intermediate exams
-
తొలి రోజు ఇంటర్ పరీక్ష ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్: చిన్నచిన్న సమస్యలు ఎదురైనప్పటికీ ఇంటర్మీడియట్ తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఫస్టియర్ ద్వితీయ భాష పరీక్షకు 5,14,184 మంది హాజరుకావాల్సి ఉండగా, 4,96,899 మంది హాజరయ్యారు. మొత్తంగా 17,010 (3.41 శాతం) మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 244 పరీక్ష కేంద్రాల్లో 87,523 మంది ఫస్టియర్ పరీక్ష రాశారు. వరంగల్, హన్మకొండలో రెండు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. పరీక్షల తీరును అధికారులు ప్రతిక్షణం పరిశీలించినట్టు ఇంటర్ పరీక్షల విభాగం ముఖ్య అధికారి జయప్రదాబాయ్ వెల్లడించారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య హైదరాబాద్ నారాయణగూడలోని రత్నా, జాహ్నవి, శ్రీచైతన్య కాలేజీలకు వెళ్లి పరీక్షల తీరును పరిశీలించారు. ఇతర అధికారులు కూడా నగరంలోని పలు కాలేజీలను పరిశీలించారు. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలోని 33 స్క్రీన్లను ప్రత్యేక సిబ్బంది పరీక్షలు పూర్తయ్యే వరకూ గమనించారు. పరీక్షకు సకాలంలో రావాలని ఇంటర్ బోర్డ్ పదేపదే సూచించినా కొన్నిచోట్ల విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో 162 మంది 9 గంటల తర్వాత పరీక్షకు హాజరయ్యారు. అయితే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో వారిని పరీక్షకు అనుమతించారు. ఖమ్మంలోని కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల లింక్ ఆలస్యమవడంతో ప్రశ్నపత్రాల బండిల్ తెరవడం ఆలస్యమైంది. దీంతో విద్యార్థులు పావుగంట నష్టపోవాల్సి వచ్చింది. చాలాచోట్ల కమాండ్ కంట్రోల్ రూంనుంచి సకాలంలో సీసీ కెమెరాలు లింక్ అవ్వలేదన్న ఫిర్యాదులు అధికారులకు వచ్చాయి. మారుమూల ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. వరంగల్, ములుగు, భద్రాచలం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడంతో ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని విద్యార్థులు తెలిపారు. తాగునీటి కోసం ఏర్పాట్లు చేసినా, ఆఖరి అరగంటలో 26 పరీక్ష కేంద్రాల్లో తాగునీరు అందక విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇంటర్ ఫస్టియర్ చదువుతు న్న నిర్మల్‌లోని బుధవార్‌పేట్ కాలనీకి చెందిన జుబేర్ (17) కొన్నేళ్లుగా నరాలకు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అయిన ప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలకు హాజరు కావాలనే లక్ష్యంతో బుధవారం కుటుంబ సభ్యుల సహాయంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రానికి హాజరయ్యాడు. స్క్రైబ్(సహాయకుడి) సహాయంతో పరీక్ష రాశాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని.. తండ్రి మృతి చెందినా పరీక్ష రాసిన కుమార్తె వర్గల్ (గజ్వేల్): తండ్రి మృతి చెందిన బాధలోనూ కుమార్తె ఇంటర్ పరీక్ష రాసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వర్గల్‌కు చెందిన పసుల లింగం (50)కు భార్య యాద మ్మ, సాయికుమార్, తేజశ్రీ సంతానం. మంగళవారం రాత్రి కారులో లింగం తూప్రాన్ వెళ్లి తిరిగొస్తుండగా నాచా రం సమీపంలో వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లింగం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కాగా, రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందడం.. బుధవారం రోజే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో.. పుట్టెడు దుఃఖంతోనూ తేజశ్రీ పరీక్షకు హాజరైంది. -
5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్టు ఆ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య వెల్లడించారు. ప్రతీ పరీక్ష కేంద్రాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తెచ్చామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను గరిష్టంగా ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని చెప్పారు. ఈసారి ప్రతీ ప్రశ్నపత్రానికి యూనిక్ సీరియల్ నంబర్ ఇచ్చామని, పేపర్ ఎవరిదో తేలికగా కనిపెట్టొచ్చన్నారు. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు(TSBIE) నుంచి పర్యవేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,532 పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానించామని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలను తెరిచి, పరీక్ష అయ్యాక సీల్ చేస్తామని చెప్పారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి కలిపి మొత్తం 9,96,971 మంది ఇంటర్ పరీక్షలు(Intermediate exams) రాయబోతున్నట్టు పేర్కొన్నారు.ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఇంటర్ పరీక్షల విభాగం ముఖ్య అధికారి జయప్రదాబాయ్, ఇతర అధికారులతో కలిసి కృష్ణఆదిత్య సోమవారం బోర్డు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.విద్యార్థులకు సూచనలు⇒ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8.30 వరకూ చేరుకోవాలి. అంతకు ముందు వచ్చినా అనుమతిస్తారు. 9 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. అయితే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం మంచిది. ⇒ tgbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు పొందొచ్చు. దానిపైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానిని ఓపెన్ చేస్తే పరీక్ష కేంద్రం జీపీఎస్ చూసుకోవచ్చు. దీనిద్వారా ముందే పరీక్ష కేంద్రాన్ని గుర్తించొచ్చు. ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా అనుమతిస్తారు.⇒ రిస్ట్‌వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రింటెడ్ మెటీరియల్, సెల్ఫోన్లు పరీక్ష కేంద్రానికి అనుమతించరు. స్మార్ట్‌వాచీలు వస్తున్న నేపథ్యంలో రిస్ట్‌వాచీలను తొలిసారి నిషేధించారు.⇒ హాల్‌టికెట్‌పై సమాచారం, మాధ్యమం తప్పుగా ఉంటే అధికారుల దృష్టికి తేవాలి. ప్రైవేట్ కాలేజీలు ఏ కారణంగానూ హాల్‌టికెట్లు నిరాకరించొద్దు. ఒకవేళ నిరాకరిస్తే కఠిన చర్యలు ఉంటాయి. -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రెగ్యులర్ ఇంటర్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షల(Open School Society Inter exams)పై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు. మార్చి, ఏప్రిల్ నెలలు పరీక్షల నెలలని, సజావుగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. రెగ్యులర్ ఇంటర్ పరీక్ష(Intermediate Exams)లకు 1,535 కేంద్రాలకు గాను 68 సెంటర్లను సున్నిత, 36 కేంద్రాలను అతి సున్నితమైనవిగా గుర్తించామన్నారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని వీటిలో పటిçష్ట ఏర్పాట్లు చేయాలని విజయానంద్ ఆదేశించారు.వేసవి దృష్ట్యా తాగునీరు, ప్రథమ చికిత్స, విద్యుత్తు, బెంచ్‌లు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.పేపర్ లీకేజీ వంటి వదంతులు వ్యాపింపజేసేవారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు జారీ చేయాలని, జిరాక్స్ సెంటర్లు, ఇంటర్ నెట్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్ మాట్లాడుతూ విద్యార్థులు సకాలంలో చేరుకునేలా తగిన సంఖ్యలో బస్సులను నడపాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబరు 18004251531 ఏర్పాటు చేశామని, జిల్లా కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు నెలకొల్పాలని కలెక్టర్లకు సూచించారు. వయోజన విద్యాశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఏర్పాట్లను వివరించారు. కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులేవీ అనుమతించొద్దని స్పష్టం చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు గదుల్లో తగినంత వెలుతురు ఉండేలా, విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని నిర్దేశించారు.పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాలతో అనుసంధానించి చీఫ్ సూపరింటెండెంట్ లైవ్ స్ట్రీమింగ్‌లో పర్యవేక్షించాలని తెలిపారు. ప్రథమ చికిత్స కిట్లతో పాటు అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచేలా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 19 వరకు ప్రథమ, 3 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. 26 జిల్లాల్లో 10,58,892 మంది హాజరుకానున్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరగనుండగా 325 కేంద్రాల్లో 67,952 మంది హాజరుకానున్నారు. -
ఇంటర్ పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో అత్యాధునిక సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ఇంటరీ్మడియట్ విద్యామండలి (టీజీబీఐఈ) ఓ విప్లవాత్మక అడుగు ముందుకేసింది.రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానించారు. టీజీబీఐఈ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ పనితీరును శుక్రవారం విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు, జ్యోత్స్నరెడ్డిలతో కలిసి పరిశీలించారు.తెలంగాణ విద్యావ్యవస్థలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థతో పరీక్ష కేంద్రాలను రియల్‌టైంలో పర్యవేక్షించడంతోపాటు న్యాయమైన పరీక్ష వాతావరణాన్ని ఏర్పాటు చేయొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో ఏర్పాటు చేసిన 8,000 కంటే ఎక్కువ హైరిజల్యూషన్ కెమెరాలతో అనుసంధానం చేసిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పనితీరును బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య వివరించారు. ఈ నూతన వ్యవస్థతో పరీక్షల నిర్వహణను ఏకకాలంలో పర్యవేక్షించడానికి, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చేయడంతోపాటు ఏవైనా అవకతవకలను నివారించడానికి వీలు ఉంటుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడంపై అధికారులను మురళి ప్రశంసించారు. ఇది విద్యారంగంలో ఒక మైలురాయిగా, పరీక్ష సంస్కరణలకు కొత్త ప్రమాణంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ములుగు జిల్లాలోని ఒక ప్రభుత్వ కళాశాలను సీసీటీవీ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థపై నమ్మకం, విశ్వాసాన్ని ఈ వ్యవస్థ బలోపేతం చేస్తుందని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఇతర విద్యా బోర్డులకు ఆదర్శప్రాయమైన నమూనాగా పనిచేస్తుందని చెప్పారు. -
AP: ఇంటర్ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశం
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీనుంచి జరిగే ఇంటర్మీడియట్ (Intermediate) పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తత్కాల్ (Tatkal Scheme) కింద అవకాశం కల్పించారు. అభ్యర్థులు రూ.3 వేల ఆలస్య రుసుంతో మంగళవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంజనవరి నుంచి 1,48,923 మంది ఇంటర్ విద్యార్థులకు భోజనం పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (Midday Meal) అందించేందుకు సమగ్ర శిక్ష విభాగం ఏర్పాట్లు చేసింది. మొత్తం 475 కాలేజీల్లో 398 కాలేజీలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో భోజనం అందిస్తున్న ఏజెన్సీలకు అప్పగించారు. మరో 77 కాలేజీలకు ఎన్జీవోల ద్వారా భోజనం సరఫరా చేయనున్నారు.రాష్ట్ర వర్సిటీలు, ప్రభుత్వ కాలేజీలకు రూ.100 కోట్లుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షాభియాన్ (పీఎం–ఉష)లో భాగంగా దేశంలోని పలు విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించింది. వర్సిటీలకు అవసరమైన ల్యాబ్స్, మౌలిక సదుపాయాల కల్పన కోసం గత విద్యాసంవత్సరం (2023)లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఇప్పుడు నిధులు మంజూరుచేసింది. ఈ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కేంద్రం త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనుంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (పేరెంట్స్ కమిటీ)లకు ఒక్కరోజు శిక్షణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం 45,124 పాఠశాలలకు సంబంధించి జిల్లా, మండల, పాఠశాల స్థాయిల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయిలోనూ, 31 నుంచి జనవరి 2 వరకు మండల స్థాయిలోనూ, 3 నుంచి 6వ తేదీ వరకు పాఠశాల స్థాయిలోనూ శిక్షణ నిర్వహించాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు డీఈవోలను ఆదేశించారు. కాగా, జిల్లా స్థాయిలో 3,765 మందికి, మండల స్థాయిలో 93,643 మంది శిక్షణకు గానూ రూ.1,92,80,070 నిధులు మంజూరు చేశారు. నాన్ టీచింగ్ సిబ్బందికి జేఎల్ పదోన్నతులుప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2024–25 విద్యా సంవత్సరం ప్యానల్ సంవత్సరానికి బోధనేతర సిబ్బందికి 10 శాతం కోటా కింద ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న జేఎల్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాలని ఇంటర్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా సోమవారం ఆర్జేడీలను ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అభ్యంతరాలను నమోదు చేయాలని సూచించారు. వీటిపై ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి తుది సీనియారిటీ జాబితాను పంపించాలన్నారు. కాగా, ఇదే కేటగిరీ కింద ఇటీవల 24 మంది నాన్ టీచింగ్ సిబ్బందికి ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు. -
TG: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియేట్ బోర్డు సోమవారం(డిసెంబర్16) విడుదల చేసింది. మార్చి 5 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు మార్చి 6 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలవుతాయి. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ ఇదీ..మార్చి 5న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1మార్చి 7న ఇంగ్లీష్ పేపర్ 1మార్చి 11న మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బోటని పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్1మార్చి 13న మ్యాథమెటిక్స్ పేపర్ 1 బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1మార్చి 17న ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1మార్చి 19న కెమిస్ట్రీ పేపర్ 1 కామర్స్ పేపర్ 1ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ ఇదీ..మార్చి 6న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2మార్చి 10న ఇంగ్లీష్ పేపర్ 2మార్చి 12న మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బోటని పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2మార్చి 15న మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2మార్చి 18న ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2మార్చి 20న కెమిస్ట్రీ పేపర్ 2 కామర్స్ పేపర్ 2 -
AP: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలి. శుక్రవారం మొదటి ఏడాది, శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్‌ను బోర్డు నియమించింది. వీరితో పాటు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జిల్లాకు ఇద్దరు అధికారులను పంపించారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల కెమేరాలతో నిఘా ఉంచారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి, పరిశీలకుల హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలపై ఇంటర్ బోర్డు ‘డిజిటల్ నిఘా’ను ఏర్పాటు చేసింది. పరీక్ష పేపర్లకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్’ కోడ్‌ను జోడించారు. పేపర్ ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగ విద్యార్థులకు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే సెంటర్లను కేటాయించడంతో పాటు వీరికి మరో గంట అదనపు సమయం, పరీక్ష రాసేందుకు సహాయకులను అందుబాటులో ఉంచినట్టు ఇంటర్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు. కాగా, పరీక్షలు ముగిసేంత వరకు తాడేపల్లిలోని ఇంటర్ విద్య కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదులు, గ్రీవెన్స్‌ల స్వీకరణకు 08645–277707, టోల్‌ఫ్రీ నంబర్ 18004251531కు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్ చేయొచ్చు. -
కలిసి మీరూ రాయండి
ఒకరోజు తేడాతో ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండు రాష్ట్రాలలో మొదలయ్యాయి. పిల్లలు కొంత ఆందోళనగా, కొంత హైరానాగా ఉంటారు. ఈ సమయంలో పిల్లలు రాయాల్సిన వారుగా తాము రాయించే వారుగా తల్లిదండ్రులు ఉండరాదు. పిల్లల పరీక్షాకాలంలో తాము కూడా తోడుగా ఉన్న భావన కలిగించాలి. అలా కలిగించాలంటే వారిని వీలున్నంత సౌకర్యంగా ఉంచాలి. భయపెట్టని ప్రోత్సాహం అందించాలి. నిపుణుల సమగ్ర సూచనలు. తండ్రి ఆఫీసులోఎనిమిది గంటలు పని చేయగలడు. మధ్యలో విరామాలు ఎన్నో ఉంటాయి. అమ్మ ఇంట్లో మూడు పూట్లా పని చేస్తుంది. మధ్యలో ఆమెకూ విరామాలుంటాయి. కాని పరీక్షలు వచ్చినప్పుడు మాత్రం విరామం లేకుండా పిల్లలు చదువుతూనే ఉండాలంటారు తల్లిదండ్రులు. పిల్లలకు ధారణశక్తి డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి పిల్లవాడికీ అది మారుతుంది. కొందరు ఒక అంశాన్ని అలా కళ్లతో చూసి గుర్తు పెట్టుకోగలరు. కొందరు అరగంట సేపు చూసి నేర్చుకోగలరు. మరికొందరు గంట చదివితే తప్ప గ్రహించలేరు. వీరు ముగ్గురూ పుస్తకం పట్టుకుని మాత్రమే కనిపించాలని పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఆశిస్తే ‘చదివిందే ఎంతసేపు చదవాలి’ అని మొదటి రెండు రకాల పిల్లలు విసుక్కుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల చేత పరీక్షలు రాయించడమంటే వారిని పూర్తిగా అర్థం చేసుకుంటూ వారికి సహకరిస్తూ, విరామాలిస్తూ, ప్రోత్సహిస్తూ చదివించడమే. వాళ్ల ప్లానింగ్‌ని వినాలి పిల్లలు పరీక్షల టైమ్ టేబుల్ రావడానికి ముందే వాళ్లదైన పద్ధతిలో ఎలా చదవాలో ప్లాన్ చేసుకుంటారు. అంటే వాళ్లు వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ముందే చదువుకుంటారు. స్ట్రాంగ్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ఉపేక్షిస్తారు. మేథ్స్ పరీక్షకు ఒక్క రోజు మాత్రమే టైమ్‌టేబుల్‌లో విరామం వస్తే తెలుగు/సంస్కృతం పేపర్లో స్ట్రాంగ్‌గా ఉండే పిల్లలు మరో రెండు రోజుల్లో తెలుగు పేపర్ ఉందనగా కూడా మేథ్స్ చేసుకుంటూ కనిపించవచ్చు. వారిని బలవంతంగా తెలుగు చదివించాల్సిన పని లేదు. వారి ప్లానింగ్‌ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కొన్ని పేపర్లకు మూడు రోజుల గ్యాప్ రావచ్చు. ఆ మూడు రోజుల్లో మొదటి రోజును ఇంకో పేపర్ సిలబస్ కోసం కొందరు పిల్లలు కేటాయిస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఆ రాయాల్సిన పరీక్షకు వారి ఉద్దేశంలో రెండు రోజులు చాలనే. ఇలాంటివి పిల్లలు చెప్పినప్పుడు మన మొండితనంతో ఇలాగే చదవాలని తల్లిదండ్రులు బలవంతం చేయకపోవడం మంచిది. బయటి తిండి వద్దు పరీక్షలు అయ్యేంత వరకూ తల్లిదండ్రులకు వీలున్నా లేకపోయినా బయటి ఆహారం అది బ్రేక్‌ఫాస్ట్ అయినా గాని ఇవ్వకపోవడం తప్పనిసరి. బయటి పదార్థాలు పొట్టని పాడు చేస్తే పరీక్ష రాయడం చాలా ఇబ్బంది అవుతుంది. పరిశుభ్రమైన ఇంటి తిండి పిల్లలకు అందించాలి. ఆకుకూరలు, కాయగూరలతో పాటు గుడ్డు తినే పిల్లలకు తినిపించాలి. బొప్పాయి, సపోటా మంచివి. పిల్లలు చదువుకునే డెస్క్ మీద, పరీక్ష హాలులో వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోవాలి. పిల్లలు హైడ్రేట్‌గా ఉండేలా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఇస్తుండాలి. తోడు వెళ్లండి పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎవరో ఒకరు పరీక్షా కేంద్రానికి వెళితే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది. పరీక్ష అయ్యే వరకూ బయటే ఉండి తీసుకొస్తాం అనంటే వారు లోపల ధైర్యంగా రాస్తారు. అలాగే పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలను ఒంటరిగా పనుల మీద బయటకు పంపరాదు. వెహికల్స్ నడపనివ్వరాదు. ఈ సమయంలో చిన్న ప్రమాదం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలు పెద్దల అజమాయిషీలోనే బయటకు వెళ్లాలి. వారితో వాక్ చేయండి పరీక్ష రాసి వచ్చాక, తర్వాతి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పిల్లలతో సాయంత్రాలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అరగంట సేపు వాకింగ్‌కు వెళ్లండి. ఆ సమయంలో వారితో ఏవైనా కబుర్లు చెప్పండి. ఆ సమయంలో కూడా చదువు గురించి కాకుండా ఏవైనా సరదా విషయాలు మాట్లాడండి. వారికి బ్రేక్ ఇచ్చినట్టూ ఉంటుంది... వ్యాయామమూ జరిగినట్టుంటుంది. సిన్సియర్‌గా చదవమనండి: తమను తాము మోసం చేసుకోకుండా, తల్లిదండ్రులను మోసం చేయకుండా ఉన్న తెలివితేటలను బట్టి మేక్సిమమ్ ఎంత చదవగలరో అంతా సిన్సియర్‌గా చదివి పరీక్ష రాయమనండి. రాసిన దానిపై వాస్తవిక అంచనాతో ఉండమనండి. ఆ అంచనా ఎంతైనాగాని చెప్పమనండి. నిజాయితీగా రాయడమే తమ దృష్టిలో ముఖ్యమని, ఫలితాల సంగతి తర్వాత చూద్దామని చెప్పండి. వారు కొంత రిలీఫ్‌గా, మరింత శ్రద్ధగా పరీక్ష రాస్తారు. -
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం..విద్యార్థి ఆత్మహత్య
-
Intermediate Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)
-
ఆన్లైన్లో ఇంటర్ హాల్‌టికెట్లు
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల హాల్‌టికెట్లను ఇంటర్మీడియెట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచింది. పరీక్ష ఫీజు చెల్లించిన మొత్తం 10,52,221 మంది విద్యార్థుల హాల్‌టికెట్లను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లాగిన్ ద్వారా, అదేవిధంగా ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్సైట్ https://bieap.apcfss.in/ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. 2023–24 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 4,73,058 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,79,163 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు వెబ్సైట్లో తమ పుట్టిన తేదీని, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పుట్టిన తేదీ లేదా తమ మొదటి సంవత్సరం హాల్‌టికెట్ నంబర్ నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని, నేరుగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకావొచ్చని ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి సౌరభ్‌గౌర్ ప్రకటించారు. ఎవరికైనా హాల్‌టికెట్‌పై ఫొటో ప్రింట్ కాకపోతే ఆ విద్యార్థులు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదిస్తే స్కాన్ చేసి ఫొటోతో కూడిన హాల్‌టికెట్‌ను ఇస్తారని వెల్లడించారు. మార్చి ఒకటి నుంచి మొదటి సంవత్సరం, రెండో తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షలు జరిగే గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. ప్రైవేటు యాజమాన్యాల వేధింపులకు చెక్ గతంలో ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి చేసేవి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యేవారు. ఈ విషయంపై ఇంటర్ బోర్డుకు కూడా అనేక ఫిర్యాదులు అందేవి. ఇప్పుడు ఎటువంటి వేధింపులు లేకుండా విద్యార్థుల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు పబ్లిక్ డొమైన్‌లోనే అందుబాటులో ఉంచింది. విద్యార్థులు ఎక్కడి నుంచి అయినా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించింది. -
పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేయండి
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలతోపాటు పదో తరగతి, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలను అధికారులంతా కలిసి సమర్థంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పది, ఇంటర్, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీసు, వైద్య, రెవెన్యూ, విద్యుత్, తపాలా, ఆర్టీసీ శాఖల రాష్ట్ర అధికారులతో గురువారం విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ మార్చి నెల మొత్తం పరీక్షల కాలమని, దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు, అభ్యర్థులు వివిధ పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. అధికారులంతా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకటి నుంచి ఇంటర్, 18 నుంచి పది పరీక్షలు ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,559 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 47,921 మంది అధికంగా పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు, మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, వీరికోసం 3,473 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్టు వివరించారు. వీరితోపాటు పరీక్షలకు రీ ఎన్రోల్ చేసుకున్న 1,02,058 మంది విద్యార్థులు కూడా ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 682 మందితో సిట్టింగ్ స్క్వాడ్స్, 156 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేసినట్టు తెలిపారు. ఓపెన్ స్కూలుకు సంబంధించి పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మార్చి 18 నుంచి 26 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతాయని వివరించారు. ఓపెన్ టెన్త్‌లో 34,635 మంది విద్యార్థులు ఉండగా, 176 కేంద్రాలు, ఓపెన్ ఇంటర్ విద్యార్థులు 76,572 మంది ఉండగా, 327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎవరూ సెల్ఫోన్లు తీసుకువెళ్లకూడదని స్పష్టంచేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అదేవిధంగా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరీక్షా కేంద్రాలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై మంత్రి ఆరా తీశారు. 27 నుంచి ఏపీ టెట్ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు జరిగే ఏపీ టెట్‌కు 2,79,685 మంది దరఖాస్తు చేసుకున్నారు. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు 120 కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు హైదరాబాద్, బెంగళూరు, బరంపురం, చెన్నై, ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీఎస్సీ నిర్వహణ కోసం నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్, ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్, పాఠశాల విద్య డైరెక్టర్ పార్వతి, సమగ్ర శిక్ష ఏఎస్పీడీ శ్రీనివాసులురెడ్డి, పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి, ఏపీ టెట్ జేడీ మేరీచంద్రిక, ఏపీ మోడల్ స్కూల్ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని ఎగ్జామ్ రాయలేకపోయిన ఇంటర్ విద్యార్థి
సాక్షి, ఖమ్మం : గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని ఓ ఇంటర్ విద్యార్థి మోసపోయాడు. గూగుల్ మ్యాప్‌లో తాను వెళ్లాల్సిన ఎగ్జామ్ సెంటర్ కాకుండా వేరే లొకేషన్ చూపించడంతో తప్పుడు అడ్రస్‌కు వెళ్లాడు. గూగుల్ తప్పిదాన్ని గ్రహించిన విద్యార్థి.. మళ్లీ సరైన పరీక్షా కేంద్రానికి వచ్చినా.. అప్పటికే ఆలస్యం కావడంతో తొలిరోజు పరీక్ష రాయలేకపోయాడు. దీంతో చేసేదేం లేక బాధతో తిరిగి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో బుధవారం చోటుసుకుంది. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన విద్యార్థి వినయ్ ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో ఎగ్జామ్ హాలుకు వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నాడు. అందులో చూపించిన డైరెక్షన్లో వెళ్లాడు. అయితే తాను వెళ్లాల్సిన లొకేషన్‌కు కాకుండా మరో ప్లేస్‌కు గూగుల్ మ్యాప్స్ తీసుకెళ్లింది. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత అది తాను పరీక్ష రాయాల్సిన సెంటర్ కాదని తెలిసింది. దీంతో హడావుడిగా వేరేవాళ్లను అడ్రస్ అడుక్కుంటూ పరీక్షా కేంద్రానికి వచ్చాడు. కానీ వినయ్ అప్పటికే 27 నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్నాడు. నిమిషం నిబంధన కఠినంగా ఉండటంతో విద్యార్థినిపరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక బాధతో వినయ్ ఇంటికి చేరుకున్నాడు. -
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల సందడి
-
సమస్యలుంటే కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీ డియెట్ పరీక్షల నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. విద్యార్థులకు ఏ ఇబ్బంది తలెత్తినా 040– 24601010, 040– 24655027 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలయ్యే పరీక్షల ఏర్పాట్లపై మిత్తల్ మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పనిచేస్తాయని తెలిపారు. ఇవే కాకుండా ప్రతీ జిల్లాలోనూ ప్రత్యేక నంబర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. కాలేజీలతో ప్రమేయం లేకుండా విద్యార్థులే ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నా రు. మంగళవారం మధ్యాహ్నం వరకూ 50 వేల మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఉదయం 9 దాటితే పరీక్ష హాలులోకి అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులు ఎక్కడా నేలపై కూర్చొని పరీక్ష రాసే విధానం ఉండకూడదని అధికారుల ను ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 9,47,699 మంది పరీక్షలు రాస్తున్నారని, వీరిలో 4,82,677 మంది ఫస్టియర్, 4,65,022 మంది సెకెండీయర్ ఉన్నట్టు చెప్పారు. 75 ఫ్లైయింగ్ స్వా్కడ్స్ పనిచేస్తాయన్నారు. డిజిటల్ మూల్యాంకనం ఈ ఏడాది 35 లక్షల ప్రశ్నాపత్రాలకు ఆన్లైన్లో మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించామని మిత్తల్ తెలిపారు. ఇందుకు సంబంధించి రెండోసారి పిలిచిన టెండర్లకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయని, వాటి అర్హతలను పరిశీలిస్తున్నామని తెలిపారు. టెన్త్ పరీక్షలు పూర్తయ్యేనాటికే ఇంటర్ కాలేజీల అఫ్లియేషన్ ప్రక్రియ ముగించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అఫ్లియేషన్ లేకపోతే పరీక్షకు బోర్డ్ అనుమతించదనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈసారి ముందే అంగీకారం తీసుకునే వీలుందన్నారు. ఇంటర్ ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. -
ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో సుమారు 4,17,740 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,19,790 మంది ప్రఽథమ, 1,97,950 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. సుమారు 548 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లోని పరీక్ష కేంద్రాలకు మాత్రం అదనపు డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లా స్థాయి పరీక్షల కమిటీ(డీఈసీ)తో పాటు హైపవర్ కమిటీ సభ్యులు సైతం ఆకస్మికంగా కేంద్రాలను సందర్శించేలా చర్యలు చేపట్టారు. నిఘా నేత్రాల నడుమ పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. ఏర్పాట్లు పూర్తి ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షల ఏర్పాట్లపై నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో వారు వెల్లడించారు. ఇప్పటికే సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచి నీటి సౌకర్యం, మెడికల్ కిట్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వెబ్సైట్లో హాల్ టికెట్లు హాల్ టికెట్లను వెబ్ సైట్ www.tsbie. egg. gov. in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు. కాలేజీలో హాల్ టికెట్ ఇవ్వకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అర గంట ముందే చేరుకోండి.. పరీక్ష సమయం కంటే ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని బోర్డు అధికారులు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా.. అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. దీనివల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. ఆయా పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలకు.. ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ పరీక్షల నేపథ్యంలో రౌండ్‌ది క్లాక్ పని చేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 040– 24601010 లేదా 040– 24655027 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. జిల్లాల వారీగా మినీ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టెలీ మానస హెల్ప్‌లైన్ నంబర్ 14416ను ఏర్పాటు చేశారు. గ్రేటర్లో పరీక్షలు ఇలా.. జిల్లా పరీక్ష కేంద్రాలు - ప్రథమ -ద్వితీయ హైదరాబాద్ -233 84,223 -86,923 రంగారెడ్డి జిల్లా -182 71,773 -55,883 మేడ్చల్– మల్కాజిగిరి -133 63,794- 55,144 -
ఏపీ లో ఇంటర్ ఎగ్జామ్స్
-
స్కూల్ టీచర్లకూ ‘ఇంటర్’ విధులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల పకడ్బందీ నిర్వ హణకు కసరత్తు మొదలైంది. ప్రైవేట్ కాలేజీలతో మిలాఖత్ అయ్యేవారికి చెక్ పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెల 15 నుంచి మొదలయ్యే ఈ పరీక్షల విధుల్లోకి స్కూల్ టీచర్లను కూడా తీసుకోవాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. ఇంటర్ కాలేజీ అధ్యాపకుల కొరత ఉన్నచోట టీచర్ల అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువుండే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లను పరీక్షల విధులకు తీసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఈ ఏడాది ఫస్టియర్ ఇంటర్‌కు 4,82,619 మంది, సెకండియర్‌కు 4,65,391 మంది హాజరవుతున్నట్టు పేర్కొంది. ప్రైవేటు కాలేజీలతో మిలాఖత్ అయినట్టు ఆరోపణలున్న పరీక్షాకేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కాలేజీల్లో వీలైనంత వరకూ క్లీన్ రికార్డు ఉన్నవారికే ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగించనున్నారు. భద్రత మరింత పెంపు కొత్తగా ప్రవేశపెడుతున్న ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని అభాసుపాలు చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారనే ఆందోళన అధికారుల్లో ఉంది. వారికి అనుకూలంగా ఉండే బోర్డ్ సిబ్బందితో కలిసి వ్యతిరేక కార్యకలాపాలు సాగించే వీలుందని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో ప్రతీ పరీక్షకేంద్రం సమీపంలో విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ పుటేజీని ఇంటర్‌బోర్డ్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బయటవ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటున్న వారిపై ఇంటర్ బోర్డ్ నిఘా పెట్టింది. క్షేత్రస్థాయిలోనూ సమీక్షిస్తున్నాం ఎక్కడా ఆరోపణలకు తావివ్వకుండా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. క్షేత్రస్థాయిలో వాస్తవపరిస్థితులు, తీసు కోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షిస్తున్నాం. విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చేయడమే కాదు. పరీక్షకేంద్రాల్లో ఎలాంటి పక్షపాతానికి తావివ్వని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నివర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. – జయప్రదాబాయి, ఇంటర్ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రతీ విద్యార్థి స్వేచ్ఛగా రాసేలా చర్యలు ఇంటర్ పరీక్షలను మంచి వాతావరణంలో ప్రతీ వి ద్యార్థి రాయాలని కోరు కుంటున్నాం. ఈసారి తొలి దశలో కొన్ని పేపర్ల కు ఆన్లైన్ మూల్యాంకనం చేపడుతున్నాం. దీ నిపై విమర్శలు చేసే శక్తుల ప్రమేయం పరీక్ష లపై ఉండరాదని అధికారులను ఆదేశించాం. – నవీన్ మిత్తల్, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి -
ఇంటర్ పరీక్షలకు వేళాయె
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. మూడేళ్లుగా ఇంటర్ పరీక్షలు పలు కారణాలతో వాయిదా పడటం, అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవడం, కరోనా సమయంలో రద్దు చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అయితే ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం ఈనెల 15 నుంచి పరీక్షలు జరుగనున్నాయి. పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా ఏలూరులోని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షాణాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. నైతికత, మానవ విలువలపై పరీక్షలు ఇంటర్ పరీక్షల్లో భాగంగా ముందుగా ఈనెల 15న నైతికత, మానవ విలువలు అనే సబ్జెక్టుపై పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్ష ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. అలాగే ఈనెల 17న పర్యావరణ విద్య అనే సబ్జెక్టుపై పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు పూర్వ పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఏలూరు జిల్లాలో 96 కేంద్రాల్లో 12,785 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 113 కేంద్రాల్లో 15,966 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 41 కేంద్రాల్లో 5,372 మంది మొత్తంగా 34,123 మంది హాజరుకానున్నారు. ప్రాక్టికల్స్‌కు సర్వం సిద్ధం పరీక్షల్లో భాగంగా ముందుగా ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈనెల 20 నుంచి వీరికి ప్రాక్టికల్స్ ప్రారంభమై వచ్చేనెల 7వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు నాన్ జంబ్లింగ్ విధానంలో పరీక్షలు రాయవచ్చు. మొత్తంగా 8,417 మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షల కోసం 76 కేంద్రాలను సిద్ధం చేశారు. అలాగే జనరల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఈనెల 26న ప్రారంభం కానున్నాయి. 147 కేంద్రాల్లో 24,227 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వచ్చేనెల 15 నుంచి.. ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు వచ్చేనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 73,521 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే సీసీ కెమెరాలన్నింటినీ ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాగే ప్రతి కేంద్రాన్నీ సెల్ఫోన్రహిత జోన్‌గా ప్రకటించారు. ఎవరూ కేంద్రాలకు సెల్‌ఫోన్ తీసుకురాకూడదనే నిబంధన విధించారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా.. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయ్యేలా అధ్యాపకులకు సూచనలిచ్చాం. కళాశాలల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడానికి ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులు కళాశాలలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడటం, వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించడం వంటివి చేస్తున్నాం. – కె.చంద్రశేఖరబాబు, ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, ఏలూరు -
అవే చివరి పలకరింపులు.. ఇంటర్ పరీక్షలు ముగించుకొని బైక్‌పై వెళ్తూ..
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియడంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ.. ఆనందంగా గడిపింది. హాస్టల్లో తన వస్తువులు సిద్ధం చేసుకొని మరోసారి మిత్రులందరినీ పలకరించి నాన్నతో పాటు ఆనందంగా బైక్‌పై గ్రామానికి బయల్దేరింది. కానీ.. ఆ విద్యార్థిని ఆనందం కొన్ని నిమిషాల్లో ఆవిరైపోయింది. దారి మధ్యలోనే బస్సు రూపంలో వచ్చిన మృత్యువు తండ్రి, కూతురిని బలితీసుకుంది. ఇక సెలవంటూ స్నేహితురాళ్లకి.. ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్లో విద్యార్థిని చెప్పిన ఆ పలకరింపులే.. చివరివయ్యాయి. సాక్షి, గద్వాల క్రైం: రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన గద్వాల మండలం అనంతపురం శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు కథనం మేరకు వివరాలిలా.. ఇటిక్యాల మండలం మునగాలకి చెందిన నల్లన్న (42), పద్మమ్మకు ఇద్దరు సంతానం. కుమార్తె రాజేశ్వరి (18) గద్వాల మండలంలోని గొనుపాడు కేజీబీవీ కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతుంది. గురువారం ఇంటర్మీడియెట్ చివరి పరీక్ష సైతం పూర్తవడంతో విద్యార్థిని పరీక్ష కేంద్రం వద్ద, హాస్టల్లో తోటి విద్యార్థినులతో ఆనందంగా పలకరిస్తూ.. తిరిగి పైచదువులకు కలుద్దామని చెప్పింది. కూతురిని ఇంటికి తీసుకొచ్చేందుకు తండ్రి నల్లన్న బైక్‌పై మునగాల నుంచి గోనుపాడులోని కేజీబీవీ హాస్టల్‌కు చేరుకున్నాడు. స్నేహితులందరికీ మరోసారి పలకరించిన రాజేశ్వరి తండ్రితో పాటు బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరింది. బస్సు రూపంలో కబళించిన మృత్యువు.. గురువారం మధ్యాహ్నం తండ్రీకూతురు ఇద్దరూ గద్వాల మీదుగా స్వగ్రామానికి వెళ్తుండగా.. ఎర్రవల్లి నుంచి గద్వాల వైపు వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుఎదురుగా వస్తున్న వీరి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పైనుంచి వారు ఎనిమిది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన నల్లన్న, రాజేశ్వరి అక్కడిక్కడే మృతిచెందారు. ఇదిలా ఉండగా, బైక్ మామూలు వేగంతోనే వెళ్తుండగా.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న వీరి బైక్‌ను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. చదవండి: దిశ కేసు: వారిని పోలీసులే వేధించి కాల్చి చంపారు గ్రామంలో విషాదం. రోడ్డు ప్రమాదంలో మునగాలకి చెందిన తండ్రీకూతురు మృతి చెందారనే విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు కన్నీటి పర్యాంతమయ్యారు. రాజేశ్వరి చదువులో ఎంతో చురుకుగా ఉంటూ.. సెలవుల సమయంలో వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబ సభ్యులకు అండగా ఉండేదని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వ్యవసాయ పనులపైనే ఆధారపడి బతుకీడుస్తున్న నల్లన్న కుటుంబంలో ఒక్కసారిగా ఇరువురు మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు, బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఏఎస్ఐ వెంకట్రాములు తెలిపారు. -
గిట్లయితే ఎట్లా? చేతి రాతతో ప్రశ్నపత్రం.. అర్థంకాక తికమక
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల కోదాడలో ఫస్టియర్ ఇంగ్లిష్ పేపర్‌కు బదులు కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు రాగా, తాజాగా హిందీ మీడియం విద్యార్థులకు బోర్డ్ చుక్కలు చూపింది. బుధవారం ఫస్టియర్ పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. కొంతమంది విద్యార్థులు హిందీ మీడియంలో పరీక్ష రాస్తున్నారు. అయితే, ఈ ప్రశ్నపత్రాన్ని బోర్డ్ హిందీ భాషలో ప్రింట్ చేయించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఇంగ్లిష్ మాధ్యమంలో పరీక్ష కేంద్రానికి పంపే ప్రశ్నపత్రాన్నే హిందీలో తర్జుమా చేసి, విద్యార్థులకు ఇవ్వాలని బోర్డ్ ఆదేశించింది. అనువాదకులను పరీక్ష కేంద్రం వాళ్లే ఏర్పాటు చేసుకోవాలని హుకుం జారీ చేసింది. హైదరాబాద్‌లోని అంబేడ్కర్ కాలేజీ, నిజామాబాద్‌లోని మరో కేంద్రంలో హిందీ మీడియం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి ముందు అనువాదకులను పిలిపించి వాళ్లతో ప్రశ్నపత్రం తర్జుమా చేయించి విద్యార్థులకు ఇచ్చారు. దీంతో పరీక్ష ఆలస్యమైంది. ఇదిలాఉంటే, అనువాదకుల చేతిరాత అర్థం కాక, విద్యార్థులు తిప్పలు పడ్డారు. ఆ రాతను అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టిందని అంబేడ్కర్ కాలేజీలో పరీక్ష రాసిన విద్యార్థులు చెప్పారు. అర్థం కాని విషయాలను అడిగే అవకాశం కూడా చిక్కలేదన్నారు. ఈ కారణంగా పొలిటికల్ సైన్స్ పరీక్ష సరిగా రాయలేకపోయామని వాపోయారు. చేతితో రాసిన ప్రశ్నపత్రం ఎందుకీ పరిస్థితి? గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి ఎదురవ్వలేదని అధ్యాపక వర్గాలు అంటున్నాయి. బోర్డ్ పరిధిలో హిందీ అనువాదకులు లేరని, ఉన్నవాళ్లంతా రిటైరయ్యారని, అందుకే కాలేజీ వాళ్లనే ఏర్పాటు చేసుకోమన్నట్టు చెబుతున్నారు. అనువాదం కోసం బయట వ్యక్తులను పిలిస్తే, పేపర్ లీక్ చేసే ప్రమాదం ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకుంటున్నారు. దీన్ని బోర్డ్‌లోని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కాలేజీల్లో హిందీ మీడియంలో బోధన సాగుతున్నప్పుడు అధ్యాపకులు ఎందుకు ఉండరని ప్రశ్నిస్తున్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. 8.30 గంటలకు ప్రశ్నపత్రం బండిల్ విప్పుతారు. అంటే అరగంటలో అనువాదకుడు ఇంగ్లిష్ నుంచి హిందీలోకి తర్జుమా చేయాలి. నెలల తరబడి ప్రింట్ చేస్తున్న పేపర్లలోనే తప్పులు వస్తుంటే, అరగంటలో ట్రాన్స్‌లేట్ చేస్తే వచ్చే తప్పుల మాట ఏంటని వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హిందీ మాధ్యమంలో బోధించే అధ్యాపకులతో ముందే అనువాదం చేయించి ప్రశ్నపత్రం ప్రింట్ చేయించి ఉండాల్సిందని అంటున్నారు. వాస్తవ పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేకుండా బోర్డ్ వ్యవహరిస్తోందనే విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యమా: మాచర్ల రామకృష్ణ గౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్) హిందీ మాధ్యమంలో ప్రశ్నపత్రాలు ప్రింట్ చేయించకుండా, విద్యార్థులను గందరగోళంలో పడేయడం ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యానికి నిదర్శనం. పరీక్షల విభాగం కొంతమంది పైరవీకారుల చేతుల్లో ఇరుక్కుపోవడం వల్ల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. బోర్డ్ ప్రయత్నం చేస్తే హిందీ అనువాదకులు ఎందుకు దొరకరు. అప్పటికప్పుడు తర్జుమా చేయించడం వల్ల తప్పులు దొర్లితే దానికి ఎవరు బాధ్యత వహించాలి. లెక్చరర్లు లేకనే : ఇంటర్ బోర్డ్ లెక్చరర్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఫస్టియర్ హిందీ మీడియం విద్యార్థులకు ప్రశ్నప్రతాలను ప్రింట్ చేయించడం సాధ్యం కాలేదని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం రాత్రి వివరణ ఇచ్చారు. గతంలో అనువాదం కోసం బోర్డ్ హిందీ మాధ్యమానికి చెందిన రిటైర్డ్ రెగ్యులర్ లెక్చరర్ల సేవలను పొందేదని, కోవిడ్ కారణంగా పాత లెక్చరర్లు అందుబాటులో లేరని, గోప్యమైన విషయం కాబట్టి ఈ పనిని వేరే వాళ్లకు అప్పగించలేమని చెప్పారు. హిందీ మాధ్యమంలో పరీక్ష రాసే విద్యార్థులు ఫస్టియర్‌లో 32 మంది, సెకండియర్‌లో 24 మందే ఉన్నారన్నారు. అందువల్లే అందుబాటులో ఉన్న అనువాదకుల సేవలు వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్స్‌కు చెప్పినట్టు తెలిపారు. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫోటోలు)
-
హాల్‌టికెట్లను తప్పుగా ముద్రించినవారిపై ఫిర్యాదు
తాడేపల్లి రూరల్: ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షల హాల్టికెట్లలో సమయం తప్పుగా ముద్రించిన ఏపీసీఎఫ్ఎస్ఎస్ నిర్వాహకులపై ఇంటర్ పరీక్షల విభాగం అధికారులు సోమవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారులు మాట్లాడుతూ.. ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్‌టికెట్లపై సమయాన్ని ఉదయం 9 నుంచి 12 గంటల వరకు అని ముద్రించాల్సి ఉండగా.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు అని ముద్రించారని తెలిపారు. ఏపీసీఎఫ్ఎస్ఎస్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు, గోపి, ప్రతాప్ ఈ పని చేసినట్లు గుర్తించామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందు కే ఇలా చేశారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటివరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులను గుర్తించి.. ఆయా కళాశాలలకు సమాచారం ఇస్తామన్నారు. అలాగే పరీక్షల సమయం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. -
రైళ్లకు సమ్మర్ రష్..!
సాక్షి, అమరావతి బ్యూరో: రైళ్లకు వేసవి తాకిడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఇస్తుండడంతో ఇప్పట్నుంచే రిజర్వేషన్లు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో రానున్న నెలన్నర వరకు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లలో బెర్త్‌లు ఫుల్ అయ్యాయి. వేసవి సెలవుల్లో పలువురు కుటుంబ సభ్యులతో స్వస్థలాలకు, బంధువుల ఊళ్లకు, విహార యాత్రలు, తీర్థ యాత్రలకు వెళ్తుంటారు. ఇతర రవాణా వ్యవస్థలకంటే రైలు ప్రయాణం చౌక కావడం, దూర ప్రాంతాలకు వెళ్లడానికి సౌకర్యవంతంగా ఉండటంతో ప్రయాణికులు ఎక్కువగా వీటినే ఎంచుకుంటారు. దీంతో వీటిలో బెర్తులకు ముందుగానే రిజర్వు చేయించుకుంటున్నారు. విజయవాడ జంక్షన్ మీదుగా 296 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో డైలీ, వీక్లీ, బైవీక్లీ, ట్రైవీక్లీ రైళ్లు ఉన్నాయి. వీటితో పాటు విజయవాడ స్టేషన్ నుంచి 35 రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ స్టేషన్ వరకు వచ్చి నిలిచిపోయే రైళ్లు మరో 23 ఉన్నాయి. వీటిలో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో చాలావరకు బెర్తులు వెయిట్ లిస్టులే దర్శనమిస్తున్నాయి. వేసవి నుంచి ఉపశమనం పొందడం కోసం ఎగువ మధ్య తరగతి ప్రయాణికులు ఏసీ బెర్తులకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో స్లీపర్ క్లాస్‌కంటే ముందుగానే ఏసీ బెర్తులు ఫుల్ అవుతున్నాయి. ముఖ్యంగా థర్డ్ ఏసీకి డిమాండ్ అధికంగా ఉంది. విజయవాడ–విశాఖ రూట్‌కు డిమాండ్ విజయవాడ–హైదరాబాద్ రూటుకంటే విజయవాడ–విశాఖపట్నం వైపు ప్రయాణించే రైళ్లలో వెయిట్ లిస్టు సంఖ్య ఎక్కువగా ఉంది. విజయవాడ– సికింద్రాబాద్ మార్గంలో నడిచే కొన్ని రైళ్లలో రానున్న నెల, నెలన్నర వరకు బెర్తులు లభిస్తున్నా యి. విజయవాడ–విశాఖ మార్గంలో బెర్తులన్నీ అయిపోయి వెయిట్ లిస్టులు దర్శనమిస్తున్నాయి. మే 20వ తేదీకి విజయవాడ – విశాఖ మధ్య కోరమాండల్ స్లీపర్ వెయిట్ లిస్ట్ 17 కాగా థర్డ్ ఏసీ వెయిట్ లిస్ట్ 18 ఉంది. గోదావరి స్లీపర్ వెయిట్ లిస్ట్ 83కు చేరింది. మిగతా రైళ్లదీ ఇదే పరిస్థితి. వేసవికి ప్రత్యేక రైళ్లు వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ వేసవిలో విజయవాడ మీదుగా సుమారు 55 సమ్మర్ స్పెషల్ రైళ్లను అందుబాటులో ఉంచింది. ఇవి ప్రయాణికుల రద్దీని నియంత్రిస్తాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షల అనంతరం.. ఈనెల 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు మేలో ఉన్నాయి. ఈ పరీక్షల అనంతరం వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పిల్లలకు సమ్మేటివ్ పరీక్షలు పూర్తి కాగానే వేసవి సెలవులు ఇస్తారు. అంటే మే మొదటి వారంలోనే వీరికి సెలవులు ప్రకటిస్తారు. ఇందుకు అనుగుణంగా తల్లిదండ్రులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగానే రైళ్లలో రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో బెర్తులు దొరకడంలేదు. ఇంటర్ సిటీ, పాసింజర్ రైళ్లు మినహా దూరప్రాంత రైళ్లలో వెయిట్ లిస్టు కొండవీటి చాంతాడంత కనిపిస్తోంది. -
ఏపీలో మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ మొదటి, రెండో ఏడాది పరీక్షల తాజా షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. జేఈఈ పరీక్షల షెడ్యూల్ మారడంతో ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు మార్పు చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని బోర్డు అధికారులు ప్రకటించారు. -
AP: ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు
అమరావతి: ఇంటర్ పరీక్షలకు కొత్త తేదీలను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలపై పడటంతో తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను వెలువరించింది. ఏప్రిల్ 22 నుంచి పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగుతాయి. ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తవ్వాలి. కానీ జేఈఈ మెయిన్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం.. కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొత్త తేదీలను ప్రకటించారు. -
ఇంటర్ పరీక్షల తేదీల మార్పు?
సాక్షి, అమరావతి: జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలపై పడింది. జేఈఈ తొలి దశ పరీక్షలు, ఇంటర్మీడియెట్ పరీక్షలు జరిగే తేదీల్లోనే జరగనున్నాయి. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై ఇంటర్మీడియెట్ బోర్డు పునరాలోచనలో పడింది. షెడ్యూల్ మార్చడంపై కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం సచివాలయంలో దీనిపై సమీక్షించారు. పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్‌కుమార్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వివిధ ప్రతిపాదనలపై చర్చించారు. ఆ 3 రోజుల పరీక్షలు వాయిదా వేస్తే... జేఈఈ తొలి దశ పరీక్షలు ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28వ తేదీవరకు జరుగుతాయి. వీటిలో ఇంటర్ సెకండియర్‌కు సంబంధించి 16న మేథమెటిక్స్ పేపర్–2ఏ, బోటనీ పేపర్–2, సివిక్స్ పేపర్–2, 19న మేథమెటిక్స్ పేపర్–2బీ, జువాలజీ పేపర్–2, హిస్టరీ పేపర్–2, 21న ఫిజిక్సు పేపర్–2, ఎకనమిక్స్ పేపర్–2 పరీక్షలు జరుగుతాయి. ఇవే తేదీల్లో జేఈఈ పరీక్షలు వచ్చాయి. ఈ మూడు రోజుల ఇంటర్ పరీక్షలను వేరే తేదీల్లో నిర్వహించడంపై సమీక్షలో చర్చించారు. దీనివల్ల పరీక్షల మధ్యలో అంతరాయం కలిగి విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇంటర్, జేఈఈ రెండింటినీ సమర్థంగా రాయలేరన్న అభిప్రాయం వ్యక్తమైంది. వాయిదా వేస్తే..! జేఈఈ పరీక్షలు ఏప్రిల్ 21తో ముగుస్తాయి. ఆ తరువాత ఏప్రిల్ 22 లేదా 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యేలా ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనపైనా చర్చించారు. పరీక్షలు వాయిదా వేస్తే మే 2 నుంచి 13 వరకు జరిగే టెన్త్ పరీక్షలపైనా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఇంటర్‌తోపాటు టెన్త్ పరీక్షలను కూడా వాయిదా వేసి ఏప్రిల్ 23 తరువాత వేర్వేరు తేదీల్లో రెండింటినీ నిర్వహించాలన్న ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నారు. ప్రీపోన్ చేయడంపైనా పరిశీలన జేఈఈ పరీక్షలు ప్రారంభమయ్యే లోపే ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిసేలా ప్రీపోన్ చేయాలన్న ప్రతిపాదనపైనా చర్చిస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ థియరీ పరీక్షలకు మొత్తం 16 రోజులు పడుతుంది. ఇందులో ప్రధానమైన పరీక్షలకు 12 రోజులు అవసరం. ఈనెల 7వ తేదీ నుంచి 31వరకు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ జరుగుతాయి. వాటిని ముందుకు జరిపి, ఇంటర్ పరీక్షలను ప్రీపోన్ చేస్తే ఎలా ఉంటుందో పరిశీలిస్తున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలను కేటాయిస్తూ ఇప్పటికే బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికిప్పుడు జంబ్లింగ్ విధానాన్ని మార్చడం సాధ్యమవుతుందా అన్న సంశయం ఏర్పడుతోంది. మరోవైపు మార్చి 18, ఏప్రిల్‌లో 2, 5, 10, 14, 15 తేదీలు ప్రభుత్వ సెలవు దినాలు. ఆ రోజుల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించగలిగితేనే ప్రీపోన్కు అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం అనుమతించాలి. వీటిపై ఇంటర్మీడియెట్ బోర్డు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న అనంతరం కొత్త షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేస్తుంది. -
ఏప్రిల్ 8 నుంచి ఇంటర్.. మే 2 నుంచి టెన్త్ పరీక్షలు
కర్నూలు కల్చరల్: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూళ్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలను, మే 2 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ థియరీ పరీక్షల కోసం 1,456, పదో తరగతి పరీక్షల కోసం 4,200 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూళ్లను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం కర్నూలులో ప్రకటించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చిత్రంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో విద్యా శాఖ మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రోజూ పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేసేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. 3,30,376 మంది బాలురు, 3,09,429 మంది బాలికలు కలిపి మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని వివరించారు. అలాగే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,05,052 (బాలికలు 2,53,406, బాలురు 2,51,646) మంది, ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,81,481 (బాలికలు 2,39,160, బాలురు 2,42,321) మంది హాజరవుతారని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలను మార్చి 11 నుంచి 31 వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకోసం 1,757 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మార్చి 7న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, మార్చి 9న ఎన్విరాన్మెంట్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. -
ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు సోమవారం విడుదల చేసింది. థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు.. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని తెలిపింది. ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని, ఎత్నిక్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంట్ సబ్జెక్టులు తీసుకున్న వారికి ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఈ పేపర్లకు పరీక్షలు ఉంటాయని బోర్డు వెల్లడించింది. ఒకేషనల్ సహా జనరల్ ఇంటర్ విద్యార్థుల పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉంది. -
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆపలేం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పరీక్షలు ఆపాలన్న పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈనెల 25 నుంచి పరీక్షలు ఉండగా చివరి నిమిషంలో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. కోర్టు అందుకు అనుమతించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఫస్టియర్ పరీక్షలు ఆపాలంటూ తెలంగాణ తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం అత్యవసరంగా విచారించింది. కరోనా నేపథ్యంలో ద్వితీయ సంవత్సరానికి ఐదు నెలల క్రితం ప్రమోట్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న దాదాపు 4.58 లక్షల మంది విద్యార్థులకు 25వ తేదీ నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించిందని తెలిపారు. సెకండియర్ చదువుతున్న విద్యార్థులు మళ్లీ ప్రథమ సంవత్సరం పరీక్షల కోసం చదవాలంటే గందరగోళానికి, తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులను పాస్ అయినట్లుగా ప్రకటించిన తరహాలోనే పాస్ చేయాలని కోరారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఇంటర్ బోర్డు తరఫున డీఎల్ పాండు వాదనలు వినిపించారు. ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేసే సమయంలోనే పరిస్థితులకు అనుగుణంగా ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తామని ముందుగానే పేర్కొన్నామన్నారు. పదవ తరగతి పరీక్షలు కూడా ఈ విద్యార్థులు రాయలేదని, కరోనా నేపథ్యంలో వీరిని పాస్ చేశారని తెలిపారు. ఇప్పుడు ప్రథమ సంవత్సరం పరీక్షలు కూడా రాయకపోతే భవిçష్యత్తులో ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి వస్తే వీరి ప్రతిభను అంచనా వేయడం ఇబ్బందికరంగా మారుతుందని నివేదించారు. ఆ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పరీక్షల నిర్వహణకు రెండు రోజుల ముందు పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న వినతిమేరకు ధర్మాసనం అనుమతించింది. -
ఇంటర్ పరీక్షలు.. ఇక డొంక తిరుగుడు ప్రశ్నలుండవ్!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25 నుంచి నిర్వహించే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తేలికగానే ఉంటాయని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని ఇంటర్ బోర్డ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కరోనా నేపథ్యం, విద్యాబోధనలో ఇబ్బందులు, కొన్నిచోట్ల సిలబస్ పూర్తవ్వని పరిస్థితులను ప్రశ్నాపత్రం రూపకల్పనలో కీలకాంశాలుగా తీసుకున్నట్టు చెబుతున్నారు. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్ పరిధిలోనే ప్రశ్నలుండే వీలుందంటున్నారు. విద్యార్థులను తికమకపెట్టే డొంక తిరుగుడు ప్రశ్నలను సాధ్యమైనంత వరకూ రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు బోర్డు వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొద్దిపాటి శ్రద్ధ తీసుకునే విద్యార్థి కూడా గట్టెక్కే రీతిలో పరీక్షలు ఉండబోతున్నాయనే భరోసాను అధికారులు కలి్పస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లోనూ చాయిస్ ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే బోర్డు ప్రకటించింది. కరోనా కారణంగా ఫస్టియర్ పరీక్షలు లేకుండా విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి అనుమతించిన విషయం తెలిసిందే. మునుపటికన్నా భిన్నంగా, రాయాల్సిన వాటికన్నా ప్రశ్నలు ఎక్కువ ఇవ్వనున్నారు. దీనివల్ల ఏదో ఒక ప్రశ్నకు విద్యార్థి సిద్ధమై ఉంటాడని, సులభంగా జవాబు రాసే వీలుందని బోర్డు వర్గాలు అంటున్నాయి. ప్రశ్నల తీరు ఇలా.... ►సబ్జెక్టుల్లో సగానికి సగం చాయిస్ ఇస్తున్నారు. ముఖ్యంగా గణితంలో ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు సాధ్యమైనంత వరకూ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. గణితంలో మూడు సెక్షన్లుంటాయి. ‘ఎ’సెక్షన్లో 2 మార్కులు, ‘బి’లో 4, ‘సీ’లో 7 మార్కుల ప్రశ్నలుంటాయి. ఏ సెక్షన్‌లోని 10 ప్రశ్నల కూ సమాధానం ఇవ్వాలి. ‘బీ’లో 10 ప్రశ్నలకుగాను 5, ‘సీ’లో 10 ప్రశ్నలకుగాను ఐదింటికి రాయాలి. ►భౌతికశాస్త్రంలో ఏ సెక్షన్లో 2, బీ సెక్షన్లో 4, సీ సెక్ష న్లో 8 మార్కుల ప్రశ్నలిస్తారు. సెక్షన్ ఏలో ఉన్న మొ త్తం పది ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నల్లో ఆరింటికి, ‘సీ’ లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి సమాధానాలివ్వాలి. ►రసాయనశాస్త్రంలో సెక్షన్ ఏలో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు, సెక్షన్ బీలో 4, సెక్షన్ సీలో 8 మార్కుల ప్రశ్నలివ్వనున్నారు. ‘ఏ’లో ఉన్న మొత్తం 10 ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నలకుగాను 6, ‘సీ’లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి సమాధానాలు రాయాలి. ►బోటనీ సెక్షన్–ఏలో 2 మార్కులు, సెక్షన్–బీలో 4 మార్కులు, సెక్షన్–సీలో 8 మార్కుల ప్రశ్నలిస్తారు. సెక్షన్–ఏలో ఉన్న మొత్తం 10 ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నలకు గాను ఆరింటికి, ‘సీ’లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి జవాబులు రాయాలి. ►అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం రెండింటిలో సెక్షన్–ఏలో 10, సెక్షన్–బీలో 5, సెక్షన్–సీలో 2 మార్కుల ప్రశ్నలిస్తారు. ఏ సెక్షన్లో 6 ప్రశ్నలకుగాను 3, ‘బీ’లో 16 ప్రశ్నలకుగాను ఎనిమిదింటికి, ‘సీ’లో 30 ప్రశ్నలకుగాను 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వాళ్ల సంగతేంటి? ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు గతంలో ఫీజు కట్టిన వాళ్లకే అవకాశం ఇస్తున్నారు. అయితే, అప్పట్లో 10 వేల మంది ఫీజులు చెల్లించలేదు. ఈ సమయంలో పరీక్షలు లేకుండా అందరినీ రెండో ఏడాదిలోకి ప్రమోట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఫీజు కట్టని వాళ్లకు ఇప్పుడు పరీక్ష రాసే అవకాశం లేకుండా పోయింది. వీళ్లంతా ద్వితీయ సంవత్సరం కొనసాగిస్తూ ఆ ఏడాదితో పాటే, ఫస్టియర్ పరీక్షలూ రాయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
పరీక్షకు పరేషానొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలను విద్యార్థులు ధైర్యంగా ఎదుర్కొని ఉత్తమ ఫలితాలు సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. విద్యార్థులు ఒత్తిడిని తట్టుకునేందుకు, వార్షిక పరీక్షను విజయవంతంగా రాసేందుకు ఉపయుక్తమైన ఫస్టియర్ స్టడీమెటీరియల్‌ను మంత్రి మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, గణితం, భౌతిక శాస్త్రం, చరిత్ర స్టడీ మెటీరియల్‌ను ‘టీఎస్‌బీఐఈ’వెబ్సైట్లో పొందొచ్చని తెలిపారు. కోవిడ్ కారణంగా ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతికి పంపిన విషయం తెలిసిందే. వారికి ద్వితీయ సంవత్సరం మధ్యలో గత వార్షిక పరీక్షలు నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని పరీక్షల్లో 50%చాయస్ ఇస్తూ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. -
Telangana: ఇంటర్ పస్టియర్ పరీక్షలు ఉన్నట్లా? లేనట్లా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉంటాయో? లేదో? తెలియక లక్షలాది మంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. పరీక్షలు పెట్టి తీరుతామని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఆమె ఈ మాట చెప్పి నెల రోజులు దాటింది. కానీ, ఇంతవరకూ షెడ్యూల్డ్ మాత్రం రాలేదు. కోవిడ్ కారణం గా 4.75 లక్షల మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యా ర్థులను ‘ద్వితీయ’లోకి ప్రమోట్ చేశారు. వాళ్లకు ఇప్పటికే ద్వితీయ సంవత్సరం పాఠ్య ప్రణాళిక సగానికి పైగా పూర్తయింది. వచ్చే ఏడాది నీట్, జేఈఈ, ఎంసెట్‌కు విద్యార్థులు తర్ఫీదు అవుతున్నారు. పోటీ పరీక్షలతో పాటు, రెండో ఏడాది పాఠ్య పుస్తకాలు చదవడమే కష్టంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. వచ్చే మార్చిలో రెండో ఏడాది పరీక్షలూ నిర్వహించకపోతే విద్యార్థులకే ఇబ్బంది ఉంటుందని ప్రభుత్వం భావించింది. మొదటి ఏడాది పరీక్షలన్నా ఇప్పుడు నిర్వహిస్తే ఆ మార్కుల ఆధారంగా రెండో ఏడాదిలోనూ ప్రమోట్ చేయవచ్చని యోచించారు. ఈ తంతు జూలై, ఆగస్టులో పూర్తిచేసి ఉంటే బాగుండేదని.. ఇప్పుడు మొదటి ఏడాది పరీక్షలు పెడితే ఎలా అని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ ఒత్తిడిల నేపథ్యంలో ఇంటర్ బోర్డు పునరాలోచనలో పడింది. -
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలపై సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తూ నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఈ పరీక్షలపై మంగళవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో పరీక్షల అవసరం, వాటి నిర్వహణ కోసం చేపట్టబోయే చర్యల గురించి తెలియచేశామన్నారు. ఈమేరకు మంత్రి ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘çసుప్రీంకోర్టులో ఈరోజు కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విచారణ జరిగింది. సుప్రీంకోర్టు రాష్ట్రాల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అది నిజం కాదు. పరీక్షలు ఎందుకు నిర్వహించాలి? నిర్వహించాల్సిన అవసరమేముంది? అనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం అడిగింది. దానికి సమాధానమిస్తూ పరీక్షలు ఎలా నిర్వహిస్తాం, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి సుప్రీంకోర్టుకు వివరించాం. ప్రధానంగా ఒక్కో రూములో 15కి మించి విద్యార్థులు లేకుండా, అలాగే ప్రతి విద్యార్థికీ అయిదడుగుల భౌతికదూరం ఉండేలా చూస్తూ, కోవిడ్–19 ప్రొటోకాల్ నియమ, నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు తెలియచేశాం. అంతేకాకుండా పరీక్షల ఆవశ్యకతను ముఖ్యంగా ఎంసెట్ పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్న అంశాన్ని వివరించాం. పదో తరగతిలో కూడా మార్కులు కాకుండా గ్రేడ్లు మాత్రమే ఇస్తామని చెప్పాం. కోర్టు వాటన్నిటినీ అఫిడవిట్ ద్వారా తెలియచేయాలని రెండురోజుల గడువు ఇచ్చింది. కేసును గురువారానికి వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితులన్నిటినీ అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు వివరించనున్నాం. తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటాం. వారు ఏ నిర్ణయం చెప్పినా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంటర్ సెకండియర్‌కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులను ప్రకటిస్తారు. ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: Telangana: లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు -
కేంద్ర మంత్రికి ఏపీ విద్యాశాఖ మంత్రి లేఖ
సాక్షి, అమరావతి: 12వ తరగతి పరీక్షల నిర్వహణపై తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు బుధవారం లేఖ రాశారు. ఆ లేఖలో.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ కేంద్రం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున ప్రత్యేక కోటాలో వ్యాక్సిన్ కేటాయించాలని, టీచర్లు, ఇన్విజిలేటర్లు, ప్రొఫెసర్లను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేస్తే ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో మానసిక స్థైర్యం పెంపొందించగలుగుతామని, కేంద్రం వారిని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా వ్యాక్సిన్ కోటా కేటాయించాలన్నారు. -
టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదు: సీఎం జగన్
-
70% సిలబస్‌తోనే ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్, ఎంసెట్ పరీక్షల్లో పరిగణనలోకి తీసుకోవా ల్సిన సిలబస్ ఖరారైంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 70% సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెకండియర్ పరీక్షలు నిర్వహించే 70% సిలబస్‌ను ఎంసెట్‌కు పరిగణనలోకి తీసుకోనుంది. ఫస్టియర్‌కు సంబంధించి గత మార్చిలోనే విద్యార్థులు పరీక్షలు రాసినందున ప్రథమ సంవత్సరంలోని పూర్తి సిలబస్‌ను ఎంసెట్‌లో పరిగణనలోకి తీసుకోనున్నారు. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, మండలి కార్యదర్శి శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు, విద్యా బోధనకు ఏర్పడిన ఆటంకాలపై చర్చించారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్, ఎంసెట్‌కు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సిలబస్‌కు సంబంధించిన విధానం 2020–21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని తొలగించేది లేదని, యథాతథంగా కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. ప్రశ్నల సంఖ్య పెంపు.. ఇంటర్మీడియట్లో ప్రశ్నల సంఖ్యను పెంచి, విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఇంటర్ వార్షిక పరీక్షల్లో ప్రశ్న పత్రాల్లో విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నల సంఖ్యను రెట్టింపు చేయడం ద్వారా విద్యార్థులకు ఎక్కువ చాయిస్ ఉండనుంది. కరోనా కారణంగా ప్రత్యక్ష బోధన లేకపోవడం, గత సెప్టెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ఆన్లైన్/ డిజిటల్ బోధన మాత్రమే కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఆ పాఠాలు ఎంత మేరకు అర్థం అయ్యాయనే గందరగోళం ఉంది. అందుకే విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు 30 శాతం సిలబస్ తగ్గింపుతో పాటు చాయిస్ ఎక్కువ ఉండేలా చర్యలు చేపట్టింది. ఎంసెట్‌లోనూ ఎక్కువ చాయిస్.. ఎంసెట్‌లోనూ విద్యార్థులకు ఎక్కువ చాయిస్ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం 160 ప్రశ్నలకు 160 మార్కుల విధానం ఉంది. అయితే ఈ సారి విద్యార్థులకు ఎక్కువ చాయిస్ ఉండేలా చర్యలు చేపట్టే ఆలోచనల్లో అధికారులు ఉన్నారు. 180 ప్రశ్నలు ఇచ్చి 160 ప్రశ్నలకు సమాధానాలు రాసే విధానం తీసుకొచ్చే అవకాశముంది. ప్రస్తుతం దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. వచ్చే 10 రోజుల్లో ఎంసెట్ కన్వీనర్‌ను ఉన్నత విద్యా మండలి నియమించనుంది. ఆ తర్వాత ప్రశ్నపత్రం, ఆప్షన్లు తదితర అంశాలపై ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీనే తుది నిర్ణయం తీసుకోనుంది. జూన్ 14 తర్వాత ఎంసెట్ ‘ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మే 13తో పూర్తవుతాయి. కాబట్టి విద్యార్థులు ఎంసెట్‌కు సిద్ధం అయ్యేందుకు 4 వారాల గడువు ఇస్తాం. జూన్ 14 తర్వాత ఎంసెట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటాం. అయితే ఆన్లైన్ పరీక్షలను నిర్వహించే సాంకేతిక సంస్థ అయిన టీసీఎస్ స్లాట్స్‌ను బట్టి పరీక్షల తేదీలు ఖరారు చేస్తాం.’ – ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి -
మూల్యాంకనం వాయిదాకు హైకోర్టు ‘నో’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకనాన్ని వాయిదా వేసేందుకు హైకోర్టు అంగీకరించలేదు. లాక్డౌన్ పూర్తిగా తొలగించే వరకూ ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించరాదనే అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇంటర్ పరీక్షల ఫలితాలకూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉన్నత విద్య ప్రవేశాలకు ముడిపడి ఉంటుందని, ఈ పరిస్థితుల్లో మూల్యాంకనం వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. (ఏది పడితే అది పండించొద్దు: సీఎం కేసీఆర్) లాక్డౌన్ పూర్తయ్యే ఈ నెల 29 వరకూ మూల్యాంకనం నిర్వహించరాదని కోరుతూ సిద్దిపేటకు చెందిన సామాజిక కార్యకర్త ఓంప్రకాష్ భోజన విరామ సమయంలో దాఖలు చేసిన అత్యవసర వ్యాజ్యాన్ని మంగళవారం ధర్మాసనం విచారించింది. రాష్ట్రంలోని 9.65 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేసుకోవచ్చునని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. -
11 నుండి ఇంటర్ వాల్యుయేషన్
సాక్షి, అమరావతి: ఈ నెల 11 నుండి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయం నాల్గవ బ్లాక్ మొదటి అంతస్థులోని మంత్రి తన ఛాంబర్లో ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామిన్ వి. రమేష్ లతో కలిసి మంత్రి 13 జిల్లాల ఆర్ఐఓలు, ఆర్జేడీలు, డీవీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. (సీబీఎస్ఈ సిలబస్ కుదింపు!) లాక్ డౌన్ అనంతరం రెడ్ జోన్ జిల్లాల్లో.. ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో మే 11 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు మంత్రి సూచన ప్రాయంగా తెలిపారు. లాక్ డౌన్ ముగిసిన అనంతరం రెడ్ జోన్ లో మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు అనుసరించి, కోవిడ్-19 జాగ్రత్తలను పాటిస్తూనే మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్,ఎడ్ సెట్, లా సెట్, పీఈసెట్ తదితర పోటీపరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారు కావడంతో త్వరితగతిన ఇంటర్మీడియట్ మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాల్సి ఉందన్నారు. మూల్యాంకన ప్రక్రియ పాదర్శకంగా ఉండాలి.. రాష్ట్ర వ్యాప్తంగా మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,18,280 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. మొత్తంగా 10,64,442 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలకు హాజరయినట్లు పేర్కొన్నారు. వీరికి సంబంధించి సుమారు 60 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉందని మంత్రి వివరించారు. 13 జిల్లాల్లోనూ మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ప్రత్యేకంగా గుర్తించిన రెండు, మూడు భవనాలను మూల్యాంకన కార్యకలాపాలకు వినియోగించనున్నామన్నారు. మూల్యాంకన ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి కావలసిన భోజనం, వసతి ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూల్యాంకన ప్రక్రియ పాదర్శకంగా, నాణ్యంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. మార్గదర్శకాలు పాటించాలి.. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక షిప్టు, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు మరో షిప్టులో మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఉదయం 15, మధ్యాహ్నం 15 జవాబుపత్రాలు ప్రతిరోజూ మూల్యాంకనం చేయాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో సంబంధింత అధికారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని భరోసానిచ్చారు. మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే అధికారులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ ను వినియోగించాల్సి ఉంటుందన్నారు. మూల్యాంకన ప్రక్రియలో 25 వేల మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. తొలుత ఆరెంజ్, గ్రీన్ జోన్ లో సుమారు 15వేల మందితో ఈ మూల్యాంకన ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. రెడ్ జోన్ లో 8 నుండి 10 వేల మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. వారికి మినహాయింపు ఇవ్వాలి.. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్ అసోసియేషన్ అధ్యక్షులు రాజారామ్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ కార్యదర్శి వి.రవి 55 ఏళ్లకు పైబడిన వారికి మూల్యాంకన ప్రక్రియలో మినహాయింపు ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ నిబంధనల ప్రకారమే మినహాయింపు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. జూన్ చివరి నాటికి ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ లో విద్యార్థులకు ఆన్ లైన్ లో థియరీ క్లాసులు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలు, ప్రాక్టికల్స్ కు సంబంధించిన వీడియోలు పొందుపరుచనున్నామని తెలిపారు. దీనికి జోన్-4 కడప జిల్లా ఆర్జేడీ కె.చంద్రశేఖర్ ఇన్ చార్జిగా వ్యవహరించనున్నారని వెల్లడించారు. -
జూన్‌లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన పది లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను జూన్‌లో నిర్వహించే అంశంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) దృష్టి సారించింది. పరీక్షలను వాయిదా వేసిన ఎంహెచ్ఆర్డీ తాజా షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. మే 3 వరకు లాక్డౌన్ ఉన్నందున, తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణ యం ప్రకటిస్తామని ఆయా సంస్థలు ముందుగా ప్రకటించాయి. మే నెలాఖరు నాటికల్లా పరిస్థితి అదుపులోకి వస్తుందని ఎంహెచ్ఆర్డీ భావిస్తోంది. జూన్‌లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. రెండింటిపైనా కసరత్తు... దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలైన జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ విద్యా ఏడాదిలో ప్రవేశాల కోసం గత జనవరిలో మెుదటి విడత జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. ఏప్రిల్ 5 నుంచి 11 వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను కేంద్రం ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది. మే 17న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను కూడా వాయిదా వేస్తూ ఐఐటీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పరీక్షల నిర్వహణపై కసరత్తు ప్రారంభించింది. జేఈఈ మెయిన్ నిర్వహిస్తేగానీ అడ్వాన్స్డ్ నిర్వహించే పరిస్థితి లేదు. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందిని ఎంపిక చేసి అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే జేఈఈ మెయిన్‌ను జూన్ మెుదట్లోనే నిర్వహించి 10 –15 రోజుల్లో ఫలితాలు ఇవ్వాలన్న ఆలోచనల్లో ఉంది. తద్వారా అడ్వాన్స్డ్ పరీక్షను జూన్ నెలాఖరుకు నిర్వహించినా జూలైలో ఫలితాలను ఇచ్చి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ 8కల్లా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించి, 17వ తేదీ నుంచి ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ – జోసా) ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూలై మెుదటి వారంకల్లా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించి, రెండో వారంలో జోసా ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. ఒకవేళ కరోనా కనుక త్వరితంగా అదుపులోకి వస్తే జేఈఈ మెయిన్‌ను మాత్రం మే నెలాఖరులో నిర్వహించే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. -
ఆలస్యం.. ఆవేదనభరితం
రంగారెడ్డి, పెద్దేముల్: మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రానికి ఇద్దరు విద్యార్థినులు ఆలస్యంగా వచ్చారు. దీంతో వారిని అధికారులు అనుమతించలేదు. దీంతో విద్యార్థినులు కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించారు. బంట్వారం మండలంలోని మోడల్ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు అనూష, స్వర్ణలత ఉదయం 9.20 నిమిషాలకు వచ్చారు. ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి రావడంతో అధికారులు వారిని అనుమతి ఇవ్వలేదు. బంట్వారం మండలం బోపూనారం నుంచి మోమెడ్‌పై రావడంతో అలస్యమైందని పరీక్షకు అనుమతి ఇవ్వాలని విద్యార్థినులు కోరినా అధికారులు స్పందించలేదు. దీంతో విద్యార్థినులు అక్కడే కుప్పకూలిపోయారు. ఏఎన్ఏం వారికి జ్యూస్ పంపిణీ చేశారు. -
ఒక్క నిమిషం ఆలస్యంపై పిల్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్షలకు అనుమతించబోమని ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే ఈ నిబంధనను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిల్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టును అభ్యర్థించారు. భోజన విరామ సమయంలో పిల్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. బుధవారం విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థులు కొద్ది నిమిషాలు ఆలస్యంగా పరీక్షకు హాజరైతే పరీక్షలు రాసేందుకు అనుమతించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులను మానసికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసే ఈ నిబంధనను రద్దు చేయాలని, సమయ పాలనపై విద్యార్థులకు అవగాహన కల్పించాలేగానీ, ఇలాంటి షరతు విధించి ఏడాది చదువును పణంగా పెట్టేలా చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని ఆయన కోరారు. -
ఇంట్లో తండ్రి మృతదేహం.. 'పరీక్ష'
విజయనగరం, గరివిడి: ఇంట్లో తండ్రి మృతదేహం ఉండగా... పుట్టెడు దుఖంతో పరీక్షకు హాజరయ్యాడు కుమారుడు. కన్నీటిని దిగమింగుకొని పరీక్షను రాశాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని దుమ్మెద గ్రామానికి చెందిన పతివాడ రాంబాబు చీపురుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి పతివాడ సత్యం(55) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రి మృతి చెందడంతో రాంబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పరీక్షకు హాజరు కావాలా! వద్దా! అనే మీమాంసలో చివరకు తన దుఖాన్ని గుండెల్లో దాచుకొని పరీక్షకు హాజరయ్యాడు. తనను ఎంతో కష్టపడి చదివించిన తండ్రి ఆశయం నెరవేర్చాలని, జన్మనిచ్చిన తండ్రి ఇకరారని తెలుసుకుని ఆయన ఆశయానికి విలువనిచ్చి పరీక్ష రాసేందుకు చీపురుపల్లిలోని జీవీఆర్ కళాశాలకు వెళ్లాడు. ఈ ఘటన గ్రామస్తులను కన్నీరు పెట్టించాయి. సత్యం మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
లైట్లు వెలగక.. ఫ్యాన్ తిరగక
ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించామని ఊదరగొట్టిన అధికారుల డొల్లతనం తొలిరోజే బయటపడింది. చాలా కేంద్రాల్లో ఫ్యాన్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు చెమటలు కక్కుతూనే పరీక్ష రాశారు. వెలుతురు సరిగాలేని గదుల్లో లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకటికి పదిసార్లు సమీక్షలతో కాలం గడిపిన జిల్లా ఉన్నతాధికారులు, ఇంటర్‌బోర్డు అధికారులు పరీక్ష వేళ చేతులెత్తేయడంతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. అనంతపురం విద్య: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు/సంస్కృతం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 97 కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 34,839 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 33,709 మంది హాజరయ్యారు. జిల్లా కేంద్రం అనంతపురంలోని ప్రధాన పరీక్ష కేంద్రాల్లో అధికారులు కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి. దీంతో విద్యార్థులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. లైట్లు లేకపోవడంతో చీకట్లోనే పరీక్షలు రాయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరీక్షలు బాగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా గత 20 రోజులుగా జాయింట్ కలెక్టర్–2, ఆర్ఐఓలు అనేక సందర్భాల్లో సమీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, న్యూటౌన్–ఎస్.ఎస్.బీ.ఎన్ కళాశాల పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడం.. ఫ్యాన్లు అసలు లేకపోవడంతో విద్యార్థులు చుక్కలు చూడాల్సి వచ్చింది. జూమ్ యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఇంటర్మీడియట్ పరీక్షలు తొలి రోజు పకడ్బందీగా నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మాస్‌కాపీయింగ్ జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఆర్ఐఓ, ఇతర ఉన్నతాధికారులతో ఇంటర్‌బోర్డు కార్యదర్శి ‘జూమ్ యాప్’ ద్వారా పర్యవేక్షించారు. 97 పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. యాప్.. బంపర్ గైడ్ గతంలో విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి వెళ్లి అక్కడ నోటీసు బోర్డులో వేసిన సమాచారం ఆధారంగా తమకు కేటాయించిన గదికి వెళ్లేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకుండా ముందు రోజు రాత్రే విద్యార్థుల తల్లిదండ్రుల రిజిస్టర్డ్ నంబర్‌కు పరీక్ష కేంద్రం, సీటింగ్ అరైంజ్‌మెంట్ సమాచారాన్ని చేరవేసేలా ఇంటర్‌బోర్డు అధికారులు ‘సెంటర్ మొబైల్ లొకేటర్ యాప్ ’ను అందుబాటులోకి తీసుకవచ్చారు. ఈ యాప్ ఇంటర్ విద్యార్థులకు బాగా ఉపయోగపడింది. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్‌ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేశారు. నేడు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు గురువారం తెలుగు/సంస్కృతం పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 97 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనుండగా.. 32,041 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. ముందస్తుగానే పరీక్ష కేంద్రానికి వస్తే ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 27 ప్రత్యేక బస్సులు ప్రతి విద్యార్థికీ, తాను చదువుతున్న కళాశాలకు 20 కి.మీ దూరం లోపే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ‘ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు’ అని గతంలో పేర్కొన్నప్పటికీ.. బుధవారం పరీక్ష ప్రారంభమయ్యే గంట ముందు సడలింపు ఇచ్చారు. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల వరకు విద్యార్థి పరీక్షకు హాజరు కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు కారణాన్ని చీఫ్ సూపరింటెండెంట్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆయన సమ్మతిస్తే పరీక్షకు అనుమ తిస్తారు. ఎక్కువ ఆలస్యమైతే ప్రత్యేకమైన పరిస్థితులు, కారణాలు ఉంటే అనుమతించే అంశంపై ఛీప్ అబ్జర్వర్లు నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కోసమే ఆర్టీసీ ప్రత్యేకంగా 27 సర్వీసులు నడిపింది. -
తొలిరోజే లీకేజీ.. వాట్సప్‌లో ఫిజిక్స్ పేపర్
యశవంతపుర: ఆదిలోనే హంసపాదు అన్నట్లు పీయూసీ (ఇంటర్మీడియేట్) ద్వితీయ ఏడాది పరీక్షల మొదటిరోజే లీకేజీ రగడ నెలకొంది. బుధవారం రాష్ట్రమంతటా పీయూసీ పరీక్షలు ఆరంభమయ్యాయి. విజయపుర (బిజాపుర)లో ఇండి పట్టణ పోలీసులు ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. లీక్ చేసిన మురుగేశ్ సగరతో పాటు పరీక్ష రాస్తూ పేపర్‌ను బయటకు వేసిన మురుఘేంద్ర అనే విద్యార్థిని అరెస్ట్ చేశారు. ఇండి పట్టణంలోని శాంతేశ్వర విద్యావర్ధక సంఘం కాలేజీలో బుధవారం ఉదయం ప్రశ్నాపత్రం లీకైంది. మురుఘేంద్ర అనే విద్యార్థి భౌతికశాస్త్రం పరీక్షను రాస్తూ క్వశ్చన్ పేపర్‌ను కేంద్రం బయట ఉన్న స్నేహితుడు మురుగేశ్ సగరకు విసిరాడు. దీనిని అతడు ఫోటో తీసి వాట్సప్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. పేపర్ లీకైందని పెద్దస్థాయిలో ప్రచారం జరిగింది. ఇది తెలిసి ఇండి పట్టణ పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. సూపర్వైజర్ సస్పెండ్.. పరీక్ష రూం సూపర్వైజర్ నారాయణకర్ను జిల్లా కలెక్టర్ వైఎస్ పాటిల్ సస్పెండ్ చేశారు. పరీక్ష కేంద్రానికి కలెక్టర్‌తో పాటు ఎస్పీ అనుపమ అగ్రవాల్ వచ్చి పరిశీలించి పునరావృతం కాకుండా సూచనలు చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీలో కాలేజీ సిబ్బంది పాత్ర మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముమ్మర తనిఖీ జరుగుతోంది. లీకేజీలు, కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు జరుపుతామని ఒకవైపు విద్యామంత్రి సురేష్‌కుమార్ పదేపదే ప్రకటిస్తూ ఉన్న తరుణంలో లీకేజీ సంఘటన సంభవించింది. -
మీకు ఆల్ ది బెస్ట్: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివితే... మంచి ఫలితాలు సాధించగలరని వారిలో స్ఫూర్తి నింపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 10,65,156 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. (చదవండి: ఎన్పీఆర్పై సీఎం జగన్ ట్వీట్) Best of luck to all the students appearing for the Intermediate exams. I urge my young friends to write the exams stress-free and without pressure of any kind. Hard work & preparation will help you ace through them. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 4, 2020 కేవలం అవే ముఖ్యం కాదు: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బెస్ట్ విషెస్ తెలిపారు. పరీక్షలు, గ్రేడ్లు ముఖ్యమేనని.. అయితే అవే సర్వస్వం కాదన్నారు. ఒత్తిడికి లోను కాకుండా.. ఉత్తమ ప్రదర్శన కనబరచాలని పేర్కొన్నారు. ఇక విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. కాగా ఈనెల 4 నుంచి 23 వరకు తెలంగాణలో నిర్వహించే పరీక్షలకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షా సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని, విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) My best wishes to the lakhs of young students who are appearing for their Intermediate board (10+2) examinations starting today While exams & grades are important, they are NOT everything in life. Don’t stress, Do your best 👍 — KTR (@KTRTRS) March 4, 2020 -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,65,156 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 5,46,368 మంది, సెకెండియర్ విద్యార్థులు 5,18,788 మంది ఉన్నారు. వీరికోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. -
నిమిషం ఆలస్యమైనా సెంటర్లోకి నిరాకరణ
సాక్షి, సిటీబ్యూరో: సమస్యాత్మక పరీక్ష కేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మాల్ ప్రాక్టీస్‌కు ఏమాత్రం ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో సెంటర్‌కు ఒక సిట్టింగ్ స్క్వాడ్‌ను ప్రత్యేకంగా నియమించింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 404280 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 462 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 16 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా కేంద్రాలపై నిఘా ఉంచుతున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రశ్నపత్రాలను మరో రెండు మూడు రోజుల్లో స్థానికంగా ఎంపిక చేసిన పోలీస్స్టేషన్లకు తరలించి ప్రత్యేక కౌంటర్లలో భద్రపర్చనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో 26, మేడ్చల్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 28 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు. సెంటర్ లొకేషన్ యాప్ ప్రారంభం.. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సెంటర్ లొకేషన్ యాప్‌ను సిద్ధం చేశారు. గతేడాదే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఫలితాలు అందించలేకపోయింది. ప్రస్తుతం ఈ యాప్ పని తీరును మరింత ఆధునికీకరించి అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి సెంటర్ లొకేషన్ యాప్ అని టైప్ చేసి, ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. యాప్‌లో హాల్‌టికెట్ నంబర్ టైప్ చేసి సెర్చ్ చేస్తే.. విద్యార్థి ఉన్న చోటికి పరీక్ష కేంద్రం ఎంత దూరంలో ఉందో తెలుస్తుంది. పరీక్ష కేంద్రానికి ఏ రూట్లో ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా హాల్‌టికెట్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరం లేదు. కాలేజీ ఫీజు పూర్తిగా చెల్లించని విద్యార్థులకు ఆయా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు వారి హాల్ టికెట్లు ఇవ్వకుండా మొండికేస్తుండటం తెలిసిందే. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే యాజమాన్యాలకు చెక్ పెట్టేందుకే ఈ అవకాశాన్ని అందుబాటలోకి తెచ్చినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. నిర్దేశిత సమయానికి మించి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఉదయం 8 గంటలకే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. విద్యార్థులు ఒత్తిడికిలోనుకావొద్దు పరీక్షల సమయం సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. తమ పిల్లలు అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాలని, తమ కాలేజీకి మంచి గుర్తింపు తీసుకురావాలనే ఆశతో కొన్ని కాలేజీల యాజమాన్యాలు పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇది చదువు.. అది చదువు అంటూ వారిని బలవంతం చేస్తున్నారు. కీలకమైన ఈ సమయంలో పిల్లలకు అండగా నిలవాల్సిన తల్లిదండ్రులు కూడా మార్కులు లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మార్కులు, ర్యాంకులే జీవితం కాదు. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలకు అండగా నిలవాలి. వారిని మానసికంగా పరీక్షలకు సిద్ధం చేయాలి. – జయప్రదాబాయి, జిల్లాఇంటర్మీడియట్ ఆఫీసర్, హైదరాబాద్ పరీక్షల తేదీలు.. సమయం ఇలా ఫస్టియర్: మార్చి 4 నుంచి 21 వరకు సెకండియర్: మార్చి 5 నుంచి 23 వరకు సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు -
కాసులిచ్చుకో.. మార్కులేసుకో!
సాక్షి, ఆదిలాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 1 నుంచి 20 వరకు నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ అంతా అస్తవ్యస్తంగా తయారైందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇంటరీ్మడియెట్ పరీక్ష నిర్వహణ అధి కారులు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాసుల కోసం కొంతమంది పరీక్ష నిర్వహణ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. కొంతమంది పరీక్షల ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అధికారులు కాసులు తీసుకుంటూ పరీక్షల్లో మార్కులు వేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో.. జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్న ఎంపీసీ, బైపీసీ, జనరల్ విద్యార్థులు మొత్తం 5,272 మంది ఉన్నారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 1884 మంది, బైపీసీ విద్యార్థులు 3388 ఉండగా, ఒకేషనల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 749, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 655 మంది ఉన్నారు. మొత్తం ఒకేషనల్ విద్యార్థులు 1404 మంది ఉన్నారు. వీరికి విడతల వారీగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాసులు ముట్టజెప్పి.. ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అదే కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్ష కేంద్రం ఉండడంతో జోరుగా కాపీయింగ్ జరుగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రైవేట్ కళాశాలలకు అదే కళాశాలకు చెందిన లెక్చరర్ ఒకరు ఇంటర్నల్‌గా వ్యవహరిస్తుండగా, మరో కళాశాలకు చెందిన లెక్చరర్ ఎక్స్టర్నల్గా ఉంటారు. విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించి పేపర్లు మూల్యాంకణం చేసి మార్కులు వేస్తారు. అయితే మార్కుల కోసం కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎక్స్టర్నల్గా వచ్చిన కొంతమందికి విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక బ్యాచ్ పరీక్షకు రూ.3వేల వరకు అప్పజెబుతున్నారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నాలుగు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. మొత్తం 120 మార్కులు ఉండగా, ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వంద శాతం మార్కులు వేయడం గమనార్హం. ఇందుకు విద్యార్థుల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలకు ఈ మార్కులు దోహద పడనుండడంతో వారు సైతం కాసులు ముట్టజెబుతున్నారు. కాగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం ప్రాక్టికల్‌లో 30 మార్కులకు గాను 11 నుంచి 24 లోపు మాత్రమే మార్కులు వేస్తున్న అధికారులు ప్రైవేట్ విద్యార్థులకు మాత్రం 30 మార్కులకు 29 నుంచి 30 వరకు వేయడం గమనార్హం. అయితే ఈ విషయమై ఓ అధికారిని అడగగా ప్రైవేట్ కళాశాలల్లో రూ.1500 నుంచి రూ.2వేల వరకు మాత్రమే ఇస్తున్నారని చెప్పడం కొసమెరుపు. ఇంత జరుగుతున్నా ఇంటరీ్మడియెట్ బోర్డు అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారు మౌనంగా ఉండటం పట్ల వారికి కూడా వాటా అందుతుందా అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మా దృష్టికి రాలేదు ప్రాక్టికల్ పరీక్షల్లో ఎక్స్టర్నల్ విధులు నిర్వహించే లెక్చరర్లకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు డబ్బులు ఇస్తున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే చర్యలు తీసుకుంటాం. – దస్రునాయక్, డీఐఈవో, ఆదిలాబాద్ -
పరీక్షకు సిద్ధం
ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బుధ వారం ప్రథమ, గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 52 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం కానుండగా.. వాటిలో 27 ప్రైవేటు, 25 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 34,679 మంది పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనుండగా.. ఉదయం 8 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించనున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు జనరల్ విభాగంలో 14,532, ఒకేషనల్‌లో 2,077 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 16,136, ఒకేషనల్ విభాగంలో 1,934 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నడుమ ప్రశ్నపత్రం బండిళ్లను తెరవనున్నారు. పరీక్షల హైపవర్ కమిటీ కన్వీనర్‌గా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ వ్యవహరించగా.. సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఆర్జేడీ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబుతోపాటు సీనియర్ ప్రిన్సిపాల్ ఒకరు ఉండనున్నారు. అలాగే డీఈసీ కమిటీలో ముగ్గురు అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ మూడు బృందాలు ఉండగా.. వీటిలో జూనియర్ లెక్చరర్, డిప్యూటీ తహసీల్దార్, ఏఎస్ఐ స్థాయి అధికారులు ఉంటారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్ష కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్లు పరీక్ష సమయానికి గంట ముందు, తర్వాత మూసివేయాల్సి ఉంటుంది. నిమిషం నిబంధన అమలు పరీక్షకు గంట ముందు నుంచే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఉదయం 9 నుంచి పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా.. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, విద్యుత్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ప్రశాంతంగా పరీక్షలు రాయండి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. విద్యార్థులు పరీక్ష సమయానికంటే ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. నిమిషం నిబంధన అమలులో ఉంటుంది. – రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, ఖమ్మం -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 27 (బుధవారం) నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 16 వరకు జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. మొత్తం 9,42,719 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,52,550 మంది ఉండగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,277 పరీక్ష కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటుచేసింది. వీటిలో 1,277 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1,277 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 24,508 మంది ఇన్విజిలేటర్లను నియమించింది. 1,277 పరీక్ష కేంద్రాల్లో 40 సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 32 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని బోర్డు నిర్ణయించింది. పరీక్షలు పూర్తయ్యే వరకు సిట్టింగ్ స్క్వాడ్స్ అక్కడే ఉంటాయి. అలాగే ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాల బండిల్స్ విప్పే చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాల నిఘా ఉంచనుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా నిమిషం నిబంధన అమలుచేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ కె.అశోక్ తెలిపారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఉదయం 8:45 గంటలకల్లా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని పేర్కొన్నారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టంచేశారు. విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని, ఇందుకోసం సెంటర్ లొకేటర్ మొబైల్ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. అందులో పరీక్ష కేంద్రం ఫొటోతో పాటు గూగుల్ రూట్ మ్యాప్ ఉంటుందని వివరించారు. వెబ్సైట్లో హాల్‌టికెట్లు..: హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు ఇప్పటికే కాలేజీలకు పంపించింది. ఫీజులు చెల్లించలేదనే కారణంతో కాలేజీలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడంలేదన్న ఫిర్యాదుల నేఫథ్యంలో వెబ్సైట్లోనూ హాల్‌టికెట్లను ఉంచింది. bie.telangana.gov.in వెబ్సైట్ నుంచి విద్యార్థులు తమ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా పరీక్షకు వెళ్లవచ్చని, దానిపై ఎవరి సంతకం అవసరం లేదని అశోక్ తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులపాలు చేసే కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థులూ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి - హాల్‌టికెట్ లేకుండా పరీక్షకు అనుమతించరు. హాల్టికెట్లలో పొరపాట్లు ఉంటే మాత్రం సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా జిల్లా ఇంటర్ విద్యా అధికారిని సంప్రదించాలి. - జవాబు పత్రంలో 24 పేజీలు ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. బార్కోడ్, సబ్జెక్టు వివరాలను కూడా సరిచూసుకోవాలి. - మొబైల్స్, పేజర్లు, కాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, పేపర్లు పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఒకవేళ వాటిని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్తే మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేస్తారు. - కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్, ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. - పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తారు. - పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తితే హైదరాబాద్‌లోని హెల్ప్‌లైన్ కేంద్రానికి (040–24601010, 040–24732369) ఫోన్ చేయవచ్చు. -
ప్రేమలో పడ్డాను.. పాస్ చేయండి..
ముజఫర్‌నగర్, ఉత్తరప్రదేశ్ : ప్రేమ వల్లే తాను పరీక్ష సరిగా రాయలేకపోతున్నానంటూ ఓ విద్యార్థి జవాబు పత్రంలో రాసుకొచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షల్లో చోటు చేసుకుంది. రసాయన శాస్త్ర పరీక్షకు తాను సరిగా చదవలేదని, అందుకు తన ప్రేమే కారణమని చెప్పుకొచ్చాడు సదరు విద్యార్థి. ‘పూజను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ మనిషి ఒక్కచోట కుదురుకోనివ్వదు. కూర్చొనివ్వదు. నిల్చొనివ్వదు. అందుకే పరీక్షకు సరిగా చదవలేకపోయాను.’ అంటూ విద్యార్థి జవాబు పత్రంలో రాశాడు. జవాబు పత్రంలో మిగతా పేజీలన్నింటిలో హార్ట్ సింబల్‌ను అందంగా గీశాడు. దీనిపై మాట్లాడిన ముజఫర్‌నగర్ స్కూల్ ఇన్స్పెక్టర్ మునేష్ కుమార్.. జవాబు పత్రాల్లో చాలామంది విద్యార్థులు తమ బాధలను రాశారని చెప్పారు. కొందరైతే పాస్ చేయాలంటూ డబ్బును పిన్ చేసి పంపారని తెలిపారు. ఒక విద్యార్థి అయితే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని కూడా చూశాడని చెప్పారు. తనకు తల్లి లేదని, ఫెయిల్ అయితే తండ్రి చంపేస్తాడని ఆ విద్యార్థి జవాబు పత్రంలో రాశాడని వివరించారు. మరొక విద్యార్థి తనను పాస్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రాశాడని తెలిపారు. -
టాటా... వీడుకోలు
సాక్షి, సిటీబ్యూరో: ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ముగిశాయి. దీంతో చివరి రోజు విద్యార్థులు సందడి చేశారు. ఒకరినొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. సెల్ఫీలు, ఫొటోలతో తమ మధుర జ్ఞాపకాలను సెల్ఫోన్లలో బంధించుకుని తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా ఇళ్లకు బయలుదేరారు. రెండేళ్ల పాటు కలిసి చదువుకున్న తోటి స్నేహితులను వదిలి వెళ్తుండడంతో కొందరు భావోద్వేగానికి గురయ్యారు. నగరంలోని పలు కళాశాలలు, హాస్టళ్ల వద్ద ఇవే దృశ్యాలు కన్పించాయి. -
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సర ద్వితీయ భాష పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలు రాసేందుకు 4,82,360 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 4,61,516 మంది హాజరయ్యారు. 20,844 మంది (4.32 శాతం) గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. వికారాబాద్, కరీంనగర్, సూర్యాపేట్‌లో మూడు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయినట్లు తెలిపింది. రేపటి నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు.. మార్చి 2 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు తెలిపింది. ద్వితీయ సంవత్సర పరీక్షల్లో భాగంగా మొదటి రోజు ద్వితీయ భాష పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఆ పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తు: కడియం పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దూరప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బందోబస్తు కల్పించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా ముందే కేంద్రాల వద్ద ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పరీక్షల సమయంలో కేంద్రాలకు సమీపంలో ఉండే జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. -
28 నుంచి ఇంటర్ పరీక్షలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఇంటర్మీడియెట్ పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభంకానున్నాయని, ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని ఆర్ఐఓ బి.ప్రభాకరరావు సూచించారు. శనివారం స్థానిక సెయింట్ థెరిస్సా కళాశాలలో ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై 102 పరీక్షా కేంద్రాల సీఎస్‌లు, డీఓలు, ఏసీఎస్‌లతో సమావేశం నిర్వహించారు. వి ద్యార్థులు ఉదయం 8.45 గంటలకే వారికి కేటాయించిన సీట్లలో కూర్చునేలా సం బంధిత అధికారులు చర్యలు తీసుకో వాలని ఆయన ఆదేశించారు. పరీక్షా కేం ద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసేలా సంబంధిత అధికారులతో చర్చించి ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రాల్లో గాలి, వెలుతురు సరిగా ఉండేలా చూడటంతోపాటు ప్రాథమిక చికిత్సకిట్లు ఉంచేలా వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు బెంచీలపై కూర్చుని మాత్రమే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. -
రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారు. ఒకేసారి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలవుతాయి. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విద్యార్ధులు పరీక్ష ఫలితాలను www.sakshi.com, www.sakshieducation.com లో చూసుకోవచ్చు. -
బాలికలదే హవా
– ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు – జూనియర్ ఇంటర్లో జిల్లాకు 9వ స్థానం – సీనియర్ ఇంటర్లో 10వ స్థానం – ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదల - ప్రభుత్వ కళాశాలల్లో పెద్దపప్పూరు టాప్ అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బాలికలు హవా కొనసాగింది. గురువారం విడుదలైన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే మొదటిస్థానంలో నిలిచారు. మొదటి సంవత్సరం ఫలితాలు గతేడాదికంటే ఈ సారి మెరుగుపడగా, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెనుకబడ్డాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో గతేడాది జిల్లా 11వ స్థానంలో నిలిచింది. ఈసారి 54 శాతం ఉత్తీర్ణతతో 9వ స్థానానికి ఎగబాకింది. జిల్లాలో మొత్తం 33,244 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా 18,076 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 16,356 మంది బాలురకు గాను 7,990 మంది 49 శాతం, 16,888 మంది బాలికలకు గాను 10,086 మంది 60 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో తగ్గిన ఉత్తీర్ణత జిల్లాలోని 39 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతేడాదికంటే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాది 40 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా ఈసారి 35.96 శాతానికి పడిపోయింది. మొత్తం 7,124 మంది విద్యార్థులకు గాను 2,562 మంది ఉత్తీర్ణత సాధించారు. పెద్దపప్పూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. ఇక్కడ 66 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 86.36 శాతంతో 57 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే రొద్దం కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. 111 మంది విద్యార్థులకు గాను 68.47 శాతంతో 76 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గుడిబండ కళాశాల తృతీయ స్థానంలో నిలిచింది. 189 మంది విద్యార్థులకు గాను 56.61 శాతంతో 107 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక రాయదుర్గం జూనియర్ కళాశాల చివరిస్థానంలో నిలిచింది. 401 మంది విద్యార్థులకు గాను 17.71 శాతంతో కేవలం 71 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎయిడెడ్ కళాశాలల్లో 39.19 శాతం ఉత్తీర్ణత ఎయిడెడ్ కళాశాలల్లో 39.19 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అనంతపురం నగరంలోని ఎస్ఎస్ఎస్ బాలికల కళాశాల ప్రథమస్థానంలో నిలిచింది. ఇక్కడ 479 మంది విద్యార్థినులకు గాను 48.02 శాతంతో 230 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే గోరంట్ల ఎస్ఏపీఎస్ కళాశాల చివరిస్థానంలో నిలిచింది. 154 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 15.58 శాతంతో కేవలం 24 మంది గట్టెక్కారు. దిగజారిన ద్వితీయ సంవత్సరం స్థానం ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మన జిల్లా స్థానం రాష్ట్రంలో గతేడాదికంటే ఈసారి కిందకు దిగజారింది. గతేడాది 8వ స్థానంలో ఉండగా ఈసారి 10వ స్థానానికి పడిపోయింది. మొత్తం 28,230 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 70 శాతంతో 19,747 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 13,761 మంది బాలురకు గాను 8,945 మంది 65 శాతం, 14,469 మంది బాలికలకు గాను 10,802 మంది 75 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో 63.55 శాతం ఉత్తీర్ణత జిల్లాలోని 39 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది 63.55 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదికంటే 0.55 శాతం మెరుగుపడింది. మొత్తం 5,918 మంది విద్యార్థులకు గాను 3,761 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ కూడా పెద్దపప్పూరు జూనియర్ కళాశాలే జిల్లా ప్రథమస్థానం దక్కించుకుంది. ఈ కళాశాలలో 85 మంది విద్యార్థులకు గాను 94.12 శాతంతో 80 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కంబదూరు కళాశాల ద్వితీయస్థానంలో నిలిచింది. 93 మంది విద్యార్థులకు గాను 86.02 శాతంతో 80 మంది ఉత్తీర్ణత సాధించారు. చిలమత్తూరు కళాశాల తృతీయస్థానంలో నిలిచింది. 87 మంది విద్యార్థులకు గాను 81.61 శాతంతో 71 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక నల్లమాడ కళాశాల చివరి స్థానంలో నిలిచింది. ఇక్కడ 72 మంది విద్యార్థులకు గాను 38.89 శాతంతో 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ‘ఎయిడెడ్’లో 56.71 శాతం ఉత్తీర్ణత ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలోని ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 56.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,208 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 685 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ కూడా నగరంలోని ఎస్ఎస్ఎస్ బాలికల కళాశాల ప్రథమస్థానంలో నిలిచింది. 410 మంది విద్యార్థినులకు గాను 62.93 శాతంతో 258 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎస్ఎస్బీఎన్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. 283 మంది విద్యార్థులకు గాను 56.18 శాతంతో 159 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక గోరంట్ల ఎస్ఏపీఎస్ కళాశాల ఇక్కడ కూడా చివరిస్థానంలో నిలిచింది. 117 మంది విద్యార్థులకు గాను 28.21 శాతంతో కేవలం 33 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. నెట్ కేంద్రాలు, సెల్ఫోన్లతో సందడి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు వారి బంధువులు నెట్ సెంటర్ల వద్ద, ఆండ్రాయిడ్ ఫోన్లతో సందడి చేశారు. మార్కులు తెలుసుకునేందుకు ఎగబడ్డారు. ఫలితాలు వెలువడగానే అనంతపురం నగరంతో పాటు హిందూపురం, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి, ఉరవకొండ, గుత్తి, పుట్టపర్తి, మడకశిర పట్టణాల్లోని నెట్ కేంద్రాలు కిటకిటలాడాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందంగా గడిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం గత ఫలితాలు ఇలా... సంవత్సరం శాతం 2008 45 2009 33.53 2010 36 2011 44 2012 47 2013 45.5 2014 49 2015 53 2016 47 2017 54 ఇంటర్ ద్వితీయ సంవత్సరం గత ఫలితాలు ఇలా... సంవత్సరం శాతం 2008 60 2009 52.86 2010 53 2011 57 2012 55 2013 63 2014 65 2015 66 2016 69 2017 70 -
కోతలు ప్రారంభం
► జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతతో జనం అవస్థలు ► పరీక్షల కాలం కావడంతో విద్యార్థుల ఆందోళన ► కోతలేమీ లేవంటున్నఅధికారులు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని పాలకులు చెబుతున్న మాటలు కోతలని తేలిపోయింది. వేసవి ప్రారంభంలోనే విధిస్తున్న అప్రకటిత కోతలు జనానికి విసుగు తెప్పిస్తున్నాయి. పరీక్షల సీజన్ కావడంతో పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులకు తరచూ కరెంటు పోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటుందో నని ప్రజలు భయపడుతున్నారు. అయితే సంబంధిత అధికారులు మాత్రం అదేమీ లేదని చెబుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అరసవల్లి: కోతల కాలం వచ్చేసింది. వేసవికాలం తొలి రోజుల నుంచే విద్యుత్ కోతలు తప్పడం లేదు. కావాల్సిన విద్యుత్ సర్‌ప్లస్‌లో ఉందని. ఎక్కడా కోతలంటూ లేవని ఓ వైపు విద్యుత్ శాఖాధికారులు చెప్తుంటే....మరోవైపు గత రెండ్రోజులుగా తరచూ విధిస్తున్న కోతలతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. జిల్లాలో విద్యుత్ విని యోగదారులు సుమారు 18 లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి సరిపడా విద్యుత్ సరఫరా ఉందని, కోతలు విధించే అవకాశాలే లేవంటూ విద్యుత్ శాఖాధికారులు చెబుతుండగా.. తాజా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అప్రకటిత కోత: జిల్లాలోని పలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా గంటల తరబడి నిలిచిపోయింది. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్న సమయాల్లో నాలుగు గంటలకు పైగానే అప్రకటిత కోతలు విధిస్తున్నారు. కొన్ని గ్రామాకు రాత్రి వేళల్లో కూడా సరఫరా నిలిపి వేస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్ర, శనివారాల్లో అప్రకటిత కోతలు విధించడంతో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అవస్థలు పడ్డారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా, మరికొద్ది రోజుల్లో డిగ్రీ, పదో తరగతి పరీక్షలు మొదలుకానున్నాయి. వేసవి మొదట్లోనే ఇలా కోతలుంటే..రానురాను ఇంకా ఏమేరకు కోతలుంటాయో అని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన జరిగిన ఎంఎల్సీ ఎన్నికల సమయంలో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో చీకట్లోనే బ్యాలెట్బాక్సులకు సిబ్బంది సీళ్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్రకటిత కోతతో చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమలతో పాటు, వెల్డింగ్, మిల్లులు, జిరాక్స్, నెట్ సెంటర్లు, ఐస్‌క్రీం పార్లర్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకపక్క నగదు లేక జనం అవస్థలు పడుతుంటే.. అరకొరగా పని చేస్తున్న ఏటీఎంలు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పనిచేయకుండా పోతున్నాయి. రోజుకు 40 లక్షల యూనిట్లు వినియోగం: జిల్లాకు 220 కేవీ టెక్కలి, గరివిడి ఉపకేంద్రాలతో పాటు 132/33 కేవీ చిలకపాలెం, పాలకొండ, రాజాం, నరసన్నపేట, ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, పైడిభీమవరం, పాతపట్నం తదితర తొమ్మిది విద్యుత్ ఉపకేంద్రాల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. జిల్లాలో ఉన్న మొత్తం గృహ, గృహేతర వినియోగదారులకు రోజుకు 40 లక్షల యూనిట్లు అవసరం. అయితే వేసవి కాలంలో కావాల్సిన డిమాండ్‌కు తగిన సరఫరా ఉండదనేది ఈ కోతలతో స్పష్టమవుతోంది. విద్యుత్ కోతలు ఉండవని.. 24 గంటల సరఫరా ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అవన్నీ కోత లేనని తేలిపోయింది. ఇదిలావుంటే కేవలం మరమ్మతుల కారణంగానే విద్యుత్ కోతలు విధిస్తున్నామంటూ సంబంధిత అధికారులు కారణాలు చెబుతున్నారు. లైన్ క్లియరెన్స్‌తోనే అంతరాయం: గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉన్న మాట వాస్తవమే. అయితే గాలులు వీయడంతో పలుచోట్ల లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) తీసుకుని విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు చేపడుతున్నాం. అందుకే సరఫరా నిలిపివేశాం. ఎటువంటి కోతలు లేవు. సీఎండీ ఆదేశాల మేరకు ప్రతి శనివారం లైన్లకు తగిలే చెట్లు కొట్టడం వంటి పనులు చేపడుతున్నాం. విద్యుత్ సరఫరా జిల్లాలో సర్‌ప్లస్‌లో ఉంది. కోతలుండే అవకాశమే లేదు. ---డి.సత్యనారాయణ, ఎస్ఈ, విద్యుత్ శాఖ ఇంటర్ పరీక్షలు రాస్తున్నాం. గంటల కొలది కరెంట్ ఉండటం లేదు. దీంతో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కరెంట్ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. --- కె.శ్రీనివాస్, అరసవల్లి విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతుంది. దీంతో వెల్డింగ్ పనులు మధ్యలో ఆగిపోతున్నాయి. షెడ్లు వేయడానికి ఎత్తులో ఉండి పనిచేయాల్సి వస్తుంది. మద్యలో తరచుగా కరెంట్ వస్తూ, పోతూ ఉండడంతో పనులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. --ఆర్.దాలినాయుడు, వప్పంగి అంధకారంలో వీరఘట్టం: వీరఘట్టం మండల ప్రజలు శనివారం రోజంతా విద్యుత్ కష్టాలను ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పలుమార్లు సరఫరా పోయినప్పటికీ సర్దుకుపోయారు. అయితే మండలానికి విద్యుత్‌ను సరఫరా చేసే వీరఘట్టంలోని సబ్‌స్టేషన్ వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో విద్యుత్ తీగ తెగిపోవడంతో మండలం మొత్తం కరెంటు సరఫరా నిలిచిపోయింది. సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నం రాత్రి పదిన్నర గంటల వరకూ కొలిక్కిరాలేదు. దీంతో పిల్లలు.. వృద్ధులు..చిన్నారులు..అవస్థలు ఎదుర్కొన్నారు. విక్రంపురం గ్రామానికి చెందిన చీపురుపల్లి అనూష అనే ఆరేళ్ల చిన్నారి ఉబ్బసం కారణంగా ఊపిరి తీసుకోవడానికి అవస్థలు పడింది. దీంతో తల్లిదండ్రులు వీరఘట్టంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొని వచ్చారు. అయితే కరెంటు లేకపోవడంతో బ్రితింగ్మిషన్ పని చేయలేదు. దీంతో సబ్–స్టేషన్ కార్యాలయానికి మాత్రం కరెంటు ఉండడంతో బాలికను అక్కడకు తీసుకొని వెళ్లి కృత్రిమశ్వాసను అందించడంతో ప్రమాదం నుంచి బయటపడింది. -
ఒకే గదిలో ఐదుగురు డిబార్
యాదగిరిగుట్ట: ఇంటర్ ద్వితియ సంవత్సరం పరీక్షల్లో భాగంగా ఒకే గదిలో పరీక్ష రాస్తున్న ఐదుగురు విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఈ సంఘటన జరిగింది. నేడు జరుగుతున్న ఇంటర్ ద్వితియ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష సందర్భంగా వీరంతా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతు పట్టుబడ్డారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించిన రిజనల్ జాయింట్ డైరెక్టర్ సుహాసిని ఇది గుర్తించి అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చే సమయంలో సరిగ్గా తనిఖీలు నిర్వహించవకపోవడం పై మండిపడ్డారు. కామారెడ్డిలో మరో ముగ్గురు: ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రంలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు డిబార్ అయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీకి వచ్చిన సమయంలో ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుపడటంతో స్క్వాడ్ అధికారి నాగరాజు వారిని డిబార్ చేశారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
-
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
► రెండు జిల్లాల్లో 88 సెంటర్లు, 56,375 మంది విద్యార్థులు ► ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ► నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ► మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే డిబారే ► సాక్షి ప్రత్యేక ఇంటర్య్వూలో ఇంటర్ విద్యాశాఖాధికారి ఆండ్రూస్ ఖమ్మం జెడ్పీసెంటర్: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నాం. ప్రణాళికాబద్ధంగా పరీక్షా కేంద్రాలను గుర్తించాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. విద్యా, వైద్య, ఆరోగ్య, పోలీస్, ఆర్టీసీ, పోస్టల్ డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తూ చర్యలు తీసుకుంటున్నామని ఆదివారం సాక్షికి ఇచ్చిన ప్రత్యేకఇంటర్య్వూలో ఇంటర్ విద్యాశాఖాధికారి ఆండ్రూస్ తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై పలు అంశాలను వివరించారు. ఇంటర్య్వూ ఆయన మాటల్లోనే... సాక్షి: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎన్ని పరీక్షా కేంద్రాలు? డీఐఈఓ: ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మొత్తం 88పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వాటిలో ఖమ్మంలో 55 సెంటర్లు వీటిలో 18 ప్రభుత్వ, ఒకటి ఎయిడెడ్, ఆరు సోషల్ వెల్ఫేర్, ఒకటి మోడల్ స్కూల్, ఒక హైస్కూల్, 28 ప్రైవేటు కళాశాలలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 33 సెంటర్లు ఉన్నాయి. వీటిలో 13 ప్రభుత్వ, 3 సోషల్వెల్ఫేర్, 4 ట్రైబల్ వెల్ఫేర్, 13 ప్రైవేటు కళాశాలలున్నాయి. సాక్షి: రెండు జిల్లాల్లో ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు? డీఐఈఓ: రెండు జిల్లాల్లో 56,375 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాలో 35,744 మంది, ప్రథమ సంవత్సరం 18 వేలు, ద్వితీయ సంవత్సరం 17,744 మంది రాయనున్నారు. భద్రాద్రి జిల్లాలో 20,631 మంది విద్యార్థులు కాగా, వీరిలో మొదటి సంవత్సరం 8,111, ద్వితీయ సంవత్సరం 8,281 మంది విద్యార్థులున్నారు. సాక్షి: పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? డీఐఈఓ: మార్చి 1 నుంచి 14 వరకు పరీక్షలు జరగనున్నాయి. 9న జరగాల్సిన పరీక్ష 19న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మాస్‌కాపీయింగ్‌కుపాల్పడితే డిబార్‌చేస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందే. సాక్షి: పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఐఈఓ: జిల్లాల్లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. మాస్ కాపీయింగ్ జరగకుండా ఇన్విజిలేటర్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నాం. పరీక్షలు జంబ్లింగ్ విధానంలో జరగనున్నాయి. సాక్షి: సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారా? జిల్లాలో ఎన్ని ఉన్నాయి? డీఐఈఓ: గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఒక సమస్యాత్మక కేంద్రం ఉంది. సాక్షి: విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? డీఐఈఓ: విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కింద కూర్చొని పరీక్షలు రాయకుండా ఏర్పాట్లు చేశాం. అన్ని కేంద్రాల్లో డెస్క్ బెంచీలు ఏర్పాటు చేస్తున్నాం. మంచినీరు, విద్యుత్, మెడికల్ క్యాంపులు ఉండేలా చూస్తున్నాం. సాక్షి: ప్రాక్టికల్స్ నిర్వహణ సక్రమంగా జరగలేదన్న వాదన ఉంది కదా? డీఐఈఓ: ప్రాక్టికల్స్ నిర్వహణ పక్కాగా నిర్వహించాం. ప్రతిభ ఉన్నవారికే మార్కులు వస్తాయి. దీనిపై ఎలాంటి అనుమానాలకు తావు లేదు. పనితనాన్ని బట్టే మార్కులుంటాయి. సాక్షి: పరీక్ష కేంద్రంలోకి ఎన్ని గంటలకు అనుమతిస్తారు? డీఐఈఓ: 8 గంటల నుంచి విద్యార్థులను అనుమతిస్తాం. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు. ఇవే ఆదేశాలు అన్ని సెంటర్లకు జారీ చేశాం. సాక్షి: పరీక్షా కేంద్రాలపై ఎలాంటి నిఘా ఉంది? డీఐఈఓ: ప్రతికేంద్రం వద్ద పోలీస్‌బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షల నిర్వహణపై హైపవర్ కమిటీ మెంబర్లు ఉన్నారు. రెండుజిల్లాలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్, 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఏడుగురు సిట్టింగ్ స్క్వాడ్, 88 మంది డిపార్ట్ మెంటల్ అధికారులు, నలుగురు డీఈసీ మెంబర్లు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు. -
ఇంటర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్?
♦ పరస్పర అవగాహనతో అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు కాలేజీలు ♦ సూర్యాపేటలో గణితం పేపర్ లీకయిందంటూ ప్రచారం... అదేం లేదన్న బోర్డు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు పరస్పర అవగాహనతో ఉమ్మడిగా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు తమ విద్యార్థుల కోసం ఈ తరహా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు పరీక్షల విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లే పేర్కొంటున్నారు. ఆ తరహాలోనే బుధవారం గణితం పేపర్-2ఏ పరీక్ష సందర్భంగా సూర్యాపేటలో పేపర్ లీకజీ గందరగోళం చోటుచేసుకుందని చెబుతున్నారు. బుధవారం సూర్యాపేటలో గణితం పేపర్ లీక్ అయిందం టూ ప్రచారం జరిగింది. పలు టీవీ చానెళ్లు స్క్రోలింగ్‌లు కూడా వేశాయి. అయితే ఈ ఘటనపై నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, రీజ నల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ విచారణ జరిపినట్లు... అక్కడ ఎలాంటి పేపర్ లీకేజీ జరగలేదని తేల్చినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆ వదంతులు మినహా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొంది. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, ఇంటర్ బోర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ లీకేజీ ప్రచారాన్ని ఖండించింది. కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల కుట్రలో భాగంగానే దీన్ని పరిగణించాలని పేర్కొంది. కానీ సూర్యాపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని పలు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఉమ్మడిగా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నాయని జూనియర్ లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. పక్కా ప్రణాళిక, కాలేజీల మధ్య ఒప్పందాల మేరకు పరీక్ష ప్రారంభమయ్యాక సెల్‌ఫోన్ ద్వారా ప్రశ్నపత్రాన్ని బయటకు లీక్ చేస్తున్నారని... జవాబులను తిరిగి సెల్‌ఫోన్ ద్వారానే పరీక్ష కేంద్రాల్లోకి చేరవేస్తున్నారని పేర్కొంటున్నారు. ఆ తరహాలోనే సూర్యాపేటలో బుధవారం పరీక్ష సందర్భంగా గందరగోళం చోటు చేసుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టాలని తెలంగాణ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇంటర్ పరీక్షలకు 94.38 శాతం హాజరు బుధవారం జరిగిన ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్, బోటనీ, సివిక్స్ పరీక్షలకు 94.38 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు బోర్డు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ మొత్తం 57 మంది విద్యార్థులు అధికారులకు పట్టుబడ్డారు. వీరిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. -
సోషల్ మీడియాలో ఇంటర్ ప్రశ్నాపత్రాలు?
సూర్యాపేట : రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపియింగ్ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. బుధవారం జరుగుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం మాథ్య్-ఏ పేపర్ పరీక్ష జరుగుతుండగా ఈ విషయం బయటపడింది. నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని కొన్ని ప్రైవేటు కళాశాలలకు చెందిన అధ్యాపక బృందమే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. పరీక్ష జరుగుతున్న సమయంలోనే ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకెళ్లి.. వాటికి సరైన సమాధానాలు రాసి... తీసుకొచ్చి... విద్యార్థులకు పంచుతున్నట్లు అధికారులకు సమాచారం. మరో వైపు ఏపీలోని నెల్లూరుజిల్లాలో కూడా కాపీయింగ్ జోరుగా జరగుతోంది. జిల్లాలోని రాపూర్ లోని ఓ ఎగ్గామ్ సెంటర్ లో మాస్ కాపీయింగ్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. సెకండియన్ మ్యాథ్స్ , సివిక్స్ ప్రశ్నా ప్రతాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నట్టు సమాచారం. ఈరోజు ఉదయం 8 గంటలకే ప్రశ్నాప్రత్రాలు లీక్ అయ్యాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికి పోలీసులకు సమాచారం ఫిర్యాదు చేశారు. ఘటనకు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మార్చి 2 నుంచి ఇంటర్ పరీక్షలు
-
మార్చి 2 నుంచి ఇంటర్ పరీక్షలు?
- ఒకవేళ కుదరకుంటే 9 నుంచి నిర్వహణకు బోర్డు కసరత్తు - రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు - ఏపీ కంటే ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 2 నుంచి ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు కసరత్తు చేస్తోంది. జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల తేదీలు, సెలవులను పరిగణనలోకి తీసుకొని ఒకవేళ 2 నుంచి నిర్వహణ సాధ్యం కాకుంటే అదే నెల 9వ తేదీ నుంచి నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తొలుత మార్చి 11 నుంచి పరీక్షలు నిర్వహిం చాలని ఉన్నతాధికారులు భావించినా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలను అదే తేదీ నుంచి నిర్వహించేందుకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు ఇప్పటికే షెడ్యూలు/టైంటేబుల్ జారీ చేయడంతో అంతకంటే ముందుగానే పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ మొదటి వారంలో (4వ తేదీన నిర్వహించే అవకాశం) ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ రాత పరీక్షను నిర్వహించే అవకాశం ఉండటం, అదే నెల నుంచి జూన్ వరకు వివిధ జాతీయస్థాయి పోటీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో మార్చిలోనే ఇంటర్ పరీక్షలను పూర్తి చేయాలని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా విద్యార్థులు జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేం దుకు సులభంగా ఉంటుందని, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూడవచ్చని పేర్కొంటున్నాయి. ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రాక్టికల్స్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ వంటి పరీక్షలను ఫిబ్రవరిలోనే బోర్డు నిర్వహించనుంది. మరోవైపు మార్చి మూడో వారంలో పదో తరగతి పరీక్షలను (మార్చి 16 లేదా 18వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే ఇంటర్ పరీక్షలను పూర్తి చేసేలా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. గత విద్యా సంవత్సరం ఇంటర్ పరీక్షలను 2015 మార్చి 9 నుంచి బోర్డు నిర్వహించింది. ప్రథమ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 22న, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 27న ప్రకటించింది. -
ఆంధ్రా విద్యార్థులకు తెలంగాణ హాల్ టికెట్లు
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం ఇంటర్ విద్యార్థులకు శాపంగా మారింది. రాష్ట్రం విడిపోవడంతో ఉన్నత విద్యాశాఖను కూడా విభజించారు. కానీ కొంతమంది ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లు తెలంగాణా బోర్డు నుంచి రావడంతో వారు అవాక్కయ్యారు. బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలో ఉన్న 7 పరీక్ష కేంద్రాల్లో నలుగురు విద్యార్థులకు తెలంగాణ బోర్డు నుంచి హాల్ టికెట్లు వచ్చాయి. గురువారం నుంచి ప్రారంభం కానున్న ద్వితీయ సంవత్సరం విషయంలోనూ సూరిపోగు రాజ్‌కుమార్ అనే విద్యార్థికి తెలంగాణ హాల్ టికెట్ వచ్చింది. మార్కుల జాబితా, ధ్రువీకరణ పత్రం కూడా తెలంగాణ బోర్డు నుంచి వస్తే మన రాష్ట్రంలో ఉన్నత చదువుకు, ఉద్యోగాలకు అనర్హుడుగా అవుతానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రింటింగ్ ప్రెస్ వల్లే ఇబ్బందులు ఈ విషయమై ఇంటర్మీడియెట్ ప్రాంతీయ బోర్డు అధికారి రమేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినా హైదరాబాద్‌లో ప్రింటింగ్‌ప్రెస్ ఒకటేనని అందువలనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయన్నారు. చీరాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నుంచి హాల్‌టికెట్లు పొందిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తామని, ఆందోళన చెందనవసరం లేదన్నారు. తెలంగాణ బోర్డు నుంచి వచ్చిన హాల్టికెట్లున్న విద్యార్థులు సంబంధిత ప్రిన్సిపాళ్ల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సమస్యలు రాకుండా చూస్తానన్నారు. -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ఏలూరు సిటీ :ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు సజావుగా సాగేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అర్ధగంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్మీడియెట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి బి.వెంకటేశ్వరరావు కోరారు. ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్ష నేటితో ప్రారంభమవుతుంది. ఈ పరీక్షలకు సంబంధించి ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలందించేందుకు ప్రథమ చికిత్స శిబిరం, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. విద్యార్థులెవరూ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకురావద్దని అధికారులు కోరుతున్నారు. ఫస్ట్ ఇంటర్ విద్యార్థులు 33,394 మంది బుధవారం నిర్వహించే ఫస్టియర్ పరీక్షకు జిల్లాలో 33,394 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది 68109 మంది పరీక్షలు రాయనున్నారు. ఇక ఫస్ట్ ఇంటర్ విద్యార్థులు 33394 మంది ఉండగా వారిలో జనరల్ కోర్సులకు సంబంధించి 30297 మంది ఉంటే బాలురు 13687 మంది, బాలికలు 16610 మంది, వోకేషనల్ కోర్సులకు సంబంధించి 3097 మందిలో బాలురు 1735, బాలికలు 1362 మంది పరీక్షలు రాస్తారు. సెకండ్ ఇంటర్ పరీక్షలకు 34715మంది హాజరుకానుండగా వారిలో జనరల్ విద్యార్థులు 30907మంది ఉంటే బాలురు 14296 మంది, బాలికలు 16611మంది, వోకేషనల్ 3808 మందిలో బాలురు 2018, బాలికలు 1790మంది ఉన్నారు. పరీక్షల షెడ్యూల్ ఇదే ఫస్ట్ ఇంటర్ పరీక్ష టైం టేబుల్ 11న సెకండ్ లాంగ్వేజ్ -1, 13న ఇంగ్లిష్ -1 16న గణితం-1 ఎ, బొటనీ -1, సివిక్స్-1, ఫిజియాలజీ -1 18న గణితం -1 బీ, జువాలజీ -1, హిస్టరీ-1 20న ఫిజిక్స్ -1, ఎకానమిక్స్ -1, క్లాసికల్ లాంగ్వేజ్-1 24న కెమిస్ట్రీ -1, కామర్స్ -1, సోషియాలజీ -1, ఫైన్స్‌ఆర్ట్స్, మ్యూజిక్ -1 26 న జియాలజీ -1, హోమ్ సైన్స్ -1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -1, లాజిక్ -1, బ్రిడ్జి కోర్సు గణితం -1 30 న మోడ్రన్ లాంగ్వేజ్ -1, జాగ్రఫీ -1 సెకండ్ ఇంటర్ టైంటేబుల్ 12న లాంగ్వేజ్ పేపరు-2, 14న ఇంగ్లిష్ పేపరు-2 17న గణితం పేపరు-2ఎ, బోటనీ పేపరు-2, సివిక్స్ పేపరు-2, ఫిజియాలజీ-2 19న గణితం-2 బీ, జువాలజీ -2, హిస్టరీ-2 23న ఫిజిక్స్ -2, ఎకనమిక్స్-2, క్లాసికల్ లాంగ్వేజ్ -2 25న కెమిస్ట్రీ-2, కామర్స్-2, సోషియాలజీ -2. ఫైన్స్‌ఆర్ట్స్, మ్యూజిక్-2 27న జియాలజీ -2, హోమ్‌సైన్సు-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్-2, బ్రిడ్జికోర్సు గణితం-2 31న మెడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ-2 -
మొదటిరోజు ప్రశాంతం
విద్యార్థుల సంఖ్య 50,655 హాజరైనవారు 46,067 గైర్హాజరైనవారు 4,588 కరీంనగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో పరీక్ష సెంటర్ అడ్రస్ మారడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. నగరంలోని భారతి జూనియర్ కళాశాల కేంద్రం నంబర్ హాల్‌టికెట్‌లో కమాన్‌రోడ్ అని ఉండడం, కళాశాల కోతిరాంపూర్‌లోని బైపాస్‌రోడ్‌లో ఉండడంతో కాసేపు ఉరుకలు పరుగులు పెట్టారు. మొదటి రోజు పరీక్ష కావడంతో విద్యార్థుల వెంబడి వారి తల్లిదండ్రులు, బంధువులు కేంద్రాల వద్దకు తోడుగా వచ్చారు. దీంతో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కడ చూసినా జనం రద్దీ కనిపించింది. నగరంలోని సైన్స్‌వింగ్ కళాశాలలో విద్యార్థులను పరీక్షలకు అనుమతించడంలో పక్షపాతం వహిస్తున్నారని ఆలస్యంగా వచ్చిన కొందరిని అనుమతించి మరికొందరి అడ్డుకున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆర్ఐఓ సుహాసినితోపాటు పరీక్షల కేంద్రం అధికారులు సెంటర్‌ను సందర్శించి వివరాలు ఆరా తీశారు. జిల్లావ్యాప్తంగా పరీక్షల నిర్వహణ సజావుగా సాగినప్పటికీ మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం పరీక్ష రాసేందుకు బెంచీలు ఏర్పాటు చేయకుండా కింద కూర్చోబెట్టి నిబంధనలను బేఖాతరు చేశారు. కళాశాలకు ఎక్కువ మంది విద్యార్థులను కేటాయించడంతో ఇరుకు గదులు సరిపోకపోవడంతో కింద కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహించారు. ఇద్దరు డిబార్... ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో సోమవారం ఇద్దరు విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కోహెడలో ఒకరు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మపురిలో ఒకరు, ఇద్దరు మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతూ పట్టుబడ్డట్లు ఆర్ఐఓ సుహాసిని వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా జనరల్ విభాగంలో 45,233 మందికి 41,691 మంది, ఒకేషనల్ విభాగంలో 5422 మందికి 4,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో జిల్లావ్యాప్తంగా 50,655 మంది విద్యార్థులకు, 46,067 మంది హాజరుకాగా, 4,588 మంది గైర్హాజరయ్యూరు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
నల్లగొండ అర్బన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం జిల్లా వ్యాప్తంగా 115 పరీక్షా కేంద్రాలలో ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సరం లాంగ్వేజ్ పేపర్-1 పరీక్షకు మొత్తం 45,859 మంది విద్యార్థులకు గాను 40,763 మంది విద్యార్థులు హాజరయ్యారు. 5096 మంది గైర్హాజరు అయ్యారు. జనరల్ విభాగంలో 41,367 మంది విద్యార్థులకు గాను 37,092 మంది పరీక్ష రాయగా 4275 మంది గైర్హాజరు అయ్యారు. అదే విధంగా ఒకేషనల్ విభాగంలో 4492 మందికి గాను 3671 మంది హాజరు, 821 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. కాగా జిల్లా కేంద్రంలో ఆర్ఐఓ ఎన్.ప్రకాశ్‌బాబు పలు సెంటర్లను తనిఖీ చేశారు. హై పవర్ కమిటీ (హెచ్పీసీ), జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) సభ్యులు, ఫ్లైయింగ్ స్వ్కాడ్, సిట్టింగ్ స్వ్కాడ్లు 45 సెంటర్లలో తనిఖీలు జరిపారు. జిల్లాలోని వివిధ సెంటర్లలో... మోత్కూరు మండలంలోని అడ్డగూడూరు ప్రభుత్వ, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థినులు 21 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పరీక్షలకు హాజరయ్యారు. గురుకుల విద్యా సంస్థ వారు సమకూర్చిన డీసీఎం వ్యానులో వారు మోత్కూరు మండల కేంద్రంలోని మూడు పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. ప్రథమ సంవత్సరం వారు 79 మంది విద్యార్థులు ఉండగా, ద్వితీయ సంవత్సరం 73 మంది ఉన్నారు. ఇక్కడే సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుండేదని విద్యార్థుల తల్లిదండ్రులన్నారు. గత సంవత్సరం కేవలం ప్రథమ సంవత్సరం విద్యార్థులే ఉండటం వల్ల సెంటర్ కేటాయించలేదని చెప్పిన అధికారులు, ఈయేడు ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నప్పటికీ సెంటర్‌ను కెటాయించలేదు. సూర్యాపేట పట్టణంలో విద్యార్థులకు 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5224 మంది విద్యార్థులకు గాను 4664 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 560 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల్లో 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమించాల్సి ఉంది. కానీ కొన్ని కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల కొరత ఉంది. అంఛనాలకు మించి విద్యార్థులకు పరీక్షలకు హాజరుకావడంతో వివిధ పరీక్షా సెంటర్లలో సరిపోను సీటింగ్ లేక వరండాల్లో ఏర్పాటు చేశారు. వరండాల్లో కింద కూర్చొని పరీక్షలు రాయడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. చౌటుప్పల్ పట్టణంలో ఐదు ఇంటర్ పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓ పరీక్షా కేంద్రాన్ని లక్కారం శివారులోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఇది మండల కేంద్రానికి కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలోనే ఉంది. ఇక్కడికి బస్సు, ఆటో సౌకర్యం ఏదీ లేకపోవడంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. నాంపల్లిలోని పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు సరిపడా బెంచీలు లేక, నేలపైనే కూర్చొని పరీక్ష రాశారు. మర్రిగూడలోని వేమన జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు మండల కేంద్రానికి 2కి.మీ దూరంలో ఉండడంతో వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు బస్ సౌకర్యంలేక విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. -
సర్వం సిద్ధం
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు కేంద్రాల వద్ద 144 సెక్షన్ వెబ్సైట్లోనూ హాల్‌టికెట్లు విద్యారణ్యపురి : జిల్లాలో ఈ నెల 9 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు జనరల్, ఒకేషనల్ విభాగాల్లో మొత్తం 1,04,381 మంది హాజరుకానున్నారు. 9న ప్రారంభం కానున్న ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 48,874 మంది, 10న మొదలయ్యే సెకండియర్ పరీక్షలకు 55,507 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లావ్యాప్తంగా 131 పరీక్ష కేంద్రాలు కేటారుుంచారు. ఇందులో 62 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కాగా... 69 ప్రభుత్వ, ఇతర రెసిడెన్షియల్ , ఎయిడెడ్ కాలేజీలు ఉన్నారుు. సుమారు 5 వేల మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. 131 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు(సీఎస్), డిపార్టుమెంటల్ ఆఫీసర్లను( డీఓ) నియమించారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్‌లతోపాటు పది సిట్టింగ్ స్క్వాడ్లను నియమాకం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఒక్కో బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఏఎస్ఐ, సీనియర్ లెక్చరర్లు సభ్యులుగా ఉన్నారు. సిట్టింగ్ స్క్వాడ్ ఒక్కో బృందంలో సీనియర్ లెక్చరర్‌తోపాటు పీడీ లేదా లైబ్రేరియన్ ఉన్నారు. అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లను కూడా నియూమకం చేశారు. ఉన్నతస్థారుులో పర్యవేక్షణకు హైపవర్ కమిటీ నియూమకమైంది. ఇందులో జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఇంటర్‌విద్య ఆర్జేడీ, డీవీఈఓ ఉన్నారు. పరీక్షల షెడ్యూల్.. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు 27వ తేదీ వరకు కొనసాగనున్నారుు. ఆయా పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరగనున్నారుు. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు ఉదయం 8.30 గంటల కల్లా చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే ఆయా కళాశాలలు ప్రిన్సిపాళ్లు తీసుకెళ్లారని, ఈ మేరకు వాటిని తీసుకుని పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు. వెబ్సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లను తీసుకోవచ్చని వెల్లడించారు. పరీక్షల నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా, పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు విధించకుండా సంబంధిత అధికారులతో ఇంటర్ విద్య ఆర్ఐఓ మాట్లాడారు. ఇటీవల కలెక్టరేట్లో వివిధ శాఖాధికారులతో కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సంబంధిత అధికారులకు కూడా ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్షల సమయంలో మూసివేయాలని అధికారులు ఆదేశించారు. సమస్యాత్మక కేంద్రాలు 23 జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి సమస్యాత్మక కేంద్రాలు 23 ఉన్నట్లు గుర్తించిన అధికారులు... వీటిపై ప్రత్యేక దృష్టిసారించారు. కాపీయింగ్ నిరోధానికి చర్యలు తీసుకున్నారు. ఏపీటీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీ(కురవి), ఏపీఎస్డబ్ల్యూజేసీ (మహబూబాబాద్), జీజేసీ(బి)(మహబూబాబాద్), ప్రిస్టన్ జూనియర్ కాలేజీ (జనగామ), ప్రభుత్వ జూనియర్ కాలేజీ(పరకాల), తేజస్విని గాంధీ జూనియర్ కాలేజీ (భూపాలపల్లి), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (భూపాలపల్లి, మద్దూరు, చేర్యాల, నెక్కొండ), పోతన కో ఆపరేటివ్ జూనియర్ కాలేజీ (పాలకుర్తి), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (కేసముద్రం, గూడూరు, కొత్తగూడెం,నర్మెట, చిట్యాల, దేవరుప్పుల, కొడకండ్ల, జఫర్‌గఢ్ సెంటర్లు సమస్యాత్మక కేంద్రాల జాబితాలో ఉన్నారుు. కాగా, జిల్లాలో మూడు సెల్ఫ్ సెంటర్లు ఏర్పాటుచేశారు. ఇందులో ధర్మసాగర్, మంగపేట, తాడ్వారుు ప్రభుత్వ నియర్ కాలేజీలు ఉన్నాయి. -
సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం
హైదరాబాద్: ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్ పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. మార్చి 9 వ తేదీ సోమవారం నుంచి 27 వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1,251 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇంటర్ పరీక్షలకు 973,237 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొంది. వారిలో 426, 448 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం, 506789 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారని వివరించింది. -
ఇంటర్ పరీక్షలపై ఎన్నాళ్లీ ప్రతిష్టంభన!
-
ఇంటర్ పరీక్షలపై ఎన్నాళ్లీ ప్రతిష్టంభన!
* ఇంటర్ పరీక్షలపై వీడని గందరగోళం * పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పట్టు * వేరుగా నిర్వహించేందుకే తెలంగాణ మొగ్గు.. గవర్నర్ సమావేశం పెట్టినా కొలిక్కి రాని సమస్య సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. పరీక్షలను వేర్వేరుగా నిర్వహించేందుకు వేర్వేరుగా ఇరు రాష్ట్రాలు పరీక్షల టైం టేబుల్ ప్రకటించినా.. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 19 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన పరీక్షల వ్యవహారాన్ని తేల్చకుండా.. ఇరు ప్రభుత్వాలు వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. వేర్వేరు పరీక్షల వల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని, ఉమ్మడిగానే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పట్టుపడుతుండగా... కలిపి నిర్వహిస్తేనే సమస్యలు వస్తాయంటూ, సొంతంగా పరీక్షల నిర్వహణకు తెలంగాణ మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షలకు అవసరమైన పేపరు కొనుగోళ్లు, ముద్రణ పనుల విషయంలో ఏం చేయాలో అర్థంకాక అధికారులు తల పట్టుకుంటున్నారు. ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వాల నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది ఒక దశలో తెలంగాణ, ఏపీలకు చెందిన మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు సమావేశమై చర్చించినా... పరీక్షల నిర్వహణ అంశాన్ని తేల్చలేకపోయారు. చివరకు ఈ ఇద్దరు మంత్రులతో గవర్నర్ నరసింహన్ సమావేశం నిర్వహించినా సమస్య కొలిక్కి రాలేదు. ఇరు రాష్ట్రాల మంత్రులు మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటారని భావించినా కుదరడం లేదు. ఇటీవల ఇంటర్బోర్డులో మంత్రుల సమావేశానికి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చినా.. అసెంబ్లీ సమావేశాల కారణంగా జగదీశ్‌రెడ్డి హాజరుకాలేకపోయారు. ఆ తరువాత గంటా శ్రీనివాసరావు విదేశ పర్యటనకు వెళ్లడంతో పరీక్షల సమస్య అలాగే ఉండిపోయింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోతున్నారు. పరీక్షల విషయంగా ఏదో ఒకటి త్వరగా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుకు సాగని పనులు.. ఇంటర్ పరీక్షలకు ప్రశ్నపత్రాల రూపకల్పన, పేపర్ సరఫరాకు టెండర్లు పిలవడం తప్ప మరే పనులు మొదలుకాలేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పేపర్ సరఫరా కోసం టెండర్లు పిలిచినా.. ప్రభుత్వాల నుంచి స్పష్టత రాకపోవడంతో వాటిని ఖరారు చేయలేని పరిస్థితి నెలకొంది. * ప్రశ్నపత్రాల రూపకల్పనలో భాగంగా ఒక్కో సబ్జెక్టులో 12 సెట్ల పేపర్లు తయారు చేయించా ల్సి ఉంది. అయితే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తే సరిపోయేలా 18 సెట్ల చొప్పున ప్రశ్నపత్రాలను రూపొందించారు. * ఈ ప్రశ్నపత్రాల ముద్రణ పనులను ఇరు రాష్ట్రాలకు కలిపి ఇవ్వాలా? వేర్వేరుగా ఇవ్వాలా? అనే అంశంపై స్పష్టత లేదు. దీనిపై ఇరు ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. 19 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన 1.20 కోట్ల జవాబు పత్రాలకు సంబంధించిన పేపరు కొనుగోలు, బుక్లెట్ల ముద్రణకు టెండర్లను కూడా పిలవలేదు. * ఫీజు చెల్లించిన విద్యార్థుల సమాచారం (డాటా) ప్రాసెసింగ్‌కు టెండర్లు పిలవలేదు. వాటిని బట్టే ఏ కోర్సులో ఎంత మంది చదువుతున్నారు. ఏ సబ్జెక్టులో, ఏ మీడియంలో ఎన్ని ప్రశ్నపత్రాలు, ఎన్ని జవాబు పత్రాలు ముద్రిం చాలనేది వెల్లడవుతుంది. తమ పరిధిలోకి తెచ్చుకుంటుందా? * వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు కట్టుబడిన తెలంగాణ ప్రభుత్వం.. తొలుత వేరుగా ఇంటర్ బోర్డు ఏర్పాటుకు ఫైలు సిద్ధం చేసింది. ఆ యాక్టును అడాప్ట్ చేసుకున్నా... ఆ తరువాత బోర్డు ఏర్పాటును పక్కనపెట్టింది. ప్రస్తుతం ఉన్న బోర్డుపై అధికారం తమదేనని, కోరితే ఏపీలోనూ తామే పరీక్షలను నిర్వహిస్తామని తెలంగాణ చెబుతోంది. కానీ ఇంతవరకు బోర్డును తమ పరిధిలోకి తెచ్చుకోలేదు. ఏపీ నేతృత్వం లోనే ఇంటర్ బోర్డు కొనసాగుతోంది. అయితే బోర్డును తెలంగాణ తమ పరిధిలోకి తెచ్చుకొని పరీక్షలు నిర్వహిస్తుందా? లేదా? అన్నదీ తేలలేదు. ఏ పేరిట సర్టిఫికెట్లు..? ఉమ్మడిగా పరీక్షలను నిర్వహిస్తే సర్టిఫికెట్లను ఏ బోర్డు పేరుతో ఇస్తారన్న అంశంపైనా స్పష్టత లేదు. ప్రస్తుత ఇంటర్‌బోర్డుకు బోర్డు ఇంటర్మీడియట్ ఏపీ అని ఉంటుంది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా ఏపీ బోర్డు పేరుతో సర్టిఫికెట్లను ఇస్తారా? ఒక వేళ బోర్డును తెలంగాణ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే ఏపీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు ఆఫ్ తెలంగాణ పేరుతో సర్టిఫికెట్లు ఇస్తారా? లేక ఏపీ పేరుతో ఇస్తారా? ఒక రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లకు మరో రాష్ట్రం బోర్డుతో పేరుతో ఉంటే అంగీకరిస్తారా? అనే అంశాలను తేల్చాల్సి ఉంది. పరీక్షలను ఉమ్మడిగా నిర్వహిస్తే జవాబు పత్రాల మూల్యాంకనం సందర్భంగా స్వ రాష్ట్రం మీద అభిమానంతో ఎక్కువ మార్కు లు వేసుకోవచ్చనే అభిప్రాయాలూ ఉన్నాయి. విద్యార్థులకు నష్టం: ఏపీ ఉన్నత విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు ఉండాలని పునర్విభజన చట్టంలోనే స్పష్టం చేశారు. అందుకే ఇంటర్ పరీక్షలు కూడా ఉమ్మడిగానే జరగాలి. వేర్వేరు పరీక్షల వల్ల కామ న్ మెరిట్‌ను నిర్ధారించడం కుదరదు. వేరుగా పరీక్షలు నిర్వహిస్తే ఏపీ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. నష్టం జరగదు: తెలంగాణ విభజన చట్టం స్ఫూర్తిని కచ్చితంగా పాటిస్తాం. చట్టం నిబంధనల ప్రకారం తెలంగాణలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 15 శాతం ఓపెన్ కోటాను అమలుచేస్తాం. అందులో మెరిట్లో ఉన్న ఏపీ విద్యార్థులకు సీట్లను ఇస్తాం. కామన్ మెరిట్ తీసేందుకు పర్సంటైల్, నార్మలైజేషన్ విధానం అమలు చేయవచ్చు. జేఈఈ మెయిన్ వంటి పరీక్షల్లో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకే ఈ విధానాన్ని సీబీఎస్ఈ ప్రవేశపెట్టింది. లేదంటే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని తొలగించి, ఇంటర్ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించవచ్చు. ఈ విధానాలతో వేర్వేరుగా ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తే తెలంగాణ విద్యార్థులకు గానీ, ఏపీ విద్యార్థులకు గానీ నష్టం ఉండదు. తల్లిదండ్రుల్లో ఆందోళన.. ఇంటర్ పరీక్షలకు ఐఐటీ, ఎన్ఐటీ వంటి ఇతర పరీక్షలతో సంబంధం ఉంటుం ది. ఇవీ మార్చిలో పూర్తికావాలి. అందుకే నాలుగు నెలల ముందు నుంచే పనులు చేపట్టాలి. కానీ ఇరు రాష్ట్రాలు ఎవరి భేషజాలతో అవి ఉన్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చట్టం ప్రకారం ఇంటర్ బోర్డు తెలంగాణకే రావాలి. కానీ బోర్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఈ గొడవల ప్రభావం పరీక్షలపై పడే అవకాశముంది. అందువల్ల దీనిపై త్వరగా తేల్చాలి. - చుక్కా రామయ్య, విద్యావేత్త -
'అవసరమైతే ఒక మెట్టు దిగడానికి ఓకే'
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలపై జరగాల్సిన ఏపీ, తెలంగాణ మంత్రుల సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తెలంగాణ విద్యాశాఖ జగదీశ్ రెడ్డి హాజరుకాలేదు. ఆయన కోసం ఇంటర్ బోర్డులో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గంటకుపైగా నిరీక్షించారు. అసెంబ్లీలో ఎల్ బీసీ సమావేశం కారణంగా భేటీకి రాలేనని గంటాకు జగదీశ్ రెడ్డి సమాచారం ఇవ్వడంతో ఆయన వెనుదిరిగారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఒక్క మెట్టు దిగడానికైనా సిద్ధమని గంటా ప్రకటించారు. తెలంగాణ సర్కారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిపేందుకు కూడా తమకు అభ్యంతరం లేదన్నారు. సకాలంలో పరీక్షలు జరిపి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీయిచ్చారు. తెలంగాణ మంత్రితో మాట్లాడి తదుపరి భేటీ ఎప్పుడనేది తెలియజేస్తామన్నారు. -
ఇంటర్ బోర్డు పై ఇరు రాష్ట్రాల పోరు
-
ఇంటర్ పరీక్షలపై కొనసాగుతున్న సందిగ్ధం
-
ఇంటర్ పరీక్షలపై కొనసాగుతున్న సందిగ్ధం
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలపై సందిగ్ధత కొనసాగుతోంది. పరీక్షల నిర్వహణపై గవర్నర్ సమక్షంలో రెండు రాష్టాల విద్యాశాఖ మంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. బుధవారం గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశమయ్యారు. ఇంటర్ పరీక్షలు విడిగానే నిర్వహించుకుంటామని తెలంగాణ మంత్రి అన్నారు. ఉమ్మడిగానే నిర్వహించాలని ఏపీ మంత్రి కోరారు. ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మంత్రులకు గవర్నర్ సూచించారు. ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళతామని చెప్పి మంత్రులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. -
అవసరమైతే కోర్టుకెళతాం: మంత్రి గంటా
-
అవసరమైతే కోర్టుకెళతాం: మంత్రి గంటా
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులు గవర్నర్ నరసింహన్ ను కోరారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కింజరపు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్ మంగళవారం గవర్నర్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ను కలిసిన తర్వాత గంటా శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. బుధవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రిని పిలిచి గవర్నర్ మాట్లాడతానన్నారని చెప్పారు. పరీక్షలు వేర్వేరుగా నిర్వహిస్తే విద్యార్థులు నష్టపోతారని, ఉమ్మడిగా నిర్వహించాలని విభజన చట్టంలో ఉందని తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళతామని, కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తామని గంటా శ్రీనివాసరావు అన్నారు. -
వేరుగానే ఇంటర్ పరీక్షలు!
-
మార్చి 9 నుంచి ఇంటర్ పరీక్షలు
* సొంతంగా నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం * తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరుగా టైమ్‌టేబుళ్లు, ప్రశ్నపత్రాలు * ఏపీలో మార్చి 11 నుంచి పరీక్షలు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలను సొంతంగానే నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగానే ముందుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ సర్కారు తిరస్కరించింది. రాష్ట్రంలో ఈ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 9 నుంచి 27 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఇంటర్ బోర్డు టైమ్‌టేబుల్ ప్రకటించింది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆమోదం తీసుకున్న వెంటనే బోర్డు అధికారులు ఈ టైమ్‌టేబుల్‌ను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 11 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీనివాసరావు ప్రటించిన మరుసటి రోజే తెలంగాణలో వేరుగా పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ జారీచేయడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుండా తెలంగాణలో వేరుగానే పరీక్షలు నిర్వహిస్తామని, వేర్వేరు ప్రశ్నాపత్రాలతోనే ఈసారి పరీక్షలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. ఇందులో భాగంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను కూడా వేరుగానే చేయమని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను మంత్రి జగదీశ్‌రెడ్డి గత నెలలోనే ఆదేశించారు. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు టైంటేబుల్తో కూడిన ప్రతిపాదనలను బోర్డు రెండు రోజుల క్రితం పంపించింది. తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శికి వెళ్లిన ఆ ఫైలు మళ్లీ తెలంగాణకు రావాల్సి ఉంది. కానీ అది తెలంగాణ అధికారులకు రాకముందే.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం నుంచి ఆమోదం లభించక ముందే.. ఏపీ విద్యాశాఖ మంత్రి తాము మార్చి 11 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తామని గురువారం ప్రకటించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి గురువారం రాత్రే చర్చించారు. తెలంగాణలో వేరుగానే పరీక్షలను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణకు వేరుగా టైంటేబుల్ రూపొందించి తీసుకురావాలని శుక్రవారం ఉదయమే ఇంటర్ బోర్డు అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు మార్చి 9 నుంచి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించి తీసుకురావడంతో ఆమోదముద్ర వేశారు. వెంటనే ఇంటర్ బోర్డు అధికారులు ఆ టైంటేబుల్తోపాటు ఆంధ్రప్రదేశ్ టైంటేబుల్‌ను ప్రకటించారు. -
మార్చి 11 నుంచి ఇంటర్ పరీక్షలు!
-
మార్చి 11 నుంచి ఇంటర్ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుండా తెలంగాణలో వేరుగా ప్రశ్నపత్రాలతో ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పరీక్షలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన షెడ్యూలును ఇంటర్మీడియెట్ బోర్డు సిద్ధం చేసి ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఆమోదానికి పంపించింది. అయితే షెడ్యూలు ఒకటే అయినా ప్రశ్నపత్రాలు మాత్రం వేర్వేరుగానే ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు ఉత్తర్వులను ఒకటీ రెండు రోజుల్లో జారీ చేసి, బోర్డు కార్యదర్శిని నియమించి షెడ్యూలు జారీ చేయాలని భావిస్తోంది. మొదట మార్చి 4వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఆలోచనలు చేసినా, పని దినాలు సరిపోవన్న నిర్ణయానికి ప్రస్తుత బోర్డు వచ్చింది. మరోవైపు జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ పరీక్ష ఏప్రిల్ 4న, ఆన్లైన్ పరీక్షలు ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఉన్నందున మార్చి 18వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షల నిర్వహణ కుదరనే అభిప్రాయానికి వచ్చారు. అందుకనుగుణంగా కాస్త ముందుగా, అంటే మార్చి 11వ తేదీ నుంచే ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలును ఖరారు చేసింది. తెలంగాణ బోర్డు కార్యదర్శి నియామకం జరిగిన వెంటనే తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఈనెల 13వ తేదీలోగా పరీక్షలపై ప్రభుత్వాల నిర్ణయాలను తెలియజేయాలని ప్రస్తుత ఇంటర్ బోర్డు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఇటీవలే లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షల వ్యవహారాన్ని తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. త్వరగా తేల్చాలని సీఎస్‌కు విజప్తి.. ఇంటర్మీడియెట్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలని ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, విద్యావేత్త చుక్కా రామయ్య తదితరులు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిసి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. మరోవైపు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను వార్షిక పరీక్షలకంటే ముందుగానే నిర్వహించాల్సి ఉంటుందని సీఎస్‌కు వివరించారు. ఇందులో భాగంగా షెడ్యూలును వెంటనే జారీ చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. -
తెలంగాణ ఇంటర్ బోర్డుకు ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటుకు న్యాయశాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు ఏర్పాటుపై ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్.21ని విడుదల చేసింది. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుండగా... ఆ పరీక్షలను ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగానే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తాజా జీవో జారీతో వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే పరీక్షలు రాయనున్నారు. -
వేరుగానే ఇంటర్ పరీక్షలు!
* విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌తో కలిపి ఉమ్మడిగా కాకుండా.. వేరుగానే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై సచివాలయంలో గురువారం ఇంటర్‌బోర్డు, ఇంటర్ విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ పరీక్షలకు సంబంధించి ఇతరత్రా నిర్వహణ సమస్యలు, ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ వంటి అంశాలపై రెండు మూడు రోజుల్లో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చర్చిస్తామని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటుకు న్యాయ శాఖ నుంచి ఆమోదం లభించిందని.. సీఎం కేసీఆర్ ఆమోదం లభించాక త్వరలోనే బోర్డును ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అయితే బోర్డు విభజనతో ప్రస్తుతానికి సంబంధం లేదని, ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఏర్పాట్లు ప్రారంభించండి ఇప్పటివరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించకపోవడంపై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ... వెంటనే ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలెట్టాలని అధికారులను ఆదేశిం చారు. ఒక్కో సబ్జెక్టుకు 12 రకాల (సెట్లు) పేపర్లు కాకుండా 2 రాష్ట్రాలకు వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు వీలుగా 24 రకాల పేపర్లు రూపొందించాలన్నారు. పేపరు కొనుగోలు, ముద్రణ, అనంతరం సరఫరాకు టెండర్లు పిలవాలని.. 2 రాష్ట్రాల ఇంటర్ బోర్డులకు వేర్వేరుగా ప్రశ్న, జవాబు పత్రాలను పంపించేలా టెండర్ల నోటిఫికేషన్లో స్పష్టం చేయాలన్నారు. ఈ ప్రక్రియకు కనీసం నెల పడుతుందని, ఆ లోగా తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు పూర్తవుతుందని మంత్రి అన్నారు. కాగా ప్రస్తుతం ఉమ్మడిగా సేవలందిస్తున్న ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఇన్చార్జి కార్యదర్శి ఉషారాణి ఈ సమావేశానికి హాజరుకాలేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతోందని కొందరు అధికారులు పేర్కొనగా... ఆ ఉద్దేశమే ఉంటే ఆగస్టు తొలి వారంలో మొదలు కావాల్సిన పరీక్షల పనులను ఇంతవరకూ ఎందుకు ప్రారంభించలేదనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. టెన్త్ పరీక్షలపై నేడు సమీక్ష తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించనున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు తేదీల ఖరారు, పరీక్షల తేదీలపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. కాంపొజిట్ కోర్సు పేపర్ రద్దు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని గురువారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. -
వేర్వేరుగా ఇంటర్ పరీక్షలు
ఇంటర్ బోర్డు సన్నాహాలు తెలంగాణ, ఏపీలకు వేరుగా ప్రశ్నపత్రాలు రెండు ప్రభుత్వాలకు బోర్డు ప్రతిపాదనలు వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేర్వేరుగా, వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నుంచి అనుమతి కోరుతూ ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపింది. సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేర్వేరుగా, వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నుంచి అనుమతి కోరుతూ ప్రతిపాదనలను పంపించింది. దీంతో ఎంసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీ పరిస్థితి గందరగోళంలో పడింది. మరోవైపు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల ఎత్తివేతకు ఏపీ సర్కార్ ఆలోచనలు చేస్తోంది.దీనికి సంబంధించిన ఎలాంటి ఆదేశాలు ఆ సర్కార్‌నుంచి ఇంతవరకు ఇంటర్ బోర్డుకు రాలేదు. వురోవైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టత లేదు. దీంతో ఇంటర్‌బోర్డు యుథావిధిగా మెుదటి ఏడాది పరీక్షల నిర్వహణకు సిద్ధవువుతోంది. పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీలను కూడా ప్రకటించింది. ఒక రాష్ట్రం ఇస్తే.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో రెండు రాష్ట్రాల విద్యార్థులకు పదేళ్లపాటు ఉమ్మడిగా ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. ఎంసెట్ ర్యాంకును ఖరారు చేసేప్పుడు విద్యార్థి సాధించిన ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తారు. దానిని కలుపుకొని తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఒకే ప్రశ్నపత్రం ద్వారా ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తే వెయిటేజీలో ఇబ్బంది ఉండదు. విడిగా పరీక్షలు నిర్వహిస్తే మాత్రం వెయిటేజీ ఖరారులో సమస్యలు తప్పవని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఒక రాష్ట్రం సులభమైన ప్రశ్నలను ఇస్తే, మరో రాష్ట్రానికి చెందిన వారు ఎంసెట్ ర్యాంకుల్లో నష్టపోక తప్పదని అంటున్నారు. ప్రశ్నపత్రాలు ఒకేలా ఉండకపోవచ్చు! ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఒకే ఇంటర్మీడియెట్ బోర్డు సేవలు అందిస్తోంది. ఈ బోర్డు నేతృత్వంలోనే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు రూపొందించినా ఒక రాష్ట్రంలోని కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉండొచ్చు. కొన్ని సులభంగా ఉండొచ్చు. రెండూ సవూనంగా ఉన్నాయని చెప్పడానికి శాస్త్రీయ విధానమంటూ ఉండదు. ఇక కావాలని ఒక రాష్ట్రం ప్రశ్నపత్రాలను సులభంగా ఇస్తే గందరగోళం తలెత్తుతుంది. ప్రశ్న పత్రాలు కఠినంగా వచ్చిన రాష్ట్రంలోని విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుంది. ఈ ప్రభావం ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశాల పై పడుతుందని నిపుణులు అంటున్నారు. ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు వచ్చిన వారికే ఓపెన్ కోటాలో అగ్రశ్రేణి కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. మూల్యాంకనమప్పుడే అనుమానాలు.. మెున్నటి మార్చి/ఏప్రిల్‌లో జరిగిన ఇంటర్మీడియెట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం విషయంలో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఒక ప్రాంతం విద్యార్థుల జవాబు పత్రాలను మరో ప్రాంతంలో మూల్యాంకన ం చేయించవద్దని లెక్చరర్లే పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కావాలని తక్కువ మార్కులు వేస్తారనే అనుమానాలు రెండు వైపుల నుంచీ వ్యక్తం అయ్యాయి. దీంతో ఏప్రాంత విద్యార్థుల జవాబు పత్రాలను ఆప్రాంతంలోనే మూల్యాంకనం చేయించారు. మూల్యాంకనం విషయంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక ప్రశ్న పత్రాలు వేర్వేరుగా ఇస్తే వచ్చే మార్కులకు శాస్త్రీయత ఎలా ఉంటుందని సందేహాలు వ్యక్తం అవుతున్నారుు. వాటి ఆధారంగా 25 శాతం వెయిటేజీ ఎలా ఇస్తారు? అనే వాదనలు వస్తున్నారుు. ఈ పరిస్థితుల్లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీని తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ స్థాయిలోనూ దానిని ఎత్తివేసే అంశంపై పరిశీలన జరుపుతున్నట్లు తెలిసింది. ఎంసెట్‌ను రద్దు చేస్తే..? ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ను రద్దు చేసే అంశంపై ఆలోచనలు జరుగుతున్నాయి. తెలంగాణలోనూ దానికి ప్రత్యామ్నాయాలు ఏంటనే అంశాలపై చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాల విధానం అమలు చేయాల్సి ఉన్నందున రద్దు సాధ్యం కాకపోవచ్చనే భావన నెలకొంది. రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ప్రవేశాల నిర్వహణకు దోహదంగా ఉన్న ఎంసెట్‌కు ప్రత్యామ్నాయం అధికారులకు కనిపించడం లేదు. ఏపీ అధికారులైతే ఈ విషయంలో లోతుగా పరిశీలన జరుపుతున్నారు. ఎంసెట్‌ను రద్దు చేస్తే.. ఉమ్మడి ప్రవేశాలకోసం రెండు రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన ప్రశ్న పత్రాలతో పరీక్షలు నిర్వహించాలి. ఒకవేళ అదీ చేసినా, మూల్యాంకనంలో తేడాలు వస్తాయనే అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వెయిటేజీ రద్దు, ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజులు గడిస్తేనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రథమ సంవత్సర పరీక్షలు రద్దు ? జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ పరీక్ష విషయుంలో గందరగోళం లేకుండా ఉండేందుకు ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పరీక్షలను ఎత్తివేయూలని గతంలోనే ఆలోచనలు చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం కొంత సంసిద్ధతను వ్యక్తం చేసింది. తెలంగాణ విద్యా శాఖ వర్గాలు కూడా ఎత్తివేస్తే బాగానే ఉంటుందని భావించారుు. తద్వారా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తరహాలో కేవలం ద్వితీయ సంవత్సరానికే (12వ తరగతి) పరీక్షలు నిర్వహిస్తే సవుస్యలు రావని యోచించారుు. ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా పర్సంటైల్ నిర్ధారణలో రాష్ట్ర విద్యార్థుల విషయంలో గందరగోళం నెలకొంటోంది. ఇతర రాష్ట్రాలు, సీబీఎస్ఈలో కేవలం 12వ తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకుని పర్సంటైల్ నిర్ధారిస్తుండగా, వునదగ్గర రెండేళ్ల మార్కులను తీసుకోవాల్సి వస్తోంది. ఈ విషయంలో ఏటా ఆందోళనలు తప్పడం లేదు. అందుకే ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షను ఎత్తివేసి, 12వ తరగతికి సమానమైన ద్వితీయ సంవత్సర పరీక్షలనే నిర్వహించేంచాలన్న డివూండ్లు వచ్చారుు. కాని ఇంతవరకు ప్రభుత్వాలనుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. దీంతో ఈసారికి పరీక్షలు నిర్వహించేందుకే ఇంటర్‌బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. -
ఇంటర్ వెయిటేజి మార్కులతో ఎంసెట్ ర్యాంకులు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకులను ఖరారు చేస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తెలిపారు. వీరిని మొదటి దశ కౌనె ్సలింగ్లో అనుమతిస్తామన్నారు. ఇక అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు వెయిటేజీ ఇచ్చి రెండో దశలో ర్యాంకులను ఖరారు చేస్తామని, ఆ తర్వాత కౌన్సెలింగ్‌కు వారిని అనుమతిస్తామని వెల్లడించారు. ఎంసెట్‌లో వచ్చే మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియట్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఈ ర్యాంకులను ఖరారు చేయనున్నట్టు తెలిపారు. -
16 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ :ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష లు ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ అంజయ్య గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. ప్రాక్టికల్ పరీక్షలు 26 నుంచి జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు 2,146 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 3,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం పది, ఇంటర్ విద్యార్థుల కోసం తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈఓ తెలిపారు. అభ్యర్థులు సంబంధిత స్టడీ సెంటర్ ద్వారా గానీ, ఏపీఓపెన్ స్కూల్ వెబ్సైట్ ద్వారా గానీ ఈ నెల 10 వరకు హాల్‌టికెట్లు పొందవచ్చన్నారు. పరీక్షల నిర్వహణకు కలెక్టర్ కోన శశిధర్ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని, జిల్లా స్థాయిలో ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలనూ నియమించామన్నారు. ఈ ఏడాది జిల్లా స్థాయి పరిశీలకులను కూడా నియమించామన్నారు. పరీ క్షలు మొదలైన తర్వాత కేవలం 15 నిముషాల వరకే అభ్యర్థులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. -
ఫెయిల్ అవుతాననే ఆందోళనతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు సరిగ్గా రాయలేకపోయానని ఆందోళన చెందిన ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నంద్యాలలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల పట్టణ శివారులోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కిరాణం వ్యాపారి లక్ష్మీనారాయణ కుమారుడు జయచంద్ర సాయివిష్ణు స్థానిక శ్రీనివాసనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. 2013లో నిర్వహించిన ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన పరీక్షల్లో ఫెయిల్ అయిన మూడు సబ్జెక్టులు రాశాడు. అయితే మళ్లీ ఫెయిల్ అవుతానేమోనని మనస్థాపం చెందాడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులంతా ఎవరి పనుల్లో వారు ఉండగా సాయివిష్ణు తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ తర్వాత దారెటు..
విద్యార్థి చదువుల సోపానాల్లో కీలకమైన ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. ఈ దశలో వేసే అడుగు భవిష్యత్తు కెరీర్‌కు పునాది వంటిది. అందుకే ఎంపిక చేసుకునే కోర్సు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ నేపథ్యంలో ఇంటర్ తర్వాత విద్యార్థులకు అందుబాటులో ఉండే అవకాశాలపై స్పెషల్ ఫోకస్.. ఇంటర్మీడియెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ పూర్తిచేసిన విద్యార్థులు విశ్లేషించుకోవాల్సిన అంశాలు.. తనకు అందుబాటులో ఉన్న అవకాశాలు ఏమిటి? తనకు ఇష్టమైన సబ్జెక్టులేమిటి? బలాలు, బలహీనతలు ఏమిటి? కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? వంటి విషయాలను విశ్లేషించుకొని స్పష్టమైన లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇంటర్మీడియెట్ తర్వాత ప్రధానంగా రెండు మార్గాలు తారసపడతాయి. అవి.. 1. ఉద్యోగావకాశాలు. 2. ఉన్నత విద్యావకాశాలు. విద్యార్థులు తమ లక్ష్యం ఏమిటనే దానిపై స్పష్టత ఏర్పరుచుకోవాలి. ఇప్పుడు చేసే తెలివైన ఆలోచన నాలుగు దశాబ్దాల కెరీర్‌కు బాటలు వేస్తుంది. ఇంటర్ పూర్తయ్యేనాటికి ఏది మంచి? ఏది చెడు? అని తెలుసుకునే మానసిక బలం ఉంటుంది కాబట్టి కెరీర్‌పై స్పష్టమైన లక్ష్య నిర్దేశనం చేసుకొని, దానికి అనుగుణంగా ముందడుగు వేయాలి. ఇంటర్ ఎంపీసీ పదో తరగతి పూర్తయ్యాక ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కెరీర్‌ను అందుకునే లక్ష్యంతో ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూపులో చేరుతారు. ఈ ఏడాది ఇంటర్‌ను దిగ్విజయంగా పూర్తిచేసే వారు ఐఐటీ, నిట్లు, బిట్స్ పిలానీ క్యాంపస్‌లు, ట్రిపుల్ ఐటీలు, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో సీటు సంపాదించేందుకు ప్రయత్నించవచ్చు. ఐఐటీలు, నిట్‌ల్లో చేరాలనుకుంటే.. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ కనబరచాలి. రాష్ట్రంలో ఎంపీసీ విద్యార్థులు ఎక్కువగా రాసే పరీక్ష ఎంసెట్. రాష్ట్రంలోని టాప్ 10 ఇంజనీరింగ్ కళాశాలలు.. బోధనా విధానం, క్యాంపస్ ప్లేస్మెంట్ల విషయాల్లో నిట్, ఐఐటీలతో పోటీపడుతున్నాయి కాబట్టి వాటిలో సీటు సంపాదించేందుకు ప్రయత్నించాలి. ఇంజనీరింగ్వైపు వెళ్లని వారు సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరొచ్చు. వీటితో పాటు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్), బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) వంటి కోర్సులను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్ బైపీసీ ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తిచేసిన వారు రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ రాయొచ్చు. దీంతోపాటు జిప్మర్, ఎయిమ్స్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, అమృత విశ్వవిద్యా పీఠం, డీవై పాటిల్, మణిపాల్ యూనివర్సిటీ తదితర ఎంట్రన్స్‌లు రాసి మెడికల్ కోర్సులో చేరొచ్చు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, మెడికల్ సీట్లు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. దాంతో ఎంబీబీఎస్ కోర్సులో చేరాలనుకునే వారికి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఇంటర్ బైపీసీ విద్యార్థులకు బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, అగ్రికల్చర్, ఫిజియోథెరపీ, ఫార్మసీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. నర్సింగ్ కోర్సుల్లోనూ చేరొచ్చు. ఇంటర్మీడియెట్ (సెన్సైస్-ఎంపీసీ/బైపీసీ) అర్హతతో డిప్లొమా ఇన్ ఫార్మసీ (డి.ఫార్మసీ) కోర్సులో చేరొచ్చు. పారామెడికల్ కోర్సులు ఇంటర్ బైపీసీ తర్వాత తక్కువ కాల వ్యవధిలో ఉద్యోగావకాశాలు అందించే కోర్సులు.. పారా మెడికల్ కోర్సులు. రోగికి డయాగ్నసిస్, ట్రీట్మెంట్, థెరపీ సరిగా జరిగేలా డాక్టర్‌కు సహకరించే వారే పారామెడికల్ నిపుణులు. ఆరోగ్య రంగంలో పారామెడికల్ నిపుణుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఆరోగ్య రంగంలో అవకాశాలు అపారం. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్,ఈసీజీ టెక్నీషియన్, బ్లడ్ బ్యాంకింగ్ టెక్నీషియన్, అనస్థీసియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ఆప్తాల్మిక్ టెక్నీషియన్, డార్క్ రూమ్ టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్, ఎంపీహెచ్‌పీపీ, థియేటర్ టెక్నీషియన్ వంటి కోర్సులు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. బైపీసీ విద్యార్థులకు బ్యాచిలర్ డిగ్రీ అంటే వెంటనే గుర్తొచ్చేది సంప్రదాయ బీజెడ్సీ. కానీ మారుతున్న పరిస్థితులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు విద్యా సంస్థలు వినూత్న కాంబినేషన్లతో కోర్సులను అం దుబాటులో ఉంచుతున్నాయి. ఇటీవల కాలంలో బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్ వంటి విభాగాలు విస్తరిస్తుండటంతో ఆయా సబ్జెక్టులతో కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులు ఆసక్తి ఉంటే ఇలాంటి గ్రూప్‌లను ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్ సీఈసీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార రంగం శరవేగంగా విస్తరిస్తుండటంలో కామర్స్ విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. ఇంటర్లో సీఈసీ పూర్త్తిచేసిన విద్యార్థులు డిగ్రీ స్థాయిలో బీకాంలో చేరొచ్చు. దాంతో పాటు ప్రతిష్టాత్మక జాబ్ ఓరియెంటెడ్ ప్రొఫెషనల్ కోర్సులైన సీఏ, సీఎస్ వంటి కోర్సులను పూర్తిచేయొచ్చు. బీకాం పూర్తయ్యాక రెగ్యులర్‌గా మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్(ఎంబీఏ), ఎంకాం (మాస్టర్ ఆఫ్ కామర్స్) తదితర కోర్సుల్లో చేరొచ్చు. ప్రత్యేక కోర్సులు సంప్రదాయ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులతోపాటు కొన్ని స్పెషల్ కోర్సులకూ అవకాశాలు పెరుగుతున్నాయి. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫొరెన్సిక్ సైన్స్, ఆప్టోమెట్రీ, డెయిరీ టెక్నాలజీ, న్యూట్రిషన్, హోంసైన్స్, ఓషనోగ్రఫీ, జెమ్మాలజీ, ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్, మర్చెంట్ నేవీ, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫిల్మ్ అండ్ మీడియా, సెక్రటేరియల్ వర్క్ తదితర స్పెషల్ కోర్సులనూ ఇంటర్ తర్వాత ఎంచుకోవచ్చు. సెట్ల సోపానాలు ఇంటర్ తర్వాత వివిధ రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల ద్వారా ఉన్నత కెరీర్‌కు సోపానాలు వేసుకోవచ్చు. ఉదాహరణకు చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించి కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం కల్పిస్తోంది డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ). ఇంటర్ తర్వాత రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ ప్రతి ఏటా డైట్‌సెట్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా రాష్ర్టవ్యాప్తంగా ఉన్న డీఎడ్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. అదే విధంగా హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి దేశంలోని ప్రముఖమైన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎంసీటీ). ఇది బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులో ప్రవేశాలకు ఏటా జారుుంట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) నిర్వహిస్తోంది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్), లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్), ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఎంట్రెన్స్ టెస్ట్ వంటివి ఈ కోవకు చెందుతాయి. ఇంటిగ్రేటెడ్ కోర్సులు డిగ్రీ ఒక దగ్గర, పీజీ మరోచోట కాకుండా వరుసగా రెండూ ఒకే చోట పూర్తిచేయాలనుకునే వారి కోసం ప్రవేశపెట్టినవే.. ఇంటిగ్రేటెడ్ కోర్సులు. ఈ కోర్సుల ద్వారా ఇంటర్ తర్వాత ఎలాంటి విరామం లేకుండా పీజీ పూర్తిచేయొచ్చు. ఒకవేళ కోర్సులో చేరిన మూడేళ్ల తర్వాత వద్దనుకుంటే.. డిగ్రీ సర్టిఫికెట్; నాలుగేళ్ల తర్వాత వద్దనుకుంటే హానర్స్ సర్టిఫికెట్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగావకాశాలు ఇంటర్మీడియెట్ అర్హతతో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్పీఎఫ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, భారతీయ రైల్వేల్లో వివిధ ఉద్యోగాలు, ఎస్ఎస్సీ నిర్వహించే వివిధ ఉద్యోగాలు, యూపీఎస్సీ నిర్వహించే స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్ ఇలా చాలా ఉద్యోగావకాశాలున్నాయి. వీటిలో ఖాళీల భర్తీకి ఎంప్లాయ్మెంట్ న్యూస్, రోజ్‌గార్ సమాచార్, ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్లు వెలువడుతుంటాయి. రాష్ట్ర స్థాయిలో వీఆర్వో, వీఆర్ఏ, గ్రూప్-4, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు వంటి ఉద్యోగావకాశాలుంటాయి. సరైన ప్రణాళికతో చదివితే కొలువును సొంతం చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తూనే దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. అందుబాటులో దూరవిద్య వివిధ కారణాల వల్ల రెగ్యులర్‌గా చదవలేనివారికి పలు యూనివర్సిటీలు దూరవిద్య విధానంలో రకరకాల కోర్సులు అందిస్తున్నాయి. తక్కువ ఫీజులతో కోర్సులు పూర్తి చేయడంతోపాటు ఉన్నత విద్యకు బాటలు వేసుకోవచ్చు. కోర్సులు పూర్తయ్యాక ఇచ్చే సర్టిఫికెట్లకు రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమానంగా గుర్తింపు ఉంటుంది. ఇవి అటు ఉన్నత విద్యకు, ఇటు ఉద్యోగావకాశాలకు ఉపయోగపడతాయి. ఇగ్నో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు దూరవిద్యా విధానంలో కోర్సులందిస్తున్నాయి. ఈ కోర్సులు ప్రయోజనకరం పై చదువులు చదవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి వివిధ ప్రభుత్వ సంస్థలందించే కోర్సులు ప్రయోజనకరంగా ఉంటాయి. సెట్విన్, స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, ఎంఎస్ఎంఈ వంటి సంస్థలు స్వయం ఉపాధి లేదంటే ఏదైనా ఉద్యోగాన్ని పొందేందుకు ఉపయోగపడే స్వల్పకాలిక కోర్సులు అందిస్తున్నాయి. ఇలాంటి వాటిలో హోటల్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్, సెల్‌ఫోన్ రిపేరింగ్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, రేడియో అండ్ టీవీ మెకానిజం, జ్యుయెలరీ మేకింగ్, కార్పెంటరీ, డీటీపీ, వెబ్ డిజైనింగ్, ఎంఎస్ ఆఫీస్, మల్టీమీడియా వంటి కోర్సులు ఉన్నాయి. అన్ని కోణాల్లోనూ విశ్లేషించుకోవాలి మన బాగోగులను కోరుకునే వారి నుంచి సరైన సలహాలు తీసుకున్న తర్వాత విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా కోర్సును ఎంపిక చేసుకోవాలి. ఆ కోర్సును జాతీయ, రాష్ట్ర స్థాయిలో అందించే ప్రముఖ సంస్థలు, అర్హతలు, ప్రవేశ విధానం తదితర అంశాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఇందుకోసం విద్యార్థులు ఇంటర్నెట్ను ఉపయోగించుకోవాలి. ఆయా సంస్థల వెబ్సైట్లను సందర్శించడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వీలైతే ఆయా సంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులను సంప్రదించాలి. ప్రస్తుతం ఆ కోర్సుకు డిమాండ్ ఎలా ఉంది? అది చేస్తే భవిష్యత్ ఎలా ఉంటుంది? తదితరాలను విశ్లేషించుకోవాలి. లక్ష్యం దిశగా ప్రయాణం ఇంటర్మీడియెట్ తర్వాత బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, హోటల్ మేనేజ్మెంట్, సీఏ.. ఇలా ఏ కోర్సులో చేరినప్పటికీ స్పష్టమైన దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటి సాధన కోసం కోర్సులో అడుగుపెట్టిన రోజు నుంచి నిజాయితీగా కష్టపడాలి. కలల్ని నిజం చేసుకునేందుకు అవసరమైన నైపుణ్యాల సముపార్జనకు కృషి చేయాలి. ఆయా రంగాలలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ఒంటబట్టించుకోవాలి. సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు వాటి అప్లికేషన్ నైపుణ్యాలను సంపాదించుకుంటే చేసిన కోర్సు ఏదైనా అత్యుత్తమ ఫలితాలు సొంతమవుతాయి. -
ఇంటర్ పరీక్ష పెపర్ లీక్ కేసులో 8 మంది అరెస్టె
-
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథ మ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశా యి. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేం ద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతోపాటు 144 సెక్షన్ విధించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదు. తాగునీరు, వైద్యసదుపాయం అందుబాటులో ఉంచారు. 94 శాతం హాజరు ప్రథమ సంవత్సరం పరీక్షకు జిల్లావ్యాప్తంగా 50,922 మంది విద్యార్థులకు 46,870 మంది హాజరయ్యారు. 4,052 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 46,207 మందికి 42,964 మంది హాజరయ్యారు. ఓకేషనల్ విభాగంలో 4,715 మందికి 3,906 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా జనరల్ విభాగంలో 75 శాతం, వోకేషనల్ విభాగంలో 19 శాతం మొత్తంగా 94 శాతం మంది పరీక్ష రాశారు. పకడ్బందీ చర్యలుతీసుకోవడంతో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని ఆర్ఐవో రమేశ్‌బాబు తెలిపారు. 10 మంది సిట్టింగ్, ఆరుగురు ఫ్లైయింగ్, ఇద్దరు అదనపు స్క్యాడ్ సిబ్బంది పరీక్షలను పర్యవేక్షించారు. -
అయ్యయ్యో... టైమైపోయింది..
ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు చెప్పడంతో చాలా మంది విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. సమయం ముంచుకురావడంతో కొందరు విద్యార్థులు ఇలా పరుగున కేంద్రాలకు చేరారు. ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం తొలి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించాయి. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తక పోవడంతో పరీక్షలు సజావుగా సాగాయి. విద్యార్థులు అరగంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లావ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 49,955 మంది హాజరయ్యారు. జనరల్ గ్రూప్‌లో 46,263 మంది విద్యార్థులకు 44,174 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఒకేషనల్ గ్రూప్ లో 3,692 మంది విద్యార్థులకు 3,159 మంది పరీక్షలకు హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆర్ఐవో ఎల్.జె.జయశ్రీ తెలిపారు. -
నేల పరీక్షలు
జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం అరకొర వసతుల మధ్య ప్రారంభమయ్యాయి. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కోట ఎస్సీ గురుకుల పాఠశాలలో 395 మందికి 365 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ కేంద్రంలో ఎన్బీకేఆర్, శ్రీనివాస, మల్లాం, కొత్తగుంట కళాశాలల విద్యార్థులు పరీక్షలు రాశారు. ఓ గదిలో విద్యార్థులకు బెంచీలు కేటాయించకపోవడంతో నేలపైనే కూర్చొని పరీక్షలు రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బెంచీలు అందుబాటులో లేవని ప్రిన్సిపల్ సూర్య చెప్పడం గమనార్హం. నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యా యి. విద్యార్థులకు తెలుగు, సంస్కృ తం, ఉర్దూ పేపర్-1 పరీక్షలు నిర్వహిం చారు. ఇందులో జనరల్ విద్యార్థులు 27,529 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,115 మంది కలిపి 28,644 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండ గా జనరల్ విద్యార్థులు 1,332 మంది, ఒకేషనల్ విద్యార్థులు 135 మంది కలిపి 1,267 మంది గైర్హాజరయ్యారు. సిట్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్, హైపవర్ కమిటీలు పలు కేంద్రాలను తనిఖీ చేశాయి. ఆర్ఐఓ పరంధామయ్య మాస్టర్‌మైండ్స్, శ్రీచైతన్య, శ్రీగాయత్రి, శ్రీమేథ, ఆర్ఎస్ఆర్ మున్సిపల్ పాఠశాల తదితర కేంద్రాలను తనిఖీ చేశా రు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు ఈ దఫా ప్రకటించడం, అర్ధగంట ముందుగా రావాలనే కొత్త నిబంధనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనేక కేం ద్రాల వద్దకు ఉదయం 7 గంటలకే చేరుకున్నారు. అయితే నెల్లూరు నగరంలోని అరవిందనగర్‌లో ఉన్న వివేకానంద కళాశాల వద్ద తగిన బోర్డు ఉంచకపోవడంతో కొందరు విద్యార్థులు ఆదరాబాదరగా అదే బ్రాంచి ఉన్న స్టోన్‌హౌస్‌పేటకు వెళ్లారు. ఆ సెంటర్‌ను తమకు కేటాయించలేదని తెలుసుకుని వారు మళ్లీ ఏడుస్తూ అరవిందనగర్‌లోని కళాశాలకు వచ్చారు. ఈ లోపు కళాశాల వారు బోర్డు ఏర్పాటు చేశారు. చివరి నిమిషంలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నామని, లేదంటే తమ భవిష్యత్ నాశనమయ్యేదని విద్యార్థులు పేర్కొన్నారు. అరగంట ముందుగా అంటే 8.30కు చేరుకోలేదనే నెపంతో ఆలస్యానికి కారణాలంటూ విద్యార్థులతో వివరణ పత్రాలు రాయించుకున్నారు. దీంతో కొన్ని చోట్ల వారు కంగారు పడ్డారు. ఈ పత్రాలు తీసుకుని ఏమి చేస్తారో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఒకటి రెండు సంఘటనలు మినహా మొత్తం మీద పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. -
ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు, సంస్కృతం, హిం దీ, ఉర్దూ, అరబిక్ సబ్జెక్టు పరీక్షలు జరి గాయి. జిల్లావ్యాప్తంగా 133 పరీక్ష కేం ద్రాలు ఏర్పాటుచేయగా, జనరల్ విభాగంలో 48,392 మందికి 43,683 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ విద్య ఆర్ఐఓ మల్హల్రావు తెలిపారు. కాగా, గోవిందరావుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో కాపీ చేస్తున్న ఆరుగురు విద్యార్థులను స్క్వాడ్ బృందం డిబార్ చేసింది. కేంద్రాల వద్ద ముందస్తు సందడి ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, 8-30గంటల వరకే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం ఆలస్య మైనా అనుమతించేది లేదని స్పష్టం చేయడంతో అన్ని కేంద్రాల వద్ద ముం దుగానే సందడి నెలకొంది. ఎక్కువశా తం మంది విద్యార్థులు నిర్ణీత సమయానికి చేరుకున్నా అక్కడక్కడా ఆలస్యమై న విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉద యం 8-45గంటల తర్వాత జిల్లాలో 30 మంది విద్యార్థులు రాగా, వారి పేర్లను నమోదు చేశారు. ఇంకా మహబూబాబాద్‌లోని ఓ కేంద్రంలో ఐదుగురు విద్యార్థులు ఉదయం 9-05 గంట లకు రావడంతో, వివరణ తీసుకున్న అధికారులు ఇదే చివరిసారిగా పేర్కొంటూ అనుమతించారు. కాగా, జిల్లాలోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్ సౌకర్యం లేక కింద కూర్చుని పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువా రం ప్రారంభం కానున్నాయి. -
తొలిరోజు గడబిడ
-
5 నిమిషాల వరకు ఓకే
‘నిమిషం’ నిబంధనకు ఇంటర్ బోర్డు సడలింపు.. 9.05 వరకు పరీక్షహాల్లోకి అనుమతి సాక్షి, హైదరాబాద్: నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని ప్రకటించిన ఇంటర్ బోర్డు బుధారం ఆ నిబంధనకు కాస్త సడలింపునిచ్చింది. 5 నిమిషాలు వరకు ఆలస్యమైన విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత 15 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతించడం వల్ల కొన్ని కళాశాలలు ప్రశ్న పత్రాలను తెలుసుకొని తమ విద్యార్థులకు జవాబులు చేరవేస్తున్నాయని తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో.. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకూడదని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే పరీక్షలు ప్రారంభమైన మొదటిరోజే నిమిషం నిబంధనను బోర్డు కాస సడలించింది. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు.. అంటే 9.05 గంటల వరకు ఆలస్యానికి గల కారణాన్ని నమోదు చేసి విద్యార్థులను లోనికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అన్ని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇచ్చింది. అరుుతే విద్యార్థులు 8.30కే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, 9.05 గంటల తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. 6.75% గైరుహాజరు బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 65,814 (6.75 శాతం) మంది గైరుహాజరయ్యారు. మొత్తం 9,75,102 (జనరల్ విద్యార్థులు 9,09,038+వొకేషనల్ విద్యార్థులు 66,064) మందికి హాల్‌టికెట్లు ఇవ్వగా అందులో మొదటిరోజు 65,814 మంది మాత్రమే పరీక్షలకు గైరుహాజరయ్యారు. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 8.30 నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్న విషయం విదితమే. ‘దాదాపు విద్యార్థులంతా ఉదయం 8.45 గంటల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 8.45 నుంచి 9.00 గంటల మధ్య 621 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ప్రారంభ సమయం 9 గంటలకు 9 మంది పరీక్షా కేంద్రాలకు వచ్చారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న 9 మందిని గుర్తించాం..’ అని అధికార వర్గాలు తెలిపాయి. పరీక్షా కేంద్రాల్లో జిరాక్స్ మిషన్లు వాడరాదని, పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్ష జరిగే సమయంలో రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారం తీసుకొని మూసి వేయించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ :జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, 120 ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రాంతీయ అధికారి కేటీ దాశరథి తెలిపారు. కాగా జిల్లాలోని అన్ని కళాశాలల నుంచి జనరల్, ఒకేషనల్ విభాగాల్లో 48,270 మంది పరీక్షలకు హాజరు కావలసి ఉంది. అయితే 3,883 మంది ైగె ర్హాజరు కాగా 44,387 మంది పరీక్షలు రాశారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా 10 సిట్టింగ్ స్క్వాడ్లు, 5 ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30లకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా కొన్ని పరీక్షా కేంద్రాలకు మొత్తం 15 మంది విద్యార్థులు ఆలస్యంగా 8.45-9.00 గంటల మధ్య వచ్చారు. అయినా వారు దూరప్రాంతాల నుంచి రావడం వంటి సహేతుకమైన కారణాలు చూపడంతో పరీక్ష రాయడానికి అనుమతించినట్టు దాశరథి తెలిపారు. కాగా గురువారం నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. పలు కేంద్రాల్లో కొరవడ్డ కనీస సౌకర్యాలు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యమూ ఎదురు కాకుండా అన్ని ఏర్పాట్లూ చేశామని అధికారులు చెపుతున్నా.. పలు కేంద్రాల్లో అనేక సమస్యలను విద్యార్థులు చవి చూడాల్సి వచ్చింది. ఓవైపు ఎండలు ముదురుతుండడంతో.. విద్యుత్ సదుపాయం లేని చోట్ల, ఉన్నా ఫ్యాన్లు లేని చోట విద్యార్థులు ఉక్కపోతతో, చెమటలు కారుతుండగా పరీక్షలు రాయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల విద్యుత్ దీపాలు లేకపోవడంతో, ఉన్నా కరెంటు పోవడంతో మసక వెలుతురులోనే విద్యార్థులు తడుముకుంటూ జవాబులు రాయాల్సిన దుస్థితి ఎదురైంది. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో చాలినన్ని డెస్కులు లేకపోవడంతో ఎందరో విద్యార్థులు ప్యాడ్లను ఒళ్లో పెట్టుకుని, అవస్థలు పడుతూ పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇక్కడ మరుగుదొడ్లు వినియోగించజాలనంత అధ్వానంగా ఉండడం కూడా విద్యార్థులకు మరో విషమ పరీక్షగా మారింది. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :అధికార యంత్రాంగం చేసిన పటిష్టమైన ఏర్పాట్ల వల్ల జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు సజావుగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా ఒక్క పరీక్ష కేంద్రంలోనూ మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదు. బుధవారం ప్రథమ సంవత్సర పేపర్-1 పరీక్షకు దరఖాస్తు చేసిన 49,777 మందిలో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 130 కేంద్రాల్లో 46,907 మంది హాజరయ్యారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు జారీ చేసిన ప్రకటనల నేపథ్యంలో ఉదయం 7.00 గంటల నుంచే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం ప్రారంభించారు. ఉదయం 8.30 గంటలకు కేంద్రాల్లోనికి అనుమతించారు. 9.00 గంటల తరువాత వచ్చే విద్యార్థులను అనుమతించబోమని ముందుగా ప్రకటించిన అధికారులు తొలిరాజు అదనంగా ఐదు నిమిషాల సమయం కేటాయించారు. మిగతా రోజుల్లో ఉదయం 9.00 గంటల తరువాత ఎట్టిపరిస్థితుల్లో గేట్లు మూసి వేయిస్తామని ఆర్ఐవో ఎం. రూఫస్‌కుమార్ చెప్పారు. దూర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులు ప్రధానంగా ఆర్టీసీ బస్సులపై ఆధారపడగా, గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు విద్యార్థులతో కిటకిటలాడాయి. వివిధ ఇంజినీరింగ్, పార్మశీ కళాశాలల నిర్వాహకులు విద్యార్థులను తమ విద్యాసంస్థల బస్సుల్లో పరీక్ష కేంద్రాలకు చేర్చారు. కేంద్రాల వద్ద పోలీసు యంత్రాంగం 144 సెక్షన్ అమలు పరిచింది. పరీక్ష ప్రారంభమైన తరువాత విద్యార్థుల తల్లిదండ్రులను, వెంట వచ్చిన వారిని అక్కడి నుంచి పంపివేశారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను ముందుగానే మూసి వేయించారు. డిగ్రీ పరీక్షలతో తికమక.. జిల్లాలో వారం రోజులుగా ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. పలు కళాశాలలు ఇంటర్, డిగ్రీ కోర్సులు రెండింటినీ నిర్వహిస్తున్నాయి. ఆయా పరీక్ష కేంద్రాల బయట ఇంటర్, డిగ్రీ కేంద్రాలను వేర్వేరుగా సూచించే బోర్డులు లేక విద్యార్థులు తికమకపడ్డారు. గుంటూరులోని ఏసీ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పరీక్ష కేంద్రాలను పక్కపక్క భవనాల్లోనే ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల కోడ్లు కనిపించక ఇంటర్ విద్యార్థులు డిగ్రీ పరీక్షా కేంద్రంలోకి, డిగ్రీ విద్యార్థులు ఇంటర్ పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు. విస్తృత తనిఖీ.. జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇంటర్ బోర్డు ఆర్జేడీ డీఆర్కే పరమహంస పిట్టలవానిపాలెంలో రెండు, పొన్నూరులో ఒకటి, చేబ్రోలులో ఒక పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఆర్ఐవో ఎం. రూఫస్‌కుమార్ గుంటూరు ప్రభుత్వ వృత్తి విద్యా బాలికల జూనియర్ కళాశాల తదితరాలలో తనిఖీ చేశారు. మూడు అత్యున్నత స్థాయి కమిటీ సభ్యుల బృందాలు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యుల బృందాలు 5, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 7, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 5 పరీక్ష కేంద్రాలను తనఖీ చేశాయి. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
-
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్ : బుధవారం ఉదయం తొమ్మిది గంటలను ంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ సంవత్సరం 33,639 మంది, ద్వితీయ సంవత్సరం 42,334 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 107 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇన్విజిలేటర్లతోపాటు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులను నియమించారు. నాలుగు ఫ్లైయింగ్స్క్వాడ్ బృందాలు, ఐదు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ప్రతి కేంద్రంలోనూ జంబ్లింగ్ విధానాన్ని అమ లు చేస్తున్నారు. అరగంట ముందే అంటే ఉదయం 8.30 గంటలకు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, 8.45గం’’లకు పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని, ఆ తర్వాతా వచ్చే వారిని ఆలస్యానికి కారణాలు అడిగి రికార్డు చేస్తామని, 9గం’’లకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోని అనుమతించే ప్రసక్తేలేదని ఆర్ఐఓ దామోదరాచారి తెలిపారు. -
నేటినుంచి ఇంటర్ పరీక్షలు
ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. బుధవారం ప్రథమ, గురువారం ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 159 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. విజయవాడ నగరంలో 84 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2013-14 సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 1,30,100 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరం 65,091 మంది, రెండో సంవత్సరం 65,009 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ఒకేషనల్ విద్యార్థులు మొదటి సంవత్సరం 966 మంది, రెండో సంవత్సరం 1,666 మంది రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 159 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 159 మంది డిపార్టుమెంటల్ అధికారులు పరీక్షలను పర్యవేక్షిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. నిర్ణీత వ్యవధిలోగా చేరుకోవాలి నిర్ణీత వ్యవధిలోగా వచ్చినవారిని మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ అధికారి వెంకట్రామయ్య స్పష్టం చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 8 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 8.25 గంటలకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తామని, 8.30 గంటలకు హాల్‌టిక్కెట్లు పరిశీలించి, 8.45 గంటలకు ప్రొఫార్మా షీట్లు ఇస్తామని ఆయన తెలిపారు. 9 గంటల తరువాత పరీక్షా కేంద్రాల్లోకి ఎవరినీ అనుమతించబోమని చెప్పారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. 4 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ఇంతవరకూ ఆకాశమే హద్దుగా ఆడుతూ..పాడుతూ,,ఉల్లాసంగా గడిపిన విద్యార్థులు తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకునేందుకు సన్నద్ధమయ్యారు. నేటి నుంచిజరగనున్న ఇంటర్మీ డియెట్ పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లాలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రథమ- బుధవారం నుంచి, ద్వితీయ- గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని ఇంటర్మీడియెట్ ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్ఐఓ)ఎల్ఆర్ .బాబాజీ తెలిపారు. మంగళవారం ఆర్ఐఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న 170 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 22,410 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 25,427 మంది విద్యార్థులు రాయనున్నారని చెప్పారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చే శామని తెలిపారు. 138 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 138 మంది డిపార్ట్మెంట్ అధికారులు, ఐదుగురు సిట్టింగ్ స్క్వాడ్, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పనిచేస్తాయని, ప్రతి కేంద్రంలోనూ జంబ్లింగ్ విధానం అమలు చేయనున్నామన్నారు. అరగంట ముందే చేరుకోవాలి ఈ ఏడాది పరీక్షల సమయపాలనలో స్వల్ప మార్పులు చేశామని చెప్పారు. గత ఏడాది ఉదయం 9 గంటల లోపు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు తప్పనిసరిగా చేరుకోవాలనే నిబంధన విధించగా ఈ ఏడాది ఆ సమయాన్ని కాస్తా కుదించామన్నారు. అరగంట ముందు ఉదయం 8.30గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరు కోవాలని చెప్పారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాలను 8.45గంటలకు పరీక్ష కేంద్రాలకు తరలిస్తారని, విద్యార్థికి ప్రశ్నపత్రం ఇచ్చిన తరువాత ఏకారణం చేతనైనా మాట్లాడించడం, ప్రశ్నలు వేయడం చేయకూడదన్నారు. కేంద్రాల్లో ఫర్నిచరు, తాగునీరు, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. వెబ్సైట్ ద్వారా ‘హాల్‌టిక్కెట్’ కళాశాల యాజమాన్యం ఏ కారణం చేతనైనా హాల్‌టిక్కెట్ ఇవ్వని నేపథ్యంలో విద్యార్థి పరీక్షకు హాజరుకాలేని పరిస్థితి రాకూడదని ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోటీ పరీక్షల మాదిరిగానే అభ్యర్థి నేరుగా హాల్‌టిక్కెట్‌ను ‘బిఐఇఏపీ.సీజీజీ.జీఓవీటీ.ఐఎన్’ వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. అభ్యర్థులకు సూచనలు అభ్యర్థికిచ్చిన జవాబు బుక్లెట్ 24పేజీలున్నాయో లేదో చూసుకోవాలి (అడిషినల్ జవాబుపత్రం ఇవ్వరు) పరీక్షకేంద్రానికి 30 నిమిషాల ముందు హాజరు కావాలి. ఈ సమయం దాటితే పరీక్షకు అనుమతి ఇవ్వరు. అంధవిద్యార్థికి స్క్రైబ్ (సహాయకుడు)అర్హత డిగ్రీ చదువుతో సమానంగా ఉండాలి. సంబంధిత కోర్సులు చదివి ఉండకూడదు. ఓఎంఆర్ బార్‌కోడెడ్ షీటులోని పార్టు-3లో అభ్యర్థి ఏమైనా మార్పులు చేసినటై్లతే పబ్లిక్ పరీక్షలలో అనుచిత ప్రవర్తనగా పరిగణిస్తారు. సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడానికి అనుమతి లేదు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
పరీక్ష హాల్లోకి అనుమతించబోమన్న ఇంటర్ బోర్డు తొలిసారిగా ఈ పరీక్షల్లో ‘నిమిషం’ నిబంధన అమలు ఉదయం 8.30 గంటల కల్లా పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని విద్యార్థులకు సూచన నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పేపర్-1 పరీక్షతో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. నిమిషం నిబంధన అమలు చేయడం ఈసారి ఇంటర్ పరీక్షల ప్రత్యేకత. ఎంసెట్ తరహాలో ఇంటర్ బోర్డు కూడా మొదటిసారిగా నిమిషం నిబంధనను అమల్లోకి తెచ్చింది. అంటే నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని బోర్డు సూచించింది. విద్యార్థులను ఉదయం 8:30 గంటలనుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఆలస్యంగా వచ్చి ఇబ్బంది పడొద్దని స్పష్టం చేసింది. గతంలో పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల వరకు పరీక్ష హాల్లోకి అనుమతించేవారు. ఈసారి అలా కుదరదు. అరగంట ముందుగానే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తున్నందున ఆ వెసులుబాటును తొలగించినట్లు బోర్డు అధికారులు చెప్పారు. విద్యార్థుల్ని సాధారణంగా 8:45 గంటలవరకు పరీక్ష హాల్లోకి పంపుతారు. అయితే 8:45 గంటల నుంచి 9 గంటల వరకూ అనుమతిస్తారు. అయితే ఆలస్యానికి గల కారణాల్ని విద్యార్థులు రాతపూర్వకంగా తెలపాలి. రాష్ట్రవ్యాప్తంగా 2,661 కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్ పరీక్షలకు 19.78 లక్షలమంది హాజరు కానున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పేర్లు, మీడియం, పరీక్ష రాసే సబ్జెక్టు వివరాలు, హాల్‌టికెట్‌లో ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. విద్యార్థులు సంతకాలు చేసేముందు ఓఎంఆర్ బార్కోడ్ షీట్‌పైనా రిజిస్టర్ నంబరు, పేర్లు, సబ్జెక్టు వివరాలను చూసుకోవాలి. కొత్త సిలబస్, పాత సిలబస్ వివరాలను సరిచూసుకోవాలి. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రం లోకి సెల్ఫోన్లు తేరాదు. సెల్ఫోన్లు తెచ్చుకునేందుకు అనుమతి ఉన్న డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరిం టెండెంట్ల ఫోన్లపై ట్యాపింగ్ తరహా నిఘా ఉంటుంది. పరీక్షలపై సీఎస్ సమీక్ష: ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం సెకండరీవిద్య ముఖ్య కార్యదర్శి(ఇన్చార్జి) పూనం మాల కొండయ్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి రామ్‌శంకర్ నాయక్‌లతో సమీక్షించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేం దుకవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఆల్ ద బెస్ట్!
నేటి నుంచే ఇంటర్ పరీక్షలు జంట జిల్లాల నుంచి 3.5 లక్షల మంది అభ్యర్థులు 8.45 దాటితే పరీక్షాకేంద్రంలోకి అనుమతి నిల్ సాక్షి, సిటీబ్యూరో: మరికొద్ది గంటల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఫస్టియర్ విద్యార్థులు, గురువారం సెకండియర్ విద్యార్థులు ద్వితీయభాష పరీక్షలను రాయనున్నారు. పరీక్షలు ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులను అరగంట ముందు నుంచే పరీక్ష జరిగే హాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 8.45 తర్వాత పరీక్షాకేంద్రంలోకి విద్యార్థులను అనుమతించరు. ఆలస్యంగా వచ్చినట్లైతే అధికారులు ఇచ్చిన ప్రొఫార్మాలో అభ్యర్థులు ఆలస్యానికి కారణాలను వివరించాలి. సీఎస్, డీ వోలు మినహా పరీక్షాకేంద్రంలో ఎవ్వరూ (ఇన్విజిలేటర్లతో సహా) సెల్ఫోన్లు వినియోగించకూడదు. ఆకస్మిక తనిఖీల నిమిత్తం రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన స్క్వాడ్ బృందాలను నియమించినట్లు అధికారులు తెలిపారు. -
ఇంటర్ పరీక్షలకూ తప్పని 'నిమిషం' నిబంధన
-
పరీక్షకు సిద్ధం
పదవాల్తేరు, ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మూడేళ్లుగా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలుస్తున్న విశాఖ జిల్లాను ఈ దఫా కూడా అదే స్థాయి లో నిలపడానికి విద్యార్థులు సమాయత్తమయ్యారు. ఉజ్వల భవి ష్యత్తుకు మేలి మలుపుగా పరిగణించదగ్గ పరీక్షలకు అధ్యాపకుల అండతో సమాయత్తమైన వారు తమ సత్తా చూపడానికి సంసిద్ధులవుతున్నారు. ఈనెల 12 నుంచి 26 వరకు జరగ నున్న ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 301 జూనియర్ కళాశాలల నుంచి మొత్తం 1,00,895 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అర్బన్‌లో 56, రూరల్‌లో 39, ఏజెన్సీలో 16 మొత్తం 111 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 19 పరీక్ష కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా నిఘా పెట్టారు. పరీక్ష ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు అరగంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి. 8.45 గంటల తర్వాత పరీక్షలకు వచ్చే అభ్యర్థులు లేట్ రిజిస్టర్లో ఆలస్యానికి కారణం రాసిన తర్వాతే పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. 9 గంటలు దాటితే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎల్.జె.జయశ్రీ చెప్పారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, అయిదు సిటింగ్ స్క్వాడ్లు, ఆర్ఐవో, డీవీఈవో బృందాలు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తాయని ఆమె తెలిపారు. -
నిమిషం ఆలస్యమైనా నోఎంట్రీ!
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్ :ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఆర్ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పరీక్ష ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు. ప్రథమ సంవత్సరంలో 37,455 మంది, ద్వితీయ సంవత్సరంలో 33,125 మంది, ప్రైవేటు విద్యార్థులు 7,058 మంది కలిపి మొత్తం 77,638 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. 110 కే ంద్రాల్లో పరీక్షలు కొనసాగనున్నాయని, ఈ సారి కొత్తగా ఆలూరు, కోడుమూరు మోడల్ స్కూళ్లనూ కేంద్రాలుగా ఎంపిక చేశామని అన్నారు. మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్, ద్వితీయ సంవత్సరం సైన్స్ సబ్జెక్టులకు పాత, కొత్త సిలబస్‌లలో ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు. పరీక్షల పర్యవేక్షణకు నాలుగు ఫ్లైయింగ్స్క్వాడ్లు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, రవాణా సౌకర్యం కల్పించాలని, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో, ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖలకు విన్నవించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని చెప్పారు. పాత, కొత్త పేపర్లు ఇచ్చే విషయంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. పాత విద్యార్థులందరినీ ఒక రూంలో ఉంచి పరీక్ష రాయించాలని సూచించారు. ఫీజు పెండింగ్ ఉన్నా హాల్‌టికెట్ ఇవ్వాల్సిందే... ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఫీజు పెండింగ్‌లో ఉన్నా హాల్‌టికెట్ ఇవ్వాలని ఆర్ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు చెప్పారు. ముందుగా హాల్‌టికెట్ ఇచ్చేసి మార్క్‌లిస్ట్ ఇచ్చే సమయంలో ఫీజు వసూలు చేసుకోవాలన్నారు. హాజరుశాతం తక్కువగా ఉండే వారికి అపరాద రుసుము కట్టించుకుని హాల్‌టికెట్ ఇవ్వాలని సూచించారు. 70 నుంచి 75 శాతానికి రూ.200లు, 65 నుంచి 70 శాతానికి రూ.250లు, 60 నుంచి 65 శాతానికి రూ.500లను డీడీ ద్వారా ఫీజు చెల్లించి, దానిని ప్రిన్సిపాల్‌కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాపీయింగ్‌ను అరికట్టేందుకు బోర్డు చర్యలు పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టేందుకు బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇంటర్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నాపత్రాన్ని 8.45 గంటలకు తీస్తారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట నుంచి పరీక్ష నిర్వహణాధికారులు సెల్‌ఫోన్ ద్వారా పేపర్ లీక్ చేసేవారు. క్షణాల్లోనే కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఆ ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థులకు చెప్పేవి. 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో ప్రశ్నలకు సమాధానాలు చూసుకున్న విద్యార్థులు 9.15 గంటలకు పరీక్షా కేంద్రంలోకి వెళ్లేవారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఇంటర్ మీడియట్ బోర్డు కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు ఈ యేడాది సరికొత్త ఎత్తుగడ వేసింది. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా విద్యార్థులను 8.30 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. 8.45 నుంచి 9 గంటల మధ్య వచ్చే విద్యార్థులను ఆలస్యంగా వచ్చే వారిగా గురించి పేర్లు నమోదు చేస్తారు. ఆ వివరాలను ఇంటర్ మీడియట్ బోర్డుకు అదే రోజు పంపిస్తారు. దీంతో పాటు ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్ ఉపయోగించరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ మాత్రమే సెల్‌ఫోన్ వాడేందుకు అనుమతించారు. అది కూడా ఆండ్రాయిడ్ వర్షన్ ఫోన్ కాకుండా సాధారణ మొబైల్ ఫోన్‌ను వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మొబైల్ ఫోన్ ద్వారా బయటి వారికి సమాచారం చేరవేసినా క్షణాల్లో జియో పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ద్వారా ఇంటర్ మీడియట్ బోర్డు అధికారులకు తెలిసిపోతుంది. ఏ ఫోన్ నెంబర్ నుంచి ఏ ఫోన్ నెంబర్‌కు ఏ సమాచారం పంపించారో సులభంగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధానం రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ మీడియట్ పబ్లిక్ పరీక్షల నుంచి అమలు కానుంది. -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
* అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు * హాజరుకానున్న 19.78 లక్షల మంది * 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ * ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,661 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 19,78,379 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 9,29,090 మంది ఉండగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 10,49,289 మంది పరీక్షలు రాయనున్నారు. 975 ప్రభుత్వ, 187 ఎయిడెడ్, 1,499 ప్రైవేటు కాలేజీల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ వెల్లడించారు. సోమవారమిక్కడి బోర్డు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాన పరీక్షలు మార్చి 26తో పూర్తవుతాయని, అన్ని పరీక్షలు ఏప్రిల్ 1న ముగుస్తాయని తెలిపారు. ప్రధాన పరీక్షల స్పాట్ వాల్యుయేషన్‌ను ఈనెల 28న ప్రారంభిస్తామని, సంస్కృతం పేప రు మూల్యాంకనాన్ని ఈనెల 19 నుంచే మొదలుపెడతామని చెప్పా రు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. స్పాట్ వాల్యుయేషన్‌లో తప్పులు చేసే వారిపై చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు విద్య, పోలీసు, రెవెన్యూ సిబ్బంది తో 133 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 135 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బోర్డు నుంచి కూడా సీనియర్ అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తారని వివరించారు. ప్రథమ సంవత్సర విద్యార్థుల ద్వితీయ భాష పేపరు, ద్వితీయ సంవత్సర విద్యార్థుల మ్యాథ్స్-2ఏ, మ్యాథ్స్-2బీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, బ్రిడ్జి కోర్సు గణితం విషయంలో ఓల్డ్, న్యూ పేపర్లు ఉన్నాయని.. ప్రశ్నపత్రం తీసుకోగానే సరిగ్గా చూసుకొని పరీక్ష రాయాలని సూచించారు. ఆలస్యంగా వస్తే అనుమతి లేదు... ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు ఉదయం 8:30 గంటల కంటే ముందుగానే చేరుకోవాలి. 8:30 గంటల నుంచి 8:45 గంటల వరకు పరీక్ష హాల్లోకి పంపిస్తారు. ఆ తర్వాత కూడా 9 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. అయితే వారు తమ ఆలస్యానికి గల కారణాలు రాతపూర్వకంగా తెలియజేయాలి. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్లోకి అనుమతించరు. సెల్ఫోన్లు, ఎల క్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకూడదు. ఇన్విజిలేషన్ విధులు నిర్వర్తించే లెక్చరర్లు కూడా ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులకు సెల్‌ఫోన్ అనుమతి ఉన్నా, వారి ఫోన్లపై ట్యాంపింగ్ తరహా నిఘా ఉంటుంది. వారి ఫోన్ల నుంచి ఏయే నంబర్లకు కాల్స్, మెసేజ్‌లు వెళ్లాయనే సమాచారం సేకరిస్తారు. తద్వారా ప్రశ్నలు లీక్ వంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సమస్య లేకుండా, విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రథమ చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు పరీక్షకు ముందురోజే తమకు కేటాయించిన కేంద్రానికి వెళ్లి చూసుకోవాలి. ప్రైవేటు యాజమాన్యాలు మాల్ ప్రాక్టీస్, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరించినా, చర్యలు చేపడతారు. హాల్‌టికెట్ సమస్యలు వస్తే జిల్లాల్లో ఆర్ఐఓ కార్యాలయాల్లో, ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో 040-24601010 ఫోన్ నంబరు, 040-24655027 నంబరుకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వెబ్సైట్లో ఇంటర్ హాల్‌టికెట్లు ఈనెల 12 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను తమ వెబ్సైట్లోనూ (ఠీఠీఠీ.ఛజ్ఛ్చీఞ.ఛిజజ.జౌఠి.జీ) అందుబాటులో ఉంచినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈనెల 11న(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకున్న ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు తమ పదో తరగతి హాల్‌టికెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను వెంట తీసుకెళ్లాలి. ద్వితీయ సంవత్సర విద్యార్థులైతే ప్రథమ సంవత్సర హాల్‌టికెట్ నంబరును, పుట్టిన తేదీ వివరాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతే కాకుండా తాము బోర్డు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకొని వచ్చినట్లు ఇన్విజిలేటర్‌కు డిక్లరేషన్‌ను ఇవ్వాలని నాయక్ వివరించారు. అందరి అభిప్రాయాల మేరకే మూల్యాంకనం అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం చేయిస్తామని బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ తెలిపారు. తెలంగాణ విద్యార్థుల పేపర్లను తెలంగాణలోనే మూల్యాంకనం చేయించాలని కోరుతూ సోమవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి కార్యాలయం వద్ద తెలంగాణ లెక్చరర్స్ ఫోరం సభ్యులు నినాదాలు చేశారు. ఎక్కడి పేపర్లను అక్కడే మూల్యాంకనం చేయించాలని కోరుతూ నాయక్‌కు టీఎల్ఎఫ్ కన్వీనర్ వెంకటస్వామి వినతపత్రం అందజేశారు. పరీక్ష కేంద్రాలు: 2,661. వీటిలో సెల్ఫ్ సెంటర్లు 95, సమస్యాత్మక కేంద్రాలు 230 ప్రథమ సంవత్సర విద్యార్థులు (జనరల్) - 8,69,377 (బాలురు-4,45,061, బాలికలు-4,24,316) ప్రథమ సంవత్సర వొకేషనల్ విద్యార్థులు - 59,713 (బాలురు 37,116, బాలికలు 22,597) ద్వితీయ సంవత్సర విద్యార్థులు (రెగ్యులర్) - 8,01,467 (బాలురు - 4,13,123, బాలికలు - 3,88,344) ద్వితీయ సంవత్సర విద్యార్థులు (ప్రైవేటు) - 1,52,669 (బాలురు - 98,233, బాలికలు - 54,446) ద్వితీయ సంవత్సర వొకేషనల్ విద్యార్థులు (రెగ్యులర్) - 76,433 (బాలురు- 40,405, బాలికలు - 36,028) ద్వితీయ సంవత్సర వొకేషనల్ విద్యార్థులు (ప్రైవేటు) - 18720 (బాలురు- 11,387, బాలికలు - 7,333) ఇంటర్ ఆర్ట్స్ గ్రూపుల సిలబస్ మార్పు ఇంటర్మీడియట్ ఆర్ట్స్ గ్రూపుల సిలబస్ మారనుంది. ఈ మేరకు ఇంటర్ విద్య అధికారులు చర్యలు చేపట్టారు. ఇంతకుముందు సైన్స్, మ్యాథ్స్ గ్రూపుల సిలబస్‌ను మార్పు చేసిన అధికారులు.. ఇప్పుడు ఆర్ ్ట్స సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు. మొదట ప్రథమ సంవత్సర కోర్సు సిలబస్‌ను మారుస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయ సంవత్సర కోర్సుల సిల బస్‌ను మారుస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన నేపథ్యంలో కొన్ని పాఠ్యాంశాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
సర్వం సిద్ధం
రేపటినుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు జిల్లావ్యాప్తంగా 220 పరీక్ష కేంద్రాలు సెంటర్ సమీపంలో 144 సెక్షన్ అమలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఈ నెల 12 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 220 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందు లో 96 కేంద్రాలు గ్రామీణ ప్రాంతంలో, 124 కేంద్రాలు పట్టణ ప్రాంతం లో ఉన్నాయి. పరీక్షలకు హాజరయ్యే వారిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 99,392 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 1,01,357 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రం సమీపంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష సమయానికి అరగంట ముందే కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష సమయం నుంచి పదిహేను నిమిషాల తర్వాత కేంద్రంలోకి అనుమతించరని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఇప్పటికే హాల్‌టిక్కెట్లు పంపిణీ చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షకుడు ప్రతాప్ వెల్లడించారు. -
ఇంటర్ పరీక్షలకు అంతా రెడీ
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంట ర్మీడియెట్ పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగే పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించరు. ఉదయం 8.30 నుంచి 8.45 వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 8.45 నుంచి 9 గంటల మధ్య వచ్చినవారిని వివరణ తీసుకుని అనుమతిస్తారు. జిల్లాలో 58,160 మంది పరీక్షలకు హాజరుకానుండగా వీరికోసం 93 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్టియర్ పరీక్షలకు 27,863 (వొకేషనల్ విద్యార్థులు 1,396 మందితో కలిపి) మంది, సెకండియర్ పరీక్షలకు 30,297 (వొకేషనల్ విద్యార్థులు 2,651 మందితో కలిపి) మంది హాజరుకానున్నారు. 93 కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతోపాటు 37 మంది కస్టోడియన్లను నియమించారు. ప్రశ్నపత్రాలను 37 పోలీస్ స్టేషన్ల లో భద్రపరచగా ఇతర సామగ్రిని పరీక్ష కేంద్రాలకు చేరవేశారు. అక్రమాల అడ్డుకట్టకు ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిరోధించేందుకు హైపవర్ కమిటీతోపాటు నాలుగు ఫ్లయింగ్, ఐదు సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. దీంతోపాటు ఆర్ఐవో, డీఈసీ సభ్యులు తనిఖీలు నిర్వహించనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించటంతోపాటు జీపీఎస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. జీపీఎస్ వల్ల సెల్ఫోన్లు పనిచేయవు. కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సెల్ఫోన్లను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. వీరు కూడా స్మార్ట్ ఫోన్లు కాకుండా సాధారణ ఫోన్లే తేవాలి. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో వెళ్లిరావటానికి వీలుగా 12 రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఆర్ఐవో సమీక్ష పరీక్షల ఏర్పాట్లపై ఆర్ఐవో ఎ.అన్నమ్మ సోమవారం ఉదయం డీఈసీ సభ్యులు గురుగుబెల్లి అప్పలనాయుడు, బి.యజ్ఞభూషణ రావు, ఆర్.భూషణరావు, బల్క్ ఇన్చార్జి ఎం.ప్రకాశరావు, బి.ప్రసాదరావులతో సమీక్ష నిర్వహించారు. అక్రమాలకు తావులేకుండా అప్రమత్తంగా వ్య వహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వివరించారు. -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్‌లైన్ :ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన 96,239 మంది పరీక్షలు రాయనున్నారు. వివరాలను ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కేపీ దాశరథి విలేకరుల సమావేశంలో సోమవారం తెలిపారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 40 వేల 722 మంది, వృత్తి విద్యా కోర్సుల్లో 6 వేల 146 మంది, మొత్తం 46 వేల 868 మంది పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరంలో 42 వేల 424 మంది, వృత్తి విద్యా కోర్సుల్లో 6 వేల 947 మంది, మొత్తం 49 వేల 371 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సమస్యాత్మకంగా 23 పరీక్షా కేంద్రాలను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 126 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పది సిట్టింగ్ స్క్వాడ్స్, ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్స్, హైపర్ కమిటీలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఆలస్యంగా వచ్చిన వారి వివరాల నమోదు పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 8.30 నుంచి 8.45 గంటల లోపు రావాలి. తొమ్మిది గంటల వరకు వచ్చిన విద్యార్థులను ఆలస్యంగా వచ్చిన వారిగా పరిగణిస్తారు. ఈ విధం గా వచ్చిన వారి వివరాలు నమోదు చేసేందుకు కేంద్రాల వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. విద్యార్థులు ఆలస్యంగా రావడానికి కారణాలను విశ్లేషిస్తారు. హాల్ టికెట్లో తప్పు ఒప్పులు, లాంగ్వేజ్ సమస్యలు వంటివి గతంలో హైదరాబాద్ ఇంటర్ బోర్డు వారే సరిచేసేవారు. ఈసారి ఆ అనుమతి ఆర్ఐవోలకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటువంటి మార్పులేమైనా ఉంటే నేరుగా ఆర్ఐవో కార్యాలయానికి వెళ్లి పరిష్కరించుకునే అవకాశం కల్పించారు. జీపీఎస్ నిఘా పరీక్ష పత్రాలు లీకేజీ కాకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జీపీఎస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. సమీపంలోని సెల్ టవర్‌కు పరీక్ష కేంద్రాల ప్రాంతాన్ని అనుసంధానం చేశారు. విద్యార్థులు రహస్య కెమెరాలతో సైబర్ నేరాలకు పాల్పడుతుంటే జీపీఎస్‌తో ఆ ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ ద్వారా ఆ వివరాలు వెంటనే అధికారులకు చేరుతాయి. దీంతో వారు అప్రమత్తమై సంబంధిత విద్యార్థిపై చర్యలు తీసుకుంటారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టమెంట్ అధికారులకు సాధారణ సెల్ఫోన్లను మాత్రమే అనుమతిస్తారు. వీరు ఎటువంటి ఫీచర్లు ఉన్న సెల్ఫోన్లు వాడినా నేరంగా పరిగణిస్తారు. 17 రూట్లలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. -
హైటెక్ కాపీయింగ్‌కు జీపీఎస్‌తో చెక్
లీకేజి గుర్తింపునకు వీలు అన్ని ఫోన్లపై ప్రత్యేక నిఘా ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మొదటిసారిగా జీపీఎస్ అమలు ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీని అడ్డుకోవడంతోపాటు హైటెక్ కాపీయింగ్‌కు చెక్ పెట్టేందుకు మొట్టమొదటిసారి ఇంటర్మీడియెట్ బోర్డు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఇప్పటి వరకు ఒక్క పోలీసు విభాగానికి మాత్రమే అందుబాటులో ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ను ఇంటర్మీడియెట్ బోర్డు అందిపుచ్చుకోనుంది. ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు పరీక్ష సమయానికి ముందుగా ఎక్కడ బయటకు పొక్కుతున్నాయో తెలుసుకునేందుకు ఈ విధానం తోడ్పడుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొన్ని కళాశాలలు పరీక్ష పత్రాలను ముందుగానే లీకు చేయించి ఆ ప్రశ్నలను విద్యార్థులకు చెప్పి పరీక్షకు పావుగంట ఆలస్యంగా పంపుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలకు చెక్‌పెట్టేందుకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలున్న ప్రదేశం అక్షాంశాలు, రేఖాంశాలు ముందుగా బోర్డుకు తెలియజేశారు. అదేవిధంగా ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, అదనపు చీఫ్‌లు అందరి ఫోన్ నంబర్లు ముందుగా ఇంటర్మీడియెట్ బోర్డుకు తెలియజేశారు. ఈ ఫోన్ నంబర్లన్నింటినీ సమీపంలోని సెల్‌టవర్లకు అనుసంధానం చేస్తారు. దీని కోసం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లోని అందరి సెల్ఫోన్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. అతి తెలివి తేటలతో వారి ఫోన్ కాకుండా ఇతర నంబర్లతో మాట్లాడినా దొరికిపోతారు. ఆయా పరీక్ష కేంద్రాల అక్షాంశాలు, రేఖాంశాలను బట్టి ఆ సెంటర్ నుంచి ఫోన్ కాల్ బయటకు వెళ్లినట్లు రికార్డు అవుతుంది. దాన్ని విశ్లేషిస్తే ఏ నంబర్ నుంచి ఏ నంబర్‌కు ఫోన్ కాల్ చేసింది, ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఎంత సమయం మాట్లాడారు తదితర విషయాలన్నీ రికార్డవుతాయి. ఆ విధంగా కాల్ వివరాలతో అక్రమార్కుల ఆటలను కట్టడి చేసేందుకు బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పరీక్ష కేంద్రంలో కేవలం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారుల వద్ద మాత్రమే ఫోన్లు ఉండాలి. ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది ఫోన్లన్నింటినీ చీఫ్ వద్ద ఉంచాలి. పరీక్ష కేంద్రాల్లో ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగించరాదని బోర్డు ఆంక్షలు పెట్టింది. ఆండ్రాయిడ్ ఫోన్‌తో ప్రశ్నపత్రాలను ఫోటోలు తీసి ఎస్ఎంఎస్ల ద్వారా ఇతరులకు క్షణాల్లో చేరవేసేందుకు వీలున్నందున ఆ ఫోన్లను పరీక్ష కేంద్రాల్లో వినియోగించవద్దన్నారు. హైటెక్ కాపీయింగ్‌కు చెక్: ఈ పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్‌కు బోర్డు చెక్ పెట్టింది. గతంలో విద్యార్థులను పరీక్ష ప్రారంభమైన 15 నిముషాల వరకు అనుమతించేవారు. ప్రస్తుతం దాన్ని మార్చి అర్ధగంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో ఉండాలి. పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. గతంలో విద్యార్థులను 9.15 గంటలకు పరీక్షకు అనుమతించేవారు. ప్రస్తుతం దాన్ని మార్చారు. విద్యార్థులు 8.45 గంటలకు పరీక్ష రాసే హాలులో ఉండాలి. 8.45 గంటల తరువాత పరీక్ష హాలులోకి వచ్చే విద్యార్థుల పేర్లు, హాల్‌టికెట్ నంబర్ ఇతర వివరాలు ప్రత్యేకంగా ఒక పుస్తకంలో నమోదు చేయాలి. పరీక్షకు ఆలస్యంగా రావడానికి గల కారణాలు కూడా స్పష్టంగా పేర్కొనాలి. ఒకే కళాశాల విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా వస్తున్నట్లు తేలితే దానిపై పూర్తిస్థాయిలో ఆరా తీసి తగు చర్యలు తీసుకుంటారు. మొత్తంగా కాపీయింగ్‌ను నిరోధించేందుకు, ప్రశ్నపత్రాల లీకేజిని అరికట్టేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు చేపట్టిన చర్యలు ఏమేరకు సత్ఫలితాలిస్తాయో వేచి చూడాలి. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : ఈ నెల 12వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు జాయింట్ కలెక్టర్ ఎండీ హషీం షరీఫ్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్లో ఏజేసీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పరీక్షల్లో మాస్ కాపీయింగ్, ఇతర అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమాల నిరోధానికి ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాలన్నారు. జిల్లాలోని 93 పరీక్ష కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ప్రథమ చికిత్స సిబ్బంది, మందులను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షలు ముగిసిన అనంతరం జవాబు పత్రాలను స్పీడ్ పోస్టులో పంపేందుకు అవసరమైన ఏర్పాట్లకు సహకరించాలని పోస్టల్ శాఖ అధికారులను కోరారు. పరీక్ష సామగ్రిని భద్రపరిచేందుకు, తరలించేందుకు అవసరమైన రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎ.అన్నమ్మ మాట్లాడుతూ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో జరుగుతాయని, అవసరమైన సిబ్బందిని నియమించామని చెప్పారు. సమావేశంలో జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి పి.పాపారావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యుడు జి.అప్పలనాయుడు, ఆర్టీసీ డీపో మేనేజర్ ముకుందరావు, పోలీస్, వైద్యఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఇంటర్మీడియెట్ పరీక్షలకు అరగంట ముందే అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడానికి అరగంట ముందు నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. సిలబస్ మారిన నేపథ్యంలో కొత్తవారికి కొత్త సిలబస్ ఆధారంగా.. బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ రాసేవారికి పాత్ సిలబస్ ఆధారంగా ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నారు. ఇంటర్ తొలి సంవత్సరం పార్ట్-2లోని సెకండ్ లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, అరబిక్, ఫ్రెంచ్, మరాఠీ, కన్నడ, ఒరియా పేపర్లు.. బైపీసీ విద్యార్థులకు నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు మేథమేటిక్స్, రెండో సంవత్సరం పార్ట్-3లోని మేథమేటిక్స్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బ్రిడ్జ్ కోర్సు మేథమేటిక్స్ పేపర్లను బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ అభ్యర్థులు పాత సిలబస్ ఆధారంగా రాయడానికి అవకాశం కల్పించారు. -
కాపీ కొడితే....ఇంటికే
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసులను నిరోధించేందుకు పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనలను కఠిన తరం చేశాయి. విద్యార్థి కాపీకి పాల్పడితే ఇంటికి పంపే ఏర్పాట్లు చేశాయి. అలాగే విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నాయి. తాజా నిబంధనలతో విద్యార్థి మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్లను ఆ విధుల నుంచి తప్పించడంతోపాటు, మాతృస్థానం నుంచి సస్పెండ్ చేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యార్థి కాపీ కొట్టిన సంఘటనల్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, సీనియర్ అధ్యాపకులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులతో పాటు ఇన్విజిలేషన్ విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలను పరీక్షల విధులతో పాటు పాఠశాలల నుంచి సస్పెండ్ చేస్తారు. ఇటువంటి సంఘటనల్లో వారిని సస్పెండ్ చేసే అధికారాన్ని సంబంధిత శాఖల డీఈవో, ఆర్జేడీ స్థాయి అధికారులకు కల్పించారు. రూ. లక్ష వరకూ భారీ జరిమానా విధించే అవకాశముంది. ఉద్దేశపూర్వకంగా తప్పిదం చేశారని నిరూపణ అయితే యాక్ట్-25 కింద క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. మూడు నుంచి ఆరేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. విద్యార్థిపై అనర్హత వేటు మాల్ ప్రాక్టీసుకు పాల్పడిన విద్యార్థులకు షోకాజ్ నోటీసు జారీ చేసి, తదుపరి పరీక్షలకు హాజరయ్యే వీలు లేకుండా అనర్హత వేటు వేస్తారు. అనంతరం పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా జరిగే విచారణలో గరిష్టంగా ఐదేళ్ళ వరకు అనర్హత వేటు విధించే అవకాశాలు న్నాయి. పదో తరగతి పరీక్షలకు 578 మంది సీఎస్, డీవోల నియామకం ఈ నెల 27 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు మొత్తం 578 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. 301 మంది పైబడిన విద్యార్థులన్న పరీక్షా కేంద్రానికి మరొక అదనపు చీఫ్ సూపరింటెండెంట్‌ను నియమించారు. ఒక్కో కేంద్రానికి 11 మంది చొప్పున మొత్తం 3,179 మంది ఇన్వజిలేటర్లను నియమించారు. పదో తరగతి పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లకు ఈనెల 6 నుంచి శిక్షణ వుంటుంది. ఈ నెల 12 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షల ఏర్పాట్లపై ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ అధికారులతో గుంటూరులో బుధవారం సమీక్షా సమావేశం జరగనుంది. -
పరీక్షల వేళ...ఎన్నికల గోల!
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : వార్షిక పరీక్షల సమయంలో ఎన్నికల గోల మొదలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో దాదాపుగా ఇటు పదో తరగతి, అటు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది పరీక్షలతో పాటు ఎన్నికలు కూడా తరుముకొస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన ప్రారంభమైంది. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల కొన్ని పాఠశాలల్లో సిలబస్ సరైన సమయంలో పూర్తికాలేదు. దీంతో విద్యార్థులను పరీక్షలకు పూర్తిస్థాయిలో తీర్చిదిద్దలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్‌విడుదల చేయడంతో ఉపాధ్యాయులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటారు. మరోవైపు సాధారణ ఎన్నికల షెడ్యూల్ కూడా నేడోరేపో విడుదల కానుంది. దీంతో ఈ ఏడాది కూడా చదువులు చట్టబండలయ్యే పరిస్థితి దాపురించింది. జిల్లాలో ఉన్న సుమారు 12 వేల మంది ఉపాధ్యాయుల్లో గతంలో ఎక్కువ శాతం మందిని ఎన్నికల విధులకు వినియోగించేవారు. అయితే పరీక్షలుండడంతో ఎంతమంది పరీక్షలకు, ఎంతమందిని ఎన్నికలకు వినియోగించాలో అధికారులకు అర్ధంకావడం లేదు. అందరికీ ‘పరీక్షా’కాలం మార్చి నెల అంటేనే ‘పరీక్షా’కాలం. ఈ నెలలో ఇంటర్ పరీక్షలు ముగిసి, నెలాఖరులో పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నారుు. ఇదే సమయంలో ఆంధ్రా యూనివర్శిటీ డిగ్రీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ పరీక్షల సెమిస్ట్లు కూడా ప్రారంభమవుతాయి. టెన్త్ పరీక్షలకు 28 వేల మందివిద్యార్థులు, ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాలు కలిపి 32 వేలమంది ఇలా సుమారు లక్ష మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలకు చెందిన సుమారు 40 వేల మంది విద్యార్థులకు ఓటు హక్కు ఉంది. పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహిస్తుండడం వల్ల విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా అనుమానమే. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా నిమగ్నమై ఉంటారు. ఉపాధ్యా యులంతా పరీక్షల విధుల్లోనే ఉంటారు. వీరే ఎన్నికల విధులకు కూడా హాజరుకావాల్సి ఉంటుండడంతో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలలో అర్థంకాక అధికారులు మధనపడుతున్నారు. -
మూల్యాంకనమూ సమస్యే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ మూల్యాంకనం కూడా సమస్యగా తయారైంది. వచ్చే నెల 12 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 27 నుంచి ప్రారంభం అయ్యే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏ ప్రాంతంలోని విద్యార్థుల పేపర్లను ఆ ప్రాంతంలోనే చేయాలన్న డిమాండ్లు వస్తుండటంతో విద్యాశాఖ, ప్రభుత్వ అధికారులకు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. విభజన ఉద్యమంలో భాగంగా ఇరుప్రాంతాల్లోని ఉపాధ్యాయులు, లెక్చరర్లు సమ్మెలకు దిగిన నేపథ్యంలో మూల్యాంకనం వ్యవహారంలో ప్రాంతీయ అభిమానం పనిచేస్తే అదే పెద్ద సమస్యగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా మూల్యాంకనం అనేది రహస్య వ్యవహారమే అయినప్పటికీ ఒక ప్రాంతంలోని పేపర్లు మరో ప్రాంతానికి వెళితే తక్కువ మార్కులు వేసే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన ఇటు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, తల్లిదండ్రుల్లో నెలకొంది. దీంతో ఏ ప్రాంత జవాబు పత్రాలను ఆ ప్రాంతంలోనే మూల్యాంకనం చేయించాలని లెక్చరర్ల సంఘాలు ఇంటర్మీడియట్ బోర్డుకు విజ్ఞాపన పత్రాలు అందజేశాయి. దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏ ప్రాంతం వారి పేపర్లను ఆ ప్రాంతంలోనే మూల్యాంకనం చేస్తే టెన్త్‌లో ఎక్కువ మార్కులు వేసుకున్నా తీవ్రస్థాయిలో సమస్య లేకపోయినా ఇంటర్మీడియట్లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటం, జేఈఈ మెయిన్‌లో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా టాప్-20 పర్సంటైల్ విధానం ఉన్న పరిస్థితుల్లో ప్రాంతీయ అభిమానంతో ఎక్కువ మార్కులు వేస్తే ఎలాగన్న గందరగోళం నెలకొంది. దీనివల్ల బాగా చదివే విద్యార్థులకు నష్టం వాటిల్లడంతోపాటు అనర్హులకు మేలు జరిగే పరిస్థితి నెలకొంది. తక్కువ మార్కులు వచ్చి ఎవరికైనా నష్టం జరిగితే రీవ్యాల్యుయేషన్ వంటి ప్రత్యామ్నాయం ఉన్నా.. అది విద్యార్థులందరి విషయంలో కష్టసాధ్యమనే వాదన ఉంది. అలాగని ఏ ప్రాంత పేపర్లు ఆ ప్రాంతానికి పంపితే, అక్కడ ప్రాంతీయ అభిమానం పనిచేస్తే సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. -
ప్రయోగ ‘పరీక్ష’
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ పరీక్షలకు సమయం ఆసన్నమవుతోంది. ఈనెల 12వ తేదీ నుంచి మార్చి 4వ తే దీ వరకు నిర్వహించేందుకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంట ల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏ టా కళాశాలల్లో సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలం అవుతున్నారు. ఈ ఏడాది కూడా ప్రాక్టికల్ పరీక్షలకు అరకొర వసతులు ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పెట్టుగా లేవు. చాలా కళాశాల ల్లో ప్రయోగ పరికరాలు, రసాయనాలు కూడా లేవు. అధికారులు పరీక్షలు ఎలా నిర్వహిస్తారో తెలపాలి. 21,352 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు, వొకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,620 మంది, బైపీసీ విద్యార్థులు 7,453, వొకేషనల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 3,349, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,930 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల కోసం 38 ప్రభుత్వ కళాశాలు, ఆరు ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలు, ఏడు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలు, 51 ప్రైవేట్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాలుగు విడతలు ప్రాక్టికల్ పరీక్షలు నాలుగు విడతలుగా జరుగనున్నాయి. మొదటి విడత ఈనెల 12 నుంచి 16 వరకు.. రెండో విడత 17 నుంచి 21 వరకు.. మూడో విడత 22 నుంచి 26 వరకు.. నాలుగో విడత ఈనెల 28 నుంచి మార్చి 4 వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఎంపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్ 60 మార్కులు, బైపీసీకి 60 మార్కులు, వొకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 150 మార్కుల చొప్పున ఉంటాయి. ఈ ప్రాక్టికల్ పరీక్షల మార్కులు థియరీ పరీక్షల మార్కులతో కలుపుతారు. ఈ మొత్తం మార్కులు ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడుతాయి. విద్యార్థులకు తప్పని అవస్థలు రెండేళ్ల పాటు కష్టపడి చదివి ప్రాక్టికల్ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న ఇంటర్ విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. పరికరాలు, రసాయనాలు లేకపోవడంతో ప్రయోగాలు అంతంత మాత్రంగానే చేస్తే మార్కుల్లో కోత విధించే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలకు రెండేళ్ల క్రితం ప్రాక్టికల్ పరీక్షల పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.2 లక్షల నిధులు విడుదల చేసింది. వీటిలో కొన్ని కళాశాలల్లో నామమాత్రంగా పరికరాలు కొనుగోలు చేశారు. వాటిని ఉపయోగించుకపోవడంతో దుమ్ము, దూళి, తుప్పుపట్టి చెడిపోయాయి. ప్రైవేట్ కళాశాలల పరిస్థితి దారుణంగా ఉంది. సౌకర్యాలు లేకున్నా అధికారులు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల నిర్వహణ కోసం అధికారులు కళాశాలలను పరిశీలనకు వెళ్లిన సమయంలో కళాశాల యాజమాన్యాలు ఏదో కొన్ని పరికరాలు చూపి అనుమతిని పొందుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పైపైనే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైన విద్యార్థులకు నష్టం కలుగకుండా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సౌకర్యాల విషయమై ఆర్ఐవో ఫజలుల్లాను అడుగగా.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలకు సౌకర్యాలు ఉన్న కళాశాలలకు మాత్రమే అనుమతినిచ్చాం. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం. -
ఇంటర్ పరీక్షల్లో ‘గూగుల్’ నిఘా
ఆర్మూర్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 76 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను గూగుల్ ద్వారా జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్)కు కనెక్ట్ చేశామని ఆర్ఐఓ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ విధానంతో ఇంటర్ పరీక్ష జరుగుతున్న సమయంలో ఆయా సెంటర్ల నుంచి సెల్ఫోన్లు ఉపయోగిం చినా, ఫోన్లు, మెసేజ్‌లు చేసినా వెంటనే తమకు సమాచారం అందుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా హైటెక్ మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించవచ్చన్నారు. శనివా రం ఆర్మూర్‌లోని క్షత్రియ జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు. విద్యార్థులు విజ్ఞాన సముపార్జనకే ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రణాళిక బద్ధంగా చదవాలని, విజయం సాధించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గురుచర ణం, క్షత్రియ కళాశాల డెరైక్టర్ అల్జాపూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్ష కేంద్రాలపై హైటెక్ నిఘా!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాలపై హైటెక్ నిఘా పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైటెక్ మాస్‌కాపీయింగ్, ప్రశ్నలు, ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు ట్యాపింగ్ తరహాలో పరీక్ష కేంద్రాల్లోని మొబైల్ నెట్‌వర్క్స్‌పై నిఘా పెట్టి కాల్స్, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్, మెడిసిన్‌తోపాటు ఇంటర్‌లోనూ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఇదివరకే అధికారులు గుర్తించారు. అంతేగాక.. పరీక్షలు ఆరంభమైన అరగంటలోపే కొన్ని ప్రశ్నలు లీకైన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. అందులో భాగంగా పోలీసు కమ్యూనికేషన్స్ విభాగం సహకారంతో పరీక్ష కేంద్రాల్లో మొబైల్ నెట్‌వర్క్స్‌పై నిఘా పెట్టేందుకు సిద్ధమైంది. పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోన్ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ ప్రశ్న, జవాబు పత్రాల రవాణాకోసం మొబైల్స్‌ను వాడుతున్నారు. పరీక్ష కేంద్రం ఉండే అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంతో అనుసంధానం చేసి, మొబైల్ కాల్స్, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్, వాటిల్లోని వివరాలను సేకరిస్తారు. ఇవన్నీ పోలీసుశాఖ సర్వర్‌లో నిక్షిప్తమవుతాయి. తద్వారా పేపరు లీకేజీ, ప్రశ్నలు బయటకు రావడం వంటి వాటిని అరికట్టాలని అధికారులు భావిస్తున్నారు. 5 నిమిషాలకు మించి ఆలస్యమైతే నో ఎంట్రీ! ఈసారి పరీక్ష ప్రారంభమయ్యాక ఐదు నిమిషాలకు మించి ఆలస్యమైతే.. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదన్న ప్రతిపాదనపై ఇంటర్ బోర్డు సీరియస్‌గా ఆలోచిస్తోంది. ప్రస్తుతం విద్యార్థులను 8:45 గంటలకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అయ్యాక గరిష్టంగా పావుగంట ఆలస్యం అయినా(9:15 గంటల వరకు) పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. అయితే ఇందులో 10 నిమిషాల సమయాన్ని కుదించాలని బోర్డు భావిస్తోంది. అంటే విద్యార్థులను 9:05 గంటల వరకే పరీక్ష హాల్లోకి పంపుతారు. దీనిపై నిర్ణయం వెలువడాల్సి ఉంది. మొదటి 3 ప్రశ్నలూ సొంత మీడియంలో... ఇంటర్ పరీక్షల్లో ద్వితీయ భాష సంస్కృతం, అరబిక్ పేపర్లో మొదటి మూడు ప్రశ్నలకు విద్యార్థులు ఎంచుకున్న మీడియంలో జవాబులు రాసేందుకు అవకాశం కల్పించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు దాదాపు 15 మార్కుల విలువైన జవాబులను ఆయా భాషల లిపిలోగాక విద్యార్థులు ఎంచుకున్న మీడియంలో రాసుకోవచ్చు. ఐదేళ్లపాటు దీనిని అమలు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మార్కులకోసం సంస్కృతం, అరబిక్‌లను ద్వితీయ భాషగా ఎంచుకుంటున్న విద్యార్థులు సంస్కృతాన్ని దేవనాగరి లిపిలోగాక తెలుగులో రాస్తున్నారు. అరబిక్ కూడా అంతే. ఈ నేపథ్యంలో సంస్కృత పరీక్షను దేవనాగరి లిపిలోనే, అరబిక్‌ను అరబిక్ లిపిలోనే రాయాలని ఇంటర్ బోర్డు గతంలో నిర్ణయించింది. దీనిపై విద్యార్థులు పదేపదే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. మొదటి మూడు ప్రశ్నలను వారు ఎంచుకున్న మీడియంలో రాసే అవకాశాన్ని కల్పించింది. దీంతో విద్యార్థులకు కొంత ఊరట కల్పించినట్లవుతుందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. -
మెరుగైన మార్కులకు మార్గాలు..
ఇంటర్మీడియెట్‌లో చూపిన ప్రతిభ భవిష్యత్తులో సుస్థిర కెరీర్‌కు బాటలు వేస్తుంది. ఇంటర్ పరీక్షల ప్రారంభానికి దాదాపు 100 రోజులు మాత్రమే సమయముంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బైపీసీలో అత్యధిక మార్కులు సాధించేందుకు సబ్జెక్టు నిపుణులు అందిస్తున్న ప్రిపరేషన్ ప్లాన్... జువాలజీ ఫస్టియర్ ఎంసెట్ మెడికల్ విభాగంలో ఇంటర్ వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచి మొదలు పెట్టి మార్చిలో జరిగే పరీక్షల వరకు ఎలా చదివితే గరిష్ట ప్రయోజనం లభిస్తుందో ఎవరికి వారు ప్రణాళిక వేసుకోవాలి. ప్రథమ సంవత్సరం సిలబస్‌లో 8 యూనిట్లున్నాయి. వీటి ప్రాధాన్యత ఇలా ఉంటుంది. యూనిట్ 1: జీవ ప్రపంచ వైవిధ్యం - 6 మార్కులు; యూనిట్ 2: జంతుదేహ నిర్మాణం - 10 మార్కులు; యూనిట్ 3: జంతు వైవిధ్యం (1) - 6 మార్కులు; యూనిట్ 4: జంతు వైవిధ్యం (2) - 6 మార్కులు; యూనిట్ 5: గమనం, ప్రత్యుత్పత్తి - 8 మార్కులు; యూనిట్ 6: మానవ సంక్షేమంలో జీవశాస్త్రం-14 మార్కులు; యూనిట్ 7: బొద్దింక- 12 మార్కులు; యూనిట్ 8: జీవావరణం, పర్యావరణం-14 మార్కులు. విద్యార్థులు ఈపాటికే చాలా వరకు సిలబస్‌ను పూర్తిచేసి ఉండాలి. ప్రిపరేషన్‌కు ఈ వంద రోజులు చాలా కీలకమైనవి. ఇంటర్ వార్షిక పరీక్షలో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు, స్వల్ప సమాధాన ప్రశ్నలు, దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు: అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు: మూడు విభాగాల్లోనూ ఇది అతి ముఖ్యమైంది. దీంట్లో చాయిస్ ఉండదు. గరిష్ట మార్కులు పొందడానికి ఈ విభాగం మంచి అవకాశం. అందువల్ల అకాడమీ పాఠ్యపుస్తకంలో ప్రతి యూనిట్ చివర ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్నంగా చదవాలి. వారానికి ఒక యూనిట్ చొప్పున సాధన చేయాలి. ఇది భవిష్యత్తులో ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్వల్ప సమాధాన ప్రశ్నలు: ఈ విభాగానికి గరిష్టంగా 24 మార్కులు కేటాయించారు. కొన్ని ప్రశ్నలకు బాగా పటాలు గీయాల్సిన అవసరం ఉంది. అందువల్ల విద్యార్థులు అవసరమైన పటాలను చాలాసార్లు సాధన చేయాలి. వారానికి కొన్ని పటాలు చొప్పున ప్రాక్టీస్ చేయాలి. దీర్ఘ సమాధాన ప్రశ్నలు: 6, 7, 8 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చే అవకాశముంది. పరాన్న జీవుల జీవితచక్రాలు, బొద్దింక, జీవావరణం, పర్యావరణం యూనిట్ల నుంచి ఈ రకమైన ప్రశ్నలు ఇస్తారు. దాదాపు 12 ప్రశ్నలకు సమాధానాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సమయపాలన కచ్చితంగా పాటించాలి. దీర్ఘ సమాధాన ప్రశ్నల్ని పరిచయం, వివరణ, సబ్ హెడ్డింగ్స్ రూపంలో సాధన చేయాలి. సెకండియర్ ప్రస్తుతం సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు.. ఆ తర్వాత పోటీ పరీక్షలు వరుసగా ఉంటాయి. కాబట్టి వారికి ఇప్పటి నుంచి అన్ని పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతి నిమిషం విలువైనదే. ద్వితీయ సంవత్సరం సిలబస్‌లో 8 యూనిట్లున్నాయి. పాఠ్యాంశాలు- వెయిటేజ్: యూనిట్ 1: మానవ జీర్ణక్రియ, శోషణం, శ్వాసించడం, వాయువుల వినిమయం- 8 మార్కులు. యూనిట్ 2: శరీర ద్రవాలు, ప్రసరణ, విసర్జక పదార్థాలు- విసర్జన- 10 మార్కులు. యూనిట్ 3: కండర, అిస్థిపంజర వ్యవస్థ, నాడీ నియంత్రణ- సమన్వయం- 10 మార్కులు. యూనిట్ 4: అంతస్స్రావక వ్యవస్థ, రసాయన సమన్వ యం,రోగ నిరోధక వ్యవస్థ-10 మార్కులు. యూనిట్ 5: మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి సంబంధిత ఆరోగ్యం- 12 మార్కులు. యూనిట్ 6: జన్యుశాస్త్రం- 12 మార్కులు. యూనిట్ 7: జీవపరిణామం- 8 మార్కులు. యూనిట్ 8: అనువర్తిత జీవశాస్త్రం- 8 మార్కులు. విద్యార్థులు ప్రయోగపరీక్షలకు రికార్డులను సిద్ధం చేసుకోవడంతో పాటు థియరీ పరీక్షలకు సన్నద్ధం కావాలి. జనవరి చివరిలోగా సిలబస్‌ను ఒకసారైనా పూర్తిచేయాలి. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్‌కు ప్రిపేర్ కావాలి. తర్వాత ఇంటర్ వార్షిక పరీక్షలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలి. - కె. శ్రీనివాసులు, శ్రీచైతన్య విద్యాసంస్థలు. ఫిజిక్స్ ఫస్టియర్ జూనియర్ ఇంటర్ విద్యార్థులు ఎక్కువగా భయపడే సబ్జెక్టు ఫిజిక్స్. అందువల్ల దీనిపై తొలుత ఇష్టం పెంచుకొని, శ్రద్ధతో చదవడాన్ని అలవాటు చేసుకోవాలి. ముఖ్యమైన చాప్టర్లు: సింపుల్ హార్మోనిక్ మోషన్; రొటేటరీ మోషన్; కైనమాటిక్స్; వెక్టార్స్; కైనటిక్ గ్యాస్ థియరీ; గ్యాస్, లిక్విడ్, సాలిడ్ వ్యాపనాలు. వెక్టార్స్లోని భౌతిక సిద్ధాంతాలను చదవడం ద్వారా ఆ చాప్టర్‌పై పట్టు సాధించవచ్చు. రొటేటరీ మోషన్, యాంగులర్ మూవ్మెంట్, పొజిషన్ వెక్టార్, యూనివర్సల్ గ్రావిటేషనల్ లా, ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ అతి ముఖ్యమైనవి. సింపుల్ హార్మోనిక్ మోషన్లో టైం ఫేజ్, సమస్యల సాధనలో దాని ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించుకోవాలి. సర్ఫేస్ టెన్షన్లో నిత్య జీవితంలో దాని ఉపయోగాలు, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, కేపిలారిటీ- దాని ఉపయోగాలను చదవాలి. థర్మో డైనమిక్స్‌లో జౌల్స్ లా, హీట్ కాలిక్యులేషన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరిమీటర్, అడియాబాటిక్, ఐసోథర్మల్ ఛేంజెస్ మొదలైన వాటిని బాగా చదవాలి. సెకండియర్ ఫస్టియర్‌తో పోల్చితే సెకండియర్ ఫిజిక్స్ కొంత కష్టమని విద్యార్థులు భావిస్తారు. అయితే ప్రణాళిక ప్రకారం చదివితే సెకండియర్ ఫిజిక్స్‌లోనూ అధిక మార్కులు తెచ్చుకోవచ్చు. పాఠ్యాంశాలు- వెయిటేజీ/అంచనా: వేవ్స్- 6 మార్కులు; రే ఆప్టిక్స్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్- 8 మార్కులు; కరెంట్ ఎలక్ట్రిసిటీ- 10 మార్కులు; మూవింగ్ ఛార్జెస్ అండ్ మాగ్నటిజం- 14 మార్కులు; పరమాణువు- 8 మార్కులు; కేంద్రకం- 6 మార్కులు; సెమీ కండక్టర్ పరికరాలు- 6 మార్కులు. దీర్ఘ సమాధాన ప్రశ్నలకు ముఖ్యమైన అంశాలు: వేవ్ మోషన్; కేంద్రకం;సెమీ కండక్టర్ పరికరాలు; మూవిం గ్ ఛార్జెస్- మాగ్నటిజం; విద్యుదయస్కాంత ప్రేరణ. స్వల్ప సమాధాన ప్రశ్నలకు ముఖ్యమైనవి: సెమీ కండక్టర్ పరికరాలు; కరెంట్ ఎలక్ట్రిసిటీ; అయస్కాంతత్వం; ఎలక్ట్రిక్ పొటెన్షియల్, రే ఆప్టిక్స్; డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. కెమిస్ట్రీ ఫస్టియర్ కెమిస్ట్రీలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు ప్రధానంగా రసాయన బంధం, పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, కర్బన రసాయన శాస్త్రం నుంచి వస్తాయి.కాబట్టి వీటికి అధిక సమయం కేటాయించాలి. కెమిస్ట్రీలో ఎక్కువగా అతిస్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకంలో రోజుకో చాప్టర్ చదువుతూ ముఖ్యమైన పాయింట్లను అండర్లైన్ చేస్తూ నోట్స్ తయారు చేసుకోవాలి. పాఠం చివర ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసుకోవాలి. కర్బన రసాయన శాస్త్రం, బోర్న్ హేబర్ వలయం, హైడ్రోజన్ స్పెక్ట్రం, అయనైజేషన్ పొటెన్షియల్, పీరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. కర్బన రసాయన శాస్త్రంలో నేమ్డ్ రియాక్షన్స్, ప్రాపర్టీస్ అంశాలను బాగా చదవాలి. జనరల్ కెమిస్ట్రీలోని Stoichiometry, ఫిజికల్ కెమిస్ట్రీలోని Stoichiometry, కెమికల్ కైనటిక్స్, ఎనర్జిటిక్స్లోని కాన్సెప్టులను నేర్చుకొని, సమస్యలన్నింటినీ సాధన చేయాలి. Stoichiometry, అటామిక్ స్ట్రక్చర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వీటిల్లో ఉండే సమస్యలను సాధన చేయ డంతోపాటు సినాప్సిస్‌ను రూపొందించుకోవాలి. సెకండియర్ కెమిస్ట్రీలో 60కి 60 మార్కులు తెచ్చుకోవాలంటే మొదట తెలుగు అకాడమీ పుస్తకాన్ని క్షుణ్నంగా చదవాలి. చాప్టర్ల చివర ఇచ్చిన ఉదాహరణలు, ప్రశ్నలను బాగా చదవాలి. ఇప్పటి నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కు ల ప్రశ్నలపై ఎక్కువగా దృష్టిసారించాలి. ముఖ్యంగా విద్యుత్ రసాయనిక శాస్త్రం; కెమికల్ కెనైటిక్స్; పి-బ్లాక్ ఎలిమెంట్స్; ఇ, ఏ, ై కలిగిన ఆర్గానిక్ పదార్థాల చాప్టర్ల లోని దీర్ఘ సమాధాన ప్రశ్నలు చదవాలి. ఆర్గానిక్ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను తప్పనిసరిగా పేపర్‌పై రాస్తూ ప్రాక్టీస్ చేయాలి. జనవరిలో ముఖ్యమైన లఘు సమాధా న, నాలుగు మార్కుల ప్రశ్నలపై శ్రద్ధచూపాలి. ఫిబ్రవరి, మార్చిలో అప్పటివరకు చదివిన అంశాలను రివిజన్ చేయాలి. పాఠ్యాంశాలు- వెయిటేజీ/అంచనా: విద్యుత్ రసాయన శాస్త్రం- 10 మార్కులు; పి బ్లాక్ మూలకాలు-12 మార్కులు; డి,ఎఫ్ బ్లాక్ మూలకాలు- 6 మార్కులు; ఇ, ఏ, ై కలిగిన ఆర్గానిక్ పదార్థాలు- 8 మార్కులు; నైట్రోజన్ కలిగిన ఆర్గానిక్ పదార్థాలు- 4 మార్కులు. బోటనీ ఫస్టియర్ ‘తెలుగు అకాడమీ’తో మేలు: బోటనీకి సంబంధించి తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలను చదవటం చాలా ముఖ్యం. పాఠ్యాంశాలను చదివేటప్పుడు ఒక వరుసక్రమాన్ని పాటిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ముందు చదివిన అంశాలు.. తర్వాత పాఠాలు తేలిగ్గా అర్థమయ్యేందుకు ఉపయోగపడతాయి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా వెయిటేజీని అంచనా వేసుకొని చదవాలి. దీనివల్ల ఏ అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలో తెలుస్తుంది. పాఠ్యాంశాలు-వెయిటేజీ: యూనిట్ 1: జీవ ప్రపంచంలో వైవిధ్యం (14 మార్కులు) యూనిట్ 2: మొక్కల నిర్మాణాత్మక సంవిధానం- స్వరూపశాస్త్రం (12 మార్కులు) యూనిట్ 3: మొక్కల్లో ప్రత్యుత్పత్తి (12 మార్కులు) యూనిట్ 4: ప్లాంట్ సిస్టమాటిక్స్ (6 మార్కులు) యూనిట్ 5: కణ నిర్మాణం, విధులు (14 మార్కులు) యూనిట్ 6: మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం (12 మార్కులు) యూనిట్ 7: వృక్ష ఆవరణ శాస్త్రం (6 మార్కులు) ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చిత్రపటాలను వేగంగా గీయటం నేర్చుకోవాలి. ప్రతి పాఠ్యాంశం చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సమాధానాల్లో ముఖ్యాంశాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. చేతిరాతను మెరుగుపరచుకోవాలి. సెకండియర్ మొదటి సంవత్సర వార్షిక పరీక్షల్లో ఏవైనా పొరపాట్లు చేస్తే, అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మంచి మార్కులు సాధించేందుకు అవకాశముంటుంది. తెలుగు అకాడమీ బోటనీ పుస్తకాల్లో కొన్ని అంశాలు సవివరంగా, స్పష్టంగా లేవు. అందువల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను చదివిన తర్వాత ప్రతి పాఠం చివర ఉన్న ప్రశ్నలకు పరీక్షలకు అవసరమయ్యే విధంగా సమాధానాలు రాసుకోవాల్సి ఉంటుంది. పాఠ్యాంశాలు- వెయిటేజీ: యూనిట్ 1: మొక్కల శరీర ధర్మ శాస్త్రం (28 మార్కులు); యూనిట్ 2: సూక్ష్మజీవ శాస్త్రం (6 మార్కులు); యూనిట్ 3: జన్యుశాస్త్రం (6 మార్కులు); యూనిట్ 4: అణు జీవశాస్త్రం (8 మార్కులు); యూనిట్ 5: బయోటెక్నాలజీ (16 మార్కులు); యూనిట్ 6: ప్లాంట్స్, మైక్రోబ్స్, హ్యూమన్ వెల్ఫేర్ (12 మార్కులు). 1, 5, 6 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. 1, 2, 3, 4, 5 యూనిట్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. మొక్కల శరీరధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీ యూనిట్ల పాఠ్యాంశాలు క్లిష్టంగా ఉంటాయి కాబట్టి వాటిని ఒకటికి రెండుసార్లు విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీలైనన్ని నమూనా పరీక్షలు రాయాలి. ప్రశ్నలకు రాసే సమాధానాల్లో స్పష్టత అధికంగా ఉండాలి. ఫ్లో చార్టులు అవసరమైన చోట వాటినే చిత్రపటాలుగా భావించాలి. -బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. -
11వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ ఫీజు గడువు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుంచి నిర్వహించే ఇంటర్మీడియెట్, ఎస్సెస్సీ పరీక్షలకు హాజరుకావాలనుకునే వారు ఇప్పటివరకు ఫీజు చెల్లించకపోతే.. వారు తత్కాల్ కింద ఈనెల 11వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు 10న తుది గడువు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ పొందేందుకు రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులు ఈనెల 10లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనారిటీ ఆర్థిక కార్పొరేషన్ వెబ్సైట్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.