పసిడి పరుగులు: ధరలు పైపైకి
విలువైన మెటల్స్గా పేరున్న బంగారం, వెండికి వరుసగా రెండో వారంలోనూ భారీగా గిరాకీ ఏర్పడింది.
ముంబై : విలువైన మెటల్స్గా పేరున్న బంగారం, వెండికి వరుసగా రెండో వారంలోనూ భారీగా గిరాకీ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలు, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో స్థానిక జువెల్లరీలు, రిటైలర్లు కొనుగోలు చేపడుతుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారం ధరలు రూ. 225లు పెరిగాయి. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.29,900, రూ.29,725 పలుకుతోంది.
అదేవిధంగా వెండి ధరలు కూడా రూ.800 పైకి ఎగిశాయి. దీంతో కేజీ వెండి ధర రూ 43,050గా నమోదవుతోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్స్కు 1,232.90 డాలర్లుగా రికార్డు అవుతోంది. అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నా దేశీయంగా మాత్రం పెళ్లిళ్ల సీజన్ కావడంతో రిటైలర్లు బంగారాన్ని కొనడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.