
కుల గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చాలా దుర్మార్గమైనదని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.
సాక్షి, వికారాబాద్: కుల గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చాలా దుర్మార్గమైనదని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. స్థానిక ఎన్నికలను తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం ఉందంటూ దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేశారు.. అది ఏమైంది?. మళ్లీ గణన ఎందుకు..? ఆ రిపోర్ట్ వాళ్లు బయట పెట్టలేదు. ఈ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి..?’’ అంటూ బండి సంజయ్ నిలదీశారు.
‘‘కుల గణన సర్వే ఫేక్. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించి తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం ఉంది. రూ.150 కోట్ల రూపాయలతో కుల గణన సర్వే అంటూ ప్రభుత్వం డైవర్షన్ చేస్తోంది. ఆనాటి సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు బయటపెట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటి..?’’ అని బండి సంజయ్ ప్రశ్నలు గుప్పించారు.
ఇదీ చదవండి: హైడ్రా బాస్‌తో భేటీ.. ఎవరీ ఆనంద్ మల్లిగవాడ్