
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర విద్యుత్ సవరణ చట్ట బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ బిల్లు వల్ల వినియోగదారులకు ఉపయోగం లేదని, గృహ వినియోగదారులు సబ్సిడీ కోల్పోయే అవకాశముందన్నారు. శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.(ఛాలెంజ్‌ను స్వీకరించిన రేణు దేశాయ్)
సబ్సిడీ పొందుతున్న అన్ని వర్గాల ప్రయోజనాలు హరిస్తున్నాయన్నారు. ప్రైవేటు సంస్థలకు పూర్తిగా అప్పగించే ప్రయత్నం నడుస్తుందన్నారు. ఈ బిల్లుతో మూడు రకాల నష్టాలు ఉన్నాయని, దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. పంజాబ్, రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాలు సైతం ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయన్నారు. రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా బిల్లులో ఒక్కలైన్ కూడా మార్చలేదని దుయ్యబట్టారు. (లాక్‌డౌన్; ఆగిన బతుకు బండి)
Comments
Please login to add a commentAdd a comment