అశ్వరావుపేటలో యువహీరో సందడి! | naga shourya visited ashwaraopeta | Sakshi
Sakshi News home page

అశ్వరావుపేటలో యువహీరో సందడి!

Published Sat, May 27 2017 1:25 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

అశ్వరావుపేటలో యువహీరో సందడి!

అశ్వరావుపేటలో యువహీరో సందడి!

అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో యువ హీరో నాగశౌర్య సందడి చేశాడు. టాలీవుడ్‌ దర్శకుడు వెంకీ కుడుములకు చెందిన ఓ ఫంక్షన్‌ హాల్‌ను ప్రారంభించడానికి ఆయన శనివారం పట్టణానికి విచ్చేశాడు. నాగశౌర్య వచ్చిన విషయం తెలియడంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో కాసేపు ఇక్కడ కోలాహలం నెలకొంది.

వరుస సినిమాలతో నాగశౌర్య తన అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్చుతానంద', 'ఒక మనస్సు' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 'జ్యో అచ్చుతానంద' చిత్ర విజయంతో కాసింత విరామం తీసుకున్న నాగశౌర్య ప్రస్తుతం కొత్త దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement