Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu TDP coalition govt Fake Case On Sakshi Editor Dhanunjay Reddy1
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు

సాక్షి, అమరావతి: చంద్రబాబు రెడ్‌బుక్‌ అరాచకాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. నిజాన్ని నిర్భయంగా ఎత్తి చూపడంతో భరించలేక తప్పుడు కేసులకు ఒడిగడుతూ కుట్ర రాజకీయాలు చేస్తోంది. పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేసిన ఉదంతాన్ని వెల్లడించడంపై అక్రమ కేసు నమోదు చేయించడమే ఇందుకు నిదర్శనం. సాక్షి పత్రికపై మాచర్ల టీడీపీ మండలాధ్యక్షుడు ఎన్‌.వీరస్వామి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఆనంద్‌­బాబు, ఇతర టీడీపీ నేతలు మంగళవారం సాయంత్రం ఇక్కడ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే డీజీపీ స్పందించి పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించడం.. వెనువెంటనే రాత్రికి రాత్రే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం అంతా పక్కా పన్నాగంతో చకచకా సాగిపోయింది. దీంతో సాక్షి పత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనుంజయ్‌రెడ్డితోపాటు ఇదే పత్రికకు చెందిన ఆరుగురు పాత్రికేయులపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 196(1), 352, 353,(2), 61(1) రెడ్‌విత్‌ 3(5) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ అక్రమ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పింఛన్‌ కోసం వస్తే కడతేర్చారన్నది వాస్తవంపల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పశువేములకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త హరిశ్చంద్ర టీడీపీ గుండాలకు భయపడి కుటుంబంతో సహా పొరుగున తెలంగాణలోని నల్కొండ జిల్లా కనగల్‌లో పది నెలలుగా తల దాచుకుంటున్నారు. ప్రతి నెల పింఛన్‌ తీసుకునేందుకు వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ వర్గీయులు పక్కా పన్నాగంతో ఆయన్ను హత్య చేశారు. ఏప్రిల్‌ నెల ఫించన్‌ తీసుకునేందుకు ఈ నెల 3న రాష్ట్ర సరిహద్దుల్లోని నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీ వద్దకు వచ్చి.. తమ గ్రామం పశువేములకు చెందిన ఒకరికి ఫోన్‌ చేశారు. సామాజిక పింఛన్లు ఇస్తున్నారా.. లేదా.. అని అడిగారు. అతను ఆ విషయాన్ని టీడీపీ వర్గీయులకు చేరవేశాడు. వెంటనే టీడీపీ గూండాలు వచ్చి హిల్‌ కాలనీలో ఉన్న హరిశ్చంద్రను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆయనపై దాడి చేసి, హత్య చేసి.. మృతదేహాన్ని పశువేములలోని ఆయన పొలంలోనే పడేశారు. హరిశ్చంద్ర భార్య నిర్మల తన భర్తను కిడ్నాప్‌ చేశారని తెలంగాణలోని విజయపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. పశువేములలో దారుణ హత్యకు గురైన హరిశ్చంద్ర మృతదేహాన్ని ఈనెల 4న గుర్తించారు. కర్రలతో కొట్టి.. గొంతుకోసి.. ముఖంపై యాసిడ్‌ పోసి మరీ దారుణంగా హత మార్చినట్టు నాగార్జున సాగర్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హిల్‌ కాలనీలోని ఓ దుకాణం వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాల నుంచి పుటేజీ సేకరించారు. హరిశ్చంద్రను కిడ్నాప్‌ చేసి తీసుకువెళుతున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపించాయి.పూర్తి అవగాహనతోనే వార్త ప్రచురితంహరిశ్చంద్ర హత్య సమాచారం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తమపై టీడీపీ గూండాలు కక్ష కట్టిన తీరును హరిశ్చంద్ర భార్య నిర్మల, కుమారుడు మురళి వివరించారు. ఇది టీడీపీ గూండాల పనేనని కన్నీటి పర్యంతమయ్యారు. పల్నాడు జిల్లాలో నెలకొన్న పరిస్థితులు క్షణ్ణంగా తెలుసుకుని పూర్తి వివరాలతో సాక్షి పత్రిక ఏపీ ఎడిషన్‌లో వార్తను ప్రచురించింది. తెలంగాణలోని విజయపురి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలతోపాటు మృతుని కుటుంబ సభ్యుల ఆవేదన, పశువేములలోని నెలకొన్న వాస్తవ పరిస్థితులను సమగ్రంగా వివరించింది. కాగా, తెలంగాణలో పాత్రికేయులు కేవలం అక్కడి పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే వార్తగా ఇచ్చారు. హరిశ్చంద్రను సమీప బంధువులే హత్య చేశారని సాక్షి పత్రిక ఏపీ ఎడిషన్‌లోనూ, తెలంగాణ ఎడిషన్‌లోనూ ప్రచురించింది. కాగా, ఆ సమీప బంధువులు టీడీపీ గూండాలేనన్నది ఏపీలోని పాత్రికేయులకు పూర్తి సమాచారం, అవగాహన ఉంది కాబట్టి మరింత సమగ్రంగా వార్తను ప్రచురించారు. అంతేతప్ప సాక్షి పత్రిక ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో ప్రచురితమైన వార్తలోని అంశాల మధ్య వ్యత్యాసం లేదు. ఈ హత్యపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఏ ఎండకాగొడుకు పచ్చ ముఠా నిర్వాకమే ప్రజల్ని మోసగించేందుకు పరస్పర విరుద్ధ వాదనలు, కథనాలు, పత్రికా ప్రకటనలు ఇవ్వడం పచ్చ ముఠా పన్నాగం. ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో పరస్పర విరుద్ధంగా ఈనాడుతోపాటు ఎల్లో మీడియా లెక్కకు మించి కథనాలు ప్రచురించిన విషయాన్ని పాత్రికేయ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. టీడీపీ.. ప్రజల్ని మోసగించేందుకు ఏపీలోనే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పరస్పర విరుద్ధంగా పత్రికా ప్రకటనలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల ముందు టీడీపీ, ఈనాడుతోపాటు ఇతరత్రా ఎల్లో మీడియాలో ఇచ్చిన ప్రకటనలే అందుకు నిదర్శనం. ‘కలల రాజధాని అమరావతి’అని విజయవాడ ఎడిషన్‌లో ప్రకటనలు ఇచ్చిన టీడీపీ.. అదే రోజు విశాఖపట్నం ఎడిషన్‌లో మాత్రం ‘ఆంధ్రప్రదేశ్‌ వికాసానికి గ్యారంటీ’ అని ప్రకటనలు జారీ చేయడం గమనార్హం. టీడీపీ, ఎల్లో మీడియా కుయుక్తులకు ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి.

helicopter crashed into the Hudson River in New York City2
న్యూయార్క్‌లో హెలికాప్టర్‌ ప్రమాదం.. ప్రముఖ కంపెనీ సీఈవో ఫ్యామిలీ మృతి

న్యూయార్క్‌: న్యూయార్క్‌ నగరంలో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని హడ్సన్‌ నదిలో హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.వివరాల ప్రకారం.. న్యూయార్క్‌ కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3:17 నగరంలోని హడ్సన్‌ నదిలో హెలికాప్టర్‌ కూలిపోయింది. బెల్‌-206 అనే హెలికాప్టర్‌ నీటిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న పైలట్‌ కుటుంబం చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతిచెందిన వారిని స్పెయిన్‌లోని సిమెన్స్ సీఈవో అగస్టిన్ ఎస్కోబార్, అతని భార్య, వారి ముగ్గురు పిల్లలుగా అధికారులు గుర్తించారు. ఇక, విమానం న్యూయార్క్ డౌన్‌టౌన్ మాన్‌హట్టన్ హెలిపోర్ట్ నుండి బయలుదేరినట్టు అధికారులు వెల్లడించారు. Tracking: looks like a Bell 206L Long Ranger Helicopter. Appears main rotor & tail are detached when the main fuselage impacts the Hudson River in NYC. The main nut/pin that holds the main rotor onto the helicopter’s fuselage is called the ‘Jesus Nut.´pic.twitter.com/o4N23RY5kZ— Mikey Kay 🏴󠁧󠁢󠁷󠁬󠁳󠁿 (@MikeyKayFilms) April 10, 2025ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఘటనా స్థలంలో బోట్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్‌ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్‌లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు. వెస్ట్ సైడ్ హైవే మరియు స్ప్రింగ్ స్ట్రీట్ సమీపంలో హడ్సన్ నదిలో హెలికాప్టర్ క్రాష్ కారణంగా, చుట్టుపక్కల ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. BREAKING: Agustin Escobar, President and CEO of Siemens in Spain, along with his wife and their three children, were identified as the victims of the helicopter that plunged into the Hudson River in New York City on Thursday, according to the New York Post. The New York… pic.twitter.com/Jnw8EIiioH— Bruce Snyder (@realBruceSnyder) April 11, 2025 🇪🇦🇺🇸 Agustin Escobar, President and CEO of Siemens in Spain, along with his wife and their three children, were identified as the victims of the helicopter that plunged into the Hudson River in New York City on Thursday, according to the New York Post.The New York Helicopter… pic.twitter.com/Inp6NckoAu— Dan-i-El (@Danielibertari0) April 11, 2025

YS Jagan Fires on Chandrababu in YCP Leaders Meet3
చర్యకు ప్రతి చర్య! బాబుకు వైఎస్‌ జగన్‌ హెచ్చరిక

న్యూటన్‌ సూత్రం ప్రకారం చర్యకు ప్రతి చర్య ఉంటుంది..! చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతాడో.. అంతకు రెట్టింపు వేగంతో పైకి లేచి ఆయనకు తగులుతుంది – వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: ‘ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. మంచి చేసి వారి గుండెల్లో స్థానం సంపాదించుకుని ఒక నాయకుడు పాలన చేయాలి. అలా కాకుండా అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టి కాయ వేస్తారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌ కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారు’ అని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఏపీ, తమిళనాడు ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చే తీర్పులు చూశాం. ఈ పక్కన ప్రజలు తంతే.. ఆ పక్కన పడతారు. చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు.కాబట్టి మనం అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలి’ అని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సూచించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మేయర్, కార్పొరే­టర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్య­క్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో పాటు, పార్టీ ముఖ్య నాయకులు దీనికి హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆయన ఏమన్నారంటే..విలువలు, విశ్వసనీయతే మన సిద్ధాంతం..వైఎస్సార్‌సీపీకి బీజం కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది. ఆ రోజు ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లిన పరిస్థితుల మధ్య వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించింది. ఇవాళ బలమైన పార్టీగా ఎదిగింది. మన పార్టీ సిద్ధాంతం ఏమిటంటే.. విలువలతో కూడిన రాజకీయాలు, విశ్వసనీయత. రాష్ట్ర చరిత్రలో వీటికి అర్థం చెప్పిన పార్టీ వైఎస్సార్‌ సీపీనే. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయి. ఈ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశా. నాలో ఈ గుణాలను చూసి మీరంతా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగులో అడుగు వేశారు.రాజకీయాల అర్థాన్ని తిరగరాశాం..రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. ఇవాళ్టికి కూడా వైఎస్సార్‌సీపీకి చెందిన ఏ నాయకుడైనా, కార్యకర్త అయినా జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు గర్వంగా కాలర్‌ ఎగరవేసుకుని ప్రజల వద్దకు ఏ ఇంటికైనా వెళ్లగలడు. ప్రతి కుటుంబాన్ని చిరునవ్వుతో పలకరించి ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ, పరిస్థితి ఒక్క వైఎస్సార్‌సీపీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలం. రాజకీయాలకున్న అర్ధాన్ని మార్చి తిరగరాసిన చరిత్ర వైఎస్సార్‌ సీపీది. మనం రాక మునుపు మేనిఫెస్టో అనేది చెత్తబుట్టలో వేసే డాక్యుమెంటులా ఉండేది. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి హామీలను పక్కాగా అమలు చేసిన పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమే. మాటకు కట్టుబడి 99 శాతం పైచిలుకు హామీలను నెరవేర్చాం. ప్రతి ఇంటికీ బాబు మోసం..ఇన్ని చేసినా కూడా మనం ఓటమి చెందాం. కారణం.. కొద్దో గొప్పో చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మారు. జగన్‌ వస్తే ఎంతమంది పిల్లలున్నా రూ.15 వేలే వస్తాయి..! కానీ చంద్రబాబు వస్తే మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి రూ.45 వేలు వస్తాయని ఆశ పడ్డారు. 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు జగన్‌ రూ.18,750 ఇచ్చాడు.. కానీ చంద్రబాబు వస్తే 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.48 వేలు ఇస్తానన్నాడు...! ప్రతి ఇంటికీ కరపత్రాలు, బాండ్లు పంచారు.ఇంట్లో పిల్లాడు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, వాళ్ల అమ్మ బయటకు వస్తే నీకు రూ.18 వేలు అని, ఆ పిల్లల అమ్మమ్మలు బయటకు వస్తే మీకు 50 ఏళ్లు కాబట్టి మీకు రూ.48 వేలు అని, ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు రూ.26 వేలు అని, చదువుకున్న యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు.. అంటూ ప్రతి ఒక్కరినీ మోసం చేశారు. దీని వల్ల పది శాతం ప్రజలు చంద్రబాబును నమ్మారు. జగన్‌ చేశాడు కాబట్టి, చంద్రబాబు కూడా చేస్తాడని నమ్మారు. జగన్‌ చేసినవన్నీ నేను కూడా చేస్తా..! అది కాకుండా ఇంకా ఎక్కువే చేస్తానన్న చంద్రబాబు మాటలను నమ్మారు. చంద్రబాబు మారాడేమోనని కొద్దో గొప్పో ప్రజలు నమ్మారు. దాంతో గతంలో మనకు వచ్చిన 50 శాతం ఓట్‌ షేర్‌లో పది శాతం మంది ప్రజలు చంద్రబాబును నమ్మడంతో అటువైపు చెయ్యి అలా వెళ్లింది. ప్రతి హామీ ఒక మోసం..చంద్రబాబు వచ్చి 11 నెలలు గడుస్తోంది. రెండో ఏడాది బడ్జెట్‌ కూడా పెట్టారు. అదిగో చంద్రబాబు చేస్తారు..! ఇదిగో చేస్తారని పిల్లలు, మహిళలు, రైతులు, యువత ఎదురు చూస్తూ వచ్చారు. అప్పుడు మాట చెప్పా కానీ.. ఇప్పుడు భయం వేస్తోందని చంద్రబాబు అంటున్నారు. ఇక్కడ కూడా నిజాయితీ లేదు. ఎగ్గొట్టేందుకు అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రానికున్న అప్పులు రూ.12 లక్షల కోట్లు అని ఒకసారి, రూ.11 లక్షల కోట్లు అని ఒకసారి, రూ.10 లక్షల కోట్లు అని ఇంకోసారి అంటున్నారు. నాడు జగన్‌ పాలనలో నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లాయని ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు వచ్చారు.. తింటున్న కంచాన్ని లాగేశాడని అంటున్నారు. చంద్రబాబు ప్రతి హామీ ఒక మోసంగా మిగిలిపోయింది.తెగింపుతో విజయం సాధించాం..సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తనకే కావాలని చంద్రబాబు రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు మొన్ననే 57 చోట్ల జరిగాయి. గెలిచే వాతావరణం చంద్రబాబుకు కనిపించకపోవడంతో ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మిగతా 50 చోట్ల అనివార్య పరిస్థితుల నడుమ ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది. పార్టీ శ్రేణులు, నాయకులు తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించారు. ఆ తెగింపు వైఎస్సార్‌సీపీ కేడర్‌ చూపించింది కాబట్టే.. చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. పోలీసులను వాచ్‌మెన్ల కంటే ఘోరంగా వాడుకున్నారు. సరిదిద్దుకుని మంచి చెయ్‌..!