coma and died
-
పోప్ అస్తమయం
వాటికన్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మందికి పైగా రోమన్ క్యాథలిక్‌ల అత్యున్నత మత గురువైన పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. 88 ఏళ్ల ఫ్రాన్సిస్ అనారోగ్య సమస్యలతో సోమవారం కన్నుమూశారు. ‘‘పోప్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కోమాలోకి వెళ్లిపోయారు. అది గుండె వైఫల్యానికి దారి తీసింది’’ అని వాటికన్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘తన జీవితమంతటినీ చర్చి, ప్రభువు సేవకే అంకితం చేసిన రోమ్ బిషప్ ఫ్రాన్సిస్ ఈ ఉదయం 7.35కు తండ్రి సన్నిధి చేరారు’ అంటూ వాటికన్ కార్డినల్ కెవిన్ ఫారెల్ అధికారిక ప్రకటన చదివి వినిపించారు. ఆ వెంటనే రోమ్ అంతటా చర్చి టవర్లలో సంతాప సూచకంగా గంటలు మోగాయి. పోప్ పార్థివ దేహాన్ని తొలుత వాటికన్ మత పెద్దలు, అధికారుల సందర్శన నిమిత్తం శాంతా మార్తా చాపెల్‌లో ఉంచుతారు. అనంతరం సాధారణ ప్రజల సందర్శనార్థం సెయింట్ పీటర్స్ చర్చికి తరలిస్తారు. విశ్వాసులు, దేశ విదేశీ ప్రముఖులు ఆయనకు నాలుగు నుంచి ఆరు రోజుల పాటు తుది నివాళులు అరి్పస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. అందుకు త్వరలో తేదీని ఖరారు చేస్తారు. ఆ తర్వాత 9 రోజుల పాటు వాటికన్లో సంతాప దినాలు పాటించాక పోప్ వారసుని ఎన్నిక జరుగుతుంది. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న పోప్ ఇటీవలే 38 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. నిమోనియాతో 1950ల్లోనే ఆయన కుడి ఊపిరితిత్తిని తొలగించాల్సి వచ్చింది. పోప్ చివరిసారిగా ఈస్టర్ సందర్భంగా ఆదివారం బయటి ప్రపంచానికి కన్పించారు.భారతీయులపై పోప్ ప్రేమాభిమానాలు మరవలేనివి: మోదీ న్యూఢిల్లీ: పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ‘‘ప్రేమాభిమానాలకు, సహానుభూతికి మారుపేరుగా ఆయన ఎప్పటికీ గుర్తిండిపోతారు. యువప్రాయం నుంచే ఫ్రాన్సిస్ క్రీస్తు సేవకు అంకితమయ్యారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు. బాధల్లో ఉన్న కోట్లాదిమందిలో ఆశాదీపం వెలిగించారు. ఆజన్మాంతం ఫ్రాన్సిస్ ప్రదర్శించిన ఆధ్యాతి్మక స్థైర్యం అందరికీ ఆదర్శం. ముఖ్యంగా భారతీయుల పట్ల ఎనలేని ప్రేమాభిమానాలు చూపారు. ఆయనతో భేటీ అయిన క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేను’’ అన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాం«దీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశవ్యాప్తంగా పలు చర్చిల ప్రతినిధులు తదితరులు పోప్ అస్తమయం పట్ల సంతాపం తెలిపారు. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాపం పాటించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.సంతాపాల వెల్లువ పోప్ అస్తమయం పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. పలువురు దేశాధినేతలు దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ఇది తమనెంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. బ్రిటన్ రాజు చార్లెస్–3, ప్రధాని కియర్ స్టార్మర్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సలా వాండెర్ లెయన్, స్పెయిన్ ప్రదాని పెడ్రో శాంచెజ్, పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, డెన్మార్క్ ప్రధాని డిక్ స్కూఫ్, ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సిసీ, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిల్ రషీల్ అల్ మక్తూమ్ తదితరులు సంతాప సందేశాలు విడుదల చేశారు. భావి తరాలకు ఫ్రాన్సిస్ గొప్ప ఆదర్శంగా నిలుస్తారంటూ కొనియాడారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారమే పోప్‌తో భేటీ అవడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గుర్తు చేసుకున్నారు.సంస్కరణవాదిగా చెరగని ముద్ర అది 2013. పోప్ బెనెడిక్ట్–16 తన పదవికి రాజీనామా చేసి రిటైరయ్యారు. అలాంటి అసాధారణ పరిస్థితి తలెత్తడం 600 సంవత్సరాల్లో అదే తొలిసారి. అలాంటి అనూహ్య పరిస్థితుల నడుమ 266వ పోప్‌గా ఫ్రాన్సిస్ బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవి చేపట్టిన తొలి లాటిన్ అమెరికన్‌గా, తొలి జెస్యూట్‌గా చరిత్ర సృష్టించారు. ఆయన అసలు పేరు జార్గ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జని్మంచారు. ఐదుగురు సంతానంలో అందరికంటే పెద్దవాడు. దైవసేవే తన మార్గమని 17 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకున్నారు. 36 ఏళ్లకే అర్జెంటీనాలోని జెస్యూట్లకు సారథి అయ్యారు. 1992లో బ్యూనస్ ఎయిర్స్ సహాయ బిషప్, 1998లో ఆర్చి బిషప్ అయ్యారు. 2001లో కార్డినల్ అయ్యారు. అనంతరం పోప్‌గా 12 ఏళ్లకు పైగా తన పనితీరుతో చెరిగిపోని ముద్ర వేశారు. అతి నిరాడంబర జీవన శైలితో ఆకట్టుకున్నారు. మిగతా పోప్ల్లా రాజప్రాసాదంలో కాకుండా వాటికన్లోని ఓ హోటల్లో నివసించారు. 2023 దాకా బెనెడిక్ట్, ఫ్రాన్సిస్ రూపంలో వాటికన్లో ఏకకాలంలో ఇద్దరు పోప్లు ఉండటం ఓ అసాధారణ ఘటనగా నిలిచిపోయింది. అయితే బెనెడిక్ట్ అబార్షన్ వ్యతిరేక అజెండాను ఫ్రాన్సిస్ పూర్తిగా సమర్థించలేదు. అధికార బలమున్న వాళ్లు నిస్సహాయులను పీల్చుకు తినడం ఎంతమాత్రమూ సరికాదంటూ తరచూ సామ్యవాద తరహా భావనలు వెలిబుచ్చేవారు. ఎన్నో సంచలనాలు శరణార్థులు, అణగారిన వర్గాలతో పాటు స్వలింగ సంపర్కల పట్ల ఫ్రాన్సిస్ ఎంతో సహానుభూతి చూపారు. వారితో పాటు పేదలు, ఖైదీలు, అంటరాని వర్గాలకు చర్చి వ్యవస్థ పెద్ద దిక్కుగా నిలవాలని స్పష్టం చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని బాహాటంగా ప్రకటించారు. అంతేగాక, ‘ఈ అంశంపై తీర్పు చెప్పేందుకు నేనెవరిని?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వలింగ వివాహాలు చేసుకున్న జంటలను చర్చి ఆశీర్వదించడానికి అనుమతించారు. స్వలింగ సంపర్కులు ప్రీస్ట్ బాధ్యతలు స్వీకరించడాన్ని సమర్థించారు. దీన్ని ఆఫ్రికా, ఆసియా, ఇతర ప్రాంతాల బిషప్‌లు తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. సంప్రదాయవాదుల తీరుతెన్నులను సందర్భం దొరికనప్పుడల్లా గట్టిగా ఆక్షేపించారు. ఇరాక్ పర్యటన ఇరాక్‌లో పర్యటించిన తొలి పోప్‌గా ఫ్రాన్సిస్ నిలిచారు. అరబ్ దేశాల్లోనూ పర్యటించి ముస్లిం ప్రపంచంతో చర్చి సంబంధాల్లో కొత్త అధ్యాయానికి తెర తీశారు. వాటికన్ బ్యూరోక్రసీతో పాటు మొత్తంగా చర్చి వ్యవస్థనే సంస్కరించేందుకు ప్రయతి్నంచి సంచలనం సృష్టించారు. మరణశిక్షను పూర్తిగా వ్యతిరేకించేలా, అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని అనైతికంగా పేర్కొనేలా చర్చి వైఖరిలో మార్పులు తెచ్చారు. పోప్‌ను ఎంపిక చేసే కీలక కార్డినల్ పదవుల్లో పాస్టర్లకు అధిక ప్రాధాన్యమిచ్చారు. కార్డినల్స్పై క్రిమినల్ కేసుల విచారణకు ఉన్న అడ్డంకులను కూడా తొలగించారు. వాటికన్ కార్యాలయాలపై పోలీసు దాడు లకూ అనుమతులిచ్చారు! వాటికన్ అధికారుల అపరిమిత ఆర్థికాధికారాలకు కత్తెర వేశారు. వారందుకునే కానుకలపైనా పరిమితి విధించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో అమెరికా వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఫ్రాన్సిస్ పనితీరుపై కొన్ని వివాదాలూ తలెత్తకపోలేదు. మైనర్లపై లైంగిక వేధింపుల అభియోగాలున్న కార్డినల్ థియోడర్ మెక్కారిక్కు చాలాకాలం పాటు దన్నుగా నిలిచారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ ఇరాన్ యువతి మృతి
దుబాయ్: ఇరాన్లో కొద్ది వారాల కింద హిజాబ్ ధరించకుండా మెట్రో రైల్లో ప్రయాణిస్తూ అంతుబట్టని రీతిలో తీవ్ర గాయాలపాలైన టీనేజ్ యువతి మరణించింది. కొద్ది రోజుల కోమా అనంతరం ఆమె తుదిశ్వాస విడిచినట్టు ప్రభుత్వ మీడియా శనివారం ఈ మేరకు వెల్లడించింది. అరి్మత గెర్వాండ్ అనే ఆ యువతి అక్టోబర్ 1న టెహ్రాన్‌లో మెట్రోలో ప్రయాణిస్తూ గాయపడింది. ఆమె ట్రైన్లోంచి ప్లాట్‌ఫాంపైకి వచ్చి పడుతున్న వీడియో బయటికి వచి్చంది. మెట్రోలో ఏమైందో ఇప్పటిదాకా బయటికి రాలేదు. హిజాబ్ ధరించనందుకే పోలీసులు ఆమెకు ఈ గతి పట్టించి ఉంటారని హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఏడాది కింద ఇలాగే హిజాబ్ ధరించనందుకు 22 ఏళ్ల మహ్సా అమినీని మోరల్ పోలీసులు తీవ్రంగా కొట్టడం, ఆమె జైల్లో మరణించడం, దానిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు పెల్లుబుకడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గెర్వాండ్ మృతితో మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
24 ఏళ్లపాటు కోమాలోనే.. కన్నుమూసిన సైక్లిస్ట్
క్రీడారంగంలో ఊహించని ఓ విషాదం చోటుచేసుకుంది. 24 ఏళ్ల పాటు కోమాలో ఉండిపోయిన స్పెయిన్ సైక్లిస్ట్ రాల్ గార్సియా అల్వరేజ్ శుక్రవారం కన్నుమూశాడు. అల్వరేజ్ టీనేజ్ వయసులోనే ప్రొఫెషనల్ సైక్లిస్ట్‌గా మారాడు. తన 17 ఏళ్ల వయసులో వెంటా మగుల్లో-బి మెలెరో జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందమే అతని సైక్లింగ్ కెరీర్‌కు చివరిది కానుందని ఊహించలేదు. స్పెయిన్‌లోని మాడ్రిడ్ వద్ద ఎత్తైన కొండమీద సైక్లింగ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. గంటకు 50మీటర్ల వేగంతో తన టీమ్‌తో కలిసి సైక్లింగ్ చేశాడు. ఈ దశలో సైకిల్ పట్టుతప్పడంతో ఐదు మీటర్ల లోతులోకి పడిపోయాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో పాటు చాతికి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అల్వరేజ్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేసి మాడ్రిడ్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. దాదాపు నాలుగున్నర గంటలు సర్జరీ నిర్వహించి అతన్ని కాపాడినప్పటికి శాశ్వత కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు పేర్కొన్నారు. కొన్నేళ్ల పాటు ఆసుపత్రి బెడ్‌పైనే ఉండిపోయిన గార్సియాలో కదలిక లేకపోవడంతో కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. అయితే అల్వరేజ్పై ఉన్న ప్రేమతో అతన్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అల్వరేజ్ తల్లి అతనికి సేవలందించింది. అలా 24 ఏళ్ల పాటు కోమాలో ఉండిపోయిన అల్వరేజ్ తాజాగా 42 ఏళ్ల వయసులో శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చదవండి: Alexander Zverev: టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం.. -
ఆసుపత్రి బిల్లు రూ.9.5 కోట్లు
బనశంకరి: కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ వివాహిత ఏడేళ్లుగా కోమాలో ఉండి, ప్రాణాలు విడిచింది. వైద్యానికి రూ.9.5 కోట్లు ఖర్చు అయినట్లు ఆమె భర్త తెలిపారు. ఈ సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది. కేరళకు చెందిన రాజేశ్‌నాయర్, పూనమ్‌రాణా(35) దంపతులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. పూనమ్ నగరంలోని అక్సెంచర్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని. ఆమె 2015 అక్టోబరు 2న కడుపునొప్పితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా వైద్యులు స్వల్ప శస్త్రచికిత్స చేశారు. వ్యాధి నయం కాకపోగా కోమాలోకి వెళ్లింది. ఈ నెల 24న పరిస్థితి విషమించి మృతి చెందినటు రాజేశ్‌నాయర్ చెప్పారు. ఆసుపత్రిలో రూ.7.5 కోట్ల బిల్లు చెల్లించామని, ఇంకా రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందని అన్నారు. ముంబై ఆసుపత్రిలో 42 ఏళ్లుగా కోమాలో ఉన్న అరుణా శానుబాగ్ తర్వాత దీర్ఘకాలం కోమాలో ఉన్న పూనమ్ కేసు రెండోది అని వైద్యులు వెల్లడించారు. -
కరుణించిన మృత్యువు!
42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా కోమాలో ఉండి కన్నుమూసిన అత్యాచార బాధితురాలు అరుణ షాన్‌బాగ్ ముంబై: కాలు కదలదు.. చేయి కదలదు.. కనురెప్పయినా వాలదు.. ప్రాణం ఉందన్న మాటేగానీ అవయవాలన్నీ అచేతనం. ఒక్క మాటలో జీవచ్ఛవం! ఒకటి కాదు.. రెం డు కాదు.. 42 ఏళ్ల నరకం!! ఈ నాలుగు దశాబ్దాల నరకానికి మృత్యువు ముగింపునిచ్చింది. అనుక్షణం తన కోసం తపించిన అరుణను తనతోపాటు తీసుకెళ్లింది. ఇన్నాళ్లూ రెప్పపడని ఆ కన్నులను తన చేతులతో శాశ్వతంగా మూసేసింది. 1973, నవంబర్ 27న ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో కామాంధుడి చేతిలో పాశవిక అత్యాచారానికి గురై ఇన్నాళ్లూ మంచంపైనే అచేతన స్థితి(కోమా)లో ఉన్న అరుణ షాన్‌బాగ్(66) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. వారం రోజుల నుంచి ఆమె తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతోంది. రక్త సంబంధీకులు వద్దనుకున్నా.. అరుణను ఇన్నాళ్లూ పసిపాపలా చూసుకున్న ఆసుపత్రి సిబ్బంది ఆమె ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అరుణ మృతికి రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, సీఎం ఫడ్నవిస్ సంతాపం తెలిపారు. ఆమె జీవితంలో చీకటి నింపిన ఆరోజు: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హల్దీపూర్కు చెందిన అరుణ షాన్‌బాగ్‌కు అప్పుడు 25 ఏళ్లు. రోగులకు సేవ చేసే నర్సింగ్ వృత్తి అంటే ఇష్టం. ఆ మక్కువే ఆమెను ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్(కేఈఎంహెచ్) వైపు నడిపింది. నర్సుగా జీవితాన్ని ప్రారంభించింది. ఎప్పుడూ ఉత్సాహంగా, అందరితో కలివిడిగా ఉండే ఈమెపై అదే ఆసుపత్రిలో వార్డుబాయ్‌గా పనిచేసే సోహన్‌లాల్ భార్తా వాల్మీకి అనే దుర్మార్గుడి కన్ను పడింది. 1973, నవంబర్ 27 రాత్రి ఎప్పట్లాగే అరుణ విధులు ముగించుకుంది. రూమ్‌కి వెళ్లేందుకు బేస్మెంట్లోని ఓ గదిలో బట్టలు మార్చుకుంటోంది. ఇదే సమయంలో సోహన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో కుక్కల్ని కట్టేసే గొలుసును ఆమె గొంతుకు బిగించాడు. పశువులా ప్రవర్తించి పారిపోయాడు. అతడి దాడితో మెడ నుంచి మెదడుకు వెళ్లే నాడులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అరుణ అక్కడికక్కడే కుప్పకూలింది. కోమాలోకి వెళ్లిపోయింది. వెన్నెముక కూడా దెబ్బతింది. అప్పట్నుంచి అచేతనంగానే ఉండిపోయింది. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు: అరుణ మృతి వార్త తెలియగానే ఆమె బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. అంత్యక్రియలు తామే నిర్వహిస్తామనగా.. ఆసుపత్రి సిబ్బంది అందుకు ఒప్పుకోలేదు. చివరికి ఆమె బంధువులు, ఆసుపత్రి యాజమాన్యం సంయుక్తంగా దహనసంస్కారాలు నిర్వహించారు. ఆసుపత్రి డీన్, అరుణ మేనల్లుడు కలసి చితికి నిప్పంటించారు. అంతకుముందు ఆమె భౌతికకాయాన్ని రాష్ట్ర మంత్రి పంకజ్ముండేతోపాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. 42 ఏళ్ల పోరాటంలో ఓడిపోయినా.. కామాంధుల చేతుల్లో అన్యాయమౌతున్న అబల ఆర్తనాదాలు వినిపిస్తున్నంత కాలం నింగిలోని ఆ ‘అరుణ’ తార ఈ సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది!! కామాంధుడికి ఏడేళ్ల శిక్షతో సరి.. సోహన్‌లాల్ పోలీసులకు చిక్కాడు. దోషిగా తేలాడు. కానీ అత్యాచారం కేసు కింద అతడిని శిక్షించలేదు. ఈ హేయమైన రాక్షస క్రీడను న్యాయస్థానం దొంగతనం, దాడిగానే చూసింది. ఒక్కో కేసు(దొంగతనం, దాడి)లో ఏడేళ్ల శిక్ష విధించాయి. ఆ శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పు చెప్పడంతో కేవలం ఏడేళ్ల శిక్ష అనుభవించి సోహన్‌లాల్ బయటకొచ్చాడు. ప్రస్తుతం పేరు మార్చుకుని ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడని తెలిసింది. అరుణ కేసు.. న్యాయ చరిత్రలో ఓ మైలురాయి! ఒంటి నిండా పుండ్లు, కదల్లేని అవయవాలతో కేఈఎం ఆసుపత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లోని వార్డు నంబర్ 4లో బెడ్‌పై ఏళ్లుగా అరుణ అనుభవిస్తున్న బాధ ఎందరినో కలచివేసింది. వారిలో ఆమె స్నేహితురాలు, జర్నలిస్టు పింకి విరానీ ఒకరు. సంవత్సరాల తరబడి పడుతున్న బాధ నుంచి విముక్తి చేస్తూ అరుణను కారుణ్య మరణం కింద చంపేసేందుకు అనుమతించాలంటూ ఆమె 2011లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇది అప్పట్లో కారుణ్య మరణంపై దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. అరుణ పరిస్థితి తెలుసుకునేందుకు వైద్య నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం అదే ఏడాది మార్చి 7న కోర్టు చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. విరానీ పిటిషన్‌ను తోసిపుచ్చినా.. కారుణ్య నియామకానికి పాక్షిక చట్టబద్ధత కల్పించింది. నయం కాని రోగంతో శాశ్వత అచేతన స్థితి (పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్) ఉన్న రోగులను చట్టపరమైన విధివిధానాలకు లోబడి ప్రాణరక్షక వ్యవస్థలను ఉద్దేశపూర్వకంగా తొలగించి, వారి మరణాన్ని వేగవంతం చేసే పరోక్ష కారుణ్య మరణానికి సానుకూలత ప్రకటించింది. తర్వాత కాలంలో అరుణ కన్నీటి జీవితంపై విరానీ ‘అరుణ స్టోరీ’ అనే పుస్తకం రాశారు. దత్తకుమార్ దేశాయ్ అనే మరాఠా రచయిత ‘కథ అరునాంచి’ అనే నాటకం రాశారు. ఈ నాటకం మహారాష్ట్రలో పలు చోట్ల ప్రదర్శితమైంది కూడా.