![Brs Leader Jagadeesh Reddy Comments On Telangana Government](/styles/webp/s3/article_images/2024/09/8/jagadeeshreddy.jpg.webp?itok=tSYR_uYs)
సాక్షి,సూర్యాపేటజిల్లా: రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గందరగోళంలోకి నెట్టిందని, కరెంట్ విషయంలో పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆదివారం(సెప్టెంబర్8) ఆయన మీడియాతో మాట్లాడారు.
‘కాంగ్రెస్ మంత్రులు సంపాదనలో మునిగిపోయారు. రైతులు మిమ్మల్ని గెలిపిస్తే అదే రైతులను మోసం చేసి పబ్బం గడుపుతున్నారు. రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారా లేదా స్పష్టమైన వైఖరి తెలియజేయాలి. వరద బాధితులకు వెంటనే నష్ట పరిహారం అందించాలి’అని డిమాండ్ చేశారు
Comments
Please login to add a commentAdd a comment