చంద్రబాబూ.. ! సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ హామీలిచ్చావ్‌..! ప్రజలకు మంచి చెయ్‌..! పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టావు. ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో పెట్టావు. రైతులకు కూడా అన్యాయం చేస్తున్నావ్‌. ఇవన్నీ సరిదిద్దుకో.. మంచి చెయ్‌.. ప్రజల మనసులో స్థానం సంపాదించుకో. పూర్వపు బిహార్‌లా తయారైంది మన రాష్ట్రం. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటా..మీ అందరికీ ఒకటే చెబుతున్నా. కష్టాలు శాశ్వతంగా ఉండవు. చీకటి వచ్చిన తర్వాత కచ్చితంగా వెలుతురు వస్తుంది. ఈ మూడేళ్లు పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలబడాలి. ప్రజలకు తోడుగా ఉండండి. మన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈసారి జగన్‌ 2.0 పాలన కచ్చితంగా మీరు చూస్తారు. ప్రతి కార్యకర్తకు జగన్‌ తోడుగా ఉంటాడు. జగన్‌ 1.0 లో అనుకున్న మేరకు మీకు తోడుగా ఉండకపోవచ్చు. కోవిడ్‌ లాంటి విపత్తులతో పాటు ఆ తర్వాత కూడా ప్రజల ప్రతి అవసరంలో వారికి తోడుగా నిలబడాల్సి వచ్చింది. కానీ ఈసారి కార్యకర్తలకు జగన్‌ 2.0 లో జరిగే మేలు మరెవరికీ జరగని విధంగా చేస్తా.అన్ని రంగాల్లో తిరోగమనమే..⇒ ఈ రోజు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో పూర్తిగా తిరోగమనం కనిపిస్తోంది. ⇒ స్కూళ్ల వ్యవస్థను నాశనం చేశాడు. నాడు – నేడు, ఇంగ్లీషు మీడియం గాలికెగిరిపోయింది. మూడో తరగతి నుంచి టోఫెల్‌ చదువు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే పరిస్థితి కూడా గాలికెగిరిపోయింది. చివరకు డిగ్రీ, ఇంజనీరింగ్‌ పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విద్యా దీవెన, వసతి దీవెన పూర్తిగా గాలికెగిరిపోయాయి.⇒ వైద్య రంగం తీసుకుంటే.. ఆరోగ్యశ్రీలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు 11 నెలలకు దాదాపు రూ.3500 కోట్లు బకాయిలు ఉన్నాయి. బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. ఆరోగ్య ఆసరాను సైతం ఎగ్గొట్టారు.⇒ రైతులకు పెట్టుబడి సాయం కింద అందుతున్న రైతు భరోసాను ఎగరగొట్టారు. చంద్రబాబు ఇస్తానన్న రూ.26 వేలు గాలికెగిరి పోయాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. ఉచిత పంటల బీమా తీసేశారు. ఆర్బీ­కేలను నిర్వీర్యం చేశారు. పారదర్శకత పక్కకు పోయింది. అవినీతి విచ్చలవిడిగా జరుగు­తోంది. బెల్టు షాపులు లేని గ్రామాలు కనిపించడం లేదు. పేకాట క్లబ్బులు, మద్యం, ఇసుక, మట్టి, మైనింగ్‌ మాఫియాలు నడుస్తు­న్నాయి. ఏ పరిశ్రమ కొనసాగాలన్నా ఎమ్మెల్యే­లకింత..! చంద్రబాబుకింత! అని డబ్బులు కడితేగానీ నడవని పరిస్థితిలో వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి.ఆరు నెలల్లోనే ఆ పరిస్థితి వచ్చిందిసాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమై ప్రజల తరపున నిలబడాలని పిలుపునిచ్చే కార్యక్రమం రెండేళ్ల తర్వాత వస్తుంది. కానీ మొట్ట మొదటి సారిగా చంద్రబాబు పాలనలో ఆరు నెలలు తిరక్కముందే ప్రజలకు తోడుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల తరఫున పోరుబాట పట్టాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. చూస్తుండగానే 11 నెలలు పూర్తయ్యాయి. మూడేళ్లు ఇట్టే గడిచిపోతాయి. పార్టీ శ్రేణులు, నాయకులు కలసికట్టుగా నిలవాలి. ప్రతి సమస్య­లోనూ ప్రజలకు తోడుగా నిలిచి ముమ్మరంగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది.మన కార్యకర్త అంటే బాబుకు భయం..అసలు చంద్రబాబు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? సంఖ్యా బలం లేకపోయినా దౌర్జన్యాలు చేస్తూ ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? కారణం.. వైఎస్సార్‌ సీపీ అంటే చంద్రబాబుకు భయం. వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకు భయం. చంద్రబాబు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ హామీల అమలులో, పాలనలో ఘోరంగా విఫలమ­య్యారు. చంద్రబాబు పాలనలో వ్యవస్ధలన్నీ పూర్తిగా నీరుగారిపోయాయి. టీడీపీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సహా కేడర్, నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు సైతం టీడీపీ కేడర్‌ను తిరగనిచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తుండటంతో చంద్రబాబు క్యాడర్‌ ఏ ఇంటికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తమను ప్రశ్నించే స్వరం ఉండకూడదని రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.రామగిరి ఉప ఎన్నికలో..అనంతపురం జిల్లా రామగిరిలో పది ఎంపీటీసీలుంటే వైఎస్సార్‌ సీపీ తొమ్మిది గెలిచింది. టీడీపీ ఒకే ఒక్కటి గెలిచిన పరిస్థితుల మధ్య రామగిరిలో ఉప ఎన్నిక జరిగింది. తొమ్మిది గెలిచిన వైఎస్సార్‌ సీపీనే ఆ ఉప ఎన్నికలో గెలుస్తుందని ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఫలితాన్ని తారుమారు చేసేందుకు యత్నించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసు ప్రొటెక్షన్‌తో ఎంపీటీసీలు ప్రయాణించాల్సి వచ్చింది. కానీ ఈ పోలీసులు ఎంత అన్యాయంగా తయారయ్యారంటే.. వారే ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమం చేశారు. రామగిరి ఎస్సై ఎంపీటీసీల వాహనం ఎక్కి ఎమ్మెల్యేతోనూ, ఎమ్మెల్యే కుమారుడితోనూ వీడియో కాల్‌లో మాట్లాడించారు. టీడీపీకి అనుకూలంగా ఓటేయమని బెదిరించారు. అయినా కూడా మన ఎంపీటీసీలు ఎక్కడా తలొగ్గలేదు. దీంతో మన పార్టీ ఎంపీటీసీలను సమయం దాటిపోయే వరకు తిప్పుతూ ఎన్నిక జరిగే సమయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కోరమ్‌ లేదని ఎన్నిక వాయిదా వేశారు. పెనుగొండ తీసుకెళ్లి బైండోవర్‌ చేసే కార్యక్రమం చేశారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధర్నాచేస్తే మన పార్టీ జిల్లా అధ్యక్షురాలి మీద, ఇన్‌ఛార్జి మీద కేసులు పెట్టారు. ఉషమ్మ గట్టిగా ఉక్కు మహిళలా నిలబడి పోరాటం చేసింది. ధర్నా చేస్తే కేసులు పెట్టి అరాచకం సృష్టించే కార్యక్రమం చేశారు. రామగిరిలో ఎన్నిక జరపాల్సి వస్తుంది కాబట్టి భయానక వాతావరణం సృష్టించేందుకు.. చురుగ్గా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్త, బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను హాకీ స్టిక్‌లతో కొట్టి చంపేశారు. చాలా బాధ అనిపించింది. రాజకీయాలను ఎందుకు ఈ స్థాయికి దిగజారుస్తున్నారు?

Rasi Phalalu: Daily Horoscope On 11-04-2025 In Telugu4
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. అదనపు రాబడి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.చతుర్దశి రా.2.34 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: ఉత్తర ప.2.54 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: రా.12.04 నుండి 1.51 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.06 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.14 వరకు, అమృత ఘడియలు: ఉ.7.05 నుండి 8.51 వరకు.సూర్యోదయం : 5.50సూర్యాస్తమయం : 6.10రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం... పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. పనులు చకచకా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.వృషభం... పనులలో తొందరపాటు వద్దు. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.మిథునం.. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. అనుకున్న పనులలో ఆటంకాలు.విద్యార్థులకు కొంత నిరాశ. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.కర్కాటకం... అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.సింహం.... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.కన్య..... నూతన వరిచయాలు. శుభకార్యాల నిర్వహణ. వాహనయోగం. సంఘంలో ఆదరణ. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.తుల... ఆర్థిక లావాదేవీలు అంతగా కలిసిరావు. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలలో అదనపు బాధ్యతలు. ఉద్యోగాలలో ఒత్తిడులు.ఆరోగ్యసమస్యలు.వృశ్చికం.... చేపట్టిన పనులలో విజయం. విందువినోదాలు. సోదరులతో వివాదాలు తీరతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలత.ధనుస్సు... విద్యార్థులకు కొత్త ఆశలు. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు.యత్నకార్యసిద్ధి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.మకరం... కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు.ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువుల కలయిక. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.కుంభం... వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి.మీనం... వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. సంఘంలో విశేష గౌరవం. ఆస్తి ఒప్పందాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.

Mumbai terror attack plotter Tahawwur Rana lands in Delhi after US extradition5
ఎన్‌ఐఏ అదుపులో రాణా 

న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. అతడిని ఎప్పుడు తీసుకొస్తారు? ఎలా తీసుకొస్తారు? అన్నదానిపై ఉత్కంఠకు తెరపడింది. భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. బుధవారం సాయంత్రం అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ నుంచి బయలుదేరిన విమానం గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్‌ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టుకు తరలించారు. ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి చందర్‌జిత్‌ సింగ్‌ ఎదుట హాజరుపర్చారు. ఎన్‌ఐఏ తరఫున సీనియర్‌ అడ్వొకేట్లు నరేందర్‌ మాన్, దయాన్‌ కృష్ణన్, రాణా తరఫున ఢిల్లీ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అడ్వొకేట్‌ పీయూష్‌ సచ్‌దేవా వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించారు. ముంబై దాడుల కేసులో విచారణ నిమిత్తం రాణాను 20 రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించాలని దయాన్‌ కృష్ణన్‌ కోరగా, న్యాయమూర్తి తన ఉత్తర్వును రిజర్వ్‌ చేశారు. అర్ధరాత్రి వరకూ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్‌ సమర్పించారు. అతిపెద్ద దౌత్య విజయం భారత్‌కు అప్పగించవద్దని, అక్కడ తనకు రక్షణ ఉండదని మొండికేస్తూ అమెరికా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ 15 ఏళ్లు కాలక్షేపం చేసిన తహవ్వుర్‌ రాణా ఆశలు నెరవేరలేదు. అతడి అప్పగింత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగించింది. కొన్ని రోజులు క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత రాణా అప్పగింత ప్రక్రియ చకచకా పూర్తయ్యింది. 2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టులో రాణాపై ఇక విచారణ ప్రారంభం కానుంది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద రాణాపై అభియోగాలు నమోదయ్యాయి. అతడిని అమెరికా నుంచి భారత్‌కు రప్పించడం అతిపెద్ద దౌత్య, న్యాయపరమైన విజయంగా భావిస్తున్నారు. 26/11 దాడుల్లో మృతిచెందినవారికి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో రాణా అప్పగింత ఒక కీలకమైన ముందుడుగు అని అమెరికా న్యాయ శాఖ గురువారం వెల్లడించింది. ముంబైలో ఆ రోజు ఏం జరిగింది? 2008 నవంబర్‌ 26న పాకిస్తాన్‌కు చెందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించారు. నవంబర్‌ 26 నుంచి 29 దాకా.. నాలుగు రోజులపాటు వేర్వేరు చోట్ల తుపాకులు, గ్రెనేడ్లతో చెలరేగిపోతూ నెత్తుటేర్లు పారించారు. ఛత్రపతి శివాజీ టెరి్మనస్, ఒబెరియ్‌ ట్రిడెంట్‌ హోటల్, తాజ్‌మహల్‌ ప్యాలెస్‌ హోటల్, లియోపోల్డ్‌ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్‌ హౌస్, మెట్రో సినిమా హాల్‌ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఆరుగురు అమెరికా పౌరులు సహా 166 మంది మృతిచెందారు. 300 మంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అజ్మల్‌ కసబ్‌ ఒక్కడే సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష అమలు చేశారు. ముంబైలో ఉగ్రవాద దాడులకు రాణా సహాయ సహకారాలు అందించినట్లు ఎన్‌ఏఐ చెబుతోంది. 2009లో ఎఫ్‌బీఐ రాణాను అరెస్టు చేసింది. లాస్‌ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్‌ డిటెన్షన్‌ సెంటర్‌లో నిర్బంధించింది. ఎవరీ రాణా? పాకిస్తాన్‌లో ధనవంతుల కుటుంబంలో 1961 జనవరి 12న జన్మించిన తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా చివరకు ఉగ్రబాట పట్టాడు. ఇస్లామాబాద్‌లో పెరిగిన రాణా హసన్‌ అబ్దల్‌ కేడెట్‌ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే డేవిడ్‌ కోలోమన్‌ హెడ్లీ అలియాస్‌ దావూద్‌ గిలానీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు. వైద్య విద్య అభ్యసించిన రాణా పాకిస్తాన్‌ సైన్యంలో డాక్టర్‌గా పనిచేశాడు. 1997లో మేజర్‌ హోదాలో పదవీ విరమణ పొందాడు. తర్వాత కెనడాకు చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించే కంపెనీ స్థాపించాడు. కెనడా పౌరసత్వం సంపాదించాడు. అనంతరం అమెరికాలోని షికాగోకు మకాం మార్చాడు. ఇమ్మిగ్రేషన్, వీసా ఏజెన్సీ ప్రారంభించాడు. హలాల్‌ మాంసం విక్రయించే వ్యాపారం చేశాడు. హెడ్లీ సూచన మేరకు రాణా ముంబైలో ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయం ఏర్పాటు చేశాడు. 2006 నుంచి 2008 దాకా హెడ్లీ ఈ ఆఫీసుకు ఐదుసార్లు వచ్చి వెళ్లాడు. ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయాలో నిర్ణయించుకున్నాడు. 26/11 దాడులకు రాణా ఆఫీసును ఉగ్రవాదులు ఒక అడ్డాగా వాడుకున్నారు. ఆరుగురు ప్రధాన కుట్రదారుల్లో రాణా కూడా ఉన్నాడు. అయితే, హెడ్లీ అప్రూవర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో కస్టడీలో ఉన్నాడు. రాణాను బహిరంగంగాఉరి తీయాలి: ఏక్‌నాథ్‌ ఓంబలే ఉగ్రవాది తహవ్వుర్‌ రాణాను బహిరంగంగా ఉరి తీయాలని ఏక్‌నాథ్‌ ఓంబలే డిమాండ్‌ చేశాడు. వందల మంది ప్రాణాలను బలిగొన్న ముష్కరుడికి బతికే హక్కు లేదని అన్నాడు. భారత్‌పై దాడులు చేయాలన్న ఆలోచన వస్తే ఏం జరుగుతుందో ఉగ్రవాదులకు తెలియాలంటే రాణాను జనం సమక్షంలో ఉరికంభం ఎక్కించాల్సిందేనని తేల్చిచెప్పాడు. 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల్లో ఏక్‌నాథ్‌ ఓంబలే సోదరుడు, అసిస్టెంట్‌ ఎస్‌ఐ తుకారాం ఓంబలే కన్నుమూశాడు. ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ను బంధించే ప్రయత్నంలో మృతిచెందాడు. ఆ సమయంలో తుకారాం వద్ద లాఠీ తప్ప ఎలాంటి ఆయుధం లేదు. ఆయినప్పటికీ కసబ్‌ను ధైర్యంగా అడ్డుకున్నాడు. కోపోద్రిక్తుడైన కసబ్‌ కాల్పులు జరపడంతో తుకారాం నేలకొరిగాడు. కసబ్‌ను చాలాసేపు నిలువరించడం వల్లే చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. తుకారాంకు ప్రభుత్వం అశోకచక్ర అవార్డు ప్రకటించింది. దాడులకు ముందు తాజ్‌మహల్‌ సందర్శన ఉగ్రవాది తహవ్వుర్‌ రాణా ముంబై దాడుల కంటే ముందు భార్యతో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్‌తోపాటు కొచ్చీ, ముంబై నగరాల్లో పర్యాటక ప్రాంతాలను సందర్శించాడు. 2008 నవంబర్‌ 26న దాడులు జరిగాయి. నవంబర్‌ 13 నుంచి 21 దాకా రాణా ఇండియాలోనే ఉన్నాడు. అతడు దేశం వదిలివెళ్లిపోయిన ఐదు రోజుల తర్వాత 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించారు. భార్య డాక్టర్‌ సమ్రజ్‌ అక్త్తర్‌తో కలిసి రాణా నవంబర్‌ 13న ఢిల్లీకి చేరుకున్నాడు. తర్వాత వారు మీరట్, ఘజియాబాద్‌లోని సమ్రజ్‌ బంధువుల ఇళ్లకు వెళ్లారు. తర్వాత వేగన్‌ఆర్‌ కారులో ఆగ్రాకు చేరుకొని ఓ హోటల్‌లో బసచేశారు. మరుసటి రోజు తాజ్‌మహల్‌ను సందర్శించారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగివెళ్లారు. కొచ్చిలో రెండు రోజులు ఉన్నారు. తర్వాత ముంబైలో పోవై హోటల్‌లో, జలవాయు విహార్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో బస చేశారు. జలవాయు విహార్‌లో 1971 నాటి యుద్ధ వీరులు నివసిస్తుంటారు. ఈ యుద్ధంలో భారత్‌ చేతిలో పాకిస్తాన్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ కాంప్లెక్స్‌ను పేల్చివేయాలని రాణా భావించాడు. కానీ, అక్కడ దాడులకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. నవంబర్‌ 21న ఇండియా నుంచి వెళ్లిపోయాడు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నరేందర్‌ మాన్‌న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల కేసులో తహవ్వుర్‌ రాణాపై ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఎన్‌ఐఏ తరఫున వాదించడానికి ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సీనియర్‌ అడ్వొకేట్‌ నరేంద్ర మాన్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆయన నియామకం రాబోయే మూడేళ్లపాటు లేదా కేసు విచారణ పూర్తయ్యేదాకా అమల్లో ఉంటుంది. ఉగ్రవాద దాడులకు సంబంధించి ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రత్యేత కోర్టులతోపాటు అప్పిలేట్‌ కోర్టులో నరేంద్ర మాన్‌ వాదిస్తారు. దయాన్‌ కృష్ణన్‌ కృషి వల్లే.. తహవ్వుర్‌ రాణాను రప్పించడం వెనుక సీనియర్‌ లాయర్‌ దయాన్‌ కృష్ణన్‌ కృషి ఎంతో ఉంది. రాణా కేసులో భారత ప్రభుత్వం తరఫున అమెరికా కోర్టుల్లో ఆయన సమర్థంగా వాదనలు వినిపించారు. అమెరికా కోర్టులో రాణాపై విచారణ 2018లో ప్రారంభమైంది. 2023 మే 16న కృష్ణన్‌ చేసిన వాదనను యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు ఆఫ్‌ సెంట్రల్‌ డి్రస్టిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోరి్నయా మేజిస్ట్రేట్‌ జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. రాణాను ఇండియాకు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చారు. రాణాను రప్పించే విషయంలో ఈ తీర్పు కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఒకే కేసులో రెండుసార్లు ఎలా శిక్షిస్తారంటూ రాణా తరఫు న్యాయవాది పాల్‌ గార్లిక్‌ క్యూసీ చేసిన వాదనను దయాన్‌ కృష్ణన్‌ గట్టిగా తిప్పికొట్టారు. రాణాపై ఎన్‌ఐఏ కోర్టులో ఎన్‌ఐఏ తరఫున వాదించే బృందంలో కృష్ణన్‌ సైతం చేరబోతున్నట్లు తెలిసింది. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నరేందర్‌ మాన్‌కు ఆయన సహకరిస్తారు. ఈ బృందంలో అడ్వొకేట్లు సంజీవి శేషాద్రి, శ్రీధర్‌ కాలే సైతం ఉంటారని సమాచారం. అప్పటి హీరోనే ఇప్పటి ఎన్‌ఐఏ చీఫ్‌ 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి సదానంద్‌ దాతే 26/11 దాడుల సమయంలో ఉగ్రవాదులతో హోరాహోరీగా తలపడ్డారు. అప్పట్లో ఏసీపీగా పని చేస్తున్న సదానంద్‌ ఆ రోజు రాత్రి ముంబై కామా ఆసుపత్రిలో ఉగ్రవాదులు అజ్మల్‌ కసబ్, అబూ ఇస్మాయిల్‌ను 40 నిమిషాలపైగా ఒంటరిగా ఎదుర్కొన్నారు. ముష్కరుల కాల్పుల్లో మిగతా పోలీసులు గాయపడగా, అయన ఒక్కరే ధైర్యంగా ముందడుగు వేశారు. ఎదురు కాల్పులు జరుపుతూ ఆ ఇద్దరినీ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్‌ పేలి సదానంద్‌ గాయపడ్డారు. అయినప్పటికీ కాల్పులు ఆపలేదు. 40 నిమిషాలపాటు సమయం చిక్కడంతో చాలామంది ప్రజలు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 26/11 దాడుల కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏకు సదానంద్‌ దాతే 2024 మార్చి నుంచి సారథ్యం వహిస్తున్నారు. 2026 డిసెంబర్‌ 31దాకా ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

Pressure on Nellore SP Krishnakanth for illegal arrest of Kakani6
కూటమి కుట్రలతో ఐపీఎస్‌ల బెంబేలు

సాక్షి, అమరావతి: చంద్రబాబు సారథ్యంలోని కూట­మి ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్రలు, అరాచకాలను అమలు చేయలేక పోలీసు శాఖ బెంబేలెత్తుతోంది. వైఎస్సార్‌­సీపీ ముఖ్య నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఏకంగా ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తుండడంతో పోలీసు ఉన్నతాధికా­రులు హడలెత్తిపోతున్నారు. కొందరు మానసిక ఒత్తిడితో అస్వస్థత పాలవుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరా­ములు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌ హఠాత్తుగా అస్వస్థతకు గురికావడం ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... వైఎస్సార్‌­సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డిపై ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిన విష­యం తెలిసిందే. అయితే, ఆయ­నపై వరుస కేసులు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఈ వ్యవహా­రాన్ని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాతో పాటు రిటైర్డ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఒత్తిడి తీవ్రం చేశారు. కాకాణిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను హైదారాబాద్‌కు పంపించారు. ప్రభుత్వ పెద్దలు, పోలీస్‌ బాస్‌లు అంతటితో సంతృప్తి చెందలేదు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో నమో­దైన పలు కేసుల్లో కాకాణి పేరును ఇరికించాలని కూడా ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఇంకా ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రతి రోజూ నిలదీస్తు­న్నారు. ఈ పరిణామాలతో ఎస్పీ కృష్ణకాంత్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఓ పరిమితి వరకు నిబంధనలకు కాస్త అటూ ఇటూగా ఉల్లంఘించగలంగానీ... బరితెగించి అక్రమ కేసులు, వేధింపులు ఐపీఎస్‌ అధికారిగా తనకు సాధ్యం కాదని ఆయన భావించారు. చట్ట పరిధిలోనే కేసులను దర్యాప్తు చేయగలను తప్ప.. రాజకీయ కక్షసాధింపు చర్యలకు సాధనంగా మారలేనంటూ ఆయన లోలోన మథన పడుతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తీవ్రంగా మందలించిన పోలీస్‌ బాస్‌కాకాణిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని నిలదీస్తూ.. డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఎస్పీ కృష్ణకాంత్‌పై గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఎస్పీపై మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. ఆయన తన నివాసంలో మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది హుటాహుటిన కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర ఒత్తిడితో ఎస్పీ కృష్ణకాంత్‌ బీపీ పడిపోయిందని వైద్యులు చెప్పారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ చేశారు. కొన్ని రోజలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొత్త ఎస్పీగా టీడీపీ వీర విధేయ సుబ్బారాయుడు!రెడ్‌బుక్‌ కుట్ర అమలులో అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరించనందుకు నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్‌పై ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఆయనను బదిలీ చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ సానుభూతిపరుల కుటుంబానికి చెందిన, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితు­డిగా గుర్తింపు పొందిన ఐపీఎస్‌ అధికారి సుబ్బారా­యు­డును నెల్లూరు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. తిరుపతి ఎస్పీగా నియమితులయ్యారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో పోలీసుల వైఫల్యంతో ఆరుగురు భక్తులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీనికి బాధ్యుడిగా తిరుపతి ఎస్పీ సుబ్బారా­యు­డును ప్రభుత్వం సస్పెండ్‌ చేయాలి. కానీ, బదిలీతో సరిపెట్టింది. అనంతరం ‘ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధక టాస్క్‌ఫోర్స్‌’ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్‌ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)లో సభ్యుడిగా సుబ్బారాయుడును నియమించారు.

Kavitha says she Likes ys Jagan In opposition7
జగన్‌ అద్భుత నాయకుడు

సాక్షి, హైదరాబాద్‌: ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతమైన నాయకుడు.. జీవితంలో ఆయన అత్యంత కఠిన సమయాలను ఎదుర్కొన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడే తీరు బాగుంటుంది. ఆయన పోరాట యోధుడు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ 2.0ను చూస్తున్నాం’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వూ్యలో కవిత మాట్లాడుతూ, వైఎస్‌ జగన్, పవన్‌ కళ్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ గురించి పాడ్‌కాస్ట్‌లో ప్రస్తావన రాగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు.‘పవన్‌ కళ్యాణ్‌ను నేను సీరియస్‌గా తీసుకోవడం లేదు. దురదృష్టవశాత్తూ ఆయన పొరుగు రాష్ట్రం ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో ఆయన గురించి అన్నీ ప్రశ్నించాలి్సన అంశాలే. చెగువేరాను ప్రేమించే వ్యక్తి ఏకంగా సనాతన వాదిగా ఎలా మారతాడు. ఆయన ఇచ్చే రాజకీయ ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రేపు తమిళనాడుకు వెళ్లి హిందీని రుద్దకూడదు అని కూడా అంటాడు. అందుకే పవన్‌ కళ్యాణ్‌కు సంబంధించిన ప్రశ్నలపై నేను నిజంగా స్పందించాలని అనుకోవడం లేదు. ఆయనను సీరియస్‌ రాజకీయ నాయకుడిగా పరిగణించడం లేదు’ అని కవిత వ్యాఖ్యానించారు. గతంలో ఏపీ హోంమంత్రి అనితను ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను కవిత గుర్తు చేశారు. ‘దళిత మహిళ కాబట్టే హోంశాఖ మంత్రి అనితను పక్కన పెట్టి తాను హోంమంత్రిత్వ శాఖ తీసుకుంటాను అన్నాడు. లోకేశ్‌ హోంమంత్రిగా ఉంటే పవన్‌ కళ్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేసేవాడా’ అని కవిత ప్రశ్నించారు.

Donald Trump wants to bring back American manufacturing sector8
టార్గెట్‌ చైనా ఎందుకంటే..! 

కాళ్లబేరానికి వచ్చిన కారణంగా డజన్ల కొద్దీ ప్రపంచదేశాలపై ఆంక్షల కత్తిని దింపకుండా 90 రోజులు ఆగుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ప్రకటించారు. వాస్తవానికి బుధవారం నుంచే అన్ని దేశాలపై పెరిగిన టారిఫ్‌లు అమల్లోకి రావాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో ట్రంప్‌ తన నిర్ణయాన్ని అనూహ్యంగా వాయిదా వేశారు. అయితే ఇందులో అనూహ్యమేమీ లేదని, ట్రంప్‌ అసలు లక్ష్యం ఈ దేశాలు కాదని, చైనాయే అసలు లక్ష్యమని కొందరు అంతర్జాతీయ వాణిజ్యరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లు నిజంగానే ట్రంప్‌ కేవలం చైనా ఉత్పత్తులు, ఎగుమతి మార్కెట్‌పై కత్తిగట్టారా? అనే చర్చ ఇప్పుడు వాణిజ్యవర్గాల్లో మొదలైంది. దీనికి కొన్నేళ్ల క్రితమే బీజాలు పడ్డాయని తెలుస్తోంది. తొలి దఫా పగ్గాలు చేపట్టినప్పుడేదాదాపు 13 ఏళ్ల క్రితంనాటి సంగతి. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో హఠాత్తుగా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల బలోపేతంపై విస్తృతస్థాయి సమావేశాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వస్తూత్పత్తుల వినిమయ అవకాశం ఉన్న దేశాలతో చైనా వాణిజ్య సంబంధాలను బలపర్చుకుంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, దేశాల ప్రభుత్వాలతో చైనా కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం చర్చలు జరిపింది. చవగ్గా సరుకుల సరఫరాపై ఒప్పందాలు కుదిరాయి. విదేశీ సంస్థల ప్రతినిధులు, చైనా ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ఉన్నతాధికారులు, ప్రముఖ ఆర్థికవేత్తల మధ్య సఖ్యత కుదిరింది. దీంతో చైనా నుంచి అన్ని రకాల ఉత్పత్తుల ఎగుమతి అనూహ్యంగా ఊపందుకుంది. చైనాకు నిరాయుధ సైన్యంగా పేరొందిన కార్మికుల కష్టంతో పురుడుపోసుకున్న లక్షల కోట్ల రూపాయల వస్తువులు ప్రపంచదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఆ పరంపర అప్రతిహతంగా కొనసాగి అమెరికాను తోసిరాజని చైనా ప్రపంచ ఎగుమతి కేంద్రంగా మారింది. మారిన ఈ పరిణామాలను ట్రంప్‌ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. తక్కువ ధరకే వస్తువులు లభిస్తుండటంతో ప్రపంచదేశాల కీలక వ్యాపారసంస్థలన్నీ చైనాకే క్యూకట్టాయి. అక్కడ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయి. రోల్స్‌ రాయిస్, జనరల్‌ మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థల ఉత్పత్తులూ చైనాలో తయారవడం మొదలైంది. దీంతో దశాబ్దాల చరిత్ర కల్గిన అమెరికాలోని కొన్ని కంపెనీల నుంచి ఉత్పత్తి తగ్గింది. దీంతో అమెరికా పరిశ్రమల్లో కార్మికుల జీవితాల్లో వెలుగులు తగ్గిపోయాయి. అమెరికాకు పరిశ్రమల నుంచి రెవెన్యూ పడిపోయింది. అమెరికా పారిశ్రామికరంగానికి పూర్వవైభవం తెస్తానని తొలిసారి ఎన్నికల్లో పోటీచేసినప్పుడే ట్రంప్‌ ఓటర్లకు మాటిచ్చారు. గెలిచి అధికారం చేపట్టారు. కానీ ఆ నాలుగేళ్లలో అనుకున్న వ్యూహాలను అమలుచేయలేకపోయారు. దీనికి ఇతరత్రా కారణాలున్నాయి. ఇప్పుడు రెండోదఫా అధికారంలోకి రాగానే పాత ప్రణాళికలకు పదునుపెట్టి ప్రయోగిస్తున్నారు. దాని ఫలితమే ఈ టారిఫ్‌ల పరంపర. ఎగుమతులు పెరిగాక చైనాలో ఏం జరిగింది? ఎగుమతులతో చైనా ఆర్థికాభివృద్ది సాధించాక అక్కడ పౌరులు పాలనలో సంస్కరణలు కోరుకున్నారు. కానీ ఏక పార్టీ, నియంతృత్వపాలనలో ఆ కల నెరవేరలేదు. కొనుగోలు శక్తి పెరిగాక వినిమయ సమాజంగా అభివృద్ధి చెందాలని జనం భావించినా అదీ నెరవేరలేదు. ప్రభుత్వం కేవలం ఎగుమతులపైనా దృష్టిసారించింది. 2015లో బహిర్గతమైన ‘‘మేడిన్‌ చైనా 2025’ బ్లూప్రింట్‌ సైతం ఇదే విషయాన్ని ఉద్ఘాటించింది. గుండుసూది నుంచి గగనతల రక్షణ వ్యవస్థలదాకా, విద్యుత్‌వాహనాలు మొదలు అధునాతన యుద్ధవిహంగాల దాకా ప్రతిరంగంలో అగ్రగామిగా వెలుగొందడమే లక్ష్యంగా ముందుకుసాగి ఆ పనిలో సఫలీకృతమైంది. ఇదే సమయంలో అమెరికాలో ట్రంప్‌ రాజకీయ రంగప్రవేశంచేసి చైనా ఎగుమతి మార్కెట్‌ ఎదుగుదలకు అడ్డుకట్టవేయాలని కంకణం కట్టుకున్నారు. ఎన్నికల హామీల్లోనే అదే చెప్పారు. చైనా ఇప్పటికే ప్రపంచంలోని మొత్తం విద్యుత్‌ వాహనాల తయారీలో 60 శాతం వాటాను ఒడిసిపట్టింది. ఈ 60 శాతంలోకూడా అధిక బ్రాండ్లు స్వదేశానివే కావడం విశేషం. ఇక బ్యాటరీల్లోనూ 80 శాతం అక్కడే తయారవుతున్నాయి. వీటిని దెబ్బకొట్టేందుకే ట్రంప్‌ టారిఫ్‌ల కొరడాను ఝుళిపిస్తున్నారు. చైనా పరిశ్రమలను దెబ్బకొడితే అమెరికా పరిశ్రమలకు పునరుజ్జీవం సాధ్యమని ట్రంప్‌ బలంగా నమ్ముతున్నారు. ట్రంప్‌ నిర్ణయం యావత్‌ ప్రపంచ వాణిజ్యవ్యవస్థనే కుదుపునకు గురయ్యేలా చేస్తోంది. ఇప్పుడేం జరగొచ్చు? అతి టారిఫ్‌ల భారాన్ని అమెరికా తమపై మోపిన నేపథ్యంలో చైనా ముంగిట ఇప్పుడు రెండు మార్గాలున్నాయి. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా టారిఫ్‌లను చైనా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం చైనా తన ఎగుమతి ఆధారిత ఆర్థికవ్యవస్థ విధానాలను అమెరికాకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే చైనా గత చరిత్రను చూస్తే ఇది జరగకపోవచ్చని అర్థమవుతుంది. అగ్రగామి ప్రపంచ ఆర్థిక శక్తిగా మారేందుకు ఎన్నాళ్లనుంచో చైనా కలలుకంటోంది. అందుకోసమే ప్రభుత్వ వ్యతిరేకతను ఉక్కుపాదంతో అణిచివేస్తూ దాదాపు ప్రజలందర్నీ ఓ మోస్తరు వృత్తినిపుణులుగా మార్చేసింది. ఆట»ొమ్మలు మొదలు ఫోన్‌లదాకా అన్ని వస్తువులు కుటీరపరిశ్రమల్లా ఇళ్లలోనే తయారవుతాయి. చైనాలో ఏం జరుగుతోందనే వివరాలు బయటకు పొక్కకుండా మీడియాపైనా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. సొంత టెక్నాలజీనే నమ్ముకున్న ప్రభుత్వం దేశీయ సంస్థలు మినహా చైనా గడ్డపై ఎవరినీ ఎదగనీయదు. ఈ నేపథ్యంలో అమెరికా టెక్నాలజీ కంపెనీలకు చైనా గడ్డపై ఎదిగేందుకు ఒప్పుకోకపోవచ్చు. టారిఫ్‌ల భయాలతో విదేశీ కంపెనీలు చైనాలో పెట్టుబడులను తగ్గించుకుని అమెరికాలో పెట్టుబడులను పెంచుకుంటాయని ట్రంప్‌ భావిస్తున్నారు. చైనాకు ఆర్డర్లు ఇవ్వడం మానేసి అమెరికన్‌ కంపెనీలు మళ్లీ దేశీయంగా కర్మాగారాలను తెరుస్తాయని ట్రంప్‌ ఆశిస్తున్నారు. అదే నిజమైతే మళ్లీ అమెరికాలో కొత్త పారిశ్రామిక విప్లవం రావొచ్చు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

AP High Court Fires On Police Department For Fake Cases9
హైకోర్టన్నా లెక్కలేదా? ఇది ధిక్కారమే

హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండా పోయింది. సెక్షన్‌ 111ను ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఉద్దేశపూర్వకంగా ఆ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయడమంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లే. ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు కాదా? ఇది ఎంత మాత్రం ఆమో­దయోగ్యం కాదు. సూళ్లూరు­పేట ఇన్‌స్పెక్టర్‌ చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేసి చూపేలా ఉన్నాయి. దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తూ ఆ ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసు జారీ చేస్తున్నాం. – హైకోర్టు న్యాయమూర్తి సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 కింద అడ్డగోలుగా కేసులు పెడుతున్న పోలీసులపై హైకోర్టు మరోమారు నిప్పులు చెరిగింది. పోలీసుల చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని తేల్చి చెప్పింది. కోర్టులన్నా.. కోర్టులిచ్చి­న ఆదేశాలన్నా పోలీసులకు లెక్కేలేదంటూ తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు అధికారాన్ని, న్యాయ పాల­నను పోలీసులు సవాలు చేస్తున్నారంది. పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడింది. తమ ఆదేశాలున్నా కూడా సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై పోలీసులు అదనపు సెక్షన్ల కింద కేసు పెట్టడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది. సెక్షన్‌ 111ను చాలా అరుదుగానే ఉపయోగించాలని, అవసరమైన సందర్భాల్లో మాత్రమే దానిని ఉప­యోగించాలని తాము గతంలో ఓ కేసులో ఇచ్చిన తీర్పులో చాలా స్పష్టంగా చెప్పామంది. అయినా కూడా పోలీసులు సెక్షన్‌ 111 కింద కేసులు పెడుతూనే ఉన్నారంటూ ఆక్షేపించింది. ఇలా ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోసాని కృష్ణ మురళిపై తమ ఆదేశాలకు విరుద్ధంగా అదనపు సెక్షన్లు చేర్చడాన్ని తప్పు పట్టింది. తిరుపతి జిల్లా సూళ్లూరు­పేట ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేశారంది. తద్వారా ఆయన పరిధి దాటి వ్యవహరించారని తేల్చింది. మురళీకృష్ణ చర్య­లు కోర్టు ధిక్కారమేనని తెలిపింది. ఇందుకు గాను ఎందుకు చర్యలు తీసుకోరాదో స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని మురళీకృష్ణను హైకోర్టు ఆదేశించింది. పోసానిపై సూళ్లూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్‌ నాయుడిని తిట్టారంటూ ఫిర్యాదు టీటీడీ చైర్మన్, టీవీ 5 యజమాని బొల్లినేని రాజగోపాల్‌ నాయుడుని పోసాని కృష్ణ మురళి దూషించారని, వాటిని సోషల్‌ మీడియాలో వ్యాప్తి చేశారంటూ టీవీ 5 ఉద్యోగి బొజ్జా సుధాకర్‌ గత ఏడాది నవంబర్‌ 14న సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేశారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ కూడా ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవే కావడంతో, పోసానికి బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35(3) నోటీసు ఇచ్చి, వివరణ తీసుకోవాలని సూళ్లూరు­పేట పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే సూళ్లూరుపేట ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ ఈ నెల 7న పోసాని కృష్ణమురళికి సెక్షన్‌ 35(3) కింద నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసుల్లో గతంలో నమోదు చేసిన సెక్షన్నే కాకుండా బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111తో పాటు పలు ఇతర సెక్షన్లను కూడా జత చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ కొట్టేయాలంటూ పోసాని హై­కోర్టును ఆశ్ర­యించారు. ఈ వ్యా­జ్యంపై గురువారం న్యాయ­మూర్తి జస్టిస్‌ హరినాథ్‌ విచారణ జరిపారు.పోలీసుల చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేస్తున్నాయి..ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘సెక్షన్‌ 111ను దురుద్దేశ పూర్వకంగా, ఎలాపడితే అలా వాడటానికి వీల్లేదని ఇదే హైకోర్టు ఇప్పటికే పప్పుల చలమారెడ్డి కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. సెక్షన్‌ 111ను ఏ సందర్భాల్లో వాడాలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే పోసాని కృష్ణమురళిపై గతంలో నమోదు చేసిన కేసులో తాజాగా జారీ చేసిన నోటీసులో అదనపు సెక్షన్లు చేర్చడం, అందులోనూ సెక్షన్‌ 111ను చేర్చడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇన్‌స్పెక్టర్‌ చర్యలు కోర్టు ఆదేశాలను అణగదొక్కే విధంగా ఉన్నాయి. అంతేకాక కోర్టు ఆదేశాలను సైతం ఇన్‌స్పెక్టర్‌ అతిక్రమించారు. అతని చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేసేలా కూడా ఉన్నాయి. కేసు దర్యాప్తు విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాలకు విరుద్ధంగా పోసానికి జారీ చేసిన నోటీసుల్లో అదనపు సెక్షన్లు చేర్చారు. ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేశారు. అందువల్ల ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసు జారీ చేస్తున్నాం’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25న స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేశారు.ఇప్పుడు అదనపు సెక్షన్లు విస్మయకరంపిటిషనర్‌ తరఫు న్యాయవాది పాపిడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, గతంలో సెక్షన్‌ 35(3) కింద నోటీసులిచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించిందన్నారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా సెక్షన్‌ 35(3) కింద పోసానికి నోటీసులు జారీ చేశారని, అయితే విస్మయకరంగా ఆ నోటీసుల్లో పలు అదనపు సెక్షన్లను జత చేశారని చెప్పారు. మహిళలను కించ పరిచారంటూ కూడా కేసు పెట్టారన్నారు. టీటీడీ చైర్మన్‌ను దూషించారంటూనే మహిళలకు ఉద్దేశించిన చట్టం కింద కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల తరఫున అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) సాయిరోహిత్‌ వాదనలు వినిపిస్తూ, హైకోర్టు ఆదేశాల మేరకు పోసానికి సెక్షన్‌ 35(3) కింద నోటీసులు ఇచ్చామన్నారు. అదనపు సెక్షన్ల నమోదు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. దీనిపై పూర్తి వివరాలు సమరి్పంచేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు.

Delhi beat Royal Challengers Bangalore by 6 wickets10
రాహుల్‌ గెలిపించాడు

బెంగళూరు: ఐపీఎల్‌ 18వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అజేయ ప్రదర్శన కొనసాగుతోంది. ఓటమి లేకుండా సాగుతున్న జట్టు వరుసగా నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో ఢిల్లీ 6 వికెట్లతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును ఓడించింది. సొంత మైదానంలో ఆడిన రెండో మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీకి పరాజయం ఎదురుకాగా... తన సొంత నగరంలో మ్యాచ్‌ను గెలిపించిన అనంతరం ‘ఇది నా అడ్డా’ అన్నట్లుగా రాహుల్‌ విజయనాదం చేయడం విశేషం. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌ (20 బంతుల్లో 37 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫిల్‌ సాల్ట్‌ (17 బంతుల్లో 37; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. అనంతరం ఢిల్లీ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేఎల్‌ రాహుల్‌ (53 బంతుల్లో 93 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగిపోగా, ట్రిస్టన్‌ స్టబ్స్‌ (23 బంతుల్లో 38 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 55 బంతుల్లో అభేద్యంగా 111 పరుగులు జోడించారు. ఒకే ఓవర్లో 30 పరుగులు... ఇన్నింగ్స్‌లో తొలి 22 బంతులు ఆర్‌సీబీ విధ్వంసంతో 61 పరుగులు... చివరి 12 బంతుల్లో అదే తరహా దూకుడుతో 36 పరుగులు... మధ్యలో మిగిలిన 86 బంతుల్లో ఢిల్లీ బౌలర్ల ఆధిపత్యం... పేలవ బ్యాటింగ్‌తో బెంగళూరు చేసిన పరుగులు 66 మాత్రమే... జట్టు ఇన్నింగ్స్‌ ఇలా భిన్న పార్శ్వాలలో సాగింది. తొలి ఓవర్లో స్టార్క్‌ 7 పరుగులే ఇవ్వగా, అక్షర్‌ వేసిన రెండో ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు వచ్చాయి. అయితే అసలు విధ్వంసం మూడో ఓవర్లో సాగింది. స్టార్క్‌ బౌలింగ్‌లో సాల్ట్‌ ఊచకోత కోశాడు. అతను 2 సిక్స్‌లు, 3 ఫోర్లు బాదగా, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 6 పరుగులు వచ్చాయి. సాల్ట్‌ వరుసగా 6, 4, 4, 4 (నోబాల్‌), 6తో చెలరేగిపోయాడు. అయితే తర్వాతి ఓవర్లో ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి వెనక్కి రాలేక సాల్ట్‌ రనౌటయ్యాడు. ఆ తర్వాత బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు రావడం గగనంగా మారింది. అయితే అక్షర్‌ వేసిన 19వ ఓవర్లో డేవిడ్‌ 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో 17 పరుగులు రాగా, ముకేశ్‌ వేసిన చివరి ఓవర్లోనూ అతను 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి. కీలక భాగస్వామ్యం... ఛేదనలో ఢిల్లీ ఆరంభంలో తడబడింది. డుప్లెసిస్‌ (2), ఫ్రేజర్‌ (7), పొరేల్‌ (7) విఫలం కాగా, అక్షర్‌ (15) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ సమయంలో చక్కటి బౌలింగ్‌తో ఆర్‌సీబీ పైచేయి సాధించినట్లు కనిపించింది. అయితే రాహుల్, స్టబ్స్‌ భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా దూసుకుపోయింది. పిచ్‌ ఇబ్బందికరంగా ఉండటంతో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత వీరిద్దరు దూకుడు ప్రదర్శించారు.చివర్లో 6 ఓవర్లలో 65 పరుగులు అవసరం కాగా...రాహుల్, స్టబ్స్‌ కలిసి 7 ఫోర్లు 4 సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించారు. హాజల్‌వుడ్‌ ఓవర్లో రాహుల్‌ 3 ఫోర్లు, సిక్స్‌తో 22 పరుగులు రాబట్టడం మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పింది. స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (రనౌట్‌) 37; కోహ్లి (సి) స్టార్క్‌ (బి) నిగమ్‌ 22; పడిక్కల్‌ (సి) అక్షర్‌ (బి) ముకేశ్‌ 1; పాటీదార్‌ (సి) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 25; లివింగ్‌స్టోన్‌ (సి) అశుతోష్‌ (బి) మోహిత్‌ 4; జితేశ్‌ (సి) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 3; కృనాల్‌ (సి) అశుతోష్‌ (బి) నిగమ్‌ 18; డేవిడ్‌ (నాటౌట్‌) 37; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–61, 2–64, 3–74, 4–91, 5–102, 6–117, 7–125. బౌలింగ్‌: స్టార్క్‌ 3–0–35–0, అక్షర్‌ 4–0–52–0, నిగమ్‌ 4–0– 18–2, ముకేశ్‌ 3–1–26–1, కుల్దీప్‌ 4–0–17–2, మోహిత్‌ 2–0–10–1. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: డుప్లెసిస్‌ (సి) పాటీదార్‌ (బి) దయాళ్‌ 2; ఫ్రేజర్‌ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 7; పొరేల్‌ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 7; రాహుల్‌ (నాటౌట్‌) 93; అక్షర్‌ (సి) డేవిడ్‌ (బి) సుయాశ్‌ 15; స్టబ్స్‌ (నాటౌట్‌) 38; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (17.5 ఓవర్లలో 4 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–9, 2–10, 3–30, 4–58. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–26–2, దయాళ్‌ 3.5–0– 45–1, హాజల్‌వుడ్‌ 3–0–40–0, సుయాశ్‌ 4–0–25 –1, కృనాల్‌ 2–0–19–0, లివింగ్‌స్టోన్‌ 1–0–14–0. ఐపీఎల్‌లో నేడుచెన్నై X కోల్‌కతావేదిక: చెన్నై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement