Top Stories
ప్రధాన వార్తలు

ఆక్వా కుదేలు.. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే కూటమి ప్రభుత్వం చేతులెత్తేయడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేవలం కేంద్రానికి లేఖ రాస్తే సరిపోదని.. అమెరికా టారిఫ్‌ల పేరుతో దోచుకుంటున్నవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారాయన. అక్వా రంగం సంక్షోభంలో(Aqua Sector Crisis) ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే, ఆపేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?. రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ప్రభుత్వ స్థాయిలో ఒక రివ్యూ చేసి, గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? రైతులంతా గగ్గోలు పెడితే, మీడియా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం? 100 కౌంట్ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200- 210కి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా, క్రాప్ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?చంద్రబాబుగారూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ధాన్యం, పత్తి, పొగాకు, మిర్చి, కంది, పెసలు, మినుము, అరటి, టమోటా ఇలా ప్రతి పంటకూ గిట్టూబాటు ధర లేకుండా పోయింది. దళారులు రైతుల కష్టాన్ని దోచుకుతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలను ప్రస్తావిస్తే మీ ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకుంటోంది తప్ప ఎక్కడా బాధ్యత తీసుకోవడంలేదు. ఇప్పుడు ఆక్వా విషయంలోనూ అంతే.ఎగుమతుల్లోనూ, అలాగే విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ రాష్ట్ర ఆక్వారంగం దేశంలోనే నంబర్ వన్. అలాంటి రంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని మా హయాంలో ఏర్పాటు చేశాం. ఆక్వా సీడ్, ఫీడ్ ధరలను నియంత్రించడంతోపాటు నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చాం. సిండికేట్‌గా మారి దోపిడీచేసే విధానాలకు చెక్ పెడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రొయ్యలకు ధరలు నిర్ణయించాం. కోవిడ్ సమయంలో దాదాపు ఐదేళ్ల క్రితం 100 కౌంట్‌కు, ఆ రోజుల్లో కనీస ధరగా రూ.210లు నిర్ణయించి రైతులకు బాసటగా నిలిచాం. మూడుసార్లు ఫీడ్ ధరలు తగ్గించాం. ఇప్పుడు ఫిష్ ఆయిల్, సోయాబీన్ సహా ముడిసరుకుల దిగుమతులపై సుంకం దాదాపు 15% నుంచి 5% తగ్గినా ఈ కూటమి ప్రభుత్వంలో ఫీడ్ ధరలు ఒక్కపైసా కూడా తగ్గలేదు. మేం ఏర్పాటు చేసిన నియంత్రణ బోర్డు అందుబాటులో ఉన్నాసరే రేట్లు తగ్గడంలేదు.గతంలో చంద్రబాబు హయాంలో ఆక్వాజోన్(Aqua Zone) పరిధిలో కేవలం 80-90వేల ఎకరాలు ఉంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జోన్ పరిధిలోకి 4.22 లక్షల ఎకరాలు తీసుకువచ్చాం. ఆక్వా రంగంలో మొత్తం 64వేల విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో జోన్ పరిధిలో ఉన్న 54వేల కనెక్షన్లకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందించాం. దీనికోసం రూ.3,640 కోట్లు సబ్సిడీ కింద ఖర్చుచేశాం. ఆక్వాజోన్స్‌లో ఉన్న ఆర్బీకేల్లో ఫిషరీస్ గ్రాడ్యుయేట్లను ఆక్వా అసిస్టెంట్లుగా నియమించి రైతుకు చేదోడుగా నిలిచి, ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపించాం. ఇప్పుడు ఆర్బీకే వ్యవస్థను నాశనం చేసి, అత్యధికంగా ఆర్జిస్తున్న రంగాన్ని దెబ్బతీస్తున్నారు.చంద్రబాబుగారూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి. వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి, ధరల పతనాన్ని అడ్డుకోండి. అమెరికా టారిఫ్‌ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ టారిఫ్‌లు అన్నవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు, ఇక ముందుకూడా ఇవి కొనసాగుతాయి. ఊరికే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం కాదు అని వైఎస్ జగన్ కూటమి సర్కార్‌కు హితవు పలికారు. 1.@ncbn గారూ.. ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే, ఆపేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 7, 2025

IPL 2025 RCB vs MI: ఉత్కంఠపోరులో ఆర్సీబీ విజయం
Rcb vs MI Live Updates:ఉత్కంఠపోరులో ఆర్సీబీ విజయంవాంఖడే వేదికగా ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 12 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42)క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హాజిల్ వుడ్, దయాల్ తలా రెండు వికెట్లు సాధించారు. హార్దిక్ ఔట్..తిలక్ వర్మ(56), హార్దిక్ పాండ్య(35) వికెట్లను ముంబై ఇండియన్స్ వరుస క్రమంలో కోల్పోయింది. ముంబై విజయానికి 11 బంతుల్లో 28 పరుగులు కావాలి.దూకుడుగా ఆడుతున్న తిలక్, పాండ్యా16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. తిలక్ వర్మ(46), హార్దిక్ పాండ్యా(34) దూకుడుగా ఆడుతున్నారు. ముంబై విజయానికి 24 బంతుల్లో 52 పరుగులు కావాలి.ముంబై నాలుగో వికెట్ డౌన్‌సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన సూర్యకుమార్.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(30), హార్దిక్ పాండ్యా(0) ఉన్నారు.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విల్ జాక్స్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 52/25 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో విల్ జాక్స్(13), సూర్యకుమార్ యాదవ్(5) ఉన్నారు.ముంబై రెండో వికెట్ డౌన్..ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన రికెల్టన్.. జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై..222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. 17 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది.ముంబై ముందు భారీ టార్గెట్‌వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(67), రజిత్ పాటిదార్(64) హాఫ్ సెంచరీలు సాధించగా.. పడిక్కల్(37), జితేష్ శర్మ(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించగా.. విఘ్నేష్ ఒక్క వికెట్ పడగొట్టారు.ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్..లివింగ్ స్టోన్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే లివింగ్ స్టోన్ పెవిలియన్‌కు చేరాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.ఆర్సీబీ మూడో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్‌విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. నిలకడగా ఆడుతున్న విరాట్, పాటిదార్13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(60), పాటిదార్(19) ఉన్నారు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్..దేవ్‌దత్త్ పడిక్కల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన పడిక్కల్.. విఘ్నేష్ పుత్తార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి తన హాఫ్ సెంచరీ మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. 53 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న కోహ్లి..విరాట్ కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు. 25 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లితో పాటు పడిక్కల్(13) ఉన్నారు.ఆర్సీబీకి భారీ షాక్.. సాల్ట్ ఔట్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), పడిక్కల్(4) ఉన్నారు.ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ తిరిగి తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్, జస్ప్రీత్ బుమ్రా

యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ అత్యున్నత న్యాయం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా నమోదు చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. యూపీలో చట్టాన్ని అతిక్రమించే చర్యలే ప్రతిరోజూ కనిపిస్తున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తి తాను తిరిగి తీసుకున్న నగదును ఇవ్వకపోవడంతో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు. ఈ కేసులో సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో అసలు యూపీలో ఏం జరుగుతుందని సూటిగా ప్రశ్నించింది సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్శనాథన్‌లతో కూడిన ధర్మాసనం.‘ఇదొక సివిల్ కేసు.. దీన్ని క్రిమినల్ కేసు కింద ఎందుకు ఫైల్ చేశారు. యూపీ పోలీసుల తీరు ఎంతమాత్రం సహేతుకం కాదు. సివిల్ నేపథ్యం ఉన్న కేసుల్ని క్రిమినల్ కేసుగా ఎందుకు మార్చి రాశారు. చట్ట ప్రకారం ఇది సరైనది కాదు. ఒక మనిషి దగ్గర తీసుకున్న డబ్బును తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వలేని పక్షంలో అది క్రిమినల్ కేసులోకి రాదు యూపీలో ప్రతీరోజూ చాలా వరకూ ఈ తరహా కేసులే కనిపిస్తున్నాయి. సివిల్ కేసుల్ని తీసుకొచ్చి క్రిమినల్ కేసుల కింద ఎలా ఫైల్ చేస్తారు. ఇది కంప్లీట్ గా చట్టాన్ని అతిక్రమించడమే’ అని ధర్మాసనం చురకలు అంటించింది. ఇదీ చదవండి: మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు

‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రకటించిన టారిఫ్‌లను తట్టుకోవడానికి చాలా మంది ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతుంటే, వారెన్ బఫెట్ మాత్రం అమెరికా స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగిస్తున్నారు. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జుకర్ బర్గ్, బెర్నార్డ్ అర్నాల్ట్ వంటి వారు వందల బిలియన్ డాలర్లు నష్టపోయారు. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లలో ట్రిలియన్ డాలర్లు ఆవిరైనా బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్ మాత్రం తన కంపెనీలో పెట్టుబడులతో బఫెట్ లాభాలను ఆర్జిస్తూనే ఉన్నారు.ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఇప్పటివరకు 184 దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా వాల్ స్ట్రీట్ విలువ దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల మేర క్షీణించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లు దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2020 మార్చిలో కోవిడ్ -19 మహమ్మారి తర్వాత ఇదే అత్యంత భారీ పతనం. అయితే ఈ ట్రెండ్ బఫెట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ ఏడాది ఆయన తన సంపదకు 12.7 బిలియన్ డాలర్లు జోడించారు. ప్రస్తుతం బఫెట్ సంపద 155 బిలియన్ డాలర్లుగా ఉంది.ముందస్తు ఆలోచనలతోనే.. బఫెట్ పతనం కాకుండా ఉండటానికి కొన్ని గణనాత్మక చర్యలు తీసుకున్నారు. బహుశా మార్కెట్ తిరోగమనం సంభవిస్తుందనే అంచనాతో ఆయన భారీ కొనుగోళ్లలో నగదును మదుపు చేయడం మానేశారు. 2024లో బుల్ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్న సమయంలో బఫెట్ కంపెనీ ఈక్విటీల్లో 134 బిలియన్ డాలర్లను విక్రయించి 334 బిలియన్ డాలర్ల నగదుతో ఏడాదిని ముగించింది.తన తోటి ఇన్వెస్టర్లు ఎదురుగాలులతో ఇబ్బందులు పడుతున్నప్పుడే బఫెట్ మెల్లగా యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి యూఎస్ టెక్ స్టాక్స్‌లో పెట్టుబడులను తగ్గించడం ద్వారా సాహసోపేతమైన చర్య తీసుకున్నారు. మరోవైపు జపాన్ ట్రేడింగ్ దిగ్గజాలపై మాత్రం ఆయన పెట్టుబడులు రెట్టింపు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో బఫెట్ జపాన్‌లోని ఐదు అతిపెద్ద వాణిజ్య సంస్థలైన మిట్సుయి, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు, మరుబెనిలలో తన వాటాను పెంచుకున్నారు.రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, బెర్క్‌షైర్ ఇప్పుడు మిత్సుయి అండ్ కోలో 9.82 శాతం, మిత్సుబిషి కార్ప్‌లో 9.67 శాతం, సుమిటోమో కార్ప్‌లో 9.29 శాతం, ఇటోచు కార్ప్‌లో 8.53 శాతం, మరుబెని కార్ప్‌లో 9.30 శాతం వాటాలను కలిగి ఉంది. ఈ పెట్టుబడులు బెర్క్ షైర్ హాత్వే మార్కెట్ క్యాప్ ను 1.14 ట్రిలియన్ డాలర్లకు మించి, టెస్లా వంటి అగ్రశ్రేణి కంపెనీలను అధిగమించేలా చేశాయి.

ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు.. ఆసియా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. అయినా కూడా వాణిజ్య సుంకాల విషయంలో తన నిర్ణయమే కరెక్ట్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ‘‘సవరించేదే లే..’’ అని భీష్మించుకుని కూర్చున్నారు. అయితే అమెరికా సహా ప్రపంచ దేశాల మార్కెట్లు కుదేలు అవుతున్న వేళ తాజాగా మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారాయన. వాషింగ్టన్: ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald rump) తోసిపుచ్చారు. ట్రూత్ సోషల్‌లో ఆయన చేసిన తాజా పోస్ట్ సారాంశం.. ‘‘ చమురు ధరలు తగ్గాయి, వడ్డీ రేట్లు తగ్గాయి. ఆహార పదార్థాల ధరలూ తగ్గాయి. కాబట్టి ద్రవ్యోల్బణం లేదు. చాలాకాలంగా అన్యాయానికి గురైన అమెరికా, ప్రతీకార సుంకాల ద్వారా సంబంధిత దేశాల నుంచి బిలియన్ల డాలర్లు తీసుకు వస్తోందని అన్నారాయన. అన్నింటికంటే.. అతిపెద్ద దుర్వినియోగదారు దేశమైన చైనా(China) మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి, ఆ దేశంపై సుంకాలను 34% పెంచినప్పటికీ.. ప్రతీకారానికి దిగొద్దన్న నా హెచ్చరికను పట్టించుకోలేదు. అమెరికా గత నాయకుల వల్లే దశాబ్దాలుగా వాళ్లు అడ్డగోలుగా సంపాదించున్నారు. ఇక.. అమెరికాను మళ్ళీ గొప్పగా తీర్చిదిద్దండి! అని పోస్ట్ చేశారాయన. ఇదిలా ఉంటే.. అమెరికా వేసిన సుంకాలకు దీటుగా స్పందించిన చైనా (China) అక్కడి నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా (USA) విధించిన సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని చైనా ఆరోపించింది. ఏకపక్షంగా, ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొంది. ఈ క్రమంలో.. వాషింగ్టన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం టారిఫ్‌లను (US tariffs) విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులకు ఇది వర్తిస్తుందని, ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయని చైనాకు చెందిన ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. ఈ పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. చైనా భయపడిందని, తప్పు నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘చైనా తప్పిదం చేసింది. వాళ్లు భయాందోళనకు గురయ్యారు. వారికి మరో మార్గం లేదు’’ అని అన్నారాయన.

హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
హైదరాబాద్: హెచ్‌సీయూవిద్యార్థులపై నమోదు చేసిన కేసులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నీర్ణయం తీసుకుంది. హెచ్ సీయూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులపై ఏ కేసులు అయితే నమోదయ్యాయో వాటిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై హెచ్ సీయూ విద్యార్థులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కంచ భూముల్ని అభివృద్ధి పేరుతో విక్రయిస్తే ఊరుకోబోమంటూ తెలంగాణ సర్కారును హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం చేపట్టబోతున్న చర్యలను కొన్ని రోజుల క్రితం అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారిపై కేసులు నమోదయ్యాయి. వీటిని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ఈరోజు(సోమవారం) స్పష్టం చేయడంతో విద్యార్థులకు ఊరట లభించింది.మంత్రుల కమిటీ సమావేశంలో నిర్ణయంHCU కంచె గచ్చిబౌలి సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సెక్రటేరియట్ లోసమావేశమైంది. ఈ భేటీలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ నటరాజన్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి యూనివర్శిటీస్ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు. ఈ మేరకు పలు విజ్ఞప్తులు చేశారు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు. ఇందులో విద్యార్థులపై కేసులతో పాటు యూనివర్శటీ క్యాంపస్ నుంచి పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకుంది ప్రభుత్వం. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది.ఇదిలా ఉంచితే, కంచ భూముల వ్యహహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఇటీవల కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే.. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.

సచిన్ మెచ్చిన గుమ్మడికాయ చికెన్ కర్రీ..! ఉబ్బితబ్బిబైన మాస్టర్ చెఫ్
మనం ఎంతో ఇష్టపడే వ్యక్తులను కలిసినా..వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దొరికినా..ఎంతో ఖుషీగా ఫీలవుతాం. అలాంటిది మనం కలలో కూడా కలిసే అవకాశం లేని ఓ ప్రముఖ సెలబ్రిటీ లేదా క్రికెట్‌స్టార్ లాంటి వాళ్లైతే ఇక ఆ మధుర క్షణాలు జన్మలో మర్చిపోం. మళ్లీ మళ్లీ ఆ క్షణాలు కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. అలాంటి అరుదైన అనుభవమే ఈ మాస్టర్ చెఫ్‌కి ఎదురైంది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్ని కలిసే అవకాశం రావడమే కాదు, అతనికి తన ప్రాంతం వంటకాలను రుచి చూపించే ఛాన్స్‌కొట్టేసింది. అసలు తాను ఇలాంటి ఓ అద్భుతం జరుగుతుందని ఎన్నడు అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబవుతోందామె. ఆ చెఫ్ మేఘాలయకి చెందిన నంబీ మారక్. ఆమె మాస్టర్ చెఫ్ రన్నరప్ కూడా. ఆమె షిల్లాంగ్‌లోని తన ఇంటి గోడలపై సచిన్ టెండూల్కర్ పోస్టర్లను చూస్తూ పెరింగింది. అలాంటి ఆమెకు అనుకోని అవకాశం వరంలా వచ్చిపడింది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తమ రాష్ట్రాన్ని పర్యటించడానికి రావడం ఓ ఆశ్చర్యం అయితే..ఆయనకు స్వయంగా తన చేతి వంటే రుచిచూపించడం మరో విశేషం. చెఫ్ నంబీ సచిన్‌కి తన ప్రాంత గారో సంప్రదాయ వంటకాలతో ఆతిధ్యం అందించింది. తన క్రికెట్ హీరోకి వండిపెట్టే ఛాన్స్ దొరికిందన్న సంబరంతో..ఎంతో శ్రద్ధపెట్టి మరీ వెజ్, నాన్‌వెజ్ వంటకాలను తయారు చేసింది. అవన్నీ ఇంటి వంటను మరిపించేలా రుచికరంగా సర్వ్ చేసింది. ఆ రెసిపీలలో.. వెటెపా (అరటి ఆకులలో ఉడికించిన మృదువైన చేప), కపా అండ్ గారో, గుమ్మడికాయ చికెన్(డూ'ఓ గోమిండా)..పితా అనే స్టిక్కీ రైస్ తదితరాలను అమిత ఇష్టంగా ఆరగించాడు సచిన్. వాటిన్నింటిలో సచిన్ మనసును మెప్పించని వంటకం మాత్రం గుమ్మడికాయ చికెన్ కర్రీనే కావడం విశేషం. ఇక చివరగా చెఫ్ నంబీ మాట్లాడుతూ.."గారో వంటకాలు కేవలం ఆహారం మాత్రమే కాదు. ఇవి మా ప్రాంతంలోని ఒక్కో ఇంటి సంప్రదాయానికి సంబంధించిన ప్రసిద్ధ వంటకాలు. ఈ రెసిపీలని నిప్పుల మీద ఎంతో శ్రమ కోర్చి వండుతారు. అలాంటి అపురూపమైన వంటకాలను నా కిష్టమైన క్రికెటర్ సచిన్‌కి వండిపెట్టడం ఓ కలలా ఉంది. నిజంగా ఇది ఓ ట్రోఫీ గెలిచిన దానికంటే ఎక్కువ. "అని ఆనందపారవశ్యంతో తడిసిముద్దవుతోంది చెఫ్ నంబీ.(చదవండి: World Health Day: వ్యాధులకు చెక్‌పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!)

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు!
హైదరాబాద్: దక్షిణ మధ్య బంగాళాఖాతాంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు బీహార్ నుంచి ఈశాన్య జార్ఖండ్, చత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఫలితంగా వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణంహైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఈరోజు(సోమవారం) హైదరాబాద్ తో పాటు మహబూర్ నగర్, మేడ్చల్, మల్కాజగిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇక భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రేపు(మంగళవారం) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉంది.

స్టాక్‌మార్కెట్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
పాట్నా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మార్కెట్లపై(భారత్ సహా) ప్రతికూల ప్రభావం చూపెడుతున్నాయి. ఇవాళ కూడా దేశీయ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్‌పై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi On Stock Market) కీలక వ్యాఖ్యలు చేశారు.స్టాక్ మార్కెట్(StockMarket)లో డబ్బు అపరిమితంగా సృష్టించబడుతుందని, అయితే అది అందరికీ లాభం చేకూర్చదని అన్నారాయన. సోమవారం పాట్నా(బీహార్)లో సంవిధాన్ సురక్షా సమ్మేళన్ పేరిట జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారాయన.అమెరికా అధ్యక్షుడి(US President) నిర్ణయం.. మన స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తోంది. మన దేశంలో ఒక శాతం కంటే తక్కువ మందే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెడుతున్నారు. అంటే.. ఇది అందరి కోసం కాదని అర్థం. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడం అనేది ఓ భ్రమ. ప్రత్యేకించి.. యువత స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండండి అని రాహుల్ గాంధీ సందేశం ఇచ్చారు.#WATCH | Patna, Bihar | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The US president has led to a tumble in the stock market. Less than 1% of the people here have their money invested in the stock market, which means the stock market is not a field for you. Unlimited money… pic.twitter.com/UNhSIHV4mv— ANI (@ANI) April 7, 2025

'పెద్ది' సిక్సర్‌తో.. పుష్ప2, దేవర రికార్డ్స్ గల్లంతు
మెగా హీరో రామ్ చరణ్ కొట్టిన సిక్సర్‌తో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ గల్లంతు అయ్యాయి. తాజాగా విడుదలైన 'పెద్ది' గ్లింప్స్‌కు షోషల్‌మీడియా షేక్ అయిపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుంది. ఫస్ట్ షాట్‌తోనే సినీ అభిమానులను రామ్‌చరణ్ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల గ్లింప్స్‌కు వచ్చిన వ్యూస్ విషయంలో దేవర (26.17 మిలియన్లు) టాప్‌లో ఉంది. ఇప్పుడు పెద్ది సినిమా గ్లింప్స్ ఆ రికార్డ్‌ను దాటేసింది. 24గంటల్లోనే ఏకంగా 30.6 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపింది. ఇప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న అన్ని సినిమాల గ్లింప్స్ రికార్డ్స్‌ను పెద్ది దాటేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. తప్పకుండా పెద్ది సినిమాతో భారీ హిట్ కొడుతున్నామని వారు పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. టాలీవుడ్లో పెద్ది గ్లింప్స్ టాప్-1లో ఉంటే.. ఇండియాలో టాక్సిక్ (36 మిలియన్లు)తో టాప్-1లో ఉంది.'పెద్ది' హిందీ గ్లింప్స్ విడుదల.. డబ్బింగ్ ఎవరంటే..?పెద్ది సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా హిందీ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. హందీ వర్షన్లో తన పాత్రకు డబ్బింగ్ స్వయంగా చెప్పుకున్నారు. ఈ గ్లింప్స్ నుంచి ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది.టాలీవుడ్ టాప్ (గ్లింప్స్) చిత్రాలుపెద్ది (30.6 మిలియన్లు)దేవర (28.7 మిలియన్లు)పుష్ప2 (27.11 మిలియన్లు)ఓజీ (27 మిలియన్లు)కల్కి (23.16 మిలియన్లు)గుంటూరు కారం (21.12 మిలియన్లు)ది ప్యారడైజ్ (17.12 మిలియన్లు)
IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌కు భారీ షాక్
ఇంటిమేట్ సీన్స్.. ఆ ఫీలింగ్ ఉండకూడదు: బాలీవుడ్ హీరోయిన్
సైలెంట్ ఎపిడెమిక్: లక్షణాలు కనిపించకున్నా లక్షల మందిలో..
‘నేను ప్రజలకు కాపలా కుక్కను.. నీలాగా గుంట నక్కను కాదు’
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
...సూపర్ సిక్స్ సార్!
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
మొక్కజొన్న మెషీన్లో పడి మహిళ దుర్మరణం
ప్రాణాలు తీస్తున్న సరదా
తెలుగబ్బాయికి నిరాశ.. 'ఇండియన్ ఐడల్' విజేతగా మానసి
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
ఏఐ కాద్సార్! నిజం జింకే!!
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్
పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన ఐసీసీ.. పది రోజుల్లో ఇది మూడోసారి
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
ఆక్వా కుదేలు.. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం?: వైఎస్ జగన్
విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
మీడియాపై ఊగిపోయిన సీఎం చంద్రబాబు
బెంగళూరులో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు!
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
'పెద్ది' సిక్సర్‌తో.. పుష్ప2, దేవర రికార్డ్స్ గల్లంతు
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
సినిమాల్లోకి స్టార్ హీరోయిన్ కూతురు.. ‘ఎంట్రీ’ కోసం ఎన్ని కష్టాలో..!
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా
సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌కు భారీ షాక్
చెట్లు కుములుతున్న దృశ్యం
తల్లీకొడుకు... యాక్షన్
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
నీట్‌ను ఎందుకు రద్దు చేయలేదు?.. సుప్రీం కోర్టుకు దీదీ సూటి ప్రశ్న
World Health Day: వీళ్ల ఆరోగ్యమే.. దేశానికి మహాభాగ్యం!
హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
సచిన్ మెచ్చిన గుమ్మడికాయ చికెన్ కర్రీ..! ఉబ్బితబ్బిబైన మాస్టర్ చెఫ్
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
IPL 2025: నిబంధనలు ఉల్లంఘించిన ఇషాంత్ శర్మ.. భారీ జరిమానా
అనర్హులతో అడ్డగోలుగా మూల్యాంకనం!
స్టాక్‌మార్కెట్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ఇక్కడా తీసేశారు.. కాంట్రవర్సీ వీడియో సాంగ్ రిలీజ్
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా
రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన ధోని
వడ్డీ రేట్ల కోతపై ఆశలు
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
ఇంటిమేట్ సీన్స్.. ఆ ఫీలింగ్ ఉండకూడదు: బాలీవుడ్ హీరోయిన్
రాముడి పాత్ర చేసిన తొలి తెలుగు హీరో ఎవరో తెలుసా?
IPL 2025 RCB vs MI: ఉత్కంఠపోరులో ఆర్సీబీ విజయం
రేవంత్ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?
కల్లుతాగి 100 మందికి పైగా అస్వస్థత.. వింత ప్రవర్తన
'గుడ్ బ్యాడ్ అగ్లీ' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
బుల్లితెరపై పుష్పరాజ్.. ఏ ఛానెల్.. ఎన్ని గంటలకో తెలుసా?
'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ధనుష్‌తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్ పోస్ట్ వైరల్!
నేటి నుంచి 1–9 తరగతుల పరీక్షలు ప్రారంభం
చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?
అందుకే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రాలేదు: సీఎం స్టాలిన్
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
పుష్పక్ బస్సుల్లో రూట్ పాస్‌లు
రుణ వేధింపులకు చెక్ పెడదాం..!
IPL 2025, MI VS RCB: భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లి
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
జాబిలమ్మ నీకు అంత కోపమా.. సినిమా రివ్యూ
రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్..
ఓటీటీలో కోర్ట్ సినిమా.. అఫీషియల్ ప్రకటన
అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?
కొత్త ఇల్లు.. కొత్త ట్రెండ్..
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపే తీర్పు
తారక్ కి ప్రేమతో.. సుకుమార్ ఇంట్లో ఎన్టీఆర్
సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు
ఏదో ఒకరోజు వస్తామంటారు.. ఏ రోజు వస్తారో తెలియదు!
‘ఆదాయం లేకుండా జీడీపీ ఎలా పెరిగింది చంద్రబాబు?
గతేడాది కంటే మరింత పాతాళానికి..
బాబోయ్ ఈ–స్కూటర్లు!
నువ్వు అందంగా ఉన్నావు...
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
వివాహేతర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం
IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌కు భారీ షాక్
ఇంటిమేట్ సీన్స్.. ఆ ఫీలింగ్ ఉండకూడదు: బాలీవుడ్ హీరోయిన్
సైలెంట్ ఎపిడెమిక్: లక్షణాలు కనిపించకున్నా లక్షల మందిలో..
‘నేను ప్రజలకు కాపలా కుక్కను.. నీలాగా గుంట నక్కను కాదు’
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
...సూపర్ సిక్స్ సార్!
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
మొక్కజొన్న మెషీన్లో పడి మహిళ దుర్మరణం
ప్రాణాలు తీస్తున్న సరదా
తెలుగబ్బాయికి నిరాశ.. 'ఇండియన్ ఐడల్' విజేతగా మానసి
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
ఏఐ కాద్సార్! నిజం జింకే!!
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్
పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన ఐసీసీ.. పది రోజుల్లో ఇది మూడోసారి
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
ఆక్వా కుదేలు.. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం?: వైఎస్ జగన్
విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
మీడియాపై ఊగిపోయిన సీఎం చంద్రబాబు
బెంగళూరులో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు!
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
'పెద్ది' సిక్సర్‌తో.. పుష్ప2, దేవర రికార్డ్స్ గల్లంతు
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
సినిమాల్లోకి స్టార్ హీరోయిన్ కూతురు.. ‘ఎంట్రీ’ కోసం ఎన్ని కష్టాలో..!
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా
సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌కు భారీ షాక్
చెట్లు కుములుతున్న దృశ్యం
తల్లీకొడుకు... యాక్షన్
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
నీట్‌ను ఎందుకు రద్దు చేయలేదు?.. సుప్రీం కోర్టుకు దీదీ సూటి ప్రశ్న
World Health Day: వీళ్ల ఆరోగ్యమే.. దేశానికి మహాభాగ్యం!
హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
సచిన్ మెచ్చిన గుమ్మడికాయ చికెన్ కర్రీ..! ఉబ్బితబ్బిబైన మాస్టర్ చెఫ్
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
IPL 2025: నిబంధనలు ఉల్లంఘించిన ఇషాంత్ శర్మ.. భారీ జరిమానా
అనర్హులతో అడ్డగోలుగా మూల్యాంకనం!
స్టాక్‌మార్కెట్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ఇక్కడా తీసేశారు.. కాంట్రవర్సీ వీడియో సాంగ్ రిలీజ్
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా
రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన ధోని
వడ్డీ రేట్ల కోతపై ఆశలు
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
ఇంటిమేట్ సీన్స్.. ఆ ఫీలింగ్ ఉండకూడదు: బాలీవుడ్ హీరోయిన్
రాముడి పాత్ర చేసిన తొలి తెలుగు హీరో ఎవరో తెలుసా?
IPL 2025 RCB vs MI: ఉత్కంఠపోరులో ఆర్సీబీ విజయం
రేవంత్ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?
కల్లుతాగి 100 మందికి పైగా అస్వస్థత.. వింత ప్రవర్తన
'గుడ్ బ్యాడ్ అగ్లీ' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
బుల్లితెరపై పుష్పరాజ్.. ఏ ఛానెల్.. ఎన్ని గంటలకో తెలుసా?
'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ధనుష్‌తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్ పోస్ట్ వైరల్!
నేటి నుంచి 1–9 తరగతుల పరీక్షలు ప్రారంభం
చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?
అందుకే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రాలేదు: సీఎం స్టాలిన్
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
పుష్పక్ బస్సుల్లో రూట్ పాస్‌లు
రుణ వేధింపులకు చెక్ పెడదాం..!
IPL 2025, MI VS RCB: భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లి
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
జాబిలమ్మ నీకు అంత కోపమా.. సినిమా రివ్యూ
రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్..
ఓటీటీలో కోర్ట్ సినిమా.. అఫీషియల్ ప్రకటన
అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?
కొత్త ఇల్లు.. కొత్త ట్రెండ్..
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపే తీర్పు
తారక్ కి ప్రేమతో.. సుకుమార్ ఇంట్లో ఎన్టీఆర్
సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు
ఏదో ఒకరోజు వస్తామంటారు.. ఏ రోజు వస్తారో తెలియదు!
‘ఆదాయం లేకుండా జీడీపీ ఎలా పెరిగింది చంద్రబాబు?
గతేడాది కంటే మరింత పాతాళానికి..
బాబోయ్ ఈ–స్కూటర్లు!
నువ్వు అందంగా ఉన్నావు...
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
వివాహేతర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం
సినిమా

ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళ సినిమాలు అనగానే సింపుల్ స్టోరీలే గుర్తొస్తాయి. కానీ ఈ మధ్య వీళ్లు కూడా రూట్ మార్చి యాక్షన్ మూవీస్ తీస్తున్నారు. గతేడాది చివర్లో మార్కో, రీసెంట్ టైంలో ఎల్ 2 ఎంపురాన్ చిత్రాలు ఈ కోవకే చెందినవే. ఈ తరహా కథతో తీసిన మరో మలయాళ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దావీద్'(Daveed Movie). ఓ ఫెయిల్యర్ బాక్సర్ నేపథ్యంగా తీసిన ఈ మూవీకి మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కాగా.. దాదాపు రెండు నెలల తర్వాత అంటే ఏప్రిల్ 11 నుంచి ఓటీటీలోకి (Ott Movie) వచ్చేస్తోంది. ఈమేరకు జీ5 సంస్థ అధికారికంగా ప్రకటించింది. (ఇదీ చదవండి: విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా)దావీద్ విషయానికొస్తే.. భార్య సంపాదనపై బతికే అబు (ఆంటోనీ వర్గీస్).. కూతురితో రోజూ కాలక్షేపం చేస్తూ బతికేస్తుంటాడు. అప్పుడప్పుడు బౌన్సర్ గా పనిచేస్తుంటాడు. ఓరోజు అలానే బాక్సింగ్ ఈవెంట్ కి వెళ్తే.. అబుని ఓ బాక్సర్ ఒక్క పంచ్ గుద్దుతాడు. పోటీకి రమ్మని సవాలు విసురుతాడు. దీంతో అబు.. బాక్సర్ ట్రైనింగ్ తీసుకుంటాడు. తర్వాత ఏమైందనేదే స్టోరీ.ప్రస్తుతానికి మలయాళంలో మాత్రం స్ట్రీమింగ్ ఉండొచ్చని ప్రకటించారు. కానీ రీసెంట్ టైంలో రిలీజైన పలు చిత్రాల తెలుగు వెర్షన్ కూడా హడావుడి లేకుండా తీసుకొచ్చేస్తున్నారు. దావీద్ కూడా తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా)

సిల్క్ డ్రస్సులో శ్రుతి హాసన్.. ట్రిప్ వేసిన సితార!
రోమ్ లో చక్కర్లు కొట్టేస్తున్న నమ్రత-సితారపెళ్లి కూతురిలా ముస్తాబైన నటి వరలక్ష్మీ శరత్ కుమార్అందంగా కనిపిస్తూ కాక రేపుతున్న శ్రుతిహాసన్దుబాయిలో షికారు చేస్తున్న దేవుళ్లు పాప నిత్యాశెట్టిచీరలో అప్సరసలా మెరిసిపోతున్న అదితీ రావ్ హైదరీయోగా నేర్పించేస్తున్న బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టిమెట్లపై కూర్చుని సుందరాంగిలా రీతూ పోజులు View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Nitya Shetty (@nityashettyoffl) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar)

సోనూ సూద్ భార్యకు ప్రమాదం.. అభిమానులకు హీరో సందేశం
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. పలు సినిమాల్లో సహాయ నటుడు, విలన్ పాత్రలతో మెప్పించారు. సోనూసూద్ ప్రస్తుతం హిందీలో మాత్రమే మూవీస్ చేస్తున్నాడు. తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తున్నారు.అయితే ఇటీవల సోనూ సూద్ భార్య సోనాలి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సోనాలితో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ నేపథ్యంలో అభిమానుల కోసం సోనూ సూద్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇటీవల నా భార్యకు యాక్సిడెంట్ జరిగిన విషయం మీకు కూడా తెలుసని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కారులో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. సీట్ బెల్ట్ లేకపోతే.. మీరు మీ కుటుంబాన్ని కోల్పోయినట్లే అని సోనూ సూద్ తెలిపారు. మీరు వెనుక సీటులో కూర్చున్నప్పటికీ కూడా సీట్ బెల్ట్ ధరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood)

జాక్ ట్రైలర్లో బూతులు.. సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంటే?
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం జాక్. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా జాక్ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. అయితే ట్రైలర్లో ఎక్కువగా బూతులు వినియోగించడంతో సెన్సార్ విషయంలో ఇబ్బందులు రావొచ్చని ఊహించారు. కానీ ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ పూర్తియినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. The equation is set 😎The chaos is calculated 🤟🏻#JACK certified 𝐔/𝐀 Rounding off the entertainment in the most explosive way ❤️🔥Bookings are now open 🎟️ https://t.co/6uRbOx5ekl#JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @Prakashraaj #AchuRajamani… pic.twitter.com/9DbOmDuqb3— SVCC (@SVCCofficial) April 7, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు
క్రీడలు

IPL 2025 RCB vs MI: ఉత్కంఠపోరులో ఆర్సీబీ విజయం
Rcb vs MI Live Updates:ఉత్కంఠపోరులో ఆర్సీబీ విజయంవాంఖడే వేదికగా ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 12 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42)క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హాజిల్ వుడ్, దయాల్ తలా రెండు వికెట్లు సాధించారు. హార్దిక్ ఔట్..తిలక్ వర్మ(56), హార్దిక్ పాండ్య(35) వికెట్లను ముంబై ఇండియన్స్ వరుస క్రమంలో కోల్పోయింది. ముంబై విజయానికి 11 బంతుల్లో 28 పరుగులు కావాలి.దూకుడుగా ఆడుతున్న తిలక్, పాండ్యా16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. తిలక్ వర్మ(46), హార్దిక్ పాండ్యా(34) దూకుడుగా ఆడుతున్నారు. ముంబై విజయానికి 24 బంతుల్లో 52 పరుగులు కావాలి.ముంబై నాలుగో వికెట్ డౌన్‌సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన సూర్యకుమార్.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(30), హార్దిక్ పాండ్యా(0) ఉన్నారు.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విల్ జాక్స్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 52/25 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో విల్ జాక్స్(13), సూర్యకుమార్ యాదవ్(5) ఉన్నారు.ముంబై రెండో వికెట్ డౌన్..ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన రికెల్టన్.. జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై..222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. 17 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది.ముంబై ముందు భారీ టార్గెట్‌వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(67), రజిత్ పాటిదార్(64) హాఫ్ సెంచరీలు సాధించగా.. పడిక్కల్(37), జితేష్ శర్మ(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించగా.. విఘ్నేష్ ఒక్క వికెట్ పడగొట్టారు.ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్..లివింగ్ స్టోన్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే లివింగ్ స్టోన్ పెవిలియన్‌కు చేరాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.ఆర్సీబీ మూడో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్‌విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. నిలకడగా ఆడుతున్న విరాట్, పాటిదార్13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(60), పాటిదార్(19) ఉన్నారు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్..దేవ్‌దత్త్ పడిక్కల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన పడిక్కల్.. విఘ్నేష్ పుత్తార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి తన హాఫ్ సెంచరీ మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. 53 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న కోహ్లి..విరాట్ కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు. 25 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లితో పాటు పడిక్కల్(13) ఉన్నారు.ఆర్సీబీకి భారీ షాక్.. సాల్ట్ ఔట్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), పడిక్కల్(4) ఉన్నారు.ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ తిరిగి తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్, జస్ప్రీత్ బుమ్రా

కోహ్లి, రోహిత్ కాదు.. వారితోనే ఆడాలని ఉంది: ఎంఎస్ ధోని
ఎంఎస్ ధోని.. భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా, ఆటగాడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. టీమిండియాకు కెప్టెన్‌గా మూడు ఐసీసీ టైటిల్స్‌ను అందించిన ఘనత అతడిది. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి, ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మిస్టర్ కూల్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ధోని తాజాగా రాజ్ షమానీ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ధోనికి హోస్ట్ నుంచి ఓ ఆసక్తికరమైన ప్రశ్నఎదురైంది. తన ఆల్ టైమ్ ప్లేయింగ్‌ను ఎంచుకోమని అతడిని అడిగారు. అందుకు ధోని తక్షణమే తిరస్కరించాడు. బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోపోయినప్పటికి, ఎప్పటికీ తను కలిసి ఆడడానికి ఇష్టపడే నలుగురు ఆటగాళ్లను మాత్రం ధోని షార్ట్‌లిస్ట్ చేశాడు. మాజీ లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ, దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేర్లను ధోని ఎంచుకున్నాడు. అయితే ధోని ఎంచుకున్న ఈ నలుగురు ప్లేయర్లలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పేర్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లి ప్రస్తుతం ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ధోని కెప్టెన్సీలో విరాట్ ఓంటి చేత్తో ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. అయినప్పటికి ధోని మాత్రం తన ఎంపిక అత్యుత్తమ నలుగురు ఆటగాళ్లలో చోటు ఇవ్వలేదు. అదేవిధంగా ఇదే ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురుంచి వస్తున్న వార్తలపై ధోని స్పందించాడు. "నేను ఇంకా ఐపీఎల్లో ఆడుతున్నా. ప్రతీ ఏడాది సమీక్షించకున్నాకే ఐపీఎల్లో పాల్గోంటున్నాను. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. ఈ జూలై నాటికి నాకు 44 ఏళ్లు వస్తాయి. తదుపరి సీజన్ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాకు 10 నెలల సమయం ఉంది. నా రిటైర్మెంట్ ఎప్పుడు అని నిర్ణయించేది నేను కాదు.. నా శరీరం. నా శరీరం సహకరిస్తోందనపిస్తే కచ్చితంగా వచ్చే ఏడాది కూడా ఆడుతా" అని రాజ్ షమానీ పాడ్ కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ధోని తన మార్క్‌ను చూపించలేకపోయాడు. 4 మ్యాచ్‌లు ఆడి కేవలం 76 పరుగులు మాత్రమే చేశాడు.

ఆఖరిసారిగా అప్పుడే బాగా ఏడ్చాను: శ్రేయస్ అయ్యర్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ టీమిండియా సొంతం కావడంలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ది కీలక పాత్ర. ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఐదు మ్యాచ్‌లలోనూ అద్భుత ఆట తీరుతో రాణించి.. జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. ఈ వన్డే టోర్నీలో మొత్తంగా 243 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.తుదిజట్టులో చోటు కరువు?అయితే, ఈ మెగా ఈవెంట్‌కు ముందు శ్రేయస్ అయ్యర్‌కు తుదిజట్టులో చోటు దక్కే పరిస్థితే లేదు. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్ (Ind vs Eng ODIs)తో స్వదేశంలో టీమిండియా మూడు వన్డేలు ఆడగా.. తొలి మ్యాచ్‌కు విరాట్ కోహ్లి గాయం వల్ల దూరమయ్యాడు. ఫలితంగా శ్రేయస్ అతడి స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు.ఇక అప్పటి నుంచి అతడికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస మ్యాచ్‌లలో బ్యాట్ ఝులిపించి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించాడు. ఇక ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. భారత జట్టు మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్ (Dubai)లో ఆడిన విషయం తెలిసిందే. అయితే, తొలి మ్యాచ్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ బాగా ఏడ్చాడట. ఇందుకు గల కారణాన్ని అతడు తాజాగా వెల్లడించాడు.ఆఖరిసారిగా అప్పుడే బాగా ఏడ్చానుక్యాండిడ్ విత్ కింగ్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను చివరగా ఏడ్చిన సందర్భం అంటే.. చాంపియన్స్ ట్రోఫీ అప్పుడే. మొదటి ప్రాక్టీస్ సెషన్లో నేను సరిగ్గా ఆడలేకపోయాను. దాంతో ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నాను.అంతేకాదు.. నా మీద నాకు అంతులేని కోపం వచ్చింది. నిజానికి సాధరణంగా నేను అస్సలు ఏడ్వను. కానీ అప్పుడు ఎందుకు అంతలా బాధపడ్డానో నాకే తెలియదు. ఒక్కోసారి నాకు ఇది షాకింగ్‌గా అనిపిస్తుంది.అంతకు ముందు ఇంగ్లండ్ సిరీస్‌లో నేను బాగానే ఆడాను. అదే జోరును చాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించాలని ఫిక్సయ్యాను. అయితే, అలా తొలి సెషన్లోనే చేదు అనుభవం ఎదురుకావడం వల్ల నిరాశకు గురయ్యాను. తర్వాత అక్కడి పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని నాదైన శైలిలో ఆడాను’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.కనక వర్షంకాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్‌ను ఆ జట్టు వదులుకుంది. ఈ క్రమంలో మెగా వేలంలోకి వచ్చిన ఈ ముంబైకర్పై కాసుల వర్షం కురిసింది. పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. ఇక పంజాబ్ సారథిగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అయ్యర్.. రెండింట గెలిచాడు.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్Sarpanch Saab's passion for the game... 🥹🤌🏻Watch the full heartfelt conversation between Shreyas Iyer and Sahiba Bali on our YT channel and Punjab Kings App. 📹 pic.twitter.com/t1PBDtCY6M— Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2025

ఇంగ్లండ్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్.. ఈసీబీ అధికారిక ప్రకటన
ఇంగ్లండ్ పురుషుల వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఎంపికయ్యాడు. ఈ ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సోమవారం అధికారిక ప్రకటన చేసింది. ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా జోస్ బట్లర్ స్ధానాన్ని బ్రూక్ భర్తీ చేయనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ కెప్టెన్సీ బట్లర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనను నైతిక బాధ్యత వహిస్తూ బట్లర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా హ్యారీ బ్రూక్ 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇంగ్లండ్ భవిష్యత్తు కెప్టెన్‌గా ముందుకు సాగాడు. 2024లోనే జోస్ బట్లర్ డిప్యూటీగా బ్రూక్ ఎంపికయ్యాడు. గతేడాది బట్లర్ గైర్హజరీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు కెప్టెన్‌గా బ్రూక్ వ్యవహరించాడు. ఆ సిరీస్‌ను ఇంగ్లండ్ 3-2 తేడాతో కోల్పోయినప్పటికి బ్రూక్ మాత్రం తన కెప్టెన్సీతో అందరిని ఆకట్టుకున్నాడు. బట్లర్ తప్పుకున్నాక బ్రూక్‌నే ఇంగ్లండ్ తదుపరి కెప్టెన్‌గా ఎంపిక అవుతాడని అంతా భావించారు.ఇప్పుడు అందరూ ఊహించిందే జరిగింది. ఇంగ్లండ్ తమ తదుపరి వైట్‌బాల్ సిరీస్ ఈ ఏడాది మేలో వెస్టిండీస్‌తో ఆడనుంది. ఈ సిరీస్‌తో ఇంగ్లండ్ వైట్ బాల్ జట్టు ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బ్రూక్ తన ప్రయాణాన్ని ఆరంభించనున్నాడు.26 ఏళ్ల హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరపున ఇప్పటివరకు 70 వైట్ బాల్ మ్యాచ్‌లు ఆడాడు. టీ20 ప్రపంచకప్-2022ను సొంతం చేసుకున్న ఇంగ్లండ్ జట్టులో అతడు భాగంగా ఉన్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం బ్రూక్ స్పందించాడు. "ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా ఎంపిక అవ్వడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. నేను బర్లీలో స్కూల్ క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని, ఏదో ఒక రోజున అవకాశము వస్తే నాయకత్వం వహించాలని కలలు కన్నాను. ఈ రోజు నా కల నేరవేరింది. నాకు ఎంతో మద్దతుగా నిలిచిన నా ఫ్యామిలీకి, అభిమానులకు, కోచ్‌లకు ధన్యవాదాలు. వీరిందరి వల్లే ఈ రోజు నేను ఈ స్ధాయికి చేరుకున్నాను. నా ప్రతీ విజయంలోనూ భాగమయ్యారు. ద్వైపాక్షిక సిరీస్‌లు, ప్రపంచకప్‌లు, ప్రధాన ఐసీసీ ఈవెంట్లలో ఇంగ్లండ్‌ను గెలుపు పథంలో నడిపించేందుకు నా వంతు కృషి చేస్తానని" ఓ ప్రకటనలో బ్రూక్ పేర్కొన్నాడు.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్
బిజినెస్

ఇల్లు ఏదైనా సరే.. ఇది ఉండాల్సిందే!
1,2,3 బీహెచ్‌కే.. ఇళ్లు ఏదైనా సరే బాల్కనీ ఉండాల్సిందే.. గృహ కొనుగోలుదారులు నిర్మాణం నాణ్యత, ప్రాంతం, ధర, వసతులతో పాటు బాల్కనీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఇంటిలోని ప్రతి అంగుళం స్థలాన్ని వినియోగించాలని భావించిన కస్టమర్లు.. ప్రస్తుతం ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉండాలని కోరుకుంటున్నారు. 75 శాతం మంది బాల్కనీ ఉండే ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపిస్తున్నారని ఫిక్కీ, అనరాక్ సర్వేలో వెల్లడించింది. అలాగే 74 శాతం మంది కస్టమర్లు నాణ్యమైన నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో గృహాల ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు విశాలమైన ఇళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. 50 శాతం మంది కస్టమర్లు 3 బీహెచ్‌కే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తే.. 38 శాతం మంది 2 బీహెచ్‌కే గృహాలకు మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎన్సీఆర్ నగరాలలో 3బీహెచ్‌కే యూనిట్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధిక ధరల కారణంగా ముంబైలో 44 శాతం మంది కస్టమర్లు 2 బీహెచ్‌కేలకు, 17 శాతం 1 బీహెచ్‌కేలకు ఆసక్తి చూపిస్తున్నారు. పుణేలో 10 శాతం కొనుగోలుదారులు 1 బీహెచ్‌కే జై కొడుతున్నారు.లగ్జరీ ఇళ్లకు డిమాండ్.. రూ.కోటిన్నర ధర ఉన్న గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023 హెచ్–2లో 20 శాతం మంది లగ్జరీ ఇళ్లకు ఆసక్తి చూపించగా.. 2021 హెచ్–2లో ఇది కేవలం 12 శాతంగా ఉంది. రూ.45–90 లక్షల బడ్జెట్ గృహాలకు 33 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. ఇక అందుబాటు గృహాలకు డిమాండ్ క్రమంగా తగ్గిపోతోంది. 2020 హెచ్–2లో 40 శాతంగా అఫర్డబుల్ హౌసింగ్ గిరాకీ.. 2021 హెచ్–2 నాటికి 25 శాతానికి, 2023 హెచ్–2లో ఏకంగా 21 శాతానికి క్షీణించింది.లాంచింగ్‌లో కొంటున్నారు.. గృహ కొనుగోలుదారుల అభిరుచి మారింది. గతంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనేందుకు ఆసక్తి చూపిన కస్టమర్లు.. ప్రస్తుతం లాంచింగ్ ప్రాజెక్ట్‌లలో కొనేందుకు ఇష్టపడుతున్నారు. 2020లో రెడీ టూ మూవ్, లాంచింగ్ ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్ల నిష్పత్తి 46:18 శాతంగా ఉండగా.. 2024 నాటికి 23:24 శాతానికి మారింది. అలాగే 2021లో శివారు ప్రాంతాలలో స్థిరాస్తుల కొనుగోలుకు జై కొట్టిన కొనుగోలుదారులు 2024 నాటికి 36 శాతానికి తగ్గారు.పెట్టుబడులకు రియలే బెటర్.. ఏటా దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఫ్లాట్ల విస్తీర్ణాలు 11 శాతం మేర పెరుగుతున్నాయి. 2022లో 1,175 చ.అ.లుగా ఉన్న సగటు ఫ్లాట్ల సైజు.. 2024 నాటికి 1,300 చ.అ.లకు పెరిగాయి. 58 శాతం మిలీనియల్స్, 39 శాతం జెన్స్–ఎక్స్ కస్టమర్లు ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన లాభాలతో ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 57 శాతం మంది రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడిగా విశ్వసిస్తున్నారు. ఇందులోనూ 36 శాతం మంది నివాస విభాగంలో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రుణ వడ్డీ రేట్లు 8.5 శాతం కంటే తక్కువగా ఉన్నంత కాలం ఇంటి కొనుగోలు నిర్ణయంపై ప్రభావం ఉండదని చెప్పారు.

అప్పుల కుప్పలుగా రాష్ట్రాలు
పెరుగుతున్న ఆదాయ వ్యయాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు రుణాలే దిక్కవుతున్నాయి. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఆధారంగా దేశంలోని 15 అతిపెద్ద రాష్ట్రాలు 2026 ఆర్థిక సంవత్సరంలో అధిక రుణాలు తీసుకునే అవకాశాలున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ రాయితీలు, స్థిరంగా పన్ను ఆదాయ వృద్ధి, సాధారణ కార్యకలాపాలకు పెరిగిన వ్యయం ఇందుకు కారణమని చెబుతున్నారు. దాంతో రాష్ట్రాలు అప్పులకే పెద్దపీట వేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు. పెరుగుతున్న ఈ అప్పుల కుప్పను నియంత్రించకపోతే వాటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ఇది ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు.రుణ పెరుగుదలకొవిడ్ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ఖర్చుల కోసం రుణాలు తీసుకోవడం పెంచాయి. తదనంతరం ఆర్థిక రికవరీ ద్రవ్యలోటును కొంతవరకు కట్టడి చేస్తున్నప్పటికీ, రాష్ట్రాలు మళ్లీ అప్పులవైపే మొగ్గు చూపుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి కొన్ని పెద్ద రాష్ట్రాలు మార్కెట్ రుణాలను పెంచాలని యోచిస్తున్నాయి. ఇందులో తమిళనాడు అగ్రస్థానంలో ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తర్వాత వరుసలో మహారాష్ట్ర, కర్ణాటకలున్నాయి.జీతాలు, పింఛన్లు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులపై ఖర్చు గణనీయంగా పెరుగుతోంది. దాంతో రుణాలు తప్పని పరిస్థితి నెలకొంది. ఇది అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. ఉన్న అప్పులకుతోడు ఉన్నికలవేళ నగదు బదిలీ, ఉచిత సౌకర్యాలు, సంక్షేమ పథకాలు.. వంటి రాజకీయ రాయితీలు ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి.రుణం-జీఎస్డీపీ నిష్పత్తులుఆర్థిక వృద్ధికి కీలకమైన కొలమానం రుణం-జీఎస్డీపీ నిష్పత్తి. ఇది ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత ప్రభావవంతంగా ఉందో సూచిస్తుంది. ఇది 25 శాతం వరకు ఉంటే ఆరోగ్యకరమైన నిష్పత్తిగా లెక్కిస్తారు. కానీ చాలా రాష్ట్రాలు ఈ పరిమితిని మించి ఉన్నాయి. ఈ నిష్పత్తిలో 52.3 శాతంతో బిహార్ అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ 47.3 శాతం, పశ్చిమ బెంగాల్ 38.9 శాతం, ఆంధ్రప్రదేశ్ 35.1 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సాపేక్షంగా 26.07% నిష్పత్తి ఉన్నప్పటికీ తమిళనాడు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన హామీల వల్ల ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది.పెరుగుతున్న వడ్డీ వ్యయాలురాష్ట్ర బడ్జెట్లపై పెరుగుతున్న వడ్డీ భారంలో ఈ రుణాల చెల్లింపులు కీలకంగా మారుతున్నాయి. కొన్ని రాష్టాలపై విధిస్తున్న వడ్డీలు వాటి ఆదాయాల్లో కోతలకు దారిస్తున్నాయి. పంజాబ్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు అతి తక్కువ వడ్డీ కవరేజీని కలిగి ఉన్నాయి. ఇది 4% నుంచి 6% మధ్య ఉంది. దీనికి విరుద్ధంగా ఒడిశా అత్యధికంగా 35.7% వడ్డీ కవరేజీని కలిగి ఉంది. బిహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలు 10% నుంచి 12% మధ్య వడ్డీ కలిగి ఉన్నాయి.కష్టంగా క్యాపెక్స్ లక్ష్యాలుఆదాయ వ్యయాలు పెరుగుతున్నకొద్దీ మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టుబడులు(క్యాపెక్స్) తగ్గుతున్నాయి. ఇటీవలి కాలంలో అనేక రాష్ట్రాలు బడ్జెట్లో కేటాయింయిన క్యాపెక్స్ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడుతున్నాయి. ఉదాహరణకు, తమిళనాడు తన 2025 ఆర్థిక సంవత్సరం క్యాపెక్స్ అంచనాను రూ.47,681 కోట్ల నుంచి రూ.46,766 కోట్లకు సవరించింది. మహారాష్ట్ర మినహా చాలా పెద్ద రాష్ట్రాలు క్యాపెక్స్‌లో గణనీయంగా 12% నుంచి 69% వరకు పెంచుతున్నట్లు చూపించాయి. కానీ వాటి అమలు ప్రశ్నార్థకంగా మారుతుంది.నిధుల వినియోగంమూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగా క్యాపెక్స్ కేటాయింపులు చేస్తున్నారు. అయినప్పటికీ దీని అమలు సవాలుగా మారింది. రాష్ట్రాలు అవసరమైన సంస్కరణలను అమలు చేయలేకపోవడం, వ్యయ లక్ష్యాలను చేరుకోవడంలో అసమర్థత కారణంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2025 ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి రుణాలకు కేటాయింపులను రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.1.25 లక్షల కోట్లకు తగ్గించింది. రాష్ట్రాలు ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతే వృద్ధి కుంటుపడుతుంది.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల కోతపై ఆశలుపరిష్కారం లేదా..?ఆర్థిక వ్యయాలు పెరిగేకొద్దీ దీర్ఘకాలిక వృద్ధికి కీలకంగా ఉన్న రాష్ట్రాల మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. రెవెన్యూ వ్యయాలపై పటిష్ట నియంత్రణ లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ మరింత క్షీణించి రాష్ట్రాలు సవాళ్లు ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్టీలకు అతీతంగా దీనిపై మేధావులు, ఆర్థిక రంగ నిపుణులు, ఇతరులతో చర్చించి అప్పులు తగ్గేలా మెరుగైన పద్ధతులను సిద్ధం చేసి అమలు చేయాలని సూచిస్తున్నారు.

వాట్సాప్ ద్వారా ఫండ్స్‌లో పెట్టుబడులు
ముంబై: హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమలోనే తొలిసారిగా ట్యాప్2ఇన్వెస్ట్ ఫీచరును ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దీనితో కేవైసీ ధృవీకరణ పూర్తి చేసుకున్న ఇన్వెస్టర్లు వాట్సాప్ (నంబరు 8270682706) ద్వారా ఇన్వెస్ట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.ఇన్వెస్ట్మెంట్ యాప్ తరహాలోనే ఇది పనిచేస్తుందని తెలిపింది. దీనితో కేవలం ఆయా ఆప్షన్లపై క్లిక్ చేయడం ద్వారా తమ స్కీముల్లో ఏకమొత్తంగా లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టొచ్చని సంస్థ వివరించింది. యూపీఏ ఆటోపే, నెట్‌బ్యాంకింగ్, ఇతరత్రా డిజిటల్ చెల్లింపు విధానాలను ఇది సపోర్ట్ చేస్తుందని కంపెనీ ఎండీ నవనీత్ మునోట్ తెలిపారు.

ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
మనిషి దేన్నైనా సాధించాలని బలంగా అనుకుని ముందుకు సాగితే.. తప్పకుండా సక్సెస్ సాధ్యమవుతుందని ఎంతోమంది చెప్పారు. ఉదాహరణలుగా కూడా నిలిచారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు టీమ్ ఇండియాకు ఓపెనర్ 'శుభ్‌మన్ గిల్' (Shubman Gill). సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గిల్.. కోట్లు సంపాదిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ కథనంలో శుభ్‌మన్ ఆస్తి ఎంత? ఎలాంటి వాహనాలను వినియోగిస్తున్నారు, ఏ కంపనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు, అనే వివరాలు తెలుసుకుందాం.శుభ్‌మన్ గిల్ అంటే టీమిండియా క్రికెటర్ మాత్రమే కాదు యూత్ ఐకాన్ కూడా. రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇతను మొత్తం సంపద విలువ రూ. 32 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇతని వద్ద రూ. 89 లక్షల ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్, రూ. 14.16 లక్షల ఖరీదైన మహీంద్రా థార్ ఉన్నాయి.మహీంద్రా థార్ కారును ఆనంద్ మహీంద్రా గిఫ్ట్‌గా ఇచ్చారు. 2021 టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన సమయంలో ఆనంద్ మహీంద్రా ఆరుగురు ఆటగాళ్లకు మహీంద్రా థార్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ జాబితాలో శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నారు. ప్రస్తుతం గిల్ ఏడాదికి రూ. 5 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?శుభ్‌మన్ గిల్ అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో CEAT, Nike, Dior, Fiama, Gilette వంటి బ్రాండ్స్ ఉన్నాయి. వీటి ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. కాగా ఈయనకు పంజాబ్‌లో ఒక విలాసవంతమైన భవనం కూడా ఉంది.
ఫ్యామిలీ

Sri Rama Pattabhishekam గురు భక్తి
శ్రీరాముని యువ రాజ్యాభిషేకం (Sri Rama Pattabhishekam) నిర్ణయమైన తర్వాత, రఘు వంశీకుల ఆచార్యులు వశిష్టుడు (Vasishta) ఈ విషయం తెలియజేయటానికి రాముని మందిరానికి వెళతాడు. శ్రీరాముడు తన గురువు స్వయంగా వచ్చారని తెలిసి, ఎదురు వెళ్లి చేతులు జోడించి, ఆహ్వానించి, భక్తితో ప్రణామం చేశాడు. జానకి బంగారు పాత్రలో స్వచ్ఛ జలం తీసుకురాగా... రాముడు వశిష్టుని రత్న సింహాసనంపై ఆసీనుని చేసి, గురు పాదాలను శ్రద్ధా భక్తులతో కడిగాడు. సీతతో సహా ఆ పవిత్ర జలాన్ని శిరసున ధరించి, ‘మీ పాద తీర్థం శిరసున ధరించటం వలన ధన్యులమయ్యాము’ అంటాడు.అప్పుడు వశిష్టుడు, ‘రామా! నీ పాద తీర్థం శిరసున దాల్చి పార్వతీ పతి శంకరుడు ధన్యుడయ్యాడు. బ్రహ్మ నీ పాద తీర్థం సేవించే పాపాలను తొలగించుకున్నాడు. ఈ రోజు కేవలం గురువుతో ఒక శిష్యుడు ఎలా వ్యవహరించాలో తెలపటా నికే నువ్వు ఈ విధంగా చేశావు. నువ్వు, సాక్షాత్తూ లక్ష్మీ దేవితో కలిసి భూమిపై అవతరించిన విష్ణువు వని, రావణ సంహారానికే రాముడుగా వచ్చావని నాకు తెలుసు. నీవు మాయా మానుష రూపంతో అన్ని కార్యాలూ చేస్తున్నావు. అందుకు నీవు శిష్యుడవు, నేను గురువుననే సంబంధానికి అనుకూలంగా నేనూ వ్యవ హరిస్తాను’ అంటాడు.శ్రీరాముడు స్వయంగా అంతర్యామి. గురువులకు గురువు. ఆయనకు గురు సేవ ఎందుకు? అంటే, లోకో పకారానికే! లోక కల్యాణానికే! గురువు పట్ల ఎలాంటి వినయ విధేయతలుకలిగి ఉండాలో, ఎంత శ్రద్దా భక్తులతో సేవించాలో తెలపటానికే శ్రీరాముడు ఆ విధంగా వ్యవహరించాడు. త్రేతా యుగంలోనే కాదు, ద్వాపర యుగంలోనే కాదు, ఏ కాలంలోనైనా గురువుల పట్ల శ్రద్ధా భక్తులు, వినయ విధేయతలు కలిగి ఉంటే అటువంటి శిష్యులకు అసాధ్యమైనది ఏదీ ఉండదని గురు చరిత్రలు, గురు శిష్య సంబంధ పురాణ కథలు వ్యక్తం చేస్తున్నాయి. – డా.చెంగల్వ రామలక్ష్మి

ఆర్ట్ ఫెస్ట్.. అదిరేట్టు.. !
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగర వేదికగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎఫ్) దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కళాకారులతో, ఔస్తాహికులతో సందడి నెలకొంది. హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి అత్తాపూర్‌లోని కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్ వేదికగా నడుస్తున్న ఫెస్ట్‌లో 200 మందికి పైగా ప్రముఖ కళా కారులు రూపొందించిన 3,500 పైగా వైవిధ్యమైన కళారూపాలను ప్రదర్శించారు. ఇందులో 25 ఆర్ట్ గ్యాలరీలతో, 100 ఎయిర్ కండీషన్డ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖ కళాకారులు భాగస్వామ్యమవుతున్న ఈ ఆర్ట్ ఫెస్ట్ ఆదివారంతో ముగిసింది. ఎంఎఫ్ హుస్సేన్ వారసత్వానికి నివాళి.. ప్రఖ్యాత భారతీయ కళాకారుడు ఎంఎఫ్ హుస్సేన్ మేనల్లుడు ఫిదా హుస్సేన్ ఎక్స్‌క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళా ప్రదర్శన ఫెస్ట్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేదికగా తన మామతో ఉన్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. భారతదేశం నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఎంఎఫ్ హుస్సేన్ కళను పదిలపరచడంలో ప్రత్యేక బాధ్యతను తీసుకున్నట్లు వెల్లడించారు. 2006 నుంచి 2011 వరకూ ఎంఎఫ్ హుస్సేన్ బహిష్కరణ సమయంలో అతను దుబాయ్, ఖతార్‌లో తనతో నివసించారని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయన సృజనాత్మకతను తాను పరిరక్షించానని, ఇందులో భాగం 2017లో హుస్సేన్ సెరిగ్రాఫ్లను భారతదేశానికి తిరిగి ఇచ్చే పనిని చేపట్టానని, ఇది తమ కళా వారసత్వానికి నిదర్శనమని అన్నారు. అనంతరం ముంబై, బరోడాలో ఎంఎఫ్ హుస్సేన్ కళను ప్రదర్శించడం, సమకాలీన కళాకారులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఎక్స్‌క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించానని తెలిపారు. సృజనాత్మకతలో తత్వ శాస్త్రం.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అంజలి ప్రభాకర్ సృజనాత్మకత ఇండియన్ ఆర్టి ఫెస్ట్‌లో విశేషంగా ఆకట్టుకుంది. జీవితంలోని వివిధ కోణాలను, తత్వశాస్త్రంపై ఆమెకున్న లోతైన అవగాహనను చిత్రాల ద్వారా ప్రదర్శించారు. విజయం, ప్రేమ, ఆధ్యాత్మికతతో పాటు జీవితంలోని అనేక ఆచరణాత్మక అంశాలను అంజలి చిత్రీకరించారు. పెయింటింగ్‌లో నైపుణ్యం, 3డీ మ్యూరల్ ఆర్ట్, మధుబని పెయింటింగ్, క్రిస్టల్ రెసిన్, సెఫోరిక్స్, అబ్స్ట్రాక్ట్ వంటి కళల్లో తన సృజనాత్మకతను ఈ ఫెస్ట్‌లో ప్రదర్శించారు.భారత్‌తో పాటు విదేశాల్లో తాను సోలో, గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌లో పాల్గొన్నానని, తాను రాసిన పుస్తకం ‘ట్యూన్స్ ఆఫ్ లైఫ్’ విడుదలైందని, ప్రస్తుతం ‘మహిళల మానసిక ఆరోగ్యంలో ఆర్ట్ థెరపీ ప్రభావాన్ని అన్వేషించడం’ అనే అంశంపై పీహెచ్డీ ఎంట్రీని చేస్తున్నట్లు తెలిపారు. 16 ఏళ్లుగా అంజలి ఇన్నోవేటివ్ ఆర్ట్ శిక్షకురాలిగా కృషి చేస్తున్నానని అన్నారు. 2017లో ఇండోర్ మిరాజ్ నేషనల్ ఆర్ట్ ఫెస్ట్, బోపాల్ ‘ఆర్ట్ ఆల్కెమీ’, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ (ఆష్మి ఇనీషియేటివ్ గాంధీ ఆర్ట్ గ్యాలరీ) వంటి ప్రదర్శనలో తన చిత్రాలకు ప్రశంసలు లభించినట్లు తెలిపారు. (చదవండి: ఇంటి రుచులకు కేరాఫ్.. హోమ్ చెఫ్..!)

కరాటే కింగ్ బొంతూరి రమేష్ సక్సెస్ స్టోరీ
వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపురం ఇప్పాయిగూడేనికి చెందిన బొంతూరి రమేష్ కుటుంబసభ్యులు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం భాగ్యనగరానికి వలస వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. రమేష్ గోల్కొండలో 9వ తరగతి చదువుతున్నప్పుడే కరాటేపై ఆసక్తి పెంచుకున్నాడు. పదో తరగతి పాసైనా ఆర్థిక పరిస్థితి సహకరించక మధ్యలోనే చదువు ఆపేశాడు. బ్రూస్లీ సినిమాలు చూసి 12వ యేట నుంచే కరాటే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులు, గ్రాండ్ మాస్టర్ ఆర్కే కృష్ణ ప్రోత్సాహంతో కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించాడు. అనంతరం కిక్‌బాక్సింగ్ నేర్చుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు గెలుచుకున్నాడు. ప్రస్తుతం మాస్టర్ రమేష్ జవహర్గర్ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు, కానిస్టేబుళ్లకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నాడు. ఇప్పటి వరకూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో రన్వీర్ తైక్వాండో అకాడమీ ద్వారా దాదాపు లక్ష మంది విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చినట్లు రమేష్ తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా కరాటే విద్యనందించి బీపీ, షుగర్, మానసిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక యోగా శిక్షణ అందిస్తున్నాడు. ఇప్పటికే పలువురు విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునేలా కృషి చేస్తున్నాడు. వేసవికాలంలో మరింత మంది విద్యార్థులకు కరాటే విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ.. 2011 బెంగళూరులో నేషనల్ గోల్డ్ మెడల్ 2016లో అక్షయ్‌కుమార్ ఇంటర్నేషనల్ గోల్డ్‌మెడల్ వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో దాదాపు 220 గోల్డ్, సిల్వర్ మెడల్స్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ.. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ

భగవద్గీత పఠనంలో గోల్డ్ మెడల్..!
ఆమె ఓ సాధారణ గృహిణి. ఒకవైపు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన సబ్జెక్టులో ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే లక్ష్యాన్ని చేరుకోడానికి ఆమె రేయింబవళ్లు శ్రమించారు. అందుకు తగిన ఫలితాన్ని కూడా అందుకున్నారు. ఆమెనే జ్యోతి చాగంటి. మైసూర్‌లోని శ్రీగణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో అవధూత దత్తపీఠం ప్రతి యేటా నిర్వహించే భగవద్గీత పారాయణ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే జ్యోతి బంగారు పతకాన్ని సాధించారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 701 శ్లోకాలను నిర్విరామంగా పారాయణం చేశారు. రెండు రోజుల క్రితం దుండిగల్‌లోని దత్త ఆశ్రమంలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామి నుంచి గోల్డ్‌మెడల్‌తో పాటు సర్టిఫికెట్‌ను అందుకున్నారు. సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆమె నిరూపించారు. హైదరాబాద్ ఫిలింనగర్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తనకు లభించిన గుర్తింపు గురించి మాట్లాడారు. ఎనిమిది నెలలు శ్రమించా.. గత ఎనిమిది నెలలుగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో దీనిని అభ్యసించా. మొదటి ప్రయత్నంలోనే గీత పఠనంలో గోల్డ్ మెడల్ సాధించా. జ్యోతి గీత మకరందం గ్రూప్‌లో టి.నాగలక్ష్మి, ఇతరుల నేతృత్వంలో తాత్విక అంశాలను విస్తృతంగా అధ్యయనం చేశాం. ఈ గ్రూపులోని గురువులు విద్యార్థులకు సరైన ఉచ్ఛారణను నేరి్పంచారు. 8 నెలలుగా రోజుకు 7 గంటల పాటు సాధన చేశా. పరీక్షలో పాల్గొనడం అద్భుత అనుభవం. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి తదుపరి విద్యార్థులకు గీతను బోధిస్తాను. (చదవండి: మరణ భయాన్ని తొలగించే ధర్మరాజ దశమి!!)
ఫొటోలు


రోమ్ వెళ్లారు.. మహేశ్ ని మాత్రం దాచేశారు (ఫొటోలు)


నేచురల్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న నటి కాయాదు లోహర్ గ్లామరస్ (ఫొటోలు)


ఓర చూపు, మైమరపించే అందాలతో మాయ చేస్తున్న కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోస్


సన్‌రైజర్స్ vs గుజరాత్ మ్యాచ్‌లో సందడి చేసిన సినీనటి సౌమ్యజాను (ఫోటోలు)


పసలేదు బ్రో.. సన్‌రైజర్స్ ఆట తీరుపై అభిమానుల నిరాశ (ఫొటోలు)


సింపుల్ లుక్ మెరిసిపోతున్న 'యానిమల్' బ్యూటీ త్రిప్తి డిమ్రి (ఫోటోలు)


అనంత్ అంబానీ ద్వారక పాదయాత్ర పూర్తి.. (ఫోటోలు)


'రామ్ గోపాల్ వర్మ'.. బర్త్‌డే స్పెషల్ ఫోటోలు చూశారా..?


ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)


కన్నుల పండువగా శోభాయాత్ర భారీగా తరలివచ్చిన భక్తులు (ఫొటోలు)
అంతర్జాతీయం

ట్రంప్‌కు హ్యాండ్సాఫ్ సెగ
వాషింగ్టన్: మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో అధ్యక్ష పీఠంపై ఆసీనులైన డొనాల్డ్ ట్రంప్ వెనువెంటనే తీసుకున్న అనూహ్య, విపరీత నిర్ణయాలతో అమెరికన్లు విసిగిపోయారు. విదేశాలపై టారిఫ్‌ల బాంబు విసిరితే అది ప్రతీకార టారిఫ్‌ల రూపంలో తిరిగొచ్చి అధిక ధరలు, ద్రవ్యోల్బణానికి బాటలు వేస్తోందన్న ఆగ్రహంతో ప్రజలు నిరసన బాటపట్టారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక దేశవ్యాప్తంగా ఎన్నడూలేనిస్థాయిలో లక్షలాది మంది స్థానిక అమెరికన్లు ముక్తకంఠంతో నినదిస్తూ ఆందోళనకు దిగిన ‘హ్యాండ్సాఫ్’ ఉద్యమం శనివారం భారీస్థాయిలో కొనసాగుతోంది. అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా శనివారం ఉద్యమం మొదలైంది. రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక భద్రత విభాగ ఆఫీస్‌లు, పార్కులు, సిటీ హాళ్ల వద్ద ప్రధానంగా పెద్దస్థాయిలో ర్యాలీలు జరిగాయి. అత్యంత సంపన్నుల చేతుల్లోకి వెళ్లిన పాలనాపగ్గాలను విడిపిస్తామని నినదించారు. ‘‘ మావి ప్రధానంగా మూడు డిమాండ్లు. ప్రభుత్వంపై సంపన్నుల అజమాయిషీ నశించాలి. ప్రభుత్వంలో అవినీతి అంతంకావాలి. మెడికేర్, సోషల్‌సెక్యూరిటీ నిధుల్లో కోత పెట్టొద్దు. వలసదారులు, లింగమార్పిడి వర్గాలు, ఇతరులపై నిర్బంధాల చట్రాలను తొలగించాలి’’ అని ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాల్లో ఒకటైన ఇండివిజిబుల్ ప్రకటించింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫెడరల్ ఎంప్లాయీస్ సహా చాలా కార్మిక సంఘాల సభ్యులు పలు రాష్ట్రాల్లో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు.50 రాష్ట్రాల్లో 1,400 చోట్ల..50 రాష్ట్రాల్లో పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, ఎల్జీబీటీక్యూ+ మద్దతుదారులు, మాజీ ఫెడరల్ ఉద్యోగులు, మహిళా హక్కుల కార్యకర్తలు, ఎన్నికల సంస్కరణల కార్యకర్తలు, సాధారణ ప్రజానీకం ఈ ఆందోళనలో భాగస్వాములై ట్రంప్ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రధానంగా 1,400 ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే చాలా వరకు ర్యాలీలు శాంతియుతంగానే కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అరెస్ట్‌లు జరగలేదు. మ్యాన్‌హాట్టన్ మిడ్‌టౌన్ మొదలు అలాస్కాలోని యాంకరేజ్దాకా ప్రతి ప్రధాన నగరం, పట్టణంలో జనం వీధుల్లోకి వచ్చి హ్యాండ్సాఫ్ అని రాసి ఉన్న బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని ఆందోళనల్లో పాల్గొన్నారు. వ్యయ నియంత్రణ చర్యలు, సమూల సంస్కరణల పేరుచెప్పి హఠాత్తుగా వేల సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను విధుల నుంచి తప్పించడం, జీడీపీ తగ్గిపోయేలా ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్థం చేయడం, వలసలపై ఉక్కుపాదం మోపడం, మానవ హక్కులను కాలరాయడం వంటి చర్యలతో ట్రంప్, ఎలాన్ మస్క్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. అమెరికాలోనేకాదు బ్రిటన్‌లోని లండన్, ఫ్రాన్స్‌లోని పారిస్, జర్మనీలోని బెర్లిన్ నగరాల్లోనూ అమెరికా ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. ‘‘అమెరికాకు ఏమైంది?. ప్రజలను టారిఫ్‌లను ఇబ్బందులు పెట్టడం ఇకనైనా ఆపండి. ట్రంప్ పెద్ద ఇడియట్’’ అని రాసి ఉన్న ప్లకార్డులను లండన్‌లో ప్రదర్శించారు. నిరసనలపై స్పందించిన శ్వేతసౌధంట్రంప్ వ్యతిరేక ర్యాలీలపై అధ్యక్ష భవనం స్పందించింది. ‘‘ ఇన్నాళ్లూ డెమొక్రాట్ల ప్రభుత్వంలో అక్రమంగా అమెరికాలో చొరబడిన విదేశీయులు, వలసదారులు ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు, ప్రయోజనాలను అక్రమంగా పొందారు. దాంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. వీళ్ల వల్ల వాస్తవిక లబ్ధిదారులైన సీనియర్ అమెరికన్లు ఎంతో లబ్దిని కోల్పోయారు. ఆ సంస్కృతికి చరమగీతం పాడి నిజమైన అమెరికన్లకే ప్రభుత్వం నుంచి సామాజిక భద్రత, వైద్యసాయం, వైద్యసదుపాయాలు అందిస్తున్నాం’’ అని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

