Kashmir issue
-
ట్రంప్ సాయంతో కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తారా?
ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా అడుగులేస్తున్నారు . ఉక్రెయిన్, గాజా సంక్షోభాలకు ముగింపు పలికేందుకు కఠిన నిర్ణయాలే తీసుకుంటున్నారు. అయితే ఆయన సాయంతోనే సున్నితమైన కశ్మీర్ సమస్య(Trump Kashmir Issue)ను భారత్ పరిష్కరించుకోవచ్చు కదా!. ఇదే ప్రశ్న భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ఎదురైంది.లండన్ చాథమ్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి జై శంకర్ హాజరయ్యారు. కశ్మీర్ పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump)ను భారత ప్రధాని మోదీ కోరే ఉద్దేశమేదైనా ఉందా? అని ప్రతినిధులు ఆయన్ని అడిగారు. అయితే ఈ అంశంలో భారత్ ఇప్పటిదాకా స్వతంత్రంగానే వ్యవహరించిందని.. ఇక మీదటా ‘మూడో ప్రమేయం’ ఉండదని స్పష్టం చేశారాయన. కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా ఇప్పటిదాకా మేం(భారత్) ఒంటరి ప్రయత్నాలే చేశాం. మంచి అడుగులెన్నో వేశాం. ఇప్పటికే నిర్ణయాత్మక చర్యలెన్నో తీసుకున్నాం. అందులో మొదటి అడుగే ఆర్టికల్ 370(Article 370) తొలగింపు. కశ్మీర్ అభివృద్ధి, ఆర్థిక పురోగతి, సామాజిక న్యాయం.. ఇవి రెండో అడుగు. అత్యధిక ఓటింగ్ శాతం నమోదు అయ్యేలా ఎన్నికలు నిర్వహించడం మూడో అడుగు. అయితే..ఇంకా పరిష్కారం కాని అంశం.. దేశం అవతల ఉంది. అదే పాక్ ఆక్రమిత కశ్మీర్(Pak Occupied Kashmir). దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. అది పూర్తైతే గనుక కశ్మీర్ సమస్య పరిష్కారం అయినట్లే. అందుకు నేను మీకు హామీ ఇస్తున్నా’’ అని జైశంకర్ అన్నారు. ‘పీవోకే’ భారత్‌లో అంతర్భాగమని, అది 1947 నుంచి పాక్ ఆక్రమణలో ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఎప్పటికప్పుడు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కిందటి ఏడాది.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విదేశీ భూభాగమేనని స్వయంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టులో అంగీకరించింది. ఓ జర్నలిస్ట్ కిడ్నాప్ కేసులో హైకోర్టులో వాదనలు వినిపించిన అదనపు అటార్నీ జనరల్.. పీవోకే విదేశీ భూభాగమని, అక్కడ పాక్ చట్టాలు చెల్లవని తెలిపారు. -
పాక్ నోట మళ్లీ పాతపాట
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ మరోసారి కశీ్మర్ ప్రస్తావన తెచి్చంది. దీర్ఘకాలిక శాంతి కోసం భారత్ ఆరి్టకల్ 370ని పునరుద్ధరించాలని, జమ్మూకశీ్మర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు రావాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్ తన సైనిక సంపత్తిని భారీగా పెంచుకుంటోందని ఆరోపించారు. ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి షరీఫ్ శుక్రవారం ప్రసంగించారు. ఆరి్టకల్ 370, హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాది బుర్హాన్ వనీల ప్రస్తావన తెచ్చారు. ‘పాలస్తీనియన్ల లాగే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా తమ స్వాతంత్య్రం, స్వీయ నిర్ణయాధికారం కోసం శతాబ్దకాలంగా పోరాడుతున్నారు’ అని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కశ్మీరీల అభిమతానికి అనుగుణంగా, ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా జమ్మూకశీ్మర్పై భారత్ చర్చలకు రావాలన్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ దూరంగా జరిగిందని ఆరోపించారు. స్వీయ నిర్ణయాధికారం జమ్మూకశీ్మర్ ప్రజల ప్రాథమిక హక్కని, దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని భద్రతా మండలి తీర్మానాలు చెబుతున్నాయని అన్నారు. భారత్‌కు బ్రిటన్ మద్దతు ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వముండాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ మద్దతు పలికారు. భారత్ డిమాండ్‌కు అమెరికా, ఫ్రాన్స్‌లు ఇదివరకే మద్దతు పలికిన విషయం తెలిసిందే. ప్రపంచ ఐక్యవేదిక మరింత ప్రాతినిధ్యంతో, మరింత స్పందనతో కూడి ఉండాలని స్టార్మర్ ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. -
NEW YEAR 2024: న్యూ ఇయర్ దశకం
మరో సంవత్సరం కనుమరుగవనుంది. మంచీ చెడుల మిశ్రమంగా ఎన్నెన్నో అనుభూతులు మిగిల్చి కాలగర్భంలో కలిసిపోనుంది. సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2024లో జరగనున్న ఆసక్తికర ఘటనలు, మిగల్చనున్న ఓ పది మైలురాళ్లను ఓసారి చూస్తే... నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దంలోనే భారత్ కచి్చతంగా ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నది అందరూ చెబుతున్న మాటే. అది 2026లో, లేదంటే 2027లో జరగవచ్చని ఇప్పటిదాకా అంచనా వేస్తూ వచ్చారు. కానీ అన్నీ కుదిరితే 2024 చివరికల్లా జర్మనీని వెనక్కు నెట్టి మనం నాలుగో స్థానానికి చేరడం కష్టమేమీ కాదన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. 2024 తొలి అర్ధభాగం చివరికి జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.4 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల మార్కును సులువుగా దాటేయనుంది. మన వృద్ధి రేటు, జర్మనీ మాంద్యం ఇప్పట్లాగే కొనసాగితే సంవత్సరాంతానికల్లా మనది పై చేయి కావచ్చు. 2.దూసుకుపోనున్న యూపీ ఉత్తరప్రదేశ్ కొన్నేళ్లుగా వృద్ధి బాటన పరుగులు పెడుతోంది. ఆ లెక్కన ఈ ఏడాది అది కర్ణాటకను పక్కకు నెట్టి దేశంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశముంది. 2023–24కు కర్ణాటక జీఎస్డీపీ అంచనా రూ.25 లక్షల కోట్లు కాగా యూపీ రూ.24.4 లక్షల కోట్లుగా ఉంది. అయితే 20 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతున్న యూపీ సంవత్సరాంతానికల్లా కర్ణాటకను దాటేసేలా కని్పస్తోంది. 3. బీజేపీ ‘సంకీర్ణ ధర్మ’ బాట 2024 అక్టోబర్‌లో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగి్నపరీక్షగా నిలవనున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఏ ఒక్క పారీ్టకీ సొంతంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. కనుక ఆ రాష్ట్రాల్లో బీజేపీ విధిగా సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ప్రస్తుత పరిస్థితులే కొనసాగే పక్షంలో వాటిలో రెండు రాష్ట్రాలు ఇండియా కూటమి ఖాతాలో పడ్డా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పక్షాలకు గట్టి పోటీ ఇవ్వాలంటే మిత్రులతో పొత్తులపై ముందస్తుగానే స్పష్టతకు వచ్చి సమైక్యంగా బరిలో దిగడం బీజేపీకి తప్పనిసరి కానుంది. 4. ‘సుదీర్ఘ సీఎం’గా నవీన్ అత్యధిక కాలం పాటు పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగా పవన్‌కుమార్ చామ్లింగ్ నెలకొలి్పన రికార్డును ఒడిశా సీఎం నవీన్ 2024లో అధిగమించేలా ఉన్నారు. ఎందుకంటే మే లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుసగా ఆరోసారి గెలవడం లాంఛనమేనని భావిస్తున్నారు. చామ్లింగ్ 1994 డిసెంబర్ నుంచి 2019 మే దాకా 24 ఏళ్లకు పైగా సిక్కిం సీఎంగా చేశారు. నవీన్ 2000 మార్చి నుంచి ఒడిశా సీఎంగా కొనసాగుతున్నారు. 5. మెగా మార్కెట్ క్యాప్ భారత మార్కెట్ క్యాపిటలైజేషన్ 2024లో 5 లక్షల కోట్ల డాలర్లను దాటేయనుంది. 2023లో మన మార్కెట్ క్యాప్ ఏకంగా 26 శాతం వృద్ధి రేటుతో పరుగులు తీసి 4.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది! ఇది పాశ్చాత్య ఆర్థికవేత్తలనూ ఆశ్చర్యపరిచింది. కొత్త ఏడాదిలో హీనపక్షం 20 శాతం వృద్ధి రేటునే తీసుకున్నా తేలిగ్గా 5 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడం లాంఛనమే. సెన్సెక్స్ కూడా ఈ ఏడాది ఆల్‌టైం రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్లడం తెలిసిందే. 2024లోనూ ఇదే ధోరణి కొనసాగడం ఖాయమేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 6. 20 కోట్ల మంది పేదలు ఆర్థిక వృద్ధికి సమాంతరంగా దేశంలో పేదలూ పెరుగుతున్నారు. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో పేదలున్న దేశం మనమేనన్నది తెలిసిందే. 2024లో ఈ సంఖ్య 20 కోట్లను మించనుంది. ఇది బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మొత్తం జనాభా కంటే ఎక్కువ! ప్రపంచబ్యాంకు నిర్వచనం ప్రకారం భారత్‌లో 14 కోట్ల మంది పేదలున్నారు. నీతీఆయోగ్ లెక్కలను బట్టి ఆ సంఖ్య ఇప్పటికే 21 కోట్లు దాటింది. 7. వ్యవసాయోత్పత్తుల రికార్డు భారత ఆహార, ఉద్యానోత్పత్తుల పరిమాణం 2024లో 70 కోట్ల టన్నులు దాటనుంది. అందుకు అనుగుణంగా ఆహారోత్పత్తుల ఎగుమతి కూడా ఇతోధికంగా పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2021లో కేంద్రం రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాల భవితవ్యం 2024లో తేలిపోవచ్చంటున్నారు. 8. కశ్మీర్‌పై చర్చలకు డిమాండ్లు కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు పాకిస్థాన్‌తో చర్చలను పునఃప్రారంభించాలని స్థానికంగా డిమాండ్లు ఊపందుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఈ మేరకు గళమెత్తే అవకాశాలు పుష్కలంగా కని్పస్తున్నాయి. అలాగే సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో జమ్మూ కశ్మీ ర్ తక్షణం రాష్ట్ర హోదా పునరుద్ధరించడంతో పాటు సెపె్టంబర్ కల్లా అసెంబ్లీకి ఎన్నికలూ జరపాల్సి ఉంది. 9. విదేశీ వాణిజ్యం పైపైకి... భారత విదేశీ వాణిజ్యం 2024లో 2 లక్షల కోట్ల డాలర్లను తాకవచ్చు. 2023లో యుద్ధాలు తదితర అంతర్జాతీయ పరిణామాలు ప్రపంచ ఎగుమతులు, దిగుమతుల మార్కెట్‌ను విపరీతంగా ప్రభావితం చేశాయి. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మన విదేశీ వాణిజ్యం కళకళలాడింది. మొత్తం జీడీపీలో 40 శాతంగా నిలిచింది. 10. బీజేపీ వర్సెస్ ‘ఇండియా’ విపక్షాలకు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా చెప్పదగ్గ కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు 2024 వేదిక కానుంది. హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఉరకలేస్తోంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటమే గాక అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటముల పాలవుతున్న కాంగ్రెస్ ఇంకా కాలూ చేయీ కూడదీసుకునే దశలోనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్ర తెలియక ఊరకే తిరగరాస్తున్నారు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ)బిల్లు, జమ్మూకశ్మీర్ రిజర్వేషన్(సవరణ)బిల్లులపై చర్చ సందర్భంగా మాజీ ప్రధాని నెహ్రూపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపణలు గుప్పించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ జమ్మూకశ్మీర్‌లోకి పూర్తిగా భారత బలగాలు వెళ్లేలోపే కాల్పుల విరమణకు నెహ్రూ ఆదేశాలిచ్చారు. అనవసరంగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. నెహ్రూ చారిత్రక తప్పిదాల కారణంగానే కశ్మీర్ సమస్య అపరిష్కృతంగా తయారై అక్కడి ప్రజలు కష్టాలపాలయ్యారు’’ అని సోమవారం రాజ్యసభలో ఆరోపణలుచేయడం తెల్సిందే. దీనిపై మంగళవారం రాహుల్ పార్లమెంట్ ప్రాంగణంలో ఘాటుగా స్పందించారు. ‘‘ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశం కోసం తన జీవితం మొత్తాన్నీ ధారపోశారు. స్వాత్రంత్య్ర పోరాటంలో చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఇంకా ఇలాంటి చరిత్ర అంతా అమిత్ షాకు తెలీదనుకుంటా. అందుకే పదేపదే చరిత్రను తిరగరాస్తున్నారు. ఇదంతా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే. కుల గణన వంటి సమస్యల సంగతేంటి? అసలు ప్రజాధనం ఎవరి చేతుల్లోకి వెళ్తోంది?. ఈ అంశాలను బీజేపీ అస్సలు చర్చకు స్వీకరించదు. భయంతో పారిపోతోంది. బీసీలను పట్టించుకోవట్లేదు’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఓబీసీల ప్రాధాన్యం పెరగాలి గిరిజన వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా, ఓబీసీ నేతను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించిందికదా ? అన్న మీడియా ప్రశ్నకు రాహుల్ బదులిచ్చారు. ‘‘మేం కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఓబీసీ నేతను ముఖ్యమంత్రిని చేశాం. వాళ్లు కూడా మధ్యప్రదేశ్‌లో ఓబీసీ నేతను సీఎంగానే చేశారు. బీసీలకు ఒకే ఒక్క కీలక పదవి ఇస్తే సరిపోదు. ఇక్కడ పదవి ముఖ్యం కాదు. మరింత మంది ఓబీసీలకు ప్రాధాన్యత దక్కాలి. వారి ప్రాతినిధ్యం మరింత పెరగాలి. మోదీ సర్కార్ ప్రధానాంశాలను పక్కనబెట్టి ప్రజల దృష్టికి మరల్చుతోంది’’ అని రాహుల్ ఆరోపించారు. -
ఐరాసలో పాక్ నోట మళ్లీ ‘కశ్మీర్’ మాట
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని మరోసారి పాకిస్తాన్ ప్రస్తావించింది. భారత్‌తో సంబంధాలు సజావుగా కొనసాగేందుకు కశ్మీరే కీలకమని పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని పాకిస్తాన్ కోరుకుంటోందని చెప్పారు. అయితే, భారత్‌తో సంబంధాల విషయంలో మాత్రం కశ్మీరే కీలకమన్నారు. కశ్మీర్‌కు సంబంధించి భద్రతా మండలి చేసిన తీర్మానాలన్నిటినీ అమలయ్యేలా చూడాలని కోరారు. ఐరాస మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్(యూఎన్‌ఎంవోజీఐపీ)ని తిరిగి అమల్లోకి తేవాలని కకర్ అన్నారు. వ్యూహాత్మక, సంప్రదాయ ఆయుధాలపై పరస్పర నియంత్రణకు సంబంధించిన పాక్ ప్రతిపాదనను అంగీకరించేలా భారత్‌పై ఒత్తిడి తేవాలన్నారు. -
ఐరాసలో కశ్మీర్ అంశంపై తుర్కియే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి వేదికగా తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. యూఎన్ 78వ సర్వ సభ్య సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం వివాదాస్పదంగా మారింది. భారత్- పాక్ మధ్య కశ్మీర్ వివాదం ఇంకా కొనసాగుతుండటం దక్షిణాసియా ఉద్రిక్తతలకు కారణమైతుందని ఆయన అన్నారు. ఈ అంశాన్ని మరోసారి చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తుర్కియే ఈ అంశంపై మద్దతునిస్తుందని పేర్కొన్నారు. ' ఇండియా, పాకిస్థాన్‌లు స్వాతంత్య్రం తెచ్చుకుని 75 ఏళ్లు పూర్తయింది. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనకపోవడం దురదృష్టకరం. కశ్మీర్లో ఇప్పటికైన శాంతి నెలకొనే విధంగా ఇరు దేశాలు చర్యలు తీసుకోవాలి.' అని ఐక్యరాజ్య సమితి వేదికగా ఎర్డోగాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన జీ20కి హాజరైన తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. వారం రోజులకే ఎర్డోగాన్ కశ్మీర్ అంశాన్ని యూఎన్‌లో మాట్లాడటం చర్చనీయాశంగా మారింది. సభ్య దేశాల సంఖ్య పెంచాలి: ఐక్యరాజ్య సమితిలో భారత్ కీలక పాత్ర పోషించడంపై ఎర్డోగాన్ శుభపరిణామం అని అన్నారు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రపంచంలో చాలా దేశాలు ఉండగా.. కేవలం ఐదు దేశాలు మాత్రమే శాశ్వత స్థానంలో ఉండటం సరికాదని అన్నారు. భద్రతా మండలిలో ఉన్న 20 దేశాలను విడతలవారిగా శాశ్వత సభ్యులుగా మార్చాలని కోరారు. ఇదీ చదవండి: జాగ్రత్త.. కెనడాలోని భారతీయులకు కేంద్రం హెచ్చరికలు -
మళ్లీ కశ్మీర్‌పై పాక్ ఏడుపు
ఐక్యరాజ్య సమితి: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఒక చర్చాకార్యక్రమంలోనూ కశ్మీర్ అంశాన్ని లేవదీసి పాకిస్తాన్ భారత్‌పై తన అక్కసును మరోసారి వెళ్లబోసుకుంది. దీంతో భారత్ ఘాటుగా స్పందించింది. పాకిస్తాన్ చేసే ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలకు కనీసం స్పందించాల్సిన అవసరం తమకు లేదని భారత్ తేల్చిచెప్పింది. నెలపాటు మొజాంబిక్ దేశ అధ్యక్షతన ఐరాస భద్రతా మండలిలో సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగానే ‘ మహిళలు, శాంతి, భద్రత’ అంశంపై చర్చలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అసంబద్ధంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ఆ తర్వాత ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంభోజ్ మాట్లాడారు. ‘ బిలావల్ వ్యాఖ్యానాలు పూర్తిగా నిరాధారం. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిన ప్రసంగమిది. మహిళలకు భద్రతపై చర్చాకార్యక్రమాన్ని మేం గౌరవిస్తున్నాం. మహిళా దినోత్సవ కాల విలువకు గుర్తించాం. ఈ అంశంపైనే మనం దృష్టిసారిద్దాం. అసందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై కనీసం స్పందించాల్సిన అగత్యం భారత్‌కు లేదు. గతంలో చెప్పాం. ఇప్పుడూ, ఇకమీదటా చెప్పేది ఒక్కటే. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమే. దాయాదిదేశం పాక్‌తో పొరుగుదేశ సంబంధాలను సాధారణస్థాయిలో కొనసాగించాలని భారత్ మొదట్నుంచీ ఆశిస్తోంది. అలాంటి వాతావరణం నెలకొనేలా చూడాల్సిన బాధ్యత పాక్‌పై ఉంది. కానీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారి శత్రుత్వాన్ని పెంచుకుంటోంది’ అని రుచిరా ఘాటుగా వ్యాఖ్యానించారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై దారుణ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని బాలాకోట్‌లో కొనసాగుతున్న జైషే మొహమ్మద్ ఉగ్ర శిబిరంపై భారత వాయుసేన మెరుపుదాడి తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీశాక భారత్‌పై పాక్ ఆక్రోశం మరింతగా ఎగసింది. -
అమెరికా హౌస్ విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి ఇల్హాన్ ఒమర్ తొలగింపు
వాషింగ్టన్: ‘కశ్మీర్‌పై అమెరికా మరింత శ్రద్ధ పెట్టాలి’ అని వ్యాఖ్యానించి భారత్ ఆగ్రహానికి గురైన అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌కు షాక్ తగిలింది. శక్తిమంతమైన హౌస్ విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి ఆమెను తొలగించారు. డెమొక్రటిక్ సభ్యురాలైన ఒమర్ తీరుపై రిపబ్లికన్ సభ్యులు చాలా రోజులుగా మండిపడుతున్నారు. ఇజ్రాయెల్, యూదులకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేసిన ఆమె విదేశీ వ్యవహారాల కమిటీలో ఉండడానికి అర్హురాలు కాదని వారు వాదిస్తూ వచ్చారు. ఓటింగ్ నిర్వహించగా కమిటీ నుంచి ఆమె తొలగింపుకు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చాయి. కమిటీలో లేనంత మాత్రాన తన గళాన్ని ఎవరూ అణచివేయలేరని, తాను మరింతగా రాటుదేలుతానని ఒమర్ వ్యాఖ్యానించారు. ఆమె గతంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో పర్యటించారు. అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో సమావేశమయ్యారు. -
Gaurav Yatra: నెహ్రూ వల్లే కశ్మీర్ సమస్య
జంజార్కా/ఉనాయ్(గుజరాత్): కశ్మీర్ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూయే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. నెహ్రూ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసినప్పటికీ అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ఆయన గురువారం అహ్మదాబాద్ జిల్లా జంజర్కా, ఉనాయ్లలో బీజేపీ ‘గౌరవ్ యాత్ర’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా పైవ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370ను రాజ్యాంగంలో చేర్చుతూ నెహ్రూ చేసిన తప్పిదం వల్లే కశ్మీర్ పెద్ద సమస్య అయి కూర్చుంది. ఆ ప్రాంతం దేశంతో సరిగ్గా విలీనం కాలేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 370ను తొలగించాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ 2019లో ఒక్క వేటుతో 370ను రద్దు చేసి, కశ్మీర్‌ను దేశంతో విలీనం చేశారు’అని అమిత్ షా చెప్పారు. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటూ బీజేపీ చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కానీ, మందిరం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది’అని అన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎయిర్ స్ట్రైక్స్‌ను ఆయన ప్రస్తావిస్తూ.. సీమాంతర ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందన్నారు. గతంలో యూపీఏ హయాంలో పాక్ ఆర్మీ మన సైనికుల తలలను నరికి, వెంట తీసుకెళ్లింది. 2014లో మన ప్రభుత్వం వచ్చాక కూడా అలాగే చేయాలని చూసింది. కానీ, ఇది మౌని బాబా (మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశిస్తూ) ప్రభుత్వం కాదన్న విషయం వాళ్లు మరిచారు. ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మోదీ ప్రభుత్వం గుణపాఠం చెప్పింది’అని అమిత్ షా అన్నారు. ‘గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఏడాదిలో 365 రోజులకు గాను 200 రోజులు కర్ఫ్యూయే అమలయ్యేది. కానీ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక గత 20 ఏళ్లలో అలాంటి పరిస్థితులు లేవు’అని చెప్పారు. దేశానికి భద్రత కల్పించడం, దేశాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేవని విమర్శించారు. ఇదీ చదవండి: ఉద్ధవ్ థాక్రే వర్గానికి భారీ ఊరట -
భారత్‌తో శాంతినే కోరుకుంటున్నాం కానీ.. కశ్మీర్‌తో ముడిపెట్టిన పాకిస్తాన్ ప్రధాని
ఇస్లామాబాద్: భారత్‌తో శాంతియుత సంబంధాలకు సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు లోబడి కశ్మీర్ సమస్య పరిష్కారంతోనే ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి నెలకొంటుందని అన్నారు. ‘యుద్ధం రెండు దేశాలకు ఎంతమాత్రం మంచిది కాదు. భారత్‌తో చర్చల ద్వారా శాశ్వత శాంతి స్థాపన జరగాలని కోరుకుంటున్నాం. అయితే, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు లోబడి కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించినప్పుడే ఈ ప్రాంతంలో శాంతి స్థాపన సాధ్యం’అని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థుల బృందంతో ఆయన పేర్కొన్నట్లు ‘ది న్యూస్ ఇంటర్నేషనల్’ తెలిపింది. వాణిజ్యం, ఆర్థిక రంగాలతోపాటు ప్రజల జీవన స్థితిగతులను పెరుగుపరచడంలో ఇరు దేశాల మధ్య పోటీ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘పాక్ దురాక్రమణదారు కాదు. మా రక్షణ వ్యయం సరిహద్దుల రక్షణ కోసమే తప్ప దురాక్రమణ కోసం కాదు’అని అన్నారు. ‘పాక్ ఆవిర్భావం తర్వాత మొదట్లో ఆర్థికంగా అన్ని రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. అనంతరం రాజకీయ అస్థిరత, సంస్థాపరమైన లోపాల కారణంగా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది’అని ఆయన చెప్పారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన అనంతరం భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. చదవండి: అరుదైన ఘటన.. కవలలే.. కానీ కంప్లీట్ డిఫరెంట్! -
మళ్లీ మొదటికొచ్చిన కశ్మీర్ సమస్య
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో శాంతిని పునఃస్థాపించగలిగామని రెండేళ్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఈ చర్యల కారణంగానే కశ్మీరీ పండిట్లు మళ్లీ తమ మాతృభూమికి వెళ్లగలిగారనీ, ఉద్యోగాలు పొందగలిగారనీ కూడా కేంద్రం చెబుతూ వస్తోంది. కానీ... తాజాగా జరుగుతున్నదేమిటి? పండిట్లు నిస్సహాయులుగా మళ్లీ కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోతున్నారు. కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పాటు ప్రజలూ, మీడియాను కూడా ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం కొరవడి, మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయేందుకు కారణమైంది. కాబట్టి, కశ్మీర్ రాజకీయాల్లో తుపాకీ పాత్ర లేకుండా జాగ్రత్త పడినప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు. మిజోరం, పంజాబ్‌లలో కేంద్రం ఇప్పటికే ఈ ఘనతను సాధించింది. గ్రీకు పురాణాల్లో ‘హుబ్రిస్’ అని పిలుస్తారు దాన్ని. ఇంగ్లిష్ నిర్వచనం ప్రకారం అధిక గర్వం లేదా మితిమీరిన అహంకారం అనవచ్చు. గ్రీకుల పురాతన మత బోధనల్లో ‘హుబ్రిస్’కు గురైన వారు... నెమిసిస్ అనే దేవత చేతిలో హతమవుతారు. కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొం టున్నట్లు కనిపిస్తోంది! తిరిగి వెళ్తున్న పండిట్లు ఆర్టికల్ 370, 35ఏ రద్దు తరువాత కశ్మీర్ లోయలో శాంతిని పునః స్థాపించగలిగామని రెండేళ్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఈ చర్యల కారణంగానే కశ్మీరీ పండిట్లు మళ్లీ తమ మాతృభూమికి వెళ్లగలిగారనీ, ఉద్యోగాలు పొందగలిగారనీ కూడా కేంద్రం చెబుతూ వస్తోంది. కానీ... తాజాగా జరుగుతున్నదేమిటి? పండిట్లు నిస్సహా యులుగా మళ్లీ కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోతున్నారు. తమను తాము కాపాడుకునేందుకు వెళుతున్న పండిట్లను నిలువరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అనధికారిక అంచనాల ప్రకారం ఇప్పటికే కొన్ని వందల మంది పండిట్లు కశ్మీర్‌ను వదిలి జమ్మూ చేరుకున్నారు. అంతేకాదు... ఉద్యోగం కోసం తప్పనిసరి చేస్తూ తమతో రాయించు కున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద గత ఏడాది కాలంలో దాదాపు ఆరు వేల మంది పండిట్లకు ఉద్యోగాలు, నివాస సదుపాయం లభించాయి. ప్రభుత్వం వీరి కోసం వేర్వేరు జిల్లాల్లో తాత్కాలిక ఇళ్ల నిర్మాణమూ చేపట్టి పూర్తి చేసింది. పండిట్ల తిరుగు వలస నేపథ్యంలో అధికారులు ఇప్పుడు ఉద్యోగ ఒప్పందాలను చూపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే... ప్రచార పటాటోపానికి మాత్రమే పనికొచ్చే నిర్మాణాలు కొన్ని చూపి అంతా బాగానే ఉందనే భ్రమను కల్పిస్తోంది ప్రభుత్వం. కానీ ట్రాన్సిట్ క్యాంపుల వద్ద కనీస భద్రతా సౌకర్యాలు, సిబ్బంది కూడా లేకపోవడం మాత్రమే వాస్తవం. అణిచివేతే విధానం కశ్మీర్ విషయంలో ప్రభుత్వం అణచివేత ధోరణినే ప్రదర్శించింది. కశ్మీర్‌లోని మిలిటెంట్లూ, ఉగ్రవాదులతో పాటు అన్ని వర్గాల ప్రజలూ, మీడియాను కూడా అనూహ్య రీతిలో తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం కొరవడి మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయేందుకు కారణమైంది. అటు ఉగ్ర వాదులు, ఇటు ప్రభుత్వం మధ్యలో బలవుతున్నది మాత్రం నిరా యుధులైన అమాయకులు. మరీ ముఖ్యంగా కశ్మీరీ పండిట్లు. వీరితో పాటు ప్రభుత్వ విధాన అమలుకు సహకరించారన్న అంచనాతో స్థానిక పోలీసు సిబ్బంది మీద కూడా ఉగ్రవాదుల దాడులు జరుగు తున్నాయి. పోలీసులను పరిస్థితులకు బందీలుగా కాకుండా ప్రభుత్వ ఉపకరణాలుగా ఉగ్రవాదులు చూస్తున్నారు. 2019 తరువాత నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో వివాదాస్పద విధానాన్ని అవలంబించిందంటే అతిశయోక్తి కాదు. ఆర్టికల్ 370 కారణంగా కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు లభిస్తున్నాయన్న భ్రమలో దాన్ని రద్దు చేయడం మాత్రమే కాకుండా, రాష్ట్రాన్ని కాస్తా కేంద్ర పాలిత ప్రాంత స్థాయికి తగ్గించారు. జమ్మూ కశ్మీర్‌కు ముఖ్య మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన రాజకీయ నేతలను నిర్బంధంలో ఉంచారు. పరిపాలన మొత్తం నేరుగా ఢిల్లీ నుంచే నడిచేది. వీటన్నింటికి తోడుగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు నిర్వ హించిన ‘ఆపరేష¯Œ ఆలౌట్’ను మనం మరచిపోకూడదు. ఉగ్రవాద అణచివేతలో విజయం సాధించామన్న ప్రభుత్వ ప్రచారార్భాటాన్నీ గుర్తుంచుకోవాలి. వాస్తవిక పరిస్థితులు వేరే... 2021 డిసెంబరులో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి, కశ్మీర్ పాలనా వ్యవస్థకు అనధికార నేత అయిన అమిత్ షా మాట్లా డుతూ – ఆర్టికల్ 370 తొలగింపు ద్వారా కశ్మీర్లో శాంతి స్థాపనకు మార్గం ఏర్పడిందనీ, అభివృద్ధి సుసాధ్యమైందనీ మరోసారి వ్యాఖ్యా నించారు. అలాగే ఈ ఏడాది మార్చిలోనూ కశ్మీర్లో హింస తగ్గి పోయిందని నిరూపించేందుకు బోలెడన్ని గణాంకాలు వల్లెవేశారు. గణాంకాలు కాగితంపై బాగానే కనిపిస్తాయి కానీ... వాస్తవ పరిస్థి తులు పరిశీలిస్తేనే అసలు విషయం తెలుస్తుంది. తుదముట్టించిన మిలిటెంట్ల సంఖ్య, అరెస్ట్ అయినవారు, స్వాధీనం చేసుకున్న ఆయు ధాలు, పునరావాసం పొందిన పండిట్లు, కుదుర్చుకున్న ఒప్పందాల వంటివన్నీ అమిత్ షా మాటల్లో వినిపించాయి అయితే వీటన్నింటి మధ్య జన సామాన్యుల భావనలెలా ఉన్నాయన్నది మాత్రం ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. ఆరేళ్ల అణచివేత ధోరణుల ఫలితంగా ప్రజలు అప్పటికే విసుగెత్తి ఉన్నారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు నిరసన ప్రదర్శనలు నిర్వహించే అవకాశమూ లేకపోయిన నేపథ్యంలో వారు ప్రభుత్వ చర్యలకు మద్దతిస్తారని ఆశించలేము. ఉగ్రవాదం తీరు మారింది! ఈ పరిస్థితుల నేపథ్యంలోనే సైనిక చర్యల కారణంగా గణనీయంగా తగ్గిపోయిన ఉగ్రవాద కార్యకలాపాలు కాస్తా మళ్లీ తీవ్రవాదం స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు అక్కడ యుద్ధం ఏకే 47, ఆర్‌పీజీలతో జరగడం లేదు కానీ... వ్యక్తులను ఎంచుకుని మరీ తుపాకులు, గ్రెనేడ్లతో దాడులు మొదలుపెట్టారు. లక్ష్యితులు నిరాయుధులు కావడం, ఆయుధాలను దుస్తుల్లో దాచుకుని వెళ్లగలగడం ఉగ్రవాదుల పనిని మరింత సులువు చేస్తోంది. అతి సాధారణ జీవితం గడుపుతూ అవసరమైనప్పుడు పండిట్ల వంటి నిరాయుధులను, లేదంటే విధి నిర్వహణలో లేని పోలీసు సిబ్బందిపై కాల్పులు జరపడం ఈ హైబ్రిడ్ మిలిటెన్సీ తీరుతెన్నులుగా మారాయి. పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదుల సంఖ్య తగ్గిపోయిందని సైన్యం స్వయంగా గత ఏడాది జూ¯Œ లో ప్రకటించింది కాబట్టి... ఈ తాజా దాడులు, హైబ్రిడ్ మిలిటెన్సీ పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కనుసన్నలలోనే జరుగుతోందని మనం కచ్చితంగా అను కోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే... మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఏర్పడ్డ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని మిలిటెంట్లు పని చేస్తున్నారని చెప్పాలి. తుపాకులకు చోటు లేదు! కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల అణచివేతలో నిఘా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ బలగాలు ఎంతో సమర్థతతో వ్యవహరించాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. గడచిన రెండు దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితులు అనేకమార్లు ఏర్పడ్డాయి కూడా! అయితే ఒక మిలిటెంట్ హతమైతే... అతడి స్థానంలో ఇంకొకరు పుట్టుకొస్తున్నారు. అంటే... ఎంత మంది మిలిటెంట్లను చంపాం? ఎన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం? అన్నవి ముఖ్యం కాదన్నమాట. కశ్మీర్ రాజకీయాల్లో తుపాకీ పాత్ర లేకుండా జాగ్రత్తపడినప్పుడే సమస్యకు పరిష్కారం లభించినట్లు. ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు. మిజోరం, పంజాబ్‌లలో కేంద్రం ఇప్పటికే ఈ ఘనతను సాధించింది. ఈ రెండు రాష్ట్రాల అనుభవాలేమిటన్నది బీజేపీ సహా అన్ని పార్టీల రాజకీయ నాయకులకూ బాగా తెలుసు. కానీ ప్రస్తుతం వారు వాటిని విస్మరి స్తున్నారు. ఇదీ రాజకీయం ప్రత్యేకత. పాకిస్తాన్ కారణంగా కశ్మీర్ విషయంలో దౌత్యమూ అత్యవసరం. కానీ అవేవీ చేయకుండా మనం అణచివేత రాజకీయాలకు పాల్పడతూ, ఉడికీ ఉడకని జాతీయత అనే భావన ఆధారిత విధానాలను అవలంబిస్తున్నాం. వ్యాసకర్త: మనోజ్ జోషీ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల నిపుణుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
'అందరూ నీలా ఉండరు'.. అఫ్రిదిని ఏకిపారేసిన టీమిండియా వెటరన్ క్రికెటర్
టీమిండియా వెటరన్ క్రికెటర్ అమిత్ మిశ్రా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. యాసిన్ మాలిక్ వ్యవహారంలో వెటకారంగా మాట్లాడిన అఫ్రిదికి అమిత్ మిశ్రా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. యాసిన్ మాలిక్ నేరాన్ని ఒప్పుకున్నాడని.. నీలాగా అబద్దపు బర్త్ డేట్స్ చెప్పరని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. విషయంలోకి వెళితే కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ నేరాన్ని అంగీకరించడంతో అతన్ని ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు బుధవారం దోషిగా నిర్దారించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న నేరానికి సంబంధించి యాసిన్‌పై అభియోగాలు వచ్చాయి. విచారణలో అవన్నీ నిజమని తేలాయి. దీంతో యాసిన్ మాలికు జీవితకాల జైలుశిక్షతోపాటు రూ. పది లక్షల జరిమానా విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. అంతకముందు యాసిన్ మాలిక్ వ్యవహారంతో పాటు కాశ్మీర్ అంశంపై అఫ్రిది ట్వీట్ చేస్తూ.. ‘భారత్ లో మానవ హక్కుల మీద గొంతెత్తుతున్నవారి గొంతు నొక్కడం కొనసాగుతూనే ఉంది. యాసిన్ మాలిక్ మీద నేరం మోపినంత మాత్రానా కాశ్మీర్ స్వేచ్ఛ కోసం చేసే పోరు ఆగేది కాదు. కాశ్మీరీ లీడర్ల మీద చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోమని ఐక్యరాజ్యసమితిని కోరుతున్నా.’ అంటూ ట్వీట్ చేశాడు. అఫ్రిది ట్వీట్ కు అమిత్ మిశ్రా స్పందిస్తూ.. ‘డియర్ షాహిద్ అఫ్రిది.. అతడు (యాసిన్ మాలిక్) స్వయంగా నేరాన్ని అంగీకరించాడు. అందరూ నీలాగా బర్త్ డేట్ ను తప్పు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించరు.'' అంటూ ట్వీట్ చేశాడు. అఫ్రిది బర్త్ డేట్ వివాదం విషయానికొస్తే.. గతంలో అతడు తన బర్త్ డే ను తప్పుగా రాసి క్రికెట్ టోర్నీలలో పాల్గొన్నాడని వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఐసీసీ అధికారులనే అఫ్రిది తప్పుదారి పట్టించాడని అఫ్రిదిపై ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఐసీసీ అధికారులే తన పుట్టినతేదీని తప్పుగా రాసుకున్నారని మాటమార్చాడు. కానీ అతడి మాటలు ఎవరూ నమ్మలేదు. చదవండి: Mohammad Hafeez: చెత్త రాజకీయాలకు సామాన్యులు బలవ్వాలా?.. మాజీ క్రికెటర్ ఆగ్రహం PAK-W Vs SL-W: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీసింది.. టి20 క్రికెట్లో పాక్ బౌలర్ కొత్త చరిత్ర Dear @safridiofficial he himself has pleaded guilty in court on record. Not everything is misleading like your birthdate. 🇮🇳🙏https://t.co/eSnFLiEd0z — Amit Mishra (@MishiAmit) May 25, 2022 India's continued attempts to silence critical voices against its blatant human right abuses are futile. Fabricated charges against #YasinMalik will not put a hold to #Kashmir's struggle to freedom. Urging the #UN to take notice of unfair & illegal trails against Kashmir leaders. pic.twitter.com/EEJV5jyzmN — Shahid Afridi (@SAfridiOfficial) May 25, 2022 -
కశ్మీర్‌పై షహబాజ్ కారుకూతలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన వెంటనే షహబాజ్ షరీఫ్ తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నారు. కశ్మీర్ అంశాన్ని, భారత్ 370 ఆర్టికల్‌ను రద్దుచేయడాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు. కశ్మీర్ లోయలో ప్రజలు రక్తమోడుతున్నారని, కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ దౌత్య, నైతిక మద్దతిస్తుందని చెప్పారు. కశ్మీర్ విషయాన్ని ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు. భారత్‌తో సత్సంబంధాలనే తాను కోరుకుంటున్నానని, కానీ కశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా అది సాధ్యం కాదని చెప్పారు. పొరుగుదేశాలను ఎవరం ఎంచుకోలేమని, వాటితో కలిసి జీవించాలని, దురదృష్టవశాత్తు దేశ విభజన సమయం నుంచి భారత్‌తో పాక్‌కు సత్సంబంధాలు లేవని చెప్పారు. 2019లో అధికరణ 370 రద్దు సహా పలు సీరియస్ చర్యలను భారత్ చేపట్టిందని, దీంతో కశ్మీర్ లోయలో, రోడ్లపై కశ్మీరీల రక్తం చిందుతోందని విషం కక్కారు. కశ్మీర్ విషయంపై చర్చకు మోదీ ముందుకురావాలని, ఆ సమస్య పరిష్కారమైతే ఇరుదేశాలు పేదరికం, నిరుద్యోగంలాంటి ఇతర కీలకాంశాలపై దృష్టి పెట్టవచ్చని సూచించారు. రాబోయే తరాలు ఎందుకు బాధలు పడాలని, ఐరాస తీర్మానాలకు, కశ్మీరీల ఆంక్షాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరిద్దామని ఆహ్వానించారు. పఠాన్‌కోట్ దాడి తర్వాత ఇండో–పాక్ సంబంధాలు దిగజారాయి. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా తొలగించడం, అధికరణ 370ని రద్దు చేయడంతో పాక్‌లోని భారత హైకమిషనర్‌ను పాక్ బహిష్కరించింది. అనంతరం భారత్‌తో వాయు, భూమార్గాలను మూసివేసింది. వాణిజ్యాన్ని, రైల్వే సేవలను నిలిపివేసింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతు నిలిపివేస్తే చర్చలు జరుపుతామని భారత్ తేల్చిచెబుతోంది. -
తెలుసా..! స్వతంత్ర పాకిస్తాన్ కావాలని మొదట కోరింది అతనేనట!
‘పాక్స్తాన్’ ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్.. 3, హంబర్‌స్టోన్ ఇంటిలోని ఒకగది గోడమీద రాసున్నాయి ఆ అక్షరాలు (పాకిస్తాన్ కాదు). రాసినవాడు జిన్నా కాదు, చౌధురి రహమత్ అలీ. ఆ పద సృష్టికర్త అలీయే. భారత స్వాతంత్య్రోద్యమానికి సమాంతరంగా ముస్లిం జాతీయోద్యమం నడపాలని ఆశించినవాడు, స్వతంత్ర పాకిస్తాన్ కావాలని మొదట కోరినవాడు ఇతడే. ఎవరీ అలీ? తూర్పు పంజాబ్, హోషియార్‌పూర్‌లోని కామేలియా అతడి స్వస్థలం. 1897 నవంబర్ 16న బాలాచౌర్లో పుట్టాడు. 1930లో ఇంగ్లండ్ వెళ్లి 1931లో కేంబ్రిడ్జ్ పరిధిలోని ఇమ్మాన్యుయేల్ కళాశాలలో చేరాడు. అలీ మిత్రుడు అబ్దుల్ కరీం కథనం ప్రకారం తన మిత్రులు పీర్ అహసనుద్దీన్, ఖ్వాజా అబ్దుల్లతో కలసి థేమ్స్ ఒడ్డున నడుస్తుండగా అలీకి ఆ పేరు స్ఫురణకు వచ్చింది. అలీ కార్యదర్శి ఫ్రాస్ట్ మాటలలో అయితే, ఒక రోజున బస్సు టాప్ మీద ప్రయాణిస్తున్నప్పుడు ఆ పేరు స్ఫురించింది. ఆ హ్రస్వనామమే (పి.ఎ.కె. స్తాన్) తరువాత ‘ఐ’ చేరి పాకిస్తాన్ అయింది. పాకిస్తాన్ అంటే పర్షియన్లో పవిత్రభూమి. బహుశా భారత్, పాక్ చరిత్రలలో అలీ అంతటి వివాదాస్పద వ్యక్తి కనిపించడు. భారత్‌లో సరే, పాకిస్తాన్ చరిత్రలో కూడా ఇతడికి కొద్దిపాటి స్థానం కూడా కనిపించనిది అందుకే కాబోలు. కానీ పాక్స్తాన్ జాతీయోద్యమ నిర్మాతగా ఇతడు తనను తాను ప్రకటించుకున్నాడు. నిజానికి బొంబాయి కేంద్రంగా ‘పాకిస్తాన్’ పేరుతో పత్రికను ప్రచురించడానికి 1928లో ఒక పత్రికా రచయిత దరఖాస్తు చేశాడు. అతడు కశ్మీర్‌కు చెందిన గులాం హసన్ షా కాజ్మీ. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫలితాలు రహమత్‌ను బాగా నిరాశపరచాయి. ఆ సమావేశాలకు వెళ్లిన భారతీయ బృందాన్ని క్షమించకూడదన్నాడు. ఆ సమావేశాలకు డాక్టర్ ఇక్బాల్ కూడా హాజరయ్యారు. అప్పుడే రహమత్ ఆయనను ఇంగ్లండ్‌లో కలుసుకున్నాడు. తరువాత 1932 నాటి అలహాబాద్ ముస్లింలీగ్ సమావేశాలలో డాక్టర్ ఇక్బాల్ చేసిన ప్రతిపాదన కూడా అలీకి నిరాశ కలిగించింది. వాయవ్య ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉన్న ఐదు ప్రాంతాలను కలిపి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసి, బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగా ఉంచాలని ఇక్బాల్, లీగ్ కోరడం అలీకి నచ్చలేదు. దక్షిణాసియాలో ముస్లింలకో స్వతంత్ర దేశం అన్నది అతడి నినాదం. అసలు పరమతానికి చెందిన ఏ పేరూ ఆసియాలో మిగిలి ఉండకూడదని అతడి నిశ్చితాభిప్రాయం. రహమత్ అలీ ప్రతిపాదించిన పిఎకెలో, పి అంటే పంజాబ్, ఎ అంటే అఫ్గానిస్తాన్ (మొత్తం వాయవ్య సరిహద్దు), కె అంటే కశ్మీర్, ఎస్ అంటే సింధ్, స్తాన్ అంటే బలూచిస్తాన్‌కు సంకేతాక్షరాలు. బ్రిటిష్ ఇండియా పటంలోని బెంగాల్, అస్సాంలకు బంగిస్తాన్ అన్న పేరూ పెట్టాడు. ఉస్మాన్స్తాన్ (నిజాం రాజ్యం), ముస్లింలు అధికంగా ఉండే ఇంకొన్ని ప్రాంతాల మీద ఆకుపచ్చ రంగు పులిమి ఒక సరికొత్త భౌగోళిక పటాన్ని అతడు రచించాడు. ఆ పచ్చరంగు ప్రాంతాలే పాక్స్తాన్. ఈ ఊహనంతటినీ 1933 జనవరి 28న విడుదల చేసిన చరిత్ర ప్రసిద్ధ ‘నౌ ఆర్ నెవర్’ కరపత్రంలో అలీ వివరించాడు. దీనర్థం ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?’ అని. దీనికే ‘మనం బతికేందుకా! నశించిపోతూ ఉండడానికా?’ అన్న ఉపశీర్షిక కూడా ఉంది. మూడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరైన భారతీయ బృందాన్ని దృష్టిలో ఉంచుకునే అతడు ఈ కరపత్రం రాశాడని చెబుతారు. దీనికే ‘పాకిస్తాన్ ప్రకటన’ అంటూ పాకిస్తాన్ పత్రిక ‘డాన్’ పేరు పెట్టడం గమనార్హం. ఈ కరపత్రం బహిర్గతమైన సంవత్సరం తరువాత 1934 జనవరి 28న ఇంగ్లండ్‌లోనే ఉన్న జిన్నాను రహమత్ అలీ తన నివాసానికి పిలిచి వివరించాడని కోలిన్స్, లాపిరే (‘ఫ్రీడవ్‌ు ఎట్ మిడ్నైట్’), రషీదా మాలిక్ (‘ఇక్బాల్: స్పిరిచ్యువల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్’) వంటి రచయితలు వేర్వేరు రీతులలో తెలియచేశారు. లండన్‌లోని వాల్డెర్ఫ్ హోటల్లో జిన్నా కోసం బ్లాక్‌టై పార్టీ ఏర్పాటు చేసి.. అలీ ఇవన్నీ చెప్పినట్టు కోలిన్స్, లాపిరే రాశారు. 3, హంబర్‌స్టోన్ ఇంటికే జిన్నా వచ్చారని ఎక్కువమంది రాశారు. చిత్రంగా ‘పాకిస్తాన్ ఆలోచనే అసాధ్యం’ అంటూ ఆ క్షణంలోనే జిన్నా చెప్పారని కోలిన్స్, లాపిరే చెబితే, ‘కాలం గడవనీ! వాళ్ల సంగతి వాళ్లే (భారతీయ ముస్లింలు) చూసుకుంటారు’ అని సర్ది చెప్పినట్టు ఇతర రచయితలు రాశారు. ఏమైనా 1934 వరకు కూడా పాకిస్తాన్ ఆలోచనకు ఎవరూ సానుకూలంగా లేరన్నది నిజం. ఇది కాలేజీ కుర్రాళ్ల రగడ అనే మూడో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లిన పెద్దలు భావించారు. రహమత్ అలీ మరికొన్ని కరపత్రాలు కూడా వెలువరించాడు. ‘పాక్స్తాన్: ది ఫాదర్ల్యాండ్ ఆఫ్ పాక్స్తానీ నేషన్’ అన్న పుస్తకం కూడా రాశాడు. ఇస్లాంను ఆవిష్కరించే క్రమంలో ప్రవక్త అరబ్ తెగలను ఏకం చేసిన క్రమమే దక్షిణాసియాలో ముస్లింలకో దేశం అన్న తన లక్ష్యానికి ప్రేరణ అని అలీ చెప్పుకున్నాడు. తమ పూర్వికులు ఆరంభించిన స్థలాలు, పట్టణాలు, కొండల పేర్ల మార్పు ఉద్యమం కొనసాగాలనీ ఆశించాడు. హిమాలయాలను ‘జబాలియా’ అని, బంగాళాఖాతాన్ని ‘బంగి ఇ ఇస్లాం’ అని, ఆసియా ఖండాన్ని ‘దినియా’అని పిలిస్తేనే సార్థకమని భావించాడు. బుందేల్‌ఖండ్ మాల్వాలను సిద్దిఖిస్తాన్ అని, బిహార్, ఒడిశాలను ఫారూకిస్తాన్ అని, రాజస్థాన్‌ను ముయిస్తాన్ అని, మొత్తం హిందూస్థాన్‌ను హైదర్స్తాన్ అని, దక్షిణ భారతదేశాన్ని మాప్లిస్తాన్ అని పిలవడం సరైనదని వాదించాడు. పశ్చిమ సింహళానికి షఫిస్తాన్ అని, తూర్పు సింహళానికి నాసరిస్తాన్ అని కూడా పేర్లు పెట్టాడు. వీటిలో మొదట సాధించవలసినది మాత్రం పాక్స్తాన్ అని అనుకున్నాడు. జాతీయోద్యమానికి సమాంతరంగా ముస్లిం జాతీయోద్యమం సాగించడానికి రహమత్ అలీ ప్రయత్నించాడు. 1940 నాటి లాహోర్ సమావేశంలో మొదటిసారిగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్ చేశాడు జిన్నా. ఆ సమావేశానికి రహమత్ కూడా హాజరయ్యాడు. దేశ విభజన తరువాత 1948 ఏప్రిల్ 6న అలీ లాహోర్ చేరుకున్నాడు. యమునా నదే హిందుస్థాన్‌కు, పాకిస్తాన్‌కు మధ్య సహజ సరిహద్దు అని, ఢిల్లీ, ఆగ్రాలు లేని పాకిస్తాన్‌ను ఎలా అంగీకరించారని ధ్వజమెత్తడం ఆరంభించాడు. తను పచ్చరంగు పూసి, సూచించిన ప్రాంతాలతో పాకిస్తాన్ ఎందుకు సాధించలేదన్నదే అతడి ప్రశ్న. జిన్నా ‘ఖాయిద్ ఏ ఆజమ్’ (మహా నాయకుడు జిన్నా బిరుదు) కాదు, ‘క్విస్లింగ్ ఏ ఆజమ్’(మహా ద్రోహి) అని విమర్శలు ఆరంభించాడు. దీనితో ప్రధాని లియాఖత్ అలీఖాన్ పాక్ నుంచి రహమత్‌ను బహిష్కరించాడు. అతడి ఆస్తులను జప్తు చేయించాడు. తిరిగి కేంబ్రిడ్జ్ చేరుకున్న అలీ 1951 ఫిబ్రవరి 3న దాదాపు అనాథగా చనిపోయాడు. కేంబ్రిడ్జ్‌లో అతడి ఆచార్యుడు ఎడ్వర్డ్ వెల్బోర్న్ డబ్బు ఇచ్చి అంత్యక్రియలు జరిపించాడు (ఈ ఖర్చులను తరువాత పాకిస్తాన్ హైకమిషన్ చెల్లించింది). మరణానంతరమైనా తన అవశేషాలు స్వస్థలం కామేలియాకు పంపించాలని తన న్యాయవాదిని అలీ కోరినట్టు చెబుతారు. కానీ 2006లో జరిగిన ఈ ప్రయత్నం కూడా చిత్తశుద్ధితో సాగలేదు. 1947లో మౌంట్‌బాటన్‌తో జిన్నా చెప్పిన ‘మాత్ ఈటెన్ పాకిస్తాన్’ (అసంపూర్ణ పాకిస్తాన్) అన్నమాటకీ, ‘కశ్మీర్ లేని పాకిస్తాన్ ఏమిటీ?’ అన్న రహమత్ వాదనకీ ఏమైనా వ్యత్యాసం ఉందా? - డా. గోపరాజు నారాయణరావు చదవండి: సస్పెన్స్ థ్రిల్లర్ క్రైం స్టోరీ: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. -
కశ్మీర్ సమస్య పరిష్కారమైతే... అణ్వాయుధాలే అవసరం లేదు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం తమను తాము రక్షించుకోవడానికే అని, కశ్మీర్ అంశం పరిష్కారమైతే అణ్వాయుధాల అవసరం ఉండబోదని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి నాటికి పాకిస్తాన్ వద్ద 165 అణ్వాయుధాలు ఉన్నాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) ఇటీవల తెలిపింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ ఓ న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. పాక్ అణ్వాయుధాల సంఖ్య పెరుగుతోందా? అడి అడగ్గా... ఆ విషయం తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. పక్క దేశం తమకంటే ఏడు రెట్లు పెద్దదైనప్పుడు చిన్న దేశం తప్పకుండా జాగ్రత్తపడుతుందని ఇమ్రాన్ అన్నారు. అందులో తప్పేమీ లేదన్నారు. అయితే తాను మాత్రం అణ్వాయుధాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. కశ్మీర్ అంశాన్ని పరిష్కరించడంలో అమెరికాకు బాధ్యత ఉందని అన్నారు. వారు తలచుకుంటే దాన్ని పరిష్కరించగలరని కూడా చెప్పారు. అయితే సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ అంశంపై మూడో దేశం మధ్యవర్తిత్వం ఉండరాదని భారత్ చెబుతోంది. -
కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!
న్యూఢిల్లీ: ఈ పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) భారత్ అంతర్గత వ్యవహారమని, ఆ విషయమై తాను ఏమీ వ్యాఖ్యానించబోనని తేల్చిచెప్పారు. భారత పర్యటన సందర్భంగా మంగళవారం ట్రంప్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌లో ప్రజలకు మతస్వేచ్ఛ ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారనే తాను భావిస్తున్నానన్నారు. ‘వివాదాస్పద అంశాల జోలికి వెళ్లాలనుకోవడం లేదు. వివాదాస్పద అంశాలకు సంబంధించిన ఒక చిన్న సమాధానం నా మొత్తం పర్యటన సానుకూలతను ముంచేస్తుంది.(అమెరికాకు బయల్దేరిన ట్రంప్ బృందం) ఆ జవాబును మాత్రమే మీరు పట్టించుకుంటారు. నా పర్యటన అంతా పక్కనబెడ్తారు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనంటూనే.. అంతా కోరుకుంటే కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. కశ్మీర్‌ను భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న అతి పెద్ద సమస్యగా ట్రంప్ అభివర్ణించారు. ‘ఉద్రిక్తతలు తొలగేలా మధ్యవర్తితం చేయమంటే.. అందుకు నేను సిద్దం’అన్నారు. మోదీ, ఇమ్రాన్‌ఖాన్.. ఇద్దరితో తనకు సత్సంబంధాలున్నాయన్నారు. ప్రతీ విషయానికి రెండు వాదనలుంటాయని వ్యాఖ్యానించారు. గతంలోనూ పలు సందర్భాల్లో కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో నాకు మంచి సంబంధాలున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్ సమస్యపై కృషి చేస్తున్నారు’అని ట్రంప్ పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీతో జరిగిన చర్చల్లో పాకిస్తాన్ అంశం ప్రస్తావనకు వచ్చిందన్నారు. పాక్ నుంచి తలెత్తుతున్న ఉగ్రవాదంపై కూడా చర్చించామన్నారు. ఈ సందర్భంగా మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ సరళంగా వ్యవహరించే, చాలా శక్తిమంతమైన నేత అని వ్యాఖ్యానించారు. ‘మోదీ గట్టి మనిషి. తానేమనుకుంటాడో అది చేస్తారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటారు’అన్నారు. ట్రంప్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి వాణిజ్యంపై.. దిగుమతుల సుంకాలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. భారత్ దిగుమతి చేసుకుంటున్న హార్లీ డేవిడ్సన్ బైక్‌పై విధిస్తున్న భారీ సంకాల విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ టారిఫ్‌ల విషయంలో అమెరికాతో సానుకూలంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. అమెరికా నుంచి భారత్ భారీగా మిలటరీ హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేస్తోందన్నారు. తాలిబన్‌తో అమెరికా శాంతి ఒప్పందాన్ని భారత్ సమర్ధిస్తుందనే తాను భావిస్తున్నానన్నారు. అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందా? అన్న ప్రశ్నకు.. అలాంటి సమాచారమేదీ తనకు నిఘా వర్గాల నుంచి రాలేదన్నారు. ((సీఎన్ఎన్ X ట్రంప్) ఢిల్లీ అల్లర్లు అంతర్గతం ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లపై మోదీతో చర్చించారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. వ్యక్తిగత దాడుల గురించి చర్చించబోనన్నారు. అది భారత్ సొంత విషయమని స్పష్టం చేశారు. సీఏఏపై తాను ఏమీ మాట్లాడబోనని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ తన దేశ ప్రజల కోసం సరైన నిర్ణయాలే తీసుకుంటుందని భావిస్తున్నానన్నారు. భారత్‌లో ముస్లింలు వివక్షకు గురవుతున్నారని, వారిపై ద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయన్న వార్తలపై స్పందించాలన్న ప్రశ్నకు.. ‘మోదీతో చర్చల్లో ముస్లింల ప్రస్తావన కూడా వచ్చింది. క్రిస్టియన్ల గురించి కూడా చర్చించాం’అన్నారు. ఈ విషయమై ప్రధాని మోదీ నుంచి తనకు శక్తిమంతమైన సమాధానం లభించిందన్నారు. కాగా, మోదీ, ట్రంప్‌ల మధ్య చర్చల్లో సీఏఏ అంశం చర్చకు రాలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు. మత సామరస్యంపై ఇరువురు నేతలు సానుకూల భావాలను వ్యక్తం చేశారన్నారు. మత స్వేచ్ఛపై మాట్లాడా... ప్రధాని మోదీతో చర్చల సందర్భంగా.. భారత్‌లో మత స్వేచ్ఛ విషయమై సుదీర్ఘంగా చర్చించానని ట్రంప్ తెలిపారు. ‘భారత్‌లో మత స్వేచ్ఛపై చర్చించాం. భారత్‌లో ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలనే మోదీ కోరుకుంటున్నారు. ముస్లింలతో కలిసి పనిచేస్తున్నామని మోదీ నాకు చెప్పారు. గతంలోనూ పౌరులకు మతస్వేచ్ఛను అందించేందుకు భారత్ కృషి చేసింది’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోదీ అద్బుతమైన నేత అని, భారత్ గొప్ప దేశమని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే.. పౌరులకు మతస్వేచ్ఛ అందించేందుకు భారత్ గొప్పగా కృషి చేసిందన్నారు. -
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తా
దావోస్: కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి సాయపడతానంటూ మరోమారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు.. అవసరమైతే బాసటగా ఉంటానంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశంలో ట్రంప్ బుధవారం తెలిపారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న ట్రంప్.. పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో వేరుగా సమావేశం అయ్యారు. కశ్మీర్ వివాదంపై భారత ప్రధాని మోదీతో మాట్లాడతానని ఇమ్రాన్‌కు హామీ ఇచ్చారు. కాగా, కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘కశ్మీర్ అంశం భారత్–పాక్‌కు సంబంధించింది. దీంట్లో ఎవ్వరి ప్రమేయాన్ని అంగీకరించే ప్రశ్నే లేదు’ అని పేర్కొంది. పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ని కలుసుకోవడం తనకు చాలా ఇష్టమనీ, అయితే ఆమె తన కోపాన్ని అమెరికాపై ప్రదర్శించవద్దంటూ ట్రంప్ సూచించారు. అనేక దేశాలు అమెరికా కంటే ఎక్కువ కాలుష్యంతో నిండిఉన్నాయనీ గ్రెటా ఆ ప్రాంతాలపై దృష్టిసారించడం మంచిదని హితవు పలికారు. ట్రంప్ ఉపన్యాసాన్ని ప్రశాంతంగా కూర్చుని విన్న గ్రెటా ‘‘మా ఇళ్లు ఇంకా మంటల్లో కాలుతున్నాయి’’ అని వ్యాఖ్యానించింది. -
ఐరాసలో పాక్‌కు మళ్లీ భంగపాటు
ఐక్యరాజ్యసమితి: భద్రతామండలిలో కశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్‌కు భంగపాటు ఎదురైంది. చైనా సాయంతో వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించేందుకు పాక్ ప్రయత్నించగా మండలిలో మిగిలిన సభ్యులెవరూ మద్దతివ్వక పోవడంతో ఏకాకిగా మిగిలిపోయింది. కశ్మీర్ అంశం ద్వైపాక్షికమైనందున దానిపై చర్చించడం కుదరదని, మండలిలోని ఇతర సభ్యులు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావాలంటే పాకిస్తాన్ తనకు కష్టమైన చర్యలు చేపట్టాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. ‘పాక్ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి వేదికగా పదేపదే చేసిన నిరాధార ఆరోపణలకు మద్దతు లభించలేదు’’అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ‘పాక్ ప్రయత్నమంతా దృష్టి మరల్చేందుకేనని మిగిలిన సభ్యులు గుర్తించడం సంతోషకరం. సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక పద్ధతులు ఉన్నాయని భద్రత సమితి సభ్యులు పాక్‌కు గుర్తు చేశారు’అని ఆయన వివరించారు. దురుద్దేశపూర్వక ఆరోపణలు చేయడం పాక్‌కు అలవాటేనని, సమితి సభ్యులు సూచించినట్టుగా సమస్యల పరిష్కారానికి కొన్ని కష్టమైన చర్యలు తీసుకోవడమే ఆ దేశానికి మేలని ఆయన అన్నారు. చైనా దౌత్యవేత్త ఝాంగ్ జున్ మాట్లాడుతూ ‘కశ్మీర్‌పై సమావేశం జరిగింది. భారత, పాక్ అంశం ప్రతి సమావేశంలోనూ ఉంటుంది. దీంతో భద్రతామండలి దీనిపై కొంత సమాచారం తెలుసుకుంది’అని పేర్కొనడం గమనార్హం. ఎస్సీఓ భేటీకి ఇమ్రాన్‌కూ ఆహ్వానం న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో ఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) వార్షికభేటీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ సహా పలువురు నేతలకు భారత్ ఆహ్వానం పంపనుంది. ఎస్సీవోలోని పాకిస్తాన్ సహా 8 సభ్య దేశాలు, నాలుగు పరిశీలక హోదా దేశాలనూ ఆహ్వానిస్తామని విదేశాంగ శాఖ మంత్రి రవీశ్ కుమార్ వెల్లడించారు. ‘గతం’ నుంచి భారత్ బయటపడాలి గత అనుభవాలు, ఆలోచనల చట్రంలో బందీగా ఉన్న భారత్, వాటి నుంచి బయటకు రావాల్సి ఉందని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. కీలక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో దేశం ప్రస్తుతం కొత్త వైఖరిని అనుసరించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. అయితే, తనను తాను స్వతంత్రంగా నిర్వచించుకుంటుందా లేక ఆ అవకాశాన్ని ఇతరులకు ఇస్తుందా అనేదే అసలైన ప్రశ్న అన్నారు. ఇందులో స్వతంత్ర వైఖరికే తనతోపాటు తమ పార్టీ మొగ్గుచూపు తాయని పేర్కొన్నారు. పలు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంలో జరుగుతున్న ‘రైజినా డైలాగ్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలపై అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పోరాటం సాగించాలన్నారు. ఈ పోరులో ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను భాగస్వాములను కానీయరాదని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జరీఫ్ మాట్లాడుతూ.. అమెరికాతో తమ దేశం దౌత్యా నికి సిద్ధమే కానీ, చర్చలకు మాత్రం కాదన్నారు. తమ సైనిక జనరల్ సులేమానీని చంపడం అమెరికా చేసిన క్షమించరాని తప్పిదమని వ్యాఖ్యానించారు. ఇరాన్ మంత్రి జరీఫ్ అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ‘రైజినా డైలాగ్’లో విదేశాంగ మంత్రి జై శంకర్ -
'ఉగ్రవాదం పాక్ డీఎన్ఏలోనే ఉంది'
పారిస్ : కశ్మీర్ విషయంలో రాజకీయాలు చేయాలని చూస్తున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ వేదికలపై భారత్ దీటుగా సమాధానం చెబుతుంది. తాజాగా ప్యారిస్‌లో జరుగుతున్న యూనెస్కో జనరల్ సమావేశంలో పాక్ లేవనెత్తిన కశ్మీర్ అంశాన్ని భారత్ తిప్పికొట్టింది. ఉగ్రవాదం అనేది పాక్ డీఎన్ఏలోనే ఉందంటూ భారత్ తరపున హాజరైన అనన్య అగర్వాల్ స్పష్టం చేశారు. పాక్ అనుసరిస్తున్న విధానాలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్తను దారుణంగా కుంగదీశాయన్నారు. యూనెస్కో వేదికగా భారత్‌పై బురద జల్లేందుకు ప్రయతించిన పాక్ వైఖరిని ఆమె ఖండించారు. ఉగ్రవాద సిద్ధాంతాలు, తీవ్రవాద భావజాలం వంటి చీకటి కోణాలకు పాక్ అడ్డాగా మారందని అగర్వాల్ ఆరోపించారు. అణు యుద్దం, ఇతర దేశాలపై ఆయుధాలను ప్రయోగించడం లాంటి వ్యాఖ్యలు చేసి ఐక్యరాజ్యసమితి వేదికను అవమానించడం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదులుగా పేరు మోసిన ఒసామా బిన్ లాడెన్, హక్కానీ నెట్వర్క్ లాంటి వారిని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్ హీరోలుగా అభివర్ణించడాన్ని చూస్తేనే వారి నిజం స్వరూపం బయటపడిందని పేర్కొన్నారు.అలాగే పాక్ మైనారిటీ వర్గాలు, మహిళలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. మళ్లీ పాక్ ఇటువంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదని అనన్య తేల్చి చెప్పారు. -
పాక్‌ను పీడించేవి ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రజలను పట్టి పీడిస్తోంది ద్రవ్యోల్బణమే తప్ప కశ్మీర్ సమస్య కాదని గల్లప్ ఇంటర్నేషనల్ నిర్వహించిన తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. పాకిస్తాన్లో గల్లప్ అండ్ గిలానీ ప్రచురించిన ఈ అధ్యయనంలో ప్రతిస్పందించిన వారిలో 53 శాతం మంది దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. మరో తీవ్రమైన సమస్య నిరుద్యోగమని 23 శాతం మంది వెల్లడించారు. అవినీతి, నీటిసమస్య తీవ్రమైందని 4 శాతం మంది అభిప్రాయపడుతున్నట్లు తేలింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తున్నట్టు కశ్మీర్ సమస్య తీవ్రమైన సమస్య అని అక్కడి ప్రజలు అనుకోవడంలేదని పేర్కొంది. ప్రజల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే కశ్మీర్ అంశం దేశానికి తీవ్రమైన విషయమని అభిప్రాయ పడుతున్నారని సర్వే తెలిపింది. -
18 నుంచి డిసెంబర్ 13 వరకు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకు జరగనున్నాయి. పార్లమెంటు ఉభయ సభల సెక్రటేరియట్లకు సోమవారం ఈ సమాచారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పంపించింది. గత రెండేళ్లుగా శీతాకాల సమావేశాలు నవంబర్ 21న ప్రారంభమై.. జనవరి మొదటివారం వరకు కొనసాగాయి. ఈ సమావేశాల్లో రెండు ఆర్డినెన్సులు, పలు కీలక బిల్లులు పార్లమెంటు ముందుకు రానున్నాయి. నూతన, దేశీ తయారీ సంస్థలకు కార్పొరేట్ పన్నును తగ్గిస్తూ జారీ అయిన ఆర్డినెన్స్, ఈ–సిగరెట్ల తయారీ, అమ్మకం, నిల్వను నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌లకు చట్టరూపం ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక వృద్ధిలో వైఫల్యం, కశ్మీర్లో స్థానికుల పరిస్థితి, ఎన్నార్సీ, పౌరసత్వ బిల్లు.. మొదలైన అంశాలపై విపక్ష సభ్యులు లేవనెత్తేవీలుంది. పార్లమెంటు సమావేశాలను మరో వారం పాటు పొడగించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో 28 బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాయి. ఈ సమావేశాల్లోనే కార్మిక సంస్కరణలకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందే అవకాశముంది. -
సిగ్గుతో చావండి
అకోలా/జల్నా: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల్లో పదును పెంచారు. కశ్మీర్ 370 ఆర్టికల్ రద్దుని మోదీ, షాలు ప్రచార ఎత్తుగడగా మార్చుకోవడంపై విమర్శలు వెల్లువెత్తడంతో విపక్షాల నోరు మూయించే క్రమంలో మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు అకోలా, జల్నా జిల్లాల్లో ప్రధాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ‘కశ్మీర్‌కు, మహారాష్ట్రకి ఏమిటి సంబంధమని ఎలా అంటారు ? వారికెంత ధైర్యం ? ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నందుకు వాళ్లకు సిగ్గు అనిపించడం లేదా ? డూబ్ మరో డూబ్ మరో (సిగ్గుతో చావండి) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పరివార్ భక్తినే (ఒక కుటుంబానికి విధేయత చూపించడం) రాష్ట్ర భక్తిగా (జాతీయభావం) భావిస్తోందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని కొనఊపిరితో కొట్టు మిట్టాడుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ పొత్తుపైన కూడా ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలది అవినీతి పొత్తు అని నిందించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలతో సామాన్య ప్రజలకే నష్టం జరిగిందని అన్నారు. -
వాళ్లిద్దరూ కలిసి పనిచేయాలి
న్యూయార్క్: కశ్మీర్ సమస్య పరిష్కారంలో భారత్, పాక్ ప్రధానులిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, పాక్‌తో చర్చలు జరపాలంటే ముందుగా ఆ దేశం నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఐరాస సమావేశాల అనంతరం మంగళవారం ట్రంప్, భారత ప్రధాని మోదీ మరోసారి భేటీ అయ్యారు. అనంతరం మోదీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్, పాక్‌లు అంగీకరిస్తే మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ సోమవారం పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో భేటీ అనంతరం ప్రకటించిన ట్రంప్ ఈ విషయమై అడిగిన ప్రశ్నకు స్పందించారు.. ‘కశ్మీర్ విషయంలో పొరుగుదేశాల నేతలిద్దరూ కలిసి చర్చించుకుంటే బాగుంటుంది. వారు చాలా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశముందని భావిస్తున్నా’ అని అన్నారు. పాక్ గడ్డపై ఉగ్ర స్థావరాలు, సైన్యానికి ఉగ్ర లింకులపై భారత విలేకరి అడిగిన ప్రశ్నపై ట్రంప్.. ‘మీకు చాలా సమర్థుడైన ప్రధాని ఉన్నారు. అవన్నీ ఆయన చూసుకుంటారు’ అని బదులిచ్చారు. భారత్– అమెరికాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతానికి త్వరలోనే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నామన్నారు. ‘మోదీ అంటే నాకు చాలా ఇష్టం. ప్రజలకు మోదీ ఎంతో అభిమానం. భారతీయులకు ఎల్విస్ ప్రెస్లీ లాంటి వారు’ అని హ్యూస్టన్‌లో ఆహూతులు చూపిన అభిమానాన్ని ఉద్దేశించి ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఆయనకు హౌడీ మోదీ కార్యక్రమం ఫొటోను బహూకరించారు. భారత్‌కు రండి! ట్రంప్‌ను ఆహ్వానించిన మోదీ కశ్మీర్ విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ తో చర్చలు జరగాలంటే ముందుగా ఆ దేశం నిర్దిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉందని భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదం కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. కుటుంబంతో భారత్‌కు రావాలని ట్రంప్‌ను మోదీ మరోసారి ఆహ్వానించారు. వాణిజ్యం, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం తదితర అంశాలపై ఇద్దరు నేతలు 40 నిమిషాల పాటు చర్చించారు. కశ్మీర్లో ఉగ్రవాదం కారణంగా గత 30 ఏళ్లలో 42వేల మందికి పైగా చనిపోయారని ట్రంప్‌కు ప్రధాని వివరిం చారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ఢిల్లీలో మీడియాకు తెలిపారు. కనీస భద్రత మధ్య మోదీ 2015లో లాహోర్‌లో పర్యటించారనీ, ఆ వెంటనే పఠాన్‌కోట్‌పై సైనిక స్థావరంపై ఉగ్ర దాడి జరిగిందని వివరించారన్నారు. ఉగ్రదాడులన్నీ ఒకటే! మంచి, చెడు.. చిన్న, పెద్ద ఉండదు: మోదీ మంచి, చెడు.. చిన్న, పెద్ద.. అంటూ ఉగ్రవాద దాడులను వర్గీకరించడం సరికాదని మోదీ అన్నారు. ప్రపంచంలో ఎక్కడ జరిగినా, ఏ స్థాయి దాడైనా.. ఉగ్రదాడిని ఉగ్రవాద చర్యగానే పరిగణించాలని ప్రపంచదేశాలకు స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదంపై నాయకుల వ్యూహాత్మక స్పందన’ అంశంపై ఐక్యరాజ్యసమితిలో మంగళవారం జరిగిన శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ప్రపంచదేశాలు పరస్పర సహకారాన్ని వివిధ స్థాయిల్లో వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో మిత్ర దేశాలతో కలిసి పనిచేసేందుకు, ఆయా దేశాల సామర్ధ్య పెంపులో సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. అలాగే, ఉగ్రవాదులు నిధులు, ఆయుధాలు సమకూర్చుకోకుండా చూడాల్సి ఉందన్నారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు సహకారం, సమాచార పంపిణీ.. తదితరాలపై ద్వైపాక్షిక, ప్రాంతీయ ఒప్పందాలను ఏర్పర్చుకోవాల్సి ఉందన్నారు. ఉగ్రవాద, తీవ్రవాద భావజాలాల్ని ఎదుర్కొనేందుకు భారత్ ప్రజాస్వామ్య విలువలు, భిన్నత్వంపై గౌరవం, సమ్మిళిత అభివృద్ధి మొదలైన కీలక ఆయుధాలను ఉపయోగిస్తోందని మోదీ వివరించారు. ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి ఐరాస ఆంక్షలు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్.. మొదలైన వాటిని రాజకీయం చేయొద్దని సూచించారు. ఆన్లైన్లోని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, సమర్ధించే సమాచారాన్ని తొలగించేందుకు ఉద్దేశించిన క్రైస్ట్‌చర్చ్ పిలుపునకు మోదీ మద్దతు పలికారు. -
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్
న్యూయార్క్: కశ్మీర్ చాన్నాళ్లుగా సాగుతున్న అత్యంత సంక్లిష్టమైన సమస్య అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధమేనని పునరుద్ఘాటించారు. అయితే, అందుకు భారత్, పాక్‌లు రెండూ ఒప్పుకోవాలన్నారు. తాను చాలా గొప్ప మధ్యవర్తినని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పుకున్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ సందర్భంగా సోమవారం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్, పాక్‌లు ఒప్పుకుంటే మధ్యవర్తిత్వానికి నేను సిద్ధమే’ అన్నారు. భారత ప్రధాని పాల్గొన్న హౌడీ మోదీ కార్యక్రమంపై ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే ట్రంప్ ప్రశంసలు కురిపించడం విశేషం. ‘ఉగ్రవాదంపై ఇక యుద్ధమేనని, కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం సొంత దేశాలనే సరిగ్గా నడుపుకోలేని కొందరికి నచ్చడం లేదు. ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు’ అని పాక్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. కశ్మీర్ ద్వైపాక్షిక సమస్య అని, మూడో దేశం జోక్యం ఇందులో అవసరం లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గత నెలలో జీ7 సదస్సు సందర్భంలోనూ ట్రంప్ తో మోదీ ఇదే విషయాన్ని చెప్పారు. -
ఐరాసలో కశ్మీర్ ప్రస్తావన!
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల్లో చర్చల సందర్భంగా కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముందని ఐరాస ప్రధాన కార్యదర్శి అంటానియొ గ్యుటెరిస్ అధికార ప్రతినిధి స్టీఫానె డ్యుజారిక్ వెల్లడించారు. కశ్మీర్‌లోయలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, మానవహక్కుల ఉల్లంఘన తదితర అంశాలను వచ్చేవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రధాన కార్యదర్శి గ్యుటెరిస్ లేవనెత్తవచ్చని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం చర్చలేనన్న విషయాన్ని గ్యుటెరస్ బలంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. ‘ప్రస్తుత కశ్మీర్ సమస్య పరిష్కారంలో.. లోయలో మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని గ్యుటెరస్ అభిప్రాయపడ్డారని స్టీఫానె తెలిపారు. సాధారణ సభ సమావేశాలను ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రధాన కార్యదర్శి ఉపయోగించుకోవచ్చన్నారు. అయితే, కశ్మీర్ పరిష్కారానికి భారత్ పాక్ ల మధ్య చర్చలే మార్గమని, వారు కోరితే ఇరువర్గాలకు ఐరాస కార్యాలయం అందుబాటులో ఉంటుందని, అదే సమయంలో మానవహక్కులకు సముచిత గౌరవం ఇవ్వాల్సిందేనని బుధవారం గ్యుటెరస్ అభిప్రాయపడిన విషయం ఇక్కడ గమనార్హం. ‘అక్కడ మానవ హక్కులను కచ్చితంగా గౌరవించాల్సిందే. అయితే, భారత్– పాక్‌ల మధ్య చర్చలే కశ్మీర్ సమస్యకు పరిష్కారమని నా విశ్వాసం’ అని నాడు పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు గ్యుటెరస్ సమాధానమిచ్చారు. కాగా, జమ్మూకశ్మీర్ భారత్ భూభాగం. దీనికి సంబంధించిన ఏ సమస్యలోనైనా.. ఐరాస లేదా అమెరికా.. ఎవరైనా సరే మూడో శక్తి ప్రమేయాన్ని అంగీకరించబోం’ అని ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారత్, పాక్‌లు కోరితేనే ఇందులో జోక్యం చేసుకుంటామని కూడా ఐరాస ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం భారత్, పాక్‌ల సంబంధాలు కనిష్ట స్థాయికి దిగజారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న న్యూయార్క్‌లో జరగనున్న ఐరాస సాధారణ సభ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతానని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేసిన విషయమూ విదితమే. అయితే, అదే సెప్టెంబర్ 27న భారత ప్రధాని మోదీ కూడా ఐరాస వేదికగా ప్రసంగించనుండటం విశేషం. దీటుగా సమాధానమిస్తాం ఐరాస వేదికపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తే అధమ స్థాయికి పాకిస్తాన్ దిగజారితే.. అందుకు భారత్ అత్యున్నత స్థాయిలో జవాబిస్తుందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తేల్చి చెప్పారు. గతంలోనూ ఇలా అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తిన సందర్భాల్లో భారత్ తిరుగులేని విధంగా వారికి జవాబిచ్చామన్నారు. ఇప్పటివరకు ఉగ్రవాద వ్యాప్తిలో పెరెన్నికగన్న పాకిస్తాన్.. ఇప్పుడు భారత్‌పై ద్వేష భావజాల ప్రచారాన్ని కూడా తలకెత్తుకుందని విమర్శించారు. -
హౌడీ మోదీ కలిసొచ్చేదెవరికి
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో జరగనున్న హౌడీ మోదీ కార్యక్రమానికి అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ హాజరవడానికి అంగీకరించడంతో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా సక్సెస్ అయ్యింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల అధినేతలు ఇద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడంతో అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. హ్యూస్టన్ ర్యాలీలో కీలక ప్రకటనకు అవకాశం ఉందంటూ ట్రంప్ సంకేతాలిచ్చారు. గురువారం కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ వెళుతుండగా ప్రత్యేక విమానంలో విలేకరుల హ్యూస్టన్ ర్యాలీలో ఏదైనా ప్రకటన ఉంటుందా అన్న ప్రశ్నకు ఉండొచ్చునని బదులిచ్చారు. భారత్, పాక్‌ల మధ్య కశ్మీర్ అంశం ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడడంతో అమెరికా భారత్ పక్షమే వహిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రవాస భారతీయులనుద్దేశించి టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో ఈ నెల 22న మోదీ ప్రసంగించనున్నారు. వాణిజ్య బంధాల బలోపేతమే మోదీ లక్ష్యం గత కొద్ది నెలలుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల అమెరికా వాణిజ్య ప్రతినిధి రోబర్ట్ లైటింగర్ భారత్ ఎగుమతులపై కొన్ని ప్రయోజనాలను రద్దు చేశారు. దీనికి ప్రతిగా అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై భారత్ సుంకాలను పెంచింది. ఇలాంటి సమయంలో రెండు దేశాల అధినేతలు ఒకే వేదికను పంచుకోవడం వల్ల రెండు దేశాల మ«ధ్య వాణిజ్య రంగంలో విభేదాలు సమసిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ రాకతో అమెరికా సమాజ ఆర్థిక పురోగతికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషికి గుర్తింపు లభిస్తోందని మోదీ భావిస్తున్నారు. ఇంధన, వాణిజ్య రంగాల్లో సంబంధాలు బలోపేతం అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఓటు బ్యాంకు కోసం ట్రంప్ అమెరికాలో నివసించే భారతీయులు ఏర్పాటు చేసిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి ట్రంప్ హాజరుకావడం ఇదే తొలిసారి. 2020 అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటికే సన్నాహాలు చేస్తున్న ట్రంప్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హాజరవుతున్నారని భావిస్తున్నారు. ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న ఆసియన్ అమెరికన్లలో అయిదో వంతు మంది భారతీయులే. అందులోనూ టెక్సాస్‌లో భారతీయుల ఓటుబ్యాంకు బలంగా ఉంది. 2 లక్షల 70 వేల మందికిపైగా ఓటర్లు టెక్సాస్‌లో ఉన్నారు. హౌడీ మోదీ కార్యక్రమానికి 50 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరుకానున్నారు. అమెరికా ఎన్నికల్లో భారతీయులు సంప్రదాయంగా డెమొక్రాట్లకే మద్దతుగా ఉంటూ వస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంపై రాజకీయంగా రిపబ్లికన్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో డెమోక్రాట్లు పట్టుకు యత్నిస్తున్నారు. -
కొత్త బంగారులోకం చేద్దాం!
నాసిక్: భూతల స్వర్గం కశ్మీర్‌ను మరోసారి కొత్త బంగారు లోకంగా మార్చేద్దామని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రతి కశ్మీరీని హత్తుకుని, కశ్మీర్‌ను మళ్లీ స్వర్గసీమగా మారుద్దామని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాసిక్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ.. దశాబ్దాల కశ్మీరీ కష్టాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని దుయ్యబట్టారు. కశ్మీర్లో హింసను ప్రజ్వరింపజేసేందుకు సరిహద్దులకు ఆవలి నుంచి నిర్విరామ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పాకిస్తాన్‌పై ధ్వజమెత్తారు. ఉగ్రవాదం, హింసల నుంచి కశ్మీర్, లద్దాఖ్ ప్రజలను దూరం చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘దశాబ్దాల హింసాత్మక వాతావరణం నుంచి బయటపడాలని యువత, తల్లులు, సోదరీమణులు నిర్ణయించుకున్నారు. వారికి ఉద్యోగాలు, అభివృద్ధి కావాలి. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలోని సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని మోదీ వివరించారు. దేశంలోని యాభై కోట్ల పాడి పశువులకు టీకాలు వేయించాలని తమ ప్రభుత్వం నిర్ణయిస్తే.. ఇదో రాజకీయ నిర్ణయమని విమర్శిస్తున్నారని, పశువులు ఓట్లు వేయవన్న సంగతి వారు గుర్తుచేసుకోవాలని మోదీ ఎద్దేవా చేశారు. ఛత్రపతి శివాజీ వంశస్తుడు బహూకరించిన తలపాగాతో మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సైనిక అవసరాలను వారు పట్టించుకోలేదు జాతీయ భద్రతపై గత యూపీఏ ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపలేదని మోదీ విమర్శించారు. సైనిక బలగాల కోసం 2009లో 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదని గుర్తు చేశారు. ‘2014లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే ఆ డిమాండ్ నెరవేరింది. అప్పటివరకు సరిహద్దుల్లో మన జవాన్లు అవి లేకుండానే ప్రాణాలొడ్డి విధులు నిర్వర్తించేవారు. అంతేకాదు, ఇప్పుడు భారత్‌లో తయారయ్యే బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి’ అని మోదీ వివరించారు. పవార్‌పై విమర్శలు... పాకిస్తాన్ అంటే తనకిష్టమన్న ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ వ్యాఖ్యలపై మోదీ ధ్వజమెత్తారు. ‘శరద్ పవార్‌కు ఏమైంది? అంతటి సీనియర్ నేత పాకిస్తాన్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూంటే బాధగా ఉంది. ఆయనకు పొరుగు దేశమంటే ఇష్టం కావచ్చుగానీ.. ఉగ్రవాదం మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు’ అని మోదీ వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎన్సీపీతోపాటు ఇతర ప్రతిపక్షాలు సహకరించలేదని, మద్దతుగా నిలవలేదని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ పేరు ప్రస్తావించకుండానే... కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను భారత వ్యతిరేక శక్తులకు ఊతమిస్తున్న దేశాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని మోదీ చెప్పారు. రామమందిర నిర్మాణంపై.. మిత్రపక్షం శివసేనపైనా మోదీ విమర్శలు గుప్పించారు. సేన పేరును ప్రస్తావించకుండా.. రామ మందిర నిర్మాణం విషయంలో కొందరు పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్నారని, వారంతా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు సంయమనం పాటించాలన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకముంచాలని చేతులు జోడించి కోరుతున్నానన్నారు. మందిర నిర్మాణం కోసం ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలని, అందుకు కేంద్రం ఓ కొత్త చట్టం రూపొందించాలని తాము చాన్నాళ్లుగా కోరుతున్నామని శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే సోమవారం వ్యాఖ్యానించడం తెల్సిందే. -
పాక్‌లో చైనా పెట్టుబడులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని అభివృద్ధి ప్రాజెక్టుల్లో దాదాపు రూ.7,164.55 కోట్లు(బిలియన్ డాలర్ల) పెట్టుబడులు పెడతామని చైనా ప్రకటించింది. తద్వారా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు సరికొత్త ఎత్తుకు చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేసింది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా రాయబారి యావో జింగ్ మాట్లాడారు. కశ్మీర్ సమస్యను భారత్–పాకిస్తాన్‌లు పరస్పర గౌరవంతో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. పాకిస్తాన్ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాక్ పర్యటన ముగిసిన నేపథ్యంలో ఇరుదేశాలు ఆదివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. కశ్మీర్‌ను పరోక్షంగా ప్రస్తావించిన చైనా.. ప్రస్తుతమున్న పరిస్థితులను మరింత జటిలం చేసే ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. -
కశ్మీర్ అంశం, చిదంబరం అరెస్ట్ రహస్యమిదే!
సాక్షి, చెన్నై: దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. దేశ జీడీపీ 5శాతానికి పడిపోవడంపై ఎన్డీఏ సర్కార్‌ను డీఎంకే తీవ్రంగా దుయ్యబట్టింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 5 శాతానికి పడిపోవడం చాలా ఆందోళనకరమైందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ బుధవారం విమర్శించారు. గత 27 ఏళ్లలో ఇంత బలహీనమైన జీడీపీ వృద్ధి గణాంకాలను చూడలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘భయంకరమైన' ఆర్థిక మందగమనాన్ని దాచిపెట్టడానికే కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం అరెస్ట్‌లాంటి అంశాలను కేంద్రం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఆర్థిక మందగమనాన్ని కప్పిపుచ్చే ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్నారు. అయితే దీనికి సంబంధించి మీడియాలో వార్తలు రాకుండా నిరోధించినప్పటికీ, ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియాలో విరివిగా వార్తలొచ్చాయని స్టాలిన్ పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రుల మూడు దేశాల పర్యటనపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఇది టూరింగ్ కేబినెట్ అనివ్యాఖ్యానించారు. 2015, 2019 సంవత్సరాలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌ను ఏఐడీఎంకే ప్రభుత్వం నిర్వహించిందని గుర్తుచేసిన ఆయన పెట్టుబడులు, ఉద్యోగాలపై పళని ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా పెట్టుబడులను ఆకర్షించేందుకు పళని స్వామి బృందం ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 10 వరకు అమెరికా, బ్రిటన్ సహా మూడుదేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. -
వెనక్కి తగ్గిన ట్రంప్!
వెనకా ముందూ చూడకుండా తోచినట్టు మాట్లాడటం...ఆ తర్వాత సర్దుకోవడం అలవాటైపోయిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కశ్మీర్ విషయంలో ఎట్టకేలకు వెనక్కి తగ్గారని తాజాగా ఆయన వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఫ్రాన్స్‌లోని బియరిట్జ్‌లో జరుగుతున్న జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కలుస్తున్నప్పుడు కశ్మీర్ విషయంలో ట్రంప్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారోనని భావించినవారిని ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచి ఉంటాయి. పైగా నేతలిద్దరి చర్చల్లో అసలు కశ్మీర్ అంశం ప్రస్తావనకే రాలేదని మన విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెబుతున్నారు. ఈ నెల 5న 370 అధికరణను రద్దు చేస్తూ, జమ్మూ–కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక, అంతకుముందూ కూడా భారత్–పాకిస్తాన్ల మధ్య కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధమేనని ట్రంప్ ఒకటికి రెండుసార్లు చెప్పారు. ఆయన అలా చెప్పిన ప్రతిసారీ మన దేశం దాన్ని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో నేరుగా ఇద్దరు అధినేతలూ కలిసినప్పుడు ఏం జరుగుతుందన్న ఆసక్తి అందరిలో ఏర్పడింది. కానీ ఇద్దరూ 40 నిమిషాలు చర్చించుకున్న తర్వాత సంయుక్తంగా జరిపిన మీడియా సమావేశం దృశ్యాలు వీక్షించాక అంతా సవ్యంగా గడిచిందన్న భావన కలిగింది. కశ్మీర్, ఇతర ద్వైపాక్షిక అంశాలను తామూ, పాకిస్తాన్ పరిష్కరించుకుంటామని ట్రంప్ సమక్షంలో మోదీ చెప్పగా, రెండు దేశాలూ తమంతట తామే ఈ సమస్యను పరిష్కరించుకుంటాయన్న విశ్వాసం ఉందని ట్రంప్ ముక్తాయించారు. కశ్మీర్ విషయంలో తాను ట్రంప్‌ను బాగానే ఒప్పించగలిగానన్న విశ్వాసంతో ఉన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బహుశా ఈ పరిణామంతో నీరసించి ఉంటారు. వాస్తవానికి ఈ నేతలిద్దరి సమావేశాన్ని ప్రభావితం చేయడానికి కావొచ్చు...పాక్ ప్రజలనుద్దేశించి ఇమ్రాన్ అదేరోజు మాట్లాడారు. కశ్మీర్ కోసం ఎంతదూరమైనా వెళ్తామని, అణుయుద్ధానికైనా సిద్ధమేనని బెదిరింపులకు దిగారు. జపాన్ లోని ఒసాకాలో జూన్ నెలాఖరులో జరిగిన జీ–20 దేశాల శిఖరాగ్ర సదస్సు తర్వాత ట్రంప్ ఏమన్నారో గుర్తుంచుకుంటే కశ్మీర్‌పై అమెరికా నుంచి ఎన్ని రకాల స్వరాలు వినబడ్డాయో అర్ధమవుతుంది. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిగా ఉండమని ఆ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కలిసినప్పుడు మోదీ తనను కోరారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. వెనువెంటనే మన దేశం దాన్ని ఖండించింది. అటు అమెరికా ప్రతినిధి జోక్యం చేసుకుని వివాదం మరింత ముదరకుండా సర్ది చెప్పారు. ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు. ఆ తదుపరి సైతం ట్రంప్ మధ్యవర్తిత్వం ఉబలాటాన్ని వదలకుండా ప్రదర్శిస్తూనే ఉన్నారు. అంతక్రితం మాట్లాడినదానికి భిన్నంగా ఇప్పుడు బియారిట్జ్‌లో ‘రెండు దేశాలూ సొంతంగానే పరి ష్కరించుకుంటాయన్న విశ్వాసం ఉంద’ని చెప్పిన ట్రంప్ కనీసం తన పాత వ్యాఖ్యలకు వివరణనిచ్చే ప్రయత్నమైనా చేయలేదు. ఫలానా కారణాల వల్ల తన ఆలోచన మారిందని సంజాయిషీ ఇవ్వలేదు. అసలు గతంలో దీన్ని ప్రస్తావించిన సంగతే గుర్తులేనట్టు ప్రవర్తించారు. నిజానికి ఈ కారణం వల్లనే ట్రంప్‌ను విశ్వసించలేం. ఈ తాజా అభిప్రాయం కూడా ఎన్నాళ్లుంటుందో, ఎప్పుడు మారుతుందో చెప్పలేం. పూర్వాశ్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలమునకలై ఉండటం వల్లకావొచ్చు...కశ్మీర్ పేచీని ఆయన కేవలం రెండు దేశాల స్థల వివాదంగా చూస్తున్నట్టు కనబడుతోంది. లేదా రెండు అణ్వస్త్ర దేశాల మధ్య తగాదా నివారించానన్న ఖ్యాతిని గడించి నోబెల్ శాంతి బహుమతిని సంపాదించాలన్న లక్ష్యం ఆయనకేమైనా ఉందేమో! ట్రంప్ ఉద్దేశాలేమైనా నరేంద్ర మోదీ ఆయన సమక్షంలోనే ‘అది ద్వైపాక్షిక సమస్య. రెండు దేశాలూ పరిష్కరించుకుంటాయి’ అని నిర్మొహమాటంగా చెప్పడం బాగుంది. అయితే ఈ విషయంలో ట్రంప్‌కు మాత్రమే కాదు...చాలా దేశాలకు ఆసక్తి ఉంది. నిరుడు జూలైలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మన దేశంలో పర్యటించినప్పుడు కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం నెరపడానికి తాము సిద్ధమేనని ప్రకటించడం గుర్తుంచుకోవాలి. చైనా సరేసరి. అది పాక్ వైఖరికి మొదటినుంచీ వంతపాడుతూనే ఉంది. అలాంటి దేశాలు మరికొన్ని ఉన్నాయి. సహజంగానే పాకిస్తాన్ మరిన్ని దేశాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని దశాబ్దాలుగా జమ్మూ–కశ్మీర్‌పై ప్రపంచ దేశాలకు ఉన్న అవగాహన వేరు. అది భారత్–పాక్‌ల మధ్య విభ జనకాలంలో ఏర్పడిన వివాదంగా అందరూ భావిస్తున్నారు. దానిపై పాకిస్తాన్‌తో సంప్రదింపులకు సిద్ధమేనని సిమ్లా ఒప్పందం మొదలుకొని ఆగ్రా డిక్లరేషన్ వరకూ మన దేశం చెబుతూ వస్తోంది. కానీ 370 అధికరణ రద్దు చేయడం ద్వారా, ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం ద్వారా దాని రూపురేఖల్ని మోదీ మార్చేశారు. అదిప్పుడు పూర్తిగా ఆంతరంగిక సమస్య అయింది. మారిన ఈ కొత్త పరిస్థితుల విషయమై ప్రపంచ దేశాలను ఒప్పించడానికి ఎంతో ఓపిక అవసరం. ట్రంప్‌కు దేనిపైనా నిలకడ ఉండదు కనుక ఆయన ఏ అభిప్రాయాన్నయినా ఇట్టే మార్చుకున్నట్టు కనబడతారు. తిరిగి పాత అభిప్రాయానికి ఎప్పుడు వెళ్తారో చెప్పలేం. కానీ వేరే దేశాల అధినేతలకు అవగాహన కలిగించడానికి చాలా సమయమే పట్టవచ్చు. అయితే ఈలోగా మన దేశం కశ్మీర్లో చేయాల్సింది చాలా ఉంది. అక్కడి ప్రజానీకాన్ని విశ్వాసంలోకి తీసుకుని వారి మనసులను గెల్చుకునే ప్రయత్నం చేయాలి. కొత్త విధానాల పర్యవసానంగా శాంతిభద్రతలకు భంగం వాటిల్లవచ్చునన్న ఉద్దేశంతో కశ్మీర్లో ఆంక్షలు విధించామని కేంద్రం చెబుతోంది. కానీ అవి సుదీర్ఘకాలం కొనసాగడం తప్పుడు సంకేతాలు పంపుతుంది. కనుక సాధ్యమైనంత త్వరగా అక్కడ ప్రాథమిక హక్కులను పునరుద్ధరించి, సాధారణ పరిస్థితులు ఏర్పర్చగలిగితే... ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటే సత్ఫలితాలొస్తాయి. -
భారత్‌తో అణు యుద్ధానికైనా రెడీ
ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో భారత్‌తో అణుయుద్ధానిౖకైనా సిద్ధమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ మరోసారి బెదిరింపులకు దిగారు. సోమవారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. ‘కశ్మీర్ పరిస్థితులు యుద్ధానికి దారి తీస్తే.. గుర్తుంచుకోండి రెండు దేశాల వద్దా అణ్వాయుధాలు ఉన్నాయి. కశ్మీర్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. కశ్మీర్ కోసం ఎంతవరకైనా వెళతాం. అంతర్జాతీయ సమాజం ఇప్పుడు బాధ్యత తీసుకోవాలి, లేదా పాక్ ఏదైనా చేయగలుగుతుంది’అని స్పష్టంచేశారు. అంతర్జాతీయంగా జరిగే ప్రతి సమావేశంలోనూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతానన్నారు. ఈ విషయంలో భారత్‌తో చర్చలు జరపడానికి ప్రయత్నించినా సరైన స్పందన రాలేదని తెలిపారు. భారత్‌లో ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంతో చర్చలు జరపవచ్చని భావించానని అయితే మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుతో చారిత్రాత్మక తప్పు చేసిందని అన్నారు. ఈ క్రమంలో భారత్ తమ సొంత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను, ఐక్యరాజ్యసమితి సూచనలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానన్నారు. ముస్లిం దేశాలు పాక్‌కు మద్దతివ్వడం లేదన్న విషయంపై స్పందిస్తూ.. ‘ఆర్థిక సంబంధాల వల్ల వారు ముందుకు రాకపోవచ్చు. కానీ వారంతా కచ్చితంగా కాలంతోపాటు కలిసి రావాల్సిందే. కశ్మీరీలను కాపాడతామని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఇది ఇప్పుడు వారి బాధ్యత. పుల్వామా వంటి దాడులను సాకుగా చూపి కశ్మీర్ అంశం నుంచి అంతర్జాతీయ సమాజ దృష్టిని మార్చే పనిలో భారత్ ఉంది’అన్నారు. -
కశ్మీర్‌పై మధ్యవర్తికి తావులేదు : మోదీ
బియార్రిట్జ్/లండన్: కశ్మీర్ విషయంలో మూడో దేశం మధ్యవర్తిత్వానికి ఎటువంటి అవకాశం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కశ్మీర్‌తోపాటు ఇతర ద్వైపాక్షిక అంశాలను భారత్, పాక్‌లు చర్చించుకుని పరిష్కరించుకుంటాయని, ఈ విషయంలో మరో దేశాన్ని ఇబ్బందిపెట్టడం తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఫ్రాన్సులోని బియార్రిట్జ్‌లో జరుగుతున్న జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ పరిణామాలపై జీ–7 భేటీ సందర్భంగా ట్రంప్‌తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ‘భారత్, పాకిస్తాన్ల మధ్య విబేధాలన్నీ ద్వైపాక్షిక సంబంధమైనవే. ఈ విషయాల్లో ఏ ఇతర దేశాన్ని కూడా ఇబ్బందిపెట్టడం మాకు ఇష్టం లేదు. ద్వైపాక్షిక సమస్యలను మేమే చర్చించి, పరిష్కరించుకుంటాం’ అని తెలిపారు. ‘1947 వరకు రెండు దేశాలు కలిసే ఉన్నాయి. ప్రస్తుతం ఇరుగుపొరుగు దేశాలుగా ఉన్న మేం అన్ని సమస్యలను చర్చించి పరిష్కరించుకుంటామనే నమ్మకం ఉంది. ప్రధానిగా రెండోసారి ఎన్నికయ్యాక పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో ఫోన్లో మాట్లాడా. భారత్, పాకిస్తాన్‌లు పేదరికం, నిరక్షరాస్యత, అంటువ్యాధులతో పోరాటం సాగించాల్సి ఉంది. ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేద్దామని కోరా’ అని తెలిపారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘మోదీతో వాణిజ్యం, సైనిక అంశా లు సహా పలు విషయాలపై చర్చించాం. కశ్మీర్ సమస్యను రెండు దేశాలు సొంతంగానే పరిష్కరించుకుంటాయనే నమ్మకం ఉంది. ఇరు దేశాల నేతలతోనూ నాకు మంచి సంబంధాలున్నాయి. తమంతట తామే ఈ సమస్యను వారు పరిష్కరించుకుంటారని విశ్వసిస్తున్నా’ అని పేర్కొన్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఈ నెల 5వ తేదీన కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ కావడం ఇదే ప్రథమం. ఇద్దరు నేతలు ప్రధానంగా ఇంధనం, వాణిజ్యం అంశాలపైనే 40 నిమిషాల పాటు చర్చలు జరిపారని విదేశాంగ శాఖ తెలిపింది. ట్రంప్ తాజా వ్యాఖ్యలు కశ్మీర్‌పై అమెరికా విధానంలో వచ్చిన భారత్ అనుకూల మార్పుగా భావిస్తున్నారు. ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రధాని ప్రస్తావన ప్లాస్టిక్ వస్తువులను వాడి పారేసే విధానానికి స్వస్తి పలికేందుకు, నీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగం, పర్యావరణ పరరిక్షణ దిశగా భారత్ చేపడుతున్న చర్యలను జీ–7 భేటీలో మోదీ ప్రస్తావించారు. జీవ వైవిధ్యం దెబ్బతినకుండా భారత్ తీసుకుంటున్న చర్యలు, వాతావరణ మార్పులు, నీటి వనరులపై ఒత్తిడి, సముద్రాల్లో కాలుష్యం’ అంశాలపై మోదీ మాట్లాడారని విదేశాంగ శాఖ తెలిపింది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుని సమ్మిళిత, సాధికారికతల ద్వారా సామాజిక అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తున్నట్లు మోదీ తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, సహకారం, ఉగ్రవాదంపై పోరాటంపై చర్చించారు. కాగా, మూడు దేశాల పర్యటన ముగించుకుని మోదీ సోమవారం భారత్‌కు తిరుగుపయనమయ్యారు. మోదీ ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడతారు. కానీ..: ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతారనీ, కానీ, ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ఇష్టపడరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. జీ–7 భేటీ సందర్భంగా ఇరువురు నేతలు మీడియా ముందుకు వచ్చి, కరచాలనం అనంతరం కలిసి మాట్లాడారు. నేతలకు ప్రైవేట్‌గా మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా విలేకరులను కోరిన మోదీ వారు అడిగిన పలు ప్రశ్నలకు హిందీలో సమాధానాలు ఇచ్చారు. ‘ఆయన(మోదీ) వాస్తవానికి చాలా బాగా ఇంగ్లిష్ మాట్లాడగలరు. కానీ, ఆయనకు ఇంగ్లిష్ మాట్లాడటం ఇష్టం ఉండదు. మోదీతో సమావేశం గొప్ప విషయం. భారత్ గురించి చాలా విషయాలు తెలిశాయి’ అని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్, మోదీ ఒకరి చేతులు మరొకరు చేతులు పట్టుకుని ఉండగా సమావేశం జరుగుతున్న గదిలో ఉన్న నేతలంతా పెద్ద పెట్టున నవ్వారు. స్నేహితుడు ట్రంప్‌తో జరిపిన సమావేశం చాలా ముఖ్యమైందని మోదీ పేర్కొనడం గమనార్హం. ట్రంప్‌తో భేటీ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ -
థర్డ్‌పార్టీ తహతహ !
ఎవ్రీబడీ లవ్స్ ఎ గుడ్ డ్రాట్.. 90వ దశకం ప్రారంభంలో పలు రాష్ట్రాలను కుదిపేసిన కరువు రక్కసి పై ప్రముఖ జర్నలిస్టు సాయినాథ్ రాసిన వ్యాస సంకలనం పేరిది. ఇది ఆయనకు రామన్ మెగసెసే అవార్డును సంపాదించి పెట్టింది. ఏదైనా సమస్య కనిపిస్తే దాని సకల లక్షణాల పై సవాలక్ష తీర్పులిచ్చేయడానికి, వాస్తవ దూరమైన వ్యాఖ్యానాలు చేయడానికే అందరూ ఉబలాటపడతారు తప్ప సరైన పరిష్కారాల పై సర్కారు సహా ఎవరూ చేసిందేమీ లేదన్నది దాని సారాంశం. దశాబ్దాల తరబడి రావణ కాష్టంలా రగులుతున్న కాశ్మీర్ సమస్య విషయంలోనూ ఇదే జరుగుతోంది. కాశ్మీర్ పై అనేక దేశాలు... మరీ ముఖ్యంగా అగ్రదేశమైన అమెరికా అంతులేని ఆసక్తిని ప్రదర్శిస్తుంటుంది. వీలు చిక్కినప్పుడల్లా అందులో జోక్యం చేసుకోవడానికి తహతహలాడుతుంటుంది. అత్యుత్సాహానికి పెట్టింది పేరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కాశ్మీర్ విషయంలో తన సహజ లక్షణాన్ని తరచూ బయటపెట్టుకుంటున్నారు. వివాదాస్పదమైన కాశ్మీర్ సమస్యపై భారత్ – పాకిస్తాన్ ప్రధాన మంత్రులతో తాను మాట్లాడానని, అవసరమైతే ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమేనని తాజాగా ఆయన మరోమారు ప్రకటించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో ఇప్పటికే మాట్లాడేశానని, త్వరలో ఫ్రాన్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని కాశ్మీర్‌పై చర్చిస్తానని ట్రంప్ చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని తీరప్రాంత నగరం బియారిట్జ్‌లో జరగనున్న జీ 7 సదస్సు సందర్భంగా తాను మోదీని కలుస్తానని ఆయన అంటున్నారు. జీ7లో భారత్ సభ్యదేశం కాకపోయినా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు మోదీ హాజరవుతున్నారు. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు అర్ధమౌతోంది. వాస్తవానికి కాశ్మీర్లో ఏ చిన్న అలజడి కనిపించినా అమెరికా వెంటనే అలర్ట్ అయిపోతుంటుంది. మధ్యవర్తిగా జోక్యం చేసుకునేందుకు, పెద్ద మనిషి తరహాలో తీర్పులిచ్చేందుకు తహతహలాడుతుంటుంది. సరిగ్గా నెలరోజుల క్రితం కూడా అమెరికా అధ్యక్షుడు ఇలాంటి ప్రకటనే చేశారు. భారత ప్రధాని మోదీ అభ్యర్థిస్తే భారత్ – పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధమేనని అన్నారు. అమెరికా పర్యటిస్తున్న పాక్ ప్రధానిని కలుసుకున్న తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. దీని పై భారత్ నిరసన వ్యక్తం చేయడంతో కొద్ది రోజులకు ట్రంప్ తన స్వరం కొంచెం తగ్గించారు. ఉభయదేశాలు కోరుకుంటేనే కాశ్మీర్ విషయంలో తాను జోక్యం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. అయినా అమెరికా అధ్యక్షుడి వైఖరిలో మార్పు లేదని, అవకాశం కోసం.. అదును కోసం ఎదురుచూస్తున్నారని తాజా ప్రకటనతో తేటతెల్లం అవుతోంది. కాశ్మీర్ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారత్ అనుసరిస్తున్న విధానం. 370 అధికరణం రద్దు, కాశ్మీర్లో తాజా పరిణామాల నేపథ్యంలో మరోమారు తతీయపక్ష మధ్యవర్తిత్వం అంశం తెరపైకి వచ్చింది. కానీ భారత్ వైఖరికే రష్యా, బ్రిటన్ మద్దతు పలికాయి. కాశ్మీర్ సమస్యకు ద్వైపాక్షిక చర్చలే పరిష్కారమన్న తమ వైఖరిలో మార్పులేదని మోదీతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడితో పాకిస్తాన్ ప్రధానమంత్రి చర్చలు జరుపుతున్న సమయంలోనే పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ యెస్ లీడ్రియన్తో మాట్లాడి భంగపడ్డారు. ‘కాశ్మీర్ మీ రెండు దేశాల అంతర్గత సమస్య, దానిని చర్చల ద్వారా పరిష్కరించుకోండి’ అని ఫ్రెంచి విదేశాంగ మంత్రి స్పష్టం చేయడం పాక్‌కు చెంపపెట్టు వంటిదే. ఫ్రాన్స్ మాత్రమే కాదు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్‌కు ఇలాంటి షాకే ఇచ్చింది. 370 అధికరణం రద్దు అనేది భారత ప్రభుత్వ నిర్ణయం.. అది ఆ దేశ అంతర్గత సమస్య.. అందులో జోక్యం చేసుకోవడానికేమీ లేదు అని బంగ్లాదేశ్ స్పష్టం చేయడం పాక్‌కు అశనిపాతంలా తగిలింది. కాశ్మీర్ విషయంలో ట్రంప్ ఆత్రత వెనుక కారణాలు తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అటు పశ్చిమాసియాలో ప్రాబల్యాన్ని కాపాడుకోవడం, ఇటు భారత ఉపఖండాన్ని చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించడం అమెరికాకు చాలా అవసరం.. అమెరికా ‘పథకాలు’ నెరవేరాలంటే వ్యూహాత్మకంగానూ, భౌగోళికంగానూ అనుకూలంగా ఉన్న పాకిస్తాన్ చాలా కీలకం. అందుకే అది పాకిస్తాన్‌కు వంతపాడుతుంటుంది. 1962 చైనా – భారత్ యుద్ధ సమయంలో భారత్‌కు అమెరికా సహాయం చేసింది. విమానాలను, సైనిక సామగ్రిని అందించింది. అందుకు ప్రతిఫలంగా కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించేందుకు అంగీకరించాలని భారత్ పై వత్తిడి చేసిందంటే అమెరికా ఈ విషయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. 1962 నవంబర్ 21న చైనా యుద్ధం ముగియగానే భారత, పాక్ విదేశాంగ మంత్రుల సమక్షంలో 24 మంది అమెరికా అధికారులు ఆరు రౌండ్లు చర్చలు జరిపారు. అవి 1963 జనవరిలో అసంపూర్తిగా ముగిసాయి. ఆ తర్వాత ఇక అమెరికా జోక్యానికి భారత్ ఎన్నడూ ఒప్పుకోలేదు. తతీయపక్ష జోక్యానికి ఏ నాడూ తావివ్వలేదు. 1972లో బంగ్లా యుద్ధం తర్వాత కుదిరిన సిమ్లా ఒప్పందమైనా, 1999లో సంతకాలు జరిగిన లాహోర్ డిక్లరేషనైనా ద్వైపాక్షిక చర్చల పర్యవసానమే తప్ప ఎవరి జోక్యాన్నీ భారత్ అంగీకరించలేదు. 2003–2008 మధ్య నాలుగంచెల ఫార్ములాపై పలు సందర్భాలలో జరిగిన చర్చలు కూడా ద్వైపాక్షికమే తప్ప మరెవరి ప్రమేయమూ లేదు. అంతెందుకు నల్ల సూరీడు నెల్సన్ మండేలా, ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటానియో గుట్టెరాస్, నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్ సహా పలువురు అంతర్జాతీయ నాయకులు కాశ్మీర్ పై మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చినా భారత్ వైఖరిలో మార్పులేదు. ఇక ముందూ ఇదే కొనసాగుతుంది తప్ప ట్రంప్ తహతహలకు తాళం వేసే పరిస్థితి ఉండదనే చెప్పాలి. -
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి రెడీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాతపాటే పాడారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్–పాకిస్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఫ్రాన్స్‌లోని బియార్రిట్జ్‌లో ఈ వారాంతంలో జరిగే జీ7 సదస్సు సందర్భంగా కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని మోదీతో చర్చిస్తానని ట్రంప్ తెలిపారు. వాషింగ్టన్లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్, పాకిస్తాన్లతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు ప్రస్తుతం బాగోలేవు. కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దదేందుకు నా వల్ల వీలైనంతమేరకు ప్రయత్నిస్తాను. అవసరమైతే అందుకోసం మధ్యవర్తిత్వం చేస్తాను’ అని వెల్లడించారు. భారత్–పాక్‌ల మధ్య సంబంధాలు ప్రస్తుతం ఘోరంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. అలాగే జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(జమ్మూకశ్మీర్, లదాఖ్)గా విభజించింది. దీంతో భారత్–పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై ట్రంప్ ఈ మేరకు స్పష్టం చేశారు. కశ్మీర్ ద్వైపాక్షిక సమస్యనీ, ఇందులో మూడోపక్షం జోక్యాన్ని తాము సహించబోమని భారత్ ప్రకటించినప్పటికీ మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ చెప్పడం గమనార్హం. మరోవైపు తాలిబన్లతో చర్చలపై ట్రంప్ స్పందిస్తూ.. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు బలపడకుండా అమెరికా బలగాలు అక్కడే మరికొంతకాలం ఉంటాయని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం తాము తాలిబన్లతో చర్చలు జరుపుతున్నామనీ, గతంలో ఏ అధ్యక్షుడూ ఈ పనిని చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షికమే: బ్రిటన్ ప్రధాని లండన్: జమ్మూకశ్మీర్ అన్నది భారత్–పాకిస్తాన్ల ద్వైపాక్షిక సమస్య మాత్రమేనని బ్రిటన్ తెలిపింది. ఈ సమస్యను ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కశ్మీర్, ఉగ్రవాదం, లండన్‌లో భారత హైకమిషన్ దగ్గర విధ్వంసం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బోరిస్ మాట్లాడుతూ..‘కశ్మీర్ సమస్యను భారత్–పాక్‌ల ద్వైపాక్షిక సమస్యగానే బ్రిటన్ గుర్తిస్తోంది. దీన్ని ఇరుదేశాలు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. భారత్–బ్రిటన్లు తమ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరముంది’ అని తెలిపారు. ఉగ్రవాదమే పెనుముప్పు: మోదీ ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్‌తో పాటు యూరప్‌కు ప్రస్తుతం ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని తెలిపారు. ‘ఈ ఉగ్రభూతంపై పోరాడేందుకు మనం సమిష్టిగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే తీవ్రవాదం, హింస అసహనం పెచ్చరిల్లకుండా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్) వంటి ఉగ్రవాద సంస్థలు మన గడ్డపై అడుగుపెట్టకుండా నిలువరించగలం’ అని ప్రధాని తెలిపారు. ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సు సందర్భంగా మోదీ, బోరిస్ కలుసుకోనున్నారు. -
కశ్మీర్ పిక్చర్లో నాయక్ – ఖల్నాయక్
రావణ కాష్టంలా మండుతూనే ఉన్న కశ్మీర్ సమస్యకు...ఆర్టికల్ 370 రద్దు పరిష్కారం అవుతుందా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కాలమే..! అయితే 1949లో మొదలైన ఈ సమస్యలో కీలక పాత్ర ధారులు ఎవరు? ఆద్యుడు... రాజా హరిసింగ్! కశ్మీర్ సమస్యకు మూల పురుషుడు.. జమ్మూ కశ్మీర్ రాజ్యానికి చిట్టచివరి రాజు. 1895 సెప్టెంబరు 23న జమ్మూలోని అమర్ మహల్లో జన్మించిన రాజా హరిసింగ్... 1909లో తండ్రి రాజా అమర్ సింగ్ జమ్వాల్ మరణం తరువాత బ్రిటిష్ పాలకుల కనుసన్నల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అజ్మీర్‌లోని మేయో కాలేజీలో చదువు పూర్తయిన తరువాత డెహ్రాడూన్‌లోని ఇంపీరియల్ కేడెట్ కారŠప్స్‌లో మిలటరీ శిక్షణ పొందిన హరిసింగ్‌ను బాబాయి మహారాజా ప్రతాప్ సింగ్ 1915లో జమ్మూ కశ్మీర్ సైనికాధికారిగా నియమించారు. 1925లో గద్దెనెక్కిన రాజా హరిసింగ్.. తన రాజ్యంలో నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేశారు. బాల్యవివాహాలను రద్దు చేయడమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వారికీ పూజా మందిరాలు అందుబాటులో ఉండేలా చట్టాలు చేశారు. రాజకీయంగా తొలి నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన హరిసింగ్... మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ముస్లింలీగ్, దాని సభ్యులనూ పూర్తిగా వ్యతిరేకించారు. పష్తూన్ల దాడుల్లో కోల్పోయిన రాజ్యాన్ని మళ్లీ దక్కించుకునేందుకు భారత ప్రభుత్వంతో చేతులు కలిపిన హరిసింగ్ తన చివరి రోజులను ముంబైలో గడిపారు. 1961 ఏప్రిల్ 26న హరిసింగ్ మరణించగా వీలునామా ప్రకారం.. ఆయన అస్థికలను జమ్మూ ప్రాంతం మొత్తం చల్లడంతోపాటు తావీ నదిలో నిమజ్జనం చేశారు. తొలి నేత... షేక్ అబ్దుల్లా... కశ్మీరీల సమస్యలన్నింటికీ భూస్వామ్య వ్యవస్థ కారణమని నమ్మిన.. ప్రజాస్వామ్య వ్యవస్థతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన కశ్మీరీ నేత షేక్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూలకు మిత్రుడిగా మాత్రమే కాకుండా.. ఆ ప్రాంతంలో తొలి రాజకీయ పార్టీని స్థాపించిన వ్యక్తిగానూ షేక్ అబ్దుల్లాకు పేరుంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో విద్యనభ్యసించిన షేక్ అబ్దుల్లా 1932లో కశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్‌ను స్థాపించారు. తరువాతి కాలంలో ఈ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌గా మారింది. 1932 సమయంలోనే జమ్మూ కశ్మీర్‌కు ఒక అసెంబ్లీ ఏర్పాటైనప్పటికీ అధికారం మాత్రం రాజా హరిసింగ్ చేతుల్లోనే ఉండేది. రాజరికం తొలగిపోయిన తరువాత మూడుసార్లు ప్రభుత్వాన్ని నడిపిన అబ్దుల్లాను షేర్ –ఏ– కశ్మీర్‌గా పిలుస్తారు. కశ్మీర్ నుంచి రాజా హరిసింగ్ తొలగాలన్న డిమాండ్‌తో ఉద్యమం నడిపిన చరిత్ర కూడా ఈయనదే. 1953లో రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడన్న ఆరోపణలతో అబ్దుల్లాను 11 ఏళ్లపాటు జైల్లో పెట్టారు. ఆ తరువాత 1975లో భారత ప్రధాని ఇందిరాగాంధీతో కుదిరిన ఒప్పందంతో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. 1964లో కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలన్న లక్ష్యంతో పాకిస్తాన్‌కు వెళ్లిన అబ్దుల్లా అప్పటి ప్రధానితో చర్చలు జరిపారు. తొలి, చివరి ప్రెసిడెంట్... రాజా కరణ్ సింగ్... దేశంలో రాజభరణాలు, బిరుదులన్నింటినీ రద్దు చేసిన ఇందిరాగాంధీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజా కరణ్‌సింగ్. 1931 మార్చి తొమ్మిదిన ఫ్రాన్స్‌లోని కెయిన్స్‌లో జన్మించిన కరణ్‌సింగ్.. జమ్మూ కశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్ ఏకైక సంతానం. కవిగా, దాతగా మాత్రమే కాకుండా.. ప్రచ్ఛన్న యుద్ధ పరిసమాప్తి సమయంలో అమెరికాలో భారత రాయబారిగానూ పనిచేసిన ఘనత ఈయనది. 1949 అక్టోబరులో కశ్మీర్ రాజ్యం భారత ప్రభుత్వంలో విలీనమైన రోజు నుంచి 18 ఏళ్ల వయసులోనే జమ్మూకశ్మీర్ ప్రతినిధిగా నియమితుడైన కరణ్ సింగ్.. తరువాతి కాలంలో రాష్ట్ర తొలి, చివరి అధ్యక్షుడిగా, గవర్నర్‌గానూ వ్యవహరించారు. ఈ కాలంలోనే జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తూ భారత రాష్ట్రపతి పేరుతో అనేక ఉత్తర్వులు వెలువడ్డాయి. 1961 నుంచి తనకు అందుబాటులో ఉన్న రాజభరణాన్ని 1973లో స్వయంగా త్యజించిన వ్యక్తిగా కరణ్‌సింగ్‌కు పేరుంది. 1967–73 మధ్యకాలంలో కేంద్ర పర్యాటక, పౌర విమానయాన శాఖల మంత్రిగా పనిచేశారు. 1984 వరకూ పలు దఫాలు లోక్‌సభకు ఎన్నికైన కరణ్‌సింగ్ వైద్య ఆరోగ్యం, విద్య, సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేశారు. 1971 పాకిస్తాన్ యుద్ధం సమయంలో తూర్పు దేశాలకు భారత ఉద్దేశాలను వివరించే దూతగానూ పనిచేశారు. 1999 వరకూ నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున, ఆ తరువాత 2018 వరకూ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. అతివాది... యాసిన్ మాలిక్... జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అనే వేర్పాటువాద సంస్థ స్థాపకుడు యాసిన్ మాలిక్. భారత్, పాకిస్తాన్ రెండింటి నుంచి కశ్మీర్ వేరుపడాలన్నది ఈయన సిద్ధాంతం. 1966లో శ్రీనగర్‌లో జన్మించిన యాసిన్ తన సిద్ధాంతం కోసం తుపాకులు పట్టాడు కూడా. అయితే 1994 తరువాత ఈయన తీవ్రవాదాన్ని విడిచిపెట్టడమే కాకుండా... శాంతియుత మార్గాల ద్వారా మాత్రమే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రచారం చేశారు. 1987 అసెంబ్లీ ఎన్నికల్లో ఇస్లామిక్ స్టూడెంట్స్ లీగ్ అధ్యక్షుడిగా యాసిన్ మాలిక్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్‌కు ప్రచారం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ కండబలాన్ని ఎదుర్కొనేందుకు మాలిక్ ఉపయోగపడ్డారని విశ్లేషకులు అంటారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడటమే కశ్మీర్లో చొరబాట్ల సమస్యకు కారణమైందన్న విశ్లేషకుల అంచనాలను అంగీకరించని మాలిక్ రిగ్గింగ్ అంతకుమునుపు కూడా ఉందని అంటారు. 2007లో సఫర్ ఏ ఆజాదీ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసిన యాసిన్ మాలిక్ కశ్మీర్ సమస్య పరిష్కారం పేరుతో తరచూ పాకిస్తాన్ ప్రధానితో సమావేశం కావడం, చర్చలు జరపడం భారతీయుల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. 2013లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌తో కలిసి యాసిన్ మాలిక్ ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొనడం దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది. స్వతంత్రవాది ఒమర్ ఫారూఖ్... జమ్మూకశ్మీర్‌పై భిన్నాభిప్రాయం కలిగినవారిలో మిర్వాయిజ్ ఒమర్ ఫారూఖ్ ఒకరు. జమ్మూ కాశ్మీర్ భారత్ నుంచి వేరు పడాలని, స్వతంత్రంగా ఉండాలన్న భావజాలం కలిగిన హురియత్ కాన్ఫరెన్స్ సభ్యత్వమున్న పార్టీల్లో మిర్వాయిజ్ పార్టీ అవామీ యాక్షన్ కమిటీ కూడా ఒకటి. 2003లో హురియత్ కాన్ఫరెన్స్ రెండుగా చీలిపోగా మిర్వాయిజ్ నేతృత్వంలోని వర్గానికి మితవాద వర్గమని పేరు. కశ్మీర్ రాజకీయాల్లోకి రాకమునుపు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనుకన్న మిర్వాయిజ్ ఆ తరువాతి కాలంలో ఇస్లామిక్ స్టడీస్‌లో స్నాతకోత్తర విద్యతోపాటు పీహెచ్డీ కూడా చేశారు. జమ్మూ కశ్మీర్లో తొలి రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన ముస్లిం కాన్ఫరెన్స్ తొలి అధ్యక్షుడు మిర్వాయిజ్ తాత. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికల్లో తరచూ లేవనెత్తే మిర్వాయిజ్ భారత్, పాకిస్థాన్‌ల మధ్య చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుం దని నమ్మేవారిలో ఒకరు. అయితే ఇరుపక్షాలు ప్రజల ఆశయాలను కూడా అర్థం చేసుకోవాలని అంటారాయన. ఉగ్రవాదానికి బీజం... గిలానీ... కశ్మీర్ సమస్యకు బీజం పడిన సమయం నుంచి జీవించి ఉన్న అతికొద్ది మంది రాజకీయ నేతల్లో సయ్యద్ అలీ షా గిలానీ ఒకరు. 1929 సెప్టెంబరు 29న బండిపొరలో జన్మించిన గిలానీ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్‌కు అధ్యక్షుడిగా చాలాకాలం పనిచేశారు. కశ్మీర్లో ఉగ్రవాదానికి బీజం పడింది గిలానీ విధానాల కారణంగానే అని కొంతమంది నేతలు ఆరోపిస్తారు. హురియత్ కాన్ఫరెన్స్ రెండు భాగాలుగా విడిపోయిన తరువాత తెహ్రీక్ ఏ హురియత్ పేరుతో మరో పార్టీని స్థాపించిన గిలానీ ఉగ్రవాదుల మరణాలకు నిరసనగా తరచూ కశ్మీర్లో బంద్‌లు, రాస్తారోకోలకు పిలుపునిచ్చేవారు కశ్మీర్ సమస్యకు స్వాతంత్య్రం ఒక్కటే పరిష్కారమన్న అంశంపై ఒక సదస్సు నిర్వహించినందుకుగాను.. .2010లో భారత ప్రభుత్వం గిలానీతోపాటు రచయిత్రి అరుంధతీ రాయ్, మావోయిస్టు సానుభూతిపరుడు వరవర రావులపై భారత ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేసింది. 2016లో బుర్హాన్ వానీ మరణం తరువాత ఏర్పడ్డ పరిస్థితుల్లో కశ్మీర్లో సాధారణ స్థితిని తీసుకొచ్చేందుకని గిలానీ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై గిలానీ పాస్‌పోర్టును 1981లోనే రద్దు చేశారు. అయితే 2006లో మూత్రనాళ కేన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ కావడంతో చికిత్స కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గిలానీకి మళ్లీ పాస్‌పోర్టు దక్కేలా చేశారు. -
ఆవిర్భావం నుంచి రద్దు వరకు..
ఆవిర్భావం నుంచి కశ్మీర్ సమస్యలకు, వివాదాలకు నిలయంగా మారింది. నాటి నుంచి కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు వరకు పరిణామాలు... ► 1846: ఆంగ్లేయులకు సిక్కులకు మధ్య జరిగిన మొదటి యుద్ధం దరిమిలా జమ్మూ పాలకుడు రాజా గులాబ్ సింగ్‌కు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి మధ్య కుదిరిన ఒప్పందం (అమృతసర్ ఒప్పందం) మేరకు మార్చి 16న జమ్మూకశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ► 1946, మే: మహారాజుకు వ్యతిరేకంగా షేక్ అబ్దుల్లా క్విట్ కశ్మీర్ ఉద్యమాన్ని ప్రారంభించారు. అరెస్టయిన అబ్దుల్లాను కాపాడేందుకు నెహ్రూ విఫలయత్నం చేశారు. ► 1946, జులై: బయటివారి ప్రమేయం అవసరం లేకుండా కశ్మీరీలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకుంటారని రాజా హరిసింగ్ ప్రకటించారు. ► 1947, జూన్3: భారత దేశాన్ని భారత్, పాకిస్తాన్‌లుగా విభజించాలని మౌంట్ బాటెన్ ప్రతిపాదించారు ► 1947, జూన్19: కశ్మీర్‌ను భారత్‌లోనో లేదా పాకిస్తాన్లోనో విలీనం చేసేలా హరిసింగ్‌ను ఒప్పించడం కోసం మౌంట్‌బాటెన్ ఐదు రోజులు కశ్మీర్లో ఉన్నారు ► 1947, జులై: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆహ్వానం మేరకు రాజా హరిసింగ్ ఢిల్లీ వచ్చి గోపాల్ దాస్‌తో చర్చలు జరిపారు. ► 1947, జులై 11: కశ్మీర్ స్వతంత్రం కోరుకుంటే పాకిస్తాన్ దానితో స్నేహం చేస్తుందని మహ్మద్ అలీ జిన్నా ప్రకటించారు ► 1947, ఆగస్టు1: మహాత్మాగాంధీ హరిసింగ్‌ను కలిసి ప్రజాభీష్టం మేరకు విలీనంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ► 1947, సెప్టెంబర్22: పాకిస్తాన్లో విలీనానికి సానుకూలత తెలుపుతూ ముస్లిం కాన్ఫరెన్స్ నిర్ణయం తీసుకుంది.అయితే, భారత్‌లో విలీనం కావాలని మహారాజు నిర్ణయించారని పాకిస్తాన్ టైమ్స్ పేర్కొంది. ► 1947, అక్టోబర్: భారత్–పాక్ యుద్ధం. పాక్ వాయవ్య రాష్ట్రానికి చెందిన వేల మంది గిరిజనులు కశ్మీర్‌పై, రాజ హరిసింగ్ సైన్యంపై దాడికి దిగారు. హరిసింగ్ భారత్ సహాయం కోరారు. దానికి భారత్ పెట్టిన షరతుకు హరిసింగ్ అంగీకరించారు. ఇరు పక్షాలు విలీన ఒప్పందంపై సంతకం చేశాయి.భారత సైన్యం కశ్మీర్‌ను రక్షించింది. కశ్మీర్ విషయమై జరిగిన మొదటి యుద్ధమిది. ► 1948: కశ్మీర్ సమస్యను భారత దేశం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ముందుకు తీసుకెళ్లింది.కాల్పుల విరమణ, కశ్మీర్ భవిష్యత్తుపై ప్రజాభిప్రాయ సేకరణ వంటి అంశాలతో తీర్మానం కుదిరింది. ► 1949, జనవరి1: భారత్,పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. కశ్మీర్లో కొంత భాగం పాక్‌కు వెళ్లిపోయింది. ► 1949: జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో భాగం చేయాలంటూ కశ్మీర్ అసెంబ్లీ ఉద్యమం చేపట్టింది. ► 1949, జూన్: మమారాజా హరిసింగ్ తన కుమారుడు కరణ్ సింగ్‌ను రాజప్రతినిధిగా నియమించి తాను వైదొలిగారు. ► 1949, అక్టోబరు 17: కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగసభ రాజ్యంగంలో 370 అధికరణను చేర్చింది. ► 1951, నవంబర్: రాజా హరిసింగ్ అధికారాలను రద్దు చేస్తూ, శాసన సభను ప్రభుత్వానికి జవాబుదారీ చేస్తూ రాజ్యాంగ సభ చట్టం చేసింది. ► 1957: జమ్మూకశ్మీర్ భారత్‌లో భాగమని, ఈ విషయమై ప్రజాభిప్రాయ సేకరణ జరిపే ప్రసక్తే లేదని భారత హోం మంత్రి గోవింద్ వల్లభ్ పంత్ స్పష్టం చేశారు. ► 1965: కశ్మీర్ విషయమై భారత్, పాక్ మళ్లీ తలపడ్డాయి. ► 1966, జనవరి 10: రష్యా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు 1965కు ముందున్న స్థానాలకు వెళ్లిపోవాలంటూ రూపొందించిన తాష్కెంట్ ఒప్పందంపై భారత్, పాక్‌లు సంతకాలు చేశాయి. ► 1989: అఫ్గానిస్తాన్ నుంచి వేలమంది మిలిటెంట్లు కశ్మీర్లోకి ప్రవేశించారు. పాకిస్తాన్ వారికి అవసరమైన శిక్షణ, ఆయుధాలు అందజేసింది ► 1989: కశ్మీర్ నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు (కశ్మీరీ పండిట్లు) ఇతర ప్రాంతాలకు వలసపోసాగారు. ► 1972: భారత్, పాకిస్తాన్ల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. దీనికి అనుగుణంగా పాక్ ఆక్రమిత కశ్మీర్, కశ్మీర్‌ల మధ్య నియంత్రణ రేఖ(ఎల్వోసీ) రూపుదిద్దుకుంది. ► 1999: పాకిస్తాన్ మద్దతుతో మిలిటెంట్లు కశ్మీర్ సరిహద్దు దాటి కార్గిల్‌లో భారత సైనిక స్థావరాలను చట్టుముట్టారు. పది వారాల పాటు జరిగిన యుద్ధంలో భారత బలగాలను దురాక్రమణదారులను తిప్పికొట్టాయి. ► 2013, ఫిబ్రవరి: భారత పార్లమెంటుపై దాడి కేసులో జైషే మహ్మద్ నేత అఫ్జల్ గురును ప్రభుత్వం ఉరితీసింది. ► 2015, మార్చి: భారతీయ జనతాపార్టీ మొదటి సారి కశ్మీర్లో పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ► 2016: భారత సైనిక స్థావరాలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది ► 2019: పుల్వామా వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో40 మంది భారత సైనికులు అమరులయ్యారు.దానికి ప్రతిగా భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై మెరుపుదాడులు జరిపింది. ► 2019, ఆగస్టు2: ప్రభుత్వం అమర్నాథ్ యాత్రను రద్దు చేసింది. యాత్రికులు స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశం. ► 2019, ఆగస్టు 3: కశ్మీర్‌లోని పర్యాటకులు, యాత్రికులు, ఇతర రాష్ట్రాల విద్యార్థులను స్వస్థలాలకు తరలించారు. ► 2019, ఆగస్టు 4: మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితన ఉన్నత భద్రతాధికారులతో చర్చలు జరిపారు. ► 2019, ఆగస్టు 5: కశ్మీర్‌కు ప్రత్యేక హోదానిస్తున్న 370 అధికరణను కేంద్రం రద్దు చేసింది. -
హఠాత్ నిర్ణయాలు!
కశ్మీర్‌కు భారీయెత్తున భద్రతా బలగాల తరలింపు, అక్కడ నిట్‌తోసహా విద్యా సంస్థలన్నిటికీ సెలవులు, అమర్నాథ్ యాత్ర అర్ధాంతరంగా నిలుపుదల, శ్రీనగర్‌లో నిరవధిక కర్ఫ్యూ వగైరా నిర్ణ యాలతో నాలుగైదు రోజులుగా అందరిలోనూ ఉత్కంఠ రేపి, రకరకాల ఊహాగానాలకు తావిచ్చిన కేంద్ర ప్రభుత్వం సోమవారం చకచకా పావులు కదిపింది. జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి నిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే అందుకు సంబంధించిన బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టి దాని ఆమోదాన్ని పొందింది. పర్యవసానంగా ఆ రాష్ట్రంలో స్థిరాస్తుల కొనుగోలు అధికారం స్థానికులకు మాత్రమే పరిమితం చేసే 35ఏ అధికరణ కూడా రద్దవుతుంది. ... జమ్మూ–కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేసి దాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టే కశ్మీర్ పునర్విభజన బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు చట్టమైతే జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా... లడఖ్ చట్టసభ రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా మారతాయి. ఈ బిల్లులు మంగళవారం లోక్‌సభ ముందుకొస్తాయి. జనసంఘ్‌గా ఉన్నప్పటినుంచీ బీజేపీకి 370, 35ఏ అధికరణల విషయంలో ఉన్న అభిప్రాయాలు ఎవరికీ తెలియనివి కాదు. తమకు సొంతంగా మెజా రిటీ లభిస్తే వాటిని రద్దు చేస్తామని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసే మేనిఫెస్టోల్లో ఆ పార్టీ హామీ ఇస్తూనే ఉంది. కానీ 2014 ఎన్నికల మేనిఫెస్టో ఆ అధికరణల రద్దుపై సంబంధిత పక్షాలతో చర్చించి ఒప్పిస్తామని తెలిపింది. ఎన్నికలయ్యాక 2015లో పీడీపీతో కలిసి జమ్మూ– కశ్మీర్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కుదిరిన ఉమ్మడి ఎజెండా స్వయంప్రతిపత్తి అంశంలో యథాతథ స్థితిని కొనసాగిస్తామని తెలియజేసింది. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల మేని ఫెస్టోలో మాత్రం స్వరం మారింది. వీటిని రద్దు చేస్తామని నిర్ద్వంద్వంగా చెప్పింది. ఎవరితోనూ సంప్రదించలేదన్న విమర్శలకు జవాబుగా బీజేపీ ఇప్పుడు ఈ మేనిఫెస్టోనే ఉదహరిస్తోంది. జమ్మూ–కశ్మీర్ పునర్విభజన బిల్లు అసాధారణమైనది. ఇంతవరకూ కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్ర ప్రతిపత్తినిచ్చిన సందర్భాలున్నాయి. కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించిన సందర్భాలున్నాయి. కానీ రాష్ట్ర హోదా గల ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారడం ఇదే తొలిసారి. పరిస్థితులు కుదుటపడితే జమ్మూ– కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తిని ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. అది ఎంతవరకూ సాధ్యమో మున్ముందు చూడాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రాల సంఖ్య 29కి పెరగ్గా, అది ఇప్పుడు మళ్లీ 28కి తగ్గింది. ఇతర సంస్థానాల విలీనానికీ, జమ్మూ–కశ్మీర్ విలీనానికీ మధ్య మౌలికంగా వ్యత్యా సాలున్నాయి. ఇతర సంస్థానాలు కొద్దికాలంలోనే దేశంలో విడదీయరాని భాగంగా మారాయి. కానీ జమ్మూ–కశ్మీర్‌కు అప్పుడు పాలకుడుగా ఉన్న హరిసింగ్‌తో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా రాజ్యాంగంలో మొదట 370 అధికరణ, ఆ తర్వాత 35 ఏ అధికరణ వచ్చిచేరాయి. విదేశీ వ్యవ హారాలు, రక్షణ, కమ్యూనికేషన్లు మినహా ఇతర అంశాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం ఉంటే తప్ప జమ్మూ–కశ్మీర్ ప్రాంతంలో కేంద్ర చట్టాలేవీ అమలుకాబోవని 370 అధికరణ చెబుతోంది. అయితే 35ఏ అధికరణ విషయంలో ఆదినుంచీ వివాదం ఉంది. ఇది 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో భాగమైంది. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని సవరించి చేర్చాల్సిన అధికరణను ఇలా దొడ్డిదోవన తీసుకురావడమేమిటని అప్ప ట్లోనే జనసంఘ్ నేతలు నిలదీశారు. దీని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై 2015లో జమ్మూ–కశ్మీర్ హైకోర్టు తీర్పునిస్తూ 35ఏను సవరణగా కాక 370 అధికరణకు వివరణగా లేదా అనుబంధంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లోఉంది. అయితే 370 అధికరణ స్వభావరీత్యా తాత్కాలికమైనదే నన్న పిటిషన్‌ను 2016లో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అందులోని సబ్ క్లాజ్ 3లోనే అందుకు సంబంధించిన మెలిక ఉన్నదని తెలిపింది. రాష్ట్ర రాజ్యాంగ సభ సిఫార్సుతో రాష్ట్రపతి నోటిఫికేషన్ వెలువరించినప్పుడు మాత్రమే 370 రద్దవుతుందని ఆ క్లాజు చెబుతోంది. ఇప్పుడు రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారానే అది రద్దయింది. కానీ అసెంబ్లీ సస్పెన్షన్‌లో ఉన్న ప్రస్తుత సమయంలో దాని సిఫార్సు లేకుండా తీసుకున్న ఈ చర్య చెల్లుతుందా అన్నది సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది. అయితే జమ్మూ–కశ్మీర్ మొదటినుంచీ కల్లోలంగా ఉండటం, అది ఉన్నకొద్దీ ఉగ్రరూపం దాలుస్తుండటం వాస్తవం. 2014లో అక్కడ ఉగ్రవాద ఘటనలు 222 జరిగితే నిరుడు అది 614కు చేరుకుంది. అప్పట్లో ఉగ్రవాదం కారణంగా భద్రతా దళాలకు చెందినవారు 47మంది మరణిస్తే, నిరుడు ఆ సంఖ్య 91కి చేరుకుంది. మత ఛాందసవాదుల ఆధిపత్యం గతంతో పోలిస్తే పెరిగింది. ఇప్పుడు 370 రద్దును గట్టిగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కూడా పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణమే. తన సుదీర్ఘపాలనా కాలంలో అది జమ్మూ–కశ్మీర్లో శాంతి నెలకొనడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. దానికితోడు ఇప్పటికే అక్కడున్న పాక్ అనుకూల ఉగ్రవాద ముఠాలకు తోడు ఇతర ఇస్లామిక్ దేశాల మిలిటెంట్ల జాడలు కూడా కనబడుతున్నాయి. ఈ దశలో నిర్ణయాత్మకంగా వ్యవహరించకపోతే మున్ముందు పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఆందోళన కేంద్రానికి ఉన్నట్టు కనబడుతోంది. తాజా నిర్ణయాల విషయంలో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటివారిని సంప్రదిస్తే బాగుండేది. భారత్‌లో కశ్మీర్ విడదీయరాని భాగమని వారు దృఢంగా విశ్వసిస్తున్నవారే. ఏదేమైనా జమ్మూ–కశ్మీర్లో సాధ్యమైనంత త్వరగా సామరస్యం నెలకొనాలని, అది నిజమైన భూలోక స్వర్గంగా కాంతులీనాలని దేశ ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. -
కశ్మీర్లో టెన్షన్.. టెన్షన్!
శ్రీనగర్/జమ్మూ/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం ఆదివారం నాటికి మరింత ముదిరింది. ఉగ్రవాదులు దాడిచేయొచ్చన్న వార్తల నేపథ్యంలో శ్రీనగర్‌ను వీడాలని రాష్ట్ర క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్‌ను అధికారులు ఆదేశించారు. అదే సమయంలో జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో సమావేశమైన అఖిలపక్ష నేతలు పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్లకు విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం చేసేందుకు ఇదే సరైన సమయమని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ కశ్మీర్‌పై ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలుచెప్పాయి. కలసికట్టుగా పోరాడుతాం: అఖిలపక్షం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటిలో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అధ్యక్షతన ఈ సమావేశానికి కాంగ్రెస్, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జేఅండ్‌కే మూవ్మెంట్, ఎన్సీ, సీపీఎం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అనిశ్చితిని రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు వివరించేందుకు వీలుగా ఓ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపాలని నేతలు నిర్ణయించారు. ఈ విషయమై ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ నిబంధనల్ని కాపాడేందుకు, రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలన్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా పోరాడాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించాం. ఆర్టికల్ 35 ఏ, ఆర్టికల్ 370లను రాజ్యాంగవిరుద్ధంగా రద్దుచేయడమంటే జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రజలపై దాడిచేయడమే. ఈ విషయంలో పరిస్థితులు మరింత దిగజారేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాం’ అని చెప్పారు. మరోవైపు పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నోటీసులు జారీచేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జమ్మూకశ్మీర్ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎవరి పేరునైనా మౌఖికంగా లేదా ఇతర మార్గాల్లో సిఫార్సు చేశారో, లేదో చెప్పాలని కోరింది. దీంతో ప్రజల్ని ఏకంచేయకుండా ప్రధాన రాజకీయ నేతల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారనీ, ఇలాంటి ప్రయత్నాలు ఫలించబోవని ముఫ్తీ స్పష్టంచేశారు. మరోవైపు రాష్ట్రంలో కర్ఫ్యూ విధించనున్న నేపథ్యంలో మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఇంట్లోంచి బయటకు రాకూడదని పోలీసులు ఆదేశించారు. కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎంవై తరిగామిలను అరెస్ట్ చేశారు. జమ్మూలోనూ బలగాల మోహరింపు.. జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాల మోహరింపుతో ఏర్పడిన అనిశ్చితి కొనసాగుతోంది. ఉగ్రముప్పు నేపథ్యంలో కశ్మీర్‌లోని ఆర్మీ స్థావరాలు, పోలీస్ ప్రధాన కార్యాలయం, విమానాశ్రయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను ఆదివారం కట్టుదిట్టం చేశారు. అలాగే జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో ముందు జాగ్రత్తగా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను భారీగా మోహరించారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్‌ను రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. కశ్మీర్లో పరిస్థితులు మరింత దిగజారవచ్చన్న భయంతో స్థానికులు నిత్యావసర సరుకులు, పెట్రోల్ కొనేందుకు షాపుల ముందు భారీ సంఖ్యలో బారులుతీరారు. మరోవైపు పుల్వామా తరహాలో ఉగ్రవాదులు వాహనాలతో ఆత్మాహుతిదాడికి పాల్పడకుండా ఉండేందుకు భద్రతాబలగాలు రోడ్లపై చాలాచోట్ల బారికేడ్లను ఏర్పాటుచేశాయి. యాజమాన్యం ఆదేశాలతో నిట్–శ్రీనగర్ విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారు. అమిత్ షా–దోవల్ కీలక భేటీ.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్లో నెలకొన్న అనిశ్చితి, భారత్‌లో చొరబాటుకు యత్నించిన 5–7 మంది పాక్ బ్యాట్ కమాండోలను ఆర్మీ హతమార్చడం తదితర అంశాలపై దాదాపు గంటపాటు చర్చలుజరిపారు. మరోవైపు జమ్మూ, ఉధమ్‌పూర్, కర్తా ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లలో రాబోయే 48 గంటలపాటు టికెట్ల తనిఖీ చేయబోమని రైల్వేశాఖ ప్రకటించింది. భారీ సంఖ్యలో ఉన్న అమర్నాథ్ యాత్రికులు రిజర్వేషన్ లేకపోయినా ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని వీడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అధికారులు, వైద్య సిబ్బంది సెలవులపై వెళ్లరాదనీ, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయరాదని కార్గిల్ కలెక్టర్ ఆదేశించారు. దీటుగా బదులిస్తాం: పాక్ భారత్ ఎలాంటి దుస్సాహసానికి, దురాక్రమణకు పాల్పడినా దీటుగా బదులిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. కశ్మీరీలకు తమ దౌత్య, నైతిక, రాజకీయ మద్దతును కొనసాగిస్తామని ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశానికి రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్, విదేశాంగమంత్రి ఖురేషీ, త్రివిధ దళాధిపతులు, ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం పాక్ స్పందిస్తూ..‘భారత్ చర్యల కారణంగా ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి విఘాతం కలుగుతుంది. కశ్మీర్ అన్నది సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యే. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దీన్ని పరిష్కరించాలని భారత్‌ను కోరుతున్నాం. తాజాగా బలగాల మోహరింపుతో కశ్మీర్లో పరిస్థితి అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది’ అని హెచ్చరించింది. ట్రంప్ కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని చెప్పారనీ, అందుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. జమ్మూలో హైదరాబాద్ రైలు ఎక్కుతున్న విద్యార్థులు -
ట్రంప్‌తో భేటీలో కశ్మీర్ ప్రస్తావనే లేదు
న్యూఢిల్లీ: జపాన్‌లో జరిగిన జీ–20 సమావేశాల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ అయినప్పుడు కశ్మీర్ ప్రస్తావనే రాలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. కశ్మీర్ వివాదంపై భారత్, పాక్‌ల మధ్యలోకి మూడో దేశం మధ్యవర్తిత్వం కుదరదని ఆయన తెలిపారు. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం చేయాల్సిందిగా మోదీ తనను కోరారంటూ సోమవారం ట్రంప్ చెప్పడంతో దేశంలో రాజకీయ దుమారం రేగడం తెలిసిందే. ఈ విషయంపై స్వయంగా మోదీనే సమాధానం చెప్పాలని ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు డిమాండ్ చేస్తూ బుధవారం లోక్‌సభలో ఆందోళనలు చేపట్టాయి. దీంతో ఆ విషయంపై చర్చించేందుకు స్పీకర్ ఓం బిర్లా సమయం ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం, వారికి సమాధానం చెప్పేందుకు లోక్‌సభ ఉప నాయకుడు రాజ్‌నాథ్ సింగ్ లేచిన వెంటనే విపక్షం మళ్లీ ఆందోళనకు సిద్ధమైంది. మోదీనే వచ్చి రెండు సభల్లోనూ సమాధానం చెప్పాలంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం రాజ్‌నాథ్ మాట్లాడుతూ కశ్మీర్ దేశానికి గర్వకారణమనీ, ఈ విషయంలో మధ్యవర్తిత్వానికి అవకాశమే లేదని చెప్పారు. ట్రంప్‌తో భేటీలో మోదీ అస్సలు కశ్మీర్ గురించి మాట్లాడిందే లేదనీ, ఇక మధ్యవర్తిత్వం ప్రస్తావన ఎక్కడినుంచి వస్తుందని ఆయన ప్రశ్నించారు. -
‘భారత్-పాక్ ఈ అవకాశాన్ని వాడుకోవాలి’
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు ప్రతిపక్షాలన్ని ఈ విషయంలో మోదీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. భారత్, పాక్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ముఫ్తీ కోరారు. ఈ సందర్భంగా ముఫ్తీ.. ‘జమ్మూకశ్మీర్ అంశంలో మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించదని తెలుసు. అయితే ట్రంప్ చేసిన ప్రకటన భారీ మార్పులను సూచిస్తోంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో అమెరికాకు గొప్ప రికార్డేం లేదు. కానీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను రెండు దేశాలు సీరియస్‌గా తీసుకుంటే బాగుంటుంది. చర్చల ద్వారా శాంతి స్థాపనకు ఇది మంచి అవకాశం. ఇరు దేశాలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది’ అంటూ ముఫ్తీ ట్వీట్ చేశారు. Despite GOI refuting idea of third party mediation on J&K, the disclosure made by Trump marks a huge policy shift. Even though USA doesn’t hold a great record in resolving protracted conflicts, hope both countries seize this opportunity to forge peace through dialogue. — Mehbooba Mufti (@MehboobaMufti) July 23, 2019 కశ్మీర్ విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్విటర్ వేదికగా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మోదీ.. ట్రంప్‌ను కోరలేదని స్పష్టం చేశారు. కశ్మీర్ సమస్య రెండు దేశాలకు సంబంధించిందని, ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని భారత్ చాన్నాళ్లుగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
ట్రంప్ వాఖ్యలపై పార్లమెంట్లో దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్ పరిష్కారంపై మధ్యవర్తిత్వం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం రేగింది. కశ్మీర్ విషయంలో ట్రంప్‌తో ఏం చర్చించారో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్, ఇత ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దేశ అంతర్గత విషయంలో జోక్యం చేసుకొమ్మని ఎలా అడుతుతారని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్ ఉభయ సభలలో వాయిదా తీర్మానం ఇచ్చాయి. లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ మాట్లాడుతూ.. అమెరికా ముందు భారత్ దాసోహం అయ్యిందన్నారు. మనం బలహీనులం కాదు, దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని మోదీ కోరలేదని రాజ్యసభలో కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. (చదవండి : కశ్మీర్‌పై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన భారత్) -
కశ్మీర్‌పై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన భారత్
న్యూఢిల్లీ : కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్విటర్ వేదికగా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మోదీ.. ట్రంప్‌ను కోరలేదని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో ట్రంప్ సోమవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘రెండు వారాల క్రితం మోదీతో సమావేశమైనప్పుడు.. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఆయన నన్ను కోరారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలని భారత్, పాక్‌లు కోరుకుంటున్నాయి. ఈ విషయంలో ఇరు దేశాలు కోరితే తన వంతుగా మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నాన’ని పేర్కొన్నారు. అక్కడే ఉన్న ఇమ్రాన్ ట్రంప్ ప్రతిపాదనను స్వాగతించారు. ట్రంప్ మధ్యవర్తిత్వం తమకు ఇష్టమేనని ఆయన తెలిపారు. అయితే రవీశ్ కుమార్ స్పందిస్తూ.. ‘కశ్మీర్ సమస్యపై భారత్, పాక్‌లు కోరితే మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ చేసిన వ్యాఖ్యాలను చూశాం. కానీ ప్రధాని మోదీ అలా ఎప్పుడూ ట్రంప్‌ను కోరలేదు. కశ్మీర్ అనేది భారత్‌కు సుస్థిరమైన స్థానం. రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలపై కేవలం ద్వైపాక్షికంగానే చర్చలు జరుపుతాం. ఈ విధమైన చర్చలు జరపాలంటే సరిహద్దుల్లో ఉగ్రవాదానికి పాక్ ముగింపు పలకాలి. షిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ కూడా ఇరు దేశాల మధ్య సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కారించుకోవాలని సూచిస్తున్నాయ’ని గుర్తుచేశారు. కశ్మీర్ సమస్య రెండు దేశాలకు సంబంధించిందని, ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని భారత్ చాన్నాళ్లుగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ...that all outstanding issues with Pakistan are discussed only bilaterally. Any engagement with Pakistan would require an end to cross border terrorism. The Shimla Agreement & the Lahore Declaration provide the basis to resolve all issues between India & Pakistan bilaterally.2/2 — Raveesh Kumar (@MEAIndia) July 22, 2019 -
బీజేపీ గెలిస్తే చర్చలకు అవకాశం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్‌తో శాంతి చర్చలకు, కశ్మీర్ సమస్య పరిష్కారానికి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో ఎక్కువ అవకాశాలున్నాయని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. బుధవారం కొందరు జర్నలిస్టులతో ఇమ్రాన్ మాట్లాడారు. ‘బీజేపీ మళ్లీ గెలిస్తే, కశ్మీర్ వివాదంపై ఒక పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఇతర పార్టీలు గెలిస్తే హిందుత్వ వాదుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ఈ వివాదం పరిష్కారానికి వెనుకంజవేస్తాయి’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే జైషే మొహమ్మద్ సహా దేశంలోని అన్ని ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ‘జైషే మొహమ్మద్ తదితర సంస్థలకు చెందిన ఉగ్రవాదులను నిరాయుధులను చేశాం. ఈ సంస్థల యాజమాన్యంలో ఉన్న పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది’ అని వివరించారు. ఉగ్ర సంస్థల విషయంలో అంతర్జాతీయ సమాజం వైఖరికి భిన్నంగా పాక్ నడుస్తోందన్న వాదనను ఇమ్రాన్ కొట్టిపారేశారు. బీజేపీకి ఓటు.. పాక్‌కు వేసినట్లే ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీ, ఇమ్రాన్‌తో కుమ్మక్కయ్యారని స్పష్టమవుతోందని ఆ పార్టీ నేత రణ్‌దీప్ సూర్జేవాలా పేర్కొన్నారు. ‘పాక్ అధికారికంగా మోదీతో జట్టుకట్టింది. మోదీకి ఓటేస్తే పాకిస్తాన్‌కు ఓటేసినట్లే’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘మోదీ జీ అప్పట్లో నవాజ్ షరీఫ్‌తో సన్నిహితంగా ఉన్నారు. తాజాగా ఇమ్రాన్‌ఖాన్ దగ్గరి స్నేహితుడయ్యారు’ అని వ్యాఖ్యానించారు. భారత ప్రధానిగా ఎవరుండాలని పాక్ కోరుకుంటోందో ఇమ్రాన్ వ్యాఖ్యలతో అర్థమైందని సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ‘మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశం పాక్ ఒక్కటే. పాకిస్తాన్‌ను ప్రతిపక్షాలతో లింకు పెడుతూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు, ప్రధానిగా మోదీ ఉండాలని పాక్ అంటోంది. ఆహ్వానించకున్నా పాక్ వెళ్లిన ఏకైక ప్రధాని, సైనిక స్థావరంలోకి పాక్ ఐఎస్ఐను ఆహ్వానించిన ఏకైక భారత ప్రధాని మోదీయే’ అని ఆయన ఎద్దేవాచేశారు. -
వారి త్యాగం అపూర్వం.. మరి రాజకీయమో?
పుల్వామా దాడి ఉగ్రవాద ఉన్మాదం. ఇటువంటి రాక్షస చర్యలు భారతీయ సైన్యం, భరత ప్రజల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపించే రోజులు పోయాయి. వాస్తవాధీన రేఖ దాటివెళ్లి ఉగ్ర శిబిరా లను మట్టుబెట్టిన వాయుసేనను చూసి దేశం గర్వి స్తోంది. త్రివిధ దళాలకు యావత్తు దేశం సెల్యూట్ చేస్తోంది. రక్షణ దళాల త్యాగాల మీద, అసమాన శౌర్య సాహసాల మీద ఎటువంటి మచ్చ లేదు. ఉన్న దల్లా ఓ విషాదం అలుముకున్న వేళ.. కాశ్మీర్ చుట్టూ అల్లుకున్న వివాదాస్పద రాజకీయాల గురించే చర్చ. కాశ్మీర్ అశాంతి ఇప్పటిది కాదు, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే అలుముకుంది. దానికిౖ వెపు పాకిస్తాన్ ఉగ్రవాదం, మరో వైపు స్వార్థపూరిత రాజ కీయ పార్టీల వైఖరి తోడయింది. కాశ్మీర్ చిన్న రాష్ట్రమే, భారత చిత్రపటంలో హిమాలయాల్లోకి విసి రేసినట్టున్న ఒక మంచు రాష్ట్రమే... కానీ దేశ రాజకీ యాలను వేగంగాప్రభావితం చేయగల రాష్ట్రం అది. దేశం ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. మళ్లీ కాశ్మీర్ అల్లకల్లోలమే ముందుకొచ్చింది. మోదీకి మరో రాజకీయ అవకాశం దొరికింది. హిందుత్వ ఎజెండాతో రాజ్యాధికారంలోకి వచ్చిన బీజేపీ మోదీ ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాల్లో మత హింసను పురిగొ ల్పింది. కషాయపు భావజాలాన్ని వ్యతిరేకించిన వారిపై గోవధ పేరుతో మూక దాడులకు పాల్పడ్డది. మేధావులు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతల మీద దేశ ద్రోహం కేసులు మోపి జైల్లో పెట్టింది. హిందూమతోద్ధారకుణ్ణి నేనే, సనాతన ధర్మ వ్యాప్తి అంతా తన భుజస్కంధాలపైనే ఉందన్నట్లు ఫోజు కొట్టే మోదీ, అమిత్ షాలు జమ్మూకశ్మీర్, పొరుగు దేశం పాక్‌లోని హిందువుల గురించి ఎందుకు పట్టిం చుకోలేదన్నది ఆశ్చర్యం కలిగించే ప్రశ్న. పాక్‌లో హిందూ మహిళల దుస్థితి దారుణంగా ఉంది. భారత్ నుంచి పాక్ విడివడిన నాటి నుంచి అక్కడ హిందూ మహిళలపై అకృత్యాలు జరుగు తూనే ఉన్నాయి. పాక్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువుల రక్షణకు సరైన చట్టాలు లేవు. హిందూ మహిళలు అత్యాచారాలు, కిడ్నాపులు, బలవంతపు మతమార్పిడుల బారిన పడి, సెక్స్ బానిసలుగా బతుకీడుస్తున్నారు. అక్కడ హిందూ మహిళలెవరూ తమకు వివాహం జరిగిందని నిరూపించుకోలేని దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఏ కారణంగా నైనా భర్త మరణిస్తే, అతని ఆస్తిపాస్తుల్లో వాటా కూడా అతని భార్యకు దక్కదు. కనీసం అక్కడి హిందువులకు పాక్ ప్రభుత్వం అందజేసే ’నేషనల్ డేటా బేస్ రెగ్యులేషన్ అథారిటీ’ గుర్తింపు కార్డులు పొందే వెసులుబాటు కూడా లేదు. పాక్–భారత్ దేశాల మధ్య ఎన్నోసార్లు చర్చలు జరిగాయి, జరు గుతున్నాయి. ఈ చర్చల్లో రాజకీయ ఎజెండా తప్ప, పాక్‌లోని హిందువుల రక్షణ మీద ఇప్పటి వరకు ఎందుకు చర్చలు జరుపలేదు? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 డిసెంబర్ 25న తన రష్యా, ఆప్ఘనిస్థాన్ పర్యటన ముగించుకొని న్యూఢిల్లీకి వస్తూ.. మార్గమధ్యంలో ఉన్నట్టుండి లాహోర్‌లో ల్యాండైపోయారు. మోదీ ఆకస్మికంగా లాహోర్‌లో అడుగుపెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్‌లో జిందాల్ గ్రూపు నకు చెందిన సజ్జన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త ఒత్తిడి మేరకే ఆయన పాకిస్తాన్ వెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏ దేశం వెళ్లినా అక్కడి ప్రవాస భారతీయులతో కలిపి ‘ఛాయ్ పే చర్చ’ పెట్టటం మోదీకి అలవాటు. హిందుత్వ ఎజెండాతోనే అధికారంలోకి వచ్చిన మోదీ∙పాక్ వెళ్లినప్పుడు అక్కడి హిందూవులను ఎందుకు కలవలేకపోయారు? అక్కడ వారికి జరుగు తున్న అన్యాయాలను ఎందుకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు? ఆయన పాక్‌లో అడుగు పెట్టేటప్పటికే ఇరు దేశాలమధ్య ద్వైపాక్షిక చర్చలపై ప్రతిష్టంభనతోపాటు.. సరిహద్దుల్లో పాక్ రేంజర్లు య«థేచ్చగా కాల్పులకు తెగబడుతున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని వుంది. మోదీ పాక్ వెళ్లి, నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిసినప్పుడు కశ్మీర్ అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. 2014 నుంచి 2019 వరకు కశ్మీర్ రక్షణలో దాదాపు 900 మంది సైనికులు అశువులు బాశారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో అధి కారిక లెక్కల ప్రకారం 527 మంది సైనికులు చని పోయారు. 1,363 మంది గాయపడ్డారు. ఒకరు యుద్ధ ఖైదీగా చిక్కారు. మళ్లీ యుద్ధం వస్తే ఎంత మంది వీరుల ప్రాణాలను తింటుందో తెలియదు. సైనికుడు అంటే యుద్ధంలో ప్రాణాలు అర్పించే మర మనుషులు కాదు. వాళ్లకు భార్య పిల్లలు ఉన్నారు. వాళ్లకు ఓ కుటుంబం ఉంది. ఏడాదికి ఓ మారైనా వారి కుటుంబం ఆత్మీయ కౌగిలి కోరుకుంటుంది. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం కశ్మీర్ అంశాన్ని అధి కార పీఠాన్నిచ్చే అక్షయ పాత్రగా చూడకుండా ఓ శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేయాలి. వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే మొబైల్: 94403 80141 -
యుద్ధం కాదు పరిష్కారం
ప్రతి చర్యకూ ప్రతిచర్య (రియాక్షన్) ఉంటుందని పాకిస్తాన్‌కూ, ఆ దేశాన్ని స్థావరంగా ఉపయోగించుకొని, ఆ దేశ సైనిక వ్యవస్థ ప్రోత్సాహంతో కశ్మీర్లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాద మూకలకూ స్పష్టం చేయడంలో భారత ప్రభుత్వం సఫలమయింది. 2016లో ఉడీ సైనిక స్థావరంపైన ఉగ్రవాదుల దాడికి ప్రతిగా భారత సైన్యం మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) చేసింది. పక్షం రోజుల కిందట పుల్వామాలో అదిల్ అహ్మద్ దార్ అనే ఇరవై సంవత్సరాల కశ్మీరీ యువకుడు మానవబాంబుగా మారి కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఆర్పీఎఫ్) ప్రయాణిస్తున్న ట్రక్కుల శ్రేణిపై దాడి చేసి తాను పేలిపోయి 40 మంది జవాన్ల మరణానికి కారకుడైనాడు. ఈ దాడి తమ సంస్థ పనేనంటూ జైషే హంతకముఠా నాయకుడు మసూద్ అజహర్ ప్రకటించాడు. ఇందుకు ప్రతీకా రంగా భారత వాయుసేనకు చెందిన 12 మిరాజ్ 2000 యుద్ధవిమానాలు సరి హద్దు దాటి పాక్ భూభాగంలో ప్రవేశించి జైషే ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసి సుమారు 300 మంది ఉగ్రవాదులనూ, వారి శిక్షకులనూ, కమాండర్లనూ మట్టుబెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇందుకు సమాధానంగా పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాలతో భారత సైనిక స్థావరాలపైన దాడులు చేయడానికి రాగా వాటిని భారత్ మిగ్ యుద్ధవిమానాలతో ఎదుర్కొని వెనక్కు పంపింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్–16 విమానాన్ని మన యుద్ధవిమానాలు కూల్చివేయగా, మన మిగ్ విమానాన్ని పాకిస్తాన్ యుద్ధవిమానాలు పడగొ ట్టాయి.భారత యోధుడు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కూలుతున్న మిగ్ విమానం నుంచి పారాచ్యూట్ సాయంతో కిందికి దిగి పాక్ సైనికులకు బందీగా చిక్కాడు. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను యుద్ధఖైదీగా పరి గణించి గౌరవంగా చూడాలనీ, భారత్‌కు అప్పగించా లనీ నరేంద్రమోదీ ప్రభు త్వం డిమాండ్ చేసింది. శాంతికోసం అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తానంటూ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్ పార్లమెంటులో ప్రకటన చేశారు. శుక్రవారం రాత్రి అభినందన్ భారత్ గడ్డపైన భద్రంగా అడు గుపెట్టాడు. ఇంతవరకూ జరిగిన పరిణామాలు క్లుప్తంగా ఇవి. యుద్ధమేఘాలు సరిహద్దుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. పరస్పరం కాల్పులు జరుపు కుంటూనే ఉన్నారు. కానీ పూర్తి స్థాయి యుద్ధానికి దిగలేదు. అందుకు భారత్, పాకిస్తాన్ ప్రజలే కాకుండా దక్షిణాసియా ప్రజలూ, అంతర్జాతీయ సమాజం కూడా సంతోషించాలి. పక్షం రోజులుగా భారత్, పాకిస్తాన్ల మధ్య సంభవి స్తున్న పరిణామాలు అసాధారణమైనవి. ప్రమాదకరమైనవి. ఆందోళనకరమై నవి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ప్రత్యక్షంగా యుద్ధవిమాన దాడులు జరగడం ఇదే ప్రథమం. 1971 తర్వాత భారత్, పాక్ యుద్ధవిమానాలు తలబడి పూర్తి స్థాయి సంప్రదాయ యుద్ధ ప్రమాదాన్ని భారతీయుల, పాకిస్తానీల గడప వరకూ తీసుకురావడం కూడా ఇదే మొదటిసారి. 1999లో కార్గిల్‌లో తిష్టవేసిన పాకిస్తాన్ సైనికులను వెనక్కు పంపేందుకు భారత యుద్ధం చేయవలసి వచ్చింది. అది పరిమితమైన లక్ష్యంకోసం జరిగిన పోరాటం. 2008లో ముంబైపై ఉగ్రవాదులు దాడి చేసినా, అంతకు ముందు 2001లో మన పార్లమెంటు భవనంపైన ఉగ్ర పంజా విసిరినా హెచ్చరికలకూ, దౌత్య చర్యలకే భారత ప్రతిస్పందన పరి మితమైనది కానీ ప్రతీకార దాడులు చేయలేదు. 1999లో సరిహద్దు పొడవునా సైన్యాన్ని మోహరించారు కానీ పూర్తి స్థాయి యుద్ధానికి దిగలేదు. ‘మా జోలికి వస్తే ఊరుకోం. ప్రతీకారం తీర్చుకుంటాం,’ అని భారత్ కార్యాచరణ రూపంలో స్పష్టం చేసింది మోదీ హయాంలోనే. దీని ఫలితం ఆశించినట్టు ఉన్నదా? ఉగ్రవాదులు వెనుకంజ వేశారా? పాకిస్తాన్ జంకుతున్న లక్షణాలు కనిపి స్తున్నాయా? ఉగ్రవాదులను అరికట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నిం చిన దాఖలాలు ఉన్నాయా? నాలుగు ప్రశ్నలకూ లేదనే జవాబు. నెహ్రూ నుంచి మన్మోహన్సింగ్ దాకా ప్రధానులందరూ కశ్మీర్ అంతర్గత వ్యవహారమనీ, పాకిస్తాన్‌తో భారత్ ముఖాముఖి చర్చించి పరిష్కరించుకుం టుందనీ, మూడో పక్షం జోక్యాన్ని ఆమో దించబోమనీ కరాఖండిగా చెబుతూ వచ్చారు. సిమ్లాలో ఇందిరాగాంధీ, భుట్టోల మధ్య కుదిరిన ఒప్పందం కూడా అదే. మెరుపుదాడుల వల్లా, యుద్ధవిమానాల ప్రయోగం వల్లా ఏమి జరిగింది? ప్రపంచంలోని అన్ని దేశాలూ శాంతి, శాంతి అంటున్నాయి. నిగ్రహం పాటించాలని కోరుతున్నాయి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం జరిగే వాతావరణం కనిపిస్తే స్పందించవ లసిన అగత్యం, హక్కు అన్ని దేశాలకూ ఉంటుంది. ఇప్పుడు కశ్మీర్ అంతర్జా తీయ సమస్యగా మారింది. పాకిస్తాన్‌కు దౌత్యపరమైన మద్దతు తగ్గింది. ఉగ్ర వాదానికి పాకిస్తాన్ బలమైన స్థావరంగా మారిందనే అభిప్రాయం చైనాతో సహా అన్ని ప్రపంచ దేశాలలో బలంగా నాటుకున్నది. ఈ ఉగ్రవాదంతో నష్టపోతున్నది భారత్ ఒక్కటే కాదు. ఇరాన్‌పైనా తాలిబాన్ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అఫ్ఘానిస్తాన్ సంగతి సరేసరి. ఆ దేశం మూడు దశాబ్దాలుగా తాలిబన్ దాడులతో, అగ్రరాజ్యాల సైనిక జోక్యంతో, ఆక్రమణలతో, పాకిస్తాన్ ప్రమేయంతో సత మతం అవుతోంది. దౌత్యపరమైన మద్దతు కూడగట్టడం వల్ల భారత్‌కు ప్రయో జనం ఏమిటి? చైనా అండదండలు ఉన్నంత వరకూ పాకిస్తాన్ దారికి వస్తుందా? అభినందన్‌ను భారత్‌కు పంపుతానని ప్రకటించడం ద్వారా ఇమ్రాన్‌ఖాన్ హుందాగా ప్రవర్తిం చినట్టు కనిపించారు. సైన్యాధికారుల ఆమోదంతోనే... సైన్యం ఆమోదం లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే భుట్టో, నవాజ్షరీఫ్లకు పట్టినే గతే తనకూ పడుతుందని ఇమ్రాన్‌కు తెలుసు. సైన్యా ధికారులు సైతం జెనీవా ఒప్పందాన్ని గౌరవించాలని నిర్ణయించి ఉంటారు. చిన్న పొరబాటు జరిగితే ఎంతటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయో ఊహిం చుకోవాలని నరేంద్రమోదీకి ఇమ్రాన్ చేసిన సూచన కొట్టిపారవేయదగినది కాదు. పరిమిత దాడులైతే నష్టం కూడా పరిమితమే. సంప్రదాయరీతిలో యుద్ధా నికి రెండు దేశాలూ సిద్ధంగా లేవు. యుద్ధమంటూ జరిగితే మారణహోమం అనివార్యం. అది అణ్వస్త్రయుద్ధానికి దారితీస్తే ప్రళయమే. అందుకే అంతర్జాతీయ సమాజం దీన్ని రెండు దేశాల మధ్య వివాదంగా పరిగణించి చేతులు కట్టుకొని కూర్చోజాలదు. రెండు దేశాల అధినేతలకూ ప్రపంచ దేశాధినేతలు సుద్దులు చెబుతారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోమంటారు. ఒక్క అభినందన్ పాకిస్తాన్ సైనికుల చేత చిక్కితేనే దేశం యావత్తూ ఊపిరి బిగపట్టి అతని విడుదల కోసం నిరీక్షించింది. చైనాతో, పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలలో అనేక మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా నాలుగు వందల టీవీ చానళ్ళు ఇటువంటి వివరాలన్నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తే అధికార పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. పరిమిత చర్యలే అయినప్పటికీ ఎన్నికల సమయంలో వచ్చిన అవకాశాన్ని అపరిమితంగా సద్వినియోగం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్ని స్తున్నాయి. దేశంలో ఇప్పుడున్న వాతావరణం అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి అనుకూలం. ఉద్రిక్తలను సొమ్ము చేసుకునే ప్రయత్నం ఎన్డీఏ నిస్సంకోచంగా చేస్తున్నది. ఇందులో నరేంద్రమోదీ సిద్ధ హస్తుడు. అధి కారపార్టీకి ఆ ప్రయోజనం దక్కకుండా ఎట్లా నివారించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు ఆలోచిస్తున్నారు. బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకోసం దేశాన్ని బలహీన పరచవద్దనీ, సైనికులను అవమానించవద్దనీ ప్రతిపక్షాలకు మోదీ విజ్ఞప్తి చేశారు. జైట్లీ సమరోత్సాహం అమెరికా అధ్యక్షుడుగా ఒబామా ఉండగా అమెరికా కమాండోలు పాకిస్తాన్లో రహస్యంగా జీవిస్తున్న అల్ కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను హత మార్చినట్టు మన సేనలు కూడా పాకిస్తాన్లో నివసిస్తున్న మసూర్ అజహర్‌ని అంతం చేయాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఇది ‘పైలట్ ప్రాజెక్టు’ మాత్రమేనని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మెరుపు దాడులైనా, పరిమి తమైన యుద్ధవిమానాల ప్రయోగమైనా దేశ ప్రజల ఆవేశాలను తగ్గించడానికీ, ప్రభుత్వం పట్ల, సైన్యం పట్ల విశ్వాసం నిలుపుకోవడానికీ పనికివస్తాయి కానీ అసలు సమస్య పరిష్కారం కాదు. శాశ్వత శాంతి నెలకొనదు. అసలు సమస్య ఏమిటి? కశ్మీర్‌లోయలో అశాంతి. ఎన్ని వేల కోట్ల రూపాయలు లోయలో కుమ్మరించినా, ఎన్ని లక్షలమంది సైనికులను మోహరిం చినా, ఎంతమంది ఉగ్రవాదులూ, సాధారణ పౌరులూ, సాయుధబలగాలూ ప్రాణాలు కోల్పోయినా సమస్య క్రమంగా జటిలం అవుతున్నదే కానీ సమసి పోవడం లేదు. కశ్మీర్ సమస్య స్వభావం అటువంటిది. 1990 నుంచి ఇప్పటి వరకూ కశ్మీర్లో 70 వేలమంది పౌరులూ, పోలీసు ఉద్యోగులూ, ఉగ్రవాదులూ మరణించి ఉంటారు. పెల్లెట్ గన్ గాయాలతో అంధులైనవారూ, కాల్పులలో వికలాంగులైనవారూ వేలమంది ఉంటారు. కశ్మీర్ ప్రజల మనోభావాలు ఏమిటో పాకిస్తాన్‌కు పట్టించుకోదు. భారత్‌కూడా కశ్మీర్‌ను కాపాడుకోవాలనే ఆరాటంలో కశ్మీరీల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేయవలసినంత చేయడం లేదు. సాయుధ బలగాలతో కశ్మీర్ సమస్య పరిష్కారం కాదని అందరికీ తెలుసు. ఎట్లా పరిష్కరించాలో తెలియక ఆ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. కశ్మీర్ ప్రజల దృష్టికోణం నుంచి చూసి వారి సమస్యను గుర్తించే అవకాశం ఉన్నప్పటికీ ఆ సాహసం ఎవరు చేయగలరు? కశ్మీర్ లోయలో అత్యధికులు కోరుకుంటున్న ఆజాదీ వారికి అందని ద్రాక్ష. వారి అభీష్ఠాన్ని మన్నించే వాతావరణం దేశంలో లేదు. వీలైనంత మేరకు స్వతంత్ర నిర్ణయాధికారాలు కల్పించడం ఆచరణ సాధ్యౖ మెన విధానం. అందుకే రాజ్యాంగంలో 370వ అధికరణను చేర్చింది. కశ్మీరీలు ప్రశాంతంగా భారతపౌరులుగా జీవించాలంటే వేర్పాటువాదానికి స్వస్తి చెప్పాలి. అది జరగాలంటే భారత ప్రజలు కశ్మీరీల హృదయాలు గెలుచుకోవాలి. అందుకు రాజకీయ పార్టీలకూ, ప్రభుత్వాలకీ అతీతంగా సమగ్రమైన కార్యక్రమం నిరంత రాయంగా అమలు జరగాలి. వాజపేయి చెప్పినట్టు జమ్రూ హియత్ (ప్రజాస్వా మ్యం), కశ్మీరియత్(కశ్మీర్ సంస్కృతి), ఇన్సానియత్(మానవత్వం) అనే మూడు మూల సూత్రాలు ప్రాతిపదికగా నూతన కశ్మీర్ విధాన రూపకల్పన జరగాలి. కశ్మీర్‌వైపు తేరిపార చూడకుండా పాకిస్తాన్‌ను శాసించే స్థితికి భారత్ చేరుకోవాలి. బంగ్లాదేశ్ ఆవిర్భవించి తూర్పు పాకిస్తాన్ అంతర్థానం కావడంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన పాకిస్తాన్ పాలకవర్గం భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చే సేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నది. సంప్రదాయ యుద్ధంలో భారత్‌ను ఓడిం చడం అసాధ్యం కనుక పరోక్షంగా జిహాదీ శక్తులకు అండదండలు సమకూర్చి కశ్మీర్‌ని రావణకాష్టం చేయాలన్నది జనరల్ జియా–ఉల్–హక్ సంకల్పం. అం తకు ముందు జుల్ఫికర్ అలీభుట్టో సైతం భారత్‌పైన వేయి సంవత్సరాల యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. భారతదేశానికి వేయి గాయాలు చేసి రక్తం పారించాలని ప్రతిన పూనారు. పాకిస్తాన్ ప్రజలకు భారత్‌పట్ల ద్వేషాన్ని నూరిపోశారు. ఉగ్రవాదులలో మంచి ఉగ్రవాదులూ, చెడు ఉగ్రవా దులూ అంటూ జనరల్ ముషార్రఫ్ విభజించారు. కశ్మీర్లో రక్తపాతం సృష్టించే జిహాదీలను మంచి ఉగ్రవాదులుగా పరిగణించి వారికి అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వాలూ, సైన్యం అందిస్తున్నాయి. పాకిస్తాన్ బుద్ధి మారదు. ప్రజలు ఎన్నుకున్న ప్రధానులు భారత్‌తో శాంతికోసం ప్రయత్నించినా పాకిస్తాన్ సైన్యాధిపతులు సహకరించరు. ఎన్నికైనవారిని గద్దె దింపి తామే పగ్గాలు చేపడతారు. భారత్‌తో వైరంలో వారి ప్రయోజనాలు ఉన్నాయి. కశ్మీర్లో చిచ్చు ఆరకుండా రగిలించాలనే దుర్మార్గపు విధానం వల్ల పాకిస్తాన్ బావుకున్నది ఏమీ లేదు. ఉగ్రవాదుల దాడులలో పాకిస్తాన్‌లోనూ సుమారు 70 వేలమంది పౌరులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయింది. మొన్న అమె రికా, నిన్న చైనా, ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఆదుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితి. పాకిస్తాన్ ఉగ్రవాదులను కశ్మీర్‌పైన ప్రయోగించ కుండా ఉండాలంటే ఆర్థికంగా, సైనికంగా భారత్ ఇంకా ఎదగాలి. అందుకోసం శాంతిసుస్థిరతలు కావాలి. యుద్ధం వద్దు. ఇదే భారత ప్రజల అభిమతం. -కె. రామచంద్రమూర్తి -
ఐక్యరాజ్య సమితి అధ్యక్షునికి ఫోన్ చేసిన ఇమ్రాన్
వాషింగ్టన్ : పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనియో గట్టర్స్‌కు ఫోన్ చేసి కశ్మీర్ విషయం గురించి మాట్లాడినట్లు తెలిసింది. ఈ విషయ గురించి స్వయంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ పీటీఐకు వెల్లడించారు. స్టీఫెన్, పీటీఐతో మాట్లాడుతూ పలు దేశాల అధిపతులు, ప్రధానులు, అధ్యక్షులు యూఎన్ అధ్యక్షుడితో మాట్లాడటం చాలా సాధరణం. అందులో భాగంగానే ఇమ్రాన్, ఆంటోనియోకు ఫోన్ చేశారన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్‌కు కశ్మీర్‌పై తమ వైఖరేంటో చెప్పామన్నారు స్టీఫెన్. అయితే ఇమ్రాన్ కశ్మీర్ అంశం లేవనెత్తిన అనంతరం ఇరువురు మధ్య జరిగిన సంభాషణ వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అంతేకాక కశ్మీర్ అంశం గురించి ఐక్యరాజ్య సమితి మిలిటరీ అబ్సర్వర్ గ్రూపు(యూన్ఎమ్ఓజీఐపీ) తరఫున పరిశీలకుల బృందం పని చేస్తోందని స్టీఫెన్ తెలిపారు. కొన్ని రోజులుగా కశ్మీర్ వ్యవహారంతో పాటు మరి కొన్ని సందర్భాల్లో పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ తీరును విమర్శిస్తూ ‘మీ పని మీరు చూసుకుంటే మంచిదం’టూ భారత్ తీవ్ర స్థాయిలో జవాబిచ్చింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఆంటోనియోతో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. కశ్మీర్ అంశం పరిశీలన గురించి ఐక్యరాజ్యసమితి 1949లో మిలిటరీ అబ్సర్వర్ గ్రూపును ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇందులో 118 మంది ఐక్యరాజ్యసమితి సిబ్బంది పనిచేస్తున్నారు. 1971 ఇండియా-పాక్ యుద్ధం, అదే ఏడాది ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ఈ సంస్థ ఇరు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షించి వాటిని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌కు నివేదిస్తోంది. -
ఎన్నికలప్పుడే ఆలయాల సందర్శన
బన్సుర్/జైపూర్: కాంగ్రెస్ నేతలు ఎన్నికలు సమీపించినప్పుడే ఆలయాల సందర్శనకు వెళతారని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నేతలు ఆలయాలు సందర్శించి పూజలు నిర్వహిస్తారు. మిగతా సమయాల్లో వాళ్లు ఆ చుట్టుపక్కల కూడా కనిపించరు. ఆలయాలు, గోవులు ఆ పార్టీకి ఎన్నికల ప్రచారాంశాలు కావొచ్చు. కానీ బీజేపీకి అవి సాంస్కృతిక జీవనంలో అంతర్భాగం’ అని రాజ్‌నాథ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో అవసరమైతే పాకిస్తాన్‌కు సాయం చేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ‘నేను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఒక్కటే చెబుతున్నా. అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వం తాలిబన్ ఉగ్రవాదులపై అమెరికా సాయంతో పోరాడుతోంది. పాక్‌లో ఉగ్రవాదులపై ఒంటరిగా పోరాడలేమని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం భావిస్తే భారత్ సాయం కోరవచ్చు’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భారత్–పాక్‌ల మధ్య కశ్మీర్ అన్నది సమస్యే కాదనీ, అది భారత్‌లో అంతర్భాగమని రాజ్‌నాథ్ పునరుద్ఘా టించారు. సర్జికల్ స్ట్రైక్స్ యూపీఏ హయాంలోనూ జరిగాయని కాంగ్రెస్ చెప్పడంపై స్పందిస్తూ.. ‘ఈ విషయాన్ని దేశప్రజలకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? సైన్యం అలాంటి సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి ఉంటే ప్రజలకు తెలిసేది కాదా? ఈ ఆపరేషన్‌ను ఎందుకు గోప్యంగా ఉంచారు? ఎవరికి భయపడ్డారు?’ అని రాజ్‌నాథ్ అన్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని అల్లాహ్ ఓడిస్తాడన్న ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ‘మతం, కులం ఆధారంగా చేసే రాజకీయాలపై మాకు నమ్మకం లేదు’ అని అన్నారు. -
భారత ప్రధానితో చర్చలకు సిద్ధం
ఇస్లామాబాద్/అమృత్సర్: భారత ప్రధాని మోదీతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తమ భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం పాక్‌కు ఎన్నటికీ లాభం చేకూర్చదన్నారు. ఉగ్రమూకలకు మద్దతు నిలిపివేసేవరకూ పాక్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవని విదేశాంగ మంత్రి సుష్మ ప్రకటించిన నేపథ్యంలో ఇమ్రాన్ స్పందించారు. ‘పాక్ ప్రజలంతా భారత్‌తో శాంతిని కోరుకుంటున్నారు. మోదీతో ఏ విషయంపై అయినా చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. సైనిక చర్యతో కశ్మీర్ సమస్యను పరిష్కరించలేం. పొరుగుదేశాల్లో విధ్వంసం సృష్టించే ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పించడం పాక్‌కు ఎన్నటికీ లాభించదు’ అని వెల్లడించారు. భారత్–పాక్‌ల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారవుతుందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు..‘అసాధ్యమన్నది ఏదీ లేదు‘ అని ఇమ్రాన్ జవాబిచ్చారు. పాక్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా, భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరాబాబా సాహిబ్ గురుద్వారాలను కలుపుతూ నిర్మిస్తున్న కారిడార్ పట్ల తనకు తెలిసినంతవరకూ మెజారిటీ భారతీయులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే శాంతిచర్చల కోసం ఇరుపక్షాలు ముందుకురావాల్సి ఉంటుందనీ, ఓపక్షం చొరవ సరిపోదని వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం భారత్ నుంచి ఈ విషయంలో సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. నిషేధిత జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్, ముంబై మారణహోమం సూత్రధారి హఫీజ్ సయీద్‌పై ఇప్పటికే ఐరాస ఆంక్షలు విధించిందనీ, జేయూడీని ఉగ్రసంస్థగా ప్రకటించిందని గుర్తుచేశారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగించడంపై పరోక్షంగా స్పందిస్తూ.. ‘మనం గతంలో బతకలేం. గతాన్ని వదిలేసి భవిష్యత్ దిశగా ఇరుదేశాలు సాగాలి. పాక్ గాలిస్తున్న కొందరు నేరస్తులు భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. ఖలిస్తాన్ వేర్పాటువాదితో సిద్ధూ పంజాబ్ మంత్రి సిద్ధూ ఖలిస్తాన్ వేర్పాటువాది, పాక్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ (పీఎస్‌జీపీసీ) సభ్యుడు గోపాల్‌సింగ్ చావ్లాతో కలిసి ఫొటో దిగారు. దీనిపై శిరోమణి అకాలీదళ్ నేత సుక్బీర్ బాదల్ మాట్లాడుతూ.. ఇటీవల సిద్ధూ నియోజకవర్గంలో జరిగిన బాంబుదాడి వెనుక గోపాల్ ఉన్నారని ఆరోపించారు. దేశం ముఖ్యమో లేక ఇలాంటి వ్యక్తులు ముఖ్యమో సిద్ధూ స్పష్టం చేయాలన్నారు. కాగా, ఈ విమర్శలపై సిద్ధూ స్పందిస్తూ.. ‘పాక్‌లో నేను చాలామందితో కలిసి ఫొటోలు దిగాను. వాటిలో ఎవరెవరు ఉన్నారో చెప్పడం కష్టం. పాక్ ప్రజలు కురిపించిన ప్రేమకు నేను తడిసి ముద్దయ్యా.. రోజుకు అక్కడ 10,000 ఫొటోలు దిగాను. వాటిలో ఉన్నది చావ్లానా? చీమానా? అన్నది నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఢిల్లీ గురుద్వారా కమిటీ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ సర్నా మాట్లాడుతూ.. గోపాల్ సింగ్ చావ్లాను తప్పించుకునేందుకు సిద్ధూ యత్నించారనీ, కానీ ఎలాగోలా సిద్ధూతో ఫొటోలు దిగగలిగాడన్నారు. -
పాకిస్తాన్‌కు కశ్మీర్ అక్కర్లేదు: అఫ్రిది
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కశ్మీర్ సమస్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు కశ్మీర్ అక్కర్లేదనీ, ఇప్పుడున్న 4 ప్రావిన్సులనే పాక్ సరిగ్గా పాలించుకోలేకపోతోందని అన్నారు. బ్రిటన్ పార్లమెంటులో విద్యార్థులతో జరిగిన సమావేశంలో అఫ్రిది ఇలా మాట్లాడారు. ‘పాక్‌కు అసలు కశ్మీర్ అక్కర్లేదు. దాన్ని భారత్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు. కశ్మీర్‌ను స్వతంత్రంగా ఉండనిద్దాం. అప్పుడైనా కనీసం మానవత్వం బతికుంటుంది. ఏ మతానికి చెందిన ప్రజలైనా చనిపోవడమన్నది బాధాకరం’ అని అఫ్రిది మాట్లాడిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
చర్చలు మళ్లీ మొదలెడదాం..
ఇస్లామాబాద్: భారత్–పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు సంసిద్ధత తెలుపుతూ ప్రధాని మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారు. ద్వైపాక్షిక బంధాలకు సవాల్‌గా మారిన ఉగ్రవాదం, కశ్మీర్ సహా ఇతర కీలకమైన అంశాలపై చర్చకు సిద్ధమేనని గురువారం మోదీకి రాసిన లేఖలో ఇమ్రాన్∙పేర్కొన్నారు. సెప్టెంబర్ 14న ఇమ్రాన్ ఈ లేఖ రాసినట్లు ఇస్లామాబాద్‌లోని పాక్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే ప్రక్రియలో భాగంగా.. ఈ నెలలో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశానికి హాజరయ్యే భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్ ప్రతిపాదించారు. ‘భారత్–పాక్ మధ్య సంబంధాల్లో సవాళ్లున్నాయి. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనే ప్రక్రియకు ఐరాస సభలో సమావేశం ఉపయుక్తమవుతుందని భావిస్తున్నా’ అని ఇమ్రాన్ లేఖలో పేర్కొన్నారు. ‘పాక్ ప్రజలు, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని కశ్మీర్ సహా అన్ని అంశాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు మేం సిద్ధం. అభిప్రాయభేదాలను రూపుమాపి పరస్పర ప్రయోజనం కలిగేలా చర్చలు జరగాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి.. ఇరుదేశాల సంబంధాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. నిర్మాణాత్మక చర్యలకు సిద్ధమే.. ఆగస్టు 18న మోదీ ఇరుదేశాల సత్సంబంధాలను కాంక్షిస్తూ ఇమ్రాన్‌కు లేఖ రాశారు. పాక్‌తో అర్థవంతమైన, నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమేనని.. దక్షిణాసియాను ఉగ్రవాద రహితంగా మార్చేందుకు ముందుకు రావాలని ఆనాటి లేఖలో మోదీ అన్నారు. పాక్ ఎన్నికల్లో గెలిచాక ద్వైపాక్షిక బంధాలపై ఇమ్రాన్ మూడుసార్లు సానుకూల ప్రకటన చేశారు. శాంతికి ముందడుగు: పీడీపీ ఇమ్రాన్ లేఖకు మోదీ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) ఆశాభావం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా భారత్–పాక్ మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని పేర్కొంది. ఐరాస సభ సమావేశం సందర్భంగా ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగితే.. శాంతి చర్చలకు ముందడుగు పడినట్లేనని వెల్లడించింది. భేటీ కానున్న విదేశాంగ మంత్రులు ఐరాస సర్వప్రతినిధి సభ సందర్భంగా న్యూయార్క్‌లో వచ్చేవారం భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. 2016 పఠాన్‌కోట్ ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి. మోదీకి ఇమ్రాన్ లేఖలో ప్రతిపాదించినందుకు సానుకూలంగా వీరిద్దరి భేటీ జరుగనుందని.. ఈ సమావేశం ద్వారా భారత్–పాక్ మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభమైందని భావించనక్కర్లేదని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ దృష్టికోణంలో మార్పు ఉండబోదన్నారు. పాక్ గడ్డపై ఉగ్రవాద కేంద్రాల విషయంలో పాక్‌ను నిలదీసే వైఖరినే భారత్ ప్రదర్శిస్తుందన్నారు. పాకిస్తాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం కర్తార్‌పూర్ సాహిబ్‌ను భారత సిక్కులు దర్శించుకునేందుకు అనుమతివ్వడంపైనా సుష్మాæస్వరాజ్ మాట్లాడతారని రవీశ్ చెప్పారు. -
యథా మోదీ తథా ఇమ్రాన్ ఖాన్!
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఎన్నికల్లో విజయం తనదేనని భావించిన ఇమ్రాన్ ఖాన్ గురువారం నాడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి, తాను భారత్‌తో శాంతియుత సంబంధాలు కోరుకుంటున్నానని, కశ్మీర్‌పై చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాక్ సైన్యం, ఐఎస్ఐ కుమ్మక్కయిందని, ఇమ్రాన్ ఖాన్ ఆ దేశానికి ప్రధాని అయితే భారత్‌కు ముప్పేనంటూ విశ్లేషణలు వెల్లువెత్తిన నేపథ్యంతో అనూహ్యంగా ఆయన నుంచి శాంతి చర్చల మాట వెలువడడం ఆశ్చర్యం అనిపించవచ్చు. కానీ అదొక వ్యూహం. ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల ప్రచారమంతా భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని ఎవరు మరచిపోతారు. అహ్మది తెగ బహిష్కరణను తీవ్రంగా సమర్థించిన విషయాన్ని ఎలా మరచిపోతారు (అహ్మది తెగవారు ముస్లింలు కాదంటూ 1973లో జుల్ఫీకర్ అలీ భుట్టో నిషేధం విధించగా, జనరల్ జియా ఉల్ హక్ ఏకంగా 1984లో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు) మైనారిటీలను చిత్ర హింసలకు గురిచేస్తున్న మత విద్రోహ రాక్షస చట్టాన్ని ఇమ్రాన్ వెనకేసుకొస్తున్న విషయాన్ని, తాలిబన్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం ద్వారా తాలిబన్ ఖాన్‌గా ముద్రపడిన విషయాన్ని ఎవరు మరచిపోతారు! ఇప్పుడు చర్చలకు సిద్ధమంటే ఎవరు నమ్ముతారు!! అంతా ఒక వ్యూహం. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అనుసరించిన వ్యూహమే అది. పాకిస్థాన్ బూచిని చూపించి దేశభక్తి పేరిట ఓట్లు దండుకోవడమే ఆ వ్యూహం. ఇప్పటికీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ పాక్ పేరునే జపిస్తుంది. వ్యూహానికి ప్రతి వ్యూహంగా నరేంద్ర మోదీని విమర్శించే అవకాశం వచ్చినప్పుడు ఆయన్ని నవాజ్ షరీఫ్‌కు ప్రియమిత్రుడని కాంగ్రెస్ పార్టీ సంబోధిస్తోంది. 2015లో మోదీ అనూహ్యంగా పాక్ వెళ్లి నవాజ్ షరీఫ్‌ను కలుసుకున్న విషయం తెల్సిందే. బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏ వ్యూహాన్ని అనుసరించిందో ఇమ్రాన్ ఖాన్ కూడా తన ఎన్నికల ప్రచారంలో అదే వ్యూహాన్ని అనుసరిస్తూ భారత్‌ను తిడుతూ వచ్చారు. ఎన్నికలు ముగిశాయి. ఇక ఆ అవసరం లేదు. భారత్‌ను నిజంగా ఇరుకున పెట్టాలంటే చర్చల ప్రక్రియను ముందుకు తీసుకరావడమే. పైగా అంతర్జాతీయ సమాజం ముందు మంచి మార్కులు కొట్టేయవచ్చు. అందుకనే చర్చల ప్రతిపాదన చేశారు. అందుకు స్పందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ లబ్ధి పొందాలంటే పాకిస్తాన్‌తో వియ్యానికి బదులు కయ్యానికి కాలుదువ్వాలి. అందుకు కశ్మీర్ భారత్‌కు ఎప్పుడూ ఆయుధమే! -
కశ్మీర్ సమస్యకు ఐర్లాండ్ తరహా పరిష్కారం
లండన్: కశ్మీర్ సమస్య పరిష్కారానికి బ్రిటన్–ఐర్లాండ్‌లు అనుసరిస్తున్న కామన్ ట్రావెల్ ఏరియా విధానాన్ని అమలుచేయాలని కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సూచించారు. కశ్మీర్ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని భారత్, పాకిస్తాన్‌లు అర్థం చేసుకోవాలన్నారు. సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ లండన్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఫరూక్ మాట్లాడారు. ‘సమస్య పరిష్కారానికి తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిఒక్కరూ ఆమోదించబోరని అణ్వస్త్ర దేశాలైన భారత్, పాక్‌లు అర్థం చేసుకుంటే కశ్మీర్ సమస్య పరిష్కారం కావొచ్చు. కానీ భారత్, పాకిస్తాన్ కశ్మీర్లో కనీసం 80 శాతం మంది ఆ నిర్ణయాన్ని అంగీకరించి తీరాలి’ అని చెప్పారు. యూకేలో భాగమైన ఉత్తర ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ల మధ్య 1920ల్లో కామన్ ట్రావెల్ ఏరియా విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో బ్రిటన్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ పౌరులు పాస్‌పోర్ట్ లేకుండా రెండో దేశంలో స్వేచ్ఛగా పర్యటించవచ్చు. -
ముషార్రఫ్ వైఖరి సరైనదే: కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ : కశ్మీర్ స్వాతంత్ర్యంపై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ వైఖరికి కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ.. ‘కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్లో కలవడానికి ఇష్టపడటం లేదు.. వారు కోరుకునేది స్వాతంత్ర్యమేనని ముషార్రఫ్ అన్నారు. నేను కూడా తొలి నుంచి అదే చెబుతున్నాను. ఈ విషయాన్ని 2007లో ముషార్రఫ్ పాక్ మిలటరీ అధికారులతోను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోని కొందరితో పంచుకున్నారు. కానీ అది సాధ్యపడదనే విషయం నాకు తెలుసున’ని తెలిపారు. సోజ్ రచించిన ‘గ్లిమ్ప్సెస్ ఆఫ్ హిస్టరీ అండ్ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్’ పుస్తకం ఈ నెల 25 విడుదల కానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన పుస్తకం గురించి మాట్లాడుతూ.. కార్గిల్ యుద్దంలో ఓడిన తర్వాత.. తన లక్ష్యాన్ని చేధించడంలో ముషార్రఫ్ విఫలమయ్యారని తెలిపారు. ఆ తర్వాత కశ్మీర్ ప్రజలు స్వాతంత్ర్యం కోరుకుంటున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారని అన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కాలంలో జరిగిన లాహోర్ డిక్లరేషన్‌తో కశ్మీర్ ప్రజల ఆశలు చిగురించాయని పేర్కొన్నారు. కాగా, సోజ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. సైఫుద్దీన్ లాంటి నాయకుడు ఈ విధంగా మాట్లాడటం బాధ కలిగించిదన్నారు. భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గులాం నబీ ఆజాద్ కూడా భారత ఆర్మీని అప్రతిష్టపాలు చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన కూడా సోజ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. -
కశ్మీరీ శాంతి కపోతం
మతాలవారీగా, కులాలవారీగా, ప్రాంతాలవారీగా, రాజకీయ భావజాలాల వారీగా చీలిపోయిన నేటి భారతంలో గౌరవప్రదంగా, నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా నిలబడి రాణించడం దాదాపు అసాధ్యం. కల్లోల కశ్మీరంలో అయితే జర్నలిజం కత్తిమీద సాము. ప్రమాదపుటంచుల్లో విన్యాసమే. వస్తునిష్టంగానే రాస్తామంటే కుదరదు. ఉంటే ప్రభుత్వ పక్షాన ఉండాలి లేదా వేర్పాటువాదులకు విధేయంగా ఉండాలి. జరిగిన వాస్తవాలు మాత్రమే ప్రచురించడం అంటే అందరినీ శత్రువులను చేసుకోవడమే. ప్రభుత్వం లేదా సైనికాధికారులు చెబుతున్న సంగతులే ప్రచురిస్తే ‘సర్కారీ పత్రకార్’ అంటూ నిందిస్తారు. డబ్బు తీసుకొని ప్రభుత్వానికి బాకా ఊదుతున్నారంటూ పాకిస్తాన్ అనుకూలవర్గాలూ, మిలిటెంట్లూ, వేర్పాటువాదులూ ఈసడించుకుంటారు. వేర్పాటువాదుల అభి ప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తే ‘దేశద్రోహులు’ అంటూ హిందూత్వవాదులూ, వీర దేశాభిమానులూ ముద్రవేస్తారు. ఈ నేపథ్యంలో అటు వేర్పాటువాదుల తోనూ, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులతోనూ, ఇటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతోనూ, కశ్మీర్‌లోని ప్రభుత్వ ప్రతినిధులతోనూ, ఉన్నత సైనికాధి కారులతోనూ సమాన ఫక్కీలో సత్సంబంధాలు కలిగిఉంటూ శాంతి నెలకొల్ప డానికి ప్రయత్నించడం సాహసం. అటువంటి అరుదైన సాహసి మొన్న తూటా లకు బలైన ప్రఖ్యాత జర్నలిస్టు సుజాత్ బుఖారీ. గురువారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో తన పత్రిక ‘రైజింగ్ కశ్మీర్’ కార్యాలయం బయటనే ఇఫ్తార్‌కు వెళ్ళేందుకు కారు ఎక్కబోతుండగా హంతకులు జరిపిన కాల్పులలో నేలకొరిగాడు. సుజాత్ బుఖారీ వివేకవంతుడు. సాహసి. స్నేహశీలి. ఎత్తుగా, అందంగా, హుందాగా, ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ఉండే బుఖారీకి అన్ని రంగాలవారితోనూ పరిచయాలు విస్తృతంగా ఉన్నాయి. అందరితో మాట్లాడే చనువుంది. అతడి కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో పని చేస్తున్నారు. హురియత్ కాన్ఫరెన్స్‌లో మిత్రులు ఉన్నారు. మనసు విప్పి మాట్లాడే ఆర్మీ జనరల్స్ ఉన్నారు. కనుకనే బారాముల్లా జిల్లాలో క్రీరీ గ్రామంలో శుక్రవారం జరిగిన బుఖారీ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరైనారు. కొందరు సీనియర్ జర్నలిస్టులు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వెళ్ళారు. కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బుఖారీ హత్యవార్త విని కన్నీటి పర్యంతం అయిపోయారు. ఆమె సోదరుడూ, మంత్రి తస్దీఖ్ముఫ్తీ, ప్రతిపక్ష నాయకుడూ, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జమ్మూ–కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత యాసిన్ మాలిక్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. కశ్మీర్ లోయలోనే కాకుండా దేశవ్యాప్తంగా బుఖారీని అభిమానించేవారు ఉన్నారు. యావద్భారతం శోకతప్తమైన సందర్భం ఇది. బుఖారీతో పాటు ఆయన అంగరక్షకులుగా ఉన్న ఇద్దరు పోలీసులు ఆగంతకుల తూటాలకు నేలకొరిగారు. అంతకు కొన్ని గంటల ముందే జౌరంగజేబు అనే జవాన్ శవం పుల్వామాలో దొరికింది. రంజాన్ సెలవుపై ఇంటికి వెడుతున్న జౌరంగజేబును దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. రంజాన్ మాసం సందర్భంగా దేశీయాంగ శాఖ కశ్మీర్లో స్వచ్ఛంద కాల్పుల విరమణ ప్రకటించిన ఫలితంగా లభించిన అవకాశాన్ని ఉగ్రవాదులు పూర్తిగా వినియోగించుకున్నారు. కాల్పుల విరమణకు ముందు ఏప్రిల్ 19 నుంచి మే 16 వరకూ ఉగ్రవాద సంబంధమైన ఉదంతాలు 25 జరిగితే, కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మే 17 నుంచి జూన్ 13 వరకూ 66 ఘటనలు జరిగాయి. కాల్పుల విరమణను పొడిగించి, చర్చల ప్రక్రియను పునరుద్ధరించకపోతే కశ్మీర్లో 1990 దశకం ఆరంభంనాటి పరిస్థితి పునరావృతం అవుతుంది. హింసాకాండ కొనసాగి ఉగ్రవాదులది పైచేయి అయితే కశ్మీర్ అంతర్జాతీయ వివాదంగా మళ్ళీ తెరపైకి ప్రముఖంగా వస్తుంది. ఇతర దేశాల జోక్యాన్ని నివారించడం కష్టం అవుతుంది. కశ్మీరీల ఆత్మగౌరవాన్ని (అస్మితను) సుజాత్ బుఖారీ ప్రాణప్రదంగా ప్రేమించేవాడు. కశ్మీరీ భాష అన్నా, సంస్కృతి అన్నా చెవికోసుకునేవాడు. కశ్మీరీ భాషలో వార్తాపత్రికలు రావడానికి ఉద్యమం చేశాడు. కశ్మీరీ భాషలో కవులూ, రచయితల కోసం స్థాపించిన ‘అబ్దీ మక్రజ్ కమ్రాజ్’ అనే సంస్థకు బుఖారీ అధ్యక్షుడు. ఈ సంస్థ కృషి ఫలితంగానే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2017లో కశ్మీర్ పాఠశాలల్లో పదో తరగతి వరకూ కశ్మీరీ భాషను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టారు. కశ్మీరీ భాషకు పర్షియన్–అరబిక్ లిపిని రద్దు చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని ఈ సంస్థ జయప్రదంగా ఆడ్డుకున్నది. ఉర్దూ, ఇంగ్లీష్, కశ్మీరీ భాషలలో అధికారం కలిగిన రచయిత బుఖారీ. మంచి వక్త. సాహిత్యసభలలో తరచుగా పాల్గొనేవాడు. అతడు కేవలం జర్నలిస్టు కాదు. శాంతికోసం పరితపించిన∙యాక్టివిస్టు కూడా. ‘రికన్సీలియేషన్ రిసోర్సెస్’ అనే సంస్థను నెలకొల్పి కశ్మీర్లో శాంతి సాధనకు చొరవ తీసుకొని సమాలోచనలు నిర్వహించే బృందంలో బుఖారీ ముఖ్యపాత్రధారి. ఇండియా, పాకిస్తాన్ల మధ్య సమాంతర దౌత్యం (ట్రాక్–2 డిప్లొమసీ) నిర్వహించేవారు. రెండు దేశాల ప్రభుత్వాల, పౌరసమాజాల ప్రతినిధులతో సమాలోచనలు అమెరికాలో, ఇంగ్లండ్‌లో, ఇతర దేశాలలో నిర్వహించేవారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఈ రకం దౌత్యంలో ప్రముఖ సంపాదకుడు శేఖర్‌గుప్తా పాల్గొనేవారు. గత నెల దుబాయ్‌లో బుఖారీ ఆధ్వర్యంలో జరిగిన కశ్మీర్ ఇనీషియేటివ్ భేటీ వివాదాస్పదమైంది. ఇండియా, పాకిస్తాన్‌లు కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతూ సమావేశంలో తీర్మానం ఆమోదించాలని అనుకున్నట్టు వార్త పొక్కింది. తీర్మానం ఆమోదానికి పెట్టలేదు కానీ అందులోని అంశాలపై రకరకాల వ్యాఖ్యలూ, ప్రతిస్పందనలూ సోషల్ మీడియాలో స్వైరవిహారం చేశాయి. ఇది ఉగ్రవాదులను ఆగ్రహోదగ్రులను చేసింది. కశ్మీర్లో శాంతి నెలకొనే అవకాశాలు మెరుగైన ప్రతిసారీ ఉగ్రవాదులు రెచ్చిపోతారు. ‘కశ్మీర్లో ప్రజలు ప్రాణత్యాగం చేస్తున్నది ఉల్లిగడ్డల లేదా ఆలుగడ్డల వ్యాపారం కోసమో, కశ్మీర్‌ను శాశ్వతంగా విభజించడం కోసమో కాదు. కశ్మీర్‌కు విమోచన కలిగించడానికి. దుబాయ్‌లో జరిగిన భేటీ భారత ఇంటెలిజెన్స్ సంస్థల నుంచి డబ్బు తీసుకున్న వ్యక్తులు నిర్వహించింది. అటువంటి సమావేశాలు నిరర్థకమైనవి’ అంటూ భారత ఇంటెలిజెన్స్ సంస్థల తొత్తుగా సుజాత్ తదితరులను జగమెరిగిన ఉగ్రవాది సలాహుద్దీన్ నిందించాడు. హిజ్బుల్ ముజాహిదీన్, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్లు బుఖారీని భారత సైన్యానికీ, ఇంటెలిజెన్స్ సంస్థలకీ డబ్బుకోసం అమ్ముడుపోయిన వ్యక్తిగా అభివర్ణించాయి. హంతకులెవరు? సుజాత్ బుఖారీని ఎవరు చంపారు? ఈ ప్రశ్నపైన సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టింగ్‌లు కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి నివేదికపైన సుజాత్ బుఖారీ వ్యాఖ్య చేసిన కొన్ని గంటలకే అతడిని హత్య చేయడం విశేషం అంటూ పాకిస్తాన్ విదేశాంగ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సుజాత్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉన్నదంటూ పరోక్షంగా పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపిస్తున్నది. బుఖారీని ఎవరు చంపారనే ప్రశ్నకు సమాధానం ప్రస్తుతానికి లేదు. అతడిని చంపవలసిన అవసరం ఎవరికి ఉంది? వేర్పాటువాదులతో, పాకిస్తాన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చర్చలు జరపాలని కశ్మీర్ ముఖ్యమంత్రి పలుసార్లు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కాల్పుల విరమణ గడువును పొడిగించాలనీ, అవసరమైతే వేర్పాటువాదులతో సైతం చర్చలు జరపాలనీ ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో శాంతికాముకుడైన బుఖారీని చంపవలసిన అవసరం కల్లోలం కోరుకునేవారికే ఉంటుంది. ముగ్గురు ఉగ్రవాదులు బైక్‌పైన వచ్చి కాల్పులు జరిపినట్టు జమ్మూ–కశ్మీర్ డీజీపీ ఎస్పి వెయిద్ అంటున్నారు. కశ్మీర్ లోయలో ప్రభుత్వానికీ, వేర్పాటువాదులకూ మధ్య, ఇండియాకూ, పాకిస్తాన్‌కూ మధ్య, ముస్లింలకూ, కశ్మీరీ పండిట్లకూ మధ్య వారధిగా ఉన్న మానవతామూర్తిని పొట్టనపెట్టుకున్నారు. కశ్మీరీ పండిట్లకు అండగా ఉంటూ, వారిని తిరిగి కశ్మీర్‌కు రప్పించాలని కోరుకునేవారిలో బుఖారీ అగ్రగణ్యుడు. అటువంటి ఉదారవాదులకు కశ్మీర్లో స్థానం లేదనీ, భద్రత లేదనీ స్పష్టం చేయడం, ఉదారవాదంవైపు మొగ్గు చూపవద్దని ఇతరులను హెచ్చరించడం హంతకుల లక్ష్యం. ఉగ్రవాదులకు హెచ్చరిక బుఖారీ అంత్యక్రియలకు హాజరైన జర్నలిస్టులు అతడి స్ఫూర్తితో మరింత ధైర్యంగా వ్యవహరించి ఉగ్రవాదుల లక్ష్యాన్ని ఓyì ంచడమే అతడికి నిజమైన నివాళి. కడచిన 15 సంవత్సరాలలో కశ్మీర్లో ఉగ్రవాదులు హత్య చేసిన మొదటి ఉదారవాది బుఖారీ. 2003లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ అబ్దుల్ మాజీద్ దార్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపివేశారు. అంతకు పది నెలల ముందు ప్రొఫెసర్ అబ్దుల్ ఘనీ లోన్ని మీర్వాయిజ్ మౌల్వీ ఫారూఖ్ వర్థంతి సభలో ప్రసంగిస్తున్న సమయంలో హత్య చేశారు. 12 ఏళ్ళ కిందట మౌల్వీ ఫారూఖ్ని కూడా ఉగ్రవాదులే చంపారు. ఫారూఖ్కీ, లోన్‌కీ, దార్కూ, బుఖారీకి మధ్య ఉన్న ఉమ్మడి లక్షణం– ఉదారవాదం. ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు శాంతిమంత్రం జపిస్తారు కనుక వారిని ఉగ్రవాదులు ఉపేక్షించరు. స్నేహశీలి, క్రియాశీలి సుజాత్ బుఖారీని నేను 2010లో మొదటి సారి కలుసుకున్నాను. వందమందికిపైగా యువకులు చేతుల్లో రాళ్ళు పట్టుకొని మరతుపాకుల ఎదురుగా నిలిచి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పారామిలటరీ సైనికులు కాల్పులకు నేలకూలిన ఘటనలు జరిగిన తర్వాత కొన్ని వారాలకు హెచ్ఎంటీవీ తరఫున అక్కడికి వెళ్ళాను. సహచరుడు జమీల్–ఉర్–రెహ్మాన్ తోడు ఉన్నాడు. గృహనిర్బంధంలో ఉన్న వేర్పాటువాద నాయకుడూ, పాకిస్తాన్ అనుకూలుడూ అయిన సయ్యద్ అలీ షా గిలానీనీ, మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ వంటి హురియత్ నాయకులనూ, ఇతరులనూ ఇంటర్వ్యూ చేశాను. సాధారణ ప్రజలతో మాట్లాడాను. చివరి అంశంగా శ్రీనగర్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. అందులో సుజాత్ బుఖారీతో పాటు శ్రీనగర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లూ, పౌరహక్కుల నేతలూ, విద్యార్థులూ అనేక మంది చురుగ్గా పాల్గొన్నారు. కశ్మీర్లో పరిస్థితీ, సైన్యం నీడలో ప్రజల జీవితాలూ, కశ్మీరీ పండిట్ల వలస, ఇండియా, పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న కశ్మీరీల బతుకులూ చర్చకు వచ్చాయి. కశ్మీరీలతో సంబంధాలు లేకుండా ఈ రోజుల్లో ఢిల్లీ స్టుడియోలలో కూర్చొని దేశభక్తి వండివార్చే టీవీ యాంకర్లకు వివేకం కానీ, వినయం కానీ లేవు. విషయపరిజ్ఞానం అంతకంటే లేదు. పాకిస్తాన్‌తో సత్సంబంధాలు పెట్టుకోవాలనీ, పాకిస్తాన్ సహకారంతో కశ్మీర్ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలనీ సూచించే వ్యక్తులను పాకిస్తానీ ఏజెంట్లుగా, దేశద్రోహులుగా చిత్రంచే జర్నలిస్టులు ఢిల్లీలో కొన్ని చానళ్ళను శాసిస్తున్నారు. వారికి నమస్కారం. కశ్మీర్లో ఏ ఘటన జరిగినా కార్యకారణ సంబంధాలు తెలుసుకోవాలంటే అక్కడి సంక్లిష్టమైన పరిస్థితులపైన లోతైన అవగాహన కలిగిన బుఖారీ వంటి వ్యక్తులతో మాట్లాడాలి. బుఖారీ అప్పుడు హిందూ పత్రిక ప్రతినిధిగా శ్రీనగర్‌లో పని చేస్తున్నాడు. ఆ పర్యటనలో రెండు దఫాలు అతడితో సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం కలిగింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక విషయాలు మాట్లాడుకున్నాం. కశ్మీర్ చరిత్రను సరైన దృక్కోణంలో అర్థం చేసుకోవడానికి అవసరమైన అవగాహన కలిగింది. బాలగోపాల్ అంటే బుఖారీకీ, హక్కుల నాయకులకూ, ప్రొఫెసర్లకూ ఇష్టం, గౌరవం. అప్పటికి సంవత్సరం క్రితమే కన్నుమూసిన బాలగోపాల్‌ను చాలామంది గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన సంపాదకుల సమావేశం సందర్భంగా ఒక సారి బుఖారీ, నేనూ కలుసుకున్నాం. ‘ది హన్స్ ఇండియా’ సంపాదకత్వం నిర్వహించిన రోజుల్లో కశ్మీర్లో ముఖ్యమైన పరిణామాలు సంభవించినప్పుడు బుఖారీని అడిగి ప్రత్యేక విశ్లేషణ తెప్పించుకొని ప్రచురించేవాడిని. హైదరాబాద్‌కు కూడా వచ్చాడు. ఎంత గంభీరమైన విషయం మాట్లాడుతున్నా ఆవేశం లేకుండా, చిర్నవ్వు చెదరకుండా ఉండటం, ఏది మాట్లాడినా సాధికారంగా వ్యాఖ్యానించడం అతడి ప్రత్యేకత. బుఖారీ వంటి వ్యక్తులు అరుదుగా తారసపడతారు. అతడి మరణం కశ్మీర్ ప్రజలకు తీరని లోటు. కె. రామచంద్రమూర్తి -
ఉగ్ర కలాపాల్ని పాక్ తక్షణం ఆపాలి: రాజ్‌నాథ్
శ్రీనగర్: ఉగ్రవాద కార్యకలాపాల్ని తక్షణం ఆపివేయాలని హోం మంత్రి రాజ్‌నాథ్ పాక్‌ను కోరారు. కశ్మీర్, పాక్‌లో కశ్మీర్ అంశంపై సరైన ఆలోచన ఉన్న అందరితో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కశ్మీర్లో రెండ్రోజుల పర్యటనకు వచ్చిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. చర్చలకోసం గతేడాది అక్టోబరులోనే కేంద్ర ం ప్రత్యేక ప్రతినిధిని నియమించిందని గుర్తు చేశారు. కశ్మీర్లో కేంద్రం ప్రకటించిన కాల్పుల విరమణను రంజాన్ వరకు పొడిగించే వీలుందన్నారు. పోలీసు అధికారులపై రాళ్లు రువ్విన ఘటనల్లో పాల్గొన్న యువతపై కేసుల్ని ఉపసంహ రించుకోవాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలోని యువతను కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారని, అయితే చిన్నపిల్లలు తప్పులు చేయడం సహజమని ఆయన అన్నారు. -
చెప్పేదొకటి, చేసేదొకటి అంటే ఇదే!
కశ్మీర్ గురించి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చెబుతున్నదానికి, వారు వ్యవహరిస్తున్నదానికి మధ్య తేడా ఉందా? నా అనుమానాలు నాకు ఉన్నప్పటికీ నిజాయితీతో కూడిన సమాధానం ఏమిటంటే నాకు తెలీదు అన్నదే. కాబట్టి ఈ సమస్యను మరింత నిశితంగా పరిశీలిద్దాం. వాస్తవానికి కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ అంశంపై కాస్త మృదువుగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి ఒకటి లేదా రెండు ఉదాహరణలను మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. కానీ, అవి తెచ్చిన ఫలితాలేమిటి అని పరిశీలిస్తే మీరు ఆశ్చర్యపోతారని నేను పందెం కాస్తాను. మొదటగా, స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, ‘కశ్మీరీలను కౌగలించుకోవడమే తప్ప వారిని కాల్చివేయడం లేక నిందించడం’ సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్‌లో మాట్లాడుతూ ‘ఎవరితో మాట్లాడటానికైనా’ తాను సిద్ధంగా ఉన్నానని, కశ్మీరీల ‘మనోభావాలకు వ్యతిరేకంగా’ తాను వ్యవహరించబోనని వాగ్దానం చేశారు. ‘అవసరమైనట్లయితే, సంవత్సరానికి 50 సార్లు’ కూడా కశ్మీర్‌ను సందర్శిస్తానని ఆయన చెప్పారు. ఈ నెలలో రాజ్‌నాథ్ సింగ్ మరింత ముందుకెళ్లారు. కశ్మీర్లో రాళ్లు విసిరి అరెస్టయిన పిల్లలను జైళ్ల నుంచి రిమాండ్ హోమ్‌లకు మార్చాలని వారి కేసులను సానుభూతితో పరిశీలించాలని కోరి నట్లు చెప్పారు. రాళ్లు విసిరిన వారికి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించవచ్చని, తొలిసారి రాళ్లు విసిరి నేరం చేసిన వారిపై కేసులను ఉపసంహరించవచ్చని నవంబర్ 21న మీడియా పేర్కొంది కూడా. కానీ ఇవన్నీ పత్రికా ప్రకటనలు మాత్రమే అయినప్పటికీ, వీటిని కీలకమైనవిగానే భావించాలి. నిజాయితీతో కూడినవిగానే కాకుండా అవి కృతనిశ్చయాన్నే సూచిస్తున్నాయి. అయితే వీటిలో అద్భుతమైన వాగ్దానం ఎవరినీ పెద్దగా ఆకర్షించలేదు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి హురియత్‌తో మాట్లాడతారా అని మీడియా నవంబర్ 17న సంధించిన ప్రశ్నకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అవునని నిర్ధారించడమే కాకుండా కశ్మీరీలతో ‘ఎలాంటి దాపరికం లేకుండా, బేషరతుగా సంభాషిస్తామని’ స్పష్టం చేశారు. నిజానికి ఇది గత సంవత్సరం ఆగస్టు నెలలో రామ్ మాధవ్ చెప్పిన దానికి ప్రతిధ్వని మాత్రమే. అప్పట్లో, తమ ప్రభుత్వం ‘కశ్మీర్ లోయలోని అన్ని సామాజిక వర్గాలతో చర్చించడానికి,’ సిద్ధంగా ఉందని, కశ్మీరీలు ‘భారత రాజ్యాంగం పరిధిలో చంద్రుణ్ణి కూడా అడగవచ్చని’ రామ్ మాధవ్ చెప్పారు. ఈ వ్యాఖ్యానాలన్నీ పైపైన, యాదృచ్ఛికంగా చేసినవిగా ఎవరూ కొట్టిపడేయలేరు. ఇవి బాధ్యతాయుత స్థానాల్లోని వ్యక్తులు చెప్పినవి. పైగా ఇవి స్థిరమైన గొలుసుకట్టు రూపంలో స్పష్టంగా, పదేపదే తరచుగా చేసిన ప్రకటనలు. కాబట్టి సహజంగానే ఈ వ్యాఖ్యలు తప్పకుండా కీలక మార్పులకు దారితీస్తాయని ఎవరైనా భావిస్తారు. కాని అలా మార్పులు చోటు చేసుకోకపోతే, కచ్చితంగా ప్రారంభంలో నేను సంధించిన ప్రశ్నే చెల్లుబాటవుతుంది. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ప్రధాని కేవలం మాటల్లో వాటిని పునరావృతం చేయడానికి ముందుగా, 2016 ఆగస్టులో రామ్ మాధవ్ చేసిన వాగ్దానాలు సంవత్సరం పాటు విస్మరణకు గురయ్యాయి. నిస్సందేహంగానే కేబినెట్ స్థాయి కలిగిన ప్రత్యేక ప్రతినిధిని నియమించారు కానీ, హురియత్‌తో మాట్లాడటానికి అతడు ఇంతవరకు ఎలాంటి విశ్వసనీయ ప్రయత్నం కూడా చేయలేదు. ప్రకటించిన మేరకు చర్చలకు ఎలాంటి ముందస్తు షరతులు ఉండవు. భారత్‌లో విలీనం సమయంలో కశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించేటటువంటి సంస్కరణలను భారత్ పరిగణించాల్సి ఉందని చిదంబరం ప్రకటించిన వైఖరిని ప్రధాని మోదీ గుచ్చి చెప్పినట్లుగా కశ్మీరీలు చంద్రుణ్ణి కూడా కోరవచ్చు. కానీ అమలు కోసం కాకుండా ప్రభావం కలిగించడానికే ఈ మాటల్ని చెప్పినట్లు ధ్వనిస్తోంది. కాబట్టి సరైన విషయాలను ఎలా చెప్పాలో బీజేపీకి బాగా తెలుసు కానీ, వాటిని అమలు చేయకపోవచ్చు లేదా మెల్లగా అమలు చేయవచ్చునని మీరు ఇప్పటికే అభిప్రాయానికి వచ్చేశారు కదా? పనిలోపనిగా ఆర్టికల్ 35 (ఎ), 370లను ఎత్తేయడం లేక సైనిక కాలనీలను నిర్మించడం గురించి కూడా మాట్లాడవచ్చు. అయితే ఇదంతా కశ్మీరీలను తిరిగి నమ్మించడానికి కాకుండా రెచ్చగొట్టడానికి ఉద్దేశించినది కావచ్చు. నేను ముందే చెప్పినట్లుగా, కశ్మీర్‌పై బీజేపీ, కేంద్రప్రభుత్వం చెబుతున్న దానికి, చేస్తున్న దానికి సంబంధం ఉండకపోవచ్చని నాకు కచ్చితంగా తెలీదు కానీ ఇవన్నీ అదే అర్థాన్ని సూచిస్తున్నాయి. అయితే నాకు స్పష్టంగా బోధపడింది ఏమిటంటే బీజేపీ, కేంద్ర ప్రభుత్వ ఆలోచనల్లోనే ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. తాము చెబుతున్నది ఏమిటో వారు గుర్తించక పోవచ్చు లేక తమ ప్రకటనలను కార్యరూపంలో పెట్టాలని వారు భావించక పోవచ్చు. ఇదంతా వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే నిర్ధారణను మీలో కలిగించినట్లయితే మీతో నేను విభేదించాల్సిన అవసరం లేదు. - కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
కశ్మీర్ వద్దు.. చైనా ఎంత చెప్పినా వినట్లేదు
బీజింగ్ : పాక్‌తో వర్తక వ్యాపారాలు కొనసాగించే విషయంలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడర్ పేరును మార్చి.. జమ్ము కశ్మీర్(సమస్మాత్మక) మార్గంలో కాకుండా మరో ప్రత్యామ్నాయా రూట్లో వ్యాపారం కొనసాగించాలని భారత్ సూచించింది. కానీ, అందుకు చైనా సుముఖత వ్యక్తం చేయలేదు. గత వారం భారత్‌లోని చైనా రాయబారి లూఓ ఝావోయూయి ఢిల్లీలో మాట్లాడుతూ... భారత్ నుంచి ప్రతిపాదన వస్తే మంచిదని.. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్. ఓబీఓఆర్ ప్రాజెక్టు నేపథ్యంలో భారత్ సలహాను చైనా పాటించే అంశాలే ఎక్కువ ఉన్నాయని లూఓ అభిప్రాయపడ్డారు. కానీ, చైనా మాత్రం ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు సరికదా పాక్‌ను వెనకేసుకొచ్చింది. కశ్మీర్ అంశం తమ ఆర్థిక ఒప్పందాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని తేల్చేసింది. కశ్మీర్ సమస్య భారత్-పాక్‌దే తప్ప.. తమది కాదని.. చర్చల ద్వారానే ఆ రెండు దేశాలు పరిష్కరించుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే వన్ బెల్ట్ వన్ రోడ్ ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లోని 68 దేశాలను కలుపుతూ.. ఎకనమిక్ కారిడార్ నిర్మించాలని చైనా ప్రతిపాదించిన విషయం తెలిసిందే. తీవ్రవాద ప్రభావిత దేశాల్లో నిర్మిస్తుండడంతో అక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు, బ్యాంకులు సైతం వెనకంజ వేస్తున్నాయి. దీనిపై ఈ మధ్య 29 దేశాల ప్రతినిధులతో బీజింగ్‌లో సదస్సు నిర్వహించగా.. భారత్ ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సదస్సు నుంచి బయటకు వచ్చేసింది. ముందు పొరుగున ఉన్న దేశాలతో స్నేహ పూర్వక ఒప్పందాలు చేసుకోవటం అలవరచుకుంటే మంచిదని ఆ సమయంలో చైనా భారత్‌కు చురకలంటించగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్తునందునే తాము ఓబీఓఆర్‌ను వ్యతిరేకిస్తున్నట్లు భారత్ తేల్చేసింది. మరోవైపు చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అంతర్జాతీయ మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఐరోపా మేధావులు గత కొంతకాలంగా వాదిస్తూ వస్తున్నారు. సీపీఈసీ కారిడార్ అనేది గిల్గిత్-బలిస్తాన్ ప్రాంత ప్రజల హక్కులను కాలరాయడమేనని వారు ప్రకటించారు. పైగా ఈ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని వారు స్పష్టం చేశారు. -
‘పీఓకే.. పాకిస్తాన్‌దే’’
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. పీఓకే పాకిస్తాన్లో అంతర్భాగమని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు సినీ నటుడు రిషి కపూర్ సంచలన ప్రకటన చేశారు. ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు దఖలు పరిస్తేనే.. కశ్మీర్ సమస్యకు శాంతియుత, శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను సమర్థిస్తూ రిషి కపూర్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో నేను చనిపోయేముందు ఒక్కసారి అయినా పాకిస్తాన్‌ను చూడాలి.. మా పూర్వీకులు మూలాలను స్పృశించాలని ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పై రిషి కపూర్ ట్విటర్ వ్యాఖ్యలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు, కొందరైతే తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తే.. మరికొందరు మాత్రం ఇటువంటి ట్వీట్లు చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు. Farooq Abdhulla ji, Salaam! Totally agree with you,sir. J&K is ours, and PoK is theirs. This is the only way we can solve our problem. Accept it, I am 65 years old and I want to see Pakistan before I die. I want my children to see their roots. Bas karva Dijiye. Jai Mata Di ! — Rishi Kapoor (@chintskap) 11 November 2017 -
మళ్లీ చర్చల దిశగా కశ్మీర్
ఆత్మీయ ఆలింగనంతో మాత్రమే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది తప్ప దూషణల వల్లనో, తూటాల ద్వారానో అది సాధ్యం కాదని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రెండు నెలల అనంతరం కేంద్ర ప్రభుత్వం కదిలింది. ఆ సమస్యతో సంబంధం ఉన్న ‘అన్ని భాగస్వామ్య పక్షాలతో’ చర్చల ప్రక్రియను ప్రారంభించబోతున్నట్టు సోమవారం వెల్లడించింది. ఇందుకోసం తన ప్రతినిధిగా ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మాజీ డైరెక్టర్ దినేశ్వర్ శర్మను నియమించింది. హింస నిత్యకృత్యమై, చావులు అతి సాధారణ విషయంగా మారిన కల్లోల కశ్మీర్ తీరుపై అన్ని వర్గాల్లోనూ ఆందోళన ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక...ముఖ్యంగా రెండేళ్ల క్రితం జమ్మూ–కశ్మీర్లో పీడీపీ–బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కశ్మీర్ లోయ మరింత అల్లకల్లోలంగా మారింది. కేంద్రం అనుసరిస్తూ వచ్చిన కఠిన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. అక్కడ అన్ని పక్షాలతో చర్చలు జరిపి ఈ పరిస్థితిని సరిచేయాలని వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఎన్డీఏ ప్రభుత్వం అంగీకరించలేదు. గత ప్రభుత్వాలన్నీ మెతకవైఖరి అవలంబించబట్టే ఈ పరిస్థితి ఏర్పడిందన్నది దాని అవగాహన. స్వాతంత్య్ర దినోత్సవంనాడు నరేంద్ర మోదీ ప్రసంగం విన్నాక కేంద్రం తన వైఖరి మార్చుకున్నదేమోనని అందరూ భావించినా అందుకు సంబంధించిన సంకేతాలేమీ లేవు. ఎట్టకేలకు ఇప్పుడు దినేశ్వర్ శర్మ నియామకం జరిగింది. కశ్మీర్‌కు హింస కొత్త కానట్టే... కేంద్రం అక్కడ దూతల ద్వారా, మధ్యవర్తుల ద్వారా రాయబారాలు నడపడం, చర్చలు సాగించడం కూడా కొత్తగాదు. రాజేష్ పైలట్, జార్జి ఫెర్నాండెజ్ వంటివారు కేంద్రం తరఫున అక్కడ ఆందోళన సాగిస్తున్న వర్గాలతో మాట్లాడారు. వారి మనోభావాలు తెలుసుకున్నారు. వాజపేయి హయాంలో 2001లో కేసీ పంత్‌ను మధ్యవర్తిగా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో చర్చల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈలోగా పార్లమెంటుపై ఉగ్ర వాద దాడి జరగడం, భారత్–పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడటం పర్యవసానంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. 2003లో ప్రస్తుత కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను మధ్యవర్తిగా నియమించి వాజపేయి సర్కారు మరో ప్రయత్నం చేసింది. వీరుగాక ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ, ఫాలీ ఎస్. నారిమన్, శాంతిభూషణ్, ప్రస్తుత కేంద్రమంత్రి ఎంజే అక్బర్ తదితరులతో ఒక స్వతంత్ర కమిటీ ఏర్పడి మిలిటెంట్ వర్గాలతోనూ, స్థానికులతోనూ, వివిధ రాజకీయ పార్టీలతోనూ చర్చించింది. కానీ వీటివల్ల ఒరిగిందేమీ లేదు. 2010లో ప్రముఖ పాత్రికేయుడు దిలీప్ పడ్గావ్కర్, రాధాకుమార్, ఎంఎం అన్సారీలను అప్పటి యూపీఏ ప్రభుత్వం మధ్యవర్తులుగా నియమించింది. ఆ కమిటీ హిజ్బుల్, లష్కరే కమాండర్లతో సైతం మాట్లాడింది. అనుమానితులెవరినైనా కాల్చిచంపడానికి లేదా నిరవధికంగా నిర్బంధించడానికి భద్రతా బలగాలకు అధికారమిస్తున్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ)ను సమీక్షించడంతోసహా వివిధ చర్యలు తీసుకోవాలని 2011లో సిఫార్సు చేసింది. కానీ మరో మూడేళ్లు అధికారంలో ఉన్నా మన్మోహన్ సర్కారు ఆ నివేదిక జోలికి పోలేదు. కేంద్ర ప్రభుత్వంపై తరచు నిప్పులు చెరుగుతున్న బీజేపీ సీనియర్ నేత యశ్వంత్‌సిన్హా నేతృత్వంలోని కమిటీ రెండు దఫాలు ఆ రాష్ట్రాన్ని సందర్శించి భిన్న వర్గాలతో మాట్లాడింది. సహజంగానే ఆ కమిటీ సమర్పించిన నివేదికలను కేంద్రం పట్టించుకోలేదు. కశ్మీర్లో యుద్ధ వాతావరణం ఉన్నదని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రక్షణ శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నప్పుడు అన్నారు. అందులో నిజముంది. నిరుడు జూలైలో మిలిటెంట్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ జరిగాక సాగిన హింసలో 165మంది మిలిటెంట్లు, 14మంది పౌరులు చనిపోగా... భద్రతా సిబ్బంది 88 మంది మరణించారు. ఈ ఏడాది ఇంతవరకూ 176మంది మిలిటెంట్లు చనిపోగా భద్రతా బలగాలకు చెందిన 65మంది, పౌరులు 49మంది మరణించారని గణాం కాలు చెబుతున్నాయి. ఇవిగాక రాళ్లు రువ్వుతున్నవారిపై భద్రతా బలగాలు పెల్లెట్లు ప్రయోగించినప్పుడు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు కంటిచూపు కోల్పోయారు. మరోపక్క కశ్మీర్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు నిధులు వచ్చిపడు తున్నాయన్న సమాచారం ఆధారంగా హురియత్‌తోపాటు పలు సంస్థల బాధ్యు లను అదుపులోనికి తీసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రశ్నించింది. అనేకమందిపై కేసులు నమోదు చేసింది. ఇలాంటి వాతావరణంలో చర్చల కోసం తొలిసారి కేంద్రం తరఫున రిటైరైన పోలీసు ఉన్నతాధికారిని నియమించడంపై హుర్రియత్ వంటి సంస్థల్లో అనుమానాలున్నాయి. సమస్యలున్నచోట, ఉద్రిక్తతలు అలుముకున్నచోట ఇదంతా సహజమే. దినేశ్వర్ శర్మకిచ్చిన అధికారాలేమిటన్న సంగతి ఇంకా తెలియకపోయినా, ‘ఎవరితోనైనాసరే’ ఆయన చర్చలు జరపవచ్చని కేంద్రం విడుదల చేసిన అధికార ప్రకటన చెబుతోంది. హుర్రియత్‌తో ఆయన చర్చలకు సిద్ధపడితే కేంద్రం తన వైఖరిని మార్చుకున్నదని భావించాలి. ఎందు కంటే మొన్న ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో చర్చల ప్రస్తావన వచ్చినప్పుడు ‘చట్ట బద్ధమైనవిగా గుర్తించిన’ పక్షాలతో మాత్రమే చర్చలుంటాయని, కశ్మీర్ విలీనాన్ని తిరగదోడేవారితో లేదా దానికి స్వాతంత్య్రం కావాలనేవారితో మాట్లాడేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే సమస్య రాజకీయపరమైనదని గుర్తించినప్పుడు దాన్ని ఆ కోణంలో పరిష్కరించడానికే పూనుకోవాలి. ఈ విషయంలో పోలీసు శాఖలో పనిచేసి వచ్చిన దినేశ్వర్ శర్మ ఎలాంటి ప్రతిపాదనలు చేయగలరో చూడాలి. ఐబీలో కశ్మీర్ వ్యవహారాలను సుదీర్ఘకాలం చూసిన అధికారిగా ఆయన కేర్పడిన అవగాహన... ఈశాన్య రాష్ట్రాల మిలిటెంట్లతో సాగిస్తున్న చర్చల వల్ల ఆయనకొచ్చిన అనుభవం ఎంతవరకూ తోడ్పడతాయో రాగలకాలంలో తేలు తుంది. కశ్మీర్లో శాంతి పునరుద్ధరణకు అన్ని పక్షాలూ చిత్తశుద్ధితో, ఓరిమితో వ్యవ హరించగలవని ఆశించాలి. -
మిషన్ కశ్మీర్..
-
పాక్‌పై కశ్మీరీలకు ఆశలేం లేవు!
లండన్: దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ల మాజీ గూఢచారులు లండన్‌లో ఒకే వేదికను పంచుకుని కశ్మీర్ అంశంపై మాట్లాడారు. ‘నిఘా సంస్థలు మంచి చేయగలవా?’ అన్న శీర్షికన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత పరిశోధన, విశ్లేషణ విభాగం (రా) మాజీ అధిపతి అమర్జిత్ సింగ్ దులాత్, పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మాజీ చీఫ్ ఎహ్సాన్ హక్ పాల్గొన్నారు. దులాత్ మాట్లాడుతూ ‘కశ్మీరీల మనసుల నుంచి పాక్ ఎప్పుడో చెరిగిపోయింది. పాక్‌తో ఒనగూరే లాభం ఏదీ ఉండదని వారు గ్రహించారు. ఆ దేశంపై కశ్మీరీలు ఆశలేం పెట్టుకోలేదు. గత 15 నెల ల క్రితం వరకు పాక్‌గానీ, పాకిస్తాన్లో గానీ కశ్మీర్‌పై మాట్లాడింది లేదు. అయితే గత 15 నెలలుగా కశ్మీర్లో భారత్ సృష్టించిన గందరగోళం, ప్రభుత్వ విధానాల వల్లే మళ్లీ పాక్ కశ్మీర్ ను తెరపైకి తెస్తోంది’ అని అన్నారు. కశ్మీర్లో హింసకు ప్రతిహింస సమాధానం కాదన్నారు. భారత్ కశ్మీరీలతో మాట్లాడకుండా ఇప్పటికీ తప్పు చేస్తోందనీ, సమస్య పరిష్కారానికి వేర్పాటువాదులతోనూ చర్చించాలన్నారు. బీజేపీ– పీడీపీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీకి ప్రభుత్వంలో చోటు కల్పించిన పీడీపీని ప్రజలు ఇకపై ఎప్పటికీ క్షమించరన్నారు. ఎహ్సాన్ మాట్లాడుతూ కశ్మీర్లో గతేడాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం అక్కడి ప్రజల్లో తిరుగుబాటు పెరిగిందని అన్నారు. కశ్మీర్ వివాదాన్ని అలాగే వదిలేయకూడదనీ, అది అపరిష్కృతంగా ఉంటే సమస్య అంతకంతకూ పెరుగుతూ పోతుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాలు కశ్మీర్ అంశంపై చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని రెండు దేశాల గూఢచారులు ఆకాక్షించారు. దులాత్ గతంలో కశ్మీర్లో ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. -
సుష్మాజీ... కశ్మీర్ సంగతేంటి?
సాక్షి : భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగంపై దాయాది దేశం పాకిస్థాన్ విరుచుకుపడింది. భారత్ ఉగ్రవాదానికి అమ్మ వంటిదని.. దక్షిణాసియా దేశాల్లో టెర్రరిజానికి అసలైన చిరునామా ఇండియాదేనని పాక్ పేర్కొంది. సుష్మా ప్రసంగించి 24 గంటలు గడకముందే ఐరాస వేదికగానే పాక్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ‘‘పాక్‌పై ఇండియా వైఖరి ఏంటో సుష్మా ప్రసంగం ద్వారా స్పష్టమైంది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించటం లేదు ఇండియాలోనే పుడుతోంది’’ అని ఐరాస సాధారణ సభలో పాక్ తరపు రాయబారి మలీహా లోధి ఆరోపించారు. ఈ సందర్బంగా కశ్మీర్ అంశాన్ని ఆమె లేవనెత్తారు. కీలకమైన కశ్మీర్ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు సుష్మా ఇలాంటి ఆరోపణలు చేశారని లోధి తెలిపారు. ‘‘కశ్మీరీల హక్కులను కాలరాస్తూ భారత ప్రభుత్వం అక్కడి ప్రజలపై ఉక్కుపాదం మోపుతోంది. పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా పెల్లెట్లు ప్రయోగిస్తోంది. వాస్తవాలను మరుగున పరిచేందుకు ఆమె (సుష్మా) ప్రయత్నిస్తున్నారు. రెండు దేశాల సరిహద్దుకు సంబంధించిన అంశం చర్చల ద్వారా విఫలమైతే అంతర్జాతీయ సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది’’ అని లోధా చెప్పుకొచ్చారు. కాబట్టి కశ్మీర్ వ్యవహారంలో ఐరాస, అగ్ర రాజ్యాలు జోక్యం చేసుకోవాల్సిందేనని ఆమె కోరారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించటం వాళ్ల(ఐరాస) బాధ్యత మాత్రమే కాదు హక్కు కూడా అని లోధీ చెప్పారు. అదే సమయంలో పాక్ ప్రధాని షాహిద్ ఖాఖన్ అబ్బాసీ కశ్మీర్ అంశం కోసం ఓ ప్రత్యేక దూతను నియామించాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని లోధీ ప్రస్తావించారు. -
త్వరలోనే పాక్ కాల్పులకు బ్రేక్!
-
త్వరలోనే పాక్ కాల్పులకు బ్రేక్!
► మరికొంతకాలం ఆగితే సరిపోతుంది: రాజ్‌నాథ్ ► కశ్మీర్లో శాంతికి ‘5 సీ’ ఫార్ములా నౌషేరా: భారత సరిహద్దుల్లోని గ్రామాలపై కాల్పులు ఆపేలా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచుతున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఇందుకోసం కొంతకాలం ఆగితే సరిపోతుందని సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న వారందరికీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భరోసా ఇచ్చారు. ఒకవేళ పాకిస్తాన్ వైపునుంచి కాల్పులు జరిగితే వారు ఊహించని స్థాయిలో ప్రతీకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నాలుగురోజుల జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా సోమవారం జమ్మూకశ్మీర్‌లోని నౌషేరా సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్దనున్న గ్రామాలనుంచి వచ్చిన వారినుద్దేశించి మంత్రి మాట్లాడారు. ‘కొంతకాలం ఆగండి. పాకిస్తాన్ కాల్పులను ఆపేలా ఒత్తిడి పెరుగుతుంది. నేడో, రేపో వాళ్లు కాల్పులు ఆపేస్తారు. ఆ తర్వాత ఒకవేళ పాకిస్తాన్ ఒక్క బుల్లెట్ కాల్చి నా.. బుల్లెట్లను లెక్కపెట్టకుండా భారత్ ప్రతీకారాన్ని చవిచూడాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు. భారత్ వైపునుంచే ముందుగా కాల్పులు జరగకూడదని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు రాజ్‌నాథ్ సూచించారు. గత కొన్నేళ్లతో పోలిస్తే ఇటీవల కశ్మీర్ లోయలో శాంతి చిగురిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు అందరితోనూ సమావేశమవుతాం. ఈ సమస్యకు కంపాషన్ (సహానుభూతి), కమ్యూనికేషన్ (సమాచార మార్పిడి), కోఎగ్జిస్టెన్స్ (సహజీవనం), కాన్ఫిడెన్స్ బిల్డింగ్ (విశ్వాసం పెంచటం), కన్సిస్టెన్సీ (స్థిరత్వం) అనే 5 సీ ఫార్ములాతో ముందుకెళ్లనున్నాం’ అని ఆయన తెలిపారు. -
విదేశీ జోక్యంతో కశ్మీర్లో కల్లోలమే: ముఫ్తీ
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్య పరిష్కారానికి విదేశీ మధ్యవర్తిత్వం అవసరమంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు. చైనా, అమెరికా లాంటి విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటే కశ్మీర్ మరో సిరియా, అఫ్గానిస్తాన్, ఇరాక్‌లా మారుతుందని హెచ్చరించారు. విదేశీ జోక్యం కోరుతున్న ఫరూక్‌కు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? అని ముఫ్తీ ప్రశ్నించారు. సిరియా, ఇరాక్‌లోని పరిస్థితులను కశ్మీర్లో ఫరూక్ కోరుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు. అమెరికా, చైనాలు తమ అంతర్గత విషయాలపై దృష్టి సారిస్తే మంచిదని ముఫ్తీ అన్నారు. -
‘కశ్మీర్ నాశనానికి ఆయనే కారణం’
-
‘కశ్మీర్ నాశనానికి ఆయనే కారణం’
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య కశ్మీర్ సమస్య పరిష్కారానికి మూడో దేశం (థర్డ్ పార్టీ) మధ్యవర్తిత్వం అవసరమని నేషనల్ కాన్ఫెరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఇది దేశ అంతర్గత వ్యవహారమని, ఇందులో మూడో దేశం జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కశ్మీర్‌ను నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు. ‘కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా జమ్మూకశ్మీర్ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. దీని పరిష్కారానికి మూడో దేశం మధ్యవర్తిత్వం వహించాలని కొందరు సూచించే స్థాయికి సమస్య చేరింది. కానీ ఇది సరైంది కాదు. భారత్ అంటే కశ్మీర్.. కశ్మీర్ అంటే భారత్. ఇది మన అంతర్గత వ్యవహారం. ఇందులో మరో దేశం జోక్యం చేసుకోవడానికి ఒప్పుకోమ’ని రాహుల్ గాంధీ అన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా, చైనా లాంటి దేశాల మధ్యవర్తిత్వం అవసరమని అంతకుముందు ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపమని ఫరూక్ అబ్దుల్లా సలహాయిస్తే సంతోషిస్తామని పీడీపీ ఎమ్మెల్యే సర్తాజ్ మాద్ని అన్నారు. -
కశ్మీర్‌పై నిర్మాణాత్మక పాత్రకు సిద్ధం: చైనా
బీజింగ్: కశ్మీర్ సమస్యపై నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్–పాకిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం కశ్మీర్లో పరిస్థితి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించిందని పేర్కొంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాసియాలో భారత్–పాకిస్తాన్ కీలకమైన దేశాలని, అయితే కశ్మీర్లో పరిస్థితి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి ఇరు దేశాల మధ్యా తలెత్తిన ఉద్రిక్తతలు భారత్–పాక్‌లో సుస్థిరత, శాంతికే కాక.. దక్షిణాసియాలో సుస్థిరతకు, శాంతికి విఘాతం కలిగించే అవకాశం ఉందన్నారు. -
కశ్మీర్‌పై పుతిన్ మధ్యవర్తిత్వం!
► స్వాగతిస్తున్నామన్న పాక్ ► తోసిపుచ్చిన రష్యా, ఖండించిన భారత్ న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ మధ్య కశ్మీర్ సహా ద్వైపాక్షిక సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వానికి సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపినట్లు పాక్ పేర్కొంది. గతవారం అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సులో భాగంగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌తో వ్యక్తిగత సమావేశంలో పుతిన్ ఈ అభిప్రాయాన్ని వెల్లడించారని వెల్లడించింది. అయితే.. పుతిన్ మధ్యవర్తిత్వంపై పాక్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని రష్యా స్పష్టం చేసింది. అస్తానాలో షరీఫ్–పుతిన్ మధ్య భారత్–పాక్ అంశంపై చర్చే జరగలేదని భారత్‌లో రష్యా దౌత్యవేత్త స్పష్టం చేశారు. ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఇరుదేశాల సమస్యలు పరిష్కారం కావాలని రష్యా కోరుకుంటోందన్నారు. పాక్ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. మధ్యవర్తిత్వంపై రష్యానుంచి తమకెలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. -
‘పాకిస్థాన్ ఆ పని చేయదు’
న్యూఢిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టాలనుకుంటున్న పాకిస్థాన్.. కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ న్యాస్థానం(ఐసీజే) దృష్టికి తీసకెళ్లనున్నట్లు వార్తలు వినవస్తున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కీలక ప్రకటన చేశారు. ‘ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందన్న భారత వైఖరిలో ఎలాంటి మార్పులేదు. పాకిస్థాన్ సైతం ఈ విషయంలో ఐసీజేకి వెళ్లదని భావిస్తున్నాం’ అని సుష్మ వ్యాఖ్యానించారు. కేంద్రంలో మోదీ సర్కారు ఏర్పడి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కశ్మీర్ వివాదంతోపాటు తమ(విదేశాంగ) శాఖకు సంబంధించిన పలు విషయాలను ఆమె వెల్లడించారు. ‘పాకిస్థాన్‌తో ఎల్లప్పుడూ స్నేహాన్నే కోరుకుంటాం. కానీ.. విధ్వంసం, శాంతి ఒకే గొడుగుకింద మనలేవు. ఒక వైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మరోవైపు చర్చలంటే సాధ్యమయ్యేపనికాదు. పాక్ తన ద్వంద్వవైఖరి వీడితే చర్చలకు భారత్ సిద్ధమే’ అని సుష్మా స్వరాజ్ అన్నారు. ఎన్నారైలు గతంలో కంటే ఇప్పుడు మాతృదేశంతో బాధవ్యాన్ని కొనసాగించగలుగుతున్నారని, గడిచిన మూడేళ్లలో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక 37.5 శాతం పెరిగిందని, సంక్షుభిత దేశాల్లో చిక్కుకుపోయిన 80 వేల మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించామని సుష్మా చెప్పారు. విదేశాంగ శాఖ ద్వారా ప్రజలకు మరింత సేవ చేయడంలో తనకు సహకారం అందించిన ప్రధాని మోదీ, సహాయ మంత్రులు వీకే సింగ్, ఎంజే అక్బర్‌లకు సుష్మా ధన్యవాదాలు తెలిపారు. -
మోదీ చేతకానితనం వల్లే కశ్మీర్లో అల్లర్లు
-
శాశ్వత పరిష్కారం కనుగొన్నాం
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యకు ఎన్డీఏ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కనుగొన్నదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అయితే దేశ ప్రాదేశిక సమగ్రతపై రాజీ ఉండదని స్పష్టం చేశారు. వేర్పాటువాద గ్రూపులతో చర్చలు జరపబోమని తేల్చిచెప్పారు. ‘కశ్మీర్‌కు ఒక శాశ్వత పరిష్కారం కావాలి.. సంబంధిత ప్రక్రియ మొదలైంది. ఆ దిశగా ముందుకెళ్తున్నాం’ అని ఓ వార్తాసంస్థతో అన్నారు. అయితే ఆ పరిష్కార వివరాలను వెల్లడించలేదు. రాజకీయ పరిష్కారం కనుగొన్నారా అని అడగ్గా.. ‘బహిరంగంగా చర్చించడం తొందరపాటు అవుతుంది. మీడియాతో చర్చించదలచుకోలేదు’ అని బదులిచ్చారు. కశ్మీర్‌పై సంబంధిత వర్గాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధమేనని, అయితే దీని కోసం వ్యక్తులకు, గ్రూపుల ఆహ్వానాలు పంపబోమని రాజ్‌నాథ్ చెప్పారు. ఇది దశాబ్దాల సమస్య అని, లోయలో యువత తీవ్రవాద బాటపట్టడంతో ఆందోళనలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. -
‘కశ్మీర్ సమస్య పరిష్కారానికి చైనా సై’
-
‘కశ్మీర్ సమస్య పరిష్కారానికి చైనా సై’
బీజింగ్: కశ్మీర్ అంశంపై భారత్, పాక్ చర్చలకు చైనా మద్దతిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం వెల్లడించారు. ఇరు దేశాలకు ‘‘అత్యంత అనుకూల పరిష్కారం’’లభించాలని చైనా ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘వన్ బెల్ట్– వన్ రోడ్’కార్యక్రమంలో పాల్గొనేందుకు చైనా వచ్చిన షరీఫ్ ఆ దేశ ప్రధాని లీ కెకియాంగ్ను కలిశారు. అనంతరం పాక్ ప్రధాని మీడియాతో మాట్లాడారు. ‘‘కశ్మీర్ అంశంలో పాక్ వాదనను చైనా ఎప్పుడూ సమర్థిస్తూనే ఉంది. భవిష్యత్‌లోనూ ఇదే తరహా మద్దతును అందిస్తుందని ఆశిస్తున్నా’’అని తెలిపారు. చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) పేరుతో చైనా నిర్మిస్తున్న రోడ్డుకు పెట్టుబడులను 46 బిలియన్ డాలర్ల నుంచి 56 బిలియన్ డాలర్లకు పెంచినట్లు చెప్పారు. అంతేకాదు చైనాకు చెందిన పలు కంపెనీలు కూడా పాక్‌లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. సీపీఈసీ పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఈ నిర్మాణం వెళుతుండడం పాక్ ప్రధాని మాటలకు బలం చేకూర్చుతోంది. ‘‘ఇరు దేశాల మధ్య ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. సంప్రదింపులు, చర్చలతో పరిష్కరించుకోవాలి. కారిడార్ నిర్మాణం చేపట్టినంత మాత్రాన కశ్మీర్ అంశంలో మా నిర్ణయంలో మార్పు ఉండదు’’అని మే 3న పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూ్యలో చైనా విదేశాంగ ప్రతినిధి జెంగ్ షువాంగ్ పేర్కొనడం గమనార్హం. -
మోదీ ఒక్కరే చేయగలరు!
కశ్మీర్ సమస్యకు పరిష్కారంపై మెహబూబా ► మోదీ మాటకు దేశమంతా మద్దతిస్తోందని ప్రశంస జమ్మూ/న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో కశ్మీర్ సమస్యకు పరిష్కారం సూచించే వ్యక్తి ప్రధాని మోదీ ఒక్కరేనని జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా అన్నారు. బలమైన ప్రజామోదం ఉన్న మోదీని లోయను సమస్యల సుడిగుండం నుంచి బయటకు తీసుకురావాలని ఆమె కోరారు. లోయలో శాంతి నెలకొల్పేందుకు వాజ్‌పేయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలును కొనసాగించటంలో యూపీఏ ప్రభుత్వం వైఫల్యం కారణంగానే పరిస్థితి దారుణంగా తయారైందని విమర్శించారు. ‘నేను మనస్సాక్షిగా ఓ విషయం చెబుతున్నా. ఇందుకు నాపై విమర్శలు రావొచ్చు. జమ్మూకశ్మీర్ సమస్యకు ఎవరైనా పరిష్కారం చెప్పగలరు అనుకుంటే అది ప్రధాని మోదీ ఒక్కరే. ఆయనకు బలమైన ప్రజామోదం ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దేశమంతా మద్దతుగా ఉంటుంది’ అని అన్నారు. అందుకే తమను విషమపరిస్థితుల్లోంచి బయటపడేయాలని ప్రధానిని ఆమె కోరారు. జమ్మూలో ఓ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా మెహబూబా మాట్లాడుతూ.. ‘ప్రజామోదమే బలమైన శక్తి. ఆయన లాహోర్ వెళ్లారు. ఆ దేశ ప్రధానిని కలిశారు. ఇది ఆయనకు బలహీనత కాదు. బలమైన శక్తికి సంకేతమది’ అని తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌కు పాక్‌లో పర్యటించే ధైర్యమే ఉండేది కాదన్నారు. ‘మాజీ ప్రధానికి పాకిస్తాన్ వెళ్లాలని.. తన పూర్వీకుల ఇంటిని చూడాలని ఉండేది. కశ్మీర్ సమస్యపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలని ఆయన కూడా అనుకున్నారు. అందుకు అవసరమైన ధైర్యమే ఆయనకు లేదు’ అని మెహబూబా వెల్లడించారు. వాజ్‌పేయి–సయీద్ హయాంలో.. కశ్మీర్లో 2002ను శాంతి అధ్యాయంగా పేర్కొన్న మెహబూబా.. అప్పటి ప్రధాని వాజ్‌పేయి, సీఎం ముఫ్తీ సయీద్లకే ఈ ఘనత దక్కుతుందన్నారు. ‘సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘన జరుగుతున్నప్పటికీ.. ఎల్కే అడ్వాణీ పాక్‌తో చర్చలు జరిపారు. అప్పుడే వాస్తవాధీన రేఖ వెంట ఇరు ప్రాంతాలను కలిపే రోడ్లను తెరవాలన్న ప్రతిపాదనకు అంతా సిద్ధమైంది’ అని తెలిపారు. -
మధ్యవర్తిత్వానికి సిద్ధం
కశ్మీర్ సమస్యపై చైనా బీజింగ్: భారత్–పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం నెరిపేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లే చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌లో తమ దేశం 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, అందువల్ల కశ్మీర్ సమస్య పరిష్కారం కావడం తమ దేశానికీ అవసరమేనని పేర్కొంది. దక్షిణాసియా ప్రాంతంలో కీలక పాత్ర పోషించేందుకు చైనా చాలా ఆసక్తిని చూపిస్తోందని అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నేతృత్వంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. ఇతర దేశాల అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం చైనా అభిమతం కాదని, అయితే విదేశాల్లోని తమ దేశ పెట్టుబడులకు రక్షణ కల్పించే విషయంలో పట్టనట్టు వ్యవహరించబోదని స్పష్టం చేసింది. -
కశ్మీర్ ద్వైపాక్షిక అంశం
టర్కీ అధ్యక్షుడికి భారత్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం బహుళ పక్ష చర్చలు జరపాలని, అందులో తామూ పాలుపంచుకుంటామని టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్దోగన్ చేసిన సూచనను భారత్ తోసిపుచ్చింది. ఇది ద్వైపాక్షిక అంశమని, సీమాంతర ఉగ్రవాదం దీనికి కారణమని ఆయనకు స్పష్టం చేసింది. భారత పర్యటన ప్రారంభ సందర్భంగా ఎర్డోగన్ ఆదివారం ఓ ఇంటర్వూ్యలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. సోమవారం ఢిల్లీ లో ఆయన ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఉగ్రవాదం, కశ్మీర్‌లపై తమ వాదనను ఎర్దోగన్‌కు స్పష్టం చేశామని విదేశాంగ ప్రతినిధి గోపాల్ బాగ్లే విలేకరులకు చెప్పా రు. ‘ఉద్దేశం ఏదైనా ఉగ్రవాదాన్ని సమర్థించకూడదని తేల్చిచెప్పాం. పాక్‌తో కశ్మీర్ సహా అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మేం సిద్ధం. మా వాదనను టర్కీ జాగ్రత్తగా ఆలకించింది’ అనిఅన్నారు. ఉగ్రపోరులో సాయం చేస్తాం: ఎర్డోగన్ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సాయం చేస్తామని మోదీతో భేటీలో ఎర్డోగన్ హామీ ఇచ్చారు. ఉగ్రవాదం ఇరు దేశాలకు ఆందోళనకరమన్న ఇరువురు నేతలు చర్చల తర్వాత విలేకర్లతో మాట్లాడారు. ‘ఉగ్రవాదం సక్రమమైందని ఉద్దేశం, ఏ కారణమూ చెప్పజాలదు. ఈ భూతాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించాం’ అని మోదీ తెలిపారు. ఎర్డోగన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు టెలికం సహా పలు రంగాల్లో మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. చర్చలకు ముందు మోదీ, ఎర్డోగన్‌లు భారత్–టర్కీ వ్యాపారుల సదస్సులో మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీతో చర్చలకు ముందు ఎర్డోగన్‌కు రాష్ట్రపతి భవన్లో ఘనస్వాగతం లభించింది. ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఎర్డోగన్ డిమాండ్ చేశారు. -
వేర్పాటువాదులతో చర్చలు లేవు
కశ్మీర్ సమస్యపై సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం - చట్టబద్ధంగా అర్హత కలిగిన వారితోనే సంప్రదింపులు న్యూఢిల్లీ: రావణకాష్టంలా రగులుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి వేర్పాటువాదులు లేదా స్వాతంత్య్రం(ఆజాదీ) కావాలని డిమాండ్ చేసే వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. కశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చట్టబద్ధంగా అర్హత కలిగిన రాజకీయ పార్టీలు, వ్యక్తులతో సంప్రదింపులు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ అభిప్రాయాన్ని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ శుక్రవారం అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. అటార్నీ జనరల్ చెప్పిన అంశాలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ప్రస్తుతం పరిస్థితులు క్లిష్టంగా ఉన్నందున చట్టానికి లోబడి నడుచుకునే వారంతా సమావేశమై చర్చించి.. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో తమ ముందుకు రావాలని సూచించింది. అనేక మంది మృతికి, గాయపడ్డానికిS కారణమైన పెల్లెట్ గన్ల నిషేధానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలన్న జమ్మూకశ్మీర్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్మాణాత్మక సూచనలతో బార్ అసోసియేషన్ తమ ముందుకు వస్తేనే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని పేర్కొంది. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు ముందు సంబంధిత వర్గాలతో సంప్రదింపులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాళ్లు రువ్వే ఘటనలు, వీధుల్లో హింసాత్మక ఆందోళనలు ఆగిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు వేర్పాటువాదులకు చర్చల ప్రక్రియలో చోటు కల్పించాలన్న బార్ అసోసియేషన్ ప్రతిపాదనను అటార్నీ జనరల్ తీవ్రంగా వ్యతిరేకించారు. కశ్మీర్ స్వాతంత్య్రంపై ప్రశ్నలు సంధిస్తూ.. గృహ నిర్బంధంలో ఉన్న పలువురు వేర్పాటువాద నేతల పేర్లను అఫిడవిట్లో ప్రస్తావించడం ద్వారా బార్ అసోసియేషన్ ఈ అంశానికి రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తోందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం కలుగజేసుకుంటూ తాము సంప్రదింపుల ప్రక్రియ కొనసాగాలని కోరుకుంటున్నామని, దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే విచారణను ఇప్పుడే ముగిస్తామని కేంద్రానికి స్పష్టం చేసింది. హింసాత్మక ఘటనలు, రాళ్లు రువ్వడం వంటివి ఆగిపోతాయని హామీ ఇస్తే పెల్లెట్ గన్ల వినియోగం నిలిపివేయాలని ఆదేశాలిస్తామని బార్ అసోసియేషన్‌కు తెలిపింది. అయితే రాష్ట్రంలోని అందరి తరఫున తాము హామీ ఇవ్వలేమని చెప్పడంతో.. న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కశ్మీర్లో సాధారణ స్థితి ఏర్పడేందుకు ఇరు వర్గాలు ఉమ్మడిగా ముందడుగు వేయాలని, తొలి అడుగు వేయాల్సింది బారే అని, ఇదే వారికి చివరి అవకాశమని స్పష్టం చేసింది. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే బార్ అసోసియేషన్ పాత్రే కీలకమని, ఇందుకు వారు సిద్ధపడితే చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను మే 9వ తేదీకి వాయిదా వేసింది. -
చర్చలే ఏకైక మార్గం
కశ్మీర్ సమస్య పరిష్కారంపై మెహబూబా ముఫ్తీ ► లోయలో చర్చలు జరిపేందుకు ప్రధాని సంసిద్ధత న్యూఢిల్లీ: హింసతో రగులుతున్న కశ్మీరులో పరిస్థితులను చక్కదిద్దడానికి సంబంధిత వర్గాలతో ప్రధాని మోదీ చర్చలకు సుముఖంగా ఉన్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చెప్పారు. అయితే లోయలో అందుకు అనువైన పరిస్థితులు కల్పించాలన్నారు. కాల్పులు కొనసాగిస్తూ, రాళ్లు రువ్వుకుంటుంటే చర్చలు సాధ్యపడవన్నారు. మెహబూబా సోమవారం ప్రధాని మోదీతో ఆయన నివాసంలో 20 నిమిషాల భేటీ అయ్యారు. కశ్మీరులో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి నాటి ప్రధాని వాజ్‌పేయి జరిపిన చర్చలను కొనసాగించాలని ఆమె మోదీకి సూచించారు. ‘కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు మోదీ సంసిద్ధతను వ్యక్తం చేశారు’అని ముఫ్తీ సమావేశమనంతరం మీడియాకు తెలిపారు. వాజ్‌పేయి అడుగుజాడల్లో నడుస్తాం... ‘నాడు వాజ్‌పేయి ప్రధానిగా, అద్వానీ ఉప ప్రధానిగా ఉన్నప్పుడు హురియత్ కాన్ఫరెన్స్‌తో చర్చలు జరిపారు. వారు ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచి చర్చలను తిరిగి ప్రారంభించాలి. సమస్య పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గం’అని ముఫ్తీ చెప్పారు. ‘వాజ్‌పేయి విధానం ఘర్షణలు కాదు... సయోధ్య. కశ్మీర్ అంశంలో ఆయన అడుగుజాడల్లో నడు స్తాం’ అని మోదీ చెప్పినట్టు ముఫ్తీ తెలిపారు. ఈ నెల 9 శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల నాటి నుంచి లోయలో హింస పెచ్చుమీరి పోయింది. పీడీపీ నాయకుడి కాల్చివేత శ్రీనగర్: దక్షిణ కశ్మీర్ లోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) పుల్వామా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఘనీని మిలిటెంట్లు రైఫిల్‌తో కాల్చిచంపారు. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో అతడి ఛాతీలోకి రెండు బుల్లెట్లు, భుజంలోకి ఒక బుల్లెట్ దూసుకుపోయాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు, శ్రీనగర్‌లో వాణిజ్య సముదాయాలు, ధనవంతులుండే ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. పోలీసులపైకి విద్యార్థులు రాళ్లతో దాడికి దిగారు. -
కశ్మీరీలకు పాకిస్థాన్ మద్దతు
ఇస్లామాబాద్: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ పాలకులు మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి వేదికపైనా కశ్మీరీలకు అండగా నిలుస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ప్రకటించారు. కశ్మీర్ దినం(ఫిబ్రవరి 5) సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ... ఏడు దశాబ్దాలుగా స్వయం పాలన కోసం పోరాడుతున్న కశ్మీరీలను భారత్ అణచివేస్తోందని ఆరోపించారు. కశ్మీర్ సోదరీసోదరులకు పాకిస్థాన్ పౌరులు అండగా నిలబడతారని తెలిపారు. ఎటువంటి సమయంలోనైనా కశ్మీరీలకు దన్నుగా నిలుస్తామన్నారు. కశ్మీర్ అంశం సమసిపోని వివాదమని పేర్కొన్నారు. ఉప ఖండం విభజనలో కశ్మీర్ సమస్య అసమగ్ర అజెండగా ఉందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ పౌరులకు ఎల్లప్పుడూ నైతిక, దౌత్య, రాజకీయ మద్దతు ఇస్తామని మమ్నూన్ హుస్సేన్ తెలిపారు. -
బ్రిటన్ పార్లమెంటులో కశ్మీర్‌పై చర్చ
తీవ్ర నిరసన తెలిపిన భారత్ లండన్ : బ్రిటన్ పార్లమెంటులో గురువారం కశ్మీర్ అంశంపై చర్చ జరిగింది. కశ్మీర్ లోయలో నెలకొన్న సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని బ్రిటన్ ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. కశ్మీర్ విషయంలో మూడో శక్తి జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. ‘జమ్మూకశ్మీర్‌తోపాటు భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి షిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ కు అనుగుణంగా శాంతియుత విధానంలో ద్వైపాక్షిక చర్చలు జరగాలి. అంతేతప్ప మూడో వ్యక్తి జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. బుధవారం యూకే హౌజ్ ఆఫ్ కామన్స్ లో జరిగిన చర్చలో భారత్–పాక్ మధ్య శాంతి చర్చల ప్రక్రియ మొదలవ్వటమే కశ్మీర్ సమస్యకు దీర్ఘకాల పరిష్కారమని.. ఈ చర్చలు జరిగేలా బ్రిటన్ చొరవlతీసుకోవాలని సభ్యులు కోరారు. ‘లడఖ్, జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న అమాయక ప్రజలకోసం.. మధ్యవర్తిత్వానికి మేం సిద్ధం. లడఖ్, జమ్మూ, కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే. భారత్–పాక్ ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి తీర్మానానికి కట్టుబడి ఉండాలి’ అని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ తెలిపారు. -
అసలు ద్రోహులు వాళ్లే: మాజీ సీఎం
-
‘నన్ను నిందించేవాళ్లే అసలు దేశద్రోహులు’
శ్రీనగర్: పాకిస్థాన్ అక్రమిత కశ్మీర్(పీవోకే) ప్రాంతం భారత జాగీరు కాదంటూ తాను చేసిన వ్యాఖ్యలను జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సమర్థించుకున్నారు. భారత పార్లమెంట్లో పీవోకేపై తీర్మానం ఆలోచనను కూడా ఆయన తప్పుపట్టారు. ఆదివారం శ్రీనగర్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. తనను దేశద్రోహి అన్నవారే నిజమైన దేశద్రోహులని మండిపడ్డారు. ‘పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటి నుంచో దాయాది ఆధీనంలో ఉంది. అది మనకే చెందుతుందని భారత్.. భారత భూభాగంలోని కశ్మీర్ తమదని పాకిస్థాన్ దశాబ్ధాలుగా వాదులాడుకుంటున్నాయి. కానీ ఈ రోజుకీ ఎవరి ప్రాంతం వాళ్ల ఆధీనంలోనే ఉంది. దీనిపై ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. కొత్తగా మోదీ వచ్చి పీవోకేను తిరిగి తీసుకుంటామంటున్నారు. ఇది జరిగే పనేనా? మోదీకి అంత దమ్ముందా? ఎవరి హద్దుల్లో వాళ్లు ఉండాల్సిందిపోయి లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారు. ఈ అస్పష్ట విధానాన్నే నేను ప్రశ్నిస్తున్నా’అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పీవోకేతోపాటు ఉగ్రవాది మసూద్ అజార్, డాన్ దావూద్ ఇబ్రహీంలపై పార్లమెంట్లో గతంలోనూ ఎన్నో తీర్మానాలు చేశారని, అయితే ఆ మేరకు ఏ ప్రభుత్వాలు కూడా చర్యలకు దిగలేదని అబ్దుల్లా తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని అక్సాయి ప్రాంతాన్ని పాక్.. చైనాకు అప్పగించినప్పుడు కూడా భారత ప్రభుత్వం మౌనంగా ఉందేతప్ప దానిపై చైనాతో మాట్లాడే సాహసం చేయలేదని అబ్దుల్లా ఆరోపించారు. ‘ఈ అభిప్రాయాలు వెల్లడించినందుకు నన్ను కొందరు దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారు. నన్నలా నిందించడానికి వాళ్లెవరు? నన్ను దేశద్రోహి అన్నవాళ్లే నిజమైన దేశద్రోహులు’అని ఫరూక్ అబ్దుల్లా నిప్పులుచెరిగారు. -
కశ్మీర్‌పై విషం చిమ్మిన మాజీ ముఖ్యమంత్రి
కేంద్ర మాజీమంత్రి, జమ్ము కశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన ఫరూక్ అబ్దుల్లా కశ్మీర్ విషయంలో విషం చిమ్మారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏమైనా భారత్ 'బాబుగాడి సొమ్మా' అనడమే కాక, నరేంద్రమోదీ ప్రభుత్వానికి దమ్ముంటే ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని సవాలు చేశారు. భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవించి కూడా ఫక్తు పాకిస్థానీ ఉగ్రవాది తరహాలో వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కూడా స్టేక్‌హోల్డర్లలో ఒకటని, ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఆమోదించిందని అన్నారు. దీనిపై ఒక ఒప్పందం కూడా ఉందని.. దాని ప్రకారం పీఓకే అనేది భారతదేశంలో భాగమని చెబుతూనే.. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి పాకిస్థాన్‌తో చర్చలు జరపడం తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు తొలగాలంటే అదొక్కటే మార్గమన్నారు. పాకిస్థాన్ నుంచి పీఓకేను లాక్కునే దమ్ము భారత ప్రభుత్వానికి లేదని, అలాగే భారతదేశం నుంచి కశ్మీర్‌ను లాక్కునే ధైర్యం పాకిస్థాన్‌కు లేదని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. వీరిద్దరి మధ్య అమాయకులైన కశ్మీర్ ప్రజలు నలిగిపోతున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి బ్యాంకుకు వెళ్లి డబ్బు మార్చుకున్న అంశంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. మంచి కొడుకు ఎవరైనా తల్లి కష్టపడకూడదని అన్నీ త్యాగం చేస్తాడని.. తాను తీసుకున్న నిర్ణయం (పెద్దనోట్ల రద్దు) కారణంగా కలిగిన అసౌకర్యానికి ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెళ్లి చేసుకోనివాళ్లకు కూతురి పెళ్లి కష్టాలు ఎలా తెలుస్తాయని, రూ. 2.50 లక్షలతో పెళ్లి ఏర్పాట్లు చేయడం ఎలా సాధ్యమని పరోక్షంగా కూడా మోదీని విమర్శించారు. -
పాక్ ప్రధానిపై విరుచుకుపడ్డ ఉగ్రవాది
కరాచీ: బహిరంగంగా సంచరిస్తోన్న ఉగ్రవాది ప్రభుత్వాధినేతపైనే ధ్వజమెత్తాడు. దాయాది దేశ అంతర్గత వ్యవహారంలో తలను పూర్తిగా దూర్చాలని ప్రధానమంత్రిని హెచ్చరించాడు. ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్ శుక్రవారం పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధాని నవాజ్ షరీఫ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. శుక్రవారం కరాచీలోని మర్కజ ఇ తఖ్వా మసీదులో నిర్వహించిన శాంతి సభలో హఫీజ్ ఈ మేరకు ఘాటు ప్రసంగం చేశాడు. 'అవతల భారత్ ఆధీనంలోని కశ్మీరీలు కష్టాల్లో ఉన్నారు. అక్కడి సైన్యం చేతిలో చావుదెబ్బలు తింటున్నారు. వారిపట్ల పాకిస్థాన్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఏవో రెండు మూడు హెచ్చరికలు తప్ప ఈ విషయంలో ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిందేమీలేదు. పాక్ ప్రభుత్వం తక్షణమే కశ్మీరీలకు అవసరమైన 'అన్నిరకాల' సహాయసహకాలు అందించాలి'అని హఫీజ్ సయీద్ అన్నాడు. కశ్మీర్ అంశంలో కలుగజేసుకోకుండా ఉండేలా పాకిస్థాన్ లో రాజకీయ అస్థిరత సృష్టించాలని భారత్ ప్రయత్నిస్తోందని, ఆ ప్రయత్నాలను ధీటుగా తిప్పికొట్టాలని హఫీజ్ పిలుపునిచ్చాడు. దేశమంతా క్వెట్టా ఉగ్రదాడి విషాదంలో ఉన్న తరుణంలో హఫీజ్ చేసిన వ్యాఖ్యలను పాక్ మీడియా సైతం తప్పుపట్టడం గమనార్హం. గతవారం క్వెట్టాలోని పోలీస్ అకాడమీపై ఉగ్రవాదులు విరుచుకుపడి, 59 మంది ట్రైనీ పోలీసులను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. -
పాక్ సిద్ధమే.. భారత్ సిద్ధమేనా: షరీఫ్
ఇస్లామాబాద్: భారత్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. కశ్మీర్ సమస్యలను పరిష్కారించాలని భారత్ కూడా భావించినట్లయితే అందుకు తమకు ఏ అభ్యంతరం లేదని షరీష్ తెలిపారు. మూడో రోజుల పర్యటనలో భాగంగా అజర్ బైజాన్, బాకులో ఉన్న పాక్ ప్రధాని మీడియాతో మాట్లాడాతూ.. కశ్మీర్లో కొనసాగుతున్న హింస, ఇతర ముఖ్య సమస్యలపై చర్చించాలని పాక్ పలు పర్యాయాలు భారత్ కు ఆహ్వానం పంపినా ప్రయోజనం లేకపోయిందన్నారు. భారత్-పాక్ మధ్య అశాంతియుత వాతావరణం నెలకొనడానికి కశ్మీర్ అంశమే ప్రధాన కారణమని షరీష్ అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సూచన మేరకు భారత్ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. ఉడీలోని భారత ఆర్మీ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడికి పాకిస్తాన్ పనేనన్న భారత్ ఆరోపణలను మరోసారి కొట్టిపారేశారు. లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్వోసీ) వద్ద పాక్ ఎలాంటి చొరబాట్లకు యత్నించలేదన్నారు. ఉడీలో జరిగిన ఉగ్రదాడిలో 19 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. -
స్నేహ హస్తం చాస్తే.. ఉగ్రదాడులా?
-
స్నేహ హస్తం చాస్తే.. ఉగ్రదాడులా?
పాక్ తీరును ఐరాసలో ఎండగట్టిన సుష్మాస్వరాజ్ - బలూచిస్తాన్ ప్రజలపై పాశవిక అణచివేత - ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటమే కొన్ని దేశాల చిరునామా - ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగం ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌తో స్నేహం కోసం ప్రయత్నిస్తే.. దానికి బదులుగా భారత్‌కు ఉగ్రదాడులు లభించాయని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ తూర్పారబట్టింది. హక్కుల ఉల్లంఘనలపై ఇతరులను నిందించే వాళ్లు ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని పాక్‌కు హితవుపలికింది. బలూచిస్తాన్‌లో పాక్ అత్యంత పాశవికమైన అణచివేతను సాగిస్తోందంటూ.. ఐరాస సర్వసభ్య సభ సమావేశంలో తొలిసారి ఆ దేశాన్ని భారత్ అభిశంసించింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాలను ఏకాకులను చేయాలని ప్రపంచానికి పిలుపునిచ్చింది. సమితి 71వ సర్వసభ్య సమావేశంలో సోమవారం భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు. వారం కిందట ఇదే వేదిక నుంచి పాక్ ప్రధాని షరీఫ్ భారత్‌పై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ‘కొన్ని దేశాలున్నాయి. ఐరాస ప్రకటించిన ఉగ్రవాదులు అక్కడ స్వేచ్ఛగా విహరిస్తుంటారు. విద్వేష ప్రబోధాలను ఇస్తూ ఉంటారు.. వారికి చట్టం, శిక్షలు వర్తించవు. అటువంటి దేశాలు అవి ఆశ్రయం ఇచ్చిన ఉగ్రవాదులు ఎంత నేరస్తులో అంతే నేరస్త దేశాలవుతాయి. అలాంటి దేశాలకు ప్రపంచ దేశాల కమిటీలో చోటు ఉండరాదు’ అంటూ పాక్‌పై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెడుతూ.. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జామత్ ఉద్-దావా అధినేతసయీద్ విషయాన్ని పేరు చెప్పకుండా సుష్మా ప్రస్తావించారు. ‘మన మధ్య కొన్ని దేశాలు ఉన్నాయి. అవి ఇంకా ఉగ్రవాద భాషను మాట్లాడుతుంటాయి, ఉగ్రవాదాన్ని పోషిస్తుంటాయి, విస్తరిస్తుంటాయి, ఎగుమతి చేస్తుంటాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటమే వాటి చిరునామాగా మారింది. అటువంటి దేశాలను మనం గుర్తించితీరాలి. వాటిని ఏకాకులను చేయాలి’ అని అన్నారు. కశ్మీర్‌పై కలలు మానండి... చర్చలకు భారత్ తమకు ఆమోదనీయం కాని ముందస్తు షరతులు విధించిందన్న పాక్ వాదనను తిప్పికొడుతూ.. షరతులు కాకుండా స్నేహం ప్రాతిపదికన పాక్‌తో సమస్యలను పరిష్కరించటం కోసం ముందడుగు వేసినందుకుభారత్‌కు పఠాన్‌కోట్, ఉడీ దాడులు ప్రతిఫలంగా దక్కాయని సుష్మా పేర్కొన్నారు. ఇటువంటి దాడుల ద్వారా కశ్మీర్‌ను పొందగలమన్న కలను పాకిస్తాన్ విడనాడాలని ఆమె సూచించారు. వారి ప్రణాళికలు సఫలం కావని.. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, అది అలాగే ఉండిపోతుందని ఉద్ఘాటించారు. పాక్ ప్రమేయానికి సజీవ సాక్ష్యం... ‘మా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేముందు మేం షరతులు పెట్టామా? హార్ట్ ఆఫ్ ఏసియా సదస్సు కోసం నేను ఇస్లామాబాద్ వెళ్లి, సమగ్ర ద్వైపాక్షిక చర్చలను ప్రారంభించడానికి అంగీకరించినపుడు షరతులు పెట్టామా? మోదీ కాబూల్ నుండి లాహోర్‌కు ప్రయాణించినపుడు మేం ఏమైనా ముందస్తు షరతులు విధించామా?’ అని ప్రశ్నించారు. గత కొన్నేళ్లలో పాకిస్తాన్‌తో అనూహ్యమైన స్నేహపూర్వక విధానాన్ని భారత్ ప్రయత్నించిందని.. కానీ దీనికి ప్రతిఫలంగా భారత్‌కు పఠాన్‌కోట్, ఉడీలలో ఉగ్రదాడులు లభించాయని పేర్కొన్నారు. ‘బహదూర్ అలీ మా కస్టడీలో ఉన్న ఉగ్రవాది. సీమాంతర ఉగ్రవాదంలో పాక్ ప్రమేయానికి అతడి వాంగ్మూలం సజీవ సాక్ష్యం’ అని తెలిపారు. ఉగ్రవాదమనేది మానవాళిపైనే నేరమని, దీన్ని ఎదుర్కోడానికి దేశాలు సమర్థ వ్యూహాన్ని రచించాలన్నారు. ఐరాసలో సుష్మ సమర్థంగా, ప్రసంగించారని మోదీ అభినందించారు. ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది... జమ్మూకశ్మీర్‌లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ పాక్ ప్రధాని ఆరోపణలను సుష్మ తిప్పికొడుతూ.. ‘మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ ఇతరులపై ఆరోపణలు చేసేవారు.. బలూచిస్తాన్ సహా తమ సొంత దేశంలో తాము ఎంతటి దురాగతాలకు పాల్పడుతున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. బలూచ్ ప్రజలపై జరుగుతున్న క్రూరత్వం రాజ్య అణచివేతలో అత్యంత దారుణ రూపం’ అని మండిపడ్డారు. -
‘ఇంతకన్నా రుజువు కావాలా?’
-
పాక్‌కు చైనా అభయం
-
పాక్‌కు చైనా అభయం
ఏ దేశమైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే అండగా ఉంటామని హామీ లాహోర్: కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌కు చైనా వత్తాసు పలికింది. విదేశీ శక్తులేవైనా పాక్‌పై దుందుడుకు చర్యలకు దిగితే తాము అండగా నిలుస్తామని అభయ హస్తమిచ్చింది. లాహోర్‌లోని చైనా కాన్సుల్ జనరల్ యూ బోరెన్.. పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్‌తో భేటీ సందర్భంగా ఈమేరకు హామీ ఇచ్చినట్లు షాబాజ్ కార్యాలయం తెలిపింది. ‘కశ్మీర్ విషయంలో మేం పాక్ పక్షాన ఉన్నాం. ఉంటాం. నిరాయుధులైన కశ్మీరీలపై దాడులు జరపడం ఏ విధంగానూ సహేతుకం కాదు. కశ్మీరీల ఆకాంక్షకు అనుగుణంగా వివాదానికి పరిష్కారం కనుగొనాలి’ అని బోరెన్ లాహోర్‌లో జరిగిన ఈ భేటీలో అన్నట్లు డాన్ పత్రిక వెల్లడించింది. ఈ నెల 18న జమ్మూ కశ్మీర్‌లోని ఉడీలో జరిగిన ఉగ్రదాడిలో 18 మంది భారత జవాన్లు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇది పాక్ చేయించిన దాడేననీ, ప్రతీకారంగా పాక్‌పై భారత్ దాడి చేస్తుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో చైనా దౌత్యవేత్త పై వ్యాఖ్యలు చేశారు. షాబాజ్ 65వ జన్మదినం సందర్భంగా బోరెన్ ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఏకాకిగా మిగిలిన పాక్: భారత్ న్యూయార్క్: ఇటీవల అంతర్జాతీయ వేదికలపై పాక్.. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రపంచ దేశాలు మాత్రం పట్టించుకోవడంలేదని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. తాజా ఐరాస చర్చలో పాక్ ప్రధాని షరీఫ్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం తెలిసింతే. అయితే ఈ విషయంలో పాక్ ఏకాకిగా మిగిలిపోయిందని, చర్చలో131 దేశాల్లో 130 దేశాలు ఉగ్రవాదంపై పోరుపై మాట్లాడాయని సయ్యద్ చెప్పారు. -
పాకిస్థాన్‌కే కొమ్ముకాసిన చైనా.. కానీ!
-
పాకిస్థాన్‌కే కొమ్ముకాసిన చైనా.. కానీ!
ఊహించినట్టుగానే ’డ్రాగన్’ చైనా దాయాది పాకిస్థాన్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే, వ్యూహాత్మకంగా కశ్మీర్ అంశం, ఉడీ ఉగ్రవాద దాడి అంశాలపై మౌనం వహించినట్టు చైనా మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్‌లో చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. అన్ని కాలాల్లోనూ వ్యూహాత్మక భాగస్వాములైన చైనా-పాక్ పరస్పరం గట్టి మద్దతు ఇచ్చుకుంటున్నాయని, వాటి స్నేహం చెక్కుచెదరనిదని షరీఫ్‌తో భేటీ అనంతరం లీ పేర్కొన్నట్టు చైనా ప్రభుత్వ మీడియా జిన్హుహా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. పాకిస్థాన్‌కు అన్నివిధాలా ఆచరణాత్మక సహకారం అందించేందుకు చైనా సిద్ధంగా ఉందని, ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఉమ్మడిగా కృషి చేస్తున్నదని లీ అన్నారు. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడర్ (సీపీఈసీ)పై పరస్పర సహకారం ద్వారా మంచి పురోగతి సాధించినట్టు లీ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా పాక్‌తో అత్యున్నత సంబంధాలు కొనసాగించేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్టు లీ అన్నారని జిన్హుహా పేర్కొంది. అయితే పాకిస్థాన్ మీడియా మాత్రం ఈ భేటీపై తనకు అనుకూలంగా కథనాలు రాసుకుంది. కశ్మీర్‌పై పాక్ వైఖరికి చైనా మద్దతును కొనసాగిస్తామని లీ షరీఫ్‌కు చెప్పినట్టు డాన్ దినపత్రిక చెప్పుకొచ్చింది. ’మేం పాకిస్థాన్‌కు మద్దతునిస్తాం. ప్రతి వేదికపై ఆ దేశం కోసం మాట్లాడుతాం’ అని లీ షరీఫ్‌కు హామీ ఇచ్చినట్టు ’డాన్’ రాసుకొచ్చింది. కశ్మీర్ పై పాక్ వైఖరికి చైనా గొప్ప ప్రాధాన్యాన్ని ఇస్తున్నదని, పాకిస్థాన్ స్వయంగా ఉగ్రవాద బాధిత దేశమని చైనా పేర్కొన్నదని ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది. -
ఐరాసలో పాకిస్థాన్‌కు చుక్కెదురు
పాకిస్థాన్ కుటియత్నానికి ఐక్యరాజ్యసమితిలో మరోసారి చుక్కెదురైంది. కశ్మీర్ సమస్యకు ఏవేవో రంగులు పూసి, దాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లి, ఆ సమస్య పరిష్కారంలో వివిధ దేశాలతో వేలు పెట్టించాలనుకున్న ఆ దేశ ప్రయత్నానికి మళ్లీ గండిపడింది. కశ్మీర్ సమస్యను పరిష్కరించాలంటూ పాకిస్థాన్ చేసిన విజ్ఞప్తిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అది ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కారం అవ్వాల్సిన సమస్య అని, భారత్-పాక్ దానిపై చర్చించుకోవాలని నవాజ్ షరీఫ్‌కు స్పష్టం చేశారు. ఇది ఆ రెండు దేశాల ప్రయోజనాలతో పాటు ఆ ప్రాంతం మొత్తం ప్రయోజనాలకు మేలు చేస్తుందని తెలిపారు. కశ్మీరీలపై మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, భారత సైన్యం అక్కడ అఘాయిత్యాలు చేస్తోందని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన వివరాలను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. బాన్ కీ మూన్ కు అందించారు. కశ్మీర్లో జరుగుతున్న చట్టవిరుద్ధమైన హత్యలపై స్వతంత్ర విచారణ జరిపించాలని కూడా కోరారు. అయితే, ఎన్నిసార్లు ఐక్యరాజ్యసమితిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని చూసినా పాకిస్థాన్‌కు మాత్రం భంగపాటు తప్పడం లేదు. ఈసారి కూడా సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ మరోసారి పాక్ వాదనను తిప్పికొట్టారు. ఇది కేవలం రెండు దేశాల మధ్య సమస్య మాత్రమేనని, అందువల్ల ఇందులో అంతర్జాతీయ జోక్యానికి తావులేదని తెలిపారు. అలాగే ఆయన తన ప్రసంగంలో కూడా ఎక్కడా కశ్మీర్ అంశాన్ని అస్సలు ప్రస్తావించలేదు. మయన్మార్, శ్రీలంకలలో నెలకొన్న పరిస్థితులు, కొరియన్ ద్వీపంలో, మధ్యప్రాచ్యంలో అస్థిరతను గురించి మాట్లాడారు తప్ప కశ్మీర్ ఊసెత్తలేదు. ఇది పాకిస్థాన్‌కు పెద్ద భంగపాటుగా మిగిలింది. నవాజ్ షరీఫ్ మాత్రం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మాట్లాడేటప్పుడు కశ్మీర్ సమస్యను ఐరాస పరిష్కరించాలని కోరారు. కేవలం భారత్, పాక్ రెండు దేశాలూ కోరితే మాత్రమే కశ్మీర్ సమస్య పరిష్కారానికి తమవంతు సాయం అందిస్తామని బాన్ కీ మూన్ కార్యాలయం ఇంతకుముందు కూడా పలుమార్లు తెలిపింది. -
‘తూటాల వర్షంతో పరిష్కారం దొరకదు’
ఇస్లామాబాద్: కశ్మీర్ సమస్యకు సంబంధించి భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధానికి మరింత ఆజ్యం పోశారు పాక్ ఆర్మీ చీఫ్ రహీల్. కశ్మీర్ లోయలోని ప్రజలపై తూటాల వర్షం కురిపించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించదని చెప్పారు. కశ్మీర్ పాక్‌కు జీవనాడి అని, అక్కడి ప్రజల స్వాతంత్య్ర పోరాటానికి అన్ని స్థాయిల్లోనూ దౌత్య, నైతిక మద్దతు కొనసాగిస్తామన్నారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపించడమంటే.. బుల్లెట్ల వర్షం కురిపించడం కాదని, వారి ఆకాంక్షలను గౌరవించడం, వారి వాదనను వినడమే సరైన పరిష్కారమని చెప్పారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలు పరిచినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. మంగళవారం రావల్పిండిలో జరిగిన డిఫెన్స్ డే సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. -
పాకిస్థాన్ ఎదురుదాడి!
ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ దూకుడు పెంచింది. భారత్‌పై దౌత్యపరమైన ఎదురుదాడిని ఉధృతం చేసింది. కశ్మీర్‌పై ద్వంద్వవైఖరి అవలంభిస్తున్నదంటూ భారత్‌ను విమర్శించడమేకాక, ఆ విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పాలని నిర్ణయించుకున్నది. ఈ క్రమంలోనే ప్రధాని నవాజ్ షరీఫ్.. 22 మంది ప్రత్యేక ప్రతినిధులను ఎంపిక చేశారు. వారంతా ప్రపంచంలోని ముఖ్యనగరాలకు వెళ్లి భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టేలా పావులు కదుపుతున్నారు.ఇస్లామాబాద్ లోని ప్రధాని కార్యాలయ వర్గాలు ఇలా పేర్కొన్నాయి.. పాకిస్థాన్ పార్లమెంటేరియన్లలో 22 మంది ఎంపీలతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఎన్నుకున్నారు. త్వరలోనే ప్రపంచదేశాలకు వెళ్లనున్న ఆ బృందం.. కశ్మీర్ అంశంలో భారత్ తీరును ఆయా దేశాలకు తెలియజేస్తుంది. కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితికి నివేదించిన భారతే, నాటి తీర్మానాలను ఖాతరు చేయడంలేదనే విషయాన్ని ఎత్తిచూపనున్నారు. సెప్టెంబర్ లో ఐక్యరాజ్యసమితి సాధారణ వార్షిక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అంతకు ముందే ఎంపీల బృందం ప్రపంచ పర్యటనను పూర్తిచేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. తద్వారా న్యూయార్క్ లో నవాజ్ షరీఫ్ భారత్ కు వ్యతిరేకంగా చేయబోయే ప్రసంగానికి మద్దతు కూడగట్టాలని పాక్ ప్రభుత్వం భావిస్తున్నది. ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో తలెత్తిన ఆందోళనలు 50 రోజులైనా తగ్గుముఖం పట్టలేదు. ఆందోళనల్లో ఇప్పటివరకు 68 మంది ప్రాణాలు కోల్పోగా, మూడువేల మందికిపైగా గాయపడ్డారు. పాక్ ప్రోద్బలంతోనే అల్లర్లు జరుగుతున్నాయన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రపంచవేదికలపై దాయాది దమననీతిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపైనే తప్ప కశ్మీర్ గురించి మాట్లాడేదిలేదని తేల్చిచెప్పారు. దీంతో పాకిస్థాన్ భారత్ కు వ్యతిరేకంగా పావులు కదిపేందుకు సిద్ధమైంది. -
'అందంగా ఉంటుందనే ప్రేమించొద్దు'
న్యూఢిల్లీ: 'అందంగా ఉంటుందని మాత్రమే కశ్మీర్ ను ప్రేమించకండి.. అక్కడి ప్రజల్ని, వాళ్ల పిల్లల్ని, ఆందోళనల్లో కళ్లు పోయినవారినికి కూడా ప్రేమను పంచండి' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు కశ్మీరీ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్. గడిచిన 32 రోజులుగా కశ్మీర్ లో అట్టుడుకుతున్న ఆందోళనలపై బుధవారం రాజ్యసభలో చర్చను ప్రారంభించిన ఆయన.. మిగతా భారతీయులలాగే కశ్మీరీలను సమదృష్టితో చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. (కశ్మీర్‌పై పెదవి విప్పిన ప్రధాని మోదీ) '32 రోజుల తర్వాతైన కశ్మీర్ ఆందోళనలపై ఎట్టకేలకు చర్చను అంగీకరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాధాలు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమనే నిజం. కానీ అక్కడి ప్రజలతో మనం కలిసిపోయామా?లేదా? అని ఆలోచించుకోవాలి. దాదాపు ప్రతి కశ్మీరీ కుటుంబం ఉగ్రవాద పీడను అనుభవించింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అత్యంత సున్నితంగా మారాయి. 32 రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహావేశాలకు కారణం ఏదైనా కావచ్చు.. దాన్ని పరిష్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించలేదు. కనీసం ఇప్పుడైనా కశ్మీరీలకు సంఘీభావం తెలపండి. అఖిలపక్షాన్ని పంపి, పరిస్థితులు చక్కబెట్టేందుకు చర్యలు తీసుకోండి. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే ఆపని చేస్తే.. కశ్మీరీలకు భరోసా ఇచ్చినవాళ్లం అవుతాం'అని గులాం నబీ ఆజాద్ అన్నారు. తెలంగాణలో మాట్లాడితే ఢిల్లీకి వినబడుతుందా? దళితులపై దాడులు, కశ్మీర్ సమస్యలపై ప్రభుత్వ స్పందన కోసం పార్లమెంట్ లో ఎంపీలు ఆందోళనలు చేస్తోంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆ సమస్యలపై పార్లమెంట్ లో కాకుండా బయటి సభల్లో స్పందించడమేమిటని ఆజాద్ ప్రశ్నించారు. 'తెలంగాణలో జరిగిన సమావేశంలో మీరు(ప్రధాని) దళితులపై దాడులను ఖండించారు. ఆ మాటలు పార్లమెంట్ వరకు వినబడలేదు. ఆ ప్రకటనేదో ఇక్కడి నుంచే చేస్తే సబబుగా ఉండేది'అని ఆజాద్ వ్యాఖ్యానించారు. -
వెంకయ్య సీరియస్
న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంపై భారత్ తో అణుయుద్ధం తప్పదని తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ నేత సయీద్ సలాహుదీన్ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తీవ్రంగా స్పందించారు. కశ్మీర్ అంశంపై మాట్లాడడానికి సలాహుదీన్ ఎవరు, ఈ విషయంపై మాట్లాడే హక్కు అతడికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సోమవారం పార్లమెంట్ వెలుపల వెంకయ్య మీడియాతో మాట్లాడారు. పబ్లిసిటీ కోసమే అతడు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని అన్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం సరైందో, కాదో పాకిస్థాన్ తేల్చుకోవాలని సూచించారు. కశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించకుంటే అణుయుద్ధం తప్పదని, నాలుగో ప్రపంచ యుద్ధం వస్తుందని సలాహుదీన్ వ్యాఖ్యానించాడు. -
'భారత్ తో అణుయుద్ధం తప్పదు'
కరాచీ: కశ్మీర్ అంశంపై భారత్ తో అణుయుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిదీన్ నేత సయీద్ సలాహుదీన్ హెచ్చరించారు. కశ్మీర్ పోరాటానికి అన్నివిధాల మద్దతు ఇవాల్సిన బాధ్యత పాకిస్థాన్ పై ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్ అండగా నిలిస్తే రెండు దేశాల మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశముందన్నారు. కశ్మీర్ ప్రజలు రాజీ పడడానికి సిద్ధంగా లేరని, నాలుగో ప్రపంచ యుద్ధం రానుందని జోస్యం చెప్పారు. ప్రపంచం, పాకిస్థాన్ మద్దతు ఇవ్వకపోయినా, ఐక్యరాజ్య సమితి తన కర్తవ్యం నిర్వహించకపోయినా కశ్మీర్ ప్రజలు తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలని సలాహుదీన్ పిలుపునిచ్చారు. సాయుధ యుద్ధం చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదని కశ్మీర్ ప్రజలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం ముక్తి ప్రసాదించకపోతే అణచివేతకు గురవుతున్న కశ్మీర్ ప్రజలు సాయుధ తిరుగుబాటు చేస్తారని చెప్పారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమాజం విస్మరించినా, పాకిస్థాన్ ప్రయత్నాలు ఫలించకపోయినా, భారత్ వేధింపులు ఆపకపోయినా.. ఇండియా మూల్యం చెల్లించుకోక తప్పదని సలాహుదీన్ హెచ్చరించారు. -
ద్విజాతి ఛాయలో కశ్మీర్ లోయ
జాతిహితం అవమానభారంతో కుంగిపోతున్నవారి, ఆగ్రహంతో ఉన్న వారి మనసులను సైన్యాలు గెలవలేవు. శత్రువును నిరోధించాలంటే లేదా ఓడించాలంటే సైన్యాన్ని ఉపయోగించాలి. అలా కాకుండా అన్యమనస్కంగా ఉన్న సోదరుడిని తిరిగి దారికి తెచ్చుకోవాలంటే పెద్ద మనసు అవసరం. ఇది పని చేయగలదా? ఒక్క వాక్యంతో వాజ్‌పేయి తీసుకువచ్చిన నాటకీయ మార్పును గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యాంగ పరిధిలోనే ఎందుకు, నేను మానవత్వం పరిధి నుంచి మీతో మాట్లాడతాను అన్నారాయన. కశ్మీర్ లోయలో జరుగుతున్న తాజా పరిణామాలన్నీ మన లోలోపలి వికృ తాలే. ఇది కశ్మీర్ భూభాగం గురించి కూడా కాదు. లేదా కశ్మీరీల గురించి అయినా కాదు. లేదంటే భారత్, పాకిస్తాన్ల వ్యవహారం కూడా కాదు. ఇప్పుడు ఇది హిందువులు, ముస్లింల గొడవగా తయారయింది. ఎవరికీ లబ్ధి చేకూర్చని ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తింది? మిగతా విషయాలు పక్కన పెట్టి ఇలాంటి వాదనలో ఉన్న కనీస తర్క బద్ధ వాస్తవాలనైనా చూద్దాం. మొదట: బుర్హన్ వనిని సాయుధదళాలు కాల్చి చంపడంతో తాజా కల్లోలం ఆరంభమైంది. ఈ పరిణామం సంభవించ కూడ నిదేమీ కాదు. అతడు రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, సోషల్ మీడియాలో హల్చల్ చేసినప్పుడే చావుకు అత్యంత సమీపంగా వచ్చాడని అర్థమైంది. నిజానికి ఇంతకాలం జీవించి ఉన్నాడంటే అదంతా అతడి చాక చక్యమే. పెద్ద వింత కూడా. సాయుధబలగాల దృష్టిలో పడి, వారు వెతుకు తున్న వారి ‘ఏ’ జాబితాలో పేరు ఎక్కిన ఆరేళ్ల తరువాత కూడా బతికి బట్ట కట్టడం మామూలుగా సాధ్యంకాదు. అతడి పట్ల నేను సానుభూతితో ఉండాలా? సోదర భారతీయుడు ఎవరు మరణించినా నేను దుఃఖిస్తాను. అయితే బుర్హాన్ వని పట్ల కొంత వరకు నేను సానుభూతి చూపాలి. ఇలాంటి ప్రాణాంతకమైన మార్గంలోకి అతడు వెళ్లేటట్టు మిత్రులు, కుటుంబం అతడిని అనుమతించినందుకు, బహుశా అలాంటి దానికి ప్రోత్సహించినందుకు కూడా నేను సానుభూతి చూపవచ్చు. అతడు మరణించిన తీరుకు కూడా సానుభూతితో ఉండవచ్చు. కానీ ఒకసారి ఆయుధం చేపట్టి జనాన్ని చంపడం మొదలుపెట్టిన తరువాత చట్టేతర విధానాలతో చంపుతున్నారంటూ అవతలి వారిని ఆరోపించే కనీస నైతిక అర్హత కోల్పోయినట్టే. అయినా అలాంటి చావును అతడు స్వచ్ఛందంగా కోరుకున్నాడు. ఇది విషాదం. తరువాత డజన్ల కొద్దీ సాధారణ పౌరులు, యూనిఫారాలలో ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఇది మరింత విషాదం. నా వరకు, ఇంకా అశేష భారతీయ జనాభా, ధైర్యం చేసి జేఎన్‌యూ ప్రాంగణంలో నేను చెప్పినట్టు ఎలాంటి సంకోచాలు లేని వాస్తవం- కశ్మీర్, ప్రస్తుతం దేశం అధీనంలో ఉన్న ఇతర భూభాగాలు భారత్ నుంచి అవిభా జ్యాలు. గణతంత్ర భారత్‌లోని అంతర్భాగాలు. అలాగే, కొంతమంది తిట్టినా, పాకిస్తాన్, చైనాల ఆక్రమణలో ఉన్న ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం ఉన్నప్ప టికీ పాకిస్తాన్ చేతిలో ఉన్న భూభాగాలు అక్కడే ఉంటే ఉండనివ్వమనే నేనంటాను. అణ్వాయుధాలు కలిగి ఉన్న మూడు ఇరుగు పొరుగు దేశాలు కూడా యుద్ధం ద్వారా ఇతరుల భూభాగాలను దఖలు పరుచుకోలేవు. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ మూడు దేశాలలో రెండు దేశాలకు వ్యతి రేకంగా ఎవరు వ్యవహరించినా కశ్మీర్ భూభాగం, కశ్మీర్ ప్రజానీకం ఆ మూడు దేశాల దాయాదుల చిరకాల పోరులో చిక్కుకోవడం తథ్యం. కాబట్టి ఎవరూ తొందరపడరు. ఆఖరికి డజను తాజా యుద్ధాలు చేసుకున్నా, భారత్-పాక్ తమ అణ్వాయుధాలు మొత్తం వినియోగించినా కూడా ఎటు వైపు వారైనా కూడా వారి వైపు ఉన్న కశ్మీరాలను కోల్పోరని నేను పందెం కట్టి మరీ చెబుతాను. భద్రతా మండలి తీర్మానాలు కూడా పాకిస్తాన్ లేదా భారత్ లకే అవకాశం కల్పించాయి. పాకిస్తాన్ చెబుతున్న ఆజాద్ కశ్మీర్, ప్రజా భిప్రాయ సేకరణ, ఆజాదీకి మద్దతు ఇవేమీ ఇక్కడ వర్తించవు. ఇవన్నీ కపట నాటకాలే. ఆజాదీ ఏమీ లేదు. స్కాట్లాండ్ లేదు. క్విబెక్ లేదు. ఆఖరికి బ్రిక్జిట్ కూడా ఇక్కడ లేదు. ఏది ఏమైనా ఐక్యరాజ్య సమితి తీర్మానాలను, సిమ్లా ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కినది పాకిస్తానే తప్ప భారత్ కాదు. ఏడేళ్లకు ముందు సైన్యం సహాయంతో కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుందామని ఆ దేశం యత్నించి పూర్తిగా విఫలమైంది. కశ్మీర్‌ను కోల్పోతున్నామని భారతీయులు ఎప్పటికీ విచారించవలసిన అవసరం లేదు. అక్కడ చాలినంత సైన్యం ఉంది. మన భూభాగంలోని ఆ లోయను రక్షించుకోవాలన్న మన ఆశయం వజ్ర సదృశంగా ఉంది. ‘‘మన’’ కశ్మీరీలు అనేది ఇప్పుడు ఒక అంశమే కాదు, అంతకు మించిన వివాదాస్పద అంకంలోకి ప్రవేశిస్తున్నాం. పౌరులనీ, భూభాగాలనీ సైన్యాలు కాపాడగలవు. కానీ ఆగ్రహంతో ఉన్నవారి మనసును సైన్యం మార్చలేదు. ఈ మాటని చాలా మంది సైనికులు, మిత్రులు వెంటనే అంగీకరిం చలేరు. అవమానభారంతో కుంగిపోతున్నవారి, ఆగ్రహంతో ఉన్న వారి మనసులను సైన్యాలు గెలవలేవు. శత్రువును నిరోధించాలంటే లేదా ఓడించా లంటే సైన్యం ఉపయోగించాలి. అలా కాకుండా అన్యమనస్కంగా ఉన్న సోదరుడిని తిరిగి దారికి తెచ్చుకోవాలంటే పెద్ద మనసు అవసరం. ఇది పని చేయగలదా? ఒక్క వాక్యంతో వాజ్‌పేయి తీసుకువచ్చిన నాటకీయ మార్పును గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యాంగ పరిధిలోనే ఎందుకు, నేను మానవత్వం పరిధి నుంచి మీతో మాట్లాడతాను అన్నారా యన. అదే ఆరేళ్ల పాటు రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పింది. ఆ బాటలోనే మన్మోహన్సింగ్ ప్రయాణించారు. భారతదేశ సంకీర్ణ ప్రభుత్వాల చరిత్రలోనే అసంభవం అనదగ్గ తీరులో ముఫ్తీ స్థాపించిన పీడీపీతో బీజేపీ జత కట్టిన దృష్ట్యా నరేంద్ర మోదీ కూడా ఇలాగే వ్యవహరించగలరని మనం ఊహించాం. కశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి పరిస్థితులు ఇంతగా విషమించడానికి కారణం- సంకీర్ణం ఏర్పాటు చేయడంలోని ఉద్దేశం గురించి బీజేపీ తన కార్యకర్తలకు సరిగా ప్రచారం చేయలేదు. మరీ ముఖ్యంగా తన సిద్ధాంతకర్తలకీ, మేధావి వర్గానికీ, అజెండా నిర్ణేతలకీ కూడా ఉద్దేశాన్ని ఎరుక పరచలేదు. సైద్ధాంతికంగా ఎడమొహం పెడ మొహంగా ఉండే రెండు విభిన్నశక్తులు జాతీయతా సూత్రంతో (ముఫ్తీ గురించి ఆయన రాజకీయాల గురించి కూడా నేను ఇదే చెబుతాను) ఒకే తాటిపైకి వచ్చాయి. ఎన్నికలు తెచ్చిన విభజనను అధిగమించి ఐక్యత సాధించే ఉద్దేశంతో అవి ఈ పనిచేశాయి. అందుకే ఈ సంకీర్ణం భేషజంతో కాకుండా, రాజనీతిజ్ఞతతో వచ్చిందని అంటాను. జమ్మూ కశ్మీర్లో ద్విజాతి సిద్ధాంతంతో సమానమైన సిద్ధాంతానికి తెర తీసిన ఎన్నికలవి. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలలో ఒక రకంగాను, ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మరో తీరు లోను ఓటింగ్ జరిగింది. పీడీపీతో భాగస్వామ్యానికి నరేంద్ర మోదీ చొరవ చూపినప్పటికీ, ఆయన పార్టీ కార్యకర్తల సిద్ధాంతం, మోదీ రాజకీయ వాస్త వాలు ఆయనను వెనక్కు తగ్గేటట్టు చేశాయి. బాధితుల పట్ల చిన్నపాటి సానుభూతి మాట కూడా చెప్పకుండా, వారు దేని గురించి అడుగుతున్నారో కూడా ప్రస్తావించకుండా కశ్మీర్లో భద్రతాదళాల కార్యకలాపాలను సమర్థించ డానికి రోజూ సాయంకాలం మోదీగారి పార్టీ వక్తలు టీవీ స్టూడియోల చుట్టూ ఎలా తిరుగుతున్నారో మనమంతా చూస్తున్నాం. సంకీర్ణ భాగస్వామిని ఆదు కోవడమన్న పేరుతో బీజేపీ చేస్తున్న ఈ పని వికృతమైనదే కాదు, స్వీయ విధ్వంసకమైనది కూడా. కశ్మీర్ మొత్తం మనదే అంటూ నినదించేవారు, గుండెలు బాదుకునే వారు కశ్మీర్ అంటే వారి దృష్టిలో ఒక్క భూభాగమా లేక కశ్మీరీలు కూడానా? అన్న ప్రశ్న వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే తమకు విధేయులుగా (హిందు వులు, బౌద్ధులు) ఉండేవారేనా? అని కూడా ప్రశ్నించుకోవాలి. అలాగే ముస్లింలు కోరుకుంటే వారు పాకిస్తాన్ వెళ్లిపోవాలన్నదే తమ వాంఛితమా? వాస్తవంగా మనసులో ఉన్నది అదే అయితే, విభజన తరువాత అసం పూర్ణంగా మిగిలిన అజెండాయే కశ్మీర్ అంటూ పాకిస్తాన్ ఇప్పటివరకు అడ్డూ అదుపు లేకుండా దేని గురించి మాట్లాడుతున్నదో మీరు కూడా అదే మాట్లా డుతున్నారు. ఆ భూభాగాన్ని, కొంత జనాన్ని (ముస్లింలు) వారు కోరు తున్నారు. మనం కూడా అంతే, ఆ భూభాగం, కొంత జనం కావాలని కోరు తున్నాం. విభజించు పాలించు అన్న సూత్రం మనకి బ్రిటిష్ జాతి నేర్పింది. మనం మాత్రం విభజించు- వదులుకో అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం. నిజానికి 97 శాతం ముస్లింలు భారతదేశంలోని ప్రధాన భూభాగంలోనే నివశిస్తున్నారు. వీరి దేశభక్తిని నిరంతరం శంకించినప్పటికీ వీరు ఏనాడూ కశ్మీరీల నినాదంతో గొంతు కలపలేదు. ఆఖరికి కొత్త సున్నీ రైట్ సిద్ధాంత కర్తలు, అంటే జకీర్ నాయక్ వంటి వారు కూడా కశ్మీర్ అంశం గురించి ఆచి తూచి మాట్లాడుతున్నారు. ఆ సమస్యను లోయకు పరిమితంగా ఉంచడానికి ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తున్నది ఇదే. ఈ మార్గం గురించి ఆలోచించండి. పాకిస్తాన్ వెళ్లిపోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే సరిహద్దులు తెరిచి ఉన్నాయి అని ముస్లింలతో భారత్ చెప్పవలసి వస్తే ఎలా ఉంటుంది? ఏ ఒక్కరు భారత భూభాగం విడిచి వెళ్లరు. నా అనుమానం ఏమిటంటే, మంచి జీవనం కోసం పాకిస్తాన్, బంగ్లాల నుంచే ఇంకొందరు ముస్లింలు ఇక్కడికే రావచ్చు. రాజకీయ, ఆర్థిక స్థిరత్వాలే మనం ఎక్కడ ఉండాలి అన్న విషయాన్ని నిర్ధారిస్తాయి. కశ్మీర్ సరిహద్దులలో కూడా ఇదే చెబితే? ఆజాదీ కశ్మీర్ గురించి కల్పనలు ఉన్న వారు, జీహాదీల వలలో పడినవారు ఏ కొందరో మినహా ఎవరూ దేశం విడి చిపోరు. కశ్మీర్లో ‘మన జనం’ అంటూ మాట్లాడేవారే ఇంకో ప్రశ్నను కూడా వేసుకోవాలి. ‘మన’ కశ్మీరీలు ‘వారి’ భూభాగంలో ఉండాలా? లేకపోతే భూభాగం ఇక్కడ వదిలి పాకిస్తాన్ వెళ్లిపోవాలా? దీనికి నిజాయితీతో కూడిన సమాధానం రాబట్టుకోవడం నా ఉద్దేశం కాదు. హిందూ-ముస్లిం పరి భాషతో కశ్మీర్ సమస్యను పునర్ వ్యాఖ్యానిస్తే వచ్చే ప్రమాదం ఏమిటో ఆలో చించాలనే నా ఉద్దేశం. అలాగే కనుక ఆలోచిస్తే కశ్మీర్‌ని పోగొట్టుకోకపోవచ్చు. కానీ కశ్మీరీలను పోగొట్టుకుంటాం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
కశ్మీర్ కల్లోలంపై ముగిసిన మోదీ సమావేశం
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో కల్లోల పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ భధ్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్, హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీనియర్ కేబినేట్ సభ్యులతో మంగళవారం చర్చించారు. జమ్మూ-కశ్మీర్ నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఏ ఇతర శాఖలకు చెందిన మంత్రులుఇలా ఎవరూ చర్చల్లో లేకపోవడం గమనార్హం. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేతో పీడీపీకి కూటమి ఉన్నా రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఒక్కరికి కూడా సమావేశంలో చోటు కల్పించకపోవడంపై జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. తెలివిగా ఆలోచించి తిరిగి కశ్మీర్ లో ప్రశాంతవాతావరణం ఏర్పడేలా చేయాలని హోం శాఖ భద్రతాదళాలకు సూచించింది. కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. తాజా పరిస్థితులపై ముస్లిం మత పెద్దలతో చర్చించారు. బుధవారం వరకూ బంద్ ను కొనసాగిస్తామని వేర్పాటువాదులు ప్రకటించడంతో కశ్మీర్ లోని అన్ని జిల్లాల్లో కర్ఫ్యూని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
కశ్మీర్‌పై చర్చలతో పరిష్కరించుకోవాలి: యూఎస్
వాషింగ్టన్: కశ్మీర్ అంశంపై నెలకొన్న వివాదాలను భారత్, పాకిస్తాన్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యూఎస్ సూచించింది. ఇరు దేశాలు శాంతి స్థాపనకు కృషి చేయాలని.. అది భారత్, పాక్‌తో పాటు ఆసియన్ రీజియన్ పురోగభివృద్ధి ఎంతో కీలకమని యూఎస్ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు. దవ్యోల్బణం కట్టడికి, ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాల పెంపనకు.. తదితర రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ చర్చలు ద్వారా ఆసియ రీజియన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు తొలగిపోతాయని టోనర్ వివరించారు. భారత్, పాక్‌ల మరింత అభివృద్ధి సాధించేందుకు యూఎస్ తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. ఉగ్రవాద అంతానికి భారత్ కలసి పనిచేస్తాం: యూఎస్ పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నిర్మూలించేలా ఆ ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి పెంచింది. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత్ సహా ఇతర దేశాలతో కలసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యూఎస్ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ పేర్కొన్నారు. ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. స్వదేశంలో ఉగ్రవాద అంతానికి పాక్ పోరాటం చేయాలని సూచించింది. ఆసియా రీజియన్‌లో ఉగ్రవాద నిర్మూలనకు భారత్, పాక్, అఫ్ఘాన్‌తో కలసి యూఎస్ పనిచేస్తుందని అన్నారు. -
నెహ్రూ వల్లే కశ్మీర్ సమస్య!
సోనియా తండ్రి ఫాసిస్టు జవాను! కాంగ్రెస్ పత్రికలో తీవ్ర విమర్శలు కంటెంట్ ఎడిటర్ తొలగింపు సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: ‘నెహ్రూ.. పటేల్ మాట వినివుంటే కశ్మీర్ సమస్య, చైనా, పాక్‌తో వివాదాలు ఉండేవి కావు. పటేల్ వారిస్తున్నా వినకుండా ఆయన కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి చేతిలో ఉంచారు.. సోనియా గాంధీ తండ్రి ఫాసిస్టు సైనికుడు. సోనియా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న తర్వాత 62 రోజుల్లోనే పార్టీ అధ్యక్షురాలయ్యారు..’ ఈ తీవ్ర విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు బద్ధశత్రువైన బీజేపీనో, మరో పార్టీనో చేసినవి కావు. సాక్షాత్తూ కాంగ్రెస్ అధికార పత్రిక ఉద్ఘాటించినవి. పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకునేవేళ కాంగ్రెస్‌ను ఇవి ఊబిలో పడేసి, ముఖాన్ని కందగడ్డలా మార్చాయి. ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ(ఎంఆర్సీసీ)కి చెందిన హిందీ పత్రిక ‘కాంగ్రెస్ దర్శన్’ డిసెంబర్ సంచికలో వ్యాసకర్తల పేర్లు లేకుండా వచ్చిన రెండు వ్యాసాల్లో ఈ విమర్శలు ఉన్నాయి. చిత్రంగా ఈ సంచికను సోనియా గాంధీకే అంకితం చేసి కవర్ పేజీపై ఆమె ఫొటో ముద్రించారు. సోనియా కాంగ్రెస్ చీఫ్ అయ్యాక పార్టీకి చేసిన సేవలను, ఆమె సాధించిన విజయాలనూ ప్రస్తావించారు. ఈ వ్యాసాలపై కాంగ్రెస్ అధిష్టానం సోమవారం కన్నెర్రజేసింది. దీంతో పత్రిక ఎడిటర్, ఎంఆర్సీసీ చీఫ్ సంజయ్ నిరుపమ్ క్షమాపణలు చెప్పారు. ఎడిటోరియల్ కంటెంట్ ఇన్చార్జి సుధీర్ జోషీని ఆ పదవి నుంచి తప్పించారు. తప్పు చేశాను: నిరుపమ్ ఈ వ్యాసాలతో తనకు సంబంధం లేదని తొలుత పేర్కొన్న ఎడిటర్ నిరుపమ్ తర్వాత తప్పు చేసినట్లు అంగీకరించారు. ‘తప్పు ఒప్పుకుంటున్నాను. తప్పు చేసిన సంపాదక విభాగంపై విచారణ జరుపుతాం. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కానివ్వం’ అని చెప్పారు. మాకు సంబంధం లేదు: కాంగ్రెస్ ‘కాంగ్రెస్ దర్శన్’తో తమకు సంబంధం లేదని, నిరుపమ్‌ను ఆ పత్రిక ఎడిటర్‌గా తాము నియమించలేదని కాంగ్రెస్ పేర్కొంది. ‘అది మూతపడిన పత్రిక. పునరుద్ధరణ ప్రయత్నాల్లో ఉంది’ అని పార్టీ ప్రతినిధి టోమ్ వడక్కన్ ఢిల్లీలో అన్నారు. నిరుపమ్‌ను ఎంఆర్సీసీగానే నియమించామన్నారు. ఆయన అంతా వ్యక్తిగతంగా చేశారని, పత్రిక ఎడిటోరియల్ కంటెంట్ ఎడిటర్ తొలగింపుతోనూ తమకు సంబంధం లేద ని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్టీ నేతలు సల్మాన్ ఖుర్షీద్, రాజ్ బబ్బర్లు పేర్కొన్నారు. వ్యాసాల్లో వాడిన పదజాలం ఆరెస్సెస్ నిఘంటువు నుంచి తీసుకున్నారని మహారాష్ట్ర మాజీ మంత్రి నసీమ్ ఖాన్.. నిరుపమ్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు ముంబైలోని ఆ పత్రిక కార్యాలయం వద్దకు చేరుకుని నిరుపమ్ వెంటనే పార్టీకి, పత్రిక కు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుపమ్ క్షమాపణలు చెప్పారని, నిర్ణయాన్ని ఎంఆర్సీసీకి వదిలేయాలని పీసీసీ చీఫ్ అశోక్ చవాన్ అన్నారు. శివసేనలో ఉన్నప్పుడు సోనియాను విమర్శించిన నిరుపమ్‌కు ఇంకా బుద్ధిరాలేదని ముంబై కాంగ్రెస్ నేత ఒకరు అన్నారు. నిరుపమ్‌కు బీజేపీ అభినందనలు కాంగ్రెస్ ‘సొంత బురద’లో చిక్కుకోవడంతో బీజేపీ సంబరపడిపోయింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.. నిరుపమ్‌ను అభినందించారు. ‘కాంగ్రెస్ దర్శన్‌ను ‘సత్యదర్శన్’ అని పిలవాలి. ప్రధాని అయ్యేందుకు పటేల్‌కు కాంగ్రెస్‌లో చాలినంత మద్దతు ఉండేది. అయితే గాంధీజీ పటేల్‌ను పక్కన పెట్టి నెహ్రూ పేరు ప్రతిపాదించారు. పటేల్ 562 సంస్థానాలను భారత్‌లో విలీనం చేయగా, నెహ్రూ కేవలం కశ్మీర్‌కు మాత్రమే బాధ్యుడు. అది ఇప్పటికీ సమస్యలా మిగిలింది. ఇది బీజేపీ, నేను అంటున్నమాట కాదు, కాంగ్రెస్ పత్రికే అంది. కాంగ్రెస్ దాచిపెడుతున్నది బయటికొచ్చింది’ అని ఢిల్లీలో అన్నారు. కాంగ్రెస్ పటేల్ గురించి రాయదని, ఇప్పుడు నిజం చెప్పిందని పేర్కొన్నారు. నిరుపమ్ గతంలో శివసేన పత్రిక ‘దోపహర్కా సామ్నా’ సంపాదకుడిగా ఉన్నప్పుడూ ఇలాంటి వ్యాసాలకు ప్రసిద్ధి అని చెప్పారు. నెహ్రూ-గాంధీయేతర కుటుంబాలకు చెందిన పీవీ, లాల్‌బహదూర్ శాస్త్రి వంటి వారికి కాంగ్రెస్ న్యాయం చేయలేదని అన్నారు. పత్రిక కంటెంట్ ఎడిటర్‌ను తొలగించడం వాస్తవాలపై కాంగ్రెస్ అసహన వైఖరికి నిదర్శనమని బీజేపీ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ విమర్శించారు. నిరుపమ్ నిజం చెప్పారని, ఆయనను అభినందిస్తున్నామని శివసేన కూడా పేర్కొంది. నెహ్రూ పెడచెవిన పెట్టారు! ‘కాంగ్రెస్ దర్శన్’లో వచ్చిన రెండు వ్యాసాల్లో ఒకదాంట్లో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను విమర్శించారు. తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వర్ధంతి(ఈ నెల 15) సందర్భంగా రాసిన ఈ వ్యాసంలో పటేల్‌ను దార్శనికత గల నేత అని కొనియాడారు. నెహ్రూతో ఆయన విభేదాలను ప్రస్తావించి, పటేల్ మాటలను తొలి ప్రధాని పెడచెవిన పెట్టారని ఆరోపించారు. ‘ఆనాడు పటేల్ అభిప్రాయాలను నెహ్రూ పరిగణనలోకి తీసుకుని ఉంటే కశ్మీర్, చైనా, టిబెట్, నేపాల్‌కు సంబంధించిన సమస్యలు ఇప్పుడు ఉండేవి కావు. కశ్మీర్ అంశాన్ని నెహ్రూ ఐరాస ముందుకు తీసుకెళ్లే యత్నాన్ని పటేల్ వ్యతిరేకించారు. పటేల్ అభిప్రాయాలను నెహ్రూ పట్టించుకోకపోవడంతో ఇద్దరి అనుబంధం తెగే స్థితికి వచ్చింది. పటేల్ ఉప ప్రధాని, హోంమంత్రి అయిన్పటికీ విదేశీ విధానంలో ఆయన ముందుచూపుతో నెహ్రూ ఏకీభవించలేదు. ఒక దశలో పరిస్థితి పటేల్ రాజీనామా చేయాలనుకునేదాకా వెళ్లింది’ అని పేర్కొన్నారు. టిబెట్ విషయంలో చైనాను నమ్మొద్దని, అది భారత్‌కు శత్రువు అవుతుందని 1950లో పటేల్ రాశారంటూ ఓ లేఖను ఉటంకించారు. 62 రోజుల్లోనే అధ్యక్ష పదవి మరో వ్యాసంలో సోనియా గాంధీ తొలినాళ్ల వ్యక్తిగత జీవితాన్ని వివరించారు. ఆమె ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్న విషయాన్ని ఉటంకించారు. ‘సోనియా తండ్రి స్టెఫానో మైనో ఫాసిస్టు సైనికుడు. రెండో ప్రపంచయుద్ధంలో ఓడిన ఇటలీ సైన్యంలో ఆయన పనిచేశారు’ అని తెలిపారు. సోనియా వేగవంతమైన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ..‘ఆమె 1997లో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న తర్వాత కేవలం 62 రోజుల్లోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. మెజారిటీ లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు విఫలయత్నం చేశారు’ అని విశ్లేషించారు. ఘనంగా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారమిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, గులాం నబీ ఆజాద్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమం తర్వాత కాసేపు కార్యాలయంలో మాట్లాడుకున్న సోనియా, రాహుల్‌లు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. -
సోనియా తండ్రి 'ఫాసిస్టు సైనికుడు'!
-
సోనియా తండ్రి 'ఫాసిస్టు సైనికుడు'!
న్యూఢిల్లీ: ఆవిర్భావ దినోత్సవం నాడే కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఎదురైంది. సాక్షాత్తూ సొంత పత్రికలోనే పార్టీ తాజా, మాజీ అధినేతలపై విమర్శలు చేస్తూ వ్యాసాలు వెలువడటం కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. 'కాంగ్రెస్ దర్శన్' పత్రికలో దేశ మొదటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ దిగ్గజ నేత జవహర్లాల్ నెహ్రూపైనే కాదు.. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీపైనా తీవ్ర ఆరోపణలు ప్రచురితమయ్యాయి. సోనియాగాంధీ తండ్రి ఓ ఫాసిస్టు సైనికుడంటూ ఆరోపణలు పత్రికలో దర్శనమివ్వడం కాంగ్రెస్ నేతల్ని బిత్తరపోయేలా చేసింది. సోనియా తండ్రి ఇటాలియన్ ఫాసిస్టు సైన్యంలో సభ్యుడని, ప్రపంచయుద్ధంలో రష్యా చేతిలో ఈ సైన్యం ఓడిపోయిందని 'కాంగ్రెస్ దర్శన్'లో పేరు లేకుండా వెలువడిన ఓ వ్యాసం పేర్కొంది. సోనియా తండ్రి స్టెఫానో మైనో మాజీ ఫాసిస్టు సైనికుడని తెలిపింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ అతి తక్కువకాలంలో అధ్యక్షురాలిగా ఎదిగారని వ్యాఖ్యానించింది. రాజకీయాల్లోకి రాముందు ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రముఖంగా ప్రస్తావించింది. సోనియా ఒకప్పుడు ఎయిర్‌హోస్టెస్ కావాలనుకున్నారని వ్యాసంలో పేర్కొంది. '1997లో కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా నమోదైన సోనియాగాంధీ కేవలం 62 రోజుల్లోనే పార్టీ అధ్యక్షురాలిగా మారారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆమె కొన్ని విఫలయత్నాలు చేశారు' అని ఈ వ్యాసం పేర్కొంది. 'కాంగ్రెస్ దర్శన్' ముంబై యూనిట్ పత్రికలో కశ్మీర్, చైనా, టిబెట్ విషయంలో తొలి ప్రధాని నెహ్రూ అనుసరించిన విధానాన్ని తప్పుపడుతూ వ్యాసం వెలువడిన సంగతి తెలిసిందే. జాతీయ కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవంగా పార్టీ అధికార పత్రికలో వచ్చిన ఈ వ్యాసాలతో ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్ పార్టీ 'కాంగ్రెస్ దర్శన్' కంటెంట్ ఎడిటర్ సుదీప్ జోషిపై వేటు వేసింది. -
నెహ్రూపై మండిపడిన 'కాంగ్రెస్ దర్శన్'
-
నెహ్రూపై మండిపడిన 'కాంగ్రెస్ దర్శన్'
సొంత పార్టీ పత్రికలో.. తమ పార్టీకే చెందిన దివంగత నేత, అది కూడా భారతదేశ తొలి ప్రధాని.. జవహర్లాల్ నెహ్రూను నిందించడం కాంగ్రెస్ తలకు చుట్టుకుంది. ఆ పార్టీ అధికార పత్రిక 'కాంగ్రెస్ దర్శన్' (హిందీ)లో భారతదేశ నెహ్రూను నిందిస్తూ ఓ వ్యాసం ప్రచురితమైంది. కాంగ్రెస్ 131వ వ్యవస్థాపక దినాన్ని పురస్కరించుకొని ఈ పత్రికలో ప్రచురించిన కథనం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. చైనా, టిబెట్ దేశాలతో విదేశీ వ్యవహారాల విషయంలో అప్పటి ప్రధాని నెహ్రూ.. స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ మాటను పెడచెవిన పెట్టారని విమర్శించింది. అంతర్జాతీయ వ్యవహారాల మీద పట్టున్న పటేల్ సలహాలను నెహ్రూ పాటించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ దర్శన్ (హిందీ ఎడిషన్) డిసెంబర్ సంచికలో డిసెంబర్ 15న పటేల్ వర్ధంతి సందర్భంగా పటేల్‌కు నివాళులర్పింస్తూ ప్రచురించిన ఈ వ్యాసంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా 1950లో పటేల్ రాసిన లేఖలను ఉటంకించారు. చైనాకు అనుకూలంగా ఉన్న నెహ్రూ వైఖరిని పటేల్ తప్పుబట్టారని, నేపాల్ విషయంలో కూడా ఆయన ధోరణిని తప్పుబట్టారని వ్యాసంలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇండియాకు చైనా పెద్ద శత్రువుగా మారబోతోందని పటేల్ వ్యాఖ్యానించినట్టు తెలిపారు. అలాగే కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లడాన్ని వ్యతిరేకించారన్నారు. విదేశీ వ్యవహారాల్లో ప్రవీణుడైన పటేల్ సలహాలను పాటించి ఉంటే గోవా పదేళ్ల ముందుగానే స్వాతంత్ర్యాన్ని పొంది ఉండేదంటూ వ్యాఖ్యానించడం కాంగ్రెస్ విధేయులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానం, హిందూ - ముస్లిం ఐక్యతతో పాటు, అప్పటి ఇద్దరు కాంగ్రెస్ అగ్రనేతల మధ్య ఘర్షణలను విమర్శిస్తూ దాదాపు 6 పేజీల్లో సాగిన ఈ కథనం తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. పటేల్ ఉప ప్రధాని, హోం మంత్రిగా ఉన్నా. ఇద్దరు నాయకుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, ఇరు నేతలు వివిధ సందర్భాల్లో రాజీనామా చేస్తామని బెదిరించారని వ్యాసంలో రాశారు. పటేల్ దూరదృష్టిని నెహ్రూ అంగీకరించి ఉంటే, అంతర్జాతీయ వ్యవహారాల్లో అనేక సమస్యలు తలెత్తేవి కావని చెప్పారు. అయితే పొరపాటు జరిగిందని, ఇది తనకు తెలిసి జరిగింది కాదని బాధ్యులపై చర్య తీసుకుంటామని ముంబై కాంగ్రెస్ చీఫ్, పత్రిక సంపాదకుడు సంజయ్ నిరుపమ్ ప్రకటించారు. ఒకవైపు అధికార బీజేపీ ఉక్కుమనిషి పటేల్‌ను కీర్తిస్తూ, నెహ్రూపై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో స్వయంగా తమ పార్టీ అధికార పత్రిలో వివాదాస్పద కథనం రావడం సంచలనం రేపింది. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
గిలానీ.. ఓ సారి మా ఊరికిరా..
- కశ్మీర్ వేర్పాటువాదనేత గిలానీకి నవాజ్ షరీఫ్ ప్రత్యేక లేఖ - పాకిస్థాన్ లో పర్యటించాల్సిందిగా ఆహ్వానం న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ మరోసారి భారత్ ను రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించింది. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇదే అంశంపై ఇరుదేశాలు భిన్నవాణులను వినిపించిన దరిమిలా చర్చల ప్రక్రియ ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో.. పాకిస్థాన్ పర్యటనకు రావాల్సిందిగా హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీషా గిలానీకి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం పంపడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు నవాజ్ పంపిన ఆహ్వాన పత్రాన్ని పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్.. గిలానీకి అందజేశారు. 'శుక్రవారం రాత్రి జరిగిన విందు సమావేశంలో బాసిత్.. నవాజ్ షరీఫ్ పంపిన ఆహ్వానాన్ని గిలానీకి అందజేశారు' అని పాక్ కమిషనర్ కార్యాలయ అధికార ప్రతినిధి ఒకరు శనివారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా లేఖలోని అంశాలను ఆయన ఉటంకించారు. కశ్మీర్ అంశం కారణంగా పార్ ఏర్పాటు ప్రక్రియ అసంపూర్ణంగా మిగిలిపోయిందని, ఇందులో ఇరు దేశాలేకాక రెండు కోట్ల మంది ప్రజల మనోభావాలు ఇమిడి ఉన్నాయని షరీఫ్ లేఖలో పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి పాక్ విస్తృత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందుకు భారత్ సహకరించటంలేదని, కశ్మీర్ అంశంపై మాట్లాడేందుకు సిద్ధంగా లేని కారణంగానే ఎన్ఎస్ఏ స్థాయి చర్చల్లో భారత్ వెనుకడుగువేసిందని ఆరోపించారు. ఇస్లామాబాద్- ఢిల్లీల మధ్య మైత్రి కొనసాగాలన్నదే తమ అభిమతమని తెలిపారు. గిలానీ కూడా పాక్ ఆహ్వానానికి అంగీకరించారని, అతి త్వరలోనే పర్యటనకు సంబంధించిన తేదీల వివరాలు తెలియజేస్తామని అధికార ప్రతినిధి తెలిపారు. -
ఐరాసలో ‘కశ్మీర్’ను లేవనెత్తిన షరీఫ్
న్యూయార్క్: అనుకున్నట్లే జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు, ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు వెనుకబాటు తదితర అంశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ అంతర్జాతీయ వేదికపై మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్. బుధవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో మాట్లాడిన ఆయన.. కశ్మీర్ సమస్య పరిష్కారానికి 4 సూత్రాల శాంతి ఫార్మూలాను ప్రతిపాదించారు. కశ్మీర్‌ను సైన్యరహితం చేయడం సియాచిన్ నుంచి బేషరతుగా సైనిక దళాలను ఉపసంహరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరుదేశాలు దళాలను ఉపయోగించడం కానీ, ఉపయోగిస్తామని బెదిరించడం కానీ చేయకపోవడం 2003నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం పై నాలుగు సూత్రాలు అమలు చేస్తే అణ్వస్త్ర దేశాలైన పాక్, భారత్‌ల మధ్య శాంతియుత సంబంధాలు నెలకొంటాయని షరీఫ్ వక్కాణించారు. సంబంధాలను సంఘర్షణతో కాకుండా సహకారంతో మాత్రమే నిర్వచించుకోవాలన్న షరీఫ్.. కశ్మీర్ అంశంపై తీర్మానాన్ని అమలు చేయకపోవడం ఐక్యరాజ్యసమితి వైఫల్యమని వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్య పరిష్కార ప్రక్రియలో కశ్మీరీలనూ భాగస్వామ్యులను చేయాలని తేల్చిచెప్పారు. -
కశ్మీర్ ప్రజలకు మా మద్దతు ఉంటుంది: పాక్
ఇస్లామాబాద్: భారత్‌తో ఉన్న కశ్మీర్ వివాదాన్ని వెంటనే పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని పాకిస్థాన్ విదేశాంగ వ్యవహారాలశాఖ మంత్రి సర్తాజ్ అజీజ్ అన్నారు. ఒక శాంతియుత తీర్మానం ద్వారా కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో చేసిన తీర్మానాల ఆధారంగానే తమ ఆలోచన ఉందని చెప్పారు. కశ్మీర్ ప్రజలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు పొందేందుకు రాజకీయంగా, నైతికంగా అన్ని రకాలుగా తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఏ స్థాయిలోనైనా భారత్‌తో తాము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
ఐరాసలో మళ్లీ కశ్మీర్ ప్రస్తావన తెచ్చిన పాక్
పాకిస్థాన్ మళ్లీ తన బుద్ధి చూపించుకుంది. కశ్మీర్ అంశంలో మూడో పక్షం జోక్యం ఉండకూడదని భారత్ పదేపదే చెబుతున్నా, దొరికిన ప్రతి వేదికపైనా ఇదే అంశాన్ని లేవనెత్తుతోంది. తాజాగా జమ్ము కశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్‌ను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కోరారు. అలాగే ఐక్యరాజ్య సమితికి చెందిన సైనిక పరిశీలన బృందం ఒకటి భారత్, పాకిస్థాన్‌ల కోసం ఏర్పాటుచేయాలన్నారు. అయితే ఐక్యరాజ్య సమితిలో బాన్ కీ మూన్ ప్రతినిధి మాత్రం, భారత్, పాక్‌లు శాంతియుత చర్చలను కొనసాగించాలని మాత్రమే మూన్ ఆకాంక్షించినట్లు తెలిపారు. ఉగ్రవాదంపై పోరు గురించి చర్చించామన్నారు. ఇక ఐక్యరాజ్య సమితిలో జరిగిన ప్రసంగాలలో కూడా చాలామంది దేశాధ్యక్షులు కేవలం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడగా, బెలారస్, వెనిజువెలా లాంటి వాళ్లు మాత్రం పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక్క నవాజ్ షరీఫ్ మాత్రం ద్వైపాక్షిక అంశాలను కూడా అక్కడ ప్రస్తావించారు. కాగా, ఆయనకు వచ్చేవారం జరిగే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ వార్షిక సమావేశంలో కూడా మాట్లాడే అవకాశం వస్తుంది. అప్పుడు కూడా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తారనే భావిస్తున్నారు. -
ముందు ‘వేర్పాటు’ చర్చలు!
భద్రత సలహాదారు చర్చల ముందు పాక్ కవ్వింపు * 23న భారత్ రానున్న పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ * అజీజ్‌తో భేటీకావాలని కశ్మీర్ వేర్పాటు నేతకు పాక్ హైకమిషన్ పిలుపు * ఆయన గౌరవార్థం ఇచ్చే విందుకు మితవాద నేతలకు ఆహ్వానం శ్రీనగర్: ఓపక్క భారత్‌తో చర్చలంటూనే, మరోపక్క వేర్పాటువాదులకు స్నేహహస్తం అందించే కవ్వింపు కుట్రలకు పాకిస్తాన్ మరోసారి తెరతీసింది. ఇరుదేశాల మధ్య ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న జాతీయ భద్రత సలహాదారు(ఎన్ఎస్ఏ) స్థాయి చర్చల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తున్న పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్‌తో భేటీకి రావాలంటూ కశ్మీర్ వేర్పాటువాద సంస్థ, అతివాద హురియత్ కాన్ఫెరెన్స్ నేత సయ్యద్ అలీ షా గిలానీకి భారత్‌లోని పాక్ హై కమిషన్ ఆహ్వానం పంపింది. అలాగే, అజీజ్ గౌరవార్థం 23న తామిచ్చే విందుకు హాజరుకావాలంటూ మితవాద హురియత్ చైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ సహా పలువురు కశ్మీర్ మితవాద వేర్పాటు నేతలను పిలిచింది. ఈ ఆహ్వానాన్ని గిలానీ మన్నించారని, 24న సర్తాజ్ అజీజ్‌తో ఆయన సమావేశమవుతారని అతివాద హురియత్ ప్రతినిధి అయాజ్ అక్బర్ ధ్రువీకరించారు. పాక్ హై కమిషన్ ఇస్తున్న విందుకు తనతో పాటు మితవాద నేతలు హాజరవుతారని మీర్వాయిజ్ ఫారూఖ్ చెప్పారు. ఆ విందుకు హాజరయ్యే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ తెలిపారు. భారత్ సీరియస్! పాక్ హై కమిషన్ చర్యపై భారత్ అధికారికంగా స్పందించనప్పటికీ, వేర్పాటువాదులకు ఆహ్వానం పంపడాన్ని తీవ్రంగా తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వం దీనిపై సరైన విధంగా స్పందిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్‌లోని కొన్ని వర్గాలు భారత్, పాక్ చర్చలను అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నాయని, వేర్పాటువాదులకు ఆహ్వానం అందులో భాగమేనన్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ బుధవారం హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. వేర్పాటువాద నేతలకు పాక్ హై కమిషన్ ఆహ్వానంప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కశ్మీర్ వేర్పాటువాద నేతలకు ఆహ్వానం పంపడాన్ని భారత్‌లోని పాక్ హై కమిషన్ సమర్థించుకుంది. ‘ఇది కొత్తేం కాదు. గతంలోనే వేర్పాటువాదులను కలిశాం. ఇలాంటి భేటీలు, విందులు గతంలోనూ జరిగాయి. దీనిపై ఇంత రాద్ధాంతం ఎందుకు?’ అంటూ కమిషన్‌లోని కౌన్సెలర్(ప్రెస్) మంజూర్ మెమన్ అన్నారు. అజిత్ దోవల్‌తో సర్తాజ్ అజీజ్ చర్చలు 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇరుదేశాలు ఎన్ఎస్ఏ స్థాయి చర్చలు ప్రారంభించాలంటూ జూలై 10న రష్యాలోని ఉఫాలో భేటీ సందర్భంగా భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ నిర్ణయించడం తెలిసిందే. రాజకీయం చేయొద్దు: మీర్వాయిజ్ పాక్ ఎంబసీ నుంచి ఆహ్వానం అందగానే, మితవాద హురియత్ కాన్ఫెరెన్స్ బుధవారం అత్యవసర కార్యనిర్వాహక భేటీని ఏర్పాటు చేసింది. అజీజ్ గౌరవార్థం ఇస్తున్న విందుకు వెళ్లాలని నిర్ణయించింది. నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత సడలేలా, సంపూర్ణ కాల్పుల విరమణ అమలయ్యేలా భారత్, పాక్‌లు చర్యలు తీసుకోవాలని మీర్వాయిజ్ ఫారూఖ్ సూచించారు. ‘దక్షిణాసియాలో శాంతి నెలకొనే ఒక అవకాశాన్ని గత ఏడాది కోల్పోయాం. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మాకు ఆహ్వానం పంపడాన్ని రాజకీయం చేయొద్దు. రాజకీయం చేసే అంశాలు వేరే ఉన్నాయి’ అన్నారు. గత ఆగస్ట్‌లో భారత్, పాక్‌ల మధ్య ప్రారంభం కానున్న విదేశాంగ కార్యదర్శుల భేటీ ఇదే కారణంతో రద్దవడం తెలిసిందే. కార్యదర్శుల సమావేశం కన్నా ముందు కశ్మీర్ వేర్పాటు వాదులతో పాక్ దౌత్యాధికారులు భేటీ కావడంపై ఆగ్రహంతో భారత్ ఆ చర్చల నుంచి వైదొలగింది. మోదీ, షరీఫ్‌ల మధ్య ఉఫాలో జరిగిన చర్చల సందర్భంగా కశ్మీర్ ప్రస్తావన లేకపోవడానికి నిరసనగా గత నెలలో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ఇచ్చిన ఈద్ మిలన్ కార్యక్రమాన్ని అతివాద వేర్పాటు నేత సయ్యద్ అలీ షా గిలానీ బహిష్కరించారు. స్వాతంత్య్రం కోసం న్యాయ పోరాటం చేస్తున్న కశ్మీరీలను పాక్ వదిలేయబోదని గతవారం బాసిత్ అనడం గమనార్హం. దారితెన్నూ లేకుండా చర్చలా?: కాంగ్రెస్ పాక్‌తో చర్చల విషయంలో ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. కశ్మీర్ వేర్పాటువాద నేతలకు పాక్ దౌత్య కార్యాలయం ఆహ్వానం పంపడాన్ని తేలిగ్గా కొట్టేసిన కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ.. కశ్మీరీ వేర్పాటువాదులను ఎప్పుడో పక్కన పెట్టేసారన్నారు. మధ్యవర్తిత్వం నెరపండి * కశ్మీర్‌పై ఐరాసలో పాక్ పాతపాట న్యూయార్క్: భారత్-పాకిస్తాన్ల మధ్య ఎన్ఎస్ఏల చర్చలకు గడువు సమీపిస్తున్న కొద్దీ పాక్ కశ్మీర్‌పై తన దూకుడును పెంచింది. కశ్మీర్ అంశాన్ని పరిష్కరించటానికి ప్రపంచ శాంతి సంస్థ ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం నెరపాలని భద్రతామండలికి మళ్లీ విజ్ఞప్తి చేసింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) కూడా జోక్యం చేసుకోవాలంది. సమకాలీన ప్రపంచ భద్రతా సవాళ్లపై జరిగిన చర్చలో ఐరాసలో పాక్ శాశ్వత ప్రతినిధి మలీహా లోధీ మాట్లాడుతూ 57 మంది సభ్యులున్న ఓఐసీ కూడా ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వాలకు తన వంతుగా పాటుపడాలని కోరారు. అంతకు ముందు వాస్తవాధీన రేఖ వద్ద భారత్, పాకిస్తాన్‌లు పూర్తి సంయమనం పాటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని.. దాని వల్ల త్వరలో జరగబోయే ఇరుదేశాల జాతీయ భద్రతాసలహాదారుల చర్చల్లో నిర్మాణాత్మకమైన ఫలితం వెలువడే అవకాశం ఉంటుందని అన్నారు. అవే ఉల్లంఘనలు.. పౌరులే లక్ష్యాలు జమ్మూ: పాక్ బలగాలు బుధవారం రాత్రీ జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో జనావాసాలపై కాల్పులు జరిపాయి. దీటుగా తిప్పికొట్టామని సైన్యం తెలిపింది. యథావిధిగా ఎన్ఎస్ఏల చర్చలు! కశ్మీర్ వేర్పాటునేతలకు పాక్ హైకమిషన్ ఆహ్వానం నేపథ్యంలో.. పాక్‌తో ఎన్ఎస్ఏ స్థాయి చర్చలను కొనసాగించాలనే భారత్ భావిస్తోందని తెలుస్తోంది. పాక్‌లో తలదాచుకున్నారని భావిస్తున్న దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ సహా 60 మంది ఉగ్ర నేరస్తుల జాబితాను భారత్ చర్చల్లో పాక్‌కు అందజేయనుంది. వారిని తమకప్పగించాలని డిమాండ్ చేయనుంది. ఇటీవలి గురుదాస్‌పూర్, ఉధంపూర్ ఉగ్ర ఘటనలను, భారత్‌కు చిక్కిన పాక్ ఉగ్రవాది నవేద్ ఉదంతాన్ని ప్రస్తావించనుంది. ముంబై దాడుల కేసు సత్వర విచారణ అంశాన్నీ లేవనెత్తనుంది. సంరతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్లు, బలూచిస్తాన్ అస్థిరతను పాక్ లేవనెత్తొచ్చని, సంఝౌతా ఉదంతంతో ముంబై దాడులను పోల్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, పాక్ వాదనను తిప్పికొట్టాలని, ముంబై దాడులు పాక్ ప్రభుత్వ సంస్థల సహకారంతో జరిగిన విషయాన్ని ఎత్తి చూపాలని భారత్ భావిస్తోందని పేర్కొన్నాయి. లష్కరే శిక్షణపై పాక్ ఉగ్రవాది నవేద్ ఇచ్చిన సమాచారాన్ని, నవేద్ తెలిపిన పాక్‌లోని తన ఇంటి అడ్రస్‌ను పాక్ ఎన్ఎస్ఏతో దోవల్ పంచుకుంటారని వెల్లడించాయి. -
భారత్‌తో చర్చల్లో పాక్ 'కశ్మీర్' కిరికిరి
న్యూఢిల్లీ: మరో నాలుగు రోజుల్లో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల భేటీ జరగనున్న సందర్భంలో ఎప్పటిలాగే పాకిస్థాన్ తన మార్కు రాజకీయాలకు తెరలేపింది. ఆదివారం ఢిల్లీలో భారత్- పాక్ జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, సర్తాజ్ అజీజ్ సమావేశం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ముందే అజీజ్.. కశ్మీర్ వేర్పాటువాద నేతలతో భేటీ అవుతారని పాకిస్థాన్ హైకమిషనర్ ప్రకటించడం తీవ్రచర్చనీయాంశమైంది. అజీజ్‌తో సమావేశానికి రావాల్సిందిగా హురియత్ నేత సయ్యద్ అలీషా గిలానీ సహా పలువురు వేర్పాటువాద నాయకులకు పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ బుధవారం ఆహ్వానాలు పంపారు. పాక్ ఆహ్వానాన్ని గిలానీ సహా వేర్పాటువాదులు అంగీకరించారు కూడా. పాక్ అనూహ్య చర్యతో చర్చల ప్రక్రియపై ఒక్కసారిగా కారుమేఘాలు కమ్ముకున్నట్లయింది. అయితే ఈ విషయంలో పాక్ లా దూకుడుగా కాకుండా పూర్తి సమన్వయంతో వ్యవహరించాని భారత్ ఇదివరకే నిర్ణయించుకున్న దరిమిలా.. ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చల ప్రక్రియ రద్దుకాదని ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. 'నిజానికి పాక్ చర్య భారత ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. వారు ద్వంద్వ విధానాలు అవలంభిస్తున్నదని అందరికీ అర్థమవుతూనేఉంది. కానీ ఏం చేస్తాం? ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యపై వారితో తప్ప ఎవరితో మాట్లాడగలం?' అని అత్యున్నత స్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు ఐక్యరాజ్యసమితిలోనూ కశ్మీర్ అంశాన్నిపాక్ లేవనెత్తింది. 'ప్రాంతీయ సమాఖ్యలు, సమకాలీన ప్రపంచ భద్రతా సవాళ్లు' అనే అంశంపై బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి మలీహా లోథీ మాట్లాడారు. భారత్- పాక్ ల మధ్య ఏళ్లుగా నలిగిపోతోన్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ)లు సహకరించాలని కోరారు. -
'బ్యాక్ ఎండ్‌లో కశ్మీర్ సమస్యకు పరిష్కారం'
ఇస్లామాబాద్: ప్రధాన సమస్య జోలికి పోకుండా మిగతా అంశాలపై దశలవారీగా చర్చలు జరపడం.. తద్వారా అసలు సమస్య పరిష్కారానికి కావాల్సినంత సానుకూలతను సృష్టించడం దౌత్యనీతి. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ లు ఇలాంటి వెనుక మార్గపు దౌత్యాన్ని(బ్యాక్ ఎండ్ డిప్లమసీ) అనుసరిస్తున్నాయని పాకిస్థాన్ ప్రధానికి జాతీయ భద్రత, విదేశీవ్యవహారాల సలహాదారు సర్తజ్ అజీజ్ అన్నారు. షాంఘై సహకార సంస్థ సమావేశంలో భాగంగా రష్యాలోని ఉఫా నగరంలో చర్చించుకున్న భారత్, పాక్ ప్రధానుల చర్చల్లో కశ్మీర్, సియాచిన్, సర్ క్రీక్ వంటి కీలక అంశాలపై ఎలాంటి ప్రస్తావన రాకపోవడంపై ఇటు భారత్ సహా, అటు పాకిస్థాన్ లోనూ కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అయితే ప్రధాన సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు దేశాలూ భావిస్తున్నాయని, అయితే చిక్కుముడిని ఒక్కసారే విప్పడంకంటే సావధానంగా వ్యవహరించడం ఉత్తమమని అజీజ్ పేర్కొన్నారు. మోదీతో చర్చల సందర్భంలో షరీఫ్ వెంట అజీజ్ కూడా పాల్గొన్నారు. -
'యోగాతో కశ్మీర్ సమస్యకు పరిష్కారం'
జమ్ము: యోగా సాధన ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోగలమని, తద్వారా జఠిలమైన కశ్మీర్ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని జమ్ముకశ్మీర్ మంత్రి చౌదరీ లాల్ సింగ్ అన్నారు. శనివారం జమ్ములో మీడియాతో మాట్లాడిన ఆయన వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ సయ్యద్ అలీషా గిలానీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. 'గిలానీకి నా సలహా ఏమంటే ప్రతి రోజు యోగా చేయమని. యోగా సాధన ద్వారా ఏది సరైన నిర్ణయమో, ఏది తప్పుడు నిర్ణయమో తెలుసుకోగలిగే జ్ఞానం సిద్ధిస్తుంది. అప్పుడు కశ్మీర్ సమస్యకు పరిష్కారం దానంతట అదే దొరుకుతుంది' అని లాలా సింగ్ అన్నారు. యోగాను వ్యతిరేకించేవారికి అసలు ఇస్లాం గురించే తెలియదని, అలాంటి వాళ్లందరూ మూర్ఖులేనని వ్యాఖ్యానించారు. కశ్మీర్ లోని అన్ని జిల్లాలు, గ్రామ స్థాయిల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని, జమ్ములోని గుల్షన్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాన వేడుకకు 5వేల మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉదని చెప్పారు. ఉధంపూర్ జిల్లాలోని మంతలాయి ప్రాంతాన్ని అంతర్జాతీయ యోగా కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. -
'పాక్ నుంచి ఆ భూతాన్ని తరిమేస్తాం'
ఉగ్రవాదుల దాడుల కారణంగా ఏడేళ్లుగా వేడుకలకు దూరంగా ఉన్న పాక్ సైనిక బలగాలు సోమవారం 'పాకిస్థాన్ పరేడ్ డే'ని ఘనంగా నిర్వహించాయి. టెర్రరిస్టులతో పోరాటంలో దేశం యావత్తు ఒక్కటయిందని, టెర్రర్ భూతాన్ని పాక్ నుంచి తరిమేస్తామని పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ అన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ప్రధాన వేడుకలో పాల్గొన్న ఆయన.. తాము భారత్‌తో స్నేహ సంబంధాల్ని కోరుకుంటున్నామని చెప్పారు. ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్లయితే ఏళ్లుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వ్యాఖ్యానించారు. ఆ దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదులతో పోరులో అమరులైన వీర జవాన్లతోపాటు పెషావర్ మృతులకూ నివాళులు అర్పించిన మమ్నూన్.. తాలిబన్ల వేటకోసం పైన్యం అనుసరిస్తున్న 'జర్బ్ ఏ అజబ్' విధానాన్ని ప్రశంసించారు. 1947లో స్వాతంత్ర్యం పొందిన నాటినుంచి పాక్ అనేక సమస్యల్ని ఎదుర్కొంటోందని, ప్రధాని నవాజ్ షరీఫ్ వాటిని పరిష్కరించగల సమర్ధుడేనని అన్నారు. -
పాకిస్థాన్‌కు బ్రిటన్ చెప్పుదెబ్బ సమాధానం
బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ పాకిస్థాన్‌కు చెప్పుదెబ్బ లాంటి సమాధానం చెప్పారు. బ్రిటన్ వేదికగా అంతర్జాతీయ యవనికపై కాశ్మీర్ అంశాన్ని రచ్చ చేయాలనుకున్న పాక్ పన్నాగాన్ని తిప్పికొట్టారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమ దేశానికి ఆహ్వానించిన కామెరాన్.. కాశ్మీర్ అంశం కేవలం భారత్, పాకిస్థాన్ మధ్య విషయమని, దానిపై తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల లండన్‌లో ఓ భారీ ప్రదర్శన ఏర్పాటుచేసి, కాశ్మీర్ అంశాన్ని అక్కడ చర్చకు లేవదీయాలని ప్రయత్నించారు. అయితే.. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. అక్కడ భారీ ప్రదర్శన చేయాలనుకున్నా.. దానికి స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. దాంతో ఆ వైఫల్యానికి కారణం మీరంటే మీరేనంటూ.. బిలావల్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్ వర్గాలు ఆరోపించుకున్నాయి. కానీ ఇప్పుడు వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు అటు ప్రదర్శన విఫలం కావడం, ఇటు బ్రిటిష్ ప్రధాని కామెరాన్ కూడా పాకిస్థాన్‌కు మద్దతు చెప్పకపోవడం ఆ దేశ నాయకులకు తీవ్ర ఆశాభంగాన్ని కలిగించింది. -
కాశ్మీర్‌పై పాక్‌కు చుక్కెదురు!
జోక్యానికి ఐరాస అయిష్టత చర్చలతో పరిష్కరించుకోవాలని సూచన న్యూయార్క్/జమ్మూ: సరిహద్దులో పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్, కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి జోక్యం కోసం చేసిన తాజా ప్రయుత్నం ఫలించలేదు. ఈ అంశంపై పాక్ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి పట్టించుకోలేదు. కాశ్మీర్‌పై కలుగజేసుకునేందుకు అరుుష్టత వ్యక్తంచేస్తూ, ఈ అంశంపై భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించింది. సరిహద్దులో ఇటీవలి ఉద్రిక్తతలకు భారతదేశమే కారణమని, సరిహద్దులో పరిస్థితి చక్కదిద్దేందుకు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి జోక్యంచేసుకోవాలని కోరుతూ పాక్ ఇటీవల ఐరాసను కోరింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మున్కు లేఖ రాశారు. అయితే, కాశ్మీర్ వివాదాన్ని ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని బాన్ కీ వుూన్ అభిప్రాయుపడినట్టు బాన్ ప్రతినిధి ఫర్హాన్ చెప్పారు. పాత ఎత్తుగడే.. భారత్: కాశ్మీర్‌పై ఐక్య రాజ్యసమితిని ఆశ్రయించడం పాకిస్థాన్ పాత ఎత్తుగడేనని, ఈ ఎత్తుగడ గతంలో ఫలించలేదని, ఇకపై కూడా ఫలించబోదని భారత్ వ్యాఖ్యానించింది. కాశ్మీర్‌పై చర్చల్లో తృతీయు పక్షానికి ప్రమేయుం కల్పించడం హర్షణీయుం కాదని విదేశాంగశాఖ ప్రతినిధి సయ్యుద్ అక్బరుదీన్ చెప్పారు. కాశ్మీర్‌సహా అన్ని అంశాలపై నేరుగా చర్చలకు భారత్ సువుుఖంగానే ఉందని, అలాంటి చర్చలపై పాక్ ఆసక్తిచూపడంలేదని అన్నారు. కాగా, కాశ్మీర్‌పై జోక్యానికి ఐక్యరాజ్యసమితి తిరస్కృతిపట్ల బీజేపీ హర్షం వ్యక్తంచేసింది. ఇది, నరేంద్ర మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా సాధించిన విజయువుని బీజేపీ జమ్మూ కాశ్మీర్ విభాగం పేర్కొంది. ఆర్మీ అధికారుల హాట్‌లైన్ చర్చలు సరిహద్దులో ఉద్రిక్తతల పరిష్కార చర్యలపై భారత్, పాక్ సైన్యాధికారులు వుంగళవారం హాట్లైన్లో వూట్లాడారు. పాక్ మిలిటరీ కార్యకలాపాల డెరైక్టర్, హాట్లైన్లో భారత మిలిటరీ వ్యవహారాల డెరైక్టర్‌తో సంభాషణలు జరిపినట్టు ఓ పాక్ సైన్యాధికారి చెప్పారు. వురోవైపు.., పాకిస్థాన్ వుంగళవారం రెండు సార్లు కాల్పుల విరవుణను ఉల్లంఘించింది. కాశ్మీర్ పూంచ్ జిల్లాలో అధీనరేఖ వెంబడి భారత్‌కు చెందిన పది అవుట్‌పోస్టులపై పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక వుహిళ గాయుపడ్డారు. -
ఐరాసలో పాకిస్థాన్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు చుక్కెదురు అయ్యింది. కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలని పాక్ చేసిన విజ్ఞప్తిని ఐరాస తిరస్కరించింది. కాశ్మీర్ అంశాన్ని చర్చల ద్వారా ఇరు దేశాలు పరిష్కరించుకోవాలని పాకిస్థాన్‌కు ఐక్యరాజ్య సమితి సూచించింది. కాగా కొద్దిరోజులుగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్... కాశ్మీర్ అంశంపైకి అంతర్జాతీయంగా దృష్టి మరల్చే యత్నాలను తీవ్రం చేసింది. కాశ్మీర్‌తో సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులపై జోక్యం చేసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌కు లేఖ రాసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేసింది. పాకిస్థాన్ ప్రధాని భద్రత, విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ రాసిన ఈ లేఖను పాక్ విదేశాంగ కార్యాలయం ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. కొద్దివారాలుగా భారత్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, భారీగా కాల్పులకు తెగబడుతోందని ఆ లేఖలో ఆరోపించారు. భారత దళాలు జరిపిన కాల్పుల్లో తమ పౌరులు భారీ సంఖ్యలో మరణించారన్నారు. అక్టోబర్ నెల మొదటి పదిరోజుల్లోనే అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి 22 సార్లు, నియంత్రణ రేఖ వెంబడి 20 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించారని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని.. దీనిపై అత్యవసరంగా దృష్టి సారించాలని బాన్‌కీ మూన్‌ను అజీజ్ కోరారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సుదీర్ఘకాలంగా ఈ జమ్మూకాశ్మీర్ వివాదం ఎజెండాగా ఉందని.. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిపిస్తామనే తీర్మానాలు కూడా చేసినా, ఇంకా ఆ పని చేపట్టలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఐరాస జోక్యం చేసుకోమని స్పష్టం చేయటంతో పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు ఎదురైందనే చెప్పవచ్చు -
మో‘ఢీ’కి సిద్ధంగానే ఉన్నాం!
* కాశ్మీర్ అంశంపై మోడీ కఠిన వైఖరి అవలంబించాలనుకుంటున్నారు * మేమూ సిద్ధంగానే ఉన్నాం.. ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం * జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కాశ్మీర్ సమస్యకు సంబంధించి ప్రధానమంత్రి మోడీ కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించుకున్నారని.. అయితే, అందుకు తాము సిద్ధంగానే ఉన్నామని జమ్మూ, కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్ శనివారం స్పష్టం చేశారు. ‘భారతదేశ ప్రజలు మోడీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆయన ఇప్పుడు కఠినంగా, మొండిగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. కాశ్మీరీలమైన మేం అందుకు సిద్ధంగానే ఉన్నాం. మా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. మోడీ వచ్చాడు.. మాకిప్పుడు పరీక్షా కాలం.. కష్టమైన రోజులు. అయినా, దేవుడి దయతో ఈ పరీక్షలో పాస్ అవుతాం’ అన్నారు. మోడీకి మేమిచ్చే సందేశం ఒకటే.. మీరు సుపరిపాలన ఇస్తారు కావచ్చు.. కానీ కఠిన వైఖరి అవలంబించి ఒక ఉద్యమాన్ని అంతం చేయలేరు’ అని స్పష్టం చేశారు. హిందీ వార్తాచానల్ ఇండియా టీవీలో రజత్ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించే టీవీ షో ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో యాసిన్ మాలిక్ పాల్గొన్నారు. తమ వల్లనే భారత్, పాక్‌ల మధ్య విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు రద్దు అయ్యాయన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అన్ని సంబంధిత వర్గాలు చర్చల్లో పాల్గొనాలని తాము కోరుకుంటున్నామన్నారు. పాక్‌తో చర్చల సందర్భంగా శాంతిపూర్వక వాతావరణం ఏర్పడటం కోసం కాశ్మీర్ వేర్పాటువాద నేతలు పాకిస్థాన్ వెళ్లేందుకు 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి అనుమతించిన విషయాన్ని మాలిక్ గుర్తు చేశారు. భారత్, పాకిస్థాన్‌లు మాత్రమే కూర్చుని చర్చలు జరపడానికి కాశ్మీర్ అంశం అనేది సరిహద్దు సమస్య కాదని మాలిక్ తేల్చి చెప్పారు. కాశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించే ఏ చర్చల్లోనైనా కాశ్మీరీలను భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు. మిలిటెంట్ల వద్దకు వెళ్లాలని మన్మోహన్ కోరారు పాకిస్థాన్‌లోని మిలిటెంట్లతో సంప్రదించాల్సిందిగా 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తనను కోరారని మాలిక్ చెప్పారు. పాక్‌తో శాంతి ప్రక్రియ ఫలప్రదమయ్యేందుకు అది తోడ్పడుతుందని మన్మోహన్ భావించారన్నారు. మన్మోహన్ సింగ్‌తో సమావేశమైనప్పుడు శాంతి చర్చల్లో తమనూ భాగస్వాము లను చేయాలని తాను కోరిన సందర్భంలో ఆయన పై విధంగా స్పందించారని ఆయన వివరించారు. -
దౌర్జన్య రాజకీయం!
సంపాదకీయం: ఏ సమస్యపై అయినా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజం. కానీ, వాటిని పీకనొక్కడం ద్వారా మాయం చేయాలనుకోవడం తెలివి తక్కువతనం అవుతుంది. న్యూఢిల్లీలో మరోసారి ఇలాంటి గుణాన్ని ప్రదర్శించారు కొందరు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు ప్రశాంత్ భూషణ్ కాశ్మీర్లో సైన్యాన్ని ఉంచాలా, వద్దా అనే అంశంలో చెప్పిన మాటలకు సహనం కోల్పోయిన కొందరు బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి సమీపంలో ఉన్న ఆప్ కార్యాలయంపై దాడిచేసి, విధ్వంసం సృష్టించారు. తాము హిందూ రక్షా దళ్‌కు చెందినవారమని చెప్పుకున్నారు. ఇదే బృందానికి చెందిన వ్యక్తులు రెండేళ్లక్రితం భగత్‌సింగ్ క్రాంతి సేన పేరిట వచ్చి ప్రశాంత్ భూషణ్‌పై ఆయన కార్యాలయంలోనే చేయిచేసుకున్నారు. గతంలో కర్ణాటకలో సైతం ఇలాంటి వ్యక్తులే సంస్కృతి, సంప్రదాయాల పేరిట పౌరులను భీతావహుల్ని చేయడానికి ప్రయత్నించారు. ప్రశాంత్ భూషణ్ లబ్ధప్రతిష్టుడైన క్రియాశీల న్యాయవాది. చాలా విషయాల్లో ఆయనకు దృఢమైన అభిప్రాయాలున్నాయి. అంతేకాదు... ఆ అభిప్రాయాలకు అనుగుణమైన కార్యాచరణ కూడా ఉన్నది. ఆ కారణంవల్లనే న్యాయవ్యవస్థలో సంస్కరణలు జరగాలని, న్యాయమూర్తులు కూడా ప్రజలకు జవాబుదారీ కావాలని, అందుకోసం తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఆయన ఉద్యమించారు. ఎన్డీఏ ప్రభుత్వం హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలి యంవంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి ప్రయత్నించినప్పుడు సుప్రీంకోర్టులో పోరాడి, దాన్ని ఆపించిన ఘనత ఆయనదే. యూపీఏ హయాంలో జరిగిన 2జీ స్కాంతో సహా ఎన్నో కుంభకోణాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా పోరాడి వాటిపై చర్యలు తీసుకొనేలా చేశారు. సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన 16మందిలో సగంమంది అవినీతిపరులని ఆయన వ్యాఖ్యానించినప్పుడు పెద్ద అలజడి రేగింది. దానిపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార వ్యాజ్యం నడుస్తున్నది కూడా. ప్రశాంత్ భూషణ్ ఆచరణపైగానీ, అభిప్రాయాల విషయంలోగానీ అందరికీ ఏకీభావం ఉండాలని లేదు. ఆయన వ్యక్తిగా వివిధ సమస్యలపై పోరాడినప్పుడు, అన్నా బృందంలో సభ్యుడిగా ఉంటూ అవినీతి వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నప్పుడు ఆయన సహచరులు కొందరు ప్రశాంత్ అభిప్రాయాలతో విభేదించారు. కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలపైనా ఆయనకంటూ కొన్ని అభిప్రాయాలున్నాయి. అవి ఏవిధంగా పొరపాటు అభిప్రాయాలో, ఆయన అవగాహనలో ఉన్న లోపాలేమిటో చెప్పడానికి ఎవరికైనా హక్కున్నది. కాశ్మీర్లో సైన్యాన్ని ఉంచాలా, లేదా అనే అంశంపై అక్కడ రిఫరెండం నిర్వహించాలని ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యానం అభ్యంతరకరమని దాడిచేసినవారు చెబుతున్నారు. అభ్యంతరాలుండటం తప్పేమీ కాదుగానీ అందుకోసమని దాడికి దిగడ ం హేయం. ప్రశాంతే చెప్పినట్టు ఆయన రిఫరెండం కోరింది కాశ్మీర్ భారత్‌లో ఉండాలా, లేదా అనే అంశంపై కాదు. అలాగే, ప్రశాంత్ అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవని, తమకు సంబంధంలేదని ఆప్ చెప్పింది. ఇంతకూ దౌర్జన్యానికి దిగిన బృందం చెప్పదల్చుకున్నదేమిటి...అచ్చం తాము విశ్వసించే అభిప్రాయాలే అందరికీ ఉండాలనా? ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దులను కాపాడే జవాన్లను, వారి త్యాగశీలతను కొనియాడేవారు సైతం కాశ్మీర్లో జరిగిన కొన్ని ఘటనల విషయంలో ఆవేదన వ్యక్తంచేసిన సందర్భాలున్నాయి. పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న రాష్ట్రం గనుక కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులతో సున్నితంగా వ్యవహరించాలని పలువురు చెప్పివున్నారు. ముఖ్యంగా సైన్యానికి విశేషాధికారాలు ఇస్తున్న సాయుధ దళాల (ప్రత్యేకాధికారాల) చట్టాన్ని విచక్షణాయుతంగా వినియోగించకపోవడంవల్ల సమస్యలు విషమిస్తున్నాయని వారి ఆందోళన. అక్కడ జరిగే ఏ చిన్న ఘటననైనా ఆసరా చేసుకుని ఉద్రిక్తతలు సృష్టించాలని పాక్ సైన్యమూ, దాని కనుసన్నల్లో పనిచేసే గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రయత్నిస్తాయి గనుకే అత్యంత జాగురూకతతో మెలగాలన్నది వారి సూచనల ఆంతర్యం. యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో నియమించిన కమిటీ ఆ చట్టాన్ని రద్దుచేయాలని సూచించింది. చట్టాన్ని సమీక్షించి అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జవాన్లపై సివిల్ కోర్టుల్లో విచారణను నిరోధిస్తున్న సెక్షన్ 6ను తొలగించాలని నిరుడు జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సైతం కేంద్రాన్ని కోరింది. జస్టిస్ జీవన్‌రెడ్డి అయినా, జస్టిస్ వర్మ అయినా ఆ చట్టం దుర్వినియోగమైన తీరును లోతుగా గమనించాకే ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఈమధ్యే సైన్యం సైతం కాశ్మీర్లో 2010లో జరిగిన ఒక ఎన్కౌంటర్ బూటకమైనదని నిర్ధారణకొచ్చి ఒక కల్నల్, మేజర్‌సహా ఆరుగురిపై కోర్టు మార్షల్ జరపాలని నిర్ణయించింది. ముగ్గురు యువకులను పాక్ చొరబాటుదార్లుగా చిత్రీకరించి ఎన్కౌంటర్ పేరిట హతమార్చిన ఘటన అది. అప్పట్లో ఆ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ కాశ్మీర్ వ్యాప్తంగా జరిగిన నిరసన ఆందోళనలు హింసాత్మకంగా మారి 123మంది పౌరులు భద్రతాదళాల కాల్పుల్లో చనిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలాచోట్ల సైన్యం అవసరం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పలుమార్లు చెప్పారు. అక్కడ సైన్యం ఉండే విషయంలో రిఫరెండం జరపాలనడం ప్రశాంత్ భూషణ్ అవగాహనా లోపం అయి ఉండొచ్చు... ఒక పార్టీలో భాగంగా మారారుగనుక వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడంలో ఉండే పరిమితులు ఆయనకు అర్ధం కాకపోయి ఉండొచ్చు. కానీ, అంతమాత్రాన కొందరు వ్యక్తులు తమ దౌర్జన్యానికి దాన్ని ఒక సాకుగా తీసుకోవడం తగనిపని. దాడికి దిగినవారు ఆప్ ఆరోపిస్తున్నట్టు బీజేపీ ప్రోత్సాహంతో వచ్చారా, లేదా అన్నది ఇంకా తేలవలసివున్నది. కానీ, ఎలాంటి ప్రజాస్వామ్య సంప్రదాయాలూ పాటించకుండా, ఏ విలువలూ లేకుండా పేట్రేగే ఇలాంటి శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం మాత్రం ఉంది. -
కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యం అవసరం: షరీఫ్
ఇస్లామాబాద్: కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా జోక్యం అవశ్యమని పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్‌పై మూడో (అమెరికా) దేశం జోక్యం చేసుకోవడం భారత్‌కు ఇష్టం లేనప్పటికీ, సమస్య పరిష్కారం కావాలంటే అగ్ర దేశం జోక్యం అవసరమేనన్నారు. బుధవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకోవడానికి బయల్దేరి వెళుతున్న నవాజ్ లండన్‌లో ఆదివారం ఈ వ్యాఖ్య చేశారు. భారత్, పాకిస్థాన్‌ల వద్ద అణ్వాయుధాలున్నాయని, ఇది అణ్వాయుధ అలికిడి కలిగిన ప్రాంతమని ఆయన అన్నారు. అమెరికా జోక్యంతోనే కాశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందన్న విషయాన్ని 1999 జూలైలో కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడే అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు తాను స్పష్టం చేశానని ఒక ప్రశ్నకు బదులుగా నవాజ్ షరీఫ్ చెప్పారు. కానీ, ఉభయ దేశాలూ నిర్మాణాత్మక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా చెబుతూ వస్తోందన్నారు. అయితే, 60 ఏళ్లుగా అడుగుముందుకు పడలేదని చెబుతూ.. భారత్, పాకిస్థాన్ మధ్య అంతూ దరీ లేని ఆయుధ పోటీ ప్రమాదకర స్థితికి చేరిందన్నారు. దీన్ని ఎక్కడో ఒకచోట ఆపాలన్నారు. అమెరికా డ్రోన్ దాడుల గురించి కూడా ఒబామా దష్టికి తెస్తానన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో గత నెలలో తాను కాశ్మీర్ అంశంపై ఆందోళన వెలిబుచ్చినప్పుడు ప్రపంచం అంతా హర్షించిందని చెప్పుకున్నారు. ఐరాస సమావేశానికి వెళ్లి వస్తూ నవాజ్ న్యూయార్క్‌లోనూ పర్యటించినప్పటికీ, పాకిస్థాన్ ప్రధాని అమెరికాలో అధికారిక పర్యటన జరపడం గత ఐదేళ్లలో ఇదే ప్రథమం.