అనారోగ్యంతో అకాల మరణం పాలైన కన్నతల్లి మృతదేహం ఓ వైపు ... ఆమె కలలుకన్న బంగారు భవితకు పునాదులు వేసుకునే పరీక్ష మరో వైపు... ఇలాంటి సంక్షిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న పసి మనస్సు పరీక్ష రాయడానికి సిద్ధమైంది.
గుంటూరు: అనారోగ్యంతో అకాల మరణం పాలైన కన్నతల్లి మృతదేహం ఓ వైపు ... ఆమె కలలుకన్న బంగారు భవితకు పునాదులు వేసుకునే పరీక్ష మరో వైపు ... ఇలాంటి సంక్షిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న పసి మనస్సు పరీక్ష రాయడానికి సిద్ధమైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. సత్తెనపల్లికి చెందిన సుమంత్రాజ్ తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. గత అర్థరాత్రి కన్నతల్లి మరణించింది. అయినా పుట్టెడు దుఃఖంలో సుమంత్రాజ్ మంగళవారం ఉదయం పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు.