
సాక్షి, అమరావతి: 12వ తరగతి పరీక్షల నిర్వహణపై తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు బుధవారం లేఖ రాశారు. ఆ లేఖలో.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ కేంద్రం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున ప్రత్యేక కోటాలో వ్యాక్సిన్ కేటాయించాలని, టీచర్లు, ఇన్విజిలేటర్లు, ప్రొఫెసర్‌లను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేస్తే ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో మానసిక స్థైర్యం పెంపొందించగలుగుతామని, కేంద్రం వారిని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా వ్యాక్సిన్ కోటా కేటాయించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment