హైదరాబాద్: ఏపీలో ఇతర పార్టీల పార్టీ ఫిరాయింపుల గురించి ఎవరు మాట్లాడినా ఫర్వాలేదు కానీ, గురివింద లాంటి చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.నుంచి వచ్చి టీడీపీలో చేరిన వారిని చంద్రబాబు రాజీనామా చేయించి, ఎన్నికల్లో గెలిపించుకున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జగదీశ్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ నుంచి తిరిగి వెళుతూ ఇద్దరు కార్యకర్తలు మరణించారని, వారి కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారని చెప్పారు. సమావేశంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, చల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు.