13 నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తా | 13th constituency tour | Sakshi
Sakshi News home page

13 నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తా

Published Mon, Oct 6 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

13 నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తా

13 నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తా

 సాక్షి, రాజమండ్రి : రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 13వ తేదీ నుంచి పర్యటిస్తానని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ తెలిపారు. తాను ప్రస్తుతం గోదావరి పుష్కరాలకు చేపట్టాల్సిన పనులపై దృష్టి సారించానని లాలాచెరువు సమీపంలోని తన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.   ఎన్నికల తర్వాత తాను ముఖం చాటేశానని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్లమెంటు సమావేశాలు జరిగాయని, ఆ తర్వాత  లిగ్మెంట్‌పెయిన్ రావడంతో వైద్యుల సూచనల మేరకు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నానని తెలిపారు. అందువల్లే నియోజకవర్గంలో పర్యటించలేక పోయానన్నారు. రాజకీయాల్లో నీతివంతుడిగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. తాను వివిధ జిల్లాల్లో వందలాది ఎకరాల భూములు కొన్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల ముందు రాజమండ్రిలో నివాసం కోసం కొన్న చిన్నపాటి స్థలం తప్ప తర్వాత ఎక్కడా కొనుగోళ్లు చేయలేదన్నారు. తనకు జిల్లాలో జరుగుతున్న ఇసుక దందాతో సంబంధాలు ఉన్నాయన్న వార్తలను మురళీమోహన్ ఖండించారు. త్వరలో గోదావరి గట్టుపై బాపూ రమణల విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement