రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపియింగ్ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
సూర్యాపేట : రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపియింగ్ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. బుధవారం జరుగుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం మాథ్య్-ఏ పేపర్ పరీక్ష జరుగుతుండగా ఈ విషయం బయటపడింది. నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని కొన్ని ప్రైవేటు కళాశాలలకు చెందిన అధ్యాపక బృందమే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. పరీక్ష జరుగుతున్న సమయంలోనే ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకెళ్లి.. వాటికి సరైన సమాధానాలు రాసి... తీసుకొచ్చి... విద్యార్థులకు పంచుతున్నట్లు అధికారులకు సమాచారం.