
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,65,156 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 5,46,368 మంది, సెకెండియర్ విద్యార్థులు 5,18,788 మంది ఉన్నారు. వీరికోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.