
మణిరత్నం సినిమాలో రామ్‌చరణ్, ఐశ్వర్య?
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌ల మధ్య మంచి ర్యాప్ ఉంది.
చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌ల మధ్య మంచి ర్యాప్ ఉంది. ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో ఇరువర్, గురు, రావణ్ మూడు చిత్రాలలో ఐష్ నటించారు. అంతే కాకుండా మణి ఎప్పుడు పిలిచినా ఆయన చిత్రాల్లో నటించడానికి తాను రెడీ అని ఐశ్వర్యారాయ్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. ఇటీవల మల్టీస్టారర్ చిత్రం ప్లాన్ చేసిన మణిరత్నం అందులో ఐస్‌నే నాయకిగా ఎంపిక చేశారు. అయితే అనివార్యకారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. తాజాగా మళ్లీ ఐశ్వర్యారాయ్‌ను తన చిత్రంలో నటింపజేసే పనిలో మణిరత్నం ఉన్నట్లు తాజాగా కోలీవుడ్‌లో ప్రచారం జోరందుకుంది.
కాట్రువెలియిడై చిత్రం తరువాత మణిరత్నం తాజాగా మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ మెగాహీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించనున్నారనీ, ఆయనకు ప్రతినాయకుడిగా అరవిందస్వామి నటించనున్నారన్నది ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి "యోధా" అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే మణిరత్నం రజనీకాంత్, మమ్ముట్టిల కాంబినేషన్‌లో దళపతి -2 చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్దం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు చిత్రాలలో ఏదో ఒక చిత్రంలో ఐశ్వర్యరాయ్‌ను నటింపజేయాలని మణిరత్నం భావిస్తున్నారు.