యాదగిరిగుట్ట: ఇంటర్ ద్వితియ సంవత్సరం పరీక్షల్లో భాగంగా ఒకే గదిలో పరీక్ష రాస్తున్న ఐదుగురు విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఈ సంఘటన జరిగింది.
నేడు జరుగుతున్న ఇంటర్ ద్వితియ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష సందర్భంగా వీరంతా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతు పట్టుబడ్డారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించిన రిజనల్ జాయింట్ డైరెక్టర్ సుహాసిని ఇది గుర్తించి అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చే సమయంలో సరిగ్గా తనిఖీలు నిర్వహించవకపోవడం పై మండిపడ్డారు.
కామారెడ్డిలో మరో ముగ్గురు:
ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రంలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు డిబార్ అయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీకి వచ్చిన సమయంలో ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుపడటంతో స్క్వాడ్ అధికారి నాగరాజు వారిని డిబార్ చేశారు.
ఒకే గదిలో ఐదుగురు డిబార్
Published Sat, Mar 4 2017 3:37 PM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
Advertisement
Advertisement