సాక్షి, నల్గొండ: నల్గొండ దద్దరిల్లేలా ఈ నెల 13న బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సభ ఉంటుందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. కృష్ణా జలాల సాధాన కోసం బీఆర్‌ఎస్ నల్గొండలో నిర్వహిస్తున్న చలో నల్గొండ సభ ఏర్పాట్లను జగదీష్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు కేసీఆర్ స్వయంగా హాజరై కృష్ణా ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగడతారని చెప్పారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి. కేసీఆర్ గుర్తులు చెరిపేస్తామంటున్న రేవంత్‌రెడ్డిది నీచ సంస్కృతి. ఇవాళ దొంగల చేతికి తెలంగాణ పోయింది. కృష్ణా ప్రాజెక్టులను తిరిగి రాష్ట్ర పరిధిలోకి తీసుకురాకుంటే కాంగ్రెస్ వాళ్ళను గ్రామాల్లో తిరగనివ్వం’ అని జగదీష్‌రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఆధీనంలో కేఆర్‌ఎంబీకి అప్పగించిందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చలో నల్గొండ పేరుతో బీఆర్‌ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి.. సీఎం రేవంత్‌రెడ్డి పర్‌ఫక్ట్ లీడర్: కేఏ పాల్
Comments
Please login to add a commentAdd a comment