ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడానికి అరగంట ముందు నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికార వర్గాలు తెలిపాయి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడానికి అరగంట ముందు నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. సిలబస్ మారిన నేపథ్యంలో కొత్తవారికి కొత్త సిలబస్ ఆధారంగా.. బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ రాసేవారికి పాత్ సిలబస్ ఆధారంగా ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నారు.
ఇంటర్ తొలి సంవత్సరం పార్ట్-2లోని సెకండ్ లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, అరబిక్, ఫ్రెంచ్, మరాఠీ, కన్నడ, ఒరియా పేపర్లు.. బైపీసీ విద్యార్థులకు నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు మేథమేటిక్స్, రెండో సంవత్సరం పార్ట్-3లోని మేథమేటిక్స్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బ్రిడ్జ్ కోర్సు మేథమేటిక్స్ పేపర్లను బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ అభ్యర్థులు పాత సిలబస్ ఆధారంగా రాయడానికి అవకాశం కల్పించారు.