
'ఈ నెల 8న యాదాద్రి ప్లాంటుకు శంకుస్థాపన'
నల్లగొండ: ఈ నెల 8న దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్టు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన 5x800 సామర్థ్యంతో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అయితే 17,950 కోట్లతో పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు బీహెచ్ఎల్ అంగీకరించినట్టు మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.