విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటులో కమీషన్లు తీసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటులో కమీషన్లు తీసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం లోకాయుక్త ముందు హాజరైన అనంతరం అసెంబ్లీలో విలేకరులతో మాట్లాడుతూ లోకాయుక్తలో జగదీశ్‌రెడ్డిపై తాము వేసిన కేసును నీరుగార్చాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. విచారణకు ఐఏఎస్ అధికారులను హాజరు కాకుండా చేసి, అసిస్టెంట్లను పంపిస్తున్నదన్నారు. జగదీశ్‌రెడ్డిని తప్పించాలని, కేసు నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.