
రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారు.
ఒకేసారి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలవుతాయి. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విద్యార్ధులు పరీక్ష ఫలితాలను www.sakshi.com, www.sakshieducation.com లో చూసుకోవచ్చు.