
సాక్షి,తిరుపతి జిల్లా : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు.
ఈ మేరకు గురువారం నాడు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లోకి తెచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో వచ్చే నెల 24 తేదీ వరకు సెక్షన్ 30 అమల్లో ఉంటుందని అన్నారు.
ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదు. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు హెచ్చరించారు.
తిరుమల పర్యటనలో వైఎస్ జగన్
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకుగానూ.. ఆ పాప ప్రక్షాళన కోసం ఈ శనివారం(సెప్టెంబర్ 28) ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. వైఎస్ జగన్ సైతం తిరుమలలో పర్యటించనున్నారు. ఇందుకోసం శుక్రవారం రాత్రే ఆయన తిరుమల చేరుకోనున్నారు. శనివారం ఉదయమే వైఎస్ జగన్ స్వామివారిని దర్శించుకుంటారు.