హైదరాబాద్: ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్ పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. మార్చి 9 వ తేదీ సోమవారం నుంచి 27 వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1,251 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
ఇంటర్ పరీక్షలకు 973,237 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొంది. వారిలో 426, 448 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం, 506789 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారని వివరించింది.