
చిరంజీవి (Chiranjeevi) బ్లాక్‌బస్టర్ సినిమాల్లో శంకర్‌దాదా ఎంబీబీఎస్ (Shankar Dada M.B.B.S. Movie) ఒకటి. ఈ సినిమా చూశాకే తనకున్న వ్యాధి బయటపడిందంటోంది వైష్ణవి వర్మ అనే అమ్మాయి. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ చేసింది. నాకు టైప్ 1 డయాబెటిస్ ఉందన్న విషయం డాక్టర్ చెప్తేనో, క్లినిక్‌కు వెళ్తేనో తెలియలేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ చూశాక ఆ వ్యాధి ఉందని తెలిసొచ్చింది. నేను సరదాగా అనడం లేదు, నిజమే చెప్తున్నాను.
ఏళ్లతరబడి బాధ.. ఒక్క సినిమాతో
ఆ పెద్ద స్టోరీని మీకు క్లుప్తంగా చెప్తాను. నాకెప్పుడూ దాహం వేస్తుండేది.. ఆకలిగా ఉండేది. ఎక్కువసార్లు టాయిలెట్‌కు వెళ్లేదాన్ని. ఉన్నపళంగా బరువు తగ్గేదాన్ని. ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా ఎవరూ ఏం చెప్పలేకపోయారు. ఓరోజు నేను శంకర్‌దాదా ఎంబీబీఎస్ చూస్తున్నాను. అందులో చిరంజీవి చెప్తున్న ఓ వ్యాధి లక్షణాలన్నీ కరెక్ట్‌గా నాకు సరిపోయాయి. సినిమా మధ్యలో ఆపేసి నాకు మధుమేహం ఉన్నట్లుంది అని పేరెంట్స్‌కు చెప్పాను. వాళ్లు బిగ్గరగా నవ్వి.. నెగెటివ్‌గా ఆలోచించకు అన్నారు.
మధుమేహం ఉందని తెలిసింది
ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించుకుంటే రక్తంలో చక్కెర.. డెసిలీటర్‌కు 555 మిల్లీగ్రాములు ఉంది. అలా నాకు టైప్ 1 డయాబెటిస్ ఉందని నిర్ధారణ అయ్యాక చికిత్స తీసుకున్నాను. నిజానికి నాకు మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది.. కానీ ఎవరం గెస్ చేయలేకపోయాం. ఒక సినిమా మాత్రం నా జీవితాన్నే మార్చేసింది అని చెప్పుకొచ్చింది. ఈ మేరకు శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో చిరంజీవి మాట్లాడిన ఓ క్లిప్పును కూడా జత చేసింది. ప్రస్తుతం ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: రెండు పెళ్లిళ్లు.. ఎందుకంటే నేను శ్రీరాముడిని ఫాలో కాను: కమల్