ఆ సమయంలో తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యా: పోకిరి భామ | Actress Ileana D'Cruz Opens Up About Postpartum Depression - Sakshi
Sakshi News home page

Ileana DCruz: గదిలో ఒంటరిగా కూర్చోని ఏడ్చా: ఇలియానా

Jan 4 2024 8:06 PM | Updated on Jan 4 2024 8:22 PM

Ileana DCruz Shares about experince On Battling Postpartum Depression - Sakshi

పోకిరి భామ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ స్టార్‌ హీరోలతో నటించింది. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. అయితే గతేడాది పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత ఆగస్టులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తన ప్రియుడితో ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.

అంతే కాకుండా తన కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు కూడా పెట్టింది. అయితే ప్రస్తుతం బిడ్డతో మాతృత్వం ఎంజాయ్ చేస్తోన్న ఇలియానా.. ప్రసవం తర్వాత ఎదురైన ఇబ్బందులను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రసవానంతరం తీవ్రమైన డిప్రెషన్‌కు గురైనట్లు తెలిపింది. ఆ సమయంలో తన భాగస్వామి మైఖేల్ డోలన్‌కు సపోర్ట్‌గా ఉన్నారని వివరించింది.

ఇలియానా మాట్లాడుతూ.. 'ప్రసవానంతరం తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యా. కానీ ఇంట్లో నాకు మంచి సపోర్ట్ ఉన్నందుకు సంతోషిస్తున్నా. నేను నా గదిలో ఒంటరిగా ఉంటూ ఏడ్చాను. ఇది నిజంగా తెలివి తక్కువ పని నాకు తెలుసు, కానీ నా కొడుకు వేరే గదిలో నిద్రిస్తున్నాడు. అందుకే నేను అతన్ని కోల్పోతున్నట్లు అనిపించింది. తనను బాగా చూసుకున్నందుకు వైద్యులకు ధన్యవాదాలు చెప్పా' అని అన్నారు. 

తన భాగస్వామిని గురించి మాట్లాడుతూ.. 'బిడ్డ పుట్టిన తర్వాత మేము కూడా తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యాం. నేను ఇప్పటికీ వాటిని అనుభవిస్తున్నా. మైక్ ఇంత అద్భుతమైన భాగస్వామి అయినందుకు నేను నిజంగా లక్కీ. అతనికి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి.. ఆ తర్వాత తనే బిడ్డను చూసుకుంటూ ఉంటాడు." అంటూ ఆనందం వ్యక్తం చేసింది. అయితే పర్సనల్ విషయాల్లో ప్రైవసీ మెయింటెన్ చేస్తున్న ఇలియానా.. తన పార్ట్‌నర్ గురించి పెద్దగా మాట్లాడలేదు. కాగా.. ఇలియానా చివరిసారిగా ది బిగ్ బుల్‌లో అభిషేక్ బచ్చన్‌తో కలిసి కనిపించింది. ప్రస్తుతం ఆమె రణదీప్ హుడా సరసన అన్‌ఫెయిర్ అండ్ లవ్లీలో నటించనున్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement