
ఇంటర్ పరీక్షలు సొంతంగానే నిర్వహిస్తాం: జగదీష్ రెడ్డి
ఇంటర్ పరీక్షలను సొంతంగానే నిర్వహిస్తామని విద్యాశాఖమంత్రి జగదీష్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: ఇంటర్ పరీక్షలను సొంతంగానే నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖమంత్రి జగదీష్రెడ్డి తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను గురువారం ఆయన కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం సెంటర్ బోర్డు తెలంగాణకే దక్కుతోందని అన్నారు. తెలంగాణకు సెంటర్బోర్డు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదన్నారు. బోర్డు తమకు అప్పగిస్తే ఉమ్మడి పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని జగదీష్రెడ్డి చెప్పారు.