కెనడా పార్లమెంట్‌కు తాళాలు.. ఎన్నికల వేళ అసలేం జరుగుతోంది?
కెనడా పార్లమెంటు భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో తాత్కాలికంగా మూసివేసినట్లు ఒట్టావా పోలీసులు వెల్లడించారు. అక్రమంగా పార్లమెంట్ హిల్‌లోని ఈస్ట్ బ్లాక్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి రాత్రంతా లోపలే ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, దుండగుడి వద్ద ఆయుధాలు ఉన్నాయా లేదా అనే దానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు.శనివారం రాత్రి ఓ వ్యక్తి పార్లమెంట్ భవనంలోకి అక్రమంగా చొరబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భవనం చుట్టూ పోలీసులను మోహరించారు. బ్యాంక్ స్ట్రీట్ నుండి సస్సెక్స్ డ్రైవ్ వరకు వెల్లింగ్టన్ స్ట్రీట్‌లోని అన్ని రోడ్లను మూసివేశారు. పెద్ద సంఖ్యల్లో పోలీసులు మోహరించారు. తూర్పు బ్లాక్‌లో ఉన్న సిబ్బంది మొత్తం ఒకే గదిలోకి చేరుకొని తాళాలు వేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. సహకరించిన ప్రజలకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.కాగా, కెనడాలో అక్టోబర్ 27న జరగాల్సిన ఎన్నికలను ఆరు నెలలకు ముందుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ పార్లమెంటును రద్దు చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ భవనంలోకి దుండగుడు ప్రవేశించడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అపహరించడానికి దుండగుడు ప్రయత్నించి ఉంటాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

యుద్ధం ఆగేనా? సుంకాలు మీకు ఓకేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) వివిధ దేశాలపై సుంకాలను విధించిన తరుణంలో ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం కానుండడం ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 7న జరగనున్న ఈ భేటీలో ఇరువురు నేతలు గాజా స్వాధీనం కోసం తుది యుద్ధ ప్రణాళికను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇజ్రాయెల్ త్వరలోనే గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోబోతోందని, ఇందుకు ట్రంప్ మద్దతుగా నిలుస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే అమెరికా సర్కారు కొత్తగా విధించిన సుంకాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ చర్చించనున్నారని సమాచారం.ట్రంప్ రెండవసారి అధ్యక్షుడైన తర్వాత వైట్ హౌస్‌లో నెతన్యాహు(Netanyahu)తో ఇప్పుడు రెండోసారి సమావేశమవుతున్నారు. ఈ సమావేశాన్ని వైట్ హౌస్ తో పాటు నెతన్యాహు కార్యాలయం ధృవీకరించాయి. హమాస్ తీవ్రవాదులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ గతకొంతకాలంగా గాజా స్ట్రిప్‌లోని నూతన భద్రతా కారిడార్‌లో సైన్యాన్ని మోహరిస్తున్న తరుణంలో ఇద్దరు నేతల మధ్య సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.గత నెలలో ఇజ్రాయెల్(Israel) కాల్పుల విరమణను ఉల్లంఘించి, అకస్మాత్తుగా గాజాపై బాంబు దాడి చేసింది. ఈ చర్యకు వైట్ హౌస్ మద్దతు పలికింది. కాగా బెంజమిన్ నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ ఈ సమావేశంలో సుంకాల సమస్య, ఇజ్రాయెల్-టర్కీ సంబంధాలు, ఇరాన్ నుండి పొంచివున్న ముప్పు తదితర అంశాలపై చర్చించనున్నట్లు నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.గాజాలో హమాస్‌కు ఎదురుదెబ్బగత వారం గాజాలో హమాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా అనేక మంది పాలస్తీనియన్లు ప్రాణ భయంతో శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా వాసులు నిరసనలు తెలిపారు. ఇజ్రాయెల్‌తో ఘర్షణకు ముగింపు పలికి, అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది పాలస్తీనియన్లు ఆందోళనలు చేశారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాతో సహా వివిధ ప్రాంతాల్లో మంగళవారం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ‘యుద్ధాన్ని ఆపాలి, మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గాజాలోని ప్రజలను రక్షించేందుకు హమాస్ తన అధికారాన్ని ఎందుకు వదులుకోదని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో శుక్రవారం ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 16 మందికి పైగా పాలస్తీనా వాసులు చనిపోవడం గమనార్హం. ఈ తరుణంలో అమెరికా-ఇజ్రాయిల్ దేశాధినేతలు భేటీ కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.ఇజ్రాయిల్ కు టారిఫ్ ఉపశమనం..అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు సంబంధించి ఇటీవల ప్రపంచ దేశాలపై సుంకాల విధించి షాకిచ్చిన ట్రంప్.. ఇజ్రాయిల్ పై 17 శాతం సంకాన్ని విధించారు. ట్రంప్ పలు దేశాలకు విధించిన సుంకాల పరంగా చూస్తే ఇజ్రాయిల్ కు కాస్త ఊరటనిచ్చినట్లే కనబడింది. భారత్ పై 26 శాతం సుంకాన్ని విధించిన ట్రంప్.. చాలా దేశాలపై 20 శాతం 49 శాతం వరకూ కూడా సుంకాలు విధించారు. ఇక్కడ ఇజ్రాయిల్ కు మాత్రం 17 శాతాన్ని సుంకాన్ని మాత్రమే విధించడంతో ఆ దేశంపై కాస్త ప్రేమ చూపించినట్లే అవగతమవుతుంది. సుంకాలకు సంబంధించి కూడా ఇజ్రాయిల్ తో డొనాల్డ్ ట్రంప్ చర్చించే అవకాశం ఉంది. ఒకవేశ ఇజ్రాయిల్ ఏమైనా గట్టిగా పట్టుబడితే దానిని కాస్త కుదించే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: West Bengal: నవమి వేడుకల్లో కత్తులు తిప్పిన బీజేపీ నేతలు

ట్రంప్ టారిఫ్ దడ.. షాపింగ్ మాల్స్ ముందు లాక్డౌన్ దృశ్యాలు
వాషింగ్టన్: అమెరికాలోని సూపర్ మార్కెట్లన్నీ వినియోగదారుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన జనమంతా తమకు అందిన వస్తువులన్నింటినీ కొనుగోలు చేసి, తమ ట్రాలీలలో నింపేసుకుని, బయటకు వస్తూ కనిపిస్తున్నారు. దీనిని చూసినవారికి త్వరలో లాక్డౌన్(Lockdown) వస్తుందనే విధంగా అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ‘ఇప్పుడే షాపింగ్ చేయండి.. లేదంటే పశ్చాత్తాప పడతారు’ అనే ట్రెండ్ నడుస్తోంది.అమెరికాలోని వినియోగదారులు షాపింగ్ మాల్స్‌కు పరుగులు తీయడం వెనుక ప్రధాన కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ పాలసీ(Donald Trump's new tariff policy). ఏప్రిల్ 2న డోనాల్డ్ ట్రంప్ భారత్, చైనాతో సహా పలు దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాలను విధించారు. దీనిపై అమెరికన్లు కలత చెందుతున్నారు. రాబోయే రోజుల్లో పలు వస్తువులు చాలా ఖరీదైనవిగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ భయంతోనే వారంతా ఉప్పు మొదలుకొని టీవీలు, ఫ్రిజ్‌లు.. ఇలా అన్నింటికీ కొనుగోలు చేస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ ప్రభుత్వ సుంకాల విధానం దిగుమతులపై(imports) ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. ఇది కంపెనీల ఖర్చును పెంచుతుంది. ఫలితంగా ఆ భారం కస్టమర్‌పై పడుతుంది. అయితే డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఈ సుంకాలు మేలు చేస్తాయని చెబుతున్నారు. అమెరికన్లు ప్రస్తుతం చేస్తున్న షాపింగ్ తీరు చూస్తుంటే.. వారెవరికీ ట్రంప్ హామీలపై పెద్దగా నమ్మకం లేదని అనిపిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మైక్రోవేవ్‌లు అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి.అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, విడిభాగాలు చైనా తదితర దేశాల నుండి దిగుమతి అవుతాయి. సుంకాల పెరుగుదల కారణంగా భవిష్యత్తులో అవి మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. సుంకాలు విధించాక ధరలలో 15-20శాతం మేరకు పెరుగుదల తప్పకుండా ఉంటుందని డీలర్లు స్పష్టంగా చెబుతున్నారు. అందుకే అమెరికన్లు వివిధ రకాల షోరూంలకు క్యూ కడుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున జీన్స్, స్పోర్ట్స్ వేర్, వర్క్ వేర్, క్యాజువల్ షూలను కూడా ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కాఫీ, స్నాక్స్, సాస్‌లు, అంతర్జాతీయ కిరాణా వస్తువులు కూడా జోరుగా విక్రయమవుతున్నాయి. బ్లెండర్లు, ఎయిర్ ఫ్రైయర్లు, మసాజ్ కుర్చీలు, ట్రెడ్మిల్స్ కూడా విరివిగా అమ్ముడవుతున్నాయి. ఇది కూడా చదవండి: Sri Rama Navami: బెంగాల్ నుంచి ముంబై వరకూ.. హై అలర్ట్
జాతీయం

మూఢాచారాలతో ప్రసవానికి యత్నం.. గర్భిణి మృతి
మలప్పురం: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నాటికీ మూఢాచారాలు కొనసాగుతున్నాయి. ఒక్కోసారి ఇవి వికటించి, మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. కేరళ(Kerala)లో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. ఆస్పత్రికి వెళ్లికుండా ఇంటిలోనే పురుడు పోసుకునేందుకు ప్రయత్నించిన 34 ఏళ్ల మహిళ ప్రసవ సమయంలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.కేరళలోని మలప్పురం జిల్లా(Malappuram district)లో ఈస్ట్ కోడూర్ ప్రాంతానికి చెందిన అస్మా(34)కు ఇంటిలోనే ప్రసవం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మృతి చెందింది. ఆమె తన ఐదవ సంతానానికి జన్మనిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అస్మా ఎర్నాకుళం జిల్లాలోని పెరుంబావూర్‌కు చెందినది. అయితే ఆమె భర్త సిరాజుద్దీన్‌తో కలిసి మలప్పురంలోని ఒక అద్దె ఇంట్లో ఉంటోంది. ప్రసవ సమయంలో ఆమెకు వైద్య సహాయం అందకపోవడంతోనే ఈ విషాదం చోటుచేసుకున్నదని తెలుస్తోంది. అస్మా భర్త సిరాజుద్దీన్ మత సాంప్రదాయాలను పాటిస్తుంటాడు. ఈ నేపధ్యంలోనే మూఢాచారాలను ఆశ్రయించే ఆయన భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఘటన తర్వాత సిరాజుద్దీన్ తన భార్య మృతదేహాన్ని పెరుంబావూర్‌కు తీసుకెళ్లి, అక్కడ సమాధి చేయడానికి ప్రయత్నించాడు. అయితే స్థానికులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెరుంబావూర్ పోలీసులు(Perumbavoor Police) వెంటనే రంగంలోకి దిగి, ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తాలూకా ఆస్పత్రికి తరలించారు. కాగా అస్మాకు జన్మించిన నవజాత శిశువు (బాలుడు) ప్రస్తుతం పెరుంబావూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అస్మా మరణంచడానికి గల కారణాలను, ఆమెకు సరైన వైద్య సదుపాయాలు ఎందుకు అందలేదనే అంశంపై విచారిస్తున్నారు. ఈ దుర్ఘటన కేరళలో ఇంటి వద్ద జరిగే ప్రసవాల సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో సరైన వైద్యవ్యవస్థ ఉన్నప్పటికీ, మలప్పురం జిల్లాలో ఇంటి వద్ద ప్రసవాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గత ఐదేళ్లలో (2019-2024) కేరళలో 2,931 ఇంటి ప్రసవాలు నమోదయ్యాయని ఒక నివేదిక వెల్లడించింది. వీటిలో మలప్పురం జిల్లాలోనే 1,244 కేసులు ఉన్నాయి. 18 నవజాత శిశువుల మరణాలు కూడా జిల్లాలో సంభవించాయి.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా

నేడు సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ
ఢిల్లీ : వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ ధర్మాసనం విచారణ జరపనుంది.మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ నమోదుచేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ మిథున్‌రెడ్డి గత నెలలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్‌పై విచారణ జరిగే సమయంలో ఏపీ సీఐడీ తరుఫు న్యాయవాది మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ హైకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్‌రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని చెప్పారు. దీంతో, మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీం కోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

‘ద్రోహి’వ్యాఖ్యలు.. బాంబే హైకోర్టులో కునాల్ కమ్రా క్వాష్ పిటిషన్
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై (Eknath Shinde) నోరు పారేసుకున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా (kunal kamra) బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను సవాలు చేస్తూ కోర్టులో క్వాష్ పిటిషన్ (quash petition) దాఖలు చేశారు. ‘నయా భారత్’ అనే స్టాండప్ కామెడీ షోలో కునాల్ కమ్రా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ‘గద్దార్’ (ద్రోహి)గా పేర్కొంటూ ఓ పేరడీ పాటను ఆలపించారు. దీనిపై వివాదం చెలరేగింది. డిప్యూటీ సీఎంపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముర్జీ పటేల్ ఫిర్యాదు మేరకు కునాల్ కమ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా కార్యక్రమ వేదికపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అతడిని అరెస్టు చేయాలంటూ డిమాండ్లు చేశారు.అయితే, ఈ తరుణంలో ఇవాళ శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ ఫిర్యాదు ఆధారంగా మార్చి 24న ఖార్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కమ్రా బాంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు.అంతకుముందు, తాను చేసిన వ్యాఖ్యలపై అంతేకాదు చట్ట బద్ధంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అదే సమయంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మార్చి 27న మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. షరతులతో ఏప్రిల్ 7 వరకు గడువిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.న్యాయ స్థానం బెయిల్ ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 1న నమోదైన మూడు ఎఫ్ఐఆర్లపై ఖార్ పోలీస్‌స్టేషన్‌కు విచారణకు హాజరు కావాలని కునాల్ కమ్రాను పోలీసులు కోరారు. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. అయినప్పటికీ స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

తమిళనాట ట్విస్ట్ .. మంత్రి నెహ్రు ఇంట్లో ఈడీ సోదాలు
చెన్నై: తమిళనాడులో రాజకీయం హీటెక్కింది. మంత్రి కేఎన్ నెహ్రు, ఆయన కుమారుడు, లోక్‌సభ సభ్యుడు అరుణ్ నెహ్రూకు సంబంధించిన నివాసాల్లో తాజాగా ఈడీ సోదాలు నిర్వహించింది. దీంతో, ఇరు నేతల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వారి ఇళ్ల వద్దకు చేరుకున్నారు.వివరాల ప్రకారం.. తమిళనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేఎన్ నెహ్రూ ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామునే ఈడీ అధికారులు.. నెహ్రుకు సంబంధించిన నివాసాలకు చేరుకున్నారు. అయితే, మంత్రి నెహ్రూ సోదరుడు ఎన్. రవిచంద్రన్ చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ట్రూ వాల్యూ హోమ్స్(టీవీహెచ్)లో ఆర్థిక అవకతవకలకు జరిగినట్టు ఈడీ అధికారులు తెలిపారు. దానికి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి. టీవీహెచ్ 1997లో స్థాపించబడింది. రాష్ట్రంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థగా గుర్తింపు ఉంది.#WATCH | Tamil Nadu | ED (Enforcement Directorate) searches underway in Chennai on True Value Homes (TVH) Builders. TVH has alleged connection with state minister KN Nehru. Searches at multiple locations started early this morning: Sources(Visuals from the residence of… pic.twitter.com/tpXXEJpgGP— ANI (@ANI) April 7, 2025
ఎన్ఆర్ఐ

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!

అమెరికాలో గుడివాడ యువకుడి బలవన్మరణం
హైదరాబాద్, సాక్షి: అమెరికాలో ఆంక్షలు ఓ భారతీయుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేశాయి. ఉద్యోగం పొగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చివరకు ఓ తెలుగు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి.. అంత్యక్రియల విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అభిషేక్ కొల్లి(Abhishek Kolli) స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ దొండపాడు. పదేళ్ల కిందట అభిషేక్ సోదరుడు అరవింద్‌తో కలిసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. ఏడాది కిందట వివాహం జరగ్గా భార్యతో పాటు అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో ఉంటున్నాడు. అయితే ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అవి తాళలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అభిషేక్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతని భార్య.. చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్లకు సమాచారం అందించింది. వాళ్లంతా చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు, వలంటీర్లు అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. అయితే చివరకు మరణాన్ని సోదరుడు అరవింద్ ఆదివారం ధృవీకరించారు. మృతదేహాన్ని సొంత ప్రాంతానికి తరలించడానికి దాతలు సాయానికి ముందుకు రావాలని గోఫండ్‌మీ ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
క్రైమ్

మాజీ ప్రియురాలిపై రౌడీ షీటర్ లడ్డూ దాడి
తెనాలి: స్థానిక అయితానగర్‌కు చెందిన రౌడీ షీటర్ లడ్డూ, గతంలో తనకు సన్నిహితంగా ఉన్న మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపెట్టగా రిమాండ్‌కు ఆదేశించారు. సముద్రాల పవన్‌కుమార్ అలియాస్ లడ్డూ.. పట్టణంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ ఎన్నారైపై దాడి చేశాడు. దీంతో పోలీసులు అతడిని పట్టణ బహిష్కరణ చేశారు. తెనాలి రావొద్దని ఆదేశించారు.అయినా రహస్యంగా పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నాడు. గత అక్టోబరులో బహిరంగంగానే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఆ సంబరానికి కూటమి నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత మూడురోజులకే అంటే అదే నెల 28వ తేదీ రాత్రి డెకరేషన్ పనులు చేస్తుండే నాజరుపేటకు చెందిన కాకుమాను ఇంద్రజిత్ అనే వ్యక్తిపై అయితానగర్ సెంటర్లోనే లడ్డూ దాడిచేశాడు. వర్కర్‌ను స్కూటర్‌పై ఇంటిదగ్గర దించి తిరిగి వెళుతున్న ఇంద్రజిత్‌పై అకారణంగా లడ్డూ దాడిచేశాడు. అతడి స్కూటర్ తీసుకెళ్లి తగులబెట్టాడు. కూటమి నేతలతో ఉన్న బంధం కారణంగానే లడ్డూ ఇంతకు తెగించాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు వార్తల్లొకొచ్చాడు. దూరంగా ఉంచిందని.. తెనాలి సమీపంలో ఓ గ్రామానికి చెందిన ఓ మహిళతో లడ్డూకు పాత పరిచయం ఉంది. ఆమె విజయవాడలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కొంతకాలంగా ఆమె లడ్డూను దూరంగా ఉంచింది. ఆగ్రహం చెందిన లడ్డూ శనివారం తనకోసం విజయవాడ వెళ్లి, తనతో గొడవ పెట్టుకున్నాడు. ఆమెను అనుసరించి తెనాలి వచ్చి, తర్వాత ఆమె నివసించే గ్రామానికి వెళ్లాడు. ఆమెను ఊరి వెలుపలికి రమ్మని బెదిరించాడు. తన దగ్గరకు వచ్చిన మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఫిర్యాదుతో రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తర్వాత అరెస్టుచేసి, స్థానిక ప్రైవేటు వైద్యశాలలో పరీక్షలు చేయించారు. ఆదివారం రాత్రి మేజి్రస్టేటు ముందు హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారు.రూరల్ ఎస్ఐ ప్రతాప్‌కుమార్ కేసు దర్యాప్తుచేస్తున్నారు.

వివాహేతర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): మూడేళ్ల చిన్నారిపై తల్లి పైశాచికంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విజయవాడ పరిధిలోని జక్కంపూడి కాలనీలో నివసించే వందనకు (23) అమ్ములు అనే మూడేళ్ల పాప ఉంది. కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. శ్రీరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో వందన, శ్రీరాములు హైదరాబాద్‌కు మకాం మార్చారు. తమ ఆనందానికి పాప అడ్డుగా ఉందని భావించిన వారు.. ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. వంటిపై, వీపుపై ఇష్టానుసారంగా వాతలు పెట్టడంతో ఆ చిన్నారి కేకలు వేసేది. కేకలు బయటకు రాకుండా నోరు మూసి ఈ అకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం విజయవాడ వచ్చిన వందన, శ్రీరాములు పాపను రైల్వే స్టేషన్లో వదిలేశారు. విషయం తెలుసుకున్న శ్రీరాములు తల్లి సుమలత రైల్వేస్టేషన్‌కు వెళ్లి అమ్ములును ఇంటికి తీసుకొచ్చింది. కాగా, ఈ అకృత్యాలు తెలుసుకున్న స్థానికులు విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

నువ్వు అందంగా ఉన్నావు...
ఖమ్మంవైద్యవిభాగం: ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు.... తక్కువ వయస్సులా కనిపిస్తున్నావు.. చదువుకున్న ఆఫీసర్లా ఉన్నావు.. బొద్దుగా కనిపిస్తున్నావు..’ అంటూ ఓ వివాహితతో ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. చేయి విరిగిన ఆమె సర్జరీ కోసం రాగా.. వైద్యులు, సిబ్బంది ప్రవర్తనతో హహిళ భయబ్రాంతులకు గురికాగా.. ఘటనపై వివాహిత బంధువులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.వైరా నియోజకవర్గానికి చెందిన ఓ వివాహిత ఇంట్లో పనులు చేస్తుండగా కిందపడటంతో చేయికి తీవ్రంగా గాయమైంది. సమీపంలోని ఆర్ఎంపీని సంప్రదిస్తే చేయి విరిగిందని నిర్ధారించి ఖమ్మంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సమీపాన శివ ఆర్థోపెడిక్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అక్కడ పరీక్షించాక సర్జరీ చేయాలని చెప్పడంతో గత గురువారం ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం సర్జరీ చేసేందుకు నిర్ణయించగా, ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లాక సదరు మహిళపై సిబ్బంది అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఆపై ఆపరేషన్ చేయడానికి వైద్యుడు కూడా అదే మాదిరి ప్రవర్తించాడు. కేస్‌షీట్‌లో వివరాలన్నీ ఉన్నా వయస్సు ఎంత అని అడిగి చెప్పగానే అంత వయస్సులా కనిపించడం లేదు... అందంగా ఉన్నావు... తెల్లగా, వయస్సు తక్కువగా కనిపిస్తున్నావు... అంటూ మాట్లాడడంతో ఆమె భయాందోళనకు గురైంది.ఆ తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చాక కుటుంబీకులకు చెప్పడంతో డాక్టర్, సిబ్బందిని నిలదీస్తే అలాంటిదేమీ బుకాయించారు. దీంతో కొద్దిరోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉన్నా ఇష్టపడని మహిళను డిశ్చార్జ్ చేయించి తీసుకెళ్లాపోయారు. కాగా, ఘటనపై ఆస్పత్రి యాజమాన్యానికి వివాహిత కుటంబీకులు ఫిర్యాదు చేయగా, ఆమె ఆరోగ్యం చక్కబడ్డాక అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై విచక్షణా రహితంగా సిమెంట్ బ్రిక్‌తో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లికి చెందిన మహ్మత్ బస్రత్(32) కోల్‌కత్తాకు చెందిన షబానా పర్వీన్(22)ను 2024 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. హఫీజ్‌పేట్‌లోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. బస్రత్ తల్లిదండ్రులతో పర్వీన్ తరచు గొడవ పడుతుండటంతో రెండు నెలల క్రితం వేరు కాపురం పెట్టాడు. కాగా పర్వీన్‌కు వాంతులవుతుండడంతో రాఘవేంద్ర కాలనీలోని సియాలైఫ్ హాస్పిటల్లో చేర్పించాడు. ఏప్రిల్1న రాత్రి 10 గంటలకు డిశ్చార్జి చేయగా బయటకు వచ్చి ఇద్దరు గొడవపడ్డాడు. కోపంతో బస్రత్ తన్నడంతో షబానా పర్వీన్ కిందపడి పోయింది. అక్కడ ఉన్న రెండు సిమెంట్ బ్రిక్లతో దాదాపు 15 సార్లు తల, శరీరంపై మోదాడు. చనిపోయిందనుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడి చికిత్సపొందుతోంది. వైద్యులు నిర్వహించిన పరీక్షలలో మూడు నెలల గర్భిణి అని తేలిందని, షబానా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/St6JwDt1Ti— ChotaNews App (@ChotaNewsApp) April 7, 2025
వీడియోలు


కర్నూలులో కాటసాని రాంభూపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్


కూటమి సర్కార్‌పై YSRCP అధినేత వైఎస్ జగన్ ఫైర్


Botsa : కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం 32 శాతం ఆదాయం తగ్గింది


Appala Raju: జగన్ మీద కక్షతో ఆరోగ్య రంగాన్ని నాశనం చేశారు


పల్లా శ్రీనివాసరావు కారుకు అడ్డుపడ్డ టీడీపీ శ్రేణులు


Madhurawada Incident: నిందితుడికి ఉరిశిక్ష వేయాలి: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి


సన్ రైజర్స్ అడ్రెస్ గల్లంతు! ప్లే ఆఫ్ చేరాలంటే...


భూమికి ముప్పు?


అంజాద్ బాషా తమ్ముడు అరెస్ట్ పై YSRCP నేతల రియాక్షన్


లీటర్‌కు రూ.2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంపు