Krishna Vrinda Vihari Movie New Release Date Announced, Deets Inside - Sakshi
Sakshi News home page

Krishna Vrinda Vihari Release: ‘కృష్ణ వ్రిందా విహారి’ కొత్త రిలీజ్‌ డేట్‌.. వచ్చేది అప్పుడే

Published Sat, Apr 23 2022 4:36 PM | Last Updated on Sat, Apr 23 2022 5:57 PM

Krishna Vrinda Vihari Movie New Release Date Announced - Sakshi

యంగ్‌ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్‌ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్‌ షిర్లీ సేథియా హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు.

Krishna Vrinda Vihari Movie New Release Date Announced: యంగ్‌ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్‌ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్‌ షిర్లీ సేథియా హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకిటించారు మేకర్స్‌. 

 ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తూ పోస్టర్‌ విడుదల చేశారు. ఇందులో నాగశౌర్య ఏదో ఆలోచిస్తూ సూపర్‌ కూల్‌గా ఉన్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య బ్రహ్మణ యువకుడిగా అలరించనున్నాడు. మహతి స్వర సాగర్‌ సంగీతం అందించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధికా శరత్‌ కుమార్‌ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. 

చదవండి: ఎన్టీఆర్‌ నాగశౌర్యకు ఏమవుతాడు? క్లారిటీ ఇచ్చిన శౌర్య తల్లి



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement