Top Stories
ప్రధాన వార్తలు

హ్యాట్సాఫ్.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ పాలనలో పేదల నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లేవని.. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచం లాగిపడేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్రకార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు.‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హాట్సాఫ్. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే, 39 స్థానాలు వైఎస్సార్సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు. వారికి సంఖ్యా బలం లేనే లేదు. కానీ.. భయాందోళనల ఈ ప్రభుత్వం మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకుంది. పోలీసులతో భయపెట్టి, బెదిరించారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధిలేదు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలి. కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజంగా ఇది ధర్మమేనా? న్యాయమేనా?. చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో ఏదో ఒక బటన్ నొక్కేవాళ్లం. ఏదోరూపంలో ప్రతి కుటుంబానికీ మంచి జరిగింది. నాలుగువేళ్లూ నోట్లోకి పోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ఇప్పుడు ఉన్న ప్లేటును కూడా తీసేశాడు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదు. తిరుపతి మున్సిపల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారు. విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి, అక్కడ అక్రమాలు చేస్తున్నారు. మన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం మనవాళ్లు చేశారు. అక్కడ 40వ వార్డు కార్పొరేటర్ ఇంటికి వెళ్లి.. ఆయన భార్యను భయపెట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9కి వైయస్సార్సీపీవే. కాని అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి.. దారి మళ్లించి, స్వయంగా ఎస్సై ఎంపీటీసీలను కిడ్నాప్‌చేసే పరిస్థితి కనిపిస్తోంది. అప్పటికీ వినకపోతే, ఏకంగా మండల కార్యాలయంలో నిర్బంధించి బైండోవర్ చేశారు. అంతటితో ఆగకుండా లింగమయ్య అనే బీసీ నాయకుడ్ని చంపేశారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా?.. .. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16కు 16 ఎంపీటీసీలు మనవాళ్లే. ఆరుగుర్ని ప్రలోభపెట్టి.. తీసుకెళ్లిపోయాడు. మరో 9 మంది వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారు. వాళ్లను ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా పోలీసులు, టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కోరం లేకపోయినా.. గెలిచామని డిక్లేర్ చేయించుకున్నారు. రాష్ట్రానికి సీఎం, కుప్పంకు ఎమ్మెల్యే చంద్రబాబే.. అయినా సరే ఒక చిన్నపదవికోసం ఇన్ని దారుణాలు చేశారు.ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు, నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు. దీనికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు. వీరు చూపించిన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ రుణపడి ఉంటాడు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెట్టాడు. సమాజంలో ఉన్న 20శాతం పేదవాళ్ల బాగోగులకు 10శాతం మందికి అప్పగిస్తాడంట!. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.48శాతం కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో ఇన్‌కం ట్యాక్స్ కట్టేవారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్‌కంట్యాక్స్ కడుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఈ 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా?. ఇన్ని రకాలుగా మోసాలు చేస్తాడు చంద్రబాబు. చివరకు చంద్రబాబు మీటింగ్‌ల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు, కాని కావాలనే మోసం చేస్తాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గురించి అడిగితే రాష్ట్రం అప్పుల పాలు అంటాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగరగొట్టడానికి అప్పులపై అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలకు సమస్యలు వస్తే వాటి పరిష్కారంకోసం తపించే ప్రభుత్వం రావాలని ప్రజలు మళ్లీ కోరుకుంటారు. మాటచెప్తే.. ఆ మాటమీద నిలబడే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. రాబోయే రోజులు మనవి. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వైఎస్సార్సీపీ(YSRCP) అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఈసారి కార్యకర్తలకోసం కచ్చితంగా పార్టీ నిలబడుతుంది. కోవిడ్ కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు. జగన్ 2.O దీనికి భిన్నంగా ఉంటుంది. కార్యకర్తలకోసం గట్టిగా నిలబడతాను’’ అని జగన్ అన్నారు.

HCU భూ వివాదం.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్,సాక్షి : తెలంగాణ హైకోర్టులో కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నానం 2:15కి వాయిదా వేసింది. రేపటి వరకు హెచ్‌సీయూ భూముల్లో చెట్లు కొట్టివేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు అటవీ భూములను తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి, చదును చేయడాన్ని వెంటనే ఆపాలని హైకోర్టులో హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కె.బాబురావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ‘సర్వే నంబర్ 25లోని కంచ గచ్చిబౌలి అడవిలో 30–40 జేసీబీలతో సర్కార్ చెట్లను తొలగిస్తోంది. హింసాత్మక అటవీ నిర్మూలనను ఆపాలి’అని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు..ప్రభుత్వం ఆ 400 ఎకరాలను చదును చేస్తున్న నేపథ్యంలో అత్యవసర విచారణ చేపట్టాలని తొలి పిల్ దాఖలు చేసిన వటా ఫౌండేషన్ (ఈఎన్‌పీవో) తరఫు న్యాయవాది ఒమర్ ఫారుక్.. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు విజ్ఞప్తి చేశారు. మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశారు. అభ్యర్థనను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనంరెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బుధవారం విచారణ చేపట్టింది. ఇరుణ పక్షాల వాదనలు విన్న కోర్టు కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు కొట్టివేయొద్దని ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణ అటవీశాఖకు కేంద్రం ఆదేశాలు అదే సమయంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంచ గచ్చిబౌలి భూములపై నిజనిర్ధారణ నివేదిక పంపాలని తెలంగాణ అటవీశాఖ అధికారులకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం కోరింది. కోర్టు తీర్పులకు లోబడే ముందుకు వెళ్లాలని సూచించింది. అటవీ చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలని తెలిపింది. నిజ నిర్ధారణ నివేదికతో పాటు సంబంధిత శాఖ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం!
టీమిండియా స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో ఇకపై ముంబైకి ఆడకూడదని ఈ యువ ఓపెనర్ నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు జైసూ ఈ- మెయిల్ పంపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా ఉత్తరప్రదేశ్‌లోని సురియాకు చెందిన యశస్వి జైస్వాల్.. దేశవాళీ క్రికెట్లో చాలా ఏళ్లుగా ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన అండర్-19 కెరీర్ నుంచి ముంబైకి ఆడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. విజయ్ హజారే (వన్డే) టోర్నీలో డబుల్ సెంచరీ బాదడం ద్వారా క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు.డబుల్ సెంచరీలతో సత్తా చాటిఅంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడే అవకాశం దక్కించుకున్న జైస్వాల్ 2020లో క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. కెరీర్ ఆరంభం నుంచి రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న 23 ఏళ్ల జైస్వాల్.. అక్కడసత్తా చాటడం ద్వారా 2023లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.టెస్టుల్లో సత్తా చాటుతున్న ఈ యువ ఓపెనర్.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా జట్టులో పాతుకుపోయాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 19 టెస్టుల్లో 1798 పరుగులు చేసిన జైసూ ఖాతాలో నాలుగు శతకాలతో పాటు.. రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం సత్తా చాటలేకపోతున్నాడు. 23 టీ20లలో కలిపి 723 పరుగులు చేసిన జైస్వాల్.. ఒకే ఒక్క వన్డే ఆడి 15 పరుగులకే పరిమితమయ్యాడు.ఇక జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు.. 2024 రంజీ బరిలో దిగాడు జైస్వాల్. ముంబై తరఫున రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసి విఫలమయ్యాడు. గోవాకు ఆడేందుకు సిద్ధంఅయితే, వచ్చే సీజన్ నుంచి జైస్వాల్ గోవాకు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయాన్ని ఎంసీకేకు మెయిల్ ద్వారా తెలిపినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.అర్జున్ టెండుల్కర్, సిద్దేశ్ లాడ్ మాదిరి జైస్వాల్ కూడా ముంబై జట్టును వీడి.. గోవాకు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ విషయం గురించి ఎంసీఏ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడు గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయమై నిరభ్యంతర పత్రం (No Objection Certificate) కోసం మెయిల్ పంపాడు.వ్యక్తిగత కారణాల వల్లే గోవాకు ప్రాతినిథ్యం వహించాలని భావిస్తున్నట్లు తెలిపాడు’’ అని తెలిపాయి. కాగా గోవా జట్టుకు జైస్వాల్ కెప్టెన్‌గా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక జైసూ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఫామ్‌లేమితో సతమతంగతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో చతికిల పడ్డ యశస్వి జైస్వాల్.. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసి.. ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో పదిహేను పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-202 ప్రాథమిక జట్టులో అతడికి చోటు ఇచ్చిన సెలక్టర్లు.. ఆ తర్వాత ప్రధాన జట్టు నుంచి తప్పించారు. ఇక ఐపీఎల్-2025లోనూ ఈ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి జైస్వాల్ కేవలం 34 పరుగులే చేశాడు. కాగా రూ. 18 కోట్లకు రాజస్తాన్ అతడిని రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు ఆ క్రెడిట్ దక్కలేదు: టీమిండియా దిగ్గజం

లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. స్పీకర్ హెచ్చరిక
Waqf Bill In Lok sabha Updates..మత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదు: గౌరవ్ గొగొయ్దేశ ప్రజల్లోని సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నమిదిరాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కొన్ని నియమాలను సృష్టించుకునే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉందిదానిని పూర్తిగా తొలగించాలని చూస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ ఎంపీ#WATCH | Deputy Leader of Congress in Lok Sabha, Gaurav Gogoi, speaks on the Waqf Amendment Bill He says, "Did the Minority Affairs Ministry make this bill, or did some other department make it? Where did this Bill come from?... Today, the condition of minorities in the country… pic.twitter.com/QJPNnwcpyI— ANI (@ANI) April 2, 2025 వక్ప్ భూములపై కిరణ్ రిజుజు కీలక వ్యాఖ్యలు..వక్ఫ్ సవరణ బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో వివరిస్తున్న కిరణ్ రిజుజుఈ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు.బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఇది తెలుసుకోవాలి.మత విశ్వాసాల విషయంలో ఎలాంటి జోక్యం ఉండదు.వక్ఫ్ చట్టం లోపాలతో అనేక ఉల్లంఘనలకు అవకాశం ఏర్పడింది.పార్లమెంట్ భవనం కూడా తమ ఆస్తేనని వక్ఫ్ బోర్డు అన్నది.వక్ప్ వాదనను ప్రధాని మోదీ అడ్డుకున్నారు.యూపీఏ అధికారంలో ఉండి ఉంటే ఢిల్లీలో 23 కీలక స్థలాలు వక్ఫ్ సొంతం అయ్యేవి.123 విలువైన ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ వక్ఫ్‌కు కట్టబెట్టింది.2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌కు ఆస్తులు కట్టబెట్టారు.దేశంలో మూడో అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ దగ్గర ఉంది.భారతీయ రైల్వే దగ్గర అత్యధికంగా ల్యాండ్ ఉంది.ఆ భూమిని భారతీయులుంతా వినియోగించుకుంటున్నారు.రెండో స్థానం రక్షణ శాఖ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది.మూడో స్థానంలో ఉన్న వక్ఫ్ భూములను భారతీయులంతా వినియోగించుకోలేరు.ప్రపంచంలోనే అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది.మసీదుల నిర్వహణపై ఈ చట్టం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు.కిరణ్ రిజుజు వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అభ్యంతరం.కేంద్రమంత్రి మాట్లాడేటప్పుడు అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను హెచ్చరించిన స్పీకర్ ఓం బిర్లా..#WATCH | After introducing the Waqf Amendment Bill in Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says "A case ongoing since 1970 in Delhi involved several properties, including the CGO Complex and the Parliament building. The Delhi Waqf Board had claimed these as Waqf… pic.twitter.com/qVXtDo2gK7— ANI (@ANI) April 2, 2025 అమిత్ షా కామెంట్స్..జేపీసీ నివేదికలో ఇచ్చిన సవరణలతో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టాం.జేపీసీ వేయాలని కాంగ్రెస్ సహా విఫక్షాలు కోరాయి.విపక్షాల డిమాండ్ మేరకే జేపీసీ వేశాం.ప్రభుత్వం తెచ్చిన బిల్లులో జేపీసీ సవరణలు సూచించింది.మేము కాంగ్రెస్ లాగా జేపీసీ సవరణలను పట్టించుకోకువడా బిల్లును యథాతథంగా తీసుకురాలేదు. #WATCH | Waqf (Amendment) Bill taken up for consideration and passing in Lok SabhaUnion Home Minister Amit Shah says, "...It was your (opposition) insistence that a Joint Parliamentary Committee should be formed. We do not have a committee like the Congress. We have a… pic.twitter.com/bbKRTuheft— ANI (@ANI) April 2, 2025 కిరణ్ రిజుజు కామెంట్స్..ఈ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు.అన్ని వర్గాల సలహాలను తీసుకున్నాం.మైనార్టీల్లో అనవసర భయాలను సృష్టిస్తున్నారు.బిల్లుపై విస్తృత చర్చ జరిపాం.గతేడాది వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.జేపీసీ నివేదిక తర్వాత వక్ఫ్ బిల్లులో సవరణలు చేసిన ప్రభుత్వం లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో ప్రారంభమైన చర్చలోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్ రిజుజుచర్చ అనంతరం ఓటింగ్ చేపట్టే అవకాశం #WATCH | Parliamentary Affairs Minister Kiren Rijiju introduces Waqf Amendment Bill in Lok Sabha. pic.twitter.com/BukG8RSqBT— ANI (@ANI) April 2, 2025వక్ఫ్ బిల్లుకు ఢిల్లీ మహిళల మద్దతు..ఢిల్లీలో పలువురు ముస్లిం మహిళలు బయటకు వచ్చి బీజేపీకి మద్దతు.వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తూ ప్రకటన.మోదీకి మద్దతు తెలుపుతూ ఫ్లకార్డుల ప్రదర్శన #WATCH | Women in Delhi come out in support of Waqf (Amendment) Bill to be presented today in Lok Sabha https://t.co/Eo2X9nBo9s pic.twitter.com/HGWKHnRwLD— ANI (@ANI) April 2, 2025కేంద్రమంత్రి కిరణ్ రిజుజు కామెంట్స్..కొంతమంది మత పెద్దలు సహా కొందరు నాయకులు అమాయక ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారు. అలాంటి కొందరు వ్యక్తులే సీఏఏ.. ముస్లింల పౌరసత్వ హోదాను తొలగిస్తుందని చెప్పారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు అవసరమని వ్యక్తిగతంగా చెబుతున్నారు. కానీ, వారి ఓటు బ్యాంకు కోసం దానిని వ్యతిరేకిస్తున్నారు అని అన్నారు.#WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha today Union Minister of Minority Affairs, Kiren Rijiju says, "Union Minority Affairs Minister Kiren Rijiju says, "Some leaders, including some religious leaders, are misleading innocent Muslims... The same… pic.twitter.com/EfzC86vrAC— ANI (@ANI) April 2, 2025రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ కామెంట్స్..దేశంలో లౌకిక పార్టీ ఎవరో ఈరోజే నిర్ణయించబడుతుంది.బీహార్‌లో ఎన్నికలు ఉన్నాయి.జేడీయూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే, వారు ఎన్నికల్లో ఓడిపోతారు.బీజేపీ దానిని ఆమోదించే అవకాశం పొందడానికి వారు వాకౌట్ చేసే అవకాశం ఉంది.చిరాగ్ పాస్వాన్ కూడా అదే చేయగలరు.ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఎవరు ఓటు వేస్తారో చూడాలి#WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayRajya Sabha MP Kapil Sibal says "...It will be decided today who is a secular party in this country. There are elections in Bihar, if JDU votes in favour of the Bill, they will lose the elections. It is… pic.twitter.com/F5YnPRmzYh— ANI (@ANI) April 2, 2025కాంగ్రెస్ ఎంపీ నిరసన.. లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢి నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు.Congress MP Imran Pratapgarhi arrives at the Parliament wearing black attire to protest against the Waqf Amendment Bill, which will be introduced in Lok Sabha today pic.twitter.com/5UdDhZedtH— ANI (@ANI) April 2, 2025 వైఎస్సార్సీపీ లోక్‌సభపక్ష నేత మిథున్ రెడ్డి కామెంట్స్..ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాంలోక్‌సభ, రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాంమైనారిటీ సమాజానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ప్రకటించారుముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిస్తున్నారు చంద్రబాబు మరోసారి ముస్లింలను మోసం చేశారుఅన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలిముస్లింల ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరంవక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలను అణచివేసే విధంగా ఉందిఇదిలాగే కొనసాగితే దేశంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉంది 👉నేడు లోక్‌సభలో కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.👉తాజాగా కాంగ్రెస్ ఎంపీ, జేపీసీ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ మేము నిజం చెప్పాలనుకుంటున్నాను. ముస్లింలకు ఏమీ జరగదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ప్రభుత్వానికి వాటా ఉన్న ప్రభుత్వ ఆస్తి వివాదాస్పదమని, నియమించబడిన అధికారి దర్యాప్తు చేసే వరకు ఆ ఆస్తిని వక్ఫ్‌గా పరిగణించబోమని, వివాదాస్పద ఆస్తి ఇకపై వక్ఫ్‌గా ఉండదని వారు నిబంధన చేశారు’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayCongress MP and JPC member Imran Masood says, "We are ready for discussion. But I want to tell you the truth. The government is repeatedly saying that nothing will happen to Muslims, but they have made a… pic.twitter.com/ZULzEi1RzT— ANI (@ANI) April 2, 2025👉 ఇక, బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు.👉బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆయా పార్టీలు విప్ జారీ చేశాయి. వక్ఫ్ (సవరణ) బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు.👉ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయించారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 298 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి. ఏమిటీ వివాదం? 👉వక్ఫ్ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం.👉ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయించాలి.👉ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి.

అండగా ఉంటా.. ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులతో వైఎస్ జగన్
తాడేపల్లి,సాక్షి: ఫార్మసీ విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పూర్తి అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.రాజమహేంద్రవరంలో కిమ్స్ బొల్లినేని ఏజీఎం దీపక్ వేధింపులు తాళలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు బుధవారం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్‌ను కోరారు.అందుకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. విద్యార్థిని విషయంలో కుటుంబానికి న్యాయం జరిగేవరకూ పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో విద్యార్థిని తల్లిదండ్రులు అనంత లక్ష్మి, దుర్గారావుతో పాటు, వైఎస్సార్సీపీ నేతలు మార్గాని భరత్, వరుదు కళ్యాణి, ఆరె శ్యామల ఉన్నారు.

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలు మారినా ఉప ఎన్నికలు రావు అని రేవంత్ చేసిన వ్యాఖ్యలను బుధవారం విచారణలో ప్రత్యేకంగా ప్రస్తావించిన జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలే చేసింది.పవిత్రమైన చట్టసభలో ఈ వ్యాఖ్యలు చేయడం... రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అపహాస్యం చేయడం కిందకే వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా సీఎంకు హితవు చెప్పండి. ఎట్టిపరిస్థితుల్లో ఈ తరహా వ్యాఖ్యలను ఉపేక్షించబోం. అవసరమైతే కోర్టు ధిక్కారంగా భావించాల్సి వస్తుంది’’ అని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఉద్దేశించి జస్టిస్ గవాయ్ అన్నారు.మేం అన్నీ ఆలోచించే కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తున్నాం. అంతమాత్రాన మాకు అధికారాలు లేవని కాదు. అసెంబ్లీలో నాయకులు చేసే ప్రకటనలకు ఒక విలువ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడే అంశాలను కోర్టులు కూడా తీసుకుంటాయి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అలాంటప్పుడు అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని వ్యాఖ్యానించారు.

స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న సంగతి మరవొద్దు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ బుధవారం వాదనలు వినిపించారు. స్పీకర్‌కు కోర్టులు గడువు విధించడం సరికాదని ఆయన వాదించారు. ఈ క్రమంలో.. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా? అని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు. ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే జ్యుడీషియల్ సమీక్షకు అవకాశముంటుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ స్పీకర్‌కు గడువు విధించడం సరికాదు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందే. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పడం భావ్యం కాదు. ఒకవేళ సూచనలు చేస్తే స్వీకరించాలా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయమే. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదు’’ అని ముకుల్ రోహత్గీ వాదించారు.ముకుల్ రోహత్గీ వాదనల్లో జస్టిస్ బీఆర్ గవాయ్ జోక్యం చేసుకున్నారు. హైకోర్టు జోక్యం చేసుకోవద్దా?. రాజ్యాంగ పరిరక్షకులుగా న్యాయస్థానాలు వ్యవహరిస్తాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే సుప్రీం కోర్టు కూడా చేతులు కట్టుకుని చూస్తుండాలా?. నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా?. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న విషయం మరిచిపోవద్దు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా? ఆయనకు విజ్ఞప్తి చేయడమో.. ఆదేశించడమో చేయలేమా? అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అయితే అది ప్రత్యేక సందర్భమన్న రోహత్గి.. సుప్రీం కోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉందని, నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయొచ్చని తెలియజేశారు.. ఫిరాయింపులపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని వాదించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని.. కనీసం ఆలోచించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని కోర్టుకు తెలియజేశారు.2024 మార్చి 18న పిటిషనర్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. 2025 జనవరి 16న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ తన విధులు నిర్వర్తిస్తున్నారు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున ఇవాళ ముకుల్ రోహత్గీ వాదనలు ముగిశాయి. ఇక అసెంబ్లీ కార్యదర్శి తరపున రేపు(గురువారం) వాదనలు వినిపిస్తానన్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బెంచ్ సమ్మతి తెలిపి విచారణ వాయిదా వేసింది. తెలంగాణలో కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతరులు పిటిషన్లు వేశారు. అయితే మొదటి నుంచి ఈ కేసు విచారణలో తెలంగాణ స్పీకర్ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేస్తూనే వస్తోంది. గత విచారణలో.. బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదనలు పూర్తి చేశారు. ఆ వాదనల సమయంలో.. సుప్రీం కోర్టు ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలే చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది.

లోకేష్.. దమ్ముంటే వారితో సెల్ఫీ తీసుకో చూద్దాం?: రోజా సీరియస్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే మాటలకు.. చేసే పనులకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్‌కు ఉందా? అని సవాల్ విసిరారు.మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ఏప్రిల్ ఫూల్ చేశారు. ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారు. మూడు లక్షల మందికి పెన్షన్లను తొలగించి వారిని ఇబ్బంది పెడుతున్నారు. జనాన్ని ఫూల్స్ చేయటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వలంటీర్లు, నిరుద్యోగులను ఫూల్స్ చేసి రోడ్డున పడేశారు. అమ్మ ఒడి ఇవ్వకుండా తల్లులు, పిల్లలను ఫూల్స్ చేశారు. ఉచిత బస్సు పేరుతో మహిళలను ఫూల్స్ చేశారు. సూపర్ సిక్స్ ఇవ్వటం కష్టంగా ఉందని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చంద్రబాబుకు సూపర్ సిక్స్ ఇవ్వటం చేతకాకపోతే పదవిలో నుండి దిగిపోవాలిలక్షా 52 వేల కోట్ల అప్పులు చేసి విజనరీగా చెప్పుకుంటున్నారు. చెత్త సీఎంగా చంద్రబాబు చరిత్ర సృష్టించారు. రూ.15లక్షల కోట్ల అప్పులు చేశారంటూ వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేశారు. చివరికి తాను చేసింది తప్పుడు ఆరోపణలని అసెంబ్లీలోనే చంద్రబాబు అంగీకరించారు. హామీలు ఇచ్చి జనాలను ఫూల్స్ చేశారు. రైతులకు భరోసా లేదు, గిట్టుబాటు ధర అసలే లేదు. మీరు అబద్దాలు మాట్లాడి, ఎల్లో మీడియాతో అబద్దాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే గంజాయి పండిస్తున్నారు.ఈవీఎంలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోయారు. కరువుతో జిల్లాలకు జిల్లాలు అల్లాడిపోతున్నాయి. మంత్రి నారా లోకేష్ కామెడీ పాదయాత్ర చేశారు. పెట్రోలు బంకులు, షాపుల దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ వాటి దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము ఉందా?. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఎక్కడపడితే అక్కడ గంజాయి సాగు జరుగుతోంది. చంద్రబాబు నివాసానికి సమీపంలోనే లిక్కర్ బెల్టుషాపులు ఉన్నాయిరాజమండ్రిలో యువతి ఆత్మహత్యాయత్నం విషయంలో టీడీపీ కుట్రలు చేసింది. దీపక్ అనే నిందితుడు టీడీపీ లీడర్లకు ముఖ్య అనుచరుడు. ఆస్పత్రి కూడా టీడీపీ నేతలదే. అక్కడ సీసీ పుటేజీని ఎవరు మాయం చేశారో ఎందుకు తేల్చలేదు?. యువతి చావు బతుకుల మధ్య ఉంటే ఏజీఎం మీద చర్యలేవీ?. సూసైడ్ లెటర్ దొరికింది కాబట్టి ఏజీఎం అసలు గుట్టు బయటపడింది. బాధిత యువతికి మెడిసిన్ ఎవరు ఎక్కించారు?. ఆ అమ్మాయి జీవితంతో దీపక్ అనేవాడు ఆడుకున్నాడు.త్రిపురాంతకంలో ఎంపీటీసీ సృజనను కిడ్నాప్ చేశారు. మూడు రోజుల పాటు ఆమెను గదిలో బంధించారు. మొన్నటి జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్‌కు నిజమైన సైనికులుగా నిలబడి మావారు పని చేశారు. రెడ్ బుక్కు భయపడలేదు. పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లాగా తయారు అయ్యారు. రూల్స్‌కు విరుద్ధంగా పనిచేస్తే పోలీసులు పర్యావసానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్యాయం చేసిన వారికి పోలీసులు అండగా ఉండొద్దు.రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామంటే ఊరుకోం. పీ-4 కార్యక్రమం వలన చంద్రబాబు కుటుంబమే బాగుపడుతుందే తప్ప ప్రజలు కాదు. తిరుమలలో మద్యం, గంజాయి దొరుకుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లాడు?. తిరుపతి మెట్లు కడిగి ఎందుకు పాశ్చాత్య పడలేదు?. రాజమండ్రి ఘటనపై ఎందుకు స్పందించటం లేదు?. వెకిలి నవ్వులు నవ్వుతూ పవన్ ఎక్కడ దాక్కున్నారు?. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపి ముస్లిం సమాజాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసం చేశారు. వారిద్దరికీ సరైన సమయంలో ముస్లింలు గుణపాఠం చెబుతారు. వైఎస్సార్సీపీలోని స్ట్రాంగ్ లీడర్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నన్ను అరెస్టు చేసి సంబరాలు చేసుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు.

ఆల్‌టైమ్ గరిష్ఠానికి పసిడి.. బంగారం ధరలు ఇలా
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల కొంత శాంతించినట్లు కనిపించినా తిరిగి జీవితకాల గరిష్టాలను చేరుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై, చెన్నై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.85,100 (22 క్యారెట్స్), రూ.92,840 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. దేశ రాజధాని నగరం దిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.85,250కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.92,990గా ఉంది. బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులు చెందలేదు. స్థిరంగా ఉన్నాయి.ఇదీ చదవండి: దేశంలోని బిలియనీర్లలో ఒకరిగా నిర్మల్ మిండావెండి ధరలుబంగారం ధరలు స్థిరంగా ఉన్నట్లే వెండి ధరల్లోనూ బుధవారం ఎలాంటి మార్పులు రాలేదు. కేజీ వెండి రేటు(Silver Price) ప్రస్తుతం రూ.1,14,000గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ఆదిత్య 369.. విజయశాంతి చేస్తానంది.. కానీ..: నిర్మాత
ఆదిత్య 369 (Aditya 369 Movie).. 1991లో వచ్చిన టైం ట్రావెల్ సినిమా. ది టైం మెషీన్ అనే నవల నుంచి స్ఫూర్తి పొంది తీసిన మూవీ ఇది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని కథానాయికగా నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 4న రీరిలీజ్ అవుతోంది.విజయశాంతిని అనుకున్నాం..ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ఆదిత్య 369 సినిమా మొదటగా విజయశాంతిని అనుకున్నాం. తను కూడా సరేనంది. కానీ అప్పటికే ఆమె సినిమాలతో బిజీగా ఉంది. మీరు వేరే హీరోయిన్ను తీసుకోండి, నాకు విజయశాంతి కావాలని అడిగాను. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. సరేలే అనుకుని రాధను సెలక్ట్ చేయాలనుకున్నాం. కానీ, ఆమె కాస్త బొద్దుగా మారటంతో మళ్లీ వేరే కథానాయికను వెతికే పనిలో పడ్డాం.నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్పెళ్లయ్యాక సినిమాలకు గుడ్బైసినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్.. తమిళంలో 'ఈరమాన రోజావే' సినిమా చేస్తున్న అమ్మాయి బాగుందని సూచించాడు. అలా ఆమెను పిలిచి స్క్రీన్ టెస్ట్ చేస్తే అందరికీ నచ్చింది. అలా మోహిని ఈ సినిమా చేసింది. తర్వాత రెండు మూడు సినిమాలు చేసిందనుకుంటాను. అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు ముగింపు పలికింది అని తెలిపాడు. ఇకపోతే ఆదిత్య 369 వచ్చిన 34 సంవత్సరాల తర్వాత దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. కథ రెడీ అయిందని, త్వరలోనే పార్ట్ 2 ఉంటుందని బాలకృష్ణ స్వయంగా వెల్లడించాడు.చదవండి: నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా
ఊరంతా చేపల కూరే...!
ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ రిపీట్ అంటూ తెగ చూసేస్తున్నారా?
IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌కు గుడ్ న్యూస్
మనకు మరో ఆలియా భట్ అవసరం లేదు: అర్జున్ రెడ్డి హీరోయిన్
HCU భూ వివాదం.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
రైలు మిస్ అయినా పర్లేదు..ఇలాంటి టెన్షన్ వద్దు..!
టీడీపీ అరాచకాలు.. వైఎస్ జగన్‌ను కలిసిన చిత్తూరు వైఎస్సార్సీపీ నేత
నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!
తెలుగులో ‘కరాటే కిడ్: లెజెండ్స్’.. ట్రైలర్ రిలీజ్
ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి
హ్యాట్సాఫ్.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్ జగన్
లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. స్పీకర్ హెచ్చరిక
స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న సంగతి మరవొద్దు: సుప్రీం కోర్టు
లక్నోపై పంజాబ్ ఘన విజయం..
చిలీ అధ్యక్షునితో మోదీ భేటీ
HCU వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్(వీడియో)
విశాఖలో ప్రేమోన్మాది దాడి.. తల్లి మృతి, కూతురి పరిస్థితి విషమం
పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం?
హెచ్‌సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
అండగా ఉంటా.. ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులతో వైఎస్ జగన్
35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!
ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్ అణుబాంబులు!
ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. చిన్నారి మృతి
మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్ ఇచ్చిన రెండో అత్త
సింధు తర్వాత ఎవరు?
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రాంబాబు క్లారిటీ
విగ్ కూడా పెట్టుకోరు.. రజనీకాంత్‌పై బాలీవుడ్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆదిత్య 369.. విజయశాంతి చేస్తానంది.. కానీ..: నిర్మాత
పోలీసుపై రెడ్ బుక్ రూల్
నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
‘ఒలింపిక్ పతకం గెలిచుంటే బాగుండేది’
HCU భూ వివాదం.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం
40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?
ఆల్‌టైమ్ గరిష్ఠానికి పసిడి.. బంగారం ధరలు ఇలా
శాంతి చర్చలకు సిద్ధం: కేంద్రానికి మావోయిస్టుల లేఖ
జీబ్లీ ఇమేజ్.. పర్సనల్ డ్యామేజ్?
బంగారం ఇచ్చి నీ భార్యను తీసుకుపో..!
beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్
నారా లోకేష్ పీఏ దందా.. తిరుమల దర్శనాల టికెట్స్..
అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
జీఎస్టీ వసూళ్ల రికార్డు
పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగిరావాలి, లేకుంటే..: రేవంత్‌రెడ్డి
లోకేష్.. దమ్ముంటే వారితో సెల్ఫీ తీసుకో చూద్దాం?: రోజా సీరియస్
తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు: భూమన
హాలీవుడ్లో విషాదం.. ‘బాట్‌మ్యాన్’ ఇక లేరు!
Best Places to Visit వేసవి విహారం
లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత
వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్
నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!
యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం!
మాకు సొంత మైదానం.. కానీ ఇక్కడ..: జహీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి
దేశంలోని బిలియనీర్లలో ఒకరిగా నిర్మల్ మిండా
రేవంత్.. మై హోమ్ విహంగ కూల్చే దమ్ముందా?: కవిత సవాల్
జొమాటోలో ఉద్యోగాల కోత.. కారణం..
మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు
కలిసి నడుద్దాం...
పంజాబ్ ఫటాఫట్
కౌంట్‌డౌన్ స్టార్ట్
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
రతన్ టాటా వీలునామా: ఎవరికి ఎంత కేటాయించారంటే?
తెలుగులో ‘కరాటే కిడ్: లెజెండ్స్’.. ట్రైలర్ రిలీజ్
ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి
ఆస్కార్ ఎంట్రీ సినిమా.. కాపీ కొట్టారంటూ నెటిజన్ల ట్రోల్స్!
భర్త మొబైల్లో పక్కంటి మహిళ ఫోన్ నంబరు..
టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా?
రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను: పంత్
చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్
భారత్‌కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల అంశంలో జోక్యం చేసుకోండి
అసత్య ప్రచారం గట్టిగా తిప్పి కొట్టాలి
వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడమంటే మాకు ద్రోహం చేయడమే
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ
గ్యాసు వేస్టు ఎందుకని!
క్రాష్ మార్కెట్
సైకిల్ చక్రం.. బతుకు చిత్రం
హుర్రే.. అరవైలో కూడా ఇరవైలా మారిపోవచ్చా?
మనకు మరో ఆలియా భట్ అవసరం లేదు: అర్జున్ రెడ్డి హీరోయిన్
నాగర్‌కర్నూల్ ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు
కాసుల కక్కుర్తితో HCU విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు
Ugadi 2025 సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
ఏడాదిలో రూ.1.33 లక్షల కోట్ల సమీకరణ
తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?
ఎవరి పార్టీ ఆఫీసుల్లో వాళ్ల జాతకాలు గొప్పగా చెప్పించుకున్నారు!
శ్రేయస్ అయ్యర్‌కు ఆ క్రెడిట్ దక్కలేదు: టీమిండియా దిగ్గజం
ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి
నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా
ట్రైలర్ చాలా బాగుంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
'బోల్ బేబీ బోల్'తో సెన్సేషన్.. ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్‌తో మరోసారి వైరల్
మహిళలకు డిజిటల్ స్కిల్స్
అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
ప్రైవేటు స్కూళ్లకు సైతం గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది!
పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!
సాక్షి కార్టూన్ 30-03-2025
హైదరాబాద్‌లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
హైవేపై రెండు బస్సులు, కారు ప్రమాదం.. పలువురు మృతి
లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన విచారణ.. శ్రవణ్ రావుకు మళ్లీ నోటీసులు
విదేశీ యువతిపై లైంగికదాడి బాధాకరం
కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్!
పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. ఘాటుగా స్పందించిన నటుడు
బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
మాకూ 'మంత్రి' ఇవ్వండి
ఊరంతా చేపల కూరే...!
ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ రిపీట్ అంటూ తెగ చూసేస్తున్నారా?
IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌కు గుడ్ న్యూస్
మనకు మరో ఆలియా భట్ అవసరం లేదు: అర్జున్ రెడ్డి హీరోయిన్
HCU భూ వివాదం.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
రైలు మిస్ అయినా పర్లేదు..ఇలాంటి టెన్షన్ వద్దు..!
టీడీపీ అరాచకాలు.. వైఎస్ జగన్‌ను కలిసిన చిత్తూరు వైఎస్సార్సీపీ నేత
నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!
తెలుగులో ‘కరాటే కిడ్: లెజెండ్స్’.. ట్రైలర్ రిలీజ్
ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి
హ్యాట్సాఫ్.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్ జగన్
లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. స్పీకర్ హెచ్చరిక
స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న సంగతి మరవొద్దు: సుప్రీం కోర్టు
లక్నోపై పంజాబ్ ఘన విజయం..
చిలీ అధ్యక్షునితో మోదీ భేటీ
HCU వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్(వీడియో)
విశాఖలో ప్రేమోన్మాది దాడి.. తల్లి మృతి, కూతురి పరిస్థితి విషమం
పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం?
హెచ్‌సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
అండగా ఉంటా.. ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులతో వైఎస్ జగన్
35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!
ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్ అణుబాంబులు!
ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. చిన్నారి మృతి
మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్ ఇచ్చిన రెండో అత్త
సింధు తర్వాత ఎవరు?
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రాంబాబు క్లారిటీ
విగ్ కూడా పెట్టుకోరు.. రజనీకాంత్‌పై బాలీవుడ్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆదిత్య 369.. విజయశాంతి చేస్తానంది.. కానీ..: నిర్మాత
పోలీసుపై రెడ్ బుక్ రూల్
నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
‘ఒలింపిక్ పతకం గెలిచుంటే బాగుండేది’
HCU భూ వివాదం.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం
40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?
ఆల్‌టైమ్ గరిష్ఠానికి పసిడి.. బంగారం ధరలు ఇలా
శాంతి చర్చలకు సిద్ధం: కేంద్రానికి మావోయిస్టుల లేఖ
జీబ్లీ ఇమేజ్.. పర్సనల్ డ్యామేజ్?
బంగారం ఇచ్చి నీ భార్యను తీసుకుపో..!
beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్
నారా లోకేష్ పీఏ దందా.. తిరుమల దర్శనాల టికెట్స్..
అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
జీఎస్టీ వసూళ్ల రికార్డు
పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగిరావాలి, లేకుంటే..: రేవంత్‌రెడ్డి
లోకేష్.. దమ్ముంటే వారితో సెల్ఫీ తీసుకో చూద్దాం?: రోజా సీరియస్
తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు: భూమన
హాలీవుడ్లో విషాదం.. ‘బాట్‌మ్యాన్’ ఇక లేరు!
Best Places to Visit వేసవి విహారం
లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత
వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్
నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!
యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం!
మాకు సొంత మైదానం.. కానీ ఇక్కడ..: జహీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి
దేశంలోని బిలియనీర్లలో ఒకరిగా నిర్మల్ మిండా
రేవంత్.. మై హోమ్ విహంగ కూల్చే దమ్ముందా?: కవిత సవాల్
జొమాటోలో ఉద్యోగాల కోత.. కారణం..
మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు
కలిసి నడుద్దాం...
పంజాబ్ ఫటాఫట్
కౌంట్‌డౌన్ స్టార్ట్
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
రతన్ టాటా వీలునామా: ఎవరికి ఎంత కేటాయించారంటే?
తెలుగులో ‘కరాటే కిడ్: లెజెండ్స్’.. ట్రైలర్ రిలీజ్
ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి
ఆస్కార్ ఎంట్రీ సినిమా.. కాపీ కొట్టారంటూ నెటిజన్ల ట్రోల్స్!
భర్త మొబైల్లో పక్కంటి మహిళ ఫోన్ నంబరు..
టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా?
రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను: పంత్
చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్
భారత్‌కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల అంశంలో జోక్యం చేసుకోండి
అసత్య ప్రచారం గట్టిగా తిప్పి కొట్టాలి
వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడమంటే మాకు ద్రోహం చేయడమే
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ
గ్యాసు వేస్టు ఎందుకని!
క్రాష్ మార్కెట్
సైకిల్ చక్రం.. బతుకు చిత్రం
హుర్రే.. అరవైలో కూడా ఇరవైలా మారిపోవచ్చా?
మనకు మరో ఆలియా భట్ అవసరం లేదు: అర్జున్ రెడ్డి హీరోయిన్
నాగర్‌కర్నూల్ ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు
కాసుల కక్కుర్తితో HCU విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు
Ugadi 2025 సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
ఏడాదిలో రూ.1.33 లక్షల కోట్ల సమీకరణ
తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?
ఎవరి పార్టీ ఆఫీసుల్లో వాళ్ల జాతకాలు గొప్పగా చెప్పించుకున్నారు!
శ్రేయస్ అయ్యర్‌కు ఆ క్రెడిట్ దక్కలేదు: టీమిండియా దిగ్గజం
ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి
నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా
ట్రైలర్ చాలా బాగుంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
'బోల్ బేబీ బోల్'తో సెన్సేషన్.. ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్‌తో మరోసారి వైరల్
మహిళలకు డిజిటల్ స్కిల్స్
అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
ప్రైవేటు స్కూళ్లకు సైతం గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది!
పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!
సాక్షి కార్టూన్ 30-03-2025
హైదరాబాద్‌లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
హైవేపై రెండు బస్సులు, కారు ప్రమాదం.. పలువురు మృతి
లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన విచారణ.. శ్రవణ్ రావుకు మళ్లీ నోటీసులు
విదేశీ యువతిపై లైంగికదాడి బాధాకరం
కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్!
పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. ఘాటుగా స్పందించిన నటుడు
బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
మాకూ 'మంత్రి' ఇవ్వండి
సినిమా

సల్మాన్ సినిమాకు ఇన్ని కష్టాలా?
ఈద్ వచ్చిందంటే సల్మాన్ ఖాన్ సినిమా రావాల్సిందే అనేది బాలీవుడ్ లో చాన్నాళ్లుగా ఉన్న సెంటిమెంట్. ఈసారి అలా సికిందర్ మూవీ రిలీజైంది. కానీ మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ బయటకు వచ్చింది. దీంతో సినిమా హైప్ అమాంతం కిందకు పడిపోయింది. ఇప్పట్లో లేవడం కూడా కష్టమే.(ఇదీ చదవండి: మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి)ఇకపోతే తొలిరోజు రూ.26 కోట్ల మేర వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రంజాన్ సందర్బంగా రెండో రోజు రూ.29 కోట్ల వరకు సొంతం చేసుకుంది. మూడో రోజు కూడా కాస్త అటు ఇటుగా ఓ రూ.20 కోట్లు వరకు వచ్చాయని అంటున్నారు. అలా ఇప్పటివరకు రూ.75.49 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ టాక్.సాధారణంగా పెద్ద హీరోల సినిమాలంటే కాస్త అటుఇటుగా ఉన్నా సరే రెండు మూడు రోజుల్లో రూ.100 కోట్ల వసూళ్లు వస్తుంటాయి. కానీ సల్మాన్ మూవీకి మాత్రం రోజురోజుకు కలెక్షన్స్ పడిపోతున్నాయనిపిస్తోంది. మరోవైపు చాలాచోట్ల జనాల్లేక షోలు రద్దవుతున్నాయని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మూవీకి రూ.100 కోట్ల వసూళ్లయినా వస్తాయా అనేది సందేహంగా మారింది. (ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి)

ఆస్కార్ ఎంట్రీ సినిమా.. కాపీ కొట్టారంటూ నెటిజన్ల ట్రోల్స్!
గతేడాది విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన చిన్న సినిమా లపతా లేడీస్. అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. అంతేకాకుండా భారత్ నుంచి ఆస్కార్ ఎంట్రీ దక్కించుకుంది. కానీ నామినేషన్స్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది.అయితే తాజాగా ఈ సినిమాపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాను 2019లో వచ్చిన అరబిక్ చిత్రం నుంచి కాపీ కొట్టారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. 2019 అరబిక్ చిత్రం బుర్ఖా సిటీ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్‌ను కాపీ చేశారని నెట్టింట ఆరోపిస్తున్నారు. ఆ సినిమాలోని ఓ సీన్.. లపతా లేడీస్‌లోని పోలీస్ స్టేషన్ సన్నివేశం ఓకేలాగా ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే గతంలోనూ లపతా లేడీస్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాను తొలిసారిగా దర్శకత్వం వహించిన ఘున్‌ఘట్ కే పాట్ ఖోల్ (1999)మూవీతో లపతా లేడీస్‌కు పోలికలు ఉన్నాయని అనంత్ మహదేవన్ ఆరోపించారు. రైల్వే స్టేషన్లో వధువులు మారిపోవడం సీన్‌ను తన చిత్రంలో నుంచి కాపీ కొట్టారని అన్నారు.కాగా.. లపతా లేడీస్ చిత్రాన్ని జియో స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. అమీర్ ఖాన్ లగాన్ (2001)చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావు తన కెరీర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం కావడం విశేషం. 2011లో తన ధోబీ ఘాట్ అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, రవి కిషన్, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 1, 2024న థియేటర్లలో విడుదలైన లపతా లేడీస్.. 2001లో ఓ రైలు ప్రయాణంలో అనుకోకుండా మారిన ఇద్దరు వధువుల కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మించారు.It’s intriguing that Lapata Ladies has drawn comparisons to Burqa City given the striking similarities in themes and narrative structure. If Rao’s film indeed mirrors key aspects of Burqa City, it raises valid questions about originality and the fine line between inspiration and…— Sumit Arora (@kingsumitarora) April 1, 2025

విగ్ కూడా పెట్టుకోరు.. రజనీకాంత్‌పై బాలీవుడ్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) బయట ఎంత సింపుల్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎక్కువగా తెల్ల పంచె, షర్ట్ ధరించే కనిపిస్తాడు. సినిమా ఈవెంట్స్‌కి కూడా అలానే వెళ్తాడు. అవసరం అయితే తప్ప మేకప్ వేసుకోరు. ఆయన సినిమాలను అభిమానించే వాళ్లు ఎంత మంది ఉన్నారో..ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వాళ్లుకూడా అంతే ఉన్నారు. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ..రజనీకాంత్‌పై బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా(Mukesh Khanna) ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్ హీరోలలో ఎంతో మందికంటే రజనీకాంత్ చాలా గొప్పవాడని, రియల్ హీరో అంటే ఆయనేనని పొగడ్తలతో ముంచేశాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు రజనీకాంత్‌ని వ్యక్తిగతంగా కలవలేదు. కానీ ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటారు. బయటకు వెళ్లినప్పుడు కూడా మేకప్ వేసుకోరు. కనీసం విగ్గు కూడా ధరించడు. ఫ్యాన్స్‌తో ఓ సామాన్య వ్యక్తిలాగే ప్రవర్తిస్తాడు.బాలీవుడ్ హీరోల్లో ఎవరూ కూడా రజనీకాంత్‌లా ఉండలేరు. మేకప్ లేకుండా వాళ్లు బయట తిరగలేరు. వాళ్లతో పోలిస్తే రజనీకాంత్ చాలా చాలా గొప్ప వ్యక్తి. ఆయన రియల్ హీరో’ అని మేకేష్ చెప్పుకొచ్చాడు. తన సినీ కెరీర్ గురించి చెబుతూ.. డైలాగులు లేని కారణంగా చాలా పెద్ద సినిమాలు వదులుకున్నానని చెప్పారు. విలన్‌గా చేయడం ఇష్టంలేక సినిమాలను దూరం పెట్టానని చెప్పారు. ‘మహాభారతం’ సీరియల్లో మొదట దుర్యోధనుడి పాత్ర ఇస్తే నో చెప్పానని, ఆ తర్వాత భీష్ముడి పాత్ర వచ్చిందని చెప్పారు. బాలీవుడ్ హీరోలపై ముకేశ్ ఖన్నా చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి."రూహీ"(1981) చిత్రంలో ముకేశ్ ఖన్నా తన సినీ కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత అతను "వక్త్ కీ దీవార్" (1981), "దర్ద్ కా రిష్తా" (1982) వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాడు. 1980లలో అతను అనేక హిందీ చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించాడు, కానీ అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. 1997లో దూరదర్శన్‌లో ప్రసారమైన "శక్తిమాన్" అనే టెలివిజన్ సీరియల్‌తో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్లో అతను శక్తిమాన్ అనే సూపర్‌హీరో పాత్రను పోషించాడు. ఈ పాత్ర అతన్ని ఇంటింటికీ చేర్చింది, ముఖ్యంగా పిల్లల్లో అతను అత్యంత ప్రజాదరణ పొందాడు. "శక్తిమాన్" సీరియల్‌ను అతను స్వయంగా నిర్మించడం విశేషం.‘మహాభారతం’ లో పోషించిన భీష్మ పాత్ర అతన్ని భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపింది. నటనతో పాటు నిర్మాణం మరియు దర్శకత్వంలో కూడా తన ప్రతిభను చాటిన ముకేష్ ఖన్నా, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి
ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో నటించిన సంజనా గల్రానీ.. తెలుగులో మరికొన్ని మూవీస్ కూడా చేసింది. కాకపోతే అనుకున్నంత పేరు రాలేదు. కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ కేసులోనూ ఈమె పేరు వినిపించింది కానీ ప్రస్తుతానికి అంతా సైలెంట్. ఇకపోతే నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈమెకు ఇదివరకే ఓ కొడుకు ఉండగా.. ఇప్పుడు మరోసారి తల్లి కాబోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)తాజాగా ఉగాది సందర్భంగా సంప్రదాయ చీరకట్టులో బేబీ బంప్ కనిపించేలా ఉన్న వీడియోస్, ఫొటోలని సంజన.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కొడుకుతో కలిసి ఈ ఫొటోషూట్ లో పాల్గొంది. దీంతో ఈమెకు నెటిజన్స్ విషెస్ చెబుతున్నారు.2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. 2021లో అజీజ్ పాషా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఒకటి అరా సినిమాలు చేస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani)
న్యూస్ పాడ్‌కాస్ట్

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...
క్రీడలు

రిజ్వాన్, బాబర్ విఫలం.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు రాత మారటం లేదు. వరుస ఓటములతో చతికిల పడ్డ పాక్.. తాజాగా న్యూజిలాండ్‌తో రెండో వన్డేలోనూ పరాజయం పాలైంది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకుంది.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ (Pakistan Tour Of New Zealand)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) సారథ్యంలో టీ20 సిరీస్‌లో 4-1తో ఘోర పరాభవం చవిచూసింది. అనంతరం.. రిజ్వాన్ కెప్టెన్సీలో శనివారం తొలి వన్డే ఆడిన పాక్.. 73 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఈ క్రమంలో బుధవారం ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరిగింది. హామిల్టన్ వేదికగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో రైస్ మరియూ 18 పరుగులకు పరిమితం కాగా.. నిక్ కెల్లీ 31 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో హెన్రీ నికోల్స్(22), ముహమ్మద్ అబ్బాస్ (41) ఫర్వాలేదనిపించగా.. మిచెల్ హే దంచికొట్టాడు.సెంచరీకి ఒక్క పరుగు దూరంలోఈ వికెట్ కీపర్ బ్యాటర్ 78 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయినప్పటికీ.. కివీస్ మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మిచెల్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది.పాక్ బౌలర్లలో మొహమ్మద్ వసీం జూనియర్, సూఫియాన్ ముకీమ్ రెండేసి వికెట్లు తీయగా.. ఫాహిమ్ అష్రఫ్, అకిఫ్ జావేద్, హ్యారిస్ రవూఫ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. పేకమేడలా కుప్పకూలిన టాపార్డర్ఇక లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఆరంభం నుంచే తడబడింది. కివీస్ పేసర్ల ధాటికి పాక్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (1), ఇమామ్ ఉల్ హక్(1)తో పాటు బాబర్ ఆజం(Babar Azam- 1), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (5) సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు.సల్మాన్ ఆఘా 9 పరుగులకే నిష్క్రమించగా.. తయ్యబ్ తాహిర్ 13 పరుగులు చేశాడు. ఇలా బ్యాటర్లంతా విఫలమైన వేళ..బౌలింగ్ ఆల్‌రౌండర్ ఫాహిమ్ అష్రఫ్ బ్యాట్‌తో చెలరేగాడు. 80 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 73 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా పేసర్ నసీం షా రాణించాడు. కేవలం 44 బంతుల్లోనే 51 పరుగులతో అలరించాడు. వీరిద్దరి అర్ధ శతకాల కారణంగా పాక్ అవమానకర నుంచి తప్పించుకుంది. 41.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయి.. 84 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఐదేసిన బెన్ సీర్స్కివీస్ బౌలర్లలో రైటార్మ్ పేసర్ బెన్ సీర్స్ ఐదు వికెట్లతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. జేకబ్ డఫీ మూడు, నాథన్ స్మిత్, విలియం ఓరూర్కీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కివీస్ బ్యాటర్ మిచెల్ హేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ విజయంతో మరో వన్డే మిగిలి ఉండగానే బ్రేస్‌వెల్ బృందం పాక్‌పై వన్డే సిరీస్ గెలుపు నమోదు చేసింది. ఇరుజట్ల మధ్య ఏప్రిల్ 5 నాటి నామమాత్రపు వన్డేతో పాక్ కివీస్ టూర్ ముగుస్తుంది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రిజ్వాన్ బృందం న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గెలుపు అన్నదే లేకుండా ఈ వన్డే టోర్నీని ముగించింది. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలోనూ మరోసారి చెత్త ప్రదర్శనతో వన్డే సిరీస్ చేజార్చుకుంది.చదవండి: రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!

లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గట్టి షాకిచ్చింది. వికెట్ తీసిన సంబరంలో ‘అతి’ చేసినందుకు గానూ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత వేయడంతో పాటు.. అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను జత చేసింది. అసలేం జరిగిందంటే..ఐపీఎల్-2025లో భాగంగా లక్నో మంగళవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో మ్యాచ్ ఆడింది. ఏకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. ఐడెన్ మార్క్రమ్ (18 బంతుల్లో 28), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 44), ఆయుశ్ బదోని (33 బంతుల్లో 41), అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 27) రాణించారు.అర్ష్‌దీప్ సింగ్‌కు మూడు వికెట్లుఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో లక్నో జట్టు ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో మెరవగా.. లాకీ ఫెర్గూసన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ప్రియాన్ష్ ఆర్య విఫలంఇక లక్ష్య ఛేదన మొదలుపెట్టిన కాసేపటికే పంజాబ్.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య వికెట్ కోల్పోయింది. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా.. సంధించిన షార్ట్ బంతిని ఆడే క్రమంలో బ్యాట్ టాప్ ఎడ్జ్‌కు తగిలింది. అయితే, షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో గాల్లోకి లేచిన బంతిని.. మిడాన్ నుంచి పరిగెత్తుకుని వచ్చిన ఫీల్డర్ శార్దూల్ ఠాకూర్ ఒడిసిపట్టాడు.రాఠీ ‘ఓవరాక్షన్’ఈ క్రమంలో మొత్తంగా తొమ్మిది బంతులు ఎదుర్కొన్న ప్రియాన్ష్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అయితే, అతడు క్రీజు వీడుతున్న సమయంలో దగ్గరికి పరిగెత్తుకు వచ్చిన దిగ్వేశ్ రాఠీ ‘ఓవరాక్షన్’ చేశాడు. పుస్తకంలో అతడి పేరును రాసుకుంటున్నట్లుగా వికెట్ తీసిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.#DigveshRathi provides the breakthrough as #PriyanshArya heads back!P.S: Don't miss the celebration at the end! 👀✍🏻Watch LIVE action of #LSGvPBKS ➡ https://t.co/GLxHRDQajv#IPLOnJiostar | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! | #IndianPossibleLeague pic.twitter.com/TAhHDtXX8n— Star Sports (@StarSportsIndia) April 1, 2025 ఈ నేపథ్యంలో దిగ్వేశ్ రాఠీ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ పాలక మండలి అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ మీడియా అడ్వైజరీ కమిటీ ప్రకటన విడుదల చేసింది. జరిమానా‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5లో గల లెవల్ 1 నిబంధనను దిగ్వేశ్ రాఠీ అతిక్రమించాడు. మ్యాచ్ రిఫరీ నిర్ణయం ప్రకారం అతడిపై చర్యలు తీసుకున్నాం’’ అని పేర్కొంది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్ జతచేసినట్లు వెల్లడించింది.కాగా ఢిల్లీకి చెందిన దిగ్వేశ్ సింగ్ రాఠీ ఈ ఏడాదే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నం వేదికగా ఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ స్పిన్నర్ తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు.పంజాబ్ ఘన విజయంఇక మ్యాచ్ విషయానికొస్తే.. ప్రియాన్ష్ ఆర్య వికెట్ తీసిన ఆనందం లక్నోకు ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69) అర్ధ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52), నేహాల్ వధేరా (25 బంతుల్లో 43) ధనాధన్ దంచికొట్టి అజేయంగా ఇన్నింగ్స్‌తో.. జట్టును విజయతీరాలకు చేర్చారు. 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.చదవండి: రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!

రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant). ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ పంత్‌ను సొంతం చేసుకుని.. జట్టు పగ్గాలు అప్పగించింది.అయితే, లక్నో సారథిగా తొలి మ్యాచ్‌లోనే పంత్ విఫలమయ్యాడు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా స్థాయికి తగ్గట్లు రాణించలేక.. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. ఇక రెండో మ్యాచ్‌లో మాత్రం పంత్‌కు ఊరట దక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో లక్నో గెలుపొందడంతో అతడు తొలి విజయం అందుకున్నాడు. అయితే, సొంత మైదానంలో మాత్రం మళ్లీ పాత కథే పునరావృతమైంది.పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సమిష్టి వైఫల్యం కారణంగా హోం గ్రౌండ్లో తొలి మ్యాచ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. ఇక ఇప్పటి వరకు లక్నో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పంత్ బ్యాటర్‌గా విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది.బ్యాటర్‌గా విఫలంతొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఆరు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. రెండో మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో పోరులో పదిహేను బంతుల్లో పదిహేను పరుగులు చేయగలిగాడు. ఇక తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండే పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో పంత్ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రూ. 27 కోట్లు దండుగ!‘‘పంత్‌కు ఏమైంది? హ్యాట్రిక్ అట్టర్‌ఫ్లాప్‌లు.. రూ. 27 కోట్లు.. లక్నో బూడిదలో పోసినట్లే..’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పంత్‌పై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. మరోవైపు.. ప్రతి మ్యాచ్ తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పంత్‌తో సంభాషిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకాతాజాగా పంజాబ్‌తో మ్యాచ్ తర్వాత కూడా గోయెంకా పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పంత్ చేతులు కట్టుకుని నిలబడగా.. అతడి వైపు వేలు చూపిస్తూ మరీ గోయెంకా సీరియస్ అయిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోయెంకా తీరుపై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో కేఎల్ రాహుల్‌తో ఇలాగే వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.‘‘విజయాల కంటే కూడా ఇలాంటి వివాదాలతోనే హైలైట్ కావాలని చూసే ఓనర్ ఈయన ఒక్కడేనేమో! ప్రతి మ్యాచ్ తర్వాత ఇలా కెప్టెన్‌తో అందరి ముందే సంభాషిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా బిల్డప్ ఇవ్వడం ద్వారా ఏం నిరూపించాలనుకుంటున్నారు? డబ్బులు పెట్టి కొన్నంత మాత్రాన వారిని తక్కువ చేసి చూపడం సరికాదు’’ అంటూ హితవు పలుకుతున్నారు.ఐపీఎల్-2025: లక్నో వర్సెస్ పంజాబ్ స్కోర్లు👉వేదిక: భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో👉టాస్: పంజాబ్.. తొలుత బౌలింగ్👉లక్నో స్కోరు: 171/7 (20)👉పంజాబ్ స్కోరు: 177/2 (16.2)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లక్నోపై పంజాబ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69).చదవండి: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?Statement victory ✅Skipper's second 5⃣0⃣ this season ✅Consecutive wins ✅Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025

పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను: పంత్
సొంత మైదానంలో తొలి మ్యాచ్‌లోనే లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. కనీసం మరో 20- 25 పరుగులు చేసి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు.హోం గ్రౌండ్లో పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యామని.. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని పంత్ అన్నాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా లక్నో మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లక్నో బ్యాటింగ్‌కు దిగింది.పంత్ ఫెయిల్టాపార్డర్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (18 బంతుల్లో 28) తొలిసారి రాణించగా.. ఇన్ ఫామ్ ఓపెనర్ మిచెల్ మార్ష్ మాత్రం డకౌట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ (30 బంతుల్లో 44) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ పంత్ (5 బంతుల్లో 2) మాత్రం మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు.ఈ క్రమంలో ఆయుష్ బదోని (33 బంతుల్లో 41) మెరుగ్గా బ్యాటింగ్ చేయగా.. డేవిడ్ మిల్లర్ (18 బంతుల్లో 19) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆఖర్లో అబ్దుల్ సమద్ మెరుపు ఇన్నింగ్స్ (12 బంతుల్లో 27) ఆడటంతో లక్నో 170 పరుగుల మార్కు దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.పంజాబ్ ఫటాఫట్‌ఇక లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలోనే ప్రియాన్ష్ ఆర్య(8) వికెట్ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు సాధించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52 నాటౌట్) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. నేహాల్ వధేరా (25 బంతుల్లో 43 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.Statement victory ✅Skipper's second 5⃣0⃣ this season ✅Consecutive wins ✅Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025 ఈ నేపథ్యంలో 16.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ జయకేతనం ఎగురవేసింది. లక్నోపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌లలో పంజాబ్ గెలుపొందింది. మరోవైపు.. మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న లక్నోకు ఇది రెండో ఓటమి.పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనుఈ క్రమంలో ఓటమి అనంతరం లక్నో సారథి రిషభ్ పంత్ మాట్లాడుతూ.. ‘‘మేము మరిన్ని పరుగులు సాధించాల్సింది. కనీసం మరో 20- 25 రన్స్ చేయాల్సింది. అయితే, ఆటలో ఇవన్నీ సహజమే. మా సొంత మైదానంలో వికెట్‌ను అంచనా వేసేందుకు ఇంకా సమయం పడుతోంది.ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే భారీ స్కోర్లు సాధించడం చాలా కష్టం. అయితే, జట్టులోని ప్రతి సభ్యుడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. స్లో వికెట్ ఉంటుందని భావించాం. ఈ మ్యాచ్ ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. అయితే, ఇందులో మాకు కొన్ని సానుకూలతలు కూడా ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.చదవండి: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?
బిజినెస్

దేశంలోని బిలియనీర్లలో ఒకరిగా నిర్మల్ మిండా
కృషి, పట్టుదల ఉంటే మనిషి దేన్నైనా సాధించగలడు. తాను ఏ స్థితిలో ఉన్నా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరగలడు. అందుకు ప్రముఖ వ్యాపారవేత్త నిర్మల్ మిండా(66) జీవితమే ఉదాహరణ. తన తండ్రికి చెందిన చిన్న మెకానిక్ షాపులో వాహనాలకు ఎలక్ట్రిక్ పరికరాలను తయారు చేసే నిర్మల్ మిండా క్రమంగా వ్యాపారంలో ఎదిగి ఏకంగా రూ.66,904 కోట్ల విలువైన యునో మిండా కంపెనీకి సారథిగా నిలిచారు. తాను ఇంత స్థాయికి ఎలా ఎదిగారో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇంజినీరింగ్‌లోనే కారు ఉత్పత్తి అంశాలపై దృష్టినిర్మల్ మిండా హరియాణాలో జన్మించారు. తనకు చిన్నతనం నుంచి ఇంజినీరింగ్ పట్ల అభిరుచి ఉండేది. తన తండ్రి షాదీలాల్ మిండాకు ఢిల్లీలోని కమలానగర్లో మోటారు సైకిళ్లకు అవసరమైన ఎలక్ట్రికల్ విడిభాగాలను తయారు చేసే ఓ చిన్న షాపు ఉంది. ఇక్కడే ఆయన విజయానికి పునాది పడింది. నిత్యం తండ్రి చేస్తున్న పనిని గమనిస్తూ ఈ రంగంలో కీలక మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఆటోమోటివ్ ప్రొడక్షన్లో కెరీర్ ప్రారంభించాలని భావించి మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే తాను కారు ఉత్పత్తికి అవసరమైన అన్ని అంశాలను నేర్చుకున్నారు. 1977లో తన 20వ ఏట తన తండ్రి కంపెనీలో చేరారు. అప్పటికే తన ఆలోచనలతో చిన్న షాపుగా ఉన్న వారి కుటుంబ వ్యాపారం కాస్తా చిన్నపాటి కంపెనీగా రూపాంతరం చెందేందుకు కృషి చేశారు. ఆయన మొదట్లో సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసి కొత్త ఆలోచనలు, ఆశయాలను పంచుకున్నారు.వ్యూహాత్మక దూరదృష్టి1990ల్లో నిర్మల్ తన సోదరుడితో విడిపోయి సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. గతంలో మిండా ఇండస్ట్రీస్ అని పిలువబడే యునో మిండాకు పునాది వేశారు. అతని వ్యూహాత్మక దూరదృష్టితో కేవలం మోటారుసైకిల్ భాగాల్లో మాత్రమే కాకుండా ఇతర విడిభాగాలను తయారు చేయడం ప్రారంభించారు. సెన్సార్లు, లైట్లు, అల్లాయ్ వీల్స్‌తో సహా విస్తృత శ్రేణి ఆటోమోటివ్ భాగాలను మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇవి ద్విచక్ర వాహనాలు, కార్లు రెండింటి అవసరాలను తీర్చాయి. దాంతో కొద్ది కాలంలోనే కంపెనీ ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది. ప్రస్తుతం యునో మిండా హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో వంటి ప్రధాన ఒరిజినల్ పరికరాలతోపాటు అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరాదారుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 73 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది.అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా..ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) రంగంలోకి ప్రవేశించడం యునో మిండా వృద్ధికి కీలకంగా మారింది. 2020 నుంచి కంపెనీ సెన్సార్లు, లైటింగ్ వంటి విభాగాల్లో అధునాతన విడిభాగాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకోసం చైనాకు చెందిన సుజౌ ఇనోవాన్స్ ఆటోమోటివ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ పరిశ్రమలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు తోడ్పడుతుందని కంపెనీ నమ్ముతుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.50,268 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆటో కాంపోనెంట్స్ రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా నిలిచింది.బిలియనీర్‌గా..నిర్మల్ మిండా వ్యక్తిగత సంపద అతని వ్యాపార విజయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకు అతని సంపద నికర విలువ 3.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది సుమారు రూ.30,000 కోట్లకు సమానం. దాంతో గురుగ్రామ్‌లోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. దాంతోపాటు భారతదేశంలోని బిలియనీర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. గురుగ్రామ్‌లోని రెండో అత్యంత ధనవంతుడైన దీపిందర్ గోయల్ సంపద కంటే మిండా సంపద మూడు రెట్లు ఎక్కువ. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం మిండా సంపద 2018లో ఒక బిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 3.5 బిలియన్ డాలర్లకు చేరింది.ఇదీ చదవండి: జొమాటోలో ఉద్యోగాల కోత.. కారణం..దాతృత్వ కార్యక్రమాలతో సేవనిర్మల్ మిండా కేవలం బిజినెస్ టైకూన్ మాత్రమే కాదు. ఆయన పరోపకారిగా కూడా గుర్తింపు పొందారు. సామాజిక అభ్యున్నతికి సుమన్ నిర్మల్ మిండా ఫౌండేషన్ (ఎస్ఎన్ఎమ్ఎఫ్) స్థాపించి దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమన్ మిండాను వివాహం చేసుకున్న అతను నిత్యం వందల సంఖ్యలో పిల్లలకు ఆహారం, ఆశ్రయంతోపాటు విద్యను అందించేలా మిండా బాల్ గ్రామ్ అనే అనాథాశ్రమాన్ని స్థాపించారు. నిరుపేద పిల్లల కోసం ప్రాథమిక పాఠశాల మిండా విద్యా నికేతన్‌ను ఏర్పాటు చేశారు. అతని కృషికి ‘హరియాణా రత్న’ అవార్డు, ఇండియా యమహా మోటార్స్ నుంచి ‘గోల్డ్ అవార్డు ఫర్ క్వాలిటీ’ వంటి ప్రశంసలు లభించాయి. నిర్మల్, సుమన్ దంపతులకు పరిధి, పల్లక్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

జొమాటోలో ఉద్యోగాల కోత.. కారణం..
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గత ఏడాది ప్రారంభించిన అసోసియేట్ ప్రోగ్రామ్ నుంచి దాదాపు 500 మంది జూనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించింది. జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ (జాప్)లో భాగంగా గత ఏడాది 1,500 మందిని కస్టమర్ సర్వీస్ రోల్స్ కోసం నియమించుకుంది. ఈ ఉద్యోగులను ఆపరేషన్స్, మార్కెటింగ్, సేల్స్, సప్లై చైన్‌తో సహా వివిధ విభాగాల్లో సేవలకు ఉపయోగించుకుంది. ప్రస్తుతం జాప్‌లో ఉన్న వారిలో 1,000 మందిని కొనసాగించాలని, మిగతావారి(సుమారు 33 శాతం మంది) పనితీరు సరిగా లేదనే కారణంతో లేఆఫ్స్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.లేఆఫ్స్‌కు కారణంపనితీరు సరిగా లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం వంటి కారణాలతో ఈ ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉద్యోగం కోల్పోయిన వారికి నష్టపరిహారంగా రెండు నెలల వేతనం ఇచ్చినట్లు చెప్పాయి. అయితే కొందరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగం నుంచి తొలగించారని సోషల్ మీడియా వేదికగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.పెరుగుతున్న పోటీఈ పరిణామంపై జొమాటో స్పందించలేదు. ఇటీవల తన మాతృసంస్థ పేరును ఎటర్నల్‌గా మార్చిన జొమాటోకు పెరుగుతున్న పోటీ, క్విక్ కామర్స్‌లో వస్తున్న మార్పుల వల్ల లాభాలు క్షీణిస్తున్నాయి. 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 57 శాతం క్షీణించి రూ.59 కోట్లకు పరిమితమైంది. క్విక్ కామర్స్ బిజినెస్ వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ జొమాటోకు అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న ఫుడ్ డెలివరీ విభాగం వృద్ధి మందగిస్తుంది. ఫుడ్ డెలివరీలో వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడానికి కంపెనీ చర్యలు తీసుకుంటుందని కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.ఇదీ చదవండి: మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..ఈ త్రైమాసికంలో జొమాటో ఉద్యోగుల బెనిఫిట్ వ్యయాలు(హెల్త్‌కేర్, రిటైర్మెంట్ ప్లాన్లు, వెల్నెస్ ప్రోగ్రామ్‌లు, పెయిడ్ లీవ్‌లు..) ఏడాది ప్రాతిపదికన 63 శాతం పెరిగి రూ.689 కోట్లకు చేరాయి. మూడు నెలల కాలంలో కార్యకలాపాల ద్వారా రూ.5,405 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2024 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం మార్చి 31, 2024 నాటికి 8,244 మంది ఉద్యోగులు ఉన్నారు.

గ్రీన్‌లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 101 పాయింట్లు పెరిగి 23,270కు చేరింది. సెన్సెక్స్(Sensex) 407 పాయింట్లు పుంజుకుని 76,423 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.21 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.52 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.38 శాతం లాభపడింది. నాస్డాక్ 0.87 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..అమెరికా ‘లిబరేషన్ డే’ అనిశ్చితి తారస్థాయికి చేరుకోవడంతో మంగళవారం దలాల్ స్ట్రీట్ స్టాక్‌లు దాదాపు 2 శాతం వరకు క్షీణించింది. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు అమలు రోజు ఏప్రిల్ 2ను డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా లిబరేషన్ డే’గా అభివర్ణించారు. క్రూడాయిల్ ధరలు అయిదు వారాల గరిష్టానికి చేరుకోవడం, భారత ఈక్విటీ మార్కెట్ మార్చిలో భారీ ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం తదితర అంశాలూ ప్రతికూల ప్రభావం చూపాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

భారత్ విదేశీ రుణాల లెక్కలివే..
భారత్ విదేశీ రుణాలు (అంతర్జాతీయ మార్కెట్ నుంచి రుణాలు, ఇతర రూపాల్లో సమీకరించినవి) 2024 డిసెంబర్ చివరికి 717.9 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.61.74 లక్షల కోట్లు) చేరాయి. 2023 డిసెంబర్ చివరికి ఇవి 648.7 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ‘క్వార్టర్లీ ఎక్స్టర్నల్ డెట్’ నివేదికలోని గణాంకాలు కింది విధంగా ఉన్నాయి.2024 సెప్టెంబర్ చివరికి ఇవి 712.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే అంతక్రితం త్రైమాసికంతో పోల్చి చూస్తే 0.7 శాతం.. ఏడాది క్రితం ఇదే కాలంతో పోల్చి చూస్తే 10 శాతం అధికమయ్యాయి. జీడీపీలో విదేశీ రుణాలు డిసెంబర్ చివరికి 19.1 శాతానికి చేరాయి. 2024 సెప్టెంబర్ చివరికి 19 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా రూపాయితోపాటు ఇతర ప్రధాన కరెన్సీలతో డాలర్ బలపడడం విదేశీ రుణ భారం విలువ పెరిగేందుకు దారితీసింది.ఇదీ చదవండి: మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..డాలర్ మారకంలో 54.8 శాతం..యూఎస్ డాలర్ మారకంలోని బకాయిలు మొత్తం విదేశీ రుణాల్లో 54.8 శాతంగా ఉన్నాయి. ఆ తర్వాత రూపాయి మారకంలో విదేశీ రుణాలు 30.6 శాతంగా ఉంటే, జపాన్ యెన్ మారకంలో 6.1 శాతం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) రూపంలో 4.7 శాతం, యూరో మారకంలో 3 శాతం చొప్పున ఉన్నాయి. మొత్తం విదేశీ రుణాల్లో నాన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్‌కు సంబంధించి 36.5 శాతం మేర ఉన్నాయి. ఆ తర్వాత డిపాజిట్ స్వీకరించే కార్పొరేషన్లకు సంబంధించి 27.8 శాతం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 22.1 శాతం, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించి 8.7 శాతం చొప్పున ఉన్నాయి. విదేశీ మారకంలో చెల్లించాల్సిన మొత్తం బకాయిల్లో రుణాల రూపంలో 33.6 శాతం ఉంటే, కరెన్సీ, డిపాజిట్ల రూపంలో 23.1 శాతం, ట్రేడ్ క్రెడిట్, అడ్వాన్స్‌ల రూపంలో 18.8 శాతం, డెట్ సెక్యూరిటీల రూపంలో 16.8 శాతం చొప్పున ఉన్నాయి.
ఫ్యామిలీ

beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్
నగరంలో ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. దీంతో వేడిని తట్టుకునేందుకు నగర వాసులు వివిధ రకాల పద్ధతులు పాటిస్తున్నారు.. ఇందులో భాగంగా ఏసీలు, కూలర్లు వంటివి లేకుండా ఉండలేని పరిస్థితి.. అయితే దీనికి భిన్నంగా వేడి నుంచి ఉపశమనం కోసం ప్రత్యామ్నాయ మార్గమైన మొక్కలను పెంచుతున్నారు. ఇంటి వాతావరణం చల్లబరిచేందుకు ఇదో చక్కటి మార్గమని నిపుణులు చెబుతున్నారు. నర్సరీల్లోనూ ఇటీవల కాలంలో ఇంటీరియర్ ప్లాంట్స్ అధిక మొత్తంలో అమ్ముడుపోతున్నాయని పలువురు నర్సరీల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ అవ్వడంతో ఎక్కువ మంది ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని ఇంటీరియర్ డిజైనర్స్ సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటీరియర్ ప్లాంట్స్ గురించిన మరిన్ని విశేషాలు.. – సాక్షి, సిటీబ్యూరో వేసవి తాపానికి ఎండలు మాత్రమే ప్రధాన కారణం కాదు. పరిమితికి మించిన వాహనాల కాలుష్యం, పరిశ్రమలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల నుంచి వెలువడే కాలుష్యం వాతావరణాన్ని తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్నాయి. అయితే గతంలో ఇంటి వద్ద మెక్కల పెంపకం కొందరికి హాబీగా ఉండేది. ఇప్పుడు ఇదో ఫ్యాషన్‌లా మారింది. కొందరు అందానికి, మరి కొందరు ఆరోగ్యం కోసం పెంచుతుంటే, ఇంకొందరు తాము ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని లక్షలు వెచ్చించి ఇంపోర్టెడ్ మొక్కలను పెంచుతున్నారు. దీంతో బాల్కనీ, డోర్స్ముందు ఖాళీ ప్రదేశంలోనే మనీ ప్లాంట్స్ వంటివి పెంచుతున్నారు. చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!ముఖ్యంగా గాలిలోని టాక్సిన్లను హరించే హెర్బల్ ప్లాంట్స్, ఆక్సిజన్ స్థాయిలను పెంచే అరుదైన మొక్కలు, ఆహ్లాదాన్ని అందించే అలంకరణ మొక్కలు ఎంపిక చేసుకుంటున్నారు. వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే సకులెంట్స్, డిజర్ట్ ప్లాంట్స్ పెంచుతున్నారు. మరికొందరు అరుదైన లక్షణాలున్న మొక్క జాతులు, నీటిలో పెంచే ఆక్వా ప్లాంట్స్, బోన్సాయ్ మొక్కలు, క్రీపర్స్, హ్యాంగింగ్స్ పెంచుతున్నారు. వివిధ రకాల మొక్కలు..మోస్టరైజమ్, పెడల్లీఫ్, ఫిలిడాండ్రమ్, రబ్బర్ ప్లాంట్, పీస్ లిల్లీస్ పెంచుకోవచ్చని నిపుణుల సూచన. ఇండోర్, ఔట్‌డోర్‌లోనూ పెరిగే మనీ ప్లాంట్, ఇంటి ముందు కానీ సూర్యరశ్మి పడే ఇంటిలోపలి వాతావరణంలో అడీనియం, అరేలియా, హెల్కోనియా, దురంతా, పెంటాస్, గ్లోరోఫైటమ్, గ్రోటాన్, పెనివత్, సైకస్ తదితర జాతి మెక్కలను పెంచుకోవచ్చు. విలాసవంతమైన ఇళ్లలో బర్డ్ ఆఫ్ ప్యారడైస్, మేరీ గోల్డ్‌లాంటి అరుదైన మొక్కలను పెంచుతున్నారు. నగర నలుమూలలా అన్ని రకాల మెక్కలు దొరికే నర్సరీలు అందుబాటులో ఉన్నాయి.చదవండి: విద్యుత్తు లేకుండా ఆకుకూరలను 36 గంటలు నిల్వ ఉంచే బాక్స్!

