
రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఇండియన్ సినిమా రూపు రేఖల్ని మార్చేసింది.భారీ బడ్జెట్ చిత్రాలు తీయాలి అంటే ఒక ధైర్యాన్ని ఇచ్చింది. మంచి కంటెంట్ మన చేతుల్లో ఉంటే ప్రేక్షకులను అలరించే విధంగా తెరకెక్కించగలం అనే నమ్మకం ఉంటే రెండు భాగాలుగా అయినా విడుదల చేయవచ్చు అని రోబో, బాహుబలి, కేజీయఫ్ సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ ఇదే దారిలో వెళ్తోంది.
తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం 40ఏళ్ల కల పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్ట్. ఇక కోలీవుడ్ వరకు తీసుకుంటే 1958 నుంచి ఈ సినిమాను తెరకెక్కించాలని ఎందరో దర్శకులు, హీరోలు ప్రయత్నించారు. తమిళ తొలితరం స్టార్ హీరో ఎమ్‌జీఆర్ పొన్నియిన్ సెల్వన్ తీసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత పొన్నియిన్ సెల్వన్ ను తెరకెక్కించేందుకు మణిరత్నం ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఒకసారి రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్ కాంబినేషన్ లో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు మణిరత్నం. కాని కుదరలేదు. ఆ తర్వాత విజయ్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఈ చారిత్రిక చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడు. కాని బడ్జెట్ ఇష్యూస్ వచ్చాయి. కోలీవుడ్ మార్కెట్ కు ఈ సినిమా అడుగుతున్న బడ్జెట్ సరిపోదనే ఇన్నాళ్లు వెయిట్ చేస్తూ వచ్చాడు మణిరత్నం.
2018లో వచ్చిన నవాబ్ తర్వాతమరోసారి పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్ట్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టాడు మణిరత్నం. అందుకు బాహుబలి సిరీస్ సంచలన విజయం సాధించడమే కారణం.బాహుబలి స్ఫూర్తితోనే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను తమిళ సినీ ఇండస్ట్రీలోనే అత్యఅధిక బడ్జెట్ తో నిర్మిస్తోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, శరత్‌కుమార్, ఐశ్వర్యరాయ్, త్రిష, విక్రమ్ ప్రభు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30న రిలీజ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment