
జ్యూస్ అందజేస్తున్న ఏఎన్‌ఎం, దిగులుగా కూర్చున్న విద్యార్థినులు
రంగారెడ్డి, పెద్దేముల్: మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రానికి ఇద్దరు విద్యార్థినులు ఆలస్యంగా వచ్చారు. దీంతో వారిని అధికారులు అనుమతించలేదు. దీంతో విద్యార్థినులు కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించారు. బంట్వారం మండలంలోని మోడల్ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు అనూష, స్వర్ణలత ఉదయం 9.20 నిమిషాలకు వచ్చారు. ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి రావడంతో అధికారులు వారిని అనుమతి ఇవ్వలేదు. బంట్వారం మండలం బోపూనారం నుంచి మోమెడ్‌పై రావడంతో అలస్యమైందని పరీక్షకు అనుమతి ఇవ్వాలని విద్యార్థినులు కోరినా అధికారులు స్పందించలేదు. దీంతో విద్యార్థినులు అక్కడే కుప్పకూలిపోయారు. ఏఎన్‌ఏం వారికి జ్యూస్ పంపిణీ చేశారు.