ప్రైవేటు స్కూళ్లకు సైతం గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది!
నా పేరు జి.సుధీర్. నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను ఒక కార్పొరేట్ విద్యా సంస్థలో గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత నెల (ఫిబ్రవరి 2025), మా హెడ్ నాకు వేరే బ్రాంచ్‌కు బదిలీ చేశారు. కానీ నేనూ ఆ రోజు నుండి డ్యూటీ కి వెళ్ళడం లేదు. నా రాజీనామా కూడా ఇవ్వలేదు. నా చివరి జీతం (ఫిబ్రవరి నెల) పొందడానికి, పి.ఎఫ్., గ్రాట్యుటీ సెటిల్మెంట్ కోసం నేను ఏమి చేయాలి? దీనిపై లీగల్‌గా ప్రోసీడ్ అవ్వాలంటే ఎలా? సలహా ఇవ్వగలరు.– జి. సుధీర్, హైదరాబాద్.ప్రైవేటు స్కూలు అయినప్పటికీ గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ పొందడం అనేది మీ హక్కు. ప్రైవేటు స్కూళ్లకు గ్రాట్యుటీ చట్టం వర్తించదు అంటూ పలు స్కూళ్ల యాజమాన్యాలు చేసిన వాదనలను సుప్రీంకోర్టు 2022లో తిరస్కరించింది. కాబట్టి మీరు కూడా గ్రాట్యుటీకి అర్హులు. అయితే గ్రాట్యుటీ పొందాలి అంటే మీరు కనీసం ఐదు సంవత్సరాలు (లేదా 4 సంవత్సరాల 7 నెలల కన్నా ఎక్కువ) సదరు సంస్థలో పనిచేసే ఉండాలి. అలా పని చేసి ఉంటే మీకు గ్రాట్యుటీ చట్టం నిర్ణయించిన కాల్కులేషన్ (జీతము 15 రోజులు X పనిచేసిన వ్యవధి / 26) ఆధారంగా గ్రాట్యుటీ చెల్లించవలసి ఉంటుంది. మీరు పనిచేసిన స్కూలు వారికి లిఖితపూర్వకంగా రాజీనామా చేసి, మీకు రావలసిన పి.ఎఫ్., గ్రాట్యుటీ సెటిల్మెంట్ కోసం ఒక దరఖాస్తు కూడా జత చేయండి. వారు పరిష్కరించని పక్షంలో హైదరాబాదులోని గ్రాట్యుటీ కమిషనర్ /లేబర్ కమిషనర్‌ను సంప్రదించి ఒక దరఖాస్తు సమర్పించవలసి ఉంటుంది. అలాగే పి.ఎఫ్ కూడా ఇవ్వకపోతే, పీ.ఎఫ్. కమిషనర్ వద్ద దరఖాస్తు/ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. మీరు పని చేసిన స్కూలు వారికి నోటీసులు పంపించి వారి పక్షం కూడా విన్న తర్వాత మీకు రావలసిన బకాయిలు చెల్లించవలసినదిగా సదరు కమిషనర్లు ఆదేశాలు జారీ చేస్తారు. రెండు విభాగాల నుంచి కూడా మీకు సరైన ఉపశమనం లభిస్తుంది. న్యాయం జరుగుతుంది. ముందు మీరు స్కూల్‌కు రాజీనామా లేఖను అందజేయండి.– శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.) (చదవండి: పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!)

పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!
పెంపకంలో.. అవకాశాల్లో.. వేతనాల్లో లింగ వివక్ష క్రిస్టల్ క్లియర్! అది ధరల్లో కూడా ఉందన్న విషయం తెలుసా? అదీ స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉపయోగించే ఒకే రకమైన వస్తువుల ధరల్లో! నిజం..!కేవలం ప్యాకింగ్‌లో తేడా వల్ల పర్సనల్ హైజీన్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ నుంచి దుస్తుల దాకా మగవాళ్ల కన్నా మహిళలు ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. దీన్ని పింక్ టాక్స్ అంటున్నారు. ఇద్దరూ వాడే ఒకేరకమైన ప్రొడక్ట్స్ మీద స్త్రీలు సగటున ఏడు శాతం అధికంగా చెల్లిస్తున్నారట. కేవలం పింక్ ప్యాక్‌లో ఉన్నందున రేజర్ బ్లేడ్స్ మీద 29 శాతం, బాడీ వాష్ మీద 16 శాతం ఎక్కువ వెచ్చిస్తున్నారట. ఆ లెక్కన ఒకేరకమైన వస్తువులు,సేవల మీద పురుషుల కన్నా స్త్రీలు ఏడాదికి సగటున లక్ష రూపాయలు అధికంగా చెల్లిస్తున్నట్టు అంచనా. దీని మీద బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజూందార్ షా కూడా స్పందించారు. ‘పింక్ టాక్స్ అనేది లింగ వివక్షకే పరాకాష్ట. దీన్ని మహిళలు తీవ్రంగా పరిగణించాలి. ధరల్లో వ్యత్యాసమున్న అలాంటి ప్రొడక్ట్స్‌ను కొనకుండా ఆ వివక్షను వ్యతిరేకించాలి’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. పింక్ టాక్స్ అనేది మహిళల మీద ఆర్థిక భారాన్ని మోపడమే కాదు సమాజంలో ఇప్పటికే ఉన్న వివక్షను బలపరచే ప్రమాదాన్నీ సూచిస్తోందంటున్నారు సామాజిక విశ్లేషకులు. మార్కెట్లో ఏ తీరైనా.. ధోరణి అయినా న్యాయమైన ధరతో పాటు జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసేట్టుగా, వివక్షతో కూడిన సామాజిక నియమాలను సవాలు చేసేట్టుగా ఉండాలి తప్ప వివక్షను ప్రేరేపించేట్టుగా ఉండకూడదని చెబుతున్నారు. ఈ పింక్ టాక్స్‌ను సవాలు చేయడానికి మన దగ్గర ప్రత్యేకమైన చట్టం లేక΄ోయినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14.. రైట్ టు ఈక్వాలిటీ కింద కోర్ట్‌లో దావా వేయొచ్చు. Pink Tax! A shameful gender bias that women must respond to by shunning such products! pic.twitter.com/U3ZQm2s7W9— Kiran Mazumdar-Shaw (@kiranshaw) March 12, 2024 (చదవండి: భాషలోనూ వివక్ష ఎందుకు?)

పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!
తాజా పుట్టగొడుగులను నగర, పరిసర ప్రాంతాల వినియోగదారులకు వారి ఇంటి దగ్గరకే తీసుకెళ్లి అందించే లక్ష్యంతో సౌర విద్యుత్తుతో పుట్టగొడుగులను ఉత్పత్తి చేసే ట్రైసైకిల్ సాంకేతికతను బెంగళూరులోని బారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపొందించింది. వేరే చోట పుట్టగొడుగులను పెంచి, తీసుకెళ్లి విక్రయించడటం వల్ల అవి తాజాదనాన్ని కోల్పోతుంటాయి. కోసిన తర్వాత వినియోగదారులకు చేరటం ఆలస్యమైతే రెండు, మూడు రోజుల్లో పుట్టగొడుగులు రంగు మారి వృథా అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించటంతో పాటు పౌష్టికాహారాన్ని ప్రజలకు తాజాగా అందించటం ద్వారా ఉపాధి పొందగోరే యువతకు ఆదాయ వనరుగా ఈ మష్రూమ్ సోలార్ ట్రైసైకిల్ సాంకేతికతను ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!పెరట్లో, మేడపైన కొద్ది ఖాళీలోనే అవుట్డోర్ సోలార్ మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్‌ను ఇంతకుముందే ఐఐహెచ్ఆర్ రూపొందించింది. ఈ యూనిట్లో పెరిగిన పుట్టుగొడుగులతో కూడిన గ్రోబాగ్స్‌ను సోలార్ ట్రైసైకిల్లోకి మార్చుకొని... వినియోగదారుల ఇళ్ల దగ్గరకు తీసుకు వెళ్లి విక్రయించడానికి ట్రైసైకిల్ ద్వారా అవకాశం కలిగిస్తోంది. తద్వారా పోషకవిలువలతో కూడిన పుట్టగొడుగులను ప్రజల దైనందిన ఆహారంలో భాగం చేసుకోగలుగుతారని ఐఐహెచ్ఆర్ ఆశిస్తోంది. చదవండి: beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్ఈ ట్రైసైకిల్ ఛాంబర్ 1.5“1“1 మీటర్ల సైజులో ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్‌లలో పుట్టగొడుగులు పెరిగే బ్యాగులను అమర్చుకోవచ్చు. గాలి ఆడటం కోసం, పురుగులు, ఈగలు వాలకుండా నైలాన్ 40 మెష్‌ను, గోనె సంచులను చుట్టూతా ఏర్పాటు చేశారు. కిలో/2 కిలోల పుట్టగొడుగులతో కూడిన 36 బ్యాగ్‌లు ఇందులో పెట్టుకోవచ్చు. 30 వాట్స్ డిసి మిస్టింగ్ డయాఫ్రం పంప్ నిరంతరం గోనె సంచులపై నీటి తుంపర్లను చల్లుతూ చల్లబరుస్తూ ఉంటుంది. ఇది విద్యుత్తుతో లేదా సౌర విద్యుత్తుతో నడుస్తుంది. 300 వాట్స్ ΄్యానల్, ఇన్వర్టర్, 12వి స్టోరేజ్ బ్యాటరీ, టైమర్ ఇందులో అమర్చారు. ట్రైసైకిల్కి 48వి, 750 వాట్స్ డిసి గేర్డ్ మోటార్ అమర్చారు. వోల్టేజి కంట్రోలర్, సౌర విద్యుత్తును నిల్వ చేయటానికి 24ఎహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇతర వివరాలకు.. ఐఐహెచ్ఆర్ మష్రూమ్ లాబ్ (బెంగళూరు) – 070909 49605.
ఫొటోలు


తిరుమలలో ఆకాశ్ అంబానీ.. గోమాతకు విశేష పూజలు (ఫొటోలు)


బాంధవి శ్రీధర్ వాటే గ్లామర్... మతిపోగొడుతోన్న మసూద బ్యూటీ (ఫోటోలు)


'శారీ' మూవీ ప్రీరిజ్లో మెరిసిన నటి ఆరాధ్య దేవి (ఫొటోలు)


వయ్యారాల నడకలతో కనువిందు చేసిన బ్యూటిఫుల్ ఉమెన్స్ (ఫొటోలు)


#IPL2025 : ముంబై మ్యాచ్‌లో ఆమె ఎవరు.. పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్? (ఫోటోలు వైరల్)


ఫ్యాషన్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)


రామ్ గోపాల్ వర్మ 'శారీ'మూవీ ప్రీరిజ్ ఈవెంట్ (ఫొటోలు)


'కోర్ట్' బ్యూటీ జర్నీ.. కాకినాడ నుంచి మెగాస్టార్ ఇంటివరకు (ఫొటోలు)


గ్రాండ్‌గా ఈద్ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు (ఫోటోలు)


పాలరాతి శిల్పంలా మిల మిల మెరిసిపోతున్న హన్సిక మోత్వానీ (ఫోటోలు)
అంతర్జాతీయం

Switzerland: సొరంగాల స్వర్గం.. ప్రభుత్వ కృషి అమోఘం
మనం ఏదైనా రైలులో లేదా బస్సులో ప్రయాణించినప్పుడు ఆ దారిలో మనకు సొరంగాలు ఎదురైనప్పుడు అద్భుతమైన అనుభూతికి లోనవుతుంటాం. అలాంటి సందర్భాల్లో మళ్లీమళ్లీ అలాంటి సొరంగాల గుండా వెళ్లాలని అనిపిస్తుంటుంది. ఇక చిన్నపిల్లలైతే సొరంగమార్గం(Tunnel) గుండా వెళ్లినప్పుడు ఒక్కసారిగా చీకటి ప్రదేశంలోకి వెళ్లడం, తరువాత వెలుతురులోకి రావడాన్ని చూసినప్పుడు కేరింతలు కొడుతూ, భలేగా ఎంజాయ్ చేస్తుంటారు. మరి ఇలాంటి అనేక సొరంగ మార్గాలు కలిగిన దేశమేదో తెలుసా?స్విట్జర్లాండ్(Switzerland) విస్తృతమైన సొరంగమార్గాలకు ప్రసిద్ది చెందింది. దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించడంలో ఈ సొరంగాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి అటు రైలు మార్గంలోనూ ఇటు, రోడ్డు మార్గంలోనూ కనిపిస్తాయి. ఈ సొరంగ మార్గాల నిర్మాణానికి స్విట్జర్లాండ్ ప్రభుతం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. అటు రైలు, ఇటు రోడ్డు మార్గాల్లో విరివిగా సొరంగాలను నిర్మిస్తూ ప్రయాణాలను వేగవంతం చేస్తోంది. ఈ సొరంగమార్గాలు దేశ ప్రజలనే కాకుండా పర్యాటకులను కూడా అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటువంటి సొరంగమార్గాల్లో పలు విశేషాలు కలిగినవాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పొడవైన రైలు సొరంగం: గోథార్డ్ బేస్ టన్నెల్ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్.. గోథార్డ్ బేస్ టన్నెల్(Gotthard Base Tunnel). దీని నిర్మాణానికి 20 ఏళ్లు పట్టింది. భూమి ఉపరితలానికి ఎనిమిదివేల అడుగుల లోతున ఈ రైలు సొరంగాన్ని నిర్మించారు. నీట్ గోథార్డ్ బేస్ టన్నెల్ అని దీనిని పిలుస్తున్నారు. 57 కిలో మీటర్ల పొడవైన ఈ రైల్వే టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైన రైలు సొరంగంగా గుర్తింపు పొందింది. జురిచ్ నుంచి మిలాన్ నగరాన్ని కలిపేందుకు ఈ రైలు మార్గం ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రైలు గంటకు 240 కిలో మీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ రైల్వే టన్నెల్ నిర్మాణానికి స్విస్ ప్రభుత్వం రూ. 65 వేల కోట్లు ఖర్చు చేసింది.పొడవైన రోడ్డు సొరంగం: గోథార్డ్ రోడ్డు టన్నెల్స్విట్జర్లాండ్లోని గోథార్డ్ రోడ్డు టన్నెల్ దేశంలోని గోస్చెనెన్ దగ్గర మొదలైన దక్షిణాన టిసినోలోని ఐరోలో వరకు కొనసాగుతుంది. ఇది ఆల్ప్స్ ప్రధాన మార్గమైన సెయింట్ గోథార్డ్ పాస్(Saint Gotthard Pass) వద్ద 16.9 కిలోమీటర్లు (10.5 మైళ్ళు) పొడవున నిర్మితమయ్యింది. 1980 నాటికి ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు సొరంగంగా ఇది పేరొందింది. బాసెల్ నుంచి చియాస్సో వరకు వెళుతుంది. దీనిలో రెండు లేన్లు ఉన్నాయి. దీనిలో ఒక మార్గాన్ని ద్విచక్రవాహనాల కోసం కేటాయించారు. ఈ సొరంగం గరిష్టంగా 1,175 మీటర్లు (3,855 అడుగులు) ఎత్తు కలిగివుంది. ఉత్తర పోర్టల్ నుండి ఈ మార్గం 10.3 కిలోమీటర్లు (6.4 మైళ్ళు) పొడవు కలిగివుంది.మరో రైల్ సొరంగం: లోట్స్చ్‌బర్గ్ బేస్ టన్నెల్లోట్స్చ్బర్గ్ బేస్ టన్నెల్ (ఎల్బీటీ) లోట్స్చ్‌బర్గ్ లైన్‌లోని 34.57 కిమీ (21.48 మైళ్ళు) రైల్వే బేస్ టన్నెల్. ఇది స్విట్జర్లాండ్‌లోని బెర్నీస్ ఆల్ప్స్ గుండా పాత లోట్స్చ్‌బర్గ్ టన్నెల్ వరకూ సాగుతుంది . ఇది ఫ్రూటిజెన్ , బెర్న్, రారాన్ , వాలాయిస్ మధ్య నడుస్తుంది. ఆల్ప్స్ పర్వతాల గుండా ఈ లోట్ష్బర్గ్ బేస్ టన్నెల్‌ను నిర్మించారు. ఎల్బీటీ నిర్మాణం 1999లో ప్రారంభమై, 2007లో పూర్తయింది. మొదటి రైలు కార్యకలాపాలు 2007 డిసెంబర్లో ప్రారంభమయ్యాయి. అయితే 2020లో ఈ మార్గంలోకి నీరు, ఇసుక ప్రవేశించడంతో తాత్కాలికంగా ఈ సొరంగాన్ని మూసివేశారు. అనంతరం సొరంగం లోపల అవసరమైన మరమ్మతులు చేశారు. 2020 చివరిలో రవాణా కోసం ఈ సొరంగాన్ని తిరిగి సిద్ధం చేశారు. దీంతో అదే ఏడాది ఏప్రిల్ 27న ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఇది కూడా చదవండి: మరుభూమిగా మయన్మార్.. దారుణమైన పరిస్థితులు

Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్.. ఇలా ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్లోడ్ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్లోడ్ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?.. ఏఐ బేస్డ్ చాట్‌బాట్ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది. ఎంతవరకు సురక్షితం?ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజ్ జనరేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్లోడ్ చేస్తే.. అవి ఫేషియల్ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్‌లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.అలాంటప్పుడు ఏం చేయాలంటే..వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు.. ఆ జనరేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్ గురించి నెట్లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. ఛాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్, డీప్‌ఏఐ, ప్లేగ్రౌండ్‌ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్ వెర్షన్లలోనూ రకరకాల ఎఫెక్ట్‌లతో ఈ తరహా ఎఫెక్ట్‌లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్ ఆర్ట్ వర్క్‌తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నోట్: పర్సనల్ డాటా తస్కరణ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్ నిపుణుల సూచన.

మరుభూమిగా మయన్మార్.. దారుణమైన పరిస్థితులు
నేపిడా: ప్రకృతి ప్రకోపానికి మయన్మార్.. మరుభూమిగా మారింది. గత శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం(Major earthquake) ఆ దేశాన్ని అస్తవ్యస్తం చేసింది. భూకంపం దరిమిలా ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. భూకంప మృతుల సంఖ్య 2,056 కు చేరింది. దాదాపు 3,900 మంది గాయపడ్డారు. 270 మంది గల్లంతయ్యారు.మరింత దిగజారిన పరిస్థితులు మయన్మార్(Myanmar)లోని ప్రధాన పట్టణాలైన మండలే, నేపిడాలలో భూకంప బాధితులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులన్నీ భూకంప బాధితులతో నిండిపోయాయి. దీంతో అందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో వారికి చికిత్స అందించేందుకు స్థలం, వనరుల కొరత ఏర్పడుతోంది. ఈ రెండు నగరాల్లోని వైద్య సిబ్బంది బాధితులను ఆదుకునేందుకు నిరంతరం తమ సేవలు అందిస్తున్నారు.సైనిక పాలనలో..పలు నివేదికల ప్రకారం గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న సైనిక పాలన(Military rule) మయన్మార్‌లో ఆరోగ్య సేవలను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. భూకంపానికి ముందు నుంచి పలు ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మండలేలో పరిస్థితి దారుణంగా ఉంది. 80 శాతానికిపైగా వైద్య సిబ్బంది సైనిక పాలనకు వ్యతిరేకిస్తున్నారు. గడచిన నెలలో ఏడు ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేశారు. భూకంపానికి ముందే మండలేలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను మూసివేశారు.ఆస్పత్రులు ధ్వంసంభూకంపం కారణంగా కొన్ని ఆస్పత్రులు ధ్వంసం కావడంతో బాధితులందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. అరకొరగా ఉన్న ఆస్పత్రులలో పడకల కొరత అధికంగా ఉంది. రోగులను నేలపైనే పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. కాగా మయన్మార్ వాతావరణ, జలశాస్త్ర విభాగం తెలిపిన వివరాల ప్రకారం భారీ భూకంపం తరువాత 36 భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వాటి తీవ్రత 2.8- 7.5 మధ్య ఉంది. శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన కొద్ది నిమిషాల తర్వాత 6.4 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించింది.ఇది కూడా చదవండి: చిరాగ్ పాశ్వాన్ తల్లి గదికి తాళం.. రోడ్డునపడ్డ కుటుంబ కలహాలు

అమెరికాలోనే చనిపోతా: ఎలాన్ మస్క్
విస్కాన్సిన్: టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ అమెరికా పట్ల తన తిరుగులేని నిబద్ధతను ప్రకటించారు. ‘నేను ఎక్కడికీ వెళ్లను. అమెరికాలోనే ఉంటా. ఇక్కడే చచ్చిపోతా. అంగారక గ్రహం మీదికి నేను వెళ్లినా అది కూడా అమెరికాలో భాగంగానే ఉండిపోతుంది’అంటూ ఆదివారం విస్కాన్సిన్ టౌన్హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మస్క్ ఇద్దరు విస్కాన్సిన్ ఓటర్లకు పది లక్షల విలువైన చెక్కులను అందజేశారు. తన రాజకీయ గ్రూపునకు వీరిద్దరినీ ప్రతినిధులుగా ప్రకటించారు. త్వరలో జరగనున్న విస్కాన్సిన్ సుప్రీంకోర్టు ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాకు, నాగరికత భవిష్యత్తుకు కీలకమైనవని పేర్కొన్నార
జాతీయం

పాలిటిక్స్ ఫుల్‌టైమ్ కాదు
లక్నో: రాజకీయాలు అనేవి తనకు ఫుల్‌టైమ్ ఉద్యోగం కాదని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే తాను కేవలం యోగిని మాత్రమేనని ఆయన స్పష్టంచేశారు. ‘బుల్డోజర్ మోడల్‌ను మా ప్రభుత్వం సాధించిన ఘనతగా చూడటం లేదు. అదొక అవసరం. సమాజహితం కోసం దాన్ని మెరుగైన విధానంలో వాడొచ్చని మేం చూపించాం’’ అన్నారు. మంగళవారం పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై యోగి సుదీర్ఘంగా మాట్లాడారు. అగ్రనేతలతో విభేదాల్లేవు ‘‘బీజేపీ అగ్రనేతలతో నిజంగా విభేదాలే ఉంటే ఇంకా సీఎంగా కొనసాగగలనా? అవన్నీ వదంతులే. నా రాజకీయ జీవితానికి పరిమితి ఉంది. ఆర్ఎస్ఎస్ మద్దతు నాకుంది. నన్నే కాదు, దేశం కోసం పరిశ్రమించే ప్రతి ఒక్కరినీ ఆర్ఎస్ఎస్ ముందుండి ప్రోత్సహిస్తుంది. సరైన పథంలో లేని వాళ్లలోనూ స్ఫూర్తి నింపి సన్మార్గం వైపు నడిపిస్తుంది. బీజేపీ ఆదేశానుసారం యూపీ ప్రజలకు సేవ చేస్తున్నా’’ అని అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో దిగిపోతారని, భావి ప్రధాని అవకాశాలు యోగికే ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ‘‘రాజకీయాలు నాకు ఫుల్‌టైమ్ జాబ్ కాదు. నేనొక యోగిని మాత్రమే. ఇతర రాష్ట్రాల్లోనూ నాకు పాపులారిటీ పెరగడానికి వేరే కారణం ఉందనుకుంటున్నా. యాత్రల్లో భాగంగా దేశవ్యాప్తంగా భక్తులు యూపీని సందర్శిస్తున్నారు. 2017 తర్వాత యూపీలో స్పష్టంగా కనిపిస్తున్న అభివృద్ధి వల్ల వారలా భావించి ఉంటారు’’ అన్నారు. రాజకీయాలు, మతంపై... ‘‘ కొంతమంది మాత్రమే రాజకీయాలు చేయాలని, మతానికి సైతం పరిధులు ఉండాలని భావించినప్పుడే సమస్యలు తలెత్తుతాయి. స్వార్థం కోసం రాజకీయాలను వాడుకుంటే సమస్యలొస్తాయి. అందరి మంచి కోసం రాజకీయాలు చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. సమస్యకు, పరిష్కారానికి మధ్య ఎటువైపు నిల్చోవాలనేదే మతం మనకు బోధిస్తుంది’’ అని అన్నారు. మీరు రాజకీయనేత అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా లేదంటే మతానికి సంబంధించిన ప్రతినిధి అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? అని ప్రశ్నించగా.. ‘పౌరుడిగా పనిచేసేందుకు ఇష్టపడతా. పౌరునిగా రాజ్యాంగబద్ధ కర్తవ్యమే నాకు ముఖ్యం. నా వరకు దేశమే అత్యున్నతం. దేశం బాగుంటే నా మతం కూడా బాగుంటుంది. మతం సురక్షితంగా ఉంటే సంక్షేమ మార్గం దానంతట అదే తెరుచుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ముస్లింలపై... ‘‘రాష్ట్ర అభివృద్ధిలో ముస్లింలకు తగు ప్రాతినిధ్యం లభిస్తుంది. మైనారిటీలు అయినంత మాత్రాన ముస్లింలకు ప్రత్యేక కేటాయింపులు అంటూ ఏమీ ఉండవు. పాదచారులు రోడ్ల పక్కన నడవాలి. అంతేగానీ రోడ్లపై నమాజ్ చేస్తామంటే కుదరదు. రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కల్గించడం చట్టప్రకారం నేరం. అయినాసరే అలాగే చేస్తామంటే అందుకు తగ్గ పరిణామాలను ‘బుల్డోజర్ న్యాయం’ రూపంలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేవాళ్లు హిందువులను చూసి నేర్చుకోండి. మహాకుంభమేళా వేళ ప్రయాగ్‌రాజ్‌కు 60 కోట్ల మంది హిందువులు వచ్చారు. దొంగతనం, విధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్ ఘటనలు ఒక్కటి కూడా జరగలేదు. దీనినే మత క్రమశిక్షణ అంటారు. దీన్ని హిందువుల నుంచి ఇతరులు కూడా నేర్చుకోవాలి’’ అని ముస్లింలనుద్దేశించి యోగి అన్నారు.ఆలయాల దాతృత్వం, సేవా కార్యక్రమాలపై.. ‘‘విద్య, ఆరోగ్యానికి సంబంధించిన అందరికీ సమానంగా ఆలయాలు, మఠాలు దాతృత్వ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆలయాలతో పోలిస్తే అత్యధిక ఆస్తులున్న వక్ఫ్ బోర్డులు ఏనాడైనా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాయా?. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం తప్ప’’ అని యోగి అన్నారు. ‘‘ నూతన నిర్మాణాలు, పాత ఆక్రమణలను తొలగించడంతోపాటు బుల్డోజర్ను మా ప్రభుత్వం ‘మెరుగైన రీతి’లో వాడింది. మా సద్వినియోగాన్ని సుప్రీంకోర్టు సైతం గతంలో మెచ్చుకుంది’’ అని వ్యాఖ్యానించారు.

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
న్యూఢిల్లీ: కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు. ఎన్డీయేలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలైన తెలుగుదేశం, జేడీ(యూ) తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆదేశించాయి. బిల్లుకు మద్దతు పలకాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇతర పార్టీలు సైతం తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి. వక్ఫ్ (సవరణ) బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు. బీఏసీ సమావేశం నుంచి విపక్షాల వాకౌట్ వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు రానున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. విపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలన్న ప్రతిపాదనకు వారు అంగీకరించారు. అయితే, ఈ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం తమ గొంతును అణచివేస్తోందని ఆరోపిస్తూ బీఏసీ సమావేశం నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే బుధవారం లోక్‌సభలో వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న లక్ష్యంతో విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఉమ్మడి వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ‘ఇండియా’ కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాందీ, కేసీ వేణుగోపాల్, రాంగోపాల్ యాదవ్, సుప్రియా సూలే, కల్యాణ్ బెనర్జీ, సంజయ్ సింగ్. టి.ఆర్.బాలు, తిరుచ్చి శివ, కనిమొళి, మనోజ్‌కుమార్ ఝా తదితరులు మంగళవారం సమావేశమయ్యారు. ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను అణచివేయడానికే వక్ఫ్(సవరణ) బిల్లును మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.బిల్లుకు మద్దతు పలుకున్న తెలుగుదేశం, జేడీ(యూ)లకు ప్రజలు కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజ్యాంగవిరుద్ధమైన బిల్లును ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ బీఏసీ సమావేశం జరిగింది. గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 293 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి.ఏమిటీ వివాదం? వక్ఫ్ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయించాలి. ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్

‘మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. 2023లో యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య గురయ్యాడు. హత్యకు గురైన అతిక్ చెందిన స్థిరాస్థుల్ని అధికారులు కూల్చివేశారు. వాస్తవానికి బుల్డోజర్తో కూల్చేసిన నిర్మాణాలతో అతిక్‌కు సంబంధం లేదు. ఆ ఇళ్లు లాయర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తున్నవారివి. ఎప్పటిలాగే సంఘ విద్రోహ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే సీఎం యోగి ప్రభుత్వం (Yogi Adityanath) పొరపాటున బాధితుల ఇళ్లను బుల్డోజర్లతో (Bulldozer justice) కూల్చేసింది. దీంతో బాధితులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.రూ.10లక్షల నష్టపరిహారం ఆ పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టు జస్టిస్ ఎస్ ఓకా,జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బూల్డోజర్ చర్యలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్‌తో పాటు ప్రయాగ్‌రాజ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. తక్షణమే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని సూచించింది.అది మా పొరపాటేఅంతకుముందు అడ్వకేట్, ప్రొఫెసర్ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ల గురించి అత్యున్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. నిబంధనలకు విరుద్ధంగా బుల్డోజర్లతో ఇళ్లను ఎలా కూల్చేస్తారు? కూల్చేవేతకు ఓ రోజు ముందు నోటీసులు ఎలా అంటిస్తారని ప్రశ్నించింది. అయితే, సుప్రీం ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు యూపీ అధికారులు బదులిచ్చారు. మేం కూల్చేసిన ఇళ్లు గ్యాంగ్‌స్టర్ అతిక్ నిర్మించుకున్నాడేమోనని పొరపాటున బుల్డోజర్ చర్యలకు దిగినట్లు వివరణ ఇచ్చారు.రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదుకూల్చివేత నోటీసులు అందజేసిన తీరుపై అధికారులను కోర్టు మందలించింది. కూల్చేసిన ఇళ్లనకు నోటీసులు అతికించామని రాష్ట్ర న్యాయవాది చెప్పగా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదని అడిగింది. అదే సమయంలో ఈ తరహా చర్యల్ని వెంటనే ఆపాలి. బాధితులు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వారికి నష్టపరిహారం కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించండి. పరిహారం ఇస్తే వారికి న్యాయం జరిగినట్లవుతుందని జస్టిస్ ఎస్.ఓకా అభిప్రాయం వ్యక్తం చేశారు.మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయిఈ కేసులు మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయి. పిటిషనర్ల ఇళ్లను నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారని కోర్టు అభిప్రాయ పడినట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్లు కూల్చేస్తున్నట్లు నోటీసులు గాని, నోటీసులు తీసుకున్న వారికి వివరణ ఇచ్చేందుకు తగిన అవకాశం ఇవ్వలేదని ప్రస్తావించింది. అందరూ కలత చెందుతున్నారుఅదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో బుల్డోజర్ కూల్చివేతల సమయంలో వైరలైన ఓ వీడియో గురించి కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. అధికారులు బుల్డోజర్లతో ఇళ్లను కూల్చే సమయంలో సదరు ఓ ఇంటికి చెందిన బాలిక తన పుస్తకాల్ని చేతపట్టుకుని ఉండడాన్ని చూడొచ్చు. ఇలాంటి దృశ్యాలతో అందరూ కలత చెందుతున్నారు’ అని జస్టిస్ భుయాన్ అన్నారు.

గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. బెయిల్ కోసం హైకోర్టుకు రన్యారావు
బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసు(Gold Smuggling Case)లో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రన్యారావు (Ranya Rao) బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. గతంలో మేజిస్ట్రేట్, సెషన్స్ కోర్టుల్లో ఆమెకు చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ వారం లేదా వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఆమె డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) కస్టడీలో ఉన్నారు.కాగా, రన్యా రావు బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుండగా ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే రన్యా రావ్ నాలుగుసార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే రన్య రావును అదుపులోకి తీసుకున్నారు.రన్యా రావు స్వస్థలం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కాగా.. నటనలో అడుగు పెట్టక ముందు బెంగళూరులో విద్యను అభ్యసించింది. 2014లో ఆమె మాణిక్య చిత్రంలో ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సరసన శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రానికి రీమేక్‌గా కన్నడలో తెరకెక్కించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత విక్రమ్ ప్రభు సరసన వాఘాతో తమిళంలో అడుగుపెట్టింది.2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో కన్నడలో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పటాస్‌కి రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీత పాత్రలో మెప్పించింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు గణేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీ కనిపించిన రాన్యా రావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది.
ఎన్ఆర్ఐ

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ఫౌండేషన్, హోఫ్ ఫర్ లైఫ్ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లలు సమాజంలో మానవ మృగాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలనేది ఈ సదస్సులో వివరించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరిష అన్నారు. అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా అది కచ్చితంగా తల్లితో చెప్పాలని సూచించారు. మేం ఏం చేయలేం అని నిస్సహాయ స్థితి నుంచి మేం ఏదైనా చేయగలమనే ధైర్యం ఆడపిల్లల్లో రావాలని హోఫ్ ఫర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకులు హిమజ అన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హోఫ్ ఫర్ సంస్థ ప్రతినిధులు ఆశాజ్యోతి, సైకాలజిస్టులు డాక్టర్ సంగీత, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై ఆడపిల్లలకు పూర్తి అవగాహన కల్పించేలా ఈ సదస్సు జరిగింది.

Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇకలేరు. వారి కుటుంబ సభ్యులకు మనసారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మహానుభావుడైన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. వారి గానం యుగయుగాల పాటు మనలో జీవించే ఉంటుందంటూ నాట్స్ నివాళులర్పించింది. గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతంఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి.పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది.1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్‌షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి.అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు.400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు.

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్‌మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025).

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.
క్రైమ్

హెల్త్ సూపర్వైజర్ దారుణ హత్య.. కీలకం కానున్న హెల్మెట్..!
మహబూబాబాద్ రూరల్: ఓ గురుకులంలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలో చోటు చేసుకుంది. రూరల్ సీఐ పి.సర్వయ్య కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన తాటి పార్ధసారథి (42) భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో నివాసముంటున్నాడు. 11 ఏళ్ల క్రితం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రేకపల్లే గ్రామానికి చెందిన స్వప్నతో వివాహం జరిగింది. వారికి పిల్ల లు భార్గవ్‌సాయి, పరమేశ్వరి ఉన్నారు. పార్ధసారథి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏడాది కాలంగా హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య స్వప్న, పిల్లలు భార్గవ్‌సాయి, పరమేశ్వరి భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో ఉంటున్నారు. పార్ధసారథి మాత్రం దంతాపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటూ సెలవు రోజుల్లో ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం భద్రాచలం వెళ్లి సోమవారం సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరాడు. తాను వస్తున్నానని తన గది యజమానికి ఫోన్ చేసి ఇంటి గేటు వేయొద్దని చెప్పాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున బోరింగ్‌తండా సమీపంలోని మిరప చేనులో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానిక రైతులు గమనించి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం తెలిపారు. దీంతో రూరల్ ఎస్సై వి.దీపిక, సీఐ పి.సర్వయ్య, డీఎస్పీ ఎన్.తిరుపతిరావు ఘటనా స్థలిని పరిశీలించి ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్‌కు సమాచారం ఇవ్వగా ఆయన హుటాహుటిన చేరకున్నారు. డాగ్స్కా్వ డ్, ఫింగర్‌ప్రింట్స్, క్లూస్‌టీం బృందాలు వివరాలు సేకరించాయి. ఘటనాస్థలికి చేరుకున్న మృతుడి సోదరి మద్దుల హేమవరలక్ష్మి, బావ శివప్రసాద్ బోరున విలపించారు. హేమవరలక్ష్మి మాట్లాడుతూ.. తన సోదరుడు పార్ధసారథిపై ఏడాది క్రితం దాడి జరిగిందని తెలిపారు. మరదలు స్వప్నకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఈ కారణంగానే తమ సోదరుడి హత్య జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా, పోలీస్ స్టేషన్లో పార్ధసారథిని దుండగులు హత్య చేసి చంపారని ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ రాజ్‌కుమార్.. పార్ధసారథి హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై దీపిక, బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతి, సీసీఎస్ సీఐ హథీరాం, ఇతర పోలీసుల అధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.కీలకం కానున్న హెల్మెట్..పార్ధసారథి హత్య విషయంలో ఘటనా స్థలిలో లభ్యమైన హెల్మెట్ కీలకం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుల రాకపోకలు, వాళ్లు వాడిన ద్విచక్రవాహనం ఆచూకీ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో నిందితులు హత్య చేయడానికి వచ్చే ముందు ఆ వాహనం నడిపిన వ్యక్తి ధరించిన హెల్మెట్ తెలుపురంగులో ఉండగా, ఘటనా స్థలిలో లభించిన హెల్మెట్ కూడా అదే రంగులో ఉండడం గమనార్హం. పార్ధసారథి హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. భద్రాచలం నుంచి హత్య జరిగిన ప్రాంతం వరకు రహదారుల వెంట ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
సంగారెడ్డి, సాక్షి: అమీన్పూర్ చిన్నారుల మృతి కేసు(Ameenpur Children Death Case)లో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే ముగ్గురు పిల్లలను కన్నతల్లి రజితనే కడతేర్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో మొదట భర్త చెన్నయ్యపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు.. లోతైన దర్యాప్తులో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత(Rajitha) కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు. కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం.రజిత పదో తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూయగా.. భర్త చెన్నయ్యకు అనుమానం రావొద్దని కడుపు నొప్పి నాటకం ఆడి ఆస్పత్రిలో చేరిందామె.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా, ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఉప్పరపల్లి మహేందర్ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అడ్డగుట్ట సొసైటీలోని హాస్టల్లో ఉంటున్నాడు.సోమవారం సాయంత్రం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో హాస్టల్ నిర్వాహకుడు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమలో ఓడిపోవడమే తన మరణానికి కారణమని రాసి ఉన్న లెటర్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు పై పడిన సెల్‌ఫోన్ తీసుకుంటుండగా...శామీర్‌పేట్: రోడ్డు పడిన సెల్ ఫోన్ తీసుకుంటుండగా కారు ఢీ కొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సిద్దిపేట్ జిల్లా, మామిడ్యాల గ్రామానికి చెందిన పొట్ట ప్రవీణ్ (23), హైదరాబాద్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై రాజీవ్ రహదారి మీదుగా వెళుతుండగా తుర్కపల్లి గ్రామ సమీపంలో తన జేబులోంచి సెల్‌ఫోన్ రోడ్డుపై పడింది. దీంతో కిందపడిన సెల్‌ఫోన్‌ను తీసుకుంటుండగా అదే సమయంలో నగరం నుంచి వేగంగా వచి్చన ఎర్టిగా కారు వెనక నుంచి అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. జినోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
కృష్ణరాజపురం/ బనశంకరి: బెంగళూరులో ఓ పారిశ్రామికవేత్తను హనీట్రాప్ చేసి ముప్పుతిప్పలు పెట్టి దోచుకున్న ముఠా ఉదంతమిది. కిలాడీ మహిళ ఒక ముద్దుకు రూ.50 వేల చొప్పున వసూలు చేయడం గమనార్హం. ముఠా బెదిరింపులను తట్టుకోలేక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కిలాడీ శ్రీదేవి రుడగి (25), ఆమె ప్రియుడు సాగర్ మోరే (28), రౌడీషీటర్ గణేష్ కాలే (38) లను నగర సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... మహాలక్ష్మి లేఔట్లో ప్రీ స్కూల్ నిర్వహిస్తున్న శ్రీదేవి అసలు నిందితురాలు. ఆమె ప్రీస్కూల్‌కు రాకేష్ వైష్ణవ్ (34) అనే వ్యాపారవేత్త తన పిల్లలను పంపించేవాడు. అలా అతనితో పరిచయం పెంచుకుని స్కూలు నిర్వహణ కోసమని రూ.4 లక్షలను అప్పుగా తీసుకుంది. డబ్బు వాపసు ఇవ్వాలని అడగగా ప్రీ స్కూల్ పార్టనర్ కావాలని కోరింది. చనువు పెంచుకుని కలిసి తిరిగేవారు. కొత్త ఫోను, సిమ్ శ్రీదేవితో మాట్లాడేందుకు కొత్త సిమ్, ఫోన్‌ను రాకేష్ కొనిచ్చాడు. శ్రీదేవి అతనికి ముద్దు పెట్టి రూ.50 వేలు చొప్పున తీసుకుంది. నీతోనే రిలేషన్షిప్లో ఉంటానని చెప్పి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తరచూ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో రాకేష్‌కు విసుగొచ్చి ఆమె సిమ్‌ను విరగ్గొట్టి పారేశాడు. టీసీ ఇస్తామని పిలిచి కిడ్నాప్ రాకేష్ ఆమె సూచన మేరకు మార్చి 12న పిల్లలకు టీసీని తీసుకునేందుకు ప్రీ స్కూల్‌కు వచ్చాడు. అప్పుడు శ్రీదేవితో పాటు నిందితులు సాగర్ మోరే, గణేష్ కాలే ఉన్నారు. వారు రాకేష్ పై దాడి చేసి, సాగర్‌తో శ్రీదేవికి నిశ్చితార్థం అయ్యింది. నువ్వు ఆమెతో మజా చేస్తున్నావా? ఈ సంగతిని శ్రీదేవి తండ్రికి, నీ భార్యకు చెబుతానంటూ రాకేష్‌ను బ్లాక్మెయిల్ చేశారు. పోలీసు స్టేషన్‌కు వెళ్దాం పద అంటూ రాకే‹Ùను ఎక్స్‌యూవీ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఇంతటితో వదిలేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని రాకే‹Ùను ఒత్తిడి చేశారు. చివర రూ.20 లక్షలు ఇస్తే చాలని డిమాండ్ చేశారు. ఆఖరికి రూ.1.90 లక్షలు తీసుకుని వదిలేశారు. నిందితులు బిజాపురవాసులు శ్రీదేవి విద్యార్థుల తండ్రులను తీయని మాటలతో మోసపుచ్చి వలలో వేసుకునేదని, ముద్దు ఇస్తే రూ.50 వేలు ఇవ్వాలనే షరతుతో సల్లాపాలు నడిపేదని వెలుగులోకి వచ్చింది. నిందితులు ముగ్గురూ విజయపుర (బిజాపుర) జిల్లా నివాసులు. ఉపాధి కోసం బెంగళూరుకు వలసవచ్చి చాతుర్యాన్ని ప్రదర్శించారు. రౌడీ గణేశ్ కాలేపై బెదిరింపులు, దోపిడీ, హత్యాయత్నం వంటి 9 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కిలాడీలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి పోలీస్‌కస్టడీకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. దర్యాప్తులో మరిన్ని హనీట్రాప్ బాగోతాలు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. నగరంలో ఈ హనీట్రాప్ దందా సంచలనం కలిగిస్తోంది. ఈమె బారిన మరికొందరు పడి ఉంటారని అనుమానాలున్నాయి.మళ్లీ బ్లాక్‌మెయిలింగ్ మార్చి 17న మళ్లీ రాకేష్ కు శ్రీదేవి ఫోన్ చేసి రూ.15 లక్షలు ఇవ్వాలని, అప్పుడే మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు, చాటింగ్‌ను డిలిట్ చేస్తాను, లేకుంటే నీ భార్యకు చూపించి నీ సంసారాన్ని పాడు చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో విసిగిపోయిన రాకేష్ చివరకు బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీదేవి, గణేష్, సాగర్లను అరెస్టు చేసి మరింత విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకున్నారు.
వీడియోలు


మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: YS జగన్


వైఎస్ జగన్ ను కలిసిన ఫార్మసీ విద్యార్ధిని అంజలి తల్లిదండ్రులు


లోకేష్ పీఏ తిరుమలలో సిఫార్సు లేఖల దందా చేస్తున్నారు: భూమన


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై సుప్రీంకోర్టు ఆగ్రహం


Revanth Reddy: బీసీలు ధర్మయుద్ధం ప్రకటించాలి


RK Roja: చంద్రబాబు ప్రతి రోజు రాష్ట్ర ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు


ఎంపీటీసీ, జడ్పీటీసీలతో వైఎస్ జగన్ భేటీ


LIVE: ఆర్కే రోజా ప్రెస్ మీట్


మంత్రి నారా లోకేష్ పీఏ సాంబశివరావు వసూళ్ల దందా


లోక్ సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు