గామికి సూపర్‌ హిట్‌ టాక్‌.. ఫస్ట్‌ డే ఎంతొచ్చిందంటే? | Vishwak Sen Gaami Movie First Day Box Office Collection | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల కష్టం 'గామి'.. తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే?

Published Sat, Mar 9 2024 1:10 PM | Last Updated on Sat, Mar 9 2024 1:22 PM

Vishwak Sen Gaami Movie First Day Box Office Collection - Sakshi

మైనస్‌ 25 డిగ్రీల చలిలో షూట్‌ చేశారు. వారి ప్రాణలు పణంగా పెట్టి సినిమా తీశారు. సినిమా మొత్తంలో విశ్వక్‌కు రెండు పేజీల డైలాగ్స్‌ మాత్రమే ఉన్నాయి. విశ్వక్‌కు అఘోరాగా

అన్ని సినిమాల్లోలాగా ఫైట్స్‌, డైలాగ్స్‌, సాంగ్స్‌ వంటి కమర్షియల్‌ అంశాలు ఏవీ గామి చిత్రంలో ఉండవు. ఈ సినిమాకు ఉన్న ప్రధాన బలం భావోద్వేగం. 2017లోనే ఈ కథ విన్నాడు విశ్వక్‌ సేన్‌. ఒక్క ఏడాదిలో పూర్తి చేసే చిత్రం కాదని ఆనాడే అనుకున్నాడు.  అన్నట్లుగానే సినిమా పూర్తి చేయడానికి ఐదారేళ్ల సమయం పట్టింది. ఇందులో చాందీ చౌదరి హీరోయిన్‌గా నటించగా విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వహించాడు.

తొలిరోజు కలెక్షన్స్‌ ఎంతంటే?
వి సెల్యులాయిడ్‌ సమర్పణలో కార్తీక్‌ శబరీష్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి అంతటా హిట్‌ టాక్‌ వస్తోంది. తొలి రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.9.07 కోట్లు రాబట్టింది. సినీప్రియుల ఫస్ట్‌ చాయిస్‌ గామి అంటూ చిత్రయూనిట్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ మీ ఇన్నేళ్ల కష్టం వృథా పోలేదు అని కామెంట్లు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ వసూళ్ల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు.

గామి ప్రత్యేకతలు..
ఇక గామి సినిమా కోసం చిత్రయూనిట్‌ ఎన్నో కష్టాలు పడింది. మైనస్‌ 25 డిగ్రీల చలిలో షూట్‌ చేశారు. వారి ప్రాణలు పణంగా పెట్టి సినిమా తీశారు. సినిమా మొత్తంలో విశ్వక్‌కు రెండు పేజీల డైలాగ్స్‌ మాత్రమే ఉన్నాయి. విశ్వక్‌కు అఘోరాగా మేకప్‌ వేయడానికే రెండు గంటలకు పైగా సమయం పట్టేది. ఈ సినిమాకు విశ్వక్‌ ఇంతవరకు పారితోషికం తీసుకోనేలేదు. సినిమా ఆరేళ్ల క్రితమే మొదలైంది. కానీ డైరెక్టర్‌ ఈ సినిమాపై తొమ్మిదేళ్లుగా వర్క్‌ చేయడం విశేషం.

చదవండి:  పందిలా తింటాడు.. ఇ‍ప్పటికీ నాన్న దగ్గర డబ్బులడుక్కుని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement