Jagadeesh reddy
-
కాసుల కక్కుర్తితో HCU విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు
తెలంగాణ భవన్,సాక్షి: హెచ్‌సీయూ భూముల కోసం న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులను.. పెయిడ్ బ్యాచ్ అని మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటు’అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జీపై జగదీష్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల జరిపిన లాఠీఛార్జ్‌ను బీఆర్ఎస్ ఖండిస్తోంది. 1969లో విద్యార్థుల పోరాట ఫలితం వల్లనే HCUను సాధించుకున్నాం. ఉద్యమ ఫలితంగా సాధించిన HCUను కాపాడుకునేందుకు విద్యార్థులు పోరాటం చేస్తున్నారు.న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులను.. పెయిడ్ బ్యాచ్ అని మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో పెయిడ్ బ్యాచ్ ముఖ్యమంత్రి,మంత్రులు. బ్లాక్ దందా వల్ల వచ్చిన పైసలతో పదవులు తెచ్చుకున్నారు. సమాజ శ్రేయసు కొరకు విద్యార్థులు పాటుపడుతారు. విద్యార్థులకు మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం, నటుడు ప్రకాష్ రాజ్ పేమెంట్ బ్యాచ్ నా. కేసీఆర్ హరితహారం చేస్తే , కాంగ్రెస్ హరితసంహారం చేస్తుంది.కేసీఆర్ వనసంరక్షణ చేస్తే రేవంత్ రెడ్డి హరిత భక్షణ చేస్తున్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే హెచ్‌సీయూలో జరుగుతున్న పనులు ఆపొచ్చు. పోలీసులను బయటకు పంపొచ్చు. కాంగ్రెస్, బీజేపీలు నాటకం ఆడుతున్నాయి. వైస్ ఛాన్సలర్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఎలా లోపటికి వెళ్తారు. డ్రోన్ కెమెరా ఎగరేస్తే 500 రూపాయలతో ఫైన్ వేయొచ్చు అని మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఇవ్వాళ హెచ్‌సీయూ విద్యార్థులు డ్రోన్ ఎగరేశారని వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు.హెచ్‌సీయూ భూముల అమ్మక వ్యవహారం చీకటి దందాలో భాగమే.హెచ్‌సీయూ భూములను గురువు కోసం (చంద్రబాబు నాయుడు) అప్పనంగా రేవంత్ రెడ్డి చీకటి దందాకు తెరలేపారు. సేవ్ హెచ్‌సీయూ అని యూనివర్సిటీ విద్యార్థులకు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే 5 లక్షల మంది మద్దతు పలికారు. వారందరూ పెయిడ్ బ్యాచ్చేనా. హెచ్‌సీయూ భూములను అమ్మిన మూటల కోసమే రాహుల్ గాంధీ మౌనంగా ఉంటున్నారు.యూనివర్సిటీనీ గౌరవించే మా హయంలో రోడ్లు వెయ్యలేదు. కమిషన్ల కొరకు కక్కుర్తి పడి రైతుల జీవితాలతో , విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆరోపణలు గుప్పించారు. -
కొత్త పథకాలు పెద్ద బోగస్: జగదీష్‌రెడ్డి
సాక్షి,సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ కొత్త నాలుగు పథకాల కార్యక్రమం అంతా బోగస్సేనని, ముందురోజు వరకు దరఖాస్తులు తీసుకుని తెల్లారే లబ్ధిదారుల ఎంపిక అంటున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆదివారం(జనవరి26) జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘గ్రామ సభలన్నీ ఒక ప్రహాసనంగా మార్చారు. రెండు సార్లు దరఖాస్తులు తీసుకుని బుట్టదాఖలు చేసి మళ్లీ దరఖాస్తులు అంటున్నారు. పైరవీ చేసుకున్న వారికి మాత్రమే లబ్ధి చేకూరుతోంది. హామీలు ఎగ్గొట్టడానికే కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలాడుతున్నాయి. ఒకరు రాష్ట్రానికి టోకరా వేస్తే మరొకరు దేశానికి టోకరా వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు తెలంగాణ ద్రోహులే. ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్‌కు చేతకావడంలేదు. దోచుకోవడం కప్పం కట్టడంతోనే రేవంత్‌కు సమయం సరిపోవడంలేదు’అని జగదీష్‌రెడ్డి విమర్శించారు.కాగా ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డుల జారీ అనే నాలుగు కొత్త స్కీమ్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆదివారం(జనవరి26) ప్రారంభించింది. ఈ స్కీములను కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గీలో సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతు భరోసా నిధులు రైతు ఖాతాలో జమవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: అర్ధరాత్రి నుంచే రైతుభరోసా డబ్బులు ఖాతాల్లోకి -
మంత్రి కోమటిరెడ్డిపై జగదీష్‌రెడ్డి ఫైర్
సాక్షి,నల్లగొండజిల్లా:ప్రజల్లో వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ నేతలు చిల్లర చేష్టలు చేస్తున్నారని రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.నల్గొండలో జగదీష్‌రెడ్డి శుక్రవారం(జనవరి24) మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది.ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాల కంటే ప్రజలే ఎక్కువ ఎండగడుతున్నారు.తెలంగాణలో బీజేపీ,కాంగ్రెస్ ఎంపీలు కుమ్మక్కయ్యాయి.ప్రజల సొమ్ము ,ఆస్తులను దోచుకునేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.కోర్టు ఉత్తర్వుల ప్రకారం శాంతియుతంగా రైతు మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం.మంత్రి కోమటిరెడ్డికి కోతలు తప్ప చేతలు లేవు’అని జగదీష్‌రెడ్డి విమర్శించారు.కాగా,బీఆర్ఎస్ తలపెట్టిన నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు(Telangana High Court) అనుమతినిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్(BRS Party) భావించిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన కోర్టు షరతులతో అనుమతి మంజూరు చేసింది.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నల్లగొండ పట్టణంలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదించడం, రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయడం లేదని, వాటిపై ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ బీఆర్ఎస్ ఈ మహాధర్నాను తలపెట్టింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా మహాధర్నాకు అనుమతి కోసం ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు దరఖాస్తు చేశారు. దాని విషయంలో పోలీసులు వెంటనే నిర్ణయం ప్రకటించలేదు. ధర్నాకు ముందు రోజైన సోమవారం ఉదయం అనుమతి ఇవ్వడం లేదని లేఖ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంది. -
రైతు భరోసా నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే..
-
సీఎం రేవంత్ కాంగ్రెస్‌ను ముంచుతున్నాడు: జగదీష్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం(నవంబర్ 12) జగదీష్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘కొడంగల్‌లో అధికారులపై జరిగిన దాడి రేవంత్ రెడ్డిపై జరిగిన దాడి. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముంచుతున్నారు.కాంగ్రెస్ పార్టీని వాడుకుని రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు.నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారు. కలెక్టర్ మాపైన దాడి జరగలేదని చెప్పారు.ప్రభుత్వం కేసులు ఎందుకు పెడుతోంది.రాష్ట్రంలో మేధావులు కొడంగల్‌కు వెళ్లి రావాలి.కొడంగల్ నియోజకవర్గంలో అధికారులను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పిలుపు ఇవ్వలేదు.కొడంగల్ ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని కాంగ్రెస్ అనడంలో ఆశ్చర్యం లేదు. 25సార్లు సీఎం రేవంత్ ఢీల్లి వెళ్లి ఎవరి కాళ్ళు మొక్కారో ప్రజలకు తెలుసు. ఉదయం రాహుల్ గాంధీ,కె.సి.వేణుగోపాల్ రాత్రి మోదీ,అమిత్ షా కాళ్ళు రేవంత్‌రెడ్డి పట్టుకుంటున్నారు.కేటీఆర్ ఢీల్లికి వెళ్ళింది కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల బండారం బయటపెట్టడానికే.మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి తెలంగాణ నుంచి రూ. 300 కోట్లు పంపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంతమంది బీఆర్ఎస్ నేతలకు నోటీసులిచ్చినా సమాధానమిస్తారు’అని జగదీష్‌రెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్..మోదీ ఏం చేస్తున్నారు: కేటీఆర్ -
పొంగులేటి బాంబుల కామెంట్స్.. జగదీష్‌రెడ్డి కౌంటర్
సాక్షి,హైదరాబాద్:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ బాంబుల కామెంట్స్‌పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి జగదీష్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై జగదీష్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మంగళవారం(అక్టోబర్ 29) మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ బాంబులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్ దోపిడీ బాంబులను అడ్డుకుంటాం. మా హాయాంలో తప్పు జరిగితే విచారణ జరుపుకోవచ్చు.కాంగ్రెస్ నేతల చిల్లర బెదిరింపులకు భయపడేది లేదు. మంత్రులు చిల్లర మాటలు బంద్ చేసి పాలనపై దృష్టి పెట్టాలి. బీఆర్ఎస్ పోరాటం వల్లే విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించింది. పాలన చేతకాకనే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారు. ప్రజాస్వామికవాదిగా చెప్పుకునే పెద్దమనిషి ఇప్పుడు ఎక్కడున్నారు? పెద్దమనిషి కాంగ్రెస్ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. పోలీసులే రోడ్డు ఎక్కటం చరిత్రలో ఇది మెదటిసారి.సీఎం సెక్యూరిటీ నుంచి స్పెషల్ పోలీసులను తప్పించటం అన్యాయం. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఆంధ్రకు వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.పండుగల సమయంలో 144సెక్షన్లు పెట్టడం దుర్మార్గం. లోఓల్టేజీ కరెంట్‌తో ఇళ్ళల్లో వస్తువులు కాలిపోతున్నాయి. కమీషన్ రాదన్న కారణంగానే విద్యుత్ శాఖను ప్రభుత్వం గాలికొదిలేసింది. కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకోవడానికి రాష్ట్ర ఖజానాను దెబ్బతీస్తున్నారు. కరోనా కాలంలో కూడా తెలంగాణ ఆదాయం తగ్గలేదు.ఇప్పుడెందుకు తగ్గింది? పేదలకు చెందాల్సిన ఆదాయం మంత్రులు,కాంగ్రెస్ నేతలు తింటున్నారు. తెలంగాణను చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చింది కేసీఆర్. రైతులకు కూడా 24గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. కాంగ్రెస్ అంటే ఏంటో ప్రజలు,రైతాంగానికి అర్థమైంది. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి. పత్తిని కొనుగోలు చేయాలి.నాణ్యత లేని గుజరాత్ పత్తికి ఎక్కువ ధర ఇస్తున్నారు’అని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి: సమస్యలు కొనితెచ్చుకుంటున్న తెలంగాణ సీఎం -
జన్వాడ ఫామ్ హౌస్ ఘటన : బీజేపీ నేతలపై జగదీష్ రెడ్డి ఫైర్
సూర్యాపేట: సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లు కూడా భూములు ఆక్రమిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు ఎందుకు స్పందించడం లేదని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి. జన్వాడ్ ఫామ్ హౌస్ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు.కేటీఆర్ ఇంటిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. వారెంట్ లేకుండా ఎలా వస్తారు ఎక్కడో ఏదో జరిగిందని సాకుతో రావడం ఏంటి. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లు కూడా భూములు ఆక్రమిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు ఎందుకు స్పందిచడం లేదు.పోలీస్ వ్యవస్థ దిగజారుతోంది. నిజాం కాలంలో కూడా ఇంతదారుణంగా లేదు. చిల్లర దాడులు మమ్మల్ని బెదిరిస్తాయని అనుకోవద్దు. కేటీఆర్ ప్రజల తరపున కొట్లాడుతోండనే ఈ దాడులు. తప్పుడు కేసులు పెట్టినా మా గొంతును మూయలేరు. గతంలో స్వయంగా పోలీసులు ఇళ్లల్లో ఆయుధాలు పెట్టి కేసులు నమోదు చేశారు. రాజ్ పాకాల విషయంలో అలాంటిదే జరిగి ఉండొచ్చు. పోలీసులే జేబుల్లో ఏదన్నా పెట్టుకుని వచ్చి ఇంట్లో పెట్టి ఉండేవారేమో.బీజేపీ నేతలు బండి సంజయ్, రఘునంధన్ రావుకు ఎందుకంత అత్యుత్సాహం.బండి సంజయ్ కి సమాచారం ఎవరిచ్చారు. ఇంట్లో దావత్ చేసుకుంటే బాటిల్స్ ఉన్నాయట. తెలంగాణలో ఉదయమే మంత్రులు తాగుతున్నారు.పరీక్ష చేద్దామా. తెలంగాణలో గృహప్రవేశం చేసుకుంటే దావత్ చేసుకుంటారా లేదా?.ఎలాంటి కేసులనైనా ఎదుర్కోవడానికి సిద్ధం. పోలీసులు తగిన మూల్యం చెల్లిస్తారు’ అని వ్యాఖ్యానించారు. -
కోమటిరెడ్డి వినోదం పంచుతున్నారు: జగదీష్‌రెడ్డి
సాక్షి,సూర్యాపేటజిల్లా:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శనివారం(అక్టోబర్19)ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సబ్జెక్ట్‌పై కాకుండా కోమటిరెడ్డి బూతులు మాట్లాడుతున్నాడు.సమస్యను పక్కదారి పట్టిస్తూ మీడియాకు వినోదం పంచుతున్నాడు. మూసీ కాలుష్యానికి కారణం ఎవరో చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ ద్రోహ ఫలితమే మూసీ కాలుష్యం.1956లో మంచినీటితో ఉన్న మూసీని 2014 నాటికి కాలుష్యకాసారంగా మార్చింది ఎవరు. దొరలు,రజాకార్లకు నిలయం కాంగ్రెస్.కోమటిరెడ్డి బాష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’అని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.ఇదీ చదవండి: రేవంత్,బండిసంజయ్లది డ్రామా: కేటీఆర్ -
తెలంగాణ పరువు తీస్తున్నారు: జగదీష్‌రెడ్డి ఫైర్
సాక్షి,సూర్యాపేట జిల్లా: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సీఎం స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని, రాష్ట్ర ప్రజల పరువు పోయేలా ఆయన ఉపన్యాసాలుంటున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు.శుక్రవారం(అక్టోబర్ 18)సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘ఎవరో రాసిచ్చిన పాఠం చదవడం రేవంత్ మానేస్తే మంచిది. తెలంగాణ ఆదాయం పెంచింది కేసీఆర్. 2014 బడ్జెట్‌ను ఇప్పటి బడ్జెట్ పోల్చి చూస్తే ఎవరు ఆదాయం పెంచారో తెలుస్తుంది. అప్పులు మంత్రుల జేబులో నుంచి కడుతున్నట్లు అతితెలివిగా మాట్లాడుతున్నారు.420 హామీలొద్దు. కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలైనా ఇస్తే చాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ఆదాయం,అప్పులపై చర్చకు మేం సిద్ధమే. సెక్యూరిటీ లేకుండా సీఎం మూసీ ప్రాంతంలో తిరిగి చూపించాలి. మూసీ కూల్చివేతల తర్వాత సెక్యూరిటీ పెంచుకుని ప్రగల్భాలు పలుకుతున్నారు. అశోక్ నగర్ పేరు వింటే రేవంత్‌కు భయమేస్తోంది. సీఎం ఏకపక్షంగా వెళుతున్నారని కాంగ్రెస్ సీఎంలే అంటున్నారు.ఇదీ చదవండి: మెగాస్టార్,సూపర్‌స్టార్‌ను మించిన నటుడు రేవంత్: హరీశ్‌రావు -
రైతులనే మోసం చేస్తారా?: జగదీష్‌రెడ్డి
సాక్షి,సూర్యాపేటజిల్లా: రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గందరగోళంలోకి నెట్టిందని, కరెంట్ విషయంలో పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆదివారం(సెప్టెంబర్8) ఆయన మీడియాతో మాట్లాడారు.‘కాంగ్రెస్ మంత్రులు సంపాదనలో మునిగిపోయారు. రైతులు మిమ్మల్ని గెలిపిస్తే అదే రైతులను మోసం చేసి పబ్బం గడుపుతున్నారు. రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారా లేదా స్పష్టమైన వైఖరి తెలియజేయాలి. వరద బాధితులకు వెంటనే నష్ట పరిహారం అందించాలి’అని డిమాండ్ చేశారు -
సీఎం రేవంత్‌పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం(సెప్టెంబర్2) ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా రేవంత్‌రెడ్డి వైఖరిని సుప్రీంకోర్టు మరోసారి తప్పుపట్టింది. లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వడంపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పిటిషనర్ లాయర్స్ మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ పీసీసీ ట్విటర్ హ్యాండిల్‌లోనే కవిత బెయిల్‌పై పోస్టులు పెట్టిన విషయాన్నికోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ‘బెయిల్ గ్రాంటెడ్.. బెయిల్ గివెన్..? అని పోస్టులు పెట్టినట్లు తెలిపారు. సీఎం రేవంతే పీసీసీ చీఫ్‌గా ఉన్నారని కోర్టుకు విన్నవించారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం స్పందింంది. ఈ పోస్టులను కోర్టు దృష్టికి తేవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు‘ఉన్నత స్థానాలలో ఇలా వ్యవహరించడం మంచిది కాదు. లాయర్లను, జడ్జిలను రాజకీయాల్లోకి లాగడం సరికాదు. న్యాయ వ్యవస్థగా మీ నుంచి గౌరవాన్ని ఆశిస్తున్నాం’అని రేవంత్‌ను ఉద్దేశించి ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో రేవంత్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు తెలిపారు. దీనికి స్పందించిన బెంచ్ రిప్లై ఫైల్ చేయాలని రేవంత్ న్యాయవాదిని ఆదేశించింది. కాగా, ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఉత్తమ్‌కుమార్ మంత్రిగా అన్‌ఫిట్: జగదీష్‌రెడ్డి
సాక్షి,సూర్యాపేటజిల్లా: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వట్టి దద్దమ్మ అని, ఆయనకు రైతుల బాధలు తెలియవని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్‌నేత జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్‌రెడ్డి అన్‌ఫిట్ అని మండిపడ్డారు. ‘కనీస అవగాహన లేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఉత్తంకుమార్ రెడ్డినే. నాగార్జునసాగర్ పరిధిలో కూడా పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వకుండా టైంపాస్ చేస్తున్నాడు. రాష్ట్రంలో డెకాయిట్ల పాలన నడుస్తున్నది. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులే పెద్ద డెకాయిట్లు. చేయి తడపనిదే ఏ పని కావట్లేదని కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. కేసీఆర్ ని డెకాయిట్ అనెంత మొగోడీవా నువ్వు.పనిచేతగాక హెలికాప్టర్లలో తిరుగుతూ పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఉత్తమ్ సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో కూడా పంటలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ సరైన సమయంలో బయటికి వస్తారు. వీళ్ళ బండారాన్ని బయటపెడతారు. ఇంకొన్ని రోజుల్లో రైతులే మిమ్మల్ని ఉరికించి కొడతారు’అని జగదీష్‌రెడ్డి హెచ్చరించారు. -
‘పవర్ కమిషన్’ లీకులు ఇవ్వడమేంటి: జగదీష్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కేసీఆర్‌పై నింద వేద్దామనే ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కేసీఆర్ ఒక్కరే విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాసుకోలేదని, అప్పటి ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కూడా సంతకం చేశారన్నారు.తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టులను కేసీఆర్ నిర్మించారని చెప్పారు. జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్‌కు తన వాదనను మెయిల్ రూపంలో పంపించిన అనంతరం శనివారం(జూన్29) ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు ప్రభుత్వాల మధ్య లంచాలకు ఎక్కడైనా ఆస్కారం ఉంటుందా అని ప్రశ్నించారు. విచారణ కమిషన్ మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపాను. ‘సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 2017 నాటికి 17 పవర్ ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి. భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాం.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయింది. అన్నీ అనుకూలంగా వున్న తర్వాతనే దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాం. బొగ్గు కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రతి పవర్ ప్లాంట్ 10 శాతం విదేశీ బొగ్గును వాడాలని కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది. సింగరేణి బొగ్గు ఉండటం వల్ల విదేశీ బొగ్గుకు మేం ఒప్పుకోలేదు’అని చెప్పారు. -
రైతు బంధుపై కమిటీ అంటే మోసమే: జగదీష్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని, ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు సాయాన్ని ఆపడానికి వీలులేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం(జూన్23)తెలంగాణ భవన్లో మరో నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.‘రైతు భరోసా పేరుతో రూ. 15,000 ఇస్తామని మాట తప్పారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ వెనుక ఉన్న మతలబు ఏంటి? రైతు రుణమాఫీతో సంబంధం లేకుండా రైతులకు ఇవ్వాలి. కమిటీ అంటే రైతులను మోసం చేయడమే. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం. పింఛన్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. విద్యుత్ బిల్లుల మాఫీ స్కీమ్ రాష్ట్రంలో అమలు కావడం లేదు. యాసంగిలో రైతులకు ఏ విధంగా రైతుబంధు ఇచ్చారో ఇప్పుడు అట్లాగే ఇవ్వండి. బీఆర్ఎస్ హయాంలో జూన్ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు వచ్చేది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది. పురుషులు,మహిళలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. వీధి కుక్కలు సైతం మహిళలపై దాడులు చేస్తున్నాయి. విద్యుత్ కమిషన్ నుంచి నాకు లెటర్ వచ్చింది. వారం రోజుల్లో కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారు. పవర్ కమిషన్ ముందుకు వెళ్లి నాకు ఉన్న సమాచారాన్ని ఇస్తాను. కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతాను. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్,విద్యుత్ అధికారుల నుంచి సమాచారం తీసుకోవాలి. లేదంటే కమిషన్ చైర్మన్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నుంచి తప్పుకోవాలి’అని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
నల్గొండ దద్దరిల్లేలా కేసీఆర్ సభ: జగదీష్‌రెడ్డి
సాక్షి, నల్గొండ: నల్గొండ దద్దరిల్లేలా ఈ నెల 13న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సభ ఉంటుందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. కృష్ణా జలాల సాధాన కోసం బీఆర్ఎస్ నల్గొండలో నిర్వహిస్తున్న చలో నల్గొండ సభ ఏర్పాట్లను జగదీష్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు కేసీఆర్ స్వయంగా హాజరై కృష్ణా ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగడతారని చెప్పారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి. కేసీఆర్ గుర్తులు చెరిపేస్తామంటున్న రేవంత్‌రెడ్డిది నీచ సంస్కృతి. ఇవాళ దొంగల చేతికి తెలంగాణ పోయింది. కృష్ణా ప్రాజెక్టులను తిరిగి రాష్ట్ర పరిధిలోకి తీసుకురాకుంటే కాంగ్రెస్ వాళ్ళను గ్రామాల్లో తిరగనివ్వం’ అని జగదీష్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఆధీనంలో కేఆర్ఎంబీకి అప్పగించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చలో నల్గొండ పేరుతో బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇదీ చదవండి.. సీఎం రేవంత్‌రెడ్డి పర్ఫక్ట్ లీడర్: కేఏ పాల్ -
TS: భట్టి పదేపదే అదే చెప్తున్నారు.. జగదీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇరవై రోజులుగా చెప్పిందే చెప్పుకుంటూ కాంగ్రెస్ నాయకులు కాలం గడుపుతున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వచ్చింది కరెంట్ ఆగిపోతుంది అని ఇప్పటికే జనంలో చర్చ మొదలైందన్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని చెప్పటం సరికాదన్నారు. ‘కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని జనం అనుకుంటున్నారు. చేతకాకపోతే చేతకాదు అని చెప్పాలి. అప్పుల గురించి కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. భారత దేశంలో అప్పులు లేని రాష్ట్రం లేదు. విద్యుత్ సంస్థల్లో కూడా అప్పులు లేని రాష్ట్రం లేదు. వీళ్లు పాలించిన రాజస్థాన్ రాష్ట్రంలోనూ అప్పులున్నాయి. పదే పదే భట్టి విక్రమార్క అప్పులున్నాయని చెప్తున్నారు. 24 గంటల కరెంట్ ఇవ్వటం చేతకాక అప్పులు గురించి మాట్లాడుతున్నారు. 2014కు ముందు 20 వేల కోట్లు అప్పు చేసి 3నుంచి 4 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ మేము 60 వేల కోట్లు అప్పు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చాం’ అని జగదీష్‌రెడ్డి తెలిపారు. ఇదీచదవండి..మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్‌రెడ్డి -
సూర్యాపేట నియోజకవర్గం అభ్యర్థికి హ్యాట్రిక్ అవకాశం...
సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేటలో టిఆర్ఎస్ పక్షాన మరోసారి పోటీచేసిన మంత్రి జగదీష్ రెడ్డి విజయం సాదించారు. దీంతో ఆయన రెండుసార్లు గెలిచినట్లు అయింది. ఆ తర్వాత మళ్లీ కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. జగదీష్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి ఆర్. దామోదరరెడ్డిపై 5941 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. జగదీస్ రెడ్డికి 66742 ఓట్లు రాగా, దామోదరరెడ్డికి 60801ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ది మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంక టేశ్వరరావుకు 39 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. జగదీష్ రెడ్డి సామాజికపరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో జగదీష్ రెడ్డి సూర్యాపేటలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంక టేశ్వరరావుపై 2219 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాంగ్రెస్ ఐ నేత దామోదర రెడ్డి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. సంకినేని గతంలో తుంగతుర్తిలో ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. దామోదరరెడ్డి తుంగతుర్తిలో నాలుగుసార్లు, సూర్యాపేటలో ఒకసారి గెలుపొందారు. ఈయన ఒకసారి ఇండిపెండెంటుగా గెలవగా, మిగిలిన నాలుగుసార్లు కాంగ్రెస్ పక్షాన గెలిచారు. 1992లో నేదురుమల్లి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా 2007 నుంచి పనిచేశారు. 2009లో గెలిచిన తర్వాత ఈయనకు పదవి దక్కలేదు. ఈయన సోదరుడు రామిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి గెలుపొందారు. వెంకటరెడ్డికి మంత్రి అవకాశం దక్కడంతో ఈయనకు ఛాన్స్ రాలేదు. సూర్యాపేట నుంచి పిడిఎఫ్ మూడుసార్లు, సిపిఐ ఒకసారి, సిపిఎం ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఐదుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ రెండు సార్లు గెలిచాయి. కడవరకు అతి సామాన్య జీవితం గడిపి ఎందరికో ఆదర్శప్రాయుడు అనిపించుకున్న ఉప్పుల మన్సూర్ సూర్యాపేటలో నాలుగుసార్లు గెలిచారు. టిడిపి నేత ఆకారపు సుదర్శన్ రెండుసార్లు శాసనసభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1952లో ఇక్కడ ద్విసభ్య నియోజకవర్గం నుంచి ఎన్నికైన బొమ్మగాని ధర్మభిక్షం తర్వాత నకిరేకల్‌లో 1957లో, నల్గొండలో 1962లో గెలిచారు. 1957లో ఇక్కడ గెలిచిన భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి 1967లో తుంగతుర్తిలో కూడా గెలిచారు. బీమ్‌రెడ్డి మూడుసార్లు లోక్‌సభకు మిర్యాలగూడెం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత కాలంలో ఆయన సిపిఎంను వదలి సొంత పార్టీని పెట్టుకున్నారు. సిపిఐ నాయకుడు దర్మభిక్షం రెండుసార్లు నల్గొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సూర్యాపేట నాలుగుసార్లు రెడ్లు, ఒక గౌడ్ నేత ఎన్నికయ్యారు. మిగిలినసార్లు ఇది రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉంది. సూర్యాపేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఈఆర్సీ నిర్ణయంపై జగదీష్ రెడ్డి ఫైర్.. అదానీకే లాభం అంటూ..
సాక్షి, సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఈఆర్సీ(Electricity Regulatory Commission) నిర్ణయంపై జగదీష్ రెడ్డి ఫైరయ్యారు. ప్రజలకు విద్యుత్ దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, మంత్రి జగదీష్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఈఆర్ఎసీ అదానీకే లాభం. కేంద్రం తెచ్చేవి సంస్కరణలు కావు. ప్రజలను పీల్చి పిప్పి చేసే నల్ల చట్టాలు. సంస్కరణల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ప్రజల డబ్బు దోచిపెట్టేందుకే కేంద్రం దుర్మార్గం చేస్తోంది. దేశ సంపదను ఒక్కరిద్దరికే కట్టబెట్టే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కృత్రిమ విద్యుత్ సంక్షోభం సృష్టించి అదానీకి మేలు చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తుంది. దేశంలో సొంత బొగ్గువనరులు ఉండగా కేంద్రం విదేశీ బొగ్గు ఎందుకు తెస్తుంది. అదానీ విదేశీ బొగ్గుని బలవంతంగా రాష్ట్రాలకు కేంద్రం అమ్మిస్తున్నది. విదేశీ బొగ్గుతోనే విద్యుత్ సమస్య ఏర్పడనుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా రాష్ట్రంలో రైతులకు అందిస్తున్న ఉచిత ఆపే ప్రసక్తే లేదని తెలిపారు. రైతులకు సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్ అందిస్తుంటే అది కేంద్రానికి కడుపు మంటగా ఉందని ఆరోపణలు చేశారు. -
కోమటిరెడ్డికి అదిరిపోయే కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదనే కామెంట్స్‌పై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా స్పందించి పొలిటికల్ కౌంటర్ ఇస్తున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కాగా, జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్ధం కాదు. వారు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్‌లో ఉండి బీజేపీని గెలిపించమని.. బీజేపీలో కాంగ్రెస్‌ను గెలిపించమని వ్యాఖ్యలు చేసే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ కూడా స్పందించారు. ఈ క్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో హంగ్ వచ్చే ఛాన్స్ లేదు. బీజేపీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్, బీఆర్ఎస్లు పొత్తుల కోసం చూస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం’ అని కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయింది. ఎవరైనా గెలుస్తామని చెప్తారు. కానీ, కాంగ్రెస్ ఓడిపోతామని చెబుతున్నారు. ఓడిపోతామని తెలిసి కూడా యాత్ర ఎందుకు చేస్తున్నారు?. ఎన్నికలకు ముందు ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కాంగ్రెస్ ఉనికి ఎక్కడా లేదు. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. అందుకే బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా గెలుస్తుంది. కేసీఆర్ ఇంకా.. ఈటల రాజేందర్ తన మనిషే అనుకుంటున్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన వారు బీఆర్ఎస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే బీఆర్ఎస్లోకి వెళ్తారని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తాయి. వీళ్లందరూ దండుపాళ్యం బ్యాచ్ అని సంచలన కామెంట్స్ చేశారు.’ అని అన్నారు. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ డిప్రెషన్లో ఉన్నారు.. కాంగ్రెస్ వెంటిలేటర్‌పై ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కలలు కనేది.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తుంది. కుటుంబ పాలన, అవినీతి పాలన, రైతుల వ్యతిరేక పాలన నిరుద్యోగ వ్యతిరేక పాలన బీఆర్ఎస్ ప్రభుత్వానిది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో పోటీచేసి ఘన విజయం సాధిస్తుంది. -
అధికారులను భయపెట్టడం సరికాదన్న మంత్రి జగదీష్ రెడ్డి
-
బీజేపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు రద్దయినట్లే : మంత్రి జగదీష్ రెడ్డి
-
ఆనాడు ఆస్తులెన్ని.. ఇప్పుడెన్ని?.. మొత్తం బయటకు తీస్తా: కోమటిరెడ్డి
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: అసెంబ్లీలో మూడు సంవత్సరాలు నియోజకవర్గ సమస్యలపై మాట్లాడినా స్పందించని సీఎం కేసీఆర్ నేడు ఉప ఎన్నికల భయంతో మునుగోడులో అభివృద్ధి పనుల గురించి ఆలోచిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21న లక్ష మందితో మునుగోడులో అమిత్ షా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. అమిత్ షా మీటింగ్‌కు భయపడే, కేసీఆర్ 20వ తేదీన బహిరంగ సభ పెట్టుకున్నాడు. నా పదవీ త్యాగంతో మునుగోడు అభివృద్ధి చెందుతుంది. మంత్రి జగదీష్ రెడ్డి నేను అమ్ముడుపోయిన అని మాట్లాడుతున్నాడు. అది ఆయన రుజువు చేస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా.. లేకపోతే నీవు మంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు. మంత్రి జగదీష్ రెడ్డి నాగారం, తుంగతుర్తి మర్డర్ కేసులలో A1, A2 నిందితుడిగా ఉన్నారు. నేరచరిత్ర కలిగిన మనిషి ఈ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ రాక ముందు జగదీష్ రెడ్డి ఆస్తులు ఎన్ని? ఇప్పుడున్న ఆస్తులు ఎన్ని?. మొత్తం బయటకు తీస్తా. త్వరలోనే అక్రమాస్తుల చిట్టా బయటపెడతా. మునుగోడులో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజల తీర్పు ఉంటుంది' అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చదవండి: (లా అండ్ ఆర్డర్ చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలి: బండి సంజయ్) -
Munugode- TRS Party: మంచి బట్టలు తొడిగినా ఓర్వలేడు.. ఆయనకు టికెట్టా!
సాక్షి, నల్గొండ: మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతి చల్లారడం లేదు. మంత్రి జగదీశ్‌రెడ్డి బుజ్జగించినా అసమ్మతి సద్దుమణగడం లేదు. మంత్రికి చెప్పుకున్నా ఫలితం లేదని అసంతృప్తితో ఉన్న నేతలు మరోసారి దైవకార్యం పేరిట చౌటుప్పల్ మండలం ఆంథోల్ మైసమ్మ దేవాలయం వద్ద ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం సమావేశమయ్యారు. చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, సింగిల్‌విండో చైర్మన్లు కలుపుకొని 200 మందికి పైగా నాయకులు సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమను ఎలా ఇబ్బంది పెట్టారు.. ఆర్థికంగా ఎలా దెబ్బకొట్టారు.. అనే విషయాలను ఒక్కొక్కరుగా మాట్లాడారు. మంచి బట్టలు తొడిగినా ఓర్వలేదని, గ్రామాల్లో గ్రూపులు కట్టి విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అందరూ కలసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని, ఇస్తే పనిచేయొద్దని, ఆయనకు తప్ప ఎవరికిచ్చినా సరే అని తీర్మానం చేసి సంతకాలు చేశారు. ఈ తీర్మాన పత్రాన్ని పార్టీ అధిష్టానానికి అందజేయనున్నట్టు చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి తెలిపారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. చదవండి: (మునుగోడులో పెరిగిపోతున్న పొలిటికల్ హీట్) -
మునుగోడులో టీఆర్ఎస్కు ఊహించని షాక్!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ హీట్ అంతా మునుగోడుపైనే ఉంది. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా మునుగోడుపైనే ఫోకస్ పెట్టాయి. ఉప ఎన్నికల బరిలో ఎవరిని పోటీలో నిలపాలి అని కసరత్తులు చేస్తున్నాయి. ఇక, అధికార టీఆర్ఎస్ ఎలాగైనా మునుగోడులో గులాబీ జెండా ఎగురవేయాలని పావులు కదుపుతుండగా ఊహించని అసమ్మతి సెగ తగిలింది. కాగా, మంత్రి జగదీష్‌రెడ్డి ఇంట్లో మునుగోడు నియోజకవర్గ నేతలు బుధవారం భేటీ అయ్యారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లను మంత్రి జగదీష్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేత కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వొదని వారు అసమ్మతి గళం వినిపించారు. కూసుమంట్లకు టికెట్ ఇస్తే ఎన్నికల్లో సపోర్టు చేసేదిలేదంటు తేల్చి చెప్పారు. ఈ విషయంపై వారం క్రితమే సీఎం కేసీఆర్‌కు అసమ్మతి నేతలు లేఖలు రాసినట్టు తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి జగదీష్ రెడ్డి అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: మునుగోడులో మరో ట్విస్ట్.. ఉప ఎన్నిక బరిలో వామపక్షాలు? -
ఒకే వేదికపై జగదీష్ రెడ్డి,రాజగోపాల్ రెడ్డి .. రసాభాసగా కార్యక్రమం
-
ఎరువుల బ్లాక్ మార్కెట్ గురించి మా దృష్టికి రాలేదు : జగదీష్ రెడ్డి
-
‘రాయలసీమ’ను నిలిపివేస్తే చర్చలకు సిద్ధం..
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేసి, సంబంధిత జీఓను ఉపసంహరించుకునే పక్షంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. కృష్ణా జల వివాదం అంశాన్ని కేవలం నేషనల్గ్రీన్ ట్రిబ్యునల్‌కే పరిమితం చేయకుండా ప్రజల్లోకి కూడా తీసుకువెళ్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, శానంపూడి సైదిరెడ్డితో కలసి శుక్రవారం ఆయన టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల నిలుపుదలకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని, ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించొద్దని అన్నారు. తెలంగాణకు జరిగే అన్యాయాలపై పోరాడటంలో సీఎం కేసీఆర్‌కు మించిన వారెవరున్నారని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ సమాజానికి అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వ వైఖరికి వంత పాడుతున్నాయని, గతంలో ఏపీకి అక్రమంగా నీటి తరలింపునకు హారతులు పట్టిన వారు ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు ద్రోహం చేసినా రాష్ట్ర నీటి వాటాల కోసం పోరాటం చేస్తామని, కాంగ్రెస్ నేతలు బానిస బతుకులు మానుకోవాలని హితవు పలికారు. బీజేపీకి తెలంగాణ సోయి లేదని మండిపడ్డారు. ‘రాయలసీమ’తో ఐదు జిల్లాలకు నష్టం రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణలో ఐదు జిల్లాలు నష్టపోతాయని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ పలు దఫాలు కేంద్రానికి లేఖ రాశారని, కేసీఆర్ చిత్తశుద్ధిపై కొందరు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడు కేసీఆర్ మీద విమర్శలు చేస్తున్నారన్నారు. తెలంగాణకు అన్యాయం జరగనివ్వం సాక్షి, న్యూఢిల్లీ: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై తాము మాట్లాడుతుంటే, కొందరు ఏపీ నాయకులు ఏ మాత్రం సంబంధం లేకుండా వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సయోధ్యతో ఉందామనుకుంటే.. కొందరు ఏపీ నేతలు నోట్లో చక్కెర, కడుపులో కత్తెరవంటి వైఖరితో వ్యవ హరిస్తున్నారని విమర్శించారు. అంతేగాక వైఎస్సార్ తెలంగాణ ఇస్తామని చెప్పి మభ్యపెట్టారని, అందుకే పోతిరెడ్డిపాడు వ్యవహారంలో మంత్రి పదవులను సైతం టీఆర్ఎస్ వదులుకుందని చెప్పారు. తమ పోరాటం తెలంగాణ ద్రోహులపైనే కాని, ఆంధ్ర ప్రజలపై కాదన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు సాగాలనే ఉద్దేశ్యంతో ఏపీ సీఎంతో ఎలాంటి వివాదాలకు పోకుండా సఖ్యతతో మెలిగే ప్రయత్నం చేశామన్నారు. తెలంగాణకు ఏం చేశారు... వైఎస్సార్ హయాంలో తెలంగాణ నీళ్లను దోచుకుపోతుంటే తమ కడుపు మండిందని మంత్రి అన్నారు. తెలంగాణ అని నినదించిన వాళ్లను నక్సలైట్ అనే ముద్ర వేసి చంపారని ఆరోపించారు. ఏపీ సీఎంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. తెలంగాణకు వైఎస్సార్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలోని ఏ కుల వృత్తులను ఎదగనీయలేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తిరిగిన ఉద్యోగులను ఏసీబీ కేసుల్లో జైళ్లకు పంపారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రులు తమకు శత్రువులు కాదని, అన్నదమ్ములుగా చూసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. నీళ్లు తోడుకుపోతే, హైదరాబాద్‌కు నీళ్లు ఎట్లా, ఏం నీళ్లు తాగాలని ఏపీ సీఎంను నిలదీయాలని వారికి సూచించారు. ఈ కొత్త పంచాయితీతో ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టేట్లు ఉన్నాయని మాట్లాడాలని అన్నారు. అపెక్స్ కౌన్సిల్లో మాట ఇచ్చినట్లు అక్రమ ప్రాజెక్ట్‌లు ఆపేయాలని, హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలు అడగాలన్నారు. -
గ్యాలరీ స్టాండ్ ఘటన: మురారి వెన్నెముకకు తీవ్ర గాయాలు
సాక్షి, సూర్యాపేట: జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో 30 మందికి, ఇతర, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మరో 70 మందికి వైద్యం అందిస్తున్నారు. జనరల్ ఆస్పత్రిలో ఉన్న 30మంది క్షతగాత్రుల్లోని 16మందికి వివిధ శస్త్రచికిత్సలు చేశామని, మిగతా వారినీ పరీక్షించి అవసరమైన శస్త్రచికిత్సలు చేయనున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళిధర్‌రెడ్డి తెలిపారు. ఎనిమిది మందికి సీరియస్? సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో 47వ జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్యాలరీ కుప్పకూలి 150 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. ఇందులో తీవ్ర గాయాలపాలైన 42 మందిని సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్, నార్కట్‌పల్లి కామినేని, ఖమ్మం ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కామినేని ఆస్పత్రిలో సూర్యాపేటకు చెందిన నరేష్ (30), మురారి (45)లకు చికిత్స అందిస్తున్నామని.. వీరిలో మురారికి వెన్నెముకపై బలమైన గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. అన్ని పరీక్షలు చేశామని, వాటి ఆధారంగా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మంచి చికిత్స అందిస్తాం: జగదీశ్‌రెడ్డి ప్రమాద బాధితులకు జరుగుతున్న చికిత్సపై మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మంగళవారం ఆయా ఆస్పత్రుల వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితులకు ఎటువంటి సాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. వారు ఇళ్లకు క్షేమంగా చేరేంత వరకు సహాయ సహకారాలు అందించాలని టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. నిర్వాహకులు, కాంట్రాక్టర్‌పై కేసు నమోదు గ్యాలరీ ప్రమాదంపై బాధితుల కుటుంబ సభ్యులు సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. కబడ్డీ పోటీల నిర్వాహకులు, గ్యాలరీ నిర్మాణ కాంట్రాక్టర్‌పై 336, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. ఘటనపై విచారణ చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉత్సాహంగా కొనసాగిన పోటీలు సూర్యాపేటలో రెండో రోజు మంగళవారం 47వ జాతీయ స్థాయి బాలబాలికల జూనియర్ కబడ్డీ పోటీలు కోలాహలంగా సాగాయి. మొదటి రోజు సోమవారం రాత్రి గ్యాలరీ ప్రమాదం అనంతరం పోటీలు ఆలస్యంగా ప్రారంభంకాగా, మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదవండి: సూర్యపేట గ్యాలరీ స్టాండ్ ప్రమాదం: ప్రధాన కారణం ఇదే! -
ఉద్యోగులంతా టీఆర్ఎస్ వైపే..
నల్లగొండ రూరల్ : ఉద్యోగులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ధీమావ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని.. తమ హయాంలోని అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి వారే ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. పట్టభద్రులు, పీఆర్టీయూ ఉపాధ్యాయులు, ఐకేపీ సెర్ప్ ఉద్యోగులతో మంగళవారం జిల్లా కేంద్రంలో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. కొత్త ఉద్యోగాలు కల్పించడం మాట అటుంచితే 20లక్షల ఉద్యోగులను తొలగించిందని మండిపడ్డారు. నల్లడబ్బును వెనక్కి తెస్తామని అధికారంలోకి వచ్చాక డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగానికి అమ్ముతూ వ్యవస్థలను నాశనం చేసిందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల నాయకులు కేవలం సీఎం కేసీఆర్‌పై వ్యక్తి గత కక్షతోనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, పరిశ్రమలు స్థాపించి 15లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశామన్నారు. అన్ని వర్గాల సంక్షేమం తమ ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. కోదండరాం ప్రతిపక్షాల కుట్రకు ఎందుకు మద్దతు పలుకుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అబద్ధాలు మాట్లాడడం ఆయనకు తగదన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని దిగుబడిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను మరోసారి ఆదరించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రమావత్‌రవీంద్రకుమార్, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, బీబీపాటిల్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, పిల్లిరామరాజు యాదవ్, పంకజ్‌యాదవ్, కృష్ణారెడ్డి, చకిలం అనీల్‌కుమార్ పాల్గొన్నారు. -
దుబ్బాక ఎమ్మెల్యే మృతి; సీఎం కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ ఛైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామలింగారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. సోలిపేట రామలింగరెడ్డి మృతి పట్ల టీఆర్ఎస్ నేతలు ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు. ‘తెలంగాణ ఉద్యమ సహచరుడు, జర్నలిస్టు, ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి అకాల మరణం నన్ను కలచివేసింది. వారి మృతి తెలంగాణకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి ఉమ్మడి మెదక్ జిల్లాకు, నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఉద్యమ సహచరుడిగా, తోటి ప్రజా ప్రతినిధిగా ఆయనతో నాకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. దుబ్బాక అభివృద్ధి కోసం, ప్రజల కోసం నిత్యం పరితపించిన నాయకుడు’ అంటూ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్విటర్లో పేర్కొన్నారు. ‘దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో ఉన్న అనుబంధం మరువలేనిది. తెలంగాణ రాష్ట్రం కోసం బలంగా ఆకాంక్షించిన వారిలో ఆయన ఒకరు. వారు జర్నలిస్ట్ గా, ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేసుకున్నారు’ అంటూ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతాపం ప్రకటించారు. ‘దుబ్బాక శాసనసభ్యుడు, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి గారి ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్న..వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ‘తెలంగాణ సమాజం నిబద్ధత కలిగిన నేతను కోల్పోయింది. వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న రామలింగారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇక్కడి ప్రజల అభీష్టం నెరవేర్చిన మహనీయుడు’ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రామలింగారెడ్డి, రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు. ‘తెలంగాణ ఉద్యమ సహచరుడు,ఎమ్మెల్యే, శాసనసభ అంచనాలు,పద్దుల కమిటీ చైర్మన్ శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.వారు ప్రజా జీవితంలో చేసిన సేవలు మరువ లేనివి.సమాజం పట్ల బాధ్యతగా ఉన్న నాయకుడు. జర్నలిస్టుగా,ఎమ్యెల్యేగా చాలా చురుకైన పాత్ర పోషించారు.రామలింగారెడ్డి లేరనేది ప్రజలకు తీరని లోటు.వారి మృతి పట్ల ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సానుభూతి ప్రకటించారు. -
‘విద్యుత్ బిల్లు’ను కేంద్రం వెనక్కి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజలు, రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే విద్యుత్ సరఫరాను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లుతో రాష్ట్రాల హక్కులను హరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ తరఫున మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొని తమ అభ్యంతరాలను తెలియజేశారు. అనంతరం ఆయన విద్యుత్ సౌధలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నా కేంద్రం ఒక్క లైనును కూడా మార్చలేదన్నారు. రాష్ట్రాల ఈఆర్సీల నియామకం విషయంలో మార్పులు చేశామని కేంద్రం అంటోంది కానీ, చేతల్లో ఎలాంటి మార్పులు జరగలేదన్నారు. ఈ బిల్లుతో భవిష్యత్తులో పేదలు విద్యుత్ సబ్సిడీలు కోల్పోయే ప్రమాదముందన్నారు. కరోనాతో తీవ్రంగా నష్టపోయిన డిస్కంలకు కేంద్రం అందిస్తున్న రుణాలకు సంబంధించిన వడ్డీలను 9.5% నుంచి 8.5 శాతానికి తగ్గించాలన్నారు. మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్ కేంద్రంలోని 270 మెగావాట్ల రెండో యూనిట్ శుక్రవారం నుంచి ఉత్పత్తి ప్రారంభించిందని, త్వరలో మూడో యూనిట్లో సైతం ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, డిస్కం సీఎండీ జి.రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కొత్త బిల్లుతో మూడు రకాల నష్టాలున్నాయి’
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర విద్యుత్ సవరణ చట్ట బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ బిల్లు వల్ల వినియోగదారులకు ఉపయోగం లేదని, గృహ వినియోగదారులు సబ్సిడీ కోల్పోయే అవకాశముందన్నారు. శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.(ఛాలెంజ్‌ను స్వీకరించిన రేణు దేశాయ్) సబ్సిడీ పొందుతున్న అన్ని వర్గాల ప్రయోజనాలు హరిస్తున్నాయన్నారు. ప్రైవేటు సంస్థలకు పూర్తిగా అప్పగించే ప్రయత్నం నడుస్తుందన్నారు. ఈ బిల్లుతో మూడు రకాల నష్టాలు ఉన్నాయని, దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. పంజాబ్, రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాలు సైతం ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయన్నారు. రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా బిల్లులో ఒక్కలైన్ కూడా మార్చలేదని దుయ్యబట్టారు. (లాక్డౌన్; ఆగిన బతుకు బండి) -
కరోనా కష్టాలున్నా ‘సంక్షేమం’ ఆపలేదు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కరోనా వైరస్ ప్రభావం కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ ఆపలేదని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. సోమవారం ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో రూ.24 లక్షల నిధులతో నిర్మించనున్న వైకుంఠధామం, రూ.10 లక్షలతో నిర్మించనున్న స్మృతివనం, రూ.71 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.50 లక్షలతో నిర్మించిన 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఆ తర్వాత సూర్యా పేట జిల్లా హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో రూ.40 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగా ఏర్పడిన హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించిన ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. యువ తకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (న్యాక్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని శేషమ్మగూడెం డంపింగ్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని (ఫీకల్స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కేటీఆర్ మాట్లాడుతూ రైతు బంధు కింద రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం 54.22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,889 కోట్లు జమచేశామన్నారు. ఆసరా, కల్యాణలక్ష్మి, రైతు బీమా లాంటి పేదల సంక్షేమ పథకాలను ఈ కష్ట కాలంలో కూడా ఆపకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తుండడం ఆయన ముందుచూపునకు నిదర్శనమన్నారు. హుజూర్‌నగర్‌లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: ఉత్తమ్ హుజూర్‌నగర్‌లో జరిగిన సభలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో తాను గృహనిర్మాణ శాఖ మంత్రి గా ఉన్నప్పుడు హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం 75 శాతం పూర్తయిందన్నారు. ఆ ఇళ్లను, రింగు రోడ్డును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తేవాలని ఆయన కేటీఆర్‌ను కోరారు. హుజూర్‌నగర్‌లో ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు ఉత్తమ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. మంత్రి కేటీఆర్ వెంట ఆయా కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జెడ్పీ చైర్మన్లు గుజ్జా దీపిక, బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావు, బాల్క సుమన్, సూర్యాపేట, నల్లగొండ కలెక్టర్లు టి.వినయ్‌కృష్ణారెడ్డి, ప్రశాంత్ జీవన్‌పాటిల్ పాల్గొన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాలు నల్లగొండ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాలను నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మానవ వ్యర్థాలను సక్రమంగా శుద్ధి చేయకపోతే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. నల్ల గొండను ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నందున ఏ కార్యక్రమాలైనా పూర్తి చేయాల్సిన బాధ్యత జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిది, అలాగే తనది కూడా అని స్పష్టం చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలోని ఉదయ సముద్రం ప్రాజెక్టుకు ఇటీవల ఆరు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామని, ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. -
సోమవారం సూర్యాపేటకు కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సూర్యాపేటకు రానున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో శనివారం సంతోష్ బాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సంతోష్ బాబు సేవలు యువతకు స్ఫూర్తిగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలిపారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5కోట్ల ఎక్స్‌గ్రేషియాతో పాటు హైదరాబాద్‌లో 600 గజాల ఇంటిస్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. సంతోష్‌బాబు భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం.. అది కూడా ఆమెకు నచ్చిన ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. ప్రభుత్వ సాయంపై కేసీఆర్ వ్యక్తిగతంగా వారి కుటుంబాన్ని కలిసి చెప్పమన్నారు అని జగదీశ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సాయాన్ని సంతోష్ బాబు కుటుంబ సభ్యులు సంతోషంగా ఒప్పుకున్నారని జగదీశ్ రెడ్డి తెలిపారు. తమతో పాటు... దేశంలోని ఇతర సైనికులకు సాయం చేయడాన్ని వారు అభినందించారన్నారు. కొడుకు పోయిన బాధ కంటే దేశం కోసం చనిపోయాడని చెప్పడం వారి గొప్పతనానికి నిదర్శనమని జగదీశ్ రెడ్డి ప్రశంసించారు. కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం స్వయంగా సూర్యాపేటలోని వారి నివాసానికి వస్తారన్నారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు సీఎమ్ రాకపైన సమాచారం ఇచ్చామని జగదీశ్ రెడ్డి తెలిపారు. (నేను ‘సంతోషం’గా ఒప్పుకుంటా..) -
మిషన్ భగీరథపై మంత్రుల సమీక్ష
సాక్షి, నల్గొండ: మిషన్ భగీరథపై నల్గొండలో బుధవారం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ... మిషన్ భగీరథ పనులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రూ. 40,123 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులు 95 శాతం ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మూడు సంవత్సరాలలో 95 శాతం పనులు పూర్తి చేయడం చారిత్రాత్మకం అన్నారు. మిగిలిన 5 శాతం పనులలో లోపాలు ఉన్నాయన్నారు. అందుకే సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీలను వెంటనే అక్కడి నుంచి మార్చాలన్నారు. ఇప్పటికే చాలా మందిని మార్చం, ఇంకా కొందరిని మార్చాల్సి ఉందని ఎర్రబెల్లి తెలిపారు. ఏజెన్సీల నిర్లక్ష్యం ఈ పథకానికి శాపంగా మారకూడదన్నారు. (‘కోవిడ్’ కేసుల్లో చార్జ్‌షీట్స్! ) మరోవైపు మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, నల్గొండ జిల్లా కోసమే మిషన్ భగీరథ పథకం రూపుదాల్చింన్నారు. అన్ని ప్రాంతాలకు సురక్షితమైన నీటినిఅందించే బృహత్తర పథకం మిషన్ భగీరథ అని అన్నారు. ఫ్లోరిన్ ప్రాంతంగా ముద్రపడ్డ మునుగోడులోనే పైలాన్ నిర్మాణం జరిగిందన్నారు. నది జలాలు నేరుగా ఇంటింటికి అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. మూడేళ్లలోనే ప్రాజెక్ట్ పనులు దాదాపుగా పూర్తి చేయడం ప్రసంశించదగ్గ విషయమన్నారు. పనులన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు సన్నద్ధం కావాలన్నారు. మంత్రులతో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల నరసింహయ్య, యన్ భాస్కరరావు, రవీంద్ర నాయక్, చిరుమర్తి లింగయ్య, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ పాల్గొన్నారు. (వాహనాలను ఆ మార్గంలో అనుమతించడం లేదు) -
‘విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలి’
సాక్షి హైదరాబాద్ : లాక్డౌన్ కాలంలో విద్యుత్ సిబ్బంది నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడ కూడా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. సోమవారం విద్యుత్‌సౌధ వద్ద మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న ప్రజలకు ఇబ్బంది లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇటీవల అకాల వర్షాలు వచ్చినప్పటికీ ఎక్కడా ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది రాలేదన్నారు. బిల్లులకు సంబంధించి రీడింగ్ తీసే అవకాశం లేనందున తమ సిబ్బంది ఇళ్లలోకి వెళ్లలేన్నారు. అయితే విద్యుత్ వినియోగానికి సంబంధించి బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలని కోరారు. మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానంలోనే తాము కూడా ఈ బిల్ ఇస్తున్నామన్నారు. (సెలబ్రిటీలు, ఇది కరోనా పార్టీ కాదు ) ఈఆర్సీ రెగ్యులేటరీ ఏ విధానం అయితే ఉంటుందో అదే పద్దతిలో.. గత సంవత్సరం మార్చి నెల వచ్చిన బిల్ ఆధారంగా బిల్ పే చేయాలి అన్నారు. అయితే గత మార్చి నెలతో పోల్చితే ఈ మార్చి నెలలో 15, 20 శాతం ఎక్కుకాగానే వస్తాయని, కానీ ఈఆర్సీ ప్రకారమే చెల్లించాలన్నారు. ఇప్పటికే బిల్లులను ప్రజలకు పంపడం జరిగిందని, వాటని దయచేసి కట్టాలని కోరారు. ఈ నెలలోని వ్యత్యాసాలను వచ్చే నెలలో ఇస్తామని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకొమన్నారు. (కరోనా: ఆయన రాజీనామా చేయాల్సిందే! ) ఎస్పీడీసీఎల్ పరిధిలో 40 శాతం పైగా వినియోగదారులు ఆన్లైన్లోనే పే చేస్తున్నారని, 10700 కమర్షియల్స్‌లో అసలు రీడింగ్ తీసుకొని బిజినెస్ సంస్థలకు బిల్ ఇచ్చామని తెలిపారు. కమర్షియల్ కూడా గత సంవత్సరంలో 50 శాతం బిల్ కట్టాలని, ఒకవేళ ఎక్కువ బిల్ కట్టినా.. వచ్చే బిల్లో సరిచేస్తామన్నారు. గత మార్చ్‌లో 8900 డిమాండ్ ఉండేదని.. ఈ మార్చ్‌లో 7800 డిమాండ్ ఉందన్నారు. ఇక కరోరా వైరస్ లేకుంటే 13500 మెగా వాట్స్ డిమాండ్ వస్తుందనుకున్నామని అన్నారు. ఈనెల బిల్ డిమాండ్ టీఎస్ఎస్పీడీసీఎల్లో ఎల్టీకి రూ. 620 కోలు, ఎన్పీడీసీఎల్లో రూ. 203 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ సంస్థలు ప్రతీసారి అత్యవసర సమయంలో పని చేస్తున్నారని, ఇలాంటి క్లిష్టమైన పనిచేస్తున్న వైద్యుల సేవలను సైతం మంత్రి జగదీష్ ఈ సందర్భంగా కొనియాడారు. (లాక్‌డౌన్‌పై రేపు ప్రధానమంత్రి కీలక ప్రకటన ) -
ఏ ఎన్నికలైనా విజయం టీఆర్ఎస్దే: మంత్రి జగదీష్
సాక్షి, నల్గొండ : రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీదే విజయమని, ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మిర్యాలగూడలో శనివారం టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కంచుకోటగా భావించే నల్గొండ జిల్లాను తెరాస కంచుకోటగా మార్చామని ఆయన తెలిపారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పగటి కలలు కన్నారని విమర్శించారు. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని.. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయ్యిందని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల తీర్పుతో రాష్ట్ర ప్రజలు తెరాసవైపే ఉన్నారని తేలిపోయిందని మంత్రి అన్నారు. (సీపీ అంజనీ కుమార్‌పై విరుచుకుపడ్డ ఉత్తమ్) గతంలో నల్గొండ జిల్లాలో అనేక మంది మంత్రులుగా చేసిన జిల్లాలో అభివృద్ధి జరిగిందేమి లేదని, కేవలం తెరాస పాలనలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. జానారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని దుయ్యబట్టారు. సొంత ఊరిని కూడా అభివృద్ధి చేసుకోలేదని విమర్శించారు. ప్రజల కోసం అనునిత్యం తపనపడే వ్యక్తిగా ఎమ్మెల్యే భాస్కర్ రావు ముందుటారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే మిర్యాలగూడ రూపురేఖలు మారుతాయన్నారు. వార్డు సభ్యులుగా అవతలి పార్టీల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారన్నారు. సోనియా గాంధీ, మోదీ సొంత రాష్ట్రాల్లో లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి జగదీష్ పేర్కొన్నారు. -
సౌరవిద్యుత్ ఉత్పాదనలో భేష్
సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుత్ ఉత్పాదనలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉండటం అభినందనీయమని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా మరిన్ని పరిశ్రమలను ఆకర్షిస్తోందన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) ఏర్పాటు చేసిన రాష్ట్ర ఇంధన పొదుపు పురస్కారాల కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యుత్ ఉత్పత్తిలోనే కాకుండా ఆదా చేయడంలోనూ తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావడం హర్షణీయమన్నారు. విద్యుత్ పొదుపుతో పాటు నీటి పొదుపును కూడా ప్రజలు అలవర్చుకోవాలన్నారు. ముఖ్యంగా కార్యాలయ సముదాయాల్లో ఎయిర్ కండిషనర్ వినియోగాన్ని తగ్గించేందుకు విరివిగా మొక్కలను పెంచాలని సూచించారు. ఇంధన ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరు భాగస్వామ్యులవ్వాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చెట్లను తొలగించినా అంతే స్థాయిలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్‌ను ప్రజలకు అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణే అని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. విద్యుత్ ఆదాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని చెప్పారు. రైతులకు త్రీ ఫేజ్ విద్యుత్‌ను 24/7 రైతులకు అందిస్తున్నట్టు టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. విద్యుత్ ఆదా, ఉత్పాదనకు సమానమన్నారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో ఇంధన విని యోగాన్ని తగ్గించిన వారికి పురస్కారాలను గవర్నర్ అందజేశారు. మొత్తం 130 దరఖాస్తులు రాగా 8 కేటగిరీల్లో వారిని గుర్తించి ఈ అవార్డులను ప్రదానం చేశారు. -
గిట్టుబాటు ధర అందేలా కృషిచేస్తా
సాక్షి, హైదరాబాద్: పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెటింగ్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని శుక్రవారం రైతు సమన్వయ సమితి కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు ఆయనను చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..తాను సమర్ధవంతంగా పనిచేస్తాననే నమ్మకంతో కేసీఆర్ ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. రైతులను సంఘటితం చేయడమే రైతు సమన్వయ సమితి లక్ష్యమన్నారు. త్వరలో రాష్ట్రంలోని సమన్వయ సభ్యులందరితో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతు సమన్వయ సమితి సభ్యుల విధులు, బాధ్యతలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కృషిచేస్తామన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ..పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా విజయం సాధిస్తారని చెప్పారు. తెలంగాణ రైతులు అదృష్టవంతులని హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. సమితి చైర్మన్‌గా రాజేశ్వర్‌రెడ్డి రైతుల సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకముందన్నారు. పల్లా బాధ్యతల స్వీకారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతు సమస్వయ సభ్యు లు అభినందనలు తెలిపారు. ఆయనకు అభినందనలు తెలిపిన వారిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, మంత్రులు పాల్గొన్నారు. -
ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యమని మంత్రి జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బుద్ధిజం మొదలైన కాలానికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో రెండ్రోజులుగా జరుగుతున్న బుద్ధ సంగీతి–2019 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బుద్ధిజానికి, తెలంగాణకు మొదటి నుంచి ఉన్న సారూప్యా న్ని వివరించారు. తెలంగాణ సమాజపు ఆలోచనలు బుద్ధిజానికి ప్రతీకలని ఆయన అభివర్ణించారు. బుద్ధిజానికి ఆనవాళ్లు గా నిలిచిన సూర్యాపేట జిల్లాలోని 5 ఆరామాలను కాపాడుకుంటామన్నారు. ఫణిగిరి, వర్ధమానకోట, నాగారం, తిరుమలగిరి, చెన్నాయిపాలెంలలో లభించిన అవశేషాలు బుద్ధిజానికి తెలంగాణ ప్రతీకలనేందుకు తార్కా ణాల న్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే జి.కిషోర్ కుమార్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ లింబాద్రి, థాయిలాండ్, నేపాల్, భూటాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో హుజూర్ జోష్
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో 43వేల పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి, నియోజకవర్గ కేంద్రంలో శనివారం ‘కృతజ్ఞత సభ’పేరిట బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17న పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొనాల్సిన బహిరంగ సభ వర్షం మూలంగా చివరి నిమిషంలో రద్దయింది. సుమారు పది రోజులక్రితం నిర్మించిన సభా వేదికను తొలగించక పోవడంతో శనివారం జరిగే బహిరంగ సభను అదే ప్రదేశంలో నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉప ఎన్నిక ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు శుక్రవారం బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్‌కు చేరుకుని, సాయంత్రం ఐదు గంటలకు జరిగే ‘కృతజ్ఞత సభ’లో ప్రసంగిస్తారు. హుజూర్నగర్ విజయంపై ఎమ్మెల్యే సైదిరెడ్డి, పార్టీ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఫోన్లో అభినందించిన కేసీఆర్, తనను కలిసేందుకు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేదని, శనివారం జరిగే సభకు సంబంధించిన ఏర్పాట్లను చూసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ పర్యటనకు వస్తున్న కేసీఆర్‌కు భారీ స్వాగతం చెప్పేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. సమన్వయ కమిటీలు..సామాజిక కోణాలు హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి వరుసగా మూడు పర్యాయాలు టీఆర్ఎస్ పోటీ చేసినా.. పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహం రూపొందించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెప్టెంబర్ చివరివారంలో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కొందరు ఎంపిక చేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ప్రచార వ్యూహం అమలు, సమన్వయ బాధ్యతలను అప్పగిస్తూ సుమారు 70 మంది ఇన్‌చార్జీలకు ఉపఎన్నికల బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీలతో పాటు కొన్ని ప్రధాన సామాజిక వర్గాల ఓట్లను రాబట్టేందుకు ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో తొమ్మిది మందితో కూడిన కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు కమిటీల ఏర్పాటు వ్యూహం టీఆర్ఎస్కు కలిసి వచ్చింది. పార్టీ వ్యూహం ఫలితాన్ని ఇవ్వడంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేసీఆర్ అభినందించగా, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులను శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. మున్సిపోల్స్‌లోనూ ఇదే తరహా వ్యూహం క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల సమన్వయం, ఇతర పార్టీల నుంచి చేరికలు తదితరాలతో భారీ మెజారిటీ సాధించిన టీఆర్ఎస్, త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తమ నియోజకవర్గాల పరిధిలో మున్సిపాలిటీలు లేని ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ప్రచారం, సమన్వయం బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తోంది. మున్సిపాలిటీలు, వార్డుల వారీగా ఇతర పార్టీల్లో క్రియాశీలంగా ఉండే కార్యకర్తలు, నాయకులను గుర్తించి.. వారిని పార్టీ గూటికి చేర్చే బాధ్యతను కూడా ఇన్‌చార్జీలకు అప్పగిస్తారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై కేటీఆర్ పార్టీ మున్సిపల్ ఇన్‌చార్జీలతో త్వరలో సమావేశం కానున్నారు. -
ఉత్తమ్‌కు మంత్రి జగదీష్ సవాల్..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు తోడు దొంగలుని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ పద్మావతికి హుజూర్నగర్ టికెట్ ఇవ్వొద్దన్న రేవంత్‌ను ప్రచారానికి దింపి, ఉత్తమ్ తన దివాళా కోరుతనాన్ని చాటుకున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటుకు నోటు కేసులో యాభై లక్షల రూపాయాలతో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే.. ఉత్తమ్ కారులో మూడు కోట్ల రూపాయలు అగ్నికి ఆహుతయ్యాయని గుర్తు చేశారు. ఈ ఇద్దరు దొంగలు కలసి హుజూర్నగర్ నియోజకవర్గంపై దాడికి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కు సవాల్ విసిరిన మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఉత్తమ్‌కు మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. సమయం, స్థలం తాను చెప్పినా లేదా.. తనని చెప్పమన్నా సరే సిద్ధమన్నారు. అది హుజూర్నగర్ సెంటరా.. సూర్యాపేట సెంటరా అన్నది తేల్చుకోవాల్సింది ఉత్తమ్‌కుమార్ రెడ్డినే అని వ్యాఖ్యానించారు. శాసన సభ్యుడిగా తన ఐదేళ్ల కాలంలో సూర్యపేటలో జరిగిన అభివృద్ధి గురించి ఉత్తమ్ తెలుసుకోవాలన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి 20 ఏళ్లు శాసన సభ్యుడిగా, మంత్రిగా అధికారంలో ఉండి చేసిందేంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. హుజూర్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి అభివృద్ధి చేయడం ఎలానో తెలియదనే.. కోదాడ ప్రజలు ఇంటికి పంపారని ఘాటుగా విమర్శించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు జ్ఞాపకశక్తి ఎక్కువ అని, ఉత్తమ్, రేవంత్‌రెడ్డి అరాచకాలను ఎప్పటికీ మరచిపోరన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
‘ఉత్తమ్ స్థానికేతరుడు.. చిత్తుగా ఓడించండి’
సాక్షి, నల్గొండ: ఓటమి భయంతోనే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. హుజుర్నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్నగర్ అభివృద్ది కావాలంటే టీఆర్ఎస్ గెలవాలని అన్నారు. ఉత్తమ్ స్వార్థ ప్రయోజనాలకు ప్రజలు బలికావొద్దని హితవు పలికారు. హుజుర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి స్థానికుడని, ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానికేతరుడని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలంతా స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని, కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ఉత్తమ్ ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు ఎంఎల్సీ భానుప్రసాద్, ఉప ఎన్నిక ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉపఎన్నికల్లో జీ‘హుజూర్’.. ఎవరికో?
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ నియోజకవర్గం.. ఎన్నికల శంఖారావం ప్రారంభమైనప్పటి నుంచి ఉంది. 1952లో తొలిసారిగా ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. 1972 ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గం రద్దయింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో మళ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఈ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో మూడుసార్లు పీడీఎఫ్, ఐదుసార్లు కాంగ్రెస్ విజయం సాధిస్తే.. స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. 2009 ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పోటీ చేస్తూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచిన రికార్డు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిదే. ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతుండడంతో ఈ సారి నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టకడతారో..? హుజూర్నగర్ ఎవరికి దక్కనుందో.. వచ్చే నెల 24న ఓట్ల లెక్కింపుతో తేలనుంది. నిషేధం ఉన్నా కమ్యూనిస్టుల ప్రభంజనం.. 1952లో హుజూర్నగర్ ద్విసభ నియోజకవర్గంగా ఏర్పడింది. ఎన్నికల సమయానికి కమ్యూనిస్టు పార్టీపై నిషేధం కొనసాగుతూనే ఉంది. దీంతో కమ్యూనిస్టులు ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి (పీడీఎఫ్)గా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా పలు స్థానాల్లో బరిలో నిలిచి విజయం సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ అప్పట్లో పీడీఎఫ్ విజయ దుందుభి మోగించింది. ద్విసభ నియోజకవర్గమైన హుజూర్నగర్ నుంచి ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులు జయసూర్య, టి.నర్సింహులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జయసూర్యకు 49,829 ఓట్లు రాగా, సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.ఎల్.ఎన్.రావుకు 11,972 ఓట్లు వచ్చాయి. అలాగే టి.నర్సింహులుకు 42,421 ఓట్లు పోలైతే, సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుమిత్రాదేవికి 11,478 ఓట్లు పడ్డాయి. జయసూర్య మెదక్ నుంచి లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఏర్పడిన ఖాళీతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ప్రముఖ కమ్యూనిస్టు నేత, కవి ముక్ధుం మొయినుద్దీన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి. ఎస్.రెడ్డిపై గెలుపాందారు. ఆయనకు 31,289 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 20,686 ఓట్లు పోల్ అయ్యాయి. ఆ తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి దొడ్డ నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీబీ.రావుపై గెలిపారు. నర్సయ్యకు 21,521 ఓట్లు వస్తే వీబీ.రావుకు 15,634 ఓట్లు దక్కాయి. 1962లో ఎగిరిన కాంగ్రెస్ జెండా.. నియోజకవర్గం ఏర్పాటైన పదేళ్ల తర్వాత హుజూర్‌నగర్‌పై కాంగ్రెస్ జెండా ఎగిరింది. అక్కిరాజు వాసుదేవరావు ఈ నియోజకవర్గ తొలి కాంగ్రెస్ ఎమ్మెల్యే. 1962 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే 25,394 ఓట్లు రాగా సీపీఐ అభ్యర్థిగా బరిలో నిలిచిన దొడ్డ నర్సయ్యకు 22,561 ఓట్లు పడ్డాయి. 2,833 ఓట్ల మెజారిటీతో వాసుదేవరావు విజయం సాధించారు. 1967 ఎన్నికల్లోనూ వాసుదేవరావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి 26,618 ఓట్లు పొందారు. ఈ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన దొడ్డ నర్సయ్యకు 23,730 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల్లోనూ వాసుదేవరావుకే విజయం దక్కింది. హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో 1962, 1967 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడింది వీరిద్దరే. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన వాసుదేవరావుపై స్వతంత్ర అభ్యర్థి కె.జితేందర్‌రెడ్డి గెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 26,699 ఓట్లు వస్తే.. స్వతంత్ర అభ్యర్థికి 41,007 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 1978 ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గం రద్దయింది. పునర్విభజనతో హస్తం ఆధిపత్యం.. పునర్విభజనతో ఈ నియోజకవర్గం నేరేడుచర్ల, గరిడేపల్లి, మఠంపల్లి, హుజూర్నగర్, మేళ్లచెరువు మండలాలతో ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత 2016లో నేరేడుచర్ల నుంచి పాలకవీడు, మేళ్లచెరువు నుంచి చింతపాలెం మండలాలను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటితో కలిపి నియోజకవర్గంలో ఏడు మండలాలయ్యా యి. పునర్విభజనతో ఏర్పాటయిన ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లో హస్తందే ఆధిపత్యం కొనసాగింది. 2009లో జరిగిన ఎన్నికల్లో నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిపై గెలిచారు. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌కు 80,835 ఓట్లు రాగా, జగదీశ్‌రెడ్డికి 51,641 ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లోనూ ఉత్తమ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్, టీఆర్ఎస్ నుంచి కాసోజు శంకరమ్మ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌కు 69,879 ఓట్లు పడగా శంకరమ్మకు 45,955 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన టీఆర్ఎస్.. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ బరిలోకి దిగితే 51,641 ఓట్లు, 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి 45,955 ఓట్లు వచ్చాయి. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చింది. ఆపార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శానంపూడి సైదిరెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్‌కు 92,966 ఓట్లు రాగా, సైదిరెడ్డికి 85,530 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఉత్తమ్ 7,436 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్వల్ప ఓట్ల తేడాతో ఉత్తమ్ గట్టెక్కారు. అయితే ఈసారి విజయం తమదేనని ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు «ధీమాగా చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో నాలుగో సారి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందా..? లేక టీఆర్ఎస్ బోణి కొడుతుందా, ఇతర పార్టీలు ప్రభంజనం చూపుతాయన్న చర్చ నియోజవకర్గ వ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది. -
చేరికలు కలిసొచ్చేనా?
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉప ఎన్నిక ముంగింట చేరికలు తారస్థాయికి చేరాయి. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, నేతల జంపింగ్‌ల పర్వం ఊపందుకుంది. ఉదయం ఒక పార్టీలో ఉన్న నేత, మరుసటి రోజు మరో పార్టీ జెండా పట్టుకుంటున్నారు. చేరికలతో తమ బలం పెరుగుతుందని, తమకే కలిసివస్తుందని ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ కొత్త నేతల రాకతో పాత నేతలు అలకబూనుతున్నారు. షెడ్యూల్ విడుదలకు ముందే.. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే చేరికల రాజకీయం హుజూర్‌నగర్‌లో షురూ అయింది. నోటిఫికేష న్ వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్ని మండలాల్లో పార్టీ పరంగా పర్యటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ తగ్గిన మండలాల్లో నజర్ పెట్టడంతో రెండు పార్టీల్లోనే భారీగా చేరికలు జరిగాయి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పలువురు నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అటు టీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్ బాట పట్టారు. ఒక నేత పార్టీని వీడితే మరో నేతను పార్టీలో చేర్పించుకునేందుకు ఇరు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మూడు రోజులుగా ఈ చేరికలు మరింత జోరందుకున్నాయి. నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం చినవెంకట్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఆపార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన మళ్లీ హస్తం గూటికి చేరారు. అలాగే జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాలకవీడు నుంచి మలోతు బుజ్జి విజయం సాధించారు. ఆమెతో పాటు భర్త, బెట్టెతండా సర్పంచ్ మాలోతు మోతీలాల్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో రాజధానిలో నాలుగు రోజుల క్రితం టీఆర్ఎస్లో చేరారు. ఉప ఎన్నిక సమయం సమీపిస్తుండడంతో ఇలా ముఖ్య నేతల చేరికలే టార్గెట్‌గా కాంగ్రెస్, టీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. ఎవరి బలం పెరిగేనో? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ 7 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇంత తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఎక్కడో పొరపాటు జరిగిందని ఆతర్వాత టీఆర్ఎస్ విశ్లేషించింది. అయితే ఇప్పుడు జరుగుతున్న చేరికలతో గతంలో కన్నా మెరుగ్గా ఫలితం ఉంటుందని అభ్యర్థులు, నేతలు ధీమాగా ఉన్నారు. టీఆర్ఎస్ ఏకంగా 40 వేల మెజారిటీతో గెలవబోతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని భారీ మెజారిటీ దక్కనుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ చేరికలతో ఎవరి బలం పెరిగింది, ఎవరి బలం తగ్గిందోనని మండల స్థాయిలో నేతలు లెక్కలు వేస్తున్నారు. గ్రామ స్థాయి, మండల స్థాయిలో ఇరు పార్టీల నుంచి జంప్ అయిన నేతలు ఎవరు..?, వారికి ఉన్న జనాదరణ ఎంత..? అని ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఏ నేత, ప్రజా ప్రతినిధి ఎటు వెళ్తున్నారు.., ఎవరితో మంతనాలు చేస్తున్నారోనని ముఖ్య నేతలు ప్రత్యేకంగా మండలాల్లో వేగులు పెట్టుకున్నట్లు ఆయా పార్టీల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీల్లోకి నేతలు మారినా వచ్చే నెల 24న ఓట్ల లెక్కింపుతోనే ఎవరి బలం పెరిగిందో తేలనుంది. పాత నేతల అలక.. చేరికలతో కొత్త నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. వీరి చేరికతో ఇంతకు ముందే ఆ పార్టీలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు అలకబూనుతున్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓటమికి కారకుడయ్యాడని, మళ్లీ పార్టీలోకి మమ్ముల్ని సంప్రదించకుండా ఎలా తీసుకుంటారని తమ ఆక్రోశాన్ని బహిరంగంగా కాకుండా తమ అనుచరగణం ముందు వెలిబుచ్చుతున్నారు. జంపింగ్‌లతో ఒక్క పార్టీలోనే ఒక్కో మండలం, గ్రామంలో రెండు మూడు గ్రూపులు తయారయ్యాయి. పైకి అంతా సయోధ్యగా ఉన్నట్లు కనిపించినా గ్రూప్‌ల వార్ మాత్రం కొనసాగుతోంది. పార్టీ ముఖ్య నేతల వద్దకు ఈ గ్రూపుల లొల్లి వెళ్లడంతో వారిని బుజ్జగిస్తున్నారు. పాత, కొత్త నేతల మధ్య ఐక్యత లేకపోతే ఈ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం లేకపోలేదని పార్టీ ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు. చేరికలు తమకు లాభమేనని నేతలు ధీమాగా ఉన్నా ఎంత వరకు కలిసివస్తాయన్నది వారికి అంతుచిక్కడం లేదు. గత ఎన్నికల్లోనూ జోరుగా చేరికలు జరిగినా కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ రాలేదు.. టీఆర్ఎస్కు విజయం దక్కలేదు. -
హుజూర్‌నగర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం
సాక్షి, సూర్యాపేట: కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసు అధికారుల తీరుకు నిరసనగా రెండు రోజుల్లో హుజూర్నగర్ సెంటర్లో సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సూర్యపేటలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలవడానికి మంత్రి హింసను ప్రేరేపిస్తున్నారని అన్నారు. అయితే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ సునాయసంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో పడవ ప్రమాదంలో మృతి చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ తరుపున ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్పీకి అసలు పని చేసే అర్హత లేదని, అధికార పార్టీకి తొత్తుగా మారారని ఉత్తమ్ మండిపడ్డారు. అంతేకాక సదరు పోలీసు అధికారి తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. హుజూర్‌నగర్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తూ నేరస్తులు, పోలీసుల వెంట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర అధికారులతో తెలంగాణ ప్రజలను మంత్రి వేధిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలను భయపెట్టి, అక్రమకేసులు బనాయించి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీలో త్వరలోనే విస్ఫోటనం జరగనుందనీ, కేసీఆర్ తీరుఫై ఆ పార్టీ నాయకులే అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా వారిని కేసీఆర్ అవమానించారని దుయ్యబట్టారు. -
ప్రోటోకాల్ పాటించాలి : ఉత్తమ్
సాక్షి, సూర్యాపేట : ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, అధికారిక కార్యక్రమాల విషయంలో ప్రోటోకాల్ పాటించేలా చర్యలు తీసుకోవాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. సూర్యాపేట జిల్లా మేల్లచేరువు మండల కేంద్రంలో 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలసి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ మంత్రులు జగదీశ్ రెడ్డి, దయాకర్‌రావులు ఇద్దరు సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులని, రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారానికి వీరు కృషి చేయాలని కోరారు. రైతు బంధు చెక్కులు రాలేదని, రైతుల రుణ మాఫీ ఊసే లేదని మంత్రులకు గుర్తు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రోటోకాల్ తప్పని సరిగా పాటించాలని అధికారులకు సూచించారు. ‘ఆర్ధిక మాంద్యం వల్ల బడ్జెట్ తక్కువగా ప్రకటించారు. సంక్షేమ పథకాలకు, రైతులకోసం ఈ బడ్జెట్లో పెద్దపీట వేశాం. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూస్తున్నాం. యూరియా లేదని రైతులు అధైర్య పడవద్దని’ భరోసా ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన కేసీఆర్‌ను ప్రతి ఒక్కరు అభినందించాలని పేర్కొన్నారు. -
నల్గోండ జిల్లాలో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు
-
సూర్యాపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్‌రెడ్డి ప్రచారం
-
వారి మానసిక పరిస్థితి మారింది
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రచార సభలతో కాంగ్రెస్ వారి మానసిక పరిస్థితి మారినట్లుగా కనిపిస్తోందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. దామరచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖ రిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలసి జగదీశ్‌రెడ్డి టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘నల్లగొండలో టీఆర్ఎస్ బహిరంగసభ తర్వాత కాంగ్రెస్ నేతల మానసిక ప్రవర్తన మారినట్టుగా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానసిక స్థితి బాగా లేదని.. ఇప్పుడు ప్రజలు కూడా అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దామరచర్లలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్ప త్తి కేంద్రాన్ని మూసేస్తామని కోమటిరెడ్డి అనడాన్ని ఖండిస్తున్నాం. ఇది కోమటిరెడ్డి వైఖరా, కాంగ్రెస్ వైఖరా స్పష్టంచేయాలి. నల్లగొండకు దామరచర్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పోరాడి సాధించుకున్నాం. కోమటిరెడ్డి ఈ ఎన్నికల్లో గెలిస్తే కదా మళ్ళీ రాజీ నామా చేయడానికి.. నల్లగొండ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆ పార్టీ ఎంత అడ్డుకున్నా దామరచర్ల ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం’ అని జగదీశ్ వ్యాఖ్యానించారు. ఆసరా పెన్షన్లు ఆపమనేటట్టున్నారు.. బతుకమ్మ చీరల పంపిణీ, రైతు బంధు చెక్కులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ తీరును ప్రజలు గమనించాలని జగదీశ్ చెప్పారు. ‘కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే ఆసరా పెన్షన్లను ఆపాలని కోరేటట్లున్నారు. కాంగ్రెస్ ప్రజాద్రోహి పార్టీ. ఎలాగూ ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్ నేతలు ప్రజలపై కక్ష కడుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైంది. కేసీఆర్ దీక్షపై ఇప్పు డు కాంగ్రెస్ నేతలు మాట్లాడటాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబుపై కేసీఆర్ మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదు. కేసీఆర్ పేరు వింటేనేబాబు భయపడుతున్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజ ల రక్షకుడిగా చంద్రబాబు నిజ స్వరూపాన్ని తెలియజెప్పాల్సిన అవసరముంది’ అని అన్నారు. వాళ్లలో వాళ్లే పొడుచుకునేలా ఉన్నారు: గుత్తా కాంగ్రెస్‌లో 40 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారని ఎంపీ గుత్తా ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారసభలో జానారెడ్డి, విజయశాంతి లాంటి వాళ్ళు కత్తి తిప్పుతుంటే, వాళ్లలో వాళ్లే పొడుచుకుంటారేమోనని అనుమానం వచ్చిందన్నారు. ‘అన్నీ ఆలోచించాకే దామరచర్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంపై నిర్ణయించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతి స్థిమితంలేదు. రూ.30 వేల కోట్లతో చేపట్టిన దామరచర్ల ప్రాజెక్టును ఆపడం కోమటిరెడ్డి వల్ల అవుతుందా? ఇలాంటి వ్యాఖ్యలతో ఏ పరిజ్ఞానం లేదని కోమటిరెడ్డి నిరూపించుకున్నారు. ఎస్ఎల్బీసీ పనులపై కోమటిరెడ్డి అబద్ధాలు మాట్లాడారు. ఈ పాజెక్టుకు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఎక్కువ నిధులు విడుదల చేసింది’ అని గుత్తా చెప్పారు. -
ఎన్నికల ప్రచారం.. షురూ !
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రం ప్రభుత్వం దాదాపు 9 నెలల ముందుగానే రద్దు కావడం.. ఆ వెనువెంటనే టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. ఆయా ప్రతిపక్ష పార్టీల తరఫున ఇంకా అభ్యర్ధులను ఖరారు చేయకున్నా.. అపుడే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రచారం పోటా పోటీగా మొదలైంది. టీఆర్ఎస్ కోదాడ, హుజూర్‌నగర్‌లో తప్ప మిగిలిన పది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ, ఇతర పార్టీలన్నీ ఇంకా పొత్తులపై ఎటూ నిర్ణయించుకోలేదు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయి. చివరకు కాంగ్రెస్ సైతం అభ్యర్థుల విషయంలో ఉలుకూ పలుకూ లేకుండానే ఉంది. మరోవైపు సీపీఐ, టీడీపీ, బీజేపీ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జనసమితి పార్టీలు తాము పోటీ చేయబోయే స్థానాలపై కానీ, అభ్యర్థుల విషయంగా కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య, శాసన మండలి సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు రోజుల కిందటే ప్రచారం మొదలుపెట్టారు. కొన్నింటిని మినహాయిస్తే, మెజారీటీ నియోజకవర్గాల్లో ప్రచారం షురూ అయ్యింది. దేవాలయాల్లో పూజలతో ప్రచారానికి శ్రీకారం టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కానీ కోదాడ, హుజూర్‌నగర్‌లో ఎలాంటి కదలికా లేదు. అసమ్మతి గళాలు ఎక్కువగా వినిపిస్తున్న మిర్యాలగూడలోనూ చడీ చప్పుడు లేదు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహయ్య ఇప్పటికే పూజలు చేసి ప్రచారం మొదలు పెట్టారు. దేవరకొండ టీఆర్ఎస్ అభ్యర్ధి రమవాత్ రవ్రీందకుమార్ శుక్రవారమే చింతపల్లి సాయిబాబా దేవాయలంలో పూజలు చేసి బైక్ ర్యాలీతో ప్రచారంలోకి దిగారు. మునుగోడులో టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారంలో మునిగిపోయాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శనివారం అంథోల్ మైసమ్మ గుడిలో అపద్దర్మ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పూజలు చేశారు. కాంగ్రెస్ తరఫున తానే బరిలోకి దిగుతున్నానని ప్రకటించిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రెండు రోజులుగా ఆయా మండలాల్లో ప్రచారం చేస్తున్నారు. భువనగిరి, ఆలేరు టీఆర్ఎస్ అభ్యర్థులు పూజలతో ప్రచారంలోకి దిగారు. తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ శనివారం అర్వపల్లి దేవాలయంలో పూజలు చేసి రెండు మండలాల్లో ప్రచారం చేశారు. అపద్దర్మ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి శనివారం జిల్లా సరిహద్దులోని అంథోల్ మైసమ్మ గుడిలో పూజలు చేశాక, సూర్యాపేట చేరుకుని ప్రచార ఢంకా మోగించారు. నకిరేకల్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ప్రచారంలో దిగాయి. టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం రెండు రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇంకా టికెట్ ప్రకటించకున్నా, పార్టీ ఇన్చార్జిగా ఉన్న చిరుమర్తి లింగయ్య సైతం శుక్రవారమే ప్రచారంలోకి దిగారు. నల్లగొండ నియోజకర్గంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారమే దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి కనగల్ మండలంలోప్రచారం మొదలు పెట్టారు. శనివారం తిప్పర్తి మండలంలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి శనివారం హైదరాబాద్ రోడ్‌లోని మర్రిగూడ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. పార్టీలో ఉన్న సీనియర్లను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఆయన ప్రచార రథం జిల్లా కేంద్రంలో వీధుల్లో ప్రచారం చేస్తోంది. బీజేపీ ప్రచార రథం సైతం నల్లగొండలో రోడ్లపైకి ఎక్కింది. మంచి రోజులు, ముహూర్త బలం, సెంటిమెంటు ఉన్న దేవాలయాలు చూసుకుని పూజలతో ప్రచారం మొదలు పెట్టారు. -
వృత్తి నైపుణ్యానికే తొలి ప్రాధాన్యత: జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ యువతకు వృత్తి నైపుణ్యం తో కూడిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో వృత్తి నైపుణ్యానికే తొలి ప్రాధాన్యత ఇచ్చామని, ఇందులో భాగంగా శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణకు సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌తో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి వెల్లడించారు. ఎంఎస్ఎంఈ ద్వారా నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో తొలిదశ వెయ్యి మందికి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి మూడెకరాల భూ పంపిణీ, ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, కొత్తగా గురుకుల పాఠశాలలు, స్వయం ఉపాధి యూనిట్లకు రాయితీలు తదితర కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. -
హోదాకు కేసీఆర్, కవిత మద్దతిచ్చారు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్ సోయి లేకుం డా మాట్లాడుతున్నారని పీసీ సీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఏపీ నేతలు వ్యతిరేకించినా, సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు స్వరాష్ట్రాన్ని సాకారం చేశారని, అందరితో చర్చించిన తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించా రని చెప్పారు. గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మొదటి నుంచీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న తలసానికి ఈ విషయం తెలియకపోవచ్చు గాని, ఉద్యమంలో పాల్గొన్న జగదీశ్‌రెడ్డికి కూడా తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రకు ప్రత్యేకహోదా ఇస్తామని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడాన్ని సమర్థిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఎంపీ కవిత కూడా మాట్లాడిన విషయాన్ని వారు గుర్తించాలని ఆయన కోరారు. -
ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైంది
ఆర్మూర్: ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైంద ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని సాయి గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన టీఆర్ఎస్ బూత్ క మిటీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ కవిత, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి టి.ఉమతోపాటు ముఖ్య నాయకులంతా తెలంగాణ అమర వీరుల కు నివాళులర్పించారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోపాలను ఎత్తి చూ పించడానికి బలమైన ప్రతిపక్షం ఉండాలని అభిప్రాయపడతారన్నారు. కానీ దేశాన్ని, రాష్ట్రాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతిని, పార్టీ ఫిరాయింపులను, చట్టాలకు తూట్లు పొడవడాన్ని నేర్పించిందని ఆరోపించారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజల్లో, రైతుల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేసిన ఏకైక పార్టీ దేశంలోనే టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే నని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులను రాజకీయ దురుద్దేశంతో అడ్డుకొనే కుట్రలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, బీజేపీతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీల నాయకులు తెలంగాణ రాష్ట్రంలో లాగ పథకాలను అమలు చేస్తామంటూ తెలంగాణ రాష్ట్రం పేరును ప్రస్తావించే స్థాయికి చేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇటీవల ఆర్మూర్‌కు వచ్చిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఫరీదొద్దిన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం లో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రూ.38కోట్లు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 48 వేల మంది కార్యకర్తలతోపాటు రాష్ట్రంలో 75 లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వం తీసుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం ఎంపీ కవిత ఆర్మూర్ పట్టణ, మండల బూత్ కమిటీ అధ్యక్షులనే పేరు పేరునా ప్రస్తావిస్తూ వారికి దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మధుశేఖర్, రాజేశ్వర్, విఠల్‌రావు, ఎంపీపీ నర్సయ్య, జడ్పీటీసీ సభ్యుడు సాందన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, నాయకులు గంగాధర్, లింగారెడ్డి, భాస్కర్, గంగామోహన్ చక్రు పాల్గొన్నారు. -
మూసీ దుర్ఘటన; ఆస్పత్రి వద్ద ఆందోళన
సాక్షి, భువనగిరి(యాదాద్రి ) : మూసీ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడడంతో 15 మంది కూలీలు మృత్యువాత పడ్డారు. వేములకొండకు చెందిన 30 మంది మహిళా కూలీలు పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లున్న క్రమంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మృతదేహాలను స్థానిక వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి మృతదేహాలను చూసి కన్నీటి పర్యంమయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ తరపున 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి ప్రకటించారు. వారి పిల్లల చదువులకయ్యే మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీనిచ్చారు. అలాగే, తన వంతుగా ఫైళ్ల ఫౌండేషన్ తరపున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున శేఖర్‌రెడ్డి సాయం ప్రకటించారు. కాగా, 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి వెళ్లిపోతున్న మంత్రి జగదీష్ రెడ్డి తీరుపై స్థానిక కాంగ్రెస్, సీపీఐ నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంలోనూ, క్షతగాత్రులకు వైద్యసాయం అందించడంలోనూ మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మృతుల కుంటుంబాలకు నష్టపరిహారంగా 20 లక్షల రూపాయలు, ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కోరుతూ ఆస్పత్రి నుంచి మృత దేహాల తరలింపును గ్రామస్తులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు అదనపు బలగాలను రప్పిస్తున్నారు. -
సమస్యలేమైనా ఉంటే చెప్పండమ్మా
ఆత్మకూర్–ఎస్ (సూర్యాపేట) : ‘అమ్మా.. పింఛన్లు అందుతున్నాయా.. గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణం ఎలా ఉంది.. సమస్యలేమైనా ఉంటే నాదష్టికి తీసుకురండి’ అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మహిళలకు సూచించారు. సోమవారం ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారంలో సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం తిరుగుప్రయాణంలో ఏపూరులోని ఎస్సీ కాలనీ సమీపంలో మహిళలు ఒక్క చోట కూర్చోవడాన్ని చూసి కారు దిగి వారివద్దకు వెళ్లి ముచ్చటించారు. అక్కడ ఉన్న అవిరె క్రిష్ణవేణి, మార్త అనసూర్యలను పలకరిస్తూ ‘మీ చేతులో సెల్‌ఉంది కదా ఏదైనా సమస్య ఉంటే నా దష్టికి తీసుకురమ్మని చెప్పాను.. ఎలాంటి సమస్యలు లేవా.. గతంలో మంచి నీటి సమస్య ఉందని నా దష్టికి తీసుకువచ్చారు.. ఇప్పుడు ఎలా ఉంది అని’ మంత్రి అడిగారు. ఎలాంటి సమస్యా లేదని మహిళలు సమాధానం ఇచ్చారు. భూములు పట్టాకావడం లేదని.. అధికారుల చుట్టూ తిరిగినా పనులు కావడం లేదని అవిరె క్రిష్ణవేణి మంత్రి దష్టికి తీసుకువచ్చింది. పక్కనే ఉన్న ఆర్ఐతో మాట్లాడిన మంత్రి .. వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. మంత్రి స్వయంగా వచ్చి తమతో కలిసి కూర్చొని సమస్యలను అడగడంతో మహిళలు ఆశ్చర్యానికి గురయ్యారు. అంతకుముందు బొప్పారంలో టీఆర్ఎస్ నాయకుడు పగడాల క్రిష్ణారెడ్డి ని పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో క్రిష్ణారెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. -
రైతులకు మేలు జరగడం ఉత్తమ్‌కు ఇష్టం లేదు
సాక్షి, హుజూర్నగర్ : రైతులకు ప్రయోజనం చేకూరడం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఇష్టం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టులను అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రజలు ఊహించిన పథకాలనే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అమలు పరుస్తున్నారని.. పథకాలు అమలు కాకముందే అవినీతి జరిగిదంటూ కాంగ్రెస్ నాయకులు అభియోగాలు మోపడం దురదృష్టకరమన్నారు. సంక్షేమ పథకాల మీద అవగాహన లేకపోవడం వల్లే కాంగ్రెస్ నాయకులు నిందారోపణలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సన్నద్దమయ్యారని హెచ్చరించారు. రైతులకు పెట్టుబడి రూపంలో 4 వేల రూపాయలు అందిస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం తమదేనని వ్యాఖ్యానించారు. మే 10వ తేదీ నుంచి రైతులకు పెట్టుబడి చెక్కులు అందజేస్తామని ఆయన తెలిపారు. -
ఆదర్శప్రాయుడు ..చామల
శాలిగౌరారం (నకిరేకల్) : ఆదర్శప్రాయుడు.. స్వాతంత్య్ర సమరయోధుడు చామల యాదగిరిరెడ్డి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మూడు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి శాలిగౌరారం గ్రామపంచాయతీ పరిధి రామగిరిలో గల ఆయన స్వగృహంలో మృతిచెందారు. ఈ సందర్భంగా యాదగిరిరెడ్డి మృతదేహాన్ని గురువారం వారు వేర్వేరుగా సందర్శించి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొని యాడారు. తన మరణాంతరం మృతదేహాన్ని వైద్య విద్యార్థుల ప్రయోగార్థం కామినేని వైద్య కళాశాలకు అప్పగించేందుకు ముందస్తుగానే వీలునామా సిద్ధం చేసుకొన్న గొప్ప మానవతావాది అన్నారు. యాదగిరిరెడ్డి మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వారిలో తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, వేముల వీరేశం, రాష్ట్ర గిడ్డం గుల సంస్థ చైర్మన్ మందుల సామేల్, రాష్ట అటవీ అభివృద్ధిశాఖ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ అధి కార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర నాయకులు వేమవరపు మనోహరపంతులు, ఉమ్మడి రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ సీవీఎన్రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్, బోళ్ల నర్సింహారెడ్డి, మామిడి సర్వయ్య, జర్నలిస్టుల సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు తదితరులు ఉన్నారు. -
మంత్రిపై చర్యలేవి; ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాసోజు
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు భూముల కొనుగోలు వ్యవహారంలో మంత్రి జగదీశ్‌రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తప్పుబట్టారు. మంత్రి ప్రైవేటు భూములను కొనుగోలు చేసి.. ప్రభుత్వానికి ఎక్కువ ధరకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గతంలో మీడియాలో వచ్చిన వార్తలను ఆయన గుర్తుచేశారు. ఇది జరిగి మూడు రోజులైనా.. సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని శ్రవణ్ విమర్శించారు. సాక్ష్యాలతో సహా మాట్లాడినా మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ నిలదీశారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చాలని చూస్తోందని ఆరోపించారు. ఈవిషయాన్ని చీఫ్ విజిలెన్స్ ఆఫ్ ఇండియా, లోకాయుక్త దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సైదు రెడ్డికి హుజూర్ నగర్ సీటు.. మంత్రి జగదీశ్వర్ రెడ్డికి డబ్బులు అన్న చందాన క్విడ్‌ప్రో కో జరుగుతోందని ఆరోపించారు. అన్ని అంశాలపై ట్విటర్లో స్పందించే మంత్రి కేటీఆర్, జగదీశ్‌రెడ్డి విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. -
కలెక్టరేట్ నిర్మాణంలో కుంభకోణం
సూర్యాపేట: కొత్తగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ నిర్మాణంలో రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం వారు ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘పేట’పేరు వింటేనే ముందుగా గుర్తొచ్చేది పోరాటాలని, అలాంటి పోరాటాల గడ్డలో జగదీశ్‌రెడ్డి అనే చీడ పురుగు ప్రజలను మోసం చేసేందుకు.. ముసుగు తగిలించుకొని వస్తున్నారని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చుట్టూ కిలోమీటర్ నుంచి రెండున్నర కిలోమీటర్ల పరిధిలో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా.. ప్రైవేటు భూములను ముందుగానే బినామీల పేరుపై కొనుగోలు చేసి వాటిల్లో కలెక్టరేట్ నిర్మాణం చేయడంలో ఆంతర్యమేమిటన్నారు. ప్రైవేటు భూములను దళితుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి వారిని మోసం చేశారన్నారు. ఈ భూములను 2016లోనే కొనుగోలు చేయడంలో కుట్ర దాగి ఉందని విమర్శించారు. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండగా మంత్రి ప్రైవేటు భూములపై ఎందుకు అంత ప్రేమ చూపుతున్నారో ప్రజలకు అర్థమైపోయిందన్నారు. జిల్లా కలెక్టర్ 671 సర్వేనంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిలో కలెక్టరేట్ నిర్మాణం చేస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు పంపించినప్పటికీ.. మంత్రి అవేమీ పట్టించుకోకుండా తనకు అనుకూలమైన ప్రైవేటు భూముల్లో కలెక్టరేట్ నిర్మాణం చేయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కలెక్టరేట్ నిర్మాణం వ్యవహారంలో హైకోర్టుకు వెళతామని వారు అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగదీశ్‌రెడ్డికి 2వేల ఓట్లు కూడా రావన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన మంత్రే అవినీతికి పాల్పడటం బాధ కలిగిస్తోందని అన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలసి నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్‌ను దారుణంగా హత్య చేయించారన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడిన కాల్డిటెయిల్స్ కూడా తీయిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి, మరో నేత కొప్పుల వేణురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి
సూర్యాపేట / హుజూర్నగర్ :రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి గుండకండ్ల జగదీశ్‌రెడ్డిలు పేర్కొన్నారు. సూర్యాపేట, హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లను మంత్రులు సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ప్రజల ఆరోగ్యాలకు భరోసానిచ్చేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. అందులో భాగంగానే డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు చేయనున్నామన్నారు. శిబిరాల ద్వారా ప్రజలందరికీ పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇవ్వడంతో పాటు ఆపరేషన్లు కూడా చేస్తామన్నారు. కార్పొరేట్‌కు దీటుగా వైద్యసేవలు అం దించేందుకు ప్రభుత్వం పాటుపడుతోందని తెలి పా రు. సీఎం హామీ మేరకు నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నా రు. నల్లగొండలో భవనాలు సిద్ధంగా ఉన్నాయని.. సూ ర్యాపేట జిల్లా కేంద్రంలో స్థలాన్ని పరిశీలించామని.. త్వరలో కళాశాలలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా అంటేనే ఫ్లోరో సిస్ గుర్తుకు వస్తుందన్నారు. ఇలాంటి జిల్లాల ప్రజలకు మేలు చేసేందుకే సీఎం మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ సురేంద్రమోహన్, కార్పొరేషన్ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, డీఎంహెచ్ఓ మురళీమోహన్, డీసీహెచ్ఎస్ సంపత్‌కుమార్, సూర్యా పేట మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, బైరు దుర్గయ్యగౌడ్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వైవి, కట్కూరి గన్నారెడ్డి, గండూరి ప్రకాష్, శనగాని రాంబాబుగౌడ్, మారిపెద్ది శ్రీని వాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, కక్కిరేణి నాగయ్యగౌడ్, పుట్ట కిషోర్‌నాయుడు, నాతి సవిందర్‌కుమార్, హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీని వాస్ గౌడ్, వైస్ చైర్మన్ దొంతిరెడ్డి సంజీవరెడ్డి, ఎంపీపీ జి. నిర్మల, జడ్పీటీసీ ఎండీ.హఫీజా, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కె.శంకరమ్మ, రాష్ట్ర ఐడీసీ మాజీ డైరెక్టర్ సాముల శివారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ భిక్షానాయక్, వైద్యశాల సూపరింటెండెంట్ డా.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు . -
‘ప్రీ ఫైనల్లో గెలవలేని వారు ఫైనల్లో గెలుస్తారా’
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ఎమ్మెల్యేల సభ్వత్వ రద్దుపై ప్రజాక్షేత్రంలోకి వెళ్తామన్న కాంగ్రెస్ నేతలు కోర్టుకు ఎందుకెళ్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రీ ఫైనల్లో గెలవలేని వారు ఫైనల్లో గెలుస్తారా అని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల తర్వాత అసెంబ్లీలో టీఆర్ఎస్, ఎంఐఎం రెండు పార్టీలే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. -
'కేటీఆర్ పార్లమెంటరీ పద్ధతిలోనే మాట్లాడారు'
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌పై జానారెడ్డి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాడ్లాడుతూ కేటీఆర్ పార్లమెంటరీ పద్ధతిలోనే మాట్లాడారని స్పష్టం చేశారు. సంస్కారం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరమని ఉందని ఆయన ఏద్దేవా చేశారు. జానారెడ్డికి కాంగ్రెస్ నేతలు ఇవ్వని గౌరవాన్ని కేసీఆర్ ఇచ్చారన్నారు. మరో వైపు ప్రధాని మోదీపై కేసీఆర్ ఎలాంటి పరుష వ్యాఖ్యలు చేయలేదని.. బీజేపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. -
తెలంగాణకు అసలు ద్రోహి కాంగ్రెస్సే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు అసలు ద్రోహి కాంగ్రెస్ పార్టీయేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. చేసిన పాపాలు, మోసాలు, రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ప్రశ్నిస్తారన్న భయం తోనే కాంగ్రెస్ నేతలు పాదయాత్ర కాకుండా బస్సుయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. యాత్ర ఎందుకు చేస్తున్నారో, ప్రజలకు ఏం చెప్పదలచుకున్నారో ఆ పార్టీ జాతీయ నాయకులతో చెప్పించాలన్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నాటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్రకు, కాంగ్రెస్ తాజా బస్సు యాత్రకు పోలికే లేదని విమర్శించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని, ఆ పార్టీలో ఉన్నవాళ్లే బయటకొస్తున్నారని చెప్పారు. జేఏసీ కాగితపు పడవని, దాంట్లో ఎవరు ప్రయాణం చేయాలనుకుంటారని ప్రశ్నించారు. ఇక్కడ ప్రజలున్నారని గుర్తిస్తున్నారా..? రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలంగాణపై మరోసారి విషం కక్కారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న రమేశ్.. తెలంగాణలోని ప్రాణహిత చేవెళ్ల గురించి, ఆంధ్రాలో కలిపిన మండలాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగు నీరుపై ఎందుకు మాట్లాడరని నిలదీశారు. తెలంగాణ ఇస్తా మని 2004, 2009లో ప్రకటించి వందల మంది ప్రాణాలు కోల్పోడానికి కారణమయ్యారన్నారు. తెలంగాణలో ప్రజలున్నారని, వారి సమస్యల పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని కాంగ్రెస్ జాతీయ నేతలు గుర్తిస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్.. ఆంధ్రా పక్షపాతి రాష్ట్రంలోని భూములు దశాబ్దాలుగా బీళ్లు పడి ఉంటే ప్రాజెక్టులెందుకు పూర్తి చేయలేదని కాంగ్రెస్‌ను జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు చిన్నచూపని, ఆ పార్టీ ఎప్పూడూ ఆంధ్రా పక్షపాతిగానే ఉందని ఆరోపించారు. ఆంధ్రాలో కాంగ్రెస్‌కు ఒక్క సీటివ్వకున్నా, ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రాకున్నా పార్టీ జాతీయ నాయకులు ఇప్పటికీ ఆంధ్రాపైనే ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో 2014 ఎన్ని కల్లో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో ఆ పొరపాటు జరగదని, ఒక్కసీటు కూడా ఇవ్వకుండా ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరించారు. బీజేపీ కేంద్రం నుంచి నిధులు ఇప్పించవచ్చు కదా.. రాష్ట్రాన్ని మోసం చేయడంలో కాంగ్రెస్‌తోపాటు బీజేపీ పోటీపడుతోందని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రం లో ఎప్పటికీ అధికారంలోకి రాలేమని తెలిసిన ఆ పార్టీ నేతలు రూ. 20 లక్షలైనా మాఫీ చేస్తామని హామీలిస్తారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ రుణమాఫీ ఎందుకు చేయడం లేదన్నారు. రుణమాఫీ, రైతుల పెట్టుబడి సాయం కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులిప్పించొచ్చు కదా అని బీజేపీ నేతలను నిలదీశారు. -
‘సింగరేణి’కి ప్రథమ బహుమతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో రెండ్రోజుల పాటు జరిగిన మైనింగ్ టుడే అంతర్జాతీయ సదస్సులో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన స్టాల్‌కు ప్రథమ బహుమతి దక్కింది. శుక్రవారం సదస్సు ముగింపు వేడుకల్లో భాగంగా పాల్గొన్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న చేతుల మీదుగా సింగరేణి జనరల్ మేనేజర్ ఆంథోనిరాజ్ ఈ అవార్డును అందుకున్నారు. సింగరేణి స్టాల్లో కోల్ మైనింగ్ వర్కింగ్ మోడల్స్.. లాంగ్ వాల్ మైనింగ్, హై వాల్ మైనింగ్, డ్రాగ్ లైన్, ప్రొపెస్డ్ ఓబీ ప్లాంట్, మాన్‌రైడింగ్ సిస్టమ్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి కాలరీస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితో సింగరేణి అద్భుతంగా పనిచేస్తోందని చెప్పారు. మైనింగ్ పారదర్శకత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పర్యావరణ హితమైన పద్ధతిలో మైనింగ్ చేపడుతున్నట్లు మంత్రి జోగు రామన్న చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా మైనింగ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. -
అమ్మకు అభయం
హుజూర్నగర్/సూర్యాపేట రూరల్ : మాతా శిశు సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకం కొనసాగుతుండగా గర్భిణులకు మరిన్ని సేవలందిస్తూ తల్లీబిడ్డ ఆరోగ్య పరిరక్షణకు దోహదపడేందుకు 108 తరహాలో అమ్మఒడి పేరిట 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనాలు అమ్మకు ఆత్మీయత, బిడ్డకు ప్రేమను పంచనున్నాయి. మొదటి విడతగా జిల్లాకు ఇప్పటికే ఎనిమిది వాహనాలు రాగా నియోజకవర్గానికి రెండు చొప్పున కేటాయించారు. ఇటీవల మంత్రి జగదీశ్‌రెడ్డి చేతులమీదుగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క ఫోన్‌కాల్‌తో.. మారుమూల గ్రామాల నుంచి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు సైతం లేని దు స్థితిలో ఇబ్బందులు పడుతున్న మహిళల కోసం అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టారు. తల్లీ బిడ్డలకే కాకుండా గర్భిణులకు వైద్యం అవసరమైతే 102 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు. ఇంటికి వచ్చి వాహనంలో వైద్యశాలకు తీసుకు వెళ్లి వైద్యపరీక్షలు పూర్తయ్యాక తిరిగి ఇంటి వద్దకు చేరవేస్తారు. జిల్లాలో గల 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలల పరిధిలో ఏఏ ఆస్పత్రిలో ఎక్కువగా ప్రసవాలు జరుగుతున్నాయో గుర్తించి ఆ ప్రాంతాలకు నూతనంగా వచ్చిన వాహనాలను కేటాయించేందుకు సిద్ధమయ్యారు. సేవలు ఇలా.... గర్భిణులకు 7వ నెల నుంచి ప్రసవానంతరం పుట్టిన చిన్నారికి మూడు నెలలు వచ్చేంత వరకు సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. 7వ నెల నుంచి గర్భిణులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా 102 వాహనానికి సమాచారం అందించి సేవలు వినియోగించుకోవచ్చు. గర్భిణి ఇంటి వద్దకు వచ్చి 102 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తారు. వైద్యసేవలు అందించిన తర్వాత్ల తిరిగి ఇంటికి చేరుస్తారు. డెలివరీ అయిన మూడు నెలల వరకు కూడా ఈ 102 వాహనం సేవలు వినియోగించుకోవచ్చు. 102 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే తరలిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించరు. ప్రయాణం మధ్యలో గర్భిణులు, బాలింతలకు అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే ఎమర్జెన్సీ కిట్ అందుబాటులో ఉంచారు. ప్రయాణ సమయంలో వైద్య పరీక్షల అవసరం, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన ఆడియోను వినిపిస్తారు. వాహనాల సేవలు వినియోగించుకోవాలి జిల్లాకు 102 వాహనాలు 8 వచ్చాయి. ఈ వాహనాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వాహనాల్లో గర్భిణులను సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. – రహీం, ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ , సూర్యాపేట జిల్లా -
ఎస్సీ, ఎస్టీల రక్షణకు మెరుగైన చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుంటోందని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. పౌర హక్కుల రక్షణ, దళితులపై దాడుల నివారణ చట్టాల అమలు పురోగతిపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. దళితుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. అంబేడ్కర్ అలోచనలకు అనుగుణంగా షెడ్యూల్ కులాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక సంస్కరణలు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. అంటరానితనాన్ని పారద్రోలేందుకు దళిత విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, జీఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయేతర విద్యుత్‌కు ప్రత్యేక విధానం
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయేతర పద్ధతుల్లో విద్యుదుత్పాదనకు వీలుగా త్వరలో ప్రత్యేక విధానం రూపొందించనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. పవన, సౌర విద్యుదుత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2,700 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తితో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని పేర్కొన్నారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సోమారపు సత్యనారాయణ, గువ్వల బాలరాజు, జలగం వెంకటరావు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని థర్మల్ విద్యుదుత్పత్తిని తగ్గించాలని నిపుణులు సూచించారని.. అయితే సౌర, పవన విద్యుదుత్పత్తిపై ఆధారపడటం ఇబ్బందులను తెచ్చిపెడుతుందని చెప్పారు. పవన విద్యుత్ ఉత్పత్తి విషయంలో నెలకొనే అస్థిరత గ్రిడ్లకు ప్రమాదకరంగా మారుతుందని, సౌర విద్యుత్ నిల్వ భారీ వ్యయంతో కూడుకున్న ప్రక్రియ అని వివరించారు. అయినా ప్రపంచ వ్యాప్తంగా వెలుగుచూస్తున్న కొత్త పరిశోధనలను పరిశీలిస్తున్నామని, రాష్ట్రానికి అనువైన విధానం అవలంబిస్తామని పేర్కొన్నారు. -
వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లు: జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని, దీనిపై సలహాలు, సూచనల కోసం కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికి కేంద్రం నుంచి ఇంకా సమాధానం లేదని ఇంధన, షెడ్యూల్డు కులాల అభివృద్ధి మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. అయితే మంత్రి చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, మూడున్నర ఏళ్లుగా కాలయాపన చేస్తోంæదని నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు జానారెడ్డి, కిషన్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. దీంతో విపక్షాల తీరుపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2010 నుంచి ఎస్సీ కమిషన్ వేయలేదన్న విషయాన్ని సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. 2010 నుంచి మంత్రివర్గంలో ఉన్న వారే ఇప్పుడు వాకౌట్ చేయడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీల విషయంలో కాంగ్రెస్ సభ్యుల తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. బీజేపీ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ కమిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. ఇంకా కేంద్రం నుంచి సమాధానం లేదన్నారు. ఏ అనుమతి కోరినా కేంద్రం కాలయాపన చేస్తోందన్నారు. -
ఏపీ చీఫ్ ఇంజనీర్ లాకర్లను ఓపెన్ చేసిన ఏసీబీ
-
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
సూర్యాపేట : శాంతిభద్రలలకు ఎలాంటి విఘాతం కలగకుండా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉచిత బంకమట్టి వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంప్రదాయాలకు, పండుగలకు పెద్దపీఠ వేస్తోందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (పీఓపీ) కెమికల్స్ విగ్రహాలతో కాలుష్యం ఏర్పడి మానవాళి మనుగడకు ముప్పు కలిగే ప్రమాదముందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి కాలుష్య నివారణకు కృషి చేయాలన్నారు. మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడంలో సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, ఆర్డీఓ సి.నారాయణరెడ్డి, డీఎస్పీ సునితామోహన్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మి, కమిషనర్ వడ్డె సురేందర్, తహసీల్దార్ మహమూద్ అలీ, గండూరి ప్రకాష్, వై.వెంకటేశ్వర్లు, కక్కిరేణి నాగయ్యగౌడ్, కౌన్సిలర్లు వర్ధెల్లి శ్రీహరి, ఆకుల లవకుశ, నిమ్మల వెంకన్న, తాహేర్‌పాషా, రంగినేని ఉమా, డాక్టర్ వనజ, నర్సింహ, పోలెబోయిన రాధిక, నేరేళ్ల మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చిట్యాల: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంతో ప్రజలంతా కలిసి వస్తుంటే రాజకీయ దివాళాకోరుతనంతో ప్రతి పక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆయన రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి బుధవారం హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌లో జరిగే కార్యక్రమానికి వెళుతూ చిట్యాల పట్టణ శివారులోని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఫాంహౌజ్‌లో విలేకరులతో మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఏర్పాటులో నిర్వాసితులకు ప్రభుత్వం గతంలో కంటే మేలైన పరిహారాన్ని అందిస్తుందన్నారు. లక్షల ఎకరాల భూములకు సాగునీరందించే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అక్కడి నిర్వాసిత ప్రజలు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సహకరిస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. ప్రతి పక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేయాలి తప్పితే ప్రాజెక్టుల నిర్మాణాలను, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం తగదన్నారు. జిల్లాలో కాలుష్యకారక పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వమని ఆయన పేర్కొన్నారు. కక్కిరేణిలో ఏర్పాటు చేయనున్న వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజేక్టుకు ప్రజాభిప్రాయసేకరణ ద్వారా ప్రజలు ఆమోదం మేరకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడుతూ స్థానికులకు ఉద్యోగవకాశాలు కల్పించే పరిశ్రమలకు తమ మద్దతుంటుందన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్ గుండెబోయిన శ్రీలక్ష్మి, ఎంపీటీసీలు ఎద్దులపురి క్రిష్ణ, రెముడాల మల్లేష్, గ్రంథాలయ అధ్యక్షుడు బెల్లి సత్తయ్య, సింగిల్ విండో డైరెక్టర్ కర్నాటి ఉప్పల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు కాటం వెంకటేశం, ఏనుగు నర్సింహారెడ్డి, గొదుమగడ్డ జలంధర్‌రెడ్డి, దుబ్బాక సతీష్‌రెడ్డి, గుండెబోయిన సైదులు పాల్గొన్నారు. -
గోజాతి సంరక్షణలో విఫలమయ్యాం
- జాతీయ బుల్‌షోలో మంత్రి జగదీశ్‌రెడ్డి - ఏపీలో 2.5 లక్షల ఒంగోలు గిత్తలు.. - బ్రెజిల్లో 16 కోట్లు: ఏపీ స్పీకర్ కోడెల - ముగిసిన జాతీయ గిత్తల ప్రదర్శన సాక్షి, హైదరాబాద్: ‘‘పులులు, సింహాల సంరక్షణకు అనేక చట్టాలు తెచ్చారు. కానీ కోట్లాది మందికి ఆహారం, జీవనాధారం కల్పించే గోజాతిని సంరక్షించడంలో మాత్రం మనం విఫలమయ్యాం’’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం జలవిహార్‌లో జాతీయ గిత్తల ప్రదర్శన కన్నుల పండువగా జరిగింది. దేశ విదేశాలకు చెందిన పలు మేలు రకాల గిత్తలను ప్రదర్శించారు. అంకుష్ సంస్థ ఏర్పాటు చేసిన బుల్‌షో కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, సినీ నటి అమల, కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి ఓపీ చౌదరి, బ్రెజిల్ వ్యవసాయ శాఖ మంత్రి జుయో క్రూజ్ రెయిస్ ఫిల్హో, పంజాబ్ మంత్రి గుల్జార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి మనకు ప్రసాదించిన వృక్ష, జంతు, పక్షి జాతులను సంరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా పశుపోషణుండాలి: కోడెల ఒంగోలు గిత్తలు ప్రస్తుతం ఏపీలో 2.5 లక్షలుంటే.. బ్రెజిల్ దేశంలో 16 కోట్లున్నాయని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అన్ని రకాల జాతులను ఆ దేశస్థులు పెంచి పోషిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారన్నారు. వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. తెలంగాణలోని తూర్పు గోవును వెలుగులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. గోమాతలో ఔషధ గుణాలున్నాయని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. తన తల్లికి కేన్సర్ సోకిందని, అనేక రకాల మందు లు వాడామని అయితే రెండేళ్లుగా గో మూత్రాన్ని ఔషధంగా వాడుతున్నందున కేన్సర్ లక్షణాలు ప్రస్తుతం కనిపించడం లేదని చెప్పారు. అంతకుముందు సినీనటుడు మోహన్‌బాబు గిత్తలను చూడడానికి ప్రత్యేకంగా వచ్చారు. తాను గిత్తలను పెంచకపోయినా... అవంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉండే ‘తూర్పుగోవు’ను ‘తెలంగాణ గోవు’గా ప్రకటించాలని అంకుష్ సంస్థ తరపున వేణుగోపాల్ కోరారు. ఆయనకు 24 వేల ఆవులు, ఎడ్లు.. బ్రెజిల్‌కు చెందిన డాక్టర్ జోస్ ఒటావియో లెమాస్ బుల్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈయనకు 10 వేల ఎకరాల భూమి, 24 వేల పశు సంపద ఉంది. అందులో 10 వేల ఆవులున్నాయి. వాటిని ఆయన స్వయంగా పెంచుతున్నారు. పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్న ఆయనకు 4 హెలికాప్టర్లు ఉన్నాయి. అంకుష్ సంస్థతో కలిసి ఈయన ఈ షో నిర్వహించారు. ఆకట్టుకున్న ర్యాంప్ వాక్ వివిధ మేలుజాతి గిత్తల ర్యాంప్‌వాక్ (బుల్‌షో) చూపరులను ఆకట్టుకుంది. మొదటగా తెలంగాణకు చెందిన ‘తూర్పుగోవు’ను వేదికపైకి తీసుకొచ్చారు. ఎలాంటి వాతావరణంలోనైనా ఇది తట్టుకొని జీవించగలుగుతుంది. అచ్చంపేట ప్రాంతంలో ఇది ఉంటుంది. ఏపీకి చెందిన పుంగనూరు గిత్త, కేరళకు చెందిన వెచ్చూరు గిత్త, వివిధ రకాల ఒంగోలు గిత్తలు, ఏపీకి చెందిన దేవరకోట జాతి గిత్త, గుజరాత్‌కు చెందిన గిర్, కాంక్రేజ్ గిత్తలను వేదికపై వాక్ చేయించారు. ఈ సందర్భంగా వివిధ జాతి గోవులను కాపాడుతున్నవారికి 26 మందికి గ్లోరియస్ నంది అవార్డులను అందజేశారు. -
అందరి దృష్టి నల్లగొండ మీదే
రౌడీ రాజకీయాల నుంచి విసునూరు వారసుల వరకు హాట్ హాట్ చర్చ రాజగోపాల్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి, ఎమ్మెల్యే వీరేశం అంతకు ముందే నల్లగొండలో మాటల తూటాలు పేల్చుకున్న ఆయా నేతలు కాంగ్రెస్ లోనూ పదవుల పందేరంపై చర్చ జానా, ఉత్తమ్ లను తప్పిస్తారని, కోమటిరెడ్డికి బాధ్యతలిస్తారని ప్రచారం బడ్జెట్ సమావేశాల్లో రాజకీయమంతా జిల్లా చుట్టూనే సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నీలగిరి రాజకీయం రక్తి కడుతోంది. వారం రోజులుగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు అసెంబ్లీకి చేరింది. రాష్ట్ర శాసనసభా బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు మాటల తూటాలు పేల్చుకుంటుండడం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరంపై చర్చ మరోసారి ప్రారంభం కావడంతో ఇప్పుడు హైదరాబాద్‌లో అందరి దృష్టి మన జిల్లా మీదే ఉంది. ముఖ్యంగా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని టార్గెట్ చేసుకుని కోమటిరెడ్డి సోదరులు అటు శాసనసభలోనూ, ఇటు శాసనమండలిలోనూ మాట్లాడుతుండడం, అందుకు ప్రతిగా జగదీశ్‌రెడ్డి కౌంటర్లు వేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో రౌడీ రాజకీయాలు, విసునూరు రామచంద్రారెడ్డి వారసులంటూ ఆవేశపూరిత వ్యాఖ్యానాలు, ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసుననే ఎత్తిపొడుపు మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరపై మరోసారి ఢిల్లీ స్థాయిలో చర్చలు ప్రారంభం కావడం, ఈ పందేరంలో మన జిల్లాకు చెందిన ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండడంతో ఇప్పుడు రాష్ట్రంలో జిల్లా రాజకీయాలే హాట్‌టాపిక్‌గా మారాయి. రౌడీలు... విసునూరు వారసులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలు జిల్లా రాజకీయాలను వేడెక్కించాయి. జగదీశ్‌రెడ్డి మంత్రిగా ఉంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నల్లగొండ జిల్లాలో ఉండే 15 ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శాంతిభద్రతల అంశంపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. నల్లగొండలో రౌడీ రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన అనడం సీన్‌ను మరింత హాటెక్కించింది. అయితే, అందుకు ప్రతిగా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. డబ్బుతో రాజకీయాల్లో ఏదైనా చేయవచ్చని అనుకునే రీతిలో కోమటిరెడ్డి సోదరులు వ్యవహరిస్తున్నారని, జిల్లాలో విసునూరు రామచంద్రారెడ్డి వారసులు రాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించింది. ఆ పార్టీ పక్షాన జిల్లాకు చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మెదక్‌జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ కోమటిరెడ్డి సోదరులను దుయ్యబట్టారు. ఎవరి చరిత్ర ఏంటో జిల్లా ప్రజలకు తెలుసునని, అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో వారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మళ్లీ కోమటిరెడ్డి శిబిరం ఎలా స్పందిస్తుందో, చర్చ ఎటువైపుకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. అయితే, అసెంబ్లీలో ప్రతిపక్షాలు డీలాపడిపోయి బడ్జెట్ సమావేశాలు స్తబ్దుగా జరుగుతాయని అందరూ భావించిన తరుణంలో జిల్లాను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు వేడెక్కుతుండడం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. డిండి రెండేళ్లలో.. కాగా, బడ్జెట్ సమావేశాల సందర్భంగా జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు విముక్తి కల్పించే డిండి ఎత్తిపోతల పథకంపై స్పష్టత వచ్చింది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని సాగునీటి మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. నల్లగొండ ఫ్లోరైడ్ విముక్తికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పిన ఆయన కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టు విషయంలో తాత్సారం జరిగిందని, డీపీఆర్ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోకుండా నాన్చిందని, ప్రస్తుత సీఎం కేసీఆర్ మాత్రం డిండి ఎత్తిపోతలపై పట్టుదలగా ఉన్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. పదవులు పోయేనా..? టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల ఆరోపణల మాట అటుంచితే... ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరంపై జరుగుతున్న చర్చ అటు ఆ పార్టీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పుడిప్పుడే జరిగేదా.. అనే మీమాంస ఉన్నా అటు సీఎల్పీ నేతను, ఇటు పీసీసీ అధ్యక్షుడిని ఆయా పదవుల నుంచి తప్పిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రారంభమైన ఈ చర్చలో కూడా జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల పేర్లే వినిపిస్తున్నాయి. తన సోదరుడిని ఎమ్మెల్సీగా గెలిపించుకుని ఊపు మీదున్న వెంకటరెడ్డి అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను తెలంగాణ వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్‌ను గెలిపిస్తానని చేసిన వ్యాఖ్యల ఆంతర్యంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత జానాలకు పదవీగండం ఉందని, ఇద్దరికీ ఏఐసీసీలో స్థానం కల్పిస్తారని కూడా పత్రికలు కోడై కూస్తున్నాయి. అయితే, పీసీసీ అధ్యక్ష పదవికి ఇప్పట్లో ఉన్న ప్రమాదం ఏమీ లేదని, అయితే, సీఎల్పీ నేతను మాత్రం మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పదవి కోసం ఇతర జిల్లాలకు చెందిన జీవన్‌రెడ్డి, అరుణ లాంటి నాయకుల పేర్లు వినిపిస్తున్నా, పీసీసీ అధ్యక్ష పదవికి జరుగుతున్న చర్చలో మాత్రం ఉత్తమ్‌ను తప్పిస్తే ఆ పదవిని కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఇస్తారని ప్రచారం జరుగుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలు కూడా జిల్లా నేతలను కేంద్రంగా చేసుకుని హాట్‌హాట్‌గా మారుతున్నాయి. నల్లగొండ డీఎస్పీ కార్యాలయం నుంచి మొదలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉన్న రాజకీయం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. ఇటీవల మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి హల్చల్ చేయడం, ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలు దానిని ఖండించడం, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇవ్వడం, మళ్లీ టీఆర్ఎస్ నాయకులు దానిని ఖండించడం, ఆ తర్వాత నకిరేకల్ నియోజకవర్గంలో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడం వరకు ఈ ఆరోపణల పరంపర వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలోనే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిలు ఓ పక్షాన, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలైన కోమటిరెడ్డి సోదరులు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అండ్‌కో మరో పక్షాన మాటల దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం, పది రోజులుగా కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం జిల్లాస్థాయిలోనే హాట్ హాట్ గా మారింది. కానీ, ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడంతో జిల్లా రాజకీయం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయింది. -
ఎట్టకేలకు ముహూర్తం ఖరారు
రేపు ఉదయం 9:30 నుంచి బీబీనగర్ నిమ్స్‌లో సేవలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు బీబీనగర్ నిమ్స్ అవుట్ పేషంట్ విభాగం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 6వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఓపీ సేవలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. మంత్రి సీహెచ్ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా, మరో మంత్రి జగదీశ్‌రెడ్డి విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. తొలిదశలో భాగంగా అబ్‌స్ట్రక్టీవ్ గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్ వంటి సాధారణ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని కోసం నిమ్స్ వైద్యులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి రాజధానిలోని నిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యుల సేవలనే వినియోగించుకోనున్నారు. బీబీనగర్‌లో ఓపీ సేవల ప్రారంభంతో భువనగిరి సహా నల్లగొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజల కష్టాలు కొంతవరకు తీరే అవకాశం ఉంది. తొలి దశలో కొన్ని వైద్యసేవలే... నాలుగు అంతస్తుల్లో 400 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ భవనంలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, స్పైన్, హెడ్ ఇంజూరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, విభాగాలతో పాటు అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్సరే, సీటీ, ఎంఆర్ఐ విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి ఆరుగురు నిష్ణాతులైన వైద్యులతో పాటు ప్రాథమిక అవసరాల కోసం 700 మంది ఇతర సిబ్బంది అవసరం. నియామకాలు చేపట్టకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రారంభించి అభాసుపాలు కావడం కంటే దశల వారీగా సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ఉత్తమమని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు తొలి దశలో బేసిక్ ఓపీ వైద్య సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ కె.మనోహర్ ప్రకటించారు. -
'నల్లగొండలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది'
హైదరాబాద్: అధికార పార్టీ టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం పార్టీలో నల్లగొండ నేతలు చేరారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. నల్లగొండ డీసీసీబీ ఛైర్మన్ విజేందర్ రెడ్డి సహా పలువురు టీఆర్ఎస్లోకి చేరినట్టు చెప్పారు. ఈ వలసల నేపథ్యంలో నల్లగొండలో టీఆర్ఎస్ గెలుపు దాదాపు ఖాయమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ప్రతినిధులు టీఆర్ఎస్కు ఓటేసేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. అందుకే వారంతా టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కాగా కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రజా సమస్యలపై స్పష్టత లేదని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. -
ప్రేమతో అడిగితే 'ఆశ' నెరవేరుస్తాం: హరీశ్ రావు
కల్హేర్ (మెదక్): ఆశా వర్కర్లు ప్రేమతో సమస్యలను ఏకరువు పెడితే వాటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. గురువారం మెదక్ జిల్లా కల్హేర్ మండలంలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు పర్యటించారు. ఈ క్రమంలో కృష్ణాపూర్ వద్ద ఆశా వర్కర్లు మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకోవటంతో.. సమస్యలుంటే నేరుగా విన్నవించాలని మంత్రి సూచించారు. అనవసర రాద్ధాంతం చేస్తే ఉపయోగం ఉండదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. -
ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రులు
ఉట్నూరు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు ఆదివారం సందర్శించారు. మండల పరిధిలో ప్రబలుతున్న విషజ్వరాల పై ఏర్పాటు చేయనున్న సమీక్షా సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రులు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులతో మాట్లాడారు. వైద్యం ఎలా అందుతుందని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగురామన్న, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఆదిలాబాద్ ఎంపీ గెడెం నగేష్ పాల్గొన్నారు. -
'గ్రామజ్యోతి' కార్యక్రమంలో మంత్రి
సూర్యాపేటరూరల్: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి 'గ్రామజ్యోతి' సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు సూచనలు చేశారు. సూర్యాపేట పట్టణంలో బోనాల సందర్భంగా మంత్రి ఊరమైసమ్మ, కోటమైసమ్మ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. -
'వంద మంది బాబులు అడ్డుపడ్డా..'
సూర్యాపేట (నల్లగొండ): వంద మంది చంద్రబాబులు అడ్డుపడ్డా.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే అనుమతులు లభించాయని స్పష్టం చేశారు. ఆ అనుమతులతోనే ప్రస్తుతం నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తుంటే.. ఇలాంటి బాబులు తమ నోటికొచ్చినట్టుగా మాట్లాడటం సబబు కాదన్నారు. సీఎం కేసీఆర్ నిరంతరం రాష్ట్ర అభివద్ధి కోసం బాటలు వేస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. -
విద్యుత్ మంత్రి మాట్లాడుతుంటే కరెంట్ కట్..!
చౌటుప్పల్ (నల్లగొండ): హరితహారం సభలో తాను ప్రసంగిస్తున్న సమయంలో కరెంట్ కట్ కావడంతో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామంలో గ్రీన్‌గ్రోవ్ ఇంటర్నేషనల్ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగం మొదలు పెట్టిన కొద్దిసేపటికే కరెంట్ కట్ అయింది. మైకు రాకపోవడంతో సౌండ్స్ ప్రాబ్లమ్ అనుకున్నారు, కానీ సౌండ్స్ బాగానే ఉన్నాయి, కరెంట్ కట్ అయిందని మంత్రికి చెప్పడంతో... ఏమయ్యా ఏఈ లేడా, విద్యుత్ మంత్రి వస్తే, కరెంట్ కట్ చేస్తారయ్యా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాల యాజమాన్యం జనరేటర్ స్టార్ట్ చేయడంతో ప్రసంగాన్ని మొదలు పెట్టారు. -
'అవినీతి ఆరోపణలు రుజువు చేసేందుకు సిద్ధం'
హైదరాబాద్: విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పై వచ్చిన అవినీతి ఆరోపణలపై నివేదిక ఇవ్వాలంటూ పలు శాఖలకు లోకాయుక్తా నోటీసులు ఇచ్చానా కేసీఆర్ ప్రభుత్వం స్పందించటం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. జగదీశ్ రెడ్డిపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన బుధవారమిక్కడ అన్నారు. అవినీతికి తావు లేదంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ...మంత్రి జగదీశ్ రెడ్డి వ్యవహారంపై విచారణ జరిపించాలని పొన్నం డిమాండ్ చేశారు. -
'ఈ నెల 8న యాదాద్రి ప్లాంటుకు శంకుస్థాపన'
నల్లగొండ: ఈ నెల 8న దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన 5x800 సామర్థ్యంతో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అయితే 17,950 కోట్లతో పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు బీహెచ్ఎల్ అంగీకరించినట్టు మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబు గురివింద: మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్: ఏపీలో ఇతర పార్టీల పార్టీ ఫిరాయింపుల గురించి ఎవరు మాట్లాడినా ఫర్వాలేదు కానీ, గురివింద లాంటి చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.నుంచి వచ్చి టీడీపీలో చేరిన వారిని చంద్రబాబు రాజీనామా చేయించి, ఎన్నికల్లో గెలిపించుకున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంగళవారం జగదీశ్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభ నుంచి తిరిగి వెళుతూ ఇద్దరు కార్యకర్తలు మరణించారని, వారి కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారని చెప్పారు. సమావేశంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, చల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు. -
'జగదీశ్‌రెడ్డి అవినీతిపై ఆధారాలున్నాయి'
చిట్యాల : ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి అవినీతికి పాల్పడినట్లు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సూర్యాపేట కోర్డుకు హాజరయ్యేందుకు వెళుతూ నల్లగొండ జిల్లా చిట్యాలలో గురువారం ఆయన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. ఇందుకోసం ప్రభుత్వం విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యపై అవినీతి ఆరోపణలు వచ్చీరాక మునుపే పదవి నుంచి సీఎం కేసీఆర్ అవమానకరంగా తొలగించారని పేర్కొన్నారు. అదే మంత్రి జగదీష్‌రెడ్డి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తామని తాము సవాలు విసురుతుంటే ఆ మంత్రి ఇంట్లో సీఎం విందుకు వెళ్లటం విడ్డూరమన్నారు. జగదీష్‌రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని నిరూపించుకునేందుకు బదులు సూర్యాపేట కోర్డులో కేసు వేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి వాటికి తాను భయపడబోనని స్పష్టం చేశారు. కాగా పరువు నష్టం కేసులో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గురువారం మధ్యాహ్నం సూర్యాపేట ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అవినీతికి పాల్పడినట్లు పొన్నం చేసిన ఆరోపణలు విషయం విదితమే. దీనిపై మంత్రి ఫిబ్రవరి 24వ తేదీన సూర్యాపేట ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, న్యాయమూర్తి ఈ కేసును జూన్ 3వ తేదీకి వాయిదా వేశారు. -
'వాళ్లు చేస్తే.. నేను రాజీనామా చేస్తా'
నల్లగొండ: తనపై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాను సిద్ధమంటూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై అవినీతి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని ఆయన మండిపడ్డారు. అయితే ఆధార రహిత ఆరోపణలు చేసిన తప్పించుకుని తిరిగిన పొన్నం ప్రభాకర్ కోర్టుకు దొంగలా హాజరయ్యారని జగదీశ్ రెడ్డి విమర్శించారు. -
కానిస్టేబుల్ మృతికి మంత్రుల నివాళి
నల్లగొండ: ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్ రెడ్డి పరిశీలించారు. దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ నాగరాజుకు వారు నివాళులర్పించారు. మరోవైపు ఈ కాల్పుల ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నల్లగొండ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావుపై వేటు వేసింది. రాత్రి పూట తనిఖీల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు పోలీసులు తీసుకోలేదని ప్రభుత్వం అభిప్రాయపడింది. -
ఈఆర్సీ నిర్ణయాన్ని అమలు చేయొద్దు: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్ణయించిన 2015-16 విద్యుత్ చార్జీల టారిఫ్‌ను ఆమోదించవద్దని సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విద్యుత్ చార్జీల పెంపుదలకు ఈఆర్సీ అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆ పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు ఒక లేఖ రాశారు. చార్జీల టారిఫ్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఈఆర్సీ పేర్కొన్నందున.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరించవద్దని కోరారు. 200 యూనిట్లలోపు చార్జీలు పెంచలేదని చెబుతూనే వంద యూనిట్లు దాటగానే టారిఫ్ ఆర్డర్ మారేలా కొత్త స్లాబుల్ని సృష్టించారని పేర్కొన్నారు. చార్జీల పెంపుపై ఆందోళన: మంత్రి జగదీశ్‌రెడ్డితో సీపీఎం నేతలు విద్యుత్‌చార్జీలను పెంచేందుకు విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఇచ్చిన అనుమతిని తిరస్కరించాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి సీపీఎం నేతలు చెరుపల్లి సీతారాములు, టి.జ్యోతి, జాన్‌వెస్లీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో మంత్రికి విన తిపత్రాన్ని సమర్పించారు. -
పొన్నం ఫిర్యాదుపై విచారణ 28కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల వ్యవహారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ ఏప్రిల్ 28కి వాయిదా పడింది. విచారణలో భాగంగా పొన్నం, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ సోమవారం లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి ఎదుట హాజరయ్యా రు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిధులకు సంబంధించిన అంశం తమ పరిధిలోకి రాదని, సంక్షేమ విభాగాలు పర్యవేక్షిస్తాయని రామకృష్ణ నివేదించారు. ఈ మేరకు స్పందించిన లోకాయుక్త... నివేదిక సమర్పించాలని సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేశారు.మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావులు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ముడుపులు స్వీకరించారని, వీరిపై చర్యలు చేపట్టాలని కోరుతూ పొన్నం ప్రభాకర్ లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
మంత్రి జగదీశ్‌రెడ్డిని తప్పించాలి: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటులో కమీషన్లు తీసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం లోకాయుక్త ముందు హాజరైన అనంతరం అసెంబ్లీలో విలేకరులతో మాట్లాడుతూ లోకాయుక్తలో జగదీశ్‌రెడ్డిపై తాము వేసిన కేసును నీరుగార్చాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. విచారణకు ఐఏఎస్ అధికారులను హాజరు కాకుండా చేసి, అసిస్టెంట్లను పంపిస్తున్నదన్నారు. జగదీశ్‌రెడ్డిని తప్పించాలని, కేసు నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
హేతుబద్ధంగా మూసివేతే..
* హేతుబద్ధీకరణ జీవో సవరించకపోతే.. 4 వేల స్కూళ్లకు తాళాలు * ఏప్రిల్ చివరలో ప్రక్రియ ప్రారంభం.. మే నెలాఖరుకు పూర్తి! * మంత్రి హామీ ఇచ్చినా సవరణలకు నోచని జీవో సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో దాదాపు 4 వేల పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమవుతోంది. పాఠశాలల హేతుబద్ధీకరణకు గత సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. విద్యార్థులు ఉన్న చోటుకు ఉపాధ్యాయులను పంపించేందుకు మాత్రమే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను చేపడతామని చెబుతున్నా.. పాఠశాలల హేతుబద్ధీకరణకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో ఉపాధ్యాయ సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దీంతో వెనక్కుతగ్గిన అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా స్కూళ్ల హేతుబ ద్ధీకరణ చేయబోమని, ఒక్క స్కూల్‌ను కూడా మూసివేయమని, ఉత్తర్వులకు సవరణ చేస్తామని అప్పట్లో ప్రకటించారు. కానీ, ఇంతవరకు ఆ ఉత్తర్వుల సవరణకు అడుగు కూడా ముం దుకు పడలేదు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా పాఠశాలలను మూసివేయబోమని చెబుతున్నారు. కానీ, జీవో సవరణకు చర్యలు చేపట్టకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. వచ్చే వేసవిలోనే (ఏప్రిల్ చివరలో హేతుబద్ధీకరణ ప్రక్రియను చేపట్టి మే చివరి నాటికి పూర్తి చేసే అవకాశం) ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. నేపథ్యంలో రేషనలైజేషన్ ఉత్తర్వులకు సవరణ చేయాలని సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. సెప్టెంబర్ 27న జారీ చేసిన జీవోలోని ముఖ్యాంశాలు.. * హేతుబద్ధీకరణలో భాగంగా ఉన్న పోస్టులను సర్దుబాటు మాత్రమే చేస్తారు. ఒక్క కొత్త పోస్టు కూడా సృష్టించరు. ప్రతి ఏటా పదో తరగతి స్పాట్ వ్యాల్యుయేషన్ ముగిసిన వెంటనే పాఠశాల విద్యా డెరైక్టర్ ఆదేశాల ప్రకారం హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలి. * ప్రాథమిక పాఠశాలల్లో: 19, అంతకంటే తక్కువ విద్యార్థులుంటే వాటిని ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న మరో స్కూళ్లో విలీనం చేస్తారు. 20 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లను ఇస్తారు. ఆ తరువాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను ఇస్తారు. ఒకవేళ కిలోమీటరు పరిధిలో మరో పాఠశాల లేకపోతే కనీసం 15 మంది విద్యార్థులున్నా ఆ పాఠశాలను కొనసాగిస్తారు. * ప్రాథమికోన్నత పాఠశాలల్లో: ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల నిబంధనలే వర్తిస్తాయి. 6,7,8 తరగతుల్లో 19 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉంటే, మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్న మరో ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేయాలి. * ఉన్నత పాఠశాలల్లో: 6 నుంచి పదో తరగతి వరకు 75 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలను మూసివేసి ఆ విద్యార్థులను సమీపంలోని మరో హైస్కూళ్లో నమోదు చేస్తారు. బదలాయింపుపై ఉపాధ్యాయుల ఆందోళన.. ఒక స్కూల్లో నిర్ణీత సంఖ్యకంటే విద్యార్థులు తక్కువగా ఉంటే వారిని సమీపంలోని స్కూళ్లలో చేర్పిస్తారు. ఆ స్కూల్లోని టీచర్ పోస్టులను విద్యార్థులు ఉన్న మరో స్కూల్‌కు పంపిస్తారు. దీంతో ఆ స్కూల్ మామూలుగానే మూత పడుతుంది. అయితే ఆ స్కూల్లోని టీచర్ పోస్టుల బదలాయింపు విషయంలోనే ఉపాధ్యాయ సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. విలీనం చేసిన స్కూల్లోని టీచర్ పోస్టులను కూడా విద్యార్థులు ఉన్న చోటికి పంపిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ అవి రద్దు అవుతాయన్న ఆందోళనలో వారు ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం చాలా పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం ఆయా స్కూళ్లలో మంజూరైన పోస్టులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఖాళీగా ఉండగా, మరికొన్నింటిలో టీచర్లు పని చేస్తున్నారు. ప్రస్తుతం స్కూళ్లలో పోస్టుల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల మూసివేసే స్కూల్లోని టీచర్లను పక్క స్కూల్లోకి పంపించకుండా ఆ పోస్టులను రద్దు చేస్తారేమోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు విద్యా శాఖ నిబంధనల ప్రకారం ఒక స్కూల్‌ను మూసివేసినపుడు ఆ పోస్టులను మరో స్కూల్‌కు బదిలీ చేస్తారు. అయితే ఆ పోస్టులో టీచర్ ఉంటే పోస్టుతోపాటు అతడ్ని బదిలీ చేస్తారు. ఒకవేళ బదిలీపై మరో స్కూల్‌కు వెళ్లిన పోస్టులో టీచర్‌ను ఇవ్వకపోతే ఆ పోస్టు కూడా రద్దు అవుతుందన్న ఆందోళనలో ఉపాధ్యాయులు ఉన్నారు. -
‘బాబు తెలంగాణ ద్రోహి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను ఇబ్బందుల పాలు చేయడానికే ఏపీ సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో ఆయన వైఖరి నోటితో మాట్లాడి, నొసటితో వెక్కిరించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రానికి సీఎంను అన్న విషయం మరిచి పోయి, తెలంగాణ విషయంలో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఓ వైపు కరీంనగర్ బహిరంగ సభలో ‘విద్యుత్ అంశంపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తా ’.. అని అంటూ, మరో వైపు ఢిల్లీలో తన అధికారులతో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి వద్ద కృష్ణపట్నం నుంచి తెలంగాణకు కరెంటు ఇవ్వబోమని చెప్పించారని వివరించారు. కార్పొరేషన్లను విడదీయడంలో, కృష్ణా, గోదావరి నీళ్ల విషయంలో పేచీలు పెడుతున్నారని అన్నారు. -
'అవినీతి వల్లే జగదీశ్ రెడ్డి శాఖ మార్పు'
-
బంగారు తెలంగాణలో ఎన్నారైలు భాగం కావాలి
-
ఉపాధి లక్ష్యంగా విద్యా సంస్కరణలు
లండన్ ప్రపంచ విద్యా సదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్యా కాలేజీలు, కోర్సులను పరిశ్రమలకు అనుసంధానం చేయడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సులను నిర్వహించేలా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు చేపడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. లండన్‌లో ఈనెల 19 నుంచి 21 వరకు జరిగిన ప్రపంచ విద్యా సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి జగదీశ్‌రెడ్డి, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు హాజరయ్యారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు మంత్రి తన ప్రసంగంలో వివరించారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు చర్యలు చేపడుతున్నామని, అభివృద్ధికి దోహద పడే మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసే విద్యార్థుల స్థాయిని బట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకువస్తున్నట్లు వివరించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్‌లోనూ మా ర్పులు తెస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వృత్తి విద్యకు ప్రాధాన్యం ఇస్తూ నేషనల్ స్కిల్స్ అండ్ వొకేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందన్నారు.నాణ్యమైన విద్యను అందించేందుకు మండలానికి ఒకటి చొప్పున 464 గురుకుల స్కూళ్లను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి బంగారు తెలంగాణ రూపకల్పనలో ఎన్ఆర్ఐలంతా భాగస్వాములు కావాలని లండన్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. లండన్‌లోని తెలంగాణ ఎన్ఆ ర్‌ఐ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చ ర్చాగోష్టి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడు తూ తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐల పాత్ర చాలా గొప్పదని అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతవరకు ప్రతి ఒక్కరు అప్రమత్తం గా ఉండాలని అవసరమైతే పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, కేజీ టు పీజీ వంటి పథకాలపై ఎన్ఆర్ఐలకు అవగాహన కల్పించారు. -
4-5 రోజుల్లో తెలంగాణ సెట్స్ తేదీలు!
మేమే సెట్స్ నిర్వహిస్తాం.. మీకు సేవలు కావాలో లేదో చెప్పండి ఏపీ సీఎస్‌కు తెలంగాణ ఉన్నత విద్యా మండలి లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూలుపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. ఇప్పటికే ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ జేఎన్టీయూకు అప్పగించగా, మిగతా సెట్స్ నిర్వహణ తేదీలతోపాటు వాటిని నిర్వహించాల్సిన విశ్వ విద్యాలయాలను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఆయా విశ్వవిద్యాలయాల అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మొత్తానికి నాలుగైదు రోజుల్లో తెలంగాణ సెట్స్ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఢిల్లీకి వెళ్లిన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హైదరాబాద్‌కు రాగానే ఆయనతో సమావేశమై వీటిపై చర్చించాలని భావిస్తోంది. ఆ తరువాత పరీక్షల తేదీలను ప్రకటించాలని భావిస్తోంది. ఒకటీ రెండు మినహా మిగతా సెట్స్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు అప్పగించాలని భావిస్తోంది. మరోవైపు ఎంసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షలను తామే నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు బుధవారం లేఖ రాశారు. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం నిర్వహణ అధికారం తమకే ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సేవలు కావాలనుకుంటే నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలని చెప్పారు. ఏపీ ఒప్పుకుంటే రెండు రాష్ట్రాలకు కలిపి తాము సెట్స్ నిర్వహిస్తామిన వివరించారు. అలాగే విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం పదేళ్లపాటు 15 శాతం ఓపెన్ కోటా సీట్లలో రెండు రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని, అందుకోసం ఏర్పాటు చేసే ప్రవేశాల కమిటీలో ఏపీ ప్రభుత్వం నుంచి ఒకరిని సభ్యునిగా నియమిస్తామని వెల్లడించారు. కాబట్టి ఒక అధికారి పేరును తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన కోసం రెండు మూడు రోజులు వేచి చూడాలని మండలి భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చిన వెంటనే షెడ్యూలును ప్రకటించనున్నారు. -
వివాదమేం లేదు..
ఎంసెట్‌పై ఏపీ ప్రభుత్వమే రాద్ధాంతం చేస్తోంది: జగదీశ్‌రెడ్డి ఢిల్లీలో విద్యాశాఖ మంత్రుల సదస్సులో ప్రసంగించిన మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: ఎంసెట్ నిర్వహణలో తమకు సంబంధించి ఎటువంటి వివాదం లేదని.. తాము చట్ట ప్రకారం ముందుకు వెళతామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కావాలని ఎంసెట్ విషయంలో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో యూజీసీ ఆధ్వర్యంలో ‘చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అంశంపై నిర్వహించిన రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలన్నింటినీ అమలు చేసేందుకు తెలంగాణ కట్టుబడి ఉందని... ఏపీ ప్రభుత్వమే చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. లేని అధికారాలను ఉన్నట్లుగా చూపించుకుని ఏపీ ఉన్నత విద్యామండలి తనకుతాను షెడ్యుల్ విడుదల చేసిందని... పైగా తప్పు చేసినవారే గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారని విమర్శించారు. ఇరు రాష్ట్రాల విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఒకే ఎంట్రెన్స్ నిర్వహించేందుకు తెలంగాణ సుముఖంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ఏపీ విద్యా మంత్రికీ చెప్పామని, నిర్ణయం తీసుకోవాల్సింది వారేనని మంత్రి అన్నారు. ఏపీ ప్రభుత్వం కోర్టులకు వెళ్లినా అక్కడా చట్టప్రకారమే వెళ్లాలని తీర్పు వస్తుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం అలవాటని మంత్రి విమర్శించారు. కొత్త విధానంతో మంచి ఫలితాలు ‘చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం’తో మంచి ఫలితాలు వస్తాయని విద్యా మంత్రుల సదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. నిరంతరం విద్యావ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కరణలు చేపట్టాలని కేంద్రం, యూజీసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాగా.. తెలంగాణకు సర్వశిక్షా అభియాన్ నిధులను త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యాశాఖలో పలు పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి వినతిపత్రాన్ని సమర్పించారు. -
త్వరలో సెట్స్ తేదీలు ప్రకటిస్తాం: జగదీశ్‌రెడ్డి
-
మా పరీక్ష మాదే..
* త్వరలో సెట్స్ తేదీలు ప్రకటిస్తాం: మంత్రి జగదీశ్‌రెడ్డి * అడుగడుగునా తప్పులు చేస్తున్నది ఏపీ ప్రభుత్వమే.. సమస్యలు సృష్టిస్తున్నది చంద్రబాబే * ఏపీలో రుణమాఫీ వైఫల్యం, రాజధాని భూముల గొడవను పక్కకు నెట్టే ప్రయత్నం * సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వివాదం * దొంగే దొంగ.. దొంగ అన్నట్లుంది వారి వైఖరి * చట్టం ప్రకారం ఉమ్మడి పరీక్షల నిర్వహణ అధికారం మాదే * ఏపీ కోరితే వారికి కూడా నిర్వహించేందుకు మేం సిద్ధం * గవర్నర్ నరసింహన్‌కు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశామని వెల్లడి * రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు లోగో ఆవిష్కరణ * ‘తెలంగాణ ఎంసెట్’పై న్యాయపోరాటం చేయాలని ఏపీ సర్కారు నిర్ణయం * ఏపీ ఉన్నత విద్యా మండలి తరఫున కూడా పిటిషన్లు వేయాలని యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులకు తెలంగాణ ఎంసెట్ ఉంటుందని.. త్వరలోనే అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ నరసింహన్‌కు కూడా ఇదే విషయాన్ని చెప్పామని ఆయన తెలిపారు. ఈ విషయంలో సమస్యలు సృష్టిస్తూ, గందరగోళంలో పడేస్తున్నది చంద్రబాబేనని విమర్శించారు. ఏపీ రాజధానికి భూసేకరణపై అక్కడి ప్రజల ఆగ్రహం, రుణమాఫీ వైఫల్యం నుంచి వారి దృష్టిని మళ్లించడానికే ఎంసెట్ విషయంలో కావాలని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తాము చట్ట ప్రకారం చర్యలు చేపడుతున్నామని, ఆంధ్రప్రదేశ్ కోరితే వారికి కూడా నిర్వహించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు లోగోను సోమవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ అధికారం తెలంగాణదేనని.. అందుకే జీవో జారీ చేశామని మరోసారి స్పష్టం చేశారు. చట్టంలోని నిబంధనల మేరకు 15 శాతం ఓపెన్ కోటాలో తెలంగాణ విద్యార్థులతోపాటు ఏపీ విద్యార్థులకు పదేళ్ల పాటు అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. అందుకోసం ఏపీ ప్రభుత్వ ప్రతినిధికి ప్రవేశాల కమిటీలో ప్రాతినిధ్యం కల్పించామని చెప్పారు. అయినా ఏపీ నేతలు మూర్ఖంగా మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. 60 ఏళ్లుగా కూడా ఇదేపని చేశారని.. రాష్ట్ర విభ జన తరువాత కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తప్పులన్నీ వారివే... ఎంసెట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కావాలని రాద్ధాంతం చేస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా ఏపీ వైఖరి ఉందని ధ్వజమెత్తారు. వారే షెడ్యూల్ విడుదల చేసి, వారే గవర్నర్‌కు ఫిర్యాదు చేసి తప్పులమీద తప్పులు చేస్తున్నారని... ఇది ప్రజ లకు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాలకు కలిపి పరీక్ష నిర్వహిద్దామనుకునేవారు ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిం చారు. తాము చట్టం ప్రకారమే ముందుకు వెళ్తున్నామని, చట్టానికి విరుద్ధంగా ఉంటే కేంద్రం, కోర్టులు జోక్యం చేసుకుంటాయని పేర్కొన్నారు. పక్కదోవ పట్టించేందుకే.. ఏపీ ఉన్నత విద్యా మండలి ఇచ్చిన షెడ్యూల్ తమకు తెలియదని ఏపీ ప్రభుత్వ నేతలు అంటున్నారని, ప్రభుత్వానికి తెలియకుండా మండలి ఎలా షెడ్యూల్ జారీ చేస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి నిలదీశారు. ఇంటర్ బోర్డు విషయంలోనూ అలాగే మొండిగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలుసునని.. సమస్యలు సృష్టిస్తూ, గందరగోళంలో పడేస్తున్నది చంద్రబాబేనని మంత్రి విమర్శించారు. ఏపీ రాజధానికి భూసేకరణపై అక్కడి ప్రజల ఆగ్రహం, రుణమాఫీ వైఫల్యం నుంచి వారి దృష్టిని మళ్లించడానికే ఎంసెట్ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ప్రతిదానికి గొడవ సృష్టిస్తున్నారని విమర్శించారు. మరోవైపు వేరుగా ఎంసెట్ నిర్వహించుకుంటామని తెలంగాణ స్పష్టం చేయడంతో... దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు సూచనల మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉన్నత విద్యామండలి తరపున కూడా వేరుగా పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. ఇక తెలంగాణ వైఖరిపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గవర్నర్‌తో భేటీ.. ఇంటర్‌బోర్డు లోగో ఆవిష్కరణ అనంతరం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో, రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో మంత్రి జగదీశ్‌రెడ్డి వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వైఖరిని గవర్నర్‌కు మరోసారి స్పష్టం చేసినట్లు చెప్పారు. తాము విభజన చట్టం ప్రకారమే ముందుకు వెళుతున్నామని చెప్పామని... ప్రతి విషయాన్ని సమస్యగా మార్చుతున్నదీ ఏపీ ప్రభుత్వమేనని వివరించామని తెలిపారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో సంస్కరణలు తెస్తోందని.. రాష్ట్రంలోనూ అదే తరహాలో సంస్కరణలు తీసుకురానున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో జరుగనున్న రాష్ట్రాల విద్యా శాఖ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు జగదీశ్‌రెడ్డి సోమవారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా తమ రెగ్యులర్ చదువుతో సంబంధం లేకుండా ఇష్టమైన కోర్సు చేసేందుకు తోడ్పడేలా... ‘చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం’ను అమలు చేస్తామని మంత్రి చెప్పారు. దీనిపైనే ఢిల్లీలో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సిలబస్ ఉండాలి
-
నైపుణ్యానికి చిరునామా
* కేజీ టు పీజీ విద్యాలయాలపై సీఎం కేసీఆర్ ఆకాంక్ష * ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతామని వెల్లడి * అందులో చదివే పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలి * శాంతిభద్రతలు, మహిళల పట్ల గౌరవం పెంచేలా పాఠాలుండాలి * రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సిలబస్ ఉండాలి * జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తమ పిల్లలను ఈ స్కూళ్లలోనే చదివించాలి * విద్యా విధానంపై మరింత చర్చ కోసం విద్యావేత్తలతో సదస్సు సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ విద్యాలయాల్లో వృత్తి నైపుణ్యాలను పెంచే విద్యా విధానం ఉండాలని, విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు, వృత్తి నిపుణులు అవసరమో ముందుగానే అంచనా వేసుకొని, అందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం మంచిదన్నారు. కేజీ టు పీజీ పాఠశాలల్లో చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉపాధి లభించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కేజీ టు పీజీ పాఠశాలల్లో అమలు చేయబోయే విద్యా విధానంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై మంత్రులు, అధికారులతో చర్చించారు. ఏ తరగతి నుంచి ఇంగ్లిషు మీడియం ప్రారంభించాలి? ఏ వయసు నుంచి పిల్లలు హాస్టళ్లలో ఉండటం మంచిది? విద్యా బోధనకు ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు సరిపోతారా? వారికి అదనంగా ఏమైనా శిక్షణ ఇవ్వాలా? బోధన అంశాలు ఎలా ఉండాలన్న విషయాలపై చర్చించారు. ఇది సమాజంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి దీనిపై విసృ్తత స్థాయిలో చర్చ జరగాలని నిర్ణయించారు. ఇందుకు ఈ నెలాఖరులోగా ఎస్సీఈఆర్టీ, ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్లు, విద్యావంతులు, విద్యారంగంలో అనుభవం ఉన్న వారితో సీఎం నేతృత్వంలోనే రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఉపాధ్యాయ సంఘా లు, ఎన్జీవోలతోనూ సదస్సు నిర్వహించి, అందరి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, దేశానికి ఉపయోగపడే మానవ వనరులుగా తీర్చిదిద్దేలా తెలంగాణ రాష్ట్ర విద్యా విధానం ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. విద్య కోసం పెట్టే ఖర్చు వృథా పెట్టుబడి అనే నీచ ప్రచారం గతంలో జరిగిందని, ఫలితంగా ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రమాణాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వం విద్య కోసం పెట్టే ఖర్చును అత్యంత ఉపయుక్తమైన కార్యక్రమంగా భావి స్తోందని, నాణ్యమైన విద్యను అందించడం ద్వా రానే మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందన్నారు. దేశంలో నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యం ఇచ్చే సంస్థలతోపాటు కొరియా, జర్మనీ వంటి దేశాల్లోనూ అధ్యయనం చేయిస్తానని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని వేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తెలంగాణలో కేజీ టు పీజీ విద్యా విధానం అమలుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. పా ఠ్యాంశాల్లో శాంతి భద్రతలు, మహిళల పట్ల గౌరవంగా మసలుకోవడం, సాంస్కృతిక వికాసం, నైతిక ప్రవర్తన వంటి అంశాలు ఉండాలన్నారు. అత్యాధునికంగా నిర్మాణాలు.. కేజీ టు పీజీ పాఠశాలల ఏర్పాటులో భాగంగా మొదటి ఏడాది నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించి, నిర్వహణలోని లోటుపాట్లను పరిశీలించి ఆ తర్వాతి సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలను విస్తరించనున్నట్లు సీఎం చెప్పారు. 15 ఎకరాల స్థలంలో ఈ స్కూళ్లు ఉండాలని, అందులో హాస్టల్, స్కూల్, ఆట స్థలం, డైనింగ్ హాల్ తదితర నిర్మాణాలన్నీ అత్యాధునికంగా, సౌకర్యవంతంగా ఉండాలన్నారు. అటాచ్డ్ టాయ్‌లెట్‌తో కూడిన గదిలో నలుగురే విద్యార్థులు ఉంటారన్నారు. వీటిల్లో అందించే ఆహారం కూడా పోషక విలువలతో కూడి ఉంటుందన్నారు. కేవలం పప్పుచారుతో సరిపెట్టకుండా గుడ్డు, తాజా కూరగాయలు వండాలని, ప్లేట్లు, గ్లాసులను కూడా స్టెరిలైజ్ చేసి వాడాలని సీఎం చెప్పారు. కలెక్టర్, ఎస్పీ లాంటి అధికారులు కూడా తమ పిల్లలను వీటిలోనే చదివించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వివిధ పథకాల కింద వివిధ పాఠశాలలు ఉన్నాయన్నారు. వాటన్నింటిని క్రమంగా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చుతామన్నారు. రాష్ట్రమంతా ఒకే తరహా పాఠశాలలు, ఒకే సిలబస్, ఒకే భోజనం మెను, ఒకే పద్ధతి, ఒకే పరీక్ష విధానం ఉండాలని స్పష్టం చేశారు. కుల మతాల పట్టింపు లేకుండా పిల్లలంతా ప్రభుత్వ ఖర్చుతోనే ఒకేచోట చదవాలని, దీనివల్ల అంతరాలు లేని సమాజం సృష్టించవచ్చన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి, సలహాదారు బీవీ పాపారావు, దేశపతి శ్రీనివాస్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డెరైక్టర్ జగన్నాథరెడ్డి, పాఠశాల విద్యా అదనపు డెరైక్టర్ గోపాల్‌రెడ్డి, కన్సల్టెంట్ ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలు సొంతంగానే నిర్వహిస్తాం: జగదీష్ రెడ్డి
హైదరాబాద్: ఇంటర్ పరీక్షలను సొంతంగానే నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖమంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గురువారం ఆయన కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం సెంటర్ బోర్డు తెలంగాణకే దక్కుతోందని అన్నారు. తెలంగాణకు సెంటర్‌బోర్డు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదన్నారు. బోర్డు తమకు అప్పగిస్తే ఉమ్మడి పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని జగదీష్‌రెడ్డి చెప్పారు. -
తెలుగు వర్సిటీ సేవలు గ్రామాలకు విస్తరించాలి
తెలంగాణ విద్యామంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి భాషను బతికించుకోవాలి తెలుగు భాషను పోగొట్టుకుంటే తెలంగాణను పోగొట్టుకున్నట్లే.. ఒగ్గుకళాకారుడు చుక్కా సత్తయ్యకు విశిష్ట పురస్కారం ప్రదానం సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సేవలు గ్రామాలకు విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి చెప్పారు. మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం 29వ వ్యవస్థాపన దినోత్సవం-విశిష్ట పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు వర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థుల సేవలను సరిగా వినియోగించుకోలేక పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. వారిని, వారి కళలను గ్రామస్థాయిలో వివిధ రంగాల్లో ఉపయోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని, దీనిపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఆంగ్లబోధన కంటే మూడవ తరగతి వరకు తెలుగు పాఠాల్లోనే పిల్లలను చదివించి, నాలుగు నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే బాగుంటుం దన్నారు. భాష - సంస్కృతిపైనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, బతుకమ్మ, బోనాలను ఇంగ్లిషులో ఎలా బోధిస్తారని పేర్కొన్నారు. భాషను బతికించుకోవాల్సిన అవసరం చాలా ఉందని, మనకు మనమే తెలుగును నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగు వర్సిటీని విస్తరించుకోవాల్సి ఉందని, తెలుగు భాషను పోగొట్టుకుంటే తెలంగాణను పోగొట్టుకున్నట్లేనని చెప్పారు. తెలంగాణ ప్రభు త్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ, భాషను నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రస్తు త పరిస్థితుల్లో ఎంతైనా ఉందన్నారు. భాష-సంస్కృతి-కళాకారులను దృష్టిలో పెట్టుకొని ఆనాటి తెలుగు వర్సిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ, తెలుగు వర్సిటీకి గ్రామీణ నేపథ్యం ఉన్నవారే వస్తారని, వారికి స్కాలర్షిప్లు పెంచాల్సి ఉందన్నారు. అంతకముందు ఒగ్గుకథ కళాకారుడు డాక్టర్ చుక్కా సత్తయ్యకు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. జ్ఞాపికతోపాటు రూ. లక్ష నగదును బహుకరించారు. తనకు ఈ స్థాయి రావడం తెలుగు వర్సిటీ పుణ్యమేనని ఆయన చెప్పారు. అంతర్జాతీయ చిత్రలేఖనంలో కాంస్య పతకం సాధించిన సోనీని అభినందించారు. ప్రజా వాగ్గేయకారులు గోరటి వెంకన్న పాడిన శారదమ్మ పాట అందర్నీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో వర్సిటీ రిజిష్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య, విస్తరణ సేవా విభాగం ఇంచార్జి డాక్టర్ జె.చెన్నయ్య పాల్గొన్నారు. -
బాబు మాటలన్నీ పబ్బం గడపడానికే..!
-
ఫిరాయింపులపై దద్దరిల్లిన అసెంబ్లీ
వాయిదా తీర్మానానికికాంగ్రెస్ సభ్యుల పట్టు ఫిరాయింపులను సీఎం ప్రోత్సహిస్తున్నారంటూ ఆందోళన నల్లబ్యాడ్జీలు ధరించి పోడియం వద్ద నినాదాలు పలుమార్లు వాయిదా పడిన అసెంబ్లీ కాంగ్రెస్ వైఖరిపై మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీశ్‌రెడ్డి మండిపాటు వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్ బడ్జెట్ పద్దులపై సాగని చర్చ సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై సోమవారం రాష్ర్టఅసెంబ్లీ దద్దరిల్లింది. కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో హోరెత్తింది. ప్రశ్నోత్తరాల సమయంలో మొదట రెండుసార్లు వాయిదా పడిన అసెంబ్లీని మధ్యాహ్నం మరోసారి సమావేశపరిచి పద్దులపై చర్చకు ఆహ్వానించినా పరిస్థితి మారలేదు. చివరకు సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టాలని స్పీకర్ ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. సీట్లలోనుంచి లేచి పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం టీఆర్ఎస్కు తగదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించిన కాంగ్రెస్ సభ్యులు.. సీఎం కేసీఆర్ స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై వాయిదా తీర్మానాన్ని ఆమోదించాలని పోడియం వద్దకు వెళ్లి పట్టుబట్టారు. ఫిరాయింపులపై చర్చించాలని, పార్టీలు మారిన సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత చూద్దామని స్పీకర్ పదేపదే విన్నవించినా సభ్యులు పట్టించుకోలేదు. రాజ్యాంగాన్ని రక్షించాలి, సీఎం డౌన్‌డౌన్, సీఎం రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఖండించాలంటూ నినదించారు. దీనిపై మంత్రి కే టీఆర్ మండిపడ్డారు. ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కాంగ్రెస్ పార్టీ అని పేర్కొంటూ ఇందిరాగాంధీ హయాం నుంచి పీవీ నరసింహారావు వరకు జరిగిన ఫిరాయింపులను ప్రస్తావించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లిందన్నట్లు కాంగ్రెస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్ సభ్యులు ఎంతకూ నినాదాలు ఆపకపోవడంతో స్పీకర్ మధుసూదనాచారి మొదట సభను 10 నిముషాలు వాయిదా వేశారు. తిరిగి సభ 10.55 గంటలకు సమావేశమైంది. అయినా కాంగ్రెస్ సభ్యులు శాంతించలేదు. తమకు న్యాయం చేయాలని నినదించారు. ఇదే సమయంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాంలాల్‌ను అడ్డంపెట్టుకొని దొడ్డిదారిన నాదెండ్ల భాస్కరరావును సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాల హోరులో హరీశ్ మాటలు ఎవరికీ అర్థంకాలేదు. గందరగోళం మధ్య సభను రెండోసారి అరగంటపాటు స్పీకర్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 12.20 గంటలకుసభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు మళ్లీ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిందని పేర్కొంటూ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. బడ్జెట్ పద్దులను ప్రతిపాదించాల్సిందిగా మంత్రులను కోరారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పద్దులను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమాలకు సంబంధించిన పద్దులపై మాట్లాడాల్సిందిగా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ను సభాపతి కోరారు. పోడియం వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ సభ్యులతో ఉన్న సంపత్‌కుమార్ అందుకు నిరాకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్ పద్దులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా... దీన్నుంచి తప్పించుకునేందుకే ప్రతిపక్ష పార్టీ ఆందోళనకు దిగిందని విమర్శించారు. బడ్జెట్‌ను రాష్ట్రమంతా అభినందిస్తుంటే తట్టుకోలేని ప్రతిపక్షాలు.. అనవసర రాద్ధాంతం చేస్తూ సభా కాలాన్ని వృథా చేస్తున్నాయన్నారు. ఏ సభ్యుడికైనా రాజకీయంగా పార్టీ మారే హక్కు ఉంటుందన్నారు. ఇప్పుడు ఆందోళన చేస్తున్న నేతలు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారారో అందరికీ తెలుసని అన్నారు. అయినా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వీడకపోవడంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. -
పాఠశాలలు మూస్తే పేదలకు చదువు కల్ల
విపక్షాల ఆగ్రహం బీజేపీ వాకౌట్ మంచిది కాదన్న కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసివేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను విపక్షాలు శుక్రవారం అసెంబ్లీలో వ్యతిరేకించాయి. పాఠశాలలను బలోపేతం చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, అలా కాకుండా వాటిని మూసివేస్తే పేదలు విద్యకు నోచుకోరని ఆందోళన వ్యక్తం చేశాయి. హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ వాకౌట్ చేయగా, కాంగ్రెస్ సభలోనే ఉండి నిరసన వ్యక్తం చేసింది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు కె. లక్ష్మణ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. విద్యార్థులు లేరని పాఠశాలలు మూసివేయడం మంచిది కాదన్నారు. తక్కువమంది విద్యార్థులున్నారని ఉపాధ్యాయులను బదిలీ చేయడం, పదిమందే ఉన్నారని పాఠశాలలనే మూసివేస్తే భవిష్యత్‌లో మారుమూల ప్రాంతాల పేద విద్యార్థులకు చదువుకునే అవకాశమే ఉండదన్నారు. హేతుబద్ధీకరణను అమలు చేస్తే హైదరాబాద్‌లోనే 450 పాఠశాల లు మూతపడతాయన్నారు. రాష్ట్రంలో 15వేలకు పైగా ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మరో సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి పేర్కొనగా, కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు గ్రామాలను దత్తత తీసుకున్న మాదిరిగా, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకటి రెండు పాఠశాలలను దత్తత తీసుకుని వాటి అభివృద్దికి పాటుపడితే బాగుంటుందని జి.కిషన్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినంత మంది ఉపాధ్యాయులులేరని ఎమ్మెల్యే డీకేఅరుణ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 200 మంది విద్యార్థులు ఉన్న చోట ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టీచర్లులేక 272 పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు. గ్రామీణ పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించాలని జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హేతుబద్ధీకరణ అంటే మూసివేయడం కాదు పాఠశాలల హేతుబద్ధీకరణ అంటే మూసివేయడం కాదని, విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను నియమించే ప్రక్రియ మాత్రమేనని విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. పాఠశాలలను మూసివేయాలన్న ప్రతిపాదన లేనేలేదని, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడిన తరువాతే హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయించామన్నారు. ఈ విషయంలో సభ్యులు ఆందోళన చెందనవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులు లేనిచోట కిలోమీటర్ పరిధిలోనే ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడం జరుగుతుందని, హేతుబద్ధీకరణలో మిగిలిపోయిన ఉపాధ్యాయులను ఆదే మండలంలో ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28 వేల పాఠశాలలుంటే అందులో 2,100 స్కూళ్లల్లో విద్యార్థినుల కోసం మరుగుదొడ్లు లేవన్నారు. 4,600 స్కూళ్లలో మంచినీరు లేదన్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో టాయిలెట్ వస్తుందనే కారణంతో విద్యార్థినులు మంచినీరు తాగడం లేదన్నారు. సామాజిక బాధ్యతగా నీటి వసతి నిర్మల్ భారత్ అభియాన్‌ను స్వచ్ఛభారత్ కార్యక్రమంగా కేంద్రం మార్పు చేసిందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. సామాజిక బాధ్యత కింద కొన్ని సంస్థలకు సర్కారీ బళ్లలో మరుగుదొడ్లు, నీటి వసతి కల్పించే బాధ్యత అప్పగిస్తామని ఆయన తెలిపారు. వచ్చే వారంలోగా 70 సంస్థలకు 20 వేల పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి వసతి కల్పించే బాధ్యత అప్పగిస్తామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని పాఠశాలల్లో టాయిలెట్లు, మంచినీటి వసతి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే ఆగస్టు నాటికి వీటిని పూర్తిచేస్తామని మంత్రి పేర్కొన్నారు. -
వాళ్ళంతా డబ్బా చానళ్ళ వల్ల పుట్టలేదు!
-
ఫీజు బకాయిలు 500 కోట్లు విడుదల
మొత్తం బకాయిలు రూ. 1587.75 కోట్లు త్వరలో మిగతావి చెల్లిస్తాం: మంత్రి జగదీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలపై నెలకొన్న సందిగ్ధతను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. తెలంగాణ పది జిల్లాల్లో ఫీజు బకాయిలన్నింటినీ రెండు,మూడు విడతల్లో చెల్లించాలని నిర్ణయించింది. తొలివిడతగా రూ. 500 కోట్లు మంజూరు చేస్తూ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేసినట్టు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్‌కమిటీతో సీఎం చర్చించి ఈమేరకు నిర్ణయించినట్టు మంత్రి వివరించారు. 2010- 11 విద్యా సంవత్సరం నుంచి 2013-14 వరకు నిలిచిపోయిన రూ. 1587.75 కోట్లను మూడు విడతల్లో పూర్తిగా చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు. ట్యూషన్ఫీజుతోపాటు స్కాలర్‌షిప్పు బకాయిలను కూడా పూర్తిస్థాయిలో చెల్లించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ఫీజు బకాయిలన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ముందు(జూన్2కు ముందు) ఉమ్మడి రాష్ట్రంలోనివే అయినప్పటికీ, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని జగదీశ్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు అనే తేడా లేకుండా 18 లక్షల మంది విద్యార్థులకు బకాయిలను చెల్లించనున్నట్టు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చెల్లించిన బకాయిల్లో 58 : 42 నిష్పత్తిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమ వాటాను వసూలు చేసుకుంటామన్నారు. అధికారుల విభజనలో జాప్యం కారణంగానే ఫీజు చెల్లింపుల్లో ఆలస్యం అయిందని, ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసినా ఇప్పటికీ అధికారుల విభజన ప్రక్రియ పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. ఫీజు బకాయిలు నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని, అప్పటి ప్రభుత్వాలను ప్రశ్నించకుండా కొత్త రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం అంటే బట్టకాల్చి మీదేయడమేనని ఆయన విమర్శించారు. అప్ప టి ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణపై చంద్రబాబు కుట్రలకు ఇక్కడి ప్రబుద్ధులు వంతపాడడం శోచనీయమని టీ-టీడీపీ నాయకులను ఉద్దేశించి మంత్రి విమర్శించారు. వృత్తి విద్యా కళాశాలల సంఘం హర్షం వృత్తి విద్యా కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన బకాయిల్లో రూ. 500 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడంపై తెలంగాణ ప్రొఫెషనల్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్, విద్యామంత్రి జగదీశ్‌రెడ్డిలకు సంఘం నాయకులు గౌతంరావు, సునీల్ ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతి నాటికి డీఎస్సీ నోటిఫికేషన్! ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వచ్చే సంక్రాంతి నాటికి నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు చర్యలు చేపడతామని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు నిరుద్యోగుల సంఘం నేతలు వెల్లడించారు. త్వరగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ పలువురు నిరుద్యోగులు శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియను డిసెంబరునాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. -
రూట్ 2 ఫ్యాషన్
అమ్మాయిలు ర్యాంప్‌పై అలా అలా వయ్యారాలు పోతుంటే... అబ్బాయిలు బెల్లీ, బ్రేక్‌లు మిక్స్ చేసి దుమ్ము దులిపారు. ఇది ఆరంభం మాత్రమే. ఆపై అదిరిపోయే ఆటలు... మతిపోగొట్టేలా విరుపులు... సినీతారల మెరుపులు... రూట్స్ బిజినెస్ స్కూల్ ఫ్రెషర్స్ డే కలర్ఫుల్గా సాగింది. సోమాజిగూడ పార్క్ హోటల్లో జరిగిన ఈ వేడుకలో మోడల్స్‌ను మరిపిస్తూ... ఫ్యాషన్లతో మురిపిస్తూ... కుర్రకారు హుషారుతో కిక్ ఎక్కించారు. అందాల తారలు రేష్మ, శ్రావ్యారెడ్డి అదనపు సొగసులద్దారు. రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి విద్యార్థులను అభినందించారు. - సోమాజిగూడ