Navdeep Singh
-
వీరమాతకు వందనం
యుద్ధంలో బిడ్డను కోల్పోయిన దుఃఖం ఒకవైపు. ‘దేశమాత కోసం నా బిడ్డప్రాణత్యాగం చేశాడు’... అనే గర్వం ఒకవైపు... ఎంతోమంది వీరమాతలు... అందరికీ వందనం...యుద్ధ చరిత్రలోకి ఒకసారి...గర్వంగా అనిపించింది...కొన్ని సంవత్సరాల క్రితం... ఉగ్రవాదులతో జరిగిన పోరులో నలుగురిని చంపేశాడు లెఫ్టినెంట్ నవదీప్‌సింగ్. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడుతూనే నేలకొరిగాడు 26 సంవత్సరాల ఆ యువకుడు. ‘నేనంటే నవదీప్‌కు ఎంత ఇష్టమో చెప్పడానికి మాటలు చాలవు. ఫ్రెండులా ఎన్నో కబుర్లు చెబుతుండేవాడు. నవదీప్ లేడు అనే వాస్తవం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఇప్పటికీ కలలో ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటాడు. అమ్మా...నేను వస్తున్నాను అనే మాట వినబడితే సంతోషంగా అనిపించేది. లెఫ్టినెంట్ నవదీప్‌సింగ్ తల్లి కౌర్ ఇక ఆ మాట ఎప్పుడూ వినిపించదు. ఉగ్రవాదులను నవదీప్ దీటుగా ఎదుర్కోకపోతే ఎంతో నష్టం జరిగి ఉండేది... అని పై అధికారులు చెప్పినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. నవదీప్ నా బిడ్డ. అతడు చనిపోయినప్పుడు నేనే కాదు.. ఎంతోమంది తల్లులు సొంత బిడ్డను కోల్పోయినట్లు ఏడ్చారు. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్లముందే ఉంది. దేశం కోసం పోరాడే వీరసైనికుడికి ఒక్కరే అమ్మ ఉండదు. దేశంలోని ప్రతి అమ్మ తన అమ్మే’ అంటుంది పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన నవదీప్‌సింగ్ తల్లి కౌర్.ఇంటికి ఎప్పుడొస్తావు బిడ్డ?ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండ నియోజక వర్గం కల్లితండాకు చెందిన ఆర్మీ జవాన్ మురళీనాయక్ పాక్‌తో జరిగిన యుద్ధంలో చనిపోయాడు. ఆ తల్లి దుఃఖ భాషను అర్థం చేసుకోగలమా? కుమారుడు మురళీనాయక్ మరణం గురించి అడిగినప్పుడు ‘ఏమని చెప్పాలి సామీ’ అని ఆ తల్లి భోరున విలపించింది. మురళీనాయక్ పార్థివదేహాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు తరలి వచ్చారు. వారు తనలాగే ఏడ్చారు. అమ్మా... నీ కొడుకు ఎంత గొప్ప వీరుడో చూశావా! ‘ఆర్మీ జవాన్ మురళీ నాయక్ తల్లి’ అని తనను పరిచయం చేస్తున్న సమయంలో ఆ తల్లి హృదయం గర్వంతో పొంగిపోతుంది. మాతృదినోత్సవం సందర్భంగా ఆ వీరమాతలందరికీ వందనం.కవాతు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి!జమ్మూ కశ్మీర్ దోడాలో జరిగిన ఎన్కౌంటర్లో కెప్టెన్ బ్రిజేష్ థాప వీరమరణం పొందాడు. ‘బ్రిజేష్ ఇక లేడు అనే వార్త విని కుప్పకూలిపోయాను. మా అబ్బాయి అని చెప్పడం కాదుగానీ చాలా క్రమశిక్షణ ఉన్న కుర్రాడు. ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే నేను సైన్యంలో చేరుతాను అనేవాడు. సైన్యంలో పనిచేయడం చాలా కష్టం అని చెబుతుండేదాన్ని. ఎంత కష్టమైనా సైన్యంలోకి వెళతాను అనేవాడు. బ్రిజేష్ లేడనే వాస్తవం కష్టంగా ఉన్నా సరే... దేశం కోసం నా కుమారుడుప్రాణాలు అర్పించాడు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది’ అంటారు నీలిమ థాప. సైనిక దుస్తుల్లో కుమారుడిని చూసిన తొలి క్షణం నీలిమ భావోద్వేగానికి గురయ్యారు.ఎప్పటి కల అది! నాన్న యూనిఫామ్ వేసుకొని చిన్నారి బ్రిజేష్ మార్చ్ చేస్తుండేవాడు (బ్రిజేష్ తండ్రి మిలిటరీలో పనిచేశారు) కుమారుడిని చూసి ‘మేజర్ సాబ్ వచ్చేశారు’ అని నవ్వేది.ఇప్పుడిక ఆమెకు నవ్వే అవకాశమే లేకపోవచ్చు. కన్నీటి సముద్రంలో దిక్కుతోచకుండా ఉన్నట్లుగానే ఉండవచ్చు. అయితే... కుమారుడి ధైర్యసాహసాల గురించి విన్నప్పుడు ఆ తల్లి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. ‘కెప్టెన్ బ్రిజేష్ థాప’ అని కుమారుడి పేరు విన్నప్పుడల్లా... ఆర్మీ అధికారుల కవాతు శబ్దాలు ఆమెకు వినిపిస్తూనే ఉంటాయి.ఆ తల్లి ఎలా తట్టుకుందో!‘పిల్లల పెంపకంలో తల్లి పాత్ర కీలకం’ అంటుంది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన మంజుల. ఇండియా–చైనా యుద్ధంలో ఆమె కుమారుడు కల్నల్ సంతోష్‌బాబు కన్నుమూశాడు. చదువులోనే కాదు ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండే కొడుకును చూసి మంజుల గర్వించేది. ఆరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సంతోష్ మరణం గురించి మంజులకు తెలియజేశారు. ఆ తల్లి గుండె ఎలా తట్టుకుందో తెలియదు. కల్నల్ సంతోష్ బాబు, తల్లి మంజులకుమారుడి బాల్యవిశేషాలు, క్రమశిక్షణ గురించి కళ్లకు కట్టినట్లు చెప్పే మంజుల కుమారుడి మరణం గురించి.. ‘మన దేశం కోసం మా అబ్బాయి వీరమరణం పొందాడు’ అని గర్వంతో చెబుతుంది. ‘ఒక్కడే బాబు నాకు...’ అంటున్న ఆ తల్లి కంఠానికి కన్నీళ్లు అడ్డుపడి మాటలు రావు. ఆమె మనసులో కనిపించని దుఃఖసముద్రాలు ఉండవచ్చుగాక... కానీ ఆమె పదే పదే చెబుతుంది...‘నా బిడ్డ మన దేశం కోసం చనిపోయాడు’.ఎక్కడ ఉన్నా అమ్మ గురించే‘కెప్టెన్ సౌరభ్ కాలియ బయట ఎలా ఉంటాడో తెలియదుగానీ ఇంట్లో మాత్రం చిలిపి’ అంటుంది అతడి తల్లి విజయ కాలియ. ‘మేరా పాస్ మా హై’ అని తల్లి గురించి సరదాగానే సినిమా డైలాగు చెబుతుండేవాడుగానీ... నిజంగా తల్లి సౌరభ్ ధైర్యం. సైన్యం. ‘ఒకరోజు సౌరభ్ వంటగదిలోకి వచ్చి సైన్ చేసిన బ్లాంక్ చెక్ ఇచ్చాడు. ఎందుకు? అని అడిగితే ‘నేను ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మనీ విత్‌డ్రా చేసుకోవడానికి’ అన్నాడు. తాను ఎక్కడ ఉన్నా నా గురించే ఆలోచించేవాడు’ అంటుంది విజయ.ఇప్పుడు ‘కాలియ హోమ్’లో ఆ బ్లాంక్ చెక్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ చెక్‌ను చూసినప్పుడల్లా కుమారుడిని చూసినట్లుగానే ఉంటుంది. ‘డబ్బును డ్రా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు ఈ కాగితంపై నా బిడ్డ చేసిన సంతకం ఉంది. అది నాకోసం చేసింది. ఇది ఎప్పటికీ తీయటి జ్ఞాపకంగా ఉండిపోతుంది’ అంటుంది విజయ. చివరిసారిగా తమ్ముడి పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి ఫోన్ చేశాడు సౌరభ్.‘నా పుట్టిన రోజుకు తప్పకుండా ఇంటికి వస్తాను అన్నాడు. ఆ రోజు ఇప్పటికీ రాలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అవుతుంది విజయ. 23 ఏళ్లు నిండకుండానే కార్గిల్ యుద్ధంలో సౌరభ్ చనిపోయాడు. హిమాచల్‌ద్రేశ్‌లోని పలంపూర్ ఇంట్లో ఒక గది మొత్తాన్ని సౌరభ్ మ్యూజియంగా మార్చారు. ‘ఈ మ్యూజియంలోకి వస్తే మా అబ్బాయి దగ్గరకి వచ్చినట్లే ఉంటుంది’ అంటుంది విజయ.నా కుమారుడు... వీరుడుఆ అమ్మ పేరు త్రిప్తా థాపర్... ఆమె కళ్లలో ఒకవైపు అంతులేని దుఃఖం, మరోవైపు గర్వం కనిపిస్తాయి. కార్గిల్ యుద్ధంలో థాపర్ తన కుమారుడిని కోల్పోయింది. మధ్యప్రదేశ్‌లో మహు పట్టణంలోని మిలిటరీ కంటోన్మెంట్ మ్యూజియంలో కార్గిల్ యుద్ధ దృశ్యాలను, కుమారుడి ఫోటోను చూస్తున్నప్పుడు ఆమెకు దుఃఖం ఆగలేదు.ఇరవై రెండు సంవత్సరాల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన విజయంత్ థాపర్ కార్గిల్ వార్ హీరో. తన దళంతో శత్రువుల బంకర్ ను చుట్టుముట్టే క్రమంలో విజయంత్ థాపర్ మరణించాడు.వీర్‌చక్ర విజయంత్ థాపర్ ,తల్లి త్రిప్తా థాపర్ ‘వీర్‌చక్ర విజయంత్ థాపర్ అమ్మగారు అని నన్ను పరిచయం చేస్తుంటారు. వీర్‌చక్ర అతడి పేరులో శాశ్వతంగా కలిసిపోయింది’ అని విజయంత్ గురించి గర్వంగా చెబుతుంది త్రిప్తా థాపర్. ఆమె దృష్టిలో అది మ్యూజియం కాదు. పవిత్ర స్థలం. ‘ఈ మ్యూజియంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ఫోటో ఎన్నో జ్ఞాపకాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. దేశం కోసం చిన్న వయసులోనే జీవితాన్ని త్యాగం చేసిన వీరులను పదే పదే తలుచుకునేలా చేస్తుంది’ అంటుంది థాపర్. తన సన్నిహిత మిత్రురాలు పూనమ్ సైనీతో కలిసి తరచు ఈ మ్యూజియమ్‌కు వస్తుంటుంది త్రిప్తా థాపర్.ఎప్పుడు వచ్చినా కుమారుడి దగ్గరికి వచ్చినట్లే ఉంటుంది ఆ తల్లికి. బ్యాగులు సర్దుకొని ఇల్లు వదిలే ముందు... ‘అమ్మా... ఆరోగ్యం జాగ్రత్త’ అని చెప్పేవాడు. గంభీరంగా కనిపించే అతడి కళ్లలో అమ్మను విడిచి వెళ్లే ముందు సన్నని కన్నీటి పొర కనిపించేది. అయితే అమ్మకు ఆ కన్నీటి ఆనవాలు కనిపించకుండా తన చిరునవ్వు చాటున దాచేవాడు. ‘అమ్మా, కొడుకుల అనుబంధం గురించి చెప్పడానికి మాటలు చాలవు’ అని కన్నీళ్లు తుడుచుకుంటుంది త్రిప్తా థాపర్ స్నేహితురాలు పూనమ్. -
జావెలిన్ దిగిందా లేదా!
మొహమ్మద్ అబ్దుల్ హాది ఏమీ చేతకాని, ఏ పనీ చేయలేని బతుకూ ఒక బతుకేనా? దీనికంటే ఆత్మహత్య నయమంటూ, మరుగుజ్జు అంటూ హేళన చేసిన వాళ్లంతా ఇప్పుడు అతని మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. కారణం.. పారిస్ పారాలింపిక్స్‌లో అతను జావెలిన్ త్రోలో స్వర్ణాన్ని అందుకోవడమే! ఆ క్రీడాకారుడు 23 ఏళ్ల నవదీప్ సింగ్. విజయానంతరం ఆ జావెలిన్ త్రోయర్ భారత్ తిరిగి వచ్చాక, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అతనితో సరదాగా మాట్లాడిన తీరు చూస్తే.. నవదీప్ తన ఆటతో ప్రపంచం దృష్టిని ఎలా ఆకర్షించాడో అర్థమవుతుంది. పారాలింపిక్స్‌లో అతను సాధించిన విజయం సామాన్యమైంది కాదు. ఆత్మన్యూనతాభావంతో బతికే ఎంతోమంది నేర్చుకోవాల్సిన పాఠం. ఆ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. హరియాణాలోని పానిపట్ సమీపంలో బువానా లాఖు నవదీప్ సొంత ఊరు. తండ్రి దల్వీర్ సింగ్ స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగి. జన్యుపరమైన లోపాలతో పుట్టడం వల్ల నవదీప్ వయసుకు తగ్గట్టు ఎదగలేకపోయాడు. పిల్లాడికి రెండేళ్లు వస్తేగానీ పరిస్థితి తీవ్రత తల్లిదండ్రులకు అర్థం కాలేదు. అప్పుడు కొడుకు చికిత్స కోసం వాళ్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఊర్లో అతను మరుగుజ్జు నవదీప్గా స్థిరపడిపోయాడు. దాంతో బాల్యం నుంచే అతను అత్యంత అవసరమైతే తప్ప బయటకు రాకుండా, ఇంట్లోనే ఉండిపోసాగాడు. ‘కొన్నిసార్లు మాతో కూడా మాట్లాడకుండా గదికి గడియ పెట్టుకుని, ఏడుస్తూ ఉండిపోయేవాడ’ని అతని పెద్దన్న మన్దీప్ గుర్తు చేసుకుంటాడు. కొడుకును సాధారణ స్థితికి తెచ్చేందుకు నవదీప్ తండ్రి తనకు సాధ్యమైనంతగా ప్రయత్నించాడు. నవదీప్ చదువుకునేందుకు మంచి మంచి పుస్తకాలను తెచ్చివ్వడంతో పాటు, ఇతర అంశాలపై అతను దృష్టి సారించేలా చేశాడు. రాష్ట్రపతి అవార్డుతో..నవదీప్‌ని ఒంటరితనం నుంచి బయటపడేసేవి ఆటలే అని భావించారంతా! దాంతో ఇంట్లోవాళ్లు అతణ్ణి ఆటల వైపు ప్రోత్సహించారు. నవదీప్ తండ్రికి రెజ్లింగ్‌లో స్థానిక పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉంది. నవదీప్ కూడా ముందుగా రెజ్లింగ్‌లోనే సాధన చేశాడు. అయితే అక్కడా అతనికి తన ఆరోగ్యం కొంత సమస్యగా మారింది. వెన్ను నొప్పి కారణంగా రెజ్లింగ్ సాధ్యం కాదని అర్థమవడంతో దానిని వదిలేశాడు. స్థానిక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు స్పోర్ట్స్‌పై మరింత ఆసక్తి పెరిగింది. పీఈటీ ప్రోత్సాహంతో అతను అథ్లెటిక్స్ వైపు మళ్లాడు. అందులో అందరితో పోటీపడుతూ సాధించిన విజయాలు నవదీప్‌కు గ్రామంలో మంచి పేరు తెచ్చి పెట్టాయి. అతని క్రీడా ప్రతిభ హరియాణాను దాటింది. వైకల్యాన్ని అధిగమించి పలు జాతీయ స్థాయి పోటీల్లోనూ మంచి ప్రదర్శన నమోదు చేశాడు. 12 ఏళ్ల వయసులో అతను కేంద్ర ప్రభుత్వం అందించే ‘రాష్ట్రీయ బాల్పురస్కార్’ అవార్డుకు ఎంపికయ్యాడు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న ఈ అవార్డు తన మరుగుజ్జుతనాన్ని మరచిపోయేలా చేసింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రత్యేక శిక్షణతో ..బాల్పురస్కార్ అవార్డు తర్వాత క్రీడలపై పూర్తిగా దృష్టి సారించవచ్చని నవదీప్‌కు నమ్మకం కలిగింది. మరికొంత కాలం అథ్లెటిక్స్‌పై మరింత సాధన చేసి ఆటలో పదును పెంచుకున్నాడు. ఆ తర్వాత శ్రేయోభిలాషులందరూ అండగా నిలవడంతో పెద్దస్థాయిలో శిక్షణ కోసం, నవదీప్ తన 16వ ఏట ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడి కోచ్ నావల్ సింగ్ వద్ద అథ్లెటిక్స్‌లో కోచింగ్, ప్రాక్టీస్ సాగింది. నవదీప్‌కి ఇంకా తోడుగా ఉండటం వల్ల అతను పైకి రాలేడని, అతను స్వతంత్రంగా ఉండే ఏర్పాట్లు చేయాలని పెద్దన్న మన్దీప్ తన తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. దాంతో తండ్రి ఎల్ఐసీ పాలసీ ద్వారా అప్పు చేసి మరీ కొడుకు కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ కొడుకు ఒలింపిక్ విజయానికి కొన్ని నెలల ముందే ఆయన కన్నుమూశాడు. కొడుకు గెలుపును చూడలేకపోయాడు. కఠోర సాధనతో..ఢిల్లీలో శిక్షణ పొందే క్రమంలో అథ్లెటిక్స్‌లో ఏదైనా ఒక ఈవెంట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన టైమ్ వచ్చింది. అప్పుడే హరియాణాకే చెందిన నీరజ్ చోప్రా.. అండర్–20 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం నవదీప్‌ను ఆకర్షించింది. దాంతో తనూ జావెలిన్ త్రో వైపు మొగ్గు చూపాడు. అక్కడి జావెలిన్ కోచ్ విపిన్ కసానా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘నా కెరీర్లో నేను ఎంతో మందికి శిక్షణనిచ్చాను. కానీ ఇంత తక్కువ ఎత్తు ఉన్న ఆటగాళ్లెవరూ నా వద్దకు రాలేదు. దాంతో నవదీప్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. 2.2 మీటర్ల పొడవు ఉన్న జావెలిన్‌ను పట్టుకోవడం మొదలు భుజాలపై భారం ఉంచి విసిరే వరకు అంతా భిన్నమే. జావెలిన్‌ను విసిరే కోణాల్లో కూడా మార్పు చేయాల్సి వచ్చింది. కానీ ఏం చేసినా అతని పట్టుదల ముందు అన్నీ చిన్నవిగా అనిపించాయి. కఠోర సాధనకు నవదీప్ ఏ దశలోనూ వెనుకాడలేదు’ అని విపిన్ చెప్పారు. ఒలింపిక్ పతకాన్ని ముద్దాడి..నవదీప్ కష్టానికి ప్రతిఫలం కొద్దిరోజులకే దక్కింది. 17 ఏళ్ల వయసులో ఆసియా యూత్ పారా గేమ్స్‌లో స్వర్ణంతో అతని విజయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత వరల్డ్ పారా గ్రాండ్ ప్రీలో స్వర్ణం గెలిచిన అతను ఈ ఏడాది ఆరంభంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి ఒలింపిక్స్‌పై ఆశలు రేపాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జావెలిన్ త్రో ఎఫ్ 41 విభాగంలో (తక్కువ ఎత్తు ఉన్న ఆటగాళ్ల కేటగిరీ) స్వర్ణం గెలుచుకున్నాడు. చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తున్నట్లే ఈసారి కూడా తన ఊర్లో అందరికీ ఆ పతకాన్ని చూపించి గర్వంగా నిలబడ్డాడు. -
కాలితో సంతకం చేసిన శీతల్.. ప్రధాని మోదీకి జెర్సీ
పారాలింపిక్స్ క్రీడాకారులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. పారా విశ్వక్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన బృందాన్ని కొనియాడారు. భారత పారాలింపిక్స్ చరిత్రలో సరికొత్త బెంచ్‌మార్కును సెట్ చేశారంటూ అభినందించారు. కాగా పారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ అత్యధికంగా 29 పతకాలు గెలిచింది. ఇందులో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, పదమూడు కాంస్య పతకాలు ఉన్నాయి.నేలపై కూర్చున్న మోదీఈ క్రమంలో టోక్యో పారాలింపిక్స్ పతకాల(19) రికార్డు బ్రేక్ అయింది. ఈ నేపథ్యంలో పారిస్ నుంచి పతకాలతో తిరిగి వచ్చిన పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పారాలింపియన్ల అంకితభావాన్ని కొనియాడిన ప్రధాని వారిని అభినందించారు. అదే విధంగా.. ప్రతి ఒక్కరితో విడివిడిగా కలుసుకొని ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా శారీరక ఎదుగుదల లోపం ఉన్న జావెలిన్ త్రోయర్ నవ్‌దీప్ సింగ్‌తో మోదీ అహ్లాదంగా గడిపారు. మరుగుజ్జు క్రీడాకారుడైన అతని చేతుల మీదుగా టోపీ ధరించేందుకు నేలపై కూర్చున్నారు. దీంతో నవ్‌దీప్ అమితానందంతో ప్రధానికి టోపీ తొడిగాడు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)అనంతరం తన చేతి భుజంపై ఆటోగ్రాఫ్ కోరగా... ప్రధాని వెంటనే పెన్ తీసుకొని అతని ముచ్చట తీర్చారు. జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన అతని గురించి అడిగి తెలుసుకున్నారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)కాలితో సంతకం చేసిన శీతల్అదే విధంగా.. షూటర్ అవని లేఖరా, జూడో ప్లేయర్ కపిల్ పర్మార్, ఆర్చర్లు శీతల్ దేవి, రాకేశ్ కుమార్ తదితరులు ప్రధానితో ముచ్చటించారు. ఈ సందర్భంగా శీతల్ కాలితో సంతకం చేసిన జెర్సీని మోదీకి బహూకరించింది. ఇక ఈ భేటీకి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ శుక్రవారం.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు.చదవండి: అలాంటి వాళ్లే ఇప్పుడు మిఠాయిలు తినిపిస్తున్నారు: శీతల్ దేవి India's Paralympic champions have set a new benchmark with the highest-ever medal count. It was a delight to interact with them. https://t.co/yLkviuJCaI— Narendra Modi (@narendramodi) September 13, 2024 -
ఎస్పీ ఆఫీసుకు క్యూ కట్టిన చింతమనేని బాధితులు
సాక్షి, పశ్చిమ గోదావరి : టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఆయన బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చింతమనేని తమపై దాడులకు పాల్పడ్డారని బాధితులు జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌కు వివరించారు. గతంలో తమ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేదని బాధితులు ఎస్పీకి తెలిపారు. ఆ కేసులపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితులపై ఫిర్యాదులపై నవదీప్‌సింగ్ మాట్లాడుతూ.. చింతమనేని అక్రమాలపై ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని బాధితులు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. వారి ఫిర్యాదులపై చట్టప్రకారం రీ ఎంక్వయిరీ చేపడతామని అన్నారు. విచారణను వేగవంతం చేస్తామని వెల్లడించారు. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చింతమనేనిపై 20 ఏళ్ల నుంచి 50 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాటిలో ఎక్కువగా పోలీసులపై దాడులు, ఎస్సీ, ఎస్టీ కేసులే ఉన్నాయని వివరించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ చింతమనేని చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ఇదివరకే 50 కేసులు నమోదు అయిన వ్యక్తిపై ఎవరైనా తప్పుడు కేసులు పెడతారా అని ఎస్పీ ప్రశ్నించారు. -
ఎస్పీ బదిలీ
నూతన ఎస్పీగా సెంథిల్‌కుమార్ నెల్లూరు(క్రైమ్): జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఎస్.సెంథిల్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ జేవీ రాముడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెంథిల్‌కుమార్ తమిళనాడు నివాసి. 2008 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి. వరంగల్ జిల్లా ములుగు ఏఎస్పీగా పోలీసుశాఖలోకి ప్రవేశించారు. అనంతరం శ్రీకాకుళం ఏఎస్పీ, శంషాబాద్ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది డిసెంబర్ 2న అనంతపురం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సెంథిల్‌కుమార్ విధినిర్వహణలో రాజీపడని అధికారిగా గుర్తింపు పొందారు. మరో రెండు, మూడు రోజుల్లో నెల్లూరు ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాకు నవదీప్ నవదీప్‌సింగ్ గ్రేవాల్‌ను విజయనగరానికి బదిలీ చేశారు. 2008 బ్యాచ్‌కే చెందిన ఆయన జిల్లా ఎస్పీగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న బాధ్యతలు చేపట్టారు. గతంలో అనంతపురం, పార్వతీపురం, రంపచోడవరం, మంచిర్యాలలో ఏఎస్పీగా పనిచేశారు. మల్కాజ్గిరి డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నె ల్లూరు ఎస్పీగా వచ్చారు. రాష్ట్ర విభజన, ఎన్నికల సమయాల్లో పరిస్థితులు అదుపుతప్పకుండా సఫలీకృతులయ్యారు. అయితే శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో అధికార పార్టీకి కొమ్ముకాశారనే విమర్శను మూటగట్టుకున్నారు. సీఎం చంద్రబాబు 19వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, ఆ తర్వాత విధుల నుంచి రిలీవ్ అవుతారని సమాచారం. -
ఆ రోజును జీవితంలో మరచిపోలేను
అది రాజస్తాన్ ఎడారి ప్రాంతం. సమయం సాయంత్రం కావొస్తోంది. ‘ఎన్‌హెచ్ 10’ సినిమా బృందం... షూటింగ్లో నిమగ్నమై ఉంది. అనుష్కశర్మకు సన్నివేశాన్ని వివరిస్తున్నాడు దర్శకుడు నవదీప్‌సింగ్. ఉన్నట్టుండి వాతావరణంలో చిన్న మార్పు. నిదానంగా గాలులు మొదలయ్యాయి. ఆ గాలులు యూనిట్ సభ్యులకు ఆహ్లాదాన్ని పంచాయి. వారిలో ఉత్సాహం రెట్టింపయ్యింది. మంచి జోష్‌గా పని చేసుకుంటూ పోతున్నారు. గాలి వేగం ఇంకాస్త పెరిగింది. దాన్ని కూడా యూనిట్ లైట్‌గానే తీసుకుంది. అయితే... రానురానూ గాలి వేగం పెరగడంతో యూనిట్ అప్రమత్తమయ్యింది. పేకప్ చెప్పేసి, తట్టాబుట్టా సర్దేయబోయారు అందరూ. కానీ... అంత అవకాశం వారికి ఆ గాలి ఇవ్వలేదు. ఆ చిన్న గాలే... భయంకరమైన ఇసుక తుఫాన్‌గా మారింది. యూనిట్ సభ్యులందరూ ఆ గాలికి అల్లకల్లోలం అయిపోయారు. ఎగసి పడుతున్న ఇసుక తాకిడికి వారి శరీరాలు కందిపోయాయి. ఎవరెవరు ఎక్కడ పడ్డారో వారికే తెలీదు. అయితే... ఒక్కసారిగా తుఫాన్ శాంతించింది. మళ్లీ అందరూ ఒకే చోటకి చేరుకున్నారు. ‘‘నా జీవితంలో ఈ నెల 17 మరచిపోలేని రోజు. ఇసుక తుఫాన్ ఎలా ఉంటుందో చూశాను. ఆ తుఫాన్ తాకిడికి అందరం చెల్లాచెదురైపోయాం. దాదాపు ఓ అరగంట పాటు దుమ్ముధూళితో ఉక్కిరిబిక్కిరైపోయాం. అయితే... ఎవరికీ చిన్న గాయం కూడా తగల్లేదు’’ అంటూ ట్విట్టర్ ద్వారా తన అనుభవాన్ని పంచుకున్నారు అనుష్కశర్మ.