సూర్యాపేట (నల్లగొండ): వంద మంది చంద్రబాబులు అడ్డుపడ్డా.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే అనుమతులు లభించాయని స్పష్టం చేశారు. ఆ అనుమతులతోనే ప్రస్తుతం నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తుంటే.. ఇలాంటి బాబులు తమ నోటికొచ్చినట్టుగా మాట్లాడటం సబబు కాదన్నారు. సీఎం కేసీఆర్ నిరంతరం రాష్ట్ర అభివద్ధి కోసం బాటలు వేస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు.