Top Stories
ప్రధాన వార్తలు

పిఠాపురం జమీందారుగా కొణిదెల నాగబాబు!
పిఠాపురం జమీందారుగా మెగా బ్రదర్ నాగబాబుకు పట్టాభిషేకం అయినట్లేనా?.. ఇక ఆ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు శంకు స్థాపనలు .. రివ్యూలు అన్నీ నాగబాబే చూసుకుంటారా? తెలుగుదేశం నాయకుడు వర్మను పూర్తిగా పక్కనబెట్టేసినట్లేనా?. పరిస్థితులు.. పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏ పనుల్లో ఉంటారో కానీ నిత్యం బిజీగా ఉంటారు. అటు సినిమాలు.. వైద్యం చికిత్స.. బిజినెస్ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉంటారు. గెలిచారే కానీ పిఠాపురం మీద ఏమీ దృష్టి సారించడం లేదు. అక్కడ అభివృద్ధి వంటి పనుల పర్యవేక్షణ.. సమీక్షలకు ఆయనకు టైం చిక్కడం లేదు. పోనీ అలాగని తనను గెలిపించిన తెలుగుదేశం వర్మకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన పరపతి పెరిగిపోతుందని, ప్రజల్లో ఆయన పలుకుబడి ఇనుమడిస్తుంది అని భయం!. అసలే గెలవక గెలవక పవన్ పిఠాపురం(Pithapuram)లో వర్మ పుణ్యమా గెలిచారు. ఇప్పుడు వర్మకు ప్రాధాన్యం ఇవ్వడానికి పవన్ కు ధైర్యం చాలడం లేదు. దీంతో పిఠాపురం బాధ్యతలు చూసేందుకు పవన్ కు ఎలాంటి ఇబ్బంది లేని.. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది..ముప్పు లేని వ్యక్తి కావాలి. సరిగ్గా ఆ ప్లేసులోకి నాగబాబు వచ్చి పడ్డారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు.. ఎంపీలకు ఒక నిర్దిష్ట నియోజకవర్గం ఉంటుంది. ఆ ప్రాంతంలో వారు రాజకీయ కార్యకలాపాలు చేస్తారు కానీ ఎమ్మెల్సీలకు అదేం ఉండదు. దీంతో వాళ్లు తమకు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ రాజకీయం చేస్తారు.పైగా నాగబాబుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో రాజకీయంగా పట్టుంది అని చెప్పేందుకు అవకాశం లేదు. దీంతో ఆయన ఏకంగా పిఠాపురంలో పాగావేసి తమ్ముడు పవన్ తరఫున పెద్దరికం..పెత్తనం చేస్తారన్నమాట. ఈ మేరకు పార్టీ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది. పిఠాపురంలో ఇకపై అధికారిక రివ్యూలు.. సమీక్షలు..అభివృద్ధిపనుల పర్యవేక్షణ కూడా నాగబాబే చేపడతారని పార్టీ ఒక ప్రకటన చేసింది.వాస్తవానికి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని ప్రారంభించాలంటే ఎమ్మెల్యేలు.. మంత్రులే చేయాలి కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు అన్నీ నాగబాబు చూస్తారని పార్టీ చెబుతోంది. ఇకముందు పిఠాపురంలో నాగబాబు(Naga Babu)కు ప్రాధాన్యం తప్ప ఆ ప్రకటనలో ఎక్కడా వర్మ ప్రస్తావన లేకుండా కుట్ర పన్నారు. అంటే రాజకీయంగా వర్మను ఇక తెరమరుగు చేయడమే లక్ష్యంగా పవన్.. నాగబాబు ముందుకు వెళ్తున్నారు.ఇకక ముందు వర్మ తనవాళ్ళకు ఒక పెన్షన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి తీసుకొచ్చేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో ఇటు వర్మ వర్గీయులు లోలోన రగిలిపోతూ బయటకు కక్కలేక.. మింగలేక ఊరుకుంటున్నారు. మున్ముందు వర్మకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం కూడా అనుమానమే. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాము అని ఆనాడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ ఇద్దరూ మాట నిలబెట్టుకున్నట్లయితే నిన్న నాగబాబుతో బాటు వర్మ కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది. కానీ ఆ ఇద్దరూ నమ్మించి వెన్నుపోటు పొడవడంతో వర్మకు ఆశాభంగం మిగిలింది. ఇక ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ ఇప్పించడం ఆయన్ను ప్రాధాన్యమైన పోస్టింగులో ఉంచడం అనేది బ్రదర్స్ కు కూడా ప్రమాదమే. ఎందుకంటే వర్మ స్థానికుడు కాబట్టి ఆయనకు ఏదైనా పదవి దక్కితే ఆయన దూకుడు వేరేగా ఉంటుంది. ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుంది. ఇదంతా పవన్ కు, నాగబాబుకు సైతం ఇబ్బందికరమే. అందుకే వర్మకు ఈ ఐదేళ్లలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న పదవి దక్కడం కలలో కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. వర్మ భుజాల మీదుగా నడిచివెళ్ళి అసెంబ్లీలో కూర్చున్న పవన్ ఇప్పుడు వర్మను పూర్తిగా అణగదొక్కేందుకే అన్నయ్య నాగబాబును పిఠాపురంలో ప్రతిష్టించినట్లు వర్మ అభిమానులు లోలోన మధనపడుతున్నారు. :::సిమ్మాదిరప్పన్న

పల్నాడులో ఘోరం.. వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
పల్నాడు, సాక్షి: కూటమి పాలనలో టీడీపీ గుండాలు మరో దారుణానికి తెగబడ్డారు. కిడ్నాప్ చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్త హరిచంద్రను దారుణంగా హతమార్చారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రెండు రోజుల కిందట నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో పింఛన్ తీసుకోవడానికి వెళ్లిన హరిచంద్ర తిరిగి రాలేదు. టీడీపీ నేతలు కొందరే ఆయన్ని కిడ్నాప్ చేసినట్లు తర్వాత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనను చంపేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు కూడా. చివరకు.. టీడీపీ నేతలే చంపేసి ఆ మృతదేహాన్ని ఆయన పొలంలోనే పడేశారు.

రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతిచెందింది. బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న నాగాంజలి శుక్రవారం ఉదయం మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, గత 28 నుంచి నాగాంజలిని వ్యైదుల బృందం పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. నాగాంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు ఉదయమే పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇప్పటివరకు ఫార్మసీ విద్యార్థిని ఘటనకు సంబంధించి ప్రభుత్వం, మంత్రులు స్పందించకపోవడం గమనార్హం.జరిగింది ఇదీ.. లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి చావుబతుకుల్లో ఉన్న ఫార్మసీ ఫైనలియర్ విద్యార్థిని కేసు దర్యాప్తు దారి తప్పుతోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ఈ ఘటన జరిగితే మూడు రోజులు గోప్యంగా ఉంచడం గమనార్హం. బాధిత విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైన కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ టీడీపీలో క్రియాశీల నేతగా వ్యవహరిస్తున్నందున కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేయగా.. కూటమి సర్కారు మొద్దు నిద్రపై మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఓ మహిళ హోంమంత్రిగా ఉండి కూడా పరామర్శించకపోవడం.. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కిమ్స్ ఆస్పత్రి వద్ద ధర్నా చేశాయి.తన చెల్లిని ఇక్కడకు ఎలా వచ్చిందో అలాగే తమకు ప్రాణాలతో అప్పగించాలని బాధిత విద్యార్థిని అక్క కన్నీళ్లతో వేడుకుంది. పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ వెంటనే ఆసుపత్రికి రావాలని డిమాండ్ చేసింది. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా ఈ విషయం తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారని, దాని అర్థం ఇదేనా? అని నిలదీసింది.నిందితుడు టీడీపీ నేతలకు బంధువు.. ఈ కేసులో అరెస్టయిన కిమ్స్ ఏజీఎం దీపక్ కాకినాడ జిల్లాలోని ఓ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది అవుతాడని తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుగ్గా పని చేశాడు. నిందితుడు మరో టీడీపీ నేతకు అల్లుడు కూడా కావడంతో ఈ కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని, దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో విద్యార్థిని ఆరోగ్యం విషమంగానే ఉందని, బ్రెయిన్‌కు పూర్తిగా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో డ్యామేజ్ ఎక్కువగా ఉందని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. వెంటిలేటర్ ఉన్నందున బీపీ, హార్ట్‌బీట్, పల్స్ నార్మల్‌గా ఉన్నట్లు వెల్లడించారు. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు.

జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
టీమిండియా స్టార్లు సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ.. దేశవాళీ క్రికెట్లో తమ సొంత జట్టును వీడేందుకు సిద్ధమయ్యారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, జైస్వాల్ (Yashasvi Jaiswal) ముంబై జట్టును వీడి.. గోవాకు ఆడటం అధికారికంగా ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వర్గాలు ధ్రువీకరించాయని జాతీయ మీడియా పేర్కొంది.ఖండించిన ఎంసీఏమరోవైపు.. జైస్వాల్ బాటలో సూర్య కూడా టీమ్ మారుతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, సూర్యకుమార్ (Suryakuar Yadav) విషయంలో వస్తున్న వదంతులను ఎంసీఏ ఖండించింది.‘సూర్యకుమార్ యాదవ్ గురించి మీడియాలో వస్తున్న వదంతుల గురించి మాకు సమాచారం ఉంది. అయితే ఈ విషయంపై మేం ఇప్పటికే సూర్యతో మాట్లాడాం. అతను తాను ముంబైకే ఆడుతున్నట్లు స్పష్టం చేశాడు.ఆ వార్తలన్నీ నిరాధారం. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించకుండా ఆటగాళ్లకు మద్దతుగా నిలవాలని అందరినీ కోరుతున్నాం’ అని ఎంసీఏ కార్యదర్శి అభయ్ హడప్ పేర్కొన్నారు. సూర్య కూడా సోషల్ మీడియా ద్వారా నేరుగా ఈ వార్తలను కొట్టిపారేశాడు. ‘ఈ వార్త రాసింది జర్నలిస్టా, స్క్రిప్ట్ రైటరా. కామెడీ సినిమాలు చూడటం మానేసి ఈ కథనాలు చదువుకుంటే చాలు. అర్థంపర్థం లేని విషయమిది’ అని సూర్య వ్యాఖ్యానించాడు. HCA స్పందన ఇదేమరోవైపు.. జైస్వాల్‌కు సంబంధించిన కథనంలో మరో భారత ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma) కూడా హైదరాబాద్‌ను వీడి గోవాకు ఆడబోతున్నట్లుగా వచ్చింది. ఈ విషయంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్పష్టతనిచ్చింది. తిలక్ వర్మతో వ్యక్తిగతంగా మాట్లాడానని, అతడు హైదరాబాద్‌కే ఆడతానని చెప్పినట్లు హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్. దేవరాజ్ తెలిపారు.ఇదీ చదవండి: రబడ ఇంటి బాట న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ ఐపీఎల్ నుంచి స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సఫారీ పేసర్... వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లిన్నట్లు టీమ్ మేనేజ్మెంట్ గురువారం వెల్లడించింది. తాజా సీజన్లో గుజరాత్ జట్టు ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడగా... అందులో రెండింట్లో బరిలోకి దిగిన రబడ 2 వికెట్లు పడగొట్టాడు. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు.‘ముఖ్యమైన వ్యక్తిగత కారణాలతో రబడ దక్షిణాఫ్రికాకు వెళ్లాడు’ అని గుజరాత్ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. అతడు తిరిగి వస్తాడా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. రబడ సేవలు దూరమైనా... మహ్మ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిధ్ కృష్ణ రూపంలో గుజరాత్ టైటాన్స్‌కు నాణ్యమైన పేసర్లు అందుబాటులో ఉన్నారు. దక్షిణాఫ్రికాకే చెందిన గెరాల్డ్ కోట్జీ, అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ కరీమ్ జనత్లో ఒకరిని విదేశీ పేసర్ కోటాలో ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి జట్టుగా అరుదైన రికార్డు

ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
పూర్వవిద్యార్థులందరూ కలిసి కొన్ని ఏళ్లు, దశాబ్దాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నారంటే.. ఎవ్వరికైనా సరే చాలా మంచి ముచ్చటగా అనిపిస్తుంది. ఎంతోకాలం కిందట కలిసి చదువుకుని, కొన్ని సంవత్సరాలుగా.. ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు తెగిపోయిన పరిస్థితుల్లో బతుకుతెరువు బాటలో పడి యాంత్రికంగా గడుపుతున్న జీవితాలకు.. అలాంటి ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఒక మంచి నవనీత లేపనంలా అనిపిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే అలూమ్ని, గెట్ టుగెదర్ కాన్సెప్టులతో వచ్చిన మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, 93 లాంటి సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద తిరుగులేని విజయాల్ని నమోదు చేశాయి.ప్రస్తుతం ఆధునిక సాంకేతికత, కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సోషల్ మీడియా తదితర అనేక కారణాల వల్ల.. పాత కాలం మిత్రుల ఆచూకీ కనిపెట్టడం సులువుగా మారుతున్న తరుణంలో.. ఇంకా ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళ్లనాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. యాభయ్యేళ్ల కిందట కలిసి చదువుకున్న వృద్ధులు కూడా.. ఇలాంటి సమావేశాలు నిర్వహించుకుంటూ.. అప్పటికి జీవించి ఉన్న తమ గురువులను ఆహల్వానించి సత్కరించుకుంటూ.. తమ తమ అప్పటి ఆనందానుభూతులను నెమరు వేసుకుంటూ గడుపుతున్నారంటే.. ఆ పూర్వవిద్యార్థుల సమ్మేళనాలకు ఉన్న ప్రాధాన్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.అయితే.. ఇలాంటి సమ్మేళనాలకు కొన్ని వికృత ఫలితాలు కూడా ఉంటాయని తెలిస్తే మనం నివ్వెరపోతాం. ఆత్మీయ సమ్మేళనాల పుణ్యమాని చిన్నప్పటి ప్రేమానుబంధాలు తిరిగి మొగ్గతొడిగే సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. పరిస్థితుల్ని బట్టి వారి మధ్య ఆత్మీయ బంధాలు బలపడుతుంటాయి. కానీ.. పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో హైస్కూలు జీవితం నాటి ప్రియుడి కాంటాక్ట్ దొరకడం, దానిని వాడుకుంటూ భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధం కొనసాగించడం అనేది వింటేనే వెగటు పుట్టిస్తుంది. అలాంటిది.. ఆ ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం అన్నెం పున్నెం ఎరుగని, తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను ఒక తల్లి తన చేతులతోనే కడతేర్చిందంటే.. మనం నిర్ఘాంతపోతాం. కడుపు మండుతుంది. పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు ఇలాంటి వికృత ఫలితాలను కూడా ఇస్తున్నాయా? అని ఆవేదన చెందుతాం. సంగారెడ్డిలో వెలుగుచూసిన సంఘటన సమాజంలో పతనమవుతున్న నైతిక విలువల తీరును, ఒక మంచి అనుభూతి కోసం జరిగే మంచి పనులను ఎలాంటి వికృత పోకడలతో భ్రష్టు పట్టిస్తున్నారనే వైనాన్ని తెలుసుకోవడానికి మంచి ఉదాహరణ అవుతోంది.సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో ఇటీవల ఒక దారుణం జరిగింది. రజిత- చెన్నయ్య దంపతుల పిల్లలు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. తల్లి రజిత కడుపునొప్పితో విలవిల్లాడుతూ ఆస్పత్రి పాలైంది. భర్తతో తగాదాలు, కుటుంబ సమస్యల కారణంగా ఆమె ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి పెట్టి చంపేసి, తాను ఆత్మహత్యకు పాల్పడిందని తొలుత పోలీసులు భావించారు. భర్త పాత్రపై అనుమానాలు వచ్చాయి. షాపు నుంచి తెచ్చిన పెరుగు కలిపి పెట్టానని, అంతకుమించి ఇంకేం తెలియదని ఆ తల్లి బుకాయించే ప్రయత్నమూ చేసింది. కానీ అసలు వాస్తవాలు నెమ్మదిగా వెలుగులోకి వచ్చాయి.రజిత అలియాస్ లావణ్య ఇంటర్మీడియట్ చదువుతుండగా 2013లో చెన్నయ్యతో పెళ్లయింది. వారికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ కలిగారు. ఆరునెలలుగా రజిత టెన్త్ క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల ఆ ఆత్మీయ సమ్మేళనం కూడా జరిగింది. అప్పటినుంచి.. హైస్కూలు నాటి ప్రియుడు శివతో ఆమె అనుబంధం పెరిగింది. అది వివాహేతర సబంధానికి దారితీసింది. పెళ్లిచేసుకోమని అడిగింది. అయితే ముగ్గురు పిల్లల తల్లిని ఎలాచేసుకుంటానంటూ శివ తిరస్కరించాడు. పిల్లల అడ్డు తొలగితే పోతుందని వారిద్దరూ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పిల్లలను చంపేస్తే ఆ నేరం భర్త మీదకు వెళుతుందని కూడా ప్లాన్ చేసినట్టు వినిపిస్తోంది. మొత్తానికి రజిత.. పెరుగన్నంలో విషం కలిపి ముగ్గురు పిల్లలకు తినిపించి, వారి గొంతు నులిమి చంపేసింది. తాను కడుపునొప్పితో బాధపడుతున్నట్టుగా నాటకమాడింది గానీ.. పోలీసుల విచారణలో బాగోతం మొత్తం బయటపడింది. వివాహేతర సంబంధం కోసం, ప్రియుడితో శాశ్వతంగా కలిసి ఉండడం కోసం పిల్లల్ని తల్లులే కడతేర్చే దుర్మార్గాలు మనం ఇంకా అనేకం సమాజంలో చూస్తున్నాం. కానీ.. అలాంటి ఒక దుర్మార్గానికి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మూలకారణం కావడం ఇక్కడ శోచనీయమైన విషయం.పూర్వవిద్యార్థుల సమ్మేళనాలు ఎంతో గొప్పవి. జీవితంలో పసితనం నాటి స్నేహాలు, ప్రేమలు, ఆప్యాయతలు కొన్ని దశాబ్దాల యెడబాటు తర్వాత.. మళ్లీ చిగురించడం మానసికంగా గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి గెట్ టుగెదర్ కార్యక్రమాల వల్ల.. యాంత్రికంగా మారుతున్న జీవితాల్లో తిరిగి జీవనోత్సాహాన్ని నింపుకోగలుగుతారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చాలాచోట్ల బాగా సక్సెస్ అవుతుంటాయి. అయితే ఇంత మంచి కార్యక్రమాలు కూడా కొన్ని వికృత ఫలితాలకు దారితీస్తున్నాయని తెలిస్తే బాధ కలుగుతుంది. రజిత- శివ లాంటి వాళ్లు ఇలాంటి కార్యక్రమాలనే సాటి సమాజం అనుమానించే విధంగా చేస్తున్నారనడంలో సందేహం లేదు. నైతిక, సామాజిక విలువల స్పృహ లేకపోవడం మనుషుల్ని ఎంతకైనా దిగజారుస్తుందని తెలుసుకోవడానికి, అమృతాన్ని అందించిన క్షీరసాగరమధనంలోంచే గరళం కూడా పుడుతుందని గ్రహించడానికి ఇది మంచి ఉదాహరణ.:: ఎం.రాజేశ్వరి

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
దాదాపు పదిరోజులుగా ఏ మాత్రం తగ్గని బంగారం ధరలు ఈ రోజు (ఏప్రిల్ 4) భారీగా తగ్గాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాంహైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 84,000 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,640 వద్ద నిలిచాయి. నిన్న రూ. 500 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 540 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగిన బంగారం రేటు.. ఈ రోజు వరుసగా రూ. 1600, రూ. 1740 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1600, రూ. 1740 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 84,000 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 91,640 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 84,150 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 91,790 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1600, రూ. 1750 తక్కువ. అయితే.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు (ఏప్రిల్ 4) కేజీ సిల్వర్ రేటు రూ. 1,08,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 99,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: ఆ పోస్టాఫీస్ స్కీమ్ నిలిపివేసిన ప్రభుత్వం

పశ్చిమ బెంగాల్ టీచర్ నియామకాల రద్దులో ట్విస్ట్.. సోమా దాస్‌కు సుప్రీం ఊరట!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ (mamata banerjee) ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (West Bengal Teacher Scam 2016)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది.అయితే వారిలో పశ్చిమ బెంగాల్ మాతృభాష బెంగాలీని బోధిస్తున్న సోమా దాస్ (School teacher Soma Das) అనే ఉపాధ్యాయురాలికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. యథావిధిగా ఆమె ఉద్యోగంలో కొనసాగవచ్చని పేర్కొంది. ఇంతకి ఎవరీ సోమాదాస్? వేలాది మంది టీచర్ల నియామకాల్ని రద్దు చేసిన సుప్రీం.. ఆమె ఒక్కరే ఉద్యోగంలో కొనసాగవచ్చని ఎందుకు తీర్పు ఇచ్చింది.సుప్రీం తీర్పుపై సోమాదాస్ 2016లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేపట్టిన టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాల్లో సోమాదాస్ అనే మహిళ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. తాజాగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం తన తీర్పుతో సోమాదాస్ ఉపాధ్యాయురాలిగా కొనసాగనున్నారు. ఓ వైపు సుప్రీం కోర్టు తీర్పుపై టీచర్‌గా కొనసాగే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారనే నిరాశను వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. నేను నిజంగా అదృష్టవంతురాలి. కానీ వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇది ఎవ్వరూ ఊహిచని విషయం అని తన అభిప్రాయాన్ని తెలిపారు. దీదీ సర్కార్‌పై సోమాదాస్ న్యాయపోరాటం2016లో కోల్‌కతా ప్రభుత్వం 9-10 తరగతి ఉపాధ్యాయ నియామక (ఎస్ఎల్ఎస్టీ) పరీక్షను పెట్టారు. ఆ పరీక్షల్లో సోమాదాస్ అర్హత సాధించారు. మెరిట్ జాబితాలో ఆమె పేరు ఉన్నప్పటికీ.. దీదీ సర్కార్ ఆమెకు టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు. ఇదే అంశంపై సోమాదాస్ న్యాయపోరాటానికి దిగారు. కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ వైపు క్యాన్సర్‌తో పోరాడుతూనేఆమె నియామకంపై హైకోర్టులో కేసు విచారణ, బహిరంగ ఆందోళనలు చేస్తున్న సమయంలో 2019లో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే.. తనకు టీచర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. అదే సమయంలో సోమాదాస్ ఆవేదనను అప్పటి కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ కీలక తీర్పును వెలువరించారు. సోమాదాస్ను ఉపాధ్యాయురాలిగా నియమించాలని జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఆదేశించారు. దీంతో 2022లో దీదీ ప్రభుత్వం సోమాదాస్‌కు బీర్భూమ్లోని నల్హాటిలో మోధురా జిల్లా పాఠశాలలో నియమించింది. ప్రస్తుతం ఆమె అదే స్కూల్లో విధులు నిర్వహిస్తున్నారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తంఈ నేపథ్యంలో 25వేల మంది టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ అత్యున్నత న్యాయ స్థానం తీసుకున్న నిర్ణయంపై సోమాదాస్ స్పందించారు. సుప్రీం తీర్పు హర్షం వ్యక్తం చేశారు. కానీ తనకు ఆమోద యోగ్యం కాదన్నారు. నేను ఎప్పుడూ ఇతరులు వారి ఉద్యోగాలను కోల్పోవాలని అనుకోను. ఈ తీర్పు నాకు ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే 2016 బ్యాచ్‌లో చాలా మంది అర్హులు ఉన్నారు. ప్రభుత్వం, స్కూల్ కమిషన్ నిర్లక్ష్యం కారణంగా అర్హులైన వారు ఎంతో మంది ఉద్యోగాలో కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

మాధవన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో శివానీ రాజశేఖర్.. 'జి.డి. నాయుడు'పై సినిమా
ఆర్. మాధవన్(R. Madhavan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘జి.డి.ఎన్’ అనే టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. భారత ప్రముఖ ఇంజనీరు జి.డి. నాయుడు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రాజశేఖర్, జీవితల కుమార్తె కూడా నటిస్తున్నారు. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మేన్, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూరు’ వంటి పేర్లను గడించిన గోపాల స్వామి దొరైస్వామి నాయుడు(Gopala Swamy Doraiswamy Naidu) షార్ట్‌గా జి. డి. నాయుడు అని కూడా అంటారు. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ‘జి.డి.ఎన్’(GDN) మూవీ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ప్రియమణి, జయరాం, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.జీడీ నాయుడు బయోపిక్‌లో టాలీవుడ్ హీరోయిన్ శివానీ రాజశేఖర్ కూడా నటించనుంది. ఇందులో మాధవన్‌తో పాటుగా బిగ్ స్క్రీన్‌పై ఆమె కనిపించనున్నారు. త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుండటంతో ఏర్పాట్లు స్పీడ్‌గా చేస్తున్నారు. కోయంబత్తూరుకు చెందిన జి.డి నాయుడు కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ, ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్టైల్, ఫొటోగ్రఫీ వంటి సెక్టార్స్‌లో కొన్ని పరికరాల ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్‌లో విప్లవం సృష్టించారని చెప్పవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌ను రూపొందించింది ఆయనే కావడం విశేషం. అందుకే ఆయన్ను ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 1893లో జన్మించిన ఆయన 1974లో మరణించారు. ఈ మధ్యకాలంలో మాధవన్ నటిస్తున్న రెండో బయోపిక్ ఇది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా (2022)లో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేసి మెప్పించారు మాధవన్. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో బయోపిక్‌లో మాధవన్ నటిస్తుండటం విశేషం. మరి... వెండితెరపై మిరాకిల్ మేన్‌గా మాధవన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.

AP Secretariat: ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం
అమరావతి,సాక్షి: ఏపీ సచివాలయంలో (andhra pradesh secretariat) రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర మంత్రులు కార్యకలాపాలు నిర్వహించే రెండవ పేషీ (ap secretariat minister peshi) బ్లాక్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అగ్ని ప్రమాదంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది అగ్నిమాపక బృందానికి సమాచారం అందించారు. ఎస్పీఎఫ్ సమాచారంతో సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం సంభవించిన రెండో బ్లాక్‌లో సచివాలయంలోని రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనితల పేషీలు ఉన్నాయి. ఏపీ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. సచివాలయంలోకి మీడియాని అనుమతించకుండా ఆంక్షలు విధించారు. సిబ్బంది ఐడీ కార్డ్ చూసిన తరువాతే వారిని లోపలికి పంపుతున్నారు. ప్రమాదం జరిగిన తీరు తెన్నుల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న మీడియాను లోపలికి అనుమతించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం.. పై అధికారుల నుండి ఆదేశాలు వచ్చిన తర్వాతే లోపలికి మీడియాని అనుమతి ఇస్తామని చెబుతున్నారు.

Jaguar jet Incident మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదం
గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 28 ఏళ్ల పైలట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ చనిపోయిన తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయనకు కొద్దిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది, మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన తమ కుమారుడు ఇలా అర్థాంతరంగా చనిపోవడంతో పైలట్ కుటుంబంలో విషాదం నెలకొంది.జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో సిద్ధార్థ్ యాదవ్ అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా సిద్ధార్థ్ కో-పైలట్ ఇతరులు ప్రాణాలను కాపాడిన తీరు పలువురి చేత కంట తడిపెట్టించింది. అపారమైన ధైర్యం, త్యాగం ఎన్నటికీ మరువ లేమంటూ పలువురు ఆయనకు నివాళి అర్పించారు.గత నెలలో (మార్చి 23) సిద్ధార్థకు నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2న అతని వివాహం జరిపించేందుకు కుటుంబం సన్నద్ధమవుతుండగా, ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేసింది. గుజరాత్‌లోని సువర్ద గ్రామంలో జామ్‌నగర్ నుండి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే సిద్ధార్థ్ అతి క్లిష్టమైన సమయంలో అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించి , జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం నుండి జెట్‌ను పక్కను మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం కూలిపోయిన తర్వాత మంటలు చెలరేగాయి. స్థానిక గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన కో-పైలట్ మనోజ్ కుమార్ సింగ్ చికిత్స పొందుతున్నాడు. హర్యానిలోని రేవారిలోని భల్ఖి-మజ్రా గ్రామానికి సుశీల్ యాదవ, నీలం దంపతుల ఏకైక సంతానం సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఫైటర్ పైలట్‌గా శిక్షణ పూర్తి చేసి 2016లో NDA పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత భారత వైమానిక దళంలో చేరారు. రెండేళ్లలోపు, అతను ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందాడు. అతని మరణ వార్త అతని కుటుంబంలోని ప్రతి ఒక్కరితోపాటు రేవారీ వాసులను కూడా తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది.రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి, ప్రస్తుతం LICలో పనిచేస్తున్న సుశీల్ యాదవ్ తన కొడుకు ధైర్యాన్ని తనకు గర్వకారణంగా అభివర్ణించారు. సిద్ధార్థ్ భౌతికకాయానికి ఆయన స్వస్థలంలో పూర్తి సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా సిద్ధార్థ్ ముత్తాత కూడా బ్రిటిష్ కాలంలో బెంగాల్ ఇంజనీర్లలో పనిచేశారు. మరోవైపు, అతని తాత పారామిలిటరీ దళాలలో సభ్యుడు. అతని తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు.
ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కాన్పు కోసం వచ్చి మాయం.. ఆపై బస్టాండ్‌లో ప్రత్యక్షం
Jaguar jet Incident మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదం
అభిమానుల గుండెల్లో పవన్ గునపాలు!
పిఠాపురం జమీందారుగా కొణిదెల నాగబాబు!
జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
పెళ్లి రోజే భార్య కళ్ల ముందు కుప్పకూలి..
రూ.44 కోట్ల విలువైన గోల్డ్ కార్డు ప్రదర్శించిన ట్రంప్
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పెళ్లి చీరలు కార్చోబీ సొబగులు : ఈ వివరాలు తెలుసా మీకు?
ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కాన్పు కోసం వచ్చి మాయం.. ఆపై బస్టాండ్‌లో ప్రత్యక్షం
Jaguar jet Incident మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదం
అభిమానుల గుండెల్లో పవన్ గునపాలు!
పిఠాపురం జమీందారుగా కొణిదెల నాగబాబు!
జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
పెళ్లి రోజే భార్య కళ్ల ముందు కుప్పకూలి..
రూ.44 కోట్ల విలువైన గోల్డ్ కార్డు ప్రదర్శించిన ట్రంప్
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పెళ్లి చీరలు కార్చోబీ సొబగులు : ఈ వివరాలు తెలుసా మీకు?
సినిమా

ఎలాగా అయిపోయానే... ‘ఓ భామ అయ్యో రామ’ సాంగ్
సుహాస్, మాళవికా మనోజ్ జంటగా నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయనుంది. కాగా ‘ఎలాగుండే వాడ్నే... ఎలాగా అయిపోయానే...’ అంటూ సాగే ఈ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. చిత్రసంగీత దర్శకుడు రథన్ స్వరాలందించిన ఈ పాటకు శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించగా శరత్ సంతోష్ ఆలపించారు. మొయిన్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘యూత్‌ఫుల్‌గా సాగే ఈ పాటలో హీరో, హీరోయిన్ ఎనర్జీ ప్లస్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని హరీష్ నల్ల పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర బాగుంటుంది’’ అని రామ్ గోధల అన్నారు.

నితిన్‌తో లిప్‌లాక్ చేయలేనన్న నటి..ఇప్పుడేమో గ్లామర్ షోకి సై!
నటీనటులు ట్రెండ్‌కు తగ్గట్లు మారాలి. అప్పుడే వరుస అవకాశాలు వస్తాయి. అలా కాదని పరిమితులు విధిస్తే అక్కడే ఆగిపోతారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకుంది కీర్తి సురేశ్ (Keerthy Suresh). ఒకప్పుడు స్కిన్ షోకి దూరంగా ఉన్న కీర్తి..ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. ఎక్స్ఫోజింగ్కి తాను కూడా రెడీ అంటోంది. సర్కార్ వారి పాట సినిమాతోనే తనలోని గ్లామర్ యాంగిల్‌ని పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి.బాలీవుడ్ నుంచి కూడా పిలుపొచ్చింది. ఆమె నటించిన తొలి హిందీ సినిమా 'బేబీ జాన్'లో రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఆ సీన్లకు ఎస్ చెప్పడంతోనే కీర్తికి ఆ చాన్స్ వచ్చిందట. అయితే ఇంతకంటే తక్కువ రొమాన్స్ ఉన్న పాత్రలను సైతం ఒకప్పుడు కీర్తి రిజెక్ట్ చేసిందట.లిప్‌లాక్ సీన్ ఉందని నితిన్ ‘మ్యాస్ట్రో’ని వదులుకుందట. ఈ చిత్రంలో మొదటగా హీరోయిన్గా కీర్తినే అనుకున్నారు. కథ మొత్తం విని లిప్‌లాక్ సీన్ ఉందని, అలాంటి సన్నివేశాల్లో నటించలేనని చెప్పిందట. ఇది నాలుగేళ్ల కిందటి మాట. అదే ఇప్పుడు అయితే కీర్తి లిప్‌లాక్ సీన్‌కి నో చెప్పేది కాదేమో. అప్పుడే ఇలాంటి సీన్లకు రెడీ అని చెబితే..ఆమె ఖాతాలో చాలా సినిమాలు చేరేవి. రెమ్యునరేషన్ కూడా బాగానే పెరిగేది. ఏది ఏమైనా మహానటిలో మార్పు వచ్చింది. పోటీ ప్రపంచంలోనే కొనసాగాలంటే స్కిన్ షో చేయాల్సిందేనని రియలైజ్ అయినట్లు ఉంది. ఇప్పుడైనా వరుస అవకాశాలు వచ్చి మళ్లీ బిజియెస్ట్ హీరోయిన్గా మారుతుందేమో చూడాలి.

అలాంటి ఛాన్స్ వస్తే 'సై' అంటున్న టాలీవుడ్ హీరోయిన్స్
సిల్వర్ స్క్రీన్‌పై అందంగా మెరిసిపోతుంటారు కథానాయిలు. ఫర్ ఎ చేంజ్ డీ గ్లామరస్‌గా కనిపించే అవకాశం వస్తే... ‘సై’ అంటారు. అలాంటి పాత్రలు చేసినప్పుడు దక్కే కిక్కే వేరు అంటున్నారు ఈ భామలు. గ్లామర్.. డీ గ్లామర్... ఏదైనా కొందరు తారలు ప్రస్తుతం అదిరిపోయే లుక్కుల్లో కనిపించడం మాత్రమే కాదు... నటనపరంగానూ విజృంభిస్తున్నారు. అదిరిపోయే లుక్కుల్లో కనిపించనున్న ఆ అందాల భామల గురించి తెలుసుకుందాం.ప్రతీకారంతో... ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసిన హీరోయిన్ అనుష్కా శెట్టి నటించిన తాజా సినిమా ‘ఘాటీ’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) మూవీ తర్వాత అనుష్క టాలీవుడ్లో కమిటైన చిత్రమిది. ‘వేదం’ (2010) వంటి హిట్ మూవీ తర్వాత అనుష్క, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ఘాటీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారట.బిజినెస్ ఉమన్‌గా సత్తా చాటుతున్న ఆమెను కొందరు కావాలని టార్గెట్ చేస్తారు. ఈ కారణంగా వ్యాపారంలో నష్టాలపాలైన ఆ మహిళ అందుకు కారకులైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని టాక్. ఈ చిత్రంలో దేశీ రాజు అనే లీడ్ క్యారెక్టర్ని తమిళ నటుడు విక్రమ్ ప్రభు పోషించారు. అత్యధిక బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందిన ‘ఘాటీ’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో సహా పలు భాషల్లో ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్ ఆరంభమైనా చిత్రయూనిట్ ఎలాంటి ప్రమోషన్స్ చేపట్టకపోవడంతో విడుదల ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.ఇటు అమ్మోరు తల్లి... అటు రాక్షసి...ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌లా ఉంటారు నయనతార. అలాగే డిఫరెంట్ రోల్స్ చేయడంలోనూ ఆమె ముందుంటారు. నటనలో వైవిధ్యం చూపిస్తుంటారు. ప్రస్తుతం నయనతార తమిళంలో ‘మూక్కుత్తి అమ్మన్ 2’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు. సుందర్.సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో కనిపిస్తారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, అవ్నీ సినీమ్యాక్స్, రౌడీ పిక్చర్స్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రూ. వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో ఇటీవల మొదలైంది. ఇక 2020లో నయనతార లీడ్ రోల్లో నటించిన తమిళ చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) సినిమాకు సీక్వెల్‌గా ‘మూక్కుత్తి అమ్మన్ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘రాక్కాయీ’ సినిమాలో తన చిన్నారిని రక్షించేందుకు ఎంతటి సాహసాలనైనా చేసే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార గెటప్ కొత్తగా ఉంటుంది. సెంథిల్ నల్లస్వామి డైరెక్షన్లో డ్రమ్‌స్టిక్స్ ప్రోడక్షన్, మూవీ వెర్స్ ఇండియా సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.నాగ సాధువుగా...ఓ వైపు హీరోయిన్గా, మరో వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు ప్రత్యేక పాటల్లో సందడి చేస్తున్నారు తమన్నా. ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజయే రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి క్రియేటర్‌గా వ్యవహరించారు. తొలి భాగంలో జోడీగా నటించిన హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా మలిభాగంలోనూ నటించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో తొలిసారిగా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటించారు తమన్నా. ఓదెల గ్రామానికి ఊహించని కష్టం వస్తుంది. ఆ ఊరిలో కొలువై ఉన్న ఓదెల మల్లన్న స్వామి నాగ సాధు (తమన్నా) పాత్ర ద్వారా ఆ సమస్యని ఎలా పరిష్కరించారు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. అలాగే టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. పైగా ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సూపర్ హిట్ కావడంతో ‘ఓదెల 2’పై భారీ అంచనాలున్నాయి. రివాల్వర్ పట్టిన రీటా...‘నేను శైలజ’ (2016) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు కీర్తీ సురేశ్. ఆ తర్వాత ‘నేను లోకల్, అజ్ఞాతవాసి, రంగ్ దే, సర్కారువారి పాట, దసరా, భోళా శంకర్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. మహానటి సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ‘మహానటి’ (2018) చిత్రానికిగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు కీర్తి. ఆమె టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రెడిన్ కింగ్సీ కీలక పాత్రలు పోషించారు.ప్యాషన్ స్టూడియోస్ అండ్ ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనీస్వామి నిర్మించారు. కామెడీ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. సాధారణ జీవితం గడుపుతున్న ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రీటా అనుకోని పరిస్థితుల్లో తుపాకీ చేతపట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి? అనేది ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను హాస్య మూవీస్ అధినేత, నిర్మాత రాజేశ్ దండా సొంతం చేసుకున్నారు.డీ గ్లామరస్‌గా బుట్టబొమ్మ... తెలుగు తెరపై బుట్టబొమ్మలా పూజా హెగ్డే ఎంతో అందంగా కనిపించారు. ఎన్నో గ్లామరస్ రోల్స్ కూడా చేశారు. కానీ రొటీన్‌కి డిఫరెంట్‌గా పూజా హెగ్డే తొలిసారిగా ఓ డీ గ్లామరస్ రోల్ చేశారు. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘రెట్రో’. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. ఈ ‘రెట్రో’ మూవీలోనే పూజా హెగ్డే డీ గ్లామరస్ రోల్ చేశారు. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ‘రెట్రో’ మే1న విడుదల కానుంది. ఇంకా రాఘవా లారెన్స్ సక్సెస్ఫుల్ హారర్ ఫ్రాంచైజీ ‘కాంచన’ లేటెస్ట్ మూవీ ‘కాంచన 5’లో పూజా హెగ్డే ఘోస్ట్ రోల్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే... పూజాకు ఈ రోల్, గెటప్ కూడా సరికొత్తదే.సీతగా సాయిపల్లవి... పల్లెటూరి అమ్మాయిలా, స్టూడెంట్‌లా... ఇలా హీరోయిన్ సాయిపల్లవి ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలు చేశారు. కానీ ఇప్పటివరకు ‘రామాయణం, మహాభారతం’ వంటి ఇతిహాసాల నేపథ్యంలో రూపొందిన సినిమాల్లో సాయి పల్లవి స్క్రీన్‌పై కనిపించలేదు. అయితే సీతగా సాయిపల్లవి ఎంత అద్భుతంగా వెండితెరపై మెరిసిపోతారో, వచ్చే ఏడాది దీపావళికి సిల్వర్ స్క్రీన్‌పై చూడొచ్చు. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ‘రామాయణ’ మూవీ తీస్తున్నారు.ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. లక్ష్మణుడిగా రవిదుబే, హనుమంతుని పాత్రలో సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారని సమాచారం. నితీష్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా రిలీజ్ కానున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... బాలీవుడ్లో సాయిపల్లవి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే హిందీలో సాయి పల్లవి ‘ఏక్ దిన్’ అనే లవ్‌స్టోరీ మూవీ కూడా చేశారు. ఆమిర్ ఖాన్ తనయుడు జూనైద్ ఖాన్ నటించిన ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.మహిళల చుట్టూ పరదా...అనుపమా పరమేశ్వరన్ కూడా జోరుమీదున్నారు. అటు హీరోయిన్గా, ఇటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారామె. తాజాగా ఆమె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘పరదా’. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. దర్శనా రాజేంద్రన్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియాపై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. వైవిధ్యమైన సోషియో డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో సుబ్బు పాత్రలో నటించారు అనుపమ. ఆమె పుట్టినరోజు (ఫిబ్రవరి 18) సందర్భంగా చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది. ‘పరదాలమ్మా పరదాలు... రంగురంగుల పరదాలు... డిజైనర్ పరదాలు.... తీసుకోవాలమ్మా తీసుకోవాలి’ అంటూ అనుపమ చెప్పే డైలాగులకి మంచి స్పందన వచ్చింది. మహిళల చుట్టూ సాగే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందని యూనిట్ పేర్కొంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేటిని ప్రకటించనున్నారు మేకర్స్. స్వారీకి సై...‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు సంయుక్త. ఆ తర్వాత ‘బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి హిట్ సినిమాల్లో నటించారామె. ప్రస్తుతం తెలుగులోనూ చేతి నిండా ప్రాజెక్టులతో దూసుకెళుతున్నారు. ‘స్వయంభూ, నారి నారి నడుమ మురారి, హైందవ, అఖండ 2: తాండవం’ వంటి తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నారామె. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారు.ఇదిలా ఉంటే... నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘స్వయంభూ’. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యోధుడి పాత్ర కోసం నిఖిల్ మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్న ఈ మూవీలో సంయుక్త కూడా పోరాట సన్నివేశాలు చేయాల్సి ఉందట. ఈ స్టంట్స్ చేయడానికి గుర్రపు స్వారీ నేర్చుకున్నారు సంయుక్త. మరి.. ఆమె పోరాటాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి చూడాలి. ఇదిలా ఉంటే... సంయుక్త టిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మోహన్‌లాల్ హీరోగా రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్త. యువరాణి పంచమి‘సవ్యసాచి’ (2018) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నిధీ అగర్వాల్. ‘మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రోడక్షన్స్పై ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ మూవీ మే 9న విడుదల కానుంది. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందిన ‘హరి హర వీరమల్లు’లో చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ నటించగా.. పంచమి అనే యువరాణి పాత్రలో నిధీ అగర్వాల్ సరికొత్తగా కనిపించనున్నారు. ఆమె పాత్రకు చాలాప్రాధాన్యం ఉంటుందట. ఈ కథానాయికలే కాదు... ఇంకొందరు కూడా వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి, మెప్పించనున్నారు.

పొట్టి గౌనులో సుప్రీత హోయలు.. బ్లూ శారీలో అనసూయ అందాలు!
పొట్టి గౌనులో సురేఖవాణి కూతురు సుప్రీత హోయలు..కామాఖ్య ఆలయంలో సంయుక్త మీనన్ పూజలు..ఫ్యాషన్ షోలో మెరిసిన అత్తారింటికి దారేది హీరోయిన్..బ్లూ శారీలో అనసూయ బ్యూటీఫుల్ లుక్స్..రాబిన్‌హుడ్ హీరోయిన్ శ్రీలీల క్యూట్ పిక్స్.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)
న్యూస్ పాడ్‌కాస్ట్

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం
క్రీడలు

ఒడిశా టైటిల్ నిలబెట్టుకునేనా!
ఝాన్సీ (ఉత్తరప్రదేశ్): పురుషుల సీనియర్ హాకీ నేషనల్ చాంపియన్‌షిప్‌నకు వేళైంది. శుక్రవారం ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ ఈనెల 15న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. ‘త్రీ డివిజన్’ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 30 జట్లు పాల్గొంటున్నాయి. గత ఏడాది తమిళనాడులో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ఒడిశా జట్టు టైటిల్ సాధించి సంచలనం సృష్టించింది. వరుసగా రెండో ఏడాది ఒడిశా తమ జోరు కొనసాగించి టైటిల్ నిలబెట్టుకుంటుందో లేదో వేచి చూడాలి. ‘ఎ’ డివిజన్లో ఉన్న 12 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతుండగా... ‘బి’ డివిజన్లోని 10 జట్లు, ‘సి’ డివిజన్లోని 8 జట్లు ప్రమోషన్ కోసం ప్రయత్నించనున్నాయి. ప్రదర్శన ఆధారంగా వచ్చే ఏడాది తిరిగి డివిజన్ల మార్పు జరుగుతుంది. ‘సి’ డివిజన్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు... వచ్చే ఏడాది ‘బి’ డివిజన్‌కు... ‘బి’ డివిజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన రెండు జట్లు ‘ఎ’ డివిజన్‌కు చేరనున్నాయి. ప్రతి డివిజన్లో కింది స్థానాల్లో నిలిచిన రెండు జట్లు... డిమోషన్ పొందుతాయి. ‘మహిళల సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌ను ఈ ఫార్మాట్లో నిర్వహించడం వల్ల ఆటకు మేలు జరిగింది. అందుకే పురుషుల విభాగంలోనూ దీన్ని కొనసాగిస్తున్నాం. దీంతో ప్రతి డివిజన్లోని జట్టు మరింత మెరుగైన స్థితిలో నిలిచేందుకు ప్రయత్నిస్తుంది’అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అన్నాడు. » ‘ఎ’ డివిజన్లోని 12 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో మూడు టీమ్‌ల చొప్పున పోటీ పడనున్నాయి. లీగ్ దశ ముగిసేసరికి గ్రూప్ అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. » ఈనెల 13న సెమీఫైనల్స్, 15న ఫైనల్ నిర్వహించనున్నారు. » డిఫెండింగ్ చాంపియన్ ఒడిశాతో పాటు రన్నరప్ హరియాణా జట్లు ‘ఎ’ డివిజన్ నుంచి బరిలోకి దిగనున్నాయి. ఈ రెండు జట్లతో పాటు పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్, కర్ణాటక, పుదుచ్చేరి జట్లు ‘ఎ’ డివిజన్లో చోటు దక్కించుకున్నాయి. » ‘బి’, ‘సి’డివిజన్ మ్యాచ్‌లు నేటి నుంచి ప్రారంభం కానుండగా... ‘ఎ’ డివిజన్ మ్యాచ్‌లు ఈ నెల 8న ఆరంభమవుతాయి. » ఇది 15వ పురుషుల సీనియర్ హాకీ జాతీయ చాంపియన్‌షిప్ కాగా... గత ప్రదర్శన ఆధారంగా జట్లను విభజించారు. » తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు ప్రస్తుతం ‘బి’ డివిజన్లో ఉన్నాయి. వీటితో పాటు చండీగఢ్, గోవా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మిజోరం, దాద్రా నగర్ హవేలీ–దామన్ దియు, కేరళ, అస్సాం జట్లు కూడా ఇదే గ్రూప్‌లో రెండు ‘పూల్స్’గా పోటీ పడనున్నాయి. » ‘సి’ డివిజన్లో రాజస్తాన్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశీ్మర్, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్, గుజరాత్ జట్లున్నాయి. » ఒక్కో మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు 3 పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ ‘డ్రా’ అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది.

127వ స్థానంలో...
లుసానే (స్విట్జర్లాండ్): ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయి మ్యాచ్‌ల్లో ఆశించిన ఫలితాలు సాధించడంలో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు విఫలమవుతోంది. ఈ నిరాశాజనక ప్రదర్శన ప్రభావం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత జట్టుపై పడింది. గురువారం విడుదల చేసిన ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 127వ స్థానానికి చేరుకుంది. క్రితంసారి భారత జట్టు 126వ స్థానంలో ఉంది. షిల్లాంగ్‌లో ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’ చేసుకుంది. తమకంటే మెరుగైన స్థానంలో ఉన్న భారత జట్టుతో మ్యాచ్‌ను 0–0తో ‘డ్రా’ చేసుకోవడం బంగ్లాదేశ్ జట్టుకు కలిసొచ్చిoది. ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి 183 ర్యాంక్‌లో నిలిచింది. గత ఏడాది జూన్‌లో భారత స్టార్ ప్లేయర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సునీల్ ఛెత్రి గుడ్‌బై చెప్పాక భారత ప్రదర్శన తీసికట్టుగా మారింది. దాంతో గత నెలలో సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో, అంతకుముందు మాల్దీవులుతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత జట్టుకు సునీల్ ఛెత్రి నాయకత్వం వహించాడు. కొత్త కోచ్ మనోలో మార్క్వెజ్ వచ్చాక భారత జట్టు ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. భారత్ తమ అత్యుత్తమ ర్యాంక్ 94ను 1996లో సాధించింది. ఆ తర్వాత టీమిండియా తమ అత్యుత్తమ ర్యాంక్‌ను అధిగమించడంలో విఫలమవుతోంది. వరుసగా మూడోసారి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు గ్రూప్ ‘సి’లో తమ తదుపరి మ్యాచ్‌ను జూన్ 10న హాంకాంగ్‌తో ఆడుతుంది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత విశ్వవిజేత అర్జెంటీనా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... స్పెయిన్ ఒక స్థానం మెరుగుపర్చుకొని రెండో ర్యాంక్‌కు చేరుకోగా... ఫ్రాన్స్ ఒక స్థానం పడిపోయి మూడో ర్యాంక్‌లో నిలిచింది. ఇప్పటికే 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన ఆసియా దేశాలు జపాన్ 15వ స్థానంలో, ఇరాన్ 18వ స్థానంలో ఉన్నాయి.

సన్‌రైజర్స్ పరాజయాల ‘హ్యాట్రిక్’
గత ఐపీఎల్ సీజన్ రన్నరప్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓడింది. తొలి పోరులో మెరుపు బ్యాటింగ్‌తో భారీ విజయం సాధించిన టీమ్ అదే బ్యాటింగ్ వైఫల్యాలతో వరుసగా మూడో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. 2024 ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన సమరంలో చివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌దే పైచేయి అయింది. సొంత మైదానంలో ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగి భారీ స్కోరు సాధించిన కేకేఆర్ ఆపై చక్కటి బౌలింగ్‌తో రైజర్స్‌ను నిలువరించింది. ఛేదనలో 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ ఆపై కోలుకోలేకపోయింది. కోల్‌కతా: మూడు రోజుల క్రితం ముంబై చేతిలో చిత్తుగా ఓడి పట్టికలో చివరి స్థానానికి పడిపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) వెంటనే భారీ విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా 80 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), అంగ్కృష్ రఘువంశీ (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... కెప్టెన్ అజింక్య రహానే (27 బంతుల్లో 38; 1 ఫోర్, 4 సిక్స్‌లు), రింకూ సింగ్ (17 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. రఘువంశీ, రహానే మూడో వికెట్‌కు 51 బంతుల్లోనే 81 పరుగులు జోడించగా... వెంకటేశ్, రింకూ ఐదో వికెట్‌కు 41 బంతుల్లోనే 91 పరుగులు జత చేయడం విశేషం. అనంతరం రైజర్స్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... 20 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ ఆట ముగిసింది. కీలక భాగస్వామ్యాలు... నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ మూడు భిన్న దశల్లో సాగింది. ఓపెనర్లు డికాక్ (1), నరైన్ (7) విఫలం కావడంతో 16 పరుగులకే జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రహానే, రఘువంశీ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 53 పరుగులకు చేరింది. అన్సారీ ఓవర్లో రఘువంశీ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన తర్వాత అదే ఓవర్లో రహానే వెనుదిరిగాడు. 43 పరుగుల వద్ద నితీశ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రఘువంశీ 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే అతను అవుటయ్యాడు. ఇక్కడ కేకేఆర్ బ్యాటింగ్ కొద్దిసేపు తడబడింది. వరుసగా 18 బంతుల పాటు బౌండరీ రాలేదు. 15 ఓవర్లలో జట్టు స్కోరు 122/4. సన్‌రైజర్స్ పట్టు బిగిస్తున్నట్లు కనిపించిన దశలో ఆఖరి 5 ఓవర్లలో కోల్‌కతా ఆటను మార్చేసింది. వెంకటేశ్, రింకూ ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు. హర్షల్ ఓవర్లో రింకూ వరుసగా 3 ఫోర్లు కొట్టగా, సిమర్జిత్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 17 పరుగులు వచ్చాయి. కమిన్స్ వేసిన 19వ ఓవర్లో వెంకటేశ్ వరుస బంతుల్లో 4, 6, 4, 4తో పండగ చేసుకున్నాడు. 25 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆఖరి 5 ఓవర్లలో జట్టు 78 పరుగులు సాధించింది. టపటపా... ఛేదనలో రైజర్స్ ఇన్నింగ్స్ పేలవంగా మొదలైంది. తొలి 13 బంతుల్లోనే హెడ్ (4), అభిషేక్ శర్మ (2), ఇషాన్ కిషన్ (2) వెనుదిరిగారు. ఆ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా పేలవ షాట్ ఆడి అవుట్ కాగా, కమిందు మెండిస్ (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఎక్కువసేపు నిలవలేదు. క్లాసెన్ కొద్దిసేపు పోరాడినా అది ఏమాత్రం సరిపోలేదు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 1; నరైన్ (సి) క్లాసెన్ (బి) షమీ 7; రహానే (సి) క్లాసెన్ (బి) అన్సారీ 38; రఘువంశీ (సి) హర్షల్ (బి) మెండిస్ 50; వెంకటేశ్ (సి) అనికేత్ (బి) హర్షల్ 60; రింకూ సింగ్ (నాటౌట్) 32; రసెల్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–14, 2–16, 3–97, 4–106, 5–197, 6–200. బౌలింగ్: షమీ 4–0–29–1, కమిన్స్ 4–0–44–1, సిమర్జీత్ సింగ్ 4–0–47–0, జీషాన్ అన్సారీ 3–0–25–1, హర్షల్ 4–0–43–1, కమిందు మెండిస్ 1–0–4–1 సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) రాణా (బి) వైభవ్ అరోరా 4; అభిషేక్ (సి) వెంకటేశ్ (బి) రాణా 2; ఇషాన్ కిషన్ (సి) రహానే (బి) వైభవ్ అరోరా 2; నితీశ్ రెడ్డి (సి) నరైన్ (బి) రసెల్ 19; కమిందు (సి) (సబ్) అనుకూల్ (బి) నరైన్ 27; క్లాసెన్ (సి) మొయిన్ అలీ (బి) వైభవ్ అరోరా 33; అనికేత్ (సి) వెంకటేశ్ (బి) వరుణ్ 6; కమిన్స్ (సి) రాణా (బి) వరుణ్ 14; హర్షల్ (సి అండ్ బి) రసెల్ 3, సిమర్జీత్ (బి) వరుణ్ 0; షమీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (16.4 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1–4, 2–9, 3–9, 4–44, 5–66, 6–75, 7–112, 8–114, 9–114, 10–120. బౌలింగ్: వైభవ్ అరోరా 4–1–29–3, హర్షిత్ రాణా 3–0–15–1, వరుణ్ చక్రవర్తి 4–0–22–3, ఆండ్రీ రసెల్ 1.4–0–21–2, నరైన్ 4–0–30–1. ఐపీఎల్లో నేడులక్నో X ముంబై వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Kamindu Mendis: కుడి ఎడమైతే పొరపాటు లేదోయి...
శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. కుడి చేత్తో ఆఫ్ స్పిన్, ఎడమ చేత్తో లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ వేయగల నైపుణ్యం అతని సొంతం. దీనిని అతను తన తొలి ఓవర్లోనే చూపించాడు. ఈ ఓవర్లో కుడి చేతి వాటం బ్యాటర్ రఘువంశీకి లెఫ్టార్మ్ స్పిన్‌తో 3 బంతులు వేసిన మెండిస్... ఎడంచేతి వాటం బ్యాటర్లు వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్‌లకు ఆఫ్‌స్పిన్‌తో మరో 3 బంతులు వేశాడు. ఈ క్రమంలో రఘువంశీ వికెట్ కూడా దక్కింది. అయితే అతడిని సమర్థంగా వాడుకోవడంలో రైజర్స్ కెప్టెన్ కమిన్స్ విఫలమయ్యాడు. ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్ కమిందు బౌలింగ్ చేయగా... ఆ తర్వాత పేసర్ల బౌలింగ్‌లో కేకేఆర్ విరుచుకుపడుతున్న సమయంలోనూ కనీసం మరో ఓవర్ కూడా వేయించకుండా ఒక ఓవర్‌కే పరిమితం చేశాడు. బ్యాటింగ్‌లో ‘0’ వద్ద రసెల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కమిందు... రసెల్ ఓవర్లోనే 2 సిక్స్‌లు, ఫోర్ బాదాడు.
బిజినెస్

ఆర్థికానికి కుంభమేళా బూస్ట్
ముంబై: ప్రయాగ్‌రాజ్ వేదికగా నెల రోజులకు పైగా జరిగిన మహా కుంభమేళా కార్యక్రమం దేశ ఆర్థిక రంగానికి మంచి బూస్ట్ (బలం) ఇచ్చినట్టయిందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక పేర్కొంది. రూ.2.8 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు మహా కుంభమేళా సందర్భంగా జరిగినట్టు తెలిపింది. ప్రత్యక్ష, పరోక్ష వినియోగం రూపంలో ఈ మేరకు ఆర్థిక రంగానికి ఉత్పాదకత సమకూరినట్టు వివరించింది. డేటా ఆధారంగా ఈ అంచనాలకు వచ్చినట్టు తెలిపింది. మేళాకు హాజరైన వారు రవాణా, వసతి, ఆహారం, పర్యాటక సేవలు, స్థానిక కొనుగోళ్ల రూపంలో రూ.90,000 కోట్లు ప్రత్యక్షంగా ఆర్థిక వ్యవస్థకు సమకూరినట్టు నివేదికలో పేర్కొంది. పరోక్ష రూపంలో ఎయిర్‌లైన్స్, హోటల్స్ తదితర రంగాలకు రూ.80,000 కోట్ల వ్యాపారం లభించినట్టు వివరించింది. మహాకుంభ మేళా సందర్భంగా చోటుచేసుకున్న వ్యాపార లావాదేవీలు ఆర్థిక వ్యవస్థపై ఎంతో సానుకూల ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ఈ సందర్భంగా ఆదాయం సంపాదించుకున్న వర్గాలు ఇళ్లు, విద్య, ఆరోగ్యం, రోజువారీ అవసరాల కోసం చేసే ఖర్చులతో ఆర్థిక వ్యవస్థకు రూ.1.1 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించింది. మొత్తం రూ.2.8 లక్షల కోట్ల కార్యకలాపాల్లో రూ.2.3 లక్షల కోట్లు వినియోగ వ్యయంగాను, మిగిలిన రూ.50,000 కోట్లు మౌలిక సదుపాయాలపై చేసిన వ్యయాల రూపంలోను ఉన్నట్టు పేర్కొంది. మహా కుంభమేళా సందర్భంగా రూ.2 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు చోటుచేసుకుని ఉండొచ్చని ఇప్పటికే పలు అంచనాలు వ్యక్తం కావడం గమనార్హం. రవాణా కోసమే రూ.37వేల కోట్లు మొత్తం వినియోగ వ్యయంలో రవాణా కోసం చేసింది సగం మేర ఉంటుందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక తెలిపింది. రూ.37,000 కోట్లు రవాణా కోసం వ్యయం చేయగా, ఇందులో రూ.17,700 కోట్లు రైల్వేకు సమకూరినట్టు అంచనా వేసింది. హెలీకాప్టర్ జాయ్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్, అమ్యూజ్మెంట్పార్క్ ప్రవేశాలు, యోగ తదితర వాటి కోసమే భక్తులు రూ.10,000 కోట్ల వరకు వ్యయం చేసినట్టు వివరించింది. 2 లక్షల మంది రిటైల్ వర్తకులు కుంభమేళా సందర్భంగా రూ.7,000 కోట్ల వ్యాపారం నిర్వహించినట్టు తెలిపింది. ఆహార సేవలకు రూ.6,500 కోట్లు సమకూరినట్టు పేర్కొంది. టీ స్టాళ్ల యజమానులు ఒక్కొక్కరు రోజుకు రూ. 30,000 సంపాదించుకున్నారని వెల్లడించింది.

టారిఫ్‌ల పెంపు అమెరికా సెల్ఫ్‌గోల్
న్యూఢిల్లీ: అమెరికా 60 దేశాలపై ప్రతీకార సుంకాలు మోపడం అన్నది తనకు తాను నష్టం చేసుకోవడమేనని (సెల్ఫ్ గోల్) ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. వీటి కారణంగా భారత్‌పై స్వల్ప ప్రభావమే ఉంటుందన్నారు. ‘‘స్వల్పకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడనుంది. ఫుట్‌బాల్ ఆటగాళ్లు చెప్పినట్టు ఇదొక సెల్ఫ్ గోల్ (తన చర్యతో ప్రత్యర్థి టీమ్‌కు పాయింట్ వచ్చేలా చేసేవాడు). భారత ఎగుమతులపై అమెరికా ప్రత్యక్ష టారిఫ్‌లు ప్రభావం చూపిస్తే అది యూఎస్‌లో ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దాంతో డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు భారత వృద్ధిపైనా ప్రభావం పడుతుంది. అయితే ఇతర దేశాలపైనా అమెరికా టారిఫ్‌లు మోపింది. కనుక ఆయా దేశాల ఉత్పత్తిదారులతో భారత్ పోటీపడుతుంది. కేవలం భారత్‌కు మాత్రమే విధించే టారిఫ్‌లతో పోల్చి చూస్తే ప్రస్తుత నిర్ణయం కారణంగా పడే ప్రభావం తక్కువే’’అని రఘురామ్ రాజన్ వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రాజన్ ప్రస్తుతం ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికా ఉత్పత్తిని పెంచాలన్నది ట్రంప్ దీర్ఘకాల ఉద్దేశ్యమని, దీని ఫలితం ఏదైనా దీర్ఘకాలంలోనే కనిపిస్తుందన్నారు. దేశీ వినియోగంతో పోల్చితే ఎగుమతులు తక్కువగానే ఉన్నందున.. అమెరికా ప్రతి సుంకాలు భారత్‌లో ప్రతిద్రవ్యోల్బణాన్ని కలిగించొచ్చన్నారు. అమెరికా మార్కెట్‌కు దారులు మూసుకుపోవడంతో భారత మార్కెట్‌కు ఎగుమతులకు చైనా ప్రయతి్నంచొచ్చని రాజన్ అంచనా వేశారు. ప్రపంచం మరింత రక్షణాత్మకంగా మారుతుండడంతో వాణిజ్యం విషయంలో తెలివిగా వ్యవహరించాలని సూచించారు. చైనాతో మరింత తటస్థ సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. సార్క్, పొరుగు దేశాలతోనూ బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

అభివృద్ధి చెందిన దేశంగా భారత్
న్యూఢిల్లీ: స్టార్టప్ ఎకోసిస్టమ్ ద్వారా సంస్కరణ, ఆచరణ, పరివర్తనకు భారత్ సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్ర సహాయమంత్రి జితిన్ ప్రసాద పేర్కొన్నారు. 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా లేదా వికసిత్ భారత్‌గా ఆవిర్భవించడంలో సామాన్యుడు సైతం కీలక పాత్ర పోషించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రజలు సుస్థిర, పటిష్ట ప్రభుత్వానికి ఓటు వేయడంతో దేశం ధృడంగా ఉన్నట్లు స్టార్టప్ మహాకుంభ్ సందర్భంగా వాణిజ్యం, పరిశ్రమలు, ఎల్రక్టానిక్స్, ఐటీ పరిశ్రమల సహాయ మంత్రి ప్రసాద వ్యాఖ్యానించారు. నూతన ఆవిష్కరణల స్టార్టప్ కమ్యూనిటీ, కొత్త ఆలోచనలతో ప్రధాని మోడీ లక్ష్యాలైన సంస్కరణ, ఆచరణ, పరివర్తనా భారత్‌కు మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. సామర్థ్యం, నైపుణ్యాలు గల భారత్ సవాళ్లకు సిద్ధమని ప్రపంచానికి చాటాలని సూచించారు. 7 ట్రిలియన్ డాలర్లకు భారత్ 2030కల్లా భారత్ 7 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే వీలున్నట్లు స్టార్టప్ మహాకుంభ్ సందర్భంగా ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ రంగం జీడీపీలో ట్రిలియన్ డాలర్లను సమకూర్చడం ద్వారా ఇందుకు కీలక పాత్ర పోషించనున్నట్లు పేర్కొన్నారు. ఆవిష్కరణలతో దేశ, విదేశీ సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ రంగం ప్రాధాన్యత వహించనున్నట్లు తెలియజేశారు. దేశ భవిష్యత్ మార్పులలో టెక్నాలజీదే ప్రధాన పాత్రగా నిలవనున్నట్లు వ్యాఖ్యానించారు. డీప్ టెక్ ద్వారా హెల్త్‌కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ తదితర రంగాల పరివర్తనలో ఐటీ నాయకత్వం వహించనున్నట్లు అంచనా వేశారు. 2047కల్లా వికసిత్ భారత్‌గా ఆవిర్భవించే ప్రణాళికల్లో ఆర్థిక వృద్ధితోపాటు.. సాంకేతిక ఆవిష్కరణలు సైతం కీలక పాత్ర పోషించనున్నట్లు వివరించారు.గ్రోసరీ డెలివరీలు, ఐస్‌క్రీమ్ తయారీకాదు!స్టార్టప్‌లు హైటెక్పై దృష్టి పెట్టాలి వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలుదేశీ స్టార్టప్ కమ్యూనిటీ గ్రోసరీ డెలివరీలు, ఐస్‌క్రీమ్, చిప్స్ తయారీ నుంచి దృష్టి మరల్చాలని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఏఐ తదితర హైటెక్ రంగాలపై దృష్టి పెట్టాలని స్టార్టప్ మహాకుంభ్ సందర్భంగా సూచించారు. నిజానికి మరింతమంది దేశీ ఇన్వెస్టర్లు స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోకి ప్రవేశించవలసిన అవసరం ఉన్నట్లు పేర్కొన్నారు. ‘డెలివరీ బాయ్‌లతో మనం సంతోషంగా ఉన్నామా? ఇదేనా భారత్ భవిష్యత్’ అంటూ ప్రశ్నించారు. ఇది స్టార్టప్కాదని, ఇది ఎంట్రప్రెన్యూర్షిప్ అని వ్యాఖ్యానించారు. మరోపక్క రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్, 3డీ మ్యాన్యుఫాక్చరింగ్, తదుపరి తరం ఫ్యాక్టరీలు తయారవుతున్నట్లు తెలియజేశారు. కొత్త స్టార్టప్‌లు దేశ భవిష్యత్‌వైపు దృష్టి పెట్టాలని సూచించారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ, టెక్నలాజికల్ వృద్ధికి స్టార్టప్‌లు దోహదపడుతున్నట్లు తెలియజేశారు.

కొన్నింటికి మోదం.. కొన్నింటికి ఖేదం
న్యూఢిల్లీ/ముంబై: భారత ఎగుమతులపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు కొన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించనుండగా.. అదే సమయంలో కొన్ని రంగాలకు ఎగుమతి అవకాశాలను విస్తృతం చేయనుంది. ముఖ్యంగా భారత ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లు, ఇంధన ఉత్పత్తులు, అమెరికాలో లభించని కొన్ని రకాల అరుదైన ఖనిజాలకు ట్రంప్ సర్కారు టారిఫ్‌ల నుంచి మినహాయింపు కల్పించింది. మిగిలిన అన్ని ఉత్పత్తులపైనా 27 శాతం అదనపు సుంకాన్ని మోపింది. దీంతో ఆటోమొబైల్ వాహనాలు, వాటి విడిభాగాలు, వైద్య పరికరాలు, రత్నాభరణాల ఎగుమతులపై ఎక్కువ ప్రభావం పడుతుందన్న అంచనాలు నెలకొన్నాయి.రత్నాభరణాల ఎగుమతులకు ఎదురుదెబ్బ: జీజేఈపీసీ అమెరికా విధించిన 27 శాతం ప్రతీకార సుంకాలు భారత జెమ్స్ అండ్ జ్యుయలరీ (రత్నాలు, ఆభరణాలు) ఎగుమతులకు పెద్ద ఎదురుదెబ్బగా జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) పేర్కొంది. అమెరికాకు భారత్ నుంచి ఏటా 10 బిలియన్ డాలర్ల రత్నాభరణాల ఎగుమతులు జరుగుతుండగా, వీటికి సవాళ్లు ఎదురుకానున్నట్టు పేర్కొంది. ‘‘భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా పురోగతికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. టారిఫ్‌లను అధిగమించేందుకు ఇది కీలకం’’అని జీజేఈపీసీ పేర్కొంది. భారత్ నుంచి అమెరికా ఏటా 11.58 బిలియన్ డాలర్ల మేర జెమ్స్, జ్యుయలరీని దిగుమతి చేసుకుంటుంటే.. అదే సమయంలో భారత్‌కు అమెరికా 5.31 బిలియన్ డాలర్ల రత్నాభరణాలను ఎగుమతి చేస్తోంది. వైద్య పరికరాలకు ప్రతికూలం.. ప్రతీకార టారిఫ్‌లతో మెడికల్ డివైజ్‌ల ఎగుమతులపై ప్రభావం పడనుందని, పరిశ్రమ వృద్ధికి సవాలుగా మారుతుందని ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఏఐఎంఈడీ) ఫోరం కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. 2023–24లో భారత్ నుంచి అమెరికాకు 714.38 మిలియన్ డా లర్ల విలువైన పరికరాలు ఎగుమతయ్యాయి.ఫార్మాకు ఊరట చౌకగా ఔషధాలు అందిస్తున్న భారత ఫార్మాకి ప్రతీకార టారిఫ్‌ల నుంచి ట్రంప్ సర్కార్ మినహాయింపునిచ్చింది. అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు 9 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. 2022లో అక్కడి ప్రతి పది ప్రి్రస్కిప్షన్లలో నాలుగు ప్రిస్క్రిప్షన్లకు సంబంధించిన ఔషధాలు మన కంపెనీలు సరఫరా చేసినవే.జీడీపీ వృద్ధికి నష్టం ట్రంప్ ప్రతీకార సుంకాలతో భారత జీడీపీ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర శాతం తగ్గిపోయి 6%కి పరిమితం కావొచ్చని ఈవై చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ తెలిపారు. అదనపు సుంకాలు విధించడం వల్ల భారత జీడీపీపై గరిష్టంగా 35–40 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడుతుందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియా హెడ్ అనుభూతి సహాయ్ అభిప్రాయపడ్డారు. టెక్స్టైల్స్ ఎగుమతులకు సానుకూలం అమెరికా సుంకాల మోత భారత టెక్స్టైల్స్ ఎగుమతులకు సానుకూలమేనని పరిశ్రమ అభిప్రాయపడుతోంది. అమెరికాకు టెక్స్‌టైల్స్‌ను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్న పోటీ దేశాలు చైనాపై 34%, వియత్నాంపై 46%, బంగ్లాదేశ్‌పై 37% సుంకాల విధింపు భారత్ కంటే అధికంగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘మా వద్ద మిగిలి ఉన్న ఖాళీ సామర్థ్యం గురించి ఇప్పటికే అమెరికా కస్టమర్ల నుంచి విచారణలు మొదలయ్యాయి’అని రేమండ్ గ్రూప్ సీఎఫ్‌వో అమిత్ అగర్వాల్ తెలిపారు. భారత్ నుంచి అమెరికా ఏటా 36 బిలియన్ డాలర్ల (రూ.3 లక్షల కోట్లు) టెక్స్‌టైల్స్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఐటీ సేవలపై పరోక్ష ప్రభావం ఎగుమతి ఆధారిత దేశీ ఐటీ సేవల రంగంపై టారిఫ్‌ల ప్రభావం ప్రత్యక్షంగా పడకపోయినా, తదనంతర పరిమాణాల వల్ల పరోక్ష ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో మందగమనం వస్తే తయారీ, లాజిస్టిక్స్, రిటైల్ తదితర రంగాల్లో డిమాండ్ పడిపోవచ్చని ఆందోళన నెలకొంది. దీంతో ఆ రంగాల్లోని సంస్థలకు సరీ్వసులు అందించే భారత ఐటీ కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఐటీ సేవల కంపెనీలు ఆర్జించిన 193 బిలియన్ డాలర్ల ఆదాయాల్లో అమెరికా వాటా 57 శాతంగా నమోదైంది.వాహనాలపై ప్రభావం కొంతే.. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం వాహన రంగంపై పెద్దగా ఉండకపోవచ్చని ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ తెలిపింది. మార్చి 26 నాటి ఆదేశాల ప్రకారం ఇప్పటికే 25 శాతం సుంకాలు అమలవుతుండడాన్ని ప్రస్తావించింది. అమెరికా మార్కెట్లో చెప్పుకోతగ్గ విక్రయాలు కలిగిన టాటా మోటర్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలకు మాత్రం.. ఎగుమతుల వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ నుంచి ఆటో విడిభాగాల ఎగుమతులు 6.79 బిలియన్ డాలర్లుగా ఉండగా, అక్కడినుంచి దిగుమతులు 1.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఫ్యామిలీ

రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?
సోషల్ మీడియాలో పుణ్యమా అని క్షణాల్లో వైరల్ అయిపోతున్నారు. సరైన సామర్థ్యం ఉండాలేగానే డిజిటల్ మాద్యమంతో అందరి దృష్టినీ ఆకర్షించవచ్చు. డిజిటల్ ఎరా పవర్ అలాంటిది మరి. కన్నుమూసి తెరిచే లోపే వైరల్ కంటెంట్‌తో సోషల్ మీడియా సూపర్స్టార్లుగా మారిపోతున్నారు. చెన్నైసూపర్ కింగ్స్ వీరాభభిమాని 19 ఏళ్ల అమ్మాయి ఆర్యప్రియ భుయాన్ విషయంలో కూడా అదే జరిగింది. సీఎస్కే రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ (IPL) మ్యాచ్ (RR vs CSK) లో ఈ అమ్మడి హావభావాలు, ఆమె రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని అవుట్‌కు ఆమె ఇచ్చిన రియాక్షన్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. దెబ్బకి ఈ ఐపీఎల్ పాపులర్ గర్ల్ రాత్రికి రాత్రే లక్షల ఫాలోయర్లను సంపాదించుకుని సంచలనంగా మారింది. పూర్తి వివరాలు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.ఆర్యప్రియ తన హావభావాలతో మిలియన్లకొద్దీ అభిమానులను సంపాదించుంది. కొన్ని సెకన్ల క్లిప్‌తో సూపర్ వైరల్ అయిన ఐపీఎల్ అమ్మాయి ఎవరు? ఆర్యప్రియ భుయాన్ (Aaryapriya Bhuyan) గౌహతికి చెందిన 19 ఏళ్ల టీనేజర్. మహేంద్ర సింగ్ ధోనికి వీరాభిమాని. ఆర్యప్రియ సోదరి ఆమెను 9-10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సీఎస్కే, ధోనిని పరిచయం చేసింది. అంతే అప్పటినుంచి సీఎస్కే అన్నా, మన మిస్టర్ కూల్ అన్నా పిచ్చి అభిమానం అట.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో ధోనీ ఔట్ : ఏం జరిగిందంటే?చెన్నై-రాజస్థాన్ మ్యాచ్‌లో చెన్నై మాజీ కెప్టెన్ ధోనీ కొట్టిన షాట్ ను లాంగ్ఆన్ లో ఫీల్డర్ అద్భుతంగా క్యాచ్ చేశాడు. చెన్నై గెలుపునకు కీలకమైన సమయంలో ధోనీ ఔట్ కావడంతో అభిమానులను నిరాశపర్చింది. ఈక్రమంలో స్టేడియంలోని ఆర్యప్రియ కూడా నిర్ఘాంతపోయింది. ‘అరె ఏంట్రా ఇది’ అన్నట్టు ఫీలింగ్స్ ఇచ్చింది. క్యాచ్ పట్టుకున్న క్రికెటర్ని చంపేద్దామన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ మేరకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కె మ్యాచ్ సమయంలో తనను టీవీలో చూపించారని ఆర్యప్రియకు తెలియదు కానీ వైరల్ ఐపీఎల్ గర్ల్ అభిమానులు అమాంతం పెరిగారు. అప్పటివరకు 800 ఉన్న ఫాలోవర్ల సంఖ్య 1.72K లక్షలకు పెరిగింది. కొందరు ఈ వీడియోను వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేశారు. మరికొందరు క్రష్ అంటూ కమెంట్ చేశారు. వైరల్ వీడియోతో ఆమె సోషల్ మీడియా స్టార్‌గా, 'మీమ్ గర్ల్'గా మారిపోయింది.#IPL cameramen supremacy 🤩🤩#Dhoni Fan Girl reaction when #dhoni got out 🥲Chooo cute 🥰🥰🥰#CSKvsRR #RRvCSK #IPL2025 #IPL #IPLOnJioStar pic.twitter.com/7hbhMkh7hr— 𝑅𝒶𝓃𝓃𝒱𝒥💫 (@Rannvijju) March 31, 2025ఆర్యప్రియ ఏమందంటే..తాను సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేనని, కొన్ని వందల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారని, అప్పుడపుడు జస్ట్ ట్రావెల్ ఫోటోలు మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎంఎస్ ధోని వికెట్‌పై తన స్పందనను చూపించే ఆమె వీడియో వైరల్ అయిన తర్వాత రాత్రికి రాత్రే లక్షలకు పెరిగిందని నేషనల్ మీడియాతో చెప్పింది. ధోని అవుట్ అవుతాడని అస్సలు ఊహించలేదు... ధోని క్యాచ్ అవుట్ అవ్వగానే షాక్ అయ్యా..అందుకే అలాంటి రియాక్షన్ వచ్చింది. ఇది యాదృచ్చికంగా వచ్చింది అంతే అది వైరల్ అయిందని ఆర్యప్రియ పేర్కొంది. ప్రస్తుతానికి దీనిపై తాను, తన కుటుంబం సంతోషంగా ఉన్నామని తెలిపింది.

భల్లే భల్లే.. పంజాబీ ఫుడ్ ఫెస్టివల్
నగరం విభిన్న సంస్కృతులకు నిలయమే కాకుండా ఆహార వైవిధ్యానికి కూడా కేంద్రంగా నిలుస్తోంది. దీనికి ప్రతిగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విభిన్న ప్రాంతాలకు చెందిన వంటకాలు నగరంలో అలరిస్తుంటాయి. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌లోని రాయల్ రెవ్ హోటల్ వేదికగా ప్రతిష్టాత్మక పంజాబీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. పంజాబ్ సంప్రదాయ పంటల పండుగ ‘పంజాబీ ఫుడ్ ఫెస్టివల్‘ను అమృత్సర్ గ్యాస్ట్రోనమికల్ యాత్రలో భాగంగా ఈ నెల 4 నుంచి 13వ తేదీ వరకు రాయల్ రెవ్ హోటల్, లాజీజ్ మల్టీక్యూసిన్ రెస్టారెంట్ వేదికగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించి బుధవారం రాయల్ రేవ్ హోటల్ వేదికగా పంజాబీ పసందైన వంటకాలతో ప్రముఖ పంజాబీ మాస్టర్ చెఫ్ రాజుసింగ్ సోన్వాల్ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన మెనూలో మటన్ బెలిరామ్, రారా మటన్, సాగ్ మీట్, తందూరీ కుక్కడ్, కుక్కడ్ మఖన్వాలా, మచ్లీ టిక్కా, మచ్లీ అమృత్సరి వంటి మాంసాహార వంటకాలు ఉన్నాయన్నారు. శాఖాహారులు పనీర్ టిక్కా జలంధరి, పెథివాలి టిక్కీని ఆస్వాదించవచ్చు. వీటితో పాటు మరెన్నో అందుబాటులో ఉన్నాయన్నారు. చదవండి:35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో

రాముని గుణగణాలను అలవరచుకుందాం!
మానవాళి సంక్షేమం కోసం సహజయోగాన్ని ఆవిష్కరించిన పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి దేశ విదేశాలలో ఇచ్చిన అనేక ప్రవచనాలలో శ్రీ రాముని గుణ గణాలను, లక్షణాలను, ఆయన వ్యక్తిత్వం నుండి మనం నేర్చుకుని, వాటిని మనలో అంతర్గతంగా స్థిరపరచుకొని వ్యక్తీకరించుకోవలసిన అవశ్యకతను గురించి విశదీకరించారు.శ్రీరాముడు పుడమిపై అవతరించినప్పుడు విశ్వ విరాట్‌లో కుడిపార్శ్వం అభివృద్ధి చెందడానికి దోహద పడింది. తేత్రాయుగంలో రాక్షసుల నుండి, దుష్ట శక్తుల బారి నుండి తన భక్తులను, ప్రజలను సంరక్షించడానికి శ్రీ విష్ణువు తీసుకున్న అవతారమే శ్రీ రాముడు. ఆ కాలంలోనే రాజుల రాజ్యాధిపత్యం మొదలయ్యి అన్నిటికన్నా మిన్నగా ప్రజాభీష్టానికి ప్రాధాన్యత ఇవ్వడం ్ర΄ారంభమయ్యింది. ప్రజల కొరకు, మానవాళి యొక్క అభివృద్ధి కొరకు రాజు మంచితనాన్ని, ప్రేమ తత్వాన్ని కలిగి వుండాలని నిర్ణయించబడింది. నాయకుడైన రాజు ఎంత త్యాగం చేయడానికైనా సిద్దపడాలి. అది శ్రీరామునితోనే మొదలయ్యింది. నేటి సమస్త ప్రజానీకం కోరుకున్న ఋజు ప్రవర్తన, మంచితనం శ్రీ రామునిగా అవతరించాయి. ప్రభువు అనే వాడు శ్రీ రామునిగా వుండాలని కోరుకున్నారు. మంచితనం గురించి, రాజ ధర్మం గురించి కేవలం చెప్పడమే కాదు, దానిని ఆచరించి చూపించిన ఆదర్శవంతమైన రాజు. శ్రీ రాముడు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఒక ఆదర్శవంతమైన తండ్రిగా, ఆదర్శవంతమైన భర్తగా, ఆదర్శవంతమైన కొడుకుగా, ఆదర్శవంతమైన రాజుగా, మర్యాద పురుషోత్తముడుగా ఇతిహాసంలో చెప్పుకోబడుతున్నాడు.అగస్త్య మహాముని రచించిన శ్రీ రామ రక్షా కవచంలో శ్రీ రాముని గుణగణాల గురించి ఇలా వర్ణించడం జరిగింది.ఆయన ఆజానుబాహుడు. చేతులలో ధనుర్బాణాలు ధరించి, పీతాంబరధారుడై సింహాసనంపై ఆసీనుడై వుంటాడు. ఆయన పద్మదళాయతాక్షుడు. తన ఎడమ పార్శ్వమున కూర్చున్నసీతాదేవిని చూస్తూమందస్మిత వదనార విందుడై మనకు కనిపిస్తాడు. అతని యొక్క మేని రంగు లేత నీలిరంగు ఛాయతోనూ, నేత్రములు తామర పుష్ప రేకులవలే పెద్దవిగా వుండి, ఇతరులకు ఆనందమును చేకూరుస్తుంటాయి. ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో విల్లు, వీపున అంబుల పొదితో దుష్ట సంహారం కొరకు సదా సన్నద్ధుడై ఉంటాడు.ఆయన జనన మరణాలకు అతీతుడు. అపార శక్తిమంతుడు. దుష్ట శక్తులన్నిటిని నాశనపరచి, మన కోరికలన్నిటినీ నెరవేర్చే సామర్ధ్యం కలవాడు శ్రీ రాముడు. తానొక అవతార పురుషుడునని గానీ, అవతార మూర్తినని గానీ ఎక్కడా ప్రకటించుకోలేదు. శ్రీ రాముని సుగుణాలలో మరొకటి ఏమిటంటే తను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం. ఆ లక్షణాన్ని మనలో కూడా స్థిరపరచు కోవాలి. ఇచ్చిన మాట తప్పించుకోవడానికి ఏవేవో కుంటిసాకులు వెతికి తప్పించుకోకూడదు. ఆయనకున్న మరో సుగుణం – అవతలివారి హృదయాన్ని నొప్పించే విధంగా మాట్లాడక ΄ోవడం. దీనినే సంకోచమని అంటారు. మానవ అంతర్గత సూక్ష్మ శరీరంలో అంగాంగమునందు, చక్రాలలోనూ, నాడులలోనూ దేవీదేవతలు కొలువై వున్నారు. కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు వారిని, వారి లక్షణాలను మనలో జాగృతి పరచుకోవచ్చును. అలా సీతా సమేతుడైన శ్రీరాముడు మన హృదయంలోని కుడి పార్శ్వం వైపు ఆసీనులై వుంటాడు. ఆత్మ సాక్షాత్కారం పొంది సహజయోగ సాధన చేస్తున్న వారిలో మర్యాద పురుషోత్తమునిగా, ఆదర్శవంతమైన తండ్రిగా, శ్రీరాముని లక్షణాలు జాగృతి చెంది ప్రతిబింబిస్తూ వుంటాయి. ఆయన మనలోని ఊపిరి తిత్తులను పరిరక్షిస్తూ వుంటాడు. ఎవరితో ఎప్పుడు, ఎలా సంభాషించాలో మనం ఆయన దగ్గరనుండి నేర్చుకోవాలి. తన పరిమితులు, హద్దులు, శ్రీ రామునికి బాగా తెలుసు. వాటిని ఆయన ఎప్పుడూ అతిక్రమించలేదు. దేశాన్ని పరిపాలించే పరిపాలకుడు ఎలా వుండాలనేది రామరాజ్యం నుండే నేర్చుకుంటారు.మర్యాద పురుషోత్తముడైన శ్రీ రాముని శ్రీ రామ నవమి పర్వదినాన బాహ్య పరంగా పూజించుకోవడమే కాకుండా అతని గుణగణాలను, వ్యక్తిత్వాన్ని సహజ యోగ సాధన ద్వారా మనలో పొందు పరచుకుని అభివ్యక్తీరించుకోవటం అవసరం. – డా. పి. రాకేష్(పరమపూజ్య మాతాజీ శ్రీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)

600 ఏళ్ల చరిత్రగల పుణ్యక్షేత్రం, అన్నీ విశేషాలే!
కలియుగ వైకుంఠంగా, తెలంగాణ తిరుపతిగా, కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది మహబూబ్‌నగర్ జిల్లాలోని పేరెన్నికగన్న శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానం. ఆర్థిక స్థోమత లేని భక్తులు మన్యంకొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా, తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. తిరుపతిలో మాదిరిగానే మన్యంకొండలో స్వామివారు గుట్టపై కొలువుదీరగా దిగువకొండవద్ద అలమేలు మంగతాయారు కొలువుదీరి ఉన్నారు. దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేసినందువల్ల మునులకొండ అని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మన్యంకొండగా మారింది. మహబూబ్‌నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టలపై మన్యంకొండ దేవస్థానం కొలువుదీరింది. 600 సంవత్సరాల చరిత్రగల ఈ దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కల్పతరువుగా భాసిల్లుతోంది. తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని స్వామి... ఈ దేవస్థానం ప్రత్యేకం. దేవస్థానం చరిత్ర...పురాణ కథనం ప్రకారం... దాదాపు 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలోగల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీర్ర ప్రాంతంలోగల మన్యంకొండపై తాను వెలిసి ఉన్నానని, కావున నీవు వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్థానం అయ్యారట. దాంతో అళహరి కేశవయ్య తమ తండ్రి అనంతయ్యతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలోగల కోటకదిరలో నివాసం ఏర్పరుచుకొని గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. కేశవయ్య దక్షిణాదిగల అన్ని దివ్యక్షేత్రాలూ తిరిగి తరించడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించి దోసిలితో ఆర్ఘ్యం వదులుతుండగా శిలారూపంలోగల వెంకటేశ్వరస్వామి ప్రతిమ వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషషాయి రూపంలోగల గుహలో ప్రతిష్టించి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. వీటితోపాటు దేవస్థానం మండపంలో ఆంజనేయస్వామి, గరుడాళ్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఈ దేవస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై అప్పట్లో మునులు తపస్సు చేసినట్లుగా చెప్పుకుంటున్న గుహ ఉంది. కీర్తనలతో ఖ్యాతి... అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు దాదాపు 300 కీర్తనలు రచించారు. ఈ కీర్తనలు దేవస్థానం చరిత్రను చాటిచె΄్పాయి. హనుమద్దాసుల తర్వాత ఆయన వంశానికి చెందిన అళహరి రామయ్య దేవస్థానం వద్ద పూజలు ్ర΄ారంభించారు. వంశ΄ారంపర్య ధర్మకర్తగా ఉండడంతో΄ాటు దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.విశేషోత్సవాల రోజు స్వామివారికి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి శనివారం తిరుచ్చిసేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామికి ప్రీతి పాత్రమైన నైవేద్యం దాసంగం. భక్తులు స్వామివారికి దాసంగాలు పెట్టి నైవేద్యాలు సమర్పిస్తారు. నిత్యకల్యాణం.. పచ్చతోరణం...మన్యంకొండ దిగువ కొండవద్ద శ్రీ అలివేలు మంగతాయారు దేవస్థానం ఉంది. ప్రతి సంవత్సరం అమ్మవారి సన్నిధిలో కొన్ని వందల వివాహాలు జరుగుతాయి. సుదూర ్ర΄ాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి మంటపంలో పెళ్లిళ్లు చేసుకుంటారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను చేసి పునీతులవుతారు. స్థలపురాణం... ఆళహరి రామయ్యకు స్వామివారు కలలోకి వచ్చి అమ్మవారి దేవస్థానాన్ని తిరుపతి మాదిరిగా దిగువకొండ వద్ద నిర్మించాలని సూచించారు. దీంతో 1957–58 సంవత్సరంలో అలమేలు మంగతాయారు దేవస్థానాన్ని ఆయన సొంత నిధులతో అక్కడ నిర్మాణం చేశారు. తిరుమల తిరుపతి నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. ఆగమశాస్త్రం ప్రకారం రోజూ దేవస్థానంలో పలు ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ ద్వాదశి రోజు అమ్మవారి ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఎలా వెళ్లాలి..?బస్సు మార్గం: హైదరాబాద్ నుంచి నేరుగా మన్యంకొండకు ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కర్నూల్ నుంచి వచ్చే భక్తులు జడ్చర్లలో దిగి మహబూబ్‌నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. లేకుంటే భూత్పూర్లో దిగి మహబూబ్‌నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. రైలులో రావాలంటే అటు హైదరాబాద్ లేదా కర్నూల్ నుండి చేరుకోవచ్చు. మహబూబ్‌నగర్ – దేవరకద్ర మార్గమధ్యలోని కోటకదిర రైల్వేస్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది. కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి.సీజన్లో పెళ్లిళ్ల హోరు...అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే కొలిచిన వారికి నిత్య సుమంగళిత్వం, సంతానం, సిరిసంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పెళ్లి కావల్సిన వారు, సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం. మన్యంకొండ శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానం మంగళవాయిద్యాలతో హోరెత్తిపోతుంటుంది. ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దేవస్థానం ఆవరణలో పెళ్లిళ్లు చేసుకుంటారు. ఒకేరోజు 12 నుంచి 25 పెళ్లిళ్ల దాకా ఇక్కడ జరుగుతాయి. అమ్మవారికి ఆలయంలో నిత్య కళ్యాణంతోపాటు కుంకుమార్చన, ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. బస...మన్యంకొండ శ్రీ అలమేలు మంగ తాయారు దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి ఎటువంటి సత్రాలు లేవు. కాక΄ోతే దేవస్థా నానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి సత్రాలు ఉన్నాయి. భక్తులు ఆ సత్రాల వద్ద ఉండవచ్చు. దీనికిగాను దేవస్థానానికి రోజుకు కొంత చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన వారు అక్కడ ఉండొచ్చు.
ఫొటోలు


బ్లూ శారీలో మెరిసిపోతున్న అనసూయ (ఫోటోలు)


కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే (ఫోటోలు)


Hyderabad Rains : హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. చిత్రాల కోసం క్లిక్ చేయండి


అయోధ్యలో ఫ్యామిలీతో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ సందడి (ఫొటోలు)


హీరో సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


అందాలతో మెస్మరైజ్ చేస్తున్న రిద్ది కుమార్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!


రెడ్ డ్రెస్‌లో హీరోయిన్ దివ్య భారతి క్రేజీ లుక్స్ (ఫోటోలు)


మూడేళ్ల వయసులో తల్లి దూరం.. తండ్రి రెండో పెళ్లి.. బామ్మే అమ్మగా మారి! (ఫొటోలు)


హీరో సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్' మూవీ స్టిల్స్ (ఫొటోలు)


స్టన్నింగ్ లుక్స్‌తో మైమరిపిస్తున్న సప్తమి గౌడ (ఫోటోలు)
అంతర్జాతీయం

పుతిన్ మరో సంచలన నిర్ణయం.. 1.6 లక్షల మంది సైనికులు..
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ రష్యా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా తన సైనిక బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నంలో పడింది. మరో 1,60,000 మంది సైనికుల నియామకానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా పిలుపునిచ్చారు. జూలై నాటికి ఈ రిక్రూట్మెంట్ పూర్తి కానుంది.వివరాల ప్రకారం.. రష్యా సైనిక బలం పెంచే యోచనలో ఉన్నారు అధ్యక్షుడు పుతిన్. ఇందులో భాగంగానే 1,60,000 మంది సైనికుల నియామకానికి రంగం సిద్ధం చేశారు. 18–30 ఏళ్ల మధ్య వయసున్న పురుషులను సైన్యంలోకి తీసుకోనున్నారు. 2011 నుంచి ఇప్పటిదాకా రష్యా నిర్బంధ సైనిక రిక్రూట్మెంట్లలో ఇదే అతి పెద్దది. వచ్చే మూడేళ్లలో ఇది 1.8 లక్షలకు పెరగనుంది.ఇక, సైన్యం పరిమాణాన్ని 24 లక్షలకు, క్రియాశీల సైనికుల సంఖ్యను 15 లక్షలకు పెంచుకుంటామని పుతిన్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. కొత్త సైనికులను యుద్ధానికి పంపబోమని, ఈ నియామకాలకు ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదని రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్యకు వారిని పంపబోమని వెల్లడించింది. Putin’s War Machine Expands: 160,000 More Drafted as Ceasefire Stalls! —largest conscription since war began. pic.twitter.com/AoTrzrzdCB— Kristin Sokoloff (@KSOKUNCENSORED) April 1, 2025

ట్రంప్ మార్క్ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినట్టుగానే ప్రపంచ దేశాలకు షాకిచ్చారు. ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ప్రతీకార సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని చెబుతూనే భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదన్నారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు. అయితే, పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించిన ట్రంప్.. రష్యా, ఉత్తర కొరియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ రెండు దేశాలపై ఎలాంటి సుంకాలు విధించలేదు. ఏప్రిల్ 2వ తేదీని అమెరికా ‘విముక్తి దినం’గా ప్రకటించిన ట్రంప్ బుధవారం వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ..‘ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా వ్యాపారం ఈరోజు పునర్జన్మించినట్లు అయింది. అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. సుంకాల పేరుతో అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. ఇక అది జరగదు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది.🚨 It’s official. Donald Trump has signed 25% tariffs on our closest trade partners and allies. Friendly reminder that tariffs were a contributing factor for the Great Depression. pic.twitter.com/hlBNCcwyMu— CALL TO ACTIVISM (@CalltoActivism) April 2, 2025ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చింది. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయి. దీంతో అమెరికా స్వర్ణయుగమవుతుంది. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చింది. కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలను విధిస్తూ వచ్చాయి. పలు దేశాలు అన్యాయమైన నియమాలను అవలంభించాయి.US President Donald Trump announced 26% import duty on India… India 26%National interest first, friendship....#TrumpTariffs pic.twitter.com/ySlvRkIYzs— Equilibrium (@abatiyaashii) April 3, 2025అమెరికాలో దిగుమతి అవుతున్న మోటారు సైకిళ్లపై కేవలం 2.4 శాతమే పన్నులు విధిస్తున్నారు. అదే థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్రవాహనాలపై 60 శాతం, భారత్ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయి. వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదకరం. అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి విధించనున్నాం. అమెరికాలో ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలపై ఎలాంటి పన్నులు వసూలు చేయం.అమెరికా ప్రతీకార సుంకాలు ఇలా..భారత్: 26 శాతంయూకే: 10 శాతంఆస్ట్రేలియా: 10 శాతంకొలంబియా: 10 శాతంచిలి: 10 శాతంబ్రెజిల్: 10 శాతంసింగపూర్: 10 శాతంటర్కీ: 10 శాతంఇజ్రాయెల్: 17 శాతంపిలిఫ్ఫీన్స్: 17 శాతంఈయూ: 20 శాతంమలేషియా: 24 శాతంజపాన్: 24 శాతం దక్షిణ కొరియా: 25 శాతంపాకిస్థాన్: 29 శాతం దక్షిణాఫ్రికా: 30 శాతంస్విట్జర్లాండ్: 31 శాతంఇండోనేషియా: 32 శాతంతైవాన్: 32 శాతంచైనా: 34 శాతంథాయిలాండ్: 36 శాతంబంగ్లాదేశ్ 37 శాతంశ్రీలంక: 44 శాతంకంబోడియా: 49 శాతంఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్‌లుగా ట్రంప్ పేర్కొన్నారు.México , México ,México Aquí buscándolo en la lista de aranceles de Donald Trump pic.twitter.com/nouS1sMg7j— Carlos Suárez E (@Caloshhh) April 2, 2025

గాజాలో ఆకలి కేకలు: పిండీ లేదు.. తిండీ లేదు
రంజాన్ పండుగతో పాటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింల ఉపవాస దీక్షలు ముగిసినా గాజాలో మాత్రం పాలస్తీనియన్లకు నిత్య ఉపవాసాలే కొనసాగుతున్నాయి. తినడానికి ఏమీ లేక ఖాళీ జనం డొక్కలెండుతున్నాయి. గాజాకు మానవతా సాయాన్ని, ఆహార సరఫరాను ఇజ్రాయెల్ పూర్తిగా అడ్డుకోవడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఐరాసతో పాటు అంతర్జాతీయ సమాజం భారీ పరిమాణంలో పంపిన ఆహార నిల్వలన్నీ సరిహద్దుల వద్దే కుళ్లిపోతున్నాయి. గాజా ఏమో నిస్సహాయ స్థితిలో ఆకలితో యుద్ధం చేస్తోంది. రంజాన్ పండుగ సందర్భంగా కూడా కనీసం రొట్టెముక్కయినా దొరకని కుటుంబాలెన్నో...! ఇది చాలదన్నట్టు పిండి నిల్వలు కూడా పూర్తిగా నిండుకోవడంతో తాజాగా గాజాలో బేకరీలన్నీ మూతబడ్డాయి!!ఈద్. పవిత్ర రంజాన్ మాసానికి ముగింపు. సాధారణంగా అయితే గాజావాసులకూ వేడుకే. కుటుంబాలన్నీ కలిసి ఆనందంగా పండుగ జరుపుకొంటాయి. కానీ గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అక్కడ ఈద్ పాలస్తీనావాసుల ఆకలి కేకలు, ఇజ్రాయిల్ బాంబు దాడుల నడుమే ముగిసింది. యుద్ధం దెబ్బకు గాజా ఆహారోత్పత్తి సామర్థ్యం పూర్తిగా పడకేసింది. దాంతో తిండికి కూడా అంతర్జాతీయ సాయంపైనే ఆధారపడుతోంది. ఇజ్రాయెల్ మాత్రం తమ బందీల విడుదల కోసం హమాస్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా మార్చి నుంచే గాజాకు ఆహారం, మానవతా సాయం సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. దాంతో సహాయక ట్రక్కులు గాజాలో అడుగు పెట్టి మూడు వారాలు దాటింది. 18 నెలల క్రితం యుద్ధం మొదలైనప్పటి నుంచీ గాజాకు ఇంతకాలం పాటు ఎలాంటి ఆహార సరఫరాలూ అందకపోవడం ఇదే తొలిసారి. దాంతో ఇంధనం తదితరాల కొరత తారస్థాయికి చేరింది. అంతేకాదు, కనీసం పిండి నిల్వలు కూడా లేని పరిస్థితి! దాంతో బుధవారం గాజాలోని బేకరీలన్నీ మూతబడ్డాయి. స్థానిక బేకరీ యజమానుల సంఘం చీఫ్ అబ్దెల్ నాసర్ అల్–అజ్రామి ఈ మేరకు ప్రకటించారు. ‘‘గిడ్డంగుల్లో పిండి పూర్తిగా అయిపోయినట్టు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) మాకు తెలిపింది. ఇజ్రాయిల్ రఫా క్రాసింగ్ తదితరాలను తెరిచి సహాయక సామగ్రి, మానవతా సాయాలను తిరిగి గాజాలోకి అనుమతించేదాకా బేకరీలు పనిచేయబోవు’’అని వెల్లడించారు. అబద్ధాలతో నిద్రపుచ్చుతూ... పాలస్తీనియన్ల ఆకలిని తీరుస్తున్న ప్రధాన వనరు రొట్టె మాత్రమే. చికెన్, మాంసం, కూరగాయలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. అందుబాటులో ఉన్న ఇతర ఆహార పదార్థాలను రొట్టెను తింటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ‘‘పరిస్థితి వివరించలేనంత దారుణంగా ఉంది. నా కుటుంబసభ్యులకు బ్రెడ్ కోసం ఉదయం 8 గంటల నుంచీ వెతుకుతున్నాను. డెయిర్ అల్–బలాహ్లోని అన్ని బేకరీల చుట్టూ తిరిగా. ఒక్కటి కూడా పనిచేయడం లేదు. పిండి లేదు. కట్టె లేదు. ఏమీ లేవు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఇంత దారుణం చూస్తామని ఎన్నడూ అనుకోలేదు’’అని ఇబ్రహీం అల్ కుర్ద్ అనే స్థానికుడు వాపోయాడు. ‘‘పిల్లలు రాత్రి భోజనం చేయకుండానే పడుకుంటున్నారు. ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి, ఉదయాన్నే పిండి తెచ్చుకుందామని వారికి అబద్ధాలు చెబుతూ నిద్రపుచ్చుతున్నాం’’అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. రఫా తదితర క్రాసింగ్లను తిరిగి తెరిచేలా ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని ఆయన వేడుకుంటున్నాడు. చుక్కల్లో పిండి ధరలు... రొట్టెతో పాటు గాజావాసులకు వంట కోసం గ్యాస్‌ను కూడా బేకరీలే అందించేవి. అవి మూతబడటంతో తిండి వండుకోవడానికి కలపనే ఆశ్రయిస్తున్నారు. కానీ దానికీ తీవ్ర కొరతే ఉంది. కలపను బ్లాక్ మార్కెట్లో అడ్డగోలు ధరలకు అమ్ముతున్నారు. దాంతో అదీ జనానికి అందుబాటులో లేకుండా పోయింది. నూనె, ఈస్ట్ వంటి బేకింగ్ పదార్థాలు కూడా కొనలేని పరిస్థితి! బేకరీలు మూతబడటంతో పిండి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఒక్క సంచీ ఏకంగా 400 షెకెల్స్ (115 డాలర్ల)కు అమ్ముతున్నారు. యుద్ధానికి ముందు 25 షెకెల్స్ ఉండేది. గత జనవరిలో స్వల్పకాలిక కాల్పుల విరమణ సందర్భంగా కూడా 35 షెకెల్స్కు దొరికేది. ‘‘ప్రజలు ఇప్పుడు యుద్ధ భయాన్ని, బాంబు దాడులను, వలస కష్టాలను, అన్నింటినీ మర్చిపోయారు. వారి ఆలోచనలన్నీ ఏ పూటకు ఆ పూట పిండి ఎలా దొరుకుతుందా అన్నదాని మీదే ఉన్నాయి’’అని ఉత్తర గాజాకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అహ్మద్ డ్రెమ్లీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధం మొదలైనప్పుడు ప్రజలు ఆరోగ్యంగా, దేన్నయినా తట్టుకునే సామర్థ్యంతో ఉన్నారు. ఇప్పుడంతా మారిపోయింది. రొట్టెకు కూడా దిక్కు లేదు! దాంతో జనం ఏది దొరికినా తిని కడుపు నింపుకుంటున్నారు. కానీ కొద్ది రోజులుగా చాలామందికి తినేందుకు ఏమీ దొరకడం లేదు. బియ్యం కొనడానికి అప్పు చేస్తున్నారు. ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకుంటున్నారు. చాలామంది పాలస్తీనియన్లు రద్దీగా ఉన్న గుడారాల్లో బతుకీడుస్తున్నారు. కొందరైతే వీధుల్లోనే నిద్రపోతున్నారు. తిండి వండుకునే పరిస్థితులు కూడా లేవు’’అంటూ గాజాలోని దైన్యాన్ని ఆయన వివరించారు. దారుణ సంక్షోభం: ఐరాస ‘‘కాల్పుల విరమణ సమయంలో గాజాలోకి రోజుకు 500 నుంచి 600 ట్రక్కుల్లో సహాయక సామగ్రి వచ్చేది. ఇప్పుడన్నీ ఆగిపోయాయి. కాల్పుల విరమణ ముగిసి యుద్ధం తిరిగి మొదలైనప్పటినుంచీ ఘోరమైన మానవతా సంక్షోభం నెలకొంది. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా ఆపేసింది. ముఖ్యంగా బేకరీల మూతతో ఆహారం కోసం కేవలం వాటిపైనే ఆధారపడ్డ లక్షలాది మంది అల్లాడుతున్నారు. దిగ్బంధాన్ని తక్షణం ఎత్తేయకపోతే గాజాలో త్వరలోనే మరణమృదంగం తప్పదు’’అని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారి హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్

అమెరికాపై సుంకాలు ఎత్తేసిన ఇజ్రాయెల్
జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికలు పని చేస్తున్నాయి. అమెరికా దిగుమతులపై అన్ని సుంకాలను ఇజ్రాయెల్ ఎత్తేసింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘అమెరికా వస్తువులపై కస్టమ్స్ సుంకాలను రద్దు చేయడమంటే మార్కెట్‌ను ఒక దశాబ్దం పాటు పోటీకి తెరవడం. ఆర్థిక వ్యవస్థకు వైవిధ్యాన్ని పరిచయం చేయడం. జీవన వ్యయాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం ఎంచుకున్న విధానాల్లో ఇది అదనపు దశ. మార్కెట్‌కు, ఇజ్రాయెల్ పౌరులకు ప్రయోజనం చేకూర్చేది. ఇజ్రాయెల్, అమెరికాల సంబంధాలను ఈ చర్య మరింత బలోపేతం చేస్తుంది’’ అని ‘ఎక్స్’లో నెతన్యాహు ప్రకటించారు.40 ఏళ్ల స్వేచ్ఛా వాణిజ్యంఇజ్రాయెల్, అమెరికా మధ్య 40 ఏళ్లుగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లో ఉంది. 99 శాతం అమెరికా దిగుమతులను ఇజ్రాయెల్ ఇప్పటికే సుంకాల నుంచి మినహాయించింది. ఈ నేపథ్యంలో తాజా చర్యను ఆర్థిక చర్యగా కంటే దౌత్య, రాజకీయ చర్యగా భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వ్యవసాయోత్పత్తులపై ఇజ్రాయెల్ ఏటా 42 మిలియన్ షెకెల్స్ (సుమారు 1.15 కోట్ల డాలర్ల) సుంకాలు వసూలు చేస్తోంది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 2024లో ఆ దేశం మొత్తం ఎగుమతుల విలువ 172 కోట్ల డాలర్లు. అమెరికా నుంచి దిగుమతుల విలువ 92 కోట్ల డాలర్లు.
జాతీయం

వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది. దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే.సదుద్దేశమే: రిజిజు న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై గురువారం అర్ధరాత్రి దాకా జరిగిన వాడివేడి చర్చ పెద్దల సభను వేడెక్కించింది. ఉమీద్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్)గా పేరు మార్చిన వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు నిరసనగా పలువురు విపక్ష సభ్యులు నల్లదుస్తులు ధరించి సభకు వచ్చారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డారు. ముస్లింల భూములను లాక్కోవడమే మోదీ సర్కారు అసలు లక్ష్యమని ఆరోపించారు. విపక్షాల వాదనను రిజిజు ఖండించారు. వాటి అభ్యంతరాలను తోసిపుచ్చారు. ‘‘ముస్లింల హక్కులను ఎవరూ లాక్కోబోవడం లేదు. ఈ విషయమై విపక్షాలు చేస్తున్నదంతా దు్రష్పచారమే’’ అని పేర్కొన్నారు. ‘‘2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు ఏకంగా 8.72 లక్షలకు పెరిగాయి. తద్వారా దేశంలో వక్ఫ్ అతి పెద్ద ప్రైవేటు భూ యజమానిగా అవతరించింది’’ అని వివరించారు. ‘‘వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తేవడం, వాటి ఆస్తులను మరింత సమర్థంగా నిర్వహించడం, ముస్లిం మహిళలకు సాధికారత కల్పించడం, ముస్లింలలోని అన్ని తెగల హక్కులనూ పరిరక్షించడమే బిల్లు లక్ష్యం. అంతే తప్ప మతంతో ఈ బిల్లుకు ఎలాంటి సంబంధమూ లేదు’’ అని పునరుద్ఘాటించారు. ‘‘అందుకే సున్నీలు, షియాలతో పాటు ముస్లింలలోని ఇతర వెనకబడ్డ వర్గాల వారు కూడా వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ఉంటారు. తద్వారా వారి ప్రయోజనాలకూ న్యాయం జరుగుతుంది. ఇందుకు ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు’’ అన్నారు. ‘‘కేంద్ర వక్ఫ్ మండలి సభ్యుల్లో అధిక సంఖ్యాకులు ముస్లిమేతరులే ఉంటారనడం అవాస్తవం. 22 మందిలో వారి సంఖ్య 4కు మించబోదు. వక్ఫ్ బోర్డులు చట్టపరమైన సంస్థలు. అంతే తప్ప కేవలం ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు కాదు. వక్ఫ్ ట్రిబ్యునళ్ల ముందు 31,999 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వివాదాస్పద వక్ఫ్ భూముల్లో ఇప్పటికే కోర్టుల్లో పరిష్కారమైన వాటి జోలికి పోబోం. పసలేని ఆరోపణలు మాని బిల్లును ఆమోదించడంలో విపక్షాలు కూడా కలసి రావాలి’’ అని కోరారు. దురుద్దేశాలు: విపక్షాలు వక్ఫ్ (సవరణ) బిల్లు వెనక మోదీ సర్కారు దురుద్దేశాలు దాగున్నాయని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. మోదీ ప్రభుత్వాన్ని ముస్లింలు విశ్వసించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు రామ్‌గోపాల్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం అన్ని మతాలనూ సమానంగా చూడాలన్నారు. బిల్లులో పలు అంశాలు పైకి బాగానే ఉన్నా దీని వెనక మోదీ సర్కారు ఉద్దేశమే అనుమానాలకు తావిస్తోందని బీఆర్ఎస్ సభ్యుడు కె.ఆర్.సురేశ్‌రెడ్డి అన్నారు. బిల్లులోని 75 శాతం అంశాలను బిల్లుతో నిమిత్తం లేకుండానే అమలు చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుచ్చి శివ (డీఎంకే), వై.వి.సుబ్బారెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), అభిõÙక్ మను సింఘ్వీ, సయీద్ సనీర్ హుసేన్ (కాంగ్రెస్), సుష్మితా దేవి (టీఎంసీ), సంజయ్ రౌత్ (శివసేన–యూబీటీ), సంజయ్‌సింగ్ (ఆప్), ముజీబుల్లా ఖాన్ (బీజేడీ), జాన్ బ్రిటాస్ (సీపీఎం), పి.పి.సునీర్ (సీపీఐ), హరీస్ బీరన్ (ఐయూఎంఎల్), వైగో (ఎండీఎంకే) తదితర సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (జేడీఎస్) బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. వక్ఫ్‌కు ముస్లిమేతరులూ విరాళాలు ఇవ్వొచ్చు: సిబల్ ముస్లిమేతరులకు కూడా వక్ఫ్ విరాళాలిచ్చే హక్కుందని స్వతంత్ర సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ‘‘నా ఆస్తిని ఫలానా వారికి ఇవ్వొద్దని చట్టం చేయడానికి మీరెవరు? హిందువులు వక్ఫ్ విరాళాలు ఇవ్వడమే కాదు, స్వాతంత్య్రానికి ముందే వక్ఫ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని పలు హైకోర్టులూ సమరి్థంచాయి’’ అని చెప్పారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో హిందూ మత సంస్థలకు 10 లక్షల ఎకరాలకు పైగా భూములున్నాయని ఆయన అన్నారు. ‘‘హిందూ మతంలో స్వార్జిత ఆస్తిని కుమారులకు మాత్రమే ఇవ్వగలరు. దాన్ని కూతుళ్లకూ ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ చట్టాన్ని మార్చండి’’ అని సూచించారు. చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ జోక్యం చేసుకుంటూ కూతుళ్లతో పాటు ఎవరికైనా ఇచ్చేందుకు మన చట్టాలు వీలు కల్పిస్తున్నాయని చెప్పారు. అయోమయం సృష్టిస్తున్నారు: రిజిజు సిబల్ తీరును మంత్రి రిజిజు తీవ్రంగా దుయ్యబట్టారు. హిందూ మత సంస్థలకు చెందిన భూమిని వక్ఫ్ భూములతో పోల్చడాన్ని ఖండించారు. ‘‘పలువురు సీనియర్ సభ్యులు ఏ అంశం పడితే అది లేవనెత్తడం ద్వారా అయోమయం సృష్టిస్తున్నారు. కానీ వాటిపై వివరణలు వినే దాకా కూడా సభలో ఉండటం లేదు’’ అంటూ అసహనం వెలిబుచ్చారు. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే: ఖర్గే వక్ఫ్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దానిపై చర్చలో ఆయన పాల్గొన్నారు. బిల్లు ముసుగులో సమాజంలో విభజన బీజాలు నాటేందుకు, ముస్లింలను వేధించేందుకు, వారి భూమిని లాక్కొని కార్పొరేట్ మిత్రులకు పంచేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ‘‘ఈ బిల్లు ఆమోదం పొందితే ముస్లింల ఆస్తులను లాగేసుకుంటారు. వారి ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి’’ అని ఆరోపించారు. అస్మదీయులను వక్ఫ్ బోర్డుల్లోకి చొప్పించేందుకు వీలుగా సవరణలు చేశారంటూ బిల్లులోని పలు అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. ‘‘గత 11 ఏళ్లలో ముస్లింల సంక్షేమానికి కేటాయించిన రూ.18,274 కోట్ల నిధులనే పూర్తిగా వెచ్చించని చెత్త రికార్డు మోదీ సర్కారుది. అలాంటివాళ్లు పస్మాంద వంటి పేద ముస్లింల సంక్షేమంపై మొసలి కన్నీరు కారుస్తున్నారు’’ అంటూ తూర్పారబట్టారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉండాలన్న ప్రతిపాదనను ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం, రామమందిర్ ట్రస్ట్ వంటివాటిల్లో ఒక్కరైనా ముస్లిం ఉన్నారా అని ప్రశ్నించారు. ఆలయ ట్రస్టుల్లో కనీసం దళితులకు కూడా స్థానం కల్పించడం లేదని ఆక్షేపించారు. ‘‘‘దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బ తీయకండి. ప్రతిష్టకు పోకుండా ఈ తప్పులతడక బిల్లును తక్షణం వెనక్కు తీసుకోండి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పాపమే: నడ్డా కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో ముస్లిం మహిళల అభ్యున్నతికి చేసిందేమీ లేదని రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా ఆక్షేపించారు. వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిన పాపం ఆ పారీ్టదేనంటూ దుయ్యబట్టారు. ‘‘ముస్లిం మహిళలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడంతో కోట్లాది మంది ముస్లిం మహిళలు గౌరవంగా జీవిస్తున్నారు. వక్ఫ్ బిల్లు జాతి ప్రయోజనాల కోసం ఉద్దేశించింది. వక్ఫ్ ఆస్తులు తీవ్రంగా దురి్వనియోగమవుతున్నాయి. దానికి పూర్తిగా అడ్డుకట్ట వేసి వక్ఫ్ వ్యవహారాల్లో జవాబుదారీతనం తేవడమే బిల్లు లక్ష్యం. వక్ఫ్ బిల్లులో సవరణలు సూచించేందుకు ఏకంగా 31 మంది సభ్యులతో జేపీసీ వేశాం. యూపీఏ హయాంలో కేవలం 13 మందితో జేపీసీ వేసి మమ అనిపించారు’’ అని నడ్డా ఆరోపించారు. ‘‘వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చి ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి కార్యకలాపాలకు ఉపయోగించేందుకు వీలుగా సౌదీ అరేబియా, తుర్కియే వంటి ముస్లిం దేశాలు కూడా పలు చట్టాలు చేశాయి. వక్ఫ్ ఆస్తులను డిజిటైజ్ కూడా చేస్తున్నాయి. అదే పని భారత్‌లో చేస్తుంటే అభ్యంతరమెందుకు?’’ అని విపక్షాలను ప్రశ్నించారు.

లాస్ట్ మినిట్‌లో వక్ఫ్ బిల్లుపై బీజేడీ యూటర్న్..
ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు గురువారం రాజ్యసభ్యలో చర్చకు వచ్చిన సందర్భంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. తొలుత వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ అదే రాజ్యసభలో ముందురోజు(బుధవారం) చెప్పిన ‘ద బిజు జనతాదళ్(బీజేడీ).. గురువారం నాటికి వచ్చేసరికి యూటర్న్ తీసుకుంది. ఆ బిల్లుకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థులు ఎలాగైనా ఓటేసుకోవచ్చని స్పష్టం చేసింది. వారి( బీజేడీ ఎంపీలు) మనస్సాక్షి ప్రకారం ఓటేసుకోవచ్చంటూ యూ టర్న్ తీసుకుంది. ఇక్కడ తమ ఎంపీలు ఎలా ఓటేసినా అంటే అనుకూలంగా ఓటేసినా ఎటువంటి విప్ జారీ చేయబోమని తేల్చి చెప్పింది. తాము మైనార్టీ వర్గాల సెంటిమెంట్స్ ను గౌరవిస్తామన్న రోజు వ్యవధిలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం హైడ్రామాకు తెరలేపింది.బీజేడీ తొలుత చెప్పింది ఇదే..‘‘ మేము మైనార్టీల సెంటిమెంట్స్ ను పరిగణలోకి తీసుకుంటాం. మా సభ్యులంతా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మాకు లోక్ సభలో ఎంపీలు లేరు.. మాకు రాజ్యసభలో ఉన్న ఏడుగురు సభ్యులు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటేస్తారు’’ అని పేర్కొంది.మరి మళ్లీ బీజేడీకి ఏమైంది?అయితే రాజ్యసభలో ముందు చెప్పిన మాటకు బీజేడీ కట్టుబడలేదు. తమ ఎంపీలు ఇష్టప్రకారమే ఓటేయొచ్చని తెలిపింది. ‘‘వారు ఫ్రీగా ఓటేసుకోవచ్చు. అనుకూలంగా ఓటేసినా, వ్యతిరేకంగా ఓటేసినా తాము వారికి ఎటువంటి విప్ జారీ చేయం’’ అని తెలిపింది. బీజేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలతోనే ఆ పార్టీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘మీరు అమ్మిన భూములను మేము వెనక్కి తీసుకోవాలా?’
ఢిల్లీ: బీఆర్ఎస్ అమ్మిన భూముల్ని తాము ఎలా వెనక్కి తీసుకుంటామని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. హెచ్సీయూకు సంబంధించి భూముల్ని వెనక్కి తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలా అడుగుతున్నారని ధ్వజమెత్తారు. ‘ మీరు(బీఆర్ఎస్) అమ్మిన భూముల్ని మేము వెనక్కి తీసుకోవాలా?, చట్టం అడ్డు వస్తుందనే కామన్ సెన్స్ లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు.చట్ట పరంగా జరిగే నిర్ణయాలను ఎవరూ అడ్డుకోలేరు. హెచ్‌సీయూ భూములను మేము అభివృద్ధికి ఉపయోగిస్తాం. హెచ్‌సీయూ భూములను కాజేయాలని బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ మా ప్రభుత్వం న్యాయ పోరాటం చేసి భూములను స్వాధీనం చేసుకుంది. బిల్లీ రావుకు చంద్రబాబు అప్పనంగా భూములు కట్టబెట్టారు’ అని మల్లు రవి విమర్శించారు.కాగా, హెచ్‌సీయూ భూముల వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గురువారం హెచ్ సీయూ భూముల వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పర్యావరణ విధ్వంసాన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు: వైఎస్సార్సీపీ
ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ పేర్కొంది. రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లును తీసుకెళ్లిన క్రమంలో చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీతరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ‘ వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఈ బిల్లు మత స్వేచ్ఛను హరించేలా ఉంది. ఏపీలో 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారి ప్రయోజనాలను, వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది. వక్ఫ్ బిలలుకు టీడీపీ మద్దతు ఇచ్చి నిజస్వరూపాన్ని బయటపెట్టింది.తమకు సిద్ధాంతాలు కంటే రాజకీయాలు ముఖ్యమని టీడీపీ చెప్పింది. ముస్లింల విశ్వాసాన్ని టీడీపీ కోల్పోయింది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లే కాదు.. విలువలను కూడా పాటించాలి. జేఏసీలో ముస్లింల అభ్యంతరాలను వైఎస్సార్‌సీపీస్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు విరుద్ధం. రాజ్యాంగం విరుద్ధంగా ఉన్న బిల్లు చెల్లదని ఆర్టికల్ 13 స్పష్టం చేస్తోంది. మైనార్టీ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం.వేలాది సంవత్సరాలుగా ముస్లింల అధీనంలో భూమిపై జోక్యం చేసుకోవడం వారి హక్కులకు భంగం కల్గించడమే. వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను చేర్చడం వారి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఇది ఆర్టికల్ 25 కు విరుద్ధం’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఎన్ఆర్ఐ

నాట్స్ తెలుగు సంబరాలు సినీ ప్రముఖులకు ఆహ్వానం
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ బృందం పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించింది. హైదరాబాద్‌లో తొలుత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావును కలిసి నాట్స్ 8 వ అమెరికా తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.నాట్స్ సంబరాలకు ముఖ్య అతిధిగా రాఘవేంద్రరావును కోరింది. ఆ తర్వాత వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్‌ను కలిసి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ని కూడా నాట్స్ బృందం కలిసి సంబరాలకు ఆహ్వానించింది. జూలై 4, 5, 6 తేదీల్లో టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని కోరింది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు థమన్‌ను కూడా నాట్స్ బృందం కలిసింది. నాట్స్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా థమన్ కూడా గుర్తు చేసుకున్నారు. అమెరికా తెలుగు సంబరాలకు థమన్ తప్పనిసరిగా రావాలని నాట్స్ ఆహ్వానించింది.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!సినీ దర్శకులు హరీశ్ శంకర్, మోహర్ రమేశ్‌లను కూడా కలిసి నాట్స్ ఆహ్వాన పత్రికలు అందించింది. సినీ ప్రముఖుల ఆహ్వానాలు అందించే కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమీటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు తదితరులు పాల్గొన్నారు.

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ఫౌండేషన్, హోఫ్ ఫర్ లైఫ్ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లలు సమాజంలో మానవ మృగాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలనేది ఈ సదస్సులో వివరించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరిష అన్నారు. అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా అది కచ్చితంగా తల్లితో చెప్పాలని సూచించారు. మేం ఏం చేయలేం అని నిస్సహాయ స్థితి నుంచి మేం ఏదైనా చేయగలమనే ధైర్యం ఆడపిల్లల్లో రావాలని హోఫ్ ఫర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకులు హిమజ అన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హోఫ్ ఫర్ సంస్థ ప్రతినిధులు ఆశాజ్యోతి, సైకాలజిస్టులు డాక్టర్ సంగీత, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై ఆడపిల్లలకు పూర్తి అవగాహన కల్పించేలా ఈ సదస్సు జరిగింది.

Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇకలేరు. వారి కుటుంబ సభ్యులకు మనసారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మహానుభావుడైన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. వారి గానం యుగయుగాల పాటు మనలో జీవించే ఉంటుందంటూ నాట్స్ నివాళులర్పించింది. గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతంఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి.పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది.1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్‌షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి.అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు.400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు.

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్‌మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025).
క్రైమ్

బాలికపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: అభం..శుభం తెలియని 12 ఏళ్ల బాలికను చెరబట్టాడు టీడీపీకి చెందిన ఓ కామాంధుడు. అలాంటి వాడిని శిక్షించాల్సిన కుటుంబ సభ్యులు వెనకేసుకొచ్చారు. ఏదో చిన్న తప్పు జరిగిపోయింది..ఇక్కడితో వదిలేద్దామని బాధిత బాలిక తండ్రిని బెదిరించి బలవంతంగా ఒప్పించారు. ఆ బాలిక శీలానికి విలువ కట్టారు. రూ. లక్ష అపరాధంగా చెల్లించేందుకు నిర్ధారిస్తూ ..అడ్వాన్స్ గా రూ. 20వేలు చెల్లించారు. ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది ఎక్కడో కాదు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే. వివరాల్లోకి వెళితే.. 10 మంది సంతానమున్న ఓ తండ్రి పొట్టకూటి కోసం కుటుంబాన్ని తీసుకుని సమీపంలోని వేరే గ్రామానికి వచ్చాడు. అక్కడ ఓ రైతు దగ్గర వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా పిల్లలు గొర్రెలు, ఆవులు మేపుతున్నారు. వారిలో పన్నెండేళ్ల బాలిక బుధవారం (ఏప్రిల్ 2) అడవిలోకి వెళ్లింది. ఆమెను గిడ్డెగానిపెంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆర్ రమేశ్ అనుసరించాడు. నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధ భరించలేని ఆ బాలిక కేకలు వేస్తూ పరుగులు తీసింది. గమనించిన ఓ వ్యక్తి బాధితురాలని ఏమైందని ప్రశ్నించగా జరిగిన ఘోరాన్ని తెలియజేసింది. ఆ వ్యక్తి రమేశ్‌ను మందలించి పిడిగుద్దులు కురిపించాడు.రూ. లక్షకు ఒప్పందం..రూ. 20వేల అడ్వాన్స్ నిందితుడి కుటుంబ సభ్యులు ఈ విషయం బయటికి పొక్కకుండా పెద్దల సమక్షంలో బుధవారం రాత్రి బాలిక తండ్రితో బలవంతంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ. లక్ష ఇస్తామని, ఎవరితోనూ చెప్పవద్దంటూ అడ్వాన్స్‌గా రూ. 20వేలు ముట్టజెప్పారు. అయితే ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వారు విచారణ చేపట్టి రమేశ్ లైంగిక దాడికి పాల్పడినట్టు నిర్ధారించారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులను కుప్పం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడు రమేశ్ పరారయ్యాడు. కాగా ఫేస్బుక్ ఖాతాలో టీడీపీ నాయకులతో దిగిన ఫొటోలు, బ్యానర్లను రాత్రికి రాత్రే తొలగించాడు.

100 కోట్లతో ఉడాయించిన చిట్టీల పుల్లయ్య అరెస్ట్
హైదరాబాద్ : చిట్టీలు, అధిక వడ్డీల ఆశ చూపి ప్రజలను నిలువునా మోసం చేసిన పుల్లయ్య ఆస్తులను సీసీఎస్ పోలీసులు సీజ్ చేశారు. సనత్‌నగర్ బీకేగూడ దాసారం బస్తీ రవీంద్రనగర్ సమీపంలో ఉండే పుల్లయ్య చిట్టీలు, వడ్డీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి..వందల మందిని మోసం చేసిన విషయం విదితమే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు ఇటీవల బెంగుళూరులో పుల్లయ్యను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. విచారణలో భాగంగా బుధవారం సాయంత్రం సీసీఎస్ పోలీసులు బీకేగూడలోని నివాసానికి పుల్లయ్యను తీసుకువచ్చారు. ఏసీపీ మల్లికార్జున చౌదరి ఆధ్వర్యంలో పుల్లయ్య తోపాటు అతని ఇద్దరు కుమారులను మూడు గంటల పాటు విచారించి ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నారు. ఐదు అంతస్తుల ఇంటితో పాటు ఫార్చూనర్ కారు, ఇతర సామాగ్రిని సీజ్ చేసి తరలించారు. కాగా ఇంటిపై రూ.60 లక్షల బ్యాంకు లోను ఉన్నట్లు తెలిపారు. కాగా పుల్లయ్యను ఇంటికి తీసుకువచ్చారన్న సమాచారంతో బాధితులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకుని ఆందోళకు దిగారు. మహిళా బాధితులు కొందరు ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పుల్లయ్యతో మాట్లాడించాలని వారు పోలీసులతో వాగి్వవాదానికి దిగారు. తిరిగి పుల్లయ్యను సీసీఎస్‌కు తరలించే క్రమంలో పోలీసు వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డు తగిలారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కారు వెంట పరుగెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో పోలీసులు అప్రమత్తమై జనాలను అడ్డుకున్నారు.

హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. పోస్టల్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం టాస్క్‌ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించి∙వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న ఓ మహిళ, నలుగురు విటులను అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా వేలేరు మండలం శోడషపల్లి గ్రామానికి చెందిన తిమ్మాపురం లలిత సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పోస్టల్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి రహస్యంగా సంవత్సర కాలంగా వ్యభిచారం నిర్వహిస్తోంది. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలు లలితతోపాటు విటులు జనగామకు చెందిన బంతిని అశోక్, బుక్క కరుణాకర్, ఘన్పూర్ మండలం మీదికొండకు చెందిన వడ్లకొండ రమేశ్, కాజీపేట విష్ణుపురికి చెందిన బొల్లి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి బాధిత మహిళలను కాపాడినట్లు తెలిపా రు. వీరి నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ.2,450 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ కోసం నిందితులను సుబేదారి పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ తెలిపారు.

భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్మేట్ శివతో వివాహేతర సంబంధం
సంగారెడ్డి జోన్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి అతి కిరాతకంగా తల్లే హత్య చేసిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమీన్పూర్ మండలం బీరంగూడ గ్రామం రాఘవేంద్రనగర్‌లో ఇటీవల జరిగిన ముగ్గురు పిల్లల మృతి ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. పిల్లల తల్లి రజిత ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా.. ఆరు నెలల క్రితం పదో తరగతి పూర్వ విద్యార్థులు అంతా కలసి పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ పార్టీ సందర్భంగా తన క్లాస్ మేట్ అయిన శివతో రజిత స్నేహం ఏర్పరుచుకుంది.రోజూ చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడేవారు. అంతే కాకుండా పలు మార్లు రహస్యంగా కలుసుకున్నారు. కాగా, రజిత భర్త చెన్నయ్య.. ఆమె కంటే వయసులో ఇరవై సంవత్సరాలు పెద్దవాడు కావడంతో మొదటి నుంచీ ఆమెకు చెన్నయ్య అంటే ఇష్టం ఉండేది కాదు. తరచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలో తన పదోతరగతి క్లాస్మేట్ శివను కలసుకోవడం, అతనికి పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని భావించింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోమని రజిత, శివను అడగ్గా.. పిల్లలు లేకుండా ఒంటరిగా తనతో వస్తా అంటే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. దీంతో శివను పెళ్లి చేసుకోవాలంటే పిల్లలను అడ్డు తొలగించుకోవాల్సిందేనని రజిత నిర్ణయించుకుంది. మార్చి 28న సాయంత్రం ఆరు గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పగా, త్వరగా ఆ పని పూర్తి చేయమని చెప్పాడు. అదే రోజు రాత్రి భర్త భోజ నం చేసి 10 గంటలకు ట్యాంకర్ తీసుకొని చందానగర్ వెళ్లగా, ఇదే అదనుగా భావించి మొదట పెద్ద కొడుకు సాయికృష్ణ (12)ను, తర్వాత కూతురు మధుప్రియ (10)ను, ఆ తర్వాత చిన్న కొడుకు గౌతమ్ (8)ను.. ఇలా ముగ్గురిని ఒకరి తరువాత ఒకరిని ముక్కు, మూతిపై టవల్ వేసి, చేతితో గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి చంపింది. పిల్లలను అడ్డు తొలగించుకోవాలని రజితను శివ ప్రోత్సహించగా ఆమె కిరాతకంగా వారిని చంపివేసిందని ఎస్పీ వెల్లడించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశామన్నారు. ఈ సమావేశంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ నరేశ్, డీఐ రాజు, ఎస్ఐ సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
వీడియోలు


బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ మనోజ్ కుమార్ కన్నుమూత


పల్నాడు జిల్లాలో YSRCP కార్యకర్త దారుణ హత్య


ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి


ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం


కొడాలి నాని ఆరోగ్యంపై లోకేష్ వ్యాఖ్యలకు అంబటి కౌంటర్


మూడు రోజులు ఆంధ్రాలో వానలే వానలు


APలో పడిపోయిన రిజిస్ట్రేషన్ల ఆదాయం


ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు హ్యాట్రిక్ ఓటమి


అసెంబ్లీలో రేవంత్ వ్యాఖ్యలపై మరోసారి సుప్రీం ఆగ్రహం


వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం