హైదరాబాద్లో మణిరత్నం సినిమా షూటింగ్ | Maniratnams next shooting in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో మణిరత్నం సినిమా షూటింగ్

Oct 9 2016 12:00 PM | Updated on Sep 4 2018 5:24 PM

హైదరాబాద్లో మణిరత్నం సినిమా షూటింగ్ - Sakshi

హైదరాబాద్లో మణిరత్నం సినిమా షూటింగ్

ఓకె బంగారం సినిమాతో ఫాంలోకి వచ్చిన గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం, మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. తన స్టైల్లో రొమాంటిక్ ఎంటర్టైనర్తో అభిమానులను అలరించేందుకు కాట్రు వెళదిలై...

ఓకె బంగారం సినిమాతో ఫాంలోకి వచ్చిన గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం, మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. తన స్టైల్లో రొమాంటిక్ ఎంటర్టైనర్తో అభిమానులను అలరించేందుకు కాట్రు వెళదిలై సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తీ, అదితిరావ్ హైదరీ హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

కొద్ది రోజులుగా కార్తీ తన లేటెస్ట్ మూవీ కాష్మోరా పనుల్లో బిజీగా ఉండటంతో మణిరత్నం సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది. ఇటీవల కాష్మోరా ఆడియో రిలీజ్ కార్యక్రమాలు పూర్తి కావటం, సినిమాకు మరి కాస్త సమయం ఉండటంతో ఈ గ్యాప్లో మరో షెడ్యూల్ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ షెడ్యూల్ హైదరబాద్లోని పలు కీలక ప్రదేశాల్లో షూట్ చేసేలా ప్లాన్ చేశారు.

పది రోజుల పాటు జరగనున్న హైదరాబాద్ షెడ్యూల్ తరువాత లడఖ్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. కొన్ని సాంగ్స్తో పాటు యాక్షన్ సీన్స్ను కూడా లడఖ్లో షూట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మద్రాస్ టాకీస్ బ్యానర్పై మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ వరకు పూర్తి చేసి, జనవరి నెలాఖరున లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement