Maniratnam
-
“కలియుగమ్ 2064″ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మణిరత్నం
శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కలియుగమ్ 2064″. అసలే కలియుగం.. ఆపై 2064… ఆ సమయంలో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకుతారు? ఎలా చావబోతున్నారు అన్నదే కథ. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను లెజండరీ డైరెక్టర్ మణిరత్నం శుక్రవారం విడుదల చేశారు. వినూత్న కథాంశంతో రాబోతున్న ''కలియుగమ్ 2064" మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిర్మాత కె.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా ఇప్పటి జెనరేషన్‌కు చాలా అవసరం. యువత, ఫ్యామిలీ, పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ. మా ఈ వినూత్న ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నాము. ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్ నార్వేలో చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అన్నారు. తెలుగులో హీరో నానితో జెర్సీ మూవీ లో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ కలియుగమ్ 2064లో విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీలో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. -
స్టైల్ మార్చిన మణిరత్నం.. కమల్ 'థగ్ లైఫ్' రిలీజ్ ఫిక్స్
మణిరత్నం సినిమాలంటే క్లాస్, కూల్‌గా ఉంటాయి. చివరగా తీసిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలు మాత్రం పీరియాడికల్ గ్రాండియర్స్. కాకపోతే వీటికి తమిళంలో తప్పితే మిగతా ఏ భాషలోనూ పెద్దగా ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం ఈ దర్శకుడు 'థగ్ లైఫ్' మూవీ చేస్తున్నాడు. తాజాగా కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)విడుదల తేదీ ప్రకటిస్తూ ఓ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్‌తో పాటు శింబుని కూడా చూపించారు. ఇంట్రెస్టింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి తోడు యాక్షన్ కట్ వచ్చేలా చూపించారు. విజువల్స్ చూస్తుంటే మణిరత్నం ఈసారి ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైన్ తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. వచ్చే ఏడాది జూన్ 5న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుంది. ఇందులో కమల్‌తో పాటు శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ, జోజు జార్జ్, అభిరామి, నాజర్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?) -
నేను పాత్రలు ఎంచుకోవడానికి ఆయనే కారణం: సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ మత్స్యకారుని నిజ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సాయి పల్లవి ఓ చిత్రంలో కనిపించనుంది. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీలో నటించింది.తాజాగా ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో హీరోయిన్ సాయిపల్లవి పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెకు నేను పెద్ద అభిమానిని.. ఏదో ఒక రోజు సాయిపల్లవితో కచ్చితంగా సినిమా తీస్తానని మణిరత్నం అన్నారు. దర్శకుడి మాటలు విన్న సాయిపల్లవి సంతోషం వ్యక్తం చేసింది.డైరెక్టర్ మణిరత్నం మాటలపై సాయిపల్లవి స్పందించింది. సినిమాల్లోకి రాకముందు నాకు మణిరత్నం సార్ పేరు తప్ప.. ఇతర దర్శకుల పేర్లు తెలియవని చెప్పింది. అంతేకాకుండా తాను స్క్రిప్ట్‌లు, పాత్రలు ఎంచుకోవడానికి కూడా కారణం ఆయనేనని తెలిపింది. కాగా.. అమరన్ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
కమల్ హాసన్- మణిరత్నం కాంబో.. ఆ హీరోలు మళ్లీ..!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 34 ఏళ్ల ముందు రూపొందిన చిత్రం నాయకన్. ఆ చిత్రం అప్పట్లో సాధించిన సంచలన విజయం సాధించింది. కాగా అదే కాంబినేషన్లో మళ్లీ ఇప్పుడు రూపొందుతున్న భారీ చిత్రం థగ్ లైఫ్. దీనిని మణిరత్నానికి చెందిన మెడ్రాస్ టాకీస్, కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ని ర్మిస్తున్నాయి. ఇందులో కమలహాసన్ సరసన నటి త్రిష నటిస్తుండగా నటుడు జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చైన్నెలో ప్రారంభమై ఆ తరువాత విదేశాల్లో చిత్రీకరణకు సినీ వర్గాలు వెళ్లాయి. అయితే అలాంటి సమయంలో తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో నటుడు కమలహాసన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్ర షెడ్యూల్ వాయిదా పడడంతో నటుడు జయం రవి ఆ తరువాత దుల్కర్ సల్మాన్ ఇటీవల సిద్ధార్థ్ కూడా థగ్స్ లైఫ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జోరుగా సాగింది. అలాగఇందులో నటుడు శింబును ఒక ముఖ్యపాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ముందుగా ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిన జయంరవి, దుల్కర్ సల్మాన్‌లు మళ్లీ ఈ చిత్రంలో నటించడానికి తిరిగి వస్తున్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా పార్లమెంటు ఎన్నికల ముగిసిన వెంటనే కమలహాసన్ థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారన్నది తాజా సమాచారం. -
స్టార్ డైరెక్టర్‌కు షాక్.. భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న మరో హీరో!
ఇండియన్ సినిమాలో దర్శకుడిగా మణిరత్నంకు మంచి పేరు ఉంది. అలాంటి దర్శకుడి చిత్రాల్లో పనిచేయాలని కోరుకోని నటినటులు ఉండరనే చెప్పాలి. ఇటీవల మణిరత్నం భారీ తారాగణంతో దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా కమల్ హాసన్ హీరోగా థగ్స్ లైఫ్ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది కమల్‌హాసన్ నటిస్తున్న 234వ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా 34 ఏళ్ల తర్వాత కమలహాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్న చిత్రమిదే. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో జయంరవి, దుల్కర్సల్మాన్, త్రిష కూడా ముఖ్యపాత్రలకు ఎంపికయ్యారు. కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ సెర్బియాలో జరగనుంది. అయితే నటుడు కమలహాసన్ అమెరికాలో జరుగుతున్న ఇండియన్–2 చిత్ర పనుల్లో బిజీగా ఉండడం, అదే సమయంలో ఇటీవల పార్లమెంట్ ఎన్నికల తేదీ ప్రకటించడంతో, పార్టీ వ్యవహారాలలో పాల్గొనడానికి చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ సెర్బియాలో ప్రణాళిక ప్రకారం జరగకపోవడంతో దర్శకుడు చైన్నెకి చేరుకున్నట్టు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ కోసం తదుపరి షూటింగ్‌ను ఎన్నికల తర్వాత మళ్లీ సెర్బియాకు వెళ్లి జరుపుతారని సమాచారం. దీంతో కమలహాసన్ కాల్షీట్స్ దొరక్కపోవడంతో ఇందులో నటిస్తున్న ఇతరుల కాల్షీట్స్ వ్యవహారంలోనూ సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమస్యలు కారణంగానే ఇప్పటికే ఈ చిత్రం నుంచి దుల్కర్సల్మాన్ వైదొలిగారు. తాజాగా జయం రవి కూడా థగ్స్ లైఫ్ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇందులో దుల్కర్సల్మాన్ పాత్రను శింబు నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జయంరవికి బదులుగా దర్శకుడు మణిరత్నం ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
బ్యూటిఫుల్ పిక్ స్టోరీ చెప్పిన సొట్టబుగ్గల సుందరి: ఫోటో వైరల్
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్‌ను ఏలిన అందాల తార ప్రీతి జింటా. యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్‌గా పాపులర్ అయిన ప్రీతి తాజాగా ఒక ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. హిమాచల్‌లోని సిమ్లాలో పుట్టిన ప్రీతి వెండి తెర మీద చెరగని సంతకం. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. 1998లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సందర్బంగా తీసిన ఒక ఫోటోను, దానికి సంబంధించిన జ్ఞాపకాలను ట్వీట్ చేసింది.( మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!) ‘‘దిల్ సే సెట్లో తొలి రోజు ఈ ఫోటో తీశారు. మణిరత్నం, షారూఖ్ ఖాన్‌తో కలిసి వర్క్ చేస్తుందకు చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఇంతలో మణిసార్ నన్ను చూడగానే మొహం కడుక్కుని రమ్మని, నవ్వుతూ మర్యాదగా అడిగారు. అయితే సార్... నా మేకప్ పోతుంది సార్ అని చెప్పా. నాకు కావలసింది అదే.. వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రా అని చెప్పారు అంతే మర్యాదగా. తమాషా చేస్తున్నారా అనుకున్నా మొదట. కానీ కాదని ఈ ఫోటో చూసిన తర్వాత అర్థం అయింది. ఫోటోగ్రఫీ డైరెక్టర్ సంతోష్ శివన్ గారు నిజంగా మనసు పెట్టి (దిల్సే) తీసిన ఫోటో. ప్రెష్‌గా, ప్రశాంత ముఖంతో అద్భుతమైన ఫోటో ఇది. ఆయనకు ధన్యవాదాలు’’ అంటూ తన మొమోరీస్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ ట్వీట్ 10లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. (ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్‌బర్డ్స్) This picture was taken on the first day on the set of Dil Se. I was so excited to be working with Mani Ratnam sir & Shah Rukh Khan. When Mani sir saw me he smiled and politely asked me to wash my face…. But sir… my make up will come off, I said smiling …. That’s exactly what I… pic.twitter.com/Lrr6CpSMFA — Preity G Zinta (@realpreityzinta) February 8, 2024 కాగా 1975 జనవరి 31న పుట్టిన ప్రీతి జింటా హిందీతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో అనేక సూపర్‌హిట్ మూవీలతోపాటు టాలీవుడ్లో కూడా తనదైన ముద్రను వేసుకుంది. ప్రేమంటే ఇదేరాతో టాలీవుడ్లోకి ప్రవేశించి, ప్రిన్స్ మహేష్‌బాబు సరసన 1999లో రొమాంటిక్ కామెడీ రాజ కుమారుడులో నటించి టాలీవుడ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. 2016 ఫిబ్రవరి 29న వ్యాపారవేత్త జీన్ గూడెనఫ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనా నటిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. ఈ జంటకు ఇద్దరు(ట్విన్స్) పిల్లలు ఉన్నారు. -
ఆ ఇద్దరిలో మణిరత్నం వైపే ఆసక్తి చూపిన కమల్‌హాసన్
కమల్‌హాసన్ హీరోగా తన 233వ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వంలో చేస్తున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తన రాజమ్మ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమలహాసన్ నిర్మించడానికి సన్నాహాలు చేశారు. హెచ్. వినోద్ కథను కూడా సిద్ధం చేశారు. ఇది వ్యవసాయం నేపథ్యంలో సాగే చక్కని సందేశాత్మక కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్ర కథపై కమలహాసన్ హెచ్ వినోద్ చాలాకాలం పని చేశారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరిగినట్లు సమాచారం. దీని తరువాత కమలహాసన్ తన 234వ చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా హెచ్. వినోద్ దర్శకత్వంలో కమల్ నటించే చిత్రం విషయంలో ఏం జరిగిందో తెలియదు గానీ, ప్రస్తుతం కమల్‌హాసన్ మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో ఈయన వినోద్ దర్శకత్వంలో నటించే చిత్రం డ్రాప్ అయిందనే ప్రచారం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై కమల్హాసన్గానీ దర్శకుడు వినోద్ గానీ స్పందించలేదు. కాగా వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్నట్లు చిత్రం తాజా సమాచారం. దీంతో వినోద్ ప్రస్తుతం నటుడు యోగిబాబు, ధనుష్‌తో చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఖాకీ, తెగింపు, వలిమై చిత్రాలతో హెచ్ వినోద్‌కు మంచి గుర్తింపు ఉంది. -
మణిరత్నం భారీ స్కెచ్.. మరో సూపర్ హిట్ ఖాయమేనా!
మల్టీ స్టార్ చిత్రాలకు కేరాఫ్‌గా అడ్రస్ దర్శకుడు మణిరత్నం. అదేవిధంగా క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేయడంలో ఈయన దిట్ట. చాలాకాలం క్రితమే రజనీకాంత్, మమ్ముట్టి, అరవింద్‌స్వామి హీరోలుగా దళపతి చిత్రాన్ని తెరకెక్కించి సూపర్‌హిట్ కొట్టారు. అదేవిధంగా ఆ మధ్య శింబు, అరుణ్‌విజయ్, అరవిందస్వామి, ప్రకాష్రాజ్వంటి స్టార్ నటులతో సెక్క సివంద వానన్ చిత్రాన్ని రూపొందించి సక్సెస్ సాధించారు. ఇటీవల విక్రమ్, జయంరవి, కార్తీ, విక్రమ్ ప్రభు, శరత్‌కుమార్, ప్రకాష్‌రాజ్, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి వంటి నటీనటులతో రెండు భాగాలుగా తెరకెక్కించిన పొన్నియిన్‌సెల్వన్ చిత్రాలు అనూహ్య విజయాలను సాధించాయి. తాజాగా మణిరత్నం మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. మణిరత్నం, కమలహాసన్ కాంబినేషన్లో గత 37 ఏళ్ల క్రితం నాయకన్ చిత్రం రూపొందించి ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో థగ్స్ లైఫ్ అని భారీ గ్యాంగ్స్టర్స్ కథా చిత్రం రూపొందుతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ చిత్రంలో జయంరవి, దుల్కర్ సల్మాన్, గౌతమ్ కార్తీక్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఇకపోతే నటి త్రిష ఇందులో హీరోయిన్గా నటించబోతున్నట్లు ప్రచారంలో ఉంది. కాగా నటి ఐశ్వర్యారాయ్ థగ్స్ లైఫ్‌లో నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ వరుసలో ప్రముఖ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మీ పేరు వచ్చి చేరింది. ఈ విషయాన్ని నిర్మాతల వర్గం ఇటీవల అధికారికంగా వెల్లడించింది. ఈ ముగ్గురు పొన్నియిన్‌సెల్వన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో ఇది మరో పొన్నియిన్ సెల్వన్ చిత్రం కానుందా? అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కమలహాసన్ గెటప్, విడుదల చేసిన టీజర్ థగ్స్ లైఫ్ చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలను పెంచేస్తున్నాయి. -
ఫిబ్రవరిలో ప్రారంభం?
‘నాయకన్’ (1987) (తెలుగులో నాయకుడు) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘థగ్ లైఫ్’. ఈ సినిమాలో త్రిష, దుల్కర్ సల్మాన్, ‘జయం’ రవి కీలక పాత్రలు పోషించనున్నారు. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదట్లో ప్రారంభం కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కావచ్చాయని, ఇప్పటికే సెట్ వర్క్ జరుగుతోందని టాక్. కమల్ హాసన్, మణిరత్నం, మహేంద్రన్, శివ అనంత్ నిర్మించనున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. మరోవైపు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్ 2’విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే హెచ్ వినోద్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించాల్సిన సినిమా ప్రకటన వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. -
మరో చిత్రానికి కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్!
ఇటీవల విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన నటుడు కమల్ హాసన్. తదుపరి హెచ్.వినోద్ దర్శకత్వంలో హీరోగా నటించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ఈ చిత్రం డ్రాప్ అయినట్లు అనధికార ప్రచారం హోరెత్తుతోంది. కాగా కమలహాసన్ నాయకన్ వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత తాజాగా మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనిని మణిరత్నం మద్రాసు టాకీసు, ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ, కమలహాసన్‌కు చెందిన రాజ్కమల్ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నట్లు ఇంతకు ముందే ప్రకటించారు. దీనికి థగ్స్ లైఫ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే చిత్ర షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం అవుతుందనే ప్రచారం. కాగా తాజాగా థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ అనుకున్న దాని కంటే ముందుగానే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర దర్శకుడు మణిరత్నం, నటుడు కమలహాసన్, నిర్మాత ఆనంద్ కలిసి దిగిన పొటోను నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అందులో ఒక వైపు మణిరత్నం, మరో వైపు నిర్మాత చేతితో థమ్సప్ సింబల్ చూపగా కమలహాసన్ ప్రారంభిద్దామా? అన్నట్టు చూస్తున్నట్లు ఉంది. దీంతో ఈ చిత్రం ఫిబ్రవరి నెలలోనే సెట్‌పైకి వెళ్లే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇండియన్ –2 చిత్రాన్ని పూర్తి చేసిన కమలహాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూర్తి చేసి థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. -
మణిరత్నం గారు అంటే నాకు చాలా అభిమానం
-
17 ఏళ్లకే పాన్ ఇండియా మూవీ.. ఆ స్టార్ కిడ్ ఎవరో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో ఫేమ్ రావాలంటే అంతా ఈజీ కాదు. అది ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఏదైనా అదృష్టం కలిసి రావాల్సిందే. కానీ ఆమెకు చిన్న వయసులోనే ఓ రేంజ్లో దశ తిరిగిపోయింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఈ స్టార్ కిడ్ అరుదైన ఘనతను సాధించింది. ఆమె ఎవరో కాదు.. నటుడు రాజ్ అర్జున్ కుమార్తె సారా అర్జున్. ఈ ఏడాది రిలీజైన మణిరత్నం బ్లాక్‌బస్టర్ మూవీ పొన్నియిన్ సెల్వన్‌లో నటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్‌కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!) సారా అర్జున్ ఆరేళ్ల వయసులోనే వాణిజ్య ప్రకటనలతో పాటు హిందీ చిత్రంలోనూ కనిపించింది. 2010లో విజయ్ చిత్రం దైవ తిరుమగల్లో ప్రధాన పాత్రను పోషించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ జై హో, ఇమ్రాన్ హష్మీ ఏక్ థీ దయాన్, ఐశ్వర్య రాయ్ జజ్బా సూపర్ స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలలో కనిపించింది. తమిళం, హిందీతో పాటు తెలుగు, మలయాళంలో కూడా నటించింది. శైవం చిత్రంలో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్ చిత్రంలో కనిపించింది. సారా అర్జున్ ఇప్పటివరకు అత్యధికంగా అర్జించిన బాలనటిగా రికార్డు సృష్టించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1లో యువ నందిని(ఐశ్వర్యరాయ్ పాత్రకు)గా కనిపించింది. ఈ క్యారెక్టర్ సారాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత పార్ట్-2లోనూ మరింత అందంగా కనిపించింది. సారా అర్జున్ 2023 నాటికి రూ.10 కోట్లతో భారతదేశంలోనే రిచెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిలిచింది. పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలు కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్) దీంతో సారాకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపును తెచ్చిపెట్టింది. తన రాబోయే ప్రాజెక్ట్‌లో దళపతి విజయ్ సినిమాలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ రెండు దశాబ్దాలుగా తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. బ్లాక్ ఫ్రైడే చిత్రంతో అరంగేట్రం చేసిన అతను రౌడీ రాథోడ్, రయీస్, సీక్రెట్ సూపర్ స్టార్, డియర్ కామ్రేడ్, తలైవి వంటి చిత్రాల్లో కనిపించారు. View this post on Instagram A post shared by Panniru Rajkumar (@rajkumar_sara_arjun) -
PS2 Collections: రెండు రోజుల్లో వందకోట్లు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం!
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్-2. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 28న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. (ఇది చదవండి: ఘనంగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 యాంథెమ్ లాంఛ్) పొన్నియన్ సెల్వన్- 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇండియాలో రెండో రోజు దాదాపు రూ.28.50 కోట్ల గ్రాస్ సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రిలీజైన తొలిరోజు రూ.38 కోట్ల రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే 100 కోట్ల సాధించింది. (ఇది చదవండి: అవి వేసుకోవడం మన కల్చర్ కాదు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!) కాగా.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-1 పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
కమల్, నయన్ క్రేజీ కాంబో మూవీలో బోల్డ్ అండ్ బ్యూటీ..!
చెన్నై: నటుడు కమల్ హాసన్ సరసన నటించాలని కోరుకోని హీరోయిన్లు ఉండరనే చెప్పవచ్చు. కమల్ హాసన్‌కు జతగా నటిస్తే పాపులర్ అవ్వవచ్చునని చాలా మంది భావిస్తుంటారు కూడా. ఆయన చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని అలాంటి సన్నివేశాల వల్ల మరింత పబ్లిసిటీ పొందవచ్చు అని కొందరు భావిస్తుంటారు. కాగా కమలహాసన్‌తో లిప్ లాక్ సన్నివేశాలు నటించడం ఇష్టం లేక నయనతార ఇప్పటివరకు ఆయనకు జంటగా లభించలేదని ప్రచారం కూడా జరిగింది. తాజాగా కమల్ 234వ చిత్రంలో నటించడానికి నయన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు. సుమారు 35 ఏళ్ల తర్వాత కమలహాసన్, దర్శకుడు మణిరత్నం కాంబోలో తెరకెక్కనున్న చిత్రం ఇది. తాజాగా రూపొందించిన పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం ఈనెల 28వ తేదీన విడుదలకు ముస్తాబవుతుంది. తదుపరి ఆయన కమలహాసన్‌తో చేసే చిత్రంపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. కాగా ఇందులో నయనతారతో పాటు మరో నటి కూడా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఆమెనే నటి ఆండ్రియా. బోల్డ్ అండ్ బ్యూటీ ఎలాంటి పాత్రనైనా ఛాలెంజ్‌గా తీసుకొని నటిస్తుంది. ఈ బహుభాషా నటి ఇంతకుముందు కమలహాసన్ సరసన విశ్వరూపం, విశ్వరూపం– 2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన 234వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: ఇది నా జీవితం.. నిర్ణయం కూడా నేనే తీసుకుంటా.. విజయ్ సినిమాలో ఐటెం సాంగ్‌పై సిమ్రాన్ -
నయనతార చిరకాల కోరిక ఇదేనట.. నెరవేరేనా?
తమిళసినిమా: లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారూక్‌ఖాన్‌కు జంటగా నటిస్తున్న జవాన్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి తన 75వ చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నారు. దీనికి దర్శకుడు శంకర్ శిష్యుడు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఇంతకుముందు అట్లీ దర్శకత్వంలో రాజా రాణి అనే చిత్రంలో నయనతార నటించిన విషయం తెలిసిందే. అందులో నటుడు ఆర్య, జయ్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ చిత్రం నయనతారకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదే విధంగా తాజాగా నీలేష్కృష్ణ దర్శకత్వంలోనూ నయనతారతో పాటు నటుడు జయ్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. కాగా నటి నయనతార ఇటీవల ఓ అవార్డు వేడుకలో పాల్గొన్నారు. దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా అవార్డులు కూడా అందుకున్నారు. ఆ సందర్భంగా ముందుగా నయనతార మణిరత్నం కాళ్లకు నమస్కారం పెట్టగా ఆయన ఆమెను ఆశీర్వదించారు. ఆ వేదికన నయనతార తన చిరకాల కోరిక గురించి వెల్లడించారు. ఆమె పేర్కొంటూ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవటం గర్వంగా ఉందన్నారు. అయితే అందరూ నటీనటుల మాదిరిగానే ఆయన దర్శకత్వంలో ఓ చిత్రంలోనైనా తాను నటించాలంటూ చిరకాల కోరికను ఆ సందర్భంలో బయటపెట్టారు. ఇంతకుముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని చిత్రాలలో నటించే అవకాశం వచ్చినా ఏదో ఓ కారణంగా అది కార్యరూపం దాల్చలేదన్నారు. కాగా అదే విధంగా రజనీకాంత్, విజయ్, అజిత్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన నయనతార ఇప్పటి వరకు లోకనాయకుడు కమలహాసన్‌తో జతకట్టలేదు. కాగా త్వరలో కమలహాసన్ కథానాయకుడిగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో నయనతారకు నటించే అవకాశం కల్పిస్తారా..? అనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు కోలీవుడ్‌లో జరుగుతోంది. -
‘పొన్నియన్ సెల్వన్ చూసి మణిరత్నంకి ఇంట్లోనే సెల్యూట్ చేశా’
దర్శకుడు మణిరత్నం 25 ఏళ్ల కల నిజం చేసిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇదే పేరుతో ల్కీ రాసిన నవలçను దర్శకుడు మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇందులో నటుడు విక్రమ్, కార్తీ, జయంరవి, శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, నటి ఐశ్వర్యరాయ్, త్రిష వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి లైకా ఫిలింస్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా రెండవ భాగం ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో భారీఎత్తున నిర్వహించారు. తమిళనాడు మంత్రి దురైమరుగన్, విశ్వనటుడు కమలహాసన్, నటి ఐశ్వర్యరాయ్, దర్శకుడు భారతీరాజా, సంచలన నటుడు శింబు, నటి కుష్బూ, సుహాసిని మణిరత్నం, శోభన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై మంత్రి దరైమురుగన్ మాట్లాడుతూ ఒక ఛారిత్రక కథను చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా రూపొందించిన అందరికీ ధన్యవాదాలన్నారు. ఈ చిత్రం చూసిన తరువాత దర్శకుడు మణిరత్నానికి ఇంట్లోనే సెల్యూట్ చేశానన్నారు. వాద్ధియదేవన్ పాత్రలో నటుడు కార్తీ చాలా బాగా నటించారని, తన నియోజక వర్గం పరిధిలోనిదే వాద్ధియదేవన్ ఊర్ అని మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. -
ఆ డైరెక్టర్ స్పూర్థితోనే సినిమాల్లోకి వచ్చాను : గౌతమ్ మీనన్
పటాన్చెరు టౌన్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన నాయగన్ సినిమా తాను సినీ రంగంలో అడుగుపెట్టడానికి ప్రేరణ అని, ఆ సినిమాలో ఉన్న వాటిని తన సినిమాల్లో చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రసిద్ధ భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతం వాసుదేవ్ మీనన్ అన్నారు. రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో రివైండ్ ద మిలీనియమ్ ఇతివృత్తంతో సోమవారం నిర్వహించిన టెడ్ఎక్స్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తాను అనుకున్నది, తన జీవితంలో ఎదురైన సంఘటలనే సినిమాగా తీస్తానన్నారు. కష్టపడకుండా ఏదీ సాధించలేమని, ఏదైనా ఒక కళలో నెపుణ్యం సాధించాలంటే పూర్తి దృష్టిని కేంద్రీకరించాలని ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి సవితా శాస్త్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండీ మ్యూజిక్ ఆర్టిస్ట్ నితీశ్ కొండపర్తి, సిస్సీ ఐస్ పాప్స్ వ్యవస్థాపకుడు రని కాబ్రా, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్.. ఇండియా నుంచి ఆ రెండు చిత్రాలే
ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్- పార్ట్ చిత్రాలు ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్స్‌లో సత్తా చాటాయి. పొన్నియిన్ సెల్వన్ 6 నామినేషన్లు, ఆర్ఆర్ఆర్ పలు విభాగాల్లో నామినేట్ అయ్యాయి. మార్చి 12న హాంకాంగ్‌లో జరగనున్న 16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్లను శుక్రవారం ప్రకటించారు. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్- 1 ఉత్తమ చిత్రంతో సహా ఆరు విభాగాలలో నామినేట్ అయింది. ఎస్ఎస్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ఆర్ఆర్ఆర్ కూడా రెండు విభాగాల్లోకి పోటీలో నిలిచింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ సౌండ్ విభాగాల్లో నామినేట్ అయింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్- శ్రీనివాస్ మోహన్, ఉత్తమ సౌండ్- అశ్విన్ రాజశేఖర్ నామినేట్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా అనేక ఉత్తమ జాబితాల్లో చోటు దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట కూడా ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చేరింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్- 1 థియేటర్లలో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్‌గా శ్రీకర్ ప్రసాద్, ఉత్తమ సినిమాటోగ్రఫీగా రవి వర్మన్, ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్‌గా ఎ.ఆర్. రెహమాన్, ఉత్తమ సంగీతానికి ఏకా లఖాని, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌గా కాస్ట్యూమ్ డిజైన్ తోట తరణి విభాగాల్లో నామినేషన్స్ లభించాయి. The press conference of the 16th Asian Film Awards has ended successfully just now! The 16th Asian Film Awards will be held at 7:30pm on 12 March (Sunday) at the Hong Kong Palace Museum. The nomination list for the 16th Asian Film Awards and the jury president were announced. pic.twitter.com/l5zhegY8Tt — Asian Film Awards Academy (@AsianFilmAwards) January 6, 2023 제16회 아시아 필름 어워즈 의 후보 라인업은 다음과 같습니다. 헤어질 결심 -- 10개의 후보 드라이브 마이 카 -- 8개 후보 Ponniyin Selvan : I -- 6개의 후보 ...등 여러가지 영화가 있습니다. 자세한 정보를 많이 기대해주세요~ pic.twitter.com/6gYF6ik3nn — Asian Film Awards Academy (@AsianFilmAwards) January 6, 2023 -
మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన త్రిష? ఆ హీరోతో ముచ్చటగా మూడోసారి!
నాలుగు పదుల వయసులోనూ త్రిష క్రేజ్ కొనసాగుతోంది. తన కెరీర్ ముగిసిపోయిందంటూ ప్రచారం జరిగినప్పుడల్లా ఆమె ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారనే చెప్పవచ్చు. ఆ మధ్య త్రిష సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చింది. అదే సమయంలో ఇక ఆమెకు సినిమాలకు దూరమైందని అంతూ అనుకుంటున్న సమయంలో తమిళ చిత్రం 96 విజయంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో రీఎంట్రీ అయ్యిందనే చెప్పాలి. ఈ మూవీ విజయంతో త్రిష కెరీర్ మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అందుకలో పలువురు స్టార్ హీరోల చిత్రాలు ఉండటం విశేషం. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి మంగాత్తా, ఎన్నై అరిందాల్ వంటి హిట్ చిత్రాల తరువాత అజిత్‌తో జతకట్టడానికి సిద్ధం అవుతుందామె. అలాగే విజయ్ 67వ చిత్రంలోనూ నటించనుంది. ఈ నేపథ్యంలో త్రిష కోసం మరో క్రేజీ ఆఫర్ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన విలక్షణ నటుడు కమలహాసన్ తన తదుపరి చిత్రం మణిరత్నంతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన 234వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈయన ఇటీవల తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ తొలి భాగం విజయం సాధించింది. కాగా దీని రెండో భాగం ఏప్రిల్ 28వ తేదీ విడుదలకు ముస్తాబవుతుంది. చదవండి: వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన! ఆ తర్వాత విక్రమ్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు మణరత్నం. వీరి కాంబోలో నాయకన్ వంటి సంచలన హిట్ చిత్రం రూపొందింది. కాగా సుమారు 35 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ కాంబో రిపీట్ కానుంది. ఈ క్రేజీ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఇందులో కమలహాసన్‌కు జంటగా త్రిషను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా త్రిష ఇంతకుముందు కమలహాసన్‌కు జంటగా మన్మదన్ అన్బు, తూంగావనం చిత్రాల్లో నటించింది. అంత ఒకే అయితే ఇప్పుడు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆయనతో నటించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం కమల్ ఇండియన్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. -
31 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ కాబోతోన్న ‘దళపతి’ కాంబినేషన్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘దళపతి’ చిత్రం కాంబినేషన్ రిపీట్ కాబోతుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఒకే ఒక్క చిత్రం దళపతి. ఇందులో మరో కథానాయకుడిగా మలయాళం సపర్‌స్టార్ మమ్ముట్టి నటించారు. నటుడు అరవిందస్వామి ఈ చిత్రం ద్వారానే పరిచయమయ్యారు. నటి శోభన హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1991 నవంబర్ 5న విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో ఇళయరాజా అందించిన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. చదవండి: స్టాకింగ్ అంటూ ఊర్వశిపై రిషబ్ ఫ్యాన్స్ ఫైర్, ఘాటుగా స్పందించిన నటి ‘రాకవ్మ కయ్యి తట్టు’ అనే పాట ఇప్పటికీ సంగీత ప్రియుల చెవుల్లో మారుమోగుతూనే ఉంది. కాగా ఆ తరువాత మణిరత్నం, రజనీకాంత్ కాంబినేషన్లో ఇప్పటి వరకు చిత్రం రాలేదు. మణిరత్నం తాజాగా తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ తొలి భాగం విడుదలై విజయవంతమైంది. ఇందులో ఏదైనా పాత్రలో నటించాలని రజనీకాంత్ భావించారట. నటుడు శరత్‌కుమార్ పోషించిన పళయ పళువేట్టయార్ పాత్రలో నటిస్తానని మణిరత్నంను రజనీకాంత్ అడిగారట. అయితే అందుకు మణిరత్నం అంగీకరించలేదని స్వయంగా రజనీ ఈ చిత్రం ఆడియో వేడుకలో చెప్పారు. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన బిగ్‌బాస్ దివి.. కాగా దాదాపు 31 ఏళ్ల తరువాత వీరి సంచలన కాంబినేషన్ రిపీట్ కానుందని సమాచారం. మణిరత్నం చెప్పిన స్టోరీ లైన్ రజనీకాంత్‌కు నచ్చినట్లు తెలుస్తోంది. అయితే మణిరత్నం ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ పార్టు–2 చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక రజనీకాంత్ జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత డాన్ చిత్రం ఫేమ్ శిబిచక్రవర్తి దర్శకత్వంలో నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో నటిస్తారా? లేక ముందుగానే ఆయనతో చిత్రం చేస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే రజనీకాంత్, మణిరత్నం కాంబినేషన్ చిత్రం గురిం అధికారిక ప్రకటన మాత్రం ఇంకా విడుదల కాలేదు. -
పొన్నియిన్ సెల్వన్ మరో రికార్డ్.. బాలీవుడ్ సినిమాను దాటేసిన కలెక్షన్స్!
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ది కశ్మీర్ ఫైల్స్ వసూళ్లను అధిగమించింది. (చదవండి: పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్లు.. ఐదురోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?) కేవలం విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.355 కోట్ల వసూళ్లు రాబట్టింది. వరల్డ్‌వైడ్ ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం సాధించిన రూ.340 కోట్ల మార్కును దాటేసింది. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
మణిరత్నం కల సాకారమవడానికి కారణం బాహుబలినే!
దేశంలో ఎంతమంది దర్శకులున్నా వారిలో కొందరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి నుంచి సినిమా వస్తుందంటే చాలు అందరూ కళ్లలో వత్తులేసుకుని మరీ ఎదురుచూస్తుంటారు. అలాంటి దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించారు. వెయ్యి ఏళ్లు వెనక్కి వెళ్లి చోళ రాజుల చరిత్రను తెరపై చూపించాడు. అందుకే ఆ వైబ్రేషన్ వరల్డ్ వైడ్ గా కనిపిస్తోంది. మణిరత్నం మేకింగ్‌పై డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి మనమూ పొన్నియిన్ సెల్వన్ లోకాన్ని ఓసారి చుట్టి వద్దాం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ పాన్ ఇండియా ట్రెండ్‌కు ప్రాణం పోసింది. ఏ సినిమా తీసినా, ఎంత పెట్టి తీసినా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని బాహుబలి సిరీస్ నిరూపించింది. ఆ ధైర్యంతోనే మణిరత్నం తన కలల ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ను పట్టాలెక్కించారు. మణిరత్నం 40 ఏళ్ల కల సాకారం అయిందంటే అందుకు కారణం మన బాహుబలి సినిమానే! ఒక సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసి కోట్లు కొల్లగొట్టవచ్చు అని ఈ సినిమాతో నిరూపితమైంది. అందుకే 5 భాగాలుగా ఉన్న పెద్ద నవల పొన్నియిన్ సెల్వన్ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మణిరత్నం. మొదటి భాగం ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది. రెండవ భాగం సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత విడుదల చేస్తారట. తమిళనాట అత్యంత ప్రజాదరణ పొందిన నవల పొన్నియిన్ సెల్వన్. 1899 నుంచి ఈ నవల ప్రాచుర్యంలో ఉంది. కల్కి మ్యాగజీన్లో ఈ నవలను ప్రచురిస్తూ వచ్చారు. అంతకు ముందు వచ్చిన ది చోళాస్, హిస్టరీ ఆఫ్ లేటర్ చోళాస్, పల్లవాస్ ఆఫ్ కంచి పుస్తకాలను ఆధారంగా చేసుకుని పొన్నియిన్ సెల్వన్ నవలను రాసుకొచ్చారు కల్కి కృష్ణమూర్తి. 1958 నుంచే పొన్నియిన్ సెల్వన్ నవలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1980లో, 2000 సంవత్సరంలో, ఆ తర్వాత 2010లో పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలనుకున్నాడు మణిరత్నం. మొదట ఈ భారీ చిత్రాన్ని రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్ కాంబినేషన్లో ప్లాన్ చేశాడు, కానీ కుదరలేదు. ఆ తర్వాత విజయ్, మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కించాలనుకున్నాడు. బడ్జెట్ ఇష్యూస్‌తో ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది 2018లో మణిరత్నం డైరెక్ట్ చేసిన నవాబ్ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ పొన్నియిన్ సెల్వన్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. 240 ఏళ్లుగా కోలీవుడ్ ఎదురు చూస్తున్న సినిమా ఎట్టకేలకు మణిరత్నం తెరకెక్కిస్తున్నారని తెలిసి తమిళనాట ఆనందం వెల్లివిరిసింది. ఒకప్పుడు ఈ ప్రాజెక్ట్ లో వీరుడిగా నటించాల్సిన సూపర్ స్టార్ రజనీకాంత్, ఇప్పుడు మిగతా హీరోలు లీడ్ రోల్స్ తీసుకోవడంతో కనీసం ఒక చిన్న పాత్రైనా ఇవ్వండి అని అడిగారట. సినిమాలో పెరియ పజువెట్టరాయర్ పాత్ర చేస్తానని అడిగితే రజనీకాంత్‌కు ఉన్న ఇమేజ్‌కు ఆ పాత్ర సరితూగదని వద్దన్నారట. సినిమాలో ఇదే పాత్రను శరత్ కుమార్ చేసారు. గతంలోనే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించి ఉంటే కనుక, ప్రస్తుతం కార్తి చేసిన పాత్రను రజనీకాంత్ చేసి ఉండేవారట. అలాగే జయం రవి చేసిన పాత్రను కమల్ హాసన్, విక్రమ్ కనిపించిన పాత్రను విజయ్ కాంత్‌తో చేయించాలి అనుకున్నారు. ఐశ్వర్యారాయ్ పాత్రలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖను, త్రిష క్యారెక్టర్ లో శ్రీదేవిని, ముందుగా అనుకున్నారట. ఏది ఏమైనా పొన్నియన్ సెల్వన్ కోసం రజనీ, కమల్ చేతులు కలిపి ఉంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేకంగా నిలిచిపోయేది. ప్రతీ మేకర్‌కు ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ కావాలంటే అందుకు సరైన టైమ్ రావాలి. ఆ టైమ్ కోసం 40 ఏళ్లు ఎదురు చూశారు మణిరత్నం. సుహాసినితో పెళ్లికి ముందు నుంచే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ కు సంబంధించిన బుక్స్ బ్యాగ్ పట్టుకుని తిరుగుతున్నారంటే మీరు ఆశ్చర్యపోకమానరు. ఐశ్వర్యారాయ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేసింది. ఆ విషయాన్ని మొదటి భాగం క్లైమాక్స్‌లో రివీల్ చేశాడు దర్శకుడు మణిరత్నం. ఒక పాత్ర నెగిటివ్ మరొకటి పాజిటివ్. రెండో భాగంలో ఐశ్వర్యారాయ్ పాజిటివ్ క్యారెక్టర్ కు సంబంధించిన స్టోరీని రివీల్ చేయబోతున్నారు. పొన్నియిన్ లో భాగం అయ్యేందుకు ఐశ్వర్య రూ.10 కోట్లు పారితోషికం తీసుకుందట. విక్రమ్ రూ.15 కోట్లు, జయం రవి రూ.8 కోట్లు, కార్తి రూ.5 కోట్లు, త్రిష రూ.2 కోట్లు పారితోషికం తీసుకున్నారట. రియల్ లొకేషన్స్ షూటింగ్స్‌కు ప్రాధ్యానతనిచ్చారు మణిరత్నం. అందుకే ఇంత భారీ చిత్రాన్ని పక్కా ప్రణాళికతో కేవలం 150 రోజుల్లో రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయగలిగారు. రెండు భాగాలకు కలసి 300 కోట్లు బడ్జెట్ ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం మణిరత్నం రెహమాన్‌ను బాలి తీసుకువెళ్లి అక్కడ ట్యూన్స్ కంపోజ్ చేయించారట. వెయ్యేళ్ల కాలం నాటి ట్యూన్స్ ఎలా ఉండేవో అలా కావాలన్నారట. చదవండి: గాడ్ ఫాదర్‌తో మరోసారి ఆ విషయం రుజువైంది చిరంజీవి ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? -
పొన్నియన్ సెల్వన్ కలెక్షన్ల సునామీ.. వారం రోజుల్లో రూ.325 కోట్లు వసూల్!
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు కొల్లగొడుతోంది. కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.325 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఒక్క తమిళనాడులోనే రూ.130 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్తోేంది. తమిళంలో గతంలో విడుదలైన రోబో 2.0, విక్రమ్ తర్వాత పొన్నియిన్ సెల్వన్ మూడోస్థానంలో కొనసాగుతోందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడలో రిలీజైంది. పదో శతాబ్దంలోని చోళ రాజుల ఇతివృత్తం ఆధారంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో చిత్రీకరించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్లు.. ఐదురోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలోనూ ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేవలం ఒక్క తమిళనాడులోనే రూ.100 కోట్ల మార్కును అధిగమించింది. (చదవండి: 'పొన్నియిన్ సెల్వన్' సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్) పొన్నియిన్ సెల్వన్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ ధృవీకరించారు. మణిరత్నం కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్, యష్ కేజీఎఫ్- 2తో పోలిస్తే తక్కువగానే వసూళ్లు సాధించిందని వెల్లడించారు. ఈ రెండు సినిమాలు రూ.600 కోట్ల కంటే ఎక్కువ నికర వసూళ్లు సాధించాయన్నారు. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. -
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘పొన్నియన్ సెల్వన్’.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. చియాన్ విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచన సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన లభించగా, తమిళనాట మాత్రం హిట్ టాక్ వచ్చింది. దీంతో అక్కడ ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ రూ.100 కోట్ల క్లబ్లో చేరేందుకు పరుగులు పెడుతోంది. విడుదలైన రెండు రోజులకే ఒక్క తమిళనాడులోనే రూ.47 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం రూ.9 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కేరళలో రూ.6 కోట్లు, ఓవర్సీస్లో దాదాపు 60 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రం దాదాపు రూ.147 కోట్ల గ్రాస్, రూ.75 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళనాడుతో పాటు ఓవర్సీస్లో కూడా మంచి టాక్ సంపాదించుకోవడంతో ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
థియేటర్ వద్ద పొన్నియన్ సెల్వన్ తారల సందడి.. అభిమానుల కోలాహాలం
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ 'పొన్నియిన్ సెల్వన్-1'. కల్కి కృష్ణ మూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అందులో ఇవాళ మొదటి భాగం విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రాన్ని చూసేందుకు వచ్చిన నటీనటులు చైన్నైలోని ఓ థియేటర్ వద్ద సందడి చేశారు. చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి మొదటి రోజు మొదటి షోను ఎంజాయ్ చేశారు. అభిమాన నటీనటులు థియేటర్లకు రావడంతో ఫ్యాన్స్ టపాసులు కాలుస్తూ హోరెత్తించారు. (చదవండి: పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘చియాన్’ విక్రమ్, ఐశ్వర్య రాయ్, ‘జయం’ రవి, త్రిష, కార్తి లాంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటించారు. మణిరత్నం దర్శకత్వం, భారీ తారగణంతో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. #ChiyaanVikram #PonniyinSelvan #FDFS #Aadithakarikalan pic.twitter.com/dtbiCPF2xw — Kavi Kumar (@KaviKum42539573) September 30, 2022 -
Ponniyin Selvan Review: పొన్నియన్ సెల్వన్ మూవీ రివ్యూ
టైటిల్: పొన్నియన్ సెల్వన్-1 నటీనటులు: చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం తదితరులు నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ దర్శకత్వం : మణిరత్నం సంగీతం: ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ విడుదల తేది: సెప్టెంబర్ 30, 2022 లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అందులో మొదటి భాగం PS-1 నేడు(సెప్టెంబర్ 30) విడుదలైంది. నాలుగేళ్ల విరామం తర్వాత మణిరత్నం చేసిన సినిమా... అందులోను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో పొన్నియన్ సెల్వన్ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. పొన్నియన్ సెల్వన్ కథేంటంటే? పొన్నియన్ సెల్వన్ కథంతా పదో శతాబ్దంలో జరుగుతుంది. వేయి సంవత్సరాల క్రితం పరిపాలన సాగించిన చోళ రాజుల గొప్పదనం గురించి చెబుతూ కథ మొదలవుతుంది. చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు(ప్రకాశ్ రాజ్)కి ఇద్దరు కుమారులు, ఓ కూతురు. పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు(చియాన్ విక్రమ్) తంజావూరుకు దూరంగా ఉంటూ.. కనిపించిన రాజ్యానల్లా ఆక్రమిస్తూ వెళ్తుంటాడు. చిన్న కుమారుడు అరుళ్ మోళి అలియాస్ పొన్నియన్ సెల్వన్(జయం రవి) చోళ రాజ్యానికి రక్షకుడిగా ఉంటాడు. తండ్రి ఆజ్ఞతో శ్రీలంకలో ఉంటాడు. తన తర్వాత వారసుడిగా పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ను యువరాజుగా సుందర చోళుడు ప్రకటిస్తాడు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా సామాంత రాజులను ఏకం చేస్తాడు కోశాధికారి పళవేట్టురాయర్(శరత్ కుమార్). సుందర చోళుడు అన్నయ్య కుమారుడు మధురాంతకుడు (రహమాన్) ను రాజును చేయాలనేది అతని కోరిక. రాజ్య ఆక్రమణ కోసం తెలిసినవాళ్లే కుట్ర చేస్తున్నారని గ్రహించి.. ఆ కుట్రను చేధించడానికి తన మిత్రుడు వల్లవరాయన్(కార్తి)ని తంజావురుకు పంపిస్తాడు ఆదిత్య కరికాలన్. కుట్ర విషయాన్ని వల్లవరాయన్ ఎలా కనిపెట్టాడు? శ్రీలంకలో ఉన్న అరుళ్‌మోళిని వల్లవరాయన్ ఎలా రక్షించాడు? సొంతవాళ్లు పన్నిన కుట్రకు యువరాణి కుందవై(త్రిష) ఎలా చెక్ పెట్టింది? పళవేట్టురాయల్ భార్య నందిని(ఐశ్యర్య రాయ్) ఉన్నంత వరకు తంజావూరుకు రానని ఆదిత్య కరికాలుడు ఎందుకు చెబుతున్నాడు? అసలు నందిని, ఆదిత్యకు మధ్య ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. రాజ్యాలు.. యుద్దం.. కుట్రలు అనగానే అందరికి గుర్తుకొచ్చే సినిమా ‘బాహుబలి’. రాజుల పాలన ఎలా ఉంటుంది? అధికారం కోసం ఎలాంటి కుట్రలు చేస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు రాజమౌళి. అయితే అది కల్పిత కథ కాబట్టి అందరికి అర్థమయ్యేలా, కావాల్సిన కమర్షియల్ అంశాలను జోడించి ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ చారిత్రాత్మక కథలకు ఆ వెసులుబాటు ఉండదు. కథలో మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. పొన్నియన్ సెల్వన్ విషయంలో అదే జరిగింది. మణిరత్నం చరిత్రకారులను మెప్పించాడు కానీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. కథలో విషయం ఉంది కానీ కన్ఫ్యూజన్స్ లేకుండా తెరపై చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. స్లోనెరేషన్ సినిమాకు పెద్ద మైనస్. కథ జరిగే ప్రాంతాలు మారుతాయి కానీ.. కథనం మాత్ర కదినట్లే అనిపించదు. చాలా పాత్రలు.. పెద్ద పెద్ద నటులు కనిపిస్తారు కానీ.. ఏ ఒక్క పాత్ర కూడా గుర్తుండిపోయేలా తీర్చిదిద్దలేదు. యాక్షన్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. ఏ పాత్ర కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ కావు. నవల ఆధారంగా ఈ స్క్రిప్ట్‌ను రాసుకోవడం వల్ల..ట్విస్టులు, వావ్ ఎలిమెంట్స్ ఏవి ఉండవు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. క్లైమాక్స్‌లో మాత్రం ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి పార్ట్-2పై ఆసక్తి పెంచారు. మొత్తంగా ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు ,అది కూడా చరిత్రపై అవగాహన ఉన్నవారికి ఎంతో కొంతో నచ్చుతుంది. కానీ తెలుగు ప్రేక్షకులను మెప్పించడం కాస్త కష్టమే. ఎవరెలా నటించారంటే... ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాకు మెయిన్ పిల్లర్ లాంటి పాత్ర వల్లవరాయన్. ఈ పాత్రలో కార్తి ఒదిగిపోయాడు. వల్లవరాయన్ సమయస్ఫూర్తి కలవాడు, చమత్కారి కూడా. సినిమాలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ కార్తికే దక్కింది. ఆదిత్య కరికాలుడు పాత్రలో చియాన్ విక్రమ్ మెప్పించాడు. అయితే ఇతని పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. సినిమా ప్రారంభంలో ఒకసారి, మధ్యలో మరోసారి, ఇక క్లైమాక్స్‌లో ఇంకోసారి కనిపిస్తాడు. అరుళ్‌మొళి వర్మన్ అలియాస్ పొన్నియన్ సెల్వన్ పాత్రలో జయం రవి ఒదిగిపోయాడు.. నందిని పాత్రకు వందశాతం న్యాయం చేసింది ఐశ్యర్యరాయ్. తన అందం, అభినయంతో ఎలాంటి మగవాడినైనా తన వశం చేసుకోగల పాత్ర తనది. అందుకు తగ్గట్టే తెరపై చాలా అందంగా కనిపించింది. రాజకుమారి కుందవైగా త్రిష తనదైన నటనతో ఆకట్టుకుంది. పళవేట్టురాయర్‌గా శరత్‌కుమార్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. సుందర చోళుడు పాత్రను ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించాడు. తంజావూరు కోటసేనాధిపతి చిన పళవేట్టురాయన్గా ఆర్.పార్తిబన్, పడవ నడిపే మహిళ పూంగుళలిగా ఐశ్యర్య లక్ష్మీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతం అని చెప్పలేం కానీ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
‘ఐశ్వర్య, త్రిషలపై చాలాసార్లు సీరియస్ అయ్యా, అలా వార్నింగ్ కూడా ఇచ్చా’
దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర బృందం ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఆయన సెట్స్‌లో కొన్నిసార్లు స్టార్ హీరోయిన్స్ అయిన ఐశ్వర్యరాయ్, త్రిషలపై సీరియస్ అయ్యానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. చదవండి: జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ఆది’ రీరిలీజ్! ఎప్పుడంటే.. షూటింగ్ సమయంలో త్రిష, ఐశ్యర్యరాయ్‌లతో కాస్తా ఇబ్బంది పడ్డానని, అందుకే వారిపై పలుమార్లు అరిచానన్నారు.‘ఈ చిత్రంలో త్రిష, ఐశ్వర్యల సన్నివేశాలు, డైలాగ్స్ సీరియస్‌గా కొనసాగుతాయి. షూటింగ్ చేస్తున్నప్పుడు వారిద్దరి మధ్య ఆ సీరియస్‌నెస్ వచ్చేది కాదు. దానికి కారణం సెట్స్‌లో వారిద్దరి మధ్య ఉన్న స్నేహం. అందువల్ల వారి సీన్స్ సరిగా వచ్చేవి కాదు. వారిద్దరి సీన్స్ చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. అసలు అనుకున్నట్టు సీన్స్ వచ్చేవి కాదు. వాటికి చాలా టైం పట్టేది. దీంతో సినిమా అయిపోయేవరకు వారిని మాట్లాడుకోవద్దని వార్నింగ్ కూడా ఇచ్చాను. చదవండి: అప్పుడే ఓటీటీకి రంగ రంగ వైభవంగా! దసరాకు స్ట్రీమింగ్, ఎక్కడంటే.. అయినా వారు వినకపోవడంతో కొన్నిసార్లు ఇద్దరిని ఇద్దరిపై కోప్పడాల్సి వచ్చింది’ అని ఆయన చెప్పుకొచ్చారు. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, జయం రవి, హీరో కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభితా ధూలిపాళ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. -
అందుకే ఆయన పొన్నియిన్ సెల్వన్‌లో భాగం కాలేదు: మణిరత్నం
కోలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో హిట్ చిత్రాలకు పనిచేసిన పాటల రచయిత 'వైరముత్తు'. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నా ఆయన.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పలు చిత్రాలకు గతంలో సాహిత్యమందించారు. వైరముత్తు పాటలు సినీ ప్రియుల్ని కట్టిపడేసేలా ఉంటాయి. మరీ తాజాగా మణిరత్నం రూపొందించిన కొత్త చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’లో మాత్రం వైరముత్తు ఎందుకు లేరు. దీనికేమైనా ప్రత్యేక కారణాలున్నాయా అన్న చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో అడిగిన ప్రశ్నకు తాజాగా మణిరత్నం స్పందించారు. 'వైరముత్తు టాలెంట్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సైతం వైరముత్తు టాలెంట్‌ను మెచ్చుకునేవారు. నేను ఆయనతో కలిసి ఎన్నోసార్లు పనిచేశా. ఆయన సాహిత్యాన్ని నా సినిమాల్లో ఉపయోగించా. అతనొక అద్భుతం. అయితే వైరముత్తును మించిన కొత్త టాలెంట్ ప్రస్తుతం పరిశ్రమలో ఉంది. కొత్త తరానికి ప్రోత్సాహమందించాలి’ అందుకే అని మణిరత్నం వివరణ ఇచ్చారు. గతంలో వైరముత్తుపై మీటూ ఆరోపణలు రావడంతో దూరం పెట్టారని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. (చదవండి: పొన్నియిన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం) అయితే గతంలో వైరముత్తు తమను వేధింపులకు గురి చేశాడంటూ కొంతమంది మహిళలు ‘మీటూ’ వేదికగా ఆరోపించారు. ప్రముఖ గాయని చిన్మయి సైతం ఆయనపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే వైరముత్తుతో పనిచేసేందుకు పలువురు సినీ ప్రముఖులు వెనకాడుతున్నట్లు అప్పట్లోనే కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. మణిరత్నం, వైరముత్తు చివరి చిత్రం 'చెక్క చివంత వానం' (2018). ఈ చిత్రంలో 'మజై కురువి' 'భూమి భూమి' లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ కోసం ఇళంగో కృష్ణన్ మూడు పాటలు, కబిలన్, శివ అనంత్, కృతికా నెల్సన్లు మరో మూడు పాటలు రాశారు. -
'పొన్నియిన్ సెల్వన్' సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ‘అలనై నీకై..’ అనే లిరికల్ పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘జలసఖి నేనై నిలిచా నెలరాజా..’ అంటూ సాగే ఈ పాట యూత్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అనంత శ్రీరామ్ ఈ పాటను రాయగా.. సింగర్ అంతరా నంది పాడారు.ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. (చదవండి: Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ నుంచి ఫస్ట్‌సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్) ఇటీవల మొదటి భాగం షూటింగ్ పూర్తవ్వగా.. సినిమా కోసం ప్రచార కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. -
పొన్నియన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల మొదటి భాగం షూటింగ్ పూర్తవ్వగా.. అందుకు సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమా కోసం ప్రచార కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసింది చిత్రబృందం. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. (చదవండి: పొన్నియన్ సెల్వన్- పార్ట్ 2 ఎప్పుడో చెప్పేసిన మణిరత్నం) అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాయ్ పాత్ర కోసం మీరు ఎవరినైనా ఎంపిక చేయాలనుకున్నారా అని అడిగిన ప్రశ్నకు మణిరత్నం స్పందించారు. ఆ పాత్రకు అప్పట్లో రేఖను ఎంపిక చేయాలనుకున్నట్లు తన మనసులో మాటను బయటపెట్టారు దర్శకధీరుడు మణిరత్నం. తొలిసారి కమల్ హాసన్‌తో కలిసి ఈ చిత్రాన్ని తీయాలనుకున్నట్లు తెలిపారు. 1994, 2011లో ఈ చిత్రం చేయడానికి ప్రయత్నించగా.. ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా టేకాఫ్ కాలేదని వివరించారు. కాగా పొన్నియన్ సెల్వన్ -1లో ఐశ్వర్రాయ ద్విపాత్రాభినయం చేస్తోంది. నందిని, ఆమెకు మూగ తల్లిగా మందాకిని దేవి పాత్రల్లో కనిపించనుంది. జూలైలో ఐశ్వర్య పాత్రకు చెందిన నందిని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి సంబంధించి యుద్ధ సన్నివేశాలను ఎక్కువ భాగం థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. -
‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 2 ఎప్పుడో చెప్పిన మణిరత్నం
ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. చోళరాజులు ఇతివృత్తంతో రూపొందిన భారీ చారిత్రాత్మక కథతో దర్శకుడు మణిరత్నం దీన్ని రూపొందిస్తున్నారు. విక్రమ్, జయం రవి, కార్తీ, విక్రమ్ ప్రభు, పార్తీపన్, ప్రభు, శరత్‌కుమార్, రఘు, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహా్మన్ సంగీతాన్ని, రవివర్మ ఛాయాగ్రహణం అందించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతోంది. చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’ దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే చిత్ర ఆడియో, ట్రైలర్లను విడుదల చేశారు. కాగా శనివారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ ఇంతకుముందు ఎంజీఆర్, శివాజీ గణేశన్ నటించిన చారిత్రక కథా చిత్రాలలో ఉపయోగించిన ఆభరణాలు గ్రీకు సాంప్రదాయానికి చెందినవన్నారు. అయితే తాను చాలా పరిశోధనలు చేసి ఈ చిత్రంలో ఆభరణాలను ఉపయోగించానని తెలిపారు. నిజానికి రాజులు యుద్ధానికి వెళ్లేటప్పుడు ఆభరణాలు కాకుండా తోలు దుస్తులు ధరించి వెళ్లేవారన్నారు. ఈ చిత్రంలో తాను అలానే చేశానని తెలిపారు. ఇందులో మొదట స్వచ్ఛమైన తమిళ సంభాషణలనే రచయిత జయమోహన్ రాశారన్నారు. అయితే వాటిని నటులు ఉచ్ఛరించడం కష్టంగా మారడం, భావోద్రేకాలు సరిగా రాకపోవడంతో సరళమైన భాషను వాడామని చెప్పారు. ఇకపోతే ఇందులో రజనీకాంత్ నటిస్తానని చెప్పగానే అంగీకరిస్తే ఆయన, రచయిత కల్కి, అభిమానుల మధ్య చిక్కుకునేవారన్నారు. తగిన నటీనటులనే ఈ చిత్రానికి ఎంపిక చేశామన్నారు. రెండవ భాగం కూడా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, మరో తొమ్మిది నెలల తరువాత పార్ట్–2 విడుదల చేస్తామని తెలిపారు. చదవండి: డైరెక్టర్‌తో మనస్పర్థలు? రజనీ ‘జైలర్’ నుంచి తప్పుకున్న హీరోయిన్! నటుడు కార్తీ మాట్లాడుతూ గుర్రాలను, ఏనుగులను చూడడానికి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షిస్తారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. త్రిష, ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించేటప్పుడు భయం, బాధ్యతగా ఉండాలన్నారు. నటి త్రిష మాట్లాడుతూ కుందవై పాత్ర కోసం 6 నెలల ముందు నుంచే కొన్ని రిఫరెన్స్‌తో సిద్ధమయ్యానన్నారు. ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. నటుడు జయం రవి మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించిన అనుభవం భవిష్యత్‌లో చాలా ఉపగయోగపడుతుందన్నారు. ఇందులో తన తండ్రి, తాను కలిసి నటించడం సంతోషకరమైన విషయం అని నటుడు విక్రమ్ ప్రభు పేర్కొన్నారు. -
‘పొన్నియన్ సెల్వన్’ ఓటీటీ, డిజిటల్ రైట్స్ అన్ని కోట్లా?!
