bullion market
-
పసిడి.. పరుగో పరుగు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం ధరల రికార్డు పరుగు ప్రభావం భారత్ బులియన్ మార్కెట్లో కనబడింది. దేశ రాజధానిలో పసిడి 10 గ్రాముల ధర సోమవారం అంతక్రితం ముగింపుతో పోలి్చతే రూ.450 పెరిగి రూ.64,300 రికార్డు స్థాయికి చేరినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇక ముంబైలో ధర సోమవారం క్రితం (శుక్రవారం ముగింపు)తో పోలి్చతే 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.553 పెరిగి రూ.63,281కి ఎగసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.551 ఎగసి రూ.63,028ని చూసింది. ఇక వెండి విషయానికి వస్తే, రెండు నగరాల్లో దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో వెండి కేజీ ధర రూ.80,200 పలికితే, ముంబైలో ఈ విలువ రూ.76,430గా ఉంది. విజయవాడ మార్కెట్లో తీరిది... గడిచిన రెండు రోజుల్లో విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి రూ.64,200కు చేరింది. డిసెంబర్1న రూ.62,950 గా ఉన్న బంగారం ధర ఒకేరోజు రూ.810 పెరిగి రూ.63,760కు చేరగా, తాజాగా సోమవారం మరో రూ.440 పెరిగి రూ.64,200కు చేరింది. ఇదే సమయంలో 22 క్యారట్ల ఆభరణాల పది గ్రాముల బంగారం ధర రూ.1,150 పెరిగి రూ.57,700 నుంచి రూ.58,850కు పెరిగింది. అంతర్జాతీయ ప్రభావం... అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఫిబ్రవరికి సంబంధించి క్రియాశీలంగా ట్రేడ్ అవుతున్న పసిడి ఔన్స్ (31.1 గ్రాములు) ధర తాజాగా రికార్డు స్థాయిలో 2,151 డాలర్లను తాకింది. అయితే లాభాల స్వీకరణ నేపథ్యంలో ఈ వార్త రాసే రాత్రి 11 గంటల సమయానికి 2.3 శాతం క్షీణించి 2,040 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఆసియన్ ట్రేడింగ్‌లో కూడా ఇంట్రాడేలో ధర ఆల్‌టైమ్ కొత్త రికార్డు స్థాయి 2,135 డాలర్లను చూసింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు, డాలర్ బలహీనత, పశి్చమాసియా సంక్షోభ పరిస్థితులు పసిడి పరుగుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఇటీవలి సర్వే విడుదలచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా 24 శాతం సెంట్రల్ బ్యాంక్‌లు రాబోయే 12 నెలల్లో తమ బంగారం నిల్వలను పెంచుకోవాలని భావిస్తున్నాయని వెల్లడించింది. రిజర్వ్ అసెట్‌గా డాలర్ కంటే బంగారమే సరైనదన్న అభిప్రాయం దీనికి కారణమని పేర్కొంది. ఈ అంశం కూడా తాజా బంగారం ధర జోరుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
దేశంలో బంగారం ధరలు.. నేడు ఎంతంటే
ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో శనివారం దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దేశంలో పలు నగరాల్లో బంగారం ధరలు హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,580గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870గా ఉండగా రూ.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉంది. వైజాగ్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉంది ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870 గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,285గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,927గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,020గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950గా ఉంది -
పసిడికి ధన్‌తెరాస్ ధగధగలు..
న్యూఢిల్లీ/ముంబై: ఈ ఏడాది ధన్‌తెరాస్ రెండు రోజులు (శని, ఆదివారాలు) రావడంతో పసిడి, ఆభరణాలు, నాణేల విక్రయాలు జోరుగా జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 35 శాతం వరకూ పెరిగి ఉంటాయని ఆభరణాల పరిశ్రమ అంచనా వేస్తోంది. ఆదివారం నాడు భారత్–పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉండటంతో కొద్ది గంటల పాటు మార్కెట్లో కాస్తంత స్తబ్దత నెలకొన్నా, మ్యాచ్ తర్వాత అమ్మకాలు వేగం పుంజుకున్నట్లు ఆభరణాల విక్రేతలు తెలిపారు. పసిడి రేటు కాస్త పెరిగినప్పటికీ వినియోగదారులు కొనుగోళ్లు జరిపినట్లు పేర్కొన్నారు. ఆదివారం దేశ రాజధాని న్యూఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 50,139 (పన్నులు కాకుండా) పలికింది. ధన్‌తెరాస్ రోజున విలువైన లోహాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ధన్‌తెరాస్ నాడు 20–30 టన్నుల బంగారం అమ్ముడవుతుంది. కోవిడ్ అనంతరం డిమాండ్ పుంజుకోవడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి సుమారు 10–15 శాతం మేర అమ్మకాలు పెరిగి ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఆలిండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశీష్ పేఠే తెలిపారు. మరోవైపు, ధన్‌తెరాస్ సందర్భంగా 15–25 శాతం వరకూ బంగారం అమ్మకాలు పెరిగి ఉండవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రాంతీయ సీఈవో (భారత్) సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ధన్‌తెరాస్ కోసం భారీ స్థాయిలో ప్రి–బుకింగ్స్ జరిగినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ చెప్పారు. ఈ ఏడాది దాదాపు కొనుగోళ్లలో దాదాపు 80 శాతం వాటా జ్యుయలరీ ఉంటుందని, మిగతాది బులియన్ ఉంటుందని పీఎన్జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ఎకానమీ కోలుకుందని ప్రజల్లో నమ్మకం కలగడాన్ని ఇది సూచిస్తోందని వివరించారు. రెండు రోజుల ధన్‌తెరాస్ సందర్భంగా తమ అమ్మకాలు పరిమాణంపరంగా 30–35 శాతం, విలువపరంగా 40–45 శాతం పెరిగాయని అంచనా వేస్తున్నట్లు పీఎం షా జ్యుయలర్స్ ఎండీ దినేష్ జైన్ తెలిపారు. వినియోగదారులు డిజిటల్ మాధ్యమాల ద్వారా చెల్లింపులు జరపడం ఈసారి ఆసక్తికరమైన ట్రెండ్ అని పేర్కొన్నారు. -
ఈసీబీ వడ్డీరేటు: బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి!
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ధరలతో తగ్గడంతో దేశీయంగా కూడా బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఇప్పటికే భారీగా తగ్గిన పసిడి ధర శుక్రవారం రివర్స్ అయింది. బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్సైట్ ప్రకారం స్పాట్ మార్కెట్లో 999 స్వచ్ఛత బంగారం 10 గ్రాముల క్రితం ముగింపు 49,972 రూపాయలతో పోలిస్తే 705 పెరిగింది, ప్రారంభ ధర రూ. 50,677గా ఉంది, అలాగే వెండి కిలో ధర 1,178 పెరిగి రూ. 55,085 పలుకుతోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) గురువారం వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచినప్పటికీ బంగారం ధరలు తగ్గాయి. స్పాట్ బంగారం ధర ఔన్సుకు 1716 డాలర్లు పలుకుతోంది. గురువారం ముగింపుతో పోలిస్తే దాదాపు 0.25 శాతం తక్కువ. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ధర స్వల్పంగా తగ్గి 10 గ్రాములకు రూ 50,361గా ఉంది. ఎంసీక్స్ మార్కెట్లో బంగారం ధర సమీప కాలంలో 10 గ్రాములు రూ. 49,300 వరకు తగ్గవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి."గురువారం బంగారం ధరలు దాదాపు ఏడాదిలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. జూలై 27న 2022న జరగనున్న సమావేశంలో ఫెడ్ వడ్డీ రేటును పెంచుతుందనే ఊహాగానాలపై డాలర్ ఇండెక్స్ పెరుగుతుందని కమోడిటీ మార్కెట్ నిపుణుల భావిస్తున్నారు. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి గురువారం రూ.50,180 వద్ద ఉండగా శుక్రవారం 50620గా ఉంది. 22 క్యారెట్ల రూ.46,400గా ఉంది. కిలో వెండి 200 రూపాయలు క్షీణించి 55400 పలుకుతోంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ వెండి 18. 76 డాలర్లుగా ఉన్నది. #Gold and #Silver Opening #Rates for 22/07/2022#IBJA pic.twitter.com/akTslTJbzt — IBJA (@IBJA1919) July 22, 2022 కాగా దేశీయంగా దిగుమతి సుంకం పెంపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారు ఆభరణాల డిమాండ్ ఐదు శాతం తగ్గి 550 టన్నులకు చేరుకోనుందని తాజా నివేదికలో తేలింది. జూన్ 30, 2022న బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. -
Gold Demand : ఆషాఢంలో ఆఫర్లు హోరెత్తుతాయా ?
ముంబై: త్వరలో బంగాంరం ధరలు తగ్గుతాయా ? కష్టమర్లను ఆకట్టుకునేందుకు జ్యూయల్లరీ కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తాయా అంటే అవుననే అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. బంగారానికి తిరిగి డిమాండ్ తీసుకువచ్చేందుకు ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. పడిపోయిన డిమాండ్ కరోనా సెకండ్ వేవ్‌తో బంగారం ధరలు పడిపోయాయి. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌ల మధ్య కాలంలో అంటే 2020 నవంబరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,960గా ఉంది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,740లుగా ఉంది. దాదాపుగా నాలుగు వేల వరకు బంగారం ధర పడిపోయింది. స్వచ్ఛమైన బంగారం ధరల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఫస్ట్ వేవ్‌లో కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కనిష్టంగా కేవలం 12 టన్నుల బంగారం దిగుమతి చేసుకోగా గత మేలో అంతకంటే తక్కువ బంగారం దిగుమతి అయ్యింది. దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు తగ్గిపోయాయి. హోల్‌సేల్ ఆఫర్లు ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ నిబంధనల నుంచి సడలింపులు మొదలయ్యాయి. దీంతో బంగారం మార్కెట్లో చలనం తెచ్చేందుకు దిగుమతి సుంకం, స్థానిక పన్నులు కలుపకుని ఒక ఔన్సు బంగారంపై దాదాపు 800 నుంచి 900ల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫస్ట్ ముగింపు దశలో గత సెప్టెంబరులో బంగారం అమ్మకాలు పెంచేందుకు ఈ స్థాయిలో డిస్కౌంట్లు ఇచ్చారు. మరోసారి అదే పద్దతిని బంగారం డీలర్లు అనుసరిస్తున్నారు. కొనుగోళ్లు ఉంటాయా లాక్డౌన్ సెకండ్ వేవ్ తర్వాత బంగారం కొనుగోళ్లు ఎలా ఉంటాయనే దానిపై నగల వర్తకుల్లో అనేక సంశయాలు ఉన్నాయి. దీంతో బంగారం కొనుగోళ్లపై వారు తర్జనభర్జనలు పడుతున్నారు. అందువల్లే డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తోందని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. చైనా, జపాన్, సింగపూర్లలో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఆషాఢం ఆఫర్లు హోల్‌సెల్ డీలర్లు ప్రకటిస్తున్న ఆఫర్లు రిటైర్లరు కూడా ప్రకటిస్తే బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రాబోయే ఆషాఢం మాసం ఎలాగు ఆఫర్లు ప్రకటించేందుకు అనువైనదే. చదవండి : బంగారం రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత? -
మళ్లీ బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా?
గత వారం రోజులుగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మార్చి 31న 44,228 రూపాయలు ఉన్న 24 క్యారెట్ల స్వచ్ఛ బంగారం ధర నిన్నటికి రూ.46,554కు చేరుకుంది. ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరలు పెరుగుతున్న కారణంగా మున్ముందు ఎలా ఉంటుందనే అనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. ద్రవ్యోల్భణం పెరగడం, కరోనా కేసులు తిరిగి ఎక్కువ అవుతుండటం వంటి అంశాలు బంగారం పెరుగుదలకు దోహదపడవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.49,000ను క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి సమీప భవిష్యత్తులో బంగారం కొనుగోలు చేయాలని భావించేవారు ఇప్పుడే తీసుకోవడం సరైన చర్యగా చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల నుంచి 1820 డాలర్లకు చేరుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విదిస్తే కనుక ఆ ప్రభావం బిజినెస్ మీద పడి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగే అవకాశం ఉంది. దింతో చాలా మంది స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకొని బంగారం మీద స్వల్పకాలానికి పెట్టుబడులు పెడతారు. ఈ కారణం చేత ధరలు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: అంచనాలను మించిన ఆదాయపన్ను వసూళ్లు -
మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి భారీగా పెరిగాయి. కొందరు దేశీయ విశ్లేషకులు భవిష్యత్‌లో బంగారం ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అందుకు కారణం కరోనా కేసులు పెరగడమే అంటున్నారు. కరోనా కేసులు ఎంతలా పెరిగితే, బంగారం ధరలు అంతలా పెరుగుతాయని అంటున్నారు. ఆల్రెడీ ఆ ట్రెండ్ కనిపిస్తోందని చెబుతున్నారు. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో నేడు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,917 నుంచి రూ.45,176కు పెరిగింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,144 నుంచి 41,381కు పెరిగింది. అంటే ఒక్కరోజులో 237 రూపాయలు పెరిగింది అన్నమాట. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,260గా ఉంది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఉండే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు రూ.46,100 ఉంది. హైదరాబాద్, విజయవాడలలో ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.63,634 నుంచి రూ.64,546కు పెరిగింది. బంగారం ధర హెచ్చుతగ్గులు అనేది ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు విషయాలపై ఆధారపడి ఉంటుంది. చదవండి: కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్! బంగారం ధర మరింత దిగొస్తుందా? లేదా? -
భారీగా పెరిగిన బంగారం ధరలు
న్యూఢిల్లీ: కొద్దీ రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడూ పెరుగుతుందో నిపుణులకు కూడా అంచనా వేయడం కష్టాంగా మారింది. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో నేడు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,228 నుంచి రూ.44,917కు పెరిగింది. అలాగే, ఆభరణ తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.40,513 నుంచి 41,144కు పెరిగింది. అంటే ఒక్కరోజులో 631 రూపాయలు పెరిగింది అన్నమాట. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,840 నుంచి రూ.45,440కు పెరిగింది. అలాగే, ఆభరణ తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,100 నుంచి 41,650కు పెరిగింది. అంటే ఒక్కరోజులో 550 రూపాయలు పెరిగింది అన్నమాట. విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.62,727 నుంచి రూ.63,634కు పెరిగింది. బంగారం ధర హెచ్చుతగ్గులపై ఎన్నో అంశాలు ప్రభావితం చూపుతాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు కారణాల వల్ల బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. చదవండి: కొత్త వేతన కార్మిక చట్టాలకు కేంద్రం బ్రేక్ ఈ స్కీమ్ గడువు పొడగించిన ఎస్బీఐ -
దిగి వస్తున్న బంగారం ధరలు
సాక్షి, ముంబై: బంగారం ధరలు మరింత దిగి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆల్‌టైం గరిష్టంనుంచి క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్ప క్షీణతను నమోదు చేయగా వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. నేడు (మార్చి 31న) మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో, జూన్ ఫ్యూచర్స్ 0.9 శాతం తగ్గి 10 గ్రాములకు 44,304 రూపాయల ట్రేడవుతున్నాయి. మే వెండి ఫ్యూచర్స్ 0.84 శాతం తగ్గి కిలోగ్రాము 62,595 వద్ద ట్రేడవుతున్నాయి. (నయా ట్రెండ్: కారు అలా కొనేస్తున్నారట!) తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలోకూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేడు 24 క్యారెట్ల పసిడి ధర రూ.380 తగ్గి,10 గ్రాములు రూ.45,110 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,350కి పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి కిలో ధర రూ.68,700 వద్ద మార్కెట్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,4400 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,490 వద్ద మార్కెట్ అవుతోంది. రూ .44,300- 44,100 స్థాయిల వద్ద బంగారానికి మద్దతు ఉంటుందని రూ .44,660-44,800 స్థాయిల వద్ద రెసిస్టెన్స్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వెండికి 62,800-62,500 రూపాయల మద్దతు, 63,600-64,000 స్థాయిలలో ప్రతిఘటన ఉందని నిపుణులు అంటున్నారు. రూపాయిలో బలహీనత ఉన్నప్పటికీ, వెండి బంగారం ధరలు బలహీనంగా ఉన్నాయి. అటు డాలర్ బలం పుంజుకుని నాలుగున్నర నెలల గరిష్ట స్థాయికి చేరుకుని 93 మార్కును దాటింది. అమెరికా బాండ్ దిగుబడి పుంజుకున్న నేపథ్యంలో రూపాయ నెల కనిష్టానికి చేరింది. భవిష్యత్తులో మరింత పడిపోవచ్చని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా డాలర్లకు డిమాండ్ బావుందని వ్యాపారులు భావిస్తున్నారు. (హోండా ప్రీమియం బైక్స్ : ధర ఎంతంటే) అంతర్జాతీయ మార్కెట్లలోనూ బులియన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ బంగారం ధరల 0.1 శాతం తగ్గి ఔన్సుకు 1,683.56 డాలర్లకు చేరుకుంది. వెండి 24.01 డాలర్ల వద్ద స్థిరంగా ఉండగా, ప్లాటినం 0.5 శాతం పెరిగి 1,160.05 డాలర్లకు, పల్లాడియం 0.7 శాతం పెరిగి 2,607.04 డాలర్లకు చేరుకుంది. చైనాలో ఫ్యాక్టరీ కార్యకలాపాల డేటా కారణంగా బంగారం రేట్లు మరింత పడిపోయాయని రాయిటర్స్ తెలిపింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధ్యక్షుడు బైడెన్ ప్రకటించిన మల్టీ ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ బంగారం ధరలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర!
బులియన్ మార్కెట్లో బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో? ఎప్పుడు తగ్గుతుందో? అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. గత రెండు రోజులుగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు నేడు మళ్లీ తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ మార్కెట్లో నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేడు (మార్చి 26) నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.40,950గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ.180 తగ్గింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం(ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.44,710 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.190 తగ్గింది. అదేవిదంగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.41,700గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం(ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,490 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.330 తగ్గింది. బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,500గా ఉంది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ.100 పెరిగింది. బంగారం ధర హెచ్చుతగ్గులపై ఎన్నో అంశాలు ప్రభావితం చూపుతాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు కారణాల వల్ల బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. చదవండి: ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్అలర్ట్! హైదరాబాద్‌లో రియల్టీ జోష్.. అమ్మకాలు అదుర్స్! -
రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్
న్యూయార్క్/ ముంబై: కరోనా కొత్త స్ట్ర్రెయిన్ కారణంగా మరోసారి బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 51,610కు చేరగా.. వెండి కేజీ రూ. 70,640 వద్ద ట్రేడవుతోంది. ఇక న్యూయార్క్ కామెక్స్‌లోనూ సోమవారం భారీగా బలపడటం ద్వారా పసిడి ఔన్స్ 1950 డాలర్లకు చేరగా.. వెండి 27.6 డాలర్లను తాకింది. వెరసి పసిడి ధరలు 8 వారాల గరిష్టాలకు చేరాయి. ఇంతక్రితం నవంబర్ 9న మాత్రమే పసిడి ఈ స్థాయిలో ట్రేడయినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. బ్రిటన్‌లో కఠిన లాక్‌డవున్ ఆంక్షలకు తెరతీయగా.. టోక్యోసహా పలు ప్రాంతాలలో జపాన్ ఎమర్జెన్సీ విధించనున్న వార్తలు పసిడికి డిమాండ్‌ను పెంచినట్లు తెలియజేశాయి. (స్ట్ర్రెయిన్ ఎఫెక్ట్- పసిడి, వెండి హైజంప్) గత వారం అమెరికా ప్రభుత్వం భారీ ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు మెరుస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ రూపు మార్చుకుని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా మళ్లీ సంక్షోభ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళనలు పసిడికి డిమాండును పెంచుతున్నట్లు నిపుణులు వివరించారు. హుషారుగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 186 బలపడి రూ. 51,610 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 51,333 వద్ద కనిష్టాన్ని తాకిన పసిడి తదుపరి 51,649 వద్ద గరిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 604 జంప్‌చేసి రూ. 70,640 వద్ద కదులుతోంది. రూ. 70,060 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 70,695 వరకూ దూసుకెళ్లింది. లాభాలతో.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.2 శాతం పెరిగి 1,950 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.15 శాతం బలపడి 1,945 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 1 శాతం పుంజుకుని 27.61 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
పసిడి, వెండి- యూఎస్ ప్యాకేజీ జోష్
న్యూయార్క్/ ముంబై: కొత్త ఏడాదిలో పదవి నుంచి తప్పుకోనున్న అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ యూటర్న్ తీసుకుంటూ 2.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడంతో పసిడి, వెండి ధరలు జోరందుకున్నాయి. నిరుద్యోగులకు తొలుత ప్రతిపాదించిన 600 డాలర్లను 2,000కు పెంచుతూ గత వారం యూఎస్ కాంగ్రెస్ ప్యాకేజీని ఆమోదించినప్పటికీ ట్రంప్ వ్యతిరేకించారు. అయితే ఉన్నట్టుండి ఆదివారం సహాయక ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ భారీ ప్యాకేజీలో 1.4 ట్రిలియన్ డాలర్లు ప్రభుత్వ ఏజెన్సీలకు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ, విదేశీ మార్కెట్లో పసిడి, వెండి ధరలు బలపడ్డాయి. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 1900 డాలర్లకు చేరగా.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో వెండి కేజీ రూ. 2,000కుపైగా జంప్‌చేసింది. ఇతర వివరాలు చూద్దాం.. (ఐపీవో బాటలో- ఫ్లిప్‌కార్ట్ బోర్డు రీజిగ్) లాభాలతో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 495 ఎగసి రూ. 50,568 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 50,200 వద్ద ప్రారంభమైన పసిడి తదుపరి 50,577 వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 2,159 జంప్‌చేసి రూ. 69,668 వద్ద కదులుతోంది. రూ. 69,000 వద్ద సానుకూలంగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 69,800 వరకూ దూసుకెళ్లింది. (దిగివచ్చిన పసిడి, వెండి ధరలు) హుషారుగా న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.9 శాతం పుంజుకుని 1,899 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.6 శాతం బలపడి 1,895 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 3.6 శాతం జంప్‌చేసి 26.82 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. వారాంతాన న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి 1883 డాలర్ల వద్ద నిలవగా.. వెండి 25.94 డాలర్ల వద్ద ముగిసింది. -
దిగివచ్చిన పసిడి, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: ముందురోజు దూకుడు చూపిన పసిడి, వెండి ధరలు తాజాగా దిగివచ్చాయి. కరోనా వైరస్ రూపు మార్చుకుని యూకేలో వేగంగా విస్తరిస్తున్నట్లు వెలువడిన వార్తలతో సోమవారం పసిడి, వెండి ధరలు హైజంప్ చేసిన విషయం విదితమే. 900 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకోవడం, ప్రపంచ దేశాలు యూకేకు ప్రయాణాలను నిలిపివేయడం వంటి అంశాలతో ముందురోజు పసిడి, వెండి ధరలు హైజంప్ చేశాయి. కాగా.. కొత్త తరహా కరోనా వైరస్‌ను సైతం వ్యాక్సిన్లు అడ్డుకోగలవని ఫార్మా వర్గాలు, హెల్త్‌కేర్ కంపెనీలు స్పష్టం చేయడంతో కొంతమేర ఆందోళనలు ఉపశమించినట్లు నిపుణులు తెలియజేశారు. ఇతర వివరాలు చూద్దాం.. (మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు) నేలచూపులో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 274 క్షీణించి రూ. 50,142 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 50,095 వద్ద కనిష్టాన్ని తాకిన పసిడి తదుపరి 50,540 వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 1,418 నష్టంతో రూ. 67,600 వద్ద కదులుతోంది. తొలుత రూ. 69,797 వద్ద నీరసంగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 67,403 వరకూ వెనకడుగు వేసింది. బలహీనంగా.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.6 శాతం తక్కువగా 1,872 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం బలహీనపడి 1,869 డాలర్లను తాకింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 2.2 శాతం పతనమై 25.91 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్ కలకలంతో సోమవారం పసిడి 1,910 డాలర్లకు జంప్‌చేయగా.. వెండి 27 డాలర్లను అధిగమించిన విషయం విదితమే. -
మళ్లీ పసిడి, వెండి.. మెరుపులు
న్యూయార్క్/ ముంబై: ఆర్థిక వ్యవస్థకు దన్నుగా లిక్విడిటీ చర్యలను కొనసాగించనున్నట్లు యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా పేర్కొంది. కొద్ది రోజులుగా ఫెడ్ నెలకు 120 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా వ్యవస్థలో లిక్విడిటీని పంప్ చేస్తోంది. కాగా.. మరోపక్క 700 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీపై యూఎస్ కాంగ్రెస్ సమీక్షను చేపట్టనున్నట్లు వెలువడిన వార్తలు సైతం పసిడికి జోష్ నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి వరుసగా మూడో రోజు పసిడి, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ సానుకూలంగా కదులుతున్నాయి. వివరాలు చూద్దాం.. (రెండో రోజూ పసిడి, వెండి పరుగు) సానుకూలంగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 243 పుంజుకుని రూ. 49,840 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 49,877 వద్ద గరిష్టాన్నీ.. రూ. 49,720 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 952 వృద్ధితో రూ. 66,863 వద్ద కదులుతోంది. ఒక దశలో రూ. 66,932 వరకూ ఎగసిన వెండి రూ. 66,588 వద్ద కనిష్టాన్ని సైతం చవిచూసింది. హుషారుగా.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.65 లాభంతో 1,871 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.2 శాతం బలపడి 1,868 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 1.7 శాతం ఎగసి 25.48 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం పసిడికి 1870-1884 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చు. ఇదేవిధంగా 1840-1828 డాలర్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. -
రెండో రోజూ పసిడి, వెండి పరుగు
న్యూయార్క్/ ముంబై: వరుసగా రెండో రోజు పసిడి, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నెల 18న యూఎస్ కాంగ్రెస్ సహాయక ప్యాకేజీపై సమీక్షను చేపట్టే వీలున్నట్లు వెలువడిన వార్తలు పసిడికి జోష్ నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండున్నరేళ్ల కనిష్టం 90.62కు చేరడం, యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టడం వంటి అంశాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. అయితే యూకే, కెనడా, యూఎస్ తదితర దేశాలలో వ్యాక్సిన్ల వినియోగం ప్రారంభంకావడంతో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశంలేదని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. (పసిడి ధరలకు కోవిడ్-19 పుష్) సానుకూలంగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 137 పుంజుకుని రూ. 49,580 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత 49,510 వద్ద ప్రారంభమైంది ఇది కనిష్టంకాగా.. తదుపరి రూ. 49,626 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ సైతం రూ. 318 వృద్ధితో రూ. 65,171 వద్ద కదులుతోంది. రూ. 65,000 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో రూ. 65,324 వద్ద గరిష్టానికి చేరింది. (పసిడికి ఉద్యోగ గణాంకాల దెబ్బ) హుషారుగా.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.3 లాభంతో 1,861 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.2 శాతం బలపడి 1,857 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.75 శాతం ఎగసి 24.83 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. మంగళవారం పసిడి ఫ్యూచర్స్ 1855 డాలర్ల వద్ద స్థిరపడగా.. వెండి 24.64 డాలర్ల వద్ద ముగిసింది. బులియన్ వర్గాల అంచనాల ప్రకారం పసిడికి 1870-1884 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చు. ఇదేవిధంగా 1840-1828 డాలర్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. -
పసిడి ధరలకు కోవిడ్-19 పుష్
న్యూయార్క్/ ముంబై: ముందురోజు వాటిల్లిన నష్టాల నుంచి పసిడి, వెండి కోలుకున్నాయి. ప్రస్తుతం అటు న్యూయార్క్ కామెక్స్, ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లో లాభాలతో ట్రేడవుతున్నాయి. సెకండ్ వేవ్‌లో భాగంగా కోవిడ్-19 విజృంభిస్తుండటంతో అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండున్నరేళ్ల కనిష్టం 90.62కు చేరింది. దీంతో తాజాగా పసిడికి బలమొచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే యూకే, కెనడా, యూఎస్ తదితర దేశాలలో వ్యాక్సిన్ల వినియోగం ప్రారంభంకావడంతో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశంలేదని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ, విదేశీ మార్కెట్లో నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. సానుకూలంగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 285 పుంజుకుని రూ. 49,224 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 49,260 వద్ద గరిష్టాన్నీ, ఆపై రూ. 49,007 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ సైతం రూ. 429 వృద్ధితో రూ. 63,900 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 64,026 వద్ద గరిష్టానికీ, రూ. 63,599 వద్ద కనిష్టానికీ చేరింది. హుషారుగా.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.6 లాభంతో 1,843 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.65 శాతం బలపడి 1,839 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.7 శాతం ఎగసి 24.22 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
పసిడికి ఉద్యోగ గణాంకాల దెబ్బ
న్యూయార్క్/ ముంబై: ఈ నెల తొలి వారంలో ఆన్లైన్ సైట్స్ ద్వారా సగటున 10.7 మిలియన్ ఉద్యోగాల కోసం ఆఫర్లు నమోదైనట్లు యూఎస్ సంస్థ జిప్రిక్రూటర్ వెల్లడించింది. నవంబర్‌లో నమోదైన 10.9 మిలియన్లతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ కోవిడ్-19 సెకండ్ వేవ్‌లోనూ ఉపాధి కల్పన బలపడటం ఆర్థిక రికవరీని సంకేతిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 91 ఎగువకు బలపడింది. దీంతో బుధవారం న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి, వెండి ధరలు పతనమయ్యాయి. ఔన్స్ పసిడి 1840 డాలర్లకు చేరింది. ఇక దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 49,000 సమీపానికి నీరసించింది. ఈ బాటలో వెండి కేజీ రూ. 63,000 మార్క్ సమీపంలో ట్రేడవుతోంది. దేశ, విదేశీ మార్కెట్లో నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. (వ్యాక్సిన్ షాక్- పసిడి ధరల పతనం) నష్టాలతో.. ఎంసీఎక్స్‌లో బుధవారం పతనమైన బంగారం, వెండి ధరలు మరోసారి డీలాపడ్డాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 221 క్షీణించి రూ. 49,039 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 49,313 వద్ద గరిష్టాన్నీ, ఆపై రూ. 48,935 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ సైతం రూ. 350 నష్టంతో రూ. 63,149 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 63,747 వద్ద గరిష్టానికీ, రూ. 62,931 వద్ద కనిష్టానికీ చేరింది. (ఫేస్బుక్ నుంచి విడిగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్?) అక్కడక్కడే.. న్యూయార్క్ కామెక్స్‌లో బుధవారం భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు తాజాగా కన్సాలిడేషన్ బాట పట్టాయి. ప్రస్తుతం పసిడి ఔన్స్(31.1 గ్రాములు) నామమాత్ర లాభంతో 1,840 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో 0.4 శాతం నష్టంతో 1,833 డాలర్లకు చేరింది. వెండి సైతం స్వల్ప వెనకడుగుతో ఔన్స్ 23.97 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
వ్యాక్సిన్ షాక్- పసిడి ధరల పతనం
న్యూయార్క్/ ముంబై: కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలు బంగారం ధరలను దెబ్బతీశాయి. దీంతో న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 10 డాలర్లు పతనంకాగా.. వెండి సైతం 1 శాతం క్షీణించింది. ఇక దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 50,000 దిగువకు చేరింది. ఈ బాటలో వెండి కేజీ రూ. 65,000 మార్క్‌ను కోల్పోయింది. కొద్ది రోజుల కన్సాలిడేషన్ తదుపరి మంగళవారం బంగారం, వెండి ధరలు రెండు వారాల గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. కాగా.. యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతులు లభించనున్న వార్తలతో ట్రేడర్లు పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో అమ్మకాలకు దిగినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల డేటాను పరిశీలించిన యూఎస్ ఔషధ నియంత్రణ సంస్థ ఎలాంటి లోపాలూ కనిపించలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభంకానున్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే యూకేలో ఫైజర్ వ్యాక్సిన్‌ను అత్యవసర ప్రాతిపదికన వినియోగిస్తున్న విషయం విదితమే. దేశ, విదేశీ మార్కెట్లో నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. చదవండి: (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) నేలచూపుతో.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 395 క్షీణించి రూ. 49,714 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 49,850 వద్ద నీరసంగా ప్రారంభమైంది. ఆపై రూ. 49,634 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ మరింత అధికంగా రూ. 890 పతనమై రూ. 64,302 వద్ద కదులుతోంది. ముందురోజుతో పోలిస్తే రూ. 64,542 వద్ద నష్టాలతో ప్రారంభమైన వెండి తదుపరి రూ. 64,163 వరకూ వెనకడుగు వేసింది. ముందురోజు పసిడి రూ. 50,109 వద్ద, వెండి రూ. 65,192 వద్ద ముగిశాయి. వెనకడుగులో.. న్యూయార్క్ కామెక్స్‌లో వరుసగా రెండు రోజులపాటు బలపడిన బంగారం, వెండి ధరలు తాజాగా డీలా పడ్డాయి. ప్రస్తుతం పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.55 శాతం క్షీణించి 1,864 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.6 శాతం నష్టంతో 1,860 డాలర్లకు చేరింది. వెండి సైతం 1 శాతం వెనకడుగుతో ఔన్స్ 24.49 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. మంగళవారం పసిడి 1875 డాలర్ల వద్ద, వెండి 24.74 డాలర్ల వద్ద ముగిశాయి. మంగళవారం పసిడి 1875 డాలర్ల వద్ద, వెండి 24.74 డాలర్ల వద్ద ముగిశాయి. కాగా.. పసిడికి 1884-1900 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని పృథ్వీ ఫిన్‌మార్ట్ డైరెక్టర్ మనోజ్ జైన్ అంచనా వేశారు. ఇదేవిధంగా సమీప భవిష్యత్‌లో 1858-1840 డాలర్ల వద్ద సపోర్ట్స్ కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. -
పసిడి, వెండి ధరల మెరుపులు
న్యూయార్క్/ ముంబై: వరుసగా మూడో రోజు దేశ, విదేశీ మార్కెట్లో పసిడి, బంగారం ధరలు జోరు చూపుతున్నాయి. నవంబర్ నెలలో నమోదైన నష్టాలను పూడ్చుకుంటూ మంగళవారం పసిడి 1800 డాలర్లను అధిగమించడంతో మరింత బలపడే వీలున్నట్లు బులియన్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే సాంకేతికంగా చూస్తే ఇంతక్రితం బ్రేక్‌డౌన్ అయిన 1851 డాలర్ల వద్ద బంగారానికి రెసిస్టెన్స్ కనిపించవచ్చని అంచనా వేశారు. ఈ స్థాయిల నుంచి ఒకవేళ బలహీనపడితే తొలుత 1801 డాలర్ల వద్ద, తదుపరి జులై కనిష్టం 1756 డాలర్ల వద్ద సపోర్ట్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు రెండున్నరేళ్ల కనిష్టానికి చేరడం, సెకండ్‌వేవ్‌లో భాగంగా కరోనా కేసులు పెరుగుతుండటం, యూఎస్ ప్యాకేజీపై అంచనాలు తాజాగా పసిడికి జోష్‌నిస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. హుషారుగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 253 పెరిగి రూ. 49,200 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 49,270 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 49,136 వద్ద కనిష్టం నమోదైంది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ సైతం రూ. 347 బలపడి రూ. 63,672 వద్ద కదులుతోంది. తొలుత రూ. 63,860 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 63,515 వరకూ వెనకడుగు వేసింది. లాభాలతో.. న్యూయార్క్ కామెక్స్‌లో వరుసగా మూడో రోజు బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.45 శాతం పుంజుకుని 1,838 డాలర్లను తాకింది. స్పాట్ మార్కెట్లో 0.2 శాతం లాభంతో 1,835 డాలర్లను అధిగమించింది. వెండి సైతం 0.3 శాతం లాభంతో ఔన్స్ 24.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
రెండో రోజూ పసిడి, వెండి ధరల దూకుడు
న్యూయార్క్/ ముంబై: వరుసగా రెండో రోజు దేశ, విదేశీ మార్కెట్లో పసిడి, బంగారం ధరలు జోరు చూపుతున్నాయి. వారాంతాన పసిడి ధరలు ఐదు నెలల కనిష్టాన్ని తాకడంతో మంగళవారం ఉన్నట్టుండి బంగారం, వెండి ధరలు జంప్‌చేశాయి. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ వెండి 5 శాతం దూసుకెళ్లగా.. పసిడి 2 శాతం ఎగసింది. వెరసి మంగళవారం పసిడి 200 రోజుల చలన సగటు 1800 డాలర్లను అధిగమించినట్లు బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో సాంకేతికంగా చూస్తే స్వల్ప కాలంలో మరింత బలపడే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఒకవేళ బలహీనపడితే 1756 డాలర్ల వద్ద బంగారానికి సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. కారణాలివీ ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు రెండున్నరేళ్ల కనిష్టం 91.32కు చేరడం, సెకండ్‌వేవ్‌లో భాగంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉండటం వంటి అంశాలతో తాజాగా పసిడికి డిమాండ్ కనిపిస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు.. ఇటీవల బంగారం డెరివేటివ్ మార్కెట్లో భారీ అమ్మకాలు చేపట్టిన ట్రేడర్లు స్క్వేరప్ లావాదేవీలు చేపట్టడం ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశాయి. దీంతో దేశీయంగానూ ముందురోజు బంగారం, వెండి ధరలు భారీగా లాభపడ్డాయి. ఈ బాటలో ప్రస్తుతం మరోసారి ఇటు ఎంసీఎక్స్‌లోనూ.. అటు విదేశీ మార్కెట్లనూ హుషారుగా కదులుతున్నాయి. నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. లాభాలతో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 424 పెరిగి రూ. 48,699 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 48,699 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 48,400 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 631 బలపడి రూ. 62,549 వద్ద కదులుతోంది. తొలుత రూ. 63,019 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 61,425 వరకూ వెనకడుగు వేసింది. సానుకూలంగా.. న్యూయార్క్ కామెక్స్‌లో మంగళవారం జంప్‌చేసిన బంగారం, వెండి ధరలు మరోసారి బలపడ్డాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.4 శాతం పుంజుకుని 1,826 డాలర్లను తాకింది. స్పాట్ మార్కెట్లోనూ 0.5 శాతం లాభంతో 1,825 డాలర్లకు చేరింది. వెండి మరింత అధికంగా 0.65 శాతం ఎగసి ఔన్స్ 24.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
బంగారం- 4 నెలల కనిష్టానికి పతనం
న్యూయార్క్/ ముంబై: మరో నెల రోజుల్లో కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు విడుదలకానున్న వార్తలు బంగారం, వెండి ధరలను దెబ్బతీస్తున్నాయి. గత వారం నాలుగు రోజులపాటు నేలచూపులకే పరిమితమైన బంగారం ధరలు వరుసగా రెండో రోజు పతనమయ్యాయి. వెరసి నాలుగు నెలల కనిష్టాలకు చేరాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి ఈ ఏడాది చివరికల్లా ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు విడుదల చేసే వీలున్నట్లు వెలువడిన వార్తలు సోమవారం బంగారం, వెండి ధరలను పడగొట్టినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో దేశ, విదేశీ మార్కెట్లో కొద్ది రోజులుగా అమ్మకాలు పెరిగినట్లు తెలియజేశాయి. కాగా. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలలో జో బైడెన్ విజయం సాధించినట్లు తాజాగా యూఎస్ పాలనావర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. దీనికితోడు వ్యాక్సిన్ల వార్తలతో ప్రపంచ ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా ముడిచమురు, ఈక్విటీలు, ట్రెజరీలు వంటి పెట్టుబడి సాధనాలవైపు ఇన్వెస్టర్ల దృష్టి మళ్లుతున్నట్లు వివరించారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితుల్లో మాత్రమే పసిడికి డిమాండ్ కనిపిస్తుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండో రోజూ.. ఎంసీఎక్స్‌లో సోమవారం సాయంత్రం పతనమైన పసిడి, వెండి ధరలు వరుసగా రెండో రోజు నీరసించాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 555 క్షీణించి రూ. 48,925 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. రూ. 49,262 వద్ద వెనకడుగుతో ప్రారంభమైంది. ఆపై రూ. 48,923 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 765 నష్టపోయి రూ. 59,760 వద్ద కదులుతోంది. తొలుత రూ. 60,064 వద్ద బలహీనంగా ప్రారంభమైన వెండి తదుపరి రూ. 59,710 వరకూ వెనకడుగు వేసింది. బలహీనంగా.. న్యూయార్క్ కామెక్స్‌లో సోమవారం ఉన్నట్టుండి పతనమైన బంగారం, వెండి ధరలు మరోసారి డీలాపడ్డాయి. ప్రస్తుతం పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 1 శాతం(18 డాలర్లు) నష్టంతో 1,826 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.8 శాతం నీరసించి 1,824 డాలర్లకు చేరింది. వెండి సైతం 1.4 శాతం బలహీనపడి ఔన్స్ 24.43 డాలర్ల వద్ద కదులుతోంది. -
రెండో రోజూ- లాభాల్లో పసిడి
న్యూయార్క్/ ముంబై: నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ వారాంతాన యూటర్న్ తీసుకున్న బంగారం, వెండి ధరలు మరోసారి బలపడ్డాయి. సెకండ్‌వేవ్‌లో భాగంగా కోవిడ్-19 అమెరికాసహా యూరోపియన్ దేశాలను వణికిస్తుండటంతో పలు ప్రభుత్వాలు మళ్లీ లాక్డవున్లవైపు చూస్తున్నాయి. దీంతో తాజాగా బంగారానికి డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఫైజర్, మోడర్నా తదితర కంపెనీల వ్యాక్సిన్లపై అంచనాలతో గత వారం తొలి నాలుగు రోజులపాటు పసిడి ధరలు క్షీణిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఫలితంగా ట్రేడర్లు పసిడిలో స్క్వేరప్ లావాదేవీలకు ఆసక్తి చూపుతున్నట్లు బులియన్ విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలొ స్వల్ప కాలానికి పసిడి, వెండి ధరలు కన్సాలిడేషన్ బాటలోనే కదలవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. రెండో రోజూ.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 117 బలపడి రూ. 50,329 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,336 వద్ద గరిష్ఠాన్ని తాకింది. రూ. 50,211 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ నామమాత్రంగా రూ. 75 పుంజుకుని రూ. 62,233 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,300 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 62,055 వరకూ వెనకడుగు వేసింది. సానుకూలంగా.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం బలపడగా వెండి స్వల్పంగా నీరసించింది. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) స్వల్ప లాభంతో 1,880 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో 0.2 శాతం ఎగసి 1,875 డాలర్లకు చేరింది. వెండి మాత్రం 0.1 శాతం బలహీనపడి ఔన్స్ 24.47 డాలర్ల వద్ద కదులుతోంది. బలపడ్డాయ్.. దేశీయంగా నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ శుక్రవారం బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 268 లాభపడి రూ. 50,260 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,435 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 49,857 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 750 ఎగసి రూ. 62,200 సమీపంలో స్థిరపడింది. తొలుత రూ. 62,750 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 61,560 వరకూ వెనకడుగు వేసింది. లాభాలతో.. న్యూయార్క్ కామెక్స్‌లో శుక్రవారం బంగారం, వెండి ధరలు సానుకూలంగా ముగిశాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.6 శాతం బలపడి 1,872 డాలర్ల ఎగునవ నిలిచింది. స్పాట్ మార్కెట్లోనూ 0.25 శాతం లాభంతో 1,871 డాలర్లకు చేరింది. వెండి 1.4 శాతం జంప్ చేసి ఔన్స్ 24.49 డాలర్ల వద్ద స్థిరపడింది. -
4 రోజుల నష్టాలకు చెక్- లాభాల్లో పసిడి
న్యూయార్క్/ ముంబై: గత నాలుగు రోజులుగా క్షీణ పథంలో పయనిస్తున్న బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. ఫలితంగా నాలుగు రోజుల నష్టాలకు చెక్ పడింది. సహాయక ప్యాకేజీలకింద ఖర్చుచేయని నిధులను వెనక్కి ఇవ్వాలంటూ ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్ తాజాగా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్‌ను డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వ సహాయక ప్యాకేజీలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 92.50కు బలపడింది. దీంతో పసిడి ఆటుపోట్ల మధ్య ప్రస్తుతం లాభాల బాటపట్టినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఎమర్జెన్సీ ప్రాతిపదికన తమ వ్యాక్సిన్లకు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించగలదంటూ ఫైజర్, మోడర్నా అంచనా వేయడంతో వరుసగా నాలుగు రోజులపాటు పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో ట్రేడర్లు అమ్మకాలకు దిగిన సంగతి తెలిసిందే. లాభాలతో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 95 బలపడి రూ. 50,087 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,197 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆపై రూ. 49,857 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 428 ఎగసి రూ. 61,938 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,090 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 61,560 వరకూ వెనకడుగు వేసింది. చదవండి: (నాలుగో రోజూ పసిడి- వెండి.. వీక్) సానుకూలంగా న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు హుషారుగా కదులుతున్నాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.2 శాతం పుంజుకుని1,866 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.1 శాతం లాభంతో 1,869 డాలర్లకు చేరింది. వెండి 0.8 శాతం లాభపడి ఔన్స్ 24.37 డాలర్ల వద్ద కదులుతోంది. నాలుగో రోజూ.. ఎంసీఎక్స్‌లో గురువారం 10 గ్రాముల బంగారం రూ. 335 క్షీణించి రూ. 49,990 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,200 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 49,720 వద్ద కనిష్టానికి చేరింది. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 1,018 నష్టంతో రూ. 61,525 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 62,182 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 60,710 వరకూ వెనకడుగు వేసింది. -
వ్యాక్సిన్ దెబ్బకు పసిడి- వెండి డీలా
న్యూయార్క్/ ముంబై: వరుసగా మూడో రోజు దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు డీలా పడ్డాయి. యూఎస్ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా ఇంక్.. కోవిడ్-19కు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లకు త్వరలో అనుమతులు లభించగలవంటూ ఆశావహంగా స్పందించడంతో పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో అమ్మకాలు తలెత్తుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. క్లినికల్ పరీక్షల విశ్లేషణ తదుపరి ఎమర్జెన్సీ ప్రాతిపదికన తమ వ్యాక్సిన్‌కు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించగలదన్న అంచనాలను తాజాగా ఫైజర్ ఇంక్ ప్రకటించింది. ఈ వార్తల నేపథ్యంలో బులియన్ ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. చదవండి: (పసిడి- వెండి అక్కడక్కడే..) నేలచూపులతో.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 165 తక్కువగా రూ. 50,601 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,618 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,504 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 347 క్షీణించి రూ. 62,901 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,970 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 62,808 వరకూ వెనకడుగు వేసింది. నీరసంగా.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు వెనకడుగుతో కదులుతున్నాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.45 శాతం నష్టంతో1,877 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో దాదాపు యథాతథంగా 1,879 డాలర్లకు చేరింది. వెండి 0.65 శాతం క్షీణతతో ఔన్స్ 24.50 డాలర్ల వద్ద కదులుతోంది. -
మెరుస్తున్న పసిడి, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై : నేటి ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. న్యూయార్క్ కామెక్స్‌లో 0.4 శాతం పుంజుకోగా.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో అక్కడక్కడే అన్నట్లుగా ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో బుధవారం పసిడి సుమారు రూ. 300, వెండి రూ. 600 చొప్పున బలపడ్డాయి. కాగా.. పసిడికి రూ. 50,000- 49,800 స్థాయిలో సపోర్ట్ లభించగలదని బులియన్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే విధంగా రూ. 51,380- 51,550 స్థాయిలో రెసిస్టెన్స్ కనిపించవచ్చని పేర్కొన్నారు. ఈ బాటలో వెండికి రూ. 61,800- 61,200 వద్ద మద్దతు లభించే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక రూ. 63,100- 63,800 స్థాయిలో వెండికి అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. ఫ్లాట్‌గా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 96 లాభపడి రూ. 50,265 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,347 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,265 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ నామమాత్రంగా రూ. 59 పెరిగి రూ. 62,600 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,827 వరకూ బలపడిన వెండి తదుపరి రూ. 62,552 వరకూ నీరసించింది. లాభాలతో న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) 0.4 శాతం లాభంతో1,869 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.26 శాతం బలపడి 1,870 డాలర్లకు చేరింది. వెండి 0.35 శాతం పుంజుకుని ఔన్స్ 24.35 డాలర్ల వద్ద కదులుతోంది. -
పసిడి, వెండి ధరల నేలచూపు
న్యూయార్క్/ ముంబై : ముందురోజు బౌన్స్‌బ్యాక్ అయిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం మందగమన బాట పట్టాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లో అక్కడక్కడే అన్నట్లుగా కదులుతుంటే.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లో వెనకడుగుతో ట్రేడవుతున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 90 శాతం విజయవంతమైనట్లు అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించడంతో సోమవారం విదేశీ మార్కెట్లో పసిడి ధరలు 5 శాతంపైగా కుప్పకూలిన విషయం విదితమే. కాగా.. ఎంసీఎక్స్‌లో మంగళవారం పసిడి రూ. 700 పుంజుకోగా.. వెండి సుమారు రూ. 2,000 జంప్ చేసింది. వివరాలు చూద్దాం.. వెనకడుగులో.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 75 తక్కువగా రూ. 50,426 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,463 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,350 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 244 క్షీణించి రూ. 62,800 వద్ద కదులుతోంది. తొలుత రూ. 63,044 వరకూ బలపడిన వెండి తదుపరి రూ. 62,998 వరకూ నీరసించింది. అక్కడక్కడే.. న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఫ్లాట్‌గా కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో1,878 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ స్వల్పంగా 0.16 శాతం బలపడి 1,880 డాలర్లకు చేరింది. వెండి దాదాపు యథాతథంగా ఔన్స్ 24.45 డాలర్ల వద్ద కదులుతోంది. -
పసిడి, వెండి ధరల దూకుడు
న్యూయార్క్/ ముంబై: అమెరికా అధ్యక్ష పదవి రేసులో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్న వార్తలతో గురువారం బంగారం, వెండి ధరలు హైజంప్ చేశాయి. వెరసి న్యూయార్క్ కామెక్స్ లో పసిడి ఔన్స్ ఒక దశలో 3 శాతం ఎగసి 1950 డాలర్ల సమీపానికి చేరింది. కోవిడ్-19తో మందగించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా సహాయక ప్యాకేజీలను అమలు చేయాలంటూ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా అభిప్రాయపడటం కూడా బంగారం ధరలకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. బైడెన్ గెలుపొందితే కనీసం ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేయవచ్చన్న అంచనాలు ఇందుకు సహకరించినట్లు తెలియజేశారు. గురువారం బంగారం ధరలు 1936 డాలర్లను దాటడం ద్వారా బలాన్ని సంతరించుకున్నట్లు బులియన్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో సమీప భవిష్యత్‌లో 2089- 1851 డాలర్ల మధ్య పసిడి ధరలు హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని విశ్లేషించారు. కాగా.. డాలరు 93 స్థాయికి బలపడటం, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ప్రస్తుతం దేశ, విదేశీ మార్కెట్లో పసిడి ధరలు డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం.. అటూఇటుగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 226 క్షీణించి రూ. 51,829 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 51,929 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 51,805 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 198 లాభపడి రూ. 64,451 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 64,594 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 64,313 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం ధరలు ప్రస్తుతం వెనకడుగుతో కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.36 శాతం క్షీణించి 1,940 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.54 శాతం నీరసించి 1,939 డాలర్లకు చేరింది. వెండి మాత్రం 0.5 శాతం పుంజుకుని ఔన్స్ 25.31 డాలర్ల వద్ద కదులుతోంది. జంప్ చేశాయ్ ఎంసీఎక్స్‌లో గురువారం 10 గ్రాముల బంగారం రూ. 1,257 జంప్‌చేసి రూ. 52,077 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 52,176 వద్ద గరిష్టాన్ని తాకగా.. 51,161 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 2,736 దూసుకెళ్లి రూ. 64,125 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 64,380 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,900 వరకూ వెనకడుగు వేసింది. -
పసిడి, వెండి.. జిగేల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించనుందన్న అంచనాలతో ఈ వారం మొదట్లో జోరు చూపిన పసిడి, వెండి ధరలు బుధవారం డీలా పడిన విషయం విదితమే. బుధవారం డాలరు ఇండెక్స్ బలపడగా.. 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ డీలాపడ్డాయి. ఈ నేపథ్యంలో బులియన్ ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుత ట్రేడింగ్ వివరాలు ఇలా.. లాభాలతో.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 375 పుంజుకుని రూ. 51,195 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 51,247 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 51,161 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 554 లాభపడి రూ. 61,943 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 62,165 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,931 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.5 శాతం ఎగసి 1,906 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.2 శాతం పుంజుకుని 1,907 డాలర్లకు చేరింది. వెండి 1 శాతం బలపడి ఔన్స్ 24.12 డాలర్ల వద్ద కదులుతోంది. లాభపడ్డాయ్ పసిడి, వెండి ధరల మూడు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. ఎంసీఎక్స్‌లో బుధవారం 10 గ్రాముల బంగారం రూ. 788 క్షీణించి రూ. 50,810 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,465 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,773 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,365 పతనమై రూ. 61,320 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,335 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 60,800 వరకూ వెనకడుగు వేసింది. -
పసిడి- వెండి కన్సాలిడేషన్‌లో..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు, కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష నేపథ్యంలో బంగారం, వెండి ధరలు కన్సాలిడేషన్ బాట పట్టాయి. రెండు రోజులపాటు ర్యాలీ చేసిన ధరలు ప్రస్తుతం అక్కడక్కడే అన్నట్లుగా కదులుతున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 94 సమీపంలో ట్రేడవుతోంది. సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు ఉధృతంకావడంతో మళ్లీ లాక్‌డవున్‌ల విధింపుతోపాటు.. కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న విషయం విదితమే. దీంతో ఇన్వెస్టర్లలో ఇటీవల ప్రపంచ ఆర్థిక మందగమన భయాలు తలెత్తినట్లు నిపుణులు చెబుతున్నారు. వివరాలు చూద్దాం.. నేలచూపులతో.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 145 తగ్గి రూ. 50,922 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 50,992 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 50,910 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 112 క్షీణించి రూ. 61,895 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 62,006 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,857 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. న్యూయార్క్ కామెక్స్‌లో వరుసగా రెండు రోజులపాటు లాభపడిన బంగారం ధరలు ప్రస్తుతం స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.12 శాతం బలపడి 1,895 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో యథాతథంగా 1,894 డాలర్లకు చేరింది. వెండి 0.3 శాతం పుంజుకుని ఔన్స్ 24.10 డాలర్ల వద్ద కదులుతోంది. -
బంగారం, వెండి ధరలు- రెండో రోజూ ప్లస్
సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు ఉధృతం అవుతుండటంతో రెండు రోజులుగా డీలాపడ్డ పసిడి ధరలు వారాంతాన కోలుకున్నాయి. ఈ బాటలో తాజాగా మరోసారి లాభాల బాటలో సాగుతున్నాయి. అమెరికాలో రోజుకి దాదాపు లక్ష కేసులు నమోదవుతుంటే.. ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లలోనూ కరోనా వైరస్ మళ్లీ వేగంగా విస్తరిస్తోంది. దీంతో యూరోపియన్ దేశాలు లాక్‌డవున్ విధింపుతోపాటు.. కఠిన ఆంక్షలకు తెరతీస్తున్నాయి. ఫలితంగా తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన బాట పట్టనున్న ఆందోళనలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు అంటు కేంద్ర బ్యాంకులు, ఇటు ఇన్వెస్టర్లు పసిడిలో కొనుగోళ్లకు మొగ్గు చూపే సంగతి తెలిసిందే. రక్షణాత్మక పెట్టుబడిగా పసిడిని భావిస్తుండటమే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ వారంలో అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష, అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పసిడి ధరలు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం.. మరోసారి ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం స్వల్పంగా రూ. 45 పెరిగి రూ. 50,744 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 50,777 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 50,612 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 735 లాభపడి రూ. 61,600 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 61,857 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,362 వరకూ క్షీణించింది. ఇవి డిసెంబర్ ఫ్యూచర్స్ ధరలుకావడం గమనార్హం! కామెక్స్‌లో.. రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ న్యూయార్క్ కామెక్స్‌లో వారాంతన బలపడిన బంగారం ధరలు మరోసారి లాభాలతో కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.25 శాతం పుంజుకుని 1,885 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.26 శాతం లాభంతో 1,884 డాలర్లకు చేరింది. వెండి 1.24 శాతం ఎగసి ఔన్స్ 23.94 డాలర్ల వద్ద కదులుతోంది. లాభపడ్డాయ్ ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 418 ఎగసి రూ. 50,700 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 50,870 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,353 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 748 పుంజుకుని రూ. 60,920 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 61,326 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 59,918 వరకూ వెనకడుగు వేసింది. -
అటూఇటుగా పసిడి, వెండి ధరలు
సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు ఉధృతంకావడంతో రెండు రోజులుగా డీలాపడ్డ పసిడి ధరలు నామమాత్రంగా కోలుకున్నాయి. అయితే వెండి ధరలు మరోసారి వెనకడుగు వేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్యాకేజీని ఆమోదించడంలో యూఎస్ కాంగ్రెస్ విఫలంకావడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడటం వంటి అంశాలు పసిడిని దెబ్బతీస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వివరాలు చూద్దాం.. మిశ్రమ బాట ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 153 లాభపడి రూ. 50,435 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 50,525 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 50,353 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 104 క్షీణించి రూ. 60,068 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 60,665 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 59,918 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. న్యూయార్క్ కామెక్స్‌లో గత రెండు రోజుల్లో క్షీణ పథం పట్టిన బంగారం ధరలు ప్రస్తుతం స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్రంగా బలపడి 1,869 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో 0.2 శాతం పుంజుకుని 1,871 డాలర్లకు చేరింది. వెండి 0.4 శాతం క్షీణించి ఔన్స్ 23.28 డాలర్ల వద్ద కదులుతోంది. వెనకడుగు.. ఎంసీఎక్స్‌లో గురువారం 10 గ్రాముల బంగారం రూ. 221 క్షీణించి రూ. 50,274 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 50,617 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,070 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 3 తక్కువగా రూ. 60,135 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 60,735 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 58,381 వరకూ వెనకడుగు వేసింది. -
బంగారం, వెండి ధరలకూ వైరస్ సెగ
సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు ఉధృతంకావడంతో బుధవారం స్టాక్ మార్కెట్లతోపాటు.. పసిడి, వెండి తదితర విలువైన లోహాలు డీలాపడ్డాయి. అమెరికా, యూరోపియన్ స్టాక్ మార్కెట్లు 2.5- 4 శాతం మధ్య పతనంకాగా.. న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి ఔన్స్ దాదాపు 2 శాతం క్షీణించి 1879 డాలర్ల వద్ద ముగిసింది. వెండి సైతం ఔన్స్ 23.36 డాలర్ల వద్ద నిలిచింది. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్యాకేజీని ఆమోదించడంలో యూఎస్ కాంగ్రెస్ విఫలంకావడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 93.50కు బలపడింది. కాగా.. పసిడి, వెండి ధరలు న్యూయార్క్ కామెక్స్‌లో ముందురోజు నష్టాల నుంచి కోలుకుని లాభాలతో కదులుతుంటే.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లో అటూఇటుగా ట్రేడవుతున్నాయి. మిశ్రమ బాట ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 80 క్షీణించి రూ. 50,415 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 112 బలపడి రూ. 60,250 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో 50,488 వద్ద గరిష్టాన్నితాకిన పసిడి 50,375 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇదే విధంగా తొలుత ఒక దశలో 60,319 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 59,930 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. న్యూయార్క్ కామెక్స్‌లో బుధవారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం లాభాలతో కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.2 శాతం బలపడి 1,883 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.3 శాతం వృద్ధితో 1,883 డాలర్లకు చేరింది. వెండి 0.6 శాతం పుంజుకుని ఔన్స్ 23.50 డాలర్ల వద్ద కదులుతోంది. వెనకడుగు.. ఎంసీఎక్స్‌లో బుధవారం 10 గ్రాముల బంగారం రూ. 452 క్షీణించి రూ. 50,509 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,065 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,230 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 2,082 పతనమై రూ. 60,199 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,500 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 59,100 వరకూ వెనకడుగు వేసింది. -
వెనకడుగులో.. బంగారం, వెండి
గత వారం చివర్లో కన్సాలిడేషన్ బాట పట్టిన బంగారం, వెండి ధరలు తాజాగా డీలాపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ, ఇటు దేశీయంగా.. ఎంసీఎక్స్‌లోనూ నష్టాలతో కదులుతున్నాయి. యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి అటు స్టాక్ మార్కెట్లతోపాటు.. ఇటు బంగారం, వెండి తదితర విలువైన లోహాలపైనా ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భారీ ప్యాకేజీని ప్రకటించాలన్న అంశంపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య విభేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్యాకేజీపై ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్‌తో యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ నిర్వహిస్తున్న చర్చలు ఫలవంతం కాకపోపవచ్చన్న సందేహాలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అధ్యక్ష ఎన్నికలలోగా ఒప్పందం కుదిరే వీలున్నట్లు పెలోసీ పేర్కొనడం గమనార్హం. వారం మొదట్లో పసిడి ధరలు ర్యాలీ బాట పట్టడం ద్వారా 1,940 డాలర్లవైపు పయనించినట్లు బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఆ స్థాయి నుంచి వెనకడుగు వేయడంతో సాంకేతికంగా బలహీనపడ్డాయని తెలియజేశారు. దీంతో సమీప భవిష్యత్‌లో 1,850 డాలర్లవరకూ క్షీణించే వీలున్నట్లు అంచనా వేశారు. అయితే కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు చేపడుతున్న లిక్విడిటీ చర్యలు బంగారానికి జోష్‌నిస్తున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ఏదశలోనైనా ట్రెండ్ రివర్స్‌కావచ్చని విశ్లేషించారు. క్షీణ పథంలో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 239 తక్కువగా రూ. 50,600 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 750 క్షీణించి రూ. 61,699 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో పసిడి 50,719 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,600 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి తొలుత ఒక దశలో 61,892 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,566 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.35 శాతం క్షీణించి 1,899 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.25 శాతం తక్కువగా 1,897 డాలర్లకు చేరింది. వెండి మరింత అధికంగా 1.1 శాతం నష్టంతో ఔన్స్ 24.41 డాలర్ల వద్ద కదులుతోంది. -
కన్సాలిడేషన్‌లో బంగారం, వెండి ధరలు
వారం మొదట్లో మూడు రోజులపాటు ర్యాలీ చేసిన పసిడి, వెండి ధరలు చివర్లో కన్సాలిడేషన్ బాట పట్టాయి. గురువారం లాభాలకు బ్రేక్ పడగా.. వాతాంతాన స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య అటూఇటుగా ముగిశాయి. యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై నెలకొన్న అనిశ్చితి అటు స్టాక్ మార్కెట్లతోపాటు.. ఇటు బంగారం, వెండి తదితర విలువైన లోహాలపైనా ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భారీ ప్యాకేజీని ప్రకటించాలన్న అంశంపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. ప్యాకేజీపై ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్‌తో చర్చలు నిర్వహిస్తున్న యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ అధ్యక్ష ఎన్నికలలోగా ఒప్పందం కుదిరే వీలున్నట్లు ఆశావహంగా స్పందించడం గమనార్హం. వారం మొదట్లో పసిడి ధరలు ర్యాలీ బాట పట్టడం ద్వారా 1,940 డాలర్లవైపు పయనించినట్లు బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఆ స్థాయి నుంచి వెనకడుగు వేయడంతో సాంకేతికంగా బలహీనపడ్డాయని తెలియజేశారు. దీంతో సమీప భవిష్యత్‌లో 1,850 డాలర్లవరకూ క్షీణించే వీలున్నట్లు అంచనా వేశారు. అయితే కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు చేపడుతున్న లిక్విడిటీ చర్యలు బంగారానికి జోష్‌నిస్తున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ఏదశలోనైనా ట్రెండ్ రివర్స్‌కావచ్చని విశ్లేషించారు. అటూఇటుగా ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 100 పెరిగి రూ. 50,866 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 51,040 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,643 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 190 క్షీణించి రూ. 62,425 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 63,006 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 62,063 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. వారాంతాన న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో 1,905 డాలర్ల వద్ద నిలిచింది. స్పాట్ మార్కెట్లో స్వల్పంగా క్షీణించి 1,902 డాలర్ల వద్ద ముగిసింది. వెండి 0.15 శాతం నీరసించి ఔన్స్ 24.68 డాలర్ల వద్ద స్థిరపడింది. -
పసిడి, వెండి.. అటూఇటుగా
దేశీ మార్కెట్లో వరుసగా మూడు రోజులు లాభపడిన బంగారం, వెండి ధరలు గురువారం వెనకడుగు వేశాయి. ఇదే విధంగా యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై నెలకొన్న అనిశ్చితి కారణంగా గురువారం న్యూయార్క్ కామెక్స్‌లోనూ నీరసించాయి. అయితే ఆర్థిక రివకరీకి సంకేతంగా గత వారానికల్లా యూఎస్‌లో నిరుద్యోగిత 8 లక్షల దిగువకు చేరడంతోపాటు, గృహ విక్రయాలు 14ఏళ్ల గరిష్టానికి చేరినట్లు గణాంకాలు తాజాగా వెల్లడించాయి. దీంతో 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 0.84 శాతానికి బలపడ్డాయి. ఫలితంగా ప్రస్తుతం విదేశీ మార్కెట్లో పసిడి, వెండి ధరలు అక్కడక్కడే అన్నట్లుగా కదులుతున్నాయి. ఇక ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం స్వల్పంగా రూ. 59 పెరిగి రూ. 50,825 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ నామమాత్రంగా రూ. 63 క్షీణించి రూ. 62,552 వద్ద కదులుతోంది. లాభాలకు బ్రేక్ వరుసగా మూడు రోజులపాటు ర్యాలీ చేసిన పసిడి, వెండి ధరలు గురువారం డీలా పడ్డాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 569 క్షీణించి రూ. 50,764 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,199 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,535 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 931 పతనమై రూ. 62,698 వద్ద నిలిచింది. ఒక దశలో 63,250 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,856 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో 1,907 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ దాదాపు యథాతథంగా 1,905 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి సైతం అక్కడక్కడే అన్నట్లుగా ఔన్స్ 24.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
3 రోజుల లాభాలకు చెక్- పసిడి డీలా
దేశీ మార్కెట్లో వరుసగా మూడు రోజులు లాభపడిన బంగారం, వెండి ధరలు తిరిగి వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 242 తక్కువగా రూ. 51,091 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 732 క్షీణించి రూ. 62,897 వద్ద కదులుతోంది. ప్యాకేజీపై డౌట్స్ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతిపాదించిన భారీ ప్యాకేజీపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మళ్లీ విభేధాలు తలెత్తడంతో బంగారం, వెండి ధరలు డీలాపడ్డాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదిత స్టిములస్ను కొన్ని షరతులతో 2.2 ట్రిలియన్ డాలర్లకు పెంచమంటూ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు ట్రంప్ సంసిద్ధతను వ్యక్తం చేసినప్పటికీ ఇతర రిపబ్లికన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మూడో రోజూ.. వరుసగా మూడో రోజు బుధవారం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 390 ఎగసి రూ. 51,333 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,454 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,915 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 441 లాభపడి రూ. 63,629 వద్ద నిలిచింది. ఒక దశలో 64,070 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 63,115 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.7 శాతం వెనకడుగుతో 1,916 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.55 శాతం క్షీణించి 1,914 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి మరింత అధికంగా 1.5 శాతం నష్టపోయి ఔన్స్ 24.89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
నేలచూపులో.. బంగారం- వెండి
దేశీ మార్కెట్లో ముందురోజు లాభపడిన బంగారం, వెండి ధరలు మళ్లీ నీరసించాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 112 క్షీణించి రూ. 50,575 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 145 నష్టంతో రూ. 61,950 వద్ద కదులుతోంది. ప్యాకేజీపై డౌట్‌తో కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన 2.2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీపై కాంగ్రెస్‌లో సందిగ్ధత కొనసాగుతుండటంతో సోమవారం పసిడి, వెండి బలపడ్డాయి. అధ్యక్ష ఎన్నికల్లోపు ప్యాకేజీని అమలు చేయాలంటే మంగళవారంలోగా ప్యాకేజీపై ఒప్పందం కుదుర్చుకోవలసి ఉన్నట్లు పెలోసీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్‌తో చేపట్టిన చర్చలపై మంగళవారానికల్లా స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో సోమవారం పసిడికి డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. సంక్షోభ సమయాలలో రక్షణాత్మక పెట్టుబడిగా పసిడిని భావించే సంగతి తెలిసిందే. సోమవారమిలా ఎంసీఎక్స్‌లో సోమవారం 10 గ్రాముల పసిడి రూ. 123 పెరిగి రూ. 50,670 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 50,940 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,437 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 373 లాభపడి రూ. 62,049 వద్ద నిలిచింది. ఒక దశలో 63,280 వరకూ బలపడన వెండి తదుపరి రూ. 61,177 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి ప్రస్తుతం 0.4 శాతం క్షీణించి 1,904 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో స్వల్ప నష్టంతో 1,902 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి 0.6 శాతం కోల్పోయి ఔన్స్ 24.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
కన్సాలిడేషన్‌లో.. బంగారం- వెండి
వారాంతాన దేశ, విదేశీ మార్కెట్లో స్వల్ప నష్టాలతో ముగిసిన బంగారం, వెండి ధరలు మరోసారి వెనకడుగు వేస్తున్నాయి. కన్సాలిడేషన్ బాటలో అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 78 క్షీణించి రూ. 50,469 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 346 నష్టంతో రూ. 61,330 వద్ద కదులుతోంది. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 94 దిగువకు పుంజుకోవడం, అమెరికా ప్రభుత్వ ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితులు వంటి అంశాలు పసిడి ధరలకు చెక్ పెడుతున్న విషయం విదితమే. సెప్టెంబర్‌లో యూఎస్ రిటైల్ సేల్స్ అంచనాలను మించుతూ 1.9 శాతం వృద్ధి చూపడంతో వారాంతాన పసిడి బలహీనపడినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వినియోగ వ్యయాలు పెరగడం ఆర్థిక రికవరీకి సంకేతమని విశ్లేషకులు తెలియజేశారు. శుక్రవారమిలా ఎంసీఎక్స్‌లో వారాంతాన 10 గ్రాముల పసిడి రూ. 160 నష్టంతో రూ. 50,552 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 50,813 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,452 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. అయితే వెండి కేజీ రూ. 118 బలపడి రూ. 61,653వద్ద నిలిచింది. ఒక దశలో 62,170 వరకూ బలపడన వెండి తదుపరి రూ. 61,324 వరకూ క్షీణించింది. దేశీయంగా ఆగస్ట్ 7న పసిడి రూ. 56,200 వద్ద, వెండి రూ. 80,000 సమీపంలోనూ రికార్డ్ గరిష్టాలకు చేరిన విషయం విదితమే. కామెక్స్‌లో.. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి ప్రస్తుతం 0.1 శాతం నీరసించి 1,904 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో నామమాత్ర లాభంతో 1901 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి 0.5 శాతం నష్టంతో ఔన్స్ 24.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వారాంతాన వారాంతాన న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 0.15 శాతం నీరసించి 1,906 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్లో 0.5 శాతం క్షీణించి 1,899 డాలర్లకు చేరింది. అయితే వెండి మాత్రం 0.75 శాతం ఎగసి ఔన్స్ 24.41 డాలర్ల వద్ద స్థిరపడింది. వెరసి పసిడి ధరలు గత వారం 1 శాతం నష్టాలతో నిలిచినట్లు నిపుణులు తెలియజేశారు. -
ట్రంప్ ఎఫెక్ట్- పసిడి, వెండి.. మెరుపులు
డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ప్రతిపాదిస్తున్న ప్యాకేజీకంటే మరింత అధికంగా స్టిములస్ చర్యలకు సిద్ధమంటూ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడంతో వారాంతాన బులియన్ మార్కెట్లకు జోష్ వచ్చింది. అధ్యక్ష ఎన్నికలయ్యే వరకూ డెమొక్రాట్లతో సహాయక ప్యాకేజీలపై చర్చలు నిర్వహించేదిలేదంటూ వారం మొదట్లో ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడగా.. తాజా పెట్టుబడులపై అంచనాలతో పసిడి, వెండి దూసుకెళ్లాయి. ఫలితంగా న్యూయార్క్ కామెక్స్‌లోనూ, దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ ధరలు జంప్‌చేశాయి. పసిడి 1912 డాలర్లను అధిగమించడంతో తదుపరి 1939 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బలపడ్డాయ్ ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల పసిడి రూ. 642 లాభపడి రూ. 50,817 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో బంగారం రూ. 50,970 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 50,300 వద్ద కనిష్టానికి చేరింది. ఇదే విధంగా వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 2,365 జంప్‌చేసి రూ. 62,884 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 63,242 వరకూ పెరిగిన వెండి ఒక దశలో రూ. 61,038 వరకూ నీరసించింది. లాభాలలో న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు లాభాలతో ముగిశాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 1.65 శాతం పుంజుకుని 1,926 డాలర్ల ఎగువకు చేరగా.. స్పాట్ మార్కెట్లోనూ 2 శాతం బలపడి 1,930 డాలర్ల వద్ద నిలిచింది. ఇక వెండి ఔన్స్ 5.2 శాతం జంప్‌చేసి 25.11 డాలర్ల వద్ద స్థిరపడింది. -
బంగారం, వెండి.. మిలమిల
ఇటీవల అనిశ్చితిలో పడిన సహాయక ప్యాకేజీపై చర్చలు తిరిగి ప్రారంభంకావడంతో గురువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడింది. ఎన్నికలయ్యే వరకూ స్టిములస్‌పై చర్చించేదిలేదంటూ ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా దిగిరావడంతో బంగారం ధరలు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్-19 ధాటికి నీరసిస్తున్న ఆర్థిక వ్యవస్థతోపాటు.. నిరుద్యోగులు, చిన్న, మధ్యతరహా కంపెనీలకు దన్నునిచ్చేందుకు వీలుగా అమెరికన్ కాంగ్రెస్‌లో ప్యాకేజీపై కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంలో డెమొక్రాట్లు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య విభేధాలు తలెత్తడంతో ఈ వారం మొదట్లో చర్చలు నిలిచిపోయిన విషయం విదితమే. బలపడ్డాయ్ ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 339 లాభపడి రూ. 50,514 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 872 ఎగసి రూ. 61,391 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో బంగారం రూ. 50,600 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 50,300 వద్ద కనిష్టానికి చేరింది. ఇదే విధంగా వెండి తొలుత రూ. 61,718 వరకూ పెరిగిన వెండి ఒక దశలో రూ. 61,038 వరకూ నీరసించింది. లాభాలలో న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం లాభాలతో కదులుతున్నాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 1 శాతం పుంజుకుని 1,914 డాలర్ల ఎగువకు చేరగా.. స్పాట్ మార్కెట్లోనూ 0.85 శాతం బలపడి 1,910 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్ 2 శాతంపైగా జంప్‌చేసి 24.36 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
రెండో రోజూ పసిడి.. వెండి నేలచూపు
కోవిడ్-19 ధాటికి ఆర్థిక వ్యవస్థ డీలా పడినట్లు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా పేర్కొంది. రికవరీకి దన్నుగా సహాయక ప్యాకేజీని అమలు చేయవలసి ఉన్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టం చేశారు. అయితే డెమొక్రాట్లతో విభేధాల కారణంగా ప్రెసిడెంట్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికలయ్యేవరకూ స్టిములస్ చర్చలు నిలిపివేయవలసిందిగా ప్రభుత్వ ప్రతినిధులను ఆదేశించారు. దీంతో పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో ట్రేడర్లు అమ్మకాలకు తెరతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి దేశ, విదేశీ మార్కెట్లలో వరుసగా రెండో రోజు పసిడి, వెండి ధరలు వెనకడుగు వేస్తున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ, ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ నష్టాలతో ట్రేడవుతున్నాయి. వివరాలు చూద్దాం.. డీలా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 470 క్షీణించి రూ. 50,056 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 941 నష్టపోయి రూ. 59,630 వద్ద కదులుతోంది. వెండి బోర్లా బంగారం, వెండి ధరలు మంగళవారం డీలాపడ్డాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 100 తగ్గి రూ. 50,526 వద్ద ముగిసింది. తొలుత 50,982 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,445 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 1,370 నష్టపోయి రూ. 60,571 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 62,365 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 60,204 వరకూ నీరసించింది. నష్టాలలో న్యూయార్క్ కామెక్స్‌లో మంగళవారం స్వల్పంగా క్షీణించిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం మరోసారి వెనకడుగు వేస్తున్నాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 1.2 శాతం(22 డాలర్లు) పతనమై 1,887 డాలర్లకు చేరగా.. స్పాట్ మార్కెట్లో మాత్రం 0.3 శాతం బలపడి 1,883 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్ 1.6 శాతం నష్టంతో 23.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
పసిడి.. వెండి ధరలు డీలా
దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ఫ్యూచర్స్ ధరలు వెనకడుగు వేస్తున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ, ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ నష్టాలతో ట్రేడవుతున్నాయి. వివరాలు చూద్దాం.. నేలచూపులో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 510 క్షీణించి రూ. 50,060 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 676 నష్టపోయి రూ. 60,469 వద్ద కదులుతోంది. లాభపడ్డాయ్ బంగారం, వెండి ధరలు గురువారం లాభపడ్డాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 236 పుంజుకుని రూ. 50,570 వద్ద ముగిసింది. తొలుత 50,645 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,120 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 1,226 జంప్‌చేసి రూ. 61,145 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 61,530 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 59,620 వరకూ నీరసించింది. బలహీనంగా న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు వెనకడుగులో ఉన్నాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.5 శాతం క్షీణించి 1,898 డాలర్లకు చేరగా.. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం తగ్గి 1,893 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్ 0.45 శాతం నీరసించి 23.93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
అటూఇటుగా.. పసిడి, వెండి ధరలు
దేశ, విదేశీ మార్కెట్లలో బుధవారం వెనకడుగు వేసిన పసిడి, వెండి ధరలు ప్రస్తుతం స్వల్పంగా బలపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ, ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ లాభాలతో ట్రేడవుతున్నాయి. కోవిడ్-19తో డీలా పడిన ఆర్థిక వ్యవస్థతోపాటు, నిరుద్యోగులకు దన్నునిచ్చేందుకు అమెరికా కాంగ్రెస్ తిరిగి భారీ సహాయక ప్యాకేజీపై చర్చలు చేపట్టిన నేపథ్యంలో పసిడి, వెండి ఫ్యూచర్స్ బలాన్ని పుంజుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. వెండి ఓకే ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి నామమాత్రంగా రూ. 4 తగ్గి రూ. 50,400 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 276 పుంజుకుని రూ. 60,195 వద్ద కదులుతోంది. వెనకడుగు వరుసగా రెండు రోజులపాటు బలపడిన బంగారం, వెండి ధరలు బుధవారం డీలా పడ్డాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 277 క్షీణించి రూ. 50,404 వద్ద ముగిసింది. తొలుత 50,860 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,150 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 2,547 పతనమై రూ. 59,919 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 61,700 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 59,460 వరకూ నీరసించింది. స్వల్ప లాభాలతో న్యూయార్క్ కామెక్స్‌లో బుధవారం ఫ్లాట్‌గా ముగిసిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్వల్పంగా బలపడ్డాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.2 శాతం పుంజుకుని 1,898 డాలర్లకు చేరగా.. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం వృద్ధితో 1,893 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్ 1 శాతం లాభపడి 23.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
పసిడి, వెండి- స్వల్ప నష్టాలతో..
దేశ, విదేశీ మార్కెట్లలో వారాంతాన పసిడి, వెండి ధరలు హెచ్చుతగ్గుల మధ్య బలహీనపడ్డాయి. ప్రస్తుతం స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ సహాయక ప్యాకేజీపై అమెరికన్ కాంగ్రెస్‌లో ఏర్పడిన ప్రతిష్టంభన, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడటం వంటి అంశాలు కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలను దెబ్బతీస్తున్న సంగతి తెలిసిందే. వివరాలు చూద్దాం.. నేలచూపులో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 84 క్షీణించి రూ. 49,575 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 417 నష్టంతో రూ. 58,610 వద్ద కదులుతోంది. నష్టాల ముగింపు ఆటుపోట్ల మధ్య వారాంతాన ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు వెనకడుగు వేశాయి. 10 గ్రాముల పుత్తడి రూ. 245 క్షీణించి రూ. 49,659 వద్ద ముగిసింది. తొలుత 49,900 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 49,380 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 602 నష్టపోయి రూ. 59,027 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 59,720 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 57,550 వరకూ నీరసించింది. ఫ్లాట్‌గా.. న్యూయార్క్ కామెక్స్‌లో శుక్రవారం హెచ్చుతగ్గుల మధ్య బంగారం, వెండి ధరలు బలహీనపడ్డాయి. ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర నష్టంతో 1865 డాలర్లకు చేరగా.. స్పాట్ మార్కెట్లోనూ యథాతథంగా 1863 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్ 0.4 శాతం నీరసించి 23.01 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
పసిడి, వెండి రికవరీ- ప్రస్తుతం ఫ్లాట్‌గా..
విదేశీ మార్కెట్లో బుధవారం రెండు నెలల కనిష్టాన్ని తాకిన పసిడి, వెండి ధరలు గురువారం చివర్లో రికవర్ అయ్యాయి. అయితే దేశ, విదేశీ మార్కెట్లలో ప్రస్తుతం అటూఇటు(ఫ్లాట్)గా ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ సహాయక ప్యాకేజీపై అమెరికన్ కాంగ్రెస్‌లో ఏర్పడిన ప్రతిష్టంభన, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండు నెలల గరిష్టానికి(94.4) బలపడటం వంటి అంశాలు గత రెండు రోజుల్లో పసిడి, వెండి ధరలను దెబ్బతీశాయి. దీంతో న్యూయార్క్ కామెక్స్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ పసిడి జులై తదుపరి 1856 డాలర్లకు నీరసించిన సంగతి తెలిసిందే. వివరాలు చూద్దాం.. స్వల్ప నష్టాలతో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 71 క్షీణించి రూ. 49,833 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 129 నష్టంతో రూ. 59,500 వద్ద కదులుతోంది. చివరికి లాభాల్లో.. ఎంసీఎక్స్‌లో ఆటుపోట్ల మధ్య గురువారం బంగారం, వెండి ధరలు చివరికి లాభపడ్డాయి. 10 గ్రాముల పుత్తడి రూ. 396 బలపడి రూ. 49,904 వద్ద ముగిసింది. తొలుత 50,050 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 49,248 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 1,141 ఎగసి రూ. 59,629 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 59,847 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 56,020 వరకూ నీరసించింది. స్వల్ప లాభాలతో న్యూయార్క్ కామెక్స్‌లో గురువారం హెచ్చుతగ్గుల మధ్య స్వల్పంగా బలపడిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం అటూఇటుగా కదులుతున్నాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర నష్టంతో 1876 డాలర్లకు చేరగా.. స్పాట్ మార్కెట్లో 0.25 శాతం పుంజుకుని 1872 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ఔన్స్ 0.7 శాతం ఎగసి 23.35 డాలర్ల వద్ద కదులుతోంది. -
రూ. 50,000 దిగువకు బంగారం
ఇటీవల క్షీణ పథంలో కదులుతున్న బంగారం, వెండి ధరలు మరోసారి వెనకడుగు వేస్తున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు బలపడుతూ వస్తోంది. తాజాగా ఆరు వారాల గరిష్టానికి చేరింది. ఇది పసిడి, వెండి ధరలను దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వివరాలు చూద్దాం.. పతన బాటలో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 405 క్షీణించి రూ. 49,976 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,890 పతనమై రూ. 59,323 వద్ద కదులుతోంది. చివరికి నష్టాలే లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ ఎంసీఎక్స్‌లో మంగళవారం బంగారం, వెండి ధరలు చివరికి డీలా పడ్డాయి. 10 గ్రాముల పుత్తడి రూ. 90 క్షీణించి రూ. 50,381 వద్ద ముగిసింది. తొలుత 50,686 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,129 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 103 తగ్గి రూ. 61,213 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 61,990 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 59,570 వరకూ నీరసించింది. నేలచూపులో న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు తిరిగి డీలా పడ్డాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.8 నీరసించి 1,892 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.6 శాతం బలహీనపడి 1,889 డాలర్ల దిగువకు చేరింది. వెండి ఔన్స్ 2 శాతం పతనమై 24 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
బంగారం- వెండి- పతనం నుంచి రికవరీ
ముందురోజు ఉన్నట్లుండి కుప్పకూలిన బంగారం, వెండి ధరలు స్వల్పంగా బలపడ్డాయి. సెకండ్ వేవ్‌లో భాగంగా యూరోపియన్ దేశాలలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో మళ్లీ పలు దేశాలు లాక్‌డవున్ ప్రకటిస్తున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీపై సందేహాలు తలెత్తడంతో సోమవారం ముడిచమురు ధరలు 5 శాతంపైగా పతనంకాగా.. పసిడి, వెండి ధరలు సైతం కుప్పకూలాయి. అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీపై పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు ఆరు వారాల గరిష్టానికి చేరింది. ఇది పసిడి, వెండి ధరలను దెబ్బతీసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వివరాలు చూద్దాం.. లాభాలతో.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 137 పుంజుకుని రూ. 50,608 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 510 లాభంతో రూ. 61,826 వద్ద కదులుతోంది. కోలుకున్నాయ్ న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు కోలుకున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.5 లాభంతో 1,921 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో 0.2 శాతం బలపడి 1915 డాలర్లకు చేరింది. వెండి ఔన్స్ 2 శాతం జంప్‌చేసి 24.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం పతనం ఎంసీఎక్స్‌లో సోమవారం బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. 10 గ్రాముల పుత్తడి రూ. 1244 క్షీణించి రూ. 50,471 వద్ద ముగిసింది. తొలుత 51,650 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 49,815 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 6,561 పడిపోయి రూ. 61,316 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 67,888 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 60,664 వరకూ పతనమైంది. కామెక్స్‌లోనూ డీలా న్యూయార్క్ కామెక్స్‌లో సోమవారం బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి 3 శాతం క్షీణించి 1,911 డాలర్లకు చేరగాగా.. స్పాట్ మార్కెట్లోనూ ఇదే స్థాయిలో నీరసించి 1912 డాలర్ల వద్ద ముగిసింది. వెండి ఏకంగా 9.3 శాతం కుప్పకూలి 24.39 డాలర్ల వద్ద స్థిరపడింది. -
బంగారం- వెండి.. మళ్లీ వెనకడుగులో
కొద్ది రోజులుగా ఆటుపోట్ల మధ్య కదులుతున్న పసిడి, వెండి ధరలు ప్రస్తుతం దేశ, విదేశీ మార్కెట్లలో బలహీనంగా కదులుతున్నాయి. అయితే వారాంతాన విదేశీ మార్కెట్లో లాభపడగా.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో అటూఇటుగా ముగిశాయి. ఇతర వివరాలు చూద్దాం.. నష్టాలతో.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 154 క్షీణించి రూ. 51,561 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 223 నష్టంతో రూ. 67,654 వద్ద కదులుతోంది. కామెక్స్‌లో ఫ్లాట్‌గా న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు స్వల్పంగా బలహీనపడ్డాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర వెనకడుగుతో 1,961 డాలర్ల వద్ద కదులుతోంది. స్పాట్ మార్కెట్లో మాత్రం స్వల్పంగా 0.15 శాతం బలపడి 1954 డాలర్లకు చేరింది. వెండి ఔన్స్ 0.3 శాతం తక్కువగా 27.06 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అటూఇటుగా.. ఎంసీఎక్స్‌లో శుక్రవారం బంగారం ధర బలపడగా.. వెండి డీలా పడింది. 10 గ్రాముల పుత్తడి రూ. 262 పుంజుకుని రూ. 51,715 వద్ద ముగిసింది. తొలుత 51,849 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 51,453 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. అయితే వెండి కేజీ రూ. 265 క్షీణించి రూ. 67,877 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 68,500 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 67,480 వరకూ వెనకడుగు వేసింది. వారాంతాన ఇలా.. న్యూయార్క్ కామెక్స్‌లో శుక్రవారం బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.65 శాతం పుంజుకుని 1,962 డాలర్ల వద్ద నిలిచింది. స్పాట్ మార్కెట్లోనూ 0.35 శాతం లాభపడి 1951 డాలర్ల వద్ద ముగిసింది. వెండి నామమాత్ర వృద్ధితో ఔన్స్ 27.13 డాలర్ల వద్ద స్థిరపడింది. -
అటూఇటుగా.. బంగారం- వెండి
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. నేడు పాలసీ నిర్ణయాలను ప్రకటించనుంది. రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ పరపతి నిర్ణయాలు భారత కాలమానం ప్రకారం నేటి అర్ధరాత్రి వెలువడనున్నాయి. కొద్ది రోజులుగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న కోవిడ్-19 కట్టడికి ఫెడరల్ రిజర్వ్.. భారీ సహాయక ప్యాకేజీలతోపాటు, నామమాత్ర వడ్డీ రేట్లను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్)గా కదులుతున్నాయి. ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటం ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. అటూఇటుగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 66 బలపడి రూ. 51,835 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ స్వల్పంగా రూ. 42 క్షీణించి రూ. 68,925 వద్ద కదులుతోంది. లాభాలతో ఎంసీఎక్స్‌లో మంగళవారం బంగారం ధర స్వల్పంగా బలపడగా.. వెండి యథాతథంగా నిలిచింది. 10 గ్రాముల పుత్తడి రూ. 82 పుంజుకుని రూ. 51,769 వద్ద ముగిసింది. తొలుత 51,847 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 51,334 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ నామమాత్రంగా రూ. 2 లాభపడి రూ. 68,967 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 69,887 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 68,199 వరకూ నష్టపోయింది. కామెక్స్‌లోనూ.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం ధరలు పుంజుకోగా.. వెండి బలహీనపడింది. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో 1,968 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లో మాత్రం 0.3 శాతం బలపడి 1961 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి ఔన్స్ 0.2 శాతం తక్కువగా 27.44 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
బంగారం- వెండి.. రికవరీ బాట
వారాంతాన క్షీణ పథం పట్టిన పుత్తడి, వెండి ధరలు కోలుకున్నాయి. అటు విదేశీ మార్కెట్లో అంటే న్యూయార్క్ కామెక్స్‌లో 0.5 శాతం పుంజుకోగా.. ఇటు దేశీయంగా డెరివేటివ్ విభాగంలోనూ స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. వెరసి ప్రస్తుతం సానుకూల ధోరణిలో కదులుతున్నాయి. వివరాలు చూద్దాం.. లాభాల్లో.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 151 బలపడి రూ. 51,470 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 297 పుంజుకుని రూ. 68,225 వద్ద కదులుతోంది. ర్యాలీకి బ్రేక్ ఎంసీఎక్స్‌లో గత వారం తొలి నాలుగు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన పుత్తడి, వెండి ధరలకు వారాంతాన బ్రేక్ పడింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 455 క్షీణించి రూ. 51,319 వద్ద ముగిసింది. తొలుత 51,684 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 51,224 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,063 పతనమై రూ. 67,928 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 68,579 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 67,613 వరకూ నష్టపోయింది. అంతక్రితం వారంలో నమోదైన నాలుగు రోజుల వరుస నష్టాలకు సోమవారం(7) నుంచీ చెక్ పడిన విషయం విదితమే. కామెక్స్‌లో అప్ న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.5 శాతం పుంజుకుని 1,957 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం బలపడి 1948 డాలర్ల ఎగువన కదులుతోంది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.7 శాతం ఎగసి 27.08 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
స్వల్ప లాభాలతో.. బంగారం- వెండి
కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న పుత్తడి, వెండి ధరలు తాజాగా బలపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ, ఇటు ఎంసీఎక్స్‌లోనూ స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. వివరాలు చూద్దాం.. ప్లస్‌లో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 58 లాభపడి రూ. 51,460 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 287 పెరిగి రూ. 68,730 వద్ద కదులుతోంది. మూడో రోజు మిశ్రమం ఎంసీఎక్స్‌లో వరుసగా మూడో రోజు బుధవారం పసిడి బలపడింది. అయితే ఊగిసలాట మధ్య వెండి నామమాత్రంగా వెనకడుగు వేసింది. 10 గ్రాముల పుత్తడి స్వల్పంగా రూ. 49 పెరిగి రూ. 51,402 వద్ద ముగిసింది. తొలుత 51,480 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,872 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 51 తగ్గి రూ. 68,443 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 68,532 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 67,288 వరకూ క్షీణించింది. కాగా.. పసిడి, వెండి ధరల నాలుగు రోజుల నష్టాలకు సోమవారం చెక్ పడిన విషయం విదితమే. కామెక్స్‌లో న్యూయార్క్ కామెక్స్‌లో బుధవారం చివర్లో బలపడిన బంగారం, వెండి ధరలు అక్కడక్కడే అన్నట్లుగా కదులుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో 1,955 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లో దాదాపు యథాతథంగా 1947 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి మాత్రం ఔన్స్ 0.5 శాతం పుంజుకుని 27.23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బుధవారం తొలుత పసిడి, వెండి ధరలు క్షీణించినప్పటికీ చివర్లో పుంజుకోవడం గమనార్హం! -
అటూఇటుగా బంగారం- వెండి ధరలు
మూడు రోజులుగా ఊగిసలాట మధ్య వెనకడుగు వేస్తూ వస్తున్న పసిడి ధరలు ప్రస్తుతం స్వల్పంగా పుంజుకున్నాయి. మరోపక్క తీవ్ర ఆటుపోట్ల మధ్య వెండి ధరలు నామమాత్రంగా బలహీనపడ్డాయి. వెరసి వరుసగా మూడో రోజూ నేలచూపులతో కదులుతున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ అటూఇటుగా కదులుతున్నాయి. వివరాలు ఇలా.. మిశ్రమ బాట.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 158 లాభపడి రూ. 50,900 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 66 నష్టంతో రూ. 66,860 వద్ద కదులుతోంది. మూడో రోజూ.. గురువారం వరుసగా మూడో రోజు పసిడి ధరలు వెనకడుగు వేశాయి. వెండి సైతం డీలా పడింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి నామమాత్రంగా రూ. 79 క్షీణించి రూ. 50,742 వద్ద ముగిసింది. తొలుత 51,068 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,500 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,328 పడిపోయి రూ. 66,926 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 68,855 వరకూ బలపడిన వెండి ఒక దశలో రూ. 66,306 వరకూ వెనకడుగు వేసింది. కామెక్స్‌లోనూ.. విదేశీ మార్కెట్లో గత మూడు రోజులుగా నేలచూపులతో కదులుతున్న పసిడి ధరలు స్వల్పంగా కోలుకున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.3 శాతం బలపడి 1,943 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం పుంజుకుని 1938 డాలర్ల వద్ద కదులుతోంది. అయితే వెండి మాత్రం ఔన్స్ 0.1 శాతం నీరసించి 26.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. పసిడి, వెండి ధరలు రెండు రోజులు బలపడితే.. రెండు రోజులు క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. -
బంగారం- వెండి.. ధరల రికవరీ
రెండు రోజుల వరుస నష్టాల నుంచి పసిడి, వెండి ధరలు పుంజుకున్నాయి. సావరిన్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ తదితర సంస్థలు బంగారం, వెండిలో కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ధరలు తాజాగా తలెత్తి చూస్తున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ లాభాలతో కదులుతున్నాయి. రెండు రోజుల ర్యాలీకి మంగళవారం చివర్లో బ్రేక్ పడగా.. బుధవారం సైతం అమ్మకాలదే పైచేయిగా నిలవడంతో డీలా పడిన సంగతి తెలిసిందే. లాభాలతో షురూ.. ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి.. ధరలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 94 పెరిగి రూ. 50,915 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 203 ఎగసి రూ. 65,987 వద్ద కదులుతోంది. వెండి వీక్ బుధవారం వరుసగా రెండో రోజు పసిడి ధరలు వెనకడుగు వేశాయి. వెండి సైతం డీలా పడింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 681 క్షీణించి రూ. 50,821 వద్ద ముగిసింది. తొలుత 51,555 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,696 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 2,565 పడిపోయి రూ. 65,784 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 67,888 వరకూ బలపడిన వెండి ఒక దశలో రూ. 65,650 వరకూ వెనకడుగు వేసింది. కామెక్స్‌లో ప్లస్.. విదేశీ మార్కెట్లో గత రెండు రోజుల పతనానికి చెక్ పెడుతూ పసిడి, వెండి ధరలు పుంజుకున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.6 శాతం బలపడి 1,956 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.35 శాతం లాభంతో 1950 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి మరింత అధికంగా ఔన్స్ 1.6 శాతం జంప్‌చేసి 27.84 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. పసిడి, వెండి ధరలు రెండు రోజులు బలపడితే.. రెండు రోజులు క్షీణిస్తున్న విషయం విదితమే. -
బంగారం- వెండి.. నేలచూపులు
బంగారం, వెండి ధరలు తాజాగా వెనకడుగు వేస్తున్నాయి. రెండు రోజుల ర్యాలీకి మంగళవారం చివర్లో బ్రేక్ పడింది. ఉదయం సెషన్లో వరుసగా మూడో రోజు ధరలు పుంజుకున్నప్పటికీ చివర్లో అమ్మకాలు తలెత్తడంతో డీలాపడ్డాయి. వెరసి అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ వెనకడుగుతో ముగిశాయి. అయితే ఎంసీఎక్స్‌లో వెండి లాభాలతో ముగియడం గమనార్హం! ద్రవ్యోల్బణానికంటే ఆర్థిక రికవరీకే ప్రాధాన్యమివ్వనున్నట్లు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పేర్కొనడంతో వారాంతాన బంగారం, వెండి ధరలు ఆటుపోట్ల నుంచి బయటపడి ర్యాలీ బాట పట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం.. రెండు రోజుల జోరుకు మంగళవారం బ్రేక్ పడగా.. బంగారం, వెండి.. ధరలు మరోసారి డీలా పడ్డాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 159 క్షీణించి రూ. 51,343 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 729 నష్టంతో రూ. 67,620 వద్ద కదులుతోంది. మంగళవారం మైనస్ వరుసగా రెండు రోజులపాటు బలపడిన పసిడి ధరలు మంగళవారం వెనకడుగు వేశాయి. వెండి మాత్రం మూడో రోజూ దూకుడు చూపింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 199 క్షీణించి రూ. 51,502 వద్ద ముగిసింది. తొలుత 52,100 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 51,303 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,031 జంప్‌చేసి రూ. 68,349 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 69,351 వరకూ బలపడిన వెండి ఒక దశలో రూ. 68,020 వరకూ వెనకడుగు వేసింది. కామెక్స్‌లోనూ.. విదేశీ మార్కెట్లో మంగళవారం వరుసగా మూడో రోజు ఉదయం లాభపడిన పసిడి ధరలు చివర్లో డీలాపడ్డాయి. కాగా.. ప్రస్తుతం మరోసారి వెనకడుగు వేస్తున్నాయి. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.4 శాతం నీరసించి 1,971 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.3 శాతం బలహీనపడి 1965 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి సైతం ఔన్స్ 1.2 శాతం క్షీణించి 28.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. పసిడి, వెండి ధరలు ఒక రోజు బలపడితే.. మరుసటి రోజు నీరసిస్తున్న సంగతి తెలిసిందే. -
రెండో రోజూ బంగారం- వెండి.. జోరు
వరుసగా రెండో రోజు బంగారం, వెండి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ లాభాలతో కదులుతున్నాయి. ద్రవ్యోల్బణానికంటే ఆర్థిక రికవరీకే ప్రాధాన్యమివ్వనున్నట్లు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పేర్కొనడంతో వారాంతాన బంగారం, వెండి ధరలు 2 శాతం చొప్పున జంప్‌చేశాయి. వడ్డీ రేట్లను దీర్ఘకాలంపాటు నామమాత్ర స్థాయిలోనే అమలు చేయనున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలివ్వడంతో డాలరు బలహీనపడింది. దీంతో ద్రవ్యోల్బణం, కరెన్సీ బలహీనతలకు హెడ్జింగ్‌గా వినియోగపడే పసిడికి డిమాండ్ పెరిగినట్లు ఆర్థిక నిపుణులు తెలియజేశారు. చౌక వడ్డీ రేట్లు బంగారంలో కొనుగోళ్లకు మద్దతుగా నిలిచే సంగతి తెలిసిందే. రెండో రోజూ శుక్రవారంనాటి జోరును కొనసాగిస్తూ బంగారం, వెండి.. ధరలు మళ్లీ మెరుస్తున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 190 బలపడి రూ. 51,638 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,261 ఎగసి రూ. 67,237 వద్ద కదులుతోంది. వారాంతాన ప్లస్‌లో గురువారం పతనం తదుపరి ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల పసిడి రూ. 546 పెరిగి రూ. 51,448 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,750 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,890 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 786 పుంజుకుని రూ. 65,976 వద్ద నిలిచింది. ఒక దశలో 66,660 వరకూ బలపడన వెండి తదుపరి రూ. 65,268 వరకూ క్షీణించింది. అయితే ఈ నెల 7న నమోదైన గరిష్టం రూ. 56,200తో పోలిస్తే.. పసిడి రూ. 5,000 క్షీణించడం గమనార్హం! కామెక్స్‌లోనూ.. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం ప్రస్తుతం 0.2 శాతం పుంజుకుని 1,979 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.3 శాతం బలపడి 1970 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి సైతం 1 శాతం ఎగసి ఔన్స్ 28.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం అప్ శుక్రవారం ఔన్స్ పసిడి 42 డాలర్లు(2.2 శాతం) జంప్‌చేసి 1,975 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్లోనూ 35 డాలర్లు(1.8 శాతం) ఎగసి 1964 డాలర్ల వద్ద నిలిచింది. ఇక వెండి సైతం 2.2 శాతం పురోగమించి ఔన్స్ 27.79 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. మూడు వారాలుగా పసిడి, వెండి ధరలు ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. -
బంగారం, వెండి ధరల రికవరీ
గురువారం ఉన్నట్టుండి పతనమైన బంగారం, వెండి.. ధరలు తాజాగా బలపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ లాభాలతో కదులుతున్నాయి. గురువారం దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. కాగా.. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 228 పెరిగి రూ. 51,130 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 690 పుంజుకుని రూ. 65,880 వద్ద కదులుతోంది. ఈ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. మూడు వారాలుగా పసిడి, వెండి ధరలు ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. గురువారమిలా ఎంసీఎక్స్‌లో గురువారం 10 గ్రాముల పసిడి రూ. 877 కోల్పోయి రూ. 50,902 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 52,160 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,533 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 2,339 దిగజారి రూ. 65,190 వద్ద నిలిచింది. ఒక దశలో 67,826 వరకూ బలపడన వెండి తదుపరి రూ. 64,613 వరకూ పతనమైంది. కామెక్స్‌లో.. న్యూయార్క్ కామెక్స్‌లో గురువారం 1,932 డాలర్లకు క్షీణించిన ఔన్స్(31.1 గ్రాములు) పసిడి ప్రస్తుతం 0.7 శాతం పుంజుకుని 1,946 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 1929 డాలర్లకు పతనమైన బంగారం తాజాగా 0.5 శాతం బలపడి 1939 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి సైతం 1 శాతం ఎగసి ఔన్స్ 27.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
దూకుడు తగ్గిన బంగారం.. వెండి
ముందురోజు ఒక్కసారిగా జోరందుకున్న బంగారం, వెండి.. ధరలు తాజాగా బలహీనపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. బుధవారం దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి దూకుడు చూపాయి. కాగా.. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 49 తగ్గి రూ. 51,730 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 177 క్షీణించి రూ. 67352 వద్ద కదులుతోంది. ఈ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. రెండు వారాలుగా పసిడి, వెండి ధరలు ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. బుధవారమిలా ఎంసీఎక్స్‌లో'బుధవారం 10 గ్రాముల పసిడి రూ. 855 జంప్‌చేసి రూ. 51,779 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,876 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,551 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 3,522 దూసుకెళ్లి రూ. 67,529 వద్ద నిలిచింది. ఒక దశలో 67,815 వరకూ బలపడన వెండి తదుపరి రూ. 63,153 వరకూ పతనమైంది. కామెక్స్‌లో.. న్యూయార్క్ కామెక్స్‌లో బుధవారం 1,952 డాలర్లకు జంప్‌చేసిన ఔన్స్(31.1 గ్రాములు) పసిడి ప్రస్తుతం స్వల్ప నష్టంతో 1,950 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 1954 డాలర్లకు పెరిగిన బంగారం తాజాగా 1942 డాలర్ల వద్ద కదులుతోంది. ఇది 0.65 శాతం నష్టంకాగా.. ఇక ముందురోజు 27.5 డాలర్లకు ఎగసిన వెండి సైతం నామమాత్ర నష్టంతో ఔన్స్ 27.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
పసిడి- వెండి- స్వల్ప లాభాలతో షురూ
ఇటీవల చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. వరుసగా ఆటుపోట్లను చవిచూస్తున్న బంగారం, వెండి.. ధరలు తాజాగా బలపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ.. ముందు రోజు నష్టాలకు చెక్ పెడుతూ లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 129 పెరిగి రూ. 51,398వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 471 ఎగసి రూ. 66,040 వద్ద కదులుతోంది. సోమవారమిలా ఎంసీఎక్స్‌లో'సోమవారం 10 గ్రాముల పసిడి రూ. 747 పతనమై రూ. 51,269 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 52,232 వద్ద గరిష్టాన్ని తాకగా.. 51,160 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,498 కోల్పోయి రూ. 65,569 వద్ద నిలిచింది. ఒక దశలో 67,345 వరకూ జంప్‌చేసిన వెండి తదుపరి రూ. 65,300 వరకూ నీరసించింది. కామెక్స్‌లో ఫ్లాట్‌గా.. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.1 శాతం బలపడి 1,942 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.3 శాతం పుంజుకుని 1,935 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్ 0.7 శాతం ఎగసి 27 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. -
వెనకడుగులో.. పసిడి, వెండి
కొద్ది రోజులుగా ఆటుపోట్లను చవిచూస్తున్న బంగారం, వెండి.. ధరలు తాజాగా బలహీనపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ.. వరుసగా రెండో రోజు నష్టాల బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 234 క్షీణించి రూ. 51,782వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 843 నష్టంతో రూ. 66,224 వద్ద కదులుతోంది. శుక్రవారమిలా వారాంతాన ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 135 క్షీణించి రూ. 52,016 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 52,409 వద్ద గరిష్టాన్ని తాకగా.. 51,239 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 528 తక్కువగా రూ. 67,067 వద్ద నిలిచింది. ఒక దశలో 68,900 వరకూ ఎగసిన వెండి తదుపరి రూ. 65,201 వరకూ పతనమైంది. కామెక్స్‌లోనూ వీక్ ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.4 శాతం బలహీనపడి 1,939 డాలర్ల సమీపంలో కదులుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం వెనకడుగుతో 1,933 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ఔన్స్ 0.8 శాతం క్షీణించి 26.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వారాంతాన ఫ్యూచర్స్‌లో పసిడి 0.5 శాతం బలపడి 1947 డాలర్ల వద్ద నిలవగా.. స్పాట్లో 0.4 శాతం క్షీణించి 1941 డాలర్ల దిగువన ముగిసింది. ఇక వెండి 1.6 శాతం నష్టంతో 27 డాలర్ల వద్ద స్థిరపడింది. -
పతన బాటలో.. పసిడి- వెండి
ఇటీవల ఆటుపోట్లను చవిచూస్తున్న బంగారం, వెండి.. ధరలు తాజాగా డీలాపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 371 క్షీణించి రూ. 53,200 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,305 నష్టపోయి రూ. 68,200 వద్ద కదులుతోంది. కామెక్స్‌లోనూ వీక్ ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.6 శాతం క్షీణించి 2,002 డాలర్ల వద్ద కదులుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం బలహీనపడి 1,994 డాలర్లకు చేరింది. ఇక వెండి ఔన్స్ 1.2 శాతం వెనకడుగుతో 27.91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
70 వేలకు చేరిన వెండి
మళ్లీ బంగారం, వెండి.. మెరుస్తున్నాయి. సోమవారం 2 శాతంపైగా జంప్‌చేసిన వీటి ధరలు నేటి ట్రేడింగ్‌లోనూ.. జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 181 పెరిగి రూ. 53,456 వద్ద ప్రారంభమైంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 859 బలపడి రూ. 70,014 వద్ద ట్రేడవుతోంది. కొద్ది రోజుల క్రితం సరికొత్త గరిష్ట రికార్డులను చేరాక ఇటీవల బంగారం, వెండి ధరలు ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం జోరు.. సోమవారం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ. 1048 దూసుకెళ్లి రూ. 53,275 వద్ద నిలిచింది. తొలుత రూ. 53,443 వరకూ లాభపడినప్పటికీ ఒక దశలో రూ. 52,113 వరకూ డీలా పడింది. ఇక వెండి కేజీ రూ. 1,984 జంప్‌చేసి రూ. 69,155 వద్ద స్థిరపడింది. అయితే ఇంట్రాడేలో రూ. 70,246 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 67,030 వద్ద కనిష్టానికీ చేరింది. కామెక్స్‌లో అప్.. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.3 శాతం లాభంతో 2,005 డాలర్ల వద్ద కదులుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.5 శాతం పుంజుకుని 1,995 డాలర్లకు చేరింది. ఇక వెండి ఔన్స్ 1.2 శాతం బలపడి 28.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఫ్యూచర్స్, స్పాట్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ పురోగమించాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్ ధర 2 శాతం ఎగసి 1998 డాలర్ల వద్ద నిలవగా.. స్పాట్లో 1985 డాలర్ల ఎగువన ముగిసింది. ఇక వెండి 6 శాతం జంప్‌చేసి 27.75 డాలర్ల వద్ద స్థిరపడింది. -
బంగారం- వెండి.. రికార్డులే రికార్డులు
ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. సాధారణ ప్రజలకూ అత్యంత ప్రీతిపాత్రమైన బంగారం, వెండి ధరలు మరింత ప్రియమయ్యాయి. బులియన్ చరిత్రలో తొలిసారి అటు ఫ్యూచర్స్,.. ఇటు స్పాట్ మార్కెట్లలో బంగారం ధరలు మంగళవారం 2,000 డాలర్లకు ఎగువన ముగిశాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) దాదాపు 35 డాలర్లు జంప్‌చేసి 2021 డాలర్ల వద్ద ముగసింది. ఇక స్పాట్ మార్కెట్లోనూ పసిడి 2019 డాలర్ల వద్ద నిలిచింది. తద్వారా సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇక వెండి సైతం ఔన్స్ 26 డాలర్లను దాటేసింది. వెరసి 2013 తదుపరి గరిష్ట స్థాయికి వెండి చేరింది! దేశీయంగానూ ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.6 శాతం బలపడి 2032 డాలర్లకు ఎగువన కదులుతోంది. స్పాట్ మార్కెట్లో మాత్రం 0.2 శాతం నీరసించి 2014 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి సైతం 0.3 శాతం నీరసించి 26 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. కాగా.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో మంగళవారం 10 గ్రాముల పసిడి రూ. 834 లాభపడి రూ. 54,551 వద్ద నిలిచింది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధరకాగా.. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర రూ. 4049 దూసుకెళ్లి రూ. 69,797 వద్ద ముగిసింది. వెరసి నేటి ట్రేడింగ్‌లోనూ పసిడి ధరలు హైజంప్ చేయనున్నట్లు కమోడిటీ నిపుణులు చెబుతున్నారు. ర్యాలీ బాటలోనే ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి(అక్టోబర్ ఫ్యూచర్స్) రూ. 219 పుంజుకుని రూ. 54,770 వద్ద ట్రేడవుతోంది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర సైతం రూ. 64 బలపడి రూ. 69,861 వద్ద కదులుతోంది. 2500 డాలర్లకు సమీప భవిష్యత్‌లో ఔన్స్ పసిడి 2500 డాలర్లను తాకే వీలున్నట్లు యూఎస్‌కు చెందిన బులియన్ సాంకేతిక విశ్లేషకులు విడ్మర్, ఫ్రాన్సిస్కో బ్లాంచ్ అభిప్రాయపడ్డారు. బంగారానికి అత్యంత కీలకమైన 2000 డాలర్ల రెసిస్టెన్స్‌ను భారీ ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించడంతో ఇకపై మరింత జోరందుకునే వీలున్నట్లు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. రానున్న 18 నెలల కాలంలో బంగారం ఔన్స్ ధర 3,000 డాలర్లకు చేరవచ్చని బీవోఎఫ్‌ఏ గ్లోబల్ రీసెర్చ్ అంచనా వేసింది. కోవిడ్-19 ప్రపంచ దేశాలన్నిటా వేగంగా విస్తరిస్తుండటం, కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడం వంటి అంశాలు బంగారానికి డిమాండ్ పెంచుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
1900 డాలర్ల చేరువకు బంగారం!
విదేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు గురువారం మరోసారి బలపడ్డాయి. అయితే నేటి ట్రేడింగ్‌లో మాత్రం బంగారం అక్కడక్కడే అన్నట్లుగా కదులుతుంటే.. వెండి 1 శాతం వెనకడుగులో ఉంది. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి ఔన్స్(31.1 గ్రాములు) నామమాత్ర వృద్ధితో 1888 డాలర్ల వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో 1890 డాలర్లకు చేరింది. గురువారం ఒక దశలో 1898 డాలర్లవరకూ ఎగసింది. అయితే సాంకేతికంగా కీలకమైన 1900 డాలర్ల మార్క్ సమీపంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో 1878 డాలర్ల వరకూ నీరసించింది కూడా. ఇక న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం వెండి ఔన్స్ ధర దాదాపు 1 శాతం క్షీణించి 22.82 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి వెనకడుగు దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ఆగస్ట్ డెలివరీ రూ. 74 బలపడి రూ. 50,774 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 50,809కు చేరింది. ఇక వెండి మాత్రం కేజీ ధర రూ. 87 క్షీణించి రూ. 61,103 వద్ద కదులుతోంది. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధరలు 22 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఈ బాటలో గత వారం వెండి ధరలు 14 శాతం జంప్‌చేసిన విషయం విదితమే. కారణాలేవిటంటే? కోవిడ్-19 కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థలకు చేయూత నిచ్చేందుకు మంగళవారం యూరోపియన్ దేశాల నేతలు 750 బిలియన్ యూరోల ప్యాకేజీకి ఆమోదం తెలిపాయి. మరోవైపు లక్షల సంఖ్యలో కోవిడ్-19 బారినపడుతున్న అమెరికన్లను ఆదుకునేందుకు వాషింగ్టన్ ప్రభుత్వం మరో భారీ ప్యాకేజీ ప్రకటించవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ నాలుగు నెలల కనిష్టానికి బలహీనపడింది. ఇక మరోపక్క యూఎస్ బాండ్ల ఈల్డ్స్ నీరసిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఐదేళ్ల బాండ్ల ఈల్డ్స్ -1.15 శాతానికి చేరినట్లు తెలియజేశారు. ఈటీఎఫ్‌ల ఎఫెక్ట్ సాధారణంగా సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు బంగారానికి డిమాండ్ పెరిగే సంగతి తెలిసిందే. ప్రస్తుత అనిశ్చిత పరిస్థతులలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. సావరిన్ ఫండ్స్, ఈటీఎఫ్ తదితర ఇన్వెస్ట్మెంట్ సంస్థలు బంగారం కొనుగోలుకి ఎగబడుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈటీఎఫ్‌ల పసిడి హోల్డింగ్స్ 28 శాతం ఎగశాయి. అంటే 105 మిలియన్ ఔన్స్‌ల పసిడిని జమ చేసుకున్నాయి. ఫలితంగా 195 బిలియన్ డాలర్లకు వీటి విలువ చేరినట్లు బులియన్ వర్గాలు తెలియజేశాయి. -
కొండెక్కుతున్న బంగారం ధరలు
-
బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం!
సాక్షి, హైదరాబాద్: బంగారం కొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి బంగారం ధరలు 42 వేల మార్క్‌ను చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెపుతున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీన పడటం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పసిడి కొనుగోళ్లు వంటి అంశాలు దేశంలో పసిడి ధర పరుగుకు దోహదపడతాయని అంచనా. డిసెంబర్ నాటికి అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్ నైమెక్స్‌లో ఒక ఔన్స్ (28.3 గ్రాముల) బంగారం ధర 1,650 డాలర్లకు చేరవచ్చు అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బంగారం ధరలను దేశీయంగా పరుగులు పెట్టించే అవకాశం ఉంది. -
భారీగా పెరిగిన బంగారం ధరలు..!
ముంబై : బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీపావళి పండుగ సందర్భంగా కొనుగోళ్ల సందడి పెరుగుతుండటంతో బంగారం ధర ఆరేళ్ల గరిష్ఠానికి చేరింది. నేడు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 32, 650గా నమోదైంది. బంగారం ధర దూసుకుపోతుండగా.. వెండి ధర మాత్రం దిగొచ్చింది. పరిశ్రమల నుంచి డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్లో వెండి ధర రూ. 40 తగ్గి 39, 200కి నమోదైంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం 30 రూపాయల చొప్పున పెరిగి రూ.32,650గా, రూ.31,500గా నమోదైంది. నవంబర్ 29, 2012 తర్వాత ఇదే అత్యధిక ధర. 2012, నవంబర్ 29న 10 గ్రాముల బంగారం ధర 32, 940రూపాయలకు చేరింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ రోజే రికార్డ్ స్థాయిలో బంగారం ధర పెరిగింది. -
దిగొచ్చిన బంగారం ధర
న్యూఢిల్లీ : బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో బంగారం ధర దిగొస్తోంది. వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర బులియన్ మార్కెట్లో 220 రూపాయలు తగ్గి, రూ.31,650గా నమోదైంది. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కూడా డిమాండ్ తగ్గడంతో, బంగారం ధర పడిపోయింది. బంగారం బాటలోనే వెండి కూడా క్షీణించింది. కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి, రూ.39,250గా నమోదైంది.పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడంతో వెండి ధర తగ్గినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. రూపాయి పతనం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధర తగ్గుతున్నట్టు తెలిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర 1.39శాతం తగ్గి ఔన్సు 1,187 డాలర్లు పలికింది. వెండి కూడా 2.39శాతం తగ్గి ఔన్సు 14.38 డాలర్లు పలికింది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.220 చొప్పున తగ్గి 10 గ్రాములకు రూ.31,6500గా, రూ.31,500గా నమోదయ్యాయి. -
భారీగా పెరిగిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : బంగారం ధరలు భారీగా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు, స్థానిక ఆభరణ వర్తకుల జరుపుతున్న కొనుగోళ్ల సందడితో బంగారం ధరలకు ఊపు వచ్చింది. నేడు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 550 రూపాయలకు పైగా ఎగిసి రూ.32,030ను టచ్ చేసింది. వెండి సైతం బంగారం మాదిరిగానే పెరిగి, కేజీకి రూ.39వేలకు పైగా నమోదైంది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో, వెండి కూడా ఎగిసింది. ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రక్షించేందుకు అమెరికా, కెనడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో, బంగారానికి డిమాండ్ పెరిగిందని ట్రేడర్లు చెప్పారు. అంతేకాక రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ట స్థాయిల్లోకి దిగజారుతుండటంతో, డాలర్‌తో జరిపే దిగుమతులు ఖరీదైనవిగా మారుతూ.. బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి. అటు గ్లోబల్‌గా కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. బడ్జెట్ లోటును అధిగమించేందుకు ఇటలీ ప్లాన్లలో ఆందోళనలు చెలరేగడంతో, బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. స్పాట్ గోల్డ్ ధర 0.1 శాతం పెరిగి ఇంట్రాడేలో 1,203.31 డాలర్లుగా నమోదైంది. ఒక్క మంగళవారం రోజే ఏకంగా 1.3 శాతం పెరిగింది స్పాట్ గోల్డ్ ధర. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం 555 రూపాయల చొప్పున పెరిగి రూ.32,030గా, రూ.31,880గా నమోదైంది. -
తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతోపాటు స్థానికంగా డిమాండ్ లోపించడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. శనివారం నాటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు తగ్గడంతో రూ. 31,350గా నమోదైంది. ఇటు బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు మాత్రం పైకి ఎగిశాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ రావడంతో, వెండి ధరలు పెరిగాయి. నేటి మార్కెట్లో కేజీ వెండి ధర 275 రూపాయలు పెరిగి రూ. 37,775గా నమోదైంది. అమెరికా ఉద్యోగ డేటా సానుకూలంగా ఉండటంతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో పసిడిలో పెట్టుబడులు తగ్గాయి. దీనికి తోడు స్థానిక నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కూడా కొనుగోళ్లు లేకపోవడంతో ధర తగ్గినట్లు బులియన్ వర్గాలు చెప్పాయి. అంతర్జాతీయంగానూ పసిడి 0.28శాతం తగ్గి ఔన్సు ధర 1,196.20 డాలర్లు పలికింది. 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 100 రూపాయల చొప్పున తగ్గి, రూ.31,350గా, రూ.31,200గా నమోదైంది. శుక్రవారం కూడా బంగారం ధరలు 60 రూపాయలు తగ్గాయి. -
భారీగా పడిపోయిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : బంగారం ధరలు నేడు భారీగా పడిపోయాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 365 రూపాయలు పడిపోయి 30,435 రూపాయల వద్ద నమోదైంది. స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ క్షీణించడం, గ్లోబల్‌గా ఈ విలువైన మెటల్‌కు సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో బులియన్ మార్కెట్లో ధరలు క్షీణించినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. బంగారంతో పాటు వెండి ధరలూ స్వల్పంగా తగ్గాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ కాస్త తగ్గడంతో, కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి రూ.40 వేల కింద రూ.39 వేలుగా రికార్డైంది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచకుండా యథాతథంగా ఉంచడంతో డాలర్ బలపడింది. దీంతో ఈ విలువైన మెటల్‌కు గ్లోబల్‌గా డిమాండ్ తగ్గింది. గ్లోబల్‌గా గోల్డ్ 0.65 శాతం పడిపోయి, ఔన్స్‌కు 1,215.50 డాలర్లుగా నమోదైంది. బలహీనమైన గ్లోబల్ ట్రెండ్‌తో పాటు, దేశీయంగా ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్ తగ్గిపోయింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 365 రూపాయల చొప్పున పడిపోయి రూ.30,435, రూ.30,285గా నమోదయ్యాయి. కాగ, నిన్న ఈ విలువైన మెటల్ ధర 150 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. -
వరుసగా ఐదో రోజు తగ్గిన బంగారం
న్యూఢిల్లీ : బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా ఐదో రోజూ బంగారం ధరలు కిందకి పడిపోయాయి. అంతర్జాతీయంగా ట్రెండ్ స్తబ్దుగా ఉండటం, స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ లేకపోవడంతో గురువారం 10 గ్రాముల బంగారం ధర బులియన్ మార్కెట్లో 140 రూపాయలు తగ్గి, రూ.31,210గా నమోదైంది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే కేజీకి 470 తగ్గినట్టు తెలిసింది. దీంతో కేజీ వెండి ధర రూ.40,030గా రికార్డైంది. పారిశ్రామిక యూనిట్ల నుంచి, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు కూడా తగ్గాయని విశ్లేషకులు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ స్థిరంగా కొనసాగింది. ఒక్క ఔన్స్‌కు 1,243 డాలర్లు నమోదైంది. బుధవారం 1 శాతం కిందకి పడిపోయిన బంగారం, వారం కనిష్ట స్థాయిలను తాకింది. ఆగస్టు నెల అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.1 శాతం నష్టంలో ఔన్స్‌కు 1,243.60 డాలర్లుగా నమోదైనట్టు తెలిసింది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధరలు 140 రూపాయల చొప్పున తగ్గి రూ.31,210, రూ.31,060గా నమోదయ్యాయి. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం బలహీనమైన గ్లోబల్ ట్రెండ్, స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ పడిపోవడమని బులియన్ ట్రేడర్లు చెప్పారు. -
బంగారం ధరలు రెండో రోజూ పతనం
న్యూఢిల్లీ : బంగారం ధరలు వరుసగా రెండో కూడా పతనమయ్యాయి. గత రెండు రోజుల నుంచి పడిపోతున్న ధరలతో బంగారం రూ.32వేల మార్కు దిగువకు వచ్చి చేరింది. బుధవారం ఒక్కసారిగా 430 రూపాయల మేర పడిపోయిన బంగారం ధరలు, నేడు మరో 240 రూపాయలు కిందకి దిగజారాయి. 240 రూపాయలు తగ్గడంతో నేడు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.31,780గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్‌తో పాటు దేశీయ జువెల్లర్ల వద్ద నుంచి డిమాండ్ తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు పడిపోతున్నట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. అంతర్జాతీయంగా అమెరికా బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరగడం, ఇటలీలో రాజకీయ ఆందోళనలు చెలరేగడం వంటి వాటితో డాలర్ ఇండెక్స్ భారీగా పెరుగుతోంది. ఈ ప్రభావం బంగారం ధరలపై పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ వారం 2 శాతానికి పైగా పడిపోయినట్టు తెలిసింది. దేశీయంగా 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.240 చొప్పున పడిపోయి రూ.31,780గా, రూ.31,630గా నమోదయ్యాయి. నిన్న రూ.430 పడిపోయిన బంగారం ధరలు రూ.32,020 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. మరోవైపు బుధవారం బంగారం బాటలోనే నడిచిన వెండి, నేడు మాత్రం రికవరీ అయింది. వెండి ధరలు నేటి మార్కెట్లో 100 రూపాయలు పెరిగి కేజీకి రూ.40,750గా నమోదయ్యాయి. -
తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ బంగారం ధరలు పైపైకి ఎగుస్తున్నా.. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ సన్నగిల్లడంతో బంగారం ధరలు నేడు బులియన్ మార్కెట్లో రూ.115 తగ్గాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర నేటి మార్కెట్లో రూ.32,285గా నమోదైంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా వంద రూపాయలు తగ్గి, కేజీకి రూ.41,300గా రికార్డయ్యాయి. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు కూడా పడిపోయినట్టు మార్కెట్ ట్రేడర్లు చెప్పారు. అధిక ధరలు స్థానిక జువెలర్స్, రిటైలర్ల డిమాండ్‌ను దెబ్బ తీస్తున్నాయని బులియన్ ట్రేడర్లు చెప్పారు. గ్లోబల్‌గా బంగారం ధరలు 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు 1,320 డాలర్లుగా నమోదనప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గినట్టు పేర్కొన్నారు. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.115 తగ్గి రూ.32,285, రూ.32,135 చొప్పున నమోదయ్యాయి. అధిక ధరలతో ఈ ఏడాది దేశీయంగా బంగారపు ఆభరణాల డిమాండ్ 2-4 శాతం తగ్గే సూచనలు ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీ అంచనావేస్తోంది. గత మూడు నెలల నుంచి కొనసాగింపుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఐక్రా వైస్ ప్రెసిడెంట్ కే శ్రీ కుమార్ చెప్పారు. ఇటీవల కాలంలో జెమ్స్, జువెల్లరీ రంగంలో పెట్టే ఫైనాన్సింగ్‌పై కూడా పరిశీలనలు పెరిగాయని తెలిపారు. -
ఒక్కసారిగా పడిపోయిన బంగారం
న్యూఢిల్లీ : మూడు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా కిందకి పడిపోయాయి. బంగారం 240 రూపాయల మేర కిందకి పడిపోయింది. దీంతో నేటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.32,390గా రికార్డైంది. గ్లోబల్‌గా వస్తున్న బలహీనమైన సంకేతాలు, స్థానిక జువెలర్ల నుంచి డిమాండ్ అంతగా లేకపోవడం బంగారం ధరల తగ్గుదలకు కారణమైంది. కాయిన్ తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి వెండికి కూడా డిమాండ్ తగ్గడంతో, వెండి ధరలు సైతం 180 రూపాయిలు క్షీణించాయి. దీంతో కేజీ వెండి ధర మార్కెట్లో రూ.41,300గా ఉంది. గ్లోబల్‌గా బంగారం ధరలు 0.28 శాతం తగ్గి ఔన్స్‌కు 1,341.50 డాలర్లుగా నమోదైంది. వెండి 0.75 శాతం తగ్గి ఔన్స్ 17.09 డాలర్లుగా ఉంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.240 చొప్పున పెరిగి రూ.32,390గా, రూ.32,240గా రికార్డయ్యాయి. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు రూ.630 మేర పెరిగిన సంగతి తెలిసిందే. -
మళ్లీ తగ్గిన బంగారం ధరలు
ముంబై : అక్షయ తృతీయ దగ్గర పడుతున్న తరుణంలో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పైకి, కిందకి పచార్లు కొడుతూ ఉన్నాయి. శనివారం మార్కెట్లో బంగారం ధరలు పైకి ఎగియగా.. సోమవారం నాటి మార్కెట్లో మాత్రం మళ్లీ కిందకి పడిపోయాయి. స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయంగా ట్రెడ్ ప్రతికూలంగా వస్తుండటంతో, బంగారం ధరలు నేటి మార్కెట్లో వంద రూపాయలు తగ్గి, 10 గ్రాములకు రూ.32000గా నమోదయ్యాయి. సిల్వర్ ధరలు కూడా వంద రూపాయలు తగ్గి కేజీ రూ.39,900గా రికార్డయ్యాయి. అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాలు వీస్తుండటమే కాకుండా.. జువెల్లర్స్ కొనుగోళ్లు తక్కువ చేపడుతుండటంతో బంగారం ధరలు మళ్లీ కిందకి పడిపోయాయని బులియన్ ట్రేడర్లు చెప్పారు. గ్లోబల్‌గా కూడా బంగారం ధరలు 0.13 శాతం తగ్గి ఒక్క ఔన్స్‌కు 1,343.79 డాలర్లుగా ఉంది. సిల్వర్ 0.36 శాతం తగ్గి 16.57 డాలర్లుగా నమోదైంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర 100 చొప్పున తగ్గి 10 గ్రాములకు రూ.32వేలుగా, రూ.31,850గా రికార్డయ్యాయి. శనివారం ట్రేడింగ్‌లో బంగారం ధర ఒక్కసారిగా రూ.300 మేర చొప్పున పెరిగిన సంగతి తెలిసిందే. -
భారీగా తగ్గిన బంగారం ధరలు
-
భారీగా తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : వరుసగా నాలుగు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. నేటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 500 రూపాయల మేర కిందకి పడిపోయింది. 460 రూపాయలు నష్టపోయి రూ.31,390గా నమోదైంది. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో పాటు గ్లోబల్‌గా సంకేతాలు ప్రతికూలంగా వస్తుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో కేజీ వెండి ధర రూ.250 తగ్గి, రూ.39,300గా నమోదైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు బలంగా ఉందని.. ఫెడ్ పాలసీ రేట్లను క్రమంగా పెంచుతుందని ఫెడరల్ రిజర్వు చైర్మన్ జీరోమ్ పావెల్ ప్రకటించడంతో, డాలర్‌కు సెంటిమెంట్ బలపడింది. దీంతో ఎంతో విలువైన ఈ మెటల్‌కి డిమాండ్ పడిపోయింది. మంగళవారం అంతర్జాతీయంగా బంగారం ధరలు 1 శాతం క్షీణించాయి. ఈ ఏడాది మూడు నుంచి నాలుసార్లు రేట్లను పెంచబోతున్నట్టు కూడా జీరోమ్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.460 చొప్పున పడిపోయి రూ.31,390గా రూ.31,240గా నమోదయ్యాయి. గత నాలుగు సెషన్లలో బంగారం ధరలు రూ.500 మేర పెరిగాయి. -
తగ్గింపుకు బ్రేక్ : పెరిగిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : బంగారం ధరలు రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. నేటి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. వచ్చే పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్‌ను అందుకోవడం కోసం స్థానిక జువెల్లర్ల నుంచి తాజాగా కొనుగోళ్లు పెరుగడంతో, 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి రూ.31,170గా నమోదైంది. వెండి ధరలు సైతం రికవరీ అయ్యాయి. రూ.330 మేర పెరిగిన వెండి నేటి మార్కెట్లో కేజీకి రూ.39,230గా రికార్డైంది. వెండికి కూడా పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగింది. వచ్చే పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్‌ను అందుకోవడం కోసం స్థానిక జువెల్లర్లు కొనుగోళ్లు చేపడుతున్నారని, అదేవిధంగా గ్లోబల్‌గా స్వల్పంగా ట్రెండ్ మెరుగుపడిందని దీంతో బంగారం, వెండి ధరలు రికవరీ అవుతున్నట్టు ట్రేడర్లు చెప్పారు. గ్లోబల్‌గా న్యూయార్క్‌లో బంగారం ధర 0.02 శాతం పెరిగి ఔన్స్‌కు 1,318.30 డాలర్లుగా నమోదైంది. దేశ రాజధానిలో 99.9, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.220 చొప్పున పెరిగి రూ.31,170గా, రూ.31,020గా నమోదయ్యాయి. గత రెండు సెషన్లలో ఈ ధరలు రూ.650 తగ్గాయి. -
బంగారంపై పన్ను తగ్గుతోందా...?
ముంబై : ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం కొనుగోలుదారుగా ఉన్న భారత్‌లో రోజురోజుకి ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. మరో రెండు రోజుల్లో కేంద్ర వార్షిక బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టబోతుంది. దీంతో పెరుగుతున్న ధరలకు చెక్‌పెట్టడానికి, అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం సమర్పించనున్న బడ్జెట్లో దిగుమతి పన్నును తగ్గించే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కూడా పన్ను తగ్గింపు అవసరమని బులియన్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తక్కువ దిగుమతి పన్నుతో దేశీయంగా బంగారం డిమాండ్‌ను పెంచవచ్చనీ పేర్కొంటున్నాయి. కరెంట్ అకౌంట్ లోటును తగ్గించేందుకు 2013 ఆగస్టులో దిగుమతి డ్యూటీని భారత్ 10 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగారంపై దిగుమతి పన్నును 2 నుంచి 4 శాతం తగ్గించే అవకాశముందని తాము అంచనావేస్తున్నట్టు ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ గాడ్జిల్ తెలిపారు. ఎక్కువ దిగుమతి డ్యూటీతో గ్రే ఛానల్స్ ఎక్కువవుతాయని, అక్రమ రవాణాకు, అనధికారిక విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తగ్గింపు అవసరమని పేర్కొన్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం 2016లో భారత్‌కు దాదాపు 120 టన్నుల బంగారాన్ని స్మగ్లర్లు రవాణా చేసినట్టు తెలిసింది. 10 శాతం దిగుమతి పన్నును ఆదా చేసుకునేందుకు స్మగ్లర్లు 1 శాతం లేదా 2 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తారని, కానీ తాము ఎలాంటి డిస్కౌంట్లు ఇవ్వకుండా.. డ్యూటీలను చెల్లిస్తామని కోల్‌కత్తాకు చెందిన హోల్‌సేల్, జేజే గోల్డ్ హౌజ్ ప్రొప్రైటర్ హర్షద్ అజ్మిరా చెప్పారు. పన్ను ఎగవేతదారులు ఎక్కువగా అక్రమ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారని, వారు 3 శాతం జీఎస్టీని కూడా చెల్లించరని చెన్నైకు చెందిన హోల్‌సేల్ ఎంఎన్సీ బులియన్ డైరెక్టర్ ప్రకాశ్ రాథోడ్ అన్నారు. తొలుత ప్రభుత్వం 10 శాతం దిగుమతి పన్నును, అనంతరం జీఎస్టీని కోల్పోతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపు చేపట్టాలని బులియన్ పరిశ్రమ పట్టుబడుతోంది. -
దివాళి డిమాండ్ : బంగారం జంప్
న్యూఢిల్లీ : దీపావళి డిమాండ్ ప్రభావంతో బంగారం ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. నేటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.290 పెరిగి మూడు వారాల గరిష్టానికి చేరుకుంది. పండుగ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి స్థానిక జువెల్లర్స్ ఎక్కువగా కొనుగోళ్లు చేపడుతుండటంతో బంగారం ధర రూ.31వేలను చేరుకున్నట్టు ట్రేడర్లు చెప్పారు.. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి తక్కువ డీల్స్ ఉండటంతో వెండి కేజీకి రూ.41వేలుగానే ఉంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం స్థానిక ఆభరణదారుల నుంచి కొనుగోళ్లు పెరగడం, దేశీయ స్పాట్ మార్కెట్లో దీపావళి ఫెస్టివల్ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడమేనని తెలిసింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధరలు రూ.290 చొప్పున పెరిగి రూ.31వేలుగా, రూ.30,850గా ఉంది. అయితే గ్లోబల్‌గా మాత్రం బంగారం ధరలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఔన్స్‌కు 0.12 శాతం తగ్గి 1,283.20 డాలర్లగా ఉంది. -
మళ్లీ మెరుపు తగ్గిన బంగారం..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్, దేశీయంగా ధన్‌తేరాస్ రోజైనప్పటికీ.. రిటైలర్లు, జ్యుయలర్ల నుంచి ఒక మోస్తరు కొనుగోళ్ల ధోరణితో మంగళవారం పసిడి ధర రూ.140 మేర తగ్గింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడటం కూడా పుత్తడి రేట్లు తగ్గడానికి కారణమైనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముంబై బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 245 క్షీణించి రూ.29,765 వద్ద, ఆభరణాల బంగారం రూ.29,615 వద్ద క్లోజయ్యింది. వెండి కిలో ధర రూ. 540 తగ్గి రూ. 39,570 వద్ద ముగిసింది. అటు, న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం పది గ్రాముల ధర రూ. 140 తగ్గి రూ. 30,710 వద్ద, ఆభరణాల బంగారం సైతం అంతే క్షీణించి రూ. 30,560 వద్ద ముగిసింది. ఇక వెండి రికార్డు స్థాయిలో రూ.400 క్షీణించి కిలో రేటు రూ. 41,000కు పడింది. అయితే, రోజువారీగా చూస్తే మాత్రం అమ్మకాలు 20% పెరిగాయని, కొనుగోలుదారులు పెట్టుబడి అవసరాల కోసం కొనుక్కోవడమే ఇందుకు కారణమని బులియన్ ట్రేడర్లు తెలిపారు. పసిడి కొనుగోళ్లకు కేవైసీ నిబంధనల సడలింపుతో రిటైల్ కొనుగోళ్లకు ఊతమిచ్చినప్పటికీ.. అంతర్జాతీయ ట్రెండ్లు పసిడి రేట్లపై ప్రభావం చూపినట్లు వివరించారు. అంతర్జాతీయంగా అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లో డిసెంబర్ కాం ట్రాక్టు ఔన్సు (31.1 గ్రాములు) ధర ఒక దశలో 15 డాలర్లు క్షీణించి 1,287 డాలర్ల వద్ద ట్రేడైంది. దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ ఒక దశలో 0.8% తగ్గుదలతో రూ. 29,611 వద్ద ట్రేడైంది. -
తగ్గిన బంగారం ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : ఒకరోజు భారీగా పైకి ఎగుస్తూ.. మరోరోజు భారీగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు, మంగళవారం మళ్లీ కిందకి పడిపోయాయి. ఈక్విటీలు, డాలర్ పైకి ఎగియడంతో పసిడి పరుగుకు బ్రేక్‌పడింది. 150 రూపాయల నష్టంలో రూ.31వేల మార్కుకు కిందకి పడిపోయింది. నేటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.30,850గా నమోదైంది. ఉత్తర కొరియా టెన్షన్లు కొంత తగ్గుముఖం పటట్టడంతో, సురక్షిత ఆస్తులుగా ఉన్న బంగారం, జపనీస్ యెన్, స్విస్ ఫ్రాంక్, ట్రెజరీలకు డిమాండ్ పడిపోయింది. వెండి ధరలు కూడా స్వల్పంగా 50 రూపాయల నష్టంలో కేజీకి రూ.41,650గా నమోదయ్యాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్‌తో పాటు స్థానిక జువెల్లర్స్, రిటైలర్ల నుంచి డిమాండ్ లేకపోవడంతో బంగారం ధరలు తగ్గుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గ్లోబల్‌గా బంగారం 0.08 శాతం పడిపోయి, సింగపూర్ ఔన్స్ బంగారం ధర 1,325.90 డాలర్లుగా నమోదైంది. వెండి కూడా 0.31 శాతం కిందకి పడిపోయి ఔన్స్‌కు 17.70 డాలర్లుగా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 150 రూపాయల చొప్పున పడిపోయి రూ.30,850గా, రూ.30,700గా నమోదయ్యాయి. సోమవారం ట్రేడింగ్‌లో ఈ ధరలు 470 రూపాయలు బలపడ్డాయి. -
భారీగా ఎగిసిన బంగారం ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో శుక్రవారం మార్కెట్లో భారీగా ఎగిసిన బంగారం ధరలు, ఒక్కరోజుల్లో ఢమాలమన్నాయి. స్థానిక జువెలర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో పాటు, బలహీనమైన గ్లోబల్ సంకేతాలతో శనివారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.820 కిందకి పడిపోయి రూ.30,530గా నమోదైంది. ఈ ఏడాదిలో అత్యధికంగా పడిపోవడం ఇదే తొలిసారి. నిన్నటి బులియన్ మార్కెట్లో ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర 990 రూపాయల మేర పెరిగి రూ.31,350గా నమోదైన సంగతి తెలిసిందే. గ్లోబల్‌గా కూడా ఏడాది గరిష్టానికి ఎగిసిన బంగారం ధరలు 0.19 శాతం పడిపోయి ఔన్స్‌కు 1,346 డాలర్లగా నమోదయ్యాయి. సిల్వర్ ధరలు 0.91 శాతం తగ్గుముఖం పట్టాయి. దేశరాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 820 రూపాయల చొప్పున రూ.30,530, రూ.30,380గా నమోదయ్యాయి. మరోవైపు సిల్వర్ ధరలు దేశీయ మార్కెట్లో ఫ్లాట్‌గా ఉన్నాయి. కేజీకి రూ.42వేలుగా నమోదయ్యాయి. -
ఒక్కరోజులోనే కిందకి పడిన బంగారం
సాక్షి, న్యూఢిల్లీ : పరుగులు పెట్టిన పుత్తడి ఒక్కరోజులోనే మళ్లీ భారీగా కిందకి పడిపోయింది. ఉత్తరకొరియా జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగించిందనే వార్తల నేపథ్యంలో మంగళవారం అమాంతం పైకి ఎగిసిన బంగారం ధరలు, బుధవారం 350 రూపాయల మేర ఢమాలమన్నాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, దానికి తోడు స్థానిక జువెల్లర్ల నుంచి పెద్దగా డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 350 రూపాయలు పడిపోయి, రూ.30,100గా నమోదైంది. వెండి కూడా 500 రూపాయల మేర క్షీణించి, 41వేల రూపాయల మార్క్ కిందకి చేరింది.. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి పెద్దగా డిమాండ్ రాకపోవడంతో కేజీ వెండి ధర బులియన్ మార్కెట్లో రూ.40,600గా నమోదైంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు 0.07 శాతం పడిపోయి ఔన్స్‌కు 1,308.60 డాలర్లుగా నమోదయ్యాయి. సిల్వర్ కూడా 0.43 శాతం క్షీణించి ఔన్స్‌కు 17.35 డాలర్లుగా ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.350 చొప్పున పడిపోయి రూ.30,100గా, రూ.29,950గా నమోదయ్యాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఇది రూ.550 మేర పెరిగిన సంగతి తెలిసింది. -
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ముంబై : రూ.29వేల దిగువకు దిగజారిన బంగారం ధరలు మళ్లీ పైకి ఎగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు స్తబ్ధుగా ఉండటం పాటు స్థానిక ఆభరణ వర్తకుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధరలు శనివారం బులియన్ మార్కెట్లో 190 రూపాయలు పెరిగాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.29వేలకు పైన రూ.29,050 వద్ద నిలిచింది. సిల్వర్ కూడా 38వేల రూపాయల మార్కును మళ్లీ తన సొంతం చేసుకుంది. కాయిన్ తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి కొనుగోళ్లు పెరగడంతో సిల్వర్ ధరలు కూడా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం ధరలు పది గ్రాములకు రూ.190 రూపాయలు పెరిగి, 29,050 రూపాయలు, 28,900 రూపాయలుగా నమోదయ్యాయి. కాగ, నిన్నటి ట్రేడ్‌లో బంగారం ధరలు 190 రూపాయలు పడిపోయిన సంగతి తెలిసిందే. ఎంసీఎక్స్ మార్కెట్లో కూడా శనివారం బంగారం ధరలు 154 రూపాయలు పెరిగి, రూ.28వేలకు చేరువలో నమోదైంది. బంగారం ధరలతో పాటు సిల్వర్ కూడా పైకి ఎగిసింది. కేజీకి 600 రూపాయలు పెరిగి, రూ.38,000 మార్కును చేరుకుంది. -
పెరిగిన బంగారం ధరలు
-
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 29,840 రూపాయిలకు చేరుకుంది. మళ్లీ రూ.30వేల స్థాయికి చేరుకుంది. గతనెల (మార్చి) 3న 29,480 రూపాయిలకు పడిపోయిన స్వచ్ఛమైన బిస్కెట్ గోల్డ్ ధర అమెరికా ఫెడ్ తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా ఒక్కసారిగా లాంగ్ జంప్ చేసింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 28,200 రూపాయిలుగా ఉంది. ఫెడ్ విడుదల చేసిన గత సమావేశ మినిట్స్‌ను ప్రకారం బ్యాలెన్స్ షీటులో భారీ కోత పడనుంది. ఇందుకు అనుగుణంగా కీలక వడ్డీ రేట్లలో పెంపునకు ఆస్కారం ఉందనే అంచనాలు బులియన్ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెంచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమావేశం కానున్న నేపథ్యంలో వీరి నుంచి ఎటువంటి ప్రకటనలు వెలువడతాయోనన్న ఆందోళనలో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఒక్కసారిగి పెరిగిన డిమాండ్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రాము) బంగారం ధర అర శాతం పెరిగి 1,255 డాలర్లకు చేరుకుంది. ఇందుకు అనుగుణంగా దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. వెండి ధర రూ.112 పెరిగి 42,370 రూపాయిలకు చేరుకుంది. -
పసిడి పరుగులు: ధరలు పైపైకి
ముంబై : విలువైన మెటల్స్గా పేరున్న బంగారం, వెండికి వరుసగా రెండో వారంలోనూ భారీగా గిరాకీ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలు, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో స్థానిక జువెల్లరీలు, రిటైలర్లు కొనుగోలు చేపడుతుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారం ధరలు రూ. 225లు పెరిగాయి. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.29,900, రూ.29,725 పలుకుతోంది. అదేవిధంగా వెండి ధరలు కూడా రూ.800 పైకి ఎగిశాయి. దీంతో కేజీ వెండి ధర రూ 43,050గా నమోదవుతోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్స్‌కు 1,232.90 డాలర్లుగా రికార్డు అవుతోంది. అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నా దేశీయంగా మాత్రం పెళ్లిళ్ల సీజన్ కావడంతో రిటైలర్లు బంగారాన్ని కొనడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. -
31 వేలకు చేరిన పసిడి ధర
ముంబై: ముంబై స్పాట్ బులియన్ మార్కెట్లో బుధవారం ఉదయం అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.31 వేలు దాటింది. వెండి కేజీ ధర రూ.45వేల పైకి చేరింది. ట్రంప్ గెలుపుతో రిస్క్ ఆస్తులకు ప్రమాదం ఏర్పడుతుందన్న అంచనాలతో పుత్తడిలో పెట్టుబడులకు సురక్షితమన్న భావించిన ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర 1,338 డాలర్ల స్థారుుకి పెరిగింది. తక్షణం తమ పెట్టుబడులకు పసిడిని రక్షణగా చూడడమే ఈ విలువైన మెటల్స్ పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో ముంబైలో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.815 ఎగసి, రూ.31,295కు చేరింది. ఇక 99.5 స్వచ్ఛత ధర కూడా అదే స్థారుులో ఎగసి రూ.31,145కు పెరిగింది. వెండి కేజీ ధర ఏకంగా రూ.1,390 ఎగసింది. రూ.45,370గా నమోదరుు్యంది. అరుుతే అటు తర్వాత క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పడిపోరుుంది. నెమైక్స్ మార్కెట్లో చూస్తే... కడపటి సమాచారం అందే సరికి పసిడి ఔన్స (31.1గ్రా) కేవలం 2 డాలర్ల లాభంతో 1,277 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే బలహీన ధోరణి దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజీలోనూ కొనసాగుతోంది. పసిడి అతి స్వల్ప లాభంతో రూ.29,993 వద్ద ట్రేడవుతోంది. డాలర్ బలోపేతం కావడం చివరికి పసడి ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
మళ్లీ రూ. 27 వేల పైకి బంగారం
ముంబై: బంగారం ధరలు గురువారం ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ముంబై బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 27వేల స్థాయిని దాటి... రూ.27,155కు చేరింది. ఇది ఐదు నెలల గరిష్టం. బుధవారం నాటి ముగింపు రూ.26,980తో పోలిస్తే ఇది రూ.175 అధికం. ముందున్న పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్‌ను తట్టుకోవటానికి ట్రేడర్లు కొంటుం డగా... అంతర్జాతీయ ట్రెండ్ కూడా దీనికి దోహదం చేసింది. అటు వెండి ధర కూడా రూ.515 పెరిగి కేజీ రూ.35,940 వద్ద స్థిరపడింది. పది గ్రాముల (99.9 శాతం) స్వచ్ఛమైన బంగారం ధర బుధవారం రూ. 27,130 కాగా అది గురువారం రూ.175 పెరిగి రూ.27,305 వద్ద నిలిచింది. అటు 99.9 శాతం స్వచ్ఛమైన వెండి ధర కూడా బుధవారం కేజీ రూ.35,940 పలుకగా గురువారం అది ఒక్కసారిగా రూ.515 పెరిగి రూ.35,940కి చేరింది. రెండు వారాల అనంతరం ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు మూడు నెలల గరిష్టానికి చేరుకోవడంతో... ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచటం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
దూసుకుపోయిన పసిడి, వెండి
-
మళ్లీ పసిడికి డిమాండ్!
ధర తగ్గుదలతో కొనుగోళ్లు పెరుగుతాయ్ ♦ పెళ్లిళ్లు, పండుగల సీజన్ ఊతం ♦ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక న్యూఢిల్లీ :ప్రతికూల వాతావరణ పరిస్థితులు గ్రామీణ ప్రాంతాలవారి ఆదాయాలపై ప్రభావం చూపడంతో ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్‌లో పసిడికి డిమాండ్ 25 శాతం తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తెలిపింది. అయితే, ఇటీవలి కాలంలో ధరలు కూడా గణనీయంగా తగ్గడంతో ఈ ఏడాది ద్వితీయార్థంలో పసిడికి మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని గురువారం ఒక నివేదికలో వివరించింది. బంగారం వినియోగంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో.. గతేడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో పసిడికి డిమాండ్ 204.9 టన్నులు ఉండగా ఈసారి మాత్రం 154.5 టన్నులకు పడిపోయింది. దిగుమతులు స్వల్పంగా తగ్గి 206.2 టన్నుల నుంచి 205 టన్నులకు క్షీణించాయి. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే (372 టన్నులు) ఈ ఏడాది ప్రథమార్ధంలో పసిడి డిమాండ్ 7 శాతమే క్షీణించి 346.2 టన్నులుగా నమోదయ్యింది. ప్రస్తుత సంవత్సరం ప్రథమార్ధం ఎలా గడిచినప్పటికీ జూలై- డిసెంబర్ మధ్య కాలంలో మాత్రం పసిడికి డిమాండ్ మెరుగుపడగలదని భావిస్తున్నట్లు డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం తెలిపారు. గడిచిన కొన్ని వారాలుగా పసిడి రేట్లు తగ్గినందున కొనుగోలుదారులు మళ్లీ కొనడం మొదలుపెట్టడంతో సానుకూల డిమాండ్ నెలకొంటోందని ఆయన వివరించారు. సాధారణంగా ధరలపై ఎక్కువగా దృష్టి పెట్టే మార్కెట్లలో.. రేట్లు తగ్గడమనేది కొనుగోళ్లకు సరైన సమయంగా పరిగణించవచ్చని సోమసుందరం పేర్కొన్నారు. ఆసియా, మధ్యప్రాచ్య మార్కెట్లలో ధరల తగ్గుదలతో కొనుగోళ్లు పెరుగుతుంటాయని, ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇది కనిపిస్తోందని ఆయన వివరించారు. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో పెళ్లిళ్లు, పండుగలు ఉండనున్న నేపథ్యంలో ఆభరణాలకు డిమాండ్ ఉండగలదని డబ్ల్యూజీసీ తెలిపింది. డిమాండ్ మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ.. ఇదంతా వర్షపాతం సాధారణ స్థాయిలో ఉన్న పక్షంలోనే సాధ్యమని డబ్ల్యూజీసీ పేర్కొంది. ఆసియాలో 12% తగ్గిన పసిడి డిమాండ్ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ క్యూ2) ఆసియాలో పసిడి డిమాండ్ 12 శాతం మేర క్షీణించి ఆరేళ్ల కనిష్టం 914.9 టన్నులకు పడిపోయిందని డబ్ల్యూజీసీ తెలిపింది. ప్రధాన మార్కెట్లయిన భారత్, చైనాలో డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణమని వివరించింది. గతేడాది క్యూ2లో 1,038 టన్నులకు డిమాండ్ నమోదైనట్లు డబ్ల్యూజీసీ నివేదికలో వెల్లడించింది. బంగారం... నెల గరిష్ట స్థాయి ముంబై: పసిడి జోరు వరుసగా ఆరవ రోజూ కొనసాగింది. ముంబై బులియన్ మార్కెట్లో ధర నెల గరిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయంగా పలు దేశాల కరెన్సీ ప్రతికూలాంశాలు, పండుగ సీజన్లో ఆభరణ వర్తకుల డిమాండ్ దీనికి ప్రధాన కారణం. ఇక్కడి స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.125 పెరిగి, రూ.25,875కు చేరింది. 22 క్యారెట్ల ధర కూడా అంతే మొత్తం పెరిగి రూ.25,725కు ఎగసింది. కాగా వెండి కూడా కేజీకి రూ.195 పెరిగి రూ.36,435కు చేరింది. -
మెరుపు తగ్గిన పసిడి
-
మరింత తగ్గిన బంగారం
-
మరింత తగ్గిన బంగారం
♦ ముంబైలో నాలుగేళ్ల కనిష్టం ♦ రూ.25,000 దిగువకు 10 గ్రా. పసిడి ముంబై/న్యూయార్క్ : అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశంలో బంగారం ధర తగ్గుతోంది. ముంబై ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.300 తగ్గి, రూ. 24,970కి చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ. 24,820కి పడింది. ధరలు ఇక్కడ ఈ స్థాయికి తగ్గడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. వరుసగా మూడు రోజుల నుంచీ బంగారం ధర కిందకు జారుతోంది. అంతర్జాతీయంగా 10 రోజుల నుంచి డౌన్ అంతర్జాతీయంగా చూస్తే... పసిడి ధర వరుసగా 10 రోజల నుంచి పతనం అవుతోంది. 1996 తరువాత వరుసగా 10 రోజులు బంగారం ధర ప్రపంచ మార్కెట్లో పడడం ఇదే తొలిసారి. బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ సంస్థ- గోల్డ్‌మన్ శాక్స్ అంచనావేస్తోంది. ఇన్వెస్టర్లు ఫండ్స్ ద్వారా మరింత బంగారం అమ్మకాలకు పాల్పడే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది. అంతర్జాతీయంగా నెమైక్స్ కమోడిటీ డివిజన్లో పసిడి ధర ప్రస్తుతం ఔన్స్ (31.1 గ్రా)కు 1,100 డాలర్ల దిగువనే కొనసాగుతోంది. మరో 100 డాలర్లు తగ్గి, 1,000 డాలర్లకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు విశ్లేషకుల అంచనా. 2009 తరువాత పసిడి ఈ స్థాయికి జారలేదు. వెండి విషయానికి వస్తే..: అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్ ధర 15 డాలర్ల లోపే ట్రేడవుతోంది. ముంబై మార్కెట్లో కేజీ ధర రూ.35,000కు కొంచెం అటుఇటుగా ఉంటోంది. కారణాలు ఏమిటి..: అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచవచ్చన్న ఊహాగానాలు అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ట్రేడర్లు భారీ అమ్మకాలకు తెగబడుతుండడం బంగారం నేల చూపుకు కారణమని కొన్ని వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా అంతర్జాతీయం గా, ఇటు దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో బుధవారం కడపటి సమాచారం అందేసరికి పసిడి భారీ నష్టాలో ్లనే ట్రేడవుతోంది. ఇదే పరిస్థితి ట్రేడింగ్ చివరికంటా కొనసాగితే... గురువారం దేశీయ స్పాట్ మార్కెట్లో కూడా పసిడి ధర మరింత పడే అవకాశం ఉంది. -
తగ్గిన బంగారం, వెండి ధరలు.
-
తగ్గిన బంగారం, వెండి ధరలు
చుక్కల్లో ఉన్న బంగారం, వెండి ధరలు కాస్త దిగివచ్చాయి. శనివారం బంగారం ధర రూ. 410, వెండి రూ.550 మేరకు తగ్గాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్ లో పదిగ్రాముల (తులం) బంగారం ధర రూ.26,690 కాగా, కిలో వెండి ధర రూ. 38,000 గా ఉంది. ఆభరణాలు, వెండి నాణేల తయారీ రంగంలో లావాదేవీలు మందకోడిగా జరుగుతుండటం వల్లే ఈ పరిణామం చోటుచేసుకుంది. వడ్డీ రేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వ్ సానుకూల సంకేతాలు ఇవ్వడం కూడా బంగారం ధరల తగ్గుదలకు మరో కారణమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయ మార్కెట్ ను ప్రభావితం చేసే సింగపూర్ లోనూ బంగారం ధర 0.5 శాతం, వెండి ధర 0.3 శాతం తగ్గింది. -
భారీగా పెరిగిన బంగారం ధర
గత కొన్నాళ్లుగా తగ్గుముఖం పడుతూ.. వినియోగదారులను ఊరిస్తున్న బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారం ధర 840 రూపాయలు పెరిగింది. పది గ్రాముల ధర ప్రస్తుతం 27,040 రూపాయలుగా ఉంది. ఈ ఏడాది ఒకే రోజులో ఇంత రేటు పెరగడం ఇదే మొదటి సారి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడటంతో ఈమధ్య కాలంలో బంగారం కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. ఇలాంటి సమయంలో ధర పెరగడంతో ఒక్కసారిగా వినియోగదారులు కుదేలయ్యారు. -
మరింత దిగివస్తున్న బంగారం ధరలు
ముంబయి : పసిడి ప్రియులకు శుభవార్త. పండుగల వేళ బంగారం ధరలు మరింతగా దిగొస్తున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు 15 నెలల కనిష్టానికి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 1200 డాలర్లకు సమీపంలో వచ్చింది. ప్రస్తుతం 1214 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 2 వేల రూపాయల దాకా తగ్గి... 26,360కి సమీపంలో ట్రేడవుతోంది. కిలో వెండి ధర 550 రూపాయలకు పైగా కోల్పోయి 39 వేల రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. మరోవైపు మెటల్ ధరలు కూడా ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. -
10 నెలల కనిష్టానికి పుత్తడి
ముంబై: పసిడి ధర ముంబై స్పాట్ మార్కెట్లో శనివారం 10 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర క్రితం ధరతో పోల్చితే... రూ.70 తగ్గి, రూ.26,755కు చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర కూడా అంతే మొత్తం తగ్గి రూ.26,605కు చేరింది. కాగా వెండి కేజీ ధర రూ.215 తగ్గి రూ.40,865కు దిగివచ్చింది. వరుసగా ఆరు రోజుల నుంచీ బంగారం ధరలు తగ్గుతున్నాయి. దేశీయంగా డిమాండ్ తగ్గడం, స్టాకిస్టుల అమ్మకాలు వంటి అంశాలు దీనికి కారణం. అంతర్జాతీయ మార్కెట్లో సైతం బంగారం ధర బలహీనంగానే ట్రేడవుతోంది. నెమైక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,250 డాలర్ల సమీపంలో కదలాడుతోంది. వెండి విషయంలో ఈ ధర 19 డాలర్లుగా ఉంది. అమెరికా ఉద్యోగ కల్పన గణాంకాలు ఊహించినదానికన్నా మెరుగ్గా ఉండడం వల్ల ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతోందన్న సంకేతాలు బలంగా ఉన్నాయి. దీనితో పసిడిలో డబ్బు క్యాపిటల్ మార్కెట్లలోకి మళ్లుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది పసిడి, వెండి ధర మెట్టు దిగడానికి దారితీస్తోందని వారు తెలుపుతున్నారు. ఆయా అంశాలుసైతం దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని వారు భావిస్తున్నారు. -
పడిపోతున్న పసిడి ధర
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: పసిడి ధర నానాటికీ పడిపోతోంది. ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర బుధవారం రూ.27,800లకు పలికింది. ఈనెల 15న రూ.30,130లు ఉన్న ఈ ధర క్రమేణా తగ్గుతూ వస్తోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం మార్కెట్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రధాని మోడీ హయాంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వార్తలు పెద్ద ఎత్తున వస్తుండటంతో బంగారం కొనుగోళ్లపై కొనుగోలు దారులు ఆసక్తి చూపడం లేదు. ధరలు మరింత తగ్గుతాయేమోనని ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల కారణంగా ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్ వ్యాపారాలు లేక డీలా పడింది. రాయలసీమలోనే పసిడి వ్యాపారానికి ప్రొద్దుటూరు ప్రసిద్ధిగాంచింది. వ్యాపారులతోపాటు వేలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు. సాధారణంగా మార్కెట్ ధరలు అప్పుడప్పుడు తగ్గడం మళ్లీ పెరగడం జరుగుతుండేది. ఈనెల 16న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో నరేంద్రమోడీ ప్రభుత్వం రావడంతో మార్కెట్ పరిస్థితులు మారిపోయాయి. బంగారం ధరలు క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి. ధరలు మరింత క్షీణిస్తాయని ప్రముఖ వ్యాపారులు ప్రకటిస్తుండటంతో కొనుగోలుదారుల్లో ఆశలు పెరుగుతున్నాయి. తొందరపడి కొనుగోలు చేసేకన్నా మరింత కాలం ఆగితే మేలు ఉంటుందని భావిస్తున్నారు. మార్కెట్ పరిస్థితులను చూసి కొనుగోలుదారులెవ్వరూ దుకాణాలకు రావడం లేదు. కేవలం ధరల గురించి మాత్రం ఆరా తీస్తున్నారు. దీంతో దుకాణాలన్నీ కొనుగోలు దారులు లేక బోసిపోయినట్లు దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని ఓ కార్పొరేట్ దుకాణంలో ఒక్క కొనుగోలుదారుడు కూడా లేకపోవడాన్ని చూస్తే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. ఏ దుకాణాన్ని చూసినా బుధవారం ఇదే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం బంగారంపై దిగుమతి సుంకం 10 శాతం ఉండగా ప్రభుత్వం దీనిని తగ్గించే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే బంగారం దిగుమతులు పెరిగి ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. ధరలు తగ్గడంతో నష్టపోయా గత నెలలో ప్రొద్దుటూరులో బంగారం కొనుగోలు చేశా. గ్రాము రూ.30వేలు చొప్పున కొనుగోలు చేశాను. ఆర్డర్ ఇచ్చిన బంగారాన్ని తీసుకునేందుకు రాగా ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.27,800 ఉందన్నారు. నేను కొనుగోలు చేసిన బంగారంపై రూ.7వేలు నష్టపోయా. - తల్లపురెడ్డి రమణమ్మ, కోగటం రూపాయి విలువ తగ్గడమే కారణం రూపాయి విలువ తగ్గడమే బంగారు ధరల పతనానికి ప్రధాన కారణం. రూపాయి విలువ బుధవారం నాటికి రూ.62.30 నుంచి రూ.58.83కు తగ్గింది. దీనికితోడు దిగుమతి సుంకం ప్రస్తుతం ఉన్న 10 శాతాన్ని తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. దిగుమతి సుంకం తగ్గితే బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. - హాజీ ఎస్ఎం ఇబ్రహీం, ఇబ్రహీం జువెలర్స్ మార్కెట్ డీలా పడింది బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు రావడం లేదు. ఇంకా ధరలు తగ్గుతాయని ఆశపడుతున్నారు. వ్యాపారాలు లేక బులియన్ మార్కెట్ డీలాపడింది. - బుశెట్టి రామ్మోహన్రావు, బులియన్ మర్చంట్స్ అసోషియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ -
‘హవాలా’దే హవా
ఎందుకు.. ఏమిటి అన్న వివరాలు చెప్పక్కర్లేదు. బ్యాంకు లావాదేవీలతో పనిలేదు. పాన్ కార్డులు అక్కర్లేదు. ఇన్కమ్ట్యాక్స్ల బాధే లేదు. ఎంచక్కా... లెక్క లేకుండా కోట్లకు కోట్లు జమ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడికి కావాలంటే అక్కడకి... ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎవరికి కావాలంటే వారికి... మాట బయటకు రాకుండా... గుట్టు చప్పుడు కాకుండా... ‘నోటి మాటతో’ ఎంతంటే అంత సొమ్ము జమ చేసుకోవచ్చు. అవసరమైతే వేరొకరికి తరలించుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే... ‘నల్ల’ ధనానానికి రాచమార్గం... క్షణంలో జరిగిపోయే ట్రాన్సెక్షన్... ఇదే ‘హవాలా’. ఎన్నికల వేళ పట్టుబడుతున్న నోట్ల కట్టలు చూస్తుంటే... హవాలా హవా దెబ్బకు పోలీసుల దిమ్మ ఎంతలా తిరుగుతోందో అర్థమవుతుంది. హైదరాబాద్:అధికారుల కళ్లు గప్పి నల్లధనం అక్రమ మార్గాల్లో తరలిపోతోంది. ‘నల్ల’ కుబేరులే కాదు... విదేశాల్లో వలస కార్మికులు కూడా హవాలా ద్వారానే స్వదేశాలకు సొమ్ము పంపిస్తున్నారు. అక్రమ వ్యాపారాలు చేసే బడా సంస్థలు, ఉగ్రవాదుల ఆర్థిక లావాదేవీలు జరిగేదీ ఇదే మార్గంలో. ఆర్థిక నేరాలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా వినిపించే మాట హవాలా. అరబిక్ భాషలో హవాలా అంటే ‘బదిలీ’ అని అర్థం. బ్యాంకింగ్ రంగాన్ని తలదన్నేలా హైదరాబాద్ మహానగరంలోనూ ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎలా తరలిస్తారంటే... ఉదాహరణకు... దుబాయిలో ఉంటున్న మహేష్ హైదరాబాద్‌లో నివాసముంటున్న తన సోదరుడికి డబ్బు పంపాలనుకుందాం. అందుకు అతను... అక్కడి హవాలా ఏజెంట్‌ను ఆశ్రయిస్తాడు. చెప్పిన వ్యక్తికే డబ్బు అందేలా ఒక పాస్వర్డ్ గానీ, మరేదైనా సంకేతాన్ని గానీ చెబుతాడు. డబ్బు తీసుకున్న హవాలా ఏజెంట్... నగరంలో అతని నెట్‌వర్క్‌కు చెందిన ఏజెంట్‌కు సమాచారం ఇస్తాడు. ఈ మేరకు... ఇక్కడి ఏజెంట్ ముందుగా అనుకున్న పాస్వర్డ్, లేదంటే సంకేతాల ఆధారంగా మహేష్ సోదరుడికి డబ్బు చెల్లిస్తాడు. అందుకు ఇక్కడి ఏజెంట్ కూడా కమీషన్ తీసుకొంటాడు. నోటి మాటపైనే... హవాలా ఆర్థిక లావాదేవీలకు ప్రామిసరీ నోట్లు, ఇతరత్రా పత్రాలుండవు. కేవలం నోటి మాటపైనే మొత్తం లావాదేవీలు జరుగుతాయి. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది. నమ్మకంపైనే వేల కోట్ల రూపాయలు రవాణా అవుతాయి. బ్యాంకులో వేసిన డబ్బు మాయమైన సందర్భాలున్నాయేమో గానీ... హవాలా ద్వారా జరిగే లావాదేవీల్లో ఎక్కడా ఒక్క పొరపాటు కూడా జరగదు. ఇక్కడ వందకు పైగా... నగరంలో సుమారు వందకు పైగానే ‘హవాలా’ హవా నడిపించేవారున్నారు. వీరికి ప్రపంచం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి సంబంధాలున్నాయి. నగదు తరలింపునకు బంధువులనో, అత్యంత నమ్మకమైనవారినో ఎంచుకొంటారు. ఎంతో రహస్యంగా జనసమ్మర్ధ ప్రాంతాల ద్వారా చేరాల్సిన వారికి చేరుస్తారు. కమీషన్ ఇలా... ఈ ఆర్థిక లావాదేవీల్లో పంపే డబ్బు నుంచే ఏజెంట్లు కమీషన్ తీసుకొంటారు. ఇందులో ఏజెంట్‌తో పాటు ఈ వ్యాపారం నిర్వహించే ప్రధాన సూత్రధారికి, గమ్యస్థానానికి చేరవేసే మరో ఏజెంట్‌కు పంపకాలు జరుగుతాయి. లక్ష రూపాయలకు 300 నుంచి 600 రూపాయల వరకు కమీషన్ ఉంటుంది. ఇప్పటి వరకు రూ.42 కోట్లు... సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి నేటి వరకు పోలీసుల తనిఖీల్లో సుమారు రూ.42 కోట్ల నల్లధనం పట్టుబడింది. దీంట్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.20 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.22 కోట్లు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో పట్టుబడింది కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే. అంటే ఈసారి దాదాపు ఏడు రెట్లు అధికం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు... నల్లధనం ఏ స్థాయిలో పరవళ్లు తొక్కుతోందో! పట్టుబడిన సొమ్మంతా ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. -
హవాలా మార్గంలో ఎన్నికల నగదు?
శంషాబాద్ వద్ద రూ.8.18 కోట్లు స్వాధీనం {sావెల్స్ బస్సుల్లో బెంగళూరు నుంచి తీసుకొస్తూ పట్టుబడ్డ ఇద్దరు నిందితులు ఎన్నికల కోసమే అని అనుమానిస్తున్న పోలీసులు బులియన్ మార్కెట్ కోసం అంటున్న నిందితులు సైబరాబాద్, సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి హవాలా రూపంలో హైదరాబాద్‌కు నగదు తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా బెంగళూరు నుంచి ప్రైవేటు బస్సుల్లో నగదు తీసుకొస్తున్న ఇద్దరు వ్యక్తులు శుక్రవారం ఉదయం శంషాబాద్ మండలం పాల్మాకుల వద్ద పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.8.18 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. ఎన్నికల అధికారి ముస్తాక్ అహ్మద్, ఆదాయ పన్ను అధికారి నవీన్‌లతో కలసి వివరాలను వెల్లడించారు. ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం... బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో పెద్దమొత్తంలో నగదు తరలిస్తున్నారంటూ శుక్రవారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. శంషాబాద్ పాల్మాకుల ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. 6.30 గంటల సమయంలో హెచ్‌కేబీ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులను (ఏపీ 29 వీ-5789, కేఏ 01 ఏబీ-2732) సోదా చేయగా, ప్రశాంత్ జితేందర్ సూరాయా(32), దర్శన్(22) అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారివద్దనున్న బ్యాగ్‌లు తెరచి చూడగా, రూ.వెయ్యి, రూ.500 డినామినేషన్లో ఉన్న నోట్లకట్టలు కనపడ్డాయి. వారిద్దరినీ తనిఖీ చేయగా, ఓ డైరీ దొరికింది. ఏ బ్యాగ్‌లో ఎంత మొత్తం ఉందో అందులో రాసి ఉంది. దాని ఆధారంగా ఆ బ్యాగుల్లో రూ.8.18 కోట్లు ఉన్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనంతరం వారిని విచారించి కాచిగూడలో వారు నివసిస్తున్న ప్రశాంత్ నెస్ట్ అపార్ట్మెంట్లో మరోసారి సోదాలు చేశారు. అక్కడ మరో రూ.14.50 లక్షలు, నోట్ల కట్టలను లెక్కించే యంత్రాలు దొరికాయి. బషీర్‌బాగ్‌లోని ఎంబీఎస్ జ్యూవెలర్స్ యజమాని అనురాగ్ గుప్తా కోసం హవాలా రూపంలో బెంగళూరు నుంచి ఈ నగదు తీసుకొచ్చినట్టు నిందితులు విచారణలో వెల్లడించారు. బెంగళూరులోని హోటల్ ఫార్చూన్‌లో విజయ్ అనే వ్యక్తిని గురువారం సాయంత్రం కలిశామని, గుప్తా ఇచ్చిన కోడ్‌ను అతడికి చెప్పడంతో తమకు రూ.8.18 కోట్లు ఇచ్చాడని వివరించారు. కొద్ది రోజుల కిందటే గుప్తాకు హవాలా మార్గంలో రూ.4 కోట్లు తీసుకొచ్చి ఇచ్చినట్టు చెప్పారు. హవాలా రూపంలో నగదును సరఫరా చేసేందుకు లక్షకు రూ.300 కమిషన్‌గా తీసుకుంటామని వెల్లడించారు. వారి సెల్ఫోన్లను పరిశీలించిన పోలీసులు.. అనురాగ్ గుప్తా కోసమే ఈ నగదు తీసుకొస్తున్నట్టు నిర్ధారించుకున్నారు. అయితే గుప్తా పోలీసులకు చిక్కకపోవడంతో అతడు పరారీలో ఉన్నట్టు సీవీ ఆనంద్ ప్రకటించారు. నిందితుల వద్ద దొరికిన నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో 171ఈ, 171బి, 102 రెడ్ విత్ 41 సీఆర్పీసీ, ఆర్పీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బంగారం బులియన్ మార్కెట్ కోసమే... ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకే ఈ నగదును హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ కోణంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసు అధికారులు తెలిపారు. బంగారం లావాదేవీలు జరిపే బులియన్ మార్కెట్ కోసమే ఈ నగదు తీసుకొచ్చినట్టు నిందితులు విలేకరులతో పేర్కొన్నారు. ఈ నగదు ఎన్నికల కోసమనే విషయం తమకు తెలియదని చెప్పారు. గుప్తా దొరికితే అసలు నిజం బయటపడుతుంది.. అనురాగ్ గుప్తా దొరికితే ఈ నగదు రవాణాలో మరికొన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరులో నగదు ఇచ్చిన విజయ్ వెనుక ఎవరు ఉన్నారో, ఈ డబ్బుకు ప్రత్యామ్నాయంగా బెంగళూరులో ఏమి ఇచ్చారో తదితర వివరాలు బయటపడతాయని అంటున్నారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఈ నగదును ప్రభుత్వ ట్రెజరీకి అప్పగించడంతోపాటు అనురాగ్ గుప్తా, విజయ్‌ల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ఆనంద్ వెల్లడించారు. -
బంగారం ఇప్పటికే కొనేశారు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాధారణంగా ఏదైనా వస్తువు ధర తగ్గితే ఎవరైనా కొనేందుకు ఉత్సాహం చూపిస్తారు. బంగారం విషయంలో ఇది మరీ ఎక్కువ. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ధర తగ్గినా కస్టమర్లు దూరంగానే ఉంటున్నారు. భారత్‌లో కొన్ని నెలల క్రితం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.35 వేల దాకా వెళ్లి ప్రస్తుతం రూ.29 వేలకు అటూ ఇటుగా ఉంది. అయినప్పటికీ కస్టమర్లను మెప్పించడం లేదు. దీనికి కారణం ఇప్పటికే అవసరానికి మించి బంగారం కొనడమే. గతేడాది జూన్‌లో బంగారం ధర రూ.25 వేలకు చేరినప్పుడు వినియోగదారులు ఇబ్బడిముబ్బడిగా పుత్తడిని దక్కించుకున్నారు. అదీ గంటల తరబడి క్యూలో నిలుచుని. ఇప్పుడు అందుకు భిన్నంగా బంగారం షాపులు వెలవెలబోతున్నాయి. బ్యాంకుల వల్లే ప్రీమియం..: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు(31.1 గ్రాములు) 1,300 డాలర్ల వద్ద కదలాడుతోంది. 10 గ్రాములకు సుమారుగా రూ.24,980 అన్నమాట. 10% కస్టమ్స్ పన్ను, 1% వ్యాట్ మొత్తం రూ.2,841 కలుపుకుంటే భారత్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.27,727 ఉండాలి. కానీ ప్రీమియం ధరకు ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.28,500 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో 999 స్వచ్ఛత బంగారం 10 గ్రాములు రూ.29,830 పలుకుతోంది. బ్యాంకులు అధిక ధరకు విక్రయించడం వల్లే ఈ ప్రీమియం వుంటున్నదనేది బులియన్ వర్తకుల వాదన. గతేడాది ఔన్సుకు 3 డాలర్లున్న ప్రీమియం, పన్నులతో కలిపి నేడు 70 డాలర్లకుపైగా ఎగబాకిందని బులియన్ విశ్లేషకులు, రిద్ధిసిద్ధి బులియన్స్(ఆర్‌ఎస్‌బీఎల్) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి జి.శేఖర్ తెలిపారు. పసిడి దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తే ప్రీమియం తగ్గుతుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు, భారత్‌కు మధ్య ధరలో వ్యత్యాసం ఉన్నందునే స్మగ్లింగ్ అధికమైందని ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) డెరైక్టర్ మోహన్‌లాల్ జైన్ తెలిపారు. బ్యాంకులు ప్రీమియం భారీగా వసూలు చేస్తున్నాయన్నారు. సెంటిమెంటు బాగోలేదు కాబట్టే ప్రస్తుతం అమ్మకాలు లేవని చెప్పారు. బంగారం దిగుమతుల్లో 20% ఎగుమతి చేయాలన్న నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 20% లోపే..: 2013 ఏప్రిల్-జూన్‌తో పోలిస్తే ప్రస్తుత కాలంలో పసిడి అమ్మకాలు 20% లోపే ఉంటాయని వర్తకులు చెబుతున్నారు. ఇప్పటికే బంగారం కొనుగోలు చేయడం ఒక కారణమైతే, ప్రస్తుతం కస్టమర్ల చేతిలో నగదు లేకపోవడమూ మరో కారణంగా తెలుస్తోంది. అటు ఆభరణాలకు, ఇటు పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ తగ్గింది. గతేడాది ఏప్రిల్ లో డాలరుతో రూపాయి మారకం విలువ రూ.54 ఉంటే, నేడు రూ.60కి చేరడమూ ధర ఎక్కువ కావడానికి కారణమైంది. ఇక దిగుమతులు కట్టడి చేసినప్పటికీ ఆభరణాల వర్తకులకు రీసైకిల్డ్ బంగారం మార్కెట్లో లభిస్తోంది. పసిడిపై రుణాలిచ్చే సంస్థల వద్ద ఆభరణాల నిల్వలు పేరుకుపోతున్నాయి. రుణగ్రస్తులు తిరిగి నగదు చెల్లించకపోవడంతో తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నాయి. ఇలా మార్కెట్లోకి బంగారం వస్తోంది. దీనికితోడు స్మగ్లింగ్ జోరందుకుందని ఓ వ్యాపారి వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో 2011లో ఔన్సు బంగారం ధర 1,910 డాలర్ల దాకా వెళ్లి సంచలనం సృష్టిస్తే, 2013 జూన్ చివరివారంలో 1,180 డాలర్లకు పడింది. మార్కెట్ తీరునుబట్టి చూస్తే అంతర్జాతీయంగా బంగారం ధర ఈ వారం ఔన్సుకు 1,293-1,350 డాలర్ల మధ్య ఉండొచ్చని ఆర్‌ఎస్‌బీఎల్ అంచనా వేస్తోంది. భారత్‌లో 10 గ్రాములకు రూ.29-31 వేలు పలుకుతుందని ఆర్‌ఎస్‌బీఎల్ ఎండీ పృథ్వీరాజ్ కొఠారి తెలిపారు. అక్షయ తృతీయ సమీపిస్తోందని, దీంతో గిరాకీ పెరిగి బంగారం దిగుమతులు జోరందుకుంటాయని చెప్పారు. రూపాయి బలపడడం కూడా ధర తగ్గేందుకు కారణమైందని చెప్పారు. దేశంలో బంగారం అన్వేషణకై పరిశోధన, అభివృద్ధికి కొత్త ప్రభుత్వం చొరవ చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బంగారం దిగుమతి నిబంధనల్లో వెసులుబాటు కల్పించాలి. ఇది కార్యరూపం దాల్చితే ఆసియాలో డిమాండ్‌కు భారత్ నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లో బంగారం ఆస్తిగా పనికొస్తుందన్న సత్యం జగమెరిగింది. ధరలు తగ్గిన నేపథ్యంలో పసిడికి డిమాండ్ ఊపందుకుంటుంది’ అని చెప్పారు. -
బంగారం రూ. 33 వేల దిశగా...!
-
బంగారం రూ. 33 వేల దిశగా...!
న్యూఢిల్లీ: ధన్‌తేరాస్ రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.33,000కు చేరుతుందని నిపుణులు, బులియన్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ధన్‌తెరాస్ (నవంబర్ 1-శుక్రవారం)రోజున బంగారం కొనడం శుభప్రదమని నమ్మకం ఉంది. ఈ నమ్మకం కారణంగా ఆ రోజున బంగారం కొనుగోళ్లు జోరుగా ఉంటాయని, డిమాండ్ పెరుగుతుందని, కానీ సరఫరా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ధర పెరుగుతుందని వారంటున్నారు. కరెంట్ అకౌంట్ లోటును కట్టడి చేసేందుకు బంగారం దిగుమతులపై ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫలితంగా బంగారం దిగుమతులు తగ్గాయని, దీంతో సరఫరా తగ్గి, డిమాండ్ పెరిగి 10 గ్రాముల బంగారం ధర రూ.300-1000 వరకూ పెరిగే అవకాశాలున్నాయని ఎస్ఎంసీ కామ్‌ట్రేడ్ సీఎండీ డి.కె.అగర్వాల్ పేర్కొన్నారు. గతేడాది ధన్‌తెరాస్ రోజున బంగారం ధర 20 శాతం పెరిగి రూ.32,485కు చేరింది. ధన్‌తేరాస్‌కు పసిడి ఆభరణాలకు డిమాండ్ స్థిరంగా ఉం టుందని నిపుణులంటున్నారు. ప్రభుత్వం నాణాలు, బంగారు కడ్డీల దిగుమతులను నిషేధించడం వల్ల డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండదని, ఫలితంగా వీటి అమ్మకాలు బాగా తగ్గుతాయని బాంబే బులియన్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సురేష్ హుండియా చెప్పారు. ప్రభుత్వ ఆంక్షలకు తోడు రూపాయి పతనం కారణంగా బంగారు నాణాలకు డిమాండ్ ఇప్పటికే 70%, ఆభరణాలకు డిమాండఖ 60% తగ్గిందన్నారు. ఇక ఈ ఏడాది ఆగస్టు 28న న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.34,500కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. ప్రస్తుతం బంగారం ధరలు న్యూఢిల్లీ మార్కెట్లో రూ.32,750గానూ, ముంబైలో రూ.31,700 గానూ ఉన్నాయి. -
రూ.32,000 దాటిన బంగారం ధర
ముంబై: దేశీయంగా ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్ ముంబైలో పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల పసిడి ధర మళ్లీ రూ. 32 వేల పైకి చేరింది. అంతర్జాతీయంగా సానుకూల ధోరణితో పాటు పండుగ, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశీయంగా కొనుగోళ్ల జోరు దీనికి ప్రధాన కారణం. పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల పసిడి ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.175 ఎగసి రూ.32,165కు చేరింది. ఆభరణాల బంగారం కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ. 32,015కు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1 గ్రా) ధర శుక్రవారం 1,353 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా సహాయక చర్యల ప్యాకేజ్‌లు మరికొంతకాలం కొనసాగుతాయన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి సెంటిమెంట్‌కు బలంగా ఉంది. -
బంగారం, వెండి కళకళ
ముంబై: అటు అంతర్జాతీయంగా, ఇదే దేశీయంగా బంగారం, వెండి ధరలు గురువారం తళుక్కుమన్నాయి. దేశీయ స్పాట్ మార్కెట్ విషయానికి వస్తే- ఇక్కడ పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.365 పెరిగి రూ.31,120కి చేరింది. 22 క్యారెట్లకు సంబంధించి కూడా ధర కూడా ఇదే పరిమాణంలో పెరిగి రూ.30,970కి ఎగసింది. వెండి కేజీ ధర రూ. 670 ఎగసి రూ.49,000కు చేరింది. ‘ఫ్యూచర్స్’లో ఇలా...: కాగా గురువారం అంతర్జాతీయంగా నెమైక్స్- కమోడిటీ డివిజన్లో పసిడి ధర ఔన్స్ (31.1గ్రా)కు కడపటి సమాచారం అందేసరికి 40 డాలర్ల లాభంతో (3 శాతం) 1,322 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కాంట్రాక్ట్ సైతం 2 శాతం లాభంతో 22 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీనిని అనుసరిస్తూ, దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల పసిడి ధర రూ. 605 (2 శాతానికి పైగా) లాభంతో రూ. 29,553 వద్ద ట్రేడవుతుండగా, వెండి కేజీ రూ. 728 లాభంతో (1.55 శాతం) రూ. 48,100 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణిలో ట్రేడింగ్ కొనసాగి, శుక్రవారం రూపాయి బలహీనపడితే దేశీయంగా స్పాట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా బంగారం వారం గరిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. డాలర్ బలహీనత, రుణ పరిమితి పెంపునకు సంబంధించి . కుదిరిన ఒప్పందం నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ సహాయక చర్యలు కొనసాగుతాయన్న విశ్వాసం బంగారం, వెండి సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. ఈ అంశాలకు తోడు దేశీయంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్ బంగారం, వెండి ధరల పెరుగుదల కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టారిఫ్‌ల తగ్గింపు: కాగా దేశీయంగా కస్టమ్స్ సుంకాల నిర్ణయానికి ప్రాతిపదిక అయిన బంగారం, వెండి టారిఫ్ విలువలను కేంద్ర ప్రభుత్వం గురువారం తగ్గించింది. దీని ప్రకారం బంగారం దిగుమతుల టారిఫ్ విలువ 10 గ్రాములకు 436 డాలర్ల నుంచి 418 డాలర్లకు తగ్గింది. వెండి కేజీ టారిఫ్ విలువ 702 డాలర్ల నుంచి 699 డాలర్లకు తగ్గింది. -
బంగారం, వెండి భారీ పతనం
న్యూయార్క్/ముంబై: దేశీయంగా, అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లలో మంగళవారం పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. అమెరికా ప్రభుత్వ కార్యకలాపాల నిలిపివేత(షట్‌డౌన్) పరిణామాల నేపథ్యం దీనికి కారణం. న్యూయార్క్ ఎక్స్ఛేంజ్ కమోడిటీ డివిజన్లో కడపటి సమాచారం అందేసరికి చురుగ్గా ట్రేడవుతున్న పసిడి కాంట్రాక్ట్ ధర ఔన్స్(31.1గ్రా)కు 43 డాలర్లు పడి (3%కి పైగా) 1,284 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్స్ ధర సైతం ఒక డాలర్‌కుపైగా నష్టపోయి(4.5%) 20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో పసిడి 10 గ్రాముల ధర 3% నష్టపోయి (రూ.1000 వరకూ) రూ. 29,490 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీకి రూ. 2 వేల వరకూ నష్టపోయి (4%) రూ.47,200 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం నష్టం ఇదే ధోరణిలో ముగిసి, బుధవారం ట్రేడింగ్ కూడా ఇదే బలహీనధోరణిలో కొనసాగితే... గురువారం ఈ ప్రభావం మన దేశీయ స్పాట్ మార్కెట్లలో కనబడే (రూపాయి విలువ కదలికలకు లోబడి) అవకాశం ఉంది. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం దేశీ బులియన్ స్పాట్ మార్కెట్లకు సెలవు. పసిడి టారిఫ్ విలువ పెంపు: కేంద్రం బంగారం దిగుమతి టారిఫ్ విలువను పెంచింది. 10 గ్రాములకు 432 డాలర్లుగా ఉన్న ఈ విలువను 436 డాలర్లుకు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే వెండి (కేజీ) విషయంలో టారిఫ్‌ను ప్రస్తుత 736 డాలర్ల నుంచి 702 డాలర్లకు (దాదాపు 5%) తగ్గించింది. -
భారీగా పడిన బంగారం, వెండి
ముంబై: బంగారం, వెండి ధరలు ముంబై బులియన్ స్పాట్ మార్కెట్లో సోమవారం భారీగా పడ్డాయి. పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.500 తగ్గి రూ. 29,800 వద్ద ముగిసింది. ఆభరణాల పసిడి కూడా ఇదేస్థాయిలో దిగివచ్చి, రూ.29,650గా నమోదైంది. వెండి కేజీ ధర కూడా ఒకేరోజు రూ.1,000 పడి రూ.50,200కు చేరింది. కారణాలు: పసిడి దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు ప్రభావంతోపాటు, అంతర్జాతీయ ఫ్యూచ ర్స్ నెమైక్స్ మార్కెట్లో బలహీన ధోరణి, రూపాయి బలోపేతం, స్టాకిస్టులు, ట్రేడర్ల అమ్మకాలు స్పాట్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు. ఫ్యూచర్స్‌లో ఇలా: సోమవారం కడపటి సమాచారం అందేసరికి పసిడి, వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులు బలహీనంగా ట్రేడవుతున్నాయి. అంతరాజతీయంగా నెమైక్స్ పసిడి ధర(ఔన్స్) క్రితం ముగింపుస్థాయిలోనే 1,315 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో రూ.442 నష్టంతో (1.5%) రూ.29,686 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. వెండి కూడా 2 శాతానికి పైగా నష్టంతో (రూ.1,038) రూ. 49,638 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణితో ఫ్యూచర్స్ మార్కెట్ ముగిసి, మంగళవారం రూపాయి మరింత బలపడినట్లయితే పసిడి, వెండిలు మరింత నష్టపోయే (మంగళవారం) అవకాశం ఉందన్నది ట్రేడర్ల విశ్లేషణ. -
రూ. 30 వేల దిగువకు బంగారం
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ బలహీన ధోరణి నేపథ్యంలో శుక్రవారం ఇక్కడ ప్రధాన బులియన్ మార్కెట్లో పసిడి రూ.30 వేల దిగువకు జారింది. పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.525 తగ్గి రూ. 29,840కి పడింది. ఇది నెల రోజుల కనిష్ట స్థాయి. ఆభరణాల బంగారం ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ. 29,690గా నమోదైంది. వెండి కేజీ ధర రూ. 2,205 తగ్గి, రూ.50,225కు దిగింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్ కమోడిటీ డివిజన్లో శుక్రవారం కడపటి సమాచారం అందేసరికి పసిడి ధర 17 డాలర్ల నష్టంతో 1314 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. రూ.315 నష్టంతో రూ.29,732 వద్ద ట్రేడవుతోంది. వెండి కాంట్రాక్ట్ రూ.775 నష్టంతో రూ. 49,720 వద్ద ట్రేడవుతోంది. -
బంగారం భారీ పరుగు
ముంబై: బంగారం, వెండి ధరలు ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్ ముంబైలో మళ్లీ ఎగిశాయి. రికార్డు స్థాయి ధర నుంచి శుక్రవారం వెనక్కు తగ్గిన ధరలు తిరిగి శనివారం మళ్లీ కొంత ముందుకు ఉరికాయి. పూర్తి స్వచ్ఛత పసిడి ధర 10 గ్రాములకు రూ. 440 పెరిగి రూ. 32,120 వద్ద ముగిసింది. ఇక ఆభరణాల బంగారం రూ. 430 ఎగసి రూ. 31,950కి చేరింది. వరుసగా రూ.33,430, రూ.33,265 ఇక్కడ రికార్డు ధరలు. కాగా వెండి మాత్రం శనివారం స్వల్పంగా రూ. 85 పెరిగి రూ.55,110 వద్ద ముగిసింది. -
రూపాయి పతనం:బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్
-
ఆల్ టైమ్ రికార్డుకు చేరిన బంగారం ధర (34,500)
అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి బలహీనపడటంతో బులియన్ మార్కెట్ లో బంగారానికి డిమాండ్ పెరిగింది. బులియన్ మార్కెట్ లో బంగారం సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. పది గ్రాముల బంగారం ధర 34,500 రూపాయలు ట్రేడ్ అయింది. నేటి మార్కెట్ లో 1900 రూపాయలు పెరిగింది. బంగారం ధరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు. గత సంవత్సరం నవంబర్ 27న బంగారం 32975 రూపాయలు నమోదు చేసుకోవడం ఇప్పటి వరకు గరిష్టం. బుధవారం మార్కెట్ లో వెండి 3700 రూపాయలు పెరిగి 58500 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి 68.80 వద్ద క్లోజ్ అవ్వడమే బంగారం, వెండి పెరుగుదలకు కారణమని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. -
బంగారం భగ్గు ఎగదోసిన రూపాయి పతనం
ముంబై: దేశీయ ప్రధాన బులియన్ మార్కెట్ ముంబైలో పసిడి ధరలు మంగళవారం చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకాయి. దీనికి దేశీయంగా రూపాయి విలువ భారీ పతనమే కాకుండా, అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో ఈ మెటల్ ధర పరుగు కూడా కారణం. వెండిది కూడా అదే ధోరణి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో నెమైక్స్, బ్రెంట్ ధరలు సైతం భారీగా పెరిగాయి.ముంబైలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర క్రితం ముగింపుతో పోల్చితే 5 నెలల గరిష్ట స్థాయికి చేరింది. రూ.810 ఎగసి రూ.32,730కి ఎగసింది. ఆభరణాల బంగారం ధర రూ.820 ఎగసి రూ. 32,585కు చేరింది. వెండి ధర కూడా భారీగా రూ.1,940 పెరిగి రూ. 56,670 వద్దకు పెరిగింది. కాగా దేశ వ్యాప్తంగా పలు బులియన్ మార్కెట్లలో పూర్తి స్వచ్ఛత ధర రూ. 31 వేలు దాటిపోయినప్పటికీ, ఆభరణాల బంగారం ధర రూ. 29 వేలు-రూ.30వేల శ్రేణిలోనే విక్రయిస్తుండడం విశేషం. అధిక ధరల వద్ద ఆభరణాల వినియోగదారుల డిమాండ్ మందగించకుండా చూడడం రిటైలర్ల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫ్యూచర్స్‌లో ఇలా...: అటు న్యూయార్క్ మర్కం టైల్ ఎక్స్ఛేంజ్- కమోడిటీ ఎక్స్ఛేంజ్ విభాగంలోసైతం పసిడి, వెండి కమోడిటీలు పరుగులు తీస్తున్నాయి. కడపటి సమాచారం అందేసరికి పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోల్చితే 25 డాలర్లు పెరిగి 1,418 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా 2% లాభంతో 25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి ధర 5% పైగా లాభంతో (రూ.1,758) రూ.33,614 వద్ద ట్రేడవుతోంది. వెండి 6%కి పైగా ఎగసి(రూ.3,440) రూ.57,227 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే- బుధవారం దేశీయ మార్కెట్లో (రూపాయి విలువ కదలికలకు లోబడి) పసిడి, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్రూడ్ ఇలా...: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు మంగళవారం కడపటి సమాచారం అందే సరికి 3%కి పైగా ఎగశాయి. నెమైక్స్ 109 డాలర్ల వద్ద, బ్రెంట్ 114 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. -
మెరుపు తగ్గని పసిడి
ముంబై: ముంబై బులియన్ స్పాట్ మార్కెట్లో ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ. 31,520కి చేరింది. 22 క్యారెట్ల ధర రూ.40 ఎగసి 31,365కు చేరింది. వెండి కేజీ ధర రూ.300 లాభంతో రూ.51,785కు చేరింది. ఫ్యూచర్స్‌లో...: అంతర్జాతీయంగా 2 నెలల గరిష్ట స్థాయికి చేరిన పసిడి ఔన్స్ ధర సోమవారం కడపటి సమాచారం అందేసరికి 1,373 డాలర్ల స్థాయిలో, వెండి 23 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో పసిడి రూ.315 లాభం (1%)తో రూ.31,155 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. వెండి కేజీ ధర కూడా ఒకశాతం లాభంతో (రూ.488) రూ.51,150 వద్ద ట్రేడవుతోంది.