జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు, సంస్కృతం, హిం దీ, ఉర్దూ, అరబిక్ సబ్జెక్టు పరీక్షలు జరి గాయి. జిల్లావ్యాప్తంగా 133 పరీక్ష కేం ద్రాలు ఏర్పాటుచేయగా, జనరల్ విభాగంలో 48,392 మందికి 43,683 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ విద్య ఆర్‌ఐఓ మల్‌హల్‌రావు తెలిపారు. కాగా, గోవిందరావుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో కాపీ చేస్తున్న ఆరుగురు విద్యార్థులను స్క్వాడ్ బృందం డిబార్ చేసింది.
కేంద్రాల వద్ద ముందస్తు సందడి
ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, 8-30గంటల వరకే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం ఆలస్య మైనా అనుమతించేది లేదని స్పష్టం చేయడంతో అన్ని కేంద్రాల వద్ద ముం దుగానే సందడి నెలకొంది. ఎక్కువశా తం మంది విద్యార్థులు నిర్ణీత సమయానికి చేరుకున్నా అక్కడక్కడా ఆలస్యమై న విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉద యం 8-45గంటల తర్వాత జిల్లాలో 30 మంది విద్యార్థులు రాగా, వారి పేర్లను నమోదు చేశారు.
ఇంకా మహబూబాబాద్‌లోని ఓ కేంద్రంలో ఐదుగురు విద్యార్థులు ఉదయం 9-05 గంట లకు రావడంతో, వివరణ తీసుకున్న అధికారులు ఇదే చివరిసారిగా పేర్కొంటూ అనుమతించారు. కాగా, జిల్లాలోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్ సౌకర్యం లేక కింద కూర్చుని పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువా రం ప్రారంభం కానున్నాయి.