ఈఆర్‌సీ నిర్ణయాన్ని అమలు చేయొద్దు: సీపీఎం | Do not implement ERC, says CPM | Sakshi
Sakshi News home page

ఈఆర్‌సీ నిర్ణయాన్ని అమలు చేయొద్దు: సీపీఎం

Published Tue, Mar 31 2015 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయించిన 2015-16 విద్యుత్ చార్జీల టారిఫ్‌ను ఆమోదించవద్దని సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయించిన 2015-16 విద్యుత్ చార్జీల టారిఫ్‌ను ఆమోదించవద్దని సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విద్యుత్ చార్జీల పెంపుదలకు ఈఆర్‌సీ అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆ పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు ఒక లేఖ రాశారు. చార్జీల టారిఫ్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఈఆర్‌సీ పేర్కొన్నందున.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరించవద్దని కోరారు. 200 యూనిట్లలోపు  చార్జీలు పెంచలేదని చెబుతూనే వంద యూనిట్లు దాటగానే టారిఫ్ ఆర్డర్ మారేలా కొత్త స్లాబుల్ని సృష్టించారని పేర్కొన్నారు.
 
 చార్జీల పెంపుపై ఆందోళన: మంత్రి జగదీశ్‌రెడ్డితో సీపీఎం నేతలు
 విద్యుత్‌చార్జీలను పెంచేందుకు విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఇచ్చిన అనుమతిని తిరస్కరించాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి సీపీఎం నేతలు చెరుపల్లి సీతారాములు, టి.జ్యోతి, జాన్‌వెస్లీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో మంత్రికి విన తిపత్రాన్ని సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement