డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సరోజని
విశాఖ మెడికల్: నగర పరిధిలో స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్థారణ కాలేదని సోమవారం అందిన నివేదిక స్పష్టం చేసిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జొన్నలగడ్డ సరోజని చెప్పారు. నగర పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు నాలుగు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు నమోదయ్యాయని, వీరినుంచి సేకరించిన లాలాజల నమూనాలను హైదరాబాద్‌లోని ఐపీఎం ల్యాబ్‌కు పంపి పరీక్షలు నిర్వహించగా, ముగ్గురిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు నిర్థారణ కాలేదన్నారు.
నాల్గో కేసు ఇసుకతోటకు చెందిన నాలుగేళ్ల బాలుడికి సంబంధించి నివేదిక ఇంకా అందాల్సి ఉందన్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ స్వైన్ అనుమానిత లక్షణాలతో మృతి చెందిన ఆరేళ్ల అభిరామ్‌కు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న గోపాలపట్నానికి చెందిన సిహెచ్.శ్రీదేవికి స్వైన్‌ప్లూ లేనట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. మర్రిపాలెంలో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీదేవి తల్లికి స్వైన్‌ఫ్లూ లేదని ఇటీవల అందిన నివేదిక ఆధారంగా నిర్ధారణ అయ్యిందన్నారు.
స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కాలేదు
Published Tue, Jan 27 2015 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM
Advertisement
Advertisement