సాక్షి, హైదరాబాద్: ఎస్సీ యువతకు వృత్తి నైపుణ్యం తో కూడిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో వృత్తి నైపుణ్యానికే తొలి ప్రాధాన్యత ఇచ్చామని, ఇందులో భాగంగా శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణకు సంబంధించి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌తో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈ ద్వారా నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో తొలిదశ వెయ్యి మందికి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి మూడెకరాల భూ పంపిణీ, ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, కొత్తగా గురుకుల పాఠశాలలు, స్వయం ఉపాధి యూనిట్లకు రాయితీలు తదితర కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment