గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆళ్లగడ్డ : గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో జరిగింది. వివరాలు.. వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం పాయలకుంట గ్రామానికి చెందిన నర్సమ్మ(48) మూలికా వైద్యం చేస్తుంది. ఈ మేరకు మూలికల కోసం కుమారుడు సుధాకర్‌తో కలిసి బైక్‌పై ఆహోబిలం వెళ్తున్నారు.
కాగా, మార్గ మధ్యలో గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సుధాకర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.