స్వైన్‌ఫ్లూపై వైద్య బృందం సర్వే | Survey medical team on swine flu | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూపై వైద్య బృందం సర్వే

Published Wed, Feb 1 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

స్వైన్‌ఫ్లూపై వైద్య బృందం సర్వే

స్వైన్‌ఫ్లూపై వైద్య బృందం సర్వే

ఎన్‌ఏడీ జంక్షన్‌ (విశాఖ పశ్చిమం) : ఇక్కడి ఏపీఎస్‌ఈబీ కాలనీలో ఒక మహిళకు స్వైన్‌ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో  వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.   ఇటీవల ఆ కాలనీకి చెందిన 45 ఏళ్ల మహిళ అనారోగ్యంతో కేజీహెచ్‌లో చేరింది. అక్కడ పరీక్షలు చేసిన తరువాత సోమవారం స్వైన్‌ ఫ్లూ వ్యాధిగా నిర్ధారించారు. ఈ సమాచారం మేరకు ఆ ప్రాంతంలో బుచ్చిరాజుపాలెం రూరల్‌ వైద్యశాల వైద్యాధికారి  డాక్టర్‌ జ్యోతి, డాక్టర్‌ పార్థసారథి వైద్య సిబ్బం దితో కలిసి సర్వే చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులను కూడా పరిశీలించామని జ్యోతి తెలిపారు. వీరికి ముందస్తు వ్యాధి నిరోధక మందులను అందించామన్నారు. వ్యాధి సోకి న మహిళను ప్రస్తుతం ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించామని, ఆమెకు ప్రమాదమేమి లేదని, కోలుకుంటోందని తెలిపారు. 

బాధితురాలు ఇటీవల  పలు ప్రాంతాల్లో పర్యటించి రావడం వల్ల ఈ వ్యాధి సోకి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ఆమె నుంచి మరెవరికీ  సోకలేదని వివరించారు. ఈ ప్రాంతంలో ఉన్నవారికి వ్యాధి రాకుండా చేపట్టవలసిన చర్యల గురించి వివరించారు. వ్యాధి సోకినపుడు ఎక్కువగా ద్రవ పదార్థాలు, పోషకాహారాలు తీసుకోవాలన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement