naga shourya
-
నాగశౌర్యకు ఆస్తమా! వాడి కూతుర్ని వీడియో కాల్లో చూస్తున్నా: హీరో తల్లి భావోద్వేగం
రోజూ ఇంట్లో ఉండి ఏదో ఒకటి అనుకునే బదులు వారానికి ఒకసారి కలుసుకుని హ్యాపీగా ఉందాం.. సంసారం ఒక చదరంగం సినిమాలో ఈ మాట నా మనసుకు కనెక్ట్ అయిందంటోంది హీరో నాగశౌర్య తల్లి ఉషా ముల్పురి. నాగశౌర్య పెళ్లి తర్వాత వేరే కాపురం పెట్టాడు. పెళ్లవగానే కొడుకు, కోడలు వేరుగా ఉండటం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది ఉషా.చిన్నప్పుడే అన్నాడుతాజాగా ఉషా (Usha Mulpuri) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగశౌర్య (Naga Shourya) చిన్నప్పుడే.. పెళ్లయ్యాక మాత్రం నేను కలిసుండను అనేవాడు. ఎందుకురా అంటే ఇద్దరు మంచివాళ్లు ఒక్క దగ్గర ఉండకూడదని చెప్పేవాడు. మొదటి నుంచి అదే అనుకున్నాం కాబట్టి పెళ్లయ్యాక కొడుకు-కోడలు వేరే ఇంట్లో ఉంటున్నారు. నాగశౌర్యకు గతేడాది పాప పుట్టింది. గత నవంబర్లోనే మనవరాలి ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేశాం. తనను చాలా మిస్ అవుతున్నాను. వీడియో కాల్లో చూస్తుంటాను. బాధగా ఉంటుందిఅదొక్కటే బాధేస్తుంది. ఇటీవల తను నాతో పాటు నెలన్నర రోజులుంది. రెస్టారెంట్ పనుల వల్ల బిజీగా ఉండటంతో తన దగ్గరకు తరచూ వెళ్లలేకపోతున్నాను. చాలామంది పిల్లలే ప్రపంచంగా బతుకుతారు. వాళ్లు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయాక జీవితం శూన్యంగా మారుతుంది. పిల్లల పెళ్లయ్యాక మనమెలా ఉండాలనేది కూడా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరికీ ఏ సలహా ఇవ్వకూడదు, వాళ్లేం చెప్పినా మనం ఓకే చెప్పాలి.. ఇవన్నీ తెలుసుకుని అలవాటు చేసుకున్నాను.చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజుశౌర్య కంటే పెద్దోడే నచ్చుతాడుఅలాగే మనం వద్దని చెప్పినంత మాత్రాన పిల్లలు వాళ్లు చేసే పనిని ఆపేయరు. కాబట్టి మనం.. సరేనని తలూపితే మన గౌరవం నిలబడుతుంది. నేను అదే పాటిస్తున్నాను. శౌర్య.. ఎప్పుడు కూడా తన మనసులో మాట చెప్పడు. చిన్నప్పటి నుంచి వాడు అలాగే ఉన్నాడు. సంతోషంగా ఉన్నప్పుడు ఏదీ చెప్పకపోయినా పర్లేదు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పాలి. అప్పుడే కదా మనం ఏదో ఒకటి చేయగలుగుతాం. నా పెద్దబ్బాయి చిన్న విషయమైనా నాతో పంచుకుంటాడు. అందుకనే నాకు శౌర్య కంటే పెద్ద కుమారుడే నచ్చుతాడు.ఇలాంటి రోజు వస్తుందని తెలుసుచిన్నప్పుడు ఇద్దరికీ ఆస్తమా ఉండేది. ఆ కారణంగా ఎక్కువగా స్కూలుకు వెళ్లేవారు కాదు. ఇంట్లోనే చదివించేదాన్ని. రోజంతా వారితోనే ఉండేదాన్ని. అలాంటిది పిల్లల పెళ్లయ్యాక ఇల్లంతా బోసిపోయినట్లనిపించింది. ఇలాంటి రోజొకటి వస్తుందని తెలుసు. దాన్నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టింది అని ఉషా చెప్పుకొచ్చింది.చదవండి: గేమ్ ఛేంజర్ సినిమాకు షాక్.. ఇకపై అది లేనట్లే! -
నాగశౌర్యతో కమెడియన్ సత్య స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఆరోజు రోడ్డు మీద జరిగింది ఇదే: నాగశౌర్య
-
సాఫ్ట్‌గా ఉండకు.. ఆడుకుంటారు
‘కుర్రాళ్ళంటే ఈ వయసులో ఇలాగే ఉంటార్రా. నువ్వేం కంగారు పడకు’ అనే డైలాగ్‌తో మొదలైంది ‘రంగబలి’ టీజర్. నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘అయ్య బాబోయ్.... రేపట్నుంచి చూత్తారుగా.. మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరం వచ్చేస్తది (నాగశౌర్య)’, అయినా.. నువ్వేం అంత సాఫ్ట్‌గా ఉండకు.... ఆడుకుంటారు (యుక్తి తరేజ)’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రంలో బీ ఫార్మసీ చదివిన యువకుడి ΄ాత్రలో నాగశౌర్య, డాక్టర్ ΄ాత్రలోయుక్తి తరేజ నటించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: పవన్ సీహెచ్. -
Rangabali Teaser: 'రంగబలి' టీజర్ వచ్చేసింది
టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య ఒకడు. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్లు అందుకున్న నాగశౌర్యకు గత కొంత కాలంగా సరైన హిట్ సినిమా పడలేదు. తాజాగా నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగబలి' టీజర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తున్నంత సేపు ఎంతో ఫన్ను పంచుతుంది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' సెన్సార్ పూర్తి.. నైజాం రైట్స్ నుంచి తప్పుకున్న దిల్ రాజు) సగటు కుర్రాడు. బాధ్యత లేకుండా తిరగడం, తండ్రి తిట్లు, తల్లి బాధ, ఫ్రెండ్స్‌తో సరదాలు, గొడవలు ఇలా అన్నీ టీజర్లో కనిపించాయి. ‘మన ఊరిలో మనర్నెవడురా ఆపేది’ అనే లోకల్ పాయింట్ అందరినీ మెప్పిస్తుంది. టీజర్‌ను కలర్ ఫుల్ గానే కట్ చేశారు మేకర్స్. పల్లెటూరును లీడ్‌గా తీసుకుని చేస్తున్న సినిమా కాబట్టి యూత్‌ను ఆకట్టుకోవచ్చు. ఈ చిత్రం జూలై 7, 2023న థియేటర్లలోకి రానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. (ఇదీ చదవండి: ట్రోలర్స్‌కు ఫోటోలతో కౌంటర్ ఇచ్చిన 'భీమవరం' బ్యూటీ) -
మరో ఆత్మహత్య జరగాలని ఎదురుచూస్తున్నారా?: రష్మీ
నడిరోడ్డుపై ప్రేయసి చెంప చెల్లుమనిపించిన యువకుడితో హీరో నాగశౌర్య వాదనకు దిగిన విషయం తెలిసిందే! అమ్మాయి మీద చేయి చేసుకోవడం తప్పని, ఇందుకుగానూ సారీ చెప్పి తీరాల్సిందేనని వాదించగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరేమో రియల్ హీరో అని మెచ్చుకుంటుంటే మరికొందరేమో ప్రేమికుల మధ్యలో దూరడం అవసరమా? అని విమర్శిస్తున్నారు. 'లవర్స్ మధ్య వంద సమస్యలు ఉంటాయి. నువ్వు మధ్యలో కల్పించుకోవడం అవసరమా? వాడి గర్ల్‌ఫ్రెండ్ వాడిష్టం. ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లమ్ లేనప్పుడు ఈ అతిగాడికి ఏం సమస్యో..', 'ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందో ఎవడికి తెలుసు? అయినా వాడి లవర్‌ను వాడు కొట్టుకుంటుంటే నీకేంటి?' అంటూ కామెంట్లు చేశారు. వీటి స్క్రీన్షాట్లను యాంకర్ రష్మీ ట్విటర్లో షేర్ చేస్తూ సదరు నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'వాడి లవర్ వాడి ఇష్టం.. అమ్మాయినే సపోర్ట్ చేస్తున్నారంటూ కామెంట్లు చేయడం ఎంత సిగ్గుచేటు. తను ఎంత ఒత్తిడికి లోనవుతుందో ఎవరికి తెలుసు? మరో ఆత్మహత్య జరగాలని ఎదురుచూస్తున్నారా?' అని ఫైర్ అయింది. కాగా ఇటీవల జరిగిన కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసును గుర్తు చేస్తూ రష్మీ ఈ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. Vadi lover vadi istam anta Ammai ne support anta The comments below are so damn shameful What kind of pressure tat girl is in who knows Do u really hav to wait for another suicide to happen https://t.co/xHGmwkIP5d pic.twitter.com/5tc7AwjalK — rashmi gautam (@rashmigautam27) February 28, 2023 చదవండి: ఆస్కార్ లైవ్‌లో నాటు నాటు పాట.. మోత మోగించనున్న రాహుల్, కాలభైరవ -
అమ్మాయిని కొడతావా? నడిరోడ్డుపై యువకుడిపై నాగశౌర్య ఆగ్రహం
యంగ్ హీరో నాగశౌర్య రియల్ హీరో అనిపించుకున్నారు. నడిరోడ్డుపై ఓ యువతిపై యువకుడు చేయి చేసుకోగా, ఎందుకు కొట్టావంటూ నాగశౌర్య నిలదీశాడు. అంతేకాకుండా అమ్మాయిని కొట్టడం తప్పు అని ఆమెకు క్షమాపణలు(సారీ)చెప్పాల్సిందే అని శౌర్య సదరు యువకుడితో గొడవకు దిగాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రోడ్డు మీద ఇద్దరు ప్రేమికులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో అబ్బాయి అమ్మాయిని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. అదే సమయంలో అట్నుంచి కారులో వెళుతున్న నాగశౌర్య ఇది గమనించి 'ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావ్ అంటూ నిలదీశాడు. దీనికి అతను ఆమె నా లవర్, నా ఇష్టం అంటూ ఓవర్యాక్షిన్ చేయగా అబ్బాయిని గట్టిగా పట్టుకొని మర్యాదగా ఆ అమ్మాయికి సారీ చెప్పు అంటూ శౌర్య వాదించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శౌర్య చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. -
సిక్స్ ప్యాక్ మానియాలో హీరోలు..ఆరోగ్యంపై ఎఫెక్ట్
సిక్స్ ప్యాక్ సినిమా స్క్రీన్కు పరిచయమై దశాబ్ధంపైగానే అయినా అంతకంతకూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. దాదాపుగా బాలీవుడ్, టాలీవుడ్ అగ్రహీరోల్లో యుక్తవయసులో ఉన్న హీరోలు అందరూ ఆరున్నొక్కరాగం ఆలపిస్తున్నవారే. తెలుగులో దేశ ముదురు సినిమా కోసం అల్లు అర్జున్ నుంచి మొదలై సునీల్, ప్రభాస్, నితిన్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, సుధీర్‌బాబు, విజయ్ దేవరకొండ...తాజాగా అఖిల్..ఇలా అనేకమంది ఆరు–ఎనిమిది పలకల దేహాలతో తెరపై గ్రీక్ లుక్‌లో తళుక్ మంటున్నారు. నాణేనికి మరోవైపు... ఆ మధ్య టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం విషయంలో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. బాహుబలి అనంతరమే ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నాడని, సిక్స్ ఫిజిక్ కోసం ఆశ్రయించిన పలు మార్గాలే దీనికి కారణమని కూడా కొన్ని విశ్లేషణలు వెలుగు చూశాయి. అలాగే ఇటీవల కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య ఆకస్మిక అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన ఆకస్మికంగా సొమ్మసిల్లిపడిపోగా ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే ఆసుపత్రిలో చేరే సమయంలో డీ హైడ్రేషన్, హై ఫీవర్‌తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సిక్స్‌ప్యాక్ కారణం? టాలీవుడ్లో హీరోలకు క్రేజీగా మారిన సిక్స్‌ప్యాక్ దక్కించుకుని, దాని కొనసాగింపుల కోసం నాగశౌర్య గత కొన్ని నెలలుగా తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారని, అదే విధంగా కఠినమైన డైట్ రొటీన్‌ను పాటిస్తున్నారని సమాచారం. యువకుడు, ఎప్పుడూ హుషారుగా ఆరోగ్యంగా కనిపించే నాగశౌర్యకు ఆకస్మికంగా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడానికి సిక్స్ ప్యాక్ క్రేజ్ కారణమై ఉండవచ్చునని అంటున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇంకా ఆ విషయాన్ని థృవీకరించలేదు. ఈ నేపధ్యంలో హీరోల్ని చూసి మక్కీ కి మక్కీ అనుసరించే లక్షలాది మంది యువ అభిమానులు జాగ్రత్త పడాల్సి ఉంది. అన్ని రకాల వసతులూ, శిక్షకులూ ఉన్న స్టార్లకే అలా అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా... నిపుణులేమంటున్నారు? ఆరుపలకల దేహాన్ని పొందాలని కోరుకునేవారు చాలా మంది ఉండొచ్చు.. అయితే దానిని సాధించడం చాలా కష్టం. అంతేకాదు సాధించినా కూడా ఆ సిక్స్‌ప్యాక్‌ని కొనసాగించడం మరింత కష్టం. ఈ విషయం చాలా మందికి తెలీదు. సిక్స్–ప్యాక్ మానియాలో పడి గుడ్డిగా అనుసరించే ముందు, ఆకస్మిక, కఠినమైన డైట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి యువత తెలుసుకోవాతని వైద్యులు, ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. సిక్స్ ప్యాక్ శరీరానికి ఆరోగ్యకరమైనది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారేం చెప్తున్నారంటే... ► అసహజమైన శరీరపు అతి తక్కువ కొవ్వు శాతం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని నెలల పాటు సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేయడం అంటే శరీరపు కొవ్వు శాతం ఉండాల్సిన కనీస స్థాయి కన్నా పురుషులలో అయితే 12% మహిళల్లో అయితే 18% తక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. కొవ్వు ఇలా పరిమితికి మించి తగ్గడం అనేది అంతర్గత అవయవాల లైనింగ్‌ను బాగా ప్రభావితం చేస్తుంది. ► తమకు వచ్చిన సిక్స్ ప్యాక్ చూపులకు బిగుతుగా కనిపించేలా చేయడానికి కొందరు ఆహారంలో ఉప్పును పూర్తిగా వదులుకుంటారు ఇది మరింత ప్రమాదకరమైన విషయం. ఆహారం నుంచి ఉప్పును తొలగించడం ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ► అదే విధంగా కొన్ని సందర్భాల్లో తాగే నీటికి కూడా ప్రమాదకర పరిమితి పాటించాల్సి ఉంటుంది. ఇది తీవ్రమైన డీ హైడ్రేషన్‌కు గురి చేసే అవకాశం ఉంది. ► అలాగే సిక్స్–ప్యాక్ సాధించిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పరిగెత్తడం, ఆ ఆరు పలకల కండరాలు ప్రస్ఫుటంగా కనిపించడం కోసం తరచు తరచి చూసుకోవడం, అవి కనపడని రోజున తీవ్రమైన ఒత్తిడికి గురికావడం జరుగవచ్చుని అది మానసిక సమస్యలకు దోహదం చేస్తుందని కూడా సైక్రియాట్రిస్ట్లు హెచ్చరిస్తున్నారు. ► బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరయ్యేవారు లేదా పూర్తిగా వైద్యుల, న్యూట్రిషనిస్ట్‌ల పర్యవేక్షణలో గడిపేవారు, ఒత్తిడితో కూడిన వృత్తి వ్యాపకాలు నిర్వహించని వారు తప్ప సిక్స్ ప్యాక్ గురించి ఎవరు ఎక్కువ శ్రమపడినా అది ప్రమాదకరమే కావచ్చునంటున్నారు. ► ఇక ఫాస్ట్‌గా సిక్స్ ప్యాక్ దక్కించుకోవడం కోసం స్టెరాయిడ్స్ వంటివి అతిగా తీసుకునేవారు కూడా ఆరోగ్యపరమైన తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పదు. -
నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా?
-
ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన ప్రియురాలు అనూష శెట్టితో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నవంబర్ 20న బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో నాగశౌర్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ నాగశౌర్య-అనూష శెట్టిల రాయల్ వెడ్డింగ్‌కి వేదికైంది. ప్రస్తుతం నాగశౌర్య పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. వీరి గ్రాండ్ వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు నెటిజన్లను వీపరితంగా ఆకట్టుకుంటున్నాయి. చదవండి: ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం.. ఫోటోలు వైరల్ ఇక నాగశౌర్య పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు భోజనాలు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయం ప్రకారం కంచాల్లో బంతి భోజనాలు వడ్డించారు. అయితే ఒక్కో అతిథికి ప్రత్యేకంగా ఒక్కో టేబుల్ ఏర్పాటుచేశారు. ఈ టేబుల్స్ అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఉన్నాయి. విందులో భాగంగా 12 రకాల వంటలు, 4 రకాల స్వీట్స్, పెట్టినట్టు తెలుస్తోంది. కాగా టాలీవుడ్ సెలబ్రిటీల కోసం త్వరలో హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్‌ను ఏర్పాటు చేసేందుకు నాగాశౌర్య ప్లాన్ చేసినట్లు సమాచారం. @IamNagashaurya 👌 pic.twitter.com/71NdpGjuAE — devipriya (@sairaaj44) November 20, 2022 Royal Lunch Arrangement @ #NagaShaurya wedding 👌👌#LetsGoShaan ❤️ #AnushaShetty pic.twitter.com/KqX3lUMmO6 — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 20, 2022 -
ఫైవ్ స్టార్ హోటల్లో గ్రాండ్‌గా నాగశౌర్య వివాహం
-
ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నేడు(ఆదివారం) 11:25 గంటలకు బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో నాగశౌర్య-అనూషల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. చదవండి : పెళ్లి కొడుకుగా నాగశౌర్య.. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్ టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా నాగశౌర్య వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక శౌర్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి కొత్తజంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్‌గా పలు అవార్డులను అందుకుంది. కొన్నాళ్లుగా ఆమెకు నాగశౌర్యతో పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అనూషశెట్టితో నాగశౌర్య ప్రేమ వివాహం!.. ఇంతకీ ఆమె ఎవరంటే
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన వివాహం ఖరారైంది. ఈనెల 20న 11:25 గంటలకు వీరి వివాహం బెంగళూరులోని ఓ హోటల్లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లిసందడి మొదలైంది.శుభలేఖలు కూడా పంచుతున్నారు. పెళ్ళికి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా నాగశౌర్య ఫ్యామిలీ ఆహ్వానితులను కోరుతున్నారు. ఇదిలా ఉండగా నాగశౌర్య పెళ్లి చేసుకునే అనూష శెట్టి ఎవరు? ఆమె ఏం చేస్తుంటుంది? అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన అనూష శెట్టిది మంగళూరు దగ్గరలోని కుందాపూర్. ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఎంతో టాలెంట్ ఉన్న అనూష ఉమెన్ అచీవర్స్‌లో ఒకరుగా గుర్తింపు సంపాదించుకున్నారు. 2019-2020లో ది బెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అనూష అందుకున్నారు. ఆర్కిటెక్ట్ గా కర్ణాటక స్టేట్ విన్నర్ అయిన అనూషతో నాగశౌర్యకు కొన్నాళ్లుగా పరిచయం ఉందట. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలు వారి పెళ్లికి అంగీకరించినట్లు సమాచారం. నాగశౌర్య పెళ్లి కబురు తెలియడంతో అభిమానులు సహా సెలబ్రిటీలు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న కృష్ణ వ్రింద విహారి, ఆ రోజు నుంచి స్ట్రీమింగ్, ఎక్కడంటే
యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’. న్యూజిలాండ్ గాయని, నటి షిర్లే సెటియా ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు మంచి విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే దసరాకు ముందు దసరాకి ముందు థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు దీపావళి సందర్భంగా ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతోంది. చదవండి: సరోగసీ వివాదం.. ఇన్‌డైరెక్ట్‌గా స్పందించిన నయన్ దంపతులు! ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫాలం నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా థియేటర్లో విడుదలైన నెల రోజులకే ఈమూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం. కాగా దీనిపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికి.. కృష్ణ వ్రింద అక్టోబర్ 23 నుంచి అందుబాటులోకి రానుందంటూ నెట్ఫ్లిక్సలో ఆప్షన్ కనిపిస్తోంది. దీంతో దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి థియేటర్ల నవ్వులు పూయించిన ఈ సినిమా.. ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. #PremiereAlert 🔔@IamNagashaurya's #KrishnaVrindaVihari will be available for streaming on @NetflixIndia from 23 October. pic.twitter.com/AtSoOIX31f — Unfiltered Filmy 🍿 (@UnfilteredFilmy) October 12, 2022 -
‘కృష్ణ వ్రింద విహారి’ సక్సెస్ మీట్.. నాగశౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘కృష్ణ వ్రింద విహారి’ చాలా మంచి సినిమా. థియేటర్లో అద్భుతమైన స్పందన వస్తోంది. మొదటి రోజు నుంచి థియేటర్లు, వసూళ్లు పెరుగుతున్నాయి. పంపిణీదారులు, మేము అంతా ఆనందంగా ఉన్నాం. మా సినిమాకి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో నాగశౌర్య అన్నారు. అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లీ సేటియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘మంచి సినిమా ఇచ్చిన అనీష్ కృష్ణకు థ్యాంక్స్. ‘ఛలో’ తర్వాత నేను గర్వపడే హిట్ ఇచ్చినందు నిర్మాత, మా అమ్మకి స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు. ఉషా ముల్పూరి మాట్లాడుత.. ‘‘కృష్ణ వ్రింద విహారి’ ఫ్యామిలీతో కలసి థియేటర్లో చూడాల్సిన సినిమా. ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. దసరా సెలవులు వచ్చాయి కాబట్టి ఇంకా సినిమా చూడని వారు చూడండి’’ అన్నారు. ‘‘మా సినిమా వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి. రాధికగారితో పాటు ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థ్యాంక్స్. మా చిత్రాన్ని పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు అనీష్ ఆర్.కృష్ణ. ఈ కార్యక్రమంలో నటీనటులు హిమజ, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజు కలెక్షన్లతో అదరగొట్టిన 'కృష్ణ వ్రింద విహారి'
యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. న్యూజిలాండ్ గాయని, నటి షిర్లే సెటియా ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే మంచి కలెక్షన్లను రాబట్టిందీ చిత్రం. అయితే తాజాగా తొలిరోజు కంటే రెండోరోజు ఎక్కువ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. అటు అమెరికాలోనూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు అక్కడ లక్షడాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా నాగశౌర్య ఇందులో సంప్రదాయ కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో కనిపించాడు.బ్రహ్మాజీ, సత్య మరియు వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లొ నటించారు. Thanks to all the Overseas Audience for the Immense LOVE for our #KrishnaVrindaVihari 😊✨ $100k+ US Gross in 2 Days! ❤️🔥 Watch our #HilariousBlockbuster In Cinemas now! 🎟️ https://t.co/ZN7BGCyB6k#KVV @ShirleySetia #AnishKrishna @mahathi_sagar @ira_creations @saregamasouth pic.twitter.com/tHMigqo57b — Naga Shaurya (@IamNagashaurya) September 25, 2022 -
అప్పుడు పాన్ వరల్డ్ సినిమా అవుతుంది: నాగశౌర్య
‘‘పాన్ ఇండియా సినిమా చేయాలంటే మంచి కథ కుదరాలి.. అంతేకానీ మనం పాన్ ఇండియాకి ప్లాన్ చేయకూడదు. మంచి కంటెంట్‌తో సినిమా తీస్తే పాన్ వరల్డ్ చూస్తారు. అప్పుడు అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు డామినేటింగ్‌గా ఉన్న సమయంలో మేము ఉండటం లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు నాగశౌర్య. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లే సేథియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగశౌర్య పంచుకున్న విశేషాలు. ⇔ ‘కృష్ణ వ్రింద విహారి’ కథ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో అనీష్‌కి ఓకే చెప్పాను. మంచి ఫన్, ఫ్యామిలీ, మాస్.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. సినిమా చూసినవారు తమ ఫ్యామిలీతో రిలేట్ చేసుకుంటారు. కుటుంబం ఉన్నంతవరకూ మా ‘కృష్ణ వ్రింద విహారి’లాంటి కథలకు తిరుగులేదు. ఈ సినిమాలో రాధికగారి పాత్ర మినహా మిగతా పాత్రలన్నీ హిలేరియస్‌గా ఉంటాయి. ⇔ ‘అదుర్స్, డీజే, అంటే సుందరానికీ’.. ఇలా ఎన్నో సినిమాల్లో బ్రాహ్మణ పాత్రలు ఉన్నప్పటికీ దేనికదే భిన్నమైనది. ‘కృష్ణ వ్రింద విహారి’ కూడా భిన్నమైన కథ. కమల్‌హాసన్, ఎనీ్టఆర్, అల్లు అర్జున్‌గార్లు.. వంటి వారు బ్రహ్మణ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు స్వతహాగా బ్రాహ్మణుడైన అవసరాల శ్రీనివాస్ వద్ద కొన్ని విషయాలు నేర్చుకున్నాను. రొమాంటిక్ సీన్స్‌లో నేను చాలా వీక్ (నవ్వుతూ).. మా దర్శకుడు కష్టపడి చేయించారు. ⇔ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన పాద యాత్రలో ప్రేక్షకుల అభిమానం ఒక వరం అనిపించింది. ఇక నేను నటించిన ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ షూటింగ్ పూర్తయింది.. త్వరలో విడుదల చేస్తాం. -
నాగశౌర్య ‘కృష్ణ వ్రిందా విహారి’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్ షిర్లీ సేథియా హీరోయిన్గా పరిచయం కానుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకిటించారు మేకర్స్. ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాను సెప్టెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
లండన్‌లో ‘ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి’ టీం సందడి
నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయిక. ప్రస్తుతం ఈ మూవీ లండన్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ హీరోహీరోయన్లపై కీలక సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు ప్రధాన తారాగణం కూడా ఈ షూటింగ్ షెడ్యూల్ పాల్గొంది. గతంలో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన కళ్యాణ వైభోగమే ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. అలాగే శ్రీనివాస్ అవసరాల, నాగశౌర్య కాంబినేషన్లో రూపొందిన ఊహలు గుసగుసలాడే, జో అచ్చుతానంత చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగశౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇలాంటి విజయవంతమైన చిత్రాల నాయకనాయికలు, దర్శకుడుతో పాటు ప్రతిభ కలిగిన సాంకేతిక వర్గంతో మా ఈ చిత్రం నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. -
‘కృష్ణ వ్రిందా విహారి’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. వచ్చేది అప్పుడే
Krishna Vrinda Vihari Movie New Release Date Announced: యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్ షిర్లీ సేథియా హీరోయిన్గా పరిచయం కానుంది. ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకిటించారు మేకర్స్. ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నాగశౌర్య ఏదో ఆలోచిస్తూ సూపర్ కూల్‌గా ఉన్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య బ్రహ్మణ యువకుడిగా అలరించనున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. చదవండి: ఎన్టీఆర్ నాగశౌర్యకు ఏమవుతాడు? క్లారిటీ ఇచ్చిన శౌర్య తల్లి Coming to you as Krishna with lots of love & laugh. May 20th - Get Set for Summer treat people🥳#KrishnaVrindaVihari on May 20th🎋 #KVV @ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @ira_creations @mahathi_sagar @saregamasouth #KrishnaVrindaVihariOnMay20 pic.twitter.com/z7CGOV7P0G — Naga Shaurya (@IamNagashaurya) April 23, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1151264010.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సామ్ చేతుల మీదుగా ‘వెన్నెల్లో వర్షంలా..’ రొమాంటిక్ సాంగ్
యంగ్ హీరో నాగశౌర్య, షిర్లీ సెటియా జంటగా నటించిన రొమాంటికి అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్‌ని స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేసింది. ‘బ్యూటిఫుల్ సాంగ్ విత్ బ్యూటిఫుల్ పీపుల్’అంటూ ట్వీట్ చేస్తూ సామ్ ఈ పాటకు సంబంధించిన యూట్యూబ్ లింక్‌ని ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘రా .. వెన్నెల్లో వర్షంలా .., రా .. వర్షంలో వెన్నెల్లా .. అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌ని ఆదిత్య ఆర్కే, సంజన కాల్మంజే ఆలపించగా, మహతి స్వరసాగర్ అద్భుత సంగీతాన్ని అందించాడు. -
‘కృష్ణ వ్రిందా విహారి’ హీరోయిన్ షిర్లే సెటియా (ఫొటోలు)
-
నాగశౌర్య ‘కృష్ణ వ్రిందా విహారి’ టీజర్ చూశారా?
నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా రాధిక కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’.అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఏప్రిల్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేసింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా నటించారు. అలనాటి నటి రాధిక ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. -
నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' వచ్చేది అప్పుడే..
Naga Shaurya Krishna Vrinda Vihari Movie Release Date Out: యంగ్ హీరో నాగశౌర్య వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే వరుడు కావలెను, లక్ష్య, అశ్వథ్థామ వంటి విభిన్న చిత్రాలలో హీరోగా మెప్పించాడు. తాజాగా నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. అనీష్ ఆర్. కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ సింగర్ షిర్లే సెటియా హీరోయిన్గా చేస్తోంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించగా శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. 'కృష్ణ వ్రింద విహారి ఏప్రిల్ 22న వస్తున్నాడు' అంటూ ట్విటర్ వేదికగా పోస్టర్ షేర్ చేశారు. ఈ సినిమా కుటుంబంతో చూడదగిన పూర్తి వినోదాత్మక చిత్రమని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. నాగశౌర్య భిన్నంగా, సరికొత్త రోల్ చేస్తున్నట్లు వెల్లడించాయి. ఒక సాంగ్ తప్ప మిగతా షూటింగ్ సుమారు పూర్తయిందని సమాచారం. ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం బాధ్యతలు స్వీకరించారు. KRISHNA and VRINDA are ready with Loads of Entertainment !!! 🤩#KrishnaVrindaVihari ❤️ is Arriving to Theatres on APRIL 22nd, 2022🎋@IamNagashaurya @ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @ira_creations @mahathi_sagar @saregamasouth#KrishnaVrindaVihariOnApr22 pic.twitter.com/uYwxi6idQF — Ira Creations (@ira_creations) March 7, 2022 -
మూడేళ్ల తర్వాత నాగశౌర్యకు రిప్లై ఇచ్చిన సాయి పల్లవి
నెచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సహజమైన నటన, అద్భుతమైన డ్యాన్స్‌తో ఇటూ ప్రేక్షకులను, అటూ దర్శక-నిర్మాతలను ఫిదా చేస్తోంది ఆమె. గ్లామర్ పాత్రలకు దూరం, చేసింది అరడజను సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందడం ఒక్క సాయి పల్లవికే చెందింది. స్టార్‌గా గుర్తింపు పొందేముందు ఓ నటి ఎన్నో విమర్శలు, ట్రోల్స్‌ను ఎదుర్కొంటుంది. కానీ సాయి పల్లవి మాత్రం అలాంటి వాటికి అవకాశమే ఇవ్వదు. అంతగా తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటుంది ఆమె. చదవండి: టాలీవుడ్ ప్రముఖుల మధ్య కోల్డ్‌వార్, వరస ట్వీట్స్‌తో మాటల యుద్ధం.. అలాంటి సాయి పల్లవిపై ముడేళ్ల క్రితం యంగ్ హీరో నాగశౌర్య విమర్శ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నాగశౌర్య, సాయి పల్లవిలు కలిసి కణం చిత్రంలో నటించారు. ఈ మూవీ షూటింగ్లో సమయంలో సాయి పల్లవితో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ గతంలో నాగశౌర్య షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం తనపై నాగశౌర్య చేసిన వ్యాఖ్యలకు సాయి పల్లవి తాజాగా సమాధానం ఇచ్చింది. ఇటీవల సాయి పల్లవి బాడీ షేమింగ్‌కు గరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందిస్తూ నాగశౌర్య వ్యాఖ్యలపై కూడా స్పందించింది. చదవండి: హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్ వైరల్ ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. నా వల్ల ఎవరైన ఇబ్బంది పడ్డారంటూ నాకు బాధగా ఉంటుంది. గతంలో హీరో నాగశౌర్య నాపై ఇలాంటి కామెంట్స్ చేశాడు. అది తెలిసి నాకు చాలా బాధేసింది. కణం మూవీ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్‌ని ఫోన్ చేసి నా వల్ల ఇబ్బంది పడ్డారా? అని అడిగాను. వాళ్లు అలాంటిదేమి లేదన్నారు. నటుడిగా నాకు నాగశౌర్య అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన నాలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారు. కానీ నేను దాన్ని పాజిటివ్‌గానే తీసుకున్నాను. నిజంగా సెట్లో నా వల్ల అతనికి ఇబ్బంది కలిగి ఉంటే అది నన్ను బాధించే విషయమే. ఇక ఈ నా సమాధానంతో అయిన ఆయన సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నా’ అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. -
ఆ సమయంలో తొమ్మిది రోజులు నీళ్లు కూడా ముట్టుకోలేదు: నాగశౌర్య
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా హీరో నాగశౌర్య మీడియాతో మాట్లాడుతూ.. వరుడు కావలెను సినిమా నా పరిధికి సంబంధించినది. అలాంటి సబ్జెక్ట్ ఎన్ని సార్లు చేసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతలకు ఉంది. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇప్పుడు లక్ష్య సినిమా రాబోతోంది. లక్ష్య ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. కథ విన్న వెంటనే నా వైపు నుంచి వంద శాతమివ్వాలని అనుకున్నాను. కొత్త నాగ శౌర్యను చూపించాలని అనుకున్నాను. ఇలాంటి కథలు రావడమే అదృష్టం. ఇలాంటివి వచ్చినప్పుడు యాక్టర్స్ ఎవ్వరైనా ఓ అడుగు ముందుకు వేస్తారు. నేను కూడా అదే చేశానని తెలిపారు. ఏ ఆట అయినా సరే ప్రొఫెషనల్‌గా వెళ్లాలంటే చాలా కష్టమని. కానీ ఈ సినిమా కోసం ఆర్చరీని నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కథ డిమాండ్ చేస్తే ఏ యాక్టర్ అయినా సిక్స్ ప్యాక్ చేస్తారు. కరెక్ట్ స్క్రిప్ట్ పడితే అందరం చాలా కష్టపడతాం. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు దాదాపు తొమ్మిది రోజులు కనీసం నీళ్లు కూడా ముట్టుకోలేదని’’ అన్నారు. ‘‘ 35 కేజీలను వెనక్కి లాగడం మామూలు విషయం కాదని ఎన్నో గాయాలు కూడా అవుతుంటాయి. ఈ సినిమా కోసం మూడు రోజులు మాత్రమే శిక్షణ తీసుకున్నాను. దేశంలోనే ఆర్చరీ నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా లక్ష్య. నా కెరీర్లోనూ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాను చేయడం ఇదే మొదటి సారి. ఇది వరకు కూడా క్రీడా నేపథ్యంలోని కథలు నా వద్దకు వచ్చాయి. కానీ ఇది బాగా నచ్చిందని చెప్పారు. చదవండి: Bigg Boss Telugu 5: సిరిది సిగ్గులేని జన్మ, ఆయన కాళ్లు కడిగి నెత్తిన చల్లుకో -
ఆకట్టుకుంటున్న నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ ట్రైలర్
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లక్ష్య’. నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విలువిద్య నేపథ్యంలో.. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ కథ నడుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. చదవండి: Rajamouli Emotional Post: ‘ఆర్ఆర్ఆర్’లో ఆయనతో ఓ షాట్ ప్లాన్ చేశా, కానీ.. సృజనమణి రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు .. నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకున్నావు.. ఇద్దరూ ఒకటేగా’ అంటూ హీరోయిన్ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమాలో కేతిక శర్మ కథానాయికగా నటించింది. అలాగే జగపతిబాబు, సచిన్ కేడ్కర్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీ డిసెంబర్ 10వ థియేటర్లలో విడుదల కానుంది. -
హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్
-
ఫాంహౌజ్ పేకాట కేసు: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్
Hero Naga Shourya Father Shivalinga Prasad Arrested: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారులో ఇటీవల వెలుగు చూసిన మంచిరేవుల పేకాట కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను ముమ్మరం చేసిన పోలీసులు నాగశౌర్య తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: టేబుల్‌కు 5 లక్షలు క్యాసినో కింగ్‌పిన్ గుత్తా సుమన్‌తో కలిసి శివలింగప్రసాద్ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో శివలింగ ప్రసాద్ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: టేబుల్‌కు 5 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేకాట కేంద్రాలను సీఎం కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మూసివేయించారు. పేకాట ఎక్కడ ఆడినా.. ఆడించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీస్ శాఖ అనేక పేకాట క్లబ్బులను మూసివేయించి కఠిన చర్యలు చేపట్టింది. కానీ కొంతమంది పేకాటను చీకటి వ్యవహారంగా నడిపిస్తూ కోట్లు గడిస్తున్నారు. రకారకాల ఆఫర్లు చెప్పి, పండుగల స్పెషల్ అంటూ మూడు ముక్కలాటకు అన్ని హంగులున్న సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సైబరాబాద్‌లో పట్టుబడిన సుమన్ గ్యాంగ్ కేవలం ఒక చిన్న చేప మాత్రమే అని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పేకాట నడిపిస్తున్న మరో మాఫియా మూడు ముక్కలు.. ఆరు కోట్లు అన్నట్టుగా భారీస్థాయిలో జూదం నడిపిస్తోంది. సుమన్.. స్పెషల్ పేరిట... జి.సుమన్‌కుమార్ (జీఎస్కే) నగరంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది వ్యాపారులు, ప్రముఖులకు వాట్సాప్‌ల ద్వారా పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీలు పెడుతున్నామని సందేశాలు పంపిస్తాడు. పార్టీ లొకేషన్ షేర్ చేస్తాడు. ఫాంహౌజ్, గెస్ట్‌హౌజ్‌లు కిరాయికి తీసుకొని మందు, విందు భారీస్థాయిలో ఏర్పాటు చేస్తాడు. కనీసం 5 నుంచి 10 టేబుళ్లు పెట్టి ప్రముఖులకు మినీ క్యాసినో ఏర్పాటు చేస్తాడు. అయితే స్పెషల్ అట్రాక్షన్ కోసం గోవా డీలర్ల నుంచి సుమన్ క్యాసినో గరŠల్స్‌ను రంగంలోకి దించుతున్నట్లు సైబరాబాద్ పోలీసుల విచారణలో వెల్లడైంది. సుమన్ ఆహ్వానం కోసం వీవీఐపీలంతా ఎదురుచూస్తారని విచారణలో తెలిసింది. హైదరాబాద్‌లోనే కాకుండా వీవీఐపీలను ప్రత్యేక విమానాల ద్వారా కేరళ, గోవా తీసుకెళ్లి కూడా జూదం ఆడిస్తాడని తెలిసింది. రెండు నెలల క్రితం సుమన్ కొంతమంది వ్యాపారులు, వీఐపీలతో కలిసి రష్యా వెళ్లాడు. అక్కడ క్యాసినోలో రూ.4.5 కోట్ల వ్యాపారం జరిపించినట్టు రష్యా వెళ్లి వచ్చిన ఓ వ్యాపారి ద్వారా వెల్లడైంది. ఇటీవల రష్యా వెళ్లినప్పుడు అక్కడ క్యాసినో ఆడుతున్న సుమన్ చౌదరి తదితరులు ఇది పెద్ద తిమింగళం... పేకాట దందాలో సుమన్‌కు మించిన ఓ తిమింగళం హైదరాబాద్ కేంద్రంగానే కోట్ల దందా సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి అండదండలు ఉండటంతోపాటు ఆయన కూడా జూదంలో చేయి తిరిగినవ్యక్తి కావడంతో పేకాట తిమింగళానికి అడ్డూఅదుపు లేదని నిఘా వర్గాలు చెప్పాయి. త్రీకార్డ్స్ (తీన్ పత్తా), రమ్మీ పాయింట్స్, పోకర్ ఈ మూడు రకాల పేకాటను ప్రముఖ వ్యక్తి అనుచరుడు జోరుగా సాగిస్తున్నాడు. వీవీఐపీలకు మాత్రమే తన అడ్డాలోకి అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి 2 గంటల వరకు ఆయన దందా సాగిస్తున్నట్టు తెలిసింది. గతంలో టాస్క్‌ఫోర్స్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లోని ఓ ప్రముఖ హోటల్లో అతడిని అరెస్ట్ చేసినా సదరు నిర్వాహకుడి వ్యవహారం మారలేదని పోలీసులే చెప్తున్నారు. దందా ఎక్కడెక్కడ? బేగంపేటలోని ఓ క్లబ్బును ఏళ్లపాటు నిర్వహించిన పేకాట తిమింగళం తెలంగాణ ఏర్పడిన తర్వాత అనధికారిక కేంద్రాలను తెరిచింది. నగరానికి చెందిన ప్రముఖుడి అండ చూసుకొని కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్, దేవరయాంజాల్‌లోని 70 ఎకరాల్లో ఉన్న ఫాంహౌజ్, జూబ్లీహిల్స్‌లో ప్రముఖ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్ మూడో ఫ్లోర్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని ఓ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ మొత్తం, బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 12లోని ప్రముఖుల నివాస ప్రాంతం, సెంట్రల్ జోన్ పరిధిలోని ఆదర్శ్‌నగర్, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌లోని సొంత ఫాంహౌజ్‌లో పేకాటను జోరుగా సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గేమ్‌కు ఐదు శాతం కమీషన్.. ప్రధానంగా త్రీకార్డ్స్, రమ్మీని ఆడించే ఈ నిర్వాహకుడు ప్రతీ టేబుల్‌కు కనీసం రూ.5 లక్షలు ఉంటేనే అనుమతిస్తాడు. మూడు ముక్కలాటలో బ్లైండ్గేమ్ పేరిట జరిగే దందానే అతడికి కాసులు కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీ గేమ్‌కి (కిట్) పాడిన మొత్తంలో 5 శాతం కమీ షన్‌గా తీసుకుంటాడు. ఉదాహరణకు ఐదుగురు కలిసి ఒక్కో గేమ్‌కి రూ.లక్ష చొప్పున ఆడినా రూ.5 లక్షలు అవుతాయి. అందులో ఒక గేమ్‌కి 5 శాతం కమీషన్ అంటే రూ.25 వేల చొప్పున వసూలు చేస్తాడు. ఇలా రోజుకు 20–25 గేమ్‌లు నడిపిస్తాడు. దీంతోపాటు రమ్మీ పాయింట్స్ 101కు ఐదుగురు రూ.5 లక్షల చొప్పున ఒక్కో గేమ్ ఆడితే రూ.25 లక్షలు అవుతుంది. ఇందులో 5 శాతం కమీషన్‌గా 1.25 లక్షలు తీసుకుంటాడు. ఇలాంటి రమ్మీ పాయింట్లు కనీసం నాలుగు గేములు ఆడుతున్నారంటే రూ.5 లక్షలు తన ఖాతాలోకి వెళ్లాల్సిందే. దీనికి అన్లిమిటెడ్ ఆఫర్‌గా ఆల్కహాల్, ఆహారం అందిస్తాడు. గోవా నుంచి వచ్చిన అమ్మాయిలను రంగంలోకి దించడం ఈ నిర్వాహకుడి ప్రత్యేకత. సుమన్‌తోపాటు అతనికి సహకరిస్తూ పేకాట సెంటర్లు నిర్వహిస్తున్న ప్రముఖ నిర్వాహకుడిపై పోలీసులు నజర్ పెట్టినట్లు తెలిసింది. -
సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాటరాయుళ్ల పట్టివేత
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌజ్‌లో భారీ పేకాట వ్యవహారాన్ని ఎస్వోటీ పోలీసులు ఛేదించారు. రెండు, మూడు రోజులు అడ్డావేసి పేకాట ఆడుదామని సిద్ధమైన వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఫామ్‌హౌజ్ సినీహీరో నాగÔౌర్యకు చెందినదిగా ప్రచారం జరగడంతో ఈ ఘటన సంచలనం సృష్టించింది. గోవాలోని కాసినోల తరహాలో.. హైదరాబాద్ శివార్లలో నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంచిరేవుల వద్ద గ్రీన్లాండ్స్ వెంచర్ ఉంది. అందులో రమణ అనే వ్యక్తి చెందిన ఫాంహౌస్‌ను సినీహీరో నాగశౌర్య ఐదేళ్ల లీజుకు తీసుకున్నారు. అందులో టీవీ సీరియళ్లు, సినిమాల షూటింగ్‌లు, పార్టీలు జరుగుతుంటాయి. అయితే దీపావళి పండుగ వస్తుండటంతో భారీగా పేకాట నిర్వహించేందుకు కొందరు ప్లాన్ చేశారు. నాలుగు రోజుల పాటు ఈ ఫాంహౌజ్‌ను వాడుకుంటామని సుమంత్ చౌదరి అనే పేరిట బుక్ చేసుకున్నారు. తరచూ గోవాలోని కాసినోలకు వెళ్లేవారిని సంప్రదించి ఇక్కడికి ఆహ్వానించారు. కాసినోల తరహాలో టేబుళ్లు, కాసినో కాయిన్లు, వందల పేకాట బాక్సులు, క్యాష్ కౌంటింగ్ మిషిన్లు, మద్యం, భోజన సదుపాయాలు వంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవహారంపై శంషాబాద్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందడంతో.. ఆదివారం రాత్రి దాడి చేశారు. 30 మంది అరెస్టు ఫామ్‌హౌజ్‌లోని పేకాట స్థావరంలో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన 30మందిని అదుపులోకి తీసుకున్నట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. 6.70 లక్షల నగదు, మూడు కార్లు, 33 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అరెస్టైన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు కూడా ఉన్నట్టు సమాచారం. పేకాట స్థావరంలో అదుపులోకి తీసుకున్నవారి పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. వారిని రిమాండ్‌కు పంపే సమయంలో వివరాలు వెల్లడిస్తామని నార్సింగి సీఐ శివకుమార్ తెలిపారు. -
‘వరుడు కావలెను' ముందు నాగచైతన్యకు చెప్పా: డైరెక్టర్
‘‘సినిమాలు, అందులోని క్యారెక్టరైజేషన్స్ చూసి చాలామంది స్ఫూర్తి పొందుతారు. కాబట్టి ప్రేక్షకులను తప్పుదోవ పట్టించకూడదు. పదిమందిని బాగుచేయకపోయినా పర్లేదు కానీ ఒక్కర్ని కూడా చెడగొట్టకూడదు. దర్శకత్వాన్ని నేనో బాధ్యతగా స్వీకరించాను. నేను ఏ సినిమా చేసినా చూసినవారు హ్యాపీగా ఉండేలా, ఒక మంచి విషయం నేర్చుకునేలా తీయాలనుకుంటాను’’ అన్నారు దర్శకురాలు లక్ష్మీ సౌజన్య. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా లక్ష్మీ సౌజన్య చెప్పిన విశేషాలు. కర్నూలు జిల్లాలో పుట్టాను. గుంటూరులో పెరిగాను. సినిమాలంటే ఇష్టం. అందుకే ఈ ఇండస్ట్రీని ఎంచుకున్నాను. దర్శకులు తేజ, శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ, ప్రకాశ్ కొవెలమూడి, మంజుల... 15 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ఇక ఇలాగే ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్‌గానే ఉండిపోతానేమోనని ‘వరుడు కావలెను’ కథ రాసుకుని దర్శకురాలిగా మారాను. ∙2017లో ‘వరడు కావలెను’ సినిమా స్టోరీలైన్‌ను నిర్మాత చినబాబుకు చెప్పాను. ఆయనకు నచ్చింది. ఆ తర్వాత పూర్తి కథ తయారు చేశాను.. ఓకే అన్నారు. కానీ అనుకోకుండా మా నాన్నగారు దూరం కావడం, కరోనా, లాక్డౌన్ పరిస్థితుల వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ముందు ఈ కథను నాగచైతన్యకు చెప్పాను. కానీ ప్రాజెక్ట్ కుదర్లేదు. ఆ తర్వాత నాగశౌర్య ఓకే అయ్యారు. ∙ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి తనకు కాబోయే వరుడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని ఆశపడుతుందో అదే ‘వరుడు కావలెను’ సినిమా. ఇందులో ఆర్కిటెక్చర్ ఆకాశ్ పాత్రలో నాగశౌర్య, ఎకో–ఫ్రెండ్లీ బిజినెస్ ఉమెన్ భూమి పాత్రలో రీతూ వర్మ కనిపిస్తారు. ఇద్దరూ బాగా చేశారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మంచి సంగీతం అందించారు. మాస్ సాంగ్స్ కోసం తమన్‌ని తీసుకున్నాం. నిర్మాత చినబాబుగారు ఈ సినిమాకు హీరో. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్టే లేదు. ఓ పెద్ద నిర్మాణసంస్థ ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. అయితే రిలీజ్ టెన్షన్ ఉంది. కానీ సినిమా చూసిన ప్రతి అబ్బాయి, అమ్మాయి మా ‘వరుడు కావలెను’ సినిమాకు కనెక్ట్ అవుతారని నమ్మకం ఉంది. సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి రంగంలోనూ అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇప్పుడు సమానమైన అవకాశాలు ఉంటున్నాయి. ఎవరైనా రన్నింగ్ రేస్‌లో పరిగెత్తాల్సిందే. పరిగెత్తగలిగితేనే రావాలి. నేను అమ్మాయిని కాబట్టి రిజర్వేషన్ ఇవ్వండి అంటే కుదరదు. ప్రతిభ ఉన్నప్పుడు ఎవరికైనా ప్రోత్సాహం లభిస్తుంది. నా దగ్గర కథలు ఉన్నాయి. ఐడెంటిటీ క్రైసిస్‌పై (గుర్తింపు కోసం తపన) ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. -
‘వరుడు కావలెను’.. ఈ టైటిల్ తనకు కరెక్ట్: రానా
‘‘వరుడు కావలెను’ టైటిల్ చూశాక హీరో ఎవరో నాకు చెప్పకపోయినా నాగశౌర్య అని ఊహించేవాణ్ణి. రాముడు మంచి బాలుడు అంటారు కదా.. తనను చూస్తే అలా అనిపిస్తుంటుంది. ఈ టైటిల్ తనకు కరెక్ట్‌గా సరిపోయింది’’ అని హీరో రానా అన్నారు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని రానా విడుదల చేశాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ..‘‘లక్ష్మీ సౌజన్యగారి గురించి శేఖర్ కమ్ములగారి శిష్యులు చెబుతుంటే విన్నాను. ఈ చిత్రంతో ఆమె మంచి హిట్ అందుకోవాలి. మంచి టీమ్ పనిచేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. నాగశర్య మాట్లాడుతూ..‘‘వరుడు కావలెను’ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నా. హీరోని బట్టి కాదు.. కథను బట్టి బడ్జెట్ పెట్టేవాళ్లను మూవీ మేకర్స్ అంటారు. తెలుగు ఇండస్ట్రీలోని మేకర్స్‌లో నాగవంశీ, చినబాబుగార్లు కూడా ఒకరు. ఈ చిత్రంలో నేను ఇంత అందంగా ఉండటానికి కారణం కెమెరామ్యాన్ వంశీ పచ్చిపులుసుగారే. ఈ సినిమాలో నన్ను నేను చూసుకుని లవ్‌లో పడిపోయా. 2018 ఫిబ్రవరి 2న ‘ఛలో’ సినిమా విడుదలైంది. ఆ రోజు సాయంత్రం సక్సెస్‌మీట్‌లో లక్ష్మీ సౌజన్య అక్కను కలిశా. తను ఆరోజు చెప్పిన లైన్ నాకు బాగా నచ్చి ఈ సినిమా చేశాను. రీతూ వర్మకీ, నాకు ఏదో గొడవ అయిందనే వార్తల్లో నిజం లేదు. తను షూటింగ్లో ఉండి రాలేదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమా చూసి మమ్మల్ని బతికించండి.. మీరు ఆనందంగా ఉండండి’’ అన్నారు. ‘‘నాకు అవకాశం ఇచ్చిన వంశీ, చినబాబులకు థ్యాంక్స్’’ అన్నారు లక్ష్మీ సౌజన్య. -
Varudu Kavalenu:పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చని అమ్మాయిని ప్రేమిస్తే..?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, ‘పెళ్లి చూపులు’ఫేమ్ రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’.లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్‌తో పాటు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని దగ్గుబాటి రానా విడుదల చేస్తూ.. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘పెళ్లి చూపుల కాన్సెప్టే మా అమ్మాయికి పడదు’ అనిహీరోయిన్ తల్లి చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. పెళ్లి చూపులు కాన్సెప్ట్ అంటేనే ఇష్టంలేని భూమి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఆకాశ్. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ప్రయత్నం ఫలించి.. భూమి ప్రేమను పొందుతాడు. కట్ చేస్తే.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారు. మరి ఆ విభేధాలకు గల కారణాలు ఏంటో తెలియాలంటే.. అక్టోబర్ 29న థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. -
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మరో ఫోక్‌సాంగ్
ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్‌కి మంచి ఆధరణ లభిస్తుంది. దీంతో భారీ బడ్జెట్ సినిమాల్లో కశ్చితంగా ఒక ఫోక్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఇటీవలె విడుదలైన సారంగదరియా, బుల్లెట్ బండి వంటి పాటలు ఎంతలా హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ‘వరుడు కావలెను’సినిమా నుంచి రిలీజైన “దిగు దిగు నాగ” అనే ఫోక్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ పాటకు 20 మిలియన్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను శ్రేయా గోషల్ ఆలపించింది. థమన్ సంగీతం అందించారు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానుంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 20M+ Views for Folk Sensation #DiguDiguDiguNaaga💥🥁 ▶️https://t.co/U7F59YlUAV 🎵 @MusicThaman 🎤 @shreyaghoshal ✍️ #AnanthaSriram#VaruduKaavalenu @IamNagashaurya @riturv @LakshmiSowG @vamsi84 @Composer_Vishal @SitharaEnts @adityamusic pic.twitter.com/MByedtS4Nc — Aditya Music (@adityamusic) October 11, 2021 -
నాగశౌర్యకు ముద్దిచ్చిన హీరోయిన్..
ప్రాచీన విలువిద్య నేపథ్యంలో నాగశౌర్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘లక్ష్య’. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్‌దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని నాగశౌర్య, కేతికల పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. -
వరుడు.. నరుడు...ఆన్ సెట్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు సినిమాల చిత్రీకరణలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేయడంతో తిరిగి సినిమాల షూటింగ్‌లు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘వరుడు కావలెను’, ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాల షూటింగ్‌లు కూడా గురువారం పునఃప్రారంభమయ్యాయి. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతోన్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. హీరో, హీరోయిన్లపై శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. కాగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్గా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరుడి బ్రతుకు నటన’ షూటింగ్ కూడా ప్రారంభమైంది. -
సోషల్ హల్చల్: షాకింగ్ లుక్‌లో శ్రద్దా, మతిపోగొడుతున్న నభా
► ఎర్ర చీరలో మెరిసిపోయిన ఈషా రెబ్బా.. అభిమానులకు కరోనా సందేశం ► ఈ కఠిన పరిస్థితుల్లో మనకు సహాయపడేవి ఆ రెండే అంటున్న సమంత ► సన్యాసిని గేటప్‌లో శ్రద్దాదాస్, అసలు విషయం చెప్పెసిన ముద్దుగుమ్మ ► అభిమానులకు అమిషా సందేశం, అతనేవరో తెలియదంటున్న భామ ► ఫొటో షేర్ చేసి కుర్రకారు మతి పోగొడుతున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ ► ఎల్లప్పుడు మీరు నాకు ప్రత్యేకమంటు మొదటి సారి పరిచయం చేసిన నాగశౌర్య ► తెలివైన నిర్ణయం తీసుకొమ్మంటున్న బిగ్‌బాస్ భామ మోనాల్ గజ్జర్ View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) -
నిర్మాణం చివరి దశలో యంగ్ హీరో నాగశౌర్య మూవీ
యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు. నాగశౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడూ చూడని ఎయిట్ప్యాక్ లుక్‌తో సర్పైజ్ చేశారు నాగశౌర్య. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కి, నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే 80 % షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రాచీన కాలంలో ఆర్చరీని వేట, పోరాటాల కోసం ఉపయోగించేవారు. అనేక పౌరాణిక కథలలో దాని ఉనికిని మరచిపోలేము. గొప్ప యోధులుగా, దేవుడిగా వ్యవహరించే వ్యక్తులు ఎల్లప్పుడూ విల్లుని ధరించే కనిపిస్తారు. ఇప్పుడు ఆ క్రీడ వెండితెరపైకి రాబోతుంది. విలువిద్య ఆధారంగా భారతదేశం యొక్క మొట్టమొదటి చిత్రం త్వరలో థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. 1900లో సమ్మర్ ఒలింపిక్స్‌లో ఆర్చరీని క్రీడగా చేర్చారు అప్పటి నుంచి ఇది క్రీడా సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఈ ఆటకు తీక్షణమైన దృష్టి, క్రమశిక్షణ, అగ్రశ్రేణి ఏకాగ్రత అవసరం. చాలా మంది ప్రతిభావంతులైన ఆర్చర్లను తయారు చేయడం ద్వారా ఈ క్రీడలో మంచి గుర్తింపు సాధిస్తోంది భారతదేశం. హీరో నాగశౌర్య, కేతికశర్మ, జగపతి బాబు,సచిన్ ఖేడేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్:రామ్‌రెడ్డి, సంగీతం:కాలబైరవ, ఎడిటర్: జునైద్, నిర్మాతలు: నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి. -
నాగశౌర్య షాకింగ్ లుక్ : టైటిల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: యంగ్‌హీరో నాగశైర్య మరోసారి షాకింగ్ లుక్‌లో ఫ్యాన్స్‌ను విస్మయపర్చాడు. ఈ చిత్రానికి `లక్ష్య` అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేసింది. కండలు తిరిగి శరీర సౌష్టవంతో, డిఫరెంట్‌గా నాగశౌర్య లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. టాలీవుడ్లో వినూత్న ప్రయోగాలతో ప్రేక్షకులముందుకు వస్తున్న నాగశౌర్య తాజా లుక్‌పై అభిమానులు ఫిదా అవుతున్నారు. (నాగశౌర్య సరసన హాట్ బ్యూటీ ఎంట్రీ) ఊహలు గుసాగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో నాగశౌర్య లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి భారతీయ మూవీ అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో ఆర్చర్ పాత్రలో కనిపిస్తున్నాడు నాగశైర్య. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్యకు జోడిగా కేతికా శర్మ నటిస్తున్న సంగతి తెలిసిందే. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అటు ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతిబాబు మరో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఎయిట్ ప్యాక్ బాడీతో చేతిలో బాణంతో స్టన్నింగ్ ఫస్ట్‌లుక్ ఇప్పటికే అందరినీ థ్రిల్ చేసిన సంగతి తెలిసిందే. “ LAKSHYA “ - A journey to conquer himself@nseplofficial @SVCLLP @sharrath_marar @Santhosshjagar1 #Ketikasharma@RaamDop @kaalabhairava7 @EditorJunaid #NS20#IndiasFirstFilmonArchery#Archery pic.twitter.com/84BbFS8NGN — Naga Shaurya (@IamNagashaurya) November 30, 2020 -
నాగశౌర్య కొత్త చిత్రం ప్రారంభం
-
పలాస మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
‘పలాస 1978 గొప్ప సినిమా అవుతుంది’
కరుణకుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి6న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చిని ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ హీరోలు నాగశౌర్య, శ్రీవిష్ణు, దర్శకుడు మారుతి, పలువురు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు హాజరయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, చిత్రయూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ‘పలాస 1978 నేను చూసాను. ఇలాంటి కథలు చేయాలని ఉన్నా లోపల చాలా భయం ఉంటుంది. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు చాలా ధైర్యం వచ్చింది. ఇలాంటి కథలు నిర్మించాలంటే నిర్మాతకు చాలా ధైర్యం ఉండాలి. కొడుకు హీరో గా ఉన్నా కూడా సినిమా నే ప్రేమించి సినిమాను నిర్మించారు నిర్మాత ప్రసాద్ గారు. అందరికీ ఆల్ ద బెస్ట్’ అని నాగశౌర్య అన్నారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘పలాస గురించి తెలుసుకున్నప్పుడు నా సినిమా అనే ఫీల్ కలుగుతుంది. దర్శకుడు తనదైన మార్క్ ని తెలుగు సినిమా పై ఇవ్వబోతున్నారు అనిపిస్తుంది. రఘు గారు ఇచ్చిన ‘పలాస మీద వచ్చిన పాట’చాలా బాగుంది. ఇది ప్రేక్షకుల్లో బలమైన ముద్రను వేయాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘పలాస ఫస్ట్ కాపీ చూసిన రోజు దర్శకుడు కుమార్ ఒక అద్భుతం చేసాడని పించింది. మనం ఊహించిన దానికంటే చాలా బాగా తీసాడు. ప్రతి మేకర్‌కి ఇలాంటి సినిమా చేయాలనిపించేలా చేసాడు. అందులో రఘుకుంచె గారి నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. తమిళ సినిమాలు చూసి మనం ఫీల్ అవుతుంటాం.. వెట్రిమారన్ లాంటి వారిని చూసి ప్రేరణ పొందుతుంటాం. కానీ మనకూ అలాంటి దర్శకులున్నారు అని కరుణ కుమార్ గుర్తు చేసాడ’న్నారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్, నిర్మాత రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్, చిత్ర బృందం పాల్గొంది. చదవండి: బంజారా సినిమాను నిషేధించాలి రాధిక నాకు తల్లి కాదు! -
50 శాతం పూర్తి.. వీసా కోసం వెయిటింగ్
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన యువ నటుడు అవసరాల శ్రీనివాస్. అష్టా చమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల కొద్ది రోజుల్లోనే ఊహలు గుస గుసలాడే సినిమాతో దర్శకుడిగా మారాడు. రెండో ప్రయత్నంగా జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్ లాంగ్ గ్యాప్ తర్వాత యంగ్ హీరో నాగశౌర్యతో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేకవార్తలు వస్తున్నాయి. బడ్జెట్ పెరిగిపోవడం, ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌పై దర్శకనిర్మాతలు అసంతృప్తిగా ఉండటంతో సినిమాను ఆపేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తమ అధికారిక ట్విటర్ ద్వారా స్పందించింది. ‘నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ 50 శాతం పూర్తయింది. చాలా అద్భుతంగా సినిమా రూపొందుతోంది. మిగతా షూటింగ్ యూఎస్ఏలో ప్లాన్ చేశాం. వీసాల కోసం వేచి చూస్తున్నాం. యూఎస్ఏ షెడ్యూల్ కూడా త్వరగానే పూర్తిచేస్తాం. ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవి. పుకార్లను నమ్మకండి’అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత వివేక్ కూచిభొట్ల ట్వీట్ చేశారు. ఇక అశ్వథ్థామతో హిట్ ట్రాక్‌లో వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో జోరుపెంచాడు. అవసరాల శ్రీనివాస్‌తో ఓ సినిమా రూపొందుతుండగానే.. లక్ష్మీసౌజన్య అనే కొత్త దర్శకురాలితో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. చదవండి: ‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ 'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు' -
కొత్త ప్రయాణం ప్రారంభం
‘అశ్వథ్థామ’ విజయంతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు నాగశౌర్య. తాజాగా ఓ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఈ సినిమా తెరకెక్కించనున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ఈ నెల 19న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాకు కెమెరా: వంశీ పచ్చి పులుసుల, సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
దర్శకురాలిగా ‘లక్ష్మీ సౌజన్య’
గ్యాప్ తర్వాత ‘అశ్వథ్థామ’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో వేగం పెంచాడు. నాగశౌర్య, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతు వర్మ జంటగా ఓ సినిమా ప్రారంభమైంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల19 నుంచి ప్రారంభంకానుంది. చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలిపారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి వంశి పచ్చి పులుసు సినిమాటోగ్రపీ అందిస్తున్నారు. ఇక ఛలో తర్వాత అంతటి హిట్ అందుకోని నాగశౌర్య ‘అశ్వథ్థామ’ వంటి మంచి కంటెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు నాగశౌర్యనే కథను అందించడం విశేషం. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై నాగశౌర్య తల్లి ఉష మూల్పురి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఫరెంట్ కాన్పెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక రీతు వర్మ కూడా పెళ్లి చూపులు తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. అయితే ఈ సినిమాలో రీతువర్మ క్యారెక్టర్ స్పెషల్‌గా ఉంటుందని దర్శక నిర్మాతలు పేర్కొంటున్నారు. చదవండి: ‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ 'చావుకబురు చల్లగా’ చెప్పిన కార్తికేయ -
మా శౌర్య చిన్నప్పట్నుంచి మాస్
‘నర్తనశాల’ (2018) సినిమా తీసి తల్లిదండ్రులను బాధ పెట్టానని శౌర్య ఫీలయ్యాడు. మా బ్యానర్ నుంచి అలాంటి సినిమా వచ్చినందుకు నిర్మాతగా నేను బాధపడ్డాను. శౌర్య కెరీర్లో అది బిగ్గెస్ట్ డిజాస్టర్. ఆ బాధను తీసేసేలా ‘అశ్వథ్థామ’ మంచి సంతోషాన్ని ఇచ్చింది’’ అన్నారు నిర్మాత ఉషా మూల్పూరి (నాగశౌర్య తల్లి). రమణతేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా శంకర్‌ప్రసాద్ సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘అశ్వథ్థామ’. నాగశౌర్య ఈ సినిమాకు కథ అందించారు. జనవరి 31న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ – ‘‘మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కె. రాఘవేంద్రరావుగారు, నందినిరెడ్డిగారు ఫోన్ చేసి అభినందించారు. శౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. చిత్రం చాలా బాగుందని, ఇంకా మూడు నుంచి నాలుగు వారాలు థియేటర్స్‌లో బాగా ఆడుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుండటం సంతోషాన్నిచ్చింది. యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను ఆదరిస్తున్నారు. మనకు ఒక నిర్భయ, దిశ కేసులు తెలుసు. కానీ ‘అశ్వథ్థామ’లో చూపించిన విధంగా కూడా జరుగుతుందని మనలో చాలామందికి తెలియదు. కథ పరంగా శౌర్యకు మంచి స్పందన వస్తోంది. శౌర్య ఇలాంటి కథ రాసినందుకు ఒక నిర్మాతగా కంటే కూడా ఒక తల్లిగా బాగా సంతోషపడుతున్నాను. కథ చెప్పినప్పుడు శౌర్య సామాజిక బాధ్యతతో ఆలోచిస్తున్నాడని మేం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం. ‘అశ్వథ్థామ’ చిత్రంతో శౌర్యలోని మాస్ యాంగిల్‌ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. కమర్షియల్ హీరోతో సినిమా చేయాలనుకునేవారికి శౌర్య కూడా ఒక మంచి ఆలోచన. నిజానికి చిన్నప్పటి నుంచి కూడా శౌర్య ఫుల్ మాస్. సాఫ్ట్ క్యారెక్టర్ కాదు. కానీ ఇండస్ట్రీలో క్యూట్ అండ్ లవర్‌బాయ్ అనే పేరు వచ్చింది. శౌర్య అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హీరో అయ్యాడు. ఇప్పుడు రైటర్ అయ్యాడు. భవిష్యత్‌లో దర్శకుడు అవుతాడేమో ఇప్పుడే తెలియదు. ఇండస్ట్రీకి మేం చాలా ప్యాషనేట్‌గా వచ్చాం. మా బ్యానర్లో తర్వాతి చిత్రం వేరే హీరోతో ఉండొచ్చు. మా బ్యానర్లో అందరి హీరోలతో సినిమాలు చేయాలనుకుంటున్నాం. మా అబ్బాయి ఒక్కరే హీరో కాదు కదా! రాఘ వేంద్రరావుగారితో శౌర్య సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
’అశ్వథ్థామ’ మూవీ రివ్యూ
-
‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ
టైటిల్: అశ్వథ్థామ జానర్: యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు: నాగశౌర్య, మెహరీన్, ప్రిన్స్, సత్య, జిష్షు సేన్ గుప్తా, పోసాని కృష్ణమురళి, తదితరులు కథ: నాగశౌర్య దర్శకత్వం: రమణతేజ సంగీతం: శ్రీచరణ్ పాకాల నిర్మాత: ఉషా మూల్పూరి ‘ఛలో’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న యువ హీరో నాగశౌర్య ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేపోయాడు. యూత్ హీరోగా ముఖ్యంగా అమ్మాయిల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోకు హిట్టు పడి చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి బలమైన స్క్రిప్ట్‌తో పాటు సందేశాత్మక చిత్రాన్ని అందించేందుకు స్యయంగా నాగశౌర్యనే కథా రచయితగా మారాడు. తన లవర్ బాయ్ ఇమేజ్ను పక్కకు పెట్టి ఫుల్ యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ ‘అశ్వథ్థామ’ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగశౌర్య. మరి ఈ సినిమాతో నాగశౌర్యకు యాక్షన్ అండ్ మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టిందా? మళ్లీ ఈ యువ హీరో హిట్ ట్రాక్ ఎక్కాడా? డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారా? అనేది మన సినిమా రివ్యూలో చూద్దాం. కథ: నగరంలోని యువతులు మిస్సవడం.. రెండు మూడు రోజులు తర్వాత అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో కనిపించడం.. కొన్ని నెలల తర్వాత ఆ యువతులు ప్రెగ్నెంట్ కావడం.. చేసింది ఎవరో తెలీదు. కొంత మంది పాత్ర ధారులతో ఓ సూత్రధారి నిర్మించుకున్న పద్మ వ్యూహం లాంటి సామ్రాజ్యంలోకి అశ్వథ్థామ ప్రవేశిస్తాడు. పద్మవ్యూహంలోకి వెళ్లిన అశ్వథ్థామ చిక్కుకున్నాడా? లేక ఆ వ్యూహాన్ని ఛేదించాడా? శత్రు సంహారం జరిగిందా అనేదే అశ్వథ్థామ కథ. గణ (నాగశౌర్య)కు కుటుంబం అన్నా తన చెల్లెలు ప్రియ అన్నా ఎంతో ఇష్టం. చెల్లెలు ప్రియ ఎప్పుడు కంటతడి పెట్టకుండా అండగా, ధైర్యంగా ఉంటానని గణ తన తల్లికి చిన్నప్పుడే మాటిస్తాడు. అయితే రవి (ప్రిన్స్)తో ప్రియ పెళ్లికి కొద్ది రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడాన్ని గణ చూస్తాడు. ఇందుకు గల కారణాలను తెలుసుకొని ప్రియకు బాసటగా నిలుస్తాడు. తన చెల్లితో పాటు ఇంకెదరో యువతులు ఇలాంటి ఘటనలే ఎదుర్కోవడాన్ని గణ తన ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటాడు. ఇదంతా చేస్తుంది ఎవరు? నేహ (మెహరీన్)కు గణ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి డాక్టర్ మనోజ్‌కుమార్ (జిష్షు సేన్ గుప్తా), సత్య, పోసాని, తదితరలు ఎందుకు ఎంటర్ అవుతారు? చివరికి ఈ మిస్టరీ వెనుక ఉన్నది ఎవరో గణ తెలుసుకుంటాడా? చివరికి ఏమైంది? అనేదే అసలు సినిమా కథ నటీనటులు: నటీనటులు విషయానికి వస్తే ఈ సినిమా మొత్తాన్ని వన్ మ్యాన్ షోతో నాగశౌర్య ముందుండి నడిపించాడు. ఇప్పటివరకు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ను తొలగించుకునేందుకు ఈ పవర్ ఫుల్ యాక్షన్ చిత్రంలో నటించిన నాగశౌర్య ఫుల్ ఎనర్జీతో సూపర్బ్ అనిపించాడు. యాక్షన్ సీన్స్‌లలో హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. తన శైలికి భిన్నంగా చేసిన ఈ సినిమాతో అటు మాస్ ఆడియన్స్‌ను సొంతం చేసుకోవడం పక్కా. సినిమా తొలి అర్థభాగంలో కొన్ని సీన్లలలో కాస్త క్లాస్ లుక్‌లో కనిపించినా.. ఆ తర్వాత ఫుల్ మాస్ అండ్ రఫ్ లుక్‌లో కనిపిస్తాడు. సైకో విలన్‌గా జిష్షు సేన్ గుప్తా కొన్ని చోట్ల భయపెట్టిస్తాడు. క్లాస్ అండ్ రిచ్ విలన్‌గా చక్కగా ఒదిగిపోయాడు. రబ్బరు బొమ్మగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ మెహరీన్‌కు ఈ చిత్రంలో మంచి పాత్ర లభించినప్పటికీ హావభావాలు పలికించడం తడబడింది. అంతేకాకుండా తన పాత్రలో జీవించడం మరిచిపోయినట్టుగా అనిపిస్తుంది. ప్రిన్స్, నాగశౌర్య చెల్లెలి పాత్రలో కనిపించి అమ్మాయి సందర్భానుసారంగా స్క్రీన్ పై వచ్చి పోతుంటారు. భారీ తారాగణం ఉన్నప్పటికీ కొన్ని సీన్లలో వచ్చిపోతుంటారు తప్ప కథకు వారు పెద్ద ప్లస్ కాదు. విశ్లేషణ: ఈ సినిమాకు ప్రధాన బలం కథ, కాన్సెప్ట్. దీంతో తెరపైనే కాకుండా తెరవెనక కూడా ప్రధాన హీరో నాగశౌర్యనే. ఇక హీరో అందించిన కథను దర్శకుడు రమణ తేజ చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. సినిమా ప్రారంభమైన తొలి పదిహేను నిమిషాల్లోనే అసలు కథలోకి ప్రవేశిస్తుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, నెక్ట్స్ ఏంజరుగుతుంది అనే కుతూహలం సగటు ప్రేక్షకుడికి ఏర్పడే విధంగా ఫస్టాఫ్ సాగుతుంది. అయితే హీరోయిన్‌తో వచ్చే సీన్లు, పాటలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉంటాయి. ఇంటర్వెల్ వరకు బాగానే ఉన్న సెకండాఫ్ దర్శకుడు ఎలా తీస్తాడా? అనే అనుమానం అందరిలోనూ తలెత్తడం ఖాయం. అయితే సెకండాఫ్‌లో కూడా కథను ఎక్కడా డీవియేట్ కాకుండా? అనవసర హంగుల జోలికి వెళ్లకుండా రెండో అర్థభాగాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు దర్శకుడు. ఈ విషయంలో దర్శకుడి ప్రతిభకు నూటికి నూరు మార్కులు వేయాల్సిందే. ఎలాంటి గందరగోళం లేకుండా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ వావ్ అనిపిస్తాయి. అయితే అన్నా చెల్లెలి మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ అంతగా పండలేదు. దీనిపై కాస్త శ్రద్ద పెట్టాల్సింది. ఇక అసలు సూత్రధారి ఎవరో కనిపెట్టిన హీరో.. చిన్న ఫైట్‌తో సినిమా ముగించడంతో సినిమా అయిపోయిందా అనే భావన సగటు ప్రేక్షుకడికి కలగడం ఖాయం. మనోజ్ రెడ్డి కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్ అందాలు, యాక్షన్ సీన్లలో మనోజ్ తన సినిమాటోగ్రఫీతో మైమరిపించాడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం జిబ్రాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్. కొన్ని సీన్లలో సైలెంట్ మ్యూజిక్.. మరికొన్ని చోట్ల హార్ట్ బీట్‌ను పెంచే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా హీరో ఈల వేసేటప్పుడు థియేటర్ మొత్తం నిశ్శబ్బ వాతావరణం అలుముకుటుంది. ఇక శ్రీచరణ్ పాకాల పాటలు పర్వాలేదనిపించాయి. కానీ గుర్తుండిపోయే పాటలు మాత్రం కాదు. ఇక ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ‘గోపాల గోపాల’ సినిమాలో ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్‌తో సినిమా ఆరంభం అవడం ‘అశ్వథ్థామ’కు బూస్టప్‌ను ఇచ్చే అంశం. ఆకట్టుకునే డైలాగ్‌లు: ‘ఏ తల్లి కన్నదో వంద మంది కౌరవుల క్రూరత్వాన్ని ఈ ఒక్కడిలోనే కనింది’, ‘మనిషికి ఉండేది కోరిక, మృగాడికి ఉండేది వాంఛ. మరి మృగాడి వాంఛను తీర్చుకోవడానికి బతికుంటే ఏంటి? చచ్చిపోతే ఏంటి?’, ‘రావణాసురుడు చనిపోయింది సీతను ఎత్తుకపోయినందుకు కాదు.. జాటాయువును పూర్తిగా చంపనందుకు.. పూర్తిగా చంపుంటే సీతమ్మను ఎత్తుకపోయింది రావణుడని, దక్షిణం వైపు వెళ్లారని రాముడికి తెలిసేదా? రావణుడు చనిపోయేవాడా?’, ‘లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్లో ఏదో మ్యాజిక్ ఉంది’, ‘ప్రస్తుత కాలంలో ఆడపిల్లను కని, పెంచి ఏ గొడవ లేకుండా పెళ్లి చేయడం అంటే సాధారణ విషయం కాదు’ అంటూ సినిమాలో వచ్చే డైలాగ్‌లు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించే విధంగా ఉంటాయి. ప్లస్ పాయింట్స్: కథ, కథనం నాగశౌర్య నటన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: కొన్ని సాగదీత సీన్స్ పాటలు క్లైమాక్స్ సాదాసీదాగా ఉండటం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
కొత్త శౌర్యను చూస్తారు
‘‘నటుడిగా నాగశౌర్య ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. గెడ్డం తీస్తే క్లాస్‌గా కనిపిస్తాడు. గెడ్డం ఉంటే ఫైటర్‌గా ఉంటాడు. కీరిటం పెడితే కృష్ణుడిలా, క్యాప్ పెడితే కౌబాయ్‌లా ఉంటాడు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘ఛలో’ వంటి సక్సెస్‌ల సమయంలో నా కన్ను నాగశౌర్యపై పడింది’’ అన్నారు ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు. నాగశౌర్య హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. రమణ తేజ దర్శకత్వంలో ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న దర్శకులు, సాంకేతిక నిపుణులు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. ‘అశ్వథ్థామ’ చిత్రం చూడలేదు. కానీ ఈ చిత్రం నా ఊహకు ఓ కమర్షియల్ కుటుంబ కథా చిత్రంలా అనిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం హిట్ సాధిస్తుంది’’ అన్నారు. ‘‘రాఘవేంద్రరావుగారి ఆశీస్సులతో ఈ సినిమా మొదలైంది. ఆయన చేయి చాలా మంచిదని అంటుంటారు. మా సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకుల అభిప్రాయాలను నా చెవులతో వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇందులో కొత్త శౌర్యను చూస్తారు’’ అన్నారు నాగశౌర్య. ‘‘ఈ సినిమాను రమణతేజ బాగా తీశాడని చెప్పుకుంటున్నారు. కానీ నాగశౌర్య మంచి కథను అందించారు. ఓ మంచి కారణంతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రమణతేజ. ‘‘మా తమ్ముడు ఇప్పటివరకు 17 సినిమాలు చేశాడు. ప్రతి సినిమాకు నేను ఏదో ఒక కంప్లైట్ చేసేవాడిని. ఈ సినిమాకు అలా ఏం లేదు. రమణతేజ ఈ సినిమాను బాగా తీశారు’’ అన్నారు ఐరా క్రియేషన్స్ డిజిటల్ డైరెక్టర్ గౌతమ్. ‘‘అవకాశాల కోసం ప్రయత్నించి ఇక ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్న సమయంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. ‘ఛలో’ వంటి సూపర్ సక్సెస్ కొట్టిన నాగశౌర్య సినిమాకు నేను డైలాగ్స్ రాయడం ఏంటీ? అనుకున్నాను. శౌర్య ఓ సీన్ ఇచ్చి రాయమన్నారు. రాశాను. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి ‘నువ్వు ఈ సినిమాకు రాస్తున్నావ్’ అన్నారు. చాలా సంతోషపడ్డాను’’ అన్నారు డైలాగ్ రైటర్ పరశురామ్. -
దేనికైనా ఎమోషనే ముఖ్యం
‘‘మన దగ్గర థ్రిల్లర్ జానర్‌కి ఆడియన్స్ తక్కువ. మన ప్రేక్షకులకు ఎలివేషన్ కన్నా ఎమోషన్ ముఖ్యం. ఒక ఎమోషనల్ కథకు థ్రిల్లర్ అంశాలు జోడిస్తే అదే ‘అశ్వథ్థామ’ చిత్రం’’ అన్నారు దర్శకుడు రమణ తేజ. ఆయన దర్శకత్వంలో నాగశౌర్య, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ – ‘‘మాది చిత్తూరులో మదనపల్లి. చిన్నప్పుడు చదువుకుంది మదనపల్లిలోనే. మా ఫ్యామిలీలో అందరం ఎక్కువగా సినిమాలు చూసేవాళ్లం. నాన్నగారికి చిరంజీవిగారంటే విపరీతమైన అభిమానం. నన్ను ఎక్కువగా సినిమాలకు తీసుకెళ్లేవారు. చిన్నప్పుడు చదువుల్లో చాలా చురుకుగా ఉండేవాణ్ణి. తమిళనాడులో ఇంజనీరింగ్ చేశాను. కాలేజ్‌లో ఉన్నప్పుడే సినిమాల్లోకి వెళ్లాలని బలంగా కోరిక కలిగింది. కాలేజీ రోజుల్లో తీసిన ఓ షార్ట్ ఫిల్మ్‌కి స్క్రీన్‌ప్లే వీక్ అనే కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత అమెరికాలో ఎంబీఏ చేయడానికి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి వెళ్లి ఫిల్మ్ కోర్స్ చేశాను. అక్కడ స్క్రీన్ రైటింగ్‌లో డిగ్రీ చేశాను. స్క్రీన్ ప్లే మీద అవగాహన సంపాదించాను. ‘టెడ్ 2’ అనే హాలీవుడ్ సినిమాకు అప్రెంటిస్‌గా వర్క్ చేశాను కూడా. తిరిగొచ్చాక ఓ సినీ ప్రమోషన్ కంపెనీలో వర్క్ చేస్తుండగా ‘ఛలో’ ప్రమోషన్స్‌లో నాగశౌర్య అన్న పరిచయమయ్యారు. అలా మా ప్రయాణం మొదలైంది. అప్పుడే శౌర్య అన్న ‘అశ్వథ్థామ’ కథ రాస్తున్నారు. అది పూర్తయ్యాక నువ్వే దర్శకుడిని అన్నారు. దర్శకుడిగా నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. శౌర్య అన్నయ్యతో ఈ ప్రయాణాన్ని మర్చిపోలేను’’ అన్నారు. -
క్లాస్.. మాస్ అశ్వథ్థామ
‘‘సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అశ్వథ్థామ’. మా అబ్బాయి నాగశౌర్య మంచి కథ రాశాడు.. దాన్ని డైరెక్టర్ చక్కగా తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత ఉషా ముల్పూరి. నాగశౌర్య, మెహరీన్ జంటగా నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన చిత్రం ‘అశ్వథ్థామ’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ– ‘‘అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్‌ని అలరించాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్ని కాస్త ఎక్కువగానే తీశాం. ‘కేజీఎఫ్’ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు–అరివు మా సినిమాకి పనిచేశారు. ఈ సినిమాలో కొత్త నాగశౌర్యను చూస్తారు’’ అన్నారు. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐరా క్రియేషన్స్ వారికి థ్యాంక్స్. నన్ను నమ్మి దర్శకత్వ బాధ్యతలు అప్పగించిన నాగశౌర్యకి కృతజ్ఞతలు. మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’’ అన్నారు రమణ తేజ. ‘‘అనుకున్న టైమ్‌లో సినిమాను పూర్తి చేశాం. మేం అనుకున్న దానికంటే ఔట్పుట్ బాగా వచ్చింది. ఇందుకు సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అని సహ నిర్మాత బుజ్జి అన్నారు. -
కొత్త నాగశౌర్యను చూస్తారు
నాగశౌర్య హీరోగా ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సోమవారం కొబ్బరికాయ కొట్టారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారాయణదాస్ నారంగ్, శరత్‌మరార్, రామ్మోహన్రావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన మొదటి సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా శరత్ మరార్ మాట్లాడుతూ– ‘‘నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్రావుగార్లతో కలిసి నాగశౌర్యతో సినిమా నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది. ఇదొక స్పోర్ట్ బేస్డ్ మూవీ. కథ అద్భుతంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘సునీల్‌గారు, శరత్ మరార్గారి కాంబినేషన్లో నా సినిమా ప్రారంభమవడం సంతోషంగా ఉంది. సంతోష్ రెండో చిత్రమిది. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్. తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘క్రీడా నేపథ్యంలో సాగే చిత్రమిది. ఒక ఊహాజనిత బయోపిక్‌లా ఉంటుంది. నాకు మంచి మైలేజ్ ఇచ్చే మూవీ అవుతుంది. ఇందులో సరికొత్త నాగశౌర్యని చూస్తారు’’ అన్నారు సంతోష్ జాగర్లపూడి. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ రెడ్డి. -
కొత్త సినిమాను ప్రారంభించిన యంగ్ హీరో
‘ఛలో’ సినిమాతో మంచి హిట్టు అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య.. మళ్లీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. నర్తనశాల, అమ్మమ్మగారి ఇల్లు వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు బోర్లాపడ్డాయి. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. నాగశౌర్య హీరోగా 'సుబ్రమణ్యపురం' ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నారయణదాస్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్రావు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశాన్ని దేవుడి పటాలపై చిత్రీకరించారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. ‘ఇదొక స్పోర్ట్ బేస్డ్ మూవీ. కథ అద్భుతంగా ఉంది అలాగే సంతోష్ ప్రామిసింగ్ డైరెక్టర్. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం'' అన్నారు. యంగ్ హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ‘ఏషియన్ సునీల్ గారు. శరత్ మరార్ గారి కాంబినేషన్లో ఈ చిత్రం ప్రారంభమవడం సంతోషంగా ఉంది. సంతోష్‌కు రెండో చిత్రం ఇది. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు. ఇక చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రయూనిట్ పేర్కొంది. -
కొత్త సినిమాను ప్రారంభించనున్న యంగ్‌హీరో
ఛలో సినిమాతో మంచి హిట్ కొట్టిన నాగశౌర్య.. మళ్లీ ఆ రేంజ్ హిట్టు కొట్టలేకపోతున్నాడు. నర్తనశాల, అమ్మమ్మగారిల్లు లాంటి సినిమాలు చేసినా.. ఈ యువహీరోకు అదృష్టం కలిసి రాలేదు. అయితే సమంత హీరోయిన్గా నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించాడు. అయితే తాజాగా నాగశౌర్య తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్పై నిర్మించే ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కాన్నుట్లు తెలిపారు. ఈ మూవీ షూటింగ్‌ను అక్టోబర్‌లో ప్రారంభించి.. వచ్చే సమ్మర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ హీరో ప్రస్తుతం అశ్వత్థామ సినిమాతో బిజీగా ఉన్నాడు. -
టాలీవుడ్ యంగ్ హీరోకు ఫైన్
సాక్షి, హైదరాబాద్ : యంగ్ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. నాగశౌర్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవి రూ. 500ల ఫైన్ విధించారు. అనంతరం కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను పోలీసులు తొలగించారు. ఈ ఘటన మంగళవారం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో చోటుచేసుకుంది. కాగా, భారత్‌లో కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడటంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల నాగశౌర్య ఓ బేబీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సొంత బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్.. వైజాగ్‌లో జరుగుతున్న సమయంలో ఆయన గాయపడ్డ సంగతి విదితమే. -
అందుకు ‘ఓ బేబీ’కి ఓకే చెప్పేశా : నాగశౌర్య
‘‘ఓ బేబీ’ చిత్రంలో నాది అతిథి పాత్ర అని చెప్పినా నందినీ రెడ్డిగారికి ఓకే చెప్పేశా. ఎందుకంటే ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన లక్ష్మీగారు ఉన్నారు. ‘మురారి’ సినిమా చూసినప్పటి నుంచి ఆమెతో పని చేయాలనుకుంటున్నా. ఇంతకు ముందు ఒకసారి అనుకున్నా కుదరలేదు. ‘ఓ బేబీ’ తో కుదిరింది’’ అని హీరో నాగశౌర్య అన్నారు. సమంత, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో బి.వి. నందినీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేశ్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు. ♦ హీరోగా చేస్తూ అతిథి పాత్రలు చేయడం ఇబ్బందిగా లేదు. నాకు నచ్చిన వారితో సినిమా చేయడం చాలా ఇష్టం. నందినీరెడ్డిగారు నాకు అక్కలాంటివారు. ఈ సినిమా గురించి ఆమె నాకు చెప్పడానికి సందేహిస్తుంటే మా అమ్మ ఒత్తిడి చేసి నాకు చెప్పించింది. కథ వినగానే తప్పకుండా హిట్ అయ్యే సినిమా అనిపించి, ఇందులో నేనూ భాగం కావాలనుకున్నా. ♦ తొలుత నాది అతిథి పాత్రే అనుకున్నా. సెట్లోకి వెళ్లాక ఫుల్ లెంగ్త్ అయింది. లక్ష్మీగారు సెట్లో ఉన్నప్పుడు ఒక రోజు మొత్తం నేను, సమంతగారు అక్కడే ఉన్నాం. నేను ఒక్కసారి ఆమెను పలకరించాను. ఆ తర్వాత దూరం నుంచి చూస్తూ నిలబడ్డాను. ఎందుకంటే నాకు సిగ్గెక్కువ. అందరూ దాన్ని పొగరు అనుకుంటారు. నా సిగ్గు వల్ల రొమాంటిక్ సీన్స్‌కి దూరంగా ఉంటున్నా. కానీ, తప్పదంటే మాత్రం చేస్తా. ♦ ఈ సినిమాలో నా లుక్ బాగుందని అంటున్నారు. అంటే ఇన్నాళ్లు నేను బాగా లేనా? అనిపించింది (నవ్వుతూ). సమంత గారితో పని చేస్తున్నప్పుడు నేను పెద్ద హీరోయిన్‌తో పని చేస్తున్నానని ఏ రోజూ అనిపించలేదు. ఈ సినిమాలో ఆమె ముఖం మీద ఉమ్మివేసే సీన్ ఉంటుంది. నేను ఆ పని చేస్తే బయట అందరూ నా మీద ఉమ్మేస్తారనుకున్నా. కానీ ఆమె డెడికేటెడ్ వ్యక్తి. సినిమా కోసమే కదా అని సహకరించడంతో ఆ సీన్ చేశా. ♦ ప్రస్తుతం మా ఐరా క్రియేషన్స్‌లో ‘అశ్వత్థామ’ సినిమా చేస్తున్నాం. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’ చేస్తున్నా. అదే విధంగా ‘పార్థు’ అని మరో సినిమా జరుగుతోంది. రిస్క్ చేయడం వల్ల ఇటీవల గాయపడ్డానని అంటున్నారు. అంత రిస్క్ అవసరమే. అది 14 నిమిషాల సీను. డూప్‌ని పెడితే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. హీరో పడే టెన్షన్ వాళ్లూ పడాలంటే నేనే కష్టపడాలని అర్థమైంది.. అందుకే రిస్క్ చేసి నేనే చేస్తున్నా. -
ఈ యువ హీరోలకు ఏమైంది!
సాక్షి, హైదరాబాద్ : నగరానికి ఏమైంది అన్నట్లు.. ఇది వింటే ఈ యువ హీరోలకు ఏమైంది అంటారు. నిజమే వరుసగా గాయాలపాలవుతున్న యువహీరోలను చూస్తే అసలేమైంది. ఎందుకు ఇలా అవుతుంది అనే సందేహం రాక మానదు. టాలీవుడ్ తలరాత బాలేదా లేక మన హీరోల జాతకం బాలేదా లేక ఏమైనా దోషం పట్టుకుందా అన్న అనుమానం వస్తుంది. మొన్నేమో వరుణ్‌తేజ్.. నిన్నేమో నాగశౌర్య.. సందీప్ కిషన్.. తాజాగా ఇవాళేమో శర్వానంద్... ఇలా ఒక్కొరు ప్రమాదాలకు గురవుతూ వస్తున్నారు. ఇంతకు మన టాలివుడ్‌కు ఏమైందంటారు. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఓ సినిమా షూటింగ్లో పాల్గొని తిరిగి వస్తుండగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాణిపేట దగ్గర ఎదురుగా వస్తున్న ఇండికా కారును వరుణ్‌తేజ్ ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో వరుణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. వరుణ్‌తేజ్ యధావిధిగా షూటింగ్లో పాల్గొంటాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక సినిమా షూటింగ్లో భాగంగా యువ హీరో నాగశౌర్య గాయపడ్డారు. కొత్త దర్శకుడు రమణతేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమా షూటింగ్లో భాగంగా వైజాగ్‌లో ఓ భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. ఎలాంటి డూప్ లేకుండా రోప్ లేకుండా నాగశౌర్య రియల్ స్టంట్ చేశాడు. ఆ సమయంలో గోడపై నుంచి దూకిన నాగశౌర్య కాలికి గాయమైంది. దీంతో కంగారుపడ్డ చిత్ర బృందం వెంటనే నాగశౌర్యను ఆస్పత్రికి తరలించారు. నాగశౌర్యను పరిశీలించిన వైద్యులు 25 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. యువ నటుడు సందీప్ కిషన్ కూడా ఇదే తరహాలో గాయపడ్డారు. సందీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెనాలి రామకృష్ణుడు సినిమా చిత్రీకరణ కర్నూలు పరిసరాల్లో జరుగుతోంది. షూటింగ్లో భాగంగా ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు బస్సులో నుంచి దూకే సన్నివేశంలో సందీప్ గాయపడ్డాడు. దీంతో చిత్ర బృందం వెంటనే కర్నూలు పట్టణంలోని మైక్యూరమ్ ఆస్పత్రికి తరలించారు. అయితే సందీప్‌కు ప్రమాదమేమి లేదని ఆయనకు తగిలింది స్వల్ప గాయాలేనని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ఇవాళ హైదరాబాద్‌కు చేరుకుంటారని చిత్ర దర్శకుడు నాగేశ్వరరెడ్డి తెలిపారు. తాజాగా ఈ గాయాల కూటమిలో శర్వానంద్ కూడా చేరిపోయాడు. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 96 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా స్కై డైవ్ చేస్తుండగా శర్వానంద్ జారీ కిందపడ్డాడు. భుజంతోపాటు కాలుకు తీవ్ర గాయాలు కావడంతో చిత్ర బృందం శర్వానంద్‌ను వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌కు చేరుకున్న శర్వానంద్ నేరుగా సన్‌షైన్ ఆస్పత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు శర్వానంద్ భుజంతోపాటు కాలుకు బలమైన గాయమైందని.. సర్జరీ చేయాలని సూచించారు. దీంతో శర్వానంద్‌కు సోమవారం సర్జరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఈ యువ హీరోలకు ఏమైంది!
-
తెలుగు హీరోలకు బ్యాడ్‌టైమ్!
సాక్షి, కర్నూల్: యువ హీరో సందీప్ కిషన్ షూటింగ్లో గాయపడ్డాడు. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమా షూటింగ్లో భాగంగా కర్నూల్లో పోరాట సన్నివేశం చిత్రీకరిస్తుండగా అతడికి గాయాలయ్యాయి. పైట్ మాస్టర్ తప్పిదం వల్ల జరిగిన బాంబ్ బ్లాస్ట్ సన్నివేశంలో అతడు గాయపడినట్టు సమాచారం. సందీప్ కిషన్ ఛాతీ, కుడి చేతిపై గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే కర్నూలు మై క్యూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు. అది పూర్తయిన అనంతరం హైదరాబాద్ అపోలో హాస్పటల్‌కి తరలిస్తారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక హీరోయిన్గా నటిస్తోంది. నిన్న వైజాగ్ షూటింగ్లో మరో యువ హీరో నాగశౌర్య కూడా గాయపడ్డాడు. నూతన దర్శకుడు రమణ తేజ తెకెక్కిస్తున్న సినిమాలో ఫైటింగ్ సీన్ తీస్తుండగా అతడి కాలికి గాయమైంది. నాగశౌర్యకు 25 రోజుల విశ్రాంతి అవసరం అని తేల్చడంతో షూటింగ్‌ను వాయిదా వేశారు. మెగా యువ హీరో వరుణ్ తేజ్ రెండు రోజుల క్రితం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయిణిపేట వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అంతకుముందు రాంచరణ్ కూడా గాయపడటంతో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కొన్నిరోజులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. నువ్వు తోపురా సినిమాలో హీరోగా నటించిన సుధాకర్ కోమాకుల కూడా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద జరిగిన కారు ప్రమాదంలో గాయాలతో అతడు బయటపడ్డాడు. హీరోలు వరుస ప్రమాదాలకు గురవుతుండడం పట్ల సినిమా పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఛలోను మించిన హిట్ అవుతుంది
‘ఛలో, నర్తనశాల’ తర్వాత నాగశౌర్య సొంతబ్యానర్లో మూడో సినిమా చేస్తున్నారు. పైగా ఈ సినిమాకి ఆయనే కథ అందించడం విశేషం. నాగశౌర్య, మెహరీన్ జంటగా రమణ తేజను దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ సినిమా రూపొందనుంది. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చి, స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందించగా, దర్శకుడు పరుశురామ్ గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ నందినీరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని ఆశ్వీర్వదించడానికి వచ్చిన రాఘవేంద్రరావుగారికి, పరుశురామ్, నందినీరెడ్డికి థ్యాంక్స్. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 70 శాతం షూటింగ్ వైజాగ్‌లో ప్లాన్ చేస్తున్నాం. మంచి కథను దర్శకుడు బాగా తీస్తారని ఆశిస్తున్నాం. ‘ఛలో’ కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన శౌర్య అన్నయ్యకు థ్యాంక్స్. ప్రొడ్యూసర్స్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు రమణ తేజ. ‘‘నర్తనశాల’ విషయంలో తప్పు చేశాం. ఈ సారి సొంత కథను రాసుకున్నాం. తప్పకుండా హిట్ వస్తుందని కోరుకుంటున్నాం’’ అన్నారు బుజ్జీ. ‘‘మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు మెహరీన్. ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: మనోజ్ రెడ్డి. -
కాంబినేషన్ షురూ
కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు నాగశౌర్య. కాశీ విశాల్ అనే నూతన దర్శకుడి చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించనున్నారు. ప్రముఖ దర్శకులు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు కాశీ విశాల్. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ అధినేత శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలో మరిన్ని విషయాలను తెలియజేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే... హీరో నాగశౌర్య కెరీర్లో వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన ‘ఛలో’ సినిమా విడుదలైన (ఫిబ్రవరి 2) తేదీనే ఆయన కొత్త సినిమా అనౌన్స్మెంట్ రావడం విశేషం. -
హ్యాట్రిక్ హిట్‌కు రెడీ అవుతున్న హీరో, డైరెక్టర్!
ఊహలు గుసగుసలాడే, జోఅచ్యుతానంద సినిమాలతో హిట్ కొట్టారు దర్శకుడు అవసరాల శ్రీనివాస్, హీరో నాగశౌర్య. దర్శకుడిగా అవసరాల టైమింగ్, టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఛలో లాంటి హిట్ మూవీ తరువాత ఆ స్థాయి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ యువహీరోతో కలిసి మళ్లీ మరో సినిమా పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. అవసరాల శ్రీనివాస్ నానితో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపినా.. నాని ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో.. నాగశౌర్యతో మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడని సమాచారం. మరి ఈ మూవీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తోంది. -
సమంత సినిమాలో నాగశౌర్య
ఛలో సినిమాతో ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత మరోసారి తడబడ్డాడు. వరుసగా అమ్మగారిళ్లు, కణం, నర్తనశాల సినిమాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరోకు క్రేజీ ఆఫర్ తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నాగశౌర్య కీలక పాత్రలో నటించనున్నాడట. నందినీ రెడ్డి చివరి సినిమా కళ్యాణ వైభోగమేలోనూ నాగశౌర్యే హీరోగా నటించాడు. లాంగ్ గ్యాప్ తరువాత నందిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మరో ప్రేమకథను నిర్మించనున్న సుకుమార్!
పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు.. చిన్న సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్. గతంలో కుమారి 21ఎఫ్, దర్శకుడు సినిమాలను నిర్మించిన లెక్కల మాష్టారు.. ఈసారి కూడా ఓ ప్రేమ కథా చిత్రాన్ని, యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందించనున్నారని సమాచారం. సుకమార్ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్లను దర్శకులుగా పరిచయం చేస్తూ.. కథ మాటలు అందిస్తూ.. సినిమాలను నిర్మిస్తూ.. సక్సెస్ సాధిస్తున్నారు. అయితే సుక్కు ఈసారి నాగశౌర్య, రష్మిక మందాన్న కాంబినేషన్లో ఓ లవ్ అండ్ ఎంటర్టైనర్ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ వార్తలపై సుకుమార్ స్పందించేవరకు చూడాల్సిందే. -
మెగా బ్యానర్లో నాగశౌర్య..!
ఛలో సినిమాతో మంచి ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత తడబడ్డాడు. వరుసగా కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల సినిమాలు బోల్తా పడటంతో ఈ యంగ్ హీరో కెరీర్ మరోసారి గాడి తప్పింది. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్న ఈ యువ కథానాయకుడు మెగా బ్యానర్లో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ కొట్టి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో నాగశౌర్య హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఓ యువ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఈప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
యంగ్ హీరో ఇన్నాళ్లకు..!
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెల్‌ఫోన్ నిత్యావసరాల్లో ఒకటైపోయింది. అలాంటిది ఈ జనరేషన్లో కూడా ఇంతవరకు సెల్‌ఫోన్ వాడకుండా ఉన్న హీరో ఉన్నాడటే నమ్మలేం. కానీ అలాంటి హీరో కూడా ఒకడు ఉన్నాడు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య తరువాత కెరీర్ లో కాస్త ఇబ్బంది ఎదురైనా ఛలో తిరిగి నిలదొక్కకున్నాడు. తాజాగా ఈ హీరో మరో బిగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇన్నేళ్లు స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉన్న నాగశౌర్య మొబైల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘ఇన్నేళ్ల తరువాత నా చేతిలో మొబైల్ ఫోన్. నేను కూడా విషపూరిత ప్రపంచంలోకి అడుగుపెడుతున్నానా..?’ అంటూ ట్వీట్ చేశారు. A smartphone in my hand after all these years.. Did I enter a vicious world?🙃 pic.twitter.com/uQvSqfSTRg — Naga Shaurya (@IamNagashaurya) 25 September 2018 -
‘@నర్తనశాల’ మూవీ రివ్యూ
టైటిల్ : @నర్తనశాల జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : నాగశౌర్య, కశ్మీరా, యామినీ భాస్కర్, శివాజీ రాజా, అజయ్, జయప్రకాష్ రెడ్డి సంగీతం : మహతి స్వర సాగర్ దర్శకత్వం : శ్రీనివాస చక్రవర్తి నిర్మాత : ఉషా ముల్పూరి ఛలో సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత అమ్మమ్మగారిళ్లు, కణం లాంటి సినిమాలతో కాస్త తడబడ్డాడు. అయితే ఆ సినిమాల ప్రభావం నాగశౌర్య కెరీర్ మీద పెద్దగా కనిపించలేదు. అందుకే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘@నర్తనశాల’ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. నాగశౌర్య డిఫరెంట్ రోల్లో కనిపించిన @నర్తనశాల ఈ యంగ్ హీరో ఖాతాలో మరో సూపర్ హిట్‌గా నిలిచిందా..? కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి గే కామెడీతో ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? కథ ; కళామందిర్ కల్యాణ్ (శివాజీ రాజా).. ఓ కూతుర్ని కని తన తండ్రి చేతిలో పెట్టాలని కలలు కంటుంటాడు. కల్యాణ్ తండ్రి చనిపోయిన తన భార్య మనవరాలిగా తిరిగి తన ఇంట్లోనే పుడుతుందన్న నమ్మకంతో ఉంటాడు. కానీ కల్యాణ్ భార్య(ప్రియ) మగ బిడ్డకు జన్మనిస్తుంది. ఈ విషయం తెలిస్తే తండ్రి గుండె ఆగిపోతుందని అబ్బాయినే అమ్మాయిగా తండ్రిని నమ్మిస్తాడు కల్యాణ్. కొడుకును కూతురిలాగే పెంచి పెద్ద చేస్తుంటాడు. ఓ బుడబుక్కల వాడితో సరదాగా మా అమ్మాయికి ఎలాంటి మొగుడు వస్తాడో చెప్పాలని అడిగిన కల్యాణ్‌కు అనుకొని సమాధానం ఎదురవుతుంది. ఆ బుడబుక్కల వాడు అబ్బాయిని అమ్మాయిగా చూపించి మోసం చేస్తున్నావు.. నిజంగానే ఈ అబ్బాయికి తోడుగా అబ్బాయే వస్తాడు అని చెప్పి వెళ్లిపోతాడు. పెరిగి పెద్దవాడైన కల్యాణ్.. కొడుకు (నాగశౌర్య) అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఓ క్లబ్‌ను నిర్వహిస్తుంటాడు. ఆడపిల్లకు ఏ సమస్య వచ్చినా తానే ముందుండి పరిష్కరిస్తుంటాడు. అలా ఓ సమస్య నుంచి మానస (కశ్మీర)ను రక్షించి ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ కల్యాణ్ చేసిన ఓ తింగరి పని వల్ల నాగశౌర్య.. దందాలు చేసే జయప్రకాష్ రెడ్డి కూతురు సత్య(యామినీ భాస్కర్)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి నాగశౌర్య ఎలా బయటపడ్డాడు.? నాగశౌర్య కు గే లా నటించాల్సి అవసరం ఎందుకు వచ్చింది..? బుడబుక్కల వాడు చెప్పిందే నిజమైందా.? చివరకు నాగశౌర్య, మానసలు ఎలా ఒక్కటయ్యారు? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఛలో సినిమాతో సూపర్ హిట్ సాధించిన నాగశౌర్య అదే కాన్ఫిడెన్స్ తో మరోసారి తన సొంత నిర్మాణ సంస్థలో @నర్తనశాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగానే కాక నిర్మాతగానూ బాధ్యతగా వ్యవహరించాడు. హీరోయిజంతో పాటు గే కామెడీ కూడా బాగానే పండించాడు. అయితే తన పూర్తి స్థాయిని ప్రూవ్ చేసుకునే సన్నివేశాలు దక్కలేదు. చాలా రోజుల తరువాత అజయ్‌కి ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. రఫ్ లుక్‌లో కనిపిస్తూనే కామెడీతోనూ ఆకట్టుకున్నాడు అజయ్. హీరోయిన్లుగా నటించిన కశ్మీర, యామినీ భాస్కర్లు నటన పరంగా పెద్దగా మెప్పించలేకపోయినా.. గ్లామర్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హీరో తండ్రిగా కనిపించిన సీనియర్ నటుడు శివాజీ రాజాను దర్శకుడు సరిగా వినియోగించుకోలేదు. జయప్రకాష్ రెడ్డి, సుధా, ప్రియా రొటీన్ పాత్రల్లో కనిపించారు. మరిన్ని రివ్యూల కోసం క్లిక్ చేయండి విశ్లేషణ ; ఛలో సినిమాతో సూపర్ ఫాంలో ఉన్న నాగశౌర్య మరోసారి సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలు అందుకోవటంలో @నర్తనశాల టీం పూర్తిగా విఫలమైంది. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగశౌర్య గే తరహా పాత్రలో నటించే సాహసం చేసినా ఆ ప్రయత్నం వృథా అయ్యింది. అవుట్ అండ్ కామెడీ ఆశించి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి నిరాశపరిచాడు. కథా పరంగా మంచి కామెడీ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు కథనాన్ని సాధాసీదాగా నడిపించాడు. ఫస్ట్‌హాఫ్‌లో హీరో హీరోయిన్ల లవ్ స్టోరి.. కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకున్నా ద్వితీయార్థం మరింత రొటీన్‌గా అనిపిస్తుంది. కథనం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సాగుతూ నిరాశపరుస్తుంది. ఛలో సినిమాకు భారీ హైప్ రావటంలో హెల్ప్ అయిన సంగీత దర్శకుడు మహతి ఈ సినిమాతో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. ఒకటి రెండు పాటలు విజువల్‌గా ఆకట్టుకున్నా గుర్తుండిపోయే రేంజ్లో మాత్రం లేవు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ; నిర్మాణ విలువలు రెండు పాటలు మైనస్ పాయింట్స్ ; కథా కథనాలు కామెడీ ఆశించిన స్థాయిలో లేకపోవటం స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
నేను కాస్త రఫ్!
‘‘నాకు బయటి ప్రొడక్షనే కంఫర్ట్‌గా ఉంటుంది (నవ్వుతూ). సొంత ప్రొడక్షన్ అయితే కాస్త టెన్షన్‌గా ఉంది. సినిమా రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించను. మా అమ్మానాన్నలు నన్ను నమ్మి సినిమా తీశారు.వేరే ప్రొడక్షన్ హౌస్‌లో చేసినప్పుడు ఎంత బాధ్యతగా ఉంటానో సొంత సినిమాకీ అలానే ఉంటాను. మా అమ్మ ఫస్ట్ క్రిటిక్. ఆవిడకు నచ్చితే చాలామంది ప్రేక్షకులకు నచ్చుతుందని నా ఫీలింగ్’’ అన్నారు నాగశౌర్య. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన సినిమా ‘ఃనర్తనశాల’. ఈ నెల 30న సినిమా విడుదల కానున్న సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు.... ►ఈ సినిమా కథ విన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశా. ట్రాన్స్‌జెండర్స్‌ను సినిమాలో తప్పుగా చూపించలేదు. ‘నర్తనశాల’ టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు ఆ టైటిల్‌తో స్టార్ట్ చేసిన సినిమాలు ఆగిపోయాయాని డాడీకి ఎవరో చెప్పారు. అందుకే ‘ః’ సింబల్ వాడాం. జస్ట్ సెంటిమెంట్ కోసమే కాదు సినిమాకి కూడా యాప్ట్ అవుతుంది. పాత ‘నర్తనశాల’ సినిమా చూసినవాళ్లు మా సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. ఠి ఈ చిత్రంలో మహిళా సాధికారతను సపోర్ట్ చేసే క్యారెక్టర్ హీరోది. అమ్మాయిలను ధైర్యవంతులుగా తయారు చేస్తుంటాడు. ఈ టైమ్‌లోనే అతన్ని ఇద్దరు హీరోయిన్లు లవ్ చేస్తుంటారు. అయితే నెక్ట్స్ ఏంటీ? అతను నిజంగా గేనా? లేక ఇంకేమైనా ట్విస్ట్ ఉందా? అనేది థియేటర్లో చూడాలి. ►క్యాస్టింగ్ కౌచ్ గురించి విన్నాను. మహిళలు తిరగబడినప్పుడే ఇలాంటివి ఆగుతాయి. అమ్మాయిల పట్ల తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ నుంచి శిక్ష మొదలైతే తప్పు చేయాలనుకునేవాళ్లు భయపడతారు. ఠి నా ప్రతి సినిమాలో నా నటన మా అమ్మకు నచ్చుతుంది. కానీ సినిమాలు నచ్చలేదని చెప్పేది. ఎందుకంటే నేను సినిమాల్లో కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు. రఫ్. ‘ఛలో’లో చేసిన పాత్రలా రియల్ లైఫ్‌లో ఉంటాను. ప్రతి ఇంటర్వ్యూలో నా పెళ్లి టాపిక్ వస్తోంది. త్వరగా చేసుకోవాలి. ఠి రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. రమణ తేజ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌లో ఓ సినిమా ఉంటుంది. వెబ్‌సిరీస్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో నటించాలని ఉంది. చూడాలి. ► స్టార్ట్డమ్ అనేది అంత ఈజీ కాదు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్లను దేవుళ్లలా పూజించేవారు. ఆ తర్వాత చాలామంది స్టార్స్ వచ్చారు. ఇప్పుడు చిరంజీవిగారు, బాలకృష్ణగారు, ఎన్టీఆర్, ప్రభాస్.. ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా 80 కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. స్టార్ మెటీరియల్ అంటే అది. తమిళనాడులో, మన దగ్గర, కేరళలో కానీ పెద్ద హీరోలందరినీ సెకండరీ దేవుళ్లులా చూస్తున్నారు. ఇప్పుడు వచ్చినవాళ్లు ‘మా సినిమాలు చూడండి.. మా సినిమాలు చూడండి’ అని అడుగుతున్నారు అంటే దేవుడే వచ్చి మా గుడికి రండీ అంటే ఏ భక్తుడు నమ్ముతాడు. అందరూ స్టార్ట్ అవ్వాలనే ట్రై చేస్తారు. అది తప్పు కాదు. కానీ అది రావడానికి 30 ఏళ్లు పడుతుంది. అది తెలుసుకోవాలని చెబుతున్నాను. సడన్‌గా ఎవరో వచ్చి స్టార్ అంటే..? నేనెవరి గురించీ నెగటివ్‌గా కామెంట్స్ చేయడం లేదు. ఆ మధ్య నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారు. నా కామెంట్స్ విజయ్ దేవరకొండకు సంబంధించినవి అనడం తప్పు. అతన్ని చూసి నాకు ఎలాంటి అసూయ లేదు. నేను చేసే సినిమాలు వేరు. అతను చేసే సినిమాలు వేరు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా. అతని సినిమా హిట్ సాధించడం వల్ల మిగతావారికి సినిమాలు పోవు కదా?. మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు. ఎవరో పెట్టారంతే. -
వారాహి బ్యానర్లో నిఖిల్, అవసరాల..?
హాస్యనటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ తరువాత దర్శకుడిగానూ సత్తా చాటారు. ఊహలు గుసగుసలాడే, జ్యోఅచ్చుతానంద సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా తన మూడో చిత్రాన్ని కూడా వారాహి బ్యానర్లోనే చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌లో నిఖిల్ హీరోగా నటించనున్నారట. ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను నాగశౌర్య హీరోగా తెరకెక్కించాలని భావించినా నాగశౌర్య సొంత సినిమాలతో బిజీ కావటంతో నిఖిల్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిఖిల్ ప్రస్తుతం తమిళ సూపర్‌హిట్ కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ముద్ర సినిమాలో నటిస్తున్నాడు. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. -
‘నర్తన శాల’ ప్రి రిలీజ్ వేడుక
-
సొంత బ్యానర్లో మరో సినిమా
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఛలో తరువాత అమ్మమ్మగారిల్లు లాంటి ఫ్లాప్ వచ్చినా అది నాగశౌర్య కెరీర్ మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న నర్తనశాల సినిమాలోనటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా తరువాత భవ్య క్రియేషన్స్ బ్యానర్లో నారి నారి నడుమ మురారి సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఆ తరువాత చేయబోయే సినిమాకు కూడా ఓకె చెప్పాడట ఈ యంగ్ హీరో. అంతేకాదు ఈ సినిమాను నాగశౌర్య మరోసారి తన సొంతం నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నాడు. శేఖర్ కమ్ముల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన తేజ ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈసినిమాకు గణ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
ఫస్ట్‌లుక్ 13th August 2018
-
‘నా కొడుకు గే నా’
‘ఛలో’ లాంటి హిట్ తరువాత నాగశౌర్య తన సొంత బ్యానర్లో చేస్తోన్న సినిమా ‘నర్తనశాల’. లెజెండరీ చిత్రమైన ‘నర్తనశాల’ చిత్రం పేరు నిలబెట్టేలా తమ సినిమా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. ఇటీవలె షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం వినోద భరితంగా ఉంది. నాగశౌర్య నటన, కామెడీ డైలాగ్‌లు అన్నీ ఆకట్టుకుంటున్నాయి. టీజర్ ఎండింగ్లో ‘నా కొడుకు గే నా’ అంటూ శివాజీ రాజా చెప్పే డైలాగ్ బాగుంది. ఈ మూవీకి మహతి స్వర సాగర్ అందించగా.. కష్మీర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై శంకర్ మూల్పూరి, ఉషా మూల్పూరి నిర్మించగా.. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. -
బాలయ్యని మళ్లీ వాడేస్తున్నాడు!
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే అమ్మమ్మగారిల్లు సినిమాతో మరో డిసెంట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో సొంత బ్యానర్లో మరో సినిమా చేస్తున్నాడు. నాగశౌర్య ఇటీవల భవ్య క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమాను ప్రారంభించాడు. సొంత బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్‌తో నందమూరి బాలకృష్ణ ఓ సినిమాను ప్రారంభించి సౌందర్య మరణంతో మధ్యలో ఆపేశారు. ఇప్పుడు భవ్య క్రియేషన్స్ సినిమాకు కూడా బాలయ్య టైటిల్‌నే ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. నాగశౌర్య లవర్‌బాయ్‌గా కనిపించనున్న ఈ సినిమాకు నారి నారి నడుమ మురారి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. బాలయ్య సూపర్ హిట్ సినిమాల్లో నారి నారి నడుమ మురారి ఒకటి. నాగశౌర్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న కొత్త సినిమాకు ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నాడు. -
భవ్య క్రియేషన్స్‌లో నాగశౌర్య..!
పైసా వసూల్ తరువాత సినిమా కాస్త గ్యాప్ తీసుకున్న భవ్య క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కొత్త సినిమా ప్రారంభించారు. ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్యతో రాజా కొలుసును దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా తెరకెక్కిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో తొమ్మిదవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ రోజు (శనివారం) ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
మెగా బ్యానర్లో యువ దర్శకుడు
ఇటీవల టాలీవుడ్లో ఒక్క సినిమాతో సెన్సేషన్‌గా మారిన దర్శకులు చాలా మందే ఉన్నారు. ఛలో సినిమాతో ఈ జాబితాలో చేరిన దర్శకుడు వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన వెంకీ తొలి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్నాడు. దీంతో పెద్ద బ్యానర్ల నుంచి కూడా వెంకీకి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే నితిన్, సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో వెంకీ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వెంకీ కుడుముల ఓ బడా బ్యానర్లో సినిమా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. స్టార్ హీరోలతో బిగ్ బడ్జెట్ సినిమాలతో పాటు యంగ్ హీరోలతో మీడియం రేంజ్ సినిమాలను రూపొందిస్తున్న గీతా ఆర్ట్స్ బ్యానర్లో వెంకీ కుడుముల ఓ సినిమా చేయనున్నాడు. సాయి ధరమ్ తేజ్ తో రూపొందించబోయే సినిమా ఇది అన్న టాక్ వినిపిస్తోంది. ఛలో తరువాత వెంకీ తన తదుపరి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఇంతవరకు చేయలేదు. -
ప్యూర్ లవ్‌స్టోరీ మొదలు
ఆది కథానాయకుడిగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డీఆర్పీ వర్మ సమర్పణలో శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు వంశీపైడిపల్లి క్లాప్ ఇచ్చారు. హీరో ఆది మాట్లాడుతూ–‘‘కథ గురించి డైరెక్టర్ నాకు మూడు గంటల నరేషన్ ఇచ్చారు. ప్యూర్ లవ్‌స్టోరీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో రెండు షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాను. హీరోయిన్ పేరును త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేయడానికి మాకు సహకరిస్తోన్న సాయికుమార్‌గారికి, హీరో ఆదిగారికి, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు. ‘‘సీమశాస్త్రి’ సినిమా తర్వాత మేము చేస్తోన్న చిత్రమిది. దర్శకుడు మంచి కథ చెప్పారు. సినిమా హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత చావలి రామాంజనేయులు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, నాగశౌర్య, నిర్మాత భరత్ చౌదరి పాల్గొన్నారు. రాజీవ్ కనకాల, రాధికా, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు సంగీతం: అరుణ్ చిలువేరు. -
నాగశౌర్యతో అవసరాల మరో సినిమా?
నాగశౌర్యను హీరోగా విజయాన్ని అందించిన తొలి దర్శకుడు అవసరాల శ్రీనివాసే. ఊహలు గుసగుసలాడే సినిమా విజయం సాధించడంతో హీరో నాగశౌర్యకు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్‌కు మంచి గుర్తింపు లభించింది. తరువాత నాగశౌర్య హీరోగా దిక్కులు చూడకు రామయ్య, ఛలో వంటి హిట్లు అందుకున్నారు. రెండో ప్రయత్నంగా జో అచ్యుతానంద సినిమాను డైరెక్ట్ చేసిన అవసరాల నాగశౌర్యకు మరో హిట్‌ను అంధించారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో నాగశౌర్య హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కించేందుక అవసరాల శ్రీనివాస్ రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను వారాహి సంస్థ నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై నిర్మాతల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదలకాలేదు. -
ఇష్టంతో చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అమ్మమ్మగారిల్లు
‘‘చిన్నప్పటి నుంచి నాకు ఫ్యామిలీతో అనుబంధం ఎక్కువ. ఉమ్మడి కుటుంబం విలువలు తెలిసినవాడిని. అనుబంధాలు, ఆప్యాయతలు బాగా ఇష్టం. ఆ ప్రభావం నాపై ఎక్కువ ఉంటుంది. నా జీవితంలోని తీపి జ్ఙాపకాలు, నిజ జీవితంలో చూసిన కొన్ని పాత్రలను సినిమాలో భాగం చేశాను. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఎంతో ఇష్టపడి చేశా’’ అన్నారు దర్శకుడు సుందర్ సూర్య. నాగ శౌర్య, షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించారు. కె.ఆర్ సహనిర్మాత. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుందర్ సూర్య మీడియాతో మాట్లాడుతూ –‘‘నాది కాకినాడ. 12 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్.శంకర్, బొమ్మరిల్లు భాస్కర్ వంటి దర్శకుల వద్ద పనిచేశాను. రెండేళ్ల క్రితం కె.ఆర్,రాజేష్‌లు పరిచయమయ్యారు. ఇందులో నాగ శౌర్య బావుంటాడని నిర్మాతలే సలహా ఇచ్చారు. ► బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడ లేదు. అడిగిందల్లా క్షణాల్లో ఏర్పాటు చేశారు. ► షాలిని పక్కింటి అమ్మాయిలా ఉంటుందని ఆమెను హీరోయిన్గా తీసుకున్నాను. శౌర్య, షామిలి ఇద్దరూ బాగా నటించారు. రావురమేష్, ‘షకలక’ శంకర్, మిగతా నటీనటులంతా బాగా చేశారు. కళ్యాణ రమణ, రసూల్, సాయి కార్తీక్ మంచి సహకారం అందిచారు. ► లవ్‌స్టోరీ, ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ లైన్స్ ఉన్నాయి. నెక్ట్స్ సినిమా గురించి త్వరలో చెబుతాను’’ అన్నారు. -
‘అమ్మమ్మ గారిల్లు’ మూవీ రివ్యూ
టైటిల్ : అమ్మమ్మగారిల్లు జానర్ : ఫ్యామిలీ ఎంటర్టైనర్ తారాగణం : నాగశౌర్య, షామిలి, రావు రమేశ్, శివాజీ రాజా, సుమిత్ర, సుధ, హేమ తదితరులు సంగీతం : కళ్యాణ్ రమణ దర్శకత్వం : సుందర్ సూర్య నిర్మాత : రాజేశ్ ఛలో సినిమాతో సక్సెస్ అందుకున్న యువహీరో నాగశౌర్య. ఈ కుర్ర హీరో ఛలో లాంటి మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ తరువాత తన తదుపరి చిత్రంగా కుటుంబ నేపథ్యంలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వేసవి సెలవుల్లో అందరూ అమ్మమ్మ గారింటికి వెళ్తారు. అయితే నాగశౌర్య ఈ వేసవిలో ‘అమ్మమ్మ గారిల్లు’కు వచ్చేలా చేశాడో లేదో తెలుసుకుందాం. కథ : రంగారావు (చలపతి), సీతా మహాలక్ష్మి (సుమిత్ర) గారిది పిఠాపురంలో ఓ పెద్ద కుటుంబం. వీరికి ఐదుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు (రావు రమేశ్) తండ్రిని ఆస్తి పంచమని అడుగుతూ ఉంటాడు. ఆస్తి కంటే అనుబంధాలు గొప్పవి, ఆస్తిని విడగొడితే అందరూ దూరమవుతారని కొడుక్కు నచ్చజెపుతాడు తండ్రి. కానీ బాబురావు(రావు రమేశ్) వినడు. అలా ఓసారి జరిగిన గొడవలో ఆ ఇంటి పెద్దల్లుడు (సుమన్)ను చేయిజేసుకుంటాడు బాబురావు. ఆ అవమానంతో సుమన్ తన మామగారి కుటుంబానికి దూరంగా ఉంటారు. అల్లుడు గారికి జరిగిన అవమానం, కొడుకు ఆస్తి కోసం చేసే అల్లరితో చలపతి చనిపోతాడు. కొడుకులు, కూతుళ్లు అందరూ సీతామహాలక్ష్మిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు. చిన్నప్పటి నుంచి సుమన్ కొడుకు సంతోష్ (నాగశౌర్య)కు మాత్రం అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అయితే ఈ గొడవలన్నింటికి కారణమైన ఆస్తిని ఎవరు పంచారు? ఎప్పుడు పంచారు? తిరిగి వీరంతా ఎలా కలుసుకుంటారు? వీటన్నింటికి హీరో చేసిన పనులేంటి అనేదే కథ. నటీనటులు : ఎప్పటిలాగే నాగశౌర్య అందంగా కనిపించాడు. నిజంగా ఇంట్లో మనవడిలా అనిపిస్తాడు. అమ్మమ్మ బాధల్ని తీర్చే మంచి మనవడిగా, కుటుంబాన్ని కలిపే పెద్దమనిషిగా నటిస్తూ మెప్పించాడు. షామిలీ ఓయ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా... మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తన పాత్ర మేరకు ఉన్నంతలో అందంగానూ కనిపించారు. ప్రేక్షకులకు నచ్చేలాను నటించారు. రావు రమేశ్ నటనకు పేరు పెట్టలేం. మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించారు. (సాక్షి రివ్యూస్) నాగశౌర్య తరువాత ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రావు రమేశ్ పాత్ర గురించే. ఇలాంటి పాత్రల్లో నటించడం ఆయనకు కొత్తేంకాదు. అమ్మమ్మగా చేసిన సుమిత్ర కంటతడి పెట్టించారు. మిగతా పాత్రల్లో శివాజీ రాజా, హేమ, షకలక శంకర్, సుధా, సుమన్ అందరూ తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ : అమ్మమ్మ గారిల్లు అని టైటిల్ చూసిన ప్రతి ఒక్కరికి కథేంటో అర్థమైపోతుంది. అయితే ఇలా అందరూ ఊహించే కథే అయినా.. సరిగా ప్రజెంట్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్మిన దర్శక నిర్మాతల గురించి మొదట చెప్పుకోవాలి. కొన్ని పదునైన మాటలతో మనసును తాకేలా చేశారు డైరెక్టర్ సుందర్ సూర్య. తులం బంగారం కాదు గుణం బంగారం కావాలి లాంటి మంచి మాటలు సినిమాలో బాగానే ఉన్నాయి. బరువైన బంధాలను అంతే బరువైన సంభాషణలతో నడిపించాడు. కథలో ఏ మాత్రం కొత్తదనం కనపడకపోయినా... కథకు ఇచ్చిన ట్రీట్మెంట్ వర్కౌట్ అయ్యేలా ఉంది. సెకండాఫ్‌లో ‘లాక్ ది ఏజ్’ అనే ఎపిసోడ్ కాసేపు నవ్వించి, కాసేపు ఏడిపించేసింది. ఆ ఎపిసోడ్ సినిమాకు కలిసొచ్చే అంశమే. (సాక్షి రివ్యూస్) ఈ విషయాల్లో డైరక్టర్ సక్సెస్ సాధించారు. తరువాతి అంశంగా సంగీతం గురించి చెప్పుకోవాలి. హీరోకు, హీరోయిన్‌కు అనవసరమైన ఇంట్రడక్షన్ సాంగ్స్ పెట్టకుండా.. ఉన్న రెండు మూడు పాటలు కూడా అలా కథతో పాటు వచ్చి వెళ్తాయి. రసూల్ అందించిన సినిమాటోగ్రఫీలో హీరో హీరోయిన్లు అందంగా కనిపించారు. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. నాలుగు ఫైట్లు, ఐదు పాటలు, ఆరు మాస్ డైలాగ్‌లు లాంటి సినిమా కాదిది. ఈ బిజీ లైఫ్‌లో మనం ఏం కోల్పోతున్నామో తెలుసుకోవాలంటే.. చూడాల్సిన సినిమా. అయితే రెగ్యులర్ మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. బలాలు : నాగశౌర్య, రావు రమేశ్ నటన సంగీతం కొన్ని డైలాగ్‌లు బలహీనతలు : కథలో కొత్తదనం లోపించడం ముగింపు : ఈ వేసవి సెలవుల్లో ‘అమ్మమ్మ గారిల్లు’ ను ఓసారి వెళ్లిచూడొచ్చు. - బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
జీవితంలో కలిసి రావాలంటే కూతుర్ని కనాలి
-
‘అమ్మమ్మ గారిల్లు’ ట్రైలర్ విడుదల
కుటుంబ కథా చిత్రాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, బంధాలు అనుబంధాల కాన్సెప్ట్‌తో సినిమా అంటే ప్రస్తుతం ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. దీనికి ఉదాహరణే గతేడాది వచ్చిన శతమానం భవతి. ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును సాధించింది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న అమ్మమ్మ గారిల్లు కూడా కుటుంబం, ఎమోషన్స్ లాంటి ఫార్మాట్లోనే ఉండబోతోంది. ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా విడుదలైన అమ్మమ్మగారిల్లు సినిమా ట్రైలర్‌ను చూస్తే.. ఈ సినిమా కథను ఎవరైనా ఊహించవచ్చు. అయితే అందరికీ తెలిసిన కథే అయినా... తీసే విధానం, స్ర్కీన్ ప్రజెంటేషన్‌తో సినిమాను ప్రేక్షకుల మదిలోకి తీసుకెళ్లవచ్చు. ఈ ట్రైలర్లో.. జీవితంలో కలిసి రావాలంటే కూతుర్ని కనాలి... తెలిసిరావాలంటే కొడుకును కనాలి అంటూ రావు రమేశ్ చెప్పిన డైలాగ్‌లు బాగానే ఉన్నాయి. నాగశౌర్య, షామిలి జంటగా నటించిన ఈ సినిమాను స్వాజిత్ బ్యానర్‌పై రాజేశ్ నిర్మించగా... సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ‘అమ్మమ్మ గారిల్లు’ సినిమా రేపు (మే 25) విడుదల కాబోతోంది. -
మెగా హీరోతో ఛలో డైరెక్టర్
నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఛలో. నాగశౌర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించటంతో బడా నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డాడు వెంకీ. తాజాగా ఈ యువ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు సినిమా చేస్తున్న సాయి ధరమ్ తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంతవరకు ప్రకటించలేదు. కిశోర్ తిరుమల, చంద్రశేఖర్ ఏలేటి, గోపిచంద్ మలినేని లాంటి దర్శకులతో చర్చలు జరగుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో వెంకీ కుడుమల కూడా చేరాడు. వీరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాను గీతా ఆర్ట్స్‌లో తెరకెక్కించనున్నారు. -
‘అమ్మమ్మ గారిల్లు’ సెన్సార్ పూర్తి
ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగశౌర్య. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో .. ఈ యువహీరో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం నాగశౌర్య ‘అమ్మమ్మ గారిల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఓయ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన షామిలి మళ్లీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే విడుదల చేసిన అమ్మమ్మ గారిల్లు టీజర్, పోస్టర్స్, లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా ఉండబోతోందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్‌ను జారీ చేసింది . స్వాజిత్ బ్యానర్‌పై రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మే 25న విడుదలవుతోంది. -
డైరెక్టర్‌గా మారిన యువ హీరో
ఛలో సినిమాతో సక్సెస్ సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నారు నాగశౌర్య. ప్రస్తుతం ఈ కుర్ర హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే కణం మూవీతో ప్రేక్షకులను పలకరించారు. త్వరలోనే అమ్మమ్మగారిల్లు సినిమాతో సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ యువ హీరో మెగా ఫోన్ పట్టుకున్నారు. అయితే ఇది ఒక షార్ట్ఫిలిమ్ కోసం. రేపు( ఆదివారం) మాతృ దినోత్సవ సందర్భంగా మాతృ మూర్తులందరికి అంకితం చేస్తూ... భూమి అనే షార్ట్ ఫిలిమ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ లఘుచిత్రాన్ని నాగశౌర్య డైరెక్ట్ చేశారు. ఆదివారం ఉదయం పది గంటలకు రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం నాగశౌర్య ‘నర్తనశాల’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. Strong women, strong mothers define the strength of our nation. Saluting all mothers this #MothersDay.#Bhoomi is our tribute to all the women on this day. Yours, Naga Shaurya. Releasing tomorrow morning at 10AM @https://t.co/6i1mAPmOuC pic.twitter.com/BG0WbIrRJ6 — Naga Shaurya (@IamNagashaurya) May 12, 2018 -
అమ్మమ్మ గారిల్లు ‘చాలా చాలా’ లిరికల్ వీడియో
-
‘అమ్మమ్మ గారిల్లు’ ఫస్ట్ సింగిల్
ఛలో సినిమాతో సక్సెస్ కొట్టి దూకుడు మీదున్నాడు కుర్ర హీరో నాగశౌర్య. పక్కింటి అబ్బాయిలా కనిపించే పాత్రలో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఛలో సక్సెస్‌తో ఫాంలో ఉన్న నాగశౌర్య ప్రస్తుతం అమ్మమ్మ గారిల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ‘చాలా చాలా...’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ లిరికల్ వీడియోను చూస్తే... ఓ పండుగ వాతావరణంలా అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు. భాస్కరభట్ల సాహిత్యం... కల్యాణ రమణ, గీతా మాధురి గాత్రం... కల్యాణ రమణ సంగీతం ఆకట్టుకున్నాయి. నాగ శౌర్యకు జోడిగా ఓయ్ ఫేం షామిలి నటిస్తోంది. స్వాజిత్ బ్యానర్‌పై రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. -
నిర్మాణాంతర కార్యక్రమాల్లో ‘అమ్మమ్మగారిల్లు’
స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో నాగశౌర్య, షామిలి జంటగా కె.ఆర్ మరియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ఈ సినిమాకు సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో డీటీఎస్ మిక్సింగ్ పనులను జరుపుకుంటోంది.అలాగే మేడే సందర్భంగా మరో కొత్త పోస్టర్ ను కూడా మార్కెట్ లోకి రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, ‘చక్కటి కుటుంబ కథా చిత్రం కావడం..స్వచ్ఛమైన తెలుగు టైటిల్‌తో వస్తున్న సినిమా కావడంతో మంచి క్రేజ్ వస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి వివేష స్పందన లభిస్తోంది. పలువురు సినీ పెద్దలు కూడా టీజర్ చూసి ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. వేసవి కానుకగా సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. -
ప్లీజ్.. నా సినిమాకు రేటింగ్ ఇవ్వకండి
టాలీవుడ్లో యంగ్ హీరో నాగశౌర్య ఛలో సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం శౌర్య నటించిన కణం చిత్రం రిలీజ్‌కు రెడీకాగా, మరో సినిమా ‘అమ్మమ్మగారి ఇల్లు’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా, ఆ కార్యక్రమంలో శౌర్య క్రిటిక్స్, రివ్యూలు రాసేవారికి విజ్ఞప్తి చేశాడు. ‘అమ్మమ్మ గారి ఇల్లు సినిమా రిలీజ్ అయ్యాక దయచేసి రేటింగ్ పెట్టకండి. ఎందుకంటే అమ్మమ్మ బంధం నేపథ్యంలో రూపొందించారు. ఈ సినిమా ప్రతీ ఒక్కరికీ నచ్చాలని మేం తీయలేదు. ఈ సినిమా ఒక్కరికి కనెక్ట్ అయినా.. వారి అనుభూతులు మీరు తెలుసుకోండి. అంతేగానీ దయచేసి రేటింగ్ మాత్రం ఇవ్వకండి. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి’ అంటూ శౌర్య కోరాడు. నాగ శౌర్య, షామిలి(ఓయ్ ఫేమ్) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుందర్ సూర్య దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
సాయిపల్లవి సినిమా పేరు మారింది..!
తమిళసినిమా: కోలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్న చిత్రాల్లో కరు ఒకటి. కారణం నటి సాయిపల్లవి నటించిన తొలి తమిళ చిత్రం ఇదే కావడం. మలయాళంలో ప్రేమమ్ చిత్రంతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న నటి సాయిపల్లవి, ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఫిదా, ఎంసీఏ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఇప్పుడు కరు చిత్రంతో తమిళప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో కోలీవుడ్‌లోనూ మ్యాజిక్ చేస్తుందో? లేదోనన్న ఆసక్తి నెలకొంది. లైకా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు. టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. మరో విశేషం ఏమిటంటే ఇందులో నటి సాయిపల్లవి ఒక పాపకు తల్లిగా నటించింది. తొలి చిత్రంలోనే తల్లి పాత్రతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ చిత్రంపై సాయిపల్లవి చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పాలి. నటుడు నిళల్గళ్ రవి, రేఖ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, నీరవ్‌షా ఛాయాగ్రహణం అందించారు. మరో విషయం ఏమిటంటే చిత్రం ఈ నెల 27న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలాంటి సమయంలో చిత్రం పేరును దియా అని మార్చారు. ఇదే చిత్రం తెలుగులో కణం పేరుతో విడుదల కానుంది. ఇకపోతే నటి సాయిపల్లవి తాజాగా సూర్యకు జంటగా ఎన్జీకే, ధనుష్‌తో మారి–2 చిత్రాల్లో నటిస్తోంది. -
‘ఛలో’ హీరోతో ‘హలో’ హీరోయిన్..!
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ సాధించిన ఈ యువ కథానాయకుడు తన సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్ నిర్ణయించారు. ఇటీవలే లాంచనంగా షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా మెహరీన్‌ను తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. తరువాత ఆమె స్థానంలో కిరాక్ పార్టీ ఫేం సిమ్రాన్ పరీన్జా పేరు వినిపించింది. తాజాగా మరో అందాల భామ పేరు తెర మీదకు వచ్చింది. అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో సినిమాతో పరిచయం అయిన కళ్యాణీ ప్రియదర్శన్ నర్తనశాల సినిమాలో హీరోయిన్గా నటించనుందట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఇంతవరకు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. -
‘సైందవ’గా యంగ్ హీరో
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే మరోసారి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న నర్తనశాల సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కణం, అమ్మమ్మగారిల్లు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. తాజాగా నాగశౌర్య మరో సినిమాకు అంగీకరించాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో నాగశౌర్య హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాతో రాజా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సైందవ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించే అవకాశముంది. -
ఆ ‘నర్తనశాల’తో సంబంధం లేదు– నాగశౌర్య
నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాణంలో రూపొందనున్న ‘నర్తనశాల’ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా చేసిన శ్రీనివాస్ చక్రవర్తి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. హీరో నాగశౌర్యపై దర్శకుడు వంశీ పైడిపల్లి క్లాప్ ఇచ్చారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘మా సంస్థ నుంచి మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది డ్యాన్స్ బేస్డ్ చిత్రమని, పాత ‘నర్తనశాల’ చిత్రానికి రీమేక్ అని చాలామంది అనుకుంటున్నారు. కానే కాదు. ఫుల్ ఎంటర్టైనర్. నవ్వుకునే చిత్రం. రెండో సినిమాకు కూడా బయటివారిని కాకుండా నన్నే హీరోగా పెట్టినందుకు మా అమ్మకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘భిన్నమైన కథను సరిగ్గా జడ్జ్ చేసి, సినిమా చేద్దామని ఒప్పుకుని, నాకు ఫ్రీడమ్ ఇచ్చిన హీరో నాగశౌర్య, నిర్మాతలు శంకర్‌ప్రసాద్, ఉషగార్లకు థ్యాంక్స్. ‘ఛలో’ను మించిన హిట్‌ను ఐరా క్రియేషన్స్‌కు అందిస్తానన్న నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీనివాస్ చక్రవర్తి. నందిని రెడ్డి, శ్రీనివాస్ అవసరాల, నటుడు అజయ్,ఎడిటర్ చంటి, డీఓపీ విజయ్ సి. కుమార్, ఎమ్ఎన్ఎస్. గౌతమ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం:మహతి స్వర సాగర్, కెమెరా: విజయ్. సి. కుమార్. -
నాగ్ మల్టీస్టారర్‌లో నాగశౌర్య హీరోయిన్
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా షూటింగ్‌ను లాంచనంగా ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన రష్మిక మందన హీరోయిన్గా నటించనుందట. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. నాగ్, నానిల మల్టీస్టారర్‌లో ఈ బ్యూటీ నటిస్తే టాలీవుడ్ లో మరింత బిజీ అయ్యే అవుతుందంటున్నారు విశ్లేషకులు. -
నాగశౌర్యకు జోడీగా సిమ్రాన్..?
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ సాధించిన ఈ యువ కథానాయకుడు తన సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా నిఖిల్ కిరాక్ పార్టీ ఫేం సిమ్రాన్ పరీన్జాను ఫైనల్ చేశారట. హిందీ సీరియల్స్‌తో పాపులర్ అయిన సిమ్రాన్.. కిరాక్ పార్టీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. నాగశౌర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన కణం త్వరలో రిలీజ్ అవుతుండగా మరిన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. -
ఆ మాటలు బాధించాయి
ఇన్నాళ్లకు హీరో నాగశౌర్య తన గురించి చేసిన కామెంట్స్‌పై పెదవి విప్పారు కథానాయిక సాయిపల్లవి. ‘‘నేను యాక్ట్ చేసిన కో–స్టార్స్ అందరిలో కల్లా సాయిపల్లవి డిఫరెంట్. ఆమె లొకేషన్‌కు టైమ్‌కి రారు. క్రమశిక్షణ లేదు. షూటింగ్ స్పాట్లో ఇబ్బంది పడ్డాం. ‘ఫిదా’ సక్సెస్ ఓన్లీ సాయిపల్లవిదే కాదు. టీమ్ అందరిది’’ అని సాయిపల్లవిని ఉద్దేశిస్తూ ఓ సందర్భంలో హీరో నాగశౌర్య కామెంట్ చేసినట్లుగా ప్రచారమవుతోంది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన తమిళ్ చిత్రం ‘కరు’. తెలుగులో ‘కణం’ పేరుతో విడుదల కానుంది. కాగా నాగశౌర్య కామెంట్స్‌పై సాయిపల్లవిని ప్రశ్నిస్తే ఆమె ఈ విధంగా స్పందించారట. ‘‘సొంత అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుంది. ఇతరుల మనోభావాలను నేను గౌరవిస్తాను. నా వల్ల ఎవరైనా ఇబ్బందిపడితే నాకు బాధగా ఉంటుంది. నాగశౌర్యకి నాతో ఉన్న ప్రాబ్లమ్ ఏంటో తెలియదు. నా గురించి అతను మాట్లాడిన మాటలు విని, బాధపడ్డాను. డైరెక్టర్ విజయ్‌గారికి ఫోన్ చేసి ‘నా ప్రవర్తన వల్ల షూటింగ్ స్పాట్లో ఎవరికైనా ఇబ్బంది కలిగిందా?’ అనడిగాను. ఆయన లేదన్నారు. ఎవరైనా నాపై కంప్లైట్ చేశారా? అని కూడా అడిగాను. ‘నో’ అన్నారు. ఈ విషయం గురించి నాగశౌర్య కూడా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. నా అదృష్టం కొద్దీ ఈ విషయాన్ని నాగశౌర్య దాచలేదు. ఓపెన్‌గా కామెంట్ చేశారు. మంచిదే’’ అని సాయిపల్లవి అన్నారని ప్రచారం జరుగుతోంది. -
సాయి పల్లవి సినిమా మళ్లీ వాయిదా
ఒక్క సినిమాతో టాలీవుడ్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మల్లార్ బ్యూటీ తరువాత ఎమ్సీఏ సినిమాతో మరోసారి ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా సినిమాలో చేస్తూ బిజీ అవుతోంది. ఈ భామ నటించిన మరో ఆసక్తికర చిత్రం కణం. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి తొలి వారంలో రిలీజ్ చేయాలని భావించారు. తరువాత ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం కణం సినిమా మరోసారి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను మార్చి 9న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ పై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయకపోయినా.. మార్చి 9న రిలీజ్ కావటం కాయంగా కనిపిస్తోంది. -
‘అమ్మమ్మగారిల్లు’ ఫస్ట్ లుక్
శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో నాగశౌర్య, బేబి షామిలి జంటగా కె.ఆర్ మరియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ఈ సినిమాకు సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ, ‘తొలిసారి చక్కని కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నా. షూటింగ్ చేస్తున్నంత సేపు సెట్ లో పండగ వాతావారణంలా కోలాహాలంగా ఉంది. కుటుంబ అనుబంధాలు..ఆప్యాయతలు..అనురాగాలు.. అందులో వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలు.. ఆవేదన ఎలా ఉంటుందనేది దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. కథను నమ్మి సినిమా చేశాం. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ఉంటాయి. క్వాలిటీగా సినిమా చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమాతో నేను మరింత దగ్గరవుతాను` అని అన్నారు. హీరోయిన్ షామిలి మాట్లాడుతూ, ‘‘ఓయ్’ సినిమా తర్వాత సరైన కథ కుదరకపోవడంతోనే మరో సినిమా చేయలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ‘అమ్మమ్మగారిల్లు’ కథ నచ్చడంతో సినిమాకు వెంటనే ఒప్పుకున్నాను. నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. నాగశౌర్య తో సినిమా చేయడం సంతోషంగా ఉంది. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని అన్నారు. దర్శకుడు సుందర్ సూర్య మాట్లాడుతూ, ‘రిలేషన్ నెవెర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకుని రాసిన కథ ఇది. దర్శకుడిగా నాకిది తొలి సినిమా. తెరపై సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కు థియేటర్ లో ఉన్నామన్నా ఫీలింగ్ కాకుండా పండగ వాతావరణంలో తమ కుటుంబంతో గడుపుతున్న అనుభూతి కలుగుతుంది. నాగశౌర్య అద్భుతంగా నటించాడు. ఎమోషన్ సన్నివేశాల్లో ఒదిగిపోయాడు. మిగతా నటీనటులంతా కూడా తమ పాత్రల ఫరిది మేర అద్భుతంగా నటించారు. ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చి నిర్మాతలు రాజేష్, ఆర్ .కె గారికి కృతజ్ఞతలు’ అని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, ‘సినిమా బాగా వచ్చింది. దర్శకుడు ప్రతీ సన్నివేశాన్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు. అలాగే నాగశౌర్య నటన సినిమాకు హైలైట్ గా ఉంటుంది. నటనపై ఆయన కమిట్ మెంట్.. డెడికేషన్ చాలా బాగున్నాయి. భవిష్యత్ లో పెద్ద స్టార్ అవుతాడు. మేము సినిమా నిర్మించి ఎంత అనుభూతి పొందామో....సినిమా చూసిన తర్వాత అంతే అనుభూతి ప్రేక్షకులు పొందుతారు’ అని అన్నారు. -
విశాఖలో ఛలో సినిమా సక్సెస్ మీట్
-
గురువారం మార్చి ఒకటి.. అంటున్న నాగశౌర్య
ఛలో సినిమాతో మంచి విజయం అందుకున్న నాగశౌర్య స్పీడు పెంచాడు. ఇప్పటికే ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న కణం షూటింగ్ పూర్తి చేసిన ఈ యంగ్ హీరో మరిన్ని సినిమాలను లైన్లో పెడుతున్నాడు. గతంలో నువ్వు లేక నేను లేను, తొలిచూపులోనే లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కాశీ విశ్వనాథ్ తరువాత నటుడిగా బిజీ అయ్యారు. దాదాపు 15 ఏళ్ల తరువాత నాగశౌర్య సినిమాతో ఆయన తిరిగి మెగాఫోన్ పట్టనున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు సూపర్‌హిట్ సినిమా దూకుడులోని ‘గురువారం మార్చి ఒకటి’ పాట పల్లవిని టైటిల్‌గా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఛలో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ యంగ్ హీరో ఈ నెలాఖరున సాయి శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించనున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నర్తనశాల సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతే కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో గురువారం మార్చి ఒకటి సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. -
‘ఛలో’ మూవీ రివ్యూ
టైటిల్ : ఛలో జానర్ : కామెడీ ఎంటర్టైనర్ నటీనటులు : నాగశౌర్య, రష్మిక మందాన, నరేశ్, గిరిబాబు, పోసాని కృష్ణమురళి తదితరులు సంగీతం : మహతి స్వర సాగర్ బ్యానర్ : ఐరా క్రియేషన్స్ నిర్మాత : ఉషా మూల్పూరి దర్శకుడు : వెంకీ కుడుముల ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, కళ్యాణవైభోగమే, జ్యో అచ్యుతానంద లాంటి క్లాస్ హిట్స్‌తో మెప్పించాడు నాగశౌర్య. మధ్యలో మాస్ హీరోయిజం కోసం ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. తిరిగి తన స్టైల్లో మాంచి లవ్ ఎంటర్టైనర్గా చేసిన ఛలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సారిగా తన సొంత బ్యానర్‌ను తన సినిమాతోనే ప్రారంభించారు. మరి సినిమా ఏ మేరకు అలరించిందో చూద్దాం. కథ : హరి( నాగశౌర్య )కి చిన్నతనం నుంచీ గొడవలంటే ఇష్టం. ఆ గొడవల్లో తనకు దెబ్బలు తగిలినా సరే ఆనందిస్తూనే ఉంటాడు. మొత్తానికి ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటాడు. చిన్నప్పుడు హరి ఏడుపు ఆపడం లేదనీ, హరి నాన్న( నరేశ్ ) అందర్నీ కొట్టు కొట్టు అని చూపిస్తూ..కొడుతూ ఉంటే హరి నవ్వుతూ ఉంటాడు. అలా మొదలైన నవ్వు స్కూల్లో, వీధుల్లో కొనసాగిస్తూనే ఉంటాడు. ఇది చివరికి నరేశ్‌కి తలనొప్పిగా మారుతుంది. తన కొడుకు గొడవలకు దూరంగా ఉండాలంటే గొడవలు ఎక్కువగా జరిగే ప్రాంతంలో పెడితే మారతాడని అనుకుంటాడు. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో తిరుప్పురు అనే గ్రామంలో నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి.ఆంధ్ర రాష్ట్రం విడిపోయేప్పుడు తిరుప్పురు ఊరు మధ్యలోంచి సరిహద్దు వెళ్తుంది. మొదటగా సరిహద్దు గీయడానికి ఊరి పెద్దలు ఒప్పుకోరు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ఊరు తమిళ, తెలుగు భాగాలుగా విడిపోతుంది. అప్పటి నుంచీ ఆ ఊరిలో అటు వైపు వారు ఇటు రారు. ఇటువైపు వారు అటు పోరు. అలాంటి ప్రాంతంలో హరిని ఉంచితే మారతాడని అక్కడి కాలేజీలో జాయిన్ చేస్తాడు. ఆ కాలేజ్‌లోనే కార్తీక(రష్మిక మందాన)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు హరి. అసలు ఆ కార్తీకకు ఊరికి సంబంధం ఏంటీ? ఆ ఊరి సమస్య హరి ప్రేమకు ఏమైనా అడ్డు తగిలిందా ? తన ప్రేమను కాపాడుకోవడానికి హరి చేసిని ప్రయత్నం ఏంటి? గొడవలంటే ఇష్టమున్న హరి తన ప్రేమకోసం ఊరిని ఒక్కటి చేస్తాడా? అసలు చివరకు ఏమైందో తెలియాలంటే థియేటర్‌కు ‘ఛలో’ అనాల్సిందే. నటీనటులు : నాగశౌర్య సహజంగా నటించాడు. చాక్లెట్ బాయ్‌లా కనిపిస్తూ.. అమ్మాయిల మనసు కొల్లగొట్టేస్తాడు. హీరోయిన్గా నటించిన రష్మిక పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంది. తెలుగులో తొలి సినిమానే అయినా తన నటన, క్యూట్ లుక్స్‌తో అలరించింది. తొందరగానే తెలుగులో మరిన్ని అవకాశాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది. తండ్రి పాత్రలో సీనియర్ నరేశ్ ఒదిగిపోయాడు. ప్రగతి తల్లి పాత్రలో తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంది. కాలేజీ లెక్చరర్‌గా పోసాని, ప్రిన్సిపాల్‌గా రఘుబాబు, స్టూడెంట్స్‌గా వైవా హర్ష, శీను, సత్య ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తారు. వెన్నెల కిశోర్ కామెడీ సరికొత్తగా ఉంటుంది. ఊరి పెద్దలుగా తమిళనటులు జి.ఎం.కుమార్, మైమి గోపి, అచ్యుత్ కుమార్ వారి పాత్రకు న్యాయం చేశారు. విశ్లేషణ : వెంకీ కుడుముల దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయితగా కూడా తన పెన్నులోని చమత్కారాన్ని చూపించాడు. ప్రతీ సన్నివేశంలో కామెడీ పండించాడు. థియేటర్లో నవ్వుల పువ్వులు పూస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఊరి ఫ్లాష్ బ్యాక్ గురించి హీరో తెలుసుకునేందుకు పడే పాట్లు, ముక్కలు ముక్కలుగా దాని గురించి తెలుసుకోవడం చాలా బాగుంటుంది. ద్వితియార్థంలో వచ్చే వెన్నెల కిశోర్ పాత్రను దర్శకుడు చాలా బాగా వినియోగించుకున్నాడు. ఆ పాత్ర ద్వారా వీలైనంత కామెడీ పండిచాడు. సరిహద్దు వివాదంగా ప్రమోట్ చేసిన ఈ సినిమాలో సీరియస్ నెస్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే నిరాశతప్పదు. ఊరు విడిపోవడానికి గల కారణాలు, క్లైమాక్స్‌లో ఊరు కలిసిపోయే విధానం కాస్త సిల్లీగా అనిపించినా కామెడీ సినిమాగా చూస్తే ఎంజాయ్ చేయోచ్చు. మ్యూజిక్ పరంగా మణిశర్మ తనయుడిగా మహతి నిరూపించుకున్నాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు వినడానికీ, చూడడానికీ బాగుంటాయి. ముఖ్యంగా చూసి చూడంగానే పాట చాలా కాలం పాటు గుర్తుండి పోతుంది. సాయి శ్రీరామ్ తన కెమెరాతో నాగశౌర్య, రష్మికలను అందంగా చూపించాడు. సెకండాఫ్ హాఫ్ లెంగ్త్ కాస్త ఇబ్బంది పెడుతుంది. ప్లస్ పాయింట్స్ : నాగశౌర్య నటన రష్మిక నటన, అందం కామెడీ మైనస్ పాయింట్స్ : ఎక్కడా సీరియస్‌నెస్ కనపడకపోవడం సెకండాఫ్ నిడివి ముగింపు : హాయిగా నవ్వుకోవాలంటే సినిమాకి చల్ ‘ఛలో’.... బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
'నిహారికతో పెళ్లా.. ఆ అమ్మాయినే చేసుకుంటా'
సినీ పరిశ్రమలో రూమర్లకు కొదవలేదు. రోజుకో వార్త తెలుగు సినీపరిశ్రమలో హల్చల్ చేస్తుంది. అందులో అగ్రహీరోల ఇళ్లలోని వార్తలు అంటే ఇక అంతే. గత కొంతకాలంగా టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న వార్త మెగా బ్రదర్, జబర్థస్త్ కామెడీ షో ఫేం నాగబాబు కుమార్తె నిహారికా పెళ్లిగురించే. గతంలో రెండుసార్లు నిహారిక పెళ్లి టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. మొదట నిహారిక బావ సాయి ధరమ్‌తేజ్‌ను పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు హల్చల్ చేశాయి. కొద్ది రోజులకు అది వాస్తవం కాదని తేలినా, మరికొద్దిరోజుల కిందట బాహుబలి ప్రభాస్‌తో నిహారిక పెళ్లి అంటూ మరో వార్త వినిపించింది. దీనిపై స్పందించిన రెండుకుటుంబాలు అటువంటిది ఏమీలేదని కొట్టిపడేశాయి. ఇప్పుడు తాజగా మరో వార్త వైరల్ అయింది. అతి త్వరలో యువ హీరో నాగ శౌర్యతో నిహారిక వివాహమని, ఇరు కుటుంబ సభ్యుల నడుమ చర్చలు నడుస్తున్నాయని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, నాగ శౌర్య నటించిన చిత్రం ‘ఛలో’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య ఆతిథిగా హాజరయ్యారు. దీంతో ఈవార్తలు మరింత జోరందుకున్నాయి. అయితే వీటన్నింటిపై స్పందించిన నాగశౌర్య, నిహారికతో తన పెళ్లి అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. తన స్నేహితుల ద్వారా తాను ఈవార్త విన్నానని , వాటిలో ఏమాత్రం నిజం లేదని మరో మూడు లేదా నాలుగేళ్లు వరకూ తనకు పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని కేరీర్ మీద శ్రద్దపెట్టానని తెలిపాడు. పెళ్లి విషయానికి వస్తే కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని వివరణ ఇచ్చారు. -
నేను విజయవాడ కుర్రాడినే..
‘ఛలో’ చిత్ర కథానాయకుడు నాగశౌర్య పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులతో శనివారం సాయంత్రం సందడి చేశారు. కళాశాల ఆడిటోరియంలో అందరితో కొద్దిసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను విజయవాడలోనే పెరిగానని, టిక్కిల్ రోడ్డులో తిరిగానని చెప్పాడు. నగరానికి వస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందన్నాడు. ‘ఛలో టీజర్‌ను యూట్యూబ్‌లో చూశారా’ అంటూ విద్యార్థులను అడిగాడు. పైరసీని ఎంకరైజ్ చేయవద్దు అన్నారు. అనంతరం నాగశౌర్యతో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. – మొగల్రాజపురం -
నాగశౌర్య ’ఛలో’ ట్రైలర్ విడుదల
-
' ఛలో ' మూవీ వర్కింగ్ స్టిల్స్
-
‘ఓయ్’ అమ్మాయి మళ్లీ వచ్చింది..!
బాలనటిగానే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న షామిలి హీరోయిన్ గా ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన ఓయ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన షామిలి, తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యింది. ముఖ్యంగా ఆ సినిమాలో షామిలి లుక్ విషయంలో కూడా విమర్శలు రావటంతో కాస్త స్లిమ్ అయ్యి కోలీవుడ్ మీద దృష్టి పెట్టింది. కోలీవుడ్ లో బిజీ అవుతున్న ఈ భామ, మరోసారి టాలీవుడ్ వైపు అడుగులేస్తోంది.ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సుందర్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో వేసవిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. -
బీకాంలో ఫిజిక్స్ పుస్తకాలతో సినిమా పాట..
జలీల్ ఖాన్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు కాబోలు. బీకాంలో ఫిజిక్స్ చదివానని ఓ ఇంటర్వ్యూలో చెప్పి వార్తల్లోకి ఎక్కారు. ఆ సమయంలో 'ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులుగా చదివి బీకామ్ డిగ్రీ సాధించా'నంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఖాన్ 'బీకామ్ ఫిజిక్స్' వ్యాఖ్యలపై చాలా మంది పొట్టచక్కలయ్యేలా నవ్వుకున్నారు. బీకామ్ ఫిజిక్స్‌పై సోషల్ మీడియాలో పలు కామెంట్లు వచ్చాయి. ఈ సంఘటన జరిగి ఇటీవలే ఏడాది పూర్తైన దాని జోరు ఏమాత్రం తగ్గలేదు. ఎల్లప్పడు సరికొత్తగా వాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఓ సినిమా పాటలోను బీకామ్ ఫిజిక్స్‌ను వాడేశారు. ఊహలు గుసగుసలాడే ఫేమ్, యువహీరో నాగ శౌర్య తాజా చిత్రం ఛలో సినిమాలోని ఓపాటలో విద్యార్ధులు బీకామ్ ఫిజిక్స్ పుస్తకాలు పట్టుకొని ఉంటారు. ఛలో సినిమా విషయానికొస్తే నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. రస్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఉషా మూల్పూరి నిర్మతగా వ్యహరిస్తున్నారు. స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనే వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. పాటలో నాగ శౌర్య, రస్మికను ఆటపట్టించే సన్నివేశంలో విద్యార్థులందరూ బీకామ్ ఫిజిక్స్ పుస్తకాలను పట్టుకొని ఉంటారు. -
‘ఛలో’ రిలీజ్ వాయిదా..!
ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల కాస్త స్లో అయ్యాడు. వరుసగా ఫెయిల్యూర్స్ పలకరిస్తుండటంతో సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘కణం’ సినిమాతో పాటు తెలుగు వెంకీ కుడుముల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘ఛలో’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ‘ఛలో’ సినిమాను నాగశౌర్య అమ్మనాన్నలు ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ ను చిత్రయూనిట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. ముందుగా అనుకున్నట్టుగా డిసెంబర్ లో కాకుండా ఫిబ్రవరి తొలి వారంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి రిలీజ్ వాయిదాపై ఎలాంటి ప్రకటన లేకపోయినా.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. -
కొత్త ప్రేమకథ
‘మేం వయసుకు వచ్చాం, అలా ఎలా, సుప్రీమ్, పిల్ల జమీందార్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఛలో’ చిత్రాలకు కెమెరామన్‌గా పనిచేసిన సాయి శ్రీరామ్ దర్శకునిగా మారారు. నాగశౌర్య హీరోగా ఆయన తెరకెక్కించనున్న సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రార ంభమైంది. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై యం.విజయకుమార్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి కెమెరా స్విచ్చాన్ చేయగా, రచయిత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు. విజయకుమార్ మాట్లాడుతూ–‘‘సాయి శ్రీరామ్ చెప్పిన కథ, కథనాలు కొత్తగా ఉన్నాయి. అందుకే తొలిప్రయత్నంగా ఈ సినిమా నిర్మిస్తున్నా. నాగశౌర్య నటించిన చిత్రాలలో ఈ ప్రేమకథా చిత్రమ్ వైవిధ్యంగా ఉంటుందని నిస్సందేహంగా చెప్పగలను. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అన్నారు. దర్శకులు అనిల్ రావిపూడి, వి.ఐ.ఆనంద్, ఉపేంద్ర తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: హరిప్రసాద్ జాస్తి, కథ: విద్యాసాగర్ రాజు, మాటలు: విశ్వనేత్ర. -
హైదరాబాద్ టు తిరుపురం
‘ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, కళ్యాణ వైభోగం’ వంటి సినిమాలతో అలరించారు నాగశౌర్య. ప్రస్తుతం ఆయన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద పని చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కన్నడ ‘కిరిక్ పార్టీ’ ఫేమ్ రష్మికా మండన్న కథానాయిక. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘ఛలో’ టైటిల్ ఖరారు చేశారు. ఉషా మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ లవ్‌స్టోరీ, క్లైమాక్స్‌తో పాటు ఎంటర్టైన్మెంట్తో రూపొందిన చిత్రమిది. మేము సినిమా నిర్మాణంలోకి వస్తామనుకోలేదు. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో, ఈ సినిమాను నిర్మిద్దామనుకున్నాం. కెమెరామేన్ సాయి శ్రీరామ్‌గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. కథలు నచ్చితే బయటి హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు. ‘‘ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో జరిగే కాలేజ్ లవ్‌స్టోరీ ఇది. హైదరాబాద్ నుంచి హీరో తిరుపురం వెళ్తాడు. అక్కడ ఏం జరిగిందన్నది ఆసక్తిగా ఉంటుంది. నాగశౌర్యను నటుడిగా మరో మెట్టు ఎక్కించే సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు శంకర ప్రసాద్ ముల్పూరి. ఈ సినిమాకి సంగీతం: సాగర్ మహతి. -
‘ఛలో’ అంటున్న యంగ్ హీరో
మంచి విజయాలతో కెరీర్ ప్రారంభించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత ఆ ఫాం కొనసాగించలేకపోయాడు. లవర్ భాయ్ ఇమేజ్‌కు చేరువవుతున్న తరుణంలో వరుస ఫ్లాప్ లు ఎదురై కష్టాల్లో పడ్డాడు. సోలో హీరోగా ఆకట్టుకోలేకపోయిన నాగశౌర్య జ్యో అచ్యుతానంద, కథలో రాజకుమారి లాంటి సినిమా లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తాజాగా మరోసారి సోలో హీరోగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు నాగశౌర్య. కొత్త దర్శకుడు వెంకీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ఛలో అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను నాగశౌర్య అమ్మా నాన్నలే నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగు తమిళ భాషల్లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న కణం సినిమాలోనూ నటిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి, నాగశౌర్యకు జోడిగా నటిస్తోంది. -
దర్శకుడిగా మరో సినిమాటోగ్రాఫర్
సినిమాటోగ్రాఫర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాంకేతిక నిపుణులు దర్శకుడిగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి, రసూల్ ఎల్లోర్, సంతోష్ శివన్ లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్లతో పాటు కార్తీక్ ఘట్టమనేని లాంటి యువ టెక్నిషియన్స్ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయారు. తాజాగా మరో సినిమాటోగ్రాఫర్ కూడా ఈ లిస్ట్ లో చేరబోతున్నాడు. పిల్ల జమీందార్, సుప్రీమ్, గీతాంజలి, ఎక్కడికీ పోతావు చిన్నవాడా లాంటి చిత్రాలకు కెమెరామేన్ గా పనిచేసిన సాయి శ్రీరామ్ త్వరలో దర్శకుడిగా మారనున్నాడు. నాగశౌర్య హీరోగా సాయి శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది. -
సెప్టెంబర్ 15న 'కథలో రాజకుమారి'
నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ప్రధాన పాత్రలలో మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథలో రాజకుమారి. రాజేష్ వర్మ సిరువూరి సమర్పణలో సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్‌రెడ్డి, కృష్ణవిజరులు ఈసినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రమిది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. -
ప్రయోగాత్మక చిత్రంలో ఫిదా బ్యూటీ
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి సినిమాల సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ, మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు రెడీ అవుతోంది. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కబోయే ప్రయోగాత్మక చిత్రం కణంలో లీడ్ రోల్ లో నటిస్తోంది సాయి పల్లవి. విక్రమ్ హీరోగా నాన్న లాంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన ఎ. ఎల్ విజయ్ దర్శకత్వంలో 2.ఓ నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సాయి పల్లవి ఓ పాపతో కలిసి ఉన్న ఈ పోస్టర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. టైటిల్ డిజైన్ లోనూ తల్లి గర్భంలోని బిడ్డను చూపించటంతో ఈ సినిమా లేడి ఓరియంటెడ్ మూవీ అయి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. -
ఆగష్టు 25న 'కథలో రాజకుమారి'
నారా రోహిత్ నటించిన మరొక విభిన్న కుటుంబ, ప్రేమకధా చిత్రం 'కధలో రాజకుమారి'. రాజేష్ వర్మ సిరువూరి సమర్పణలో నిర్మించబడిన ఈ చిత్రానికి సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్ రెడ్డి, కృష్ణవిజయ్ నిర్మాతలు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ 'యు' సర్టిఫికేట్ అందుకొంది. సెన్సార్ సభ్యుల నుండి విశేష స్పందనను పొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు 25న విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రం 'కథలో రాజకుమారి'. సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన 'కథలో రాజకుమారి'ని ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి' అన్నారు. -
జూన్ 30న 'కథలో రాజకుమారి'
డిఫరెంట్ మూవీస్‌తో ఆకట్టుకుంటున్న నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా కథలో రాజకుమారి. మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అరకు ప్రాంతంలో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.. మేస్ట్రొ ఇళయరాజా రెండు పాటలకు సంగీతమందించగా.. 'కృష్ణగాడి వీరప్రేమగాధ' ఫేం విశాల్ చంద్రశేఖర్ మరో ఐదు పాటలకు మ్యూజిక్ చేశాడు. త్వరలో ఈ సినిమా ఆడియోను అరన్ మ్యూజిక్ ద్వారా మర్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఇంత వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో నారా రోహిత్ నటిస్తుండగా మరో యంగ్ హీరో నాగశౌర్య ప్రత్యేక పాత్రలో అలరించనున్నాడు. వీరి ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకే హైలెట్ అంటున్నారు చిత్రయూనిట్. నమిత ప్రమోద్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కోటా శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వర రావు, అవసరాల శ్రీనివాస్, మురళీమొహన్, అజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, హీరోయిన్ నందిత ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 30న సినిమాలను రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆరోహి సినిమా, అరన్ మీడియ వర్క్స్, శ్రీహాస్ ఎంటెర్టైన్మెంట్స్, సుధాకర్ ఇంపెక్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. -
అశ్వరావుపేటలో యువహీరో సందడి!
అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో యువ హీరో నాగశౌర్య సందడి చేశాడు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ కుడుములకు చెందిన ఓ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించడానికి ఆయన శనివారం పట్టణానికి విచ్చేశాడు. నాగశౌర్య వచ్చిన విషయం తెలియడంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో కాసేపు ఇక్కడ కోలాహలం నెలకొంది. వరుస సినిమాలతో నాగశౌర్య తన అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్చుతానంద', 'ఒక మనస్సు' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 'జ్యో అచ్చుతానంద' చిత్ర విజయంతో కాసింత విరామం తీసుకున్న నాగశౌర్య ప్రస్తుతం కొత్త దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. -
తెలుగు.. తమిళం.. ప్రేమపల్లవి..!
పాట పల్లవితో ప్రారంభమవుతుంది. హీరో నాగశౌర్య తమిళ ప్రేమకథ ‘ప్రేమమ్’ పల్లవితో ప్రారంభం కానుంది. ‘ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, ఒక మనసు, జ్యో అచ్యుతానంద’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య త్వరలో తమిళ తెరకు పరిచయం కానున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించనున్న ఈ తెలుగు, తమిళ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మలయాళ ‘ప్రేమమ్’ ఫేమ్ సాయి పల్లవి నటించనున్నారు. చక్కని ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. రజనీకాంత్ ‘2.0’ నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. -
లవ్ ఎంటర్టైనర్లో నాగశౌర్య
త్రివిక్రమ్ శిష్యుడు వెంకి కుడుములను దర్శకునిగా పరిచయం చేస్తూ నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి, శంకర ప్రసాద్ మూల్పూరి నిర్మించనున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కన్నడ హిట్ ‘కిరాక్ పార్టీ‘ ఫేం రష్మిక మండన ఇందులో కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త రాజేశ్ కిలారు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నారా రోహిత్ క్లాప్ ఇచ్చారు. శంకర ప్రసాద్ మూల్పూరి మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయి నాగశౌర్యతో ఓ చిత్రం నిర్మించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. వెంకి కుడుముల చెప్పిన కథ నచ్చడంతో మా బ్యానర్లోనే చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మా ఐరా క్రియేషన్స్ మొదటి సినిమా నాది కావడం సంతోషంగా ఉంది.’’ అన్నారు నాగశౌర్య. ‘‘నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన నాగశౌర్య, ఉషా, శంకరప్రసాద్ గార్లకు ధన్యవాదాలు. ఇది మంచి లవ్ ఎంటర్టైనర్’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాగర్ మహతి, కెమెరా: సాయి శ్రీరామ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్. నాగేశ్వరరావు (బుజ్జి). -
జ్యో అచ్యుతానంద కాంబినేషన్లో మరో సినిమా
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా.. చెప్పుకోదగ్గ హిట్స్ సాధించటంలో ఫెయిల్ అవుతూ వస్తున్న హీరో నారా రోహిత్. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నారా రోహిత్ కోరిక తీర్చిన సినిమా జ్యో అచ్యుతానంద. కమెడియన్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. నారా రోహిత్‌తో పాటు నాగశౌర్య మరో హీరోగా నటించిన జ్యో అచ్యుతనంద సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తున్నాడు రోహిత్. ప్రస్తుతం నారా రోహిత్, 'కథలో రాజకుమారి' సినిమాలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళీ భామ నమితా ప్రమోద్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మరోసారి నారా రోహిత్, నాగశౌర్యలు కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాగశౌర్య చేస్తుంది అతిథి పాత్రేనట. ప్రస్తుతం రోహిత్, నాగశౌర్యల కాంబినేషన్లో రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే చిత్రయూనిట్ సినిమా రిలీజ్ డేట్‌ను వెల్లడించనున్నారు. -
క్రేజీ మల్టీ స్టారర్‌కు రెడీ అవుతున్నారు
యంగ్ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి మల్టీ స్టారర్ సినిమాలకు రెడీ అవుతున్నారు. అందుకే దర్శకులు కూడా క్రేజీ కాంబినేషన్లలో మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అదే బాటలో భలేమంచి రోజు సినిమా ఫేం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఓ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే జ్యో అచ్యుతానంద సినిమాలో కలిసి నటించిన నారా రోహిత్, నాగశౌర్యలతో పాటు సందీప్ కిషన్‌లు హీరోలుగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా ఇద్దరు హీరోలు చేసిన మల్టీ స్టారర్ సినిమాలు మాత్రమే రాగా, శ్రీరాం ముగ్గరు హీరోలకు సరిపోయే ఇంట్రస్టింగ్ కథను సిద్దం చేశాడట. ఇప్పటికే కథ విన్న నారా రోహిత్, నాగశౌర్య, సందీప్ కిషన్‌లు ఈ ప్రాజెక్ట్‌కు అంగకరించారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
జ్యో అచ్యుతానందపై రాజమౌళి రివ్యూ
తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియాలో స్పందించే దర్శక ధీరుడు రాజమౌళి, తాజాగా జ్యో అచ్యుతానందపై సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సినిమా రాజమౌళికి అత్యంత సన్నిహితులైన వారాహి చలన చిత్ర బ్యానర్ పై రూపొందటంతో రిలీజ్ రోజు తొలి షోనే చూసిన జక్కన సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పేరు పేరునా ప్రశంసించాడు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో స్పందించిన రాజమౌళి, ' వారాహి చలన చిత్ర, అవసరాల శ్రీనివాస్, కళ్యాణ్ రమణల కాంబినేషన్ జ్యో అచ్యుతానంద సినిమాతో మరోసారి ఆకట్టుకుంది. సినిమాలో ఎక్కడా కావాలని ఇరికించిన సీన్స్ లేవు. సినిమా అంతా ఆరోగ్యకరమైన హాస్యం, గుండెలకు హత్తుకునే ఎమోషన్స్ అలరిస్తాయి. ముఖ్యంగా చివరి 10 నిమిషాలు కంట తడి పెట్టిస్తోంది. నారా రోహిత్, నాగశౌర్యలు అన్నదమ్ములుగా బాగున్నారు. రెజీనా నటన తొలిసారిగా చూశా. ఎంతో నచ్చింది. వెంకట్ ఫోటోగ్రఫి సినిమాకు ప్లస్, చిన్న చిన్న డిటెయిలింగ్ విషయంలో కూడా ఆర్ట్ డైరెక్టర్ రమ జాగ్రత్తలు తీసుకున్నారు. 'చివరకు మిగిలేది' నవలను వయసైనట్టుగా చూపించటం ఓ ఉదాహరణ. అందరికీ శుభాకాంక్షలు'. అంటూ ట్వీట్ చేశాడు. Combination of @VaaraahiCC Avasarala Srinivas and @Kalyanramana delivers yet another family youthful entertainer #JyoAchyuthananda. Never— rajamouli ss (@ssrajamouli) 9 September 2016Over the top, never forced- the film generates super fun through out and warms your heart in the last 10 mins of climax.Nara Rohith and— rajamouli ss (@ssrajamouli) 9 September 2016Nagashourya are very good as brothers. Watched regina for the first time. Very impressed. Venkat's photography is an asset. Appreciate the— rajamouli ss (@ssrajamouli) 9 September 2016amount of detail art director Rama put in. The aging of the novel "chivaraku migiledhi" in the film is a small example.Congratulations all!— rajamouli ss (@ssrajamouli) 9 September 2016 -
ఆ నలుగురికీ కీలకం
ఊహులు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా జ్యో అచ్యుతానంద. మొదటి సినిమా తరహా లోనే ఈ సినిమాను కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందించాడు అవసరాల శ్రీనివాస్. ట్రయాంగులర్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు నలుగురి కెరీర్‌కు కీలకంగా మారింది. ముఖ్యంగా అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ విజయాలు సాధించలేకపోతున్నారు. అందుకే జ్యో అచ్యుతానంద సక్సెస్ ఆయనకు కీలకం కానుంది. ఇక హీరోలుగా నటిస్తున్న నారా రోహిత్, నాగశౌర్యలకు కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు సక్సెస్‌కు మాత్రం చాలాకాలంగా దూరంగా ఉన్నారు. ఇక హీరోయిన్గా నటిస్తున్న రెజీనా కూడా స్టార్ ఇమేజ్ కోసం ఈ సినిమానే నమ్ముకుంది. -
ఏట్టి రీమేక్‌లో ఆది..?
చుట్టాలబ్బాయి సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన యంగ్ హీరో ఆది, తరువాత చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్లలో మాత్రమే కనిపించిన ఆది, భవిష్యత్తులో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా క్రీడా నేపథ్యం ఉన్న సినిమాల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. స్కూల్ డేస్ నుంచి మంచి రన్నర్‌గా పేరున్న ఆది తమిళ్లో ఘన విజయం సాధించిన ఏట్టి సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఓ వింత వ్యాదితో బాదపడుతున్న క్రీడాకారుడి కథగా తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా నాగశౌర్యతో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఆది స్టేట్ మెంట్‌తో ఏమైనా మార్పులు జరుగుతాయేమో చూడాలి. -
అవసరాలకు మంచి డేట్ దొరికింది
ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్, రెండో ప్రయత్నంగా తెరకెక్కిస్తున్న సినిమా జ్యో అచ్యుతానంద. ట్రయాంగులర్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారాహి చలనచిత్ర బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. సినిమా సక్సెస్ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్న యూనిట్‌కు ఇప్పుడు రిలీజ్ విషయంలో కూడా కలిసొచ్చింది. ముందుగా ఈ సినిమాను భారీ పోటి మధ్య సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అదే రోజు రిలీజ్ అవుతాయనుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా వెనక్కు తగ్గటంతో ఇప్పుడు జ్యో అచ్యుతానంద సోలోగా బరిలో నిలిచింది. నాగచైతన్య ప్రేమమ్, నాని మజ్ను, సునీల్ వీడి గోల్డెహే సినిమాలు వాయిదా పడ్డాయి. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా విషయంలో మాత్రం క్లారిటీ లేదు. దీంతో థియేటర్ల సంఖ్యతో పాటు తొలి వారం కలెక్షన్ల విషయంలోనూ జ్యో అచ్యుతానంద సత్తా చాటుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
ధనుష్ హీరోగా ఒక మనసు రీమేక్..?
మెగా వారసురాలు నిహారిక హీరోయిన్గా తెరంగేట్రం చేసిన సినిమా ఒక మనసు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం మంచి వసూళ్లనే సాధిస్తోంది. దీంతో పరభాష నటులు ఇప్పుడు ఈ సినిమా రీమేక్ మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ తరహా చిత్రాలను ఇష్టపడే తమిళ ప్రేక్షకుల కోసం ఒక మనసు సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు ఓ స్టార్ హీరో. ఇటీవల ఒక మనసు సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన తమిళ హీరో ధనుష్, ఆ సినిమాను తమిళ్లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ మేరకు ఒక మనసు సినిమా దర్శక నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ముఖ్యంగా నాగశౌర్య పాత్ర, నేపథ్యం.. నచ్చిన ధనుష్ తానే స్వయంగా ఆ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. తన సొంతం నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
'ఒక మనసు' మూవీ రివ్యూ
టైటిల్ : ఒక మనసు జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : నాగశౌర్య, నిహారిక, రావూ రమేష్, ప్రగతి సంగీతం : సునీల్ కశ్యప్ దర్శకత్వం : రామరాజు నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి ఇటీవల కాలంలో సార్ట్ వారసుల హవా బాగా కనిపిస్తుండటంతో అదే బాటలో మెగాఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చింది కొణిదల నీహారిక. నాగబాబు కూతురిగా, పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న నీహారిక, తొలిసారిగా ఒక మనసు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. మరి వెండితెర మీద మెరసిన తొలి మెగా వారసురాలు ఆకట్టుకుందా..? హీరోయిన్ గా సక్సెస్ కొట్టాలన్న నీహారిక కల నెరవేరిందా..? కథ : సూర్య (నాగశౌర్య) రాజకీయ నాయకుడు కావాలన్న ఆశతో విజయనగరంలో సెటిల్మెంట్స్ చేస్తూ తిరిగే అబ్బాయి. సూర్య మామయ్య ఎమ్మెల్యే కావటంతో ఏ రోజుకైనా సూర్యను కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలని కలకంటుంటాడు సూర్య తండ్రి (రావు రమేష్). విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో హౌస్ సర్జన్‌గా చేస్తున్న సంధ్య (నీహారిక), సూర్యని తొలి చూపులోనే ఇష్టపడుతుంది. తరువాత ఆ ఇద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. అదే సమయంలో తన రాజకీయ అవసరాల కోసం ఓ పెద్ద సెటిల్మెంట్ ఒప్పుకున్న నాగశౌర్య చిక్కుల్లో పడతాడు. నమ్మకద్రోహం కారణంగా కోర్టు కేసులో ఇరుక్కుని మూడేళ్లపాటు జైలులో ఉంటాడు. ఆ తరువాత బెయిల్ వచ్చినా కేసు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరోసారి సంధ్యకు దగ్గరవుతాడు సూర్య. కానీ తన తండ్రి కలను నెరవేర్చటం కోసం ఈ సారి సంధ్యకు శాశ్వతంగా దూరం కావలసిన పరిస్థితి వస్తుంది. మరి సూర్య నిజంగానే సంధ్యను దూరం చేసుకున్నాడా.? సూర్య వదిలి వెళ్లిపోవటానికి సంధ్య అంగీకరించిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇప్పటి వరకు లవర్ బాయ్ పాత్రల్లో కనిపించిన నాగశౌర్య ఈ సినిమాలో కాస్త పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో తండ్రి కల, అమ్మాయి ప్రేమకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా మంచి నటన కనబరిచాడు. తొలిసారిగా వెండితెర మీద మెరిసిన నిహారిక పరవాలేదనిపించింది. లుక్స్ పరంగా హుందాగా కనిపించిన నిహారిక, నటన పరంగా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. తండ్రి పాత్రలో రావూ రమేష్ మరోసారి ఆకట్టుకున్నాడు. కొడుకు భవిష్యత్తు కోసం తపన పడే తండ్రిగా రావూ రమేష్ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. ఫ్రెండ్ పాత్రలో అవసరాల శ్రీనివాస్, చిన్న కామెడీ పాత్రలో వెన్నెల కిశోర్ తమ పరిధి మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణులు : నీహారికను హీరోయిన్గా ఎంచుకొని సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు రామరాజు, మరోసారి తన మార్క్ పోయటిక్ టేకింగ్ తో ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ స్లో నారేషన్ కాస్త ఇబ్బంది పెట్టినా.. రిచ్ విజువల్స్, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి, సినిమా చాలా వరకు హీరో హీరోయిన్ల మధ్య మాటలతోనే నడిపించిన దర్శకుడు, డైలాగ్స్ పై మరింతగా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం, రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం ఆకట్టుకుంటాయి. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. వైజాగ్ బీచ్ అందాలను, అరకు పచ్చదనాన్ని మరింత అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫీ మెయిన్ స్టోరీ ప్రీ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ డైలాగ్స్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
నిహారికకు ఏమైంది?
మెగా వారసురాలుగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడానికి సిద్ధమవుతోంది నిహారిక. రామరాజు దర్శకత్వంలో 'ఒక మనసు' అనే అందమైన ప్రేమ కథలో హీరోయిన్ గా కనిపిస్తుంది నాగబాబు ముద్దుల తనయ. ఈ మధ్యే అట్టహాసంగా ఆ సినిమా ఆడియో రిలీజ్ జరుపుకుంది. నిహారికకు జంటగా నాగశౌర్య నటించాడు. జూన్ 24న సినిమా రిలీజ్ డేట్ అనుకున్నారు. అందుకు తగ్గట్లే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేస్తున్నారు. త్వరలో ప్రమోషన్ హంగామా మొదలు పెట్టాలనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఇక్కడే అసలు సమస్య వస్తోంది చిత్ర యూనిట్‌కి. టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ...షూటింగ్ ముగిసిన తర్వాత నిహారిక ఎందుకో ఈ సినిమా యూనిట్ కి దూరంగా ఉంటూ వస్తోందంట. మొదట విడుదల చేసిన ట్రైలర్ కి డబ్బింగ్ చెప్పడానికి కూడా నిహారిక చాలా టైమ్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు సినిమా డబ్బింగ్ విషయంలో కూడా అదే సమస్యను ఎదుర్కొంటుందట చిత్ర యూనిట్. ఈ సినిమా డబ్బింగ్‌కి ఎప్పుడు రమ్మని పిలిచినా ... నిహారిక ఏదో వంక చెప్పి తప్పించుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. మెగా డాటర్ ఇమేజ్ తో తమ సినిమాకు మరింత మైలేజీ వస్తుందన్న దర్శక నిర్మాతల ఆశలను.. నిహారిక వ్యవహరిస్తున్న తీరు డిసప్పాయింట్ చేస్తోందని సమాచారం. మరికొద్ది రోజులు ఆగి .. నిహారిక డబ్బింగ్ కి రాకపోతే కనుక.. మరో డబ్బింగ్ ఆర్టిస్ట్ తో వాయిస్ చెప్పించాలని డిసైడ్ అయ్యారట. అయితే ఆ రూమర్లపై నిహారిక కూడా ఇంతవరకూ స్పందించలేదు. -
ఆ ప్రశ్నతో నన్ను మాట్లాడనివ్వకుండా చేసింది : నాగబాబు
‘‘తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా దొరకరు. నాగబాబు ధైర్యం చేసి నీహారికను హీరోయిన్ని చేశారు. హీరోయిన్ అవు తుందని, కాదని ఇలా ఇంట్లో తర్జనభర్జన జరుగుతున్నప్పుడు నాగశౌర్యతో సినిమా చేస్తోందని మీడియా ద్వారా తెలిసింది. అరె.. బన్నీ సరసన హీరోయిన్గా చేస్తే బాగుంటుందనిపిం చింది. సరిగ్గా అప్పుడే ‘సరైనోడు’ స్టార్ట్ అయింది. ఇది మా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడే అందరికీ చెబుతున్నా’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. మెగా ఫ్యామిలీ వారసు రాలిగా నాగబాబు కుమార్తె నీహారిక వెండితెరపై తెరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ఒక మనసు’. నాగశౌర్య, నీహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో రామ్‌చరణ్ ఈ చిత్రం బిగ్ సీడీని ఆవిష్కరించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ- ‘‘చిరంజీవిగారు వేసిన బాటలో మేం కష్టపడు తున్నాం. నీహా మా కన్నా ఎక్కువ కష్టపడుతోంది. తెలుగు పరిశ్రమకు ఆహ్వానం పలుకుతున్నా. నీహాకు ఎలాంటి కోస్టార్ దొరుకుతాడో అని ఎదురుచూశా. నాగశౌర్య స్వచ్ఛమైన తెలుగబ్బాయిలా ఉంటాడు. నీహాను చూశాక తమ ఇంటి అమ్మాయిలా అందరూ అనుకుంటారు’’ అన్నారు. ‘‘నేను ‘కంచె’ సినిమా చేస్తున్నప్పుడు ‘మల్లెల తీరంలో..’ చూశాను. మా చెల్లి మంచి దర్శకుని చేతిలో పడిందని హ్యాపీగా ఉంది. ఈ రోజు ఉన్న హీరోల్లో నాగశౌర్య మంచి నటుడు. నీహారికను చిన్నప్పుడు ‘ఏమవుతావు’ అని అడిగితే ఐఏఎస్, డాక్టర్ అవుతాననేది. ఇప్పుడు మాతో పాటే సినిమాల్లోకి వచ్చేసింది. కొత్తలో తన మీద నమ్మకం ఉండేది కాదు. నెమ్మదిగా నాకు కూడా నమ్మకం కుదిరింది’’ అని వరుణ్‌తేజ్ చెప్పారు. నాగ బాబు మాట్లాడుతూ- ‘‘నీహారికకు మంచి కథ ఇచ్చారు. ఇంతమంది హీరోలున్న ఫ్యామిలీ నుంచి నీహారిక హీరోయిన్గా వెళుతుందని చెప్పగానే అందరూ ప్రోత్సహించారు. నీహారిక మాస్ కమ్యూనికేషన్ చేశాక సినిమాల్లోకి ఎంటరవుతానంటూ, ‘హీరోలు వస్తున్నప్పుడు ఏమీ మాట్లాడరేం? ఆడపిల్లలు వస్తున్నప్పుడే మాట్లాడతారేం?’అని ప్రశ్నించింది. నన్ను మారు మాటాడకుండా చేసింది. అందుకే నీహారికను తనకు ఇష్టమైన రంగంలోకి పంపించాను. ప్రతి పేరెంట్ కూడా తమ కూతుళ్లు కన్న కలలను సాకారం చేసుకోవడానికి ప్రోత్స హించాలని కోరుతున్నా. ఆడపిల్లలను అబ్బాయిల కన్నా ఎక్కువగా లేక సమానంగా ప్రోత్సహించండి’’ అని నాగబాబు చెప్పారు. నీహారిక మాట్లాడుతూ- ‘‘రామరాజు గారు స్క్రిప్ట్ నెరేట్ చేస్తుంటే అలా వినాలనిపించింది. నేను ఈ సినిమాలో కొన్ని సీన్స్‌లో బాగా యాక్ట్ చేశానంటే నాగశౌర్య కారణం. అమ్మ ప్రేమను వర్ణించడం ఎవరి తరం కాదు. కానీ, ఈ సినిమా మాత్రం అమ్మ ప్రేమంత స్వచ్ఛంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘రామరాజుగారి వల్లే మేమింత బాగా యాక్ట్ చేయగలిగాం’’ అని నాగశౌర్య అన్నారు. ఈ వేడుకలో నీహారిక తల్లి పద్మజ, చిరంజీవి కుమార్తె సుస్మిత పాల్గొన్నారు. -
'ఒక మనసు' మూవీ స్టిల్స్
-
ఆ ఒక్క... మనసు కథ!
మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కుమార్తె నీహారిక హీరోయిన్గా తెరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర వ్యాఖ్యాతగా అందర్నీ ఆకట్టుకున్న ఆమె హీరోయిన్గా చేస్తున్న తొలి చిత్రం ‘ఒక మనసు’ ఫస్ట్‌లుక్‌ను ఉగాది సందర్భంగా విడుదల చేశారు. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఎ. అభినయ్, డా. కృష్ణా భట్టలతో కలిసి ‘మధుర ’ శ్రీధర్ నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ 6 అందమైన మెలొడీలం దించారు. ఈ నెల చివర్లో పాటలను, వేసవి స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చే స్తున్నాం’’ అని తెలిపారు. -
ఈ కళ్యాణం... కమనీయం
కొత్త సినిమా గురూ! పెళ్లనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఓ మధుర ఘట్టం. పైగా భారతీయ వివాహ వ్యవస్థకో విశిష్ఠత కూడా ఉంది. ఈ వ్యవస్థ గొప్పదనాన్ని వెండితెరపై ఆవిష్కరించిన కథలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాయి. ‘సీతారామకల్యాణం’, ‘పెళ్లిపుస్తకం’, ‘మురారి’... ఇలా ఎన్నో సినిమాల్లో వివాహం అనేది జీవితంలో ఎంత అద్భుతమైన ఘట్టమో కళ్లకు కట్టినట్టు చూపించారు. తాజాగా నందినీ రెడ్డి కూడా కళ్యాణ వైభోగాన్ని తెరపై ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే ‘కళ్యాణ వైభోగమే’. కథేంటంటే... 23 ఏళ్ల శౌర్య (నాగశౌర్య) గేమింగ్ డిజైనర్. మిలియన్ డాలర్ కంపెనీ పెట్టి యూఎస్‌లో సెటిలైపోవాలన్నది డ్రీమ్. పెళ్లంటే నూరేళ్ల మంట అని అతని అభిప్రాయం. అందుకే అమ్మ (ఐశ్వర్య), నాన్న(రాజ్ మాదిరాజు)లు పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంటాడు. అయినా ఓ రోజు తప్పక పెళ్లి చూపులకు వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ దివ్య (మాళవికా నాయర్)ను చూస్తాడు. ఇద్దరికీ విడిగా మాట్లాడుకునే అవకాశం ఇస్తారు పెద్దలు. నాకీ పెళ్లి ఇష్టంలేదని ఆమె మొహం మీదే చెప్పేస్తాడు. దివ్వకు కూడా అదే అభిప్రాయం. పెళ్లికి ముందు తల్లిదండ్రుల మాట... పెళ్లయ్యాక భర్త మాట వింటూ ఉండే భార్యలా.. తన కళ్ల ముందు కనిపించే అమ్మ (రాశి)లా ఉండకూడదు, ఇంకా ఏదో సాధించాలని తన ఫీలింగ్. ఇష్టం లేని పెళ్లిని ఆపడానికి శౌర్య, దివ్య తమ పెద్దలకు ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పి, ఎలాగోలా పెళ్లి సంబంధాన్ని తప్పిస్తారు. అది తప్పిపోయినా పెద్దలు మాత్రం ఇద్దరికీ పెళ్లి సంబంధాల వేటలో ఉంటారు. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో శౌర్య, దివ్యలు ఓ రెస్టారెంట్లో కలుస్తారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్‌తో విడిపోవచ్చని వారి ప్లాన్. ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. అక్కడనుంచి మొదలవుతుంది అసలు కథ. వాళ్ల ఉద్దేశం. వాళ్లు అనుకున్నట్లే విడిపోయారా? లేక కలిసే ఉన్నారా? అనేది మిగతా కథ. బలవంతంగా పెళ్లి చేసేద్దామనే ధోరణిలో ఉన్న పెద్దవాళ్లు, వాళ్లకు ఎదురు చెప్పలేక పెళ్లి చేసుకుని, అందులోంచి బయటపడటానికి ప్లాన్ వేసిన ఓ యువ జంట ఎన్ని కష్టాలు ఎదుర్కొందో నందినీ రె డ్డి ఆసక్తికరంగా చూపించారు. ఆడవాళ్లంటే ఇంటికి పరిమితం కావాలనే ఆలోచనతో ఉన్న హీరోయిన్ తండ్రి పాత్రలో తమిళ నటుడు ఆనంద్, అతని భార్యగా రాశి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఓ సన్నివేశంలో ఎప్పుడూ భార్యలే భర్తలకు వడ్డించాలా అని శౌర్య పట్టుబట్టి తన మావయ్య (ఆనంద్)తో అత్తయ్య(రాశి)కు వడ్డించేలా చేస్తాడు. పెళ్లయిన ఇన్నేళ్లలో ‘ఎప్పుడూ తనను తిన్నావా’ అని అడగని భర్త అలా వడ్డించడంతో చెమర్చిన కళ్లు, తర్వాత శౌర్య ‘తినండి అత్తయ్యా’ అంటూ వడ్డిస్తుంటే రాలిన ఆనందబాష్పాలతో ‘చాలు బాబు...’ అంటూ రాశి కనబర్చిన నటన టచింగ్‌గా ఉంటుంది. తండ్రికి భయపడే అమ్మాయిగా, జీవితంపట్ల స్పష్టమైన ఆలోచన గల యువతిగా మాళవిక, లైఫ్ అంటే జాలీ రైడ్ అనుకునే శౌర్యగా నాగశౌర్య తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చాలా సినిమాల్లో తల్లి పాత్రల్లో కనిపించే ప్రగతి ఈ సినిమాలో ఐపాడ్ అమ్మక్కగా నవ్వులు పూయించారు. పతాక సన్నివేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తాగుబోతు రమేశ్, జీహెచ్ఎంసి వ్యాన్ డ్రైవర్‌గా ఆశిష్ విద్యార్థి నవ్వించడం కొసమెరుపు. ‘అలా మొదలైంది’ ఆనవాళ్లు అక్కడక్కడా కనిపించినా, తనదైన టేకింగ్‌తో వాటిని ప్రేక్షకుల మనసుల్లోంచి తుడిచేసే ప్రయత్నం చేశారు దర్శకురాలు. కళ్యాణి కోడూరి స్వరపరిచిన పాటల్లో పెళ్లి పాట గుర్తుండిపోతుంది. డబుల్ మీనింగ్ కామెడీ రాజ్యమేలుతున్న ఈ తరుణంలో హృదయానికి హత్తుకునేలా, సకుటుంబ సపరివారాన్ని ఎక్కడా ఇబ్బంది పెట్టని ఈ కల్యాణ వైభోగం నవరసభరితం. -
రిస్క్ చేస్తున్న యంగ్ హీరో
చందమామ కథలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగశౌర్య, తరువాత 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా లవర్ బాయ్ రోల్స్ మాత్రమే చేసిన ఈ చాక్లెట్ బాయ్, రూట్ మార్చి చేసిన ప్రయోగం పెద్దగా వర్కవుట్ కాలేదు. మాస్ ఇమేజ్ కోసం చేసిన యాక్షన్ సినిమా జాదూగాడు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో మరోసారి రొమాంటిక్ మూవీస్ మీద దృష్టి పెట్టాడు నాగశౌర్య. ప్రస్తుతం అలామొదలైంది ఫేం నందినీ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ వైభోగమే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న నాగశౌర్య, ఆ సినిమా తరువాత మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కిరణ్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్న నెక్ట్స్ సినిమాలో హీరోగా, విలన్‌గా డ్యూయల్ రోల్లో నటించడానికి అంగీకరించాడు. మాస్ క్యారెక్టర్‌తో మెప్పించలేకపోయిన నాగశౌర్య, నెగెటివ్ రోల్లో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
ఆ జంట కన్నులపంట
ఓ అమ్మాయి, అబ్బాయి జీవితంలో పెళ్లికి ముందు, ఆ తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సకుటుంబ వినోదకథా చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై కేఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మా సంస్థ గతంలో నిర్మించిన ‘అలా మొదలైంది’ వంటి చిత్రాలను మించి ఇది విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. కథాకథనాలు, సంభాషణలు, ఛాయాగ్రహణం హైలైట్’’ అని తెలిపారు. ‘‘ప్రస్తుతం ప్రేమ, పెళ్లి లాంటి బంధాలపై యువతరంలో ఉన్న ఆలోచనలకు ఈ చిత్రం అద్దం పడుతుంది. సున్నిత భావోద్వేగాలను సమపాళ్ళలో మేళవించి చిత్రం రూపొందించాం’’ అని నందినీరెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కల్యాణ్ కోడూరి, సినిమాటోగ్రఫీ: జీవీఎస్ రాజు, సహ-నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహనరెడ్డి. వి. -
నాలుగు భాషల్లో నాగశౌర్య చిత్రం
ఊహలు గుసగులాడే సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య, తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఆ సినిమా తరువాత వరుసగా నాలుగు ఫ్లాప్‌లు పలకరించటంతో తన లేటెస్ట్ సినిమా కళ్యాణ వైభోగమే రిలీజ్ విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. పోటిపడి రిలీజ్ చేసి రిస్క్ చేసే కన్నా సోలో రిలీజ్ కోసం వెయిట్ చేయటమే బెటర్ అని భావిస్తున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య ఓ బహు భాష చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఆస్ట్రేలియాలో డిస్ట్రిబ్యూటర్‌గా పలు విజయవంతమైన చిత్రాలను అందించిన రామ్ నిర్మాతగా, సాయి చైతన్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాకు నాగశౌర్యను హీరోగా ఎంపిక చేసుకున్నారు. భారీగా తెరకెక్కనున్న ఈ సినిమాను ఒకేసారి నాలుగు భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారు. మరి ఈ సినిమాతో నాగశౌర్య సౌత్‌లో స్టార్ ఇమేజ్ అందుకుంటాడేమో చూడాలి. -
వైభవంగా ఉంటుంది!
నందినీరెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, దామోదర్ ప్రసాద్ నిర్మించిన ‘అలా మొదలైంది’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో తయారైన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రం అన్ని విధాలుగా వైభవంగా ఉంటుందని దర్శక-నిర్మాతలు నందినీరెడ్డి, దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా రూపొందిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. దామోదర్ ప్రసాద్ మాట్లాడు తూ - ‘‘యువతలో ప్రేమ, పెళ్లి బంధాలపై ఉన్న అభిప్రాయాలను అందరికీ అర్థమయ్యేలా చూపించాం. కల్యాణి కోడూరి స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. చిత్రంపై మరిన్ని అంచనాలు పెరగడానికి ఆడియో విజయం ఓ కారణమైంది. ఈ చిత్రం హక్కులను అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసు కుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్ రెడ్డి.వి. -
వీళ్లు చాలా క్లోజ్.. కానీ...
ఆ అబ్బాయికి ఫోన్లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఒకరి జీవితాన్ని ఒకరు మాటల్లో ఆవిష్కరించుకున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్‌ల్లో మునిగిపోయి ప్రపంచాన్ని మర్చిపోయారు. అంత బాగా క్లోజ్ అయిపోయారు. కానీ ఇద్దరూ ఎప్పటికీ అన్నోన్ ఫ్రెండ్స్‌గా మిగిలిపోవాల నుకుంటారు. కానీ సడన్‌గా ఆ అమ్మాయి దీన్ని బ్రేక్ చేయాలనుకుంటుంది. అసలు ఎందుకో, ఏమిటో తెలియాలంటే ‘అబ్బాయితో అమ్మాయి’ చూడాలంటు న్నారు హీరో నాగశౌర్య. రమేశ్ వర్మ దర్శకత్వంలో నాగశౌర్య, పలక్ లల్వానీ జంటగా వందన అలేఖ్య జక్కం, శ్రీనివాస్ సమ్మెట, కిరీటి పోతిని నిర్మించిన చిత్రం ‘అబ్బాయితో... అమ్మాయి’. ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగశౌర్య మాట్లాడుతూ-‘‘ఇది నా హోమ్ బ్యానర్ లాంటిది. ఎక్కడా లెక్కలు వేసుకోకుండా నా గురించి ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. రమేశ్‌వర్మ గారు మూడున్నర ఏళ్లు పాటు నా కోసం వెయిట్ చేశారు. ఇళయరాజాగారి 999వ సినిమా నాది కావడం చాలా ఆనందంగా ఉంది. కుదిరితే ఆయనతో మరో సినిమా కూడా చేయాలని ఉంది’’ అని అన్నారు. రమేశ్‌వర్మ మాట్లాడుతూ- ‘‘‘వీర’ సినిమా తర్వాత ఓ ఫ్రెష్ పెయిర్‌తో లవ్ స్టోరీ తీద్దామనుకున్నా. అప్పుడే నాగశౌర్య హీరోగా ఓ కథ తయారు చేసుకున్నా కానీ నాగ శౌర్య బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అనుకున్న దాని క న్నా సినిమాకు చాలా బడ్జెట్ అయింది. కానీ నిర్మాతలు మాత్రం ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు’’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘సినిమా చూసిన వాళ్లందరూ బాగుందటున్నారు. మంచి బిజినెస్ కూడా జరిగింది. ఇళయరాజా గారి సూచన మేరకు ఈ చిత్రాన్ని తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో నాగశౌర్యతో మరో చిత్రం చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మురళీకృష్ణ కొడాలి. -
అబ్బాయితో అమ్మాయి మూవీ స్టిల్స్
-
ఆ హీరోకి మొహం చాటేశారు
సినిమా రంగం సక్సెస్ వెంటే పరిగెడుతుంది అన్న నిజం మరోసారి రుజువైంది. మొన్నటి వరకు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా కనిపించిన ఓ యంగ్ హీరోకి, ఒక్క ఫ్లాప్ వచ్చేసారికి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. 'చందమామ కథలు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య ఆ తరువాత వరుస సక్సెస్‌లతో బిజీ హీరోగా మారిపోయాడు. కానీ ఒక్క ఫ్లాప్ ఈ యంగ్ హీరో కెరీర్‌నే టర్న్ చేసింది. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య తరువాత 'దిక్కులు చూడకు రామయ్య', 'లక్ష్మీ రావే మా ఇంటికీ' సినిమాలతో మంచి విజయాలు సాధించాడు. అయితే ఈ సినిమాలన్నింటిలో లవర్‌బాయ్‌గా కనిపించిన నాగశౌర్య, యాక్షన్ టర్న్ తీసుకొని చేసిన 'జాదుగాడు' సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఫెయిల్యూర్ నాగశౌర్య కెరీర్‌నే కష్టాల్లో పడేసింది. 'జాదుగాడు' సినిమాకు ముందు చేతినిండా సినిమాలతో బిజీగా కనిపించిన నాగశౌర్య ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. గతంలో నాగశౌర్య ఖాతాలోనే ఉన్న అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఊహలు గుసగుసలాడే సీక్వెల్‌తో పాటు, మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు దర్శకుడు తెరకెక్కిస్తున్న మరో సినిమాలకు కూడా ఇప్పుడు వేరే హీరోలను ఫైనల్ చేశారు. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉన్న నాగశౌర్య ఆ సినిమాతో అయిన హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని ట్రై చేస్తున్నాడు. -
చూస్తే ప్రేమలో పడిపోతారు!
ఓ జంట మధ్య చిగురించిన ప్రేమ వారి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పిందనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’. నాగశౌర్య, పాలక్ అల్వాని జంటగా వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో టీజర్ ఆవిష్కరించారు. నాగశౌర్య మాట్లాడుతూ- ‘‘నేను మంచి హీరో అవుతానని రమేష్ వర్మ ఎప్పుడో నమ్మారు. అందుకే నాకోసం మంచి కథ సృష్టించారు. ఈలోగా నేను వేరే సినిమాలతో బిజీ అయిపోయా. అయినా నా కోసం రెండేళ్లు ఆగారు. ఇది కచ్చితంగా హిట్టయ్యే మూవీ. ఇళయరాజాగారితో చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది. నేను అందగాణ్ణే అనే ఫీలింగ్ కలగచేసిన కెమేరామేన్ శ్యామ్ కె. నాయుడుగారికి నా కృతజ్ఞతలు’’ అని చెప్పారు. ‘‘రమేష్ వర్మ ఓ అద్భుత మైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టీజర్ చూస్తేనే ఈ సినిమాతో ఎవరైనా ప్రేమలో పడిపోతారు’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో మల్టీ డైమన్షన్ వాసు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: పాత్రికేయ. -
దక్షిణాది అవార్డ్‌ల సంబరం
ఆర్థికంగా లాభం కాకపోయినా పరిశ్రమపై ప్రేమతో పదమూడేళ్లుగా ఈ అవార్డు వేడుకలు జరుపుతున్నారు. ఈ దక్షిణాది సినీ అవార్డుల ఫంక్షన్‌కు భారతీయ సినీ దిగ్గజాలు రావడం విశేషం’’ అన్నారు నిర్మాత కె.ఎస్. రామారావు. ఈ నెల 21న హైదరాబాద్‌లో జరగనున్న సినీ వారపత్రిక ‘సంతోషం’ 13వ వార్షికోత్సవం, దక్షిణాది సినీ అవార్డ్స్ సంబరం గురించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు. వేడుకల కర్టెన్ రైజర్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇన్విటేషన్‌ను కేఎస్ రామారావు ఆవిష్కరించగా, వేడుకల సాంగ్ హీరో నాగశౌర్య విడుదల చేశారు. నాయిక రాశీ ఖన్నా, సాయిసుధాకర్, ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి, హీరో నాగ అన్వేష్, ‘సంతోషం’ అధినేత సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
బుల్లితెరపై... ‘లక్ష్మీ రావే మా ఇంటికి’
మార్చి 8, ఆదివారం నాడు మహిళా దినోత్సవం సందర్భంగా జీ-తెలుగు చానల్లో అదే రోజు సాయంత్రం 6 గంటలకు అవికా గోర్, నాగ శౌర్య జంటగా నటించిన చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ప్రసారం కానుంది. విజయనగరంలో ‘కొంచెం ఇష్టం - కొంచెం కష్టం’ రోహిణి, రేవతి, గౌతమ్ ఈ పేర్లు వింటే గుర్తొచ్చే సీరియల్ ‘కొంచెం ఇష్టం-కొంచెం కష్టం’ అని ప్రేక్షకులు ఠక్కున చెబుతారు. రోహిణి , రేవతి ఇద్దరూ గౌతమ్‌ను ప్రేమిస్తారు. కానీ వారిలో ఎవరికి గౌతమ్ దక్కనున్నాడో తెలియాలంటే మార్చి 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు విజయనగరంలోని ఎం.ఆర్ కళాశాలలోని అయోధ్య మైదానంలో జరిగే చిత్రీకరణకు ప్రేక్షకులు హాజరు కావాలని ‘జీ -తెలుగు’ టీవీ చానల్ ప్రతినిధులు తెలిపారు. -
కుర్ర హీరోలు.. దూసుకుపోతున్నారు..!
-
'లక్ష్మీ రావే మా ఇంటికి' న్యూ స్టిల్స్
-
'లక్ష్మీ రావే మా ఇంటికి' ఆడియో వేడుక
-
'లక్ష్మీ రావే మా ఇంటికి' స్టిల్స్
-
‘లక్ష్మీ..రావే మా ఇంటికి’ టీజర్ విడుదల
-
50రోజులు పూర్తి చేసుకున్న 'ఊహలు గుసగుసలాడే'
-
లక్ష్మీరావే మా ఇంటికి మూవీ స్టిల్స్