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. పదో శతాబ్ధంలో చోళ రాజ్యంలోని స్వర్ణయుగాన్ని మణిరత్నం తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కితున్న ఈ మూవీ తొలి భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈమూవీ ఓటీటీ, డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. తాజా బజ్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైం వీడియోస్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? అలాగే డిజిటల్ రైట్స్ కూడా భారీ రేట్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. కాగా పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలను ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ రూ. 120 కోట్లకు దక్కించుకోగా.. డిజిటల్, శాటిలైట్‌ను రైట్స్‌ను అమెజాన్‌తో పాటు సన్‌టీవీ కూడా విక్రయించారట. అయితే ఎంతమొత్తానికి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిషలు, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే.. -
ఉత్కంఠభరితంగా ‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. పదో శతాబ్ధంలో చోళ రాజ్యంలోని స్వర్ణయుగాన్ని మణిరత్నం తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కితున్న ఈ మూవీ తొలి భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ వారి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రిలీజ్ అయిన రెండు పాటలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. చదవండి: పుష్ప 2పై అప్డేట్ ఇచ్చిన రష్మిక, ‘అప్పుడే సెట్లో అడుగుపెడతా’ ‘వెయ్యి సంవత్సరాల క్రితం చోళ నాట స్వర్ణశకం ఉదయించక మునుపు ఒక తొక చుక్క ఆకాశంలో ఆవిర్భవించింది. చోళ రాజ కులంలో ఒకరిని ఆ తోకచుక్క బలిగోరుతుందంటున్నారు జ్యోతిష్యులు. దేశాన్ని పగలు, ప్రతికారాలు చుట్టుముట్టాయి. సముంద్రాలు ఉప్పొంగుతున్నాయి..’ రానా వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ట్రైలర్ చూపించిన యుద్ధపు సన్నివేశాలు. పోరాటలు సినిమా అంచనాలను పెంచేస్తోంది. కాగా కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక మంగళవారం జరిగిన ఈ ట్రైలర్ ఈవెంట్లో ‘లోకనాయకుడు’ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులు హజరయ్యారు. చదవండి: హాట్‌టాపిక్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్!, ఎవరెవరికి ఎంతంటే.. -
పొన్నియన్ సెల్వన్ నుంచి ఫస్ట్‌సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 30న ఈ మూవీ ఐదు(తెలుగు,తమిళం, మలయాళం, హిందీ, కన్నడ) భాషల్లో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్లను వేగవంత చేసిన చిత్ర బృందం ఇప్పటికే ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేయగా.. వీటికి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. చదవండి: సినిమా రిలీజ్ కాదన్నారు.. వారం క్రితం ఏడ్చేశాను: నిఖిల్ ‘పొంగే నది పాడినది’ అంటూ సాగే ఈ పాట సింగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను ఏఆర్ రెహమాన్, ఏఆర్ రైహానా, బాంబా బక్యా ఆలపించారు. కాగా ఈ సినిమాకు ఏఆర్ రహామాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. కాగా మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్‌పై సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు
ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 30న ఈ మూవీ ఐదు(తెలుగు,తమిళం, మలయాళం, హిందీ, కన్నడ) భాషల్లో విడుదల కానుంది. నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఫస్ట్‌లుక్, టీజర్లను వరుసగా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక రీసెంట్గా విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చదవండి: Nayanthara: నయనతార షాకింగ్ రెమ్యూనరేషన్.. ఒకేసారి అన్ని కోట్లా..? ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం వివాదంలో నిలిచినట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌లోని పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మణిరత్నం, హీరో విక్రమ్‌కు కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ చిత్రంలో చోళులను, చోళ రాజవంశం గురించి తప్పుగా చూపించారని సెల్వం అనే న్యాయవాది ఆరోపిస్తు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీజర్లో ఆదిత్య కరికాలన్(విక్రమ్ పోషించిన పాత్ర) నుదిటిపై తిలకం లేదని ఎత్తి చూపారు. కానీ, విక్రమ్‌కు సంబంధించిన పోస్టర్లో మాత్రం తిలకం ఉన్నట్లుగా చూపించారు. ఈ సినిమాలో చోళులను తప్పుగా చూపించారని ఆయన ఆరోపించారు. Welcome the Chola Crown Prince! The Fierce Warrior. The Wild Tiger. Aditya Karikalan! #PS1 🗡@madrastalkies_ #ManiRatnam pic.twitter.com/UGXEuT21D0 — Lyca Productions (@LycaProductions) July 4, 2022 చారిత్రక వాస్తవాలను చూపించడంలో దర్శక-నిర్మాతలు విఫలయ్యారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక దీనిపై స్పష్టత రావాలంటే సినిమాను విడుదలకు ముందే ప్రత్యేకంగా ప్రదర్శించాలని లాయన్ సెల్వం తన పటిషన్లో డిమాండ్ చేశారు. ఈ కోర్టు నోటీసులపై దర్శకుడు మరణిరత్నం కానీ, విక్రమ్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా పొన్నియన్ సెల్వెన్‌ను రూపొందింది. ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, ప్రభు, శోభితా ధూలిపాల, ఐశ్వర్య లక్ష్మిలు కీ రోల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
ఒక్క పాట కోసం 300 మంది డ్యాన్సర్లు.. 25 రోజులు చిత్రీకరణ
Ponniyin Selvan: 25 Days Shoot With 300 Dancers: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. ఈ చిత్రం పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో విక్రమ్, కార్తీ ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఇదివరకు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర అప్డేట్ తెలిసింది. భారీ చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక పాటను సుమారు 300 మంది డ్యాన్సర్స్‌తో చిత్రీకరించారు. ఈ 300 మంది డ్యాన్సర్స్‌తో సుమారు 25 రోజులపాటు షూటింగ్ చేశారని సమాచారం. ఈ డ్యాన్సర్స్‌లో 100 మందిని ప్రత్యేకంగా ముంబై నుంచి రప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 30న వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో -
మణిరత్నం 40 ఏళ్ల కల.. విజయ్, మహేశ్‌బాబుతో ప్లాన్, కానీ..
రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఇండియన్ సినిమా రూపు రేఖల్ని మార్చేసింది.భారీ బడ్జెట్ చిత్రాలు తీయాలి అంటే ఒక ధైర్యాన్ని ఇచ్చింది. మంచి కంటెంట్ మన చేతుల్లో ఉంటే ప్రేక్షకులను అలరించే విధంగా తెరకెక్కించగలం అనే నమ్మకం ఉంటే రెండు భాగాలుగా అయినా విడుదల చేయవచ్చు అని రోబో, బాహుబలి, కేజీయఫ్ సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ ఇదే దారిలో వెళ్తోంది. తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం 40ఏళ్ల కల పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్ట్. ఇక కోలీవుడ్ వరకు తీసుకుంటే 1958 నుంచి ఈ సినిమాను తెరకెక్కించాలని ఎందరో దర్శకులు, హీరోలు ప్రయత్నించారు. తమిళ తొలితరం స్టార్ హీరో ఎమ్జీఆర్ పొన్నియిన్ సెల్వన్ తీసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత పొన్నియిన్ సెల్వన్ ను తెరకెక్కించేందుకు మణిరత్నం ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒకసారి రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్ కాంబినేషన్ లో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు మణిరత్నం. కాని కుదరలేదు. ఆ తర్వాత విజయ్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఈ చారిత్రిక చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడు. కాని బడ్జెట్ ఇష్యూస్ వచ్చాయి. కోలీవుడ్ మార్కెట్ కు ఈ సినిమా అడుగుతున్న బడ్జెట్ సరిపోదనే ఇన్నాళ్లు వెయిట్ చేస్తూ వచ్చాడు మణిరత్నం. 2018లో వచ్చిన నవాబ్ తర్వాతమరోసారి పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్ట్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టాడు మణిరత్నం. అందుకు బాహుబలి సిరీస్ సంచలన విజయం సాధించడమే కారణం.బాహుబలి స్ఫూర్తితోనే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను తమిళ సినీ ఇండస్ట్రీలోనే అత్యఅధిక బడ్జెట్ తో నిర్మిస్తోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, శరత్‌కుమార్, ఐశ్వర్యరాయ్, త్రిష, విక్రమ్ ప్రభు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30న రిలీజ్ చేస్తున్నారు. -
లక్కీ చాన్స్ చేజార్చుకున్న కీర్తి సురేశ్? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
దర్శకుడిగా మణిరత్నంకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగ చెప్పనక్కర్లదు. ఆయన సినిమాలో నటించే చాన్స్ కోసం స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఆశగా ఎదురుచూస్తుంటారు. ఆయన సినిమాల్లో చిన్న రోల్ చేసిన చాలు అని ఎంతోమంది నటీనటులు ఆరాటపడుతుంటారు. అలాంటి స్టార్ డైరెక్టర్ చాన్స్ ఇస్తే ఓ స్టార్ హీరోయిన్ వదులుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు ‘మహానటి’ కీర్తి సురేశ్. మణిరత్నం తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ మూవీ బృందం నుంచి కీర్తికి పిలుపు అందగా.. డేట్స్ లేవని ఆ లక్కీ చాన్స్ వదుకుందట కీర్తి. చదవండి: నయన్ బాటలో తమన్నా.. ఆ అనుభూతి ఉత్సాహాన్నిచ్చిందంటున్న మిల్కీ బ్యూటీ తాజాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక ఇది తెలిసి ఆమె ఫ్యాన్స్ అయ్యే అంటుండగా.. మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు. ‘‘మహానటి’ తర్వాత ఒక్క హిట్ కూడా లేని ఆమెకు మణిరత్నం వంటి స్డార్ డైరెక్టర్ చిత్రంలో అవకాశం వస్తే వదులుకుందా?, చాలా తెలివి తక్కువ వ్యవహరించింది’’అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కాగా మహానటి చిత్రంతో తన నటనకు గానూ కీర్తి జాతీయ అవార్డు అందుకుంది. ఆ తరువాత ఆమె పలు చిత్రాలలో నటించిన సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో మణిరత్నం చారిత్రక చిత్రం పొన్ని యన్ సెల్వన్‌లో నటించే అవకాశం వచ్చింది. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే! అయితే అదే సమయంలో రజనీకాంత్‌కు చెల్లెలిగా అన్నాత్తే చిత్రంలో నటిస్తుండటంతో పాటు మరోవైపు ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్లో పాల్గొంటుంది. ఇక రజనీకాంత్‌తో నటిస్తే మంచి క్రేజ్ వస్తుందని భావించిన కీర్తి తనకు డేట్స్ సర్దుబాటు కావడం లేదని చెప్పి మణిరత్నం మూవీకి నో చెప్పిందని సినీవర్గాల నుంచి సమాచారం. దీంతో కీర్తి పాత్రకు త్రిషని తీసుకుందట చిత్ర బృందం. ఇందులో త్రిష కుందనవై అనే రోల్ పోషించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో త్రిషతో పాటు ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, జయం రవి, హీరో కార్తీ వంటి స్టార్ హీరోహీరోయిన్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
‘పొన్నియన్ సెల్వన్’.. మణిరత్నం కోసం రంగంలోకి కమల్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 1955లో కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న తెలుగు, హిందీ తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. చదవండి: ‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా?.. డైరెక్టర్ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా! ఇక మూవీ ప్రమోషన్లో భాగంగా ఇందులోని ప్రధాన పాత్రలకు సంబంధించిన లుక్‌ను ఒక్కొక్కొటిగా విడుదల చేస్తూ మూవీపై అంచనాలను పెంచుతోంది చిత్ర బృందం. అయితే ఈ సినిమా ప్రధాన పాత్రలకు సంబంధించిన పలు సన్నివేశాలను అక్కడక్కడా కలుపుతూ వాయిస్ ఓవర్ ఉంటుందట. అయితే తమిళంలో ఈ స్పెషల్ సీన్స్‌కు కమల్‌తో వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నాడు మణిరత్నం. అంతేకాదు ఇతర భాషల్లో కూడా ఆయా స్టార్‌ను ఎంచుకుని వాయిస్ ఓవర్ చెప్పించేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళంలో కమల్ చెబితే బాగుటుందని మూవీ టీం భావిస్తోందట. -
ప్రతీకారానికి అందమైన రూపం.. ఐశ్వర్య రాయ్ లుక్
Aishwarya Rai Ponniyin Selvan First Look Poster: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 1955లో కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడా మణిరత్నం. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాలోని నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్, కార్తీ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. తాజాగా ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్‌ను బుధవారం (జులై 6) రివీల్ చేసింది చిత్రబృందం. 'ప్రతీకారానికి అందమైన రూపం. నందిని.. పళవూరు రాణి' అంటూ సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్‌ను ప్రకటించారు. ఇందులో మనోహరమైన రూపంతో పగ, ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న పళవూరు రాణి నందినిగా ఐశ్వర్య రాయ్ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్లో ఐశ్వర్య రాయ్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ప్రపంచంలోనే ఖరీదైన వజ్రం తమన్నా సొంతం.. కోట్లలో ఆస్తులు.. ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ? Vengeance has a beautiful face! Meet Nandini, the Queen of Pazhuvoor! #PS1 releasing in theatres on 30th September in Tamil, Hindi, Telugu, Malayalam and Kannada. 🗡@madrastalkies_ #ManiRatnam @arrahman pic.twitter.com/HUD6c2DHiv — Lyca Productions (@LycaProductions) July 6, 2022 -
పొన్నియన్ సెల్వన్ ప్రచారం ముమ్మరం
పొన్నియన్ సెల్వన్ చిత్ర యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మెడ్రాస్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చారిత్రక కథా చిత్రం ఇది. నవలగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ చరిత్ర ఇప్పుడు వెండితెరకెక్కుతోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష తదితర భారీ తారాణం నటిస్తున్న ఈ చిత్రాన్ని మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఏఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పొన్నియన్ సెల్వన్ టీం చిత్ర ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ చిత్రంలోని ఒక్కో పాత్రను ఒక్కో రోజు పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం విక్రమ్ పోషిస్తున్న ఆదిత్య కరికాలన్ పాత్రను విడుదల చేశారు. మంగళవారం కార్తీ పోషిస్తున్న వందియ దేవన్ పాత్రను విడుదల చేశారు. ఈ రెండు పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తూ చిత్రంపై ఆసక్తిని రేకెతిస్తోంది. తదుపరి జయం రవి పోషిస్తున్న అరుళ్‌మోళి వర్మన్, ఆ తరువాత కుందవై పాత్రలో నటిస్తున్న త్రిష పాత్రను, నందిని పాత్రలో నటిస్తున్న ఐశ్వర్యరాయ్ పాత్రను అంటూ ప్రధాన పాత్రలను వరుసగా విడుదల చేసి చిత్రంపై హైప్ క్రియేట్ చేస్తోంది మూవీ యూనిట్. కాగా వచ్చే వారం గానీ, ఆపై వారంగానీ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. -
Ponniyin Selvan: యుద్ధవీరుడు కరికాలన్ గా విక్రమ్.. ఫస్ట్‌లుక్ వైరల్
పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి ప్రధాన తారలుగా నటించారు. ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ నటిస్తున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. అలాగే ‘చోళ కీరట రాజు. భయంకరమైన యుద్ధవీరుడు, ది వైల్డ్ టైగర్’ అంటూ విక్రమ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇక ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలోని తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. శరత్‌కుమార్, ప్రభు, పార్తిబన్, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
పొన్నియిన్ సెల్వన్: చోళులు వచ్చేస్తున్నారు
మణిరత్నం సినిమా వస్తుందంటే చాలు సినీప్రియుల అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. వారి అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలు తెరకెక్కిస్తుంటాడీ డైరెక్టర్. ప్రస్తుతం ఆయన పొన్నియిన్ సెల్వన్ సినిమా చేస్తున్నాడు. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ రెండు విభాగాలుగా తెరకెక్కనుంది. తాజాగా శనివారం నాడు ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజైంది. చోళులు వస్తున్నారు అంటూ ఈ వీడియోలో రాసుకొచ్చారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం నిర్మించిన ఈ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. Look out! Brace yourself. Get ready for an adventure filled week! The Cholas are coming! #PS1 🗡 @LycaProductions #ManiRatnam pic.twitter.com/9Ovj3I8GXW — Madras Talkies (@MadrasTalkies_) July 2, 2022 చదవండి: అందుకే పెళ్లి చేసుకోలేదు.. నా పిల్లలు కారణం కాదు: స్టార్ హీరోయిన్ జనవరి టు జూన్.. ఫస్టాఫ్‌లో అదరగొట్టిన, అట్టర్ ఫ్లాప్ అయిన చిత్రాలివే! -
రిలీజ్‌కు ముందే భారీ ధరకు మణిరత్నం సినిమా..
Maniratnam Ponniyin Selvan OTT Rights Release Date Details: స్టార్ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్' చిత్రం. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న 'పొన్నియన్ సెల్వన్' పార్ట్ 1ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మేకర్స్. అయితే 'పొన్నియన్ సెల్వన్' అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్‌కు ముందే సూపర్ ప్రిరిలీజ్ బిజినెస్ చేసింది. 'పొన్నియన్ సెల్వన్' సినిమా రెండు భాగాల డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసింది. సుమారు రూ. 125 కోట్లకు ఈ రైట్స్ సాధించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రాలతో సూపర్ హిట్ కొట్టి తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఒక మంచి సక్సెస్ సాధిస్తే యావత్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందొచ్చని భావిస్తున్న తమిళ ఇండస్ట్రీ ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రీట్, 105 షాట్స్‌తో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ సీనియర్ నటి రాధిక సినిమాలో హీరోగా చిరంజీవి.. -
పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సక్సెస్, కలవరపడుతున్న కోలీవుడ్
పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి పరభాషా చిత్రాలు జాతీయ స్థాయిలో సంచలన విజయాలను అందుకోవడంతో తమిళ చిత్రాల గురించి పెద్ద చర్చే సాగుతోంది. ఇలాంటి తరుణంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళ సినీ పరిశ్రమ భయపడాల్సిన అవసరం లేదని నమ్మకాన్ని పెంచే వ్యాఖ్యలు చేశారు. హనీ ప్లిక్స్ అనే సంస్థ చిత్ర నిర్మాణ ఖర్చులు తగ్గించడం వంటి పలు ప్రయోజనాలు చేకూరేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. సోమవారం జరిగిన సాఫ్ట్వేర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మణిరత్నం మాట్లాడుతూ తమిళ చిత్ర పరిశ్రమ గురించి భయపడాల్సిన పని లేదని, ఇతర భాషా చిత్రాలకు పోటీ ఇస్తోందన్నారు. మన చిత్రం చంద్రలేఖ అప్పట్లోనే హిందీలో సంచలన విజయం సాధించిందన్నారు. అదే విధంగా దక్షిణాది సినిమా ఇప్పుడు తన పరిధిని పెంచుకుందన్నారు. ఇండియన్ సినిమా స్టాండర్డ్ పెరిగిందని అభిప్రాయపడ్డారు. యువ దర్శకులు విజువల్ వండర్స్ సృష్టిస్తున్నారని, ఆరోగ్యకరమైన పోటీ మంచిదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత టీజీ త్యాగరాజన్, నటుడు ప్రశాంత్ పాల్గొన్నారు. చదవండి: రాజీవ్‌తో గొడవలు నిజమే, కానీ విడాకులు.. యాంకర్ సుమ ఎమోషనల్ పెళ్లి చేసుకున్న టీవీ నటి రష్మీ, ఫొటోలు వైరల్ -
కోలీవుడ్ ఫస్ట్ ప్లేస్‌లో దూసుకుపోతోంది: ముఖ్యమంత్రి
చెన్నై సినిమా: తమిళ సినిమా రంగం దేశంలో ప్రథమస్థానంలో దూసుకుపోతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పేర్కొన్నారు. సౌత్ ఇండియా మీడియా, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (సదస్సు) శనివారం ఉదయం చెన్నైలో మొదలైంది. స్థానిక నందంబాక్కంలోని ట్రేడ్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించానని పేర్కొన్నారు. తమిళ సినిమా భారతీయ సినిమాలో ప్రథమస్థానంలో దూసుకుపోతుందని ప్రశంసించారు. చిత్ర పరిశ్రమ ఐక్యతకు తాను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈతరం యువత గంజాయి, గుట్కా వంటి మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని, అలాంటి వాటిపై సినిమాల్లో అవగాహన కలిగించే విధంగా సంభాషణలు పొందుపరచాలని సీఎం స్టాలిన్ తెలిపారు. దక్షిణ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు సత్యజ్యోతి ఫిలిమ్స్ త్యాగరాజన్ అధ్యక్షత వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులు దర్శకుడు మణిరత్నం, నటుడు జయంరవి, టాలీవుడ్ నుంచి డైరెక్టర్ రాజమౌళి, సుకుమార్, మల్లువుడ్ నుంచి నటుడు జయరాం, ఫాహత్ ఫాజిల్, శాండిల్‌వుడ్ నుంచి శివరాజ్‌కుమార్ మొదలగు 300 మందికి పైగా పాల్గొని సినిమాకు చెందిన వివిధ అంశాలపై ప్రసంగించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, సినిమా మార్కెట్ విస్తరణ, ఓటీటీ ప్రభావంపై తమ అనుభవాలను, అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చదవండి: బుల్లితెర నటుడి కొత్త ఇల్లు.. కోట్లల్లో ధర.. -
‘మణిరత్నంను ఇంతవరకు కలవలేదు, ఆయనతో నాకు చేదు అనుభవం ఉంది’
Sukumar Remember A Incident With Director Mani Ratnam In a Interview: స్టార్ డైరెక్టర్ మణిరత్నం వల్ల తనకు చేదు అనుభవం ఎదురైందంటూ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన తాజాగా రూపొందించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఘనవిజయంతో ఫుల్ జోషల్‌లో ఉన్నాడు సుకుమార్. ఈ నేపథ్యంలో పుష్ప సక్సెస్‌తో వరస ఇంటర్య్వూలతో బిజీగా ఉన్న సుక్కు ఈ క్రమంలో మణిరత్నం గురించి ఆసక్తికర విషయం చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన కొత్తలో తన అభిమాన దర్శకుడు మణిరత్నం తీరుతో చాలా బాధపడ్డానంటూ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. చదవండి: బాహుబలి ‘కట్టప్ప’కు కరోనా, ఆకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిక ‘నేను మణిరత్నంగారి అభిమానిని.. ఆయన తీసిన 'గీతాంజలి' సినిమాతో మరింత ఫ్యాన్ అయ్యాను. ఆ సినిమా చూసిన అనంతరం థియేటర్ నుంచి బయటికు వెస్తుంటే.. ఒక గర్ల్ ఫ్రెండ్‌ను వదిలేసి వస్తున్నట్టుగా అనిపించింది. అలాంటి ఆయనను కలవడం ఇంతవరకూ కుదరలేదు’ అని ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే మణిరత్నం ప్రభావంతోనే తాను దర్శకుడి అయ్యానన్నాడు. ‘‘ఆర్య’ సినిమా చేసిన తరువాత ఒకసారి ఆయన ముంబైలో కనిపించారు. ఆ సమయంలో మణిరత్నం గారు హీరోయిన్ శోభనతో సీరియస్‌గా ఏదో డిస్కస్ చేస్తున్నారు. చాలా సేపు వెయిట్ చేశాను. అయినా వాళ్ల సంభాషణ పూర్తి కావడం లేదు. చదవండి: ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్ దాంతో ఇక ఉండలేక ‘సార్’ అంటూ దగ్గరికి వెళ్లాను. అప్పుడాయన కోపంగా నా వైపు చూస్తూ ‘వెళ్లూ’ అన్నట్టుగా చేయితో సైగ చేశారు’ అని పేర్కొన్నారు. ఇక ఆ క్షణం ఆయనను అలా చూసి చాలా బాధపడ్డానని, తాను ఎంతగానో అభిమానించే మణిరత్నంగారు అలా అనడంతో మనసుకు చాలా కష్టంగా అనిపించిందన్నాడు. అయితే, ఒక డైరెక్టర్ సీరియస్‌గా స్రీప్ట్ గురించి చర్చిస్తున్న సమయంలో డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందనేది ఆ తర్వాత తనకు అర్థమైందన్నాడు. అప్పటి ఆయన ధోరణి నాకు తప్పుగా అనిపించలేదని, అయితే ఆ క్షణం తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆయనను కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని సుకుమార్ చెప్పాడు. -
పొన్నియిన్ సెల్వన్: తొలి భాగం షూటింగ్ పూర్తి, విడుదల ఎప్పుడంటే..
స్టార్ డెరెక్టర్ మణిరత్నం దర్శకతంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ ‘పొన్నియిన్ సెల్వన్’ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఆమె యువరాణి నందిని పాత్ర పోషిస్తోంది. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌ను ఆదివారం (సెప్టెంబర్ 19న) ఆమె సోషల్ మీడియాలో విడుదల చేసింది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ‘పీఎస్1’ పూర్తయినట్లు, సమ్మర్ కానుకగా 2022లో విడుదల కానున్నట్లు పోస్టర్లో మూవీ టీం వెల్లడించింది. విక్రమ్, కార్తీ, త్రిష, ‘జయం’ రవి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. కల్కి కృష్ణమూర్తి నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా, గతనెల పీఎస్1 సెట్స్ నుంచి ఐశ్వర్య ఫోటో ఒకటి బయటికి వచ్చి వైరల్ అయింది. అందులో ఆమె బంగారు రంగు చీర, భారీ ఆభరణాలతో ఉంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
పొన్నియిన్ సెల్వెన్: ఐష్‌తో ప్రత్యేకంగా భారీ పాట, 400 మందితో..
‘డోలా రే డోలా’, ‘కజ్రారే’, ‘తాళ్ సే తాళ్ మిలా’ వంటి పాటల్లో ఐశ్వర్యారాయ్ డ్యాన్స్ అదుర్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఐష్‌ని అలాంటి మరో పాటలో చూసే అవకాశం ఉంది. మణిరత్నం దర్శకత్వంలో రపొందుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో యువరాణి నందిని పాత్ర చేస్తున్నారు ఐశ్వర్యారాయ్. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సినిమా సెట్లో ఐశ్వర్యపై ఓ భారీ పాటను చిత్రీకరించారని సమాచారం. చదవండి: ‘ఆ సన్నివేశాలు ఎంజీఆర్, జయలలితలను కించపరిచేలా ఉన్నాయి’ ఈ పాట కోసం స్పెషల్‌గా రిహార్సల్స్ కూడా చేశారట ఐశ్వర్య. కాస్ట్యమ్స్ విషయంలోన కేర్ తీసుకున్నారట. ఇంకో విశేషం ఏంటంటే... ఈ పాటలో ఐశ్వర్యతో పాటు నాలుగు వందల మందికిపైగా డ్యాన్సర్లు కనిపిస్తారని టాక్. గతంలో చేసిన ‘డోలా రే డోలా’, ‘కజ్రారే’, ‘తాళ్ సే తాళ్ మిలా’ పాటలకు ఐశ్వుర్య చప్పట్లు అందుకున్నారు. ఈ పాటలో నృత్యానికి ప్రేక్షకుల నుంచి మరోసారి ఆమె చప్పట్లు అందుకోవడం ఖాయం అంటున్నారట చిత్రయూనిట్. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, త్రిష తదితరులు నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. -
భారీ వెబ్‌సిరీస్ 'నవరస' రిలీజ్ డేట్ ఫిక్స్
శృంగారం, కరుణ, శాంతం, హాస్యం, అద్భుతం, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం... ఈ నవరసాల నేపథ్యంలో తొమ్మిది కథలతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన వెబ్ సిరీస్ ‘నవరస’. తొమ్మిది కథలను తొమ్మిది మంది దర్శకులు తెరకెక్కించారు. ‘గిటార్ కంబి మేలే నిండ్రు’ కథకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించగా సూర్య, ప్రయాగా మార్టిన్ ప్రధాన పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, రేవతి, అశోక్ సెల్వన్ ముఖ్య తారలుగా బిజయ్ నంబియార్ ‘ఎదిరి’కి దర్శకత్వం వహించారు. ‘పాయసం’ని వసంత్ తెరకెక్కించగా ఢిల్లీ గణేష్, రోహిణి, అదితీ బాలన్, కార్తీక్ కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ‘సమ్మర్ ఆఫ్ 92’ని యోగిబాబు, రమ్యా నంబీశన్ కీలక పాత్రధారులుగా ప్రియదర్శన్ తెరకెక్కించారు. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ‘పీస్’లో బాబీ సింహా, గౌతమ్ మీనన్, మాస్టర్ తరుణ్ కీలక పాత్రలు చేశారు. నటుడు అరవింద్ స్వామి దర్శకత్వం వహించిన ‘రౌద్రమ్’లో శ్రీరామ్, రిత్విక, అభినయశ్రీ తదితరులు కీలక పాత్రధారులు. కార్తీక్ నరేన్ తెరకెక్కించిన ‘ప్రాజెక్ట్ అగ్ని’లో అరవింద్ స్వామి, ప్రసన్న ప్రధాన పాత్రధారులు. సిద్ధార్థ్, పార్వతి ముఖ్య తారలుగా ఆర్. రతీంద్రన్ ప్రసాద్ ‘ఇనిమై’ని తెరకెక్కించారు. అథర్వా మురళి, అంజలి, కిశోర్ ముఖ్య తారలుగా సర్జున్ దర్శకత్వంలో ‘తునింద పిన్ రూపొందింది. ఈ తొమ్మిది భాగాల లుక్స్‌ని గురువారం విడుదల చేశారు. ఆగస్ట్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. -
ఆన్లైన్లో లీకైన ‘పుష్ప’ స్టోరీ, సుక్కుపై ట్రోల్స్!
ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సూకుమార్-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’కు సంబంధించిన ఓ వార్త నెట్టింటా హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సన్నివేశాల చిత్రకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడించింది. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ మూవీని రూపొందించాడు. ఇందులో స్టైలిష్ స్టార్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. పుష్పరాజు అనే లారీ డైవర్‌గా అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలై ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా టీజర్లో అల్లు అర్జున్ చెప్పే ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయతే తాజా బజ్ ప్రకారం.. పుష్ప స్టోరీ ఆన్లైన్లో లీక్ అయినట్లు వినపిస్తోంది. పుష్ప కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక అది చూసిన వారంత పుష్ప స్టోరీ కాపీ కొట్టిందని, మన టాలెంటెడ్ దర్శకుడు సూకుమార్.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ‘విలన్’ మూవీ కథను ఆధారంగా చేసుకుని ‘పుష్ప’ను రాసుకొచ్చారంటూ ఆయనపై తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు. అయితే రామాయణం కథను ఆధారంగా చేసుకొని.. రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ‘విలన్’ సినిమాని రూపొందించారు మణిరత్నం. తన చెల్లికి జరిగిన అన్యాయంపై హీరో.. విలన్లపై ఏ విధంగా పగ తీర్చుకుంటాడనేదే ఈ సినిమా కథ. అయితే సుకుమార్ కూడా ఈ కథని బేస్ చేసుకొనే ‘పుష్ప’ మూవీని రూపొందించారని కామెంట్స్ వస్తున్నాయి. అయితే ‘పుష్ప’ సినిమాలో కూడా అల్లు అర్జున్‌కు ఓ చెల్లి పాత్ర ఉంటుందనేది మేకర్స్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాలో కూడా పుష్పరాజ్ తన చెల్లికి అన్యాయం చేసిన వాళ్లపై రివేంజ్ తీర్చుకోవడమే ప్రధాన కథాంశంగా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక నిజంగానే సుకుమార్ ‘విలన్’ సినిమాని కాపీ కొట్టారా లేదా అనే విషయం తెలియాంటే ఈ మూవీ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప ఆగస్టు 13న రిలీజ్ కానుంది. చదవండి: రెచ్చిపోయిన అనసూయ, ఏకంగా వీధుల్లో ఇలా.. కన్నడ రీమేక్‌లో నితిన్ హిట్ మూవీ, దర్శకుడు ఎవరో తెలుసా! -
గోదారి తీరంలో మణిరత్నం సినిమా షూటింగ్!
పోలవరం రూరల్ (పశ్చిమగోదావరి): గోదావరి తీరంలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పోలవరం మండలంలో సింగన్నపల్లి వద్ద ఓ సినిమాకు సంబంధించి షూటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి నదిలో టూరిజం బోట్లు, పడవలు ఏర్పాటు చేసి డెకరేషన్ చేపట్టారు. సింగంపల్లి నుంచి గోదావరి నదిలో పాపికొండలు వెళ్లే మార్గంలో షూటింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సెట్టింగులతో పలు సన్నివేశాలు ఈ ప్రాంతంలో చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందే సినిమాకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సినీ సిబ్బంది ఆదివారం నదిలో ట్రయల్ రన్ నిర్వహించారు. చదవండి: బోయపాటి సినిమాకు బ్రేక్.. కారణం ఇదే! లూసిఫర్: మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ -
20 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి.. కామెడీ రోల్లో షాలిని!
ప్రముఖ తమిళ హీరో అజిత్ భార్య, నటి షాలిని పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. 2000 ఏడాదిలో అజిత్‌ను పెళ్లాడిన తర్వాత ఆమె హౌజ్ వైఫ్‌గా సెటిలైన విషయం తెలిసిందే. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత షాలిని మూవీస్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కాగా మణిరత్నం ప్రముఖ తమిళ నవలైన పొన్నియన్ సెల్వన్‌ను వెబ్ సిరీస్‌గా అదే పేరుతో తెరకెక్కిస్తున్నట్లు గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలీం సిటీలో జరుపుకుంటోంది. ఇందులో హీరో విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తిలు లీడ్ రోల్ పోషిస్తున్నారు. తాజా ఈ సిరీస్‌లో షాలిని కూడా నటిస్తున్నారని, ఇందులో ఆమె ఓ కామెడీ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఐశ్యరాయ్, కార్తీ, త్రిష, జయం రవీలు ఈ సిరీస్ షూటింగ్లో పాల్గొన్నారు. కాగా షాలిని ఈ నెల చివరిలో సష్త్రటింగ్లో పాల్గొననున్నారని, త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. అయితే చివరిగా 2001లో వచ్చిన తమిళ చిత్రం ‘పిరియాధ వరం వెండం’లో షాలినీ నటించారు. ఇందులో హీరో ప్రశాంత్‌కు జోడీగా ఆమె కనిపించారు. (చదవండి: వైరలవుతోన్న ‘కుట్టి థలా’ ఫోటోలు) (హీరో అజిత్‌కి ఏమైంది? షూటింగ్ ఫోటో వైరల్) -
కట్ చెప్పలేదు.. కట్టేసుకున్నారు..!
(వెబ్ స్పెషల్): ఇంటర్వ్యూల్లో చాలా మంది హీరోయిన్లు చెప్పే మాట తాము డైరెక్టర్స్ చాయిస్ అని. అంటే.. దర్శకులు చెప్పినట్లు తాము చేస్తామని అర్థం. కొన్ని కొన్ని సార్లు ఈ చెప్పే వారి మాటలు అవతలి వారి మనసును తాకుతాయి. దాంతో ఒకరి మీద ఒకరికి ఇష్టం, ప్రేమ కలుగుతాయి. అది కాస్త పెళ్లికి దారి తీస్తుంది. దాంతో కట్ చెప్పలేక వారితో జీవితాన్ని ముడి వేసుకున్నారు. హీరోయిన్లు దర్శకులను వివాహం చేసుకోవడం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. మరి ఇంతకు ఏ హీరోయిన్ ఏ దర్శకుడిని పరిణయం ఆడిందో చూడండి.. సుహాసిని-మణిరత్నం హీరోయిన్, దర్శకుల వివాహం టాపిక్ వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది సుహాసిని-మణిరత్నంల పేర్లే. ఆమె అందం, అభినయాల కలబోత అయితే.. ఆయన భారతీయ ఆత్మను ప్రతిబింబించే చిత్రాల దర్శకుడు. వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి 1988లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. దివంగత దర్శకుడు కె. బాలచందర్ ఒత్తిడి మేరకే తాము వివాహం చేసుకున్నామంటారు సుహాసిని. వీరికి ఒక కుమారుడు నందన్ ఉన్నాడు. (చదవండి: పెద్దన్నయ్య) రేవతి - సురేష్ చంద్ర సురేష్ చంద్ర దర్శత్వంలో రేవతి రెండు చిత్రాల్లో నటించారు. అలా ఏర్పడ్డ పరిచయంతో ఈ జంట ప్రేమలో పడ్డారు. 1986లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. కృష్ణవంశీ - రమ్య కృష్ణ కృష్ణవంశీ తెరకెక్కించిన చంద్రలేఖ చిత్రంలో రమ్యకృష్ణ నటించారు. అలా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ జంట 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు రిత్విక్ ఉన్నాడు. రోజా - సెల్వమణి రోజాని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది సెల్వమణి. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. 2002లో రోజా, సెల్వమణిలు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు, పాప ఉన్నారు. శరణ్య-పొన్నవనన్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు శరణ్య. కానీ 1980-90ల కాలంలో ఈమె చాలా తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేశారు. అప్పుడే దర్శకుడు పొన్నవనన్తో ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకున్నారు.(చదవండి:ఇదే నాకు పెద్ద బర్త్‌డే గిఫ్ట్ ) ఖుష్బూ-సుందర్ ఇద్దరు కలిసి ఒక్క చిత్రం కూడా చేయలేదు. కన్నడ నిర్మాత అయిన సుందర్‌ని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఖుష్బూ. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. వారి పేరు అవంతిక అనందిత. సీత- పార్థిపన్ సీనియర్ నటి సీత, దర్శకుడు పార్థిపన్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 1990లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమర్తెలు, ఓ దత్తత తీసుకున్న కొడుకు ఉన్నారు. 2001లో ఈ జంట విడాకులతో విడిపోయారు. ఆ తర్వాత సీత మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. (చదవండి: జీవితం ఉన్నది అనుభవించడానికే..) దేవయాని- రాజ్ కుమారన్ దర్శకుడు రాజ్ కుమారన్, దేవయానిల లవ్ ఎఫైర్ అప్పట్లో ఒక సెన్సేషన్. రాజ్ కుమారన్ దర్శత్వంలో దేవయాని నీ వరువై ఏనా అనే చిత్రంలో నటించారు. వీరిద్దరూ 2001లో వివాహం చేసుకున్నారు. అమలాపాల్ - విజయ్ దర్శకుడు అమలాపాల్, విజయ్ ప్రేమ వ్యవహారం గురించి తెలిసిందే. పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. వీరే కాక దర్శకుడు సెల్వ రాఘన్, హరి, ప్రియ దర్శన్ వంటి వారు హీరోయిన్లనే వివాహం చేసుకున్నారు. -
‘నవరస’లో తెలుగు హీరోలు.. వీరేనా?
నవరస అనే పేరుతో మొదటిసారి విభిన్న దర్శకుడు మణిరత్నం ఓటీటీ ఫ్లాట్‌ఫ్లాంలో అడుగు పెట్టబోతున్నారు. నవసర పేరిట తొమ్మిది ఎపిసోడ్లు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇందులో ప్రతి ఎపిసోడ్‌కు ఒక డైరెక్టర్ దర్శకత్వం వహించనుండగా, ఒక్కో హీరో నటించనున్నారు. ఇప్పటికే దర్శకులుగా నటులు అరవింద్ స్వామి, సిద్ధార్థ్ లతో పాటు గౌతం మీనన్, బిజోయ్ నంబియార్, సుధ కొంగర, కేవీ ఆనంద్, జయేంద్ర, కార్తీక్ నరేన్ ఎంపికయ్యారు. ఈ వెబ్ సిరీస్‌లో నటించడానికి తమిళ సినీ పరిశ్రమ నుంచి సూర్య, మాధవన్ ఎంపిక కాగా ఇక తెలుగు పరిశ్రమ నుంచి నాగార్జున, నాని, నాగ చైతన్యలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వెబ్‌సిరీస్‌ను ఆగస్టు నుంచి మొదలు పెట్టే ఆలోచనాలో మణిరత్నం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మణిరత్నం స్కిప్ట్‌ను మాత్రమే మానిటర్ చేస్తారా లేక ఏదైనా ఎపిసోడ్‌ను డైరెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది. చదవండి: గొప్పగా నటించమని వేడుకుంటా: మణిరత్నం -
మణిరత్నం మల్టీస్టారర్‌లో హీరో కార్తీ!
తమిళ సూపర్ స్టార్ హీరో కార్తీకి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేటితో కార్తీ 43వ(మే 25) వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు సెలబ్రెటీలు, అభిమానులు ప్రత్యేకంగా ట్విటర్లో బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం కార్తీ ‘సుల్తాన్’, ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. బక్కియాన్ కన్నన్ దర్శకత్వంతో నటిస్తున్న ‘సుల్తాన్’ చిత్రంలో కార్తీ సరసన రష్మిక మండన నటిస్తున్నారు. ఇది రష్మిక తొలి తమిళ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడినట్లు చిత్ర బృందం తెలిపింది. (స్వర్ణయుగం మొదట్లో..) అంతేగాక ప్రముఖ దర్శకుడు మణిరత్నం మల్టీస్టారర్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ కార్తీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దర్శకుడు అదే పేరుతో రూపొందిస్తున్నారు. చోళ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రంలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, లాల్, శోభితా ధూలిపాలి నటిస్తున్నారు. ఇప్పటికే సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా ‘పొన్నియిన్ సెల్వన్’ను మణిరత్నం ఒక దశాబ్థం తర్వాత తెరకెక్కిస్తున్నాడు. ‘రావన్’ తర్వాత ఐశ్వర్య మళ్లీ మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. (అందుకే తప్పుకున్నా) -
గొప్పగా నటించమని వేడుకుంటా: మణిరత్నం
ప్రముఖ దర్శకుడు మణిరత్నం మొదటిసారిగా సోషల్ మీడియా లైవ్‌చాట్‌లోకి వచ్చారు. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో ఆసక్తి కనబరచని ఆయన తన భార్య, నటి సుహాసిని నిర్వహించిన లైవ్‌చాట్‌లో మొదటిసారిగా పాల్గొన్నారు. అంతేగాక సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉండే ఆయన ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకోవడమే కాకుండా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ లైవ్‌లో హీరో మాధవన్, నటి ఖుష్భు, అదితిరావ్ హైదరిలతో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం పాల్గొన్నారు. ఈ క్రమంలో ‘మాధవన్ నువ్వు మణిరత్నం(ఆయన)కు గోల్ఫ్ ఆటను పరిచయం చేయడం ద్వారా ఆయన జీవితం మారిపోయింది’ అని సుహాసిని అన్నారు. అయితే ‘ఆటలో నన్ను ఓడించమని రత్నం సార్‌కు సవాలు విసిరాను.. కానీ ఆయన నాపై చెత్తను విసిరారు’ అంటూ చమత్కరించాడు. (నిర్మాతను టెన్షన్ పెడుతున్న హీరోయిన్) అంతేగాక మణిరత్నం నిర్మించిన మాధవన్ ‘అలైపాయుతే’ సినిమాలోని ఓ రైలు సన్నివేశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ.. ‘సన్నివేశం చిత్రీకరించడానికి ఆ సమయంలో రెండు రైళ్లు ఉన్నప్పటికీ.. నాకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో చిత్రీకరణపై ఆందోళన చెందాను’ అని చెప్పుకొచ్చారు. ఇక మధ్యలో నటి అను హాసన్ కలుగజేసుకుని మణిరత్నంపై రాపిడ్‌ఫైర్ ప్రశ్నలను సందించారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్లో ఉన్న మీరు భార్య నుంచి ఎలా తప్పించుకుంటున్నారని అడగ్గా.. ‘లాక్డౌన్లో నేను నిశ్శబ్ధాన్ని పాటించడం నేర్చుకున్న’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. ఇక ప్రముఖ నటి పూనం ధిల్లాన్... ‘పాత్రల ఎంపికలో ఏలా ఉంటారు. అసాధారణమైన నటులను ఎన్నుకుంటారా లేక సాధారణ నటులను అసాధారణమైన వారిగా మార్చుకుంటారా’ అని అడిగారు. ‘నా నటీనటులను బాగా నటించమని వేడుకుంటాను’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. (‘కరోనా’ సందేశం.. పవన్, బన్నీ మిస్) View this post on Instagram Good evening. Hope u enjoyed the live sessions last 21 days. It was time to say good bye. But we had an amazing evening. Hope you all liked what was planned and what was spontaneous. Give us your feed. Especially those whose videos were played A post shared by Suhasini Hasan (@suhasinihasan) on Apr 14, 2020 at 9:08am PDT ఇక అదితి రావు హైదరి.. పాత్రలకు సరైన నటులను ఎలా అడగ్గా.. తనని కాస్తా ఇబ్బందికి గురి చేసే నటుల కోసమే నేను ఎప్పుడూ వెతుకుతానని చెప్పాడు. “ఇది కూడా ఓ మంచి అనుభూతి. ఎవరైనా మొదటి ఎంపికతోనే ఎల్లప్పుడూ ముగించ కూడదు. నిజానికి సరైనా ఎంపిక.. మనం చేసే సగం పనిని పూర్తి చేస్తుంది. అయితే నేను ఏది చెబితే అది మాత్రమే చేసే వారిని వెతకను. దానితో పాటు అదనంగా ఎదైన కొత్తగా చేయాలి’’ అని చెప్పారు. ఇక ఓటీటీ(ఓవర్ దీ టాప్) వంటి ప్లాట్‌ఫాంల కోసం సినిమా చేయడానికి లేదా చూపించడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదని అభిమానులు అడిగిన ప్రశ్నకు.. “నేను 20 సంవత్సరాలుగా టెన్నిస్ ఆడుతున్నాను. ఇప్పు నన్ను మీరు ఫుట్‌బాల్ ఆడమని అడిగితే ఆడలేను. అంతేగాక ఆ ఆటకు న్యాయం కూడా చేయలేను ” అంటు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కాగా ప్రముఖ తమిళ ఇతిహాస నవల ఆధారంగా ఆయన తెరకెక్కించబోయే ‘పొన్నీన్ సెల్వన్’ను సీరిస్‌లుగా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక సినిమాల్లో మీరు ఎప్పుడైనా నటించాలనుకుంటున్నారా అని ఓ అభిమాని అడిగ్గా... ఇదే ప్రశ్నను ఇది వరకే రజనీకాంత్ కుమార్తె ఆయనను అడిగినట్లు సుహాసిని చెప్పారు. దానికి ఆయన చేయనని వెంటనే సమాధానం ఇచ్చారని కూడా ఆమె తెలిపారు. (బగ్గా వైన్ షాప్ పేరుతో ఆన్లైన్లో మోసం) -
స్వీయ నిర్బంధంలో నటి కుమారుడు
-
స్వీయ నిర్బంధంలో మణిరత్నం కుమారుడు
చెన్నై : ప్రముఖ దర్శకుడు మణిరత్నం, సీనియర్ నటి సుహాసినిల కుమారుడు నందన్ మణిరత్నం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కొద్దిరోజుల క్రితం లండన్ నుంచి వచ్చిన ఆయన కరోనా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షలో కరోనా నెగిటివ్ వచ్చినప్పటికి బాధ్యతగా వ్యవహరించి తనకు తాను స్వీయ నిర్బంధం విధించుకున్నారు. తమ ఇంట్లోని ఓ ప్రత్యేక గదిలో ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సినీ నటి ఖుస్భూ ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో స్వీయ నిర్బంధంలో ఉన్న నందన్‌తో తల్లి సుహాసిని గ్లాస్ విండో ద్వారా మాట్లాడిన దృశ్యాలు ఉన్నాయి. ‘ బాధ్యత కలిగిన వ్యక్తులు చేసే పనిది. సుహాసిని, నందన్‌మణిరత్నాలకు నా అభినందనలు. వీరి నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉంది. నీ స్వీయ నిర్బంధం చక్కగా గడవాలని కోరుకుంటాన్నా’నని ఖుస్భూ పేర్కొన్నారు. కాగా, తమిళనాడులో ఇప్పటి వరకు 9.. దేశ వ్యాప్తంగా 415 కరోనా కేసులు నమోదవ్వగా 8 మంది మృత్యువాత పడ్డారు. -
ఇదే నాకు పెద్ద బర్త్‌డే గిఫ్ట్
ఇది తనకు పెద్ద బర్త్‌డే గిఫ్ట్ అని అన్నారు నటుడు అరుణ్ విజయ్. విషయం ఏమిటంటే మంగళవారం ఈయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా అరుణ్ విజయ్ నటిస్తున్న సినమ్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఆవిష్కరించారు. ఈయన తన చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించడమే తన పుట్టినరోజుకు పెద్ద గిఫ్ట్ అని అరుణ్ విజయ్ పేర్కొన్నారు. సినమ్ చిత్ర యూనిట్ కూడా చాలా ఖుషీగా ఉంది. చిత్ర కథానాయకుడు అరుణ్ విజయ్ మాట్లాడుతూ.. మణిరత్నం తన చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇది చిత్ర ప్రచారానికి బలాన్నిచ్చే అంశం అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో తానింతకు ముందు సెక్క సివంద వానం చిత్రంలో నటించడం మరిచిపోలేని అనుభవం అని అన్నారు. ఆయన దర్శకత్వంలో నటనలో కొత్త కోణాన్ని నేర్చుకున్నానని చెప్పారు. గత ఏడాది పుట్టిన రోజు ఎలాగైతే తనకు అద్భుతంగా జరిగిందో అదే విధంగా ఈ పుట్టిన రోజు కొనసాగుతుందని భావిస్తున్నానన్నారు. అందుకు సినమ్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మణిరత్నం చేతుల మీదగా విడుదల చేయడమే కారణం అన్నారు. ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఒక పోలీస్ అధికారి కోపం ఎన్ని ఆటంకాలను ఎదిరించి న్యాయం కోసం పోరాడాల్సి వస్తుందని చెప్పే చిత్రమే సినమ్ అని తెలిపారు. ఇలాంటి కథాంశంతో ఇంతకు ముందు పలు చిత్రాలు వచ్చినా దర్శకుడు జీఎన్ఆర్.కుమారవేలన్ కథను వివరించిన విధానం తెరపై ఆవిష్కరించిన తీరు తనకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తోందన్నారు. కాగా సినమ్ చిత్ర షూటింగ్ సెట్లో అరుణ్‌విజయ్ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. అరుణ్ విజయ్ తండ్రి విజయ్‌కుమార్, తల్లితో పాటు, సహోదరి ప్రీతి, అగ్నిసిరగుగళ్ చిత్ర దర్శకుడు నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మా క్రియేషన్స్ శివ నటుడు అరుణ్‌విజయ్‌కు బంగారు గొలుసును బహుమతిగా అందించారు. కాగా ఇందులో పలాక్ లాల్వాణి హీరోయిన్గా నటిస్తుండగా కాళీవెంకట్ చాలా ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటిస్తున్నారు. షబీర్ సంగీతాన్ని, గోపీనాథ్ ఛాయాగ్రహణను అందిస్తున్నారు. -
షూట్ షురూ
రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఆయన షూట్ ప్లాన్‌ను రెడీ చేశారని కోలీవుడ్ సమాచారం. తొలి షెడ్యూల్‌ను థాయ్‌ల్యాండ్‌లో ప్లాన్ చేశారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ కొన్ని సన్నివేశాలకు సంబంధించి థాయ్‌ల్యాండ్ అడవుల్లో సెట్ వర్క్ జరుగుతోందట. మరిన్ని సన్నివేశాల కోసం నటీనటుల కంటే ముందే మణిరత్నం అక్కడికి వెళ్లి మరికొన్ని లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేస్తారని కోలీవుడ్ టాక్. అంతా పూర్తి చేసి చిత్రీకరణను వచ్చే నెల 12న మొదలుపెట్టాలని భావిస్తున్నారట. మరోవైపు ఈ సినిమాలో నటించే నటీనటులపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఇందులో నటింబోతున్నట్లు ఇప్పటివరకు విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్‌లు మాత్రమే వివిధ సందర్భాల్లో చెప్పారు. ఐశ్వర్యా రాయ్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఇంకా ‘జయం’ రవి, అనుష్క, అమలాపాల్, కీర్తీ సురేష్, పార్తీబన్ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. -
అనుష్కకు అంత లేదా!
సినిమా: మణిరత్నం ప్రఖ్యాత దర్శకుడని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన భారీ చిత్రాలనూ తెరకెక్కించగలరు, బడ్జెట్ చిత్రాలను బ్రహ్మాండంగా తెరపై ఆవిష్కరించగలరు. అలాగే ప్రేమకథా చిత్రాలను వైవిధ్యంగా చెక్కడంలో సిద్ధహస్తుడు. అయితే ఈ మధ్య కాస్త తడబడ్డ మణిరత్నం సెక్క సివంద వానం చిత్రంతో మళ్లీ గాడిలో పడ్డారు. అది మల్టీస్టారర్ చిత్రం. ఆ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఒకసారి వాయిదా వేసుకున్న పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ భుజానేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇది కల్కీ అనే రచయిత రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా అదే పేరుతో తెరకెక్కించనున్న చిత్రం. ఇందులో నటుడు విక్రమ్, కార్తీ, జయంరవి, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, తెలుగు నటుడు మోహన్‌బాబు, ఐశ్వర్యరాయ్, నయనతార, కీర్తీసురేశ్ నటించనున్నారు. కాగా వీరితో పాటు నటి అనుష్క కూడా ముఖ్యపాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆమె నటించడం లేదనే ప్రచారం వైరల్ అయ్యింది. అందుకు కారణం నయనతార కంటే తన పాత్ర తక్కువ కావడమేననే ప్రచారం దొర్లింది. అయితే మణిరత్నం చిత్రం నుంచి నటి అనుష్క నటించడం లేదన్నది వాస్తవమే అయినా, అందుకు కారణం నయనతార కాదట. పారితోషికమేనన్న విషయం ఇప్పుడు వెలుగులోకొచ్చినట్లు తాజా సమాచారం. దక్షిణాదిలో నయనతారకు దీటుగా పేరు తెచ్చుకున్న నటి అనుష్క. ఆమె పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించడానికి రూ.4 కోట్లు డిమాండ్ చేసిందని, దీంతో దర్శకుడు మణిరత్నంకు షాక్ కొట్టినంత పనైందని సమాచారం. రూ.కోటి ప్లస్ జీఎస్టీ కలిపి చెల్లిస్తామని చెప్పడంతో ఈ సారి అనుష్కకు షాక్ కొట్టినంత పనైందట. ఈ బ్యూటీ పారితోషికం విషయంలో బెట్టు సడలించకపోవడంతో అంతకు వర్త్ లేదంటూ మణిరత్నం ఆమె పాత్రలో మరో నటిని ఎంపిక చేసే పనిలో పడ్డారట. అలా ఆ పాత్రకు చెన్నై చిన్నది త్రిష సెట్ అయ్యిందని సమాచారం. అయితే అంతకు వర్త్ లేదన్న మణిరత్నం మాటల్లో అర్థం, అనుష్కకు అంత సీన్ లేదనా లేక ఆ చిత్రంలో ఆమె పాత్రకు అంత వర్త్‌లేదనా అన్నదిప్పుడు చర్చనీయాం«శంగా మారింది. అయితే నటి ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేయనుండడంతో ఇక అనుష్క పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఏముంటుంది? అనే చర్చా జరుగుతోంది.అయినా రూ.4 కోట్లు తీసుకునే అనుష్కను రూ.కోటి పారితోషికం అంటే ఎలా ఒప్పుకుంటుంది. కాగా లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం మెడ్రాస్ టాకీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్.రెహ్మాన్ అందిస్తున్నారు. వైరముత్తు రాసిన గీతాలకు ఏఆర్.రెహ్మాన్ బాణీలను సిద్ధం చేసేశారట. డిసెంబర్లో పొన్నియన్ సెల్వన్ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. -
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు, ఇంట్రస్టింగ్ అప్డేట్?
సాక్షి, ముంబై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న 'పొన్నియిన్ సెల్వన్' చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్నఈ సినిమాలో నటించే దిగ్గజాలపై ఇప్పటికే పలు అంచనాలు అభిమానుల్లో హల్చల్ చేస్తున్నాయి. తాజా సంచలనం ఏమిటంటే హిస్టారికల్ వార్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. దక్షిణాది సూపర్స్టార్లు లీడ్ రోల్స్ పోషించనున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో ఐశ్యర్య తల్లీ కూతుళ్లుగా రెండు కీలక పాత్రల్లో అలరించనున్నారు. చోళరాజు పెరియా పజువేట్టరయ్యర్ భార్య నందిని, నందిని తల్లి మందాకిని దేవీ పాత్రలకు మణిరత్నం ఐషును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జీన్స్ సినిమాలో కవల అక్కా చెల్లెళ్లుగా ఆకట్టుకున్న ఐశ్యర్య ఈసారి తల్లీ కూతుళ్లుగా ఆకట్టుకోనున్నారన్నమాట. కార్తీ, విక్రమ్, మోహన్ బాబు, కీర్తి సురేష్ ఇప్పటికే ఈసినిమాలో ప్రధాన పాత్రలు పోషించనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న పొన్నియన్ సెల్వన్ సినిమాని మద్రాస్ టాకీస్ అండ్ లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంలో రాసిన కల్కి కృష్ణమూర్తి చారిత్రాత్మక నవల ఆధారంగా 'పొన్నియిన్ సెల్వన్' తెరకెక్కుతోంది. ఇది చోళ రాజు రాజరాజ చోళుని కథను చెబుతుంది. పాన్ ఇండియా ఆడియన్స్ టార్గెట్ గా రూపొందనున్న ఈ సినిమా నవంబరు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ విషయంపై అధికారిక వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉంది. చదవండి : అడవుల్లో వంద రోజులు! -
అడవుల్లో వంద రోజులు!
రాజుల ఆహార్యం గొప్పగా ఉంటుంది. అందుకే రాజుల కథలతో వచ్చే సినిమాల కోసం హీరోలు తమ లుక్‌ను మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తమిళ హీరోలు విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి తమ లుక్స్‌ను మార్చుకోబోతున్నారు. చోళ సామ్రాజ్య నేపథ్యంతో కూడుకున్న నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్రమ్, ఐశ్వర్యారాయ్ నటించనున్నారు. విక్రమ్, కార్తీ, జయం రవి, పార్తిబన్, కీర్తి సురేష్, అమలాపాల్ ప్రధాన పాత్రధారులనే ప్రచారం జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, మోహన్‌బాబు కూడా కీలక పాత్రలు చేయనున్నారని కోలీవుడ్ టాక్. సినిమాలోని రాజుల పాత్రకు తగ్గట్లు జుట్టు మీసాలు, గెడ్డాలు పెంచుకోమని మణిరత్నం ఈ సినిమాలో నటించే కీలక పాత్రధారులకు చెప్పారట. ఆల్రెడీ విక్రమ్, కార్తీ వంటి నటులు ఈ పని స్టార్ట్ చేశారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ నవంబరులో మొదలు కానుందని తెలిసింది. ముందుగా థాయ్‌ల్యాండ్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట టీమ్. వంద రోజుల పాటు అక్కడి అడవుల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారని తెలిసింది. -
రాణీ త్రిష
చోళుల కాలానికి వెళ్లేందుకు హీరోయిన్ త్రిష ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ప్రముఖ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించే వారి జాబితా గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా హీరోయిన్ త్రిష ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయబోతున్నారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. త్రిష చేయబోయేది ఓ రాణి పాత్ర అట. ఇప్పటివరకు ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్ మాత్రమే ఫైనలైజ్ అయిన సంగతి తెలిసిందే. మోహన్‌బాబు, అనుష్క, ‘జయం’ రవి, కీర్తీ సురేశ్, అమలాపాల్, రాశీఖన్నా... ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో పన్నెండు పాటలు ఉండబోతున్నాయని తెలిసింది. రచయిత వైరముత్తు ఈ చిత్రంలోని పాటలన్నింటినీ రాయబోతున్నారట. అందుకోసం ఆయన పదవ శతాబ్దానికి చెందిన సాహిత్యంపై ప్రత్యేకమైన పరిశోధనలు చేస్తున్నారని టాక్. ఈ సినిమా చిత్రీకరణ డిసెంబరులో ప్రారంభం కానుందట. -
మణిరత్నం దర్శకత్వంలో త్రిష?
మణిరత్నం దర్శకత్వంలో చెన్నై చిన్నది త్రిష నటించనుందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు మణిరత్నం ఆ మధ్య సరైన సక్సెస్ లేక కాస్త వెనుకబడ్డారు. అయితే సెక్క సివంద వానం చిత్రంతో మళ్లీ సక్సెస్ రూటు పట్టారు. ఆ ఉత్సాహంతో ఒకసారి వాయిదా వేసిన భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్‌ను తిరిగి పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా ప్రతిసారి ఏదో ఒక కొత్త అంశం వెలుగులోకి వస్తూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల పొన్నియన్ సెల్వన్. ఈ నవలను ఇంతకు ముందు ఎంజీఆర్ నుంచి చాలా మంది తెరకెక్కించాలని ఆశ పడ్డారు. అయితే చేయలేకపోయారు. ఇప్పుడు దర్శకుడు మణిరత్నం ఒక యజ్ఞంగా ఈ చిత్రానికి తెర రూపం ఇవ్వడానికి సంకల్పించారు. యువ స్టార్స్ నుంచి సూపర్‌స్టార్స్ వరకు పొన్నియన్ సెల్వన్ చిత్రంలో భాగం కాబోతున్నారు. పలు భాషలకు చెందిన భారీ తారాగణంను మణిరత్నం ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే వందియదేవన్‌గా నటుడు కార్తీ, అరుళ్‌మోళివర్మగా జయంరవి, పూంగళలిగా నయనతార, సుందరచోళన్‌గా బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, ఆదిత్త కరికాలన్‌గా విక్రమ్, కందవై పాత్రలో నటి కీర్తీసురేశ్, నందిని పాత్రలో అందాలరాశి ఐశ్వర్యరాయ్, పళవైట్టైరాయర్ పాత్రలో సత్యరాజ్‌లను ఎంపిక చేసినట్లు సమాచారం. మలయాళ నటుడు జయరాం, నటి అమలాపాల్, ఐశ్వర్యలక్ష్మి కూడా ముఖ్య పాత్రల్లో నటించనున్నట్లు తెలిసింది. తన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించనున్న విషయాన్ని నటుడు జయరాం ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇక మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్సెల్వన్ చిత్రంలో నటించనుండడం తన అదృష్టం అని నటి ఐశ్వర్యరాయ్ ఇప్పటికే పేర్కొన్నారు. మణిరత్నం ఎప్పుడు కాల్షీట్స్ అడిగినా కేటాయిస్తానని చెప్పారు. తాజాగా సంచలన నటి త్రిష కూడా పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించనున్నట్లు తాజా సమాచారం. ఆమెను నటింపజేసే విషయమై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో నటించనున్న తారాగణాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని మణిరత్నం రూ.800 కోట్ల భారీ వ్యయంతో రెండు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలో కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. -
అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్ భావోద్వేగం!
సాక్షి, చెన్నై : తమిళ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆలయాలు, మహోన్నతుల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని మాజీ ప్రపంచ సుందరి, హీరోయిన్ ఐశ్వర్యారాయ్ అన్నారు. తాను తెరంగేట్రం చేసింది కోలీవుడ్‌లోనేనని, తనకు గౌరవం తెచ్చిన తమిళ నేలకు వందనం చేస్తున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చాలాకాలం తర్వాత ఐశ్వర్య బుధవారం చెన్నైకి వచ్చారు. ఈ సందర్భంగా చెన్నై, తమిళ సంప్రదాయాలు, కోలీవుడ్ గురించి మాట్లాడారు. ‘ఇక్కడి వాతావరణం, ఆహారపు అలవాట్లు, ప్రేమ, ఆప్యాయత, నేను తిరిగిన నేలను జీవితాంతం గుర్తుంచుకుంటా’ అని చెప్పుకొచ్చారు. కాగా 1994లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ఐశ్వర్యా రాయ్.. టాప్ డైరెక్టర్ మణిరత్నం సినిమా ‘ఇద్దరు’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అనంతరం బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హీరో అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఐశ్... తన తదుపరి సినిమాలో నెగెటివ్ రోల్లో కనిపించనున్నారు. 10వ శతాబ్ధానికి చెందిన కథతో మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమాలో రాజ్యాధికారం కోసం కుట్రలు చేసే నందిని అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. విక్రమ్, శింబు, జయం రవిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అమలాపాల్ కీలక పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
అడంగమరు దర్శకుడితో కార్తీ?
అడంగమరు చిత్రం ఫేమ్ కార్తీక్ తంగవేల్‌కు నటుడు కార్తీ అవకాశం ఇచ్చినట్లు తాజా సమాచారం. నటుడు జయంరవి కథానాయకుడిగా నటించిన చిత్రం అడంగమరు. రాశీఖన్నా నాయకిగా నటించిన ఈ చిత్రం 2018లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడే కార్తీక్ తంగవేల్. ప్రస్తుతం కార్తీ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో మలయాళ దర్శకుడు జీతు జోసఫ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఒకటి. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నిఖిలావిమల్ నాయకిగా నటిస్తున్న ఇందులో సత్యరాజ్, అమ్ము అభిరామి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఇరుంబుతిరై చిత్ర దర్శకుడు పీఎస్.మిత్రన్ దర్శకత్వంలో కార్తీ నటించనున్నారు. మానగరం చిత్రం ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ నటించిన ఖైదీ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. జూలైలో ఖైదీని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా కార్తీక్ తంగవేల్ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇంతకు ముందు కార్తీ హీరోగా దేవ్ చిత్రాన్ని నిర్మించింది. ఆ చిత్రం ఆడకపోవడంతో కార్తీ ప్రిన్స్ పిక్చర్స్ సంస్థకు వెంటనే మరో చిత్రం చేయడానికి కాల్షీట్స్ ఇచ్చినట్లు తెలిసింది. వీటితో పాటు కార్తీ, మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోనూ నటించడానికి సమ్మతించారన్నది గమనార్హం. చాలా నమ్మకం పెట్టుకుని ఇష్టపడి చేసిన రొమాంటిక్ లవ్‌స్టోరీతో కూడిన దేవ్ చిత్రం నిరాశ పరచడంతో కార్తీ వేగం పెంచేశారు. వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నారు. -
మణిరత్నం చిత్రంలో అమలాపాల్
తమిళసినిమా: సంచలన నటి అమలాపాల్‌కు మరో లక్కీచాన్స్ లభించనుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రం కోసం ఒక తపస్సు చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే నాటి దివంగత ముఖ్యమంత్రి, మక్కళ్ తిలగం ఎంజీఆర్ వంటి నటుడే నటించాలని కలలు కన్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఆ తరువాత కమలహాసన్ వంటి వారు కూడా ఆశ పడిన నవల అది. కాగా ఇంతకుముందు మణిరత్నం పొన్నియిన్‌సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేసి బడ్జెట్ వర్కౌట్ కాకపోవడంతో తన ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్‌సెల్వన్ చిత్రాన్ని వెండితెర కళాఖండంగా చెక్కడానికి సిద్ధం అయ్యారు. ఇంతకుముందు నటుడు విజయ్, తెలుగు నటుడు మహేశ్‌బాబు వంటి స్టార్స్‌తో పొన్నియన్సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నించిన మణిరత్నం ఈ సారి విక్రమ్, జయంరవి, కార్తీ, కీర్తీసురేశ్, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి ఇండియన్ స్టార్స్‌ను తన చిత్రంలో పాత్రదారులుగా ఎంచుకున్నారు. అయితే ఇందులో అగ్రనటి నయనతార కూడా ఒక కీలక పాత్రను పోషించనుందనే ప్రచారం జోరందుకున్నా, ఆ తరువాత ఆమె కాల్షీట్స్ కేటాయించలేని పరిస్థితి కారణంగా మరో అగ్రనటి అనుష్క ఆ పాత్రను చేయబోతోందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా మరో సంచలన వార్త ఏమిటంటే పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో మరో సంచలన నటి అమలాపాల్‌ను కూడా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది. అందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు గ్లామర్ పాత్రలకు ప్రాముఖ్యతనిచ్చిన అమలాపాల్ ఈ మధ్య హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలపై దృష్టి సారిస్తోంది. ఆమె నటిస్తున్న అడై, అదో అంద పరవై పోల వంటి చిత్రాలు హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలే. తాజాగా మణిరత్నం ఆఫర్ చేసిన హిస్టారికల్ పాత్రలో నటించే లక్కీ అవకాశాన్ని ఈ సంచలన నటి అంగీకరిస్తుందా? అనే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ అవకాశం ఇస్తోంది దర్శకుడు మణిరత్నం. కాబట్టి పొన్నియిన్‌సెల్వన్ చిత్రంలో స్టార్ నటీనటుల్లో నటి అమలాపాల్‌ను కూడా చూడవచ్చు. ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని సమాచారం. దీన్ని మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి రిలయన్స్ సంస్థ నిర్మించడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ ఏడాది చివరిలో పొన్నియిన్ సెల్వన్ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. -
మణిరత్నం చిత్రంలో మల్టీస్టారర్స్
సినిమా: మణిరత్నం తాజా చిత్రం స్టార్స్‌మయంగా మారుతోంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్‌తో చిత్రం చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే మణిరత్నంకు మల్టీస్టారర్ చిత్రాలు చేయడం కొత్తేమీ కాదు. ఆయన దళపతి చిత్రాన్నే రజనీకాంత్, మమ్ముట్టి, అరవిందస్వామి, శోభన, భానుప్రియ వంటి ప్రముఖ నటీనటులతో చేసి విజయం సాధించారు. అదేవిధంగా ఇటీవల అరవిందస్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌విజయ్, జ్యోతిక వంటి స్టార్స్‌తో సెక్క సివందవానం చిత్రాన్ని తీసి సక్సెస్ అయ్యారు. ఇక తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే చిత్రాన్ని మల్టీస్టారర్స్‌తో చేయడానికి సిద్ధమయ్యారు. నిజానికి ఈ చిత్రాన్ని చాలా కాలం క్రితమే విజయ్, టాలీవుడ్ స్టార్ మహేశ్‌బాబు, ఐశ్వర్యరాయ్ వంటి వారితో చేయ తలపెట్టారు. అయితే అది అప్పట్లో సెట్ కాలేదు. తాజాగా అదే చిత్రాన్ని మరింత భారీ తారాగణంతో రూపొందించడానికి రెడీ అయ్యారు. ఇందులో విక్రమ్, విజయ్‌సేతుపతి, జయంరవి, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, టాలీవుడ్ స్టార్ నటుడు మోహన్‌బాబు వంటి వారిని ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా మరో స్టార్ నటుడు కార్తీ కూడా ఈ మల్టీస్టారర్ చిత్రంలో యాడ్ అవుతున్నట్లు తెలిసింది. త్వరలో సెట్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్న ఆ పొన్నియన్ సెల్వన్ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. -
జీవీతో ఐశ్వర్య
మణిరత్నం చిత్రంలో యువ సంగీతదర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్‌తో కలిసి నటించడానికి ఐశ్వర్యరాజేశ్ సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. కోలీవుడ్‌లో అత్యధిక చిత్రాలు చేస్తున్న నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్. ఈయన చేతిలో ఇప్పుడు 10 చిత్రాల వరకూ ఉన్నాయి. వాటిలో ఈ ఏడాది 7 చిత్రాలు తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నాయి. ఆ మధ్య నటుడిగా కాస్త తడబడ్డా, నాచియార్‌తో హిట్‌ట్రాక్‌లో పడ్డ జీవీ తాజాగా దర్శకుడు మణిరత్నం నిర్మించనున్న చిత్రంలో హీరోగా నటించడానికి పచ్చజెండా ఊపారు. మణిరత్నం శిష్యుడు ధనశేఖరన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇకపోతే ఇందులో నటి ఐశ్వర్యరాజేశ్ ప్రధాన పాత్రలో నటించనుంది. ఈ చిత్రంలో తను జీవీ ప్రకాశ్‌కుమార్‌కు అక్కగా కనిపించబోతోందని సమాచారం. ఇంతకు ముందే కాక్కాముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించి ప్రశంసలు అందుకున్న ఈమె ఇటీవల హీరోయిన్గా బాగా బిజీ అయిపోయింది. అంతే కాదు కనా చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో చాలా ఉత్సాహంలో ఉన్న ఐశ్వర్యరాజేశ్‌కు మరోసారి మణిరత్నం సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించే అవకాశం రావడంతో మరింత సంబరపడిపోతోంది. ఈమె ఇంతకుముందు మణిరత్నం దర్శకత్వంలో సెక్క సెవంద వానం చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. జీవీ ప్రకాశ్‌కుమార్‌తో జత కట్టే హీరోయిన్ ఎంపిక జరుగుతోందట. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి 96 చిత్రం ఫేమ్ గోవింద్‌వసంత్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం జయంరవి, విక్రమ్, శింబు, అమితాబచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి భారీ తారాగణంతో పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
బెదిరింపు ఫోన్‌కాల్
ఆఫీస్‌లో బాంబ్ ఉన్నట్లు అర్ధరాత్రి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆఫీసులో ఏ ప్లేసూ వదలకుండా తనిఖీ చేశారు. కానీ అక్కడ ఏం లేకపోవడంతో ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు పోలీస్ సిబ్బంది మమ్ముర ప్రయత్నాలు మొదలుపెట్టారు. చదువుతుంటే... ఇది ఓ యాక్షన్ సినిమాలోని సీన్లా ఉంది కదా. కానీ నిజంగా జరిగింది. చెన్నైలోని ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆఫీస్‌లో ఇదంతా జరగిందని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన మణిరత్నం ‘చెక్క చివంద వానమ్’ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఒక కమ్యూనిటీని కించపరిచేలా ఉన్నాయట. అందుకే ఎవరో ఇలా బెదిరింపు కాల్ చేసారట. ఈ సినిమా తెలుగులో ‘నవాబ్’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. -
రేపే ‘నవాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్!
చెలియా చిత్రం తరువాత మణిరత్నం దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం నవాబ్. భారీ మల్టిస్టారర్గా తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. మణిరత్నం ఈసారీ అన్నదమ్ముల మధ్య జరిగే సంఘర్షణను ‘నవాబ్’ రూపంలో ప్రేక్షకులకు ముందుకు తెస్తున్నారు. ఇటీవలె విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నవాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌ను సెప్టెంబర్ 25న పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులందరూ హాజరుకాబోతున్నారని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, ప్రకాష్ రాజ్, జయసుధ, జ్యోతిక తదితరులు నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. -
‘నవాబ్’ కూడా నిజజీవిత పాత్రల నేపథ్యమే..!
లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నవాబ్. మణి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కుతోంది. అయితే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మణిరత్నం గత చిత్రాలు ఎక్కువగా పురాణేతిహాసాలు, చారిత్రక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కినవే. ప్రేమకథా చిత్రాలు తప్ప మణి దర్శకత్వంలో తెరకెక్కిన ఇతర చిత్రాలు రామాయణ మహాభారతాలు, తమిళ రాజకీయ నాయకుల కథల ఇన్పిపిరేషన్‌తో తెరకెక్కించారు. తాజా చిత్రం నవాబ్ కూడా అలా నిజజీవిత పాత్రల నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తమిళ రాజకీయాల నేపథ్యంలోనే ఈ సినిమా రూపొందించారని ప్రధాన పాత్రలైన ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామిల పాత్రలు తమిళ నాయకులను గుర్తు చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై మణి టీం మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
మణిరత్నం ఆదుకోవాలి.. సినీకార్మికుడి ఫిర్యాదు
దర్శకుడు మణిరత్నంపై సినీ లైట్‌మెన్ పోలీస్ కమిషనర్‌కు సోమవారం ఫిర్యాదు చేశాడు. అనంతరం మణిమారన్ మీడియాతో మాట్లాడుతూ తాను సినీ లైట్‌మెన్‌గా పని చేశానని లైట్‌మెన సంఘంలో సభ్యుడిగా ఉన్నానన్నాడు.10 ఏళ్ల క్రితం తాను దర్శకుడు మణిరత్నం చిత్రాలకు పనిచేశానని చెప్పాడు. కాగా అప్పుడు నటుడు అభిషేక్‌బచ్చన్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన గురు చిత్ర షూటింగ్ స్థానిక పెరంబూరులో జరినప్పుడు తాను విష జ్వరానికి గురయ్యానని తెలిపాడు. ఆస్పత్రిలో చేరగా చికిత్సకు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారన్నారు. తాను పేదవాడిని కావడంతో తన వద్ద అంత డబ్బు లేకపోవటంతో దర్శకుడు మణిరత్నం ఇంటికి వెళ్లి సాయం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపాడు. చివరికి ఆర్థికసాయం కోరుతూ ఒక లేఖ కూడా రాశానని, అయినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు. తన భార్య పని చేసి తన కుటుంబాన్ని పోషిస్తోందని చెప్పాడు. లైట్‌మెన్ సంఘం నుంచి రూ. 2 లక్షలు వైద్య సాయానికి అందించాల్సిందిగా కోర్టు ఆదేశించిందని చెప్పాడు. అయితే ఆ సంఘం నిర్వాహకులు తనను రూ.20 వేలు లంచం ఇవ్వాలని అడిగారన్నాడు. తాను అప్పు చేసి ఆ డబ్బును సంఘంకు ఇచ్చానని, అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం లైట్‌మెన్ సంఘం రూ. 2 లక్షలు కాకుండా లక్ష రూపాయలే ఇచ్చిందని చెప్పాడు. మరో లక్ష ఇవ్వాల్సి ఉందన్నాడు. తను మణితర్నం చిత్రాలకు పని చేశానని, ఆయన మానవత్వంతో తనకు ఆర్థికసాయం చేయాలని కోరారు. అందుకోసం తాను స్థానిక నుంగంబాక్కమ్ వళ్లువర్ కోట్టం వద్ద కుటుంబంసహా నిరాహార దీక్ష చేయడానికి పోలీసుల అనుమతి కోరడానికే కమిషనర్ కార్యాలయానికి వచ్చినట్లు మణిమారన్ తెలిపాడు. ఈ సంఘటన కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. -
‘వరద’గా అరవింద్ స్వామి..
మణిరత్నం సినిమా అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన తన సినిమాల్లో క్యారెక్టర్స్‌ను మలిచే విధానం ఆకట్టుకుంటుంది. మణిరత్నం సృష్టించే పాత్రలే సినిమాను నడిపిస్తాయి. ఆయన డైరెక్షన్లో వచ్చిన కడలి, చెలియా సినిమా అభిమానులను అంతగా మెప్పించలేకపోయాయి. మళ్లీ ఓ భారీ మల్టిస్టారర్ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ‘నవాబ్’గా తెలుగులో రాబోతోన్న ఈ మూవీలో అరవింద్ స్వామీ, శింబు, విజయ్ సేతుపతిలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రోజూ ఒక పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా సోమవారం ‘వరద’పాత్రకు సంబంధించిన అరవింద్ స్వామీ లుక్‌ను రివీల్ చేశారు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేడు శింబు పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జ్యోతిక, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. #Nawab - Launching Star 2's look today at 5:00 PM. Any guesses?#ManiRatnam @LycaProductions @thearvindswami #STR #VijaySethupathi @arunvijayno1 @prakashraaj #Jyotika @aditiraohydari @aishu_dil @DayanaErappa @salamsir21@arrahman @santoshsivan #SirivennelaSeetharamaSastry pic.twitter.com/pkOoGZLqAJ — Lyca Productions (@LycaProductions) August 14, 2018 -
‘నవాబ్’ను చూడబోతున్నాం!
మణిరత్నం రత్నాల్లాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. మణిరత్నం సినిమాల్లో నటిస్తే చాలనుకుంటారు హీరోలు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా.. జాతీయ స్థాయిలో మణిరత్నం సినిమాలకు క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎంచుకునే కథలకు సరిహద్దులు ఉండవు. పాత్రల మధ్య భావోద్వేగాలే ఆయన కథను నడిపిస్తాయి. గత కొంతకాలం పాటు మణిరత్నం నుంచి వచ్చే సినిమాలు సినీ ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. అయితే మళ్లీ మునుపటి మణిరత్నాన్ని తలపించేలా, పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా ‘నవాబ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబులు అన్నదమ్ములుగా నటిస్తున్నారని, వీరి మధ్య వచ్చే సంఘర్షణలే సినిమాకు కీలకం అని తెలుస్తోంది. ఈ సినిమాలో జ్యోతిక, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సోమవారం సాయంత్రం నుంచి సినిమాలోని లీడ్ క్యారెక్టర్స్‌కు సంబంధించిన లుక్స్‌ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. నేటి సాయంత్రం 5గంటలకు అరవింద్ స్వామి లుక్‌ను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. #Nawab - Look 1 coming up at 5 PM today! Guess who?#ManiRatnam @LycaProductions @thearvindswami #STR #VijaySethupathi @arunvijayno1 @prakashraaj #Jyotika @aditiraohydari @aishu_dil @DayanaErappa @salamsir21@arrahman @santoshsivan @sreekar_prasad #SirivennelaSeetharamaSastry pic.twitter.com/ii5tPgqtrg — Lyca Productions (@LycaProductions) August 13, 2018 -
మణిరత్నంకు గుండెపోటు వార్తలపై అపోలో ప్రకటన
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు, దక్షిణాది సినీ దిగ్గజం మణిరత్నం (62)కు గుండెపోటు వచ్చిందనే వార్తలపై అపోలో వైద్యులు స్పందిచారు. ఆయనకు గుండెపోటు రాలేదని వారు తెలిపారు. కేవలం రెగ్యూలర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వచ్చినట్టు వెల్లడించారు. కాగా, గురువారం మధ్యాహ్నం ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించినట్టు ప్రచారం జరిగింది. దీంతో సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ఆందోళన చెందారు. భారతీయ చిత్రసీమ గర్వించదగ్గ అనేక కళాత్మక చిత్రాలను మణిరత్నం తెరకెక్కించారు. నాయకుడు, దళపతి, రోజా, ముంబై, సఖి, ఓకే బంగారం, ఇద్దరు వంటి ప్రఖ్యాత సినిమాలను మణిరత్నం రూపొందించారు. త్వరలో రానున్న చెక్క చివంత వనం మూవీ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో మణిరత్నం ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ సినిమా తెలుగులో నవాబ్ పేరుతో రానుంది. రోజా, దళపతి, నాయకుడు, ఓకే బంగారం, బొంబాయి, గురు లాంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను అటు కొలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు అందించారు. -
ఆ అలవాటు నాకు లేదు..
తమిళసినిమా: ఆడవారి మాటలకు అర్థాలేవేరులే అన్నారో మహాకవి. ఇది చాలా మంది విషయంలో నిజమని అనిపించకమానదు. నటి అదితిరావునే తీసుకుంటే మణిరత్నం దర్శకత్వంలో కార్తీతో రొమాన్స్ చేసిన జాణకు ఆ చిత్రం నిరాశ పరిచినా ప్రచారం మాత్రం బోలెడు వచ్చేసింది. మణిరత్నంను పొగడ్తల్లో ముంచేయడం లాంటి భేటీలతో ఫ్రీ పబ్లిసిటీ కొట్టేసిన అదితిరావు మరోసారి ఆయన దర్శకత్వంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. కాగా తాజాగా గ్లామరస్ ఫొటోలను, ఈత దుస్తులు ధరించిన ఫొటోలను తరచూ ఇంటర్నెట్లో విడుదల చేస్తూ నెటిజన్లకు మంచి పని చెబుతోంది. కొంత విమర్శలను పోగేసుకుంటోందనుకోండి. అవకాశాల కోసమేనా ఈ ట్రిక్స్ అన్న ప్రశ్నలను లైట్‌గా తీసుకుంటోంది. అలాంటి వాటిని పట్టించుకోకపోవడంతో పాటు అసలు తనకు గ్లామరస్ దుస్తులు నప్పవని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది. ఈ అమ్మడు ఏంమంటోందో చూద్దాం. నా దుస్తులను నేనే ఎంపిక చేసుకుంటాను. హద్దులు మీరిన గ్లామర్ దుస్తులు నా శరీరాకృతికి నప్పవు. నిజం చెప్పాలంటే ధరించే దుస్తులను చూసి మనుషులను విలువ కట్టే విధానం ఇంకా సమాజంలో కొనసాగుతూనే ఉంది. నా కుటుంబం, స్నేహితులను దృష్టిలో పెట్టుకునే దుస్తులను ఎంపిక చేసుకుని ధరిస్తాను. ఇక కెరీర్ గురంచి చెప్పాలంటే ఈ ఏడాది తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చాను.అదే విధంగా తమిళం, హిందీ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నాను. ఏకకాలంలో ఎక్కువ చిత్రాలు చేసే అలవాటు నాకు లేదు. సినిమాలో నా పయనం నిదానంగానే ఉంటుంది. కాబట్టి నా మార్కెట్ తగ్గింది. అందుకే అవకాశాలు రాబట్టుకోవడానికి గ్లామరస్ చిత్రాలను విడుదల చేస్తున్నాను అని భావించనక్కర్లేదు. ఇక్కడ నేనింకా సాధించాల్సింది చాలా ఉంది అని నటి అదితిరావు అంటోంది. అయినా అంటారు గానీ ఆడవారి మాటలకు అర్థాలే వేరు కదా! నిజాలు చెబుతారా? అంగీకరిస్తారా? -
దర్శక రత్నం
-
నవాబ్... ప్యాకప్
లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘చెక్క చివంద వానమ్’ సినిమాకు సెర్బియాలో ప్యాకప్ చెప్పారు దర్శకుడు మణిరత్నం. అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, జ్యోతిక, అదితీరావ్ హైదరీ ముఖ్యతారలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘చెక్క చివంద వానమ్’. లైకా ప్రొడక్షన్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగులో ‘నవాబ్’గా రిలీజ్ చేయనున్నారు. సెర్బియా షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. శింబు మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించటానికి సెర్బియా వెళ్లింది చిత్రబృందం. శింబు పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో సినిమా మొత్తం పూర్తయింది. దాంతో ప్యాకప్ చెప్పారు మణిరత్నం. ఈ సినిమాలో అరవింద స్వామి, శింబు, విజయ్‌సేతుపతి అన్నదమ్ములుగా కనిపించనున్నారని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ అవనున్న ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: సంతోష్ శివన్. -
క్రికెట్ క్రీడలో సాధించాలనే..
తమిళసినిమా: నేటి సమాజంలో మహిళలు పురుషులకు దీటుగా దూసుకుపోతున్నారు. ఏ రంగంలోనూ తాము మగవారికి తక్కువ కాదనే విధంగా తమ సత్తా చాటుకుంటున్నారు. ఇక సినిమా కథానాయికల విషయానికొస్తే ఎలాంటి పాత్రకైనా రెడీ అంటున్నారు. ఇంతకు ముందు పాత్రల స్వభావానికి తగ్గట్టుగా మారడానికి హీరోలు మాత్రమే శిక్షణలు, కసరత్తులు చేసేవారు. ఇప్పుడు హీరోయిన్లు అలా పాత్రలకు జీవం పోయడానికి శాయశక్తులా శ్రమిస్తున్నారు. ఆ మధ్య నటి అనుష్క కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటి వాటిలో తగిన శిక్షణ పొందిన విషయం తెలిసిందే. సమంత కూడా కర్రసాములో తర్ఫీదు పొందారు. తాజాగా నటి ఐశ్వర్యరాజేశ్ క్రికెట్ క్రీడలో శిక్షణ పొందారట. కాక్కముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా అద్భుతమైన అభినయాన్ని పలికించి అందరి ప్రశంసలు అందుకున్న ఐశ్వర్యరాజేశ్‌కు ఆ తరువాత మార్కెట్ పెరిగిందనే చెప్పాలి. దీంతో అవకాశాలు తలుపుతట్టాయి. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మణిరత్నం చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతితో కలిసి నటిస్తున్న ఈ అమ్మడు ఆయనతో నటించడం సంతోషంగా ఉందని, విజయ్‌సేతుపతితో మళ్లీ మళ్లీ నటించడానికి తాను సిద్ధం అని పేర్కొన్నారు. తాజాగా ఒక బలమైన పాత్రలో నటించే అవకాశం ఐశ్వర్యరాజేశ్‌ను వరించింది. అది క్రికెట్ క్రీడాకారిణి పాత్ర కావడం విశేషం. కనా పేరుతో తెరకెక్కితున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌కు కూతురిగా నటిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన దంగల్ చిత్రంలో కుస్తీ పోటీల్లో రాణించాలన్న కోరిక నెరవేరకపోవడంతో తన కలను తన కూతుర్ల ద్వారా నెరవేర్చుకున్న బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ మాదిరిగా కానా చిత్రంలో సత్యరాజ్ క్రికెట్ క్రీడాకారుడిగా రాణించాలన్న తన కలను తన కూతురి ద్వారా నేరవేర్చుకుంటారట. నటి ఐశ్వర్యరాజేశ్‌కు క్రికెట్ గురించి పెద్దగా తెలియదట. కానా చిత్రంలో తన పాత్రలో జీవించడం కోసం ఈమె ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు డేవ్వాట్ మోర్ వద్ద శిక్షణ పొందారట. క్రికెట్ క్రీడలో పురుష ఆధిక్యమే సాగుతోంది. ఇప్పుడిప్పుడే మహిళలు ఆ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. అలా కానా చిత్రం మహిళలకు క్రికెట్ క్రీడలో సాధించాలనే ఆసక్తి అధికం అవుతుందనే అభిప్రాయాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేశాయి. -
కల నిజమైంది
దర్శకుడు మణిరత్నం సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఆయన డైరెక్షన్ స్టైల్ డిఫరెంట్. అందుకే మణిరత్నం సినిమాల్లో నటించేందుకు యాక్టర్స్ ఇష్టపడుతుంటారు. కొందరైతే అదృష్టంగా భావిస్తుంటారు. ఆ అదృష్టం దక్కినందుకు ఆనందపడుతున్నారు తమిళ నటి ఐశ్వర్యా రాజేశ్. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితీ రావ్ హైదరీ, ఐశ్వర్యా రాజేశ్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘చెక్క చివంద వానమ్’. తెలుగులో‘నవాబ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో తమ వంతు షూటింగ్స్‌ను కంప్లీట్ చేశారు ఐశ్వర్య రాజేశ్ అండ్ అరుణ్ విజయ్. ‘‘నవాబ్’ సినిమాలో నా వంతు షూటింగ్ కంప్లీటైంది. మణిరత్నంగారితో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కల నిజమైనట్లు ఉంది’’ అన్నారు ఐశ్వర్య. అంతేకాదు తమిళ హీరో శివకార్తీకేయన్ ప్రొడక్షన్స్ హౌస్‌లో రూపొందనున్న సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు ఐశ్వర్య. అరుణ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కతోన్నఈ సినిమా ఫస్ట్‌లుక్ అండ్ టైటిల్ ఎనౌన్స్మెంట్ రేపు రానుంది. -
దర్శకుడిగా మారనున్న విలక్షణ నటుడు
సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్న దక్షిణాది నటుడు అరవింద్ స్వామి. తనీ ఒరువన్ సినిమాలో ప్రతినాయక పాత్రలో ఆకట్టుకున్ అరవింద్ స్వామి తరువాత ఆ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ధృవలోనూ అదే పాత్రలో నటించి మెప్పించారు. భాస్కర్ ఒరు రాస్కెల్ సినిమాతో హీరోగానూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం శతురంగవేట్టై, నరకసూరన్, వనంగాముడి సినిమాలతో పాటు మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంద వానం సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. నటుడిగా ఫుల్ బిజీగా కొనసాగుతూనే దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్నారు అరవింద్ స్వామి. ఇప్పటికే కథ రెడీ చూసుకున్న ఈ విలక్షణ నటుడు ప్రస్తుతం స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
సాహో కాదు.. నవాబ్
తమిళ హీరో అరుణ్ విజయ్ దుబాయ్ వెళ్లారు. ఇంకేముంటుంది? ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ షెడ్యూల్ అబుదాబిలో జరుగుతోంది కదా ఆ షూట్లో పాల్గొనడానికి వెళ్లాడేమో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ‘సాహో’లో అరుణ్ నటిస్తున్నారు. అయితే దుబాయ్ వెళ్లింది మాత్రం ‘నవాబ్’ షూట్ కోసం. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితీ రావ్ హైదరీ ముఖ్య తారలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘చెక్క చివంద వానమ్’. తెలుగులో ‘నవాబ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా చెన్నై షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. నెక్ట్స్ షెడ్యూల్ దుబాయ్‌లో జరగనుంది. ‘‘ఈ సినిమాలో నా ఫైనల్ షెడ్యూల్ కోసం దుబాయ్ వెళ్తున్నాను’’ అని పేర్కొన్నారు అరుణ్ విజయ్. తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా నటించిన ‘కుట్రమ్ 23’ తెలుగులో ‘క్రైమ్ 23’ పేరుతో రిలీజ్ కానుంది. -
ఆయన దూకమంటే దూకేస్తా!
తమిళసినిమా: నేను చాలా కష్టపడే అవకాశాలు పొందాను అంటోంది నటి అదితిరావ్. ఈ బాలీవుడ్ బ్యూటీ మణిరత్నం చిత్రం కాట్రువెలియిడై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. అందులో నటుడు కార్తీతో రొమాన్స్ సన్నివేశాల్లో చాలా సన్నిహితంగా నటించి గుర్తింపు పొందింది. హిందీలోనూ నటిస్తున్న అదితిరావ్ ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న పద్మావత్ చిత్రంలోనూ కీలకపాత్రను పోషించింది. తాజాగా మణిరత్నం ఈ అమ్మడికి మరో చాన్స్ ఇచ్చారు. ఆయన తాజా చిత్రం సెక్క సివంద వానం చిత్రంలో అరవిందస్వామి, శింబులతో కలిసి నటిస్తోంది. ఇందులో నటి జ్యోతిక, ఐశ్వర్యరాజేశ్ కూడా ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సందర్భంగా నటి అదితిరావ్ తన భావాలను పంచుకుంది. అవేమిటో చూద్దాం. నేను చిన్నతనం నుంచి మణిరత్నం అభిమానిని. బొంబాయి చిత్రం చూసి అందులోని నటి మనీషాకొయిరాలలా అవ్వాలని కలలు కన్నాను. అందుకే డాన్స్‌ను నేర్చుకున్నాను. అలాంటి తరుణంలో మణిరత్నం నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. కాట్రువెలియిడై చిత్రంలో నటించే అవకాశం రావడంతో పట్టరాని సంతోషం కలిగింది. ఆయన నటీనటుల నుంచి చాలా సున్నితంగా నటనను రాబట్టుకోవడంలో దిట్ట. మణిరత్నం కిందకు దూకమన్నా ఆలోచించకుండా దూకేస్తాను. విభిన్న కథా చిత్రాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషించాలని ఆశపడుతున్నాను. సినీ కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు రావడం సులభం. అలాంటి నేపథ్యం లేనివారు ఈ రంగంలో ఎదగడం కష్టతరం. నేను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చాను. నటిగా సపోర్టు చేయడానికి ఎవరూ లేరు. చాలా కష్ట పడే అవకాశాలు అందుకున్నాను. నిజం చెప్పాలంటే నాకు టర్నింగ్ ఇచ్చే కథా పాత్ర ఇంకా అమరలేదు. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను అని నటి అదితిరావ్ పేర్కొంది. -
ఆకలి రోజుల్లో ఆపద్బాంధవుడు నాయకుడు
కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు– ఎంత మంచి కారణానికి పట్టినా.భారత దేశంలో కన్సిస్టెంట్గా ఉన్న ఒకే ఒక్క విషయం– ఆకలి. స్వాతంత్య్రం వచ్చాక ఇరవై, ముప్పై ఏళ్లకు జనాభా పెరిగిందని అందరూ అన్నారు కానీ పెరిగింది జనాభా కాదు ఆకలి. పేదరికం. సంపద అతి స్వల్పమంది చేతుల్లోకి వెళ్లిపోయింది. ఉపాధి అత్యల్పం అయిపోయింది. కనుక పని దొరకని వాళ్లంతా పెరిగిపోయిన జనాభా కింద జమ కట్టబడ్డారు. ఈ సమస్య గురించి పాలకులకు శ్రద్ధ లేదు... ఒక వేళ ఏం చేయాలనుకున్నా ఇంత పెద్ద దేశంలో ఏ పనీ తొందరగా తెమలదు. వ్యవస్థ విఫలమైన చోట సమాంతరమైన వ్యవస్థ ప్రాణం పోసుకుంటుంది. డబ్బు ఎక్కువ ఉన్న చోట దీనికి తేజం ఎక్కువ. ‘ఆర్థిక రాజధాని’ బొంబాయిలో అండర్ వరల్డ్ పురుడు పోసుకోవడానికి కారణం అదే. అందరు పేదవాళ్లు ఊరికే ఉండరు. ఆకలేసిన వాళ్లందరూ కడుపుకు తడిబట్ట చుట్టుకుని పడుకోరు. ఒకడు తెగిస్తాడు. వాడు తన అవసరాల కోసమో, అవసరమైన జనం కోసమో, నిజంగా తన మనుషులు అనే భావం వల్లో కొందరికి సాయం చేస్తాడు.అలాంటి వాడు బయటి సమాజానికి ఎలా కనిపించినా తన సమాజానికి నాయకుడిలా కనిపిస్తాడు. ఈ సినిమాలో కమలహాసన్ అలాంటి నాయకుడే. ఖద్దరు పంచె, తెల్ల చొక్కా ధరించిన రాబిన్‌హుడ్. పేదలకు పెద్ద దిక్కు. తండ్రిది మద్రాసు. యూనియన్ లీడర్. కాని ప్రభుత్వం అతణ్ణి కాల్చి పారేసింది. ఆ తండ్రి లక్షణం, తిరగబడే స్వభావం ఉన్న కమలహాసన్ బొంబాయి పారిపోతాడు. అలా పారిపోయినవాళ్లు ఎక్కడకు చేరతారు? ఆసియాలోనే అతి పెద్ద మురికివాడైన ధార్వికి చేరుతారు. కమలహాసన్ అక్కడ ఒక ముస్లిం ఇంటిలో నీడ పొందుతాడు. అక్కడే పెరుగుతాడు. ‘అటు సరుకు ఇటు చేర్చడం’ అనే విద్య ఊపిరి పోసుకుంటున్న ఆ రోజుల్లో అందులో దిగుతాడు. సముద్రం చాలా అఘాతాలతో మాత్రమే కాదు నేరాలతో కూడా నిండి ఉంటుంది. ముంబై తీరం తన గర్భంలో ఎన్నో నేరాలను దాచుకుని ఉంటుంది. కమల హాసన్ ఆ నేర ప్రపంచంలోకి అడుగు పెడతాడు. సినిమా ప్రారంభంలోనే దర్శకుడు ఒక ప్రశ్నను అడిగిస్తాడు –‘ఈ పని మంచిదా... చెడ్డదా’. దానికి జవాబు దర్శకుడే చెప్పిస్తాడు –‘నలుగురికి మేలు చేసే పని మంచిదే’. ఈ స్పష్టత ఇచ్చాక కమలహాసన్ మురికివాడ ప్రజల కోసం ఏదో ఒక తెగింపు చేస్తూనే ఉంటాడు. అందులో ఒకటి– వీరోచిత ప్రతీకారంతో నిండినది– తమను పీడిస్తున్న ఇన్స్పెక్టర్ని చంపడం. తన ప్రాంతాన్ని కబ్జా చేయాలనుకున్న సేట్ని తన్ని తగలేయడం. ఆడవాళ్లకు రక్షణ ఇవ్వడం. సాయం కోరి వచ్చే వాళ్లకు సాయం చేయడం. గణేశ్ మండపాల్లో వినాయక చవితినాడు చేతికి అందిన నోట్లను జనం మీదకు విసరడం. కమల్ ఇప్పుడు నాయకుడు. ముఖ్యంగా ఊరుగాని ఊరులో, దక్షిణాది వారని మూలకు నెట్టివేయబడ్డ తమిళులలో వారి సమస్యలు తీర్చే ఆపద్బాంధవుడు. వాళ్లు తమకు ఏ కష్టం వచ్చినా వ్యవస్థను ఆశ్రయించరు. ఈ సమాంతర వ్యవస్థనే ఆశ్రయిస్తారు. తక్షణమే జవాబు దొరికే దర్బారు అది. కాని కింద నీటిలో ఉండే చేప అక్కడక్కడే తిరుగాడాలి. పై నీటికి ఎగబాకితే అక్కడ మొసళ్లుంటాయి. షార్క్‌లు కాచుకుని ఉంటాయి. బస్తీ స్థాయి నాయకుడి నుంచి కమలహాసన్ ఇంకా ఎదుగుదామని చూస్తాడు. షిప్‌యార్డ్ మీద జెండా ఎగరేయాలని చూస్తాడు. కాని అప్పటికే అక్కడ పాతుకుపోయి ఉన్నవారు తన ప్రయోజనాలకు అడ్డు తగిలితే ఊరుకుంటారా?కమలహాసన్ భార్య తుపాకీ బుల్లెట్లు దిగబడి మరణిస్తుంది.అంతేనా?ఇలాంటి పనుల వల్లే చెట్టంత కొడుకు మరణిస్తాడు.సొంత మనుషులు పోయినప్పుడు ప్రాణంలా చూసుకునే జనం ప్రాణం పోస్తారు. కమలహాసన్ తట్టుకుని నిలబడగలడు. కాని అతని కూతురు? ఆమె తండ్రిని అసహ్యించుకుంటుంది. ఈ పనులు మానేయమంటుంది. చివరకు అతణ్ణే విడిచిపెట్టి వెళ్లిపోతుంది.చుక్కానిని పారేసి ఓడ ఎక్కిన మనిషి గమ్యం లేని ఏదో ఒక వడ్డుకు చేరుకోవాలిగాని ఎక్కిన తీరానికి కాదు. ఇప్పుడు కమలహాసన్ చేస్తున్నది పులి మీద సవారి. దిగలేడు. వెనక్కి రాలేడు.అప్పటికే అతడి నేర ప్రపంచం పెద్దదైపోయింది. పెద్దవాడైపోయాడు.కాని వ్యవస్థ కూడా చాలా గమ్మత్తుది. అది తనకు ప్రయోజనాలు నెరవేరే వరకూ సమాంతర వ్యవస్థలను అంగీకరిస్తుంది. తనను కూడా దాటేస్తే.. తన చేతుల్లో లేనంత స్థాయికి చేరుకుంటే అప్పుడు బూజు పట్టిన తుపాకీని తళతళ మెరిపిస్తుంది. ఇప్పుడు కమలహాసన్ మీద ఒక పోలీసు ఆఫీసరు పులిలా వచ్చి పడతాడు. అతడి మనుషులను లోపలేస్తాడు. వ్యాపారాలు బంద్ చేయిస్తాడు. కమల హాసన్‌ను వెంటాడతాడు. చివరకు కమలహాసన్ లొంగిపోతాడు. కాని ఇలాంటి మనిషికి వ్యతిరేకంగా సాక్ష్యం ఉంటుందా?ఏమీ ఉండదు.కమలహాసన్ కోర్టు నుంచి నిర్దోషిగా బయటపడ తాడు.ఇది ప్రకృతి అంగీకరించని నియమం. కత్తి పట్టినవాడు కత్తితోనే పోవాలి. కథ సుఖాంతమైన కమలహాసన్ ఏ ఇన్స్పెక్టర్నైతే తాను చంపాడో ఆ ఇన్స్పెక్టర్ కొడుకు చేతిలోనే హతమవుతాడు.కథ ముగుస్తుంది.ఎలాంటి కథ ఇది? ఎంత రోమాంచితమైనది. జీవితంలోని సకల ఆటుపోట్లను చూసినది. ఒక మనిషి తెగబడి చూడగలిగిన జీవితాన్నంతా చూపించగలిగినది.ఇది కొందరి జీవితం.ఎంతో మందికి పనికి వచ్చిన కొందరి జీవితం.కాని వ్యవస్థను దాటిన జీవితం ఇల్లాగే ముగుస్తుంది.ఇవాళ దేశం అభివృద్ధి చెందింది. ఉపాధి పెరిగింది. ఆకలి అలాగే ఉంది. సముద్రం ఒడ్డున లైట్‌హౌస్ వ్యవస్థ అంగీకారం కలిగిన మార్గాన్ని చూపిస్తుంటుంది.కాని ఈ ఆకలి నశించకపోతే ఇదిగో ఇవాళ, రేపు కూడా ఒక దివిటీ నేరానికి దారి చూపిస్తూనే ఉంటుంది. ఒక కాలంలో వెలిగి ఆరిపోయిన దివిటీ కథ– ఈ కథ– నాయకుడు. నాయకన్ 1987లో మణిరత్నం తీసిన క్లాసిక్ ‘నాయకన్’. తెలుగులో ‘నాయకుడు’గా విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఒక స్ట్రయిట్ ఫిల్మ్ చూసిన అనుభూతి కలగడానికి కారణం స్రవంతి మూవీస్ వారు పెట్టిన శ్రద్ధ కావచ్చు. రాజశ్రీ ప్రతిభ కావచ్చు. అన్నింటికి మించి మొదటి ప్రశంస చేయాల్సింది ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంనే. కమల్‌కు ఆయన చెప్పిన డబ్బింగ్ ఎంతో ప్రతిభావంతమైనది. డబ్బింగ్ ఆర్టిస్టులకు ఈ ఒక్క సినిమాలో ఎస్.పి చూపిన వేరియేషన్సే పెద్ద పాఠాలు. ఇది ముంబైలో స్థిరపడ్డ తమిళ అండర్ వరల్డ్ డాన్ ‘వరదరాజ ముదలియార్’ జీవితం ఆధారంగా తయారైంది. సినిమా చూసిన వరద రాజ ‘మరీ అంత మంచివాణ్ణి కానులే’ అని మణిరత్నంతో చిన్న చిర్నవు నవ్వాడట. డాన్ జీవితాన్ని, హింసను గ్లోరిఫై చేసిందనే విమర్శ ఈ సినిమా ఎదుర్కొన్నా జనం పట్టించుకోలేదు. ‘గాడ్‌ఫాదర్’ ప్రభావం దీని మీద ఉన్నా మణిరత్నం అదేం లేదని అంటాడు. ఇందులోని చాలా సన్నివేశాలు కాలానికంటే ముందే తీసినవి. పిసి శ్రీరామ్ పనితనం గమనించి చూడాలి తప్ప చెప్పలేం. ఇందులోని కొన్ని షాట్స్‌ను పోలినవి ‘శివ’లో చూస్తాం. శరణ్యకు ఇది తొలి సినిమా. ఇళయరాజా చేసిన ఆర్.ఆర్, పాటలూ గొప్పవి. ఇందులో ‘నీ గూడు చెదిరింది’... ఇప్పటికీ కామెడీ సన్నివేశాల్లో ఉపయోగిస్తుంటారు. కమలహాసన్‌కు ఈ సినిమా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తెచ్చింది. కొడుకు చచ్చిపోయినప్పుడు కమల్ ఏడ్చే సన్నివేశం గొప్ప నటనగా చెప్పుకున్నారు. ఇలాంటి సినిమాలో నటించాలన్న రజనీకాంత్ తపన చాలా ఏళ్లకు ‘కబాలి’తో గాని తీరలేదు. -
పవర్ఫుల్ పాత్రలో..
తమిళసినిమా: రీఎంట్రీలోనూ తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి జ్యోతిక. ఇంతకుముందు సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్‌ల నుంచి అజిత్, విజయ్, సూర్య,శింబు వరకూ జతకట్టి కథానాయకిగా రాణించిన ఈ నటి, నటుడు సూర్యను ప్రేమ వివాహం చేసుకుని నటనకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సంసార జీవితంలో సెటిల్ అవుతారనుకున్న వారికి షాక్ ఇచ్చే విధంగా ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత 36 వయదినిలే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్ర విజయానందంతో వరుసగా నటించడం మొదలెట్టిన జ్యోతిక ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుని నటిస్తున్నారు. అలా నటించిన తాజా చిత్రం నాచియార్ మంచి సక్సెస్‌నే అందుకుంది. రీఎంట్రీ తరువాత జ్యోతిక బయట చిత్ర నిర్మాణ సంస్థలో నటించిన తొలి చిత్రం ఇదే. అదేవిధంగా తాజాగా మణిరత్నం దర్శకత్వంలో సెక్క సెవంద వానం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది మల్టీస్టారర్ చిత్ర. అంతే కాదు తమిళం, తెలుగు, మలయాళం అంటూ బహుభాషా చిత్రం కూడా. మణిరత్నం తన మద్రాస్ టాకీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో నటుడు అరవిందస్వామి రాజకీయనాయకుడిగానూ, శింబు ఇంజినీర్‌గా, విజయ్‌సేతుపతి పోలీస్‌ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తున్నారు. ఇక జ్యోతిక పురుషాధిక్యతను వ్యతిరేకించే ఒక శక్తి వంతమైన స్త్రీ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరోసారి ఈమె నట విశ్వరూపన్ని చూడవచ్చు అనేది కోలీవుడ్ వర్గాల టాక్. మరో ముఖ్య పాత్రలో నటి ఐశ్యర్యరాజేశ్ నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, మణిరత్నం ఆస్థాన సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలను కడుతున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సెక్క సెవంద వానం చిత్రం ఈ ఏడాదిలోనే తెరపైకి వచ్చే అవకాశం ఉంది. చాలా కాలం తరువాత మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. -
అది ప్రేమ కాదు
సాక్షి, సినిమా : నటి త్రిషపై తనకున్నది ప్రేమ కాదు అన్నారు సంచలన నటుడు శింబు. సంచలనాలకు మారు పేరు శింబు అన్నంతగా వాసికెక్కిన ఈ నటుడు అన్భానవతన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం తరువాత మరో చిత్రంలో నటించలేదు. చాలా గ్యాప్ తరువాత ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటిస్తున్నారు. ఈ దర్శకుడు శింబును హీరోగా ఎంపిక చేసుకోవడం కూడా సంచలనమే. శింబు ఇంతకుముందు నటి త్రిషతో కలిసి రెండు చిత్రాల్లో నటించారు. అందులో ఒకటి విన్నైతాండి వరువాయా చిత్రం. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అంతే కాదు శింబు, త్రిషల గురించి వదంతులు బాగానే హల్చల్ చేశాయి. తాజాగా విన్నైతాండి వరువాయా చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి దర్శకుడు గౌతమ్‌మీనన్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నటుడు మాధవన్‌ను హీరోగా ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై నటుడు శింబు ఇటీవల ఒక ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో త్రిష గురించి అడిగిన ప్రశ్నకు ఆమె తనకు చిన్నతనం నుంచి తెలుసని అన్నారు. త్రిష నటి అవుతుందని ఊహించలేదన్నారు. త్రిష గురించి చెప్పాలంటే తను ఎలాంటి గర్వం చూపించదు. ఏ విషయం గురించి అయినా తనతో పంచుకుంటుందని చెప్పారు. అయితే తమ మధ్య ఉన్నది ప్రేమ కాదు, స్నేహం కూడా కాదని అన్నారు. అభిమానం, ఆదరణ అని ఘనంగా చెప్పగలనని అన్నారు. -
అదితిరావ్‌కు మళ్లీ లక్కీచాన్స్!
తమిళసినిమా: మణిరత్నం చిత్రంలో మరోసారి నటించడానికి నటి అదితిరావ్ హైదరి సిద్ధమవుతోంది. ఇంతకు ముందు మణరత్నం తెరకెక్కించిన కాట్రువెలియిడై చిత్రంలో కార్తీకి జంటగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అయినా తన తాజా చిత్రంలో అదితిరావ్‌ను మణిరత్నం తీసుకున్నారనేది తాజా సమాచారం. ఈ ప్రఖ్యాత దర్శకుడు తన తాజా చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కథా చర్చల కోసమే చాలా కాలం తీసుకున్నారు. అంతే కాదు చిత్రంలో పలువురు స్టార్ హీరోలను నటింçపజేస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రంలో ఇప్పటికే విజయ్‌సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్, అరవిందస్వామి, జ్యోతిక, ఐశ్వర్యరాజేశ్‌లను ఎంపిక చేశారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అదితిరావ్ కూడా ఈ జాబితాలో చేరిందని సమాచారం. అయితే ఈ అమ్మడు చిత్రంలో ఏ హీరోతో రొమాన్స్ చేయనుందన్నది తెలియాల్సి ఉంది. అదే విధంగా చిత్ర వివరాలను దర్శకుడు మణిరత్నం ఇంకా అధికారిక పూర్వంగా ప్రకటించలేదన్నది గమనార్హం. ఇక సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ ఫస్ట్‌కాపీ విధానంతో మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని నిర్మించడానికి సిద్ధమైంది. అయితే గత డిసెంబర్లోనే ఈ భారీ చిత్రం సెట్ పైకి వెళ్లాల్సింది. కారణాలేమైనా షూటింగ్ ఆలస్యమైంది. త్వరలోనే చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం శింబు గెడ్డం, మీసం పెంచి చాలా డిఫరెంట్‌గా కనిపించడానికి రెడీ అయ్యారు. -
నా తప్పూ ఉంది!
తమిళసినిమా: నా తప్పు లేదని అనడం లేదు. ఉంది అయితే..అని వ్యాఖ్యానించారు సంచలన నటుడు శింబు. ఆయనపై నిర్మాత మైఖెల్‌రాయప్పన్ అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రానికి నష్టపోయిన రూ.20 కోట్లు చెల్లించాలంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఆ వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. శింబుపై రెడ్ కార్డ్ వేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు సంతానం హీరోగా నటించిన చక్క పోడు పోడు రాజా చిత్రాన్ని నటుడు వీటీవీ, గణేశన్ నిర్మించారు. సేతురామన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా నటుడు శింబు సంగీత దర్శకుడగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక ట్రిబుల్కేన్లోని కలవానర్ ఆవరణలో జరిగింది. ఆ కార్యక్రమంలో నటుడు ధనుష్ ఆడియోను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తానిక్కడికి శింబు ఆహ్వానం మేరకే వచ్చానన్నారు. తామిద్దరి మధ్య స్నేహమే ఉందన, కొందరు అనుకుంటున్నట్లు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. తమ మధ్య ఉన్న వాళ్లకే సమస్యలు ఉన్నాయని, వాళ్లే తమ మధ్య సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. శింబు ఆయన అభిమానులకోసం ఏడాదికి రెండు చిత్రాలైనా చేయాలని, ఆయన అభిమానుల తరఫున తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. మణిరత్నం నా అభిమానేమో అనంతరం నటుడు శింబు మాట్లాడుతూ తన మిత్రుడు సంతానం కోరిక మేరకే ఈ చిత్రానికి సంగీతాన్ని అందించానన్నారు.అతని ఎదుగుదలకు తానెప్పుడూ పక్కాబలంగా ఉంటానని అన్నారు. ఇటీవల తన గురించి చాలా చర్చ జరిగిందని, అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం నిర్మాత తనపై ఆరోపణలు చేశారని అన్నారు. తాను తప్పు చేయలేదని చెప్పడం లేదని, అయితే ఆయన చిత్ర షూటింగ్ సమయంలోనో, విడుదలకు ముందో, ఆ తరువాతో ఈ ఆరోపణలు చేస్తే సమంజసంగా ఉండేదని, చిత్రం విడుదలైన ఆరు నెలలకు ఎవరో చెబితే రచ్చ చేయడం ఏమిటని ప్రశ్నించారు.తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకుంటున్నానని అన్నారు. ఇకపోతే తానిప్పుడు మణిరత్నం చిత్రంలో నటించనున్నానని, ఆయన కూడా తన అభిమానో ఏమోగానీ, ఆ చిత్రం నుంచి తనను తొలగించలేదని తెలిపారు.ఈ నెల 20 నుంచి చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు మణిరత్నం చెప్పారని శింబు తెలిపారు. -
మణిరత్నం సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటి
దక్షిణాది నటీనటులకు మణిరత్నం సినిమాలో నటించటం ఓ కల. అందుకే హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమా అంటే చాలు ఎవరైన ఓకె చెప్పేస్తారు. సీనియర్ నటుల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ మణిరత్నం సినిమాలో చాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి ఓ అరుదైన అవకాశం టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ తలుపు తట్టింది. భర్త మరణం తరువాత నటనకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ నటి చాలా కాలం తరువాత ఓ తమిళ సినిమాకు అంగీకరించింది. మణిరత్నం సినిమా కావటం వల్లనే జయసుధ ఆ సినిమాలో నటించేందుకు అంగీకరించిందట. చెలియా సినిమాతో నిరాశపరిచిన మణిరత్నం ప్రస్తుతం శింబు, అరవింద్ స్వామి, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతిల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. జ్యోతిక మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ నటించనుంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సఖి సినిమాలో జయసుధ నటించింది. తిరిగి ఇన్నేళ్ల తరువాత మరోసారి మణి దర్శకత్వంలో నటించనుంది. ఇటీవల ఊపిరి సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించిన జయసుధ మరోసారి ఆసక్తికరమైన సినిమాలో కోలీవుడ్ ఆడియన్స్‌ను అలరించనుంది. -
మనసులో తాళిబింబం మౌనరాగం
పెళ్లయి అప్పటికి నాలుగంటే నాలుగు రోజులు కూడా కాలేదు. ఆమెను తీసుకుని అతడు బజారుకు వచ్చాడు. కొత్త భార్య. ఏదైనా కానుక ఇస్తే బాగుండని భావన. ‘ఏం కావాలి?’ అడిగాడు. ‘ఏం వద్దు’ అందామె. ‘మొదటిసారి తీసుకువచ్చాను. ఏం కావాలన్నా అడుగు’ అన్నాడు. ‘ఏం అడిగినా కొనిస్తారా?’ ఎదురు ప్రశ్నించింది. ‘నా శక్తికి మించనిదైతే కొనిస్తాను’ అన్నాడు. ‘అయితే నాకు విడాకులు కావాలి. కొనివ్వగలవా’ అందామె. అక్కడ నిశ్శబ్దం. చాలా విస్ఫోటనాలకు చప్పుడు ఉండదు. అతడి హృదయం నిశ్శబ్దంగా అతి సూక్ష్మ స్థాయిలో కూడా ముక్కచెక్కలై వేయి వక్కలయ్యింది. అతడు ఆమెకు పట్టీలు కొన్నాడు. మువ్వలు ఉన్న తెల్లగా మెరుస్తున్న వెండి పట్టీలు. భార్య పాదాలకు పట్టీలు తొడిగి ఒక ముద్దు పెట్టడం ఏ భర్తకైనా మురిపెం. ‘నీ కోసం తెచ్చాను. తీసుకో’ అని చేయి పట్టుకున్నాడు. ‘చేయి వదలండి’ అందామె. ‘ఏం నేను పట్టుకోకూడదా?’ అని అడిగాడు. ‘అలా అని కాదు. నాకు బాగనిపించడం లేదు’ ‘ఏం?’ ‘మీరు పట్టుకుంటే గొంగళిపురుగు పాకినట్టుగా ఉంది’ అతడు ఒకడుగు వెనక్కి వేశాడు. ఆమె కోసం అతడు అగ్ని చుట్టూ ఏడు అడుగులు వేశాడు. ఇప్పుడు ఏ అడుగు వేయాలి? ముందుకా వెనక్కా? అది ఢిల్లీ. రేవతిని పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టాడు మోహన్. కాని కాపురం చేదుగా ఉంది. చక్కెర లేని టీలా ఉంది. కాదు పాలు లేని టీలా ఉంది. కాదు కాదు అసలక్కడ టీయే లేదు. ఉన్నది ఖాళీ కప్పే. ఆమె మనసులో అతడు లేడు. అతడు కట్టిన తాళి లేదు. ఆమె ఒక కట్టె ముక్కలా అతడికి తల వంచింది. పెద్దలు పంపితే రైలెక్కి ఢిల్లీ చేరుకుంది. విడాకులిచ్చి పంపించేస్తే వెళ్లిపోతానని అంటుంది. ఇంకొకడైతే చెంప పగలగొట్టి ఉండేవాడేమో. అతడు మాత్రం ఎంతో ఓర్పుగా ‘ఎందుకు?’ అని అడుగుతాడు. ఆమెకు ఒక ప్రేమ కథ ఉంది. ఇంకా ఆమె మనసులో సజీవంగా ఉన్న ప్రేమ కథ. ఏనాడో అందులోని ప్రేమికుడు మరణించిన ప్రేమ కథ. ఆమె కాలేజీలో చదువుతుండగా కార్తీక్ పరిచయయ్యాడు. అతి చల్లటి నీళ్లు తల మీద కుమ్మరించినట్టుగా ఉక్కిరిబిక్కిరి చేసే పరిచయం అతడిది. అతడు చురుకైన కుర్రాడు. విలువలున్న కుర్రాడు. నవ్వుతూ ఉండే కుర్రాడు. నిజంగా విల్లులా ఉండే కుర్రాడు.ఆమెతో కాఫీ తాగడానికి వెళ్లి హోటల్లో పక్క టేబుల్ మీద తండ్రిని చూసి ఆమె భయపడుతుంటే ‘మిస్టర్ చంద్రమౌళి’ అంటూ ఆ తండ్రిని ధైర్యంగా పిలిచి ఆమెను దడిపించేంత అల్లరి కుర్రవాడు. లైబ్రరీలో ఆమెకు ‘ఐ లవ్ యూ’ చెప్తే.. ‘వెళ్లి మైక్ పెట్టి ఊరంతా చెప్పుకోపో’ అని ఆమె చికాకు పడితే నిజంగానే మైక్ పెట్టి ఊరంతా చెప్పడానికి సిద్ధమైన దూకుడు కుర్రవాడు. భూతమైతే వీణ్ణి సీసాలో బంధించవచ్చు. కాని ఒళ్లంతా, హృదయమంతా నిండిపోయే ఉత్సవం అయితే ఎలా ఊడపెరకడం? తీసి పారేయడం. ఆమె అతణ్ణి ప్రేమించింది. ఆవేళ రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలనుకుంది. కాని ఆ ఆఫీసు మెట్ల మీదే అతడు బుల్లెట్ దెబ్బకు కుప్పకూలాడు. ఆమె కళ్లముందే కన్నుమూశాడు. ఆ బింబం ఆమెలో అలాగే ఉండిపోయింది. ఫ్రీజ్ అయ్యింది. దాని మీద ఏ కొత్త బింబమూ రావడం లేదు. ఇప్పుడు వచ్చిన భర్త బింబం అసలే ముద్ర పడటం లేదు. అదీ ఆమె సమస్య. ఆ సమస్యను చెప్పుకుంది. అతడేం చేయాలి? అయిష్టంగా ఇచ్చిన అమృతం కూడా విషమే. మనసు లేని భార్యతో సంసారం శవంతో సంసారమే. అతడు ఆమెను గౌరవించదలుచుకున్నాడు. ఆమె కోరిన విడాకులు ఇవ్వదలిచాడు. కాని అందుకు సంవత్సరకాలం గడువు ఉంటుందని చట్టం చెప్పింది. ఈ సంవత్సర కాలం వాళ్లిద్దరూ ఒకే కప్పు కింద ఉండాలి. కాని భార్యాభర్తలుగా మాత్రం కాదు. అపరిచితుల్లాగానే. అతడు ఆ మేరకు సిద్ధమవుతాడు. ఆమె నుంచి పూర్తిగా డిటాచ్ అయిపోతాడు. తన పనులు తాను. తన తిండి తాను. తన పక్క తాను. ఉన్నప్పుడు విలువ తెలియదు. కోల్పోతున్నప్పుడే తెలుస్తుంది. ఆమెకు మెల్లమెల్లగా ఆమె ఏం కోల్పోతున్నదో అర్థమవుతుంది. అతడు దూరమయ్యే కొద్దీ అతడి మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఎంత చక్కనివాడు. సంస్కారవంతుడు. తన సంతోషం కోసం సహనం పాటించినవాడు. అంతకుమించి తనను ఎంతో అభిమానిస్తున్నవాడు. కాని అప్పటికే విషయం చేయి దాటిపోయింది. సంవత్సరం గడిచిపోయింది. విడాకులు చేతికి వచ్చేశాయి. అతడు దగ్గరుండి ట్రైన్ కూడా ఎక్కించేశాడు.ట్రైన్ బయలుదేరింది. కొందరికి ట్రైన్ తప్పితే జీవితం తప్పుతుంది. కాని ఆమెకు ఈ ట్రైన్ ముందుకెళితే జీవితం తప్పుతుంది.మనసులో పాత బింబం చెరిగిపోయింది. భర్త బింబం సంపూర్ణంగా స్థిరపడిపోయింది. ఆమెకు అతడు కావాలి.చైన్ లాగడం.. ట్రైన్ ఆగడం... గతం ఆ ఇనుప చక్రాల కింద నలిగిపోయి కొత్త జీవితానికి పచ్చ జెండా ఊపడం... ఒక మనోహరమైన జీవితం ఇప్పుడే మొదలైంది. మణిరత్నం తొలి సక్సెస్ 1986లో మణిరత్నం ఐదవ సినిమాగా వచ్చిన ‘మౌనరాగం’ అతడికి తొలి సక్సెస్ నమోదు చేసింది. ‘మౌనరాగం’తోనే మొదటిసారిగా మణిరత్నం పి.సి.శ్రీరాం జోడి ఖరారైంది. ఆ తర్వాత ఆ జంట ఎంత మేజిక్ చేసిందో తెలుసు. రేవతి స్థానంలో మొదట నదియాను, సుప్రియా పాఠక్‌ను అనుకున్నారు మణిరత్నం. కాని ఆ పాత్ర రేవతికి రాసి పెట్టి ఉంది. ‘పరిచయం లేని భార్యాభర్తలు ఎలా ఒకరికొకరు అడ్జస్ట్ అవుతారు’ అనే పాయింట్ తీసుకుని రాసుకున్న ఈ కథలో చివరి నిమిషంలో కార్తీక్ ఎపిసోడ్ జత పడింది. సినిమాలో నిజంగా మెరిసింది ఈ ఎపిసోడే. రేవతి పక్కింటి సిక్కుకి తప్పుల తెలుగు నేర్పించడం మంచి హాస్యం. ఇక ఇళయరాజా చేసిన ‘చిన్ని చిన్న కోయిలల్లే’, ‘మల్లెపూల చల్లగాలి’, ‘చెలి రావా’ పాటలు పెద్ద హిట్స్. – కె. -
చెన్నై టు ముంబయ్ వయా హైదరాబాద్!
మణిరత్నం, గౌతమ్ మీనన్... ఇద్దరూ ఇద్దరే! ఎలాంటి కథతోనైనా, ఏ నేపథ్యంలోనైనా సిన్మాలు తీయగల సత్తా ఉన్న దర్శకులు. ‘అర్జున్‌రెడ్డి’ అలియాస్ విజయ్ దేవరకొండ... ఒక్క సిన్మాతో ఎలాంటి పాత్రలోనైనా నటించగలననే నమ్మకం కలిగించిన నటుడు. ఇప్పుడీ హీరోపై ఈ దర్శకులిద్దరి కన్ను పడిందట! విజయ్‌తో సినిమాలు తీయాలని మణిరత్నం, గౌతమ్‌మీనన్ కథలు రెడీ చేస్తున్నారట! ఆల్రెడీ చెన్నైలో ఆ ఇద్దరితో వేర్వేరుగా ఈ హీరో కలిశారని కోడంబాక్కమ్ వర్గాల సమాచారమ్. ఓ పక్కన తమిళ దర్శకులు విజయ్ కోసంప్రయత్నిస్తుంటే... ముంబయ్ నుంచి కూడా ఈ హీరోకి కబురొచ్చిందట! ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్, దర్శకుడు బిజోయ్ నంబియార్ తదితరులు విజయ్‌తో డిస్కషన్స్ చేస్తున్నారట! సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌వర్మకి కూడా విజయ్‌తో ఓసినిమా తీయాలనుందట! వీళ్లిద్దరూ ముంబయ్‌లో ఓసారి కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో గీతా ఆర్ట్స్, వైజయంతి మూవీస్, యూవీ క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు నిర్మిస్తున్న సినిమాల్లో విజయ్ నటిస్తున్నారు. మరి, ఈ బిజీ షెడ్యూల్లో నెక్ట్స్ సిన్మా ఎవరికి కమిట్ అవుతారో? వెయిట్ అండ్ సీ!! -
అర్జున్ రెడ్డికి అద్భుతమైన అవకాశం
పెళ్లి చూపులు సినిమాతో తొలి సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాతో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఈ సినిమా సక్సెస్ తరువాత అంతా విజయ్‌ని అర్జున్ రెడ్డిఅనే పిలుస్తున్నారు. విజయ్ ఇంతటి భారీ క్రేజ్ సాధించి పెట్టిన అర్జున్ రెడ్డి సినిమా ఇప్పుడు మరో గోల్డ్ ఛాన్స్ కూడా అందించిందన్న ప్రచారం జరుగుతోంది. సౌత్ ఇండస్ట్రీలో మాత్రమేకాదు ఇండియన్ సినిమాలోనే మణిరత్నం సినిమాలో నటించటం ప్రతీ నటుడి కల. అయితే అలాంటి కల త్వరలోనే విజయ దేవరకొండ విషయంలో నిజం కాబోతోందట. ఇటీవల అర్జున్ రెడ్డి సినిమాను చూసిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం, విజయ్ నటనపై ప్రశంసలు కురిపించినట్టుగా తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు విజయ్ దేవరకొండ హీరో మణిరత్నం ఓ సినిమా రూపొందించాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు మరో అరడజను చిత్రాలు విజయ్ చేతిలో ఉన్నాయి. మణి రత్నం శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఫాజిల్ ల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యే లోపు విజయ్‌తో మణి చేయాలనుకుంటున్న సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
మణిరత్నం చిత్రంలో శింబు
తమిళసినిమా: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన కాట్రువెలియిడై చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. తాజాగా ఒక ఆసక్తికరమైన ప్రచారం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మణిరత్నం ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. అదే ఇప్పుడు వాస్తవం కాబోతోందనిపిస్తోంది. ఆయన తాజా చిత్రంలో విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్నారని, అదే విధంగా కథానాయకిగా ఐశ్వర్యరాజేశ్ నటించనున్నారని, మరో ప్రధాన పాత్రలో నటి జ్యోతిక, అదే విధంగా అరవిందస్వామి, ఫాహద్ ఫాజిల్ వంటి ప్రముఖ నటీనటులు కూడా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ టీమ్‌లోకి సంచలన నటుడు శింబు వచ్చి చేరారు. అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం నిరుత్సాహపరిచిన తరువాత శింబు నటించే చిత్రం ఏమిటని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకిది సంతోషాన్నిచ్చే వార్తే అవుతుంది. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్నారు. పాటలను వైరముత్తు రాస్తున్నారట. ఈ చిత్రంతో మణిరత్నం, ఏఆర్.రెహ్మాన్, వైరముత్తుల కలయిక అన్నది రోజా చిత్రం నుంచి అంటే 25 ఏళ్లుగా కొనసాగుతోందన్నది గమనార్హం. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రానికి సంతోష్‌శివన్ ఛాయాగ్రణను అందించనున్నారని సమాచారం. రజనీకాంత్ నటించిన దళపతి చిత్రంతో ప్రారంభమైన మణిరత్నం, సంతోష్‌శివన్‌ల కాంబినేషన్ ఆ తరువాత రోజా, ఇరువర్, ఉయిరే, రావణన్ చిత్రాల వరకూ సాగింది. తాజా చిత్రం ఆరోది అవుతుందన్న మాట. ఈ చిత్రాన్ని మణిరత్నం జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. -
వివాదాస్పద హీరోతో మణిరత్నం
మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న మణిరత్నం ప్రాజెక్టులో వివాదాస్పద హీరో శింబు కూడా నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో నలుగురు హీరోలు ఉంటారని వార్తలు కూడా వచ్చాయి. ఆ పాత్రల కోసం విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌లను మణిరత్నం సంప్రదించినట్లు తెలుస్తోంది. మణిరత్నం సినిమాలో తన పాత్ర గురించి ఇంతకు ముందే జ్యోతిక మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే నానితో పాటు ఐశ్వర్య రాజేశ్ పాత్రలు కూడా అధికారికంగా ఓకే అయ్యాయి. విజయ్ సేతుపతికి కాల్షీట్లు ఖాళీగా లేకపోవడంతో ఈ ప్రాజెక్టుకు అంగీకరించే అవకాశం లేనట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో నటీనటుల గురించి వెల్లడించడానికి చిత్రయూనిట్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సంతోష్ శివన్ దీనికి ఛాయాగ్రాహకుడిగా, ఏఆర్ రెహ్మన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్య రాజేశ్
మిళసినిమా: ఎస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్ ఐశ్వర్యరాజేశ్‌ను వరించింది. హీరోయిన్ పాత్రే కావాలంటూ అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా తనను వెతుక్కుంటూ వచ్చిన పాత్రల్లో నటిస్తూ తన సత్తా చాటుకుంటున్న నటి ఐశ్వర్యరాజేశ్. కాకాముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా అద్భుతంగా నటించి ప్రశంసలు పొందిన ఈ సహజ నటికి ఆ తరువాత స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్ సరసన ధ్రువనక్షత్రం, ధనుష్‌తో వడచెన్నై చిత్రాల్లో నటిస్తున్న ఐశ్వర్యరాజేశ్ బాలీవుడ్లో నటించిన డాడీ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. వీటితో పాటు మలయాళంలోనూ అడుగుపెట్టిన ఐశ్వర్యరాజేశ్‌కు తాజాగా మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. కాట్రువెలియిడై చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా దర్శకుడు మణిరత్నం తాజా చిత్రానికి రెడీ అయ్యారు. ఇందులో నటించే నటీనటుల గురించి ఇంతకు ముందు రకరకాల ప్రచారం జరిగినా తాజాగా నటి ఐశ్వర్యరాజేశ్ నటించే విషయం పక్కాగా ఓకే అయ్యిందని ఆమె స్పష్టం చేశారు. అంతే కాదు ఇందులో నటి జ్యోతిక కూడా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా నటుడు విజయ్‌సేతుపతి, టాలీవుడ్ హీరో నాని ఈ క్రేజీ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
మణిరత్నం చిత్రంలో కీర్తీసురేష్?
తమిళసినిమా: మణిరత్నం తన చిత్రాల్లో కథానాయికలను అందంగా చూపిస్తారు. అదే సమయంలో వారి కథా పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఐశ్వర్యారాయ్ నుంచి వర్ధమాన నటీమణుల వరకూ మణిరత్నం చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తారు. మణిరత్నం గత చిత్రం కాట్రువెలియిడై. కార్తీ, అతిథిరావు జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల మధ్య మిశ్రమ స్పందననే అందుకోగలిగింది. కాగా మణి తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. ఈ విషయంలో రకరకాల ప్రచారాలు హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్‌తో చిత్రం అంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత విజయ్‌సేతుపతి హీరోగా చిత్రం మొదలవ్వనుందనే ఊహాగానాలు తెరపైకొచ్చాయి. తాజాగా మణిరత్నం మాస్ మసాలా ఎంటర్టెయినర్గా మల్టీస్టారర్ చిత్రానికి రెడీ అవుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో దుల్కర్సల్మాన్, అరవిందస్వామి, ఫాహత్ ఫాజిల్ ముగ్గురు హీరోలు నటించనున్నారని, వారికి జంటగా ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒక నాయకిగా నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారని తాజా సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
మణిరత్నం దర్శకత్వంలో మాధవన్?
తమిళసినిమా: మణిరత్నం దర్శకత్వంలో నటుడు మాధవన్ నటించనున్నారా? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాధానం వస్తోంది. మణిరత్నం, మాధవన్లది హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులకు అనుభూతిని కలిగించాయి. మణిరత్నం దర్శకత్వం వహించనున్న ఈ ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ తేజ, మాలీవుడ్ నటుడు ఫాహిద్ ఫాజిల్ కలిసి నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ లో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో మాధవన్‌ను తన చిత్రంలో నటింపజేసే ప్రయత్నంలో మణిరత్నం ఉన్నట్లు సమాచారం. మణిరత్నం తన తాజా చిత్రంలో మాధవన్‌ను నటింపజేయాలనుకుంటున్నారా, ఆ తరువాత చిత్రం గురించి చర్చలు జరుపుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది. విక్రమ్ వేదా చిత్రంలో పోలీస్ అధికారిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న మాధవన్ ప్రస్తుతం ఒక తమిళ హిందీ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. -
స్పీడు పెంచిన చెర్రీ
వరుసగా మూస మాస్ సినిమాలతో బోర్ కొట్టించిన చెర్రీ కొద్ది రోజులుగా సినిమాల సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. బ్రూస్ లీ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని ధృవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చెర్రీ, ఆ సినిమా తరువాత కూడా మరోసారి బ్రేక్ తీసుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 లోనటిస్తున్న చరణ్ ఇప్పుడు స్పీడు పెంచాడు. రంగస్థలం 1985 సెట్స్ మీద ఉండగానే వరుసగా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. సూపర్ హిట్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తన సొంతం నిర్మాణ సంస్థ కొణిదల ప్రొడక్షన్ కంపెనీలో ఓ సినిమా చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించాడు చెర్రీ. ఆ సినిమా తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలోనూ చరణ్ సినిమా ఉంటుందన్న వార్త వినిపిస్తోంది. హీరోగా వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు మెగా పవర్ స్టార్. -
మణిరత్నం,రామ్‌చరణ్‌ల ద్విభాషా చిత్రం
తమిళసినిమా: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నూతన చిత్రానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. కాట్రువెలియిడై చిత్రం తరువాత ఆ దర్శకుడు తదుపరి చిత్ర పనుల్లో మునిగిపోయారు. ఈ సారి భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్‌చరణ్, మాలీవుడ్ నటుడు ఫాహద్ పాజిల్‌ల కాంబినేషన్లో తమిళం, తెలుగు భాషల్లో చిత్రం చేయబోతున్నట్లు తాజా సమాచారం. రామ్‌చరణ్ ప్రస్తుతం రగస్థలం అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారని, అందులో ఒకరుగా కాట్రువెలియిడై చిత్రం ఫేమ్ అదిథిరావు నటించనున్నారట. మరో కథానాయకి ఎంపిక జరుగుతున్నట్లు తెలిసింది. కాగా మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలు కట్టనున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంతోష్‌శివన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఇంతకుముందు మణిరత్నం చిత్రాలు దళపతి, రోజా, ఇరువర్, ఉయిరే, రావణన్ చిత్రాలకు సంతోష్‌శివన్ చాయాగ్రహణం అందించారన్నది గమనార్హం. కాగా ఈ క్రేజీ చిత్రం సెప్టెంబర్‌లో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. -
మణి-చరణ్: మెగా కాంబినేషన్ సెట్టయిందా!?
తమిళ సినిమా: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తన కొత్త సినిమా కోసం సిద్ధం అవుతున్నారు.. కాట్రువెలియిడై (చెలియా) చిత్రం తర్వాత మణి తదుపరి చిత్రపనుల్లో మునిగిపోయారని తాజా సమాచారం. ఈ సారి భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారట. టాలీవుడ్ మెగా వారసుడు రాంచరణ్, మాలీవుడ్ నటుడు ఫాహద్ పాజిల్‌ల కాంబినేషన్లో ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రూపొందించనున్నట్టు తెలుస్తోంది. రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' అనే చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించనున్నట్లు కోలివుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారని, అందులో ఒకరిగా 'చెలియా' ఫేమ్ అదితిరావు నటించనున్నారని తెలుస్తోంది. మరో కథానాయకి ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చనున్నారు. సంతోష్‌శివన్ చాయాగ్రహణం అందించనున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు మణిరత్నం చిత్రాలు దళపతి, రోజా, ఇద్దరు, రావణన్ తదితర చిత్రాలకు సంతోష్‌శివన్ చాయాగ్రహణం అందించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెప్టెంబర్‌లో సెట్ పైకి వెళ్లే అవకాశముందని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. -
మణిరత్నం సినిమాలో రామ్‌చరణ్, ఐశ్వర్య?
చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌ల మధ్య మంచి ర్యాప్ ఉంది. ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో ఇరువర్, గురు, రావణ్ మూడు చిత్రాలలో ఐష్ నటించారు. అంతే కాకుండా మణి ఎప్పుడు పిలిచినా ఆయన చిత్రాల్లో నటించడానికి తాను రెడీ అని ఐశ్వర్యారాయ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇటీవల మల్టీస్టారర్ చిత్రం ప్లాన్ చేసిన మణిరత్నం అందులో ఐస్నే నాయకిగా ఎంపిక చేశారు. అయితే అనివార్యకారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. తాజాగా మళ్లీ ఐశ్వర్యారాయ్‌ను తన చిత్రంలో నటింపజేసే పనిలో మణిరత్నం ఉన్నట్లు తాజాగా కోలీవుడ్‌లో ప్రచారం జోరందుకుంది. కాట్రువెలియిడై చిత్రం తరువాత మణిరత్నం తాజాగా మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ మెగాహీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించనున్నారనీ, ఆయనకు ప్రతినాయకుడిగా అరవిందస్వామి నటించనున్నారన్నది ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి "యోధా" అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే మణిరత్నం రజనీకాంత్, మమ్ముట్టిల కాంబినేషన్లో దళపతి -2 చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్దం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు చిత్రాలలో ఏదో ఒక చిత్రంలో ఐశ్వర్యరాయ్‌ను నటింపజేయాలని మణిరత్నం భావిస్తున్నారు. -
మణిరత్నంకి పోటీ వస్తున్న సీనియర్ హీరో
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గురు. తమిళ హిందీ భాషల్లో సక్సెస్ సాధించిన సాలా ఖద్దూస్కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. చిత్రయూనిట్, సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. డేట్ మాత్రం ప్రకటించలేదు. తాజాగా గురు మూవీ రిలీజ్ డేట్‌పై చిత్రయూనిట్ ఓ నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే ఆలస్యం కావటంతో ఏప్రిల్ 7న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే అదే రోజు గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెలియా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటిస్తుండటంతో తెలుగు నాట భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో వెంకటేష్.. గురు, కార్తీ.. చెలియాల మధ్య గట్టి పోటి నెలకొంది. మరి వెంకీ ఇంత పోటిలో బరిలో దిగుతాడా లేక మరో డేట్ కోసం ఎదురుచూస్తాడా..? తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
మణిరత్నం మూవీ లేటెస్ట్ అప్డేట్
ఓకె జాను సినిమాతో ఫాంలోకి వచ్చిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తన మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ఆడియన్స్‌ను అలరించనున్నాడు. కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ హీరోగా తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం కాట్రు వెలియడై. అతిథి రావు హైదరీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ముందుగా ఈ సినిమా తెలుగు వర్షన్‌కు డ్యూయెట్ అనే టైటిల్‌ను నిర్ణయించినా ఇటీవల చెలియా అని మార్చారు. ఈ విషయాన్ని తెలుగు వర్షన్ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమాను మార్చి 24న రిలీజ్ చేయాలని భావించినా.. పోస్ట్ ప్రొడక్షన్‌కు మరింత సమయం కేటాయించాలన్న ఆలోచనతో రిలీజ్‌ను ఏప్రిల్ 7కు వాయిదా వేశారు. త్వరలోనే రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
మణిరత్నం డైరెక్షన్లో పొలిటికల్ థ్రిల్లర్
పొలిటికల్ థ్రిల్లర్స్ తెరకెక్కించటంలో మణిరత్నంది డిఫరెంట్ స్టైల్. ఇద్దరు, యువ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మణిరత్నం మరోసారి అదే జానర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న మణి, ఓకెబంగారం సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం కార్తీ హీరోగా తెరకెక్కుతున్న కాట్రు వేలయిదే (తెలుగులో డ్యూయెట్) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న మణిరత్నం, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడట. తన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ఎదిర్ కట్చి( ప్రతిపక్ష పార్టీ) అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు మణి, దీంతో ఇదే మణిరత్నం నెక్ట్స్ సినిమా అన్న ప్రచారం జరుగుతోంది. తన సినిమాలకు తెలుగు, తమిళ భాషల్లో ఇమేజ్ ఉన్న హీరోలను ఎంచుకునే మణిరత్నం ఈ సినిమాకు తమిళ రంగం మీదే దృష్టి పెడుతున్నాడు. అందుకే తమిళనాట వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ హీరో అధర్వను హీరోగా తీసుకునే అవకావాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
హైదరాబాద్‌లో మణిరత్నం సినిమా షూటింగ్
ఓకె బంగారం సినిమాతో ఫాంలోకి వచ్చిన గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం, మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. తన స్టైల్లో రొమాంటిక్ ఎంటర్టైనర్తో అభిమానులను అలరించేందుకు కాట్రు వెళదిలై సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తీ, అదితిరావ్ హైదరీ హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొద్ది రోజులుగా కార్తీ తన లేటెస్ట్ మూవీ కాష్మోరా పనుల్లో బిజీగా ఉండటంతో మణిరత్నం సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇటీవల కాష్మోరా ఆడియో రిలీజ్ కార్యక్రమాలు పూర్తి కావటం, సినిమాకు మరి కాస్త సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో మరో షెడ్యూల్‌ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ షెడ్యూల్ హైదరబాద్‌లోని పలు కీలక ప్రదేశాల్లో షూట్ చేసేలా ప్లాన్ చేశారు. పది రోజుల పాటు జరగనున్న హైదరాబాద్ షెడ్యూల్ తరువాత లడఖ్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. కొన్ని సాంగ్స్‌తో పాటు యాక్షన్ సీన్స్‌ను కూడా లడఖ్‌లో షూట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ వరకు పూర్తి చేసి, జనవరి నెలాఖరున లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
మణిరత్నం, నానిల సినిమా ఆగిపోలేదట..!
భారతీయ సినీ అభిమానులు గర్వించే స్థాయి చిత్రాలను తెరకెక్కించిన దక్షిణాది దర్శకుడు మణిరత్నం. ఒకప్పుడు ఘనవిజయాలు అందించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ మధ్యలో చాలా రోజుల పాటు తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వలేకపోయాడు. చాలా కాలం తరువాత ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు మణి. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో వెంటనే ఓ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేశాడు. ద్విభాష చిత్రంగా కార్తీ, నాని, నిత్యామీనన్, సయామీ ఖేర్‌లతో సినిమాను ప్లాన్ చేశాడు. ఇక సెట్స్ మీదకు వెళ్లటమే అనుకున్న సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో కార్తీ, అదితి రావ్ల కాంబినేషన్లో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. కాట్రు వెళదిలై పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే గతంలో ప్రకటించిన మణిరత్నం మల్టీ స్టారర్ సినిమా కూడా ఈ ఏడాది చివరకు సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ విషయాన్ని చిత్ర హీరోయిన్ సయామీ ఖేర్ స్వయంగా ప్రకటించింది. ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న సయామి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ... మణిరత్నం దర్శకత్వంలో చేయబోయే సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిపింది. -
మరోసారి రీమేక్ అవుతున్న క్లాసిక్
సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన క్లాసిక్ మూవీ ఘర్షణ. తమిళ్లో అగ్ని నచ్చతిరం పేరుతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. డబ్బింగ్ వర్షన్ గా తెలుగులో రిలీజ్ అయి ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. అంతేకాదు 200 రోజులు పాటు ఆడిన డబ్బింగ్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. అదే సినిమాను వన్ష్ పేరుతో హిందీలోనూ రీమేక్ చేశారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. విక్కీ కౌశల్, హర్షవర్థణ్ రాణేలు హీరోలుగా బెజాయ్ నంభియార్ దర్శకత్వంలో ఘర్షణ సినిమా మరోసారి రీమేక్ అవుతోంది. ఇటీవల అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన వాజీర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న బెజాయ్, ఘర్షణ రీమేక్ తో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. పాతికేళ్ల క్రితం సంచలనాలు సృష్టించిన ఘర్షణ ఈ తరం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుదో చూడాలి. -
బంగారం బాలీవుడ్‌కి వెళ్తోంది
చాలా కాలం తరువాత మణిరత్నం మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కి మంచి విజయం సాధించిన సినిమా ఓకే బంగారం. వరుస ఫ్లాప్‌లతో డీలా పడిపోయిన మణిరత్నం, ఈ సినిమా సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చాడు. దీంతో ఈ సినిమాను బాలీవుడ్‌లోనూ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నటీనటుల ఎంపిక విషయంలో చాలా రోజులు ఆలస్యం అయినా, తర్వాత సరైన నిర్మాత దొరకకపోవటంతో మరింత ఆలస్యం అయ్యింది. ఫైనల్‌గా ఓకే బంగారం బాలీవుడ్ రీమేక్ కు టీం సెట్ అయ్యిందన్న వార్త బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ పొయటిక్ లవ్ స్టోరీని హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో మణిరత్నం తెరకెక్కించిన సఖి సినిమాను సాథియా పేరుతో బాలీవుడ్లో తెరకెక్కించిన షాద్ అలీ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఆషికీ 2 సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ ఈ సినిమాలో మరోసారి తెరను పంచుకోనున్నారు. సౌత్‌లో సూపర్బ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్న ఏఆర్ రెహమాన్ మరోసారి ఈ ప్రేమకథకు సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఓకే బంగారం రీమేక్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
కార్తీతోనే మణి సినిమా
ఓకే బంగారం సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన మణిరత్నం తన నెక్ట్స్ సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నా, మణి మాత్రం ఇంతవరకు ఏ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. కార్తీ, దుల్కర్ సల్మాన్ల కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తాడని భావించినా.. ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రాలేదు. తరువాత కార్తీ, నాని కాంబినేషన్ అంటూ, నాని సోలో హీరోగా బైలింగ్యువల్ సినిమా అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా మణిరత్నం నెక్ట్స్ సినిమాపై మరో వార్త కోలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. కార్తీ హీరోగా ఓ డిఫరెంట్ ఎంటర్టైనర్ను తెరకెక్కించాలని భావిస్తున్నాడట మణిరత్నం. కార్తీ అయితే తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుందని భావించిన మణి, ఈ సినిమానే ఫైనల్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. -
నాని ఆ సినిమా చేస్తున్నాడట
మణిరత్నం చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, కార్తీ హీరోలుగా నటిస్తారన్న వార్త వినిపించింది. తరువాత దుల్కర్ స్థానంలో నాని నటించే అవకాశం ఉందటూ మరో వార్త, తరువాత నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడంటూ రకరకాల కథనాలు సౌత్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ గాసిప్స్ అన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేశాడు యంగ్ హీరో నాని. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మణిరత్నం సినిమాలో నాని నటిస్తున్నట్టు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కార్తీ ఇతర ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమా వాయిదాపడింది. త్వరలోనే మణిరత్నం, కార్తీ, నానీ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళుతుందని తెలిపాడు. మణిరత్నం సినిమాలో నటించటం నాని కల అని.. ఆ అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోడని తెలిపారు. -
మణి సినిమాలో నాని
సౌత్ హీరోలకే కాదు, నార్త్ స్టార్ హీరోలకు కూడా మణిరత్నం సినిమాలో నటించడం ఒక కల.. హీరోయిజం, స్టార్డంతో సంబంధం లేకుండా తన కథకు ఎవరైతే సరిపోతారో వారిని వెతికి పట్టుకునే మణిరత్నం, ఓ టాలీవుడ్ యంగ్ హీరోకు ఛాన్స్ ఇస్తున్నాడు. మణిరత్నం నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు నాని. టాలీవుడ్లో నాచురల్ ఆర్టిస్ట్‌గా పేరున్న నాని ... ఈగ సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మణిరత్నం తెరకెక్కించిన 'ఓకె బంగారం' సినిమా తెలుగు వర్షన్‌కు డబ్బింగ్ చెప్పిన నాని, మణిరత్నం దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. అదే జోష్‌లో ఇప్పుడు మణిరత్నం నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్ చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, కార్తీ హీరోలుగా రీవేంజ్ డ్రామాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు మణిరత్నం. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఆయన ఒకేసారి తెరకెక్కించనున్నాడు. మరి నానీని తెలుగు వర్షన్లో హీరోగా సెలెక్ట్ చేశాడా..? లేక వేరే ఏదైనా పాత్రకు తీసుకున్నాడా..? అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా మణిరత్నం నెక్ట్స్ సినిమాలో నాని నటించటం ఖాయంగా కనిపిస్తోంది. -
'అగ్ని నక్షత్రం' ఇన్ స్పిరేషన్ తో మణి సినిమా!
ఓకె బంగారం సక్సెస్ తరువాత మణిరత్నం చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇప్పటికే కార్తీ, దుల్కర్ సల్మాన్ లు హీరోలుగా సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను రివేంజ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇద్దరు యంగ్ హీరోలు కలిసి నటిస్తుండటంతో, ఈ మూవీ గతంలో మణిరత్నం తెరకెక్కించిన 'అగ్ని నక్షత్రం' స్ఫూర్తితో రూపొందిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. 1988లో రిలీజ్ అయిన అగ్నినక్షత్రం సినిమాలో అమలా, నిరోషాలు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ కొత్త సినిమా కోసం 'ఇదు ఎన్న మాయం' ఫేం కీర్తి సురేష్‌ను ఒక హీరోయిన్గా ఎంపిక చేయగా మరో హీరోయిన్ కోసం ఇంకా వేట కొనసాగుతోంది. ప్రస్తుతానికి మణి ఇంకా 'ఓకె బంగారం' సక్సెస్ ను ఎంజాయ్ చేసే మూడ్‌లోనే ఉన్నాడు. అక్టోబర్ 1 నుంచి సౌత్ కొరియాలో జరగనున్న బుసాన్ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 'ఓకె బంగారం' ను ప్రదర్శిస్తున్నారు. బుసాన్ ఆసియాలోనే అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్ కావటంతో మణి ఆ ఏర్పాట్లలో మునిగిపోయాడు. ఈ హడావిడి పూర్తవ్వగానే కార్తీ, దుల్కర్ ల కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా మీద దృష్టి పెట్టనున్నాడు. తమిళంలో చాలా కాలం తరువాత వస్తున్న మల్టీ స్టారర్ సినిమా కావటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా మణి చిత్రం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. -
నయనతారకి బంపర్ ఆఫర్
-
మణిరత్నం - మౌనరాగం
మౌనరాగం పలికించగల దర్శకరత్నం మణిరత్నం తన సినిమాని తానే రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ మళయాల నటుడు మమ్ముటీ కుమారుడు దుల్ఖర్ సల్మాన్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారని సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో మౌనరాగం మళ్లీ రూపుదిద్దుకుంటున్నట్లు మాలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా సంబంధించి మణిరత్నం అధికారికంగా ఇప్పటి వరకు చిన్న మాట కూడా మాట్లాడలేదు. అయినా అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఈ చిత్రానికి టైటిల్ కూడా ఇంకా ఖరారు కాలేదు. ఇందులో హీరోగా దుల్ఖర్ సల్మాన్ నటించనున్నారనేది మాత్రం ఖరారైంది. హీరోయిన్గా మొదట ఆలియా భట్ అనుకున్నారు. ఇప్పుడు తాజాగా నిత్య మీనన్, శృతిహాసన్ పేర్లు వినిపిస్తున్నాయి. నిత్య, దుల్ఖర్ ఇద్దరూ కలిసి నటించిన 'ఉస్తాద్ హోటల్' మంచి హిట్ కొట్టింది. వీరి కెమీస్ట్రీ సూపర్బ్.బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్‌గా వనితా ఫిల్మ్ అవార్డు కూడా అందుకున్నారు. ఇద్దరూ కలిసి నటించిన 'హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్' త్వరలో రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ 6న ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పీసీ శ్రీరామ్ పని చేయనున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ సఖి అఖరి చిత్రం. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్. ** -
ఇంతకూ మణిరత్నం సినిమా ఎవరితో?
మణిరత్నం సినిమాలో ఊహించని ట్విస్టులు ఉండవు కానీ, ప్రస్తుతం ఆయన చేయాలనుకుంటున్న సినిమాకు మాత్రం బోలెడన్ని ట్విస్టులు ఎదురవుతున్నాయి. నాగార్జున-మహేశ్‌బాబు కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. నాగ్ సరసన ఐశ్వర్యారాయ్, మహేశ్‌కి జోడీగా శ్రుతీహాసన్ నటించనున్నారని కూడా వివరాలు తెలిశాయి. మణిరత్నం సతీమణి, నటి సుహాసిని ఓ తమిళ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ధ్రువీకరించారు కూడా. నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఆంగ్ల పత్రికతో ప్రస్తావించారు. అయితే మహేశ్‌బాబు మటుకు తనకు తాను ఎక్కడా ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పలేదు. ఆయన ఇప్పుడున్న బిజీలో ఈ సినిమా చేస్తారా అనేది పెద్ద డౌటే. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అనే సందేహాలు చాలామందిలో ముసురుకున్నాయి. ఒకవేళ ఈ హీరోలిద్దరూ రిజెక్ట్ చేస్తే మణిరత్నం పరిస్థితి ఏంటి? తాజాగా... ఫిలిమ్నగర్లో వినిపిస్తున్న కబురు ఏంటంటే... రాజకీయాల్లో ఉన్న ఓ అగ్ర కథానాయకునికి మణిరత్నం ఈ వారంలో కథ వినిపించనున్నారట. ఆయన కనుక ఓకే చేస్తే, వెంటనే ప్రాజెక్ట్ మొదలవుతుందట. అందులో ఆయనతో పాటు, ఆయన తనయుడు కూడా నటించే అవకాశం ఉందట. -
మళ్లీ తల్లి కానుందా?
సినిమా తారలు చిక్కినా వార్తే! లావైనా వార్తే. ముఖ్యంగా కథానాయికలు బరువు పెరిగితే మాత్రం ‘సమ్‌థింగ్’ అనుకుంటారు. ప్రస్తుతం ఐశ్వర్యా రాయ్ గురించి అలానే మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ఓటేయడానికి బయటికొచ్చిన ఈ సుందరి నలుగురి కంట్లో పడ్డారు. ఆ మధ్య సన్నగా కనిపించిన ఐశ్వర్య ఇప్పుడు మాత్రం కాస్త బొద్దుగా కనిపించారు. ఆ మాత్రం చాలు ఊహాగానాలు చెలరేగడానికి. ఐశ్వర్యారాయ్ మళ్లీ అమ్మ కాబోతోందని, ఆమె శరీరాకృతి చూస్తే ఆ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఐశ్వర్య పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కూతురు పుట్టిన తర్వాత ఐశ్వర్య సినిమాలేవీ అంగీకరించలేదు. వెండితెరపై ఆమె ఆగమనం కోసం అభిమానులు వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా, ప్రహ్లాద్ కక్కడ్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించడానికి ఆమె పచ్చజెండా ఊపారనే వార్తలు రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈలోపు ఐష్ గర్భవతి అనే వార్త వచ్చింది. తమ అభిమాన కథానాయిక మరో బిడ్డకు జన్మనిస్తే.. అభిమానులకు ఆనందంగానే ఉంటుంది. కాకపోతే, వెండితెరపై ఆమెను మిస్ అవుతామనే బాధ కూడా ఉంటుంది. ఏదేమైనా ఐష్ గర్భవతి అనే వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. -
అది తెలిసినవాళ్లెవరూ నన్ను ప్రేమించరు!
‘‘భారతదేశంలో పుట్టడం నా అదృష్టం’’ అంటున్నారు శ్రుతీహాసన్. ఆమె అలా అనడానికి కారణం ఉంది. విదేశాల్లో పుట్టి, ఏ హాలీవుడ్ సినిమాలోనో చేస్తే ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చేదని, భారతదేశంలో పుట్టడం వల్ల పలు భాషల్లో నటించడానికి కుదురు తోందని అంటున్నారు శ్రుతి. తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. ఇంకా అంగీకరించాల్సిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో మణిరత్నం దర్శకత్వం వహించనున్న భారీ మల్టీస్టారర్ ఒకటి. ఇందులో తనను నాయికగా అడిగారని శ్రుతి పేర్కొన్నారు. కానీ, ఇంకా డేట్స్ కేటాయించలేదని, ఇలాంటి ఓ భారీ అవకాశానికి అడగడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రానికి డేట్స్ కేటాయించడానికి డైరీ తిరగేస్తున్నారట. అది సరే.. సినిమాల్లో హీరోలతో ప్రేమలో పడుతుంటారు కదా.. మరి, నిజజీవితం సంగతేంటి? అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే -‘‘నేను సింగిల్‌గానే ఉన్నా. సినిమాల పరంగా నా బిజీ షెడ్యూల్ గురించి తెలిసినవాళ్లెవరూ నన్ను ప్రేమించరు. ప్రస్తుతం సినిమాల మీదే పూర్తి దృష్టి సారించాను. కష్టపడి పని చేయాలన్నదే నా ధ్యేయం. ప్రతి శుక్రవారం ఏదో ఓ సినిమా వస్తుంది.. పోతుంది. కానీ, చేసిన కృషి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది’’ అని చెప్పారు. -
నాగ్ సరసన ఐష్..కాదు అశిన్
తెలుగు-తమిళ ద్విభాషా మల్టీస్టారర్ చిత్రం - అగ్ర దర్శకుడు మణిరత్నం - అయినా హీరోయిన్ మారిపోయింది. చిన్న చిత్రం అయినా, పెద్ద చిత్రం అయినా, భారీ మల్టీస్టారర్ చిత్రం అయినా, ఎంతటి దర్శకుడైనా, ఎంతటి హీరోయిన్ అయినా ముందు అనుకున్న వారు ఆ తరువాత మారిపోవడం సహజమైపోయింది. దర్శకుడికి నచ్చకపోయినా, హీరోకి నచ్చకపోయినా హీరోయిన్ మారిపోవడం తరచూ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ హీరోయినే నో చెప్పినట్లు తెలుస్తోంది. మాజీ ప్రపంచం సుందరి, ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో వెలిగిపోతున్న ఐశ్వర్యారాయ్ మణి రత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'ఇరువర్ (1997) ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. అటువంటి మణిరత్నం దర్శకత్వం వహించే చిత్రంలో నటించాలన్న ప్రపోజల్‌కు ఆమె నో చెప్పారని సమాచారం. అందాల తార ఐశ్వర్యారాయ్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించి కనువిందు చేస్తుందని అందరూ ఆశగా చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఆశతో ఎదురు చూశారు. అదీ టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సరసన కనిపించబోతోందని మన ప్రేక్షకులు తెగ ఆనందపడిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే, మణిరత్నం డైరెక్ట్ చేయబోతోన్న మల్టీస్టారర్ మూవీలో నాగ్‌కు జోడీగా ఐష్ నటింస్తుందని వార్తలొచ్చాయి. కానీ, ఈ ప్రపోజల్‌కు ఐష్ నో చెప్పినట్లు తెలుస్తోంది. ఐష్ అందాల్ని చూద్దామనుకున్నవారికి నిరాశే మిగిలింది. తెలుగులో మళ్లీ మల్టీస్టార్ల యుగం మొదలైంది. గతంలో ఎన్టీఆర్-అక్కినేని, ఎన్టీఆర్-కృష్ణ, ఎన్టీఆర్- మోహన్ బాబు, కృష్ణ-శోభన్ బాబు, అక్కినేని-కృష్ణ....ఇలా ఎన్నో చిత్రాలు వచ్చాయి. విజయవంతమయ్యాయి. ఆ తరువాత చాలాకాలం మల్టీస్టార్ల చిత్రాలు రాలేదు. ఇటీవల వెంకటేష్-మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వెంకటేశ్-రామ్ మసాలా, అల్లు అర్జున్, రాం చరణ్ ‘ఎవడు’ చిత్రాలు వచ్చాయి. తాజాగా తమిళంలో అగ్ర దర్శకుడైన మణిరత్నం దర్శకత్వంలో తెలుగు సూపర్ స్టార్లు అక్కినేని నాగార్జున, మహేశ్ బాబు కాంబినేషన్లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రూపొందనుంది. ఈ భారీ మూవీ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఐతే ఇందులో నాగ్ సరసన అశిన్ నటించే అవకాశాలున్నాయని ఫిలింనగర్ సమాచారం. గతంలో అశిన్ నాగ్‌తో శివమణి మూవీలో నటించింది. మళ్లీ ఇంతకాలం తరువాత వీరిద్దరి జోడీ రిపీట్ కాబోతోంది. -
అందరికీ 'అతడే' కావాలి..!