అధికార పార్టీ టీఆర్‌ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం పార్టీలో నల్లగొండ నేతలు చేరారు.
హైదరాబాద్: అధికార పార్టీ టీఆర్‌ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం పార్టీలో నల్లగొండ నేతలు చేరారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. నల్లగొండ డీసీసీబీ ఛైర్మన్ విజేందర్ రెడ్డి సహా పలువురు టీఆర్‌ఎస్‌లోకి చేరినట్టు చెప్పారు.
ఈ వలసల నేపథ్యంలో నల్లగొండలో టీఆర్‌ఎస్ గెలుపు దాదాపు ఖాయమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ప్రతినిధులు టీఆర్‌ఎస్‌కు ఓటేసేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. అందుకే వారంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. కాగా కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రజా సమస్యలపై స్పష్టత లేదని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.