బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు | Case File On BRS MLA Palla Rajeshwar Reddy | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు

Jun 3 2024 10:49 AM | Updated on Jun 3 2024 10:49 AM

 Case File On BRS MLA Palla Rajeshwar Reddy

జనగామ జిల్లా: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై ఎన్నికల నిబంధన ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదైంది . గత ఏడాది నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో చొరబడి ఓటర్లను మభ్యపెట్టారంటూ కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ పాటు పోలీసులకు కాంగ్రెస్ స్టేట్ యూత్ లీడర్, కాంగ్రెస్అభ్యర్థి పోలింగ్ ఏజెంట్ కొమ్మూరి ప్రశాంత్రెడ్డి ఫిర్యాదు చేశారు. కండువాతో పోలింగ్ బూత్ కి వెళ్లవద్దని ఎంత చెప్పినా వినలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

'బలవంతంగా పోలింగ్ బూత్ లోకి చొచ్చుకు వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సదరు ఫొటో ఆధారాలను జత చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు తాజాగా శనివారం కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130  ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం ఆదివారం బయటకు వచ్చింది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా కేసు నమోదైంది వాస్తవమేనని చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement