పోలీసులు వచ్చే లోపే తిరగబడి కొట్టండి | 6100 posts to be filled soon in the Police Department | Sakshi
Sakshi News home page

పోలీసులు వచ్చే లోపే తిరగబడి కొట్టండి

Published Fri, Nov 22 2024 6:00 AM | Last Updated on Fri, Nov 22 2024 12:53 PM

6100 posts to be filled soon in the Police Department

కొందరు మృగాలకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.. వారిని ఏం చేయాలన్నా చట్టం కట్టేస్తోంది 

పోలీస్‌ శాఖలో త్వరలో 6,100 పోస్టుల భర్తీ.. భూ అక్రమాలకు పాల్పడితే జైలుకు పంపుతాం.. భోగాపురంలో మ్యూజియానికి అల్లూరి పేరు  

బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే వరకూ పోరాడతాం 

శాసనసభలో సీఎం చంద్రబాబు  

సాక్షి, అమరావతి: ‘మృగాల కంటే హీనంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఏం చేయాలన్నా చట్టం కట్టేస్తోంది. పోలీసులు వచ్చే లోపే ప్రజలు తిరుగుబాటు చేసి వారిని కొట్టాలి’ అంటూ సీఎం చంద్రబాబు గురువారం అసెంబ్లీలో చెప్పారు. సభలో ప్రవేశ పెట్టిన వివిధ బిల్లులు, తీర్మానాలపై ఆయన మాట్లాడారు. గతంలో ఇంతకంటే కష్టమైన పరిస్థితులు చూశానని, హైదరాబాద్‌లో ఉగ్రవాదం, విద్వేషాలు, మత కలహాలు, సీమలో ఫ్యాక్షన్‌  , విజయవాడలో రౌడీయిజం ఉండేదన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను అణచివేశామన్నారు. ముంద్రా పోర్టుకు ఏపీ అడ్రస్‌తో డ్రగ్స్‌ వచ్చాయని, దానిపై నిరసన తెలిపితే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని అన్నారు. 

రాష్ట్రంలో నేరాలన్నీ గంజాయి మత్తులోనే చేస్తున్నారని, కాలేజీ పరిసరా­ల్లోకి కూడా గంజాయి వెళ్లిందని చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిని మార్చడం కష్టమని అన్నారు. తల్లి, చెల్లిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వారిని జగన్‌ ప్రోత్సహించారని ఆరోపించారు. డిజిటల్‌ కార్పొరేష­న్‌లో సొంత మనుషులను పెట్టి సోషల్‌ మీడియాలో పని చేయించుకున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా లాండ్‌ మాఫియాను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తెచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. సివిల్‌ జడ్జి అధికారాలను రెవెన్యూ అధికారులకు ఇచ్చార­న్నారు. 

ఎవరినైనా లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అధికారిగా పెట్టుకునేలా చట్టంలో పేర్కొన్నారని, అంటే ‘సాక్షి’లో పని చేసే గుమస్తాలను అధికా­రులుగా పెట్టాలని చూశారని అన్నారు. రెవెన్యూ రికార్డులో పేరు మార్చాలంటే ఆ యజమానికి నోటీసు కూడా ఇవ్వడానికి అవకాశం లేకుండా నేరుగా హైకోర్టులో తేల్చుకునేలా చేశారన్నారు. అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామన్నారు. తాము తెచ్చిన యాంటీ లాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ ద్వారా ఎక్కడ భూమి కబ్జా చేసినా, ప్రయత్నించినా, బెదిరించినా శిక్షిస్తామని, భూమి కబ్జా చేయలేదని కూడా వారే నిరూపించుకోవాలని అన్నారు. 

భూ ఆక్రమణలకు పాల్పడ్డవారిని 6 నెలల్లోనే శిక్షిస్తామని, ఇసుక అక్రమాలకు, బియ్యం స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్‌ అమలు చేస్తామ­న్నారు. ఈ మేరకు చట్టంలో మార్పులు చేయాలని హోం మంత్రి అనితకు సూచించారు. అమరవీరుల స్థూపం నిర్మాణానికి రాజధానిలో 5 ఎకరాలు  కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు.  త్వరలోనే 6,100 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 2,812 పోలీస్‌ వాహనాల కొనుగోలుకు రూ.281 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. 

రూ.859 కోట్ల బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. జిల్లాకో సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతపురం, తిరుపతి, రాజమండ్రిలో ప్రాంతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లు, రాజధానిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌  సైన్స్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

వివేకా హత్యపై అధికారులూ అదే చెప్పారు
వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఉదయం సాక్షిలో గుండెపోటుతో చనిపోయారని కథనం నడిపారని, తానూ దానిని నమ్మానని, అధికారులు, విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పారని చంద్ర­బాబు అన్నారు. అక్కడి సీఐని మేనేజ్‌ చేశారని, రక్తం మరకలు కనబడకుండా బాత్రూమ్‌ క్లీన్‌ చేసి మృతదేహాన్ని వెంటనే ఫ్రీజర్‌లో పెట్టారన్నారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి పోస్టుమార్టం చేయాలని అడగ్గా, అప్పుడు నెత్తిపైన గొడ్డలి వేట్లు ఉన్నాయని తేలిందన్నారు. 

గిరిజన మ్యూజియంకు అల్లూరి పేరు
భోగాపురం విమానాశ్రయానికి, అక్కడి గిరిజన మ్యూజియంకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని చంద్రబాబు చెప్పారు. పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించేంత వరకూ కేంద్రంపై పోరాడ­తామని తెలిపారు. దేవాలయాల కమిటీల్లో విశ్వ బ్రాహ్మణులకు కూడా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్‌ కోరారు. శాసనసభలో బుధవారం ఆమోదించి మండలికి పంపిన నాలుగు బిల్లులు యధాతథంగా ఆమోదం పొందినట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. 

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ 
సాక్షి, అమరావతి: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు గురువారం శాసన సభలో చెప్పారు. ఇప్పటికే ఈ అంశాన్ని కేబినెట్‌ ఆమోదించిందని, అసెంబ్లీలో చేసిన తీర్మా­నాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు తీర్మానాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌ గురువారం సభలో ప్రవేశపెట్టారు. మంత్రి సవిత, పలువురు రాయ­లసీమ ఎమ్మెల్యేలు తీర్మానంపై మాట్లాడారు. 

అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కర్నూలును బెస్ట్‌ టౌన్‌గా మార్చడంలో భాగంగా హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యాలయాలు కూడా అక్కడే ఉంటాయన్నారు. వికేంద్రీకరణ తమ విధానమని చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖ, రాయలసీమలో కర్నూలు, తిరుపతి, ఇక్కడ అమరావతి అభివృద్ధి చేస్తామన్నారు.

హార్టికల్చర్‌ అభివృద్ధి చేస్తే రాయ­లసీమకు మహర్దశ వస్తుందని చెప్పారు. అనంతపురానికి బెంగళూరు ఎయిర్‌పోర్టు, కర్నూలుకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు, చిత్తూరుకు చెన్నై ఎయిర్‌పోర్టు దగ్గరగా ఉన్నాయని, ఈ అవకా­శాన్ని అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చన్నారు. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదన్నారు.

చెత్త యూజర్‌ చార్జీలు, కాంట్రాక్టర్ల లబ్ధిపై విచారణ: మంత్రి నారాయణ 
గత ప్రభుత్వంలో చెత్తపై యూజర్‌ చార్జీల వసూలు, కాంట్రాక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ అన్నారు.

5 లక్షల ఉద్యోగాలు: మంత్రి లోకేశ్‌
వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఐటీ, కమ్యూనికేషన్స్‌ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో ఏ ప్రభుత్వం హామీ ఇవ్వలేదని తెలి­పారు. ఎలక్ట్రా­నిక్స్‌ అండ్‌ డేటా సెంటర్‌ పాలï­Üలపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ గత టీడీపీ పాల­నలో 53 కంపెనీలు, రూ.17 వేల కోట్ల పెట్టు­బడి, 96,